భారత్‌లో టయోటా తొలి ఎలక్ట్రిక్ కారుకు బుకింగ్స్ ప్రారంభం
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటర్స్ భారత్‌లో తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ (బీఈవీ) అర్బన్ క్రూజర్ ఎబెల్లాను ఆవిష్కరించింది. దీనికి బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ డిఫ్యూటీ ఎండీ తడాషీ అసజుమా తెలిపా రు. సుజుకీ, టయోటాకి అంతర్జాతీయంగా భాగస్వామ్య ఒప్పందం ఉన్నందున సుజుకీ మోటర్ గుజరాత్ ఈ వాహనాన్ని సరఫరా చేస్తుందని చెప్పారు.
ది 49 కిలోవాట్‌హవర్, 61 కిలోవాట్‌హవర్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఒక్కసారి చార్జి చేస్తే 543 కి.మీ. వరకు రేంజి ఉంటుంది. ఎబెల్లాను యూరప్‌కి కూడా ఎగు మతి చేయనున్నట్లు తడాషీ వివరించారు. చార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు జియో–బీపీలతో చేతులు కలిపినట్లు, క్రమంగా ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. టయోటా ప్రస్తుతం భారత్‌లో హైబ్రిడ్, డీజిల్, పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది.


