ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు  | Anthropic gauges workers, observed exposure to AI | Sakshi
Sakshi News home page

ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు 

Mar 7 2026 4:39 AM | Updated on Mar 7 2026 7:05 AM

Anthropic gauges workers, observed exposure to AI

యువ వర్కర్ల నియామకాలు మాత్రమే తగ్గాయి 

కృత్రిమ మేధతో ప్రోగ్రామర్లు, అనలిస్ట్‌ కొలువులకు రిసు్కలు 

వంటవాళ్లు, మెకానిక్‌ల ఉద్యోగాలు సేఫ్‌ 

ఆంథ్రోపిక్‌ నివేదిక

న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. 

కోడింగ్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్‌ డిజిటల్‌ విధులను నిర్వర్తించే వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్‌ ప్రోగ్రామర్లు, కస్టమర్‌ సర్విస్‌ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్టులు, ఫైనాన్షియల్‌..ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్‌ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది.

 మరోవైపు, వంటవాళ్లు, మోటార్‌సైకిల్‌ మెకానిక్‌లు, లైఫ్‌గార్డ్‌లు, బార్‌టెండర్లు, డ్రెస్సింగ్‌ రూమ్‌ అటెండెంట్స్‌లాంటి మాన్యువల్‌ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement