ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా? | Ferrari First Electric Car Name Luce And Know The Details Here | Sakshi
Sakshi News home page

ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?

Feb 10 2026 5:24 PM | Updated on Feb 10 2026 5:31 PM

Ferrari First Electric Car Name Luce And Know The Details Here

సూపర్ కార్లను లాంచ్ చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫెరారీ కంపెనీ.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు ఫెరారీ లూసే (Ferrari Luce) అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 9, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది.

ఫెరారీ లూసే క్యాబిన్ డిజైన్‌ను మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ అభివృద్ధి చేశారు. దీంతో ఇది రెట్రో డిజైన్ పొందింది. ఈ కారులో టచ్‌స్క్రీన్‌లు మాత్రమే కాకుండా.. నాబ్‌లు & స్విచ్‌లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని ఎప్పటిలాగే అందించడానికి ఇలా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.

త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. రేంజ్, టూర్ & పెర్ఫార్మెన్స్ వంటి డ్రైవింగ్ మోడ్‌ల కోసం రోటరీ స్విచ్‌లు ఉంటాయి. కుడి వైపున ఉన్న ఎరుపు మానెట్టినో డయల్ డ్రైవర్లు.. ఐస్, వెట్, డ్రై, స్పోర్ట్ & ఈఎస్సీ ఆఫ్ వంటి ఛాసిస్ సెట్టింగ్‌లను టోగుల్ చేయడానికి అనుమతిస్తుంది.

12.5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. బ్యాటరీ స్థితి, పవర్ రీజెనరేషన్, టైర్ ప్రెజర్ & జీ ఫోర్స్ డేటాను ఇందులో చూడవచ్చు. ఫెరారీ లూస్ ప్రత్యేకమైన కంట్రోల్ సిస్టమ్‌ పొందనుంది. సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్‌లు, బూట్ & లాక్ ఫంక్షన్‌ల కోసం భౌతిక బటన్లు, నాలుగు విండోల కోసం స్విచ్‌లు ఉంటాయి. వెనుక ప్రయాణీకులు స్పీడ్, ల్యాప్ టైమ్స్ తెలుసుకోవడానికి టచ్‌స్క్రీన్‌ను పొందుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement