తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడైనా.. | Chennai doctor hands newborn to nervous father Goes Viral | Sakshi
Sakshi News home page

తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడైనా..

Mar 9 2026 5:07 PM | Updated on Mar 9 2026 5:44 PM

Chennai doctor hands newborn to nervous father Goes Viral

కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్‌ చేశారు. డాక్టర్‌ శరవణ కుమార్‌ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్‌ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. 

అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్‌లోనే ఉన్న అతన్ని డాక్టర్‌ ప్లీజ్‌ టెన్షన్‌ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. 

కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్‌ని జోడించి మరి పోస్ట్‌ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.

(చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!)

 

Advertisement
 
Advertisement
Advertisement