breaking news
Automobile
-
ఆడి కొత్త ప్లాన్.. వచ్చే మూడేళ్లలో..
వచ్చే మూడేళ్లలో తమ మార్కెట్ వాటాను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు వాహనాల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతం సంస్థకు 8 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాబోయే పండుగల సీజన్లో సరికొత్త ఆడి క్యూ3తో మొదలుపెట్టి 2027 నాటికి మొత్తం మూడు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.2027లో నెక్ట్స్ జనరేషన్ ఆడి ఏ5, ఫ్లాగ్షిప్ ఆడి క్యూ9ని అందుబాటులోకి తేనున్నట్లు ధిల్లాన్ పేర్కొన్నారు. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చే ఏడాది ఆఖరు నాటికి రిటైల్ నెట్వర్క్ని 25 శాతం పైగా విస్తరించనున్నట్లు వివరించారు. షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్íÙప్‌లను తమ ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్టునకు కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. -
మాన్యువల్ కార్లకు ఎందుకింత డిమాండ్?
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా.. కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా.. భారతీయ డ్రైవర్లకు ఇప్పటికీ ‘మాన్యువల్’ గేర్‌బాక్స్‌లపై నమ్మకం కొనసాగుతోంది. సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కార్ల మార్కెట్లో క్లచ్ పెడల్‌తో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతోంది. ‘గేర్స్ ఆఫ్ గ్రోత్–2025’ నివేదిక ప్రకారం.. 2025లో విక్రయమైన యూజ్డ్ కార్లలో 72 శాతం మాన్యువల్ గేర్‌బాక్స్ వాహనాలే ఉన్నాయి. అయితే, ఆటోమేటిక్ కార్ల వాటా 28 శాతంగా ఉంది. అంటే ఆటోమేటిక్ కంటే మాన్యువల్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. వయసు, లింగం, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. మాన్యువల్ కార్ల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆటోమేటిక్ వాహనాల వైపు ఆసక్తి క్రమంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.యువతలో 'ఆటోమేటిక్'పై ఆసక్తియువ కొనుగోలుదారులు, ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారు మార్కెట్ సగటుతో పోలిస్తే ఆటోమేటిక్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, డ్రైవింగ్‌లో సౌలభ్యం, మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త తరం కొనుగోలుదారులు ఆటోమేటిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణాల్లో క్లచ్ వినియోగం తగ్గించడం ఆటోమేటిక్ కార్లకు అనుకూలంగా మారుతోంది.భవిష్యత్తులో యువత ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ ఆటోమేటిక్ కార్ల మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే 45 ఏళ్లు పైబడిన కొనుగోలుదారులు మాత్రం మాన్యువల్ కార్లపైనే ఎక్కువ విశ్వాసం చూపుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, సులభమైన మరమ్మతులు, ఎక్కువ రీసేల్ అవకాశాలు ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది.ఏది కొనాలి?మాన్యువల్ లేదా ఆటోమేటిక్.. ఏది సరైన ఎంపిక అనేది కొనుగోలుదారుల వినియోగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఆటోమేటిక్ కార్లు సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తాయి. పదేపదే క్లచ్ నొక్కాల్సిన అవసరం లేకపోవడం, డ్రైవింగ్ సులభంగా ఉండటం వీటి ప్రధాన ప్రయోజనాలు. మరోవైపు ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించే వారు, తక్కువ నిర్వహణ వ్యయాన్ని కోరుకునే వారికి మాన్యువల్ కార్లు ఇప్పటికీ మెరుగైన ఎంపికగా ఉన్నాయి.అయితే.. సెకండ్ హ్యాండ్ ఆటోమేటిక్ కారు కొనుగోలు చేసే వారు గేర్‌బాక్స్ పనితీరు, సర్వీస్ రికార్డు, తనిఖీ నివేదికలు, వారంటీ అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో సమస్యలు వస్తే మరమ్మతు వ్యయం మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.మాన్యువల్ కార్లకు ఎందుకు డిమాండ్?సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో మాన్యువల్ కార్ల ఆధిపత్యానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో తొలి కారణం ధర. మాన్యువల్ కార్ల కొనుగోలు ధరతో పాటు నిర్వహణ ఖర్చు (సర్వీసింగ్ వ్యయం) కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ‘విలువ’కు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రెండోది అలవాటైన డ్రైవింగ్. దేశంలో ఎక్కువ మంది డ్రైవింగ్‌ను మాన్యువల్ కార్లతోనే ప్రారంభించారు.కాబట్టి సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసేవారు తమకు పరిచయమైన గేర్ వ్యవస్థనే ఎంచుకుంటున్నారు. మూడోది ఉత్తమ రీసేల్ విలువ. మాన్యువల్ కార్లకు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు కాబట్టి సులభంగా విక్రయించవచ్చు. మరోవైపు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను పరిశీలించడం కష్టంగా ఉంటుంది. టార్క్ కన్వర్టర్, ఏఎంటీ, సీవీటీ, డ్యూయల్ క్లచ్ వంటి ఆటోమేటిక్ వ్యవస్థల్లో సమస్యలు వస్తే మరమ్మతు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.నగరాల్లో ఆటోమేటిక్స్.. పట్టణాల్లో మాన్యువల్స్ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మెట్రో నగరాల్లో ఆటోమేటిక్ కార్ల వాటా ఎక్కువగా ఉంది. అధిక ట్రాఫిక్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగర వినియోగదారులు ఆటోమేటిక్ మోడళ్లను ఎంచుకుంటున్నారు. మెట్రో మార్కెట్లలో మారుతీ బాలెనో, హోండా సిటీ మోడళ్ల ఆటోమేటిక్ వేరియంట్లకు డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు నాన్-మెట్రో మార్కెట్లలో తక్కువ ధర, తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన మోడళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మారుతీ స్విఫ్ట్ డిజైర్, వ్యాగన్ఆర్, ఆల్టో, గ్రాండ్ ఐ10 వంటి కార్లు ఈ మార్కెట్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్!
దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు ఇచ్చే సబ్సిడీని 2028 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించింది.నిజానికి ఈ సబ్సిడీ గడువు 2026 ఆర్థిక సంవత్సరంతో ముగియాల్సి ఉండగా, మరో రెండేళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించనుంది.పెరిగిన బడ్జెట్ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే?.. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కోసం కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. ఇదివరకు దీనికోసం రూ.1,772 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ఇప్పుడు దీనిని రూ.2,767 కోట్లకు పెంచింది. అంతే కాకుండా.. సబ్సిడీ పొందే వాహనాల సంఖ్యను 24 లక్షల నుంచి 45.7 లక్షలకు పెంచారు.ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కు రూ. 2,500 సబ్సిడీ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.5,000 వరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే చివరి తేదీ 2027 డిసెంబర్ 31గా నిర్ణయించారు.పెరుగుతున్న ఈవీ సేల్స్దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2021-22లో సుమారు 2.53 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025-26 నాటికి ఈ సంఖ్య 14.6 లక్షలకు చేరింది. మరోవైపు పెట్రోల్ టూ-వీలర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం వల్ల పెట్రోల్ ఖర్చు తగ్గడంతో పాటు, దేశం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా టూ-వీలర్లు దేశంలో పెద్ద మొత్తంలో పెట్రోల్ వినియోగిస్తున్నందున, ఈ మార్పు ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వల్ల కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మరోవైపు సబ్సిడీని 2028 వరకు కొనసాగించడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు కూడా భవిష్యత్తుపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెంచి ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులతో పాటు దేశంలో ఈవీ మార్కెట్‌కు కూడా ఊతమిచ్చే అవకాశం ఉంది. -
రూ.13.99 లక్షల బైక్.. ఇండియాలో లాంచ్!
డుకాటి తన సరికొత్త మాన్స్టర్ వీ2ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు(ఎక్స్-షోరూమ్).ఈ కొత్త బైక్, దాని మునుపటి మోడల్ కంటే కొంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ ఇంజిన్, తేలికైన ఛాసిస్, మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది.డుకాటీ ఇప్పుడు సరికొత్త 890 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ద్వారా 9,000 rpm వద్ద 111 హార్స్ పవర్, 7,250 rpm వద్ద 91.1 Nm టార్క్ అందిస్తుంది. ఇన్‌టేక్ వేరియబుల్ టైమింగ్ (IVT) సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఈ సిస్టమ్ ఇంజన్ పరిధిని విస్తృతం చేయడంతో పాటు, పవర్ డెలివరీని సున్నితంగా చేసి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది.2026 డుకాటీ మోడల్ చెప్పుకోదగ్గ స్థాయిలో అప్డేటెడ్ డిజైన్ పొందలేదు. కానీ బాడీవర్క్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్‌ను కొంత మార్చారు. బాడీ ప్యానెళ్లను సూక్ష్మంగా సవరించారు. రైడర్‌కు మరింత దృఢమైన రైడింగ్ పొజిషన్‌ను అందించే లక్ష్యంతో డుకాటి హ్యాండిల్బార్లను కూడా కొద్దిగా ముందుకు జరిపింది. -
టాటా కార్లపై భారీ ఆఫర్స్!
రాబోయే ఓనం పండుగ సందర్భంగా.. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ కార్లపైనా ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లకు వర్తిస్తాయి. హ్యారియర్ ఈవీపై గరిష్టంగా రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.టాటా మోటార్స్‌కు ముఖ్యమైన మార్కెట్‌గా ఉన్న కేరళలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఓనం ఆఫర్స్ ప్రకటించింది. మోడల్‌ను బట్టి, ఈ ఆఫర్లలో నగదు ప్రయోజనాలు, లాయల్టీ ప్రయోజనాలు, బీమా సంబంధిత ఆఫర్ల కలయిక ఉంటుంది.టాటా ఆల్ట్రోజ్‌పై రూ. 54,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. నెక్సాన్‌పై రూ. 72,500 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్ కారుపై రూ. 77,500 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన సియెర్రాపై రూ. 30,000 లాయల్టీ ప్రయోజనం లభిస్తుండగా, హారియర్.. సఫారీలు ఒక్కొక్కదానికి రూ. 47,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి.నెక్సాన్.ఈవీ (Nexon.ev) పై రూ. 60,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, కర్వ్.ఈవీ (Curvv.ev) పై రూ. 55,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఓనం ఆఫర్లు వేరియంట్, డీలర్షిప్ నిబంధనలను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ అందించే ఆఫర్స్ గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించడం మంచిది. -
మహీంద్రా గ్రూప్‌నకు ఇక ఈమెదే ‘స్ట్రాటజీ’!
మహీంద్రా గ్రూప్ కీలక నాయకత్వ నియామకం చేపట్టింది. కమిన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న శ్వేతా ఆర్యను గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ (Group Chief Strategy Officer)గా నియమించింది. ఆమె వచ్చే సెప్టెంబర్ 15 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సీనియర్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆమె భాగం కానున్నారు.కొత్త హోదాలో శ్వేతా ఆర్య మహీంద్రా గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్‌కు నాయకత్వం వహిస్తారు. గ్రూప్‌లోని వివిధ వ్యాపారాల్లో వృద్ధి అవకాశాలను గుర్తించడం, ఉన్న వ్యాపారాల్లో విలువను పెంచడం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను సాధించడం వంటి అంశాలపై ఆమె దృష్టి సారించనున్నారు. ఆమె గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలిగా ఉంటూ, గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షాకు రిపోర్ట్ చేస్తారు.23 ఏళ్లకు పైగా అనుభవంశ్వేతా ఆర్యకు ఆటోమోటివ్, ట్రావెల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం వంటి విభిన్న రంగాల్లో 23 ఏళ్లకు పైగా వ్యాపార, వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉంది. కమిన్స్‌లో చేరకముందు ఆమె థామస్ కుక్ ఇండియాలో స్ట్రాటజీ, విలీనాలు-కొనుగోళ్ల (M&A) విభాగాలను నడిపించారు. అంతకుముందు కీర్నీ, ఇన్ఫోసిస్ సంస్థల్లోనూ వివిధ బాధ్యతలు నిర్వహించారు.కమిన్స్ ఇండియాలో ఆమె 2024 సెప్టెంబర్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు సంస్థలో స్ట్రాటజీ లీడర్‌గా, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లీడర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కమిన్స్ ఇండియా పవర్ సిస్టమ్స్ బిజినెస్‌కు నాయకత్వం వహిస్తూ, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ విస్తరణపై పనిచేస్తున్నారు. -
కేటీఎం బైకుల ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు ఇవే!
కేటీఎం ఇండియా.. తన 160 డ్యూక్, ఆర్సీ 160 ధరలను పెంచింది. ఇందులో ఆర్సీ 160 ధర గరిష్టంగా రూ.15,000 పెరిగింది. అయితే.. వేరియంట్‌ను బట్టి, 160 డ్యూక్ ధర రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య పెరిగింది.జీఎస్టీ రేట్లలో మార్పుల నేపథ్యంలో.. సెప్టెంబర్‌లో కేటీఎం ధరలను తగ్గించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కేటీఎం తన బైకుల ధరలను పెంచింది. అయితే.. 350సీసీ వరకు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ద్విచక్ర వాహనాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, కంపెనీ చిన్న మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గాయి.కేటీఎం 160 డ్యూక్160 డ్యూక్ స్టాండర్డ్ వెర్షన్ ధర గతంలో రూ.1.71 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో దీని ధర రూ.13,000 పెరిగింది. అధిక స్పెసిఫికేషన్లు గల TFT వేరియంట్ ధర రూ.1.79 లక్షల నుంచి రూ. 1.91 లక్షలకు పెరిగింది. అంటే దీని ధర రూ. 12,000 పెరిగిందన్నమాట.కేటీఎం ఆర్సీ 160ఆర్సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో రూ.1.85 లక్షలకు విడుదలైన ఈ ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు రూ. 2 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ 164.2 సీసీ ఇంజన్‌ను కలిగి.. 18.7 bhp పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
రూ.1.50 లక్షలు పెరిగిన మెజెస్టర్ ధర!
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మెజెస్టర్ ధరలను సవరించింది. మే నెలలో లాంచ్ అయిన ఈ కారు ధరలను కంపెనీ పెంచడం ఇదే మొదటిసారి. ఈ పెంపు సావీ 2డబ్ల్యుడీ వేరియంట్లకు (ఆరు-సీటర్, ఏడు-సీటర్ కాన్ఫిగరేషన్లకు) వర్తిస్తుంది.ధరలు ఇప్పుడు రూ.1.50 లక్షల వరకు పెరిగాయి. దీంతో ఎక్స్-షోరూమ్ ధర రూ. 42.49 లక్షలకు (గతంలో ఈ కారు ధర రూ. 40.99 లక్షలు) చేరింది. అయితే, టాప్ స్పెక్ సావీ 4డబ్ల్యుడీ వేరియంట్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 44.99 లక్షల ఎక్స్-షోరూమ్ వద్దే ఉంది.కంపెనీ మెజెస్టర్ ధరలను పెంచింది. కానీ కారులో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. కాబట్టి అదే పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, 12-స్పీకర్ల JBL సరౌండ్ సౌండ్ సిస్టమ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్లు, 220-వోల్ట్ పవర్ అవుట్లెట్, ముందు సీట్లకు వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫంక్షన్, లెవెల్ 2 ADAS, మరియు 360-డిగ్రీల HD కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 212 బీహెచ్పీ పవర్, 478.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. 4WD వేరియంట్లో MG యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, 10 ఆఫ్-రోడ్ మోడ్లు లభిస్తాయి.ఎంజీ మెజెస్టర్ దేశీయ మార్కెట్లో.. జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్, టయోటా ఫార్చ్యూనర్, వోక్స్వ్యాగన్ టేరాన్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. కియా సోరెంటోలకు కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
తగ్గిన పెట్రోల్ కార్ల అమ్మకాలు.. కారణం ఇదే!
భారతదేశంలో కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో ఇంధన ఎంపికలు మారుతున్నాయి. ఫాడా విడుదల చేసిన జూలై 2026 రిటైల్ డేటా ప్రకారం.. పెట్రోల్/ఇథనాల్ కార్ల వాటా 41.68 శాతానికి తగ్గింది. జూన్‌లో ఇది 43.15 శాతంగా ఉండగా.. గతేడాది జూలైలో 47.62 శాతంగా ఉంది. మరోవైపు డీజిల్ కార్ల వాటా జూన్‌లో 16.32 శాతం నుంచి జూలైలో 17.73 శాతానికి పెరిగింది.గతేడాదితో పోలిస్తే డీజిల్ కార్ల వాటా కూడా స్వల్పంగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ20 పెట్రోల్‌పై వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా ఈ మార్పుకు ఒక కారణమని ఫాడా చెబుతోంది.పెట్రోల్/ఇథనాల్‌పై ఆసక్తి తగ్గుతున్న తరుణంలో.. సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. జూలైలో సీఎన్జీ వాహనాల వాటా 24.67 శాతం, హైబ్రిడ్ కార్ల వాటా 8.02 శాతం, ఈవీల వాటా 7.90 శాతంగా ఉంది. ఈ మూడు కలిపితే 40.59 శాతం మార్కెట్ వాటా వస్తుంది. అంటే పెట్రోల్/ఇథనాల్ వాహనాల కంటే కేవలం 1.09 శాతం పాయింట్లు మాత్రమే తక్కువ. దీన్నిబట్టి చూస్తే వాహన కొనుగోలుదారులు పెట్రోల్ ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా జూలైలో రికార్డు స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా 3,27,901 ఈవీలు అమ్ముడైనట్లు నివేదిక వెల్లడించింది. ఇది మొత్తం ఆటో మార్కెట్లో 12.7 శాతం వాటా అన్నమాట. మొత్తం మీద డీజిల్ కార్ల వాటా పెరగడం కంటే.. పెట్రోల్/ఇథనాల్ నుంచి సీఎన్జీ, హైబ్రిడ్, ఈవీల వైపు వినియోగదారుల ఆసక్తి పెరగడమే ప్రధాన మార్పుగా కనిపిస్తోంది. రాబోయే పండుగల సీజన్లో ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్‌లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం!
ఎలక్ట్రిక్ స్కూటర్లు (ఈ-స్కూటర్లు) నడపడం మోటార్‌సైకిళ్లు లేదా సైకిళ్లు నడపడం కంటే ప్రమాదకరమని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ-స్కూటర్ (చిన్న చక్రాలవి) ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలను ‘ది గార్డియన్’ నివేదించింది.చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌కు చెందిన హ్యాండ్, ట్రామా, ఆర్థోపెడిక్ సర్జన్ డేవిడ్ బోడాన్స్కీ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. 2020 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్, వేల్స్‌లోని 18 నగరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని జాతీయ ప్రధాన ట్రామా రిజిస్ట్రీ నుంచి పరిశోధకులు విశ్లేషించారు.తలకు గాయాల ముప్పు మూడు రెట్లుమోటార్సైకిల్ రైడర్లతో పోలిస్తే ఈ-స్కూటర్ రైడర్లకు మెదడు గాయం లేదా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే అంతర్గత అవయవాలకు గాయాలయ్యే అవకాశం సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఎముకలు విరిగే ప్రమాదం మాత్రం సైక్లిస్టులు, మోటార్‌సైకిల్ రైడర్లతో పోలిస్తే తక్కువగా నమోదైంది.చిన్న చక్రాలే ప్రధాన కారణమా?ఈ-స్కూటర్ల డిజైన్ కూడా ప్రమాద తీవ్రతకు ఓ కారణమని బోడాన్స్కీ అభిప్రాయపడ్డారు. చిన్న పరిమాణంలో ఉండే చక్రాలు గుంతలు, రోడ్డు గుంతలు లేదా ఇతర అడ్డంకుల్లో సులభంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీంతో రైడర్లు అదుపు తప్పి హ్యాండిల్బార్లపై నుంచి ముందుకు ఎగిరి తలపై పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఈ-స్కూటర్ రైడర్లలో 6 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్ ధరించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తలకు సంబంధించిన గాయాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మహిళలు, యువతకూ అధిక ముప్పుఈ-స్కూటర్ ప్రమాదాల్లో లింగపరమైన తేడాలు కూడా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళలు సుమారు మూడో వంతు ఎక్కువగా ప్రమాదాలకు గురైనట్లు, అలాగే తీవ్రమైన గాయాలు నమోదయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ-స్కూటర్ల హ్యాండిల్బార్లు సాధారణంగా పురుషుల శరీరాకృతికి అనుగుణమైన ఎత్తులో ఉండటం కూడా మహిళలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఓ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మొత్తం ఈ-స్కూటర్ గాయాల్లో 16 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలంటున్న నిపుణులుయూకేలోని చాలా ప్రాంతాల్లో పబ్లిక్ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ లేన్లపై ప్రైవేట్ ఈ-స్కూటర్లను నడపడం చట్టబద్ధం కాదు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వారి నుంచి పోలీసులు వేలాది ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్ వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి భద్రతా శిక్షణ, హెల్మెట్ వినియోగం, మెరుగైన డిజైన్‌తో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ రైడర్లకు భద్రత కల్పించేలా ఈ-స్కూటర్ల రూపకల్పన, వినియోగ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
E20 పెట్రోల్‌పై ఆందోళనలు.. పరీక్షల్లో తేలింది ఇదే!
భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై గత కొంతకాలంగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ కలపడం వల్ల ఇంధన నాణ్యతపై ప్రభావం పడుతుందా?.. క్లోరైడ్, తేమ లేదా నీరు కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించాయి.దేశంలోని రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. వాటిలో క్లోరైడ్ స్థాయి 1 ppm లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగా ఉంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కి పైగా ఈ20 నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చని చమురు సంస్థలు చెబుతున్నాయి.చమురు సంస్థలు ఎన్ని చెబుతున్నా.. ఈ20పై వినియోగదారుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గడం లేదా వాహనం పనితీరులో మార్పులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్లు వాహన వినియోగదారులు పేర్కొంటున్నారు. -
భారత్‌లో.. లక్షలమంది కొంటున్న కారు ఇదే!
భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. మారుతి సుజుకి డిజైర్ (సెడాన్) మాత్రం అమ్మకాలలో దూసుకుపోతోంది. FY27లో ఏప్రిల్ నుంచి జూలై వరకు డిజైర్ 89,816 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు FY26లో 2,29,130 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. సెడాన్ కార్ల మార్కెట్ వాటా భారీగా పడిపోయినప్పటికీ డిజైర్ అమ్మకాలు గణనీయంగా ఉండటం విశేషం.డిజైర్‌కు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణాలు.. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విశాలమైన క్యాబిన్, మంచి రీసేల్ వాల్యూ. మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సర్వీస్ నెట్వర్క్ కూడా దీనికి కలిసొస్తున్నాయి. అందుకే చాలా కుటుంబాలు డిజైర్ ఒక మంచి ఎంపికగా భావిస్తారు.భద్రత విషయంలో.. కూడా కొత్త డిజైర్ మంచి ఫలితాలు సాధించింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో అడల్ట్, చైల్డ్ ప్రొటక్షన్ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కాగా ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఎంపికలలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 24.79 కిమీ/లీ మైలేజ్, సీఎన్జీ మోడల్ 33.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైర్ ధరలు సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.36 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది -
కియా కార్లపై ఆగస్టు ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు
కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కియా ఇండియా ఆగస్టు నెలలో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కంపెనీ తన పలు మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, కార్పొరేట్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ వంటి పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు అన్ని మోడళ్లు, వేరియంట్లకు ఒకేలా ఉండవు. డీలర్, నగరం, స్టాక్ లభ్యతను బట్టి కూడా మారే అవకాశం ఉంది.కియా కార్నివాల్ఆగస్టులో అత్యధిక ప్రయోజనం ఈ ప్రీమియం ఎంపీవీపై లభిస్తోంది. MY2026 మోడళ్లపై రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ ప్రయోజనాలు కలిపి గరిష్ఠంగా రూ.1.5 లక్ష నుంచి రూ.1.70 లక్ష వరకు ప్రయోజనం లభిస్తుందని వివిధ తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అన్ని ప్రయోజనాలు ప్రతి కొనుగోలుదారుడికి వర్తించవు.కారెన్స్ క్లావిస్MY2026 పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.95,000 వరకు లభించవచ్చు. పాత MY2025 టర్బో-పెట్రోల్ స్టాక్‌పై ప్రయోజనం మరింత ఎక్కువగా ఉండొచ్చు.కారెన్స్ క్లావిస్ ఈవీMY2026 ఎలక్ట్రిక్ MPVపై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం కలిపి రూ.75,000 వరకు ప్రయోజనం లభిస్తుంది.కియా సైరోస్MY2026 టర్బో-పెట్రోల్ వెర్షన్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.20,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. అంటే గరిష్ఠంగా రూ.65,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. డీజిల్ వెర్షన్‌పై ప్రయోజనం రూ.55,000 వరకు ఉంటుంది.కియా సోనెట్ MY2026 సోనెట్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనం ఉంది. ముఖ్యంగా 1.2 HTK(O) వేరియంట్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్, రూ.15,000 స్క్రాపేజ్, రూ.15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ లభిస్తాయి.కియా సెల్టోస్ కొత్త తరం సెల్టోస్‌పై గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనం ఉంది. ఇందులో రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్ ప్రయోజనం ఉన్నాయి. పాత MY2025 స్టాక్‌పై మాత్రం ప్రధానంగా స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే లభిస్తోంది.కియా కారెన్స్ MY2026 కారెన్స్‌పై ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ద్వారా రూ.20,000, కార్పొరేట్ బెనిఫిట్‌గా రూ.15,000 వరకు కలిపి రూ.35,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.పాత స్టాక్‌పై భారీ ప్రయోజనాలుఆగస్టు ఆఫర్లలో MY2025 స్టాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం కనిపిస్తోంది. ముఖ్యంగా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ MY2025 మోడళ్లపై రూ.1.40 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, ఇందులో భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. సైరోస్ MY2025 స్టాక్‌పై రూ.70,000 వరకు ప్రయోజనం లభించవచ్చు. అందువల్ల పాత స్టాక్ కొనుగోలు చేసే వారు తయారీ నెల, మోడల్ ఇయర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయడం మంచిది.ఇదీ చదవండి: 165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. -
ఈవీలను తెగబడి కొంటున్నారు!
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. జులైలో మరోసారి రికార్డు సృష్టించాయి. ఏకంగా 3,27,901 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైతో పోలిస్తే ఇది 66 వృద్ధి. ప్రస్తుతం రిటైల్ విక్రయాల్లో ప్రతి ఎనిమిది వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం ఉంటోందని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లోనే 63 శాతం వృద్ధితో 3,06,220 యూనిట్ల విక్రయాలతో రికార్డు నమోదైంది. దీనితో మొత్తం ఈవీల వినియోగం తొలిసారిగా 12 శాతాన్ని దాటింది.జులైలో ద్విచక్ర ఈవీల అమ్మకాలు గతేడాది జూలైలో నమోదైన 1,08,516 యూనిట్ల నుంచి 88 శాతం ఎగిసి 2,04,362 యూనిట్లకు పెరిగాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాలు 32 శాతం వృద్ధితో 17,981 యూనిట్ల నుంచి 87,055 యూనిట్లకు చేరాయి. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు 169 శాతం ఎగిసి 1,324 యూనిట్ల నుంచి 3,556 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం నుంచి కొనుగో లు చేసే వైపుగా వినియోగదారులు మళ్లుతున్నారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ తెలిపారు. అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్స్ సరఫరా కొరత ప్రతిబంధకంగా ఉంటోందని, లేకపోతే అమ్మకాలు మరింతగా పెరుగుతాయని చెప్పారు. పండుగ సీజన్‌కి ముందుగా సరఫరాను పెంచే దిశగా తయారీ సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ20 పెట్రోల్ నాణ్యమైనదే: ఆయిల్ కంపెనీలుఈ20 పెట్రోల్‌లో అధిక తేమ, క్లోరైడ్ ఉంటున్నాయన్న ఆరోపణలు నిరాధారమైనవని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన పరీక్షల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలేమీ లభించలేదని పేర్కొన్నాయి. మొత్తం సరఫరా వ్యవస్థవ్యాప్తంగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఈ20 పెట్రోల్ ఉందని తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెరి్మనల్స్, రిటైల్ ఔట్‌లెట్స్‌లో పర్యవేక్షణను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని వివరించాయి. నీరు చొరబడటం, సాంద్రతకు సంబంధించి ప్రతి బంకులోనూ రోజుకు 8–12 సార్లు పరీక్షలు చేస్తూ, నాణ్యతపై పర్యవేక్షణను కఠినతరం చేసినట్లు ఓఎంసీలు తెలిపాయి.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
వర్టస్ యానివర్సరీ ఎడిషన్ లాంచ్.. 150 యూనిట్లు మాత్రమే!
ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో.. వర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ను రూ. 19.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత వర్టస్ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ జీటీ ప్లస్ స్పోర్ట్ ట్రిమ్ ఆధారంగా నిర్మితమైంది.వర్టస్ యానివర్సరీ ఎడిషన్ అవకాడో పెర్ల్ రంగులో లభిస్తుంది. రూఫ్ నలుపు రంగులో ఉంటుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ బూట్ లిప్ స్పాయిలర్ కూడా ఉన్నాయి. ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో కేవలం 150 యూనిట్లు మాత్రమే లభిస్తుంది. డిజైన్ ప్యాకేజీలో ఫ్రంట్ బంపర్‌పై గ్లాస్ బ్లాక్ ట్రిమ్, ముదురు రంగు హెడ్‌ల్యాంప్, టెయిల్ల్యాంప్ హౌసింగ్‌లు, గ్లాస్ బ్లాక్ డాష్‌బోర్డ్ ఇన్సర్ట్లతో కూడిన బ్లాక్ కలర్ క్యాబిన్ ఉంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. లెదరెట్ అపోల్స్ట్రే, రెడ్ కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ సన్‌రూఫ్, 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎనిమిది స్పీకర్ల ఆడియో సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 1.5 లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ (150 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్) ఎంపికలో లభిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. 19.62 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. -
165 Km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ (E3 Electric.Ai) తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ3 ట్రయాన్ (E3 TRION)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కుటుంబ అవసరాలు, రోజువారీ నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌కు పరిచయ ధరను రూ.1 లక్ష (బెంగళూరు ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. తొలుత బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభించి, అనంతరం ఇతర నగరాలకు విస్తరించనుంది.మూడు వేరియంట్లు.. ధరలుఈ3 ట్రయాన్ను C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ C1 ధర రూ.1 లక్ష కాగా, C1X ధర రూ.1,09,999, టాప్ వేరియంట్ C2 ధర రూ.1,19,999గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. కంపెనీ తొలుత బెంగళూరు మార్కెట్‌పై దృష్టి పెట్టి, దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉంది.165 కి.మీ వరకు రేంజ్ఈ3 ట్రయాన్‌లో వేరియంట్‌ను బట్టి బ్యాటరీ, పనితీరు మారుతాయి. C1లో 2.3kWh రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది IDC సర్టిఫైడ్ రేంజ్ 108 కి.మీ, గరిష్ఠ వేగం గంటకు 67 కి.మీగా ఉంటుంది.C1Xలో 3kWh స్థిర బ్యాటరీని అందించారు. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ వరకు IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో మొత్తం ట్రియాన్ లైనప్‌లో ఇదే రేంజ్ ఫోకస్డ్ మోడల్‌గా నిలుస్తుంది.ఇక C2 కూడా 3kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 128 కి.మీ IDC రేంజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీ. స్పోర్ట్ మోడ్‌లో 0-40 కి.మీ వేగాన్ని సుమారు 6 సెకన్లలో అందుకోగలదని కంపెనీ పేర్కొంది. C1, C1Xలో ఎకో, పవర్ మోడ్లు ఉండగా.. C2లో అదనంగా స్పోర్ట్ మోడ్‌ను అందించారు.స్కూటర్లో AI ప్రత్యేక ఆకర్షణఈ3 ట్రయాన్‌లో సాధారణ కనెక్టెడ్ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ప్రధానంగా తీసుకొచ్చారు. ఏఐ ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ, ముందస్తు రిపోర్టులు, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్, లైవ్ వెహికల్ డేటా, కనెక్టెడ్ నావిగేషన్, ఛార్జర్ లొకేషన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్కూటర్లో 5 అంగుళాల డిస్ప్లేను అందించారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు. డాష్‌క్యామ్ ఫంక్షనాలిటీ, SOS అసిస్టెన్స్, జియో-ఫెన్సింగ్, ఛార్జింగ్ ఇన్సైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాహనంలోని బ్యాటరీ, మోటార్, ఇతర వ్యవస్థల డేటాను విశ్లేషించి సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడమే ఏఐ వ్యవస్థ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.14 అంగుళాల చక్రాలు.. 52 లీటర్ల స్టోరేజ్డిజైన్ పరంగా ట్రియాన్‌ను కుటుంబ వినియోగానికి అనుగుణంగా రూపొందించారు. ఇందులో 14 అంగుళాల పెద్ద చక్రాలు ఉండటంతో నగర రోడ్లతో పాటు గ్రామీణ రహదారులపై కూడా మెరుగైన స్థిరత్వం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IP67 రేటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్స్, వెనుక LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బూట్, ఫ్లోర్‌బోర్డ్, గ్లోవ్‌బాక్స్ ప్రాంతాలను కలిపి 52 లీటర్ల వరకు స్టోరేజ్ సామర్థ్యం అందించారు. -
టాటా నెక్సాన్ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న నెక్సాన్.. 'కామో ఎడిషన్' రూపంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి కంపెనీ పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.భారతదేశంలో నెక్సాన్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని, 11 లక్షలకు పైగా అమ్మకాలను సాధించిన సందర్భంగా.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. అయితే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు లేదు, కానీ కొన్ని కాస్మెటిక్ అప్డేట్లు & కొన్ని అదనపు పరికరాలను జోడించారు.నెక్సాన్ కామో ఎడిషన్ మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే రెండు కొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ రంగులు కాకుండా కామో బ్యాడ్జ్‌లు కనిపిస్తాయి. క్యాబిన్లో కూడా ముందు సీట్ల హెడ్రెస్ట్లపై కామో థీమ్ ఉంటుంది. క్యాబిన్ లోపల 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించారు.మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఈ కారులోని నాలుగు సరౌండ్-వ్యూ కెమెరాలను ఉపయోగించి పనిచేసే ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్. ఇది నిరంతరంగా రికార్డ్ చేయగలదు, ప్రమాదం జరిగినప్పుడు ఫుటేజీని ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది, వీడియోలను ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌పై చూడటానికి లేదా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.వేరియంట్‌ను బట్టి.. పరికరాల జాబితాలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, జేబీఎల్ స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఏడు ఫంక్షన్లతో కూడిన ఏడీఏఎస్ మాత్రమే కాకుండా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం కూడా ఉన్నాయి.నెక్సాన్ కామో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్లో ఉన్న అవే ఇంజన్ ఆప్షన్లతో కొనసాగుతుంది. కొనుగోలుదారులు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ టర్బో సీఎన్జీ యూనిట్ వంటి వాటిలో ఎంచుకోవచ్చు. వేరియంట్‌ను బట్టి, ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, ఆటోమాటిక్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు! -
టీవీఎస్ స్కూటర్ల ధరల పెంపు.. అత్యధికం ఆ స్కూటర్‌పైనే..
టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ లైనప్‌లో పలు మోడళ్ల ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్ల ధరలను కూడా సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఆర్బిటర్ శ్రేణి కూడా ఖరీదైంది. మరోవైపు జూపిటర్ 110, జూపిటర్ 125, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది.ఐక్యూబ్ ధరలు ఇలా..టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లలో 3.5kWh మోడల్‌పై అత్యధిక పెంపు నమోదైంది. దీని ధర రూ.1.33 లక్షల నుంచి రూ.1.42 లక్షలకు పెరిగింది. అంటే రూ.9,000 పెరిగింది. బేస్ 2.2kWh ఐక్యూబ్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్ ఎస్ (4.7kWh) ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.61 లక్షలకు పెరిగింది. ఇక టాప్-స్పెక్ ఐక్యూబ్ ఎస్టీ (5.3kWh) ధర రూ.1.72 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు చేరింది. అయితే 3.1kWh ఐక్యూబ్ ధర రూ.1.33 లక్షల వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.ఆర్బిటర్పై అత్యధికంటీవీఎస్ కొత్త ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ల ధరలు అత్యధికంగా పెరిగాయి. ఆర్బిటర్ వి1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కు చేరింది. అంటే రూ.11,00 పెరిగింది. ఆర్బిటర్ వి2 ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.14 లక్షలకు పెరిగింది. ఈ వేరియంట్‌పై రూ.9000 పెంపు నమోదైంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.జూపిటర్ 110, 125 ధరల పెంపుపెట్రోల్ స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 110 ధరలు కూడా పెరిగాయి. వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెంపు నమోదైంది. దీంతో ఈ స్కూటర్ ధరల శ్రేణి రూ.73,975 నుంచి రూ.88,850కు చేరింది.జూపిటర్ 125 మోడల్ ధరలు కూడా రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ ధరలు రూ.81,110 నుంచి రూ.89,935 వరకు ఉన్నాయి.ఎన్‌టార్క్ 125 ధరలూ పెరిగాయిస్పోర్టీ లుక్‌తో యువతలో మంచి ఆదరణ ఉన్న ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ.82,500 నుంచి రూ.83,350కు పెరిగింది. అంటే రూ.850 పెరిగింది. ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ ధర కూడా రూ.87,950 నుంచి రూ.88,800కు చేరింది.వేరియంట్‌ను బట్టి పెంపు మారుతున్నందున కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బుకింగ్‌కు ముందు తాజా ధరలను డీలర్ వద్ద నిర్ధారించుకోవడం మంచిది. -
రహదారి భద్రతలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడమే. పార్లమెంటరీ కమిటీ, అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదైన 30.48 కోట్ల వాహనాల్లో ఏకంగా 16.54 కోట్ల వాహనాలు (ప్రధానంగా ద్విచక్ర వాహనాలు) ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 146 అమలుపై కీలక తీర్పు ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం (పెట్రోల్/డీజిల్) విక్రయించకుండా నిరోధించేలా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.సాంకేతికతతో ఆటోమేటిక్ ఈ-చలాన్లుఇంధన విక్రయాల నిలిపివేతకే పరిమితం కాకుండా సాంకేతికతను జోడించాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 'వాహన్' పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. దీనిద్వారా బీమా లేని వాహనాలు రహదారిపైకి రాగానే ఆటోమేటిక్‌గా గుర్తించి వాహనదారుల మొబైల్ ఫోన్లకు ఈ-చలాన్లు వెళ్తాయి. తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాలు/యాప్‌లు అందుబాటులోకి తేనున్నారు.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో-ఎన్‌కు 2026 అప్డేట్ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ ఆటోమేటిక్ 4WD వేరియంట్ ధర రూ.25.49 లక్షలకు చేరింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త స్కార్పియో-ఎన్లో ప్రధానంగా ఇంటీరియర్, టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయగా.. బయటి డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.డిజైన్, ఇంజిన్ అలాగే..స్కార్పియో-ఎన్‌కు ఉన్న బాక్సీ, ఎత్తైన, రగ్డ్ డిజైన్‌ను మహీంద్రా కొనసాగించింది. ముందు భాగంలోని గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సీ-ఆకారంలోని డీఆర్ఎల్లు, బంపర్, టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రధాన డిజైన్ అంశాలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. అయితే, టాప్ వేరియంట్లలో కొత్త 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.ఇక 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్లే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 203hp పవర్, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 175hp పవర్, 400Nm టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో మహింద్రా 4XPLOR 4WD సిస్టమ్ కొనసాగుతోంది.అసలు అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లోనే..స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పులు క్యాబిన్లో కనిపిస్తాయి. పాత 8-అంగుళాల యూనిట్ స్థానంలో 12.3-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ HD ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వచ్చింది. దీనికి ఆరు ఫిజికల్ షార్ట్‌కట్ బటన్లు ఇచ్చారు. అలాగే, గతంలో ఉన్న సెమీ-డిజిటల్ క్లస్టర్ స్థానంలో 10.25-అంగుళాల పూర్తిస్థాయి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు.ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా బిల్ట్-ఇన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు వరుసలో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే USB టైప్-C పోర్ట్ కూడా చేరింది.పనోరమిక్ సన్‌రూఫ్, 540-డిగ్రీ కెమెరాకొత్త స్కార్పియో-ఎన్లో తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. మరో ముఖ్యమైన అప్‌గ్రేడ్ 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా. ఇందులో బ్లైండ్-వ్యూ మానిటర్ కూడా ఉంటుంది. పార్కింగ్ సమయంలో వాహనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మరింత స్పష్టంగా గమనించేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఇవే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-డిమ్మింగ్ IRVM, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి ‘అడ్వెంచర్ స్టాటిస్టిక్స్’ (Adventure Statistics) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో ఇంజిన్ పనితీరు, రోల్, పిచ్, కంపాస్, ఆల్టీమీటర్, జీ-ఫోర్స్ వంటి వివరాలను డ్రైవర్ చూడవచ్చు.లెవల్-2 అడాస్ సేఫ్టీభద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేకులు, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్, ISOFIX వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ Z8L వేరియంట్లో లెవల్-2 ADAS లభిస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై-బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.కొత్త స్కార్పియో-ఎన్ ధరలు2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ను Z2, Z4, Z6, Z8S, Z8, Z8T, Z8L వేరియంట్లలో అందిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో 4WD కూడా లభిస్తుంది. వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..వేరియంట్పెట్రోల్ MTపెట్రోల్ ATడీజిల్ MTడీజిల్ ATడీజిల్ 4WD MTడీజిల్ 4WD ATZ2రూ.13.69 లక్షలు–రూ.14.19 లక్షలు–––Z4రూ.15.57 లక్షలురూ.17.16 లక్షలురూ.16.12 లక్షలురూ.17.68 లక్షలురూ.18.03 లక్షలు–Z6––రూ.17.17 లక్షలురూ.18.82 లక్షలు––Z8Sరూ.17.79 లక్షలురూ.19.26 లక్షలురూ.18.79 లక్షలురూ.19.89 లక్షలు––Z8––రూ.19.86 లక్షలురూ.21.41 లక్షలు––Z8Tరూ.20.38 లక్షలురూ.21.75 లక్షలురూ.20.65 లక్షలురూ.22.25 లక్షలురూ.22.86 లక్షలురూ.24.39 లక్షలుZ8L 7-సీటర్రూ.21.31 లక్షలురూ.22.87 లక్షలురూ.21.99 లక్షలురూ.23.49 లక్షలురూ.24.25 లక్షలురూ.25.49 లక్షలుZ8L 6-సీటర్రూ.21.69 లక్షలురూ.23.05 లక్షలురూ.22.47 లక్షలురూ.23.80 లక్షలు––పాత మోడల్‌తో పోలిస్తే ఎంట్రీ లెవల్ Z2 పెట్రోల్ మాన్యువల్ ధర రూ.20,000 పెరిగింది. టాప్-ఎండ్ Z8L డీజిల్ 4WD ఆటోమేటిక్ ధర రూ.54,000 అధికమైంది. -
E20 పెట్రోల్‌తో ఇంజిన్లు పాడవుతున్నాయా?
దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపిన పెట్రోల్) పెట్రోల్ వినియోగం, ఇంధన నాణ్యతపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్’ (సియామ్) స్పష్టత నిచ్చింది. సాంకేతిక చర్చలలోని కొన్ని అంశాలను పాక్షికంగా చర్చించిన తర్వాత చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ మునుపటి లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.భారత ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 ఇంధన రంగానికి ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇస్తుందని సియామ్ స్పష్టం చేసింది. దేశ ఇంధన స్వయంసమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇథనాల్ బ్లెండింగ్ అత్యంత కీలకమైనదని తెలిపింది. వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యమని పేర్కొంది.కఠినమైన నాణ్యతా ప్రమాణాలుకేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇథనాల్ సరఫరా ప్రక్రియలో క్లోరైడ్, సల్ఫర్ స్థాయిలను గరిష్టంగా 3 పీపీఎం పరిమితికి లోబడి ఉంచాలని ముందు జాగ్రత్త మార్గదర్శకాలను జారీ చేసిందని సియామ్ గుర్తుచేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజూ 150కి పైగా పారామితుల్లో ఇంధనాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని తెలిపింది.నిరంతర తనిఖీలుదేశవ్యాప్తంగా ఉన్న 87,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో నీరు చేరకుండా రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పరీక్షించిన వేల కొద్దీ శాంపిళ్లలో వ్యత్యాసాలు అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యాయని వివరించింది. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ కంపెనీలు, సాంకేతిక నిపుణుల మధ్య ఇంధన నాణ్యతపై చర్చలు నిరంతరం సాగే ప్రక్రియ అని, మీడియాలో వచ్చిన కథనాలను ప్రాతిపదికగా తీసుకుని వాహనదారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సియామ్ స్పష్టం చేసింది.మునుపటి లేఖలో ఇలా..‘E20 పెట్రోల్‌లో క్లోరైడ్, తేమ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా వాహనాల ఇంజిన్ భాగాలు త్వరగా తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఈజీఆర్ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలోని ఇతర కీలక భాగాలు త్వరగా పాడైపోతున్నాయి. వాటి రీప్లేస్మెంట్లు భారీగా పెరిగాయి’ అని సియామ్ మునుపటి లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!
ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యత, కల్తీ అయ్యే అవకాశంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధనంలో కల్తీ లేదా నాణ్యత లోపాలు ఉన్నాయన్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశవ్యాప్తంగా కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ప్రజలకు అందించే పెట్రోల్ నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి దశలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ తనిఖీలతో పాటు.. ఎలాంటి కల్తీ జరగకుండా అదనపు పరీక్షలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించింది.దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో.. రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి కలయిక ఉందా.. లేదా?, అనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. పెట్రోల్‌లో కలుషితాలు ఉన్నాయా?, లేదా? అని తెలుసుకోవడానికి 2 వేలకు పైగా ఇంధన నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ కలుషిత సమస్యలు బయటపడగా, వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లో విక్రయాలను నిలిపివేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.తనిఖీలు ఇలా..ఈ20 పెట్రోల్ నాణ్యత అనేది వాహనం ట్యాంక్‌కు చేరిన తర్వాత మాత్రమే పరిశీలించేది కాదని కేంద్రం తెలిపింది. ఇథనాల్ తయారీ దశ నుంచే నాణ్యత తనిఖీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ముందు ఇథనాల్ నాణ్యతను పరిశీలిస్తారు. డిస్టిలరీల నుంచి వచ్చే ప్రతి బ్యాచ్ ఎథనాల్ BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దాని స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండటం తప్పనిసరి. ఇథనాల్‌ను ఆయిల్ కంపెనీల డిపోలకు పంపే సమయంలో నాణ్యత ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు.నాణ్యత ప్రమాణాలు పాటించని ఇథనాల్‌ను.. సరఫరా వ్యవస్థలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం తెలిపింది. 2024 జూలై నుంచి 2026 జూన్ మధ్య కాలంలో 302 ట్యాంకర్లలో వచ్చిన దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ను ప్రమాణాలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. ఇందులో స్వచ్ఛత, నీటి శాతం, సాంద్రత వంటి అంశాల్లో లోపాలను గుర్తించారు.ఇథనాల్ నిల్వ, రవాణా సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పదార్థాలతో కలవకుండా.. ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో ఉంచుతున్నారు. డిపోలకు చేరిన ప్రతి ట్యాంకర్ నుంచి పైభాగం, కింది భాగం నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించిన తర్వాతే ఆమోదిస్తున్నారు.Certain media reports have cited issues of fuel adulteration or contamination. It is hereby clarified that fuel quality is monitored on a regular basis by Oil Marketing Companies. In addition to the advanced and elaborate testing protocols already in place, further checks have… pic.twitter.com/o0fnrnXrCM— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) August 4, 2026 -
డ్రైవింగ్ సమయంలో.. ఏ నావిగేషన్ యాప్ బెస్ట్?
ఒకప్పుడు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలంటే.. దారిలో కనిపించినవాళ్లను అడిగి తెలుసుకుని వెళ్లేవారు. కానీ పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. దీంతో న్యావిగేషన్ పుట్టుకొచ్చింది. ఒకప్పుడు దారి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే మ్యాప్స్ యాప్స్.. ఇప్పుడు ట్రాఫిక్‌ను తప్పించుకోవడం, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కథనంలో డ్రైవింగ్ సమయంలో ఏ యాప్ ఎక్కువ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలోనూ.. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి యాపిల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్, వేజ్ (Waze) వంటి యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.యాపిల్ మ్యాప్స్యాపిల్ పరికరాలను ఉపయోగించేవారికి యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. ఇవి మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యాప్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో డిజైన్, స్పష్టమైన రూట్ వివరాలు మొదలైనవి ఉన్నాయి.ఐఫోన్, యాపిల్ వాచ్ వంటి డివైజ్లతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రయాణ సమయంను ఇతరులతో షేర్ చేయడం, కారును పార్క్ చేసిన ప్రదేశాన్ని గుర్తుంచుకోవడం, వివిధ యాపిల్ పరికరాల్లో రూట్లను సింక్ చేయడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అయితే రూట్లను ఎక్కువగా కస్టమైజ్ చేయడం, ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించడం వంటి విషయాల్లో దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.వేజ్ (Waze)ట్రాఫిక్ సమస్యలను ముందుగానే తెలుసుకోవాలనుకునే వారికి వేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు, రోడ్ బ్లాక్‌లు, పోలీస్ చెకింగ్ వంటి సమాచారాన్ని ఇది అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులోని సమాచారం ఎక్కువగా యూజర్ల నుంచి వస్తుంది. అంటే.. ఒక ప్రాంతంలో ఎదురయ్యే సమస్యలను అక్కడి డ్రైవర్లు వెంటనే తెలియజేస్తారు. దీంతో మిగతా వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వెజ్ వినియోగం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమాచారం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. వినియోగదారులు దీనిని గుర్తుంచుకోవాలి.గూగుల్ మ్యాప్స్గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉపయోగించే నావిగేషన్ యాప్‌లలో ఇది ప్రధానమైనది. ఈ యాప్ దారి చూపడానికి మాత్రమే కాకుండా.. ప్రయాణానికి అవసరమైన అనేక ఫీచర్లను అందిస్తుంది.ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం, టోల్ రోడ్లను తప్పించడం, తక్కువ ఇంధనం ఖర్చయ్యే మార్గాలను సూచించడం, లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా నెట్వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో ప్రయాణించే వారికి కూడా గూగుల్ మ్యాప్స్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.ఏ యాప్‌ను ఎంచుకోవాలి?మీరు పూర్తిగా యాపిల్ ఎకోసిస్టమ్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాప్స్ మంచి ఎంపిక. రోజువారీ ట్రాఫిక్ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటే వేజ్ ఉపయోగపడుతుంది. ఎక్కువ ఫీచర్లు, నమ్మకమైన రూటింగ్, ఆఫ్‌లైన్ సదుపాయాలు కావాలంటే గూగుల్ మ్యాప్స్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అందరికీ సరిపోయే ఒకే ఒక్క బెస్ట్ నావిగేషన్ యాప్ ఉండదు. కాబట్టి ప్రయాణ అవసరాలు, డ్రైవింగ్ చేసే ప్రాంతం, కావాల్సిన సదుపాయాల ఆధారంగా సరైన యాప్‌ను ఎంచుకుంటే ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. -
జూలైలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ వాహనదారుల ఆదరణే పరమావధిగా మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జులై 2026 నెలవారీ కార్ల విక్రయాల గణాంకాల ప్రకారం.. ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 18,200 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM), వివిధ ఆటోమొబైల్ సంస్థల అధికారిక నివేదికల ప్రకారం గత జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లుమారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ (WagonR): 18,200 యూనిట్లు అమ్ముడుపోయి మొదటి స్థానంలో నిలిచింది. దీని మైలేజ్, తక్కువ బడ్జెట్, విశాలమైన క్యాబిన్ స్పేస్ ఇందుకు ప్రధాన కారణాలు. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.5.54 లక్షలు - రూ.7.38 లక్షలుహ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): 17,500 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎస్యూవీ (SUV) విభాగంలో ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.11.00 లక్షలు - రూ.20.15 లక్షలుమారుతీ సుజుకీ బ్రెజా (Brezza): 16,800 యూనిట్లు అమ్ముడై మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా దీని సీఎన్జీ (CNG) వేరియంట్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ లభించింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.8.34 లక్షలు - రూ.14.14 లక్షలుటాటా పంచ్ (Tata Punch): 16,100 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.6.13 లక్షలు - రూ.10.20 లక్షలుమారుతీ సుజుకీ స్విఫ్ట్ (Swift): కొత్త మార్పులతో వచ్చిన ఈ కారు 15,600 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.6.49 లక్షలు - రూ.9.60 లక్షలువ్యాగన్ఆర్ ఇప్పటికీ హాట్ ఫేవరెట్ ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా మార్కెట్లో ఎస్యూవీ (SUV)ల హవా నడుస్తున్నప్పటికీ, వ్యాగన్ఆర్ తన స్థానాన్ని పదిలపరుచుకోవడం విశేషం. ముఖ్యంగా పట్టణ రోడ్లలో సులువైన డ్రైవింగ్, మెరుగైన ఇంధన సామర్థ్యం (CNG ఆప్షన్ సహా), రీసేల్ వ్యాల్యూ, అందుబాటు ధరలు ఈ కారును సామాన్యుడి ఫేవరెట్ చాయిస్‌గా మార్చాయి.మారుతీ సుజుకీ తిరుగులేని ఆధిపత్యంమోడళ్ల వారీగానే కాకుండా, మొత్తం కార్ల కంపెనీల పరంగా చూస్తే మారుతీ సుజుకీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జులై 2026లో ఒక్క దేశీయ మార్కెట్లోనే దాదాపు 2 లక్షల యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. -
పెరిగిన కార్ల అమ్మకాలు.. హ్యుందాయ్‌కు ఆల్‌టైమ్ రికార్డు!
ఇండియా కార్ల మార్కెట్‌కు 2026 జూలై నెల మంచి ఊపునిచ్చింది. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా.. గత ఏడాది జూలైతో పోలిస్తే మెరుగైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా హ్యుందాయ్ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించగా, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రాకంపెనీ ఎస్యూవీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కియా, టయోటా, ఎంజీ మోటార్, నిస్సాన్ కూడా బలమైన విక్రయాలను పొందాయి.టాటా మోటార్స్.. జూలైలో మొత్తం 63,760 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40 వేల యూనిట్లతో పోలిస్తే ఇది 59 శాతం ఎక్కువ. ఇందులో దేశీయ మార్కెట్లోనే 62,611 వాహనాలు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మరోసారి తన సత్తా చాటింది. జూలైలో 15,217 ఈవీలను విక్రయించి గత ఏడాది కంటే.. 114 శాతం వృద్ధిని నమోదు చేసింది.మహీంద్రా కంపెనీ.. జూలైలో దేశీయ మార్కెట్లో 60,048 ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అన్ని రకాల వాహనాలను కలిపి చూస్తే మహీంద్రా మొత్తం 1,03,860 యూనిట్లను విక్రయించి 26 శాతం వృద్ధిని సాధించింది. విదేశీ మార్కెట్లకు చేసిన ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా.. దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 75,360 వాహనాలను విక్రయించింది. ఇది హ్యుందాయ్ భారత చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా నిలిచింది. దేశీయంగా 54,210 కార్లు అమ్ముడవగా, ఎగుమతులు కూడా ఎనిమిదేళ్లలో అత్యధిక స్థాయికి చేరాయి. కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చిపెట్టిన మోడల్‌గా క్రెటా నిలవగా, ఐ20 కూడా ఈ ఏడాదిలో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది.కియా ఇండియా కూడా.. జూలైలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 28,200 యూనిట్లను విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 27.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త తరం సెల్టోస్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సైరోస్ ఈవీ వంటి మోడళ్లు కూడా అమ్మకాలకు ఊతమిచ్చాయి.టయోటా కిర్లోస్కర్ మోటార్ జులైలో మొత్తం 32,516 వాహనాలను విక్రయించి వృద్ధిలో నిలకడను చూపించింది. దేశీయ మార్కెట్లో 30,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. కంపెనీ దేశీయ అమ్మకాలు 5 శాతం పెరిగాయి. అలాగే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో టయోటా మొత్తం విక్రయాలు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి.జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. వరుసగా రెండో నెల అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. జూలైలో 8,158 వాహనాలను విక్రయించిన కంపెనీ, తన మొత్తం అమ్మకాలలో 80 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వాహనాలేనని వెల్లడించింది. దీంతో భారత ఈవీ మార్కెట్లో ఎంజీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.ఇక నిస్సాన్ జూలైలో.. దేశీయ మార్కెట్లో 4,518 వాహనాలను విక్రయించి ఏకంగా 218 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల విడుదలైన కొత్త టెక్టాన్ ఎస్‌యూవీకి వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.ఇదీ చదవండి: కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే? -
పొట్టి రైడర్లకు బెస్ట్ బైక్స్ ఇవే!
సాధారణంగా ఒక మోటార్‌సైకిల్ కొనుగోలు చేసే సమయంలో ఇంజిన్ పవర్, మైలేజ్, డిజైన్ మాత్రమే కాదు.. సీట్ హైట్ కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే.. తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు బైక్‌ను కంట్రోల్ చేయడంలో సీట్ హైట్ కీలక పాత్ర పోషిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపినప్పుడు రెండు కాళ్లు నేలను తాకడం, బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సులభంగా ఉండాలంటే.. తక్కువ సీట్ హైట్ ఉన్న బైక్‌లు చాలా ఉపయోగపడతాయి.సీట్ హైట్ ఒక్కటే మాత్రమే సౌకర్యవంతమైన రైడింగ్ ఇస్తుందని చెప్పలేము. సీట్ వెడల్పు, బైక్ బరువు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ.. పొట్టి రైడర్లు ముందుగా పరిశీలించాల్సిన ముఖ్యమైన స్పెసిఫికేషన్ సీట్ హైట్. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.77 వేల నుంచి రూ.1.85 లక్షల ధరల మధ్య 800 మిమీ కంటే తక్కువ సీట్ హైట్ కలిగిన కొన్ని మంచి బైక్స్ అందుబాటులో ఉన్నాయి.బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160తక్కువ సీట్ హైట్ కలిగిన బైక్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160. దీని సీట్ హైట్ కేవలం 737 మిమీ మాత్రమే. క్రూయిజర్ డిజైన్‌తో వచ్చే ఈ బైక్‌లో ఫార్వర్డ్ సెట్ ఫుట్‌పెగ్స్ ఉంటాయి. దీంతో రైడర్ కాళ్లు సహజమైన పొజిషన్లో ఉంటాయి. తక్కువ ఎత్తు ఉన్నవారికి పెద్ద ఇంజిన్ కలిగిన బైక్‌లలో ఇది సులభంగా కంట్రోల్ చేయగల ఆప్షన్‌గా నిలుస్తుంది.టీవీఎస్ రైడర్ 125780మిమీ సీట్ హైట్ కలిగిన టీవీఎస్ రైడర్ 125 ప్రధానంగా రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించిన కమ్యూటర్ బైక్. సన్నగా ఉండే సీట్, తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌లో హ్యాండిల్ చేయడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా బైక్ నడిపే పొట్టి రైడర్లకు ఇది మంచి ఎంపిక.హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి హీరో స్ప్లెండర్ ప్లస్. ఇది కూడా తక్కువ సీట్ హైట్ కలిగి ఉంటుంది. దీని సీట్ హైట్ 785 మిమీ మాత్రమే. తక్కువ బరువు, సన్నని బాడీ డిజైన్ కారణంగా పార్కింగ్ లేదా నెమ్మదిగా నడిపే సమయంలో కూడా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.బజాజ్ పల్సర్ 150785 మిమీ సీట్ హైట్ కలిగిన బజాజ్ పల్సర్ 150 కూడా మన జాబితాలో ఒకటి. స్ప్లెండర్‌తో పోలిస్తే.. ఈ బైక్ ట్యాంక్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. కాబట్టి 5 అడుగుల 4 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు కొనుగోలు చేసే ముందు ఒకసారి బైక్‌పై కూర్చొని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీట్ హైట్ తక్కువగా ఉన్నా, ట్యాంక్ వెడల్పు వల్ల కొందరికి కాళ్లు నేలకు పెట్టడం కాస్త భిన్నంగా అనిపించవచ్చు.జావా 42రెట్రో డిజైన్‌తో ఆకట్టుకునే జావా 42 బైక్ సీట్ హైట్ 788 మిమీ. దీని రౌండెడ్ సీట్ డిజైన్ కారణంగా రైడర్ కాళ్లు దగ్గరగా ఉంచుకోవచ్చు. అందువల్ల సీట్ హైట్ కంటే కూడా రైడింగ్ అనుభూతి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఈ జాబితాలో కొంచెం ఖరీదైన బైక్ అయినప్పటికీ, ప్రత్యేకమైన డిజైన్ కోరుకునే వారికి మంచి ఎంపిక.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350ఈ జాబితాలో కొంత ఎక్కువ హైట్ ఉన్న సీట్ కలిగిన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. దీని సీట్ హైట్ 790 మిమీ. చిన్న వీల్‌బేస్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా బైక్ పెద్దగా అనిపించదు. ఇందులో 349 సీసీ ఇంజిన్ ఉన్నప్పటికీ.. నగర రోడ్లపై సులభంగా నడపగలిగేలా రూపొందించారు. -
కొత్త రకం డీజిల్ వచ్చేసింది.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
భారత సైన్యం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే.. దేశంలో అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ (XWG) డీజిల్‌ను సైన్యం వినియోగంలోకి తీసుకురావడం మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సరికొత్త డీజిల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.నిజానికి.. సాధారణ డీజిల్ తీవ్ర చలిలో గడ్డకట్టే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ మాత్రం మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. అందుకే భారత సైన్యాధిపతి దీనిని సైన్యానికి గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు.XWG డీజిల్ గురించి..XWG అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్. పేరుకు తగ్గట్టుగా.. ఇది అత్యంత చల్లని వాతావరణ పరిస్థితులను తగ్గుకుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ XWGను ప్రత్యేకంగా తయారు చేశారు. సాధారణ డీజిల్ తీవ్రమైన చలిలో చిక్కబడి ఫ్యూయల్ లైన్లను, ఫిల్టర్లను మూసివేసే అవకాశం ఉంటుంది. దీంతో వాహనాలను స్టార్ట్ చేయడం కష్టమవుతుంది. కానీ XWG డీజిల్ అలాంటి సమస్యలను అధిగమించేలా రూపొందించారు. మైనస్ 42 డిగ్రీల వరకు కూడా ఇది గడ్డకట్టకుండా పనిచేస్తుంది.ఈ డీజిల్ అవసరం ఏమిటి?భారత సైన్యం లడఖ్, సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన మంచు ప్రాంతాల్లో నిరంతరం విధులు నిర్వహిస్తుంటుంది. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల కంటే తక్కువకు చేరిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో సాధారణ డీజిల్ గడ్డకట్టడంతో ట్యాంకులు, ట్రక్కులు, ఇతర సైనిక వాహనాలు పనిచేయడం కష్టమయ్యేది. దీని వల్ల సైనికులు రాత్రంతా వాహనాలను తరచూ స్టార్ట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంధన ట్యాంకుల కింద 'బుఖారీ' అనే సంప్రదాయ హీటర్‌ను కూడా ఉపయోగించేవారు. ఇది అదనపు శ్రమతో పాటు భద్రతాపరమైన ప్రమాదాలకు కూడా దారితీసేది.#GeneralDhirajSeth, #COAS, today launched Xtreme Weather Grade (XWG) Diesel, an indigenous innovation developed jointly by the Indian Army and Oil Marketing Companies. Designed for reliable performance in extreme cold, the specialised fuel remains effective at temperatures as low… pic.twitter.com/tV2rJlPMUu— ADG PI - INDIAN ARMY (@adgpi) July 31, 2026XWG డీజిల్ ఉపయోగాలుఈ కొత్త డీజిల్ ద్వారా తీవ్రమైన చలిలో కూడా వాహనాలు సులభంగా స్టార్ట్ అవుతాయి. దీంతో సైనిక వాహనాలు ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుంది. సైనికులపై అదనపు ఒత్తిడి తగ్గుతుంది. అలాగే డీజిల్ గడ్డకట్టకుండా ఉండేందుకు ప్రమాదకరమైన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు.ఈ డీజిల్ ఉపయోగించడానికి ప్రత్యేకంగా కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న వాహనాల్లోనే ఎలాంటి ఇంజిన్ మార్పులు చేయకుండా దీనిని ఉపయోగించవచ్చు. ఇది BS-VI ఉద్గార ప్రమాణాలు మరియు IS 1460:2025 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారైంది.సాధారణ ప్రజలు ఉపయోగించవచ్చ?ప్రస్తుతం ఈ డీజిల్‌ను ప్రధానంగా సైన్యం కోసం రూపొందించినప్పటికీ, భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి తీవ్ర చలిగాలులు వీచే ప్రాంతాల్లో వాహనాలు ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు.ఈ ప్రత్యేక డీజిల్‌ను భారత సైన్యం, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు కలిసి కేవలం ఏడాది వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఇది 'మేక్ ఇన్ ఇండియా' దిశగా మరో విజయంగా ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో కూడా సైన్యం అవసరాలకు అనుగుణంగా ఇలాంటి మరిన్ని ప్రత్యేక ఇంధనాలు, సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. -
128 కిమీ రేంజ్ అందించే.. విడా కొత్త స్కూటర్!
హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా.. దేశీయ విఫణిలో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన గో ఎఫ్బీ పేరుతో వీడా విఎక్స్2 సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.1.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కంపెనీకి చెందిన అధికారిక డీలర్‌షిప్‌లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ కొత్త వేరియంట్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 128 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జర్‌తో, 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 65 నిమిషాలు పడుతుంది. వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కు 6kW మోటార్ జత చేయబడి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు.హీరో విడా వీఎక్స్2 గో ఎఫ్బీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.3 అంగుళాల LCD కన్సోల్ పొందుతుంది. దీనికి టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ఉంది. సీటు కింద ఉండే స్టోరేజ్ సామర్థ్యం 27.2 లీటర్లు. కాబట్టి ఇది అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. -
హోండా కార్స్ ఇండియాకు కొత్త బాస్!
హోండా కార్స్ ఇండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా 'తోషియుకి యానగిసావా'ను(Toshiyuki Yanagisawa) నియమించింది. ఈయన 2026 అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కంపెనీకి నాయకత్వం వహిస్తున్న తకాషి నకాజిమా (Takashi Nakajima) తన పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత.. యానగిసావా ఏషియన్ హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.తోషియుకి యనగిసావా ప్రస్తుతం హోండా ఇండియా స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఆఫీస్‌ను నడిపించడంతో పాటు, హోండా డిజిటల్ ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HDII) సీఈఓగా కూడా ఉన్నారు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా HDII కార్యకలాపాలను ఆయన కొనసాగించనున్నారు.భారత మార్కెట్లో హోండా తన వ్యాపారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో.. కొత్త సీఈఓను నియమించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తున్న హోండా.. భవిష్యత్ వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న కొత్త కారును 2028లో విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.ప్రస్తుతం హోండా దేశీయ మార్కెట్లో అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ వాహనాలను దేశంలోనే తయారు చేస్తున్నారు. ఇటీవల హోండా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు జెడ్ఆర్-వీ (ZR-V) అనే హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా విడుదల చేసింది. ఈ మోడల్‌ను కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గంలో దిగుమతి చేసుకుంటుంది. -
టీవీఎస్ రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్ లాంచ్!
టీవీఎస్ మోటార్ కంపెనీ రైడర్ 125 డాక్టర్ డూమ్ ఎడిషన్‌ను రూ.95,320 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేసింది. ఇప్పటికే ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్, డెడ్‌పూల్, వోల్వరైన్ థీమ్‌లతో కూడిన మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న రైడర్ సూపర్ స్క్వాడ్ శ్రేణిని ఈ సరికొత్త మోడల్ మరింత విస్తరిస్తుంది. అంటే కొత్త థీమ్ కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని సంస్థ దీనిని విడుదల చేసింది.డాక్టర్ డూమ్ ఎడిషన్ స్పెక్ట్రల్ గ్రీన్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితులలో ఆకుపచ్చ నుంచి గోధుమ రంగులోకి మారే కలర్ షిఫ్టింగ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే.. ఇతర సూపర్ స్క్వాడ్ రైడర్ మోడళ్ల మాదిరిగానే, దీని ఫ్యూయల్ ట్యాంక్ అండ్ సైడ్ ప్యానెళ్లపై కూడా డాక్టర్ డూమ్ గ్రాఫిక్స్ ఉంటాయి.డిజైన్ పరంగా కొత్తగా అనిపించినప్పటికీ.. మెకానికల్‌గా ఏమీ మారలేదు. ఈ మోటార్‌సైకిల్ 124.8cc, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తూనే ఉంది. ఇది 11 bhp పవర్, 11.75 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది.ఫీచర్ల జాబితాలో కూడా ఎలాంటి మార్పు లేదు. అయితే రైడర్ డాక్టర్ డూమ్ ఎడిషన్‌లో.. కనెక్టెడ్ ఫంక్షన్లతో కూడిన టీవీఎస్ కనెక్టెడ్ రివర్స్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. టాప్ స్పెక్ సూపర్ స్క్వాడ్ వేరియంట్లలో సింగిల్ ఛానల్ ABSతో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. ఈ లేటెస్ట్ బైక్.. రానున్న రోజుల్లో అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌లన్నింటిలో అందుబాటులోకి వస్తుంది. -
అదరగొట్టిన మహీంద్రా.. కంగుతిన్న హ్యుందాయ్
దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో (2026–27, క్యూ1) కంపెనీ రూ. 5,455 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.4,083 కోట్లతో పోలిస్తే లాభం 34 శాతం జంప్ చేసింది. మొత్తం ఆదాయం కూడా 28 శాతం వృద్ధితో రూ. 45,529 కోట్ల నుంచి రూ. 58,188 కోట్లకు చేరింది.‘స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, మా వైవిధ్యమైన పోర్ట్ట్ఫోలియో, చురుకైన చర్యలతో సవాళ్లను అధిగమించి, పటిష్టమైన ఫలితాలను సాధించగలిగాం. ప్రస్తుత డైనమిక్ వ్యాపార పరిస్థితుల్లో కూడా ఆటో, వ్యవసాయ సంబంధిత విభాగాలు తమ లీడర్షిప్ పొజిషన్లను బలోపేతం చేసుకుంటున్నాయి’ అని ఎంఅండ్ఎం గ్రూప్ సీఈఓ, ఎండీ అనీశ్ షా పేర్కొన్నారు. క్యూ1లో కంపెనీ 23% వృద్ధితో రూ.3,04,000 వాహనాలను విక్రయించింది. ఇందులో 1,75,000 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) అమ్ముడవ్వడం విశేషం. ఎస్యూవీ మార్కెట్ వాటా సీక్వెన్షియల్‌గా అర శాతం పెరిగిందని, ఎక్స్ఈవీ 9ఎస్ అమ్మకాల సంఖ్య పరంగా భారత్‌లో టాప్ సెల్లింగ్ ఈవీగా నిలిచిందని ఎంఅండ్ఎం సీఈఓ (ఆటో, ఫామ్ సెక్టార్) రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 13 శాతం ఎగిశాయి. టెక్ మహీంద్రా మార్జిన్ల జోరు కొనసాగింది. ఎబిటా 330 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. మహీంద్రా లాజిస్టిక్స్ ఆదాయం పటిష్టంగా 23 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్‌కి పశ్చిమాసియా సెగపశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎగుమతులు క్షీణించడం, ఒక సప్లయర్ ప్లాంటులో అగ్నిప్రమాదంతో ఉత్పత్తి దెబ్బతినడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్స్ ఇండియా (హెచ్ఎంఐఎల్)పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనితో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం రూ. 889 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన రూ. 1,369 కోట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ.ఇక ఆదాయం రూ. 16,413 కోట్ల నుంచి రూ. 16,335 కోట్లకు తగ్గింది. అటు వ్యయాలు రూ. 14,780 కోట్ల నుంచి రూ. 15,407 కోట్లకు పెరిగాయి. పలు ప్రతికూల పరిస్థితుల వల్ల అమ్మకాలు, లాభదాయకతపై ప్రభావం పడిందని కంపెనీ సీఈవో తరుణ్ గర్గ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట చేయనున్నామని గర్గ్ చెప్పారు. -
రోడ్లపైకి 4 వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు..
దేశీయంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను రహదార్లపైకి తెచ్చిన తొలి భారతీయ సంస్థగా ఘనత సాధించినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ వెల్లడించింది. హిమాచల్ రోడ్డు రవాణా కార్పొరేషన్‌కి 4,000వ బస్సును లాంఛనంగా అందజేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇది కంపెనీకే కాకుండా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కూడా కీలక సందర్భమని కంపెనీ ఎండీ మహేష్ బాబు చెప్పారు.విశ్వసనీయమైన పనితీరు, తక్కువ నిర్వహణ వ్యయాలు, పర్యావరణానికి గణనీయంగా ప్రయోజనాలను అందించేలా తమ బస్సులు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సులు మొత్తం మీద 730 మిలియన్ గ్రీన్ కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాయని, 6.5 లక్షల టన్నులపైగా కర్బన ఉద్గారాలను నివారించాయని కంపెనీ పేర్కొంది. -
ఎలక్ట్రిక్ టూ-వీలర్ల జోరుతో ఈవీలు.. రయ్ రయ్!
ముంబై: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగం విస్తృత వృద్ధి దశలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా (పెనెట్రేషన్) 10 నుంచి 12 శాతానికి పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఈ వృద్ధికి ప్రధాన దన్నుగా నిలుస్తాయని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 8.5 శాతంగా నమోదైంది. ఇండ్–రా నివేదిక ప్రకారం విభాగాల వారీగా ఈవీ వాటా అంచనాలు ఇలా ఉన్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం, దిగ్గజ ఆటో కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో ద్విచక్ర వాహన విభాగంలో ఈవీల వాటా గతేడాది 6.6 శాతం నుంచి ఈ ఏడాది 8–10 శాతానికి పెరగొచ్చని అంచనా. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగంలో ఈవీల ఆధిపత్యం కొనసాగనుంది. గతేడాది (2025–26) మొత్తం త్రిచక్ర వాహన విక్రయాల్లో ఈవీల వాటా 59 శాతంగా ఉంది. కమర్షియల్ ఆపరేటర్లకు అనుకూలమైన నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 62–65 శాతానికి చేరొచ్చు. కొత్త మోడళ్ల విడుదలతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల వాటా గతేడాది 4.4 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి పెరగొచ్చు. మెట్రో నగరాలు, అధిక ఆదాయ వర్గాల్లో వీటి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అధిక ప్రారంభ కొనుగోలు ధర, చార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత, ఒక్కసారి చార్జింగ్‌తో ప్రయాణించగల దూరం (రేంజ్) వంటి అంశాలు ఈ విభాగంలో వేగవంతమైన విస్తరణకు సవాళ్లుగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) వాటా కూడా గతేడాది 4.37 శాతం నుంచి ఈ ఏడాది 6–8 శాతానికి చేరొచ్చు. బలమైన ఆర్డర్ బుక్, ప్రభుత్వ కొనుగోలు కార్యక్రమాలు ఇందుకు దోహదపడనున్నాయి. అయితే రాష్ట్ర రవాణా సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఈ–బస్సుల విస్తరణ ఆధారపడి ఉంటుందని పేర్కొంది.బ్యాటరీల దిగుమతులు తగ్గాలి వాహన వినియోగ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటం, విస్తృత శ్రేణిలో కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, వినియోగదారుల ఆదరణ పెరగడంతో దేశీయ ఈవీ మార్కెట్‌కు బలమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే తదుపరి దశ వృద్ధి దేశీయ వాల్యూ చైన్ బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీలు, అనుబంధ సాంకేతికతల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఈ స్థానంలో దేశీయ సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోపాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించాల్సి ఉంది’’ అని ఇండియా రేటింగ్స్ కార్పొరేట్స్ డైరెక్టర్ శృతి సబూ పేర్కొన్నారు. -
సరికొత్త టయోటా హైలక్స్: ధర ఎంతంటే?
టయోటా భారతదేశంలో తొమ్మిదవ తరం హైలక్స్‌ను లాంచ్ చేసింది. ఈ పికప్ ట్రక్ జీఎక్స్ 4x2 ఏటీ, జీఎక్స్ 4x4 ఏటీ, వీఎక్స్ 4x4 ఏటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు రూ. 31.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.టయోటా హైలక్స్ సరికొత్త మోడల్ IMV ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. దీని మునుపటి మోడల్‌కు ఆధారమైన అదే బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఇది. భారతదేశంలో డబుల్ క్యాబ్ బాడీ స్టైల్లో లభిస్తుంది. ఈ పికప్ ట్రక్ ముందు భాగంలో హనీకోంబ్ గ్రిల్, బ్లాక్ ట్రిమ్‌తో సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కార్గో బెడ్ 500 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.హైలక్స్ పికప్ ట్రక్ కొత్త డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 3-స్పోక్ స్టీరింగ్ వీల్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి మాత్రమే కాకుండా.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, టెర్రైన్ మోడ్లు, ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 201 Bhp పవర్, 500 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.8-లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ లేదా ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. కాగా ఇది సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.ఇదీ చదవండి: సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే! -
కొత్త కారు: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్
లగ్జరీ కార్ల విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మిని (MINI) భారత మార్కెట్లో మరో ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్ డస్ట్ ఎడిషన్ (MINI Cooper Convertible Stardust Edition) పేరుతో విడుదలైన ఈ ఓపెన్‌టాప్ కారు ధరను రూ.62.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసే సీబీయూ మోడల్‌గా ఇది అందుబాటులో ఉంటుంది. మినీ ఇండియా వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించగా, డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.ఆకట్టుకునే ఎక్స్టీరియర్స్టార్ డస్ట్ ఎడిషన్ సాధారణ కూపర్ కన్వర్టిబుల్తో పోలిస్తే మరింత ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఇందులో స్పార్క్లింగ్ కాపర్ గ్రే మెటాలిక్ పెయింట్‌ను ఉపయోగించారు. దీనికి కాంట్రాస్ట్‌గా సిల్వర్ మిర్రర్ క్యాప్స్, 18 అంగుళాల జేసీడబ్ల్యూ ర్యాలీ స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించారు. బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మినీ యువర్స్ సాఫ్ట్ టాప్కు ప్రత్యేకమైన వోనెన్ యూనియన్ జాక్ గ్రాఫిక్ ఉండటం ఈ ఎడిషన్‌కు మరింత బ్రిటిష్ టచ్‌ను ఇస్తుంది.కన్వర్టిబుల్ సాఫ్ట్ టాప్‌ను డ్రైవింగ్‌లోనే ఆపరేట్ చేయవచ్చు. మినీ అధికారిక వివరాల ప్రకారం, ఎలక్ట్రిక్ Z-ఫోల్టిండ్ రూఫ్‌ను గంటకు 30 కిలోమీటర్ల వేగం వరకు తెరవడం లేదా మూసివేయడం సాధ్యమవుతుంది. అలాగే 40 సెంటీమీటర్ల వరకు తెరుచుకునే సన్‌రూఫ్ మోడ్ కూడా ఉంటుంది.ప్రీమియం క్యాబిన్క్యాబిన్లో మినీ ప్రత్యేకమైన డిజిటల్ అనుభూతిని అందిస్తోంది. మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9తో పనిచేసే వృత్తాకార హై-రిజల్యూషన్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో రూపొందించిన వెస్సిన్ స్పోర్ట్స్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, హర్మన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రీమియం అనుభూతిని పెంచుతాయి. కొత్త తరం మినీ కన్వర్టిబుల్‌లో వెస్సిన్ అప్హోల్స్టరీ, డిజిటల్ ఇంటీరియర్ వంటి అంశాలను బీఎండబ్ల్యూ గ్రూప్ కూడా ధ్రువీకరించింది.మినీ కూపర్ కన్వర్టిబుల్ నలుగురు ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. రూఫ్‌ను మడిచినప్పుడు బూట్ సామర్థ్యం తగ్గినా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్థలం లభిస్తుంది. మినీ అధికారిక సమాచారంలోనూ నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్‌ను ధ్రువీకరించింది.204 హెచ్‌పీ పవర్.. 6.9 సెకన్లలో 100 కిమీ వేగంపనితీరు విషయంలోనూ ఈ కన్వర్టిబుల్ ఏమాత్రం తగ్గదు. ఇందులో 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల మినీ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్టెప్‌ట్రోనిక్ స్పోర్ట్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఈ కారు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.9 సెకన్లలో అందుకుంటుంది. మినీ ఇండియా ప్రస్తుత అధికారిక స్పెసిఫికేషన్లలో ఇదే 6.9 సెకన్ల యాక్సిలరేషన్‌ను పేర్కొంటోంది. -
‘ఎస్ఎంఎల్’కు మహీంద్రా ట్రక్ల వ్యాపారం
ముంబై: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ట్రక్కులు, బస్సుల విభాగాన్ని (ఎంటీబీడీ) అనుబంధ సంస్థ ఎస్ఎంఎల్ మహీంద్రాకి బదలాయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 525 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 7న ఒప్పందాలు (బీటీఏ) కుదుర్చుకోనుండగా, వచ్చే ఏడాది జనవరి నాటికి డీల్ పూర్తి కావచ్చని వివరించింది. పటిష్టమైన బ్రాండ్స్‌తో, విలీన సంస్థ, మార్కెట్లో శక్తివంతమైన పోటీదారుగా ఎదుగుతుందని ఎస్ఎంఎల్ మహీంద్రా చైర్మన్ వినోద్ సహాయ్ చెప్పారు. భవిష్యత్ వృద్ధి అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టడం కాకుండా ప్రస్తుత వేల్యుయేషన్‌పై ఎస్ఎంఎల్ షేర్హోల్డర్లకు స్పష్టత ఉండేందుకు స్లంప్ సేల్ ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని ఎంఅండ్ఎం సీఎఫ్‌వో అమర్‌జ్యోతి బారువా చెప్పారు. తేలికపాటి, మధ్య రకం వాణిజ్య వాహనాల రంగానికి చెందిన ఎస్ఎంఎల్ ఇసుజులో మహీంద్రా గతేడాది మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి, పేరును ఎస్ఎంఎల్ మహీంద్రాగా మార్చింది. విలీన సంస్థ ఇలా.. ఎస్ఎంఎల్ మహీంద్రా, ఎంటీబీడీ విలీనతో ఏర్పడే సంస్థవిస్తృత స్థాయి ఉత్పత్తుల శ్రేణితో దేశీయంగా నాలుగో అతి పెద్ద వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజంగా ఎదగనుంది. 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి ఆదాయాలను రూ. 12,500 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థల ఆదాయం కలిపి సుమారు రూ. 6,000 కోట్లుగా ఉంటుంది. ఇరు సంస్థలు చేతులు కలపడం వల్ల మార్కెట్ వాటాలో నాలుగో స్థానానికి చేరవచ్చు. ఉమ్మడి వ్యాపారానికి 200 డీలర్íÙప్లు, 650 టచ్పాయింట్లు ఉంటాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఎస్ఎంఎల్ కొత్తగా 25 కొత్త డీలర్‌షిప్‌లు, 60 టచ్పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు సహాయ్ చెప్పా రు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఉత్పత్తుల శ్రేణి విస్తరణ, సామర్థ్యాలను పెంచుకోవడంలాంటి అంశాలపై విలీన సంస్థ దృష్టి పెడుతుంది.బుధవారం బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 1.51 శాతం క్షీణించి రూ. 3,223 వద్ద ముగియగా, ఎస్ఎంఎల్ మహీంద్రా 20 శాతం ఎగిసి రూ. 4,565.50 వద్ద క్లోజయ్యింది. -
E20 వివాదం.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మీద మాత్రమే కాకుండా.. ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో ఈ20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని గడ్కరీ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా.. ఈ20 విధానం తన శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం లేదా నిర్వహించడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను తొలగించాలని, వాటిని సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే.. బాంబే హైకోర్టు ప్రస్తుతం గడ్కరీకి కేసు దాఖలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వంటి తాత్కాలిక ఉపశమనాలపై తదుపరి దశలో విచారణ జరగనుంది. -
సీఎన్జీ కార్లకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
పశ్చిమ ఆసియా సంఘర్షణ తర్వాత.. ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో ఈ వాహనాలకు డిమాండ్ బలంగా కొనసాగుతుందని మారుతి సుజుకి ఇండియా అంచనా వేస్తోంది.మారుతి సుజుకి FY27లో సుమారు 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 7 లక్షలకు పైగా యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి సుమారు 2.2 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 58 శాతం పెరుగుదలను సూచిస్తుందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.పశ్చిమ ఆసియా యుద్ధం తర్వాత ఇంధన ధరలు పెరగడం కూడా డిమాండ్ పెరుగుదలకు ఒక కారణమని, దీనివల్ల కొనుగోలుదారులు తక్కువ నిర్వహణ ఖర్చులున్న వాహనాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలతో సహా 15 సీఎన్జీ మోడళ్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలలో సీఎన్జీ వాహనాల వాటా 42 శాతంగా ఉంది. -
గంటకు 21 మంది మృతి.. రోడ్డు భద్రతపై ఆందోళన!
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరోసారి గుర్తు చేస్తున్నాయి.కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో దేశవ్యాప్తంగా 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అంటే.. సగటున ప్రతి గంటకు 59 ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 1,83,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి గంటకు 21 మంది, రోజుకు సగటున 502 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే.. తమిళనాడులో అత్యధికంగా 71,387 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఒక్క ఏడాదిలోనే 27,550 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీన్నిబట్టి చూస్తే.. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది.ఇక గత కొన్నేళ్లతో పోలిస్తే.. పరిస్థితి మరింత దిగజారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో దేశంలో 4.8 లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు 2025లో ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం '4E' (Education, Engineering, Enforcement, Emergency Care) వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, రహదారులు.. వాహనాల నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.అయితే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలంటే ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా చాలా అవసరం. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం, హెల్మెట్ లేదా సీటుబెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
రివర్ ఇండీ సరికొత్త రికార్డ్.. మూడేళ్లలో..
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివర్ మొబిలిటీ, కర్ణాటకలోని హోస్కోట్లో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రం నుండి 50,000వ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ సంస్థ 2023 ఆగస్టు 25న ఇండీ తయారీని ప్రారంభించింది, అంటే ఈ మైలురాయిని చేరుకోవడానికి మూడు సంవత్సరాల కంటే తక్కువ సమయం పట్టిందన్నమాట.ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రివర్ మొబిలిటీకి చెందిన ఏకైక ఉత్పత్తి. అయినప్పటికీ సంస్థ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2025లో జెన్ 3 వెర్షన్ పరిచయంతో ఈ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్ను పొందింది.జెన్ 3 అప్డేట్తో.. రివర్ కొత్త టైర్లు, అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, మెరుగైన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా హిల్-హోల్డ్ అసిస్ట్‌ను కూడా జోడించారు. అయితే వినియోగదారుల అభిప్రాయం మేరకు సంస్థ స్కూటర్ రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరిచినట్లు సమాచారం.ఇండీ ప్రధానమైన ఆకర్షణలలో ఒకటి దాని ప్రాక్టికాలిటీ. ఇది సీటు కింద 43 లీటర్ల స్టోరేజ్‌ను, దానికి తోడు 12-లీటర్ల గ్లోవ్ బాక్స్‌ను అందిస్తుంది. దీంతో ఇది భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది.ఇండీకి 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 9 bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ఇది 163 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. కాగా ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. కంపెనీ ప్రకారం, 750W ఛార్జర్‌ను ఉపయోగించి, బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ విధులను రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ నిర్వహిస్తాయి. -
మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. కేవలం 85 మాత్రమే!
జీప్ ఇండియా.. మెరిడియన్ 85వ యానివెర్సరీ ఎడిషన్‌ను రూ.36.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. దీనికి కంపెనీ కేవలం 85 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.ఈ స్పెషల్ ఎడిషన్, టాప్ స్పెక్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. యానివర్సరీ ఎడిషన్‌లో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ముందు డోర్లు, టెయిల్‌గేట్, వీల్ సెంటర్ క్యాప్స్‌పై 85వ వార్షికోత్సవ డీకాల్స్‌తో పాటు, గ్లాస్ బ్లాక్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇది తెలుపు, మెటాలిక్ గ్రీన్, ఎరుపు, గ్రిజియో మాగ్నీషియో, నలుపు రంగులలో లభిస్తుంది. క్యాబిన్ మొత్తం నలుపు రంగు థీమ్‌తో ఉంటుంది. డాష్‌బోర్డ్ అంతటా మాయన్ గోల్డ్ ట్రిమ్, కాంట్రాస్ట్ డిటైలింగ్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. అయితే మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఇది 168 bhp పవర్, 350 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. -
TVS iQube vs Orbiter: ఏది బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు!
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్, ఆర్బిటర్ ఈవీలలో ఏదైనా కొనాలనుకుంటే.. వీటి ధరలు, రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ధరలుటీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.73 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆర్బిటర్ ధర రూ.91,550 నుంచి రూ.1.15 లక్షల మధ్య ఉంది. ధర మధ్య వ్యత్యాసం రూ.20 వేల నుంచి రూ.30వేలు మాత్రమే. కానీ కొంత తక్కువ ధరలో కావాలంటే ఆర్బిటార్ మంచి ఎంపిక.పెర్ఫామెన్స్ టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 75 నుంచి 82 కి.మీ/గం వరకు ఉంటుంది, అందువల్ల ఇది హైవే, సుదూర ప్రయాణాలకు మంచి ఎంపికగా నిలుస్తుంది.టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ నగర వినియోగం కోసం ఉపయోగపడుతుంది. ఇది సుమారుగా 6.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 68 కి.మీ/గం. నగర ట్రాఫిక్‌లో చాలా మందికి ఈ వేగం సరిపోతుంది.రేంజ్టీవీఎస్ ఐక్యూబ్ వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. కాబట్టి దీని రేంజ్ సుమారుగా 74 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ఉంటుంది. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బ్యాటరీ వేరియంట్ సుమారుగా 158 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. స్టోరేజ్ విషయంలో ఆర్బిటర్ 34 లీటర్ల స్పేస్ అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 32 లీటర్లను అందిస్తుంది.ఫీచర్స్ప్రీమియం అనుభూతిని కోరుకునే వినియోగదారులకు టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది పెద్ద డిస్ప్లే, అత్యుత్తమ ఫినిషింగ్, శక్తివంతమైన మోటార్, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. కుటుంబ వినియోగం, సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఆర్బిటర్ కొన్ని తక్కువ ఫీచర్స్ పొందుతుంది.కొంత ఎక్కువ బడ్జెట్ వెచ్చించి.. మెరుగైన పనితీరు, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో మంచి మైలేజ్, తగినంత రేంజ్, ప్రాక్టికాలిటీని కోరుకుంటే ఆర్బిటర్ ఎందుకోవడం ఉత్తమం. -
రూ.47.99 లక్షల హోండా కొత్త కారు లాంచ్!
హోండా కంపెనీ తన ZR-V e:HEVని భారతదేశంలో రూ.47.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఈ కారు కోసం మే నెల నుంచి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి. సంస్థ దీనిని జపాన్ నుంచి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి చేస్తుంది.కంపెనీ లాంచ్ చేసిన ZR-V e:HEV మొదటి రెండు బ్యాచ్‌లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయినట్లు సమాచారం. సంస్థ ఇండియన్ మార్కెట్ కోసం రూ.160 యూనిట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. ధర ఎక్కువైనా హోండా కారుకు మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.హోండా ZR-V 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జత చేయబడ్డాయి. ఇది 5,000-6,000 rpm వద్ద 181 Bhp పవర్, 0-2,000 rpm వద్ద 315 Nm టార్క్ అందిస్తుంది. పవర్ అనేది e-CVT ద్వారా ముందు చక్రాలకు వెళుతుంది. బ్యాటరీ రీజెనరేషన్ కోసం ఇందులో ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.ఈ హైబ్రిడ్ మోడల్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, దీని గరిష్ట వేగం 172 కిలోమీటర్లు అని హోండా పేర్కొంది. మైలేజ్ మాత్రం లీటరుకు 22.79 కిలోమీటర్లు అని కూడా కంపెనీ తెలిపింది. ఇది ట్వైలైట్ మిస్ట్ బ్లాక్ పెర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ అనే రంగులలో లభిస్తుంది. -
సరికొత్త బ్రెజ్జా లాంచ్: రూ.7.40 లక్షలు!
మారుతి సుజుకి తన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 7.40 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ వెర్షన్ కొత్త ఇంజన్ ఆప్షన్‌తో పాటు చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లతో వస్తుంది.2026 ఎడిషన్ బ్రెజ్జాలో అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ పాడ్లతో కూడిన కొత్త బంపర్లు, కొత్త 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్లైట్లను యథాతథంగా కొనసాగించారు.ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త బ్రెజ్జా బ్లాక్ అండ్ బేజ్ రంగుల కలయికతో పాటు గ్లాస్ బ్లాక్ ట్రిమ్‌ను పొందుతుంది. మధ్యలో పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద విక్టోరిస్ నుంచి తీసుకున్న ఎయిర్ కండిషనింగ్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUVలో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.భద్రతా ఫీచర్లలో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవి ఉన్నాయి. ఇది స్ప్లెండిడ్ సిల్వర్, సిజ్లింగ్ రెడ్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, బ్లూయిష్ బ్లాక్ రంగులతో పాటు, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వివేషియస్ ఆరెంజ్, లస్ట్రస్ బీజ్ అనే రెండు కొత్త రంగులలో కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక కారు.. 15 లక్షల సేల్స్!2026 బ్రెజ్జా కొత్త 1.0-లీటర్, డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 108 Bhp పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG వెర్షన్ కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. -
ఒక కారు.. 15 లక్షల సేల్స్!
భారతదేశంలో హ్యుందాయ్ ఐ20 అమ్మకాలు కొత్త మైలురాయిని అధిగమించాయి. 2008లో ప్రారంభమైన ఈ కారు ఇప్పటి వరకు 15 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. దీన్నిబట్టి చూస్తే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం మార్కెట్లో మూడవ తరం ఐ20 అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్‌తో పాటు, బ్లాక్-థీమ్ స్టైలింగ్‌తో నైట్ ఎడిషన్, స్పోర్టీ ఎన్ లైన్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉంది.ఐ20 లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్, 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో సహా అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.ఐ20 కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాగా ఐ20 ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. కాబట్టి ఇవి మంచి పనితీరును అందిస్తాయి. -
ట్రాక్టర్ విక్రయాలకు స్పీడ్ బ్రేకర్స్..!
ముంబై: దేశీయ ట్రాక్టర్ల పరిశ్రమ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో మందగింవచ్చని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ భావిస్తోంది. అధిక బేస్ ఎఫెక్ట్, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ ఎఫ్వై 27లో ట్రాక్టర్ల విక్రయాల వృద్ధి 1–4 శాతానికి పరిమితం కావచ్చని తెలిపింది. కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) ట్రాక్టర్ పరిశ్రమ వార్షికంగా ఏకంగా 23.5 శాతం అద్భుత వృద్ధిని నమోదు చేసింది.రుతుపవనాలు కీలకం భారత వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు వరకు అందిన గణాంకాల ప్రకారం దక్షిణ, మధ్య, తీరప్రాంత భారతదేశంలో వర్షపాతం లోటు కనిపిస్తోంది. వర్షాభావ లేమి పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగితే అది ఖరీఫ్ సాగు, పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇక్రా స్పష్టం చేసింది. దీనివల్ల రైతు ఆదాయాలు తగ్గి, కొత్త ట్రాక్టర్ల కొనుగోళ్లు లేదా రీప్లేస్మెంట్ (పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకోవడం) డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది.జూన్ అమ్మకాలు మాత్రం జోరుగానే జూన్‌లో ట్రాక్టర్ల హోల్‌సేల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 11.9 శాతం, రిటైల్ విక్రయాలు 25.3 శాతం పెరిగినట్లు ఇక్రా వెల్లడించింది. గత ఏడాది తక్కువ బేస్ ఎఫెక్ట్, రైతుల నగదు ప్రవాహం మెరుగుపడటం, గత సెపె్టంబర్లో జీఎస్టీ తగ్గింపు వల్ల ట్రాక్టర్ల కొనుగోలు మరింత అందుబాటులోకి రావడం ఇందుకు కారణాలని పేర్కొంది. అయితే గతేడాది అధిక వృద్ధి కారణంగా ఏర్పడిన అధిక బేస్, ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం, బలహీన రుతుపవనాల అంచనాల నేపథ్యంలో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో విక్రయాల వృద్ధి మందగించవచ్చని ఇక్రా అభిప్రాయపడింది.తయారీ కంపెనీలకు ఊరట ట్రాక్టర్ తయారీ సంస్థల (ఓఈఎంలు) నిర్వహణ మార్జిన్లు స్థిరంగా కొనసాగే అవకాశముందని తెలిపింది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల (ఆపరేటింగ్ లెవరేజ్), ముడిసరుకుల స్థిరమైన ధరలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. లాభదాయకత, తక్కువ రుణభారం, తగినంత ద్రవ్య లభ్యత కారణంగా తయారీ సంస్థల క్రెడిట్ ప్రొఫైల్ కూడా బలంగానే కొనసాగే అవకాశముందని ఇక్రా అంచనా వేసింది. -
ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ ఉండదు
ప్రభుత్వ రంగ ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకులు.. ప్రీమియం పెట్రోల్‌ని ఇథనాల్ కలపకుండానే విక్రయించడాన్ని కొనసాగిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ప్రీమియం వాటా 0.5 శాతమే ఉందని ఆయన చెప్పారు. అలాగే పెట్రోల్‌లో ఇథనాల్‌ని 20 శాతానికి మించి కలపడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు.ఈ0, ఈ10 పెట్రోల్‌ని తిరిగి ప్రవేశపెట్టే యోచనేదీ లేదని తెలిపారు. ఇథనాల్ కలపని పెట్రోల్‌ని ఈ0గా, 10 శాతం కలిపితే ఈ10గా, 20 శాతం కలిపితే ఈ20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బంకుల్లోను ఈ20 పెట్రోల్‌ని విక్రయించాలని ఆదేశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు దీని ప్రతికూల ప్రభావాలపై రూఢీగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఆయన తెలిపారు. పరిశోధనల్లో, ఫీల్డ్ ట్రయల్స్‌లో కూడా ఇంజిన్ మన్నిక, పనితీరు, వాహన జీవితకాలంపై ఈ20 వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ నిర్ధారణేమీ కాలేదని వివరించారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
526 కిమీ రేంజ్ అందించే కొత్త కారు లాంచ్!
కియా కంపెనీ భారతదేశంలో సైరోస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది . ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.49 లక్షలు, రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అయితే దీనిని బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో రూ.7.99 లక్షల ప్రారంభ ధరలో కొనుగోలు చేయవచ్చు.సైరోస్ ఈవీ, కే1 ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన కియా డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయిల్లైట్లతో కూడిన ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ కారు 17-అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ 30-అంగుళాల పనోరమిక్ డిస్ప్లేతో వస్తుంది, ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ఫేస్ ఉంటాయి. ఈ ఈవీ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 4వే పవర్ డ్రైవర్ సీట్, స్లైడింగ్, రిక్లైనింగ్ వెనుక సీటు, డాష్‌క్యామ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లను అందిస్తుంది.సైరోస్ ఈవీలోని 42 kWh, 51.4 kWh బ్యాటరీలు.. వరుసగా 443 కి.మీ, 526 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. కాగా కంపెనీ 15 సంవత్సరాలు / అపరిమిత కిలోమీటర్ల జీవితకాల బ్యాటరీ వారంటీ అందిస్తుంది. ఇదే సమయంలో కియా 3 సంవత్సరాల తర్వాత 80% వరకు రీసేల్ విలువను అందించే అష్యూర్డ్ బైబ్యాక్ పథకాన్ని కూడా ప్రకటించింది. -
కొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో ఏఎంజీ ఈ 53 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. ఇది పెర్ఫార్మెన్స్, రేసింగ్ అనే రెండు ఎడిషన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.45 కోట్లు, రూ. 1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).కొత్త AMG E 53 హైబ్రిడ్ కారు అప్డేటెడ్ ఈ-క్లాస్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో ప్రత్యేకమైన బంపర్లు, ప్రకాశవంతమైన గ్రిల్, వెడల్పాటి ఫెండర్లు, డిఫ్యూజర్, లిప్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ కారులో అడాప్టివ్ సస్పెన్షన్, రియర్ యాక్సిల్ స్టీరింగ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, పెద్ద బ్రేకులు, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉన్నాయి.లోపలి భాగంలో.. ఈ53 కి 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కూడిన మెర్సిడెస్ MBUX సూపర్‌స్క్రీన్, ఏఎంజీ స్పోర్ట్స్ సీట్లు, డాల్బీ అట్మోస్‌తో కూడిన 17 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ లభిస్తాయి. ఈ కారు పోలార్ వైట్, వెర్డే సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, నాటికల్ బ్లూ, వెల్వెట్ బ్రౌన్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్ అనే మలుపులు కలర్ ఎంపికలలో లభిస్తుంది.కొత్త మెర్సిడెస్-AMG E 53 హైబ్రిడ్ 4Matic+ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ 6-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనికి ఒక ఎలక్ట్రిక్ మోటార్ లభిస్తుంది. కాబట్టి ఇది 577 Bhp పవర్, 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ 100 కిమీ దూరం ప్రయాణించగలదని సమాచారం. -
రూ.11 వేలతో బుకింగ్.. సిద్ధమైన కొత్త బ్రెజ్జా!
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బ్రెజ్జా.. ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ అప్డేటెడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని డీలర్‌షిప్‌లకు పంపించడం కూడా స్టార్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారు డెలివరీలు లాంచ్ తరువాత చాలా వేగంగా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.ఇప్పటికే లీక్ అయిన చిత్రాల ప్రకారం.. మారుతి బ్రెజ్జా అప్డేటెడ్ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ, కొన్ని కొత్త మార్పులు చూడవచ్చు. కొత్త గ్రిల్, బంపర్‌ను చూడవచ్చు. అంతే కాకుండా.. హెడ్‌ల్యాంప్, డీఆర్ఎల్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. అయితే.. వెనుక భాగంలో బంపర్, టెయిల్-ల్యాంప్ అంతర్గత భాగాలలో కూడా స్వల్ప మార్పులు ఉండవచ్చు. కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లలో కూడా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ లాంచ్ తరువాత అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.లోపలి భాగంలో.. బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మరిన్ని గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. సెంటర్ కన్సోల్ లేఅవుట్‌ను అప్డేట్ చేయడంతో.. ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, సన్‌గ్లాస్ హోల్డర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్‌తో కూడిన కొత్తగా డిజైన్ చేసిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన రీచ్ అండ్ రేక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి పరికరాలు ఉంటాయని అంచనా.అలెక్సా ఇంటిగ్రేషన్‌తో కూడిన పెద్ద 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అత్యంత ముఖ్యమైన అప్గ్రేడ్లలో ఒకటిగా ఉండబోతోంది. సీట్ వెంటిలేషన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.కొత్త బ్రెజ్జా మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రానుంది. వీటిలో 103 hp పవర్, 139 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C పెట్రోల్ ఇంజన్, 110 hp పవర, 170 Nm టార్క్ అందించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, ఒక CNG వేరియంట్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్‌ను 6 స్పీడ్ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితోనూ అందించే అవకాశం ఉంది. CNG వెర్షన్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది. -
హైవే లోకల్ పాస్‌లు.. ఇక పూర్తిగా ఆన్లైన్లో!
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మరో కీలక డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్‌యాత్ర (RajmargYatra) మొబైల్ యాప్‌లో ‘డిజిటల్ లోకల్ పాస్’ సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన ప్రయాణికులు ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే నెలవారీ లోకల్ టోల్ పాస్‌ను పొందవచ్చు.ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ఢిల్లీ అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-IIలోని ముండ్కా–బక్కర్వాలా టోల్ ప్లాజా వద్ద ప్రారంభించగా, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ఇతర టోల్ ప్లాజాలకు దశలవారీగా విస్తరించనున్నట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.ఎవరు అర్హులు?టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఈ లోకల్ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి పాస్ మంజూరైతే, సంబంధిత టోల్ ప్లాజా ద్వారా ఒక నెల పాటు అపరిమిత ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇందుకోసం టోల్ ప్లాజాకు వెళ్లి పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం ప్రక్రియ మొబైల్ యాప్‌లోనే కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.దరఖాస్తు ఎలా పరిశీలిస్తారు?వినియోగదారు సమ్మతి ఇచ్చిన తర్వాత రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలతో అనుసంధానమై ధృవీకరణ చేపడుతుంది. డిజిలాకర్ ద్వారా చిరునామా వివరాలు, వాహన్ డేటాబేస్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్, అనుసంధానమైన ఫాస్ట్యాగ్ సమాచారం, అలాగే జీఐఎస్ ఆధారిత లొకేషన్ వెరిఫికేషన్ ద్వారా దరఖాస్తుదారు నిజంగా అర్హత ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారో లేదో నిర్ధారిస్తుంది. దీంతో కాగితపు పత్రాల అవసరం తగ్గడంతో పాటు ఆమోద ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది.‘మార్గ్‌మిత్ర’ హెల్ప్ సెంటర్ కూడా ప్రారంభంలోకల్ పాస్‌తో పాటు ‘మార్గ్‌మిత్ర’ (MargMitra) హెల్ప్ సెంటర్‌ను కూడా ఎన్హెచ్ఏఐ యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 22 భారతీయ భాషల్లో టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా సహాయం అందించే డిజిటల్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్. ఫాస్ట్యాగ్ రీఛార్జ్, కేవైసీ, రీఫండ్ స్థితి, లోకల్/వార్షిక పాస్‌లు, బ్లాక్‌లిస్ట్ స్టేటస్, ఈ-నోటీసులు, అప్పీలు, అలాగే జాతీయ రహదారులపై నిలిచిపోయిన వాహనాలు లేదా ఇతర భద్రతా సమస్యలను నివేదించే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. -
పెట్రోల్‌లో ఇథనాల్ పెంపు?.. కేంద్రం క్లారిటీ!
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం విషయంలో గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందా? అనే అనుమానాలు చాలా మంది వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను స్పష్టం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం కంటే ఎక్కువ పెంచే ఆలోచనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోబోమని, ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. అంతే కాకుండా.. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.ఇకపోతే.. అసలు ఇథనాల్‌ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతున్నారు అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది కాబట్టి.భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం క్రమంగా పెరుగుతూ 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో పెరుగుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు! -
ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల ధరలను మరోమారు పెంచడానికి సిద్ధమైంది. 2026 ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మారుతి సుజుకి దాని లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనుంది. అయితే ఏ మోడల్ ధరను ఎంత వరకు పెంచనుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా కంపెనీ మూడు నెలలు ముందు కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల అమ్మకాలు పెరుగుతాయా?, తగ్గుతాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో.. పెరిగిన ద్రవ్యోల్బణ భారాలు, ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరలను సవరించాల్సి వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే ఆగస్టు నుంచి కొత్త కారు కొనాలంటే.. ఇంకొంత ఖర్చు చేయక తప్పదని స్పష్టమవుతోంది. -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్.. పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటంతో సీఎన్జీ కార్లు మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్‌ను ఓవర్టేక్ చేసి సీఎన్జీ కార్లు అమ్మకాల్లో టాప్–2 ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి.మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్ కార్లను దాటేసిన సీఎన్జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్ కార్ల విక్రయాలు కూడా రయ్ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. జూన్‌లోనూ జూమ్... ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఈ ఏడాది జూన్‌లో కూడా దుమ్మురేపాయి. రిటైల్ సేల్స్‌లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్‌లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్‌గేర్‌లో అమ్ముడయ్యాయి. జూన్ అమ్మకాల్లో సీఎన్జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్‌టైమ్ గరిష్టం) దక్కించుకున్నాయి.ఎందుకీ డిమాండ్..→ కారు కొనుగోలుదారులు సీఎన్జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ కార్లకు ఒక్కో కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. → నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్జీ వేరియంట్ల రేటు పెట్రోల్ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు 15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్ మార్కెట్లో సీఎస్జీ కార్లకు కిర్రాక్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. → సీఎన్జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది. → ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్ డీలర్ల సంఘాల ఫెడరేషన్ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్జీ, ఈవీలే బెటర్ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! → కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్ కార్ల నుంచి సీఎన్జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్ కార్ల డిమాండ్‌కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. → గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్లను ఆటోమొబైల్ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్తో పాటు టాప్ ఎండ్ మోడళ్లలో సైతం సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్‌లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్జీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గౌరవ్ గుప్తా డిజైన్‌తో.. స్పెషల్ కార్లు!
ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా సహకారంతో రూపొందించిన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్, ఎమ్9 లగ్జరీ ఎంపీవీ 'కౌచర్ ఎడిషన్ల'ను ఎంజీ మోటార్ కంపెనీ ఆవిష్కరించింది. ఇవి మార్కెట్లో పరిమిత సంఖ్యలో (50 యూనిట్లు) మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి సంస్థ వీటికోసం ప్రీ-రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధరలు ఆగస్టు 3న వెల్లడించనున్నారు.ఈ స్పెషల్ ఎడిషన్స్ స్టాండర్డ్ సైబర్‌స్టర్, ఎమ్9 ఆధారంగా రూపొందించారు. కానీ కాస్మొటిక్ డిజైన్ మాత్రమే గౌరవ్ గుప్తా చేసారు. ఈ థీమ్‌ను రెండు వాహనాలలోనూ ఎంబ్రాయిడరీ, టోనల్ ఫినిషింగ్‌లు చూడవచ్చు.డిజైన్ పరంగా మార్పులు కనిపించినప్పటికీ.. ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి సైబర్‌స్టర్ డ్యూయల్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ సెటప్‌ను అలాగే నిలుపుకుంటుంది. తద్వారా 528 bhp పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. 77 kWh బ్యాటరీ ప్యాక్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని. ఇక ఎంజీ ఎమ్9 విషయానికి వస్తే.. ఇందులో కూడా ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి అదే 90 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 548 కిమీ రేంజ్ అందిస్తుంది. పనితీరులో కూడా ఎలాంటి మార్పు లేదు. -
కియా కొత్త కారు.. రూ.526 కిమీ రేంజ్!
కియా ఇండియా భారత మార్కెట్ కోసం సైరోస్ ఈవీ(Syros EV)ని ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం రూ.25,000 టోకెన్ మొత్తంతో ప్రీబుకింగ్‌లను ప్రారంభించింది. డెలివరీలు ప్రారంభమయ్యే సమయానికి ధరలను ప్రకటించనున్నారు. సైరోస్ ఈవీ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సైరోస్ ఈవీ ప్రత్యేకత ఏమిటంటే దాని రేంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులోని 51.4 కిలోవాట్ బ్యాటరీ 526 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. 42kWh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. ఇది 8.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.సైరోస్ ఈవీ.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ స్టైల్ పొందుతుంది. డిజిటల్ టైగర్ ఫేస్, స్టార్ మ్యాప్ ఎల్ఈడీ లైటింగ్ సిగ్నేచర్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపల 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, హర్మాన్ కార్డాన్ 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, 16-లీటర్ల ఫ్రంట్ ట్రంక్, 100 వాట్స్ USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.సేఫ్టీ విషయానికి వస్తే.. సైరోస్ ఈవీ కారు లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)తో వస్తుంది. వీటిలో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్టాప్ అండ్ గోతో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఉన్నాయి.వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, పార్కింగ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. ఇది ఏడు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే! -
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేష్ ఆందోళన
దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఈ ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేస్తూనే.. ఈ ఇథనాల్ పెట్రోల్ విధానం సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల యజమానుల వరకు అందరికీ ఇబ్బందిగా మారిందని ఆయన విమర్శించారు.లక్షల రూపాయల నష్టం..తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇథనాల్ పెట్రోల్ ద్వారా ఇంజిన్ వాల్వ్‌లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని నరేష్ పేర్కొన్నారు. ‘ఇదే పరిస్థితి నా కొత్త పోర్షే పనమెరా కారుకు వస్తే దాదాపు రూ.12 లక్షల వరకు నష్టం వస్తుంది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో లీటరు రూ.165 ధర పలికే ‘హై ఆక్టేన్ 100’ పెట్రోల్ వాడుతున్నాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు లగ్జరీ ఇంధనాలు వాడగలరని, కానీ నిత్యం బతుకుదెరువు కోసం చూసే సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026‘ఒక మాజీ బీజేపీ నాయకుడిగా నాకు తెలుసు.. పార్టీకి బలమైన థింక్ ట్యాంక్, ప్లాన్ A, B, C లు ఉంటాయి. కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం చాలా హడావుడిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ లాంటిది’ అని నరేష్ విజయకృష్ణ తెలిపారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్‌ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత హడావుడి ఎందుకని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
సరికొత్త హయబుసా.. ఇప్పుడు కొత్త రంగులో..
సుజుకి తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్ టూరర్ అయిన 2027 హయబుసాను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు కొత్త రంగులలో అందుబాటులో ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.2027 సుజుకి హయబుసా కొత్త పెయింట్ స్కీమ్(గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ రిఫ్లెక్టివ్ బ్లూ)లు మినహా, ఎలాంటి యాంత్రిక మార్పులకు లోనుకాలేదు. కాబట్టి మునుపటిలాగే అదే ఇంజిన్, ఛాసిస్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కొనసాగిస్తోంది. పెర్ల్ బ్రిలియంట్ వైట్ అండ్ మెటాలిక్ ఊర్ట్ గ్రే రంగులలో, కాంట్రాస్టింగ్ రెడ్ హైలైట్స్‌తో కూడిన ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.హయబుసాలోని అదే 1,340 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్ లైన్ ఫోర్ ఇంజన్.. 190 bhp పవర్, 150 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ జతచేయబడి ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS) కూడా ఉంది, ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, మల్టిపుల్ రైడర్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి.భారతదేశంలో సుజుకి హయబుసా ధర రూ.18.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కాగా ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చిన కొత్త కలర్ హయబుసా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది. బహుశా భవిష్యత్తులో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పిల్లల కోసం టెస్లా బైక్.. రూ.20 వేలు మాత్రమే!
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టెస్లా (Tesla) ఇప్పుడు పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాలెన్స్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.నిజానికి టెస్లా కంపెనీ.. పెద్దవాళ్లకు ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేస్తుందని చాలామంది ఎదురుచూశారు. కానీ సంస్థ మాత్రం చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈవీ సైకిల్ విడుదల చేసింది. ఈ బ్యాలెన్స్ బైక్‌ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించారు.టెస్లా బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్, చైన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ వంటివి ఉండవు. కేవలం పిల్లలు తమ కాళ్లతో బైక్‌ను ముందుకు కదిలిస్తూ బ్యాలెన్స్, హ్యాండిల్ తిప్పడం నేర్చుకునేలా తయారు చేశారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో మెగ్నీషియం అల్లాయ్ ఫ్రేమ్ ఉపయోగించడం వల్ల పిల్లలు సులభంగా నడపగలరు. బైక్‌పై టెస్లా లోగో, ముందు భాగంలో కంపెనీ గుర్తు కూడా ఉన్నాయి.ఈ బైక్ ధర 225 డాలర్లు (సుమారు రూ.20 వేలు). సాధారణ పిల్లల బ్యాలెన్స్ బైక్‌లతో పోలిస్తే దీని ధర కొంత ఎక్కువే. అయితే ప్రీమియం బ్రాండ్ల బైక్‌లతో పోలిస్తే.. టెస్లా ధర కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ సీటు ఎత్తును పిల్లల పెరుగుదలకు అనుగుణంగా ఐదు రకాలుగా మార్చుకునే సౌకర్యం ఉంది. గరిష్టంగా 35 కిలోల బరువు ఉన్న పిల్లలు దీనిని ఉపయోగించవచ్చు. బైక్‌ను అసెంబుల్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్ కూడా ప్యాకేజీలో అందిస్తారు.Balance Bike for Kids now available on Tesla Shop– Lightweight magnesium frame & adjustable seat– Five height levels– Suitable for children 2-5 years oldhttps://t.co/IIPjY1Ad9N pic.twitter.com/nr375ZRchr— Tesla North America (@tesla_na) July 16, 2026 -
లెక్సస్ కొత్త కారు.. ధర ఎంతంటే?
ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ విడుదలతో లెక్సస్ ఈఎస్ రేంజ్ మరింత విస్తరించింది. ఈ లేటెస్ట్ కారు ఎక్స్‌క్విజిట్, లగ్జరీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 66.10 లక్షలు, రూ. 71.80 లక్షలు (ఎక్స్ షోరూమ్).లెక్సస్ ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే పరిమాణంలో పెద్దది. పొడవైన వీల్‌బేస్, పెరిగిన వెడల్పు అన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎల్ ఆకారపు లైటింగ్ ఎలిమెంట్స్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డోర్ లాచ్ వంటివన్నీ ఆకట్టుకుంటాయి. ఇది వైట్ నోవా, సోనిక్ టైటానియం, సోనిక్ క్రోమ్, గ్రాఫైట్ బ్లాక్, సోనిక్ కాపర్ రంగులలో అందుబాటులో ఉంటుంది.కొత్త ES350h లోపలి భాగంలో 14.0-అంగుళాల హై-డెఫినిషన్ టచ్స్క్రీన్లో సరికొత్త లెక్సస్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంతే కాకుండా మరింత సౌకర్యం, వినియోగించడానికి సులభంగా ఉండటం కోసం ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇంజిన్ స్టార్ట్, డోర్ లాక్‌లు, విండో క్లోజర్, స్లైడ్ రూఫ్ వంటి ముఖ్యమైన ఫంక్షన్లను రిమోట్‌గా నిర్వహించగల సమగ్రమైన కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.ఈఎస్350హెచ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ 2.5-లీటర్ ఇన్లైన్ 4-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పీసీయూతో కూడిన కొత్త ఈ యాక్సిల్, లిథియం అయాన్ బ్యాటరీ కూడా లభిస్తుంది. కాగా కంపెనీ 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), హైబ్రిడ్ బ్యాటరీపై 8 సంవత్సరాలు/200,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తుంది. -
ఇకపై అలాగైతేనే డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణా శాఖ కఠినతరం చేసింది. రోడ్డు భద్రతా నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న అభ్యర్థి ఇక నుంచి తప్పనిసరిగా ఆన్లైన్లో రోడ్డు భద్రతపై మూడు గంటల పాటు వీడియో పాఠాలను చూసి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. వీడియో పాఠాలకు హాజరైన వారిని మాత్రమే డ్రైవింగ్ లైసెన్సుల కోసం నిర్వహించే ట్రాక్ టెస్టులకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా కూకట్పల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఫలితాలను అనుసరించి నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఈ విధానాన్ని విస్తరించనున్నారు. ముఖ కవళికల నమోదు ఉంటేనే.. సాధారణంగా లెరి్నంగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 30 రోజుల నుంచి 6 నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం నాగోల్, కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, తదితర డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే లైసెన్స్ లభిస్తుంది. ఇక నుంచి ఈ రెండు పరీక్షలతో పాటు 3 గంటల వీడియో పాఠాలను చూసి రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకొని డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రవాణాశాఖ ఆధ్వర్యంలోని టీజీ ఆన్లైన్లో ఈ పాఠాలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఈ పాఠాలను వీక్షించే సమయంలో అభ్యర్థుల ముఖకవళికల నమోదు (ఫేస్ రికగ్నిషన్) తప్పనిసరి. అలాగే స్కూల్ జోన్లలో వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హారన్ మోగించాలి. ఆసుపత్రులు ఉన్న చోట హారన్ మోగించొద్దు. డిఫెన్సివ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. రోజుకు 2,500 డ్రైవింగ్ టెస్టులు... ప్రస్తుతం నగరంలోని అన్ని టెస్ట్ ట్రాక్‌లలో నిత్యం 2,500 మందికిపైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా.. కొన్ని చోట్ల ఎలాంటి పరీక్షలు లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ తాజాగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రతా పాఠాలు సత్ఫలితాలిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. -
ఫెరారీ కొత్త కారు.. ధర ఎంతంటే?
ఫెరారీ భారతదేశంలో అమల్ఫీ స్పైడర్‌ను రూ.4.6 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది ఫెరారీ ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. సాఫ్ట్ టాప్‌తో వచ్చే ఈ కారు కూపేను పోలి ఉంటుంది.క్లాసీ స్టైలింగ్ పొందిన ఈ కారు.. ఆకట్టుకునే హుడ్, వెడల్పుగా ఉండే ఫెండర్లను కలిగి ఉంది. దీనికి బ్లాక్ స్ట్రిప్‌తో అనుసంధానమైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, నాలుగు ఎల్ఈడీ టెయిల్లైట్లు, నాలుగు ఎగ్జాస్ట్ టిప్‌లు ఉన్నాయి. లోపల 15.6 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ వైపు మూడవ స్క్రీన్‌తో కూడిన డ్యూయల్-కాక్‌పిట్ లేఅవుట్ ఉంది. ఇది స్పోర్టీ 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది, దీనిని హాప్టిక్ టచ్ బటన్లకు బదులుగా ఫిజికల్ కంట్రోల్స్‌తో అప్డేట్ చేశారు.బోనెట్ కింద 3.9-లీటర్ల ట్విన్-టర్బో V8 ఇంజన్ ఉంది, ఇది 640 Bhp పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పవర్ డెలివరీ వెనుక చక్రాలకు అందుతుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఫెరారీ పేర్కొంది. -
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన!
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.., దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) వినియోగం విస్తరిస్తోంది.ఈ20 పెట్రోల్ కారణంగా.. పాత పెట్రోల్ వాహనాల్లో ఇంజిన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయని కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు నష్టం జరిగితే.. పరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాలామంది వాహన యజమానులు చెబుతున్నారు.లోకల్ సర్వే నిర్వహించిన ఒక నివేదిక ప్రకారం.. ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు తీవ్రమైన నష్టం జరిగిందని భావించే వారిలో ఎక్కువ మంది పరిహారం కోసం ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సర్వేలో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22 వేలకుపైగా పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు.సర్వే ప్రకారం.. 31 శాతం మంది 'వినియోగదారుల కమిషన్'ను ఆశ్రయిస్తామని తెలిపారు. 14 శాతం మంది అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. అంటే మొత్తం 45 శాతం మంది న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అదే సమయంలో 18 శాతం మంది వాహన తయారీ సంస్థతో పాటు ఇంధన కంపెనీ నుంచి పరిహారం కోరుతామని తెలిపారు. 9 శాతం మంది కేవలం వాహన తయారీదారు నుంచి పరిహారం కోరనున్నట్లు పేర్కొన్నారు.నిజానికి భారత్ ఈ20 పెట్రోల్ వైపు మారుతున్న సమయంలో, ముఖ్యంగా పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను కలిగిన వారిలో 55 శాతం మంది 2025 ప్రారంభం నుంచి వాహనంలో అసాధారణమైన అరుగుదల, ఎక్కువ మరమ్మతుల అవసరం కనిపించిందని తెలిపారని సర్వే ద్వారా తెలిసింది. గతంలో నిర్వహించిన మరో సర్వేలో 66 శాతం మంది వాహనదారులు 10 శాతానికి పైగా మైలేజ్ తగ్గిందని పేర్కొన్నట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా -
ఒకే ప్లాంట్.. 30 లక్షల వెహికల్స్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన చకన్ ప్లాంట్ నుంచి 30 లక్షల (3 మిలియన్) వాహనాన్ని విడుదల చేసింది. కంపెనీ ఈ మైలురాయి యూనిట్‌గా బీఈ 6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.ప్రస్తుతం మహీంద్రా చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్న మొత్తం 19 వాహనాల్లో బీఈ6 ఎలక్ట్రిక్ ఒకటి. ఇక్కడ ప్యాసింజర్ వాహనాలు మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల ఉత్పత్తి కూడా జరుగుతోంది.చకన్ ప్లాంట్‌లో మహీంద్రా సంస్థ ప్రారంభ ఉత్పత్తి కొంత నెమ్మదిగా సాగినప్పటికీ.. ఆ తరువాత గణనీయంగా పెరిగిందని కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్, ఆర్. వేలుసామి పేర్కొన్నారు. ఇది వినియోగదారులలో పెరుగుతున్న నమ్మకాన్ని, మా సిబ్బంది, భాగస్వాములు, సరఫరాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు.మహీంద్రా 2009 డిసెంబర్లో చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. 2018 సెప్టెంబర్‌లో 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటింది. 20 లక్షల మైలురాయి 2024 మార్చిలో చేరుకోగా.. సుమారు 27 నెలల తర్వాత, 2026 జూలైలో మూడు మిలియన్ల యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.మహీంద్రా బీఈ6ఇక బీఈ6 విషయానికి వస్తే.. ఇది INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన మహీంద్రా మొదటి రెండు 'బోర్న్ ఎలక్ట్రిక్' SUVలలో ఒకటి. ఇది ఎక్స్ఈవీ 9ఈ కారుతో పాటు 2024 చివరలో భారతదేశంలో విడుదలైంది. దీని డెలివరీలు 2025లో ప్రారంభమయ్యాయి. BE 6 ఐదు ట్రిమ్ స్థాయిలలో, 59 kWh, 79 kWh బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ధరలు రూ. 18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.Three million vehicles. Countless stories set in motion. Today, Chakan rolled out Mahindra's 3 millionth vehical. Proud to be part of millions of journeys and here's to a million more. #Mahindra #MahindraAutomotive #MahindraSUVs #MahindraElectricOriginSUVs pic.twitter.com/Z128vyQ9wB— Mahindra Automotive (@Mahindra_Auto) July 16, 2026 -
2026 క్లాసిక్ 350 లాంచ్: ధర ఎంతంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ విఫణిలో అప్డేటెడ్ క్లాసిక్ 350ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,87,434 (ఎక్స్-షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2026 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎడిషన్ రెండు ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది. ఈ బైక్‌లో ఇప్పుడు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అమర్చారు. అదనపు సౌలభ్యం కోసం బైక్ తయారీదారు USB టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ప్రవేశపెట్టారు. సస్పెన్షన్ సెటప్‌లో ఎలాంటి మార్పు లేదు. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేకులు ఉన్నాయి.కొత్త క్లాసిక్ 350లో 349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 20.2 Bhp పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరుని అందిస్తుంది. -
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా లభించిన బలమైన డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో దేశీయ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఏప్రిల్–జూన్ మధ్య కంపెనీల నుంచి డీలర్లకు 12,73,811 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల (పీవీ) పంపిణీ జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన 10,11,884 యూనిట్ల పంపిణీతో పోలిస్తే ఇది 25.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 2024–25 తొలి త్రైమాసికంలో నమోదైన 10.3 లక్షల యూనిట్ల గరిష్ట రికార్డును ఈ తొలి త్రైమాసిక విక్రయాలు అధిగమించాయి. దేశీయ వాహన తయారీదారుల సమాఖ్య ‘సియామ్’ బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. అన్ని విభాగాల్లో ఆల్‌టైమ్ రికార్డులుత్రిచక్ర వాహనాల విభాగం క్యూ1 కాలానికి చరిత్రలోనే అత్యధిక పంపిణీని నమోదు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే కాలంలోని 1,65,211 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 29.7 శాతం వృద్ధితో 2,14,339 యూనిట్లకు చేరింది.వాణిజ్య వాహనాల విభాగం కూడా తొలి త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక విక్రయాలను సాధించింది. గత ఏడాది క్యూ1తో పోలిస్తే 18.3 శాతం వృద్ధిని కనబరుస్తూ రికార్డు స్థాయిలో 2.65 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి.మరోవైపు ద్విచక్ర వాహనాల పంపిణీ కూడా క్యూ1లో 20.3 శాతం పెరిగి 56,28,675 యూనిట్లకు చేరింది. గత ఏడాది క్యూ1 కాలంలో ఈ విక్రయాలు 46,77,990 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘కేంద్రం జీఎస్టీ రేట్లను సవరించడం, సులభతర వాహన ఫైనాన్సింగ్ రుణాలు, గతేడాది నమోదైన స్వల్ప విక్రయాల ప్రభావం (లో బేస్ ఎఫెక్ట్) తో పాటు మార్కెట్లోకి కొత్త మోడళ్లు రావడం ఈ బలమైన వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్ స్థిరంగానే ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం, గ్రామీణ డిమాండ్‌పై నేరుగా ప్రభావం చూపే రుతుపవనాల గమనాన్ని, అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాలను ఆటో పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు.రెండో త్రైమాసికంపై సియామ్ అవుట్లుక్పండుగల సీజన్ సమీపిస్తుండటంతో వాహనాలకు ఇదే విధమైన స్థిరమైన డిమాండ్ మున్ముందూ కొనసాగవచ్చని సియామ్ అంచనా వేసింది. జీఎస్టీ 2.0 తో పాటు తక్కువ రేట్లకే లభిస్తున్న ఫైనాన్సింగ్ సదుపాయం వాహన ధరలను అందుబాటులో ఉంచుతూ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. అయితే, కమోడిటీ (ముడి సరుకుల) ధరలు పెరగడం ఆటోమొబైల్ రంగానికి కొంత ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో గ్యాస్, ఇంధనం, ముడి సరుకుల సరఫరా మెరుగుపడినా.. ఇటీవలి కాలంలో అక్కడ చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిణామాలు పరిశ్రమకు కీలకం కానున్నాయని సియామ్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
ఒక్క చార్జ్‌తో 526 కి.మీ. జర్నీ
న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ ‘కియా ఇండియా’ మధ్య తరగతి, ప్రీమియం ఈవీ కస్టమర్లను లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘కియా సైరోస్ ఈవీ’ని ఆవిష్కరించింది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. 51.4 కేడబ్ల్యూహెచ్ ఎక్స్టెండెడ్ రేంజ్ బ్యాటరీ మోడల్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 526 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఇస్తుంది. 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లోనే 10% నుంచి 80%కి ఛార్జ్ చేసుకోవచ్చు. దేశంలోనే మొదటిసారిగా లైఫ్‌టైమ్ హై–వోల్టేజ్ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రా మ్, బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బాస్) ఫైనాన్సింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కియా వెబ్సైట్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో ప్రీబుక్ చేసుకోవచ్చు. -
ఈ20 వివాదం.. నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్!
కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ (ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం) విధానంపై వస్తున్న ‘ఆసక్తుల ఘర్షణ’ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, తన ప్రతిష్టను, దేశ ప్రగతిని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ కొన్ని అంశాలు వెల్లడించారు.వాస్తవాలు ఇవే.. నా వాటా నామమాత్రం!కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఇథనాల్ విధానం ప్రవేశపెట్టడానికంటే ఎంతో ముందే తమ కుటుంబానికి షుగర్ వ్యాపారం ఉందని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా దాదాపు 550 యూనిట్ల ద్వారా ఏటా 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో మా కుటుంబానికి, నా కుమారుల కంపెనీలకు ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమే. ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన స్వప్రయోజనాల కోసం ఎలా ప్రభావితం చేయగలరు?’ అని గడ్కరీ అన్నారు.తన కుమారుల వ్యాపారంలో ఇథనాల్ అనేది కేవలం 10 శాతం మాత్రమేనని, ఆ సంస్థలపై ప్రస్తుతం రూ.1,600 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ కొనుగోళ్లు లేదా ధరల నిర్ణయ ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇది ఒక్కరి నిర్ణయం కాదు.. రైతుల కోసమే!ఇంధన సంబంధిత నిర్ణయాలన్నీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని, తన మంత్రిత్వ శాఖ కేవలం వాహనాల ఇంజిన్ ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తుందని గడ్కరీ వివరించారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం కేవలం ఒకరి నిర్ణయంతో కాకుండా కేంద్ర కేబినెట్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ, శాస్త్రీయ సంస్థల విస్తృత సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ విధానం వాజపేయ్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభమైందని, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా దీనిని సమర్థించిందని గుర్తు చేశారు.రైతుల ఆదాయాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, దేశానికి భారం అవుతున్న ముడి చమురు దిగుమతులను నియంత్రించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తాను కేవలం చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, వెదురు, వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్, మిథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.ఇంజిన్లు దెబ్బతింటాయనేది తప్పుడు ప్రచారంఈ 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గడ్కరీ తేల్చిచెప్పారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా దీన్ని విజయవంతంగా వాడుతున్నారని పేర్కొన్నారు. వాహనదారులెవరైనా దీనివల్ల నష్టపోతే నేరుగా కంపెనీలకు లేదా తనకు ఫిర్యాదు చేయవచ్చని సవాల్ విసిరారు.ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా? -
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
రెనాల్ట్ ఇండియా.. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్టాండర్డ్ టెక్నో వేరియంట్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందుతుంది.డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 1.0 టర్బో పెట్రోల్ మాన్యువల్ (రూ. 12.99 లక్షలు), 1.3 టర్బో పెట్రోల్ మాన్యువల్ (రూ.13.99 లక్షలు), 1.3 టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ (రూ. 15.39 లక్షలు).డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ సాధారణ డస్టర్ మాదిరిగా అదే ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.మెకానికల్‌గా.. ఈ స్పెషల్ ఎడిషన్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ లేదా ట్రాన్స్మిషన్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి కొనుగోలుదారులు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్, లేదా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ వంటివి కొనుగోలు చేయవచ్చు. -
‘ఈ20’తో మైలేజ్ తగ్గిందా? అసలు నిజమిదే!
భారతదేశంలో ఈ20 (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) చుట్టూ గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీ (జీఎల్సీ) మైలేజ్ ఈ20 పెట్రోల్ వాడటం వల్ల భారీగా పడిపోయిందంటూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధికారికంగా స్పందించడం, ఆ తర్వాత సదరు యూట్యూబర్ తన తప్పు తెలుసుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.వివాదానికి కారణం ఏంటి?సామాజిక మాధ్యమంలో అధిక ఫాలోవర్లు ఉన్న సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో లోకల్ బంకులో పెట్రోల్ కొట్టించిన 48 గంటల్లోనే మైలేజ్ లీటరుకు 17 కిలోమీటర్ల నుంచి ఏకంగా 5 కిలోమీటర్లకు పడిపోయిందని ఆరోపించారు. ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిమీ రావాల్సిన రేంజ్ కేవలం 480 కిమీ మాత్రమే చూపిస్తోందని డిజిటల్ మీటర్ స్క్రీన్‌ను వీడియోలో చూపించారు. ‘ఇదంతా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్లే జరిగింది. ఇంజిన్ ఎప్పుడు పాడైపోతుందో అని భయమేస్తోంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాహనదారుల్లో ఆందోళన రేకెత్తించాయి.మెర్సిడెస్ బెంజ్ అధికారిక స్పందనఈ వీడియో వైరల్ కావడంతో మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్పందిస్తూ కస్టమర్ అడ్వైజరీని విడుదల చేసింది. ‘మెర్సిడెస్ బెంజ్ సంస్థకు కస్టమర్ల భద్రత, వాహన విశ్వసనీయత అత్యంత ప్రాధాన్యత కలిగినవి. భారతదేశంలో విక్రయించే అన్ని మెర్సిడెస్ బెంజ్ (BS6) పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనవి. మైలేజ్ తగ్గడానికి ఇంధనం మాత్రమే కారణం కాదని.. డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులు, టైర్ ప్రెజర్, ఇంజిన్ సెన్సార్ల వంటి పలు అంశాలపై అది ఆధారపడి ఉంటుంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.యూట్యూబర్ యూ-టర్న్మెర్సిడెస్ బెంజ్ స్పందన తర్వాత, సౌరవ్ జోషి తన కారును కంపెనీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ సాంకేతిక నిపుణులు తనిఖీ చేయగా అసలు సమస్య ఇంధనంలో లేదు, కారు ఇంజిన్‌లో ఉన్న ఒక సాంకేతిక లోపం వల్లే మైలేజ్ అంత దారుణంగా పడిపోయిందని తేలింది. దీనితో సౌరవ్ జోషి వెంటనే స్పందిస్తూ.. అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈ20 ఇంధనం వల్ల సమస్య రాలేదని, ఇంజిన్ లోపం వల్లే అలా జరిగిందని స్పష్టం చేస్తూ తన పాత వీడియోలోని ఆ భాగాన్ని కూడా తొలగించారు.ఈ20 ఇంధనంపై నిపుణులు ఏమంటున్నారు?ఆటోమొబైల్ ఇంజినీర్ల ప్రకారం.. ఇథనాల్‌కు ప్యూర్ పెట్రోల్‌తో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు సాధారణ మైలేజ్ కంటే కేవలం 3-5% వరకు మాత్రమే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ, లీటరుకు 17 కిమీ ఇచ్చే కారు 5 కిమీకి పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
సీఎం విజయ్‌కు బొమ్మ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అధికారిక కార్యక్రమాల వల్ల మాత్రమే కాకుండా.. ఆయన సహజమైన, సరదా క్షణాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసియా ఆపరేషన్స్ సీఈఓ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)తో జరిగిన సమావేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఈ సమావేశంలో విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధి.. ముఖ్యమంత్రి విజయ్‌కు తమ కంపెనీకి చెందిన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు స్కేల్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ చిన్న కారు బొమ్మను విజయ్ తీసుకుని, పక్కన పెట్టకుండా ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.చాలామంది నెటిజన్లు విజయ్ అమాయకత్వాన్ని, సరళ స్వభావాన్ని ప్రశంసించారు. కొందరు ఆయన ఆ చిన్న కారును ఎంతో ఆసక్తిగా చూస్తున్న తీరు చాలా క్యూట్‌గా ఉందని, చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారని కామెంట్లు చేశారు.నిజానికి సీఎం విజయ్‌కు ఇచ్చిన టాయ్ కారు విన్‌ఫాస్ట్ వీఎఫ్8 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి చెందిన చిన్న నమూనా. దీనిని కంపెనీ పిల్లలు ఆదుకునే బొమ్మగా కాకుండా.. తమ వాహనాలను ప్రచారం చేయడానికి లేదా ప్రత్యేక అతిథులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి రూపొందించింది.విన్‌ఫాస్ట్ వీఎఫ్8 గురించిఅసలైన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో తరం. ఇది 60.13 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 228 హార్స్పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.#CMVijay's cute playtime with a Miniature Toy Car... 🤎🚗 pic.twitter.com/dmrxMCbeO2— 𝐒𝐚𝐤𝐭𝐡𝐢 𝐀𝐠𝐫𝐢 𝑻𝑽𝑲 (@mersal_sakthi03) July 13, 2026 -
భారత్‌లోని E85 బైకులు: ధర, వివరాలు ఇలా..
భారతదేశం పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. కొన్ని వాహన తయారీ సంస్థలు కూడా ఇథనాల్ వినియోగానికి సరిపడే వెహికల్స్ తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇప్పటికే మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేశాయి. ఈ బైక్‌లు E20 నుంచి E85 వరకు (20% నుంచి 85% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనం) ఉపయోగించగలవు.ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లకు కంపెనీలు ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చాయి. ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న నాలుగు ఈ85 బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హీరో స్ప్లెండర్ ప్లస్ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. దీని ధర రూ. 82,710 (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ స్ప్లెండర్ మోడల్ ఆధారంగా రూపొందించినప్పటికీ, ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఇంధన వ్యవస్థ, ఇంజిన్ నిర్వహణ, కొన్ని విడిభాగాల్లో మార్పులు చేశారు. ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కూడా స్ప్లెండర్ మాదిరిగానే 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది కూడా E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేస్తుంది. ఈ బైక్ ధర రూ. 72,792 (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చవకైన ఈ85 మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటి.సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250సుజుకి సంస్థ కమ్యూటర్ విభాగానికే మాత్రమే కాకుండా.. ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను అందించింది. ఇందులో భాగంగానే కంపెనీ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకును ఇథనాల్‌తో పనిచేసాల రూపొందించింది. ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. దీని ధర రూ.2,00,896 (ఎక్స్ షోరూమ్).యమహా ఎఫ్‌జెడ్ బ్లూయమహా కంపెనీ జూలై 2026లో ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ మోడల్‌ను లాంచ్ చేయడంతో.. భారత ఫ్లెక్స్ ఫ్యూయల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఎఫ్‌జెడ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మితమైంది. ఈ బైక్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగలదు. ఇందులో 149 సీసీ సింగిల్ సిలిండర్ బ్లూ కోర్ ఇంజిన్ అమర్చారు. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). -
ఫోక్స్‌వ్యాగన్ టైరాన్.. రూ.5 లక్షల తక్కువ ధరకు!
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. టైరాన్ లైనప్‌లో కొంత తక్కువ ధరలో ఉండే ఐదు సీట్ల ఎంట్రీ లెవల్ మోడల్ 'టైరాన్ లైఫ్'ను రూ. 41.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఆర్-లైన్ (రూ. 46.99 లక్షల) ధర కంటే రూ. 5 లక్షలు తక్కువ.టైరాన్ ఆర్-లైన్ ఏడు సీట్ల వాహనం. అయితే టైరాన్ లైఫ్ ఐదు సీట్ల మోడల్. దీని అల్లాయ్ వీల్స్ ఆర్ లైన్ కంటే కొంత చిన్నగా ఉంటాయి. డ్యూయల్-టోన్ ఇంటీరియర్ అప్హోల్స్టరీ ఉంటుంది. కానీ డోర్, స్టీరింగ్ వీల్‌పై ఉండే 'R' బ్యాడ్జ్‌లు లేవు. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆర్-లైన్‌లోని 15-అంగుళాల డిస్ప్లేకు బదులుగా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ 12.9-అంగుళాల యూనిట్ ఉంది. ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్ లభిస్తుంది. వెనుక లోగోలు, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.టైరాన్ లైఫ్ కూడా 2.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 201bhp పవర్ 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారును కూడా కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.ఇదీ చదవండి: 2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు -
అవును, ఈ20తో మైలేజీ కట్!
న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా మైలేజీ పడిపోతోందని, వాహనాల ఇంజిన్లు పాడైపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) కారణంగా మైలేజీ 3–5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే, అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన పికప్, స్మూత్ యాక్సెలరేషన్, తక్కువ కాలుష్యం వల్ల పర్యావరణానికి మేలు, దేశానికి ఇంధన భద్రత వంటి పలు ప్రయోజనాలతో పోలిస్తే, ఈ ప్రభావం చాలా తక్కువేనని వాదించడం విశేషం. ఈ10 లేదా స్వచ్ఛమైన పెట్రోల్ తో పోలిస్తే ఈ20 మరింత పర్యావరణహితమైనదే కాకుండా అధిక నాణ్యత, సామర్థ్యంతో కూడినదని పేర్కొంది. చాలా ఏళ్ల శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులతో పాటు దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. 2001లోనే పైలట్ ప్రాజెక్టులు... పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని చాలా వేగంగా అమల్లోకి తెచ్చారన్న ఆందోళనలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులను 2001లోనే భారత్ మొదలు పెట్టిందని, 2006లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 5% మిశ్రమంతో దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. కాగా, 2014 వరకు ఇథనాల్ మిశ్రమం 1.5% స్థాయిలోనే ఉండగా.. 2018లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ బయో ఇంధన పాలసీ, ఫీడ్‌స్టాక్‌గా చెరకుతో పాటు ఇతర వనరులను చేర్చడంతో జోరందుకుంది. ఇథనాల్ మిశ్రమం 2022లో 10%కి, 2025–26లో 20%కి చేరుకుందని పెట్రోలియం శాఖ పేర్కొంది. పాత వాహనాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆందోళనపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా ఈ20ని ప్రవేశపెట్టడానికి ముందే ఇంజిన్ మన్నిక నుంచి ఫ్యూయల్ సిస్టమ్స్, డ్రైవింగ్ పరిస్థితులు, కాలుష్య ఉద్గారాల వంటి వాటిపై విస్తృతమైన పరీక్షలు జరిగాయని స్పష్టం చేసింది. మారుతీ, హీరో మోటోకార్ప్ సహా పలు వాహన కంపెనీలు కూడా ఈ20 వల్ల విడిభాగాలు తుప్పుపట్టడం, అసాధారణమైన సమస్యలు లేదా దెబ్బతినడం వంటివేమీ లేవని నివేదించాయని తెలిపింది. మరోపక్క, బంకుల్లో ప్యూర్ పెట్రోల్‌తో పాటు ఈ10, ఈ20.. ఇలా వివిధ గ్రేడ్లను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 1 లక్షకు పైగా ఉన్న బంకుల్లో ఇలా నిర్వహించాలంటే, రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో పాటు ఇంధన పంపిణీ సంక్లిష్టంగా మా రుతుందని తేల్చిచెప్పింది.రూ.1.97 లక్షల కోట్లకు పైగా ఆదా ఇథనాల్ మిశ్రమ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశం, పెట్రోలు ధరల తగ్గింపు కంటే క్రూడ్ దిగుమతులపై ఆధారపడటాన్ని భారీగా తగ్గించడమేనని పెట్రోలియం శాఖ పేర్కొంది. తద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ధరల స్థిరీకరణకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఇథనాల్ మిశ్రమంతో రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, 316 లక్షల టన్నుల క్రూడ్ దిగుమతులు తగ్గాయని తెలిపింది. 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు 2014–15 నుంచి చూస్తే, రైతులకు రూ.1,66 లక్షల కోట్లకు పైగా దక్కిందని వివరించింది.రవాణా రంగానికి భవిష్యత్తు హైడ్రోజన్: గడ్కరీ దేశంలో రవాణా పరిశ్రమకు భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనమే దన్నుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీన్ని భవిష్యత్తు ఇంధనంగా అభివరి్ణంచారు. దేశవ్యాప్తంగా 10 రూట్లలో హైడ్రోజన్ ఇంధన వాడకంపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నోయిడా–ఢిల్లీ–ఆగ్రాతో పాటు ఎన్‌హెచ్ 16 విశాఖపట్నం–బయ్యవరం రూట్ ఉందన్నారు. -
‘మైలేజీ తగ్గుతుంది.. కానీ..’
దేశంలో పెరుగుతున్న కాలుష్యం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ20 (20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) ఇంధనంపై వాహనదారుల్లో ఉన్న పలు అనుమానాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెరదించారు. ఈ20 ఇంధనం వల్ల కారు మైలేజీ కొంతవరకు తగ్గుతుందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, దీనివల్ల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.మైలేజీ తగ్గడానికి కారణం ఇదే..!సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కేలరీల విలువ తక్కువగా ఉండటం వల్లే మైలేజీలో స్వల్ప వ్యత్యాసం ఉంటుందని గడ్కరీ వివరించారు. ‘ఇథనాల్, పెట్రోల్ మధ్య కేలరీల విలువలో వ్యత్యాసం ఉండటం వాస్తవం. అయితే మైలేజ్ అనేది కేవలం ఇంధనం పైనే కాకుండా డ్రైవింగ్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనాలు తక్కువ గేర్లలో నడుస్తాయి. స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో నిరంతరం బ్రేకులు వేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. అదే హైవేలపై గంటకు 100 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో వెళ్తే మైలేజీలో కొంత వ్యత్యాసాన్ని మాత్రమే గమనించవచ్చు’ అని నితిన్ గడ్కరీ అన్నారు.ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లతో రూపొందించిన వాహనాలకు మైలేజ్ సామర్థ్యంతో ఎటువంటి సమస్య ఉండదని, అందుకే భవిష్యత్తులో ఫ్లెక్స్ ఇంజిన్ టెక్నాలజీని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.ఇంజిన్ దెబ్బతింటుందనేది తప్పుడు ప్రచారంఈ20 ఇంధనం వల్ల వాహన భాగాలు పాడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. ఇదంతా ఒక తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నంలో భాగమేనన్నారు. ‘ఏఆర్ఏఐ, వాహన తయారీదారులు ఎన్నో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. కొన్ని పాత మోడల్ వాహనాల్లో కొన్ని భాగాలపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే, సర్వీసింగ్ సమయంలో ఆయా భాగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వాహన తయారీ సంస్థలను కోరింది. ఈ20 ఇంధనం కారణంగా దెబ్బతిన్న ఒక్క కారునైనా నాకు చూపించండి’ అని గడ్కరీ సవాల్ విసిరారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన
భారీ ఉద్యోగాల కోతపై జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తీవ్ర విమర్శ లెదుర్కొంటోంది. లక్ష ఉద్యోగాల కోతపై బోర్డు యోచిస్తోందన్న వార్తదావాలనంలా వ్యాపించింది. దీంతో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.వోక్స్వ్యాగన్ తన చరిత్రలోనే అతిపెద్ద పునర్నిర్మాణంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్ష వరకు ఉద్యోగాలను తగ్గించడంతో పాటు, జర్మనీలోని నాలుగు ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దీంతో ఉద్యోగల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తప్పదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వ్యయ ఒత్తిళ్లు, ప్రపంచ పోటీని కారణంగా చూపుతూ కొన్ని జర్మన్ కంపెనీలు తమ కార్యకలాపాలలోని కొన్ని భాగాలను విదేశాలకు తరలిస్తున్నాయి.ఉద్యోగ కోతలపై భారీ నిరసనల మధ్య వోక్స్వ్యాగన్ బోర్డు సమావేశం జరిగింది. హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్, మరియు ఆడికి చెందిన నెకార్సుల్మ్ అనే నాలుగు ప్లాంట్లను మూసివేసి, ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో సుమారు 16 శాతానికి సమానమైన లక్ష ఉద్యోగాలను తొలగించే పునర్నిర్మాణ ప్రణాళికపై చర్చించడానికి వోక్స్వ్యాగన్ పర్యవేక్షక బోర్డు వోల్ఫ్స్‌బర్గ్‌లో సమావేశమైంది. డజనుకు పైగా సైట్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా, మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తలెత్తుతుందని ఐజీ మెటల్ హెచ్చరించింది. అధిక ఖర్చులు, తక్కువగా వినియోగమవుతున్న సామర్థ్యం, చైనా, అమెరికా సుంకాల నుండి ఎదురయ్యే పోటీపరమైన ముప్పులను పరిష్కరించడానికి ఈ చర్యలు అవసరమని సీఈఓ ఆలివర్ బ్లూమ్ వాదిస్తున్నారు. -
ఇథనాల్ ఇంధనంపై ముదిరిన వివాదం!
దేశవ్యాప్తంగా వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ వాడకంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆటోమొబైల్ దిగ్గజాలకు ప్రశ్నలేవనెత్తారు. 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమనే అంశంపై దేశంలోని ప్రముఖ 29 ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ఆయన లేఖలు రాశారు. కంపెనీల అధికారిక మేనేజ్మెంట్ మాన్యువల్స్‌లో ఒకలా, ప్రభుత్వ వేదికలపై కంపెనీ ప్రతినిధులు మరోలా మాట్లాడుతున్నారని ఈ వైరుధ్యంపై వారంలోగా స్పష్టమైన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆప్ యూనిట్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను వెల్లడించారు.కంపెనీల ద్వంద్వ వైఖరిదేశంలోని ద్విచక్ర, నాలుగు చక్రాల వాహన తయారీదారులను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ రెండు రకాల లేఖలను పంపారు. మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ సంస్థలకు ప్రత్యేకంగా లేఖలు పంపారు. జులై 4న జరిగిన ప్రభుత్వ విలేకరుల సమావేశంలో ఈ మూడు కంపెనీలు మాట్లాడుతూ.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడినా ఎటువంటి నష్టం జరగదని, మైలేజీ కేవలం 3% నుంచి 5% మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నాయి. దేశంలోని మిగతా 26 ఆటోమొబైల్ కంపెనీలకు పంపిన లేఖలో.. పాత వాహనాల్లో ఈ20 వాడకంపై వారి అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని కోరారు.ఆందోళనకర వైరుధ్యం ఇదే!‘కంపెనీలు ప్రభుత్వ సమావేశంలో చెప్పే మాటలకు, వారు వినియోగదారులకు ఇచ్చే ఓనర్ మాన్యువల్స్‌కు పొంతన లేదు. 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో 10% కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకూడదని ఆ మాన్యువల్స్‌లో స్పష్టంగా రాసి ఉంది. మరి ప్రభుత్వ ప్రెస్మీట్లో అంతా సురక్షితమేనని ఎలా చెబుతున్నారు? ఇది వినియోగదారులను మోసం చేయడం కాదా?’ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.వాహనదారులకు నష్టపరిహారం ఇస్తారా?కంపెనీల ముందు కేజ్రీవాల్ ప్రధానంగా రెండు డిమాండ్లను ఉంచారు. ఒకవేళ E20 పెట్రోల్ సురక్షితమేనని కంపెనీలు లిఖితపూర్వకంగా చెబితే కింద పేర్కొన్న అంశాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.1. మైలేజీ నష్టానికి పరిహారం: కంపెనీలు చెబుతున్న 4% నుంచి 5% కంటే ఎక్కువగా (ఉదాహరణకు 10% పైగా) మైలేజీ పడిపోతే సదరు వినియోగదారుడికి కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయా?2. ఇంజన్ భాగాల వైఫల్యం: E20 ఇంధనం వాడకం వల్ల ఫ్యుయెల్ పంపులు, ఇంజన్ భాగాలు దెబ్బతింటే ఆ నష్టాన్ని భరించి ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీలు గ్యారెంటీ ఇస్తాయా?గ్రౌండ్ రిపోర్ట్ కోసం పర్యటనలుప్రభుత్వం మొండిగా ప్రజలపై ఈ నిర్ణయాన్ని రుద్దుతోందని విమర్శించిన కేజ్రీవాల్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, సర్వీస్ సెంటర్లు, మెకానిక్ షాపులను సందర్శించి వాహనదారుల, నిపుణుల ప్రత్యక్ష అనుభవాలను సేకరించనున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
2026 టాటా స్టెల్త్ ఎడిషన్స్: ధర, వివరాలు
టాటా మోటార్స్ భారతదేశంలో 2026 హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్లను లాంచ్ చేసింది. టాప్ స్పెక్ ఫియర్లెస్ అల్ట్రా, అకంప్లిష్డ్ అల్ట్రా ట్రిమ్‌ల ఆధారంగా రూపొందిన ఈ కార్లు..కాస్మెటిక్ అప్డేట్లు పొందుతాయి. కాబట్టి ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.2026 టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 23.43 లక్షల నుంచి రూ. 26.01 లక్షల మధ్య ఉండగా.. సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 24.09 లక్షల నుంచి రూ. 26.76 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఈ కార్లలో అత్యంత స్పష్టంగా కనిపించే అప్డేట్.. స్టెల్త్ బ్లాక్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్. ఈ రెండు SUVలకు మ్యాట్ స్టెల్త్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా లభిస్తాయి. ఇవి వాటిని డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్ల నుంచి ప్రత్యేకంగా అనిపించేలా చేస్తాయి. ఫ్రంట్ ఫెండర్లపైన ఉంచిన 'స్టీల్త్' బ్యాడ్జ్ ఒక స్పష్టమైన మార్పు. ఇవి కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉండటం చూడవచ్చు.రెండు SUVలు నలుపు రంగు క్యాబిన్ థీమ్‌ను పొందుతాయి. సీట్లు కార్బన్ నోయిర్ లెదరెట్తో తయారు చేసారు. సెంటర్ కన్సోల్ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాగా ఇతర ఫీచర్స్ దాదాపు సాధారణ హారియర్, సఫారీలో ఉన్నట్లే ఉన్నాయి.మెకానికల్‌గా.. స్టెల్త్ ఎడిషన్లలో ఎలాంటి మార్పులు లేవు. హారియర్, సఫారీలలో 170 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్, 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందించే 2.0 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా యథావిధిగా ఉన్నాయి, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: స్టైలిష్ లుక్, పవర్ఫుల్ ఇంజన్‌తో టెక్టన్.. ధర, ఫీచర్లు ఇవే! -
ఈ85 పెట్రోల్ ఇంకా చౌక.. ఎంత తక్కువంటే..
దేశంలో ఇథనాల్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. E85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది. E85 ఫ్యూయల్ ధర E20 పెట్రోల్‌తో పోలిస్తే లీటరుకు సుమారు రూ.20 తక్కువ ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.అయితే ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చమురు సంస్థల 48 పెట్రోల్ బంకుల్లో E85 విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.సీఎన్ఎన్-న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధార పడటాన్ని తగ్గించడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తికి ఊతమివ్వడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇథనాల్ మిశ్రమాలపై నడిచే వాహనాలకు వారంటీ, బీమా వంటి అంశాలపై ఉన్న సందేహాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.E20పై అపోహలు అవసరం లేదుE20 పెట్రోల్ వాడితే ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. కోట్లాది ద్విచక్ర, లక్షలాది నాలుగు చక్రాల వాహనాలు ఇప్పటికే E20పై ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా నడుస్తున్నాయని, వాహన తయారీ సంస్థలు కూడా యాంత్రిక లోపాలపై విస్తృతంగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఇథనాల్ వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, తక్కువ కార్బన్ ఉద్గారాలు, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం వంటి ప్రయోజనాలు మరింత ముఖ్యమని వివరించారు.E25 ఇంకా పరీక్షల దశలోనే..ఇక E25 (25 శాతం ఇథనాల్ మిశ్రమం)ను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విస్తృత పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాత వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చించి మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి E25 వాణిజ్య విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యాలతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. -
భారత్‌లో ‘హోండా’ భారీ విస్తరణ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ) దేశంలో భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2028 నాటికి తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 80 లక్షల యూనిట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశంలో కొత్తగా 3,800 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని హోండా ప్రెసిడెంట్, సీఈవో సుత్సుము ఒటానీ వెల్లడించారు.‘‘అంతర్జాతీయ తయారీ, ఎగుమతుల వ్యూహంలో భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామిగా మారుతోంది. కేవలం దేశీయ అవసరాల కోసమే కాకుండా, పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌ను అందుకోవడానికి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాము’’ అని ఒటానీ తెలిపారు. హోండా దీర్ఘకాలిక విజన్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, భారతదేశంలో కేవలం ఈవీలపైనే కాకుండా ఐసీఈ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలతో కూడిన ‘సమతుల్య వ్యూహం’తో ముందుకు సాగుతామన్నారు. కస్టమర్లకు ఆచరణాత్మకమైన, సులభంగా అందుబాటులోకి వచ్చే, వినియోగదారు కేంద్రిత సొల్యూషన్లు అందించడంపైనే సంస్థ ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.ప్రతి ఏటా ఎగుమతుల్లో వృద్ధి ప్రస్తుతం హెచ్ఎంఎస్ఐ సంస్థ జపాన్, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా మొత్తం 65 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. కంపెనీ ఎగుమతుల గణాంకాలు ప్రతి ఏటా స్థిరంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2024లో 3.6 లక్షల యూనిట్లు, ఆర్థిక సంవత్సరం 2025 లో 5.1 లక్షల యూనిట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 2026లో అది 6.2 లక్షల యూనిట్లకు చేరింది. ఈ నిరంతర వృద్ధి భారత్‌ను హోండా అంతర్జాతీయ తయారీ హబ్‌గా మారుస్తోందని ఒటానీ తెలిపారు. ప్రస్తుతం మానేసర్ (హర్యానా), టపుకరా (రాజస్థాన్), నరసాపుర (కర్ణాటక), విఠలాపూర్ (గుజరాత్) ప్లాంట్ల ద్వారా హోండాకు ఏడాదికి 60 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం ఉంది.రూ.2,420 కోట్లతో ప్లాంట్ల విస్తరణ రాజస్థాన్‌లోని టపుకరా ప్లాంట్‌లో రూ.1,500 కోట్ల పెట్టుబడితో మూడో ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది 2028 నాటికి అందుబాటులోకి రానుంది. తద్వారా అదనంగా 6.70 లక్షల యూనిట్ల సామర్థ్యం పెరిగి, ఈ ప్లాంట్ మొత్తం సామర్థ్యం 20.1 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. అలాగే, గతంలో ప్రకటించిన రూ.920 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌లో నాలుగో ప్రొడక్షన్ లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2027 నాటికి ప్రారంభం కానుంది. దీని ద్వారా వార్షిక సామర్థ్యం మరో 6.50 లక్షల యూనిట్లు పెరిగి, మొత్తం ప్లాంట్ కెపాసిటీ 26.1 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. తద్వారా ప్రపంచంలోనే హోండాకు చెందిన అతిపెద్ద మోటార్‌సైకిల్ అసెంబ్లీ ప్లాంట్‌గా గుజరాత్ ప్లాంట్ అవతరించనుందిఢిల్లీ ఈవీ విధానంపై స్పందన ఢిల్లీలో ఏప్రిల్ 1, 2028 నుండి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే రిజిస్టర్ అవ్వాలనే నిబంధనపై ఒటానీ సానుకూలంగా స్పందించారు. కాలుష్య నివారణకు ఇది మంచి అడుగు అని ప్రశంసించారు. అయితే, ‘ఈవీల వైపు మార్పు వేగం’ అనేది అంతిమంగా వినియోగదారుల చేతుల్లోనే ఉంటుందన్నారు. చార్జింగ్ మౌలిక వసతులు, బడ్జెట్, సౌకర్యం, రోజువారీ అవసరాల ఆధారంగానే కస్టమర్లు వాహనాలను ఎంచుకుంటారని అభిప్రాయపడ్డారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తి వ్యూహాన్ని అమలు చేస్తూనే.. దేశ రవాణా రంగ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తామన్నారు. -
దుబాయ్: వెడ్డింగ్ హాల్స్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
దుబాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA), యూఏఈ తొలి పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ సంస్థ UAEV (Emarat EV Charging Stations Company) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దుబాయ్‌లోని మజ్లిస్‌లు, కమ్యూనిటీ కౌన్సిల్స్, వెడ్డింగ్ హాల్స్ వంటి ప్రజా సదుపాయాల వద్ద దశలవారీగా ఆధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో నివాసితులు, సందర్శకులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత సులభతరం కానుంది.ఈ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అల్ రషీదియా మజ్లిస్, అల్ బర్షా మజ్లిస్, నాద్ అల్ షెబా మజ్లిస్లలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 2026లో అల్ ఖవానీజ్ మజ్లిస్, అల్ వార్కా మజ్లిస్, అల్ బర్షా వెడ్డింగ్ హాల్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. అనంతరం 2027లో అల్ త్వార్ వెడ్డింగ్ హాల్, అల్ అవిర్ మజ్లిస్, హట్టా మజ్లిస్ల వరకు ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ ప్రాజెక్టు యూఏఈ నెట్ జీరో 2050 వ్యూహం, దుబాయ్ సోషల్ అజెండా 33 లక్ష్యాలకు అనుగుణంగా అమలు కానుంది. అలాగే 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,000కిపైగా హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న యూఏఈవీ లక్ష్యానికి కూడా ఇది బలాన్నిస్తుంది. ఇటీవల మసీదుల పార్కింగ్ ప్రాంగణాల్లో కూడా ఇదే తరహా ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు యూఏఈవీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దుబాయ్‌లో గ్రీన్ మొబిలిటీ విస్తరణ వేగంగా సాగుతోందనే సంకేతాలను ఇస్తోంది. -
స్టైలిష్ లుక్, పవర్ఫుల్ ఇంజన్‌తో టెక్టన్.. ధర, ఫీచర్లు ఇవే!
నిస్సాన్ ఇండియా.. భారత మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశిస్తూ, 'టెక్టన్'ను అధికారికంగా లాంచ్ చేసింది. దీని ధరలు రూ.10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.టెక్టన్ డిజైన్నిస్సాన్ టెక్టన్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఈ ఎస్యూవీ ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సీ షేప్ డీఆర్ఎల్స్ ఉన్నాయి. బోనెట్‌పై టెక్టన్ అనే అక్షరాలు ఉండటం గమనించవచ్చు. పెద్ద వీల్ ఆర్చ్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు డోర్ల కోసం పుల్ స్టైల్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్ల్యాంప్లకు ఒక ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. ఈ కారు టెయిల్‌గేట్‌పై బ్రాండ్ బ్యాడ్జ్‌ను చూడవచ్చు. ఇది ఆరు మోనోటోన్లు, ఐదు డ్యూయల్ టోన్లతో సహా 11 పెయింట్ స్కీమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.ఇంటీరియర్, ఫీచర్స్నిస్సాన్ టెక్టన్ క్యాబిన్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రే పాటు నాలుగు ఇంటీరియర్ థీమ్‌ల ఎంపికలను పొందుతుంది. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ ఏసీ కంట్రోల్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, గూగుల్ మ్యాప్స్‌తో కూడిన గూగుల్ బిల్ట్-ఇన్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ప్యాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా లభిస్తాయి.సేఫ్టీ ఫీచర్స్సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ ఎస్యూవీ 5 స్టార్ BNCAP రేటింగ్‌ను పొందింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX మౌంట్లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి.. నిస్సాన్ కంపెనీ ఈ ఎస్యూవీ లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి ఏడీఏఎస్ ఫీచర్లను కూడా అందిస్తోంది.పవర్‌ట్రెయిన్, మైలేజ్ఇక పవర్‌ట్రెయిన్, మైలేజ్ విషయానికి వస్తే.. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 హార్స్ పవర్ 166 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 163 hp పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ట్రాన్స్మిషన్ల జాబితాలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT (ప్రత్యేకంగా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కోసం) ఉన్నాయి. చిన్న ఇంజన్ 19.4 kmpl మైలేజ్ అందించగా, పెద్ద యూనిట్ 18.5 kmpl మైలేజ్ అందిస్తుంది.నిస్సాన్ టెక్టన్ మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలోని రెనాల్ట్ డస్టర్, టాటా సియెర్రా, మారుతి సుజుకి విక్టోరిస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి వస్తుంది.కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిస్సాన్''ఆటోమొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిస్సాన్ ఇండియాకు అభినందనలు. ప్రపంచ వేదికపై ఆల్-న్యూ నిస్సాన్ టెక్టన్‌ను ఆవిష్కరించడం విశేషమైన ఘట్టం. ఆకట్టుకునే డిజైన్, ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ ఫీచర్లతో రూపొందిన ఈ ఎస్యూవీ నిస్సాన్ నాణ్యతకు మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన నిస్సాన్ ఇండియా బృందానికి శుభాకాంక్షలు. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా టెక్టన్ విశేష విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము'' అని కంపెనీ ప్రతినిధులు నిస్సాన్ టెక్టన్ లాంచ్ సందర్భంగా వెల్లడించారు. -
మహీంద్రా వాహన రేట్లకు రెక్కలు.. రేపటి నుంచి కొత్త ధరలు
న్యూఢిల్లీ: ముడిసరుకు వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రకటించింది. ఈ జూలై 10 (రేపటి) నుంచి ఎస్యూవీ వాహనాల ధరలను సగటున 2.7 శాతం, వాణిజ్య వాహనాల ధరలను సగటున 2 శాతం పెంచనున్నట్లు తెలిపింది.అయితే ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతుందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్వో, ఎక్స్‌యూవీ 7ఎక్స్వో ఎస్‌యూవీల ధరలు రూ.7.54 లక్షల నుంచి రూ.25.07 లక్షల మధ్య ఉన్నాయి. -
100 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వాహనాల విభాగంపై టాటా గ్రూప్ భారీ ప్రణాళికల్లో ఉంది. వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఆదాయ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 50,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో రూ. 40,000 కోట్లను దేశీ వ్యాపారంపై, సుమారు రూ. 12,763 కోట్ల మొత్తాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్‌పై పెట్టుబడులు పెట్టనుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) 81వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు తెలిపారు.‘రెండు కంపెనీలకు (టీఎంపీవీ, టాటా మోటార్స్) భారీ ఆకాంక్షలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో (2031 ఆర్థిక సంవత్సరం నాటికి) జేఎల్ఆర్తో కలిపి టీఎంపీవీకి 60 బిలియన్ డాలర్ల అమ్మకాల లక్ష్యం ఉంది. ఇందులో జేఎల్ఆర్ వాటా 45–50 బిలియన్ డాలర్లుగా, టాటా మోటార్స్ దేశీ వ్యాపారం వాటా 15 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇక వాణిజ్య వాహన విభాగం ఆదాయ లక్ష్యం దాదాపు 40 బిలియన్ డాలర్లు. 2 కంపెనీల ఆదాయ లక్ష్యం కలిపి 100 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. లాభం టార్గెట్ 5 బిలియన్ డాలర్లు‘ అని చంద్రశేఖరన్ వివరించారు. కొత్త ఉత్పత్తులపై ఫోకస్.. ‘2030 నాటికి అమ్మకాల పరిమాణంలో 10 రెట్లు వృద్ధితో 12 లక్షల వాహనాల స్థాయికి చేరుకోవాలని, ప్రస్తుతం 14.2 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం‘ అని ఆయన తెలిపారు. జేఎల్ఆర్ ఈ ఏడాది ద్వితీయార్థంలో పలు ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
90 దేశాలు.. 70 లక్షల మంది మెచ్చిన బైక్!
2005లో లాంచ్ అయిన టీవీఎస్ అపాచీ అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ బైకుకు ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల కస్టమర్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం అపాచీ సిరీస్‌లో ఆర్టీఆర్ 160, ఆర్టీఆర్ 160 4వీ, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 200 4వీ, ఆర్టీఆర్ 310, ఆర్ఆర్ 310తో పాటు ఇటీవల విడుదలైన ఆర్టీఎక్స్ అడ్వెంచర్ టూరర్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 160 సీసీ నుంచి 310 సీసీ వరకు వివిధ ఇంజిన్ సామర్థ్యాలతో ఈ బైకులు అమ్ముడవుతున్నాయి. కాగా ప్రస్తుతం అపాచీ బైకులు ప్రపంచంలోని 90కి పైగా దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.అపాచీ ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రైడింగ్ మోడ్స్, టీవీఎస్ SmartXonnect కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, కీ లెస్ రైడ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఇంజిన్ కూడా మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. -
ఇథనాల్ వినియోగం.. ప్రభుత్వం కొత్త ప్లాన్!
భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో మరో కీలక మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉండగా, త్వరలో E25 పెట్రోల్ (75 శాతం పెట్రోల్ + 25 శాతం ఇథనాల్) తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్ పనితీరు, మైలేజీ, ఇంధన వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతోందో అనే అంశాల గురించి కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే.. ఆటోమొబైల్ కంపెనీలు, ఇంధన రంగ నిపుణుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. కాబట్టి ఈ25 పెట్రోల్ అమలుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఇప్పటికే దేశంలోని చమురు శుద్ధి సంస్థలు E25 పెట్రోల్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్లో E25 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. భారత్ ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమంలో మంచి పురోగతి సాధించింది.2030 నాటికి దేశవ్యాప్తంగా E20 అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ లక్ష్యం ఐదేళ్ల ముందే సాధ్యమైంది. అయితే ఇప్పుడు అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల కోసం ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. E25 మాత్రమే కాకుండా E22, E27, E30 పెట్రోల్‌కు సంబంధించిన ప్రమాణాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా.. అధిక ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా తగిన సన్నాహాలు చేస్తోంది.ఇదీ చదవండి: E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!అయితే.. E25 పెట్రోల్ ఎప్పుడు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే, భవిష్యత్తులో ఇథనాల్ శాతం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
మహీంద్రా సరికొత్త ‘యువోటెక్ ప్లస్’ ట్రాక్టర్
మహీంద్రా ట్రాక్టర్స్ సరికొత్త ‘యువోటెక్ ప్లస్ 585 డీఐ వీ1’ మోడల్‌ను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ మల్టీ పర్పస్ ట్రాక్టర్లో శక్తివంతమైన ‘ఎంబుల్’ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 30% అదనపు పవర్‌ను ఇవ్వడం వల్ల ఎలాంటి కఠినమైన పొలాల్లోనైనా స్థిరంగా పనిచేస్తుంది. ఆకర్షణీయమైన మెటాలిక్ రెడ్ కలర్లో లభించే ఈ ట్రాక్టర్.. టూ–వీల్ (2డబ్ల్యూడీ), ఫోర్–వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.రైతుల సౌకర్యార్థం ఇందులో 12 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్ సిస్టమ్, మల్టీ–స్పీడ్ పీటీఓ, పవర్ స్టీరింగ్, బరువైన వ్యవసాయ పరికరాలను సులభంగా ఎత్తగలిగే పటిష్ట హైడ్రాలిక్ ఫీచర్లను అందించారు. కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో విజయవంతమయ్యాక, ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సీఈఓ హర్ష్ రాయ్ తెలిపారు. పరిశ్రమలోనే అత్యుత్తమంగా ఆరేళ్ల వారంటీతో వస్తున్న ఈ ట్రాక్టర్, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మహీంద్రా డీలర్‌షిప్‌లలో లభిస్తుందని సంస్థ పేర్కొంది. -
టాప్‌లేపిన టీవీఎస్!
దేశీ టూవీలర్ కంపెనీల మధ్య రేసు రసవత్తరంగా మారుతోంది. తొలిసారిగా టీవీఎస్ మోటార్స్ దేశంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన కంపెనీగా అవతరించడంతో పోటీ హీటెక్కింది. జూన్ నెల మొత్తం అమ్మకాల్లో దుమ్మురేపి.. హీరో మోటోకార్ప్‌ను వెనక్కినెట్టింది. ఎగుమతులు టాప్‌గేర్‌లో దూసుకెళ్లడం టీవీఎస్‌కు జోరుకు ప్రధాన కారణం. అయితే, దేశీ విక్రయాల్లో మాత్రం ఇప్పటికీ హవా ‘హీరో’దే కావడం విశేషం!విదేశీ వ్యాపారం దూకుడుతో టీవీఎస్ మోటార్స్ చెలరేగిపోతోంది. గత నెలలో ఎగుమతులతో కలిపి కంపెనీ 5,65,417 ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. గతేడాది జూన్‌తో పోలిస్తే అమ్మకాలు 47 శాతం జంప్ చేశాయి. దేశీయంగా బైక్స్ అమ్మకాలు 42 శాతం (2,67,096) దూసుకెళ్లగా... స్కూటర్ సేల్స్ ఏకంగా 53 శాతం (2,47,950) పెరగడం గమనార్హం. దీంతో ఏళ్లకు ఏళ్లు మార్కెట్ లీడర్‌గా పాతుకుపోయిన హీరో మోటోకార్ప్‌ను రేసులో రెండో స్థానానికి తోసేసి.. టీవీఎస్ ‘టాప్’లేపింది. ఈ ఏడాది జూన్‌లో హీరో మోటో మొత్తం 5,41,519 టూవీలర్లను అమ్మింది.హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా 5,28,281 వాహనాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. అయితే, దేశీ మార్కెట్ రారాజు ఇప్పటికీ హీరో మోటోనే. జూన్‌లో ఈ కంపెనీ అమ్మకాలు 4.4 శాతం తగ్గినప్పటికీ.. 5 లక్షల పైనే వాహనాలను సేల్ చేసింది. అదేవిధంగా హోండా దేశీయంగా 4,68,956 టూవీలర్లను విక్రయించి (21% వృద్ధి) రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మోపెడ్ సేల్స్‌ను మినహాయంచి చూస్తే, దేశీయంగా 4,11,014 టూవీలర్లు సేల్ చేసిన టీవీఎస్ మూడో ప్లేసు దక్కించుకుంది. టీవీఎస్ ఎక్స్ఎల్ పేరుతో ప్రస్తుతం మోపెడ్‌ను ఈ ఒక్క కంపెనీ మాత్రమే అమ్ముతోంది. జూన్‌లో 50,371 (46% అప్) టీవీఎస్ మోపెడ్లు రోడ్డెక్కడం ఇంకా వీటికున్న ఆదరణకు అద్దంపడుతోంది.ఎగుమతుల రైడ్... నంబర్ వన్ మైలురాయిని చేరుకోవడంలో టీవీఎస్‌కు దేశీ అమ్మకాల కంటే ఎగుమతులే దన్నుగా నిలిచాయి. విదేశీ విపణిలో ఈ చెన్నై కంపెనీ జూన్‌లో ఏకంగా 47 శాతం వృద్ధితో 1,72,355 టూవీలర్లను సేల్ చేసింది. తద్వారా హీరో మోటో, హోండాలను ఈజీగా దాటేసింది. ఈ రెండు కంపెనీలు కలిపి 97,594 యూనిట్లను ఎగుమతి చేయగా.. ఒక్క టీవీఎస్ దీనికి దాదాపు రెట్టింపు స్థాయిలో విదేశాల్లో విక్రయించడం విశేషం! అయితే, టాప్ టూవీలర్ ఎగుమతిదారుగా మాత్రం బజాజ్ ఆటో నిలిచి టీవీఎస్‌కు షాకిచి్చంది. జూన్‌లో బజాజ్ ఆటో 2,22,439 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. గతేడాది జూన్‌తో పోలిస్తే బజాజ్ విదేశీ సేల్స్ 49 శాతం పెరిగాయి.విదేశీ వృద్ధి ఇంజిన్... టీవీఎస్‌కు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వ్యాపారమే కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా మారుతోంది. కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం, 90కి పైగా దేశాల్లో టీవీఎస్ బైక్‌లు, స్కూటర్లు పరుగులు తీస్తున్నాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలు పటిష్టమైన విదేశీ మార్కెట్లుగా నిలుస్తున్నాయి. తద్వారా టీవీఎస్ టూవీలర్ రంగంలో గ్లోబల్ కంపెనీగా ఎదుగుతోంది. వార్షిక అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టూవీలర్ తయారీదారుగా ఆవిర్భవించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో 25 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల ద్వారానే లభించడం దీనికి నిదర్శనం.ఎలక్ట్రిక్‌లోనూ టాప్ స్పీడ్...ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో కూడా టీవీఎస్ ఓ రేంజ్లో దుమ్మురేపుతోంది. జూన్‌లో ఏకంగా 48,537 ఈ–సూ్కటర్లను విక్రయించింది. దేశవ్యాప్తంగా 1,93,495 లక్షల ఈ–టూవీలర్లు అమ్ముడవగా.. టీవీఎస్ 24 శాతం పైగా మార్కెట్ వాటాతో టాప్‌లో నిలిచింది. తర్వాత స్థానాల్లో బజాజ్ (22%), ఏథర్(16%), హీరో విడా(11%) ఉన్నాయి. ఒకప్పుడు నంబర్ వన్‌లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 8% వాటాతో ఐదో స్థానానికి పడిపోయింది. -
రూ.2,000 కోట్లతో నెక్స్ట్ భారత్ వెంచర్స్ భారీ పెట్టుబడులు
భారతదేశంలో సామాజిక శ్రేయస్సు, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్ కార్పొరేషన్’ మద్దతుగల ‘నెక్స్ట్ భారత్ వెంచర్స్ ఐఎఫ్ఎస్సీ ప్రైవేట్ లిమిటెడ్’ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. దేశీయ స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు ఏకంగా రూ.2,000 కోట్ల నిధితో కూడిన రెండో ‘ఇంపాక్ట్ ఫండ్’ను ప్రకటించింది. వ్యవసాయం, ఆర్థిక సమ్మేళనం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్), ఆరోగ్య సంరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో సామాజిక మార్పు కోసం పనిచేసే స్టార్టప్‌లకు ఈ నిధుల ద్వారా ఆర్థిక చేయూత లభించనుంది.గతంలో కేటాయించిన మొదటి ఫండ్ (రూ.340 కోట్లు) ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 20కి పైగా సామాజిక ప్రభావం చూపే సంస్థలలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.మూడేళ్లలో నిధుల మోహరింపుతాజా రెండో ఫండ్‌కు సంబంధించి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన పెట్టుబడిదారుగా వ్యవహరిస్తుందని, దీనితో పాటు జపాన్‌కు చెందిన మరికొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కూడా నిధులు సేకరించనున్నట్లు నెక్స్ట్ భారత్ వెంచర్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విపుల్ జిందాల్ నాథ్ వెల్లడించారు.ఈ నిధుల కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ఈ రూ.2,000 కోట్లను వ్యూహాత్మకంగా పెట్టుబడిగా పెట్టనున్నాం. ప్రాథమికంగా గ్రామీణ భారతదేశంలోని స్థానిక ప్రజలు, టైర్-2, టైర్-3 పట్టణాలు, లేదా నగరాల్లోని అనధికారిక, గిగ్ ఎకానమీ కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే స్టార్టప్‌లకే మా ప్రాధాన్యత. దీనివల్ల వ్యవసాయం, అగ్రిటెక్, హెల్త్‌కేర్, హెల్త్-టెక్, స్థిరమైన జీవనోపాధి కల్పించే రంగాలు సహజంగానే లబ్ధి పొందుతాయి’ అని విపుల్ జిందాల్ నాథ్ చెప్పారు.15 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితిసాధారణ వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్ల కాలపరిమితి 12 ఏళ్లు ఉంటే, నెక్స్ట్ భారత్ వెంచర్స్ తమ ఫండ్ కాలపరిమితిని 15 ఏళ్లుగా నిర్ణయించింది. దీనిపై నాథ్ స్పందిస్తూ.. జపాన్ సంస్థలు పెట్టుబడుల విషయంలో ఎంతో ఓపికగా వ్యవహరిస్తాయని, సామాజిక మార్పును ఆశించే స్టార్టప్‌లకు స్థిరపడటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ వృద్ధి రేటు ఒక్కసారిగా హైపర్ గ్రోత్ మోడ్‌లో కాకుండా, క్రమంగా స్థిరంగా సాగుతుందన్నారు.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!
భారత్‌లో E20 పెట్రోల్‌పై పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో.. మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ వాహనాల్లో E20 వినియోగంపై కీలక స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కంపెనీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో, తమ వాహనాల్లోని ఇంజిన్లు ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని వాహనాలు E20తో పనిచేస్తాయని పేర్కొంది. అయితే.. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.2025 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలు కూడా E20 పెట్రోల్‌తో సురక్షితంగానే నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మైలేజీలో లేదా పికప్‌లో చిన్న మార్పులు కనిపించవచ్చని పేర్కొంది.ఈ20 పెట్రోల్ ఇంజిన్‌కు హాని చేయదు, కేవలం ఇంధనంలో ఎనర్జీ కంటెంట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం మాత్రమే ఉంటుందని మహీంద్రా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో E20పై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది.ఇతర కంపెనీల స్పందనE20 పెట్రోల్ విడుదలను సమర్థిస్తూ టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రభుత్వ పత్రికా సమావేశం జరిగిన కొద్దిసేపటికే మహీంద్రా ఈ వివరణ ఇచ్చింది.అయితే కొంతమంది వాహన వినియోగదారులు మైలేజీ తగ్గిందని చెబుతున్నారని కూడా వారు అంగీకరించారు. -
E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు!
దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగానే E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే.. ఈ నిర్ణయం పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల లోకల్‌సర్కిల్స్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22,567 మంది పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది E20 పెట్రోల్ అమలు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ E20 అమలు విధానాన్ని తప్పుబట్టారు. 42 శాతం మంది ఈ విధానాన్ని విపత్తుగా అభివర్ణించారు. కొంతమంది మాత్రమే ప్రభుత్వ చర్యలను మెచ్చుకున్నారు.2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను వినియోగిస్తున్న యజమానుల్లో 66 శాతం మంది E20 పెట్రోల్ వాడిన తర్వాత తమ వాహనాల మైలేజీ 10 శాతం కంటే ఎక్కువ తగ్గిందని తెలిపారు. ఇథనాల్ శక్తి సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. తక్కువగా ఉండటంతో, అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాత వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది తమ వాహనాల్లో విడిభాగాలు అరిగిపోవడం, మరమ్మతుల అవసరం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇథనాల్‌కు అనుకూలంగా రూపొందించని పాత ఫ్యూయల్ పైపులు, రబ్బరు సీల్స్, గ్యాస్కెట్లు, ఫ్యూయల్ పంప్ వంటి భాగాలపై ప్రభావం పడే అవకాశముందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.భారత్‌లో 2023 ఏప్రిల్‌కు ముందు తయారైన చాలా పెట్రోల్ వాహనాలు E10 (10 శాతం ఇథనాల్) మిశ్రమానికి అనుగుణంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలే పూర్తిగా E20కు అనుకూలంగా తయారవుతున్నాయి. కాబటి ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కోట్లాది పాత వాహనాల యజమానులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని సర్వే సూచిస్తోంది.సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. 2023కు ముందు తయారైన వాహనాల యజమానుల్లో 31 శాతం మంది, ధర ఎక్కువైనా E0 (ఇథనాల్ లేని పెట్రోల్) లేదా E10 పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఉంటే దానినే ఎంచుకుంటామని తెలిపారు. అంటే.. ప్రజలు ఇథనాల్ మిశ్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించడం కాదు. తమ వాహనానికి సరిపోయే ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. -
ఒక్కసారిగా రూ.60 వేలు.. పెరిగిన విండ్సర్ ఈవీ ధర!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఎంజీ ఇండియా (MG India) తన విండ్సర్ ఈవీ (Windsor EV) ధరలను పెంచింది. జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల కియా, టయోటా వంటి ఇతర వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్ల ధరలను పెంచిన నేపథ్యంలో ఎంజీ కూడా ఇదే బాటలో నడిచింది.ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఎక్స్సైట్ బేస్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.60,000 పెంపు జరిగింది. దీంతో దీని ధర రూ.14.10 లక్షల నుంచి రూ.14.70 లక్షలకు చేరింది. ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.46,900 పెరిగి రూ.16 లక్షలకు చేరగా, ఎసెన్స్ వేరియంట్ కూడా అదే మొత్తంతో పెరిగి రూ.17 లక్షలకు చేరింది.ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్ ధర రూ.52,000 పెరిగి రూ.17.90 లక్షలకు చేరుకుంది. టాప్ వేరియంట్ అయిన ఎసెన్స్ ప్రో ధర రూ.40,000 పెరిగి రూ.19 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం మీద వేరియంట్లను బట్టి ధరల పెంపు 2.15 శాతం నుంచి 4.26 శాతం వరకు పెరిగిందని స్పష్టమవుతోంది. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా?, లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్! -
హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!
జూలై 2026 నెలలో హోండా కార్స్ ఇండియా.. ఎంపిక చేసిన కొన్ని కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను, ప్రయోజనాలను ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్ కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.హోండా ఎలివేట్ కారుపై కంపెనీ గరిష్టంగా రూ.2.15 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 40,000 వరకు నగదు తగ్గింపు, రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనం, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా హోండా ఎలివేట్ ధరలు రూ. 11.60 లక్షల నుంచి రూ. 16.16 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ క్రెటా , కియా సెల్టోస్ , టాటా సియెర్రా, మారుతి విక్టోరిస్, మారుతి గ్రాండ్ విటారా, రెనాల్ట్ డస్టర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.సెడాన్ల విభాగంలో కొత్త హోండా అమేజ్ కొనుగోలుపై రూ. 67,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హోండా అమేజ్ సెకండ్ జనరేషన్ మోడల్ మీద రూ. 58,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కొనుగోలుపైన ఎలాంటి తగ్గింపులు లేదు. ఎందుకంటే ఈ కారు ఇటీవలే షోరూమ్‌లలోకి వచ్చింది.Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ లేదా ప్రయోజనాలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మీరు కొనే కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అనే వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించాలి. -
డీజిల్‌లో కొత్త ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా ఎదగడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో దిగుమతి చేసే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబ్యుటనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కలిపే చర్యలు జరుగుతున్నాయి. అయితే.. ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపడం సాధ్యం కాదు. కాబట్టి ఇథనాల్ నుంచే ఐసోబ్యుటనాల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించాలనే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన తెలిపారు. ఐసోబ్యుటనాల్ డీజిల్‌కు బదులుగా ఉపయోగపడగల సమర్థవంతమైన ఇంధనమని ఆయన పేర్కొన్నారు.ఈ కొత్త ఇంధన మిశ్రమంపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో వాహన ఇంజిన్లను కూడా ఈ ఇంధనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు.ఐసోబ్యుటనాల్‌ను తరువాతి తరం బయోఫ్యూయల్‌గా పరిగణిస్తున్నారు. దీనికి అధిక ఎనర్జీ డెన్సిటీ ఉండటం, ఇంజిన్లతో మెరుగైన అనుకూలత కలిగి ఉండటం, తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేయడం వంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఈ ఇంధనాన్ని విస్తృతంగా ఉపయోగిస్తే.. భారత్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. దేశంలో బయోఫ్యూయల్ ఉత్పత్తికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడనున్నాయని భావిస్తున్నారు.కాగా ఇప్పటికే.. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే విజయవంతం చేసింది. దీనివల్ల దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గిందని, రైతులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడ్డాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం! -
రూ.5 కోట్ల కారుతో పిల్లల ఆటలు.. కోర్టుకెక్కిన యజమాని!
పిల్లల చేష్టలు ఒక్కోసారి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. ఇలాగే చైనాలో నలుగురు చిన్నారులు రూ.5 కోట్లకు పైగా విలువైన ఫెరారీ సూపర్‌కార్‌ను ఆటబొమ్మగా మార్చి ధ్వంసం చేసిన ఘటన సంచలనంగా మారింది. పిల్లల తల్లిదండ్రులు తగిన పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో కార్ యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కారంతా గీతలే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరంలో జరిగింది. వ్యాపార పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో యజమాని తన ఎరుపు రంగు ఫెరారీ 488 జీటీబీ కారును ఆరుబయట పార్క్ చేశాడు. అతను తిరిగి వచ్చేసరికి పొరుగింటికి చెందిన 10 ఏళ్లలోపు నలుగురు పిల్లలు కారుపై ఎక్కి చిందరవందర చేసేశారు. కారు గ్లాస్‌పై జారుడు బల్లలా ఆడుకున్నారు. వెదురు కర్రలతో కారంతా గీతలు పెట్టేశారు.కారు హుడ్, టాప్, ఫెండర్లు, టెయిల్లైట్లు, కిటికీలు సహా పలు భాగాలపై లోతైన గీతలు కనిపించాయి. ముందు బంపర్ కూడా చీలినట్లు వెల్లడైంది. స్థానిక రిపేర్ సెంటర్ల అంచనా ప్రకారం ఒరిజినల్ పార్ట్స్‌తో మరమ్మతులకు సుమారు 1 లక్ష యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) వరకు ఖర్చవుతుందని సమాచారం. ప్రత్యామ్నాయ ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాలు ఉపయోగిస్తే ఈ వ్యయం కాస్త తగ్గే అవకాశం ఉంది.రూ.60 వేలే ఇస్తామన్న తల్లిదండ్రులుయజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం రెండు దఫాల చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదు. పిల్లల తల్లిదండ్రులు కేవలం 5,000 యువాన్లు (సుమారు రూ.60 వేల వరకు) మాత్రమే పరిహారంగా చెల్లించేందుకు సిద్ధమని చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. అంతేకాక పిల్లల నుంచి క్షమాపణలు కూడా రాలేదని యజమాని ఆరోపించాడు. దీంతో పూర్తి మరమ్మతు ఖర్చును వసూలు చేసేందుకు సివిల్ దావా వేయాలని నిర్ణయించాడు. -
జూన్‌లో ఎక్కువ మంది కొన్న కారు ఇదే!
భారత ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. వినియోగదారుల అభిరుచుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ (SUV) వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలో కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.జూన్ నెలలో టాటా మోటార్స్ దేశీయంగా మొత్తం 63,083 ప్రయాణికుల వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 37,237 వాహనాలతో పోలిస్తే 69 శాతం వృద్ధి నమోదు చేసింది. ముఖ్యంగా పంచ్, నెక్సాన్, టియాగో కొత్త వెర్షన్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల మోడళ్లకు బుకింగ్‌లు పెరగగా, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా 14,800 యూనిట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించాయి.అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచి 21,006 యూనిట్లు విక్రయించింది. టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మారుతి సుజుకి డిజైర్ 17,899 యూనిట్లతో మూడో స్థానాన్ని దక్కించుకొని, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌గా తన స్థానాన్ని కొనసాగించింది.తరువాత స్థానాల్లో వ్యాగన్ఆర్ (16,952 యూనిట్లు), ఎర్టిగా (16,111 యూనిట్లు), స్విఫ్ట్ (15,215 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (14,097 యూనిట్లు), ఫ్రాంక్స్ (13,135 యూనిట్లు), బాలెనో (12,488 యూనిట్లు), హ్యుందాయ్ వెన్యూ (10,776 యూనిట్లు) నిలిచాయి.టాటా మోటార్స్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నప్పటికీ, టాప్-10 జాబితాలో ఆరు మోడళ్లతో మారుతి సుజుకి ఆధిపత్యాన్ని కొనసాగించింది. డిజైర్, వ్యాగన్ఆర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో మోడళ్లు కలిపి 91,780 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి. ఇది టాప్-10 కార్ల మొత్తం అమ్మకాలలో 57 శాతానికి పైగా ఉండటం విశేషం.ఇదీ చదవండి: E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!ఈసారి టాప్-10 జాబితాలో సాధారణంగా స్థానం సంపాదించే హ్యుందాయ్ క్రెటా కనిపించలేదు. సరఫరాదారుల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఉత్పత్తి తాత్కాలికంగా అంతరాయం కలగడంతో క్రెటా అమ్మకాలు తగ్గాయి. అలాగే కొత్త వెర్షన్ విడుదలకు ముందు మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు కూడా తగ్గడంతో అది కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.జూన్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. భారత వినియోగదారులు ఎస్యూవీ వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. టాప్-10 జాబితాలో పంచ్, నెక్సాన్, స్కార్పియో, ఫ్రాంక్స్, వెన్యూ వంటి ఐదు ఎస్‌యూవీలు చోటు దక్కించుకున్నాయి. అయితే ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, డిజైర్ అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌గా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. -
రూ .4.53 లక్షల ధర.. కొత్త కారు విడుదల
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో 2026 మోడల్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరను రూ.4.53 లక్షలుగా నిర్ణయించింది. ఈ తాజా వెర్షన్లో డిజైన్, క్యాబిన్లో స్వల్ప మార్పులతో పాటు వేరియంట్ లైనప్‌ను కూడా కంపెనీ సరళీకృతం చేసింది. కారు ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు ట్రిమ్‌లలో, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.వేరియంట్లు – ధరలుఎవల్యూషన్ - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.4.53 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.4.90 లక్షలుక్లైంబర్ - 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.5.15 లక్షలు, AMT వేరియంట్ ధర రూ.5.61 లక్షలులైనప్లో మార్పులు2026 అప్డేట్తో ఇప్పటివరకు ఉన్న స్టాండర్డ్, టెక్నో వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. దీంతో క్విడ్ శ్రేణి ఇప్పుడు రెండు ప్రధాన ట్రిమ్లకే పరిమితమైంది. మాన్యువల్ వేరియంట్లకు కంపెనీ అధీకృత డీలర్ల ద్వారా రెట్రోఫిట్ సీఎన్జీ కిట్ కూడా అందిస్తోంది. దీని అదనపు ధర రూ.70,450గా నిర్ణయించారు.కొత్త 2026 క్విడ్‌లో 3డీ రెనాల్ట్ లోగో, 14 అంగుళాల స్టీల్ వీల్స్‌కు కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్‌గేట్‌పై సిల్వర్ ఫినిష్‌తో 'KWID' లెటరింగ్ వంటి మార్పులు చేశారు. అయితే LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, ముందు-వెనుక బంపర్ల డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.క్యాబిన్లో కొత్త స్టీరింగ్ వీల్ఇంటీరియర్లో ప్రధాన మార్పు రెనాల్ట్ కైగర్ నుంచి తీసుకొచ్చిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇందులో ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్‌ను కూడా సమీకరించారు. అలాగే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ, పవర్ విండోలు వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.భద్రతా పరంగా ఎవల్యూషన్ ట్రిమ్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, క్లైంబర్ వేరియంట్లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. అదనంగా రియర్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), AMT వేరియంట్‌కు హిల్ స్టార్ట్ అసిస్ట్, EBDతో కూడిన ABS, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.కొత్త క్విడ్‌లో ఇప్పటికే ఉన్న 1.0 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్నే కొనసాగించారు. ఇది 69 బీహెచ్పీ పవర్, 92.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఎంపికలు లభిస్తాయి.భారత ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రెనాల్ట్ క్విడ్‌కు ప్రధాన ప్రత్యర్థులుగా మారుతి సుజుకి ఆల్టో K10, మారుతి సెలెరియో వంటి మోడళ్లు ఉన్నాయి. తక్కువ ధర, ఆధునిక ఫీచర్లు, సీఎన్జీ ఎంపిక వంటి అంశాలతో ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే.. -
E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!
ఈ20 ఫ్యూయెల్ గురించి సోషల్ మీడియాలో అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా E20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతే కాకుండా.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన స్పందించారు.E20 ఫ్యూయెల్ అంటే?E20 ఫ్యూయెల్ అంటే.. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (Biofuel). దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది.ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా?ఈ20 ఫ్యూయెల్ వాడితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకరించారు. అయితే.. ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై స్పష్టతఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తలను మంత్రి పూర్తిగా ఖండించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలులో ఉంది. భవిష్యత్తులో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం (E25, E27, E30) ప్రవేశపెట్టే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుకు ముందు అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన BIS ప్రమాణాలను రూపొందించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని, వెంటనే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ఉద్దేశం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఈ80 ఫ్యూయెల్ వినియోగించడానికి అనుకూలమైన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
లాంచ్‌కు ముందే అమ్ముడైపోయాయ్!: ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కొడియాక్ ఆర్ఎస్' కారును స్కోడా ఆటో ఇండియా దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) ద్వారా దిగుమతి చేసుకుంటుంది.స్కోడా లాంచ్ చేసిన ఈ కొత్త కొడియాక్ ఆర్ఎస్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత.. ఆరు నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడైపోయాయి. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో దీనికున్న డిమాండ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.స్కోడా కొడియాక్ ఆర్ఎస్ కార్లను కంపెనీ మన దేశానికి కేవలం 50 యూనిట్లను మాత్రమే పరిమితం చేసింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా పనిచేసే ఈ లేటెస్ట్ మోడల్ 265 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.స్కోడా కొడియాక్ ఆర్ఎస్ 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీంతో ఇది భారతదేశంలో ఇప్పటివరకు లాంచ్ అయిన అత్యంత వేగవంతమైన స్కోడా మోడల్‌గా నిలిచింది. ఆర్ఎస్ వేరియంట్లో ప్రోగ్రెసివ్ స్టీరింగ్, 15 అడ్జస్టబుల్ సెట్టింగ్‌లతో కూడిన అడాప్టివ్ డాంపర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇది చూడటానికి స్టాండర్డ్ కొడియాక్ మాదిరిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్గ్రేడ్లను పొందుతుంది. వీటిలో రీడిజైన్ బంపర్లు, ఆర్ఎస్ బ్యాడ్జింగ్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెద్ద రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి ఉన్నాయి. గ్రిల్, ORVMలు, విండో ఫ్రేమ్‌లు, రూఫ్ రైల్స్, డీ-పిల్లర్ అంతటా గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించారు. ఈ SUV వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్, మూన్ వైట్, స్టీల్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. కొడియాక్ ఆర్ఎస్ కారులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆర్ఎస్ స్పెషల్ గ్రాఫిక్స్‌తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్, హీటింగ్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 13-స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఈ SUVలో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ సిస్టం వంటివి ఉన్నాయి. ఇది ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్‌కు పోటీగా ఉంది. -
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు రూ.11 లక్షలకే..
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘క్రెటా ఎలక్ట్రిక్’ కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో బ్యాటరీ ధరను వాహనం ధర నుంచి వేరు చేయడం ద్వారా క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.10.99 లక్షలకు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానాన్ని కంపెనీ తాజాగా అధికారికంగా ప్రకటించింది.ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో అధిక ప్రారంభ వ్యయం ప్రధాన అడ్డంకిగా ఉండేది. కొత్త బాస్ మోడల్లో వినియోగదారులు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ లేదా ఈఎంఐ విధానాన్ని ఎంచుకోవచ్చు. హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాటరీ ఈఎంఐ ఖర్చు కిలోమీటరుకు రూ.3.90 నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గి, ఈవీ యాజమాన్యం మరింత అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.ఫీచర్లలోనూ అప్డేట్బాస్ మోడల్‌తో పాటు క్రెటా ఎలక్ట్రిక్‌లో కొన్ని కొత్త ఫీచర్లను కూడా హ్యుందాయ్ జోడించింది. అన్ని సంబంధిత వేరియంట్లలో ‘ఇంటిగ్రేటెడ్ సైడ్ ఫుట్ స్టెప్’ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వాహనంలోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హోమ్ ఛార్జర్ వేరియంట్లలో 7.4 కిలోవాట్ల వాల్‌బాక్స్ ఛార్జర్‌ను ప్రామాణికంగా అందిస్తోంది.రెండు బ్యాటరీ ప్యాక్‌లు.. 510 కి.మీ వరకు రేంజ్క్రెటా ఎలక్ట్రిక్‌లో 42 కిలోవాట్లు, 51.4 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్యాటరీతో కూడిన లాంగ్-రేంజ్ వేరియంట్‌కు ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 510 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ARAI సర్టిఫైడ్) లభిస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. లాంగ్-రేంజ్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది.ప్రీమియం టెక్నాలజీ ఫీచర్లుక్రెటా ఎలక్ట్రిక్‌లో వెహికల్-టు-లోడ్ (V2L), హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవల్-2 ADAS, ఐ-పెడల్ సింగిల్ పెడల్ డ్రైవింగ్, డిజిటల్ కీ, యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ కూడా కంపెనీ అందిస్తోంది.ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణదేశంలో ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హ్యుందాయ్ తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 183 ప్రాంతాల్లో 214 డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మొత్తం 399 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే మైహ్యుందాయ్ యాప్‌లోని ఈవీ ఛార్జ్ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వినియోగదారులు గుర్తించి ఉపయోగించుకోవచ్చని తెలిపింది. -
ఈవీ ఛార్జింగ్‌కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో సురక్షితంగా ఈవీలను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 45 శాతం ఇళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను అప్‌గ్రేడ్ (ఆధునీకరణ) చేయాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (ఏఈఈఈ), ఈవీ ఛార్జింగ్ ప్లాట్‌ఫామ్ ‘కజామ్’ భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది నెట్–జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ అట్ హోమ్: ఎనేబ్లింగ్ ఈవీ–రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు. టైర్–1, టైర్–2, టైర్–3 నగరాల్లోని స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాలు, అద్దె ఇళ్లతో సహా సుమారు 80,000 పైగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఈవీ ఛార్జర్ల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదికలోని ముఖ్యాంశాలు:∙దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్‌లో ఈవీల వాటా 2024లో కేవలం 0.2%గా ఉండగా, 2035 నాటికి అది దాదాపు 6%కి పెరిగే అవకాశం ఉందని అంచనా. ∙ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.∙సరైన మౌలిక వసతులు, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చాలామంది సాధారణ విద్యుత్ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్టెన్షన్ వైర్లు, ఇతర షేర్డ్ కనెక్షన్ల ద్వారా ప్రమాదకరమైన పద్ధతుల్లో ఛార్జింగ్ చేస్తున్నారు. నిరంతర ఈవీ ఛార్జింగ్ లోడ్‌ను భరించేలా ఇవి రూపొందించకపోవడంతో షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. ఇలాంటి పద్ధతుల వల్ల ఛార్జింగ్ విశ్వసనీయత తగ్గడంతో పాటు ఛార్జింగ్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాహన బ్యాటరీ సామర్థ్యం కూడా వేగంగా క్షీణించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లునివేదిక సూచనలు: ఇళ్ల వద్ద ఈవీలను సురక్షితంగా, విశ్వసనీయంగా, సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు ప్రతి ఇల్లు కనీస భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలని నివేదిక సూచించింది. నిరంతర ఛార్జింగ్ లోడ్‌ను తట్టుకునేందుకు తగినంత విద్యుత్ లోడ్ (సాంక్షన్డ్ లోడ్)తో పాటు ప్రత్యేక ఛార్జింగ్ సర్క్యూట్ ఉండాలని పేర్కొంది. అలాగే ప్రమాణాలకు అనుగుణమైన వైరింగ్, సరైన ఎర్తింగ్, అగి్నప్రమాద భద్రతా నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రదేశంలో ఛార్జర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. అదనంగా తగిన సామర్థ్యం గల ఎంసీబీలు, ఎర్త్–లీకేజ్ ప్రొటెక్షన్ వ్యవస్థ, అలాగే నిరంతర ఛార్జింగ్ లోడ్‌ను తట్టుకునే సరి్టఫైడ్ (ధృవీకరించిన) ప్రత్యేక ఈవీ సబ్–మీటర్‌ను ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేసింది. ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట! -
కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లు
కియా ఇండియా (Kia India) తన పాపులర్ ఎస్యూవీ సెల్టోస్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా జీటీఎక్స్(ఓ) (GTX(O)), ఎక్స్-లైన్(ఓ) (X-Line(O)) అనే టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 21.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో, ఇప్పటివరకు టాప్‌లో ఉన్న GTX(A), X-Line(A) వేరియంట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయి.సెల్టోస్ ప్రస్తుత బేస్ మోడల్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనసాగుతుండగా, కొత్త టాప్ వేరియంట్లు ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీతో మరింత హైఎండ్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ కొత్త వేరియంట్లలో ప్రధాన ఆకర్షణగా ADAS Level 2 F+ సూట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ క్రాస్ కొలిజన్ కంట్రోల్, లేన్ చేంజ్ అలర్ట్స్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మార్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఫీచర్ల పరంగా కూడా ఈ వేరియంట్లు మరింత ప్రీమియంగా ఉన్నాయి. కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ సపోర్ట్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే (HUD), AQI డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే మొబైల్ యాప్ ద్వారా నియంత్రించగల ఫ్రంట్–రియర్ డాష్‌క్యామ్‌లు వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా రైన్-సెన్సింగ్ వైపర్లు, వన్-టచ్ పవర్ విండోస్, కియా కనెక్ట్ 2.0 ద్వారా 85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.మార్కెట్లో ఈ అప్‌గ్రేడ్‌తో సెల్టోస్ పోటీ మరింత పెరిగింది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో నేరుగా పోటీ పడుతోంది.ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, సెల్టోస్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 బిహెచ్పి), 1.5 లీటర్ డీజిల్ (116 బీహెచ్పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 బీహెచ్పీ) ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, సివిటి, ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. -
665 కిమీ రేంజ్.. టాటా సియెర్రా ఈవీ లాంచ్!
టాటా మోటార్స్ ఎట్టకేలకు తన సియెర్రా EVను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు జులై 15 నుంచి మొదలవుతాయని సమాచారం.కొత్త సియెర్రా ఈవీ.. స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నమైన డిజైన్ పొందుతుంది. ఇందులో బాడీ రంగులో ఉండే క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, కొన్ని ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ పొందాయి. కాగా ఇది రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టీన్ వైట్, అండమాన్ అడ్వెంచర్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్ అనే మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని లేఅవుట్ సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్ప్లేతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ జాబితాలో.. వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అటానమస్ పార్కింగ్ అయిన ఈ-వ్యాలెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ కారులో స్టాండర్డ్, ఇమ్మర్సివ్, పర్సనల్, స్నో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. భద్రతా ఫీచర్ల జాబితాలో, ఈ కారు ADAS లెవెల్ 2 ఫీచర్లు, ESP, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీ కెమెరా ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!టాటా సియెర్రా EV రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. వీటిలో వెనుక భాగంలో 175 kW మోటార్, ముందు భాగంలో 103 kW మోటార్ ఉన్నాయి. వెనుక మోటార్ 240 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. ముందు మోటార్ 164 Nm టార్క్ అందిస్తుంది. దీని ఫలితంగా మొత్తం 504 Nm గరిష్ట టార్క్ లభిస్తుంది..ఇది 75 kWh, 63 kWh బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికలలో లభిస్తుంది. 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 665 కి.మీ. రేంజ్ అందిస్తే, 63kWh వెర్షన్ 565 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ తగ్గుతుంది. ఈ బ్యాటరీలను 120 kW, 7.2 kW, 3.3 kW ఛార్జర్లను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్ వినియోగదారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న బైకులను కోరుకుంటారు. ఈ కారణంగానే కమ్యూటర్ బైక్స్ చాలాకాలంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్ (రూ.55,500 - రూ.57,500)టీవీఎస్ స్పోర్ట్ అనేది బడ్జెట్ సెగ్మెంట్లో అత్యంత తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఇది ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ వెళ్లేవాళ్లు, ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది 109.7cc ఇంజిన్‌తో 8.1 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్దగా స్పోర్టీ ఫీచర్లు లేకపోయినా, దీని అసలు బలం మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులోనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపగలిగేలా ఇది చాలా లైట్‌గా ఉంటుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (రూ.58,977 - రూ.71,470)హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత పాపులర్ కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు దీన్ని చాలా మంది మొదటి ఎంపికగా మార్చాయి. ఇందులోని 97.2cc ఇంజిన్ 7.9 హార్స్ పవర్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందించే ఈ బైక్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.బజాజ్ ప్లాటినా 100 (రూ.65,407)బజాజ్ ప్లాటినా 100 అనేది కంఫర్ట్ రైడింగ్ కోసం రూపొందించిన సింపుల్ కమ్యూటర్ బైక్. దీని 99.59cc ఇంజిన్ సుమారు 7.9hp పవర్ అందిస్తుంది. ఈ బైక్ సాఫ్ట్ సస్పెన్షన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. రోడ్లు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఇది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.బజాజ్ ప్లాటినా 110 (రూ.69,284)బజాజ్ ప్లాటినా 110 అనేది ప్లాటినా 100 కంటే కొంచెం అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో 115.45cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6hp పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల హైవే రైడింగ్ కూడా కొంచెం స్మూత్‌గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ 125 (రూ.79,048 - రూ.87,527)పల్సర్ 125 ఈ జాబితాలో స్పోర్టీ లుక్ కలిగిన బైక్. ఇది 124.4cc ఇంజిన్‌తో 11.8hp పవర్ అందిస్తుంది. ఇది కేవలం కమ్యూటర్ బైక్ మాత్రమే కాదు, కొంచెం స్టైల్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఇస్తుంది. డిజైన్ కూడా పెద్ద పల్సర్ 150 మాదిరిగా ఉంటుంది. యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి. -
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ'!
ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్‌లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్‌పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026 -
ఐవెకో కొనుగోలుతో 10 లక్షల వాహనాలు లక్ష్యం!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్స్) మార్కెట్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఐవెకో’ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వార్షిక అమ్మకాల్లో మిలియన్ (10 లక్షలు) యూనిట్ల మార్కును అధిగమించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 29న జరిగిన కంపెనీ రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొన్ని విషయాలను వెల్లడించారు.కమర్షియల్ వెహికల్ బిజినెస్ ప్రత్యేకంగా విడిపోయి స్వతంత్ర సంస్థగా లిస్ట్ అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత ఐవెకో కొనుగోలు టాటా మోటార్స్ అంతర్జాతీయ ఆశయాలకు వేగాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.‘ఐవెకో గ్రూప్ ఏకీకరణతో ప్రాథమికంగానే మా ఉమ్మడి వ్యాపారం 6,00,000 వాహనాల వార్షిక వాల్యూమ్‌తో ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల వాహనాల మార్కును సులభంగా దాటగలము. ఈ వ్యూహాత్మక చర్యతో ప్రపంచవ్యాప్తంగా టాప్-4 అతిపెద్ద కమర్షియల్ వెహికల్ తయారీదారుల సరసన టాటా మోటార్స్ నిలుస్తుంది’ అని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.రెండో త్రైమాసికంలో డీల్ పూర్తిప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి తుది విడత రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తిగా ముగుస్తుందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐవెకోకు ఉన్న అధునాతన పవర్ ట్రెయిన్, నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలపై టాటా మోటార్స్‌కు పూర్తి పట్టు లభిస్తుంది. తద్వారా కంపెనీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం కానుందని చెప్పారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజన్, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 530 bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇది 4.3 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250కిమీ/గం. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కొంత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఎం షాడోలైన్ డీటైలింగ్‌తో కూడిన సన్నని అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వర్టికల్ డబుల్ స్లాట్లు వంటివి మాత్రమే కాకుండా.. ప్రకాశవంతమైన M లోగోతో కూడిన బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎమ్ ఎక్స్టీరియర్ మిర్రర్స్, ఎమ్ స్పెషల్ సైడ్ స్కర్ట్‌లను కలిగి ఉంది. వెనుక వైపు.. సన్నని ఎల్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ SUV రన్ ఫ్లాట్ టైర్లతో కూడిన 21 అంగుళాల ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.లోపలి భాగంలో.. ఒకే గ్లాస్ ప్యానెల్ కింద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరికొత్త బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5తో పనిచేస్తుంది, ఇది బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా టచ్, వాయిస్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది.సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, క్రాష్ సెన్సార్లు, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి. -
క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ డేట్ ఫిక్స్!
రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన అప్డేటెడ్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్‌గా కొనసాగుతూ, దాని లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్లు ఫేస్‌లిఫ్ట్ క్విడ్ పూర్తిస్థాయి రీడిజైన్‌కు బదులుగా సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందుతుందని సూచిస్తున్నాయి. వెహికల్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, టెయిల్ ల్యాంప్‌ల చుట్టూ క్యామోఫ్లాజ్‌తో కనిపించాయి. కాబట్టి ఇది కీలకమైన విజువల్ ఎలిమెంట్స్‌లో అప్డేట్లను సూచిస్తుంది.అప్డేటెడ్ మోడల్లో కొత్త గ్రిల్, బంపర్లు, కొత్త లైటింగ్ అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ డిజైన్ డాసియా స్ప్రింగ్ ఈవీ నుంచి ప్రేరణ పొందవచ్చని, తద్వారా క్విడ్‌ను.. రెనాల్ట్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.లోపలి భాగంలో.. మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కొన్ని చిన్న అప్డేట్లను పొందుతుందని సమాచారం. అధికారిక ఫీచర్ల జాబితా ఏదీ వెల్లడించనప్పటికీ, అప్డేటెడ్ మోడల్లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.ఇంజిన్ పరంగా.. క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 65 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు, కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5 స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి ప్రత్యర్థులతో పోటీని కొనసాగించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన! -
E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ100 (E100) ఇంధనానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో మన దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.E100 ఇంధనంఈ100 అనేది దాదాపు 100 శాతం ఎథనాల్‌తో తయారైన ఇంధనం. ఇందులో సాధారణ పెట్రోల్ ఉండదు. ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. దీనిని చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధనంతో వాహనం పనిచేయాలంటే.. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఉండాలి.ఈ100 ఇంధనం వల్ల లాభాలు➤విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.➤దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది.➤రైతులకు చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.➤గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.➤దేశానికి ఇంధన భద్రత మెరుగుపడుతుంది.#WATCH | Nagpur, Maharashtra: Union Minister Nitin Gadkari says, “Last night at 8 PM, I signed the file, finalising the regulations to legally authorise the use of 100% ethanol. I am delighted to share that I, along with Hardeep Singh Puri, had the opportunity to launch the 100%… pic.twitter.com/BDIyTZGZF4— ANI (@ANI) June 13, 2026ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం వల్ల ఇప్పటికే రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ చమురు దిగుమతి వ్యయం ఆదా కాగా, రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.E100 ఇంధనం పెట్రోల్‌ను పూర్తిగా భర్తీ చేయగలదా?భవిష్యత్తులో E100 పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అది వెంటనే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కోట్లాది కార్లు, బైకులు, స్కూటర్లు ఈ100 ఇంధనాన్ని ఉపయోగించుకునే విధంగా తయారవ్వలేదు. కొన్ని ఈ20 ఇంధనం మాత్రమే ఉపయోగించుకోగలవు. కాబట్టి కొంతకాలం పాటు పెట్రోల్, E100 రెండూ కలిసి ఉపయోగంలో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ E100 వినియోగం కూడా పెరుగుతుంది.E100 ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల వాహనాల్లో ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం. కొత్త ఇంజెక్టర్లు, బలమైన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ పైపులు, ఇథనాల్‌ను తట్టుకునే భాగాలు అవసరం.ఇప్పటికే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ నమూనాను అభివృద్ధి చేసింది. అలాగే టయోటా, ఎంజీ, హ్యుందాయ్, సుజుకి సంస్థలు కూడా ఇలాంటి వాహనాలను తయారు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.E100 ఇంధనం వల్ల వచ్చే సమస్యలు➤ఇథనాల్ శక్తి.. పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ. కాబట్టి అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.➤ప్రస్తుతం ఉన్న సాధారణ వాహనాల్లో ఈ100 ఉపయోగించలేము. ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే అవసరం.➤దేశవ్యాప్తంగా ఈ100 అందించాలంటే పెట్రోల్ బంకుల్లో కొత్త నిల్వ ట్యాంకులు, పంపులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు➤దేశమంతటా ఈ100 అందించే ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.➤ఎక్కువ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలి.➤ఇథనాల్ ఉత్పత్తిని స్థిరంగా పెంచుతూ వ్యవసాయ అవసరాలకు కూడా నష్టం కలగకుండా చూడాలి.➤ప్రజల్లో ఈ100 ఇంధనం గురించి అవగాహన పెంచాలి.భారతదేశం తన అవసరాలకు కావలసిన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇథనాల్ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తోంది. -
కొత్త కారు: సిట్రోయెన్ నుంచి ‘ఎయిర్‌క్రాస్ కంఫర్ట్’ ఎడిషన్
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా, బ్రాండ్ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్యూవీ ‘ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్ బీజ్ లెదరేట్ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్ కంఫర్ట్‌ను మరింత పెంచారు.వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు జోడించారు. భద్రత కోసం ఫ్రంట్ కొలిషన్ హెచ్చరికలు చేసే అడ్వాన్స్డ్ డాష్ క్యా మ్ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్ బు కింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో, అధికారిక డిజిటల్ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. -
పాత కార్లకు E20 పెట్రోల్ ప్రమాదమేనా?
ప్రభుత్వం ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్+ 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. దేశం తన ఈ20 లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడంతో, ఈ ఇంధనం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అయితే వాహన యజమానుల్లో 'E20 పెట్రోల్ వాడితే ఇంజిన్‌కు నష్టం జరుగుతుందా?' అనే అనుమానం మాత్రం అలాగే ఉంది.నిపుణుల ప్రకారం.. అన్ని వాహనాలకు ఈ20 పెట్రోల్ హానికరం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలు ఇప్పటికే ఈ20 ఇంధనానికి అనుగుణంగా తయారయ్యాయి. ఈ కార్లు ఈ ఫ్యూయల్‌తో సజావుగా పనిచేస్తాయి. కానీ 2023కి ముందు తయారైన పాత వాహనాలు సాధారణంగా ఈ10 లేదా ప్యూర్ పెట్రోల్‌కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వాటిలో ఈ20 వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.పాత వాహనాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం.. ఇథనాల్ స్వభావం. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఫ్యూయల్ ట్యాంక్‌లో తేమ చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లో మురికి పేరుకుపోయి పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ తక్కువగా ఉండటంతో మైలేజ్ కొంత తగ్గుతుంది.ఇదీ చదవండి: రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీఅయితే.. పాత వాహన యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ20 వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్యూయల్ అడిటివ్స్ వాడడం ఒక సులభమైన మార్గం. ఇవి ఇంధనంలోని ఇథనాల్ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలవు. అలాగే.. పాత ఫ్యూయల్ లైన్స్‌ను PTFE లేదా బ్రైడెడ్ స్టీల్ లైన్స్‌తో మార్చడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు. ఇంజిన్ సీల్స్‌ను విటాన్ వంటి మెటీరియల్స్‌తో అప్‌గ్రేడ్ చేయడం కూడా ఉపయోగకరం.మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వాహనాల్లో తుప్పు రాకుండా స్పెషల్ కోటింగ్ చేయించుకోవచ్చు. వాహనాల్లో ఈసీయూ ట్యూనింగ్ లేదా అప్డేటెడ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ20 అనుకూలతను మెరుగుపరచవచ్చు. కాబట్టి పాత వాహనాలను ఉపయోగించేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
లీటరుకు 71 కిమీ మైలేజ్.. ఈ బైక్ ధర ఎంతంటే?
హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ అయిన ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇది ఫీచర్ అప్గ్రేడ్లతో పాటు మెరుగైన భద్రతను అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దీని ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).కొత్త వేరియంట్లో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్‌కు బదులుగా.. ముందు వైపు డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. ఈ అప్‌గ్రేడ్ ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చే పట్టణ ప్రాంతాల్లో, మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులో ఉంది.బ్రేకింగ్ అప్‌గ్రేడ్‌తో పాటు, ప్యాషన్ ప్లస్ డిస్క్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. ఈ కన్సోల్‌లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్స్, కాల్ అండ్ SMS అలర్ట్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి కూడా ఉన్నాయి.మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి అదే 100 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 5.9 కిలోవాట్ల పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హీరో ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో కలిసి పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ 71 కిమీ/లీ మైలేజ్ ఉస్తుందని కంపెనీ చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం! -
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
సిటీలో రోజూ 50–60 కిలోమీటర్ల జర్నీ.. వారాంతాల్లో విహారానికి అలా 300–400 కిలోమీటర్ల లాంగ్ రైడ్‌కు వెళ్లి రావాలి! ఎలక్ట్రిక్ కారు కొంటేనేమో దూర ప్రయాణాలకు రేంజ్ సమస్యతో పాటు చార్జింగ్ సదుపాయాలు ఇంకా సరిగ్గా అందుబాటులో లేవు. పోనీ పెట్రోలు కారైతే సిటీలో మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ. మరి అటు నగర ప్రయాణాలకు పూర్తి ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్.. ఇటు పెట్రోలు కారులా ఎంత దూరమైనా ప్రయాణించే చాన్సుంటే? ఒకే కారులో ఈ రెండు ఆప్షన్లు దొరికితే? అలాంటి వారి కోసమే ఇప్పుడు ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు (పీహెచ్ఈవీ) దూసుకొస్తున్నాయి. విదేశీ వాహన దిగ్గజాలతో పాటు దేశీ కంపెనీలు కూడా ఈ హైబ్రిడ్ మోడళ్లను తీసుకొచ్చేందుకు సై అంటున్నాయి. భారత్‌లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ)పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. చార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాల్లో బ్యాటరీ అయిపోతుందేమోనన్న భయం కొనుగోలుదారులను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఈవీ ఎకోసిస్టమ్ పూర్తిగా ఏర్పాటయ్యేందుకు చాలా ఏళ్లే పట్టేలా ఉంది. దీనికి మధ్యేమార్గంగా ఆటోమొబైల్ కంపెనీలు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లపై ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ పాపులర్ ఎస్–క్లాస్‌లో తొలి పీహెచ్ఈవీ మోడల్ ‘ఎస్450ఈ’ని ప్రవేశపెట్టింది. దీనిలోని బ్యాటరీ పవర్ 110 కిలోమీటర్ల రేంజ్ (ఒక్కసారి పూర్తి చార్జింగ్‌తో ప్రయాణించే దూరం) అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో ఎంచక్కా నచ్చినంత దూరం జర్నీ చేయొచ్చు. మెర్సిడెస్‌తో పాటు బీఎండబ్ల్యూ, వోల్వో వంటి లగ్జరీ కార్ల దిగ్గజాలు ప్రస్తుతం మన దగ్గర పీహెచ్ఈవీలను విక్రయిస్తున్నాయి.రేట్లు ఎక్కువే.. జీఎస్టీ తగ్గాలిఈవీలతో పోలిస్తే ప్రస్తుతం పీహెచ్ఈవీలు ఉపయోగకరమే అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రేట్లే ప్రధాన అడ్డంకి. పెట్రోల్ కార్లతో పోలిస్తే వీటి ధర సుమారు రూ. 15 లక్షలు ఎక్కువగా ఉంటోంది. చాలావరకు ప్రీమియం, లగ్జరీ విభాగంలోనే కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి. వీటి ధరలు రూ.90 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల రేంజ్లో ఉన్నాయి. మాస్ మార్కెట్‌కు అందుబాటులో లేవు. దీనికి తోడు ఈవీలకు 5 శాతం జీఎస్టీ ఉండగా.. పీహెచ్ఈవీలపై 40 శాతం ఫ్లాట్ జీఎస్టీ విధింపు వల్ల కూడా కొనుగోలుదారులపై అధిక భారం పడుతోంది. అందుకే వీటినీ ఈవీ కేటగిరీలోకి చేర్చాలనేది కంపెనీల డిమాండ్. కాగా, ధరలు తగ్గాలంటే స్థానిక అసెంబ్లింగ్ కూడా కీలకం. పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల సుంకాల మోత మోగుతోంది. అందుకే సీకేడీ (వాహన విడిభాగాలను) దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేయడం వల్ల కూడా ధరలు భారీగా దిగొచ్చే అవకాశం ఉంటుంది.ప్లగ్–ఇన్ హైబ్రిడ్ అంటే...ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లలో విద్యుత్ మోటార్‌తో పాటు పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. ఇందులోని బ్యాటరీని ఇంట్లో లేదా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ ద్వారా చార్జ్ చేయవచ్చు. బ్రేకులు వేస్తున్నప్పుడు కూడా కొంత పవర్ తిరిగి బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇక బ్యాటరీ చార్జింగ్ తగ్గినప్పుడు లేదా ఎక్కువ దూరం వెళ్లాల్సి వచి్చనప్పుడు పెట్రోల్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్లగ్ఇన్ హైబ్రిడ్ల రేంజ్ సుమారు 50–120 కిలోమీటర్లు. మన దేశంలో రోజువారీ సిటీ జర్నీ సుమారు 40–50 కిలోమీటర్ల మధ్యే ఉంటుంది. కాబట్టి పీహెచ్ఈవీలతో ఇంధన ఖర్చు దిగొస్తుంది. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే బ్యాటరీ అయిపోయాక పెట్రోల్ మోడ్‌లోకి మారడమే. ఇక మారుతీ గ్రాండ్ విటారా, హోండా సిటీ వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లలో పెట్రోలు ఇంజిన్లు సెల్ఫ్ చార్జింగ్ ద్వారా స్వయంగా కొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని స్టోర్ చేసుకుంటాయి. వీటిని బయటి నుంచి చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఎలక్ట్రిక్ మోడ్‌లో ఇవి 1–3 కిలోమీటర్లే వెళ్లగలవు. కారు స్టార్ట్ చేసేటప్పుడు, సిగ్నల్స్ వద్ద ఇవి బ్యాటరీ పవర్‌ను వాడుకుంటాయి. దీనివల్ల కొద్దిగా ఇంధనం ఆదా అవుతుంది.చైనా చలువతో మాస్మార్కెట్లోనూ...ఇప్పటిదాకా లగ్జరీ సెగ్మెంట్‌కే పరిమితమైన ఈ హైబ్రిడ్ కార్లు.. చైనా కంపెనీల చలువతో ఇకపై మాస్ మార్కెట్‌కు కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా బీవైడీ ‘సీల్ యూ’తో పాటు జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ – చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ‘జెటూర్ టీ2’ ఎస్యూవీ రిలీజ్ కోసం కారు ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ పెట్రోల్ ఇంజిన్ పవర్‌తో పాటు 120 కిలోమీటర్ల పైగా బ్యాటరీ రేంజ్ ఉండటం విశేషం. సీల్ యూలో పెట్రోలు ఫుల్ ట్యాంక్, బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే.. 1,200 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకుపోవచ్చు. జెటూర్ టీ2 అయితే పెట్రోల్+ఎలక్ట్రిక్ రేంజ్ 1,000 కి.మీ. అంతేకాదు, వీటి ధరలు సైతం రూ.45–50 లక్షల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. మరోపక్క జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ సైతం ఎస్యూవీ 520 పీహెచ్ఈవీని ప్రవేశపెడుతోంది. ఇది కూడా చైనా జాయింట్ వెంచర్ సెయిక్–జీఎం–వులింగ్ (ఎస్జీఎండబ్ల్యూ) స్టార్‌లైట్ 560 క్రాసోవర్ ఎస్యూవీ రీబ్యాడ్జ్డ్ వెర్షన్. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైదరాబాద్‌లో టాటా ఈవీ మెగాచార్జర్ హబ్
భారతదేశపు అగ్రగామి ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయిన 'టాటా పవర్', దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్'తో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి తెలంగాణలోనే మొట్టమొదటి హై-స్పీడ్ 'టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్'ను హైదరాబాద్‌లోని ఐలాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ప్రారంభించాయి.హైటెక్ సిటీ నడిబొడ్డున వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఐలాబ్స్ చార్జింగ్ హబ్.. హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించింది. సొంత ఈవీ కార్లు ఉన్నవారు, కమర్షియల్ ఫ్లీట్ నిర్వాహకులు, రైడ్ హెయిలింగ్ సర్వీసులు, నగరాల మధ్య ప్రయాణించే వారు, కార్పొరేట్ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అండ్ బిజినెస్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో.. నమ్మకమైన, వేగవంతమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు, రాష్ట్ర పర్యావరణ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం.మొత్తం 360 కిలోవాట్స్ చార్జింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగాచార్జర్ హబ్‌లో మూడు 120 కిలోవాట్ల డిస్పెన్సర్లు ఉన్నాయి. వీటి సహాయంతో ఒకే సమయంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయవచ్చు. 24 గంటలూ పనిచేసే ఈ సదుపాయం వల్ల చార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేని, నమ్మకమైన చార్జింగ్ అనుభూతి లభిస్తుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. -
దిగ్గజ కంపెనీ కొత్త ప్లాన్.. లక్ష ఉద్యోగులు బయటకు!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్.. అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రణాళికలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడుల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.కంపెనీ కొత్త ప్రణాళిక ప్రకారం.. సుమారు లక్ష ఉద్యోగాల వరకు కోతలు ఉండే అవకాశం ఉంది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం అని తెలుస్తోంది. అయితే కంపెనీ 50వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఫోక్స్‌వ్యాగన్ తన పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించాలని చూస్తోంది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి, మొత్తం 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని యోచిస్తోంది. ఆర్ధిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
భారత్‌లో కొత్త మోటార్‌సైకిళ్ల తయారీ!
అమెరికాకు చెందిన ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్, భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు, క్రూయిజర్ మోడళ్లను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. వీటిని భారతదేశంలోనే తయారు చేస్తారు. ఇక్కడి నుండి అంతర్జాతీయంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.హార్లే ‘బ్యాక్ టు బ్రిక్స్’ వ్యూహం2019 నుంచి 2025 మధ్య కాలంలో హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ రిటైల్ విక్రయాలు 40 శాతం తగ్గాయి. దీంతో కంపెనీ మార్జిన్లు 18% దెబ్బతిన్నాయి. డీలర్ల లాభాలు ఏకంగా 80% మేర క్షీణించాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ‘బ్యాక్ టు బ్రిక్స్’ పేరుతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌ల ఆధారంగా రాబోయే మూడేళ్లలో 20 కొత్త మోడళ్లు, వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రీమియం విభాగంలో మరింత విస్తృతంగా వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది.వ్యూహాత్మకంగా భారత్‌లోకి రీఎంట్రీహార్లే డేవిడ్సన్ 2011లో హర్యానాలోని బావల్లో ప్లాంట్ ఏర్పాటు చేసింది. నష్టాల కారణంగా 2019లో భారత్‌లో తయారీ కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత 2020లో హీరో మోటోకార్ప్‌తో లైసెన్సింగ్, పంపిణీ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా మోటార్‌సైకిళ్ల విక్రయం, సరీ్వసింగ్తో పాటు సంయుక్తంగా కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యంలో తొలి ఉత్పత్తిగా వచి్చన హెచ్డీ ఎక్స్440 ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.35 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై హీరో మావ్రిక్ పేరుతో మరో మోడల్‌ను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ఎగుమతుల దిశగా కీలక అడుగులు వేస్తోంది.వ్యాపారణ విస్తరణ వ్యూహంపై హార్లే డేవిడ్సన్ స్పందిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ విస్తరణకు హీరో మోటోకార్ప్ కీలక భాగస్వామి అని పేర్కొంది. అయితే కొత్త ఉత్పత్తులపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే మాట్లాడుతూ, ఈ ఏడాది మరిన్ని హార్లే బ్రాండెడ్ మోటార్‌సైకిళ్లు విడుదలవుతాయని ధృవీకరించారు.గ్లోబల్ మార్కెట్లలో అనుకూలత ఉంటే భారత్‌లో తయారైన మోడళ్లను ఇతర దేశాల్లో విక్రయించే నిర్ణయం పూర్తిగా హార్లే–డేవిడ్సన్దేనని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లు కలిపి దేశంలో 14,375 యూనిట్లు అమ్ముడయ్యాయి. 350సీసీ - 500సీసీ విభాగంలో సుమారు 11 శాతం మార్కెట్ వాటాతో, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో ఆపరేటింగ్ మార్జిన్లు సాఫ్ట్వేర్ ఎగుమతుల కంటే అధికంగా ఉండటం గమనార్హం.ఏడాది చివర్లో ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హార్లే–డేవిడ్సన్ ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లకు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. వీటిలో తొలి మోడల్‌గా ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అనంతరం దశలవారీగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో కొన్ని మోడళ్లను భారత్ నుంచి తొలిసారిగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. -
ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!
భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.జూనో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
భారీ డిమాండ్.. 10 లక్షలకు చేరుకున్న ఐక్యూబ్!
భారతదేశంలో ఈవీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ తయారీ సంఖ్య 10 లక్షల యూనిట్లను దాటింది.2020లో మొదటిసారిగా విడుదలైన ఐక్యూబ్, తక్కువ కాలంలోనే భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా మారింది. కొన్ని సందర్భాల్లో.. బజాజ్ చేతక్ వంటి పోటీదారులు గట్టి పోటీ ఇస్తూనే మార్కెట్లో మొదటి స్థానానికి కూడా చేరుకుంది.టీవీఎస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఐక్యూబ్ వినియోగదారులు అందరూ 14.94 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. ఇది కేవలం అమ్మకాల గణాంకం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయాణాల ద్వారా సుమారు 5,22,969 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంటే పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించబడటం వల్ల పర్యావరణానికి గణనీయమైన మేలు జరుగుతోంది.గత ఆరు సంవత్సరాల్లో ఈ స్కూటర్లో పెద్ద డిజైన్ మార్పులు జరగకపోయినా, ఇది నిరంతరంగా అప్డేట్ అవుతూ వచ్చింది. కొత్త రంగులు, ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు వంటి మెరుగుదలలు వినియోగదారులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ స్కూటర్‌ను భారతదేశంలోని 3,000కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి బేస్ వేరియంట్, ఎస్ వేరియంట్, ఎస్టీ వేరియంట్.. వీటి ధరలు రూ. 1.07 లక్షల నుంచి రూ.1.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇవి 2.2 కిలోవాట్ బ్యాటరీ, 5.3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాలతో లభిస్తాయి. -
పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!
బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొత్త వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC)సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఎస్-6 వాహనాలకు నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి పీయూసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించే అవకాశం ఉంది.ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్న బీఎస్-6 వాహనాలు ప్రతి ఏడాది పీయూసీ సర్టిఫికెట్‌ని రెన్యువల్ చేయించుకోవాలి. పదేళ్లు దాటిన వాహనాలకు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి కావచ్చు. వాణిజ్య బీఎస్-6 వాహనాలకు ఆరు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల చెల్లుబాటు ఇవ్వాలని, ఆ తర్వాత వార్షిక పునరుద్ధరణ విధానాన్ని కొనసాగించాలని అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ మార్పులు ‘PUCC 3.0’ పేరుతో రూపుదిద్దుకుంటున్న సంస్కరణలలో భాగమని తెలుస్తోంది. బీఎస్-6 వాహనాలు పాత తరహా బీఎస్-4, బీఎస్-3 వాహనాలతో పోలిస్తే నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ ధూళికణాల ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో తక్కువ కాలుష్యం విడుదల చేసే వాహన యజమానులపై అనవసర పరిపాలనా భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు.అయితే పాత వాహనాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశమూ ఉంది. ముఖ్యంగా అధిక కాలుష్యం వెదజల్లే వాహనాలకు తరచూ పరీక్షలు నిర్వహించడం, పీయూసీ కేంద్రాల్లో తప్పుడు రీడింగులు లేదా డేటా తారుమారును అరికట్టేందుకు పరీక్షా విధానాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇదే సమయంలో దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించేందుకు స్క్రాపేజ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. అయితే పీయూసీ చెల్లుబాటు కాలం పెంపుపై ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదు. సంబంధిత ప్రతిపాదనకు తుది ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
‘ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమే’
న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయాలకు అందుబాటులో ఉండడం గమనార్హం. దీన్ని వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్‌పై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కూడా వచ్చాయి.దీంతో కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగదారులకు అనుకూలమని, ఆర్థికంగా ప్రయోజనకరమని స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్ వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్ లభించందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. ‘‘ఇథనాల్ మిశ్రమం అన్నది అంతర్జాతీయంగా ఆమోదంలో ఉన్న విధానమే. యూఎస్, బ్రెజిల్, జపాన్ తదితర దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.బ్రెజిల్ అయితే పెట్రోల్‌లో ఇథనాల్‌ను మరింత ఎక్కువగా కలుపుతోందని, ఈ27 అక్కడ అమల్లో ఉందని పేర్కొంది. ఇథనాల్‌ను కలపడం వల్ల పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవచ్చంటూ, ఈ రూపంలో ఇప్పటి వరకు రూ.1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్టు తెలిపింది. మరోవైపు ఇథనాల్ తయారీలోకి వినియోగించే వ్యవసాయ ముడి సరుకులకు స్థిరమైన డిమాండ్ ఏర్పడినట్టు, అది రైతులకు ఆదాయాన్ని పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాయపడుతున్నట్టు వెల్లడించింది.‘‘దేశ ఇందన భద్రతలో ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి, పర్యావరణ అనుకూలమైన రవాణాకు తోడ్పడుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటించింది. -
‘టాటా’ భారీ ప్లాన్: అయిదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) వచ్చే అయిదేళ్లలో రూ.37,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 2031 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై31) నాటికి దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో 20 శాతం వాటాను సాధించడంతో పాటు వార్షిక విక్రయాలను ప్రస్తుత 6.4 లక్షల యూనిట్ల స్థాయి నుంచి 12 లక్షల యూనిట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్ల సమావేశంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శైలేష్ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు.ఆరు కొత్త మోడళ్లు.. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 9 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రానున్న 2–3 ఏళ్లలో అదనంగా మరో 4 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని జోడించి మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు శైలేష్ చంద్ర తెలిపారు. అలాగే ఎఫ్వై31 నాటికి ఆరు కొత్త మోడల్ శ్రేణులను మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో కంపెనీ మొత్తం మోడల్ శ్రేణుల సంఖ్య ప్రస్తుతం ఉన్న తొమ్మిది నుంచి 15కు చేరనుంది. అధిక వృద్ధి అవకాశాలు ఉన్న విభాగాలతో పాటు ఇప్పటివరకు ప్రవేశించని కొత్త ఈవీ విభాగాల్లోనూ ఈ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. పోర్ట్‌ఫోలియోలో 30% ఈవీ వాటా లక్ష్యం భవిష్యత్తు అంతా మలీ్ట–పవర్‌ట్రెయిన్ (ఈవీ, సీఎన్జీ, పెట్రోల్/డీజిల్) దేనని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. ఎఫ్వై31 నాటికి టాటా మోటార్స్ తన సొంత పోర్ట్‌ఫోలియోలో 30 శాతం ఈవీ భాగస్వామ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 ఈవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో కంపెనీ సాధించే అదనపు విక్రయాల్లో ఈవీ, సీఎన్జీ వాహనాలదే కీలక పాత్ర కానుంది. ‘‘ఎఫ్వై20 నుంచి ఎఫ్వై26 మధ్య కంపెనీ మార్కెట్ వాటా 9 శాతం పాయింట్లు పెరిగిందని, ఎఫ్వై26 నుంచి ఎఫ్వై31 మధ్య మరో 5–6 శాతం పాయింట్ల వృద్ధితో 20 శాతం మార్కెట్ వాటాను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శైలేష్ చంద్ర తెలిపారు.ఆటో పరిశ్రమ అంచనాలు దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్ ఎఫ్వై26 లోని 47 లక్షల యూనిట్ల నుండి ఎఫ్వై31 నాటికి 64 లక్షల యూనిట్లకు పెరుగుతుందని శైలేష్ చంద్ర అంచనా వేశారు. కొనుగోలుదారుల ఆదాయాలు పెరగడం, ఆధునిక సాంకేతికత తోడవ్వడంతో ప్రస్తుతం ఉన్న కార్ల సగటు ధర రూ.11–12 లక్షల నుండి ఎఫ్వై 31 నాటికి రూ.15 లక్షలకు చేరనుందన్నారు. దేశీయంగా ఈవీ విక్రయాలు ఎఫ్వై31 నాటికి 10.11 లక్షల యూనిట్లకు (మొత్తం మార్కెట్లో 15–20% వాటా) చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షలుగా ఉన్న ఈవీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 3.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని శైలేష్ చంద్ర తెలిపారు. -
ఆరు నిమిషాల్లోనే అన్నీ సేల్.. కొత్త కారు క్రేజ్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో పనితీరు ఆధారిత ప్రీమియం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోందని మరోసారి రుజువైంది. స్కోడా ఆటో ఇండియా తాజాగా బుకింగ్‌లను ప్రారంభించిన తన ఫ్లాగ్షిప్ పెర్ఫార్మెన్స్ ఎస్యూవీ ‘కొడియాక్ ఆర్ఎస్’ తొలి బ్యాచ్ వాహనాలన్నీ కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. దేశానికి కేటాయించిన తొలి 50 యూనిట్లను వినియోగదారులు బుక్ చేసుకోవడంతో ఈ మోడల్‌పై ఉన్న ఆసక్తి స్పష్టమైంది.స్కోడా భారత మార్కెట్లో ఆర్ఎస్ (ర్యాలీ స్పోర్ట్) బ్యాడ్జ్‌తో తీసుకొచ్చిన తొలి ఎస్యూవీ ఇదే. కంపెనీ 125 ఏళ్ల మోటార్‌స్పోర్ట్స్ వారసత్వం, ఆర్ఎస్ బ్రాండ్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక మోడల్‌ను పరిమిత సంఖ్యలో సీబీయూ (Completely Built Unit) రూపంలో తీసుకొచ్చింది.కొడియాక్ ఆర్ఎస్లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 265 పీఎస్ శక్తి, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్‌వీల్ డ్రైవ్ వ్యవస్థతో కూడిన ఈ ఎస్యూవీ 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో చేరుకుంటుందని స్కోడా వెల్లడించింది. గరిష్ఠ వేగం గంటకు 231 కి.మీ. వరకు ఉంటుంది. దీంతో ఇది భారతదేశంలో స్కోడా విక్రయిస్తున్న అత్యంత వేగవంతమైన మోడల్‌గా నిలిచింది.ధరను స్కోడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఎక్స్‌షోరూమ్ ధర రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తొలి బ్యాచ్ పూర్తిగా అమ్ముడవడంతో కంపెనీ అదనపు యూనిట్లను భారత్‌కు కేటాయిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కార్లలో ‘స్విఫ్ట్’ హవా! -
ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా: స్పందించిన మస్క్!
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఒక టెస్లా మోడల్ 3 కారు అధిక వేగంతో ఓ ఇంటిలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల మహిళ మరణించింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టం ఉపయోగించినట్లు సమాచారం రావడంతో, టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీపై ప్రశ్నలు తలెత్తాయి.ప్రమాదం ఎలా జరిగింది?స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. 44 ఏళ్ల మైఖేల్ బట్లర్ కారును డ్రైవ్ చేసే సమయంలో ఒక ఇంటిని ఢీకొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉన్నట్లు అతను విచారణాధికారులకు తెలిపారు. కారు ఇంటి గోడను బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 76 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినప్పటికీ, కొంతసేపటి తరువాత మరణించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. కారు ఢీకొట్టిన ప్రదేశంలో (ఇంట్లో) పిల్లలు తరచుగా ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరూ లేదు. మహిళ తప్పా.. మరెవరికి ప్రమాదం జరగలేదు.ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. అయితే అధికారులు అతడు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినట్లు లేదని తెలిపారు. కాగా ప్రస్తుతం అతను దర్యాప్తుకు సహకరిస్తున్నాడు. ఇప్పటివరకు అతనిపై ఎటువంటి కేసులు లేదా అభియోగాలు నమోదు కాలేదని స్పష్టం చేశారు.దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రమాదం సమయంలో కారు ఏ సిస్టమ్‌ను ఉపయోగిస్తోందో స్పష్టంగా తెలియలేదు. అది టెస్లా 'ఆటోపైలట్' వ్యవస్థనా, లేక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)నా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.BUSINESS INSIDER you lying fucks. Prepare to be sued. pic.twitter.com/k68q64QvrB— Pete Balls to the wall FSD 🤖🚕 (@kylaschwaberow) June 22, 2026ఎలాన్ మస్క్ స్పందనఈ ఘటనపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, డ్రైవింగ్ సిస్టమ్ కారణంగా ప్రమాదం జరిగిందనే ఆరోపణలను ఖండించారు. ఆయన ప్రకారం.. FSD వ్యవస్థను నివాస ప్రాంతాల్లో చాలా తక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించినట్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదం అధిక వేగంతో జరిగింది కాబట్టి, ఈ ఆరోపణలు సరైనవిగా కనిపించడం లేదని చెప్పారు.టెస్లా ఏఐ విభాగం వివరణటెస్లా ఏఐ హెడ్ అశోక్ ఎల్లుస్వామి కూడా స్పందించారు. డ్రైవర్ యాక్సిలరేటర్‌ను పూర్తిగా (100%) నొక్కి స్వయంచాలక డ్రైవింగ్‌ను మాన్యువల్‌గా ఓవర్‌రైడ్ చేశాడు. ప్రమాదం సమయంలో కారు గంటకు సుమారు 73 మైళ్ల (దాదాపు 117 కి.మీ.) వేగంతో ప్రయాణించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా యాక్సిలరేటర్ నొక్కిన స్థితిలోనే ఉందని టెస్లా డేటా సూచిస్తోందని తెలిపారు.Yup. In this case, the driver manually overrode self-driving by pressing the accelerator all the way to 100% of the accel pedal in this residential area. They reached a speed of 73 mph during the crash, and had the accelerator pressed even after the crash.— Ashok Elluswamy (@aelluswamy) June 22, 2026 -
సెకండ్ హ్యాండ్ కార్లలో ‘స్విఫ్ట్’ హవా!
గురుగ్రామ్: భారతీయ సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కార్ల మార్కెట్లో కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. మెట్రో నగరాల్లోని ఇన్వెస్టర్లు, ఉద్యోగులు ఆటోమేటిక్, ప్రీమియం మోడళ్లకు మొగ్గు చూపుతున్నారు. చిన్న పట్టణాల (నాన్–మెట్రో) ప్రజలు అందుబాటు బడ్జెట్, తక్కువ మెయింటెనెన్స్ కార్లను ఇష్టపడుతున్నారు. అయితే, ఈ రెండు విభిన్న మార్కెట్లలోని కస్టమర్లు ఏకాభిప్రాయంతో ఎంచుకుంటున్న ఏకైక బ్రాండ్ ‘మారుతీ సుజుకీ స్విఫ్ట్’ కావడం విశేషం. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న సెకండ్ హ్యాండ్ కారుగా స్విఫ్ట్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. యూజ్డ్ కార్ల విక్రయ సంస్థ ‘కార్స్ 24’, ఆటోమొబైల్ ఫోరమ్ ‘టీమ్–బీహెచ్పీ’ సంయుక్తంగా విడుదల చేసిన ‘గేర్స్ ఆఫ్ గ్రోత్ 2025’ నివేదికలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 3.3 కోట్లకు పైగా వినియోగదారుల లావాదేవీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.మిగతా కార్లు వెనకబడ్డాయిదేశవ్యాప్తంగా జరిగిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో మారుతీ స్విఫ్ట్ ఏకంగా 4.93 శాతం వాటాను సొంతం చేసుకుంది. నగరాల్లో 5 శాతం, చిన్న పట్టణాల్లో 4.80 శాతం మార్కెట్ వాటాతో అన్ని చోట్లా స్విఫ్ట్ కారే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రెండో స్థానంలో వ్యాగన్ ఆర్ (3.47%) ఉండగా.. చిన్న పట్టణాల్లో మాత్రం స్విఫ్ట్ తర్వాత స్విఫ్ట్ డిజైర్ (3.08%) రెండో స్థానంలో నిలిచింది. మిగతా కార్ల మధ్య పోటీ చాలా స్వల్పంగా ఉంది.స్విఫ్ట్ ఎందుకంత ఫేవరెట్? దేశీయ యూజ్డ్ కార్ల మార్కెట్లో నేటికీ 52 శాతం వాటాతో చిన్న కార్లదే (హ్యాచ్‌బ్యాక్) ఆధిపత్యం కాగా, స్విఫ్ట్ దీనికి సరిగ్గా సరిపోతుంది. అలాగే, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 72 శాతం మంది మైలేజ్ ఎక్కువగా ఉండి, రిపేర్ ఖర్చులు తక్కువగా ఉండే ‘మాన్యువల్’ గేర్‌బాక్స్ మోడళ్లనే కోరుకుంటారు. దీనికి తోడు మారుతీ సుజుకీకి దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన సరీ్వస్ నెట్వర్క్ వల్ల ఏ చిన్న మెకానిక్ అయినా దీనిని సులువుగా రిపేర్ చేయగలడు. తిరిగి అమ్మాలనుకున్నప్పుడు (రీ సేల్ వాల్యూ) ఈ కారు చాలా వేగంగా అమ్ముడుపోవడం విశేషం. ఈ కారణాల దృష్ట్యా స్విఫ్ట్ కారు కస్టమర్ల తొలి ఎంపికగా నిలిచింది. మున్ముందు ఎస్‌యూవీల నుంచి పోటీ ప్రస్తుతానికి స్విఫ్ట్ హవా నడుస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మారే సూచనలున్నాయి. యూజ్డ్ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల వాటా 2023లో 15% ఉండగా.. ఇప్పుడది ఏకంగా 32 శాతానికి పెరిగింది. ప్రస్తుత టాప్–10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఎస్‌యూవీగా ‘హ్యుందాయ్ క్రెటా’ నిలిచింది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలు 2027–28 నాటికి సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో.. భవిష్యత్తులో చిన్న కార్ల (హ్యాచ్‌బ్యాక్) ఆధిపత్యానికి బీటలు పడొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. -
సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!
రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ ఎస్యూవీ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 750 డస్టర్ వాహనాలను చెన్నై ప్లాంట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. రాబోయే నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ మోడల్‌ను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.కొత్త డస్టర్ భారతదేశంలో తొలిసారిగా రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ రకాల పవర్‌ట్రెయిన్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని వేరియంట్లు, పవర్ట్రెయిన్లలో 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్‌ను పొందడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని నిరూపించింది.2030 నాటికి భారత్ నుంచి సంవత్సరానికి 2 బిలియన్ యూరోల ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ ఎగుమతుల ప్రారంభం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. -
రూ.3 లక్షలతో బుకింగ్.. 50 యూనిట్లు మాత్రమే!
స్కోడా కంపెనీ తన సరికొత్త కొడియాక్ ఆర్ఎస్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.3 లక్షల టోకెన్ మొత్తంతో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే సంస్థ 50 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్ఎస్ బ్యాడ్జ్ 50 సంవత్సరాల వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని స్కోడా ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసింది.సరికొత్త స్కోడా కొడియాక్ ఆర్ఎస్ విండో ట్రిమ్స్, రూఫ్ రైల్స్ వంటివి పొందుతుంది. ఇది మూన్ వైట్, మ్యాజిక్ బ్లాక్, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 2.0 TSI పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇంజిన్ 265 bhp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 231 కిమీ/గం. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
ఎప్రిలియా కొత్త బైక్: ధర ఎంతంటే?
ఎప్రిలియా ఇండియా.. టుయోనో 457 స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కోసం ఎంపిక చేసిన షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.కొత్త ఎప్రిలియా టుయోనో 457 స్పెషల్ ఎడిషన్ 2006 ట్యూనో 1000R నుంచి తీసుకున్న రెండు కొత్త లివరీలను పొందింది. అంతేకాకుండా.. ఈ మోటార్‌సైకిల్‌లో కొన్ని ఎర్గోనామిక్ మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.స్పెషల్ ఎడిషన్ టుయోనో 457, కొత్త గ్రాఫిక్స్ డిజైన్, లోగోలతో పాటు, మాంబా బ్లాక్ అండ్ పూమా గ్రే అనే రెండు కొత్త రంగులలో లభిస్తుంది. కొత్త స్మోక్డ్ ఫినిష్ ఏరోడైనమిక్ ఫ్లైస్క్రీన్, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ కోసం ఎత్తుగా అమర్చిన హ్యాండిల్బార్లు ఉన్నాయి. సుదూర ప్రయాణాలలో మరింత సౌకర్యం కోసం ఈ స్పెషల్ ఎడిషన్ సీటులో మార్పులు చేశారని, అలాగే భారతీయ రోడ్లపై మెరుగ్గా పనిచేసేలా సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరిచినట్లు ఎప్రిలియా చెబుతోంది.ఇంజిన్ విషయానికి వస్తే.. ఎప్రిలియా పవర్‌ప్లాంట్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. కాబట్టి టుయోనో 457 బైక్ 46.9 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతోంది. -
రక్షణ రంగంలోకి సింహ 4x4
భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌కు చెందిన రక్షణ రంగ అనుబంధ సంస్థ ‘కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్’ (కేఎస్‌ఎస్‌ఎల్), అంతర్జాతీయ రక్షణ సంస్థ ‘పారామౌంట్’తో కలిసి సరికొత్త నెక్ట్స్ – జనరేషన్ లైట్ ఆర్మర్డ్ మల్టీ–పర్పస్ వాహనం ‘సింహ 4x4’ ను మార్కెట్లోకి తెచ్చాయి.నాటో ప్రమాణాలకు అనుగుణంగా సాయుధ దళాల ఆధునిక అవసరాలతో పాటు, అంతర్జాతీయ రక్షణ డిమాండ్లను తీర్చేలా ఈ వాహనాన్ని సరికొత్త డిజైన్‌తో రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షణ ఆపరేషన్లు, రోడ్లపై, కఠిన భూభాగాల్లో నిఘా పెట్టడానికి ఈ ‘సింహ 4x4’ అనుకూలంగా ఉంటుంది. దీనిలోని మోడ్యులర్ ఆర్కిటెక్చర్ కారణంగా అవసరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు (అప్గ్రేడ్లు) చేసుకోవడం సులువవుతుంది. -
హైదరాబాద్‌లో అతి పెద్ద ‘పోర్షే ’ కార్ షోరూమ్
హైదరాబాద్: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల దిగ్గజం పోర్షే ఇండియా తాజాగా భారత్‌లో 911 జీటీ3ని ప్రవేశపెట్టింది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గంటకు 311 కి.మీ.దూరం ప్రయాణించగలదు. దీని ఎక్స్ షోరూం ధర రూ.3.32 కోట్లుగా ఉంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఇక, కంపెనీ దేశంలోనే అతిపెద్ద షోరూమ్ ‘పోర్షే సెంటర్’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈవీఎమ్ ప్రీమియం కార్స్ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేసింది. దాదాపు 2,800 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో ఉండే ఈ లగ్జరీ సెంటర్లో సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్స్ (3ఎస్) సేవలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ‘డెస్టినేషన్ పోర్షే’ అనే వినూత్న డిజైన్ కాన్సెప్ట్‌తో ఈ షోరూమ్‌ను తీర్చిదిద్దారు. -
టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్ ..!
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027) లో 3–5 శాతం పరిమిత హోల్‌సేల్ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడే సూచనలు, ద్రవ్యోల్బణంతో వాహనాల ధరలు పెరగడం, గత ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన అత్యధిక విక్రయాల ప్రభావం (హై బేస్ ఎఫెక్ట్) వంటి అంశాలు ఈ రంగానికి సవాళ్లుగా మారొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది. సానుకూలతలున్నా.. అంతర్జాతీయ సవాళ్లు పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగైన రిటైల్ విక్రయాల జోరు, నిలకడైన ఎగుమతుల మద్దతుతో ద్విచక్ర వాహన రంగం తన నిలకడైన ప్రదర్శనను చాటుకుంటోందని ఇక్రా పేర్కొంది. ‘జీఎస్టీ 2.0’ సంస్కరణలతో వాహనాలు అందుబాటు ధరల్లోకి రావడం, పాత వాహనాల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసే ధోరణి మార్కెట్ వృద్ధికి సానుకూలంగా మారనున్నాయి. అయితే, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సప్లై చైన్‌ను దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఆ పరిణామాలను క్షుణ్ణంగా గమనించాల్సి ఉంటుందని తెలిపింది. మేలో విక్రయాల జోరు దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 2026 మే నెలలో వార్షిక ప్రాతిపదికన 15.7 శాతం బలమైన వృద్ధితో 19 లక్షల యూనిట్లకు చేరాయని ఇక్రా నివేదిక తెలిపింది. జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాహన తయారీ కంపెనీలు ధరలు పెంచుతారనే ముందస్తు అంచనాలతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. ఇక రిటైల్ విక్రయాలు కూడా మే నెలలో ఏడాది ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెళ్లిళ్ల సీజన్, ఎంట్రీ–లెవెల్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే, దేశంలో నమోదైన విపరీతమైన ఎండల కారణంగా షోరూమ్‌లకు కస్టమర్ల రాక తగ్గడం, కొన్ని మోడళ్ల సరఫరాలో అంతరాయాలు వృద్ధి వేగాన్ని కొంతమేర నియంత్రించాయి. ఈ–టూ వీలర్స్ దూకుడు ఇక్రా నివేదికలో ఎలక్ట్రిక్ వాహన విభాగ ప్రదర్శన ఆకట్టుకుంది. 2026 మే నెలలో రిటైల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 71.7 శాతం వార్షిక వృద్ధితో 1,72,148 యూనిట్లకు చేరాయి. మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్లో ఈవీల వాటా ప్రస్తుతం 8.9 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు, మారుతున్న పర్యావరణ వ్యవస్థకు ఇది నిదర్శనమని ఇక్రా స్పష్టం చేసింది. -
2026 పల్సర్ 220ఎఫ్: రూ.1.36 లక్షలు!
బజాజ్ ఆటో తన పల్సర్ 220ఎఫ్ బైకును అప్డేటెడ్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ మోడల్ ధర రూ.1.36 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ బైక్ రేటు కంటే రూ.8000 ఎక్కువ.పల్సర్ 220ఎఫ్ బైకులో అప్డేటెడ్ ఫీచర్ ఎల్ఈడీ హెడ్లైట. గతంలో కంపెనీ దీనిని కొత్త గ్రాఫిక్స్, ఎల్ఈడీ ఇండికేటర్లు, కొత్త కలర్ స్కీమ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హాలోజన్ సెటప్ స్థానంలో, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs)తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను అమర్చింది.లైటింగ్ అప్‌గ్రేడ్ మినహా, మోటార్‌సైకిల్ మెకానికల్‌గా ఎలాంటి మార్పు పొందలేదు. కాబట్టి ఇది 20.9 హార్స్ పవర్, 18.6 న్యూటన్ మీటర్ టార్క్ అందించే అదే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.బజాజ్ పోర్ట్‌ఫోలియోలోని అత్యంత పురాతన మోటార్‌సైకిళ్లలో పల్సర్ 220F ఒకటి. అయితే కంపెనీ తన కస్టమర్ల అభిరుచి మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. కాగా కంపెనీ కొత్త జనరేషన్ పల్సర్ 125ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. బహుశా ఇది రానున్న రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ! -
RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలు (బెంగళూరులో) ప్రారభించింది. కేవలం వాహనాన్ని విక్రయించడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్పెషల్ సపోర్ట్ నెట్‌వర్క్‌ను కూడా సంస్థ ఏర్పాటు చేసింది.రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే ఉన్న షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో షాప్-ఇన్-షాప్ విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయకుండా.. ఇప్పటికే ఉన్న డీలర్ నెట్వర్క్ ద్వారా ఫ్లయింగ్ ఫ్లీ బైకును విస్తరించనున్నారు. అంతే కాకుండా.. వినియోగదారులకు 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సహాయం అందించేలా ఉంటుంది.ఫ్లయింగ్ ఫ్లీ C6 ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే.. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) స్కీమ్ ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించాలి. దీని వల్ల ప్రారంభ పెట్టుబడి తగ్గి, మరింత మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని సులభంగా కొనుగోలు చేసే అవకాశం పొందుతారు.ఈ మోటార్‌సైకిల్‌లో 3.91 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 154 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 15.4 కిలోవాట్ల పవర్, 60 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 0 నుంచి 60 కిమీ వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు.ఫ్లయింగ్ ఫ్లీ C6 బరువు కేవలం 124 కిలోలు మాత్రమే ఉండటం వల్ల ఇది తేలికగా ఉంటుంది. అయితే 19 అంగుళాల పెద్ద చక్రాలు, సన్నని 90 సెక్షన్ టైర్లు నగర రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 3.5 అంగుళాల రౌండ్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, అడ్జస్టబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఐదు రైడింగ్ మోడ్లు, లీన్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. -
మళ్లీ పెరగనున్న ధరలు.. కియా కార్లు ప్రియం!
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా, దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2026 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.భారతదేశంలో విక్రయించే అన్ని కియా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఈ ధరల పెంపునకు కారణమని ఈ కొరియన్ సంస్థ చెబుతోంది. ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ధరల పెరుగుదల మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయి.ప్రస్తుతం, కియా ఇండియా దేశంలో ఎనిమిది విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. కార్నివాల్,ఈవీ6, ఈవీ9 కార్లు కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా మన దేశానికి వస్తాయి. స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మోడళ్లలో సోనెట్, సైరోస్, సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ ఉన్నాయి.ప్రస్తుతం, ఈ మోడళ్ల ధరలు ఎంట్రీ-లెవల్ సోనెట్ కోసం రూ. 7.33 లక్షల నుంచి, టాప్-స్పెక్ క్లావిస్ ఈవీ కోసం రూ. 25 లక్షల వరకు ఉన్నాయి. కార్నివాల్, ఈవీ6, ఈవీ9 ధరలు వరుసగా రూ. 59.45 లక్షలు, రూ. 67.98 లక్షలు, రూ. 1.3 కోట్లుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). -
పోర్షే కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
పోర్షే భారతదేశంలో కొత్త తరం 911 GT3ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.పోర్షే 911 జీటీ3 కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 503 బీహెచ్పీ పవర్, 470 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్లో స్టాండర్డ్‌గా పీడీకే గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.10 రంగులలో లభించే ఈ కారు 21 ఇంచెస్ అల్యూమినియం వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ సిల్వర్ థీమ్ పొందుతుంది. ప్రత్యేకమైన సీట్లు, రూఫ్ ఫినిష్, సీట్ బెల్ట్‌లు, వీల్స్ నుంచి కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు మొదలైనవి ఉన్నాయి. పనితీరు అద్భుతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. -
ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి విలువైన ఖనిజాలను డెడ్ అయిపోయిన బ్యాటరీలు, ఈ-వ్యర్థాలు, జీవితకాలం ముగిసిన వాహనాల నుంచి రీసైకిల్ చేసేందుకు రూ.1,500 కోట్ల విలువైన ‘క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్’ను అమలు చేయనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బ్యాటరీ సమ్మెట్ 2026 సదస్సులో ఈ ప్రకటన చేశారు. ఈ పథకం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)లో భాగంగా అమలవుతుంది.ప్రస్తుతం భారత్‌లో ఈవీలు, పవర్ స్టోరేజ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ తయారీ వేగంగా విస్తరిస్తుండటంతో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2022లో సుమారు 20 గిగావాట్-గంటల (GWh) స్థాయిలో ఉన్న డిమాండ్ 2030 నాటికి 220 GWhకు చేరే అవకాశం ఉంది. దీంతో దిగుమతి బ్యాటరీ పదార్థాలపై ఆధారపడటం కూడా గణనీయంగా పెరిగింది.ఈ నేపథ్యంలో పాత బ్యాటరీల నుంచి విలువైన ఖనిజాలను రీసైకిల్ చేయడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రీసైక్లింగ్ యూనిట్లకు మూలధన (Capex), కార్యకలాపాల (Opex) సబ్సిడీలు అందించేలా పథకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఖనిజాలను నిజంగా వెలికితీసే రీసైక్లింగ్ సంస్థలకే ప్రోత్సాహకాలు లభిస్తాయి.ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకం ద్వారా కనీసం 270 కిలోటన్నుల వార్షిక రీసైక్లింగ్ సామర్థ్యం ఏర్పడి, దాదాపు 40 కిలోటన్నుల కీలక ఖనిజాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. అలాగే సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు దాదాపు 70 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.ఇదే సమయంలో కీలక ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచేందుకు నాలుగు క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పార్కులు, తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. మరోవైపు అర్జెంటీనా సహా విదేశాల్లో లిథియం నిక్షేపాల కొనుగోలు, దేశీయ అన్వేషణ ప్రాజెక్టులు, ఖనిజ బ్లాకుల వేలం వంటి చర్యల ద్వారా దీర్ఘకాలిక సరఫరా భద్రతపై దృష్టి సారిస్తోంది.ఈ చర్యలు భారత ఈవీ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల భద్రతను పెంచడమే కాకుండా, చైనా వంటి దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించి ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడతాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఈవీ మార్కెట్‌కు స్థిరమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాటరీ సరఫరా వ్యవస్థను నిర్మించడంలో ఈ పథకం కీలక మైలురాయిగా భావిస్తున్నారు. -
2026 కవాసకి నింజా 500 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో కొత్త '2026 నింజా 500' బైక్ లాంచ్ చేసింది. దీని ధర మునుపటి మోడల్ కంటే రూ.1000 ఎక్కువ. దీంతో ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.76 లక్షలు.కొత్త నింజా 500లో పెద్దగా యాంత్రిక మార్పులు చేయలేదు. అయితే 2026 మోడల్‌ను E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. దీంతో భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా ఈ బైక్ సిద్ధంగా ఉంది. అలాగే కవాసాకి ప్రత్యేకమైన లైమ్ గ్రీన్ కలర్ స్కీమ్‌లో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది.ఈ బైక్‌ను 2024లో విడుదల చేసిన నింజా 400కు వారసుడిగా కంపెనీ పరిచయం చేసింది. ఇందులో 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 44.38 బీహెచ్పీ పవర్, 42.6 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంది. దీంతో రైడింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.సస్పెన్షన్ వ్యవస్థలో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ను కొనసాగించారు. బ్రేకింగ్ కోసం ముందు 310 మిమీ డిస్క్, వెనుక 220 మిమీ డిస్క్ బ్రేక్‌లను అందించారు. ఇవి మెరుగైన నియంత్రణ, భద్రతను అందిస్తాయి.డిజైన్ విషయానికి వస్తే, నింజా సిరీస్‌కు ప్రత్యేకమైన స్పోర్టీ లుక్ పొందుతుంది. ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, షార్ప్ ఫెయిరింగ్ లైన్స్, ఆకర్షణీయమైన ఫ్రంట్ డిజైన్ బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అలాగే ఫుల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది.ఈ బైక్‌లో 785 మిమీ సీటు ఎత్తు, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 171 కిలోల కర్బ్ వెయిట్ వంటి అంశాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 2026 కవాసాకి నింజా 500లో పెద్ద మార్పులు లేకపోయినా, E20 అనుకూలతతో పాటు కొత్త రంగు ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. -
సిట్రోయెన్ కొత్త కారు: ధర రూ.6.89 లక్షలు!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ కార్ ఈసీ3ఎక్స్ (eC3X) 2026ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ధరలు రూ.6.89 లక్షల నుంచి (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ స్కీమ్) ప్రారంభమవుతాయి. సాధారణ ధర రూ.10.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు పొందింది. ముందుభాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్ప్లిట్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్ వంటివి ఉన్నాయి. 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు. ఈ కారు పోలార్ వైట్, స్టీల్ గ్రే, కోస్మో బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్ వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త డ్యాష్‌బోర్డ్‌తో పాటు వైట్ అండ్ బ్లూ డ్యూయల్ టోన్ థీమ్‌ను అందించారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 2.0 వంటివాటితో పాటు.. 6 ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి.కొత్త eC3Xలో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో సుమారు 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. -
15 ఎయిర్‌బ్యాగ్‌లతో.. తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కారు!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లోకి తమ ప్రతిష్టాత్మక ఎస్–క్లాస్ శ్రేణిలో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. దేశీయంగా తమ మొదటి ప్లగ్–ఇన్–హైబ్రిడ్ వాహనం (పీహెచ్ఈవీ) ‘ఎస్ 450ఈ’ లాంచ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్లో 2,700 కి పైగా పరికరాలను సరికొత్తగా తీర్చిదిద్దడం లేదా రివైజ్ చేయడం విశేషం.భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే మొదటిసారిగా ఈ కారులో 15 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ ప్రవేశపెట్టింది. ఎస్ 450ఈ లాంచ్ ఎడిషన్ ధర రూ. 2.20 కోట్లుగా నిర్ణయించగా, మ్యానుఫ్యాక్చర్ ఎడిషన్ ధరను రూ. 2.38 కోట్లుగా (ఎక్స్ షోరూమ్) ఖరారు చేసింది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, 2026 క్యూ4 నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.ఈ లగ్జరీ కారులో 22 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తోనే పట్టణ ప్రయాణాలకు సరిపడేలా 115 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ని అందిస్తుంది. సుదీర్ఘ ప్రయాణాల్లో చార్జింగ్ అయిపోతుందనే ఆందోళన లేకుండా, అవసరాన్ని బట్టి వాడుకునేందుకు పెట్రోల్ ఇంజిన్ లభ్యతను కూడా కల్పించారు. ఈ వాహనం మొత్తం మీద 320 కిలోవాట్ (435 హెచ్‌పీ) సామర్థ్యంతో పాటు 680 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే ఎలక్ట్రానిక్‌గా దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లుగా నిర్దేశించారు.ప్రీమియం కస్టమర్ల నుంచి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లకు వస్తున్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ ఎస్ 450ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చాము. కస్టమర్ల అంచనాలకు మించి, భారత్‌లో ఎస్ క్లాస్ వారసత్వాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాము. ఈ వాహనం ద్వారా ఐసీఈ, బీఈవీ, పీహెచ్ఐవీ పవర్ట్రైన్ల నుంచి కస్టమర్లు తమకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’’ అని మెర్సిడెస్–బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. -
ఇథనాల్‌తో నడిచే కొత్త బైక్‌లు.. రూ.4,000 తక్కువ ధరకే!
భారతదేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల రెండు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. అవి ఒకటి స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, రెండు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. కంపెనీ ఈ రెండు బైకులపై రూ.4,000 ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉంటుంది.ధరల తగ్గింపు కారణంగా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. దీంతో ఈ రెండు బైకులు సాధారణ వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చాయి.ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ల ప్రత్యేకతహీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు E85 ఇంధనంతో పనిచేస్తాయి. E85 అంటే.. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయిక. సాధారణ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఈ విధమైన ఇంధనం పర్యావరణానికి కొంత తక్కువ హానికరం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.E85 ఇంధనాన్ని ఉపయోగించేందుకు హీరో మోటోకార్ప్ ఈ బైక్‌లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. వాటిలో ప్రత్యేక ఫ్యూయల్ పంప్, అదనపు ఫ్యూయల్ ఫిల్టర్, ఇంధన మిశ్రమాన్ని గుర్తించి తగిన విధంగా ఇంధన సరఫరాను నియంత్రించే రీక్యాలిబ్రేటెడ్ ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) వంటివి ఉన్నాయి.ఇంజిన్ పనితీరుఈ రెండు బైక్‌లలో 97.2 సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. E85 మోడ్‌లో ఈ ఇంజిన్ 8.4 బిహెచ్పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం.. E85 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే పవర్ 7 శాతం, టార్క్ 3 శాతం పెరుగుతాయి. అంటే.. ఈ బైక్‌లు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, కొంత మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి.హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు జూలై 2026 నుంచి ముందుగా ఢిల్లీ, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు. -
కారులో స్టెప్నీ టైర్.. చిన్నగా ఉండటానికి ఇదే అసలు కారణం!
కార్లలో ఉండే స్టెప్నీ (Spare Tyre) సాధారణంగా.. మిగతా టైర్ల కంటే కొద్దిగా చిన్నగా ఉండటం చాలా మంది గమనించి ఉంటారు. కొందరు దీనిని తయారీ లోపంగా భావించినప్పటికీ, వాస్తవానికి ఇది ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో భాగంగా తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయం. ఈ చిన్న స్టెప్నీని సాధారణంగా 'స్పేస్ సేవర్' లేదా 'డోనట్ టైర్' అని పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపయోగించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తారు.బరువును తగ్గించడంస్టెప్నీ టైర్ చిన్నగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాహనం బరువును తగ్గించడం. కారు ఎంత తక్కువ బరువు ఉంటే అంత తక్కువ ఇంధనం వినియోగిస్తుంది. దీంతో మైలేజ్ మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి హానికరమైన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రతి కారులో పూర్తి పరిమాణం గల అదనపు టైర్‌ను ఉంచితే వాహనం బరువు పెరిగి ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.స్థలాన్ని ఆదా చేయడంమరో ముఖ్యమైన కారణం స్థలాన్ని ఆదా చేయడం. చిన్న పరిమాణంలోని స్టెప్నీ కారు డిక్కీలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ప్రయాణికులు తమ లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కార్లలో డిక్కీ స్థలం పరిమితంగా ఉండటం వల్ల ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఖర్చు తగ్గించడంఖర్చును తగ్గించడం కూడా మరో కారణం. చిన్న టైర్, రిమ్ తయారీకి తక్కువ ముడిసరుకు అవసరం అవుతుంది. ఫలితంగా తయారీ ఖర్చు తగ్గుతుంది. స్టెప్నీని రోజువారీ వినియోగం కోసం కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఖరీదైన పూర్తి పరిమాణం గల టైర్‌ను అందించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వాహన ధర కూడా కొంత వరకు నియంత్రణలో ఉంటుంది.తాత్కాలిక ఉపయోగం కోసంఅయితే ఈ చిన్న స్టెప్నీని ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగించకూడదు. సాధారణంగా 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తారు. అలాగే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. దీని ప్రధాన ఉద్దేశం సమీపంలోని టైర్ రిపేర్ సెంటర్ లేదా సర్వీస్ స్టేషన్ వరకు సురక్షితంగా చేరుకోవడమే.సులభ వినియోగంచిన్న స్టెప్నీ తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల దానిని మార్చడం కూడా సులభం. రోడ్డుపై టైర్ పంక్చర్ అయినప్పుడు డ్రైవర్లు లేదా ప్రయాణికులు పెద్దగా శ్రమ లేకుండా స్టెప్నీని అమర్చగలుగుతారు. పూర్తి పరిమాణం గల టైర్‌తో పోలిస్తే దీనిని ఎత్తడం, అమర్చడం చాలా సులభంగా ఉంటుంది.అయితే.. చిన్న స్టెప్నీ వాడుతున్నప్పుడు వాహనం గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండ్లింగ్‌లో స్వల్ప మార్పులు రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది. స్టెప్నీ అనేది స్వల్ప దూరం ప్రయాణించడానికి మాత్రమే అనే విషయం మర్చిపోకూడదు. -
భారత్‌లో మరో టెస్లా కారు.. డెలివరీ షురూ!
టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.మోడల్ YLలో 16-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు. -
ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?
భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఇది ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.కంపెనీ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన సమయంలో ధరలను ప్రకటించలేదు. అయితే తాజాగా సంస్థ ఈ వాహనం ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ ZXi+ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్ ఉంది. అయితే ధర మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ కంటే రూ. 86,000 ఎక్కువ.వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుంది. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నప్పటికీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది. అంతేకాకుండా.. చెరకు వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్లుఅయితే.. ఈ వాహనం ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యాగన్ ఆర్ టూర్ H3తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. టూర్ H3లో 1.0 లీటర్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.పనితీరు విషయానికి వస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లో పవర్ లేదా టార్క్ పరంగా ఎటువంటి పెరుగుదల లేదు. ఈ 1.2 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 90.9 హార్స్పవర్, 113.7 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. -
హోండా కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్!
దేశీయ కార్ల మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా జూన్ నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్యూవీ, సెడాన్ విభాగాల్లో అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ తన ప్రముఖ మోడళ్లైన ఎలివేట్, అమేజ్, సిటీ కార్లపై భారీ తగ్గింపులు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్లు, పొడిగించిన వారంటీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత ఆధారంగా ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది.ఎక్కువ తగ్గింపు ఎలివేట్కే..హోండా లైనప్‌లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు ఎలివేట్ ఎస్‌యూవీపై అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ ఎంటీ, జెడ్ఎక్స్ సీవీటీ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. నగదు తగ్గింపులతో పాటు ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలు, 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డ్యాష్‌క్యామ్ వంటి యాక్సెసరీ ప్యాకేజీలను కూడా కంపెనీ అందిస్తోంది. మిడ్ వేరియంట్లైన వి అపెక్స్, వీఎక్స్ మోడళ్లపై కూడా రూ.1.5 లక్షలకు పైగా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్ హోండాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలుస్తోంది.కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్‌పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొత్త తరం అమేజ్ జెడ్ఎక్స్ ఎంటీ వేరియంట్‌పై రూ.67,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, వీఎక్స్, వి వేరియంట్లపై వరుసగా రూ.48,000, రూ.28,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, ఎంపిక చేసిన వేరియంట్లకు ఆమోదిత సీఎన్జీ కిట్ అమర్చించుకునే వినియోగదారులకు రూ.20,000 వరకు రీయింబర్స్‌మెంట్‌ను హోండా కొనసాగిస్తోంది.ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు హోండా సిటీపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించింది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సిటీ పెట్రోల్ వేరియంట్లపై రూ.1.56 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్ MY25 స్టాక్‌పై గరిష్ఠంగా రూ.1.97 లక్షల వరకు తగ్గింపులు అందిస్తున్నట్లు సమాచారం. తాజా ఫేస్‌లిఫ్ట్ సిటీ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో పాత స్టాక్ క్లియరెన్స్ కోసం ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్న వేళ, హోండా ఆఫర్లు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పటికే టాటా మోటర్స్, హ్యూందాయ్ వంటి కంపెనీలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్యూవీ లేదా ప్రీమియం సెడాన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల మంచి అవకాశంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
టూవీలర్లు.. ఆన్లైన్లోనే కొనేస్తున్నారు!
భారతదేశంలో టూవీలర్ కొనడమంటే.. అదో పెద్ద కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే ఓ వేడుక లాంటిది. ఓ మంచి రోజు చూసి కుటుంబ సభ్యులంతా షోరూంకి వెళ్లి పదుల సంఖ్యలో వాహనాలను పరిశీలించి, రంగులు, హంగులూ అన్నీ చూసి ఓ బండిని కొనుక్కుంటారు. దీనికి ఓ పూటంతా పడుతుందంటే ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. బట్టలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొంటున్నట్టుగా టూవీలర్లను కూడా ఆన్లైన్లో కొనేవాళ్లు ఎక్కవయ్యారు.ఆన్లైన్ టూవీలర్ అమ్మకాలు రెట్టింపుఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తమ వేదికపై ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల కంటే టయర్-2, టయర్-3 పట్టణాల నుంచే ఎక్కువ డిమాండ్ నమోదవుతోంది. కంపెనీ ప్రకారం, ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వస్తున్నారు.ఎలక్ట్రిక్, ప్రీమియం బైక్‌లకు భారీ డిమాండ్రోజువారీ ప్రయాణాల కోసం కమ్యూటర్ బైక్‌లతో పాటు ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 20కిపైగా బ్రాండ్లకు చెందిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఆన్లైన్ కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.తెలుగు నగరాల్లో బుకింగ్స్ జోరుదక్షిణ భారతదేశంలో కాకినాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ద్విచక్ర వాహన బుకింగ్స్ 12 రెట్లు పెరిగినట్లు అమెజాన్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని నాగౌర్, జింద్, అలాగే పశ్చిమ ప్రాంతంలోని రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి నగరాల్లో కూడా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.తొలిసారి ఆన్లైన్లో కొనేవాళ్లూ ఎక్కువే..గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా టయర్-3 పట్టణాలకు చెందిన 2,300కు పైగా వినియోగదారులు అమెజాన్ ద్వారా తొలిసారిగా టూవీలర్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. షోరూంకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ధరలు పోల్చుకోవడం, ఫైనాన్స్ ఆప్షన్లు చూడటం, డిజిటల్ పేమెంట్లతో బుకింగ్ చేయడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.భారత టూవీలర్ మార్కెట్లో కొత్త ధోరణిదేశీయ టూవీలర్ మార్కెట్లో కూడా ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2025లో భారత టూవీలర్ విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 2.14 కోట్ల యూనిట్లకు చేరి 13%కు పైగా వృద్ధి నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం మోటార్‌సైకిళ్లు ఈ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి.భవిష్యత్తులో మరింత విస్తరణప్రస్తుతం ఆన్లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు మొత్తం మార్కెట్లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న పట్టణాల్లో డిజిటల్ అవగాహన పెరగడం, విస్తృత బ్రాండ్ ఎంపికలు, ధరల్లో పారదర్శకత కారణంగా భవిష్యత్తులో టూవీలర్ కొనుగోలు అనుభవం పూర్తిగా ఆన్లైన్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. -
హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్‌లు ఇవే!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త ప్రీమియం బైక్‌లను విడుదల చేసింది. తన పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన 755సీసీ ప్లాట్‌ఫామ్‌పై వినూత్నమైన ‘ఈ–క్లచ్’ సాంకేతికతను జోడిస్తూ.. సీబీ750 హార్నెట్, ఎక్స్ఎల్750 ట్రాన్స్‌ఆల్ప్ బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు లగ్జరీ టూరింగ్ బైక్ ‘గోల్డ్ వింగ్’ను సరికొత్త కలర్ ఆప్షన్లో, రేసింగ్ ప్రియుల కోసం ఫ్లాగ్షిప్ సూపర్‌స్పోర్ట్ బైక్ ‘సీబీఆర్1000ఆర్ఆర్–ఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్పీ’ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా టాప్‌లైన్, బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సీబీ750 హార్నెట్ ఈ–క్లచ్ఇదొక స్ట్రీట్ నేకెడ్ బైక్. ఇందులో 755సీసీ ప్యారలల్–ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 67.5 కేడబ్ల్యూ పవర్, 75 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. షోవా 41ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, 5.0 అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి. అలాగే హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ, విభిన్న రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ అందించారు. సీబీఆర్1000 ఆర్ఆర్–ఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్పీ సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్ టూరింగ్) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్’ మోడ్‌తో కూడిన రైడింగ్ ఆప్షన్లు, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, షోవా సస్పెన్షన్ దీని ప్రత్యేకత.గోల్డ్ వింగ్ (లగ్జరీ టూరింగ్ బైక్)సుదూర ప్రాంతాల రైడింగ్ కోసం లగ్జరీ ఫీచర్లతో వచ్చే ఈ బైక్‌లో 1833సీసీ 6–సిలిండర్ ఇంజిన్ ఉంది. స్మూత్ రైడింగ్ కోసం 7–స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (డీసీటీ)తో పాటు వెనక్కి జరుపుకోవడానికి రివర్స్, వాకింగ్ స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఎల్రక్టానికల్లీ అడ్జస్టబుల్ విండ్్రస్కీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్‌బ్యాగ్ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు ఈ బైక్ సొంతం.ఎక్స్ఎల్ 750 ట్రాన్స్ఆల్ప్సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్ టూరింగ్) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్’ మోడ్‌తో కూడిన రైడింగ్ ఆప్షన్లు, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, షోవా సస్పెన్షన్ దీని ప్రత్యేకత.వినియోగదారులకు సరికొత్త అనుభూతి‘‘కొత్త ‘ఈ–క్లచ్’ టెక్నాలజీ ద్వారా ప్రీమియం మోటార్‌సైకిల్ రైడింగ్‌ను మరింత సులభతరం, సౌకర్యవంతం చేస్తున్నాం. రోజువారీ నగర ప్రయాణాల నుంచి సుదూర ప్రాంతాల టూరింగ్ వరకు.. ఈ బైక్‌లు రైడర్లకు నమ్మకమైన, అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. భారతీయ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతను అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని హోండా మోటార్‌సైకిల్స్ ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుమి ఒటానీ తెలిపారు. -
కొత్త ఐ20.. ఇప్పుడు బ్రెజిల్ మార్కెట్లో!
హ్యుందాయ్ కంపెనీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'i20'ను కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ పరిమాణం కొంత పెరగడంతో.. దీని పొడవు 4.1 మీటర్లకు చేరింది. దీంతో ఇది మునుపటి కంటే మరింత స్పేస్, ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.ధరలు బ్రెజిల్ మార్కెట్లో 99,990 నుంచి 1,39,990 బ్రెజిలియన్ రియల్ వరకు ఉండగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18.8 లక్షల నుంచి రూ.26.3 లక్షల వరకు ఉంటుంది. ఇది కియా కే3 ప్లాట్‌ఫామ్‌కు ఆధారంగా నిర్మితమైంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కియా సెల్టోస్ కూడా నిర్మించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ క్రాష్ టెస్టుల్లో మంచి సేఫ్టీ రేటింగ్ సాధించినందున కొత్త i20 కూడా మరింత దృఢంగా తయారైనట్లు భావించవచ్చు.డిజైన్ పరంగా కొత్త i20 పూర్తిగా లేటెస్ట్ లుక్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ అండ్ రియర్‌లో కనెక్టెడ్ లైట్ బార్లు, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ స్టాన్స్ దీనికి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఇంటీరియర్‌లో 12.3 ఇంచెస్ కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు, లోగో లెస్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఇందులో ఉంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. బూట్ స్పేస్ సుమారు 346 లీటర్లు ఉంది.ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త i20లో రెండు 1.0 లీటర్ ఇంజిన్లు ఉన్నాయి. ఒకటి MPi ఫ్లెక్స్ ఫ్యూయల్ (నేచురల్ ఆస్పిరేటెడ్), మరొకటి TGDi టర్బో ఇంజిన్. ఇవి వరుసగా సుమారు 79bhp/100Nm - 113bhp/171Nm పవర్ డెలివరీ చేస్తాయి. ఈ ఇంజిన్లు పెట్రోల్, ఎథనాల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లకు అనుగుణంగా పనిచేస్తాయి.బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కొత్త i20 అదే డిజైన్, ఫీచర్స్ వంటివాటితో భారతదేశానికి రావడం కష్టం. కానీ ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా మార్చబడే అవకాశం ఉంది. ఏడీఏఎస్ ఫీచర్లు ఉండకపోవచ్చు. ఇంజిన్ లైనప్‌లో 1.2-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో ఉండవచ్చు. -
హైదరాబాద్‌లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీలో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనుంది. మన దేశంలో టెస్లాకిది ఐదో సెంటర్.కాగా.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఆక్టేవ్ బ్లాక్‌లో రానున్న ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 6 సీటింగ్ కెపాసిటీ టెస్లా వై ఎల్ (లాంగ్– వీల్ బేస్) మోడల్ కారును ప్రదర్శించనున్నారు. 88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ఫీచర్స్‌తో ఉన్న ఈ కారు.. 5 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరులో కొలువుదీరిన టెస్లా షోరూమ్‌లు.. తాజాగా భాగ్యనగరానికి రానున్నాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి!
అమెరికా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్.. తాజాగా భారీ స్థాయిలో తన వాహనాలను రీకాల్ ప్రకటించింది. మొత్తం 2.5 లక్షలకు పైగా వాహనాలు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి. గతంలో చేసిన రీకాల్‌లో సరిగా మరమ్మతులు చేయకపోవడం వల్ల, మళ్లీ సమస్య తలెత్తినట్లు గుర్తించిన సంస్థ ఇప్పుడు మరోమారు రీకాల్ జారీ చేసింది.ఈ రీకాల్ ప్రధానంగా 2012 నుంచి 2018 మధ్య తయారైన ఫోర్డ్ ఫోకస్ మోడల్ కార్లకు వర్తిస్తుంది. ఈ వాహనాల్లో ఉన్న కానిస్టర్ పర్జ్ వాల్వ్ లోపం కారణంగా ఇంజిన్ ఆకస్మికంగా ఆగిపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ సమయంలో ఇలాంటి సమస్య అనుకోని సమస్యను తీసుకొస్తుంది. దీనిని పరిష్కరించేందుకు డీలర్లు వాహనాలకు ఉచితంగా పవర్ట్రైన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అందించనున్నారు. దీని ద్వారా ఇంజిన్ పనితీరును మెరుగుపరచి, అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది.వాహన యజమానులకు సంబంధించిన నోటిఫికేషన్ లేఖలు జూలై 6 నుంచి పంపించడం మొదలైంది. అంతే కాకుండా.. ఫోర్డ్ వినియోగదారులు ఫోర్డ్ కస్టమర్ సర్వీస్ నంబర్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. రీకాల్‌కు సంబంధించిన వాహనాల వివరాలు మరియు VIN నంబర్లు జూలై 6 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. -
EVలకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
భారత ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) వైపు అడుగులు వేసిన ప్రభుత్వం, భవిష్యత్తులో E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ పరిణామాలు దేశంలోని వాహన కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.ఇటీవల ప్రభుత్వం 22 నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక ఇథనాల్ వినియోగానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇంధనాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, వాటి ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో.. వాహన కొనుగోలుదారుల్లో అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కొనుగోలు చేసే పెట్రోల్ వాహనాలు వాటికి అనుకూలంగా ఉంటాయా?, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో 28 వేలకుపైగా మంది పాల్గొన్నారు. వారిలో 43 శాతం మంది E20, E30 వంటి ఇంధనాల భవిష్యత్ ప్రభావాల కారణంగా వచ్చే ఏడాది కొత్త వాహనాల కొనుగోలును వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 6 శాతం మంది మాత్రమే కొత్త పెట్రోల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 7 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 7 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. అంటే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EVలు, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి రెట్టింపుకన్నా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.ఇంధన భవిష్యత్తుపై అనిశ్చితి, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ ఈవీ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.దేశవ్యాప్తంగా EVల వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో మొత్తం వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 11 శాతాన్ని దాటింది. అదే నెలలో EVల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 81 శాతం పెరగడం ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.


