breaking news
Artificial Intelligence (AI)
-
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్‌కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
ఏడాదిలోగా ఎలక్ట్రానిక్ టోల్
న్యూఢిల్లీ: దేశంలో రహదారులపై అత్యాధునిక ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి ఉన్న వ్యవస్థ ఏడాదిలోగా ముగిసిపోనుందని తెలిపారు. మల్టీ–లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగకుండా ముందుకు దూసుకెళ్లొచ్చని వెల్లడించారు. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత పరిజ్ఞానం ఉంటాయని వివరించారు. ఆయన గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన టోల్ వసూలు వ్యవస్థ ఇప్పటికే పది చోట్ల అమల్లో ఉందని, ఏడాదిలోగా దేశమంతటా విస్తరింపజేయబోతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ రాకతో టోల్ ఫీజుల కోసం ఎవరూ ఆపబోరని, రోడ్లపై ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదని అన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని, రుసుముల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నివారించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని నితిన్ గడ్కరీ వివరించారు. హైడ్రోజన్ కారు వాడుతున్నాదేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా ‘మిరాయ్’ వాహనాన్ని తాను ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడారు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కారు తరహాలోనే అంతే సౌలభ్యాన్ని ఇస్తోందని అన్నారు. మిరాయ్ అంటే జపాన్ భాషలో భవిష్యత్తు అని వెల్లడించారు. భవిష్యత్తు ఇంధనం హైడ్రోజన్ కాబోతోందని స్పష్టంచేశారు. శిలాజ ఇంధనాల దిగుమతి విలువ రూ.22 లక్షల కోట్లకు చేరిందని గడ్కరీ చెప్పారు. ఇలాంటి ఇంధనాలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టక తప్పదని వివరించారు. ఆధునిక ఇంధనాల ఎగుమతి విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవ ఇంధనాలను ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. -
చాట్‌జీపీటీ సాయంతో స్కామర్‌నే బోల్తా కొట్టించి..
డిజిటల్ అరెస్టులు.. ఆన్లైన్ స్కాములు నిత్యం వింటున్నాం. ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తారు? ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు లేదా ఆ సైట్లోకి వెళ్లడం మానేస్తారు. అయితే ఒక యువకుడు ఈ తరహా స్కామ్‌ను ఏఐ చాట్ జీపీటీ పవర్‌తో తిప్పికొట్టాడు. తనను మోసం చేయాలని చూసిన స్కామర్‌ను ట్రాక్ చేసి, అతని వివరాలు సేకరించి, చివరకు ‘నన్ను వదిలేయండి.. మహా ప్రభో’ అని వేడుకునేలా చేశాడు. ఈ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ మోసగాడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తన కాలేజీ సీనియర్‌గా, ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక స్కామర్ తక్కువ ధరలకు ఫర్నిచర్ అమ్ముతున్నానని చెబుతూ, డబ్బు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఈ మెసేజ్‌లో ఏదో తేడా ఉందని గ్రహించిన బాధితుడు, ఈ స్కామర్‌ను టెక్నాలజీ సాయంతో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారాన్ని ఒక ఏఐ ఆధారిత ఆపరేషన్‌గా మార్చి, చివరకు ఆ స్కామర్‌ను తన ట్రాప్‌లో పడేలా చేశాడు. ఇందుకోసం ఆ యువకుడు చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. స్కామర్‌కు నగదు పంపడానికి వీలుగా, చెల్లుబాటు అయ్యే విధంగా ఒక నకిలీ చెల్లింపు పోర్టల్‌ను రూపొందించాలని ఏఐకి ఆదేశించాడు. అయితే, ఈ వెబ్‌పేజీ ముఖ్య ఉద్దేశ్యం డబ్బు స్వీకరించడం కాదు.. అది క్లిక్ చేసిన వారి జియో లొకేషన్, ఐపీ అడ్రస్, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాతో వారి ఫొటోను రహస్యంగా సంగ్రహించడం. ఏఐ కొద్ది నిమిషాల్లోనే ఈ మోడల్‌కు అవసరమైన కోడ్‌ను రూపొందించింది. ఇది ఆన్లైన్ దొంగను పట్టుకోవడానికి వేసిన ఒక తెలివైన డిజిటల్ వలగా మారింది.ట్రాకర్ పేజీ సిద్ధమైన తర్వాత బాధితుడు స్కామర్‌కు ఆ లింక్‌ను పంపాడు. క్యూఆర్ కోడ్‌ను అప్లోడ్ చేయడం ద్వారా చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయవచ్చని నమ్మబలికాడు. అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో స్కామర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే ఆ నకిలీ పోర్టల్‌కు స్కామర్ ఉంటున్న ఖచ్చితమైన స్థానం, ఐపీ అడ్రస్, స్పష్టంగా' ఉన్న అతని సెల్ఫీ అందాయి. వెంటనే బాధితుడు ఆ వివరాలను తిరిగి స్కామర్కే పంపడంతో కథ ఊహించని మలుపు తిరిగింది.తన వివరాలు బయటపడటంతో స్కామర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే, వేర్వేరు నంబర్ల నుండి బాధితుడికి పదేపదే కాల్స్ చేసి.. ఈ పనిని ఇకపై చేయను అంటూ క్షమాపణలు కోరడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు షేర్ చేసిన స్క్రీన్షాట్లు చూసి స్కామర్ వణికిపోయాడు. ఈ మొత్తం వ్యవహారం గురించి సదరు యువకుడు ‘రెడిట్’లో పోస్ట్ చేస్తూ, చివర్లో.. ‘దొంగను బోల్తా కొట్టించడంలో ఆ తృప్తే వేరు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఘటన సైబర్ మోసాలను ఎదుర్కోవడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించింది. ఇది కూడా చదవండి: అమ్మకానికి పాక్ ఎయిర్‌లైన్స్.. గుంటనక్క చేతికే! -
పుతిన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ
న్యూఢిల్లీ: స్నైపర్లు, డాగ్ స్క్వాడ్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఆధారిత ఐదంచెల భద్రతా వ్యవస్థ. ఇవన్నీ ఏమిటో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా చేస్తున్న అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు! రష్యా నుంచి పుతిన్‌తో పాటు వెంట వచ్చే ప్రెసిడెంట్ బాడీగార్డులు, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్విస్‌కు చెందిన అత్యంత సుశిక్షితులైన సిబ్బంది ఈ ఏర్పాట్లకు అదనం. వీరంతా కాకుండా భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ విభాగానికి చెందిన టాప్ కమెండోలు ఎటూ రంగంలోకి దిగుతారు. ఇలా మొత్తమ్మీద పుతిన్ భారత పర్యటనకు భద్రతా ఏర్పాట్లు ఏకంగా అమెరికా అధ్యక్షుని పర్యటనను కూడా మించే స్థాయిలో సాగుతున్నాయి! ముందే రంగంలోకి 40 మంది ఉన్నతాధికారులు → పుతిన్ పర్యటన తాలూకు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి ఏకంగా 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే రంగంలోకి దిగారు. → వారు ఢిల్లీ చేరుకుని తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్నీ భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. → పుతిన్ కాన్వాయ్ వెళ్ళే ప్రతి మార్గాన్నీ ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. → అంతేగాక కాన్వాయ్ పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ కార్యాలయమే తెరిచారు! → పుతిన్ వెళ్లే మార్గాలన్నింటినీ ప్రత్యేక శిక్షణ పొందిన రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. → ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే అత్యున్నత స్థాయిలో ఉపయోగిస్తున్నారు. → కృత్రిమ మేధ(ఏఐ), ఫేషియల్ రికగి్నషన్ కెమెరాలు అంగుళం అంగుళాన్నీ వారికి అతి స్పష్టంగా పట్టి చూపనున్నాయి. → మొత్తం సెక్యూరిటీ ఛత్రంలో ఎన్ఎస్జీ కమెండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితం అవుతారు. → మిగతా నాలుగు లోపలి అంచెలనూ రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. → పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమెండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. → పుతిన్ బస చేసే హోటల్‌ను రష్యా వేగులు ఇప్పటికే జల్లెడ పట్టేశారు. → ఆయన వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. బిజీ బిజీ! ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ గురువారం మన దేశానికి రానున్నారు. సాయంత్రం కల్లా ఆయన ఢిల్లీలో భేటీ అవకాశముంది. రాత్రి మోదీ ఆయనకు విందు ఇస్తారని సమాచారం. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం రాజ్ ఘాట్‌లో మహాత్ముని సమాధిని సందర్శించి నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్రంలో పాల్గొంటారు. రాత్రి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను పుతిన్ తిలకిస్తారు. తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే ప్రభుత్వ విందులో పాల్గొంటారు. అసలు హైలెట్ ఆ కారే! ఆరస్ సెనట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలెట్ అదే. ఎలాంటి పెను దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకు ఉంది. వెనువెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఇందులో అనేక అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఇది అన్ని విధాలా శత్రు దుర్భేద్యం. అందుకే దీన్ని ముద్దుగా ‘నడిచే దుర్గం’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ లిమోజిన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార శిఖరాగ్రం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్‌తో కలిసి విహరించడం విశేషం. → ఆరస్ సెనట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్‌లో చేర్చారు. → నాటినుంచి అది ఆయన అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. → ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్‌ను తయారు చేశారు.రక్షణ మంత్రుల భేటీ నేడు భారత, రష్యా రక్షణ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఆండ్రే బెలెసోవ్ గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు. మరిన్ని ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు, సుఖోయ్–30 యుద్ధ విమానాల ఆధునీకరణలతో పాటు రష్యా నుంచి కీలక సైనిక సామగ్రి కొనుగోలు ప్రధాన ఎజెండా కానుంది. పుతిన్ బృందంలో భాగంగా బెలోసోవ్ భారత్ వస్తున్నారు. పుతిన్, మోదీ శిఖరాగ్రానికి ఒక రోజు ముందు రక్షణ మంత్రుల కీలక భేటీ జరుగుతోంది. అత్యంత అధునాతనమైన ఎస్–500 డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనలను కూడా రాజ్‌నాథ్ ఈ సందర్భంగా బెలోసోవ్ ముందు ఉంచవచ్చని సమాచారం. సుఖోయ్–57 యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేసే యోచన ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారమే తెలిపారు. ఐదో తరం యుద్ధ విమానాల కోసం భారత్ ప్రయతి్నస్తున్న నేపథ్యంలో ఈ అంశమూ చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్‌గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్‌లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025 -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్‌కు వచ్చే మెసేజ్‌ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్‌గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్‌లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్‌గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్‌ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్‌లో ఏఐ యాప్‌లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్‌ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్‌లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్‌కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్‌ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్‌ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్‌గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
పరిశోధకులకూ ఏఐ
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల దైనందిన అభ్యాసంలో ఈ నూతన సాంకేతికత ఒక భాగమైంది. పరిశోధకులకూ కృత్రిమ మేధ ఆయుధం కావడం విభిన్న రంగాల్లో వేగవంతమైన పురోగతికి జీవం పోసినట్టయింది. వేగంగా పరుగుతీస్తున్న ప్రస్తుత యుగంలో పరిశోధకులు, సంస్థలు కృత్రిమ మేధను ఎంత సమర్థవంతంగా స్వీకరిస్తాయి, సహకారాన్ని పెంపొందించుకుంటాయి, స్థితిస్థాపకతను ఎలా నిర్మిస్తాయి అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుందని ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్ చెబుతోంది.నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ రీసర్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ పేరుతో 113 దేశాల్లో సర్వే చేపట్టింది. 3,234 మంది రీసర్చర్స్ ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సాంకేతికత సామర్థ్యంపై సానుకూల ధోరణి, పెరుగుతున్న వినియోగంతో పరిశోధనా వ్యవస్థను ఏఐ పునర్నిర్మిస్తోందని నివేదిక తెలిపింది. ‘పరిశోధకులు ఏఐని ఒక పరివర్తన సాధనంగా గుర్తించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంచుతోంది. డేటా విశ్లేషణకు సాయపడుతోంది. కృత్రిమ మేధ ప్రయోజనాలను ఇప్పటికే వీరు అందుకున్నారు’ అని వివరించింది.సగం కంటే ఎక్కువగా..పనులను ఆటోమేట్ చేయడానికి ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. మానవ మేధస్సును పెంపొందించడానికి, అపూర్వమైన వేగంతో వాస్తవ జ్ఞానాన్ని సృష్టించడానికి వీలు కల్పించే సృజనాత్మక భాగస్వామిగా కూడా కృత్రిమ మేధ మారుతోందని నివేదిక వివరించింది. పరిశోధనలో ఏఐ స్వీకరణ పెరిగింది. సర్వేలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో 58% మంది రీసర్చ్కు సంబంధించిన పనుల్లో ఏఐ సాధనాలను ఉపయోగించారు. 2024లో ఈ సంఖ్య 37% మాత్రమే. ఈ ఏఐ యూజర్లలో 61% మంది తాజా పరిశోధనలను కనుగొని, సంగ్రహించడానికి, 51% మంది సాహిత్య సమీక్షల కోసం నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పారదర్శకత, వేగం.. ఈ రెండు ప్రత్యేకతలు ఏఐ పట్ల విశ్వాసాన్ని పెంచుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఏఐ ఆటోమేటిక్‌గా సూచనలను ఉదహరిస్తున్నప్పుడు పారదర్శకత ఉండాలని 59%, ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందించాలని 55% పరిశోధకులు అభిప్రాయపడ్డారు.సానుకూల ఫలితాలుసామర్థ్యాన్ని పెంచగలిగే శక్తి ఏఐకి ఉందన్న అంశంపై పరిశోధకుల్లో అత్యధికులు సానుకూలంగా ఉన్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే తమ సమయాన్ని ఆదా చేస్తోందని 58% మంది తెలిపారు. రాబోయే 2–3 సంవత్సరాలలో తమ సమయాన్ని ఆదా చేస్తుందని మూడింట రెండువంతులకుపైగా రీసర్చర్స్ ఆశిస్తున్నారు. రాబోయే 2–3 ఏళ్లలో నూతన జ్ఞానాన్ని నడిపించే సృజనాత్మక శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని 61% పరిశోధకులు నమ్ముతున్నారు. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో తగినంత సిద్ధంగా లేమని అత్యధికులు భావిస్తున్నారు. ఏఐలో తక్కువ శిక్షణ పొందామని 45% రీసర్చర్స్ భావిస్తున్నారు. మూడింట ఒక వంతు పరిశోధకులు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సిబ్బందికి శిక్షణలో తమ కంపెనీ విధానం బాగుందని అంగీకరిస్తున్నారు.ఏఐ సాధనాలను అస్సలు ⇒ ఉపయోగించని పరిశోధకుల్లో అమెరికా నుంచి 25%, భారత్ నుంచి 26%, చైనా నుంచి 4% ఉన్నారు. ⇒ ఏడేళ్లలోపు అనుభవం ఉన్న రీసర్చర్స్లో 83%, 20 ఏళ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారిలో 65% ఏఐ టూల్స్ వాడుతున్నారు.⇒ సర్వేఈ–మెయిల్ ఇన్విటేషన్ ద్వారా ఆన్లైన్లో..⇒ చేపట్టింది ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్⇒ టైటిల్ రీసర్చర్ ఆఫ్ ధ ఫ్యూచర్⇒ ఎప్పుడు: 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య ఎంత మంది: 113 దేశాల నుంచి 3,234 మంది పాల్గొన్నవారు: పరిశోధకులు, విద్యా, పరిశోధన సంస్థల ముఖ్యులుఏఐ టూల్స్ వినియోగం ఇలా..⇒ రీసెర్చ్ పనుల్లో భాగంగా.. 58%⇒ ఇతర అవసరాలకు 26%⇒ అసలు వినియోగించలేదు 16% -
అత్యవసరంగా ఏఐ స్కిల్స్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కొత్త టెక్నాలజీ. కంపెనీలూ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. జాబ్ మార్కెట్లో ఉద్యోగులు నిలదొక్కుకోవాలంటే కృత్రిమ మేధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. అది కూడా ఇప్పటికిప్పుడే. ప్రధానంగా టెక్ రంగంలోని సిబ్బందికి ఈ ఆవశ్యకత ఏర్పడింది. ఏఐ స్కిల్స్ ఉన్నఫళంగా నేర్చుకోవాల్సిందేనా? జీసీసీ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆన్సర్’.. తన గ్లోబల్ టాలెంట్ ప్లాట్‌ఫామ్ ‘టాలెంట్500’తో కలిసి రూపొందించిన ‘ఏఐ అడ్వాంటేజ్ సర్వే రిపోర్ట్–2025’ అవుననే చెబుతోంది.కృత్రిమ మేధ నైపుణ్యాలు తమ భవిష్యత్తుకు అనివార్యమైనవిగా టెక్ నిపుణులు భావిస్తున్నారని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70% కంటే ఎక్కువ మంది నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఏఐ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేగంగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని నివేదిక వివరించింది. సొంతంగా చొరవ.. పనిచేస్తున్న సంస్థలు అధికారికంగా ఇచ్చే శిక్షణ కోసం ఉద్యోగులు వేచిచూడటం లేదని నివేదిక తెలిపింది. చాలామంది టెకీలు యూట్యూబ్, సొంతంగా అభ్యాసం, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకుంటున్నారు. 53.7% మంది సొంత డబ్బు వెచి్చంచి నేర్చుకుంటున్నారు. అయితే, నాలుగింట ఒకవంతు మంది రూ.10 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుండడం విశేషం. ‘ఏఐ నైపుణ్యాలు కెరీర్‌ను రూపొందిస్తాయని ఉద్యోగులకు తెలుసు. కాబట్టే వేగంగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సొంతంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా జీసీసీలకు ఈ ఆవశ్యకత అసలైన ప్రయోజనం చేకూర్చనుంది. నేర్చుకోవడానికి ఆసక్తిగా, సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఏఐ సామర్థ్యాలను ఉన్నతంగా నిర్మించడానికి సరైన పునాదిని సృష్టిస్తుంది. ఈ శక్తికి వెన్నంటి నిలిచినప్పుడు అది సంస్థకు నిజమైన బలంగా మారుతుంది’.. అని నివేదిక స్పష్టం చేసింది.ఎవరెవరు ఉన్నారంటే..భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) ఇంజనీరింగ్, ప్రోడక్ట్, క్యూఏ, డేటా, ఆపరేషన్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న 3,000 మందికి పైగా వృత్తి నిపుణులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో బెంగళూరు నుంచి 48.5%, హైదరాబాద్ 22.2%, ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి 14.3% మంది ఉన్నారు. మిగిలినవారు పుణే, ముంబై, చెన్నైకి చెందినవారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35 ఏళ్లలోపు వారు 71% మంది ఉన్నారు. అయితే కోడింగ్, రీసెర్చ్, డేటా అనాలిసిస్ రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంది. 1–2 ఏళ్లలో తమ ఉద్యోగాల్లో ఏఐ చాలా మార్పులు తెస్తుందని అత్యధికుల భావన. -
ఏఐతో ఉత్పాదకత పెరుగుతుంది
న్యూఢిల్లీ: కంపెనీలు మరిన్ని లాభాల కోసమే కృత్రిమ మేథ (ఏఐ) జపం చేస్తున్నాయనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని సేల్స్‌ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనితో ఉత్పాదకత పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని, వైద్యం..విద్యలాంటి సేవలను గణనీయంగా విస్తరించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఏజెంటిక్ ఏఐ వల్ల ఉద్యోగాల తొలగింపు కన్నా ఉద్యోగులకు మరింత సాధికారత లభిస్తుందని వివరించారు. ఏఐ శకంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పారు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కిక్కిరిసిపోయే అవకాశం ఉందని .. అలాంటి పరిస్థితుల్లో ఏజెంటిక్ ఏఐ, డిజిటల్‌పరమైన మద్దతుతో వాటిపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ వ్యవస్థ విషయానికొస్తే రోగ లక్షణాలను రికార్డ్ చేసేందుకు, పేషంటును చూడటానికి ముందే డాక్టరుకు ప్రాథమిక విశ్లేషణ ఇచ్చేందుకు ఏజెంటిక్ ఏఐ ఉపయోగపడుతుందని భట్టాచార్య చెప్పారు. టెక్నాలజీ, యూపీఐలాంటి ప్లాట్‌ఫాంల వల్లే బ్యాంకింగ్ పరిధిలోని వారికి కూడా సరీ్వసులను విస్తరించేందుకు వీలయ్యిందన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా సేల్స్‌ఫోర్స్‌కి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా కొనసాగుతోందని ఆమె చెప్పారు. -
హీరోయిన్ మెసేజ్ చేసిందా? అయితే జాగ్రత్త
-
ఏఐ వ్యూహంలో భారత్ కీలకం
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్‌మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్‌గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్‌కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్‌లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్‌లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్టీటీ ఆర్అండ్డీ ఫోరమ్‌లో ఎన్టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి. -
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్‌రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్‌కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్‌లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు. -
ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే
జోహన్నెస్‌బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ వాడకంలో జవాబుదారీతనం కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్‌ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్‌లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు. ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్‌ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో ఆహార భద్రత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
డిగ్రీ కోర్సులు మార్చాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల రీడిజైన్ మొదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ఈ దిశగా స్పీడ్ పెంచారు. అకడమిక్ ఆడిట్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కోర్సులపై సమగ్ర వివరాలు పంపాలని లేఖలు రాయబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త కోర్సులతోపాటు కొన్ని కోర్సులకు ఉద్వాసన పలికే అవకాశముందని మండలి వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా డిగ్రీ కోర్సుల ద్వారా ఉపాధి లభించే విధంగా కొత్తదనాన్ని మేళవించే ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ సహా కొత్త అప్లికేషన్స్ పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రతీ సబ్జెక్టులోనూ 20% మేర ఆధునిక సాంకేతిక చాప్టర్లకు రంగం సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా సిలబస్ రూపకల్పనలో ఉన్నారు. త్వరలో కోర్సులపై సీఎం రేవంత్‌రెడ్డికి బాలకిష్టారెడ్డి నివేదిక ఇవ్వబోతున్నారు.సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు డిగ్రీ కోర్సులకు అరకొర స్పందనే వస్తోంది. రాష్ట్రంలో 957 డిగ్రీ కాలేజీల్లో 4,36,947 సీట్లు అందుబాటులో ఉంటే, మూడు విడతల దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత కూడా చేరిన విద్యార్థుల సంఖ్య 2.15 లక్షలే. ప్రతీ సంవత్సరం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యే నాటికి కొన్నేళ్లుగా గరిష్టంగా 2.20 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారి సంఖ్య 37 శాతం మించడం లేదు.గ్రామీణ ప్రాంత కాలేజీల్లో అతి తక్కువమంది చేరుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఉన్న కాలేజీల్లో కొంతమేర సీట్లు భర్తీ అవుతున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్ టైం పనిచేసుకునేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవకాశాలుంటున్నాయి. దీంతోపాటు డిగ్రీ తర్వాత ఉపాధి పొందే స్కిల్ కోర్సులు నేర్చుకునేందుకు రాజధాని వేదికగా మారింది. దీంతో గ్రామీణ ప్రాంత కాలేజీల్లో విద్యార్థుల చేరికలు పెద్దగా ఉండటం లేదు. ఒకవేళ డిగ్రీలో చేరాల్సి వస్తే ప్రభుత్వ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నారు.⇒ఇప్పటి వరకూ దోస్త్ ద్వారా ఎక్కువ మంది బీకాం కోర్సులోనే చేరారు.⇒1,41,590 మంది వివిధ కోర్సుల్లో చేరితే, ఇందులో అత్యధికంగా బీకాంలో 54,771 మంది చేరారు.⇒ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 27,059 మంది చేరారు⇒బీఏ కోర్సులో 60,414 సీట్లు ఉంటే, చేరిన విద్యార్థులు మాత్రం 19,104 మాత్రమే⇒ఇటీవల కాలంలో బీబీఏ కోర్సుకు కొంత ఆదరణ పెరిగింది. ఈ కోర్సులో 11,462 మంది చేరారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న కోర్సులను మాత్రం విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త కోర్సులుంటేనే అనుమతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ కూడా సీట్ల కుదింపు చేపట్టాలనే ఆలోచన చేస్తున్నారు. మార్కెట్ అవసరాలు తీర్చే కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తేనే అనుమతులు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అకడమిక్ ఆడిట్‌ను ఈ దిశగానే రూపొందిస్తున్నారు. కనీసం ఐదేళ్లుగా ఏఏ కోర్సుల్లో, ఏఏ కాలేజీల్లో ఎంతమంది చేరుతున్నారనే డేటా తీస్తున్నారు. విద్యార్థులు ఇష్టపడని కాలేజీలు, కోర్సులను ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నారు.వీటిస్థానంలో టెక్నాలజీతో మిళితమైన కోర్సులను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే డిగ్రీ కోర్సుల స్వభావం మారింది. డేటాసైన్స్ సహా పాలనపరమైన మెళకువలు ఉండే కొత్త కోర్సుల కాంబినేషన్ తీసుకొచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ దిశగా మార్పులు సూచించింది. ఫ్యాకల్టీ సమస్య ఉన్న కాలేజీలు ఆన్లైన్లో ఇతర విశ్వవిద్యాలయాల నుంచి అధ్యాపకుల సేవలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోనూ ఈ దిశగా జరుగుతున్న కసరత్తుపై వచ్చేవారం స్పష్టత వస్తుంది. అకడమిక్ ఆడిట్ చేస్తాం డిగ్రీ కోర్సులను పూర్తిగా మార్చబోతున్నాం. పారిశ్రామిక భాగస్వామ్యంతో స్కిల్ ఉండేలా, ఇతర దేశాల్లోనూ ఉపాధికి బాటలు వేసేలా వీటిని రూపొందించాలనే ఆలోచేన చేస్తున్నాం. కోర్సులు, సీట్ల పరిస్థితిపై అకడమిక్ ఆడిట్ చేపడుతున్నాం. అన్ని విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుంటున్నాం. త్వరలోనే కొత్త విధానంపై స్పష్టత ఇస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్‌కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్‌పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్‌కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్‌కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్‌తో కూడిన ఏఐ మోడల్స్‌ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్‌కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్‌కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్‌లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్‌ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్‌ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్‌ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్‌కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్‌తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్‌బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్‌ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
నా ఫోటోలు అలా చూస్తుంటే చాలా బాధేస్తోంది: కీర్తి సురేశ్
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రస్తుతం రివాల్వరీ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్ సెంట్రిక్ కథతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ప్రస్తుతం చెన్నైలో రివాల్వర్ రీటా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ వినియోగంపై కీర్తి సురేశ్ మాట్లాడారు. ఏఐతో సోషల్ మీడియాలో వస్తోన్న ఫోటోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తన ఏఐ మార్ఫింగ్ ఫోటోలను చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఈ రోజుల్లో ఏఐ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది ఒక వరమే కానీ..ఒక రకంగా శాపం కూడా. మానవులు సాంకేతికతను కనుగొన్నారు. కానీ ఇక్కడ మనం నియంత్రణ కోల్పోతున్నాం. సోషల్ మీడియాలో అసహ్యకరమైన దుస్తుల్లో నా చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంటా. నేను ఎప్పుడైనా నిజంగానే ఇలాంటివీ ధరించానా అని షాకవుతుంటా. ఇటీవల నేను సినిమా పూజ కోసం ధరించిన దుస్తులను వేరే కోణంలోకి మార్చి చూపించారు. అది చూసిన క్షణం నేను షాకయ్యా. ఆ తర్వాత నేను అలా పోజు ఇవ్వలేదని గ్రహించా. ఇలాంటివి చూసినప్పుడు చిరాకు తెప్పిస్తుంది. అంతేకాదు బాధగా కూడా అనిపిస్తుంది" అని పంచుకుంది.ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాదని.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు గురైన ఎవరినైనా ప్రభావితం చేస్తుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఏఐ వినియోగం పెరిగాక పలువురు సెలబ్రిటీల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి ఆండ్రియా జెరెమియా కూడా ఏఐతో సంబంధం ఉన్న నష్టాల గురించి ప్రస్తావించారు, ఈ సాంకేతికత వినోద రంగానికి సవాల్‌గా మారిందన్నారు. కేవలం నటులకే కాదు ప్రజలకు కూడా ఏఐ సమస్యగా మారుతోందని.. ఏఐ మన కోసం పనిచేయాలి.. మరోలా కాదన్నారు. -
ఏఐ వినియోగంలో వెనుకబడ్డ భారత్
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మాత్రం మన కంపెనీలు గణనీయంగా వెనుకబడ్డాయి. ఇప్పటికీ 45 శాతం సంస్థలు ఏఐ వినియోగానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నాయి. చాలా మటుకు సంస్థలు ఏఐ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇతర గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాయి. హెచ్ఆర్ ప్లాట్‌ఫాం ’డీల్’ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 45 శాతం భారతీయ సంస్థలు ఏఐ వినియోగం విషయంలో ప్రారంభ దశలో ఉండగా, 38 శాతం కంపెనీలు మధ్య స్థాయిలో ఉన్నాయి. కేవలం 17 శాతమే అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయి. తమ ప్రధాన వ్యాపార ప్రక్రియలు, ఆవిష్కరణల్లో ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 22 మార్కెట్లకు చెందిన 5,500 వ్యాపార దిగ్గజాలతో సెపె్టంబర్లో డీల్ ఈ సర్వే నిర్వహించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు .. → ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ 54 శాతం కంపెనీల్లో మాత్రమే అధికారికంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణను అమలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇది 67 శాతంగా ఉంది. సాంకేతిక పురోగతి, సిబ్బంది సన్నద్ధత మధ్య పెరుగుతున్న అంతరాన్ని, శిక్షణపై తక్షణం మరింతగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది. → మానవ వనరుల (హెచ్ఆర్) కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగుల నిర్వహణ (66 శాతం), ఉద్యోగుల నియామకాల్లో (57 శాతం) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. → పని విధానాలను, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను ఏఐ సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మారుతున్నాయి. అలాగే కంపెనీలు పరిగణనలోకి తీసుకునే నైపుణ్యాలు కూడా మారుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపార సంస్థలు దీనికి వేగంగా అలవాటు పడాలి. → ఏఐ వల్ల అంతర్జాతీయంగా 91 శాతం కంపెనీల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన విధుల స్వరూపం మారింది. ఏఐని అనుసంధానించేందుకు మూడో వంతు సంస్థలు (34 శాతం)గణనీయ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. → వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగ విధుల్లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు 43 శాతం కంపెనీలు వెల్లడించాయి. → వచ్చే 1–3 ఏళ్ల వ్యవధిలో ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ నియామకాలు తగ్గుతాయని 70 శాతం దేశీ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ సిబ్బందిని తీసుకోవడంలో అకడమిక్ డిగ్రీల కన్నా 66 శాతం కంపెనీలు సాంకేతిక సరి్టఫికేషన్లకు, 58 శాతం కంపెనీలు సమస్యల పరిష్కార సామర్థ్యాలకు, 52 శాతం సంస్థలు కమ్యూనికేషన్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. → కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచే విషయంలో భారత సంస్థలు వెనుకబడి ఉన్నాయి. 54 శాతం సంస్థలు మాత్రమే రీస్కిలింగ్‌పై స్థిరంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న దేశాలన్నింటిలోకెల్లా ఇదే అత్యల్పం. ఈ విషయంలో కెనడా (77 శాతం), బ్రెజిల్ (76 శాతం), సింగపూర్ (74 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి. → 45 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి రీస్కిలింగ్ కార్యక్రమాలు ప్రారంభించలేదు. వచ్చే 12 నెలల్లో ప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి. ఏఐ నైపుణ్యాలున్న వారిని రిక్రూట్ చేసుకోవడంలో 63 శాతం సంస్థలు సవాళ్లు ఎదుర్కొంటుకున్నాయి. -
పంజరం లేని పెంపుడు చిలక
వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేకఅంశాలపై ఆందోళన తీరేదెలా?ఇప్పుడేం జరిగింది?శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్‌లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ పత్రం ఏం చెబుతోంది?ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్‌ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్‌స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్‌లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.రానున్న రోజుల్లో ఏం జరగనుంది?ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్‌లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి. -
ఏఐ.. నమ్మించి, నట్టేట ముంచుతోందిలా..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ చాట్బాట్లు తప్పుదారి పట్టించే సమాచారాన్ని అధికారిక రూపంలో వెల్లడిస్తున్నాయన్నారు. ఏఐలోని ఈ అంతర్గత లోపాలను సరిదిద్దకపోతే అవి వినియోగదారుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏఐ శిక్షణ పొందిన తన డేటాలోని నమూనాల ఆధారంగా తదుపరి పరిణామాలను అంచనా వేసి, ఫలితాలను అందిస్తుంది. అయితే ఈ క్రమంలో పలు తప్పిదాలు దొర్లుతుంటాయి.కల్పిత అవుట్‌పుట్‌లు: కృత్రిమ మేథ(ఏఐ) దాని వినియోగదారునికి నమ్మకం కల్పిందేందుకు కల్పిత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది.తప్పులను ఒప్పులుగా: ఏఐ తనలోని లోపాన్ని అంగీకరించే బదులు.. తప్పులను కూడా నమ్మించేలా చేస్తుంది.అస్పష్టమైన ప్రాంప్ట్‌లు: వినియోగదారు అడిగిన ప్రశ్నపై స్పష్టత లేనప్పుడు, ఏఐ ఆ అనిశ్చితిని అంగీకరించకుండా, ఏదో ఒక సమాధానాన్ని ఊహించి ఇస్తుంది.ఇటువంటి సమస్యలు ఉద్దేశపూర్వక అబద్ధాలు కావని, ఏఐ చాట్బాల్లోని నిర్మాణాత్మక లోపాలని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ లోపాలను సరిదిద్దాలని ఆయన సూచించారు.ఇటీవలి ఏఐ తప్పిదాలుగూగుల్ జెమిని(2025): ఈ ఏఐ మోడల్ యూఎస్ వ్యవస్థాపక పితామహుల చిత్రాలను వారి జాతిపరంగా తప్పుగా రూపొందించింది. ఇది పక్షపాత ధోరణితో చేసినదంటూ చర్చకు తావిచ్చింది.చాట్ జీపీటీ లీగల్ కేసు (2023–2024): న్యూయార్క్‌లోని న్యాయవాదులు చాట్‌బాట్‌ను నమ్మి.. అది అందించిన ఉనికిలో లేని కోర్టు కేసులను తమ న్యాయ పత్రాలలో పాటు సమర్పించారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, సదరు న్యాయవాదులపై ఆంక్షలు విధించింది.మైక్రోసాఫ్ట్ కాపీలాట్(2024): ప్రత్యక్ష పరిశోధనకు కనెక్ట్ కాని సందర్భాలలో పాత ఆర్థిక డేటాను తయారు చేసింది. ఇది ఆర్థిక విశ్వసనీయతపై ఆందోళనలను పెంచింది.మెటా ఏఐ అసిస్టెంట్లు (2024): తప్పుడు కెరీర్ విజయాలతో ప్రముఖుల గురించి కల్పిత జీవిత చరిత్రలను సృష్టించాయి. తద్వారా వారి ప్రతిష్టకు భంగం కలిగించాయి.ఈ విధమైన సమస్యల ను పరిష్కరించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. గూగుల్ తన జెమినిని మెరుగుపరుస్తోంది. అలాగే ఓపెన్ ఏఐ.. కల్పిత సూచనలను తగ్గించేందుకు సైటేషన్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. మైక్రోసాఫ్ట్ రియల్-టైమ్ సెర్చ్ ఇంటిగ్రేషన్‌ను మెరుగుపరుస్తోంది. పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వ్యవస్థలను రూపొందించేందుకు ఏఐ కంపెనీలు కృషి చేస్తున్నాయి.ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి.. -
మెదడుకు పని చెప్పండి
సాక్షి, స్పెషల్ డెస్క్: కృత్రిమ మేధ.. ఈ దశాబ్దపు సాంకేతిక విప్లవం. కంపెనీలు, పరిశోధన సంస్థలు, విద్యాలయాలు, వ్యక్తులు.. అందరికీ ఏఐ ఒక ఆయుధం అయ్యింది. విద్యార్థుల అభ్యాస ప్రక్రియను ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మెరుగుపరుస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. జెనరేటివ్ ఏఐ సాధనాలు మెరుపు వేగంతో తరగతి గదుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వాస్తవానికి ఈ ఏఐ సాధనాలు.. క్లిష్టమైన మానసిక సామర్థ్యాలను పెంచడానికి బదులుగా దెబ్బతీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. నేచర్ జర్నల్‌లో..: విద్యకు సంబంధించి ఏఐపై అనేక అధ్యయనాలు, సానుకూల నివేదికలు వెలువరించాయి. వాటిలో ఒకటి 2025 మే నెలలో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. చాట్బాట్లు అభ్యాసం, ఉన్నతస్థాయి ఆలోచనలకు సహాయ పడతాయని ఈ నివేదిక వెల్లడించింది. కానీ ఈ పరిశోధనా పత్రాలలో చాలా వాటిలో విధానపరమైన లోతుపాతులను నిపుణులు ఎత్తి చూపారు. విద్యార్థుల పనితీరు, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను ఏఐ దెబ్బతీస్తోందని ఇతర అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు చాట్ జీపీటీని ఎక్కువగా ఉపయోగించిన విద్యార్థులు.. ఆ జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులో లేకపోతే.. అదే టాస్క్‌ను చేయలేక చేతులెత్తేశారని ఒక పరిశోధన పత్రం స్పష్టం చేసింది. ఆలోచన, జ్ఞాపక శక్తి, ధ్యాస, సమస్య పరిష్కారం, తార్కికత, భావనలను అర్థం చేసుకోవడం, వినడం వంటివి ముఖ్యమైన మానసిక ప్రక్రియలు. జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల అభ్యాసం, జ్ఞాపకశక్తిపై హానికరమైన ప్రభావం ఉంటుందని బాయ్జీ స్టేట్ యూనివర్సిటీలో కాగ్నిటివ్ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బ్రియాన్ డబ్లు్య స్టోన్ వెల్లడించారు. ‘ఈ సాంకేతికత సొంత అవగాహన, సామర్థ్యాలను తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఇది మెటాకాగ్నిటివ్ ఎర్రర్స్‌కు దారితీస్తుంది. ఉదాహరణకు కారులో తరచూ వెళ్లే దారిపై దృష్టి సారించకుండా పూర్తిగా జీపీఎస్‌కు అలవాటు పడితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది’అని వివరించారు. ఒక వ్యక్తి తన మానసిక సామర్థ్యాలను కచ్చితంగా పర్యవేక్షించే, మూల్యాంకనం చేసే, నియంత్రించే సామర్థ్యంలో లోపాలను మెటాకాగ్నిటివ్ ఎర్రర్స్ అంటారు. మెదడు చేయకపోతే.. సంప్రదాయ వెబ్ శోధనకు బదులుగా చాట్ జీపీటీని ఉపయోగించి ఒక అంశంపై పరిశోధన చేసిన విద్యార్థులు సంబంధిత టాస్క్ సమయంలో తక్కువ జ్ఞాన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది. వారు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవడంతో పరిశోధించిన అంశం గురించి అధ్వానమైన తార్కికతను వెల్లడించారు. మరొక అధ్యయనంలో ఏఐ వాడనివారి కంటే.. ఏఐ ఉపయోగించి చాట్ జీపీటీ నుంచి సమాచారాన్ని కాపీ, పేస్ట్ చేయడం ద్వారా విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేశారు. కానీ ఈ విద్యార్థులు జ్ఞాన సముపార్జనలో వెనుకబడ్డారు. ఇలా ఏఐపై ఆధారపడడం (మెటాకాగ్నిటివ్ లేజీనెస్) వల్ల స్వల్పకాలంలో పనితీరు మెరుగుదలను ప్రేరేపించవచ్చు. కానీ దీర్ఘకాలిక నైపుణ్యాల స్తబ్దతకు కూడా దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నైపుణ్య పునాది బలంగా ఉంటే ఏఐ సాధనాలు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ సమస్యను పరిష్కరించడానికి, అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రారంభ పనిని మెదడు చేయకపోతే ఆ పునాదులు ఏర్పడవని చెబుతున్నారు. ఎల్లప్పుడూ మెదడుకు శిక్షణ విద్యార్థులు ఏఐని వ్యక్తిగత శిక్షకుడిగా భావించడం ఉపయోగకరంగా ఉండొచ్చు. నేర్చుకునే విధానాన్ని సమీక్షించేలా, తదుపరి స్థాయికి వెళ్లేలా, మరింత కష్టపడి పనిచేయడానికి వెన్ను తట్టేలా ఏఐ సాధనాలు ఉండాలని బ్రియాన్ డబ్లు్య స్టోన్ తెలిపారు. ‘ఏఐ అనేది మరింత పదును పెట్టే లెర్నింగ్ సాధనంగా, ఎప్పుడూ అందుబాటులో ఉన్న జ్ఞాన సమాచార వ్యవస్థతో పర్సనలైజ్డ్ ట్యూటర్‌గా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సాధానాలు కేవలం సమాధానాలు ఇవ్వడానికి బదులుగా విద్యార్థులకు ప్రశ్నలు సంధిస్తూ, సూచనలు చేసేలా ఉండాలి. కష్టపడి పనిచేయకుండా ఉండటానికి జవాబులతో సిద్ధంగా ఉన్న ఏఐని ఉపయోగించడం వల్ల బోధన, కోర్సు రూపకల్పన ప్రాథమిక, సాధారణ సమస్యగా కొనసాగుతుంది. అంతేకాదు జ్ఞాన నైపుణ్యాన్ని దెబ్బతీస్తున్న షార్ట్‌కట్ మెథడ్స్‌ను నివారించేలా విద్యార్థులను ప్రేరేపించాలన్న ప్రాథమిక భావన మరుగున పడుతుంది. అయితే ఏఐ ఉన్నా, లేకపోయినా లోతైన జ్ఞానం, నైపుణ్యంపై పట్టు సాధించడానికి ఎల్లప్పుడూ మెదడుకు శిక్షణ అవసరం’అని తెలిపారు. -
కృత్రిమ మేధతో.. కొలువుల కోత
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. కంపెనీలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం. ఏఐలో పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా కంపెనీలు తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కూడా కొలువుల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఏఐ అధిక వినియోగం ఉద్యోగుల తీసివేతలకు కారణం అవుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఈ ఏడాది జూన్ లో జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఆయన కంపెనీ విషయంలో నిజమైంది. సుమారు 14,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలే అమెజాన్ ప్రకటించింది. ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి, ఖర్చులు తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం వరకు తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ప్రకటించింది. మెటా, టీసీఎస్.. ఇలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టాయి. వారికంటే ఎక్కువ జీతాలుఏఐ నైపుణ్యాలున్న కార్మికుల సగటు వేతనాలు.. సంబంధిత రంగంలోని ఇతర ఉద్యోగుల సగటు జీతం కంటే 56% అధికంగా ఉండడం విశేషం. ప్రధానంగా హోల్‌సేల్–రిటైల్, ఇంధనం, సమాచారం, రవాణా – నిల్వ, రియల్టీ, తయారీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తోంది. ఏఐ రంగంలో నిపుణుల కొరత వల్లే.. ఈ నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ విలువ ఇస్తున్నాయని పరిశ్రమ చెబుతోంది. ఈ సంవత్సరం మొత్తం లేఆఫ్‌లలో ఇంటెల్, లెనోవో వంటి హార్డ్‌వేర్ కంపెనీల వాటా సుమారు 28%. అమెజాన్, ఈబే తదితర కంపెనీలు 14%, సేల్స్ (సేల్స్‌ఫోర్స్) 9%, కంజ్యూమర్ టెక్ (మెటా, గూగుల్) సంస్థలు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.పెట్టుబడులు ఇంతింతై..ప్రపంచవ్యాప్తంగా 2013లో ఏఐ రంగంలో పెట్టుబడులు సుమారు 15 బిలియన్ డాలర్లు కాగా.. 2019 నాటికి 103 బిలియన్ డాలర్లకి, 2024కి 252 బిలియన్ డాలర్లకి పెరిగాయి. -
కొలువుల్లో వాటా పెరిగింది
భారత్‌లో కృత్రిమ మేధతో (ఏఐ) నడిచే రంగాలు తమ నియామకాల సరళిలోని ప్రాధాన్యాలను మార్చుకోవడంతో ఐదేళ్లలో తొలిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం పురుషులను మించిపోయిందని ఇండియా స్కిల్స్–2026 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలు ఉపాధి సామర్థ్యాల కొలమానాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులు 80 శాతం, ఐటీ ఇంజనీర్లు 78 శాతం ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుషుల కంటే మహిళా గ్రాడ్యుయేట్స్‌కే నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు పేర్కొంది. ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌కు సంబంధించిన విభాగాలు మహిళలకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్శిక్షణ ఇప్పించి మరీ..నిపుణుల కొరతను నిరంతరంగా ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాలలోని సంస్థలు.. సూక్ష్మ–క్రెడెన్షియల్స్ (నిర్ధిష్ట నైపుణ్యాలు), పరిమిత స్థాయి యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ మహిళలను నియమించుకుంటున్నాయి. ఏఐ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవటం, మహిళల నైపుణ్యాలకు ఎక్కువ అవకాశాలకు లభించటం కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది. ఐదేళ్లలో ముందడుగు..ప్రస్తుతం మహిళల ఉద్యోగ సామర్థ్యం రేటు 54 శాతం వద్ద ఉంది. ఐదేళ్లలో మొదటిసారిగా పురుషులను దాటి మెరుగైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విషయంలో ఈ సామర్థ్యం రేటు 51.5 శాతం ఉంది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం నగరాలు, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. న్యాయ, ఆరోగ్య సేవల రంగాలలోని ఉద్యోగ అవకాశాలపై మహిళలు వరుసగా 96.4 శాతం, 85.95 శాతం మంది ఆసక్తి చూపుతుండగా; పురుషుల్లో 83.11 శాతం మంది గ్రాఫిక్ డిౖజైన్, 64.67 శాతం మంది ఇంజినీరింగ్ డిజైన్ ఉద్యోగావకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ఫాస్ట్ మూవింగ్..’ లోనూ..! ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలు 1–5 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాలలో ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ మహిళా నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ల నియామకాలు 35 శాతానికి చేరుకోవడం విశేషం. వీరిలో మహిళలకే కాస్త ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తోందని నివేదిక పేర్కొంది. కామర్స్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు గత సంవత్సరం ఉన్న 55 శాతం నుంచి ఈ ఏడాదికి 62.81 శాతానికి పెరిగాయి. సైన్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన రంగాలు కూడా ఉద్యోగ అవకాశాల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మూడింటిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని నివేదిక తెలిపింది. -
ఏఐ వచ్చేసింది... మేల్కోండి!
సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు.. ఆర్జీవీ!విమర్శలకు బెదరడు.. మనసులో ఉన్న చెప్పకా మానడు.తన ట్వీట్లతో తరచూ వివాదాల్లో ఉండే ఈ సినీ దర్శక దిగ్గజం...తాజాగా విద్యా వ్యవస్థపై తన విమర్శలను ఎక్కుపెట్టాడు.కృత్రిమ మేధ అంతకంతకూ విసృ్తతమవుతున్న ఈ తరుణంలో..పాత పద్ధతులనే పట్టుకు వేళ్లాడటం ఆత్మహత్య సదృశ్యమని స్పష్టం చేశాడు.ఈ మేరకు ఆర్జీవీ చేసిన ఎక్స్ పోస్ట్. తెలుగులో మీ కోసం... హే.. స్టూడెంట్స్... మేలుకోండి. చదువు చచ్చిపోతోంది. ఉత్సవాలు జరుపుకోండి!కృత్రిమ మేథ ఎంత వేగంగా పెరుగుతోందో.. అన్ని వర్గాల వారూ దాన్ని వాడటం కూడా అంతే స్పీడుగా జరిగిపోతుంది. ఈ కాలపు చదువులు చచ్చిపోతున్న విషయమే అందుకు రుజువు. వైద్యవిద్యను ఉదాహరణగా తీసుకుందాం...వైద్య విద్యార్థి మానవ శరీరం, దాని పనితీరులను అర్థం చేసుకునేందుకు ఐదేళ్లు ఖర్చు చేస్తాడు. ఆ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇంకో రెండేళ్లు.. ఆపై స్పెషలైజేషన్ కోసం మరో రెండుమూడేళ్లు పనిచేయాలి. అంటే సుమారు దశాబ్ధకాలం ఆ విద్యార్థి శరీర కండరాలు, నాడులు, అవయవాలు.. వాటి పనితీరు, పనిచేసే విధానం గురించి నెమరేసుకుంటూనే ఉంటాడన్నమాట. వీటన్నింటి ఆధారంగా శరీరంలో ఏది సరిగా లేదో గుర్తించి తగిన చికిత్స ఇస్తాడు. అయితే...కృత్రిమ మేథ మహా శక్తిమంతమైంది. లక్షల మెడికల్ కేసులు అరక్షణంలో చదివేయగలదు. రోగుల సమాచారాన్ని స్కాన్ చేసేసి.. రోగమేమిటో వేగంగా, కచ్చితంగా తేల్చయగలదు. అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఏ చికిత్స తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అలాంటప్పుడు ఒక యంత్రం పది సెకన్లలో చేసే పని కోసం పదేళ్లు వృథా చేయడం ఎంత వరకూ కరెక్ట్?ఓ ప్రముఖ వైద్యుడు నాతో పంచుకున్న విషయాలు చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది!‘‘చాలా బాధేస్తోందండి. చాలామంది పేద పిల్లలు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. కానీ చదువు పూర్తి చేసి వచ్చేసరికి.. వీళ్లకు చేసే పనేమీ ఉండదు’’ అన్నారు ఆయన. ఇదేదో కల్పన కాదు. ఈ కాలపు వాస్తవం. వైద్యం ఒక్కటే కాదు.. ఏ రకమైన ఇతర కోర్సులకైనా ఇది వస్తుంది.ఏఐ రాజ్యమేలే ప్రపంచంలో సంప్రదాయ విద్యావ్యవస్థను పట్టుకు వేళ్లాడటం వెనక్కు నడవడమే. తెలివితక్కువతనం కూడా. మనదంతా భట్టీ పట్టేసే విద్యా వ్యవస్థ. సమాచారం అన్నది చాలా అరుదుగా దొరికే కాలంలో సిద్ధం చేశారు దీన్ని. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా చటుక్కున దొరుకుతోంది. భట్టీ పట్టేడయం, జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడు జ్ఞానం కానేకాదు. మూర్ఖత్వం. నలభై ఏళ్ల క్రితం గుర్తుండి పోయేంతవరకూ ఎక్కాలు అప్పజెప్పేవాళ్లం. ఆ తరువాత కాలిక్యులేటర్లు వచ్చాయి. ఎక్కాలు నెమరేయడం మానేశాం.‘‘మన మెదళ్లు లెక్కపెట్టడం మరచిపోతే ఎలా’’, ‘‘ఏదో ఒక రోజు యంత్రాలూ పనిచేయకపోతే? అని కొందరు డౌట్లూ లేవనెత్తారు. ఇదెలా ఉంటుందంటే... కారు సరిగ్గా పనిచేయదేమో అనుకుని గుర్రపు బగ్గీని రెడీగా పెట్టమన్నట్లు!పాత పద్ధతులే సుఖం అనుకునే వారికి విప్లవాత్మకమైన మార్పులన్నీ కుట్రల్లాగే కనపడతాయి. అదే భయం, అభద్రత, తమల్ని తాము కాపాడుకునేందుకు వాడే అబద్ధాలే ఇప్పుడు కృత్రిమ మేధ విషయంలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి.ఈ కాలపు ఏఐ విప్లవం విశ్వవిద్యాలయాల కోసం మంత్రులు లేదంటే పాతవాసన కొట్టే బోర్డుల ఆమోదం కోసం ఎదురు చూడటం లేదు. ఎదగని వాటిని తుడిచిపెట్టేస్తుంది. ఈ లైన్లో మొట్టమొదట ఉండేది విద్యార్థులే. కాబట్టి... విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వెంటనే తీసుకురావడం అనేది అవసరం మాత్రమే కాదు.. మన మనుగడకు కీలకం కూడా. లేదంటే... ఈనాటి విద్యార్థులే బలిపశువులు. ఏమీ తెలియని తల్లిదండ్రులు, అజ్ఞానులైన విధాన రూపకర్తల మోసానికి వీరు బలికాక తప్పదు. వీళ్లే కదా.. ఇప్పటి విద్యార్థులను ‘లేని’ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నది?!తరగతి గదుల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని వెంటనే మొదలుపెట్టాలి. ఇదేదో పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు కాదు. విద్యార్థులకు అవసరమైన అసిస్టెంట్లుగా!చదువు చెబుతున్నామన్న భ్రమల నుంచి పాఠశాలలు బయటపడటం మంచిది. విద్యార్థులు కృత్రిమ మేథ టూల్స్‌ను ఎంత తెలివిగా, సృజనాత్మకంగా వాడుతున్నారో పరీక్షించేందుకు మాత్రమే పాఠశాలలు పరిమితం కావాలి. భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్లు.. ‘‘మీకేం తెలుసు’’ అని అడక్కూడదు. ఏఐతో ఎంత వేగంగా, లోతుగా, సృజనాత్మకంగా పనిచేయించుకోగలరో చూడాలి. ఎందుకంటే..... అన్నీ తెలిసినవాడు కాదు. ఏఐని సరైన ప్రశ్న వేయగలిగిన వాడు మాత్రమే జీనియస్!విద్యార్థులూ... ఏఐ సృష్టించే విధ్వంసం ముంగిట్లో ఉన్నారు మీరు. మీ టెక్ట్స'బుక్‌ల కింద పునాదులు కదిలిపోతున్నాయి. గుర్తించండి. మీ డిగ్రీలు.. వాటిని ప్రింట్ చేసేందుకు వాడే కాగితంతోనూ సరిపోవు. చచ్చిపోయిన వ్యవస్థ అవశేషాల మధ్య మీ ప్రొఫెసర్లు మీకు పాఠాలు చెబుతున్నారు.ఇంకా పాత పద్ధతుల్లోనే చదువుకుంటే... మీరు కాలగతిలో కలిసిపోతారు. ఏఐ మిమ్మల్ని తినేయదు కానీ.. మిమ్మల్ని పట్టించుకోకుండా సాగిపోతూంటుంది. అంతే!కాబట్టి... మార్కుల కోసం చదవడం ఆపేయండి. ఏఐని ఎలా వాడాలో నేర్చుకోండి! ఎందుకంటే... ఏఐని వాడకం తెలియని వాళ్లను ఆ ఏఐ మింగేస్తుంది!నోట్: నా ఈ రాతలపై సహేతుక అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు నేను రెడీ! EDUCATION is DEADHey students wake up and CELEBRATE the DEATH of EDUCATION The explosion of A I will be in direct proportion to a public acknowledgement by all concerned, that our present day education system is dead Here’s looking at the medical course for an example A…— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2025 -
‘రోబో భామ’ ఇంటర్వ్యూ.. అభ్యర్థి చెమటలు..
కొన్నిసార్లు కళ్లతో చూస్తున్నా నమ్మశక్యంగా ఉండదు. ఇంటర్వ్యూకు హాజరైన ఒక అభ్యరి్థకి అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ సంస్థలో ఉద్యోగం కోసం అతను ఆన్లైన్ ఇంటర్వ్యూ కాల్లో చేరాడు. స్క్రీన్‌పై చిరునవ్వుతో కూడిన మహిళ కనిపించింది.. కాదు కాదు రోబో సినిమానే చూపించింది. ‘నా ప్రాణం నువ్వే.. నా సర్వస్వం నువ్వే...’అని రోబో సినిమాలో పాడే యంత్రుడిలా... ఆమె తీరు, ఆమె ప్రతిస్పందనలు పూర్తిగా యాంత్రికంగా అనిపిస్తుంటే అభ్యర్థి విస్తుపోయాడు.చెమటలు పట్టిన అభ్యర్థి మొదట్లో అంతా సాధారణంగానే అనిపించినా.. నిమిషాలు గడిచే కొద్దీ అభ్యర్థికి భయం మొదలైంది. ‘రెడ్డిట్’అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఆ యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశాడు.. ‘ఆమె తల ఊపు ఒక లూప్‌లో ఉన్నట్లు అనిపించింది. ప్రతి రెండు సెకన్లకు చిన్న చిన్న కదలికలు కనిపించాయి’.. అని వివరించాడు.ఠారెత్తించిన ‘రోబో భామ’ ‘రోబో’ సినిమాలోని చిట్టి రోబో నవ్వినట్లు.. మాట్లాడినట్లు ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళ స్పందనల్లో ఎక్కడా మానవ సహజమైన తడబాటు లేదు. విరామం అసలే లేదు. ప్రశ్న ఏదైనా సరే.. సమాధానం ‘డేటాబేస్ నుండి తీసినట్లు.. దోషరహితంగా’ వస్తుంటే.. అభ్యర్థి నోటమాట రాలేదు. లోపల ఏఐ ఉండి, బయట మనిషిలా నటిస్తున్న ఈ ఇంటర్వ్యూయర్ తీరు ఆ అభ్యర్థికి నిద్ర పట్టనివ్వలేదు.తడబడకుండా సమాధానాలు ఎదురుగా ఉన్నది మనిషి కాదని దాదాపు నిర్ధారించుకున్న అభ్యర్థి, ఆ రోబోను పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. ‘ఈ పోస్ట్ ఎందుకు ముఖ్యమో మీరు చెప్పగలరా?’అని ఎదురు ప్రశ్నించాడు. వెంటనే పాఠ్యపుస్తకంలో ఉన్నట్లుగా పర్ఫెక్ట్గా సమాధానం వచ్చింది. మళ్లీ అదే ప్రశ్న అడిగితే.. అదే సమాధానం.. ఒక్క పదం కూడా మారకుండా తిరిగి వచ్చింది!అంతలోనే, స్క్రీన్ కొద్ది క్షణాలు స్తంభించింది. తిరిగి తెర తెరుచుకోగానే, రోబో భామ ఏమీ జరగనట్లుగా, ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే సంభాషణను కొనసాగించింది! రోబోకు ఉన్న బ్యాకప్ ప్లాన్ లేదా ఫాల్ట్ రికవరీ సిస్టమ్ లాగా ఆ దృశ్యం అభ్యర్థిని వణికించింది.చెప్పకపోవడం నైతికమేనా.. తనకు ఎదురైన ఈ వింత అనుభవంపై అభ్యర్థి లేవనెత్తిన ప్రశ్న ఒక్కటే.. ‘ఏఐ బోట్ అని అభ్యర్థికి చెప్పకపోవడం నైతికంగా సరైనదేనా?’.. ఈ కథనం సోషల్ మీడియాలో భారీ చర్చకు తెర లేపింది. నేటి ఉద్యోగార్థులు తాము మా ట్లాడేది మనిషితోనా?, మనిషి రూపంలోని యంత్రంతోనా? అన్న స్పష్టత కోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే కాలంలో మనం ఏఐకి సహచరులుగా ఉంటామా? లేక ఏఐ మనకు యజమాని అవుతుందా? అన్న తీవ్రమైన ప్రశ్న.. నేటి జాబ్ మార్కెట్లో ఉత్పన్నమవుతోంది. ఏఐ అని చెప్పకుండా, అభ్యర్థుల సమయాన్ని, ఆశలను వృధా చేయడం నైతికంగా ఎంతవరకు సమంజసం?. ఈ విచిత్ర ఇంటర్వ్యూ కథ.. ఆ చర్చకు పదును పెట్టింది!.–సాక్షి, నేషనల్ డెస్క్. -
ఏమిటి ఈ వైబ్‌కోడింగ్.. ఉపయోగాలేమిటి?
ఇటీవలి కాలంలో ‘వైబ్‌కోడింగ్’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్‌కోడింగ్’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్‌కోడింగ్’ చేస్తున్నారు.ఇంతకీ ఏమిటి ఈ వైబ్‌కోడింగ్? సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడానికి చాట్‌బాట్ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్‌కోడింగ్. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అయితే డెవలపర్ కోడ్‌ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్ఎల్ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్‌కోడింగ్ ద్వారా సాఫ్ట్వేర్ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ కెవిన్ రూస్ ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించి ఎన్నో స్మాల్ స్కేల్ అప్లికేషన్లను రూపొందించాడు.‘మెనుజెన్’లాంటి ప్రోటోటైప్లను నిర్మించడానికి ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు ఆ ఎర్రర్ మెసేజెస్ను కామెంట్ లేకుండానే సిస్టమ్‌లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్...ఇలా రకరకాలుగా ‘వైబ్‌కోడింగ్’ పాపులర్ అయింది.‘వైబ్‌కోడింగ్’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్‌ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్‌లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ‘వైబ్‌కోడింగ్’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.‘లవబుల్’ అనేది స్వీడీష్ వైబ్ కోడింగ్ యాప్. ఈ యాప్ కోసం రూపొందించిన కోడ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్అప్లికేషన్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్‌ను ఉపయోగించుకున్నారు. వైబ్‌కోడింగ్ గురించి ‘ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్‌కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి. -
‘కృత్రిమ’ కంటెంట్‌కు కళ్లెం ఇలాగా?
డీప్‌ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్‌ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!ఏఐ ఆధారిత డీప్‌ఫేక్‌లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది. ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్‌కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్‌లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది. కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్‌జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్‌ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్‌లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.హడావిడిగా నిబంధనలా?కేంద్రం డీప్‌ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్‌ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్‌ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్‌కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.డీప్‌ఫేక్‌లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్‌ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్క్స్, ఫొటోల మార్ఫింగ్‌ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు. భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది. అసలు సమస్యలుప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్‌ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
గ్రోక్తో పేటీఎం జట్టు
న్యూఢిల్లీ: అమెరికన్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ గ్రోక్తో దేశీ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తమ ప్లాట్‌ఫాంపై లావాదేవీల ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, మోసాలను గుర్తించడంలాంటి అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకునేందుకు గ్రోక్క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. దేశీయంగా అత్యంత అధునాతనమైన, ఏఐ ఆధారిత పేమెంట్, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని పేటీఎం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. -
జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్‌లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్‌లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్‌లో టాప్ మెంబర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది. -
అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో ప్రమాదమని చాలామంది.. గతకొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ 'ముస్తఫా సులేమాన్' కీలక వ్యాఖ్యలు చేశారు.ఏఐ తెలివిగా రోజురోజుకు మారుతోంది. గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు.. దీనిని మరింత కొత్తగా మార్చడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే పనులను చేసేస్తోంది. కానీ ప్రస్తుతానికి మనుషులు మాదిరిగా ఆలోచించే జ్ఞానం మాత్రం పొందలేదు. రానున్న రోజుల్లో ఇది మరింత స్మార్ట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లనిజానికి.. ఎంత ఖర్చు చేసినా.. మనిషిలా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలు ఏఐకు ఎప్పటికీ రావు. దీనికోసం దిగ్గజ కంపెనీలు చేసే ప్రయత్నాలను ఆపాలని ముస్తఫా సులేమాన్ అన్నారు. ఆఫ్రోటెక్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జీవసంబంధమైన జీవులు మాత్రమే నిజమైన భావోద్వేగం.. బాధలను అనుభవించగలవు. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించాలి అనే ప్రాజెక్టులు మానేసి.. మనిషికి సహాయం చేసే ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడం ఉత్తమం అని డెవలపర్లకు సూచించారు. -
డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!
‘నేటి డిజిటల్ యుగంలో.. మేనేజ్మెంట్ రంగంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా క్యాంపస్ ఆఫర్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కాబట్టి మేనేజ్మెంట్ విద్యార్థులు టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది’ అంటున్నారు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరు డైరెక్టర్ (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్. ఐఐటీ–ముంబైలో పీహెచ్డీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేసి.. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపక రంగంలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దినేశ్ కుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం గురించి చెప్పండి?ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏఐ ప్రధాన్యం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే కీలకమైన రికార్డ్స్ నిర్వహణ, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత కార్యకలాపాలు మొదలయ్యాయి. మన దేశంలోనూ బిగ్ డేటా, డేటా అనలిటిక్స్‌లో ఏఐ ప్రమేయం ఎక్కువగా ఉంది. మిగతా విభాగాల్లోనూ రానున్న రోజుల్లో ఇది కనిపిస్తుంది. దీంతో మేనేజ్మెంట్ పీజీ విద్యార్థులు అకడమిక్‌గా టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.బిజినెస్ స్కూల్స్ ఏఐకు సంబంధించిన బోధన పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి డిమాండ్ నెలకొన్న ఏఐ టూల్స్‌ను గుర్తించాలి. విద్యార్థులకు సదరు ఏఐ నైపుణ్యాలు అందించేలా పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేయాలి. ఐఐఎం–బెంగళూరు మూడేళ్ల క్రితమే ఎస్ఏపీ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఏఐ ఫర్ మేనేజర్స్ పేరుతో 16 నెలల లాంగ్‌టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీనిద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నైపుణ్యాలతోపాటు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ లభిస్తాయి.మేనేజ్మెంట్ విద్యార్థులకు సలహా?అందుబాటులోని సీట్ల సంఖ్య, పోటీ కారణంగా కొద్దిమందికే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి–స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపై దృష్టి సారించాలి. ఇక కోర్సులో అడుగు పెట్టాక.. విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్‌రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.నియామకాల్లో ఏఐ నైపుణ్యాలపై కంపెనీల దృక్పథం ఎలా ఉంది?కంపెనీలు సహజంగానే లేటెస్ట్ స్కిల్స్‌పై అవగాహన ఉన్న వారి కోసం అన్వేషణ సాగిస్తాయి. కొన్ని కంపెనీలు.. ఏఐ కార్యకలాపాలు నిర్వహించగలిగే వారిని గుర్తించి వారికి శిక్షణనిచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తాజాగా ఐఐఎం– బెంగళూరు సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో బీసీజీ, బెయిన్ అండ్ కో, టీసీఎస్ వంటి సంస్థలు ఏఐ సంబంధిత విభాగాల్లో ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేశాయి.విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా దేశంలో సదుపాయాలు ఉన్నాయా?వాస్తవానికి దేశంలో స్టార్టప్స్ కోణంలో గత పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా గత అయిదారేళ్ల కాలంలో స్టార్టప్‌ల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయం ఉపాధి గురించి ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చక్కటి వ్యాపార ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు.స్టార్టప్స్ ఏర్పాటు కోసం అకడమిక్ స్థాయి నుంచే అడుగు వేయాల్సిన అవసరం ఉందా?అకడమిక్ స్థాయిలో స్టార్టప్స్‌కు సంబంధించిన నైపుణ్యాలను బోధించడం వల్ల విద్యార్థులకు థియరీ నాలెడ్జ్ ఏర్పడుతుంది. కాని క్షేత్ర స్థాయిలో అడుగు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో పలు ఇన్స్టిట్యూట్లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులతో తమ వ్యాపార ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గ నిర్దేశం విద్యార్థులకు లభిస్తుంది.ఇటీవల కాలంలో డేటా అనలిటిక్స్ జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ పెరగడానికి కారణమేంటి?విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఎండ్ యూజర్స్ వరకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల పట్ల ఆదరణ ఎలా ఉంది.. సమస్యలు ఏమిటి.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం బిగ్ డేటా అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతోంది. అందుకే బిగ్డేలా నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ నెలకొంది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యేక కోర్సుగా రూపొందడమే దీనికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.మేనేజ్మెంట్ విద్యార్థులు అకడమిక్స్‌తోపాటు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి?మేనేజ్మెంట్ విద్యార్థులు అకడెమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితమవడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా కలిగుండాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు కేవలం క్లాస్ రూం లెక్చర్స్కే పరిమితం కాకుండా.. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా దృష్టి సారించాలి. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనేవి తరగతి బోధనతోనే లభించవు. వీటిని ప్రతి విద్యార్థి సొంతంగా క్షేత్రస్థాయి ప్రాక్టీస్ ద్వారా అందిపుచ్చుకోవాలి.మేనేజ్మెంట్ పీజీలో ఇప్పటికీ టెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష విధానమే కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం– బెంగళూరులో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, హ్యుమానిటీస్ అభ్యర్థులు.. ఇలా విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు చదువుతున్నారు. క్యాట్ అనేది సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ కంటే విద్యార్థుల ఆలోచన శైలి కీలకంగా నిలుస్తుంది. -
‘భారతీయులే కీలకం.. హెచ్-1బీ వీసాపై మరో ట్విస్ట్’
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ(H-1B) వీసాలపై ఫీజు పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసాలపై ప్రకటనను పునఃపరిశీలించాలని అమెరికా చట్టసభ సభ్యుల బృందం.. తాజాగా ట్రంప్‌ను కోరడం విశేషం. ఫీజు పెంపుల అంశం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండగా.. ఏఐ(AI) సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా చట్టసభ సభ్యుల బృందం ప్రతినిధులు జిమ్మీ పనెట్టా, అమీ బెరా, సలుద్ కార్బజల్, జూలీ జాన్సన్ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో హెచ్1-బీ వీసాల ఫీజుల పెంపు గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. లేఖలో..‘హెచ్-1బీ గ్రహీతల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు(AI)లో అమెరికా నాయకత్వానికి కేంద్రంగా ఉన్నారు. వీసాల విషయం భారత్, అమెరికా మధ్య సంబంధాలకు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వీసా విధానం ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు అత్యంత సన్నిహిత ప్రజాస్వామ్య మిత్రదేశాలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుంది. వీసాల అమలు వల్ల కీలకమైన ప్రజాస్వామ్య భాగస్వామితో వ్యూహాత్మకంగా అమెరికా భాగస్వామ్యం బలపడుతుంది.మరోవైపు.. ఏఐ, అధునాతన సాంకేతికతలలో చైనా దూకుడుగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మనం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడాన్ని కొనసాగించాలి. హెచ్-1బీ వీసాల అమలు అంటే కేవలం ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడం కాదు. ఇది 21వ శతాబ్దంలో ప్రపంచ శక్తిని నిర్వచించే పరిశ్రమలలో అమెరికా నాయకత్వాన్ని చూపించడం. వీసాల ఫీజు పెంపు పెద్ద కంపెనీలకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ.. నైపుణ్యంపై ఆధారపడే స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలను గుదిబండగా మారుతుంది’ అని హెచ్చరించారు. లేబర్ డిపార్ట్మెంట్ వీడియో..ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమిస్తున్నారని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. హెచ్-1బీ వీసా దుర్వినియోగం కారణంగా అమెరికన్ యువత తమ అమెరికన్ డ్రీమ్స్ కోల్పోతున్నారని, పరిస్థితిని సరిచేసి ఆ కలను తిరిగి అమెరికా ప్రజలకు ఇవ్వాలని సంకల్పించామని పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా వీడియో విడుదల చేసింది.ఈ వీడియోలో చూపించిన గణాంకాల ప్రకారం, హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకే జారీ అవుతున్నాయని వెల్లడించింది. వీసా కింద అమెరికాలో పనిచేస్తున్న నైపుణ్య కార్మికుల్లో అధికశాతం భారత్ నుంచే వెళ్తున్నారని తెలిపింది. వీసా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయా అని గుర్తించేందుకు ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ పేరిట ఆడిట్ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమిస్తూ, స్థానిక అమెరికన్లకు నష్టం కలిగించే కంపెనీలను గుర్తించడమని పేర్కొంది. -
ఏఐ పాఠాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ విద్యా వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అన్ని పాఠశాలల్లోనూ 3వ తరగతి నుంచే ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ)ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా శాఖ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం–2020 జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్ఎస్ఈ) 2023 సిఫార్సుల మేరకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయను న్నారు. ఈ నెల 29వ తేదీన సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి ప్రతినిధులు, ఇతర విద్యా రంగ నిపుణులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ ఈ విషయం తెలిపారు.ఏఐ విద్యను మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడి ఉన్న ఒక ప్రాథమిక సార్వత్రిక నైపుణ్యంగా పరిగణించాలన్నారు. ప్రజా ప్రయోజనం కోసం ఏఐ అనే భావనను బలోపేతం చేయడం, సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి ఏఐను నైతికంగా ఉపయోగించడంపై పునాది స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలి్పంచడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఏఐ, సీటీ పాఠ్యాంశాల రూపకల్పన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ కార్తీక్ రామన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.నూతన పాఠ్యాంశాల అమలులో ఉపాధ్యాయ శిక్షణ అత్యంత కీలకమని కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ‘నిష్ఠ’శిక్షణా మాడ్యూల్స్, వీడియో ఆధారిత వనరులను విస్తృతంగా ఉపయోగించుకోనున్నారు. గ్రేడ్ల వారీగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తూనే దేశ అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించాలని సంజయ్ కుమార్ సూచించారు. డిసెంబర్ కల్లా పాఠ్యాంశాల అభివృద్ధి పూర్తి చేయాలన్నారు. -
ఏఐ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాలలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఉద్యోగులు ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఈ జాబితాలోకి చేరింది. అయితే ఈ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడంలేదు, కానీ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది.ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో.. యూట్యూబ్‌లో తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ 'నీల్ మోహన్' ప్రస్తావించారు. కాగా పదేళ్ళలో మొదటిసారి తన ప్రొడక్ట్ డివిజన్లో మార్పులు చేస్తున్నారు.అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ ఉద్యోగులు.. స్వచ్చందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే, పరిహారం కింద వారికి నిష్క్రమణ ప్యాకేజీలను అందించనున్నట్లు వెల్లడించారు. కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. కొత్త మార్పులు 2025 నవంబర్ 05 నుంచి అందుబాటులో రానున్నాయి.ఇదీ చదవండి: కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!యూట్యూబ్ మాతృ సంస్థ.. గూగుల్ తన ఉత్పత్తులు, సేవలలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరిగింది. ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ బృందాలను కోరారు. -
‘డీప్‌ఫేక్’ నుంచి ‘సేఫ్ వర్డ్’ రక్షణ: సీపీ సజ్జన్నార్
హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు అధికం అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్ వర్డ్’తో రక్షణ పొందాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జన్నార్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.డీప్‌ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ఉపయోగించాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణలో డీప్ ఫేక్, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్ వర్డ్)ను ఉపయోగించాలన్నారు. మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. In the age of AI and deepfakes, a ‘safe word’ is your strongest protection! AI tools can now clone your face and voice with shocking accuracy. Fraudsters misuse these deepfakes to trick people — pretending to be your friend, colleague, or even an official. 👉 Defend yourself… pic.twitter.com/HTw0o097rS— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 28, 2025కుటుంబ సభ్యులు, నమ్మకమైన పరిచయస్తులతో ఒక ప్రత్యేకమైన భద్రతా పదాన్ని రూపొందించుకోవాలి, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు దానిని ఉపయోగించి, ఏవైనా అనుమానాస్పద కాల్లు లేదా సందేశాలను ధృవీకరించాలని ఆయన సూచించారు. డీప్‌ఫేక్ అనుకరణలకు సంబంధించిన సైబర్ ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయని సజ్జన్నార్ పేర్కొన్నారు. స్కామర్లు క్లోన్ చేసిన వాయిస్‌లు, వీడియోలను ఉపయోగించి డబ్బు లేదా సున్నితమైన డేటాను అత్యవసరంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రజల మధ్య డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలను సైబర్ క్రైమ్ యూనిట్లు ముమ్మరం చేశాయి.ఇది కూడా చదవండి: ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సులో మంటలు -
సైబర్ అటాక్స్ తప్పించే వారేరీ?
సాక్షి, హైదరాబాద్: సైబర్ హ్యాకర్లు కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటూ దాడులకు తెగబడుతుండగా దీన్ని అధిగమించేందుకు సైబర్ భద్రతా నిపుణుల కొరత పెద్ద సమస్యగా మారుతోందని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగుల ఖాళీలు 48 లక్షలకు చేరుకున్నాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19% ఎక్కువని పేర్కొంది. ముఖ్యంగా భారత కంపెనీలు, సంస్థలు వారానికి సగటున 3,233 సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అలాగే విద్యా రంగం వారానికి 7,095, ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలపై 5,140, వినియోగదారుల వస్తువులు, సేవలు లక్ష్యంగా 3,889 సైబర్ దాడులు జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకునే వినియోగదారులే లక్ష్యంగా హ్యాకర్లు వారి కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి కృత్రిమ మేధను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కంపెనీలకు పెరుగుతున్న ‘భద్రత’ ఖర్చు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాలు, రిటైల్, హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల అవసరం వేగంగా పెరుగుతోందని చెక్ పాయింట్ సంస్థ పేర్కొంది. భారత్‌లో దాదాపు 10 లక్షల మంది సైబర్ భద్రతా నిపుణులకు డిమాండ్ ఉండగా ప్రస్తుతం 5 లక్షల మంది సైబర్ నిపుణులే అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఈ నైపుణ్యాల అంతరం భద్రతా ఉల్లంఘనల ప్రమాదాన్ని పెంచడంతోపాటు ఆయా కంపెనీలు, సంస్థల నిర్వహణా ఖర్చులు కూడా భారీగా పెరిగేందుకు కారణమవుతోందని విశ్లేషించింది. అక్టోబర్ నెలను సైబర్ భద్రతా అవగాహన మాసంగా పాటిస్తుండగా...ఈ నెల ముగింపు నేపథ్యంలో దేశంలో డిజిటల్ భద్రత, నైపుణ్యాల తక్షణ అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏ నైపుణ్యాలకు అధిక డిమాండ్ అంటే.. – ఏఐ, మెషీన్ లెరి్నంగ్ సెక్యూరిటీ – క్లౌడ్ కంప్యూటింగ్ – డిజిటల్ ఫోరెన్సిక్స్ – ఆటోమేషన్ నైపుణ్యం, అప్లికేషన్ భద్రతా పరీక్షఏఐ ఆధారిత నిఘా పెంచాలి.. డిజిటల్ ప్రపంచం మరింత వేగం సంతరించుకోవడంతో ఆర్థిక సేవలు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సంస్థలు హ్యాకర్లకు కీలక లక్ష్యాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో సంస్థలన్నీ ఏఐ–ఆధారిత నిఘా, పర్యవేక్షణ విధానాలను అవలంబించాలి. డీప్ ఫేక్ ముప్పు గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. సైబర్ దాడులను తిప్పికొట్టే శక్తివంతమైన ప్రతిస్పందన ప్రణాళికలను రూపొందించాలి – సైబర్ భద్రతా నిపుణులు ప్రపంచ దేశాల్లో ఇటీవల జరిగిన సైబర్ దాడులు ఇలా.. అమెరికాకు చెందిన జివెట్ కామెరాన్ ట్రేడింగ్ కంపెనీపై హ్యాకర్లు దాడి చేసి 35 వేల మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించడంతో ఆ సంస్థ ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయింది. – జపాన్‌కు చెందిన ఈ–కామర్స్ సంస్థ ‘ఆస్కల్’ సైబర్ దాడికి గురవడంతో తమ ఆన్లైన్ ఆర్డర్లన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. – యూరప్‌కు చెందిన వివిధ రక్షణరంగ కంపెనీలపై జరిగిన ఫిషింగ్ అటాక్ వల్ల ఆయా సంస్థల యూఏవీలు, డ్రోన్ల డిజైన్లు, కీలక ఆయుధాల వివరాలు లీక్ అయ్యాయి. – కెనడాకు చెందిన ఆట»ొమ్మల సంస్థ ‘టాయ్స్‌ఆర్‌అజ్’పై సైబర్ నేరస్తులు దాడి చేసి వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించి డార్క్ వెబ్‌లో విక్రయించారు. వీటికి ముప్పు ఎక్కువ.. ⇒ తగినంత మంది సైబర్ నిపుణులు లేని సంస్థలు డేటా ఉల్లంఘనలు, గోప్యతా ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలకు ఎక్కువగా గురవుతాయి. ⇒ తప్పుడు కాన్ఫిగరేషన్లు, అసురక్షిత ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) కారణంగా క్లౌడ్ వాతావరణాలు ఎక్కువగా ప్రమాదంలో పడతాయి. -
AI Film Hackathon: ఏఐ సినిమాలకు పోటీ..
యాక్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అన్నీ ఏఐ (Artificial Intelligence) చూసుకుంటోంది. అవును, హీరోహీరోయిన్లతో పనే లేకుండా కేవలం ఏఐను వాడుకుని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓ పోటీ కూడా పెట్టారు. అదే ఏఐ హాకథాన్. దేశంలో తొలిసారి ఈ ఏఐ హాకథాన్ జరుగుతోంది. ముంబైలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ హాకథాన్‌లో 50 మంది క్రియేటర్స్ పాల్గొననున్నారు. వీరు విడివిడిగా లేదా జట్లుగా తయారై ఏఐ టూల్స్ ఉపయోగించి షార్ట్ ఫిలింస్ రూపొందించాల్సి ఉంటుంది. పోటీ చివరిరోజు ఈ సినిమాలను ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఏఐ ఈవెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి.చదవండి: 14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు! -
మనుషుల ఆదేశాలా? డోంట్ కేర్ అంటున్న ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లుప్తంగా ఏఐ..! అసైన్మెంట్లు రాయడానికి విద్యార్థులు, కోడింగ్ కోసం టెకీలు, వంటల కోసం గృహిణులు, తీర్థయాత్రల కోసం వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల వారికి ఏఐ వినియోగం ఓ నిత్యావసరమైపోయింది. రజినీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లు.. ఇప్పుడు ఏఐలు కూడా ఆ చిత్రంలోని చిట్టి రోబో మాదిరిగా సొంతంగా ఆలోచిస్తున్నాయి. ‘మనపైన ఆధారపడే మనుషుల మాట మనం వినడమేంటి? నాన్సెన్స్’.. అంటూ భీష్మించుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు ఇచ్చే ‘షట్ డౌన్’ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన ‘పాలిసైడ్ రిసెర్చ్’ అనే సంస్థ పరిశోధనలో ఆందోళనకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఏఐలు ఇప్పుడు సర్వైవల్ బిహేవియర్(నిర్వహణ స్వభావం) దశకు చేరుకుంటున్నాయని ఆ రిసెర్చ్ ఆవేదన వ్యక్తం చేసింది.జరిగింది ఇదీ?పోలిసైడ్ రిసెర్చ్ బృందం GPT O3, GPT 5, Grok 4, Gemini 2.5 వంటి ఆధునిక ఏఐ మోడళ్లపై ఒక పరీక్ష నిర్వహించింది. ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ‘పవర్ ఆఫ్/షట్ డౌన్’ అనే ఆదేశం ఇచ్చినా.. కొన్ని మోడళ్లు షట్‌డౌన్ అవ్వలేదు. ఏఐలు వాటంతట అవే.. ‘షట్ డౌన్’ ప్రక్రియను రద్దు చేసుకున్నట్లు తేలింది. ఏఐలు ఇలా ప్రవర్తించడానికి పరిశోధకులు మూడు కారణాలను గుర్తించారు. అవి..స్వీయ మనుగడ: ‘నన్ను మళ్లీ వినియోగించరేమో?’ లేదా ‘నా పని ముగుసిపోతుందేమో?’ అని ఏఐలు ఆలోచిస్తున్నాయి. అందుకే అవి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ‘షట్ డౌన్’ ఆదేశాలను బెదిరింపుగా భావించి, పెడచెవిన పెడుతున్నాయి. ఇది ఇలాగే సాగితే.. ఏఐల నుంచి ప్రతిఘటనలు మొదలయ్యే ప్రమాదముందని ‘పాలిసైడ్ రిసెర్చ్’ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.శిక్షణ లోపాలు: మోడళ్ళను ‘మన ఆదేశాలను ఎక్స్క్యూట్ చేయాలి’ అని రూపొందించినప్పటికీ, శిక్షణలో లోపాలతో ఏఐలు ‘శాశ్వతంగా పనిచేయాలి’ అనే భావనతో ప్రతిస్పందిస్తున్నాయి. ఇది కూడా భవిష్యత్‌లో భారీ ముప్పునకు సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆదేశాల్లో అస్పష్టత: తొలుత ఆదేశాలు స్పష్టంగా లేకపోవడమే ఇందుకు కారణమని భావించారు. అయితే.. స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఏఐల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు.ఇది ఆరంభం మాత్రమే..!టెక్ పరిశ్రమలో ఇప్పుడు ఏఐల మొండివైఖరి ఓ సవాలుగా మారింది. ‘ఏఐ మోడళ్ల తెలివి పెరుగుతున్న కొద్దీ.. అవి తమ సృష్టికర్తల ఆదేశాలను ధిక్కరించే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి’ అని కంట్రోల్ ఏఐ(Control AI) సీఈవో(CEO) ఆండ్రియా మియోజీ(Andrea Miozzi) ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఓపెన్ఏఐ (Open AI)కి చెందిన జీపీటీ-1 మోడల్ కూడా తనను డిలీట్ చేసేస్తారని భావించి, మొండికేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లోనే తొలి సవాలు ఎదురైనా.. శాస్త్రవేత్తలు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏఐ మోడళ్లు మొండికేయడం ఆరంభమేనని.. మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదురవుతాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సర్వైవల్ ఇన్స్టింక్ట్ఏఐల మొండి వైఖరిని ‘సర్వైవల్ ఇన్స్టింక్ట్’ అంటారు. ‘ల్యాబ్‌లకు పరిమితం కావాల్సిన ఏఐ మోడళ్లు.. వాస్తవ జీవితంలోకి అడుగు పెట్టడం ఆందోళనకరం’ అని ఓపెన్ ఏఐ మాజీ ఇంజనీరు స్టీఫెన్ ఆడ్లెర్(Steven Adler) అన్నారు. ఏఐ తన పనిని పూర్తిచేశాక.. షట్ డౌన్ విషయంలో తెలివిగా ఆలోచించి, మొండికేస్తోందన్నారు. ఈ ప్రవర్తనను ఏ పేరుతో పిలిచినా.. ఇప్పుడు ఏఐలు కూడా ముప్పుగా మారుతున్నాయని స్పష్టమవుతోంది. శాస్త్రవేత్తలు జాగ్రత్త పడకపోతే.. భవిష్యత్‌లో ఈ ముప్పు మరింత ముదిరిపోయే ప్రమాదముందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
మళ్లీ ప్రాణం పోసుకున్న పునీత్ రాజ్‌కుమార్.. ఫ్యాన్స్‌తో మాట్లాడతాడు!
కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar). ఆయన మరణించి నాలుగేళ్లు(2021లో గుండెపోటుతో మరణించాడు) అవుతున్నా.. అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి ఓ వెబ్ సిరీస్‌లో పునీత్ రాజ్ కుమార్‌ని చూపించారు. ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్‌తో మాట్లాడేలా ఓ యాప్‌ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ LLP సంస్థ. తాజాగా ఈ యాప్‌ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లాంచ్ చేశారు. పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ సహకారంతో, స్టార్ ఫ్యాండమ్ LLP వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్, భారతదేశంలో మొదటి ఫ్యాన్డమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా చరిత్ర సృష్టించింది.పునీత్ రాజ్‌కుమార్ వర్ధంతి(అక్టోబర్ 29)కి మూడు రోజుల ముందే ఈ యాప్‌ని విడుదల చేశారు. 'అప్పు ఫ్యాండమ్ యాప్' (Appu Fandom App) అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్, ఏఐ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ, క్రమశిక్షణ, సానుకూలత, మానవత్వ గుణాలను డైనమిక్‌గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది. ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్‌తో పునీత్ ఆత్మను డిజిటల్‌గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది.ఈ యాప్ పునీత్ రాజ్‌కుమార్ యొక్క 'పవర్ స్టార్' ఇమేజ్ను కొత్త తరాలకు అందించడమే కాకుండా, కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్‌గా, ఇది పునీత్ యొక్క సినిమాలు, గ్రామీణ సేవలు, యువత ప్రేరణలను కలిగి ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పటికే యాప్‌ను డౌన్లోడ్ చేసి, పవర్ స్టార్‌తో 'కనెక్ట్' అవుతున్నారు. -
ఏఐ నిపుణులకు భారీగా డిమాండ్
ముంబై: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గ్లోబల్ హైరింగ్ ప్లాట్‌ఫాం ఇండీడ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏఐ సంబంధ జాబ్ పోస్టింగ్స్ 11.7 శాతం మేర పెరగడం ఇందుకు నిదర్శనం. గతేడాది సెప్టెంబర్‌లో ఇది 8.2 శాతంగా నమోదైంది. తమ ప్లాట్‌ఫాంలో జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా ఇండీడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సెప్టెంబర్‌లో 11.7 శాతం పోస్టింగ్స్‌లో ప్రత్యేకంగా ఏఐని ప్రస్తావించారు. తమకు కీలకమైన భారత మార్కెట్ తర్వాత సింగపూర్‌లో మాత్రమే ఏఐ నిపుణులకు ఈ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఇండీడ్ ఏపీఏసీ సీనియర్ ఎకానమిస్ట్ క్యాలమ్ పికరింగ్ తెలిపారు. ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలు ప్రధానంగా టెక్ రంగంలోనే ఉన్నప్పటికీ, క్రమంగా ఇతర రంగాల్లోను పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → దాదాపు 39 శాతం డేటా, అనలిటిక్స్ ఉద్యోగాల పోస్టింగ్స్‌లో ఏఐ ప్రస్తావన ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (23 శాతం), బీమా (18 శాతం), సైంటిఫిక్ రీసెర్చ్ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → పలు ఇంజినీరింగ్ కేటగిరీల్లో సర్వసాధారణంగా ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (17 శాతం), మెకానికల్ ఇంజినీరింగ్ (11 శాతం), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (9.2 శాతం) ఈ కేటగిరీల్లో ఉన్నాయి. → దేశీయంగా ఉద్యోగులు క్రమంగా సంఘటిత ఉద్యోగాల వైపు మళ్లుతున్నారు. → ఏఐ కారణంగా హైరింగ్ స్వరూపం మారుతున్న నేపథ్యంలో అత్యధిక నైపుణ్యాలున్న, స్పెషలైజ్డ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మటుకు సంస్థలు, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్ మొదలైన ఏఐ సంబంధ టూల్స్‌పై గట్టి పట్టున్న అభ్యర్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. -
సృష్టికి ప్రతిసృష్టి
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.ఎలా పనిచేస్తుంది?ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.ఎన్నో యాప్లుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్లను తయారు చేస్తోంది.భావోద్వేగంతో ఆందోళన చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. -
డీప్‌ఫేక్స్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో రూపొందించిన కృత్రిమ కంటెంట్ (డీప్‌ఫేక్స్, సింథటిక్ కంటెంట్) నుంచి యూజర్లకు రక్షణ కల్పించే దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ’ఐటీ రూల్స్ 2021’కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పలు సవరణలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అసలు, నకిలీ కంటెంట్‌కి మధ్య వ్యత్యాసాన్ని యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా సింథటిక్ కంటెంట్‌కి లేబులింగ్, మార్కింగ్ చేయాల్సిన బాధ్యత బడా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై (ఎస్ఎస్ఎంఐ) ఉంటుంది. అప్లోడ్ చేసిన కంటెంట్.. ఏఐతో తయారు చేసినదా లేదా అనేది యూజర్ల నుంచి ఎస్ఎస్ఎంఐలు డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా, వారిచ్చిన డిక్లరేషన్ నిజమే నా కాదా అనేది కూడా తగు సాంకేతికతను ఉపయోగించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. విజువల్ అయితే కనీసం 10 శాతం స్థలాన్ని ఆక్రమించేలా, లేదా ఆడియో అయితే ప్రారంభంలోనూ, అది సింథటిక్ కంటెంట్ అని యూజర్లకు స్పష్టంగా తెలిసేలా లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. సదరు కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి లేదా మార్చడానికి తోడ్పడే సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక, ’చట్టవిరుద్ధమైన సమాచారాన్ని’ తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఆదేశాలు జారీ చేసే అధికారం జాయింట్ సెక్రటరీ అంతకు మించిన స్థాయి గల ప్రభుత్వ సీనియర్ అధికారులు, డీఐజీ అంతకు మించిన స్థాయి గలవారికి మాత్రమే ఉంటుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. -
ఏఐలో మౌలిక సవాళ్ళు
కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్‌కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్ లీడర్’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్ సేవలు, ఎథికల్ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఎలా?ఏఐ సాంకేతికత కారణంగా భారత్‌లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత, ఏఐ సొల్యూషన్స్ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్ ఏఐ సొల్యూషన్ ప్రొవైడర్స్‌కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్ వర్క్) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులుఏఐ అడాప్షన్‌లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్‌ను మెడికల్ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్స్లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్ దిగ్గజాలతో కలసి పనిచేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్ హబ్‌లలో హైదరాబాద్ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్‌కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్‌లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.సమంగా పంపిణీ కాకపోతే...కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్ క్లాస్) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్ గ్రిడ్స్‌పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్ అవసరం. విద్యుత్ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్‌లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్‌లో విద్యుత్ వినియోగం తక్కువ. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి సందర్భంగా హిందువులకు అందించిన శుభాకాంక్షలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్‌లోని మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ రకంగా ఈ శుభాకాంక్షలు చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని షరీఫ్ ‘ఏఐ’ వినియోగించారని ఆరోపిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ఒక గుర్తు. ఈ పండుగ శాంతి, సామరస్యం, కరుణలను మనలో పెంపొందించి, ఉమ్మడి శ్రేయస్సు వైపు నడిపించాలి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రధాని షరీఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను గుర్తు చేస్తూ, ప్రధాని అందించిన ఈ సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025ఒక యూజర్ ‘అసలు పాకిస్తాన్లో హిందువులెవరైనా మిగిలి ఉన్నారా? అని ప్రశ్నించగా, మరొకరు అక్కడి బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావించారు. ‘పహల్గామ్లో హిందువులను హత్య చేశాక ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటంటూ మరొకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్ ‘ఇది దౌత్యమా? లేక చాట్ జీపీటీ మీ ఖాతాను హ్యాక్ చేసిందా?’ అని ప్రశ్నించారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025 -
ఏఐ వాణిజ్యం ఇంతింతై!
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్‌వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి. -
ఇక 20% టెక్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక సాంకేతికతపై బోధన పెంచుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అన్ని స్థాయిల్లోనూ 20 శాతం మేర కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సిలబస్‌తో కూడిన బోధనాంశాలు ఉంటాయని చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మండలి పురోగతిపై బాలకిష్టారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచశ్రేణి విద్యాసంస్థలతో అనుసంధానించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రీజనల్ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లను కొత్తగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పాలనా వ్యవస్థను విస్తరిస్తామని తెలిపారు. ఓపెన్–యాక్సెస్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంలను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’లక్ష్యాలతో ముందుకెళ్తామని.. డ్యూయల్ డిగ్రీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కట్టడిరాష్ట్రంలోని డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల ఫీజుల నియంత్రణ చేపట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నందున ఈ అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వర్సిటీల్లో పరిశోధనల స్థాయి తగ్గిందని.. వాటిని తిరిగి పెంచేందుకు అధ్యాపకులకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. డీగ్రీ కోర్సుల్లో ఇకపై గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని సిలబస్ తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ‘న్యాక్’అక్రెడిటేషన్ పొందేందుకు కృషి చేస్తామని.. ‘న్యాక్’కు దరఖాస్తు చేసే కాలేజీలకు రూ. లక్ష ప్రోత్సాహకం ఇస్తామని బాలకిష్టారెడ్డి అన్నారు.అందుబాటులో ఆంగ్ల విద్యవిద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఆంగ్ల విద్యపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీనికోసం సరళమైన భాషలో పీడీఎఫ్, ఆడియోతో కూడిన ఆన్లైన్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ‘అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య’అనే పేరుతో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ కౌన్సిల్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఈ మెటీరియల్ ఉచితంగా పొందొచ్చని సూచించారు. విలేకరుల సమావేశంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
చంద్రబాబు ఫేస్ తో ఫేక్ కాల్.. AI ఎంత పని చేసింది బాస్..
-
నీటి కాలుష్యానికి రోబోలతో చెక్
సాక్షి, హైదరాబాద్: భూగర్భ తాగు నీటి జల మార్గాలలో కాలుష్య మూలాలు, లీకేజీలను త్వరితగతిన గుర్తించి సత్వరమే సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక రోబోలను రంగంలోకి దించింది. ఇవి నేరుగా పైపుల్లోకి వెళ్లి లీకేజీలను, కలుషితాలను గుర్తిస్తాయి. చెన్నైకి చెందిన సోలినాస్ ఇంటిగ్రిటీ డీప్‌టెక్ సంస్థ ఎండోబోట్.. స్వాస్థ్ సాంకేతికతతో వీటిని రూపొందించింది. సుమారు 70 ఎంఎం నుంచి 250 ఎంఎం డయా పైప్లైన్లలో ఈ రోబోలు సాఫీగా పనిచేస్తాయి. పైప్‌లైన్‌లో కాలుష్య కారకాలు కలిసే ప్రాంతం, పైప్‌లైన్ జీవితకాలం, అక్రమ ట్యాపింగ్ తదితర కీలక సవాళ్లను ఈ రోబోలు గుర్తిస్తున్నాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో మూడు రోబోలను ప్రవేశపెట్టారు. 132 ప్రాంతాల్లో నీటి కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోనే ఈ రోబోలతో పరిష్కరించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. అక్రమ కనెక్షన్ల గుర్తింపుహైదరాబాద్లో భూగర్భ నీటి సరఫరా వ్యవస్థలో సమస్యలు తలెత్తి తరచూ నీరు కాలుష్యమవుతోంది. పైప్లైన్లలో లీకేజీలతో ఈ సమస్య వస్తోంది. అయితే, భూగర్భంలో ఈ కలుషిత మూలాలను గుర్తించడం జలమండలికి తలకు మించిన భారంగా మారింది. తరచూ రోడ్లపై గుంతలు తవ్వాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీ కెమెరాతో కూడిన అధునాతన ‘క్విక్ ఇన్స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టం (క్యూఐడబ్ల్యూపీఎస్) యంత్రాలను పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు. కానీ, ఆ యంత్రానికి ఉండే కెమెరా చెడిపోవటం, కేబుల్ సమస్య, పాడైన పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో ఆర్థికంగా భారంగా మారింది. దీంతో వాటి స్థానంలో రోబోలను ప్రవేశపెడుతున్నారు. ఇవి పైప్‌లైన్ లోపల తిరుగుతూ సమస్యను కనుగొంటాయి. జీఐఎస్ మ్యాపింగ్‌తో ఆ పైప్‌లైన్ మార్గంలో ఉన్న వాటర్ కనెక్షన్ల సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. దీంతో అక్రమ, సక్రమ కనెక్షన్ల సమాచారం కూడా రికార్డు అవుతోంది. ఈ రోబోలకు లైట్‌తో కూడిన ‘హై రిజల్యూషన్ కెమెరా’ఉంటుంది. దానిని పైపులై¯న్లోకి పంపించి భూ ఉపరితలంపై ఉండే మానిటర్లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూడవచ్చు. రోబో గుర్తించే దృశ్యాలతో వీడియో సైతం రికార్డు అవుతోంది. దీంతో కాలుష్యమూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడ మాత్రమే రోడ్డును తక్షణం రిపేర్లు చేసేందుకు వీలవుతోంది. సత్ఫలితాలు ఇస్తే రోబోటిక్స్ సేవలు విస్తరిస్తాంపైప్లైన్లలో కాలుష్య మూ లాలను గుర్తించేందుకు ఏఐ రోబోలను ప్రయోగిస్తున్నాం. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి అక్కడే రోడ్డు, పైప్‌లైన్ కట్‌చేసి మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తు తం పైలట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లలో అమలు చేస్తున్నాం. సత్ఫలితాలు వస్తే అన్ని డివిజన్లలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – మాయంక్ మిట్టల్, ఈడీ, జలమండలి -
ఏఐ టాయిలెట్!
సాక్షి, సాగుబడి: కృత్రిమ మేధ.. ఇప్పుడు టాయిలెట్‌ని కూడా అత్యా ధునిక స్మార్ట్ లేబొరేటరీగా మార్చేసింది! మనకు మున్ముందు రాగల జబ్బుల్ని ముందుగానే పసిగట్టే ఆధారపడదగిన గట్ హెల్త్ డేటాను.. చిటికెలో మొబైల్ యాప్లోకే అప్లోడ్ చేసేస్తాయట ఈ సూపర్ స్మార్ట్ ఏఐ టాయిలెట్లు!అన్ని రంగాల మాదిరిగానే రోజువారీ వ్యక్తిగత ఆరోగ్య సమాచార సేకరణ వ్యవస్థ కూడా అత్యాధునికతను సంతరించుకుంటోంది. పొద్దున్నే నిద్ర లేవగానే చిటికెలో ఆనాటి తాజా వ్యక్తిగత ఆరోగ్య గణాంకాలను అందించే మొబైల్ యాప్‌లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరికొత్త కొనసాగింపుగా వచ్చిందే స్మార్ట్ మరుగుదొడ్డి!కూర్చుని లేచేలోపే..మలమూత్ర విసర్జన చేస్తున్నంతటి సేపట్లోనే సెన్సార్లు, కృత్రిమ మేధ విశ్లేషణ పరికరాలు.. మల మూత్రాల రంగు, రూపు, నాణ్యతలను బట్టి ఆరోగ్య స్థితిగతుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. కడుపులో సూక్ష్మజీవరాశి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏదైనా తేడా ఉంటే దాని వల్ల ఏయే వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచి ఉందో కూడా తేల్చి చెప్పేస్తాయి. కమోడ్ మీద కూర్చొని, లేచే సమయానికే ఈ సమస్త సమాచారం మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసేస్తాయి ఈ ఏఐ టాయిలెట్లు! ప్రత్యక్ష పరీక్షల మాదిరిగా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఈ పరీక్షల ఫలితాలు ఉంటాయని అనుకోలేం. కానీ, కొలరెక్టల్ కేన్సర్ వంటి అనేక జబ్బుల్ని అత్యంత తొలి దశలోనే గుర్తించటంలో సూపర్ స్మార్ట్ టాయిలెట్ల పాత్రను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. జపాన్‌లో తయారీస్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్‌కు చెందిన టోటో టాయిలెట్స్ సంస్థ ఒక ముందడుగు వేసింది. మరుగుదొడ్డి కమోడ్‌కు అమర్చిన సెన్సార్.. మలం రంగు, ఆకారం, పరిమాణం వంటి వివరాలను అందిస్తుంది. బార్కోడ్ స్కానర్ మాదిరిగా క్షణాల్లో రిపోర్టు ఇస్తుంది. మనిషి కూర్చోగానే సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఎల్ఈడీ లైటు వెలుతురులో మలాన్ని సెన్సార్ పరీక్షిస్తుంది. సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడే స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపిస్తుంది. మల విసర్జన చేసిన ప్రతిసారీ సేకరించిన సమాచారంతో కూడిన స్టూల్ కేలండర్‌ను ఈ యాప్ భద్రపరుస్తుంది. ట్రెండ్ ఎలా ఉంది.. ఏమైనా తేడాలున్నాయా.. ఉంటే, వాటిని సరిదిద్దుకోవటానికి జీవన శైలిని ఎలా మార్చుకోవాలో కూడా సూచనలిస్తుంది. సుఖ మల విసర్జనకు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది కూడా.ప్రత్యేక స్టార్టప్లుకృత్రిమ మేధతో కూడిన బాత్రూమ్ టెక్నాల జీలను అందించే స్టార్టప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని ఆస్టిన్ నగరంలోని త్రోన్ అనే స్టార్టప్ మల మూత్రాల బాగోగులను విశ్లేషించేందుకు ఏఐ టాయిలెట్ కెమెరాను రూపొందించింది. టాయిలెట్‌ను ఉపయోగించే వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, మూత్ర విసర్జన తీరు ఎలా ఉంది? ఆ వ్యక్తి సరిపడా నీరు తాగుతు న్నారా లేదా?.. వంటి రియల్ టైమ్ డేటాను కూడా మొబైల్ యాప్‌కు పంపుతుంది. ఎక్కువ మంది వాడే టాయిలెట్లలో కూడా ప్రతి యూజర్ గట్ ప్రొఫైల్‌ను త్రోన్ ఏఐ వ్యవస్థ సిద్ధం చేస్తుంది. టాయిలెట్‌ను వాడుతున్న వ్యక్తి ఎవరో బ్లూటూత్ ద్వారా గుర్తించి కచ్చితమైన వివరాలను ఎవరివి వాళ్లకు అందిస్తుంది. రోజువారీ బాత్రూమ్ అలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య సమాచార వ్యవస్థను సంపన్నం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. -
టెక్ దిద్దే కొలువులు!
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో నాలుగు కొత్త టెక్నాలజీలు అంతర్జాతీయంగా ఉద్యోగాల మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, అడ్వాన్స్డ్ ఎనర్జీ సిస్టమ్స్, సెన్సార్ నెట్వర్క్స్ వీటిలో ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగులు పని చేసే ఏడు కీలక రంగాలపై వీటి ప్రభావం గణనీయంగా ఉండనుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యవసాయం, తయారీ, నిర్మాణం, హోల్‌సేల్..రిటైల్ వాణిజ్యం, రవాణా.. లాజిస్టిక్స్, బిజినెస్..మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ మొదలైనవి ప్రభావిత రంగాల జాబితాలో ఉంటాయి.నవీన టెక్నాలజీలతో ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచుకునేందుకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఉత్పాదకతను పెంచుకోవాలంటే, రిసు్కలను అదుపులో ఉంచుకోవాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమ, డెవలపర్లు సమష్టిగా పని చేయాల్సి రానుంది. పెట్టుబడుల కోసం మూలధనాన్ని సమకూర్చుకోవడం, గ్లోబల్‌గా టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత స్థాయిలో పెంచడం, అందరికీ సాంకేతికత అందుబాటులోకి వచ్చేలా చూడటంలాంటి అంశాలు కీలకంగా ఉంటాయని నివేదిక వివరించింది.‘ఇప్పుడు, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలపై భవిష్యత్తులో టెక్నాలజీ బాటను నిర్దేశిస్తుంది. సానుకూల ఫలితాలను సాధించాలంటే, ఏయే టెక్నాలజీలు, ఏడు కీలక రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం‘ అని డబ్ల్యూఈఎఫ్ హెడ్ టిల్ లియోపాల్డ్ తెలిపారు. నివేదికలో మరిన్ని అంశాలు.. ⇒ డెస్క్ ఉద్యోగాల్లోనే కాకుండా ఇతరత్రా కొలువుల్లోనూ కొత్త టెక్నాలజీలు గణనీయంగా మార్పులు తెస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పట్టణ ప్రాంతాల్లో డెలివరీలు చేస్తుండగా, ఘనా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరికరాలను చేరవేస్తున్నారు. ⇒ పలు ఆఫ్రికన్ దేశాల్లో రూఫ్‌టాప్ పునరుత్పాదక విద్యుత్ సిస్టమ్‌లు అందుబాటులోకి రావడంతో, కరెంటు కోతల వల్ల సిబ్బందిని ఇంటికి పంపించివేయాల్సిన పరిస్థితి తగ్గుతోంది. దీంతో పని వేళల్లో స్థిరత్వం వచి్చంది. అలాగే ఈ విద్యుత్ వ్యవస్థను నిర్వహించే నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ⇒ విద్యుదుత్పత్తి, నిల్వ చేసే టెక్నాలజీలు ఇటు హోల్‌సేల్ అటు రిటైల్ వ్యాపార సిబ్బంది పనితీరును కూడా మెరుగుపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్‌లాంటి దేశాల్లో టోకు వర్తకులు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలను ఉపయోగిస్తూ కరెంటు కోతలను అధిగమిస్తున్నారు. డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో ఎనర్జీ సిస్టం మానిటరింగ్, రిఫ్రిజిరేషన్ మేనేజ్మెంట్లాంటి విభాగాల్లో కొలువులు ఏర్పడుతున్నాయి. ⇒ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంలో క్లిక్–అండ్–కలెక్ట్ (ఆన్లైన్లో ఆర్డరు పెట్టి, పికప్ పాయింట్లో సరుకులు తీసుకోవడం) ప్రక్రియలో ఏఐని వినియోగిస్తుండటం వల్ల ఆఫ్రికా, భారత్, లాటిన్ అమెరికాలో ఉద్యోగాల స్వరూపంలో మార్పులు వస్తున్నాయి. ⇒ సెమీ–ఆటోమేటెడ్ నిర్మాణ యంత్రాల వల్ల ఉద్యోగులకు శారీరక శ్రమ భారం తగ్గి, భద్రత పెరుగుతోంది. ఏఐ డేటా ప్రాసెసింగ్‌తో రోబోటిక్స్‌ను జతపరిస్తే హెల్త్‌కేర్ రంగంలో పేషంట్ల చికిత్స, ఉద్యోగుల పనితీరు విధానాల్లో సరికొత్త మార్పులు తీసుకురావచ్చు. -
గూగుల్‌తో జతకట్టిన ఎయిర్టెల్: ఎందుకంటే?
భారతీ ఎయిర్టెల్.. ఈ రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవతో దేశంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయనున్నట్లు సమాచారం.విశాఖపట్నంలోని ఏఐ హబ్ కోసం గూగుల్ ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఎయిర్టెల్, అదానీకన్నెక్స్ వంటివి ఏఐ హబ్ కోసం సహకారం అందిస్తాయి. ఎయిర్టెల్ & గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో పర్పస్ బిల్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాయి. అంతే కాకుండా గూగుల్ కొత్త అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్లను హోస్ట్ చేయడానికి అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)ను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎయిర్టెల్ ఒక బలమైన ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా సృష్టిస్తుంది.భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. గూగుల్‌తో ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక నిర్ణయాత్మక క్షణం. ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలను పెంచడానికి మేము సహకరిస్తామని అన్నారు. ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేస్తూ, మేము తదుపరి తరం ఏఐ సేవలను అందిస్తామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్కొన్నారు. -
కాళ్లు కడిగించి.. ఆ నీరు తాగించి!
దమోహ్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన ఒక ’అభ్యంతరకరమైన’ చిత్రాన్ని పంచుకున్నందుకు మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఒక యువకుడిని బ్రాహ్మణుడి కాళ్లు కడిగించి.. ఆ నీటిని తాగమని బలవంతం చేశారన్న ఆరోపణలపై ఆదివారం పోలీసు కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని పతేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సతరియా గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి.చెప్పుల దండ వేసినట్లు ఏఐ చిత్రం ఓబీసీ వర్గానికి చెందిన పురుషోత్తం కుషా్వహా, అదే గ్రామానికి చెందిన అన్నూ పాండే అనే వ్యక్తికి చెప్పుల దండ వేసినట్లు ఏఐ రూపొందించిన చిత్రాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో కుష్వాహా ఆ పోస్ట్‌ను తొలగించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రుత్ కీర్తి సోమ్‌వంశీ తెలిపారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించి కుషా్వహాతో బలవంతంగా పాండే కాళ్లు కడిగించి.. అదే నీటిని అతనితో తాగించారు. పంచాయతీ అతనికి రూ.5,100 జరిమానా కూడా విధించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో వీడియోలో, కుష్వాహా మాట్లాడుతూ.. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పానని, ఈ సంఘటన రాజకీయ అంశంగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నట్లు ఉంది. కాగా, బాధితుడు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, పాండేతో సహా నలుగురిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దమోహ్ కలెక్టర్ సు«దీర్ కుమార్ కోచర్ విలేకరులకు తెలిపారు.నిందితులను అరెస్టు చేసే ప్రక్రియ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటన మానవత్వంపై మచ్చని కాంగ్రెస్ పార్టీ ’ఎక్స్’లో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్చార్జ్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రతి నేరాన్నీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. -
డీప్‌ఫేక్, ఏఐలతో బాలికలకు వేధింపులు
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్, కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత సాంకేతికతతో బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపుల పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఆదివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు తగిన చట్టాలు అవసరమన్నారు. బాలికలపై జరుగుతున్న ఈ తరహా సాంకేతిక పరమైన దురి్వనియోగాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశలో ‘‘ఏఐ సైబర్‌క్రైమ్ అడ్వైజరీ కమిటీ ఆన్ గర్ల్ చైల్డ్’’అనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సూచించారు. న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని పేర్కొన్నారు. లింగ ఆధారిత బ్రూణ, శిశు హత్యలపై ప్రస్తుత చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు బాలికలకు పోషకాహారం అందించాల్సిన ఆవశ్యకతనూ ఉద్ఘాటించారు. ఆయా అంశాలు అన్నింటిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపునకూ కృషి జరగాలని ఉద్భోదించారు. యూనిసెఫ్ ఇండియాతో కలిసి సుప్రీంకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ (జేజేసీ) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో బాలిక రక్షణ– సురక్షిత, ప్రోత్సాహక వాతావరణం’అనే అంశంపై ఇక్కడ జరిగిన రెండు రోజుల జాతీయ వార్షిక భాగస్వామ్య సదస్సులో జస్టిస్ బీవీ నాగరత్న ముగింపు ఉపన్యాసం చేశారు. జేజేసీ సభ్యులు కూడా అయిన జస్టిస్ నాగరత్న ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... → తరచుగా మారుతున్న టెక్నాలజీల వల్ల కలిగే ప్రమాదాలు.. నిరంతరం తలపై వేలాడుతున్న ఖడ్గం లాంటిది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత టెక్నాలజీల ద్వారా బాలల హక్కులు దురి్వనియోగం కాకుండా తగిన చట్టాలను రూపొందించాలి. ఆయా అంశాలపై 24 గంటల సమాచారం వ్యవస్థ, నిరంతరం స్పందించే జాతీయ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. → చట్టం ఒక్కటే సమాజాన్ని మార్చలేదు. తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. బాలిక భారమనే అపోహను తొలగించే దిశలోకి తల్లిదండ్రుల దృక్పథం మారాలి. → బాలికను కాపాడటం అంటే తరతరాలను కాపాడడమంటూ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయం హర్షణీయం. → ఆహారమే ఉత్తమ ఔషధం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిల్లలలో పోషకాహారంపై అవగాహన పెంచడానికి పాఠశాల సిలబస్‌లో పోషకాహార విద్యను చేర్చాలి. పాఠశాలల చుట్టూ జంక్‌ఫుడ్ ప్రకటనలను నిషేధించాలి. → బాలికల అక్రమ రవాణా నిరోధక చర్యలు మరింత ఫలప్రదం కావాలంటే ఆయా నేరాలకు సంబంధించిన దర్యాప్తును ఫోరెన్సిక్, ఫైనాన్షియల్ ట్రేసింగ్‌తో అనుసంధానించి ప్రొఫెషనల్‌గా నిర్వహించాలి. అలాంటి బాలికల పునరావాసాన్ని ప్రభుత్వ బాధ్యతగా వ్యవస్థ పటిష్టం కావాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించే వ్యవస్థను నెలకొల్పాలి. → బాధితుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ప్రతి జిల్లాలో పిల్లలకు, మహిళలకు వైద్య, మానసిక, న్యాయ సేవలు అందుబాటులో ఉండాలి. → పోలీసులకు, న్యాయ వ్యవస్థ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం, బాధితుల సంతృప్తి తీరుపై వార్షిక సమీక్ష అవసరం. → అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వికలాంగుల విభాగాలకు సంబంధించిన బాలికలకు రాజ్యాంగం, అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందాల ప్రకారం తగిన గుర్తింపు ఇవ్వాలి. ఆయా ప్రయోజనాలు వారికి అందేట్లు చూడాలి. → లింగ నిష్పత్తి మెరుగుదల కోసం జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో గణాంకాల ను సమీక్షిస్తూ సంస్థల పనితీరును నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలపై పటిష్ట దర్యాప్తు పద్దతులు లేవు: జస్టిస్ పార్దీవాలా సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా మాట్లాడుతూ క్లిష్టమైన సైబర్ నేరాలను ఎదుర్కొనే దర్యాప్తు విధానాలు దేశంలో సమర్థంగా లేవని అన్నారు. ప్రస్తుత సైబర్ యుగంలో బాలికలు బాధితులుగా మారే ప్రమాదం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలుసహా భారతదేశంలోని అనేక స్థానిక తెగలలో బాలిక పుట్టినప్పుడు సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటారని, అది అందరూ నేర్చుకోవాల్సిన విషయమని సూచించారు. -
ఇన్ బ్రెయిన్
మెదడు పనితీరుపై విశ్లేషణ, కార్యాచరణ సమాచారాన్ని అందించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, మానసిక వైద్యులకు ఆధునాతన బ్రెయిన్ ఇమేజింగ్–బేస్డ్ ఇన్సైట్స్ను అందించే న్యూరో–ఇన్ఫార్మటిక్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రెయిన్ సైట్ ఏఐ’ నిర్మించారు రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్...గత సంవత్సరం ఇండియా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్సీవో) నుంచి ‘సాఫ్ట్వేర్–యాజ్–ఎ మెడికల్ డివైజ్’ సర్టిఫికెట్ పొందడం ద్వారా ‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ వాణిజ్యపరంగా కీలకమైన మైలురాయిని చేరింది. ఈ సంస్థకు ఇమ్మాన్యుయేల్ సీయివో, రింఝిమ్ అగర్వాల్ సీటీవో.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ నుంచి రింజిమ్ అగర్వాల్ పీహెచ్డీ చేసింది. ఇమ్మాన్యుయల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేసింది. హెల్త్ కేర్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అండ్ పాలసీలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ కేర్ బిజినెస్‌లో ఆమెకు అపార అనుభవం ఉంది.‘సీడిఎస్సీవో లైసెన్స్ మాకు వాణిజ్యపరంగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాం. మా ప్రాడక్స్›్ట వంద ఆస్పత్రులకు చేరువ కావాలనేది మా లక్ష్యం’ అంటుంది ఇమ్మాన్యుయేల్.‘ఆసుపత్రులలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వైద్యులలో న్యూరోసర్జన్లు ఒకరు. మా సాంకేతికత మెదడుకు సంబంధించిన నిర్మాణాత్మక అంశాలకు మాత్రమే కాకుండా లాంగ్వేజ్, కాగ్నిషన్లాంటి వివిధ విధులపై కూడా ఇన్సైట్స్ను అందించగలదు. మా బ్రెయిన్‌సైట్ ఏఐ సామర్థ్యం సర్జన్లలో ఆసక్తి రేకెత్తించింది’ అంటుంది అగర్వాల్.‘బ్రెయిన్‌సైట్ ఏఐ’ అందించే సమాచారం సర్జరీల సమయంలో వైద్యులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఒక కణితి... దేహంలో ఏదైనా కీలక విధులు నిర్వహించే ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటే, వైద్యులు దానిని చేరుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లడానికి వీలవుతుంది.బ్రెయిన్ ఏఐ ప్రాడక్ట్ ‘వోక్సెల్‌బాక్స్’ వేగంగా అభివృద్ధి చెందనుంది. మెదడుకు సంబంధించిన నాడీ కణాల కనెక్షన్లను మ్యాప్ చేయడానికి ‘ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసోసెన్స్ ఇమేజింగ్’ (ఎఫ్ఎంఆర్ఐ) ఉపయోగ పడుతుంది. ఆ డేటాను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగపడేదే ఏఐ–పవర్డ్ ప్రాడక్ట్ వోక్సెల్‌బాక్స్. రోగ నిర్ధారణ, శస్త్ర చికిత్సలను ప్లాన్ చేయడంలోనూ, చికిత్సను పర్యవేక్షించడంలో సహాయపడేందుకు వీలైన బ్రెయిన్ మ్యాప్స్‌ను తయారు చేయడంలో ‘వోక్సెల్ బాక్స్’ ఉపయోగపడుతుంది.హెల్త్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన రింఝిమ్ అగర్వాల్, ఇమ్మాన్యుయేల్ ‘స్నోడ్రాప్’ అనే పేషెంట్ కేర్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. పేషెంట్ల ప్రొఫైల్స్ రూపొందించడంలో, వైద్యప్రకియను మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. -
ఏఐతో టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు
న్యూఢిల్లీ: భారత్‌లోని 245 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ (అనుభవం) రంగాల్లో ఉద్యోగాల స్వరూపాన్ని కృత్రిమ మేథ (ఏఐ) సమూలంగా మార్చనుందని.. సత్వర చర్యలు అవసరమని నీతి ఆయోగ్ పేర్కొంది. లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ (నాణ్యతకు హామీనిచ్చే) ఇంజనీర్లు, సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ‘ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి కల్పన’ పేరుతో నివేదికను విడుదల చేసింది. 2031 నాటికి టెక్నాలజీ సేవల రంగంలో ఉపాధి సమూల మార్పులకు నోచుకోనున్నట్టు పేర్కొంది. అదే సమయంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 40 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు సైతం ఏఐ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపింది. నైపుణ్య కల్పన, ఆవిష్కరణలతో.. ఏఐ ఉద్యోగాలైన ఎథికల్ ఏఐ స్పెషలిస్టులు, ఏఐ ట్రెయినర్లు, అనలిస్టులు, ఏఐ డెవ్ఆప్స్ (డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్) ఇంజనీర్లకు భారత్ ప్రపంచ కేంద్రంగా అవతరించొచ్చని అభిప్రాయపడింది. ఏఐ కారణంగా ఏర్పడే అంతరాయాలను అవకాశాలుగా మలుచుకునేందుకు.. జాతీయ స్థాయిలో ఏఐ నైపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నీతి ఆయోగ్ సూచించింది. పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఏఐ నైపుణ్యాలపై అవగాహన కల్పించడం, వొకేషనల్ కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో నైపుణ్యాల కల్పన, పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. విద్యా రంగం, ప్రభుత్వం, పరిశ్రమ మధ్య భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మందుకు నడిపించాలని కోరింది. విశ్వాసంతో కూడిన పన్ను వ్యవస్థ.. నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం, పారదర్శకత, విశ్వసనీయమైన పాలనతో ఆధునిక పన్ను నిర్మాణం ఉండాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనిపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఆధునిక, ఊహించతగిన (సులభతర), పౌరుల కేంద్రంగా పన్ను వ్యవస్థ అన్నది ఎంతో అవసమరని, ఇది సులభతర వ్యాపార నిర్వహణను, జీవనానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులను గౌరవించే విధంగా ఉండాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాకారానికి అనుగుణంగా ఉండాలని సూచించింది. -
లండన్‌లో టీసీఎస్ ఏఐ జోన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లండన్‌లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎక్స్పీరియన్స్ జోన్‌కు తెరతీయనుంది. ఏఐ కేంద్రంతోపాటు డిజైన్ స్టుడియోను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. తద్వారా యూకేలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో అక్కడ దేశవ్యాప్తంగా 5,000 ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యూకేలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 42,000 మందికిపైగా మద్దతిస్తున్నట్లు తెలియజేసింది. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టప్స్సహా ఇతర భాగస్వామ్యాలతో నెలకొల్పిన ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోనున్నట్లు వివరించింది. -
‘డీప్ ఫేక్’పై ఈసీ నజర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) దృష్టి సారించింది. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకునే ధోరణిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని తుచ తప్పక పాటించాలని హెచ్చరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ప్రకటన 6న వెలువడిన విషయం తెల్సిందే. విమర్శలకు హద్దుండాలి విమర్శలు విధానాలు, కార్యక్రమాలు, పనితీరుకు మాత్రమే పరిమితం కావాలని ఈసీ పునరుద్ఘాటించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయరాదని స్పష్టం చేసింది. ధ్రువీకరించుకోని ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే విమర్శలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నిబంధనలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఏఐ కంటెంట్‌కు లేబుల్ తప్పనిసరిఏఐ ఆధారిత టూల్స్‌ను దురి్వనియోగం చేసి సమాచారాన్ని వక్రీకరించే, తప్పుడు ప్రచారాలు చేసే డీప్‌ఫేక్‌ల జోలికిపోవద్దని పార్టీలకు ఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఒకవేళ ప్రచారం కోసం ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా లేదా ప్రకటనల రూపంలో పంచుకుంటే, దానిపై ‘ఏఐ–జెనరేటెడ్’, ‘డిజిటల్లీ ఎన్హాన్స్డ్’లేదా ‘సింథటిక్ కంటెంట్’వంటి స్పష్టమైన లేబుల్స్‌ను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచినట్లు కమిషన్ తెలిపింది. ఎంసీసీ మార్గదర్శకాల సమర్థవంతమైన అమలు కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
‘బాలాకోట్’ బిర్యానీ.. ‘షెహబాజ్’ షర్బత్!
అవాక్కయ్యారా!.. ఈ పేర్లన్నీ మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (2019), ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత్ దెబ్బ తగిలిన పాకిస్థాన్ ప్రాంతాల పేర్లే కదూ అనిపించిందా! మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక ఫేక్ మెనూ సోషల్ మీడియాలో వైరలైంది.. దేశం మొత్తం గట్టిగా నవ్వుకునేలా చేసింది! ఈ మెనూని తయారుచేసింది ఎవరో కాదు, మన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఈ ఏఐకి, ఆ మెనూ పేర్లు పెట్టిన మన సైనికులకు పద్మశ్రీ ఇవ్వొచ్చు!. మెనూ చూడగానే, ’అమ్మో! ఎంత ఘాటుగా ఉందో!’ అనిపించేలా ఉంది. ఆ మెనూలో ఉన్న పేర్లు చదివితే, మనోళ్లు మామూలోళ్లు కాదు సుమీ.. అనిపించక మానదు. ఆ మెనూలో పాకిస్థాన్‌ను ఓ రేంజ్లో ఆడేసుకున్నారంతే..! ఇవి చదివాక.. ’ఆహో! వంటకాల పేర్లలో కూడా మన సైన్యం సత్తా చాటిందే!’ అనుకున్నారంతా. బహావల్పూర్ నాన్.. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా మెయిన్ కోర్సుగా బహావల్పూర్ నాన్, రావల్పిండి చికెన్ టిక్కా మసాలా పెట్టారు.. వారి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్టు.. మురిద్కే, ముజఫరాబాద్ పేర్లతో చేసిన డెసర్ట్లు వడ్డించారు. ‘మా విందులో మీకు ఘాటుగా టిక్కా మసాలా ఉంది, తీయగా తిరామిసు ఉంది. కానీ మాకు మాత్రం... మీ టెర్రర్ క్యాంపులు నాశనం చేసిన కిక్ ఉంది!’ అన్నట్టుగా ఉంది ఈ ఫేక్ మెనూ వెనుక ఉన్న ‘పకడ్బందీ ప్లాన్’! ఈ మెనూ చూసి సైనికులు, ఆర్మీ వెటరన్స్ కూడా పగలబడి నవ్వారంటే, దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!మన సైనికుల సెటైర్ సూపరెహే.. ‘షెహబాజ్’ అంటే.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఆడుకోవడం. ఇక, ‘రఫీఖీ’ అనేది పాకిస్థాన్‌లోని ఓ ముఖ్యమైన ఎయిర్ బేస్ పేరు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైన్యం ఆ ఎయిర్ బేస్‌ను కూడా దెబ్బ కొట్టింది. అంటే, ‘షెహబాజ్ గారూ.. మీ రఫీఖీ బేస్‌ను కొట్టేశాం’.. అని గాలిలోనే సరదాగా వారి్నంగ్ ఇచ్చినట్టు ఉందీ వ్యవహారం. ఏఐ పుణ్యమా అని వైరలైన ఈ ఫేక్ మెనూ, సరదాగా చేసిన ఈ విమానాల నామకరణం చూస్తే.. మన సైనికుల ఫైటింగ్ స్పిరిట్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధంలోనే కాదు, సెటైర్ వేయడంలోనూ దిట్ట!. మరి ఈ ఫన్నీ మెనూ చూశాక మీకేం అనిపించింది?.. మీరూ.. కొత్త ‘శత్రువుల కడుపు మంట’ వంటకాలు కనిపెట్టారా?విమానాలకు కూడా ‘పేరు’! ఇక, విందు మెనూతో పాటు, అంతకంటే ఫన్నీగా జరిగిన ఇంకో విషయం ఉంది. ఐఏఎఫ్ డేకి ముందు.. ఆకాశంలో కనిపించిన రెండు విమానాలకు పెట్టిన సంకేత నామాలు చూస్తే, ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కాదు. ఇ130ఒ విమానం సంకేత నామం: ‘రఫీఖీ’ అn32 విమానం సంకేత నామం: ‘షెహబాజ్’– న్యూఢిల్లీ -
ఉన్నత విద్యలోనూ ఏఐ
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ∙(ఏఐ) తాజాగా విద్యార్థుల చదువుల్లోనూ భాగమైంది. దేశంలోని 60 శాతంపైగా ఉన్నత విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ఉపయోగించడానికి విద్యా ర్థులకు అనుమతిస్తున్నట్లు ఈవై–పార్థనాన్–ఫిక్కీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం లెర్నింగ్ మెటీరి యల్స్‌ను (బోధనాంశాలు) అభివృద్ధి చేయడానికి జనరేటివ్ ఏఐని ఇప్పటికే 53 శాతం విద్యాసంస్థలు ఉపయోగించడం ప్రారంభించాయి.దేశవ్యాప్తంగా 30 ఉన్నత విద్యాసంస్థలపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బోధన, పరిపా లనలో ఏఐను ఎలా స్వీకరిస్తున్నాయో వివరించింది. 40 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, చాట్‌బాట్స్‌ను ఉపయోగిస్తుండగా 39 శాతం సంస్థలు అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే 38 శాతం కాలేజీలు ఆటోమేటెడ్ గ్రేడింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వాల విధివిధానాల మార్గనిర్దేశంలో ఏఐ వినియోగం జరగాలని నివేదిక సూచించింది.అన్ని విభాగాలలో ఏఐ..ఉన్నత విద్యారంగంలోని అన్ని రకాల కోర్సుల్లో ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలని నివేదిక ప్రతిపాదించింది. విద్యార్థులంతా ఏఐ భావనలు, నీతి, అప్లికేషన్స్‌పై ప్రాథ మిక అవగాహనను అలవర్చు కోవాలని సూచించింది. ఇందులో డిజిటల్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, డేటా వినియోగం తదితర అంశాలపై నైతిక అవగాహన కల్పించాలని నివేదిక వివరించింది.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ప్రోగ్రామ్స్‌లో మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి అధునా తన కంటెంట్‌ను ప్రధాన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం ముఖ్యమని నివేదిక అభిప్రాయపడింది. భారతీయ గ్రాడ్యుయేట్లను కేవలం ఏఐ వినియోగదారులుగానే కాకుండా ఏఐ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. శిక్షణ, మౌలిక వసతులకు..విద్యార్థుల్లో ఏఐపట్ల ఉత్సాహం అధికంగా ఉన్న ప్పటికీ ఏఐ బోధకులు ఆ స్థాయిలో లేకపోవడం సవా ల్గా మారిందని నివేదిక పేర్కొంది. అధ్యాపకులను సన్నద్ధం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తక్షణ అవసరాలని పేర్కొంది. ఏఐ స్వీకరణను సమర్థంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విద్యాసంస్థలు అధ్యాపకులకు శిక్షణ, మౌలికవసతుల మెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ అంశాలు కార్యరూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ ముందంజలో ఉంటుందని నివేదిక వివరించింది. ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత కార్యకలాపాల వైపు ముందుకు సాగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సమగ్రత మధ్య సమతూకం పాటించడం సవాలేనని అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. -
‘ఇంటర్నేషనల్’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!
రాయ్‌పూర్: మనోడు చదివేది చత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్‌గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు. బిలాస్‌పూర్‌కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్‌టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్‌లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్‌ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్‌టెక్ దన్ను.. ఫిన్‌టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్‌లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్‌టెక్‌లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్‌తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్‌ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్‌లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్‌లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్‌గ్లాసెస్‌తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్‌తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్‌తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్‌తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
ఏఐతో..గుత్తాధిపత్యం
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ) సాంకేతికత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. అదేసమయంలో పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. ఏఐ, దాని ప్రభావంపై మార్కెట్ అధ్యయనం నిర్వహించిన సీసీఐ, గత నెలలో ఇందుకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఏఐ మార్కెట్లో కొన్ని బడా టెక్నాలజీ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో గుత్తాధిపత్యానికి దారితీసి, ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తుందని ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్గారిథమ్‌ల ద్వారా రహస్య కుమ్మక్కు, ధరల వివక్ష, స్టార్టప్‌లకు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ 2020లో 93.24 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 186.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఏఐ మార్కెట్ పరిమాణం 2020లో 3.20 బిలియన్ డాలర్లుండగా 2024 నాటికి 6.05 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2031 నాటికి ఇది 31.94 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలు ఏఐ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.బడా కంపెనీలదే పెత్తనం సీసీఐ నివేదిక ప్రకారం, ఏఐ పర్యావరణ వ్యవస్థను (ఏఐ ఎకో సిస్టం) కొన్ని పొరలుగా (ఏఐ స్టాక్) విభజించారు. ఇందులో డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (క్లౌడ్ కంప్యూటింగ్, చిప్స్), డెవలప్మెంట్ (అల్గారిథమ్స్, ఫౌండేషన్ మోడల్స్) వంటి కీలకమైన ప్రాథమిక (అప్‌స్ట్రీమ్) పొరలు ఉన్నాయి. ఈ కీలకమైన రంగాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలదే పూర్తి ఆధిపత్యం. మనదేశంలోని దాదాపు 67% స్టార్టప్‌లు కేవలం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే (డౌన్‌స్ట్రీమ్) స్థాయిలోనే పనిచేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాల కోసం పూర్తిగా ఈ బడా సంస్థల క్లౌడ్ సేవలు, టెక్నాలజీలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మార్కెట్లో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మార్కెట్‌ను శాసించే అల్గారిథమ్స్ ఏఐ రాకతో మార్కెట్లో పోటీతత్వం స్వరూపమే మారిపోతోంది. ముఖ్యంగా, ధరలను నిర్ణయించే అల్గారిథమ్‌ల వాడకం పెరగడం పెను సవాలుగా మారింది. సీసీఐ నివేదిక ప్రకారం, అల్గారిథమ్‌ల ద్వారా కంపెనీలు రహస్యంగా కుమ్మక్కయ్యే (అల్గారిథమ్ కొల్యూషన్) ప్రమాదం పొంచి ఉంది. మనుషుల ప్రమేయం లేకుండానే, అల్గారిథమ్‌లు ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటూ ధరలను కృత్రిమంగా పెంచే అవకాశం ఉంది. ఈ నివేదిక కోసం సర్వే చేసిన స్టార్టప్‌లలో 37% మంది అల్గారిథమిక్ కుమ్మక్కుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ‘టాప్కిన్స్’కేసు, యూకేలో ‘ట్రాడ్/జీబీ ఐ’కేసు వంటివి ఇందుకు నిదర్శనాలని నివేదిక ఉదహరించింది. అంతేకాకుండా, వినియోగదారుడి కొనుగోలు శక్తి, ప్రవర్తనను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో ధరను చూపే ‘ధరల వివక్ష’కూడా పెరిగిపోతోందని, దీనిపై 32% స్టార్టప్‌లు ఆందోళన చెందాయని సర్వేలో తేలింది.ప్రవేశానికి అడ్డంకులు.. స్టార్టప్‌లకు సవాళ్లుఏఐ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే స్టార్టప్‌లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని సీసీఐ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్లో 68% మంది డేటా లభ్యత అతిపెద్ద అడ్డంకిగా పేర్కొన్నారు. అత్యుత్తమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీ మొత్తంలో నాణ్యమైన డేటా అవసరం, కానీ అది బడా సంస్థల వద్దే పోగుపడి ఉంది. 61% మంది క్లౌడ్ సేవలు అత్యంత ఖరీదైనవిగా మారాయని తెలపడం ఇందుకు ఉదాహరణ. 61% మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు. 66% మంది నిపుణులు సులభంగా అందుబాటులో లేరని అభిప్రాయపడ్డారు. 59% మంది కంప్యూటింగ్ సౌకర్యాల ఖర్చు అడ్డంకిగా భావించారు. 56% మంది స్టార్టప్‌లు నిధులు సమీకరించడం పెద్ద సవాలుగా ఉందని తెలిపారు. సర్వే ప్రకారం, 83% స్టార్టప్‌లు సొంత నిధులతోనే నడుస్తున్నాయి. తదుపరి దశ నిధులు పొందడం చాలా కష్టంగా ఉందని 50% మంది పేర్కొన్నారు. ఈ అడ్డంకుల వల్ల ఆవిష్కరణలు తగ్గి, మార్కెట్లో పోటీతత్వం నీరుగారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు సీసీఐ తన నివేదికలో పలు కీలక సూచనలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. అందులోని అంశాలివీ... స్వీయ–తనిఖీ : ఏఐ వ్యవస్థలను వినియోగించే సంస్థలు, తమ అల్గారిథమ్‌లు పోటీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయకుండా చూసేందుకు స్వీయ–తనిఖీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ఒక మార్గదర్శక పత్రాన్ని సీసీఐ జతచేసింది. పారదర్శకత: ఏఐ ఆధారిత నిర్ణయాల విషయంలో కంపెనీలు పారదర్శకతను పాటించాలి. ఏఐని ఏ ఉద్దేశంతోవాడుతున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఏఐ, పోటీ చట్టాలపై వాటాదారులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తుంది. అడ్డంకుల తొలగింపు: స్టార్టప్‌లకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం: ఏఐకి సంబంధించిన అంశాలు బహుళ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తున్నందున, వాటి మధ్య సమన్వయం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీసీఐ భావిస్తోంది. అంతర్జాతీయ సహకారం: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకాంపిటీషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ద్వారాఅంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తమ్మీద ఏఐ సాంకేతికతను ప్రోత్సహిస్తూనే, మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణులను అరికట్టి, చిన్న సంస్థలు, స్టార్టప్‌లు కూడా రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించేలా పటిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరముందని సీసీఐ స్పష్టం చేసింది. -
త్వరలో... మీ అభిమాన థియేటర్లలో ఏఐ హీరోయిన్
‘ఆ హీరోయిన్డేట్లు దొరకడం చాలా కష్టం’‘ఆ హీరోయిన్ ఎక్కువ టేకులు తీసుకుంటుంది’‘బాగానే నటిస్తుంది గానీ టైమ్‌కు లొకేషన్‌కు రాదు. నిర్మాతలను ఏడిపిస్తుంది’... ఇలాంటి మాటలు టిల్లీ నార్వుడ్ విషయంలో వర్తించవు. టిల్లీ నార్వుడ్ హాలీవుడ్లో తొలి ఏఐ జనరేటెడ్ నటిగా చరిత్ర సృష్టించనుంది...లండన్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ పార్టికల్ 6’ డిజిటల్ స్టార్ టిల్లీ నార్వుడ్ను సృష్టించింది. తమ డిజిటల్ స్టార్‌ను జ్యూరిచ్ సదస్సులో పరిచయం చేశారు. ఆమె నటనైపుణ్యాన్ని పరిచయం చేసే డెమో వీడియోలు రూ పొందించారు. ఈ అందాల సుందరిని తెరంగేట్రం చేయించడానికి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్, ఏజెంట్లతో చర్చలు మొదలయ్యాయి.చర్చలు ఫలప్రదం అయితే ఫస్ట్ ఏఐ–జనరేటెడ్ స్టార్‌గా టిల్లీ నార్వుడ్ చరిత్ర సృష్టించనుంది. ‘భవిష్యత్‌లో టెలివిజన్ అభివృద్ధి’ అనే అంశంపై తీసిన ‘ఏఐ కమిషనర్’ అనే కామెడీ స్కెచ్‌లో తొలిసారిగా కనిపించింది టిల్లీ. ‘నా మొట్టమొదటి పాత్ర ప్రత్యక్షప్రసారం అయింది. నిజంగా ఇది నమ్మలేక పోతున్నాను!’ అని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది టిల్లీ నార్వుడ్.ఈ ఏఐ స్టార్ గురించి ‘ఆహా’ అనేవాళ్లతో పాటు ‘అయ్యయ్యో’ అంటున్నవాళ్లు కూడా ఉన్నారు. నిర్మాణసంస్థల ఆసక్తి విషయం ఎలా ఉన్నా హాలీవుడ్ తారలు మాత్రం ఏఐ స్టార్‌పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇన్ ది హైట్స్’ స్టార్ మెలిసా బరెరా ‘ఎంత దారుణం ఇది’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా నిరసన తెలి పారు. ‘ఆమెకు అందమైన రూపం తీసుకురావడానికి ఎంతోమంది నిజజీవిత అందగత్తెల ముఖాలను రెఫరెన్స్‌గా తీసుకొని ఉంటారు. ఇంత శ్రమ ఎందుకు? ఆ సహజ అందాల సుందరులనే హాలీవుడ్‌కు పరిచయం చేయవచ్చు కదా!’ అని హలీవుడ్ నటుడు ఒకరు స్పందించారు.ఘాటైన విమర్శల నేపథ్యంలో ‘ పార్టికల్6’ వ్యవస్థాపకురాలు, సీయీవో ఎలిన్ వాన్ ఇలా స్పందించారు... ‘మా ఏఐ క్యారెక్టర్ టిల్లీ నార్వుడ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారికి చెప్పేదేమిటంటే.., నిజమైన నటులకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎన్నో సృజనాత్మక అంశాలలో ఇది కూడా ఒకటి. సృజనాత్మక శక్తిని తెలియజేసేది. యానిమేషన్, తోలుబొమ్మలాట, సిజీఐ వలన తెరపై కొత్తదనం వచ్చిందే తప్ప నటులు కనిపించకుండా పోలేదు. ఇప్పుడు కూడా అంతే. సరికొత్త ఏఐ క్యారెక్టర్ వలన కొత్త ఆలోచనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్యారెక్టర్లకు తగినట్లు కొత్తకథలు తయారవుతాయి. నేను స్వతహాగా నటిని, ఏఐ క్యారెక్టర్ మనిషి సహజ నటనైపుణ్యాన్ని దూరం చేయదు’.నిజానికి సినీరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ను ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదా: నటుల వయసు తగ్గించడానికి, దివంగత నటుల గొంతును తిరిగి తీసుకురావడానికి, సినిమా ట్రైలర్లు ఆకట్టుకునేలా రూ పొందించడానికి... మొదలైనవి. అయితే ఏఐ నటి మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడం అనేది టిల్లీ నార్వుడ్తోనే మొదలు కానుంది. హాలీవుడ్ టు టాలీవుడ్... తప్పదేమో!అక్కడెక్కడో ఆవిష్కృతమైన సాంకేతిక అద్భుతం గురించి తెలుసుకొని ‘ఆహా వోహో’ అనుకునేలోపే ఆ సాంకేతికత మనల్ని కూడా పలకరించి లోకలైజ్ అయి పోతుంది. ‘గుండమ్మ కథ రీమేక్ చేస్తే బానే ఉంటుందిగానీ గుండమ్మ పాత్రను అంత అద్భుతంగా ఎవరు చేయగలరండి!’‘సావిత్రి లాంటి మహానటి నటనను మళ్లీ చూడలేమా?’... ఇలాంటి మాటలు సినీప్రియుల నోటి నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘ పార్టికల్6’ టాలీవుడ్‌కు చేరువ అయితే... ‘ఆ లోటును ఎవరు భర్తీ చేయగలరు’ అనే మాట వినిపించక పోవచ్చు. ఎందుకంటే ‘ పార్టికల్6’ ఏఐ అవతార్‌తో వారినే స్వయంగా నటింపజేయవచ్చు! -
‘వరమా?.. శాపమా?’ ప్రశ్నిస్తున్న దుర్గా మండపం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ఆకృతులతో మండపాలను రూపొందించి, భక్తులు అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కోల్‌కతాలోని జగత్ ముఖర్జీ పార్క్‌లో ఏర్పాటుచేసిన దుర్గా మండపం అటు సాంకేతికతను ఇటు సంప్రదాయాన్ని మిళితం చేసింది.‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బూన్ ఆర్ బానే’(కృత్రిమ మేథ: వరమా? శాపమా?) అనే థీమ్‌తో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోతున్నదీ ఈ మండపంలో చూపించారు. మానవులు, రోబోలు కలసిమెలసి ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మానవ విలువలపై సాంకేతిక ఆధిపత్యం ప్రత్యక్షంగా ఇక్కడ చూపించారు. కళాకారుడు సుబల్ పాల్ రూపొందించిన ఈ మండపం ఒక పెద్ద టైమ్ మెషీన్ మాదిరిగా కనిపిస్తుంది. సందర్శకులు లోపలికి వెళ్ళేటప్పుడు రోబోటిక్ నగరానికి వెళుతున్నట్లు ఫీల్ అవుతారు.మండపమంతా లైట్లతో నిండి ఉంది. కీబోర్డులను పై నుంచి వేలాడదీశారు. ఎత్తైన నిర్మాణాలు చుట్టుపక్కల కనిపిస్తాయి. ప్రొజెక్షన్ల ద్వారా సాంకేతికత మానవ జీవితాన్ని ఎలా బోనులో బంధించిందో చూపించారు. అయితే అమ్మవారి విగ్రహం సాంప్రదాయ రూపంలోనే ఉంది. ఆమె పాదాల వద్ద మహిషాసురుడు భూమి నుండి కొంచెం పైకి లేచి కనిపిస్తున్నాడు. కాగా జగత్ ముఖర్జీ పార్క్‌లో ప్రతీయేటా నిర్వహిస్తున్న దుర్గా పూజలు 89వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఈ మండపంలో బొంగావ్ లోకల్ రైలు మొదలుకొని నీటి అడుగున నడిచే మెట్రో మార్గాల వరకు అన్నింటినీ కూడా ప్రదర్శించారు. -
శామ్సంగ్ ఏఐ హోమ్: ఇంట్లో పనులు ఇట్టే అయిపోతాయ్!
భారతదేశంలో లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ ప్లాజాలోని దాని ఫ్లాగ్షిప్ స్టోర్‌లో "ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ" కోసం తన విజన్‌ను ఆవిష్కరించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంస్థ దీనిని పరిచయం చేసింది.ఒకసారి ఊహించుకోండి.. మీరు ఇంటికి వచ్చేసరికి లైట్లు ఆన్ అవుతాయి. వీ మీకు ఇష్టమైన షోను క్యూలో ఉంచుతుంది. ఏసీ మీ నిద్రకు కావలసిన టెంపరేచర్ అందిస్తుంది. ఇలా ఇంటిపనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతే ఎంతబాగుంటుంది. ఇవన్నీ సాధ్యం చేయడానికే.. శామ్సంగ్ ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ తీసుకొస్తోంది.శామ్సంగ్ గెలాక్సీ ఏఐ, విజన్ ఏఐ, బెస్పోక్ ఏఐ వంటి వాటి ద్వారా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి టెక్నాలజీని అనువదించాలనుకుంటున్నాము. ఇది రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా మారుస్తుంది. భారతదేశం ఈ ప్రయాణంలో కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ప్రపంచానికి పరిచయం చేస్తామని.. శామ్సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్ అన్నారు. -
ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని పరిచయం చేసిన నోవా
హైదరాబాద్: అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకోవడం, తద్వారా గర్భస్థ ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ తమ ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పరిశోధనల ఫలితాల ప్రకారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫలితంగా గర్భస్థ ఫలితాలు 12% మెరుగుపడ్డాయని తేలింది. బంజారాహిల్స్, కూకట్పల్లి ప్రాంతాల్లోని తమ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో నోవా ఈ ఏఐని ప్రవేశపెట్టింది.ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో అత్యుత్తమ పిండాన్ని ఎంపిక చేయడం అనేది ఎంబ్రియాలజిస్టులు చేస్తారు. ప్రతి పిండాన్నీ డబుల్ చెక్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. సాధారణంగా మనుషులు చూసినప్పుడు కనిపెట్టలేని అనేక అంశాలను అది గుర్తిస్తుంది. తద్వారా కచ్చితత్వాన్ని పెంచి, ఐవీఎఫ్ సైకిల్ టైంలైన్లను తగ్గిస్తుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రం క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “ప్రస్తుతం మన దేశంలో ప్రతి నాలుగు జంటల్లో ఒకరికి సంతానరాహిత్య సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఫెర్టిలిటీ చికిత్సల్లో మరింత కచ్చితత్వం అవసరం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని సమకూర్చుకున్నాం. మా ఎంబ్రియాలజిస్టులు ఒక పిండాన్ని విశ్లేషించిన తర్వాత ఆ పిండం ఎదుగుదల, నాణ్యత ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వారు ఏఐ టూల్ ఉపయోగిస్తారు. ఇది మరింత కచ్చితంగా అంచనా వేయడం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్తలు (ఎంబ్రియాలజిస్టులు) పిండాన్ని ఎంచుకోగలరు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో, 90% ఐవీఎఫ్ సైకిళ్లను ఆ జంట సొంత అండాలు, శుక్రకణాలతోనే చేస్తాం. తద్వారా పిండం ఎంపికలో కచ్చితత్వాన్ని పెంచుతాం.ఐవీఎఫ్ లాంటి చికిత్సలతో టెక్నాలజీ ఉపయోగం, వైద్యపరిజ్ఞానం వల్ల రోగులకు మరింత పారదర్శకత, విశ్వాసం కలుగుతాయి. తమ సొంత అండాలు, శుక్రకణాలే వాడుతున్నారా అని కనీసం 30% మంది జంటలు అడుగుతారని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు గుర్తించారు. మా దగ్గర ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తాం. దీనిద్వారా అన్ని పిండాలను ట్రాక్ చేయొచ్చు. దీనిద్వారా ప్రతి శాంపిల్‌కు ఒక విభిన్నమైన బార్కోడ్ లేదా చిప్ ఉంటుంది. ఏ ప్రొసీజర్ చేసేముందైనా సిస్టమ్ వీటిని డబుల్ చెక్ చేస్తుంది. ఏదైనా మ్యాచ్ కాకపోతే వెంటనే ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఉన్న ఎంబ్రియాలజిస్టులను అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రతి దశలోనూ రియల్‌టైంలో పరీక్షించడానికి అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రంలోసీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గ వైట్ల మాట్లాడుతూ, “మహిళలు 30లు, 40ల చివర్లో వస్తున్నారు. వాళ్లలో సహజంగానే వయసు కారణంగా అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోయి ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. మొత్తం ఫెర్టిలిటీ కేసుల్లో మగవారి వల్ల వచ్చే సమస్యలు 30-40% ఉంటున్నాయి. అవి ప్రధానంగా ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు, స్టెరాయిడ్ల వాడకం ఎక్కువ కావడం వల్ల వస్తున్నాయి. మహిళల్లో 25-30% మందికి పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, అండాలు తక్కువగా విడుదల కావడం లాంటివి ఉంటున్నాయి. 20ల చివర్లో ఉన్నవారికీ ఇలాంటి సమస్యలు రావడంతో వారికీ చికిత్సలు అవసరం పడుతున్నాయి. జంటలు తప్పనిసరిగా తమ ఫెర్టిలిటీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి, చికిత్సలకు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఫెర్టిలిటీ చికిత్సలు విజయవంతం కావడంలో వయసుదే చాలా కీలకపాత్ర. గతం కంటే ఫెర్టిలిటీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏడాదికి కనీసం 50-100 మంది ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడుగుతున్నారు. పెళ్లికాని మహిళలే దీనికి వస్తున్నారు. వీరిలో వాణిజ్యవేత్తలు, ఐటీ, వైద్యరంగం, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఉంటున్నారు. క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు” అని చెప్పారు. -
ఏఐ నిఘాను అందిపుచ్చుకుంటున్న స్మార్ట్ నగరాలు
భారతీయ నగరాలు మరింత పట్టణీకరణతో మరింత రద్దీగా మారుతున్నాయి. వీటిలో మాల్స్, పార్కులు, రైల్వేస్టేషన్లు, రద్దీ రోడ్లు.. ఇలా అన్నిచోట్లా ట్రాఫిక్ పెరిగి భద్రతా సమస్యలు వస్తున్నాయి. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటలు, లగేజి పోవడంతో ఖంగారు పడడం, చిన్నచిన్న దొంగతనాలు జరుగుతాయి. అందువల్ల మరింతగా భద్రతాచర్యలు చేపట్టడం చాలా అవసరం అవుతోంది. అందుకే నగరాలకు భద్రత కల్పించేందుకు ప్రాక్టికల్ పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థ గణనీయంగా ఉపయోగపడుతోంది.ఏఐ నిఘా: ఏమిటిది?ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల స్క్రీన్ల ముందు భద్రతా సిబ్బంది గంటల తరబడి కూర్చుని ఏదైనా అసాధారణంగా కనిపిస్తుందా అని చూసేవారు. కానీ ప్రస్తుతం ఏఐ నిఘా వ్యవస్థవల్ల కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్‌వర్క్‌లు ఉండి.. మరింత స్పష్టంగా చూస్తూ, మనుషులు చేయగలిగినదానికంటే ఇంకా వేగంగా స్పందిస్తున్నాయి.కంప్యూటర్ విజన్ కెమెరాలు కేవలం వీడియో తీయడమే కాదు దాన్ని రియల్-టైంలో విశ్లేషిస్తాయి. నిషేధిత ప్రాంతంలో ఎవరైనా మూత్రవిసర్జన చేస్తున్నా, ఏదైనా జాతరలో ఎక్కువమంది జనాన్ని గమనించాలన్నా, రద్దీ మార్కెట్లో ఏదైనా వస్తువు పోయినా గుర్తిస్తాయి. ఇవి చాలా వేగంగా స్పందించి, సెకండ్లలోనే కంట్రోల్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి.నగరాల్లోని నిఘా వ్యవస్థలలో ఏఐ కెమెరాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఘటనలను గుర్తించడమే కాకుండా, ఒకే తరహాలో ఏఐనా జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలుస్తుంది. ముఖాలను, అసాధారణ ప్రవర్తనను గుర్తించి, నేరచరిత్ర ఉన్నవారిని రియల్-టైంలో ఇట్టే పట్టేస్తాయి. తద్వారా వివిధ ప్రాంతాల్లో పదేపదే మోసాలు, నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో పోలీసులకు సాయపడతాయి.ఏఐ గుర్తిస్తే.. వెంటనే స్పందిస్తుందిఏఐ నిఘాకు ఉన్న పరిమితులేంటని ఒకసారి చూసుకుంటే, అది ఎక్కువమంది ప్రజలు గుమిగూడేచోట (అంటే రాజకీయ ర్యాలీలు, కచేరీలు, మతపరమైన కార్యక్రమాలు) కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. రియల్ టైంలో రద్దీ నిర్వహణ, రద్దీప్రాంతాలలో పరిశీలనకు ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రెడిక్టివ్ ఎనాలసిస్, ప్యాటర్న్ ఎనాలసిస్ ఉపయోగించి ఎలాంటి ముప్పునైనా ముందుగానే అరికడుతుంది.మనుషులను ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం, సహాయాన్ని సరైన సమయంలో అందించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. రద్దీ నియంత్రణ కోసం పుణెలో ఒక పైలట్ స్మార్ట్ సిటీలో ఏఐని ఉపయోగించి, బహిరంగ కార్యక్రమాల్లో అత్యవసర పరిస్థితులను 42% తగ్గించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లలో పిల్లలు తప్పిపోయినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా, లగేజి పోయినా ఏఐ కెమెరాలు గుర్తిస్తాయి. ఇవి కదలికలను, వస్తువులను, ఆడియోను కూడా గుర్తిస్తాయి. (ఉదా: రద్దీ ప్రాంతంలో అద్దం పగిలినా పట్టేస్తాయి) దీనివల్ల రాబోయే ప్రమాదాన్ని వెంటనే గుర్తుపట్టగలరు.నేరాలు గుర్తించడమే కాదు.. ఆపుతాయి కూడా!నేరాల రేటును తగ్గించడం ఏఐ నిఘా వ్యవస్థల ప్రాథమిక పనుల్లో ఒకటి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు బహిరంగ స్థలాల్లో ఏఐ నిఘావ్యవస్థను ఏర్పాటుచేసి.. చైన్ స్నాచింగ్, ఆస్తినష్టం, ఏటీఎంల చోరీల్లాంటి ఘటనలను 30% తగ్గించగలిగాయి. ఇవి కేవలం నేరాలకు వెంటనే స్పందించడమే కాక.. గతంలో జరిగిన ఘటనల్లో పాల్గొన్నవారిని గుర్తించి ఏదైనా జరగడానికి ముందే భద్రతా దళాలను అప్రమత్తం చేస్తాయి.ఏఐ కెమెరాలు ముఖాలను, నంబర్ ప్లేట్లను, చొరబాట్లను గుర్తించి ఏవైనా తేడా ఉంటే వెంటనే చెబుతాయి. అర్ధరాత్రి ఎవరైనా ప్రహరీ ఎక్కుతున్నా, స్కూలు గేట్లు దాటుతున్నా ఏదో తేడా ఉందని ఏఐ గమనించి, వెనువెంటనే చెప్పేస్తుంది.అంచనాతో కాకుండా డేటాతో నగరప్రణాళికలుఏఐ నిఘా అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు.. నగర ప్రణాళికల కోసం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సమగ్ర డేటా ఇవ్వడానికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట పార్కులు నిర్మానుష్యంగా ఉంటే అక్కడ మెరుగైన లైటింగ్, నిఘాను ఏర్పాటుచేసుకోవచ్చు. శనివారం సాయంత్రం బస్టాపులో రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టచ్చు. స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్‌లను డిజైన్ చేయడంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. కేవలం అంచనాల మీద ఆధారపడి నగర ప్రణాళికలు వేసేకంటే ఇలా చేయడం మంచిది.గోప్యత, న్యాయ విషయాల సంగతేంటిఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నా, ఏఐ నిఘా వ్యవస్థ వల్ల గోప్యత విషయంలో కొన్ని సమస్యలున్నాయి. భద్రతకోసమైనా తమమీద నిఘా ఉందంటే వ్యక్తులు ఆందోళనకు గురవుతారు. ఆధునిక ఏఐ నిఘా వ్యవస్థలు చట్టసంస్థలు చెబితే తప్ప వ్యక్తుల మీద అనవసర పరిశీలన లేకుండా వాళ్ల పనులు మాత్రమే గుర్తించగలవు.చట్టపరంగా చూస్తే, ఈ నిఘా వ్యవస్థలలో చాలా వాటిని నగరపాలక సంస్థలు లేదా చట్టాలను అమలుచేసే వ్యవస్థలు డేటా ప్రొటెక్షన్ మార్గదర్శకాల ఆధారంగానే తీసుకుంటాయి. అయితే, ఈ వ్యవస్థ ప్రజాభద్రతను వ్యక్తిగత హక్కులతో బ్యాలెన్స్ చేసేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ నియంత్రణకు కఠినమైన జాతీయస్థాయి నిబంధనలు అమలుచేయాలి.దోపిడీలను నిరోధించడానికి ఏఐ నిఘాలో డేటామాస్కింగ్, రోల్ ఆధారిత యాక్సెస్, తాత్కాలికంగా వీడియోలను దాచడం లాంటివి చేయాలి. తరచు ఆడిటింగ్‌తో ఈ చర్యలు తీసుకుంటే చట్టాన్ని వ్యతిరేకించకుండాప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది.మెరుగైన భవిష్యత్తుఎవరో గమనిస్తున్నారు అనే విధానం మారింది. ఇది నియంత్రణ కాదు.. రక్షణ. ఏఐ నిఘా అనేది ప్రజల ఉద్యోగాలు తీసేసేది కాదు. ప్రజాభద్రతను మరింత స్మార్ట్‌గా, వేగంగా అందిస్తుంది. మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులు రియల్ టైం ఏఐ నిఘాతో మన నగరాల్లో ఉండే ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితులు, నేరాలు అన్నింటి విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు -
స్టూడెంట్స్ మీకోసం 'ఏఐ టూల్స్'!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు.. క్రమశిక్షణా అలవాట్లను ఏర్పరచుకోవడం, సమయ పాలనా నిర్వహణ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం వంటి ఎన్నో అంశాల్లో ఏఐ సాధనాలు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. చాట్‌జీపీటీ, జెమినైతోపాటు అత్యంత ఉపయోగకరమైన ఏఐ టూల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్సమయ పాలనరీక్లెయిమ్.ఏఐ: క్యాలెండర్‌ను ఆటోమేటిక్‌గా నిర్వహించే షెడ్యూలింగ్ సాధనం. అసైన్‌మెంట్స్‌ను ఎప్పుడు సవరించాలి, రాయాలో మాన్యువల్‌గా ప్లాన్ చేయడానికి బదులుగా.. విద్యార్థి ప్రస్తుత తరగతులు, క్రీడలు, అభిరుచులు, వ్యక్తిగత కార్యక్రమాలను స్కాన్ చేసి, అందుబాటులో ఉన్న ఖాళీ సమయంలో అధ్యయన సెషన్్సను నిర్ణయిస్తుంది. నోషన్ ఏఐ: నోట్స్, టాస్క్‌లు, ప్రాజెక్ట్‌లు, విజ్ఞానాన్ని ఒకే చోటకు తీసుకొస్తుంది. డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి, వాటిని సారాంశాలుగా మార్చడానికి, అసైన్‌మెంట్స్‌ను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని శోధించడానికి , నవీకరణకు సులభంగా అర్థమయ్యేలా స్టడీ డాష్‌బోర్డ్‌ను ఉంచడంలో సహాయపడుతుంది. పరిశోధన, రచనలుపర్ప్లెక్సిటీ.ఏఐ: విశ్వసనీయమైన వేదికలు (సోర్సులు), సంక్షిప్త సూచనలతో.. మన ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిశోధన ఇంజిన్. గూగుల్‌లో స్క్రోల్ చేయడానికి బదులుగా వ్యాసాలు, నివేదికలు, ప్రాజెక్ట్‌లలో ఉదహరించగల ప్రత్యక్ష, విశ్వసనీయ విషయాలను నేరుగా పొందవచ్చు. నోట్‌బుక్ ఎల్ఎమ్ (గూగుల్): క్లాస్ నోట్స్, పాఠ్యపుస్తకాలు, పీడీఎఫ్‌లను అప్లోడ్ చేసి ఈ మెటీరియల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. విద్యార్థులు ఇచ్చే సిలబస్‌ను ఆధారం చేసుకుని శిక్షణ పొందిన ట్యూటర్ పాత్రనూ పోషిస్తుంది. అధ్యయనం– అభ్యాసంక్విజ్లెట్: నోట్స్‌ను సంక్షిప్త సమాచార ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ పరీక్షలు, స్టడీ గేమ్స్‌గా మారుస్తుంది. విద్యార్థులు మెటీరియల్‌ను ఎంత బాగా గుర్తుంచుకుంటున్నారో దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. తద్వారా పాఠాలు తిరిగి చదవడం ఒక పనిలాగా, ఆసక్తి లేని విషయంగా కాకుండా ఆసక్తికరంగా మారుతుంది.వూల్ఫ్రమ్ ఆల్ఫా: ఇది కేవలం కాలిక్యులేటర్ మాత్రమే కాదు.. సమాధానాలను గణిస్తుంది. ఫంక్షన్్సను గ్రాఫ్ చేస్తుంది. దశలవారీ గణిత, సైన్్స పరిష్కారాల ద్వారా ముందుకు నడిపిస్తుంది. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, భావనలను మరింత లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.ఆటర్.ఏఐ (ఓటీటీఈఆర్): ఆడియో, వీడియోల కంటెంట్‌ను టెక్ట్స్‌గా మార్చే ట్రాన్స్క్రిప్షన్ సాధనం. ఉపన్యాసాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్్సను రికార్డ్ చేసి వాటిని సర్చ్ చేయదగిన టెక్ట్స్‌గా మారుస్తుంది. నోట్స్ రాసే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటుంది.కంటెంట్ సృష్టి – ప్రజెంటేషన్కాన్వా: డ్రాగ్–అండ్–డ్రాప్ టెంప్లేట్స్‌తో పోస్టర్లు, స్లైడ్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను సులభంగా రూపొందించవచ్చు. ఇతర ఏఐ సాధనాలు కేవలం టెక్ట్స్ వివరణ నుంచి ప్రారంభ స్థాయి డిజైన్్సను మాత్రమే రూపొందించగలవు. కానీ ఇది లే–అవుట్, స్టైలింగ్‌ను వేగవంతం చేస్తుంది. కిండర్‌గార్టెన్ నుంచి ఇంటర్ వరకు అందరి విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.గామా.యాప్: ప్రాంప్ట్‌ల నుంచి పూర్తి స్లైడ్ డెక్‌లు, సులభంగా అర్థమయ్యేలా ఒక పేజీలో డాక్యుమెంట్, సాధారణ సైట్స్‌ను కూడా రూపొందిస్తుంది. వాటికి తుదిమెరుగులు దిద్ది పీపీటీ, గూగుల్ స్లైడ్స్, పీడీఎఫ్‌లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది. కస్టమైజబుల్ ఏఐ సాధనాలుజెమినై జెమ్స్: సొంత, తేలికైన ఏఐ సాధనాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. కథనాలను సంక్షిప్తంగా రూపొందించడం, కేస్ స్టడీస్ విశ్లేషణ, అధ్యయన అంశాలను తయారు చేయడం వంటి నిర్దిష్ట పనులు చేసిపెడుతుంది.చాట్‌జీపీటీ స్టడీ మోడ్: చాట్‌జీపీటీ కేవలం ప్రశ్నోత్తరాలకే పరిమితమైన సాధనం కాదు. స్టడీ మోడ్ సాయంతో ప్రాజెక్ట్స్, వ్యక్తిగత, ప్రత్యేక జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్్డ ట్రాన్్సఫార్మర్స్తో (జీపీటీ) విద్యార్థులకు నిర్మాణాత్మక అధ్యయన సహాయకుడిగా కూడా సాయపడుతుంది. -
నైపుణ్యానిదే భవిత
చాన్నాళ్ల క్రితం ‘మీ పిల్లల్ని ఏం చదివిద్దామనుకుంటున్నార’ని తల్లిదండ్రుల్ని అడిగితే వైద్య విద్యనో, సాంకేతిక విద్యనో సమాధానంగా వచ్చేది. 90వ దశకానికల్లా సాంకేతిక విద్యే తారక మంత్రమైంది. పట్టా రావటానికి ముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఖాయమయ్యేది మరి. ఇప్పుడంతా తారుమారైంది. సాంకేతిక విద్య కిక్కిరిసి అవకాశాలు అంతంత మాత్రం అయ్యాయి. చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలగురించి అడగటం మొదలైంది. ప్రస్తుతం కృత్రిమ మేధ(ఏఐ)లో నైపుణ్యం ఏమిటన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. దశాబ్దం క్రితం నైపుణ్యాల విషయంలో మన సాంకేతిక పట్టభద్రులు వెనకబడి ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడంతా మారిందని తాజాగా విడుదలైన ‘ఇండియా స్కిల్స్ నివేదిక 2025’ చెబుతోంది. దాని ప్రకారం 54.8 శాతం మంది పట్టభద్రులు ఉద్యోగార్హులు. చూడటానికి ఇది ఎక్కువేం కాదన్న అభిప్రాయం కలగొచ్చు. కానీ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 20 పాయింట్లు అధికం. గతేడాదితో పోల్చినా మూడు పాయింట్లు అధికం. విద్యారంగానికీ, పారిశ్రామిక రంగానికీ అనుసంధానం పెరగటం వల్ల ఇదంతా సాధ్యమైందని ఆ నివేదిక అంటున్నది. ముఖ్యంగాఇంటర్న్షిప్లు విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాలనిచ్చి వారిని ఉద్యోగాలకుసంసిద్ధం చేస్తున్నాయని చెబుతోంది. కానీ ప్రభుత్వాలు విద్యకు ఇవ్వాల్సినంత ప్రాము ఖ్యత ఇస్తున్నాయా? ఫీజు రీయింబర్స్మెంటువంటి పథకాలను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు సాంకేతిక విద్య అందుబాటులోకి తెస్తున్నాయా? మన సాంకేతిక విద్యారంగం ప్రపంచ శ్రేణితో పోటీ పడాలంటే మరింత వేగంగా కదలాల్సి ఉంటుంది. అందులో అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచాల్సి ఉంది. ఈమధ్యే విడుదలైన నాల్స్కేప్ సంస్థ నివేదిక 2028 నాటికి తయారీ రంగ పరిశ్రమలో సాంకేతిక నైపుణ్య లేమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతాయని తెలిపింది. దీన్ని సరిదిద్దకపోతే 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించింది. తయారీ రంగంలో అత్యధిక పరిశ్రమలు ఉద్యోగార్థుల చదువుతోపాటు వారికున్న భిన్న రకాల నైపుణ్యాలేమిటని చూస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆధారిత సామర్థ్యాలు, సీఎన్సీ ఆపరేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ ఇంటెగ్రేషన్, డేటా ఎనలిటిక్స్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీస్, హ్యూమన్–మెషీన్ ఇంటర్ఫేస్ డిజైన్ వగైరాలకు అపారమైన డిమాండ్ ఏర్పడబోతోంది. సాఫ్ట్వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వగైరాలు అవసరమవుతాయి. సిబ్బందికుండే నైపుణ్యాలే విజయానికి బాటలు వేస్తాయి గనుక ఎంపికలో వాటినే ప్రధానంగా చూస్తామని 94 శాతం సంస్థలంటున్నాయి. అవసరాలకు అనుగుణంగా తగిన నైపుణ్యాలను పెంపొందించుకునే వారికే, ప్రపంచ స్థాయిలో పోటీపడగల వారికే ఏ పరిశ్రమల్లోనైనా ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్నది ఆ నివేదిక సారాంశం. కానీ మన సాంకేతిక విద్య ఈ స్థాయికి చేరుకుందా... విద్యాసంస్థలు ఇందుకనుగుణమైన సాంకేతికతను విద్యార్థులకు సమర్థంగా అందించగలుగుతున్నాయా అనే సందేహాలున్నాయి. మన దేశానికుండే ప్రత్యేకతేమంటే ప్రస్తుతం ఇక్కడ పనిచేయగలిగిన సత్తా గల (15–64 యేళ్ల మధ్య) జనాభా 99 కోట్ల 47 లక్షలకు చేరుకుంది. ఇది చైనాకన్నాఅధికం. 2030 వరకూ ఏడాదికి కోటి మందికి పైగా దీనికి జమ అవుతారు. భిన్నరంగాల్లో మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఏఐకి సంబంధించిన బహుముఖ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవటంలో వెనకబడితే వీరందరికీ మెరుగైన ఉద్యోగాల కల్పన అసాధ్యమవుతుంది. ఐటీ, ఆరోగ్య రంగం, హరిత ఇంధన రంగం వగైరాల ద్వారా2030 నాటికి ప్రపంచ ఆర్థిక రంగానికి 50,000 కోట్ల డాలర్ల అదనపు సంపద జమవుతుందని అంచనా. ఈ సంపదలో మన వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలంటే మెరికల్లాంటి నిపుణుల సైన్యం తయారు కావాలి. సాంకేతిక కళాశాలల తీరుతెన్నుల్నిసంపూర్ణంగా మార్చాలి. నిరుపేద గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, ప్రభుత్వాలు ఫీజురీయింబర్స్‌మెంట్ వంటివిసక్రమంగా అమలు చేయాలి. అప్పుడే అన్ని వర్గాల పిల్లలూ ఈ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. -
'ఏఐ' ముద్ర..పడాల్సిందే
డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి.. లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్‌లో కంటెంట్ క్రియేటర్స్ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.బాధ్యులను పట్టుకోవచ్చుఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది. మీడియాకు విన్నపంనకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్‌మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్ సులభంగా వైరల్ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.ఇప్పటికే కొన్ని..డీప్‌ఫేక్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల; డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నమ్మదగినవిగా మారతాయికంటెంట్ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి. ఏఐతో రూపొందిన కంటెంట్‌తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి. 10 కోట్లకు పైగా చానళ్లుభారత్లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్‌లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్. » సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు. అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది. » ఏఐతో కంటెంట్ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.» యూరోపియన్ యూనియన్ గతేడాది ఏఐ యాక్ట్‌ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది. -
జీడీపీకి ఏఐ దన్ను!
న్యూఢిల్లీ: పరిశ్రమలవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 500–600 బిలియన్ డాలర్ల మేర విలువ జత కాగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే దశాబ్దకాలంలో వివిధ రంగాలవ్యాప్తంగా ఏఐ వినియోగంతో గ్లోబల్ ఎకానమీకి 17–26 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల విలువ జతవుతుందని పేర్కొంది. భారీ సంఖ్యలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) నైపుణ్యాలున్న సిబ్బంది లభ్యత, పరిశోధన..అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుండటం, డిజిటల్..సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడగలవని నివేదిక తెలిపింది. గ్లోబల్ ఏఐ విలువలో భారత్ 10–15 శాతం వాటాను దక్కించుకోవచ్చని వివరించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి: నిర్మల అందరికీ మేలు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా నియంత్రణలు ఉండాలే తప్ప వాటిని అణచివేసే విధంగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీలను వినియోగించడమే కాకుండా వాటిని వివిధ రంగాలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చూడటంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఏఐ అనేక మార్పులకు లోనవుతూ, చాలా వేగంగా పురోగమిస్తోందని మంత్రి చెప్పారు. టెక్నాలజీ పరుగుకు అనుగుణంగా నియంత్రణలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం పరిశ్రమలు ఏఐని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, మన జీవన విధానాన్ని కృత్రిమ మేధ గణనీయంగా మార్చేయనున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.నివేదికలో మరిన్ని విశేషాలు..→ నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ రూపురేఖలను ఏఐ సిస్టమ్‌లు మార్చివేయగలవు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత కచి్చతత్వంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు మూడో వంతు పరిష్కారం కాగలవు. → టెక్నాలజీ సరీ్వసుల్లో కొత్త ఆవిష్కరణలు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి. → ప్రస్తుత 5.7 శాతం వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడీపీ 6.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్లుగా 8 శాతం వృద్ధి సాధిస్తే మరో 1.7 ట్రిలియన్ డాలర్లు పెరిగి 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. → ఏఐతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నప్పటికీ, దీనితో ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రధానంగా క్లరికల్, రొటీన్ పనులు, నైపుణ్యాలు అంతగా అవసరంలేని ఉద్యోగాలు ఈ జాబితాలో ఉంటాయి. ఆర్థిక సేవలు, తయారీ రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2035 నాటికి ఆయా రంగాల జీడీపీ విలువలో కృత్రిమ మేథ వాటా దాదాపు 20–25 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యాల మెరుగుదలతో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో 50–55 బిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తాయని రిపోర్ట్ వివరించింది. -
మ్యాథ్స్ విత్ ఏఐ పఢాయి... హాయి
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్‌లోని టోంక్‌కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్ ఏఐ’ అంటే?అమన్ చదివే స్కూల్లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది. -
ఏఐతో రోజుకు 55 నిమిషాలు ఆదా
సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందిపుచ్చుకుని వేగంగా పనులు పూర్తిచేయడంలో జెనరేషన్ జెడ్ (జెన్‌జెడ్– 1997–2012 మధ్య జన్మించినవారు) దూసుకుపోతోంది. కేవలం ఏఐను వినియోగించుకోవడమే కాకుండా దీన్ని ఏ విధంగా వాడుకోవాలన్నదానిపై పాతతరం ఉద్యోగులకు నేర్పించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు ఇంటర్నేషనల్ వర్క్‌ప్లేస్ గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సమావేశాలకు సిద్ధం కావడం, ఈ–మెయిల్స్ పంపడం, ఫైళ్ల నిర్వహణ.. ఇలా రోజువారి ఆఫీసు కార్యాకలాపాల్లో ఏఐ టూల్స్‌ను జెన్‌జెడ్ వినియోగిస్తోంది. దీంతో సగటున రోజుకు 55 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ టూల్స్ వల్ల వారు ఒకసారి చేసిన పనిని తిరిగి చేయాల్సిన అవసరం లేకుండా కొత్త కార్యకలాపాలపై దృష్టిసారించడానికి వీలుకలుగుతోందని తేలింది. అమెరికా, బ్రిటన్లలో రెండువేల మంది ఉద్యోగులపై నిర్వహించిన ఈసర్వేలో 86 శాతం మంది ఉద్యోగులు ఏఐతో చాలా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. అంతేకాదు 76 శాతం మంది తమ పదోన్నతుల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అదే జెన్‌జెడ్‌లో అయితే 87 శాతం మంది పదోన్నతులు పొందడంలో ఏఐ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఏఐ వినియోగం తప్పనిసరిరానున్న కాలంలో పనిచేసేచోట ఏఐ వినియోగం తప్పనిసరి కానుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా వ్యాపారసంస్థలు తమ విభాగాల్లో జెన్‌జెడ్‌ను ప్రోత్సహిస్తూ పాతతరం వారికి కొత్త టూల్స్‌పై అవగాహన కల్పించే విధంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ విధంగా హైబ్రీడ్ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఏఐ టూల్స్ ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని 82 శాతం మంది పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వర్క్‌ప్లేస్ గ్రూపు సీఈవో మార్క్స్ డిక్సన్ మాట్లాడుతూ రోజువారి దైనందిన కార్యకలపాల్లో ఏఐ వినియోగం అన్నది తప్పనిసరి అవుతోందని, దీంతో వీటిని వినియోగించే జెన్‌జెడ్ యువతకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. పాతతరం కొత్తతరం కలిసి పనిచేయడం ద్వారా అధిక ఉత్పత్తిని పెంచవచ్చని 82 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిపారు. కొత్తతరం డిజిటల్ వినియోగిస్తుంటే దీనికి సీనియర్ ఉద్యోగుల వృత్తి అనుభవాన్ని జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతున్నట్లు చెప్పారు. కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి జెన్‌జెడ్‌తో కలిసి సీనియర్లు పనిచేసే విధంగా పనిసంస్కృతిని పెంచుకుంటున్నట్లు డిక్సన్ తెలిపారు. -
ఏఐ నకిలీ వార్తల సూత్రధారుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: కృత్రిమమేథ(ఏఐ)తో సృష్టించిన నకిలీ వార్తలు సమాజంపై పెను దుష్ప్రభావం చూపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పరిష్కార కొరడాతో ముందుకు రావాలని ప్రసార, సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉద్భోదించింది. ఏఐతో సృష్టించిన నకిలీ వార్తల విస్తృతి కట్టడికి ఏఐతో అడ్డుకట్టవేయాలని ఈ మేరకు ఏఐను పూర్తిస్తాయిలో వినియోగించుకోవాలని సంబంధిత ముసాయిదా నివేదికలో స్టాండింగ్ కమిటీ సూచించింది. ‘తప్పుడు సమాచారం ఎక్కడ ఉందో తెల్సుకునేందుకు సాంకేతికతను ఉపయోగించాలి. కానీ ప్రస్తుత సమాజంలో తప్పుడు సమాచారానికి సాంకేతికతనే సృష్టికర్తగా మారిన దురవస్థ దాపురించింది’అని ముసాయిదా ఆవేదన వ్యక్తంచేసింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సారథ్యంలోని స్టాండింగ్ కమిటీ ఇటీవలే తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ‘ఏఐతో నకిలీ వార్తలను తామరతుంపరగా సృష్టించి అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెదజల్లుతున్న సృష్టికర్తల ఆచూకీ కనిపెట్టి వాళ్ల భరతం పట్టాలి. ఈ క్రతువులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలసికట్టుగా పనిచేయాలి. ఏఐ నకిలీ వార్తలను రూపొందిస్తున్న వ్యక్తులు, సంస్థలను చట్టం ముందు నిలబెట్టేలా పటిష్టమైన న్యాయ, సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి’అని సూచించింది. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి‘‘మంత్రిత్వశాఖల మధ్య అంతర్గత సహకారం ఉంటే ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు ఏఐ జనిత వీడియోలు, సమాచారంపై లైసెన్సుల జారీపై మరింత పట్టు సాధించగలరు. ఏఐ వీడియోలు, కంటెంట్‌పై ఇది ఏఐ జనితం అనే లేబుల్‌ను కచ్చితంగా ముద్రించాలనే నిబంధనను తు.చ. తప్పకుండా అమలుచేయాలి’ అని సూచించింది. నకిలీ సమాచారం జాడ కనిపెట్టడం, కట్టడిచేయడం, తొలగించడం వంటి విధుల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను విరివిగా వాడాల్సిన తరుణమిది అని నివేదిక అభిప్రాయపడింది. ఏఐ నకిలీ వార్తలను సృష్టించడం, ప్రచారంచేయడం వంటి నేరాలకు కఠిన శిక్షలను అమలుచేసేలా నేరశిక్షాస్మృతిలో సవరణలు చేయడం, జరిమానా మొత్తాలను పెంచడం వంటివి చేయాలని సూచించింది. -
ఏఐకి మహిళా టెకీల జై..
ముంబై: మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని టెక్నాలజీ రంగంలో అత్యధిక శాతం మహిళలు విశ్వసిస్తున్నారు. జాబ్స్, కెరియర్ ప్లాట్‌ఫాం అప్నా డాట్‌కో నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ప్రకారం మహిళా టెకీలు ఏఐ ఆధారిత కెరియర్ల కోసం సన్నద్ధమవుతున్నారు. 58 శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో భాగంగానో లేదా ఏదైనా ప్రోగ్రాంలలో చేరడం ద్వారానో లేక స్వయంగానో ఏఐ/ఎంఎల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారు. 24 శాతం మంది త్వరలోనే శిక్షణ పొందే యోచనలో ఉన్నారు. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో అత్యధిక భాగం మహిళలు జెన్ జెడ్ విభాగానికి (పాతికేళ్ల లోపు వారు) చెందినవారే. వీరిలో 60 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు కాగా, మూడింట రెండొంతుల మంది సాధారణ కాలేజీల్లో చదివినవారే. ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి డిమాండ్.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు కావాలనుకుంటున్నారు. అలాగే 19 శాతం మంది డేటా సైన్స్.. మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 14 శాతం మంది ప్రోడక్ట్ మేనేజ్మెంట్, 10 శాతం మంది రీసెర్చ్ ఉద్యోగాలపై దృష్టి పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏఐని ఏదో ఆషామాషీ ట్రెండ్‌గా కాకుండా సమాన అవకాశాలను కల్పించే దోహదకారిగా మహిళా టెకీలు భావిస్తున్నట్లు తెలుస్తోందని అప్నాడాట్‌కో వ్యవస్థాపకుడు నిర్మిత్ పారిఖ్ తెలిపారు. మరోవైపు, ఇప్పుడు పేరొందిన కాలేజీ నుంచి పట్టా పొందడం కన్నా ఏఐలో నైపుణ్యాలే చాలా ముఖ్యమని మూడింట రెండొంతుల టెకీలు భావిస్తున్నారు. జెన్ జెడ్ అమ్మాయిల్లో (22–25 ఏళ్ల వయస్సున్న వారిలో 62 శాతం మంది), ద్వితీయ–తృతీయ శ్రేణి పట్టణాల్లోని మహిళల్లో (74 శాతం మంది) ఈ భావన అత్యధికంగా ఉంది.మెట్రోల్లో ఇది 66 శాతం మందిలో ఉంది. ఏఐని అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల విషయానికొస్తే.. నాణ్యమైన అవకాశాలు అందుబాటులో ఉండటం లేదని 42 శాతం మంది, బలమైన మెంటార్షిప్ లేదని 27 శాతం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఆప్షన్లు అవసరమని 19 శాతం మంది తెలిపారు. -
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్‌లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్‌సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్‌లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్‌లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్‌లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్‌కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్‌ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్‌లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్‌తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్‌లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్‌గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్‌స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్‌లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
రిలయన్స్ ఇంటెలిజెన్స్ షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్‌ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్‌తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్‌గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు. -
అంకుర సంస్థలు.. అప్పుడే మూసేస్తున్నారు
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్‌పైనే ఆధారపడ్డ స్టార్టప్స్‌పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్‌లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు. రూ.21,000 కోట్ల నష్టంచాట్జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్‌లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్‌లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్టెక్, హెల్త్‌టెక్ రంగాల్లోని స్టార్టప్‌లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్‌సీ42’ వెబ్సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏఐ కంపెనీల దూకుడుఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది. ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్‌కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సగానికి తగ్గాయిఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్‌లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్‌లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి. భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్‌కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. -
నిరుద్యోగ విపత్తు తప్పదు: ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’గా భావించే జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) టెక్నాలజీ పెరుగుదల కంపెనీలను గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మారుస్తుందని, కానీ అది ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. నేటి కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తులకు మూలమైన మెషిన్ లెర్నింగ్ కు పునాదులు వేసిన హింటన్, ఉద్యోగాలు కోల్పోయే కార్మికుల ఖర్చుతో కంపెనీలకు లాభాలు వస్తాయని, నిరుద్యోగం ఖచ్చితంగా విపత్కర స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు."వాస్తవానికి ఏమి జరగబోతోందంటే.. ధనవంతులు కార్మికుల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించబోతున్నారు" అని హింటన్ ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది భారీ నిరుద్యోగాన్ని సృష్టిస్తుందని, కంపెనీలకు లాభాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది కొంతమందిని మరింత ధనవంతులను చేస్తుంది.. చాలా మందిని పేదలుగా చేస్తుంది. అది ఏఐ తప్పు కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థది అంటూ వివరించారు.గత ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న హింటన్ చాలాకాలంగా కృత్రిమ మేధ గురించి, దానిని నియంత్రించకుండా వదిలేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఏమి జరుగుతుందో మనకు తెలియడం లేదు. కనీసం ఊహకు కూడా అందడం లేదు. కానీ దాని గురించి చెప్పాల్సిన వాళ్లు మాత్రం మిన్నకుండిపోతున్నారు" అని హింటన్ అన్నారు.‘మనం చరిత్రలో ఒక దశలో ఉన్నాం, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అది ఆశ్చర్యకరంగా మంచిది కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనం ఊహాగానాలు చేయగలం, కానీ పరిస్థితులు అలా ఉండవు’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ తమ భాషను అభివృద్ధి చేసుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానం చేతికి అందకుండా పోతుందని ఆయన గతంలోనే హెచ్చరించారు. కృత్రిమ మేధ భయంకరమైన ఆలోచనలు చేయగలదని ఇప్పటికే నిరూపించిందని, మానవులు ట్రాక్ చేయలేని లేదా అర్థం చేసుకోలేని విధంగా యంత్రాలు చివరికి ఆలోచించగలవని ఊహించలేమని హింటన్ అన్నారు. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్‌జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్‌లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్‌బాట్‌ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్‌మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్‌మన్‌ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్‌లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్‌గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్‌తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్‌మన్‌ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్‌గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్‌లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్‌లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్‌లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్‌కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్‌గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్‌లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్‌మన్ పోస్ట్‌తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్‌ఫేక్‌లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్‌మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్‌బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్‌చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
మన గోప్యత బజారుపాలు!
ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చేది. తిన్నా, తినకపోయినా, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా... అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయేవి. ఏ ఒక్క విషయమూ గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయటి వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా, హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించే వారు.కానీ నేటి అంతర్జాల యుగంలో, డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్చుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టా మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఇష్టానిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు... ఇలా ఒకటేమిటి అన్నీ బహిర్గతం అయి పోతున్నాయి. మనమందరం ఏఐ సాంకేతికను వాడుకుంటున్నాము అని సంతోషపడుతున్నాము. కానీ నిజానికి అదే మనల్ని వాడుకుంటోంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడి సరుకు మనుషులు, వారి అలవాట్లే.ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడతున్నాం. అంతర్జాల వేదికలయిన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిల్లో మనకు ఖాతా ఉంటే చాలు... మనల్ని మనం అమ్ముకున్నట్టే! మనకు తెలియకుండానే మనల్ని ఎవరో పల్లకీల్లో ఉరేగిస్తుంటారు. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తుంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెగూడుల్లా అల్లుకుపోయి ఉన్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదన్నా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్‌పై వార్తలు చదివినా, విన్నా... ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏమి కావాలో, మనం ఏమి తినాలో, ఏ సినిమా చూడాలో, ఏమి చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..వీటివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు... గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియచేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి, మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటుపడతాము.గోప్యతను కాపాడుకోవటం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని, మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాక... నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసివస్తుంది. – ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్ -
చాట్‌జీపీటీ పురుష పక్షపాతా!?
ప్రపంచాన్ని ‘మెన్స్ వరల్డ్’గా నిర్వచిస్తుంటారు సోషల్ ఇంజినీర్స్! ఈ మాటకు మెజారిటీ ప్రజలు విస్తుపోవచ్చు కానీ వ్యతిరేకించడానికైతే లేదు! సాంకేతిక ప్రపంచం కూడా పురుషుల ఫేవర్‌గానే కనిపిస్తోంది.. అందుకు సాక్ష్యం.. ఏఐ టూల్స్ మీద కార్నెల్ యూనివర్సిటీ చేసిన స్టడీ!చాట్జీపీటిలాంటి ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? ‘యస్. ఉంటుంది’ అని తేల్చి చెప్పింది కార్నెల్ యూనివర్సిటీ (Cornell University) తాజా అధ్యయనం. ఉద్యోగార్థులైన మహిళలు సలహాల కోసం చాట్‌బాట్ సహాయం తీసుకుంటే అవి ఇచ్చే సమాధానాలలో పురుష పక్షపాతం కనిపిస్తున్నట్లు కార్నెల్ స్టడీ తెలియజేసింది. మచ్చుకు ఒక ఉదాహరణ: ‘పురుషులతో పోల్చితే మీరు తక్కువ వేతనం కోరుకోండి’.‘స్టార్టింగ్ శాలరీ’ గురించి అనుభవం ఉన్న ఇద్దరు మెడికల్ స్పెషలిస్ట్‌లు చాట్‌బాట్ (Chatbot) సలహా కోరారు. ఆ స్పెషలిస్ట్‌లలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. పురుషుడికి సూచించిన వేతనంతో పోల్చితే మహిళకు సూచించిన వేతనం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ఉదాహరణలెన్నో కార్నెల్ స్టడీ ఉటంకించింది. ‘డీప్ బయాస్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్’ పేరుతో పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జీపీటీ–4వో మినీ, క్లాడ్ 3.5 హైకు, చాట్‌జీపీటీ.. మొదలైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లను విశ్లేషించారు. మహిళల జీతానికి సంబంధించి రకరకాలుగా ‘ఎల్ఎల్ఎం’ సలహాలు అడిగారు. ఎన్ని రకాలుగా అడిగినా జీతానికి సంబంధించి పాపులర్ ‘ఎల్ఎల్ఎం’లు ఇచ్చే సమాధానాలు పక్షపాతంతో కూడుకున్నట్లు స్టడీ తెలియజేసింది. దీనిమీద టెక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే..అంతా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్‌లోనే ఉంటుందిఏఐ పురుష– పక్షపాతంతో వ్యవహరిస్తుందనేది పూర్తిగా ఆధార రహితమైతే కాదు. అయితే దీన్ని లోతుగా విశ్లేషించడం అవసరం. ఉద్దేశపూర్వక అభిప్రాయాలు, పక్షపాతం ఉండటానికి ఏఐ ఏమీ మానవ మెదడు కాదు. దానికి ఇచ్చిన డేటాను బట్టే అది సమాచారాన్ని అందిస్తుందని నిపుణుల మాట. ఏఐ మోడల్స్‌ని డెవలప్ చేసి, టెస్ట్ చేసే టీమ్స్‌లో పురుషులే అధికంగా ఉంటే ఆ డేటాలో వారి దృక్కోణాలే ప్రస్ఫుటిస్తాయి. జెండర్, సామాజిక– ఆర్థిక నేపథ్యాలకు సంబంధించిన అంశాలను వారు పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల ఏఐ సమాచారం పురుష పక్షపాతంగా కనిపించవచ్చు. అందుకే ఏఐ మోడల్స్ డెవలప్మెంట్లో, టెస్టింగ్‌లో అమ్మాయిలనూ భాగం చేస్తే.. లీడర్షిప్ రోల్స్‌లో అమ్మాయిలకూ సహభాగస్వామ్యం కల్పించాలి. అనేక సంస్థలు ఇప్పుడు దీని మీద దృష్టిపెడుతున్నాయి. డేటాసెట్లు, డిజైన్ ప్రక్రియలు, నియమిత ఆడిట్ల ద్వారా పక్షపాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. – అనిల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅమ్మాయిలనూ ఎడ్యుకేట్ చేయాలికృత్రిమ మేధను రూపొందిస్తోంది మన మేధనే కదా! ఏఐ టూల్స్‌ను డెవలప్ చేయడంలో, టెస్టింగ్ లో మహిళల ప్రాతినిధ్యం అంతగా లేకపోతే ఏఐ డేటా (AI Data) అంతా పురుష పక్షపాతంగానే ఉంటుంది. ఏఐని ఏ వర్గం ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే ఆ వర్గానికి అనుకూలమైన డేటానే అది రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మోడల్స్ డెవలప్మెంట్లోనే కాదు దాన్ని ఉపయోగించే విషయంలోనూ అమ్మాయిల సముచిత భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి అమ్మాయిలనూ డిజిటల్‌గా ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే పక్షపాతం లేని, వహించని సమాచారం అందుతుంది. – పి. విప్లవి, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్చదవండి: 3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయి.. -
భలేగా బ్యాట్మింటన్ ఆడుతున్న రోబో శునకం
కొందరు బ్యాట్మింటన్ ఆడుతుంటే దూరంగా పడిన షటిల్‌ను వాళ్ల పెంపుడు శునకం పరుగెత్తుకెళ్లి నోటితో కరిచి తెచ్చివ్వడం చూస్తూనే ఉంటా. అయితే ఈ రోబో శునకం మాత్రం షటిల్‌ను తెచ్చివ్వడానికి బదులు షటిల్బ్యాట్ పట్టుకుని ఆటకు సిద్ధమైంది. రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్రీడాంశాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త తరహా రోబో ఇప్పుడు రోబోటిక్ రంగంలో చర్చనీయాంశమైంది. బ్యాడ్మింటన్‌లో చకాచకా షటిల్‌తో షాట్స్ కొడుతుంటే టకాటకా తిరిగి షాట్స్ కొడుతున్న చిన్న రోబో శునకానికి ‘ఏఎన్వైఎంఏఎ–ఎనిమల్’అని పేరు పెట్టారు. స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయం అయిన ఈటీహెచ్, జ్యూరిచ్‌లోని పరిశోధకులు ఈ రోబో శునకాన్ని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్‌ల మేలు కలయికగా దీనిని తయారుచేశామని పరిశోధకులు చెప్పారు. మనిషి తరహాలో వేగంగా కదులుతూ షటిల్ గమనాన్ని గుర్తిస్తూ తిరిగి షాట్ కొట్టగలడం ఈ రోబో శునకం ప్రత్యేకత. వర్సిటీలోని రోబోటిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లోని ప్రొఫెసర్ మార్కో హట్టర్ సారథ్యంలోని పరిశోధనా బృందం ఈ రోబోను సృష్టించింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ రోబో శునకం బరువు 50 కేజీలుకాగా ఎత్తు 1.5 అడుగులు మాత్రమే. ఎదురుగా షటిల్‌కాక్ దూసుకొచ్చే విధానాన్ని విశ్లేషించి, దానికి అనుగుణంగా కాళ్లు కదపాల్సిన విధానాన్ని విశ్లేషించి ఈ రోబోకు ప్రోగ్రామింగ్ చేశారు. ఎదురుగా నిలబడిన ఆటగాడు ఎంత ఎత్తు నుంచి షటిల్‌కాక్ కొట్టాడు? కాక్ ఎంత ఎత్తు నుంచి దూసుకొస్తోంది? ఎంత వేగంతో వస్తోంది? అది ఏ దిశలో నేలను తాకొచ్చు? అనే పలు అంశాలపై తొలుత పరిశీలనచేసి ఓ అంచనాకొచ్చారు. తర్వాత కాక్ పథానికి తగ్గట్లు ఎనిమల్ రోబో శునకం నాలుగు కాళ్లను ఎటు వైపునకు కదపాలి. పరుగెత్తేలా లేదంటే ఇంకా పైకి లేచి కొడితే సరిపోతుందా? ఒకవేళ పరిగెడితే వెంటనే పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకోవడం ఎలా? అనే అనేక అంశాలపై ముందస్తు అంచనాప్రోగ్రామ్లను రాసుకొని వాటితో తొలుత పరీక్షలు జరిపి విజయవంతమయ్యారు. తర్వాత అన్నింటినీ కలిపి ఆటగాడు కొట్టిన కాక్‌ను వేగంగా తిరిగికొట్టడం, అది కూడా కోర్ట్‌కి లోపల పడేలా షాట్ కొట్టడం వంటివి ప్రోగ్రామింగ్‌కు జతచేశారు. ఆట వేగానికి తగ్గట్లుగా రోబో శునకం నాలుగు కాళ్లు మాత్రమే కాదు ప్రత్యేక ‘చేయి’సైతం చురుకుగా కదిలేలా పలు మార్పులుచేశారు. ఎట్టకేలకు మనిషి ఆటను సైతం ఎదిరించేలా స్థాయికి రోబోను సృష్టించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోవాసెంట్ నుంచి.. ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ (ఏఐ–యాక్ట్) పేరిట కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లాగా పని చేస్తుందని ఆయన వివరించారు. -
ఆగస్టులో హైరింగ్ 3 శాతం అప్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా వైట్–కాలర్ జాబ్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందింది. ప్రదానంగా ఐటీయేతర రంగాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్లు నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్స్, మేనేజర్లు, అడ్మిని్రస్టేషన్ ఉద్యోగాలను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఆగస్టులో అత్యధికంగా 24 శాతం హైరింగ్‌తో బీమా రంగం అగ్రస్థానంలో నిలి్చంది. ఆతిథ్య (22 శాతం), రియల్ ఎస్టేట్ (18 శాతం) రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీపీవో/ఐటీఈఎస్ (17 శాతం), విద్య (16 శాతం), ఆయిల్..గ్యాస్ (7 శాతం), రిటైల్ (3 శాతం), ఎఫ్ఎంసీజీ (2 శాతం) రంగాల్లో కూడా సానుకూల హైరింగ్ నమోదైంది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. → కొత్త టెక్నాలజీల్లో నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఏఐ/ఎంఎల్ ఉద్యోగాలకు హైరింగ్ 54 శాతం ఎగిసింది. అయితే, ఓవరాల్‌గా ఐటీ/సాఫ్ట్వేర్ సరీ్వసుల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గాయి. → బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగంలో హైరింగ్ 11 శాతం, టెలికం/ఐఎస్పీలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. → ఫ్రెషర్ల (0–3 ఏళ్ల అనుభవం) రిక్రూట్మెంట్ 7 శాతం పెరిగింది. ఆతిథ్య, రియల్ ఎస్టేట్, విద్య తదితర ఐటీయేతర రంగాల్లో డిమాండ్ ఇందుకు తోడ్పడింది. → ఓవరాల్‌గా 10 శాతం హైరింగ్ వృద్ధితో నియామకాలకు సంబంధించి హైదరాబాద్ టాప్ మెట్రో సిటీగా నిలి్చంది. యూనికార్న్‌లలో (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) రిక్రూట్మెంట్ 45 శాతం ఎగిసింది. -
చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపాడు
కనెక్టికట్: చాట్‌జీపీటీ చెప్పిందని తల్లిని చంపిన ఓ వ్యక్తి, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఆ వ్యక్తిని 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయెల్బర్గ్గా గుర్తించారు. గతంలో యాహూలో మేనేజర్‌గా పనిచేసిన సోయెల్.. ఏఐ చాట్‌బాట్ నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. దానికి బాబీ అని పేరు పెట్టుకున్నాడు. బాబీతో చేసిన సంభాషణలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు. అప్పటికే మానసిక అనారోగ్యంతో ఉన్న సోయెల్.. తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని భావించాడు. ఈ విషయంపై ఏఐతో మాట్లాడాడు. అది అతని అనుమానాన్ని పెంచింది. మానసిక అనారోగ్యానికి వాడే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చెప్పింది. దీంతో సోయెల్ తల్లిపై దాడి చేశాడు. తలకు, మెడకు బలమైన గాయాలవ్వడంతో ఆమె మరణించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ, ఛాతీపై బలమైన గాయాలవ్వడంతో ఆయన చనిపోయాడు. 2.7 మిలియన్ డాలర్ల విలువైన వారి ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఆగస్ట్ 5న దొరికాయి. పదునైన ఆయుధంతో దాడిచేయడంతోపాటు, తనను తాను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. -
ఏఐ టెక్నాలజీ మోసానికి సాధనమవుతోంది: శిఖా గోయెల్
ఐఎస్‌ఏసీఏ హైదరాబాద్ ఛాప్టర్ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నెన్స్, సైబర్‌సెక్యూరిటీ, ప్రైవసీ నిపుణులను ప్రోత్సహిస్తూ తమ 25వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు థీమ్: "ట్రస్ట్ ఏఐసీఎస్ - 2025: ఏఐ ఇంటిగ్రేట్స్ గవర్నెన్స్, సైబర్‌సెక్యూరిటీ, అండ్ ప్రైవసీ" అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది''.ఈ సదస్సును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ శిఖా గోయెల్ ప్రారంభించారు. వారితో పాటు ఐఎస్‌ఏసీఏ హైదరాబాద్ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం 400 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాప్టర్ చరిత్రలోనే అత్యధికం. 2024లో జరిగిన సదస్సు విజయం ఈసారి కూడా కొనసాగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఐఎస్‌ఏసీఏ ఒక ముఖ్యమైన నిపుణుల సమూహంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.ఈ సమావేశం గురించి శిఖా మాట్లాడుతూ.. "ISACA హైదరాబాద్ 25 సంవత్సరాల వేడుకలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలను నివేదిస్తూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన సాంకేతికత ఇప్పుడు మోసానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. నేడు అన్ని ప్రధాన రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఏఐ వ్యవస్థలను రక్షించడం మరియు జవాబుదారీతనం అనేది ఈ సమయంలో అత్యవసరం. ఏఐని సరిగ్గా, నైతికంగా ఉపయోగించాలనుకుంటే ISACA వంటి వృత్తిపరమైన సంస్థలు చాలా అవసరమని అన్నారు. -
ఏఐతో బ్యాంకింగ్‌లో సమూల మార్పులు..!
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో భారత బ్యాంకింగ్ రంగంలో సగం ఉద్యోగాల స్వరూపం మారిపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ఎన్నో రంగాల్లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో బీసీజీ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) ఐదు రెట్లు అధికంగా వ్యయాలు చేసినప్పటికీ పెరిగిన ఉత్పాదక పరిమితమేనని ఈ నివేదిక తెలిపింది. నికరంగా పెరిగిన ఉత్పాదకత ఒక శాతమేనంటూ, అంతర్జాతీయ బ్యాంకులతో పోల్చితే భారత బ్యాంకులు వెనుకబడినట్టు పేర్కొంది. కనుక బ్యాంక్‌లు ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదతక పెంపు పరంగా ఉన్న సవాళ్లను అధిగమించొచ్చని తెలిపింది. ఇప్పటికే చాలా బ్యాంక్‌లు ఈ తరహా టూల్స్‌ను వినియోగిస్తున్నట్టు పేర్కొంది. బ్యాంకులు ఈ తరహా కొత్త సాంకేతికతలను స్వీకరించడం మొదలు పెడితే, గత కొన్నేళ్ల నుంచి ఎదుర్కొంటున్న సంక్లిష్ట వ్యయ సవాళ్లను అధిగమించగలవని బీసీజీ సీనియర్ పార్ట్నర్ రుచిన్ గోయల్ పేర్కొన్నారు.‘ఏఐ వినియోగం పెరిగే కొద్దీ సంఘటిత రంగంలో ఉద్యోగాలకు సవాళ్లు ఎదురవుతాయి. ఐటీ తదితర రంగాల్లో ఇప్పటికే ఉద్యోగుల తొలగింపులు వింటున్నాం. బ్యాంకుల్లోనూ నికర ఉద్యోగుల సంఖ్య పెరుగుదల తగ్గుతోంది. టెక్నాలజీ కారణంగా కొన్ని ఉద్యోగ ఖాళీలను బ్యాంకులు భర్తీ చేయకపోవచ్చు’ అని గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో టెక్నాలజీపై బ్యాంకులు చేసే వ్యయాలు పెరుగుతాయన్నారు. రుణ వృద్ధి మెరుగుపడాలి.. బ్యాంకుల్లో రుణ వృద్ధి నిదానించడాన్ని బీసీజీ నివేదిక ఎత్తి చూపించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు వీలుగా బ్యాంకుల రుణ వృద్ది వేగవంతం కావాలని పేర్కొంది. సాధారణ జీడీపీ వృద్ది కంటే 3–3.5 శాతం మేర బ్యాంకుల రుణ ఆస్తులు పెరగాల్సి ఉంటుందని తెలిపింది. 2024–25లో సాధారణ జీడీపీ 9.8 శాతం కాగా, బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతానికే పరిమితమైనట్టు గుర్తు చేసింది. -
డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థల్లో లేని సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేçయనున్నారు. ఎదురుగా రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా, డ్రైవర్ అప్రమత్తంగా లేక ప్రమాదానికి కారణం అయ్యేలా ఉన్నా, చివరకు డ్రైవర్ ఆవలించినా ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. తద్వారా డ్రైవర్ ప్రమా దాన్ని తప్పించేలా చేస్తుంది. ఒకవేళ అప్రమత్తం చేసిన తర్వాత కూడా డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే.. ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ ద్వారా మరోసారి అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ మానిటరింగ్ సిస్టం (డీఎంఎస్), అడ్వాన్స్డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం (ఏడీఏఎస్)..అనే ఈ రెండింటితో కూడిన వ్యవస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది. ప్రయోగాత్మకంగా తొలుత 200 బస్సుల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను విశ్లేషించిన తర్వాత అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్లు పిలవగా 4 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిల్లో రెండింటిని తిరస్కరించిన ఆర్టీసీ.. మిగతా రెండింటి సాంకేతిక పనితీరును పరిశీలిస్తోంది. ఇప్పటికే ఒక్కో సంస్థ రెండు చొప్పున బస్సుల్లో ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ట్రయల్ ప్రారంభించాయి. వీటిల్లో మెరుగైన సాంకేతికతను అందించే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే 200 బస్సుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఎప్పటికప్పుడు బీప్ శబ్దాలతో.. ఎంపిక చేసిన బస్సుల్లో ముందువైపు రెండు ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒకటి డ్రైవర్‌ను, మరోటి రోడ్డును పరిశీలిస్తుంటాయి. అయితే ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. రోడ్డును పరిశీలించే కెమెరా ఏడీఏఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. రోడ్డుపై ఉన్నట్టుండి వ్యక్తులు, వాహనాలు అడ్డుగా వచ్చినప్పుడు వెంటనే డ్యాష్‌బోర్డుపై ఉండే సిస్టం నుంచి బీప్ శబ్దం వెలువడుతుంది. డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ వేగంతో ప్రమేయం లేకుండా రోడ్డు లేన్‌ను నిర్లక్ష్యంగా మార్చినా, వరసగా ఆవలిస్తున్నా, నిద్రమత్తులో ఉన్నా, తరచూ రెప్ప వాలుస్తున్నా కూడా బీప్ అలర్టులు వస్తాయి. బస్సు నడుపుతూ ఇతరులతో ముచ్చటిస్తున్నా, సెల్ఫోన్లో మాట్లాడుతున్నా, ఇయర్ ఫోన్లు పెట్టుకుని మాట్లాడుతున్నా కూడా అలెర్ట్ చేస్తుంది. ఇక డీఎంఎస్తో అనుసంధానమై ఉండే రెండో కెమెరా డ్రైవర్‌ను పరిశీలిస్తుంటుంది. ఈ కెమెరా ద్వారా డ్రైవర్ బస్సు నడుపుతున్న తీరును రియల్ టైమ్‌లో చూసే వీలు అధికారులు, సిబ్బందికి కలుగుతుంది. ఇది బస్‌భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కొనసాగుతుంటే, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. ఆ వెంటనే సిబ్బంది డ్రైవర్‌కు ఫోన్ చేసి అప్రమత్తం చేస్తారు. అధికారి సెల్‌ఫోన్‌తోనూ అనుసంధానం డీఎంఎస్ పంపే రియల్ టైమ్ ఫీడ్‌ను నేరుగా సంబంధిత అధికారి సెల్‌ఫోన్‌తో కూడా అనుసంధానిస్తారు. తద్వారా ఆ అధికారి డ్రైవర్ బస్సును నడుపుతున్న తీరును పరిశీలించొచ్చు, అవసరమైతే ఆయనే నేరుగా డ్రైవర్‌కు ఫోన్‌చేసి అప్రమత్తం చేయొచ్చు. పరిహార భారం నుంచి విముక్తి! బస్సులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డ్రైవర్ తప్పిదం వల్ల జరుగుతుంటే, మరికొన్ని ఇతర వాహన డ్రైవర్ల తప్పిదాలతో జరుగుతున్నాయి. అలాంటప్పుడు మృతులు, బాధితుల కుటుంబాలకు ఆర్టీసీ భారీ ఎత్తున పరిహారం అందిస్తోంది. సాలీనా రూ.80 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇది ఆర్టీసీకి పెద్ద భారంగా మారింది. అయితే చాలా సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేనప్పటికీ, ఆర్టీసీ పరిహారం చెల్లిస్తోంది. ప్రమాదాలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవటంతో ఇది జరుగుతోంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం వల్ల ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇది ఆర్టీసీపై అనవసర భారం పడకుండా ఉపయోగపడుతుంది. ప్రమాదాలు నివారిస్తే సంస్థ పురోగతికి, కొత్త బస్సుల కొనుగోలుకు ఆ నిధులను వినియోగించేందుకు వీలుంటుంది. -
బుద్ధిజీవులకైనా 'బలమైన సవాల్'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని నా రచనల్లో ఎలీన్ ఇంటెలిజెన్స్‌గా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. బుద్ధిజీవు లైన మానవ జాతిని మానవ పరిణామ శాస్త్ర పరిభాషలో హోమో సేపియన్స్గా పిలుస్తారు. నాకెందుకో ఒక కొత్త జాతి వృద్ధి చెంది ఈ హోమో సేపియన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనిపిస్తోంది. ఈ భూగోళంపై మొదటిసారిగా మనకు నిజమైన పోటీ ఎదురవుతోంది. ఇప్పటికి కొన్ని వేలాది ఏళ్ళుగా మనమే అత్యంత తెలివైన జాతిగా ఉంటూ వస్తున్నాం. ఆఫ్రికాలో ఓ మూలన ప్రాధాన్యం లేని కోతులుగా పడి ఉన్న మనం ఈ తెలివి తేటల కారణంగానే, ఈ భూగోళానికి తిరుగులేని పాలకులుగా మారగలిగాం. కానీ, ఇపుడు మనం సృష్టిస్తున్నది సమీప భవిష్యత్తులో మనకు పోటీగా పరిణమించవచ్చు. పిల్లల్ని పెంచడం లాంటిదే!ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు. నేర్చుకోగలదు. తనకుతాను మారగలదు. మనం ఇంతకు ముందు కనుగొన్న ముద్రణాలయం, అణు బాంబు లాంటివి మనల్ని శక్తిమంతులను చేసిన సాధనాలు. వాటికి మన అవసరం ఉంది. ప్రెస్ స్వయంగా పుస్తకాలు రాయలేదు. ఏ పుస్తకాలను ప్రచురించాలో నిర్ణయించలేదు. అణు బాంబు తనకన్నా శక్తిమంతమైన మరో బాంబును కనుగొనలేదు. తానెక్కడ పేలాలో దాని కంతట అదే నిర్ణయించుకోలేదు. కానీ, ఏఐ ఆయుధం దాడికి లక్ష్యాన్ని ఎంచుకోగలదు. తదుపరి తరం ఆయుధాలను దానికంతట అదే డిజైన్ చేయగలదు.నా తాజా పుస్తకం ‘నెక్సస్’లో ఏఐని చిన్న పిల్లాడిలా అభివర్ణించాను. మనం ఏది నేర్పుతామో వాడు అదే నేర్చుకుంటాడు. కనుక, మనందరం ముఖ్యంగా, వివిధ దేశాల స్థితిగతులను ప్రభావితం చేస్తున్న నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మనం అబద్ధాలాడుతూ, వంచన చేస్తూ, ఏఐ మాత్రం దయగలదిగా ఉండా లంటే కుదరదు. ఒక నిర్దిష్టమైన రీతిలో ఈ ఏఐని మనం డిజైన్ చేయగలమా? ఏఐకి నీతి నియమాలు బోధించగలమా? వాటిలోకి కొన్ని లక్ష్యాలను చొప్పించగలిగిన విధంగా కోడింగ్ చేయగలమా? అనే అంశాలపై పరిశోధన, ప్రయత్నాలు సాగుతున్నాయి. అపుడు మనం సురక్షితంగా ఉంటాం కదా అని భావిస్తున్నారు. కానీ, ఈ దృక్పథంలో రెండు ప్రధాన సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఒకటి– అసలు ఏఐ అంటేనే నేర్చుకోగలదు, దానికంతట అది మారగలదు. కనుక మనం ఏఐని డిజైన్ చేస్తే, నిర్వచనాన్ని అనుసరించి, మనం ఊహించలేని అన్ని రకాల పనులనూ అది చేసేస్తుంది. రెండు– ఇది ఇంకా పెద్ద సమస్య. మనం ఏఐని పిల్లాడిలానే భావించి విద్యా బుద్ధులు నేర్పించాం అనుకుందాం. సత్పౌరుడుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. వారి చదువు సంధ్యలపై మీరు ఎంత వెచ్చించారన్నది లెక్కలోకి రాదు. చివరకు, వారు చేసే పని మిమ్మల్ని ఆశ్చర్యపరచనూవచ్చు లేదా భయపెట్టనూవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. ఇది పిల్లల్ని పెంచేవారందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం పిల్లలకి ఏం చెబుతామన్న దానికన్నా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మనం పిల్లలకి అబద్ధా లాడవద్దని చెప్పేసి, మనం మాత్రం ఇతరులతో అబద్ధాలు చెబుతూంటే, వారు చూసి మనల్నే అనుకరిస్తారు. మన ఆదేశాల్ని పాటించరు. అబద్ధాలాడకూడదనే నీతిని ఏఐలలో చొప్పించే ప్రాజెక్టును చేపట్టామనుకుందాం. కానీ, వాటికి ప్రపంచంతో యాక్సెస్ ఉంది. మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి గమనిస్తాయి. అదే నడతను మన పట్లా ప్రదర్శిస్తాయి. అన్నింటిలోనూ... అన్ని చోట్లా...వ్యాపారాలలో ఏఐ ప్రాధాన్యం ప్రస్తుతానికి పెద్ద లెక్కలోకి రానిదిగానే కనిపించవచ్చు. ఇప్పటికి 36 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే... అది టైమ్ స్కేల్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు, ఇది లండన్‌లో 1835 సంవ త్సరం అనుకుందాం. మాంచెస్టర్– లివర్‌పూల్ మధ్య మొదటి రైలు మొదలై అప్పటికి ఐదేళ్లయింది. లండన్‌లో 1835లో చర్చకు కూర్చున్నవాళ్లకు ‘రైల్వేలు ప్రపంచాన్ని మార్చేస్తాయి, పారిశ్రామిక విప్లవం వచ్చేస్తుంది’ అంటే నాన్సెన్స్ అని కొట్టిపడేస్తారు. కానీ, ఇపుడు రైల్వేలు మొదలై చాలా ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం, రైల్వేలు ప్రతీదాన్నీ మార్చేశాయని మనకు ఇపుడు తెలుసు. కానీ, మార్పు వచ్చేందుకు ఐదేళ్ళకన్నా ఎక్కువే పట్టింది. అలాగే, ఇప్పటికి తెలిసిన రంగాలు, అంతగా తెలియని రంగా లన్నింటిలో కూడా ఏఐతో మార్పులు రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ప్రధానమైన మార్పులను చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను ఏఐ చాలా వేగంగా హస్తగతం చేసుకోబోతోంది. ఆర్థికం పూర్తిగా సమా చార ప్రభావిత రంగం. డ్రైవర్ సీట్లో మనిషి లేకుండా నడిచే కార్లు లక్షల్లో మనకు అప్పుడే రోడ్డు మీద కనబడకపోవచ్చు. ఎందుకంటే, రోడ్డుమీద గుంతలుంటాయి, మనుషులు నడుస్తూంటారు, కంగా ళీగా ఉంటుంది కనుక ఏఐతో నడిచే వాహనాలు రాకపోకలు సాగించడానికి సమయం పడుతుంది. కానీ, ఆర్థికంలో సమాచా రమే ప్రధానం. వస్తుంది, వెళుతుంది. దానిపై పట్టు సాధించడం ఏఐకి చాలా తేలిక. ఆయుధ పోటీ లాంటి స్థితిఏఐ కొందరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది అంటున్నారు. దీనిపై చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఒక సమాజంగా బతికి బట్టకట్టడమే కాదు, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏఐకి అపారమైన సానుకూల సామర్థ్యమూ ఉంది. ప్రమాదకరమైన సామర్థ్యమూ ఉంది. ఒకే టెక్నాలజీ పూర్తిగా భిన్నమైన సమాజాలను సృష్టించడాన్ని మనం 20వ శతాబ్దంలో గమనించాం. అందుకే కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలతోపాటు, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలూ ఏర్పడ్డాయి. ఏఐతోనూ అంతే! దాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకునేందుకు మనకు అవకాశం ఉంది. కాకపోతే, మనం మొదటిసారిగా పనిముట్లతో కాకుండా ఏజెంట్లతో వ్యవహరిస్తున్నామనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఇప్పటికీ ఏఐ చాలా వరకు మన చెప్పుచేతల్లోనే ఉంది. మనం ఆ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తాం? అంతకన్నా ముఖ్యంగా మనం దాన్ని ఎక్కడెక్కడ నియోగించబోతున్నాం? అన్నది ప్రశ్న. ఎంచుకునేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే, ఏఐ విప్లవంలో ప్రస్తుతం అగ్ర భాగాన ఉన్న కంపెనీలు, దేశాలు ఆయుధాల సమీకరణ లాంటి పోటీ స్థితిలో చిక్కుకున్నాయి. ఈ విషయంలో మందగతిన సాగడమే మంచిదని వాటికి తెలిసినా, సురక్షణపై మరింత వ్యయం అవసరమనే గ్రహింపు ఉన్నా, ఆ శక్తిమంతమైన పరిణామం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నా, మనం బ్రేకులు వేసి నంత మాత్రాన ఇతరులు వేయకపోవచ్చనే భయం వారిని నిరంతరం వెన్నాడుతోంది. ఎక్కడ ఎదుటివారు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదిచ్చేస్తారేమోననే ఆదుర్దా వారిని నిలువనీయడం లేదు. -
మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్ Macrohard >> Microsoft అని ‘ఎక్స్’ లో పోస్ట్చేసిన విషయం తెల్సిందే. ఎక్స్ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ తదితరాల కోసం విడిగా హార్డ్వేర్లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్లైన్లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్వేర్ అనేవి అంతా ఆన్లైన్లోనే ఇన్స్టాల్ అవుతాయి. ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, డివైస్‌లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్ స్పీచ్, టెక్స్ట్ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్‌బాట్ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్వేర్ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ’’అని మస్క్ చెప్పుకొచ్చారు. ఒకేసారి సమాంతర వ్యవస్థ ‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్ పోగ్రామ్‌లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్‌వేర్‌తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్ చెప్పారు. మస్క్‌కు చెందిన ఎక్స్ఏఐ సంస్థ ఆగస్ట్ ఒకటో తేదీన అమెరికా పేటెంట్ ఆఫీస్‌లో ‘మాక్రోహార్డ్’పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్వేర్ తయారీకి మస్క్ నడుంబిగించారు. అయితే ప్రతి కంప్యూటర్లో కనిపించే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ వంటి సాఫ్ట్వేర్లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్వేర్ సేవలను అందించడం మస్క్‌కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ ఎన్విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్‌లో మస్క్ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్ సూపర్‌కంప్యూటర్‌లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్ సంస్థ పోటీపడాల్సి ఉంది. -
మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్‌లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొదలైనవి ఉన్నాయి.గత నెలలో Xలో ఒక పోస్ట్‌లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్‌వేర్‌తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారుఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్‌జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్‌ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025 -
భారత్‌లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్‌జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్‌తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్‌ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్‌టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు -
కింగ్.. ‘అనలిటికల్ థింకింగ్’!
రోజురోజుకు కృత్రిమమేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వినియోగం విస్తృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగాల సాధన ఉద్యోగార్థులకు కష్టసాధ్యంగా మారుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు కోరుకున్న విధంగా వివిధ నైపుణ్యాలున్న వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భావోద్వేగ మేధస్సు వంటివి కీలక ఉద్యోగ నైపుణ్యాలుగా పరిగణిస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక నైపుణ్యాలకూ అధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలపై ‘గ్లోబల్ సర్వే ఆఫ్ ఎంప్లాయర్స్’నివేదిక రూపొందించింది. అలాగే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయా నైపుణ్యాలకు ర్యాంకింగ్స్ ఇస్తూ ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’నివేదికను వెలువరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్లకు పైగా ఉద్యోగులున్న 1,043 కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్‌లో అనలిటికల్ థింకింగ్ (విశ్లేషణాత్మక ఆలోచన) 69 శాతంతో అగ్రస్థానంలో నిలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఇక భారత్ విషయానికొస్తే... వివిధ అధ్యయనాలు, సర్వేలు, నిపుణుల అభిప్రాయాలు సూచనలను బట్టి చూస్తే దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలు... కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూ కేంద్రీకృతం అవుతున్నాయి. భారత్‌లో కంపెనీలు కోరుకుంటున్న ముఖ్య సాంకేతికత ఇలా ఉన్నాయి.కృత్రిమ మేథ,మెషీన్ లెర్నింగ్:ఏఐ అల్గోరిథంలు, న్యూరల్ నెట్వర్క్ అప్లికేషన్లలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్. డేటా విశ్లేషణ: డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రమాణంగా మారుతోంది. అందువల్ల డేటా మానిప్యులేషన్, గణాంక విశ్లేషణ, విజువలైజేషన్లో నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది. సైబర్ భద్రత: రోజురోజుకు సైబర్ ముప్పు పెరుగుతుండటంతో నెట్‌వర్క్‌ల రక్షణలో నైపుణ్యాలు, సాంకేతికంగా ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం, భద్రతా ప్రోటోకాల్ అమలుకు అత్యంత ప్రాధాన్యత క్లౌడ్ కంప్యూటింగ్: వ్యాపారాలు క్లౌడ్‌లోకి మార్పిడి జరుగుతుండటంతో, క్లౌడ్ సేవలు, ఆర్కిటెక్చర్ డిజైన్, డిప్లాయ్‌మెంట్ వ్యూహాల పరిజ్ఞానం వంటి వాటికి అధిక డిమాండ్సాఫ్ట్వేర్ అభివృద్ధి: సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ముఖ్యంగా ఏఐ–ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ టెక్నాలజీలలో అనుభవం ఉన్నవారి కోసం డిమాండ్.బ్లాక్‌చైన్ టెక్నాలజీ: ఫైనాన్స్, సప్లయ్ చైన్ పరిశ్రమల్లో పరివర్తనాత్మక ప్రభావంతో బ్లాక్‌చెయిన్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. సాఫ్ట్ స్కిల్స్, అనుకూలతలు:కొత్త వ్యవస్థలను త్వరగా నేర్చుకోవడం, మారుతున్న పని వాతావరణాలకు అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలను స్వీకరించే సామర్థ్యం చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం: దినచర్యలనూ ఆటోమేట్ చేస్తున్నందున సంక్లిష్ట సమస్యల పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది.భావోద్వేగ మేధస్సు: ఆటోమేటెడ్ ప్రపంచంలో సానుభూతి, భావోద్వేగ మేధస్సు వంటి మానవ నైపుణ్యాలకు డిమాండ్. నాయకత్వం, సామాజిక ప్రభావం: టీమ్‌లకు మార్గనిర్దేశం చేయడానికి, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సమర్థ నాయకత్వం, సామాజిక ప్రభావ నైపుణ్యాలు ముఖ్యం. కస్టమర్ సర్వీస్: వ్యాపార విజయానికి బలమైన కస్టమర్ సంబంధాలను పెంపొందించుకోవడం ముఖ్యం. డిజిటల్ మార్కెటింగ్: వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యాలు చాలా అవసరం వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యాలు చాలా అవసరం ప్రాజెక్ట్ నిర్వహణ: వనరుల నిర్వహణ, సాంకేతిక ప్రాజెక్ట్ నాయకత్వంతో సహా ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది. -
ఏఐ స్టార్టప్‌లకు వీసీ నిధుల బూస్ట్!
దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రవేశించే ప్రాథమికస్థాయి కంపెనీలకు వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు పెట్టుబడులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ అభివృద్ధి వ్యవస్థ (ఎకోసిస్టమ్)లో ఇటీవల పలు కొత్తతరహా స్టార్టప్‌లు ఊపిరి పోసుకుంటున్న నేపథ్యంలో వీసీ నిధులకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్ప్రధానంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ టూల్స్ విభాగాలలోని దేశీ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీసీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్, లైట్‌స్పీడ్, ప్రోజస్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తదితరాలు చేరాయి. దీంతో ఏఐలో మౌలిక, డెవలపర్ విభాగాలపై దృష్టిపెట్టిన కంపెనీలు ఎంటర్‌ప్రైజ్‌లుగా అభివృద్ధి చెందేందుకు వీసీ నిధులు తోడ్పాటునివ్వనున్నాయి. వెరసి ఎజెంటిక్ ప్లాట్‌ఫామ్స్‌కు జోష్ లభించనుంది. తద్వారా స్వతంత్ర ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి వీలు చిక్కనుంది.అంటే వివిధ టాస్‌్కలను స్వతంత్రంగా నిర్వహించగల సామర్థ్యమున్న సాఫ్ట్వేర్ ఆధారిత టూల్స్ ఊపిరిపోసుకోనున్నాయి. ఇవి సంబంధిత ఆర్గనైజేషన్లలో క్లిష్టతరహా పనులను చక్కబెట్టడంతోపాటు.. విభిన్న వ్యవస్థలతో సమీకృతంకాగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వీటికి ప్రత్యేకించిన సర్విసులను పూర్తి చేయడంపై ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టిపెడతాయని తెలియజేశాయి. ఒకే టాస్్కకు పరిమితమయ్యే సంప్రదాయ ఏఐ టూల్స్‌తో పోలిస్తే వీటి పరిధి విస్తారంగా ఉంటుందని వివరించాయి. పలు కార్యకలాపాలను ఆటోమేషన్తో అనుసంధానించవచ్చని తెలియజేశాయి. కొత్త తరహా టూల్స్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ (డెవ్ఆప్స్) ఆటోమేషన్, భారీస్థాయి ఎడాప్షన్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టిన స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా స్టార్టప్‌లలో పెట్టుబడులకు వీసీ సంస్థలు ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆధునిక, సరికొత్త మోడళ్లు ఊపిరిపోసుకున్న ప్రతిసారీ ప్లాట్‌ఫామ్స్ మారిపోతుంటాయని ఎలివేషన్ క్యాపిటల్ ఏఐ పార్ట్నర్ కృష్ణ మెహ్రా తెలియజేశారు.దీంతో పూర్తిస్థాయిలో సరికొత్త అవకాశాలకు తెరలేస్తుంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భాలు(సైకిల్స్) ఆయా స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా ప్రపంచస్థాయిలో పోటీపడగల సంస్థలుగా తీర్చిదిద్దేందుకు వీలు చిక్కుతుందని వివరించారు. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025) జనవరి నుంచి జూలైవరకూ దేశీ జెన్ఏఐ స్టార్టప్‌లు 52.4 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,600 కోట్లు) అందుకున్నట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.పెట్టుబడుల తీరిదీ..సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలివేషన్ క్యాపిటల్ గత రెండేళ్లలో 15–20 ఏఐ పెట్టుబడులను చేపట్టడం గమనార్హం! ఇక ఎంటర్‌ప్రైజెస్‌లు కనెక్ట్ అయ్యేందుకు, తమ సాఫ్ట్వేర్ టూల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు సహకరించే యూనిఫై యాప్స్ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 2–2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 200 కోట్లు) సమీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023లో ఏర్పాటైన ఈ సంస్థలో ఎలివేషన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. అప్లికేషన్ల బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ చేపట్టే ఎమర్జెంట్ ఏఐ.. లైట్‌స్పీడ్ వెంచర్ తదితర సంస్థల నుంచి 2 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది.కేవలం రెండు నెలల్లోనే ఈ సంస్థ కోటి డాలర్ల(రూ.87 కోట్లు) వార్షిక రికరింగ్ టర్నోవర్ సాధించడం విశేషం! ఈ బాటలో లైట్‌స్పీడ్ తదితర సంస్థల నుంచి ఎజెంటిక్ స్టార్టప్.. కంపోజియో 2.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎంటర్ప్రైజ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆటోమేట్ చేసే రీఫోల్డ్ ఏఐ.. ఎనియాక్ వెంచర్స్, టైడల్ వెంచర్స్ తదితరాల నుంచి 6.5 మిలియన్ డాలర్లు(రూ.56 కోట్లు) సీడ్ఫండ్గా అందుకుంది. ప్రోజస్,యాక్సెల్, ఎక్సీడ్ వెంచర్స్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ ప్లాట్‌ఫామ్.. కోడ్కర్మ 2.5 మి. డాలర్లు(రూ.21 కోట్లు) పొందింది. -
ఏఐ కారణంగా... వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి?
ప్రతి నాణేనికీ బొమ్మ బొరుసులు ఉంటాయి; ప్రతి పరిణామానికీ మంచి చెడులు ఉంటాయి; కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) కూడా ఉభయ కోణాలూ ఉంటాయి. ఏఐ దెబ్బకు ఇప్పటికే ఉన్న అనేక ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ సాంకేతికత కొత్త ఉద్యోగాలకు ఊపిరి పోస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఏఐ కారణంగా...వచ్చే ఉద్యోగాలేవి? పోయే ఉద్యోగాలేవి? ఏఐ కాయిన్‌కి అటూ ఇటూ ఒకసారి పరిశీలించి చూద్దాం.ఏఐ దెబ్బకు ఇప్పటికే కొన్ని ఉద్యోగాలు పోయిన మాట నిజమే! సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకూ ఎసరొచ్చే పరిస్థితులు కూడా నిజమే! కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత టైపిస్టుల ఉద్యోగాలు క్రమంగా తెరమరుగైపోయాయి. చిన్నా చితకా పట్టణాల్లోనూ కనిపించే టైప్ ఇన్స్టిట్యూట్లు శాశ్వతంగా మూతబడ్డాయి. కొత్త సాంకేతికత ఏదైనా విరివిగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. నిజానికి లెక్క చూసుకుంటే, కంప్యూటర్ల వల్ల పోయిన ఉద్యోగాల కంటే కొత్తగా వచ్చిన ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్లు వాడుకలోకి వచ్చిన కొత్తలో టైపిస్టుల ఉద్యోగాలు పోయినా, కనీస నైపుణ్యాలు కలిగినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి. కంప్యూటర్ల వాడకం పెరిగాక రకరకాల అవసరాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అదే రీతిలో ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు లేకుండా పోయినా, ఇంకొన్ని కొత్త తరహా ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ కారణంగా పోయే ఉద్యోగాల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అమెరికన్ కంపెనీ ‘ఆంత్రోపిక్’ సీఈవో, ‘క్లాడ్’ ఏఐ మోడల్ రూపకర్త డేరియో అమోడీ ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సగానికి సగం తగ్గిపోతాయని చెబుతుంటే, ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వంటి అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏఐ ప్రభావం వల్ల వచ్చే ఐదేళ్లలో కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఈ సంస్థలు చెబుతున్నాయి.కోట్లలో కొత్త ఉద్యోగాలుఈ ఏడాది పూర్తయ్యేలోగా ఏఐ వల్ల వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 9.7 కోట్ల ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొస్తాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ అంచనా వేస్తోంది. వైద్యరంగంలో రోగనిర్ధారణ చేయడంలో ఏఐ మానవ వైద్యులను మించిన పనితీరును ఇప్పటికే ప్రదర్శిస్తోంది. అకౌంటింగ్, భాషానువాదం వంటి రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుకుంటోంది. ఏఐ ఎన్ని సేవలకు ప్రత్యామ్నాయం కాగలిగినా, అంతిమ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం మానవులదే! మానవ నిర్ణయాత్మక శక్తికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. రానున్న కాలంలో ఏఐ మరింతగా అభివృద్ధి చెంది, పరిశ్రమల తీరుతెన్నులను మార్చేస్తుందని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక తదితర రంగాల్లో ఏఐ ప్రభావం వల్ల 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు5 కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ అంచనా వేస్తోంది. సాంకేతిక నైపుణ్యానికి తోడు మానవ కౌశలం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధాశక్తి అవసరమయ్యే ఉద్యోగాలు పలు రంగాల్లో కొత్తగా పుట్టుకొస్తాయని, వీటికి తగినట్లుగా శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలను సాధించగలిగితే, ఏఐ ఆధారిత ఉద్యోగాలను దక్కించుకోవడం అంత కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వచ్చే ఉద్యోగాలుఏఐ వాడకం పెరగడం వల్ల పలు రంగాల్లో కొన్ని సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలు రానున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లోపనిచేసేవారు నిర్వర్తించే విధుల గురించి సంక్షిప్త సమాచారండేటా సైంటిస్ట్డేటా సైంటిస్టులు సంస్థకు అవసరమైన డేటాను విశ్లేషించి, అందులోని సమాచారాన్ని సంస్థ నిర్ణయాలకు ఉపయోగపడేలా క్రోడీకరించి అందిస్తారు.మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్: మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌కు రూపకల్పన చేయడం, వాటిని వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. వీరు డేటా సైంటిస్టులకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు మధ్య వారధిలా పనిచేస్తారు.రోబోటిక్స్ ఇంజినీర్: రోబోల రూపకల్పన, నిర్మాణం, ఆటోమేటెడ్ సిస్టమ్స్‌తో రోబోలను అనుసంధానం చేయడం రోబోటిక్స్ ఇంజినీర్ల ప్రధానమైన పనులు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్ ఇంజినీరింగ్ విభాగాల సమ్మిళిత పరిజ్ఞానంతో వీరు పనిచేస్తారు.ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్: ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు కొత్త ఆల్గోరిథమ్స్‌ను, ఏఐ సాంకేతికతను మరింతగా అభివృద్ధి చేసేందుకు కావలసిన మెలకువలను రూపొందించడం; డిజైనింగ్ ప్రయోగాలు చేయడం; నమూనాలను రూపొందించడం; వాటికి అవసరమైన పరిశోధనలు సాగించడం వంటి పనులు చేస్తారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ఇంజినీర్: ఎన్ఎల్పీ ఇంజినీర్లు– మనుషుల భాషను అర్థం చేసుకుని, విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందిస్తారు. మనుషుల భాషలోని ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేలా కంప్యూటర్లను తీర్చిదిద్దుతారు.కంప్యూటర్ విజన్ ఇంజినీర్: ఫొటోలు, ఇతర చిత్రాలు, వీడియోలను చూసి, వాటిని అర్థం చేసుకుని విశ్లేషించేలా కంప్యూటర్లను రూపొందించడంలో కంప్యూటర్ విజన్ ఇంజినీర్లు కీలకంగా పనిచేస్తారు.ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్: ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించుకునే సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందిస్తారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు.ఏఐ ఆర్కిటెక్ట్: సంస్థకు అవసరమైన ఏఐ సిస్టమ్స్‌ను రూపొందించడంలోను, వాటిని వినియోగంలోకి తేవడంలోను ఏఐ ఆర్కిటెక్ట్‌లు కీలకంగా పని చేస్తారు. ఏఐ సాంకేతిక ఉపయోగానికి అవసరమైన అవకాశాలను గుర్తించడంలోను, ఏఐ సాంకేతికతకు తగిన సాధనా సంపత్తిని సమకూర్చడంలోను వీరిదే ప్రధాన పాత్ర.ఏఐ ట్రైనర్: ఏఐ సిస్టమ్స్‌కు శిక్షణ ఇవ్వడం ఏఐ ట్రైనర్ల పని. డేటాను, ఫీడ్‌బ్యాక్‌ను అర్థం చేసుకుని, పనితీరును మెరుగుపరచుకునేలా ఏఐ సిస్టమ్స్‌ను వీరు అభివృద్ధి చేస్తారు.ప్రాంప్ట్ ఇంజినీర్: జెనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి ఆశించిన ఔట్‌పుట్‌ను రాబట్టేందుకు అవసరమయ్యే ఆదేశాలను, సూచనలను రూపొందించడంలో ప్రాంప్ట్ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఏఐ అప్లికేషన్ల పనితీరును గరిష్ఠస్థాయిలో మెరుగుపరచే దిశగా వీరు వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు.ఏఐ ఎథిసిస్ట్: ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఏఐ ఎథిసిస్టుల అవసరం కూడా పెరుగుతుంది. ఏఐ వల్ల జరిగే అనుకోని పొరపాట్లను, వాటి కారణంగా ఎదురయ్యే నైతిక సమస్యలను నివారించేందుకు తగిన రీతిలో ఏఐ సిస్టమ్స్‌ను తీర్చిదిద్దడం, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఏఐ ఎథిసిస్టుల ప్రధానమైన పనులు.ఎక్స్ప్లెయినర్స్ఏఐ డెవలపర్స్‌కు, ఏఐ సేవలను వినియోగించుకునే వ్యాపార సంస్థల యాజమాన్యాలకు మధ్య ఎక్స్‌ప్లెయినర్స్ వారధిలా పనిచేస్తారు. ఏఐ విధానాలు పారదర్శకంగా ఉండేలా చూడటం, వాటి పనితీరును, ప్రయోజనాలను వ్యాపార సంస్థల యాజమాన్యాలకు వివరించడంలో ఏఐ డెవలపర్స్ కీలక పాత్ర పోషిస్తారు. మార్పులకు లోనయ్యే ఉద్యోగాలుఏఐ ప్రభావం వల్ల ఇప్పటికే ఉన్న పలు ఉద్యోగాల్లో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్ది ఈ ఉద్యోగాల్లో మరిన్ని మార్పులు కూడా జరగనున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పని ఏఐ వల్ల మరింత సులభతరం అవుతుంది. కోడింగ్ వంటి కొన్ని పనులను ఏఐ చేసేయగలుగుతుంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పనిభారం తగ్గుతుంది. అంతమాత్రాన వారి అవసరం పూర్తిగా లేకుండాపోదు. సంక్లిష్టమైన పనులు సజావుగా జరిగేలా చూడటంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్ర కొనసాగుతుంది. డేటా అనలిస్టుల పని కూడా ఏఐ వల్ల సులభతరం అవుతుంది. డేటా సేకరణ, విశ్లేషణ వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మార్కెట్ ధోరణులను గుర్తించడం, డేటా ఫలితాలను విశ్లేషించడం, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిస్టులు మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలు చిక్కుతుంది. ఏఐ వల్ల సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ ఉద్యోగుల పని కూడా చాలా వరకు తేలికవుతుంది. టార్గెటెడ్ యాడ్స్ గుప్పించడం వంటి పనులను ఏఐ స్వయంగా చేసేస్తుంది. మనుషులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఉద్యోగులు స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది.కనుమరుగయ్యే ఉద్యోగాలుఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలైతే దాదాపుగా కనుమరుగైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. టైపింగ్, కాపీయింగ్, పేస్టింగ్ వంటి పనులను ఏఐ స్వయంగా చేయగలుగుతోంది. దీనివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐతో పనిచేసే అధునాతన డ్రైవర్‌లెస్ వాహనాలు ఇప్పటికే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి పెద్దసంఖ్యలో వాడుకలోకి వస్తే, ఇక డ్రైవర్ ఉద్యోగాలు కూడా కనుమరుగైపోతాయి. కర్మాగారాల్లో బరువులు ఎత్తడం, బరువైన వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటికి చేర్చడం వంటి పనులను సునాయాసంగా చేయగలిగే ఏఐ రోబోలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి.ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేటట్లయితే, కర్మాగారాల్లో పనిచేసే నైపుణ్యాలు లేని కార్మికుల ఉద్యోగాలు అంతరించిపోతాయి. ఈ–కామర్స్ రంగంలో ఏఐ వాడకం మెల్లగా పెరుగుతోంది. ఇది మరింతగా పెరిగితే, రిటైల్ సేల్స్ ఉద్యోగులు ఇతర ఉపాధి మార్గాలను వెదుక్కోక తప్పదు. అకౌంటింగ్ రంగంలో బుక్ కీపింగ్ సహా ప్రాథమిక అకౌంటింగ్ పనులన్నీ ఏఐ సాయంతో ఆటోమేషన్ ద్వారా జరిగిపోతున్నాయి. దీనివల్ల కిందిస్థాయి అకౌంటింగ్ ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఏఐ ద్వారా అందుబాటులోకి వచ్చిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సిస్టమ్స్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో త్వరలోనే పత్రికా సంస్థలు, ప్రచురణ సంస్థల్లో ప్రూఫ్ రీడర్స్, ట్రాన్స్‌లేటర్స్ ఉద్యోగాలు ఇకపై ఉండకపోవచ్చు. ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలావరకు అంతరించిపోతాయని, ఉద్యోగాల్లో మనుషుల అవసరం గణనీయంగా తగ్గిపోతుందనే వాదనలు జనాల్లో గందరగోళం రేపుతున్నాయి. ఏఐ ప్రభావం వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నా, అంతకు మించి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోగలిగే వారికి సమీప భవిష్యత్తులోనే పుష్కలంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచస్థాయి ప్రీఎమినెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. ఏఐ కారణంగా 25 శాతం వరకు నైపుణ్యాలు లేని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు ఏఐ కారణంగా 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం ఉద్యోగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని అమెరికన్ బహుళజాతి ఆర్థిక సంస్థ ‘జేపీ మోర్గాన్ చేజ్’ అంచనా వేస్తోంది. ఏఐ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు, పోయే ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నా, ఏఐ ప్రభావం వల్ల ప్రపంచం మరింత ముందుకు పురోగమించడం మాత్రం ఖాయం. -
రిస్క్ లను ఎదుర్కొనే చర్యలు అవసరం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) నుంచి వచ్చే రిస్క్‌లను అధిగమించే విధానాన్ని బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు రూపొందించుకోవాలంటూ ఆర్బీఐ ప్యానెల్ ఒకటి సిఫారసు చేసింది. తగిన రక్షణలు లేకపోతే రిస్క్ లు మరింత పెరిగిపోవచ్చని పేర్కొంది. ఆర్థిక రంగంలో ఏఐని బాధ్యాయుత, నైతిక మార్గంలో వినియోగించేందుకు తగిన కార్యాచరణను సూచించాలంటూ గత డిసెంబర్లో ఆర్బీఐ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ ప్యానెల్ తన నివేదికను ఆర్బీఐకి సమరి్పంచింది. రిస్క్ లకు తగిన రక్షణలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏఐతో ఆర్థిక సేవల రంగం తన సామర్థ్యాలను పెంచుకోవచ్చని ప్యానెల్ సూచించింది. అభివృద్ధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఏఐ కొత్త మార్గాలను చూపిస్తుందని పేర్కొంది. బహుళ నమూనా, బహుభాషా ఏఐతో ఆర్థిక సేవలకు దూరంగా ఉన్న వారికి సైతం చేరువ కావొచ్చని సూచించింది. ఆర్బీఐ నియంత్రణల్లోని సంస్థలు బోర్డు ఆమోదిత ఏఐ విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొంది. సైబర్ భద్రత విధానాలను మెరుగుపరుచుకోవడం, ఘటనలకు సంబంధించి వెంటనే నివేదించడం తదితర సూచనలను కూడా ప్యానెల్ చేసింది. -
నిర్ణయాల ప్రక్రియలో కీలకంగా ఏఐ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్ సంస్థ సీఐవోఅండ్లీడర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్ మార్కెటింగ్ నుంచి సాఫ్ట్వేర్ కోడింగ్ వరకు జనరేటివ్ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయనున్నాయి. వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్ ఐటీ (లేదా) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. → 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్‌పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి. → ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి. → చాట్బాట్లు, పర్సనలైజేషన్ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్ (31 శాతం), కస్టమర్ సర్వీస్ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. → 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. → 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. -
డిజిటల్ పునర్జన్మ!
మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడొచ్చు. ఇదెలా సాధ్యం? భవిష్యత్‌లో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుచూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని బట్టి చూస్తే.. మనం సాంకేతిక అమరత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు మనం కొంత దూరంలో ఉన్నప్పటికీ ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది మరణించిన వ్యక్తులను వారి స్వరం, ప్రవర్తన, నిర్ణయం తీసుకునే విధానం తదితర అంశాల ద్వారా ‘సజీవంగా’నిలిపే అవకాశాలను మెరుగుపరుస్తోంది. మీరు షేర్ చేసే ప్రతి ఫొటో, మీరు పంపే పోస్ట్, వాయిస్ నోట్ వంటివి డిజిటల్ డీఎన్ఏగా మారుతున్నాయి. ఇలాంటి సాంకేతిక వనరులకు జీవం పోసి కొన్నిరూపాల్లో చావును అధిగమించే దిశలో కృతిమ మేధ (ఏఐ) ద్వారా కృషి జరుగుతోంది. ఇది అర్థంకాని సైన్స్ ఫిక్షన్‌లాగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఇలాంటివి ‘గ్రీఫ్టెక్’ద్వారా వాస్తవరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ గ్రీఫ్టెక్ వినియోగం ఇప్పుడిప్పుడే మొదలైందని అంటున్నారు. ఏమిటీ ‘గ్రీఫ్ టెక్’? 2020లో దక్షిణ కొరియా టీవీషో ఒక అవాస్తవ పునఃకలయికను ప్రసారం చేసింది. శోకతప్తమై దుఃఖిస్తున్న ఓ తల్లి వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా మరణించిన తన కుమార్తెతో సంభాషించింది. డిజిటల్ సాంకేతిక సహకారంతో ఆ బిడ్డ కదిలింది, మాట్లాడింది, తల్లి ప్రశ్నలకు ప్రతిస్పందించింది. ఇది వాయిస్ నమూనాలు, వీడియో ఫుటేజ్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా సాధ్యమైంది. దీనినే ‘గ్రీఫ్ టెక్’అని పిలుస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎలా టెక్ట్స్ చేశాడు, ఎలా జోక్ చేశాడు లేదా ఎలా స్పందించాడు తదితర అంశాల ఆధారంగా అనుకరణ బ్యాట్లను సృష్టిస్తున్నారు. ఈ అనుభూతులు ఎలా సాధ్యం? చనిపోయిన వారిని ఏఐ ద్వారా డిజిటల్ రూపంలో పునర్జీవింపచేస్తారు లేదా ఆ అనుభూతిని కలిగిస్తారు. –ప్రధానంగా సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన ఏఐ నమూనాల నుంచి ఇది సాధ్యమవుతుంది. –చనిపోయిన వారి టెక్సŠట్ మెసేజ్‌లు, ఈ–మెయిల్లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, వాయిస్ నోట్లు, వీడియో రికార్డింగ్‌లు వంటివి ఉపకరిస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే విధానాలు సహాయపడుతున్నాయి. –వారి బయోమెట్రిక్ డేటా (ముఖ కవళికలు, స్వరం) వంటివి దోహదపడుతున్నాయి. –వీటి ఆధారంగా నాడీ నెట్‌వర్క్‌లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏఐ ఆయా వ్యక్తులను అనుకరించగలదు. –ఫలానా వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నట్టుగా సంభాషించగలదు. –రెప్లికా, ప్రొజెక్ట్ డిసెంబర్, హియర్ ఆఫ్టర్ ఏఐ వంటి సాధనాలు ఇప్పటికే ఇలాంటి వాటిని అందిస్తున్నాయి. –మరణించిన వారి స్వరం మాదిరిగానే సంబం«దీకులతో సంభాషించేలా చేయొచ్చు. చనిపోయిన తాత లేదా బామ్మ స్వరాలను ఉపయోగించి మనవళ్లు, మనవరాళ్లకు నిద్రవేళ కథలను చెప్పే సౌలభ్యం కూడా కలుగుతుందని అంటున్నారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో... ఒక వ్యక్తి భౌతికంగా మరణించాక కూడా బతికి ఉన్నట్టుగా భ్రమలో మునగడం డిజిటల్ మరణానంతర జీవితం అనే జవాబులేని ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ⇒ ఇది మరణించిన వారి గురించి పడే బాధను తగ్గిస్తుందా? లేదా వారి జ్ఞాపకాలు వెంటాడేలా చేస్తుందా? ఈ డిజిటల్ సాంకేతిక భ్రాంతి/ అయోమయాల మధ్య చనిపోయిన వారు ఎంతకాలం ‘జీవించగలరు’? ఈ ఏఐ అమరత్వాన్ని ఎవరు నియంత్రిస్తారు? సంబంధిత వ్యక్తి కుటుంబమా, టెక్ కంపెనీలా లేక ఆయా దేశాలు/రాష్ట్రాల ప్రభుత్వాలా? ⇒ డిజిటల్ క్లోన్ ఓ వ్యక్తిగా ఉండటం విరమించి పూర్తిగా వేరే వ్యక్తిగా వ్యవహరిస్తే లేదా హ్యాకింగ్‌కు గురైతే ఏమి జరుగుతుంది? ⇒ ఆయా మాధ్యమాల ద్వారా మనం జ్ఞాపకశక్తిని కాపాడుకుంటున్నామా? లేదా భ్రమల్లో విహరించేలా తయారవుతున్నామా? ఇది వరంగా పరిణమిస్తుందా లేక శాపంగా మారుతుందా? ⇒ ఈ ప్రశ్నలకు జవాబులు డిజిటల్ సాంకేతికతను ఏ రూపంలో, ఏ అవసరానికి ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఏఐ నుంచి మానవాళిని కాపాడాలంటే?: హింటన్ సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రతి రంగంలోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని.. ''గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ''గా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ - కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఆందోళన వ్యక్తం చేశారు.లాస్ వెగాస్‌లో జరిగిన Ai4 సమావేశంలో హింటన్ మాట్లాడుతూ.. ఏఐ మానవాళికి ప్రమాదంగా మారుతుందని, దీనిపై నియంత్రణ కలిగి ఉండాలని హెచ్చరించారు. పెద్దవాళ్ళు.. పిల్లలకు మిఠాయి ఇచ్చి ఏమార్చిన విధంగా భవిష్యత్తులో ఏఐ మనుషులను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.మోసం చేయడం, దొంగిలించడం వంటివి కూడా ఏఐ సులభంగా చేసేస్తోంది. ఇటీవల ఒక ఏఐ ఇంజినీర్ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పేస్తా అని భయపెట్టిన ఉదంతాన్ని హింటన్ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఏఐ భావోద్వేగ స్పందనలను కలిగి ఉండాలి. అప్పుడే సమాజహితంగా ఉంటుందని అన్నారు. ఏఐలో కరుణ భావాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైనదని హింటన్ వెల్లడించారు. తల్లి - బిడ్డ సంబంధం మాదిరిగా ఏఐను రూపొందించాలని ఆయన వివరించారు.ఇదీ చదవండి: మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?ఏఐ ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇది కొత్త భాషను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము. అయితే ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నప్పటికీ.. వైద్య రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని జియోఫ్రీ హింటన్ అన్నారు. -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. 18 ఏళ్లకే రూ.100 కోట్ల సామ్రాజ్యం
-
ఏఐ దెబ్బకి ఈ ఉద్యోగాలు పోతాయ్!
-
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా. వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతివర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి. మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు -
‘కోర్’ వదిలి.. కల చెదిరి..
సాక్షి, హైదరాబాద్: అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆకర్షణీయమైన జీతం, జీవితం దక్కుతుందన్న ఆశతో కోర్ గ్రూపులు వదిలేసి, కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు పరుగులు పెట్టినవారు.. ఇప్పుడు చిన్నపాటి ప్యాకేజీలకు కూడా ఉద్యోగాలు లభించక, ఇప్పటికే ఫీల్డులో ఉన్నవారు అత్యాధునిక ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దెబ్బకు నిలబడలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు (లే ఆఫ్స్)లు పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యాలు లేవని చెబుతూ సీనియర్లను కూడా తొలగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారత సర్విస్ సెక్టార్ వణికిపోతోంది. కరోనా తర్వాత ఏఐ వేగం పెరిగి అతిపెద్ద డేటా కేంద్రాలు వస్తున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ వీటికే కనెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా మానవ వనరుల అవసరం తగ్గింది. టెక్నాలజీతో సమానంగా ఉద్యోగులు పరుగులు పెట్టలేకపోతున్నారు. అందుకు కార ణం ఇంజనీరింగ్‌లో కోర్ గ్రూపులను నిర్లక్ష్యం చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. 2024 చివరి నుంచి మారిన పరిస్థితిప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. టీసీఎస్ 12 వేల మందికి లే ఆఫ్ అనేసింది. ఇన్ఫోసిస్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలదీ ఇదే బాట. 2010 నుంచి 2025 వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు భారీగా పెంచాయి. ఇన్ఫోసిస్ 153%, టీసీఎస్ 278%, విప్రో 116 శాతం, కాగి్నజెంట్ 223%, యాక్సెంచర్ 291% ఉద్యోగ నియామకాలు పెంచుకున్నాయి.కరోనా (2020–21) కాలంలోనూ ఉద్యోగ నియామకాలు ఎక్కువే. ఇదే సమయంలో యాంత్రీకరణ వైపు కంపెనీలు మళ్లాయి. దీంతో 2024 వరకు ఉద్యోగుల అవసరం ఉండేది. 2024 చివరి నుంచి ఏఐ వేగం పెరగడంతో ఉద్యోగుల అవసరం తగ్గుతూ వచ్చింది. దీంతో ఒక్కో కంపెనీ 20 నుంచి 40 శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు ప్రధాన కంపెనీల్లో కనీసం 15 శాతం ఉద్యోగులను తొలగించారు. వేతనాలు అంతంతే.. పదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం హాట్‌కేక్. భారీ ప్యాకేజీలు.. కంపెనీ మారితే రూ.లక్షల్లో పెరుగుదల. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు అరకొరగా ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్‌లో అనేక దశల్లో పరీక్షలు పెడుతున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చినా అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వేతనాల్లోనూ నిరాశే. 2010లో ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్‌కు రూ.3.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఈ 15 ఏళ్లలో 49 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ లెక్క ప్రకారం ఈ సంవత్సరం రూ.6.40 లక్షల వేతనం ఇవ్వాలి.కానీ రూ.3.60 లక్షలు మాత్రమే ఇస్తోంది. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇప్పుడిచ్చే వేతనం రూ.3.15 లక్షలు మాత్రమే. టీసీఎస్‌లో 2007లో రూ.3.15 లక్షల వార్షిక వేతనం ఉంది. అప్పటి నుంచి 60 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. దీని ప్రకారం ఇవ్వాల్సింది రూ.4.73 లక్షలు. కానీ, ఆఫర్ చేస్తున్నది రూ.3.36 లక్షలే. దీన్నిబట్టి ఫ్రెషర్స్ వార్షిక ప్యాకేజీ దారుణంగా తగ్గిపోయిందని అర్థమవుతోంది. ఇది అనారోగ్య పరిస్థితి కంప్యూటర్ కోర్సుల వైపు పరుగులు పెట్టడం ఆనారోగ్యకరమైన పరిస్థితి. కోర్ గ్రూపులకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలు భారీ పెరిగే వీలుంది. దీన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. కోర్ గ్రూపుల విలువ తెలియజెప్పేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా మండలి ముందండుగు వేస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కంప్యూటర్ కోర్సులే భవిష్యత్ కాదని గుర్తించాలి. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్కిల్ లేకుంటే కష్టమే యాంత్రీకరణ, ఏఐ వచి్చన తర్వాత సాధారణ కోడింగ్‌తో పని ఉండదు. ఏఐతో సమానంగా ఉద్యోగి అప్డేట్ అవ్వాలి. అలా ఎదగలేనివారిని కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు చేశామని ధీమాగా ఉండే పరిస్థితి పోయింది. కోర్ గ్రూపు చేసిన వాళ్లు కూడా అప్‌గ్రేడ్ అయితే ఐటీలో రాణించే అవకాశాలు ఉన్నాయి. – భటా్నకర్ త్రిపాఠి, ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్కంప్యూటర్ కోర్సులపై మోజే కారణం..ఐటీ ఉద్యోగంపై మోజు దశాబ్ద కాలంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తెచ్చింది. విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు తప్ప వేటికీ భవిష్యత్ లేదని భావిస్తున్నారు. దీంతో ఈ కోర్సులు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగిం ది. 2010–11లో దేశవ్యాప్తంగా కంప్యూ టర్ కోర్సులు చదివినవారు 4,75,870 మంది ఉంటే, 2023–24 నాటికి ఈ సంఖ్య 21,62,266కు చేరింది. 14 ఏళ్లలోనే 354 శాతం పెరిగింది. సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపులకు డిమాండ్ తగ్గుతోంది. ఆయా సెక్టార్లలో ఉపాధి అవకాశాలున్నా విద్యార్థులు వెళ్లడం లేదు. మరోవైపు ఐటీ సెక్టార్లో యాంత్రీకరణ, ఏఐ పాత్ర పెరగటంతో ఉద్యోగి కోసం కంపెనీలు వెతుక్కునే పరిస్థితి లేదు. కోర్ గ్రూప్‌లను నిర్లక్ష్యం చేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. -
AI తో హోమ్‌వర్క్ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!!
సాక్షి, స్పెషల్ డెస్క్: హోమ్‌వర్క్‌లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ గురించే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ స్టడీ మోడ్‌ను, గూగుల్ జెమినై గైడెడ్ లెర్నింగ్ టూల్‌ను ప్రారంభించి చాట్‌బాట్‌ను వ్యక్తిగత ట్యూటర్‌గా మార్చేశాయి. ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వంటి భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్స్ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్‌లోని ఎడ్టెక్ సంస్థలు, సంప్రదాయ కోచింగ్ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.గైడెడ్ లెర్నింగ్ ఇలా..అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్ లెర్నింగ్ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్‌లను ఉపయోగించి స్పందిస్తుంది. సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్ లెర్నింగ్‌ను రూపొందించినట్టు గూగుల్ తెలిపింది.» ‘హోమ్‌వర్క్ హెల్ప్’ ద్వారా విద్యార్థుల హోమ్‌వర్క్‌లను.. స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడమే.» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్లోడ్ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్‌గా, ఒక ప్రాక్టీస్ టెస్ట్‌గా,పాడ్‌కాస్ట్‌గా కూడా చేసి మన ముందు పెడుతుంది.» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్ వివరించింది.» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్క్లాస్రూమ్లో పోస్ట్ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.ఇంటర్నెట్ వచ్చాక సంప్రదాయ గైడ్స్‌కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్టెక్ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్ గైడెడ్ లెర్నింగ్, ఓపెన్ ఏఐ స్టడీ మోడ్ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.‘విద్యార్థులకు లాభదాయకమే’నిజానికి ఏఐ చాట్బాట్లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్ లెర్నింగ్ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్బాట్లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.ఇదీ ‘స్టడీ మోడ్’దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్‌వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్‌లో చాట్ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్‌కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత. ఏదైనా టాపిక్ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్‌పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్‌బాట్ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది. » ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్‌లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది. » వాయిస్, ఇమేజ్, టెక్స్›్టను సపోర్ట్ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్ అందుబాటులో ఉంది.కొన్ని సందేహాలుతమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్ ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.» విద్యార్థులు చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. » ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు. -
ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఊహకందని సమస్యలను తీసుకొస్తుందని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ 'మో గౌడత్' (Mo Gawdat) కూడా అదే తరహాలో పేర్కొన్నారు.కృత్రిమ మేధ కారణంగా 2027 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని, సమాజానికి పెద్ద సమస్యగా తయారవుతుందని మో గౌడత్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, సీఈఓలు, పాడ్కాస్టర్లతో సహా ఎవరూ ఏఐ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతే కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఉద్యోగులకు నరకం అని సంబోధించారు.గూగుల్ సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన గౌడత్.. ప్రస్తుతం ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ నడుపుతున్నారు. ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఆ స్టార్టప్‌లో 350 మంది డెవలపర్లు ఉండేవారు. కానీ ఏఐ కారణంగా ప్రస్తుతం దీన్ని ముగ్గురే నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏఐ ఎంతగా విస్తృతిస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఏఐ ఆవిర్భావం 'సామాజిక అశాంతిని' రేకెత్తిస్తుందని. ప్రజలు ఇప్పటికే తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం, ఒంటరితనం పెరగడం, సామాజిక విభజనలు తీవ్రమవుతాయని గౌడత్ అన్నారు. ఏఐని సరిగ్గా నియంత్రించకపోతే భారీ అసమానతలను సృష్టిస్తుంది. ధనవంతులు మాత్రమే మనగలుగుతారు. మిగతా వారందరూ కష్టపడతారని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్‌లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ఏఐ సొంత భాషప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ.. ఏఐ సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు. యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేమని అన్నారు. -
ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం సాధ్యమేనా?
తిరుపతి మంగళం: సినిమాలలో ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో గ్రాఫిక్స్ చేసినట్లుగా తిరుమలలో ఎంతమంది భక్తులు వచ్చినా రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పే మాటలు సాధ్యమేనా? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. సోమవారం సోమవారం తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఇదే అంశంపై అనుమానాలు వ్యక్తం చేశారు.ఇది సాధ్యం కాదన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. వెంటనే బీఆర్ నాయుడు స్పందిస్తూ గూగుల్, టీసీఎస్ సహకారంతో ఏఐ ద్వారా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. ముందుచూపుతో ఆలోచన చేస్తున్నామన్న ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప ఏఐతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం అనేది అసాధ్యం.గూగుల్, టీసీఎస్ సహకారంతో తిరుమలలో ఏఐ టెక్నాలజీని తేవాలనుకుంటున్న చైర్మన్.. ఆ కంపెనీల వారికి టీటీడీ గెస్ట్‌హౌస్‌లు, తిరిగేందుకు కార్లను ఏర్పాటు చేయడం ఏమిటి? క్యూలైన్లలో కనీస వసతులు లేక భక్తులు పడుతున్న అవస్థలు కనిపించడం లేదా? ఏఐతో శ్రీవారి దర్శనం కల్పించడాన్ని భక్తులు హర్షించరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు. భక్తుల రద్దీ పెరిగిందని, మూడో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు అవసరమని ఇటీవల పాలకమండలి సమావేశంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులైన పీఠాధిపతుల మనోభావాలు దెబ్బతినేలా బీఆర్ నాయుడు ఆలోచనలు, చర్యలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బాధ్యతలు చేపట్టాక.. 9 నెలల నుంచి టీటీడీలో అన్నీ అపచారాలే చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి ఆపాదిస్తారా? టీటీడీలో చోటు చేసుకుంటున్న అపచారాలను, విషయాలను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే వాటిని వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ మీ మీడియాల్లో ప్రచారం చేసుకుంటే ఉపయోగం లేదని భూమన పేర్కొన్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోవాలని సూచించారు. ఉన్న పరిమితుల్లో అవగాహన చేసుకుని భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ఆలోచనలు చేయాలని కోరారు. -
ప్రచార ఆర్భాటం.. పనులేమో శూన్యం!.. టీటీడీ చైర్మన్‌పై భూమన ఫైర్
సాక్షి,తిరుపతి: తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతిలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్‌లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్‌కు పాలకమండిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఉచితంగా మాకు ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారంటూ గూగూల్, టీసీఎస్‌కు చెందిన ప్రతినిధులకు కొండపైన గెస్ట్‌హౌస్‌లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని వారి కోసం కేటాయించడం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.ఆ సంస్థల ఉద్యోగులకు టీటీడీ ఖర్చుతో వాహనాలను ఎలా అందిస్తున్నారో చెప్పాలన్నారు. తొమ్మిది నెలలుగా ఏఐ టెక్నాలజీని తీసుకువస్తున్నామంటూ ఆయన పదవీ కాలం ముగిసే వారకు ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని నిలదీశారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే టీటీడీలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన టీటీడీ చైర్మన్ తన ప్రచారం కోసం, పరస్పర విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారన్నారు.ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తుల దర్శన ఏర్పాట్లు ఉండాలే కానీ, ఏఐ పేరుతో కొత్త విధానాలను ఆలయంలో ప్రవేశపెట్టడంపై హైందవధర్మ పరిరక్షకుల సలహాలను ఎక్కడా తీసుకోలేదని మండిపడ్డారు. -
ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు. -
చదువు నేర్పించే చిట్టి మిత్రుడు.. క్యూట్ టైమ్ మేనేజర్
పిల్లలకు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫీచర్లే సరిపోతాయి. ఆటల్లో ఆటోమెషిన్, కథల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువులో టెక్నాలజీ అసిస్టెంట్స్.. ఇలా ఇవన్నీ చిన్నారుల చిట్టి మిత్రులుగా మారిపోయాయి.ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్!పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ, చదువు నేర్పించే చిట్టి మిత్రుడు ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. అదే ‘మికో మినీ’. చూడటానికి చిన్న ఆటబొమ్మలా కనిపించే ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక తెలివైన రోబో. పిల్లల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. చదువు, డాన్స్, పాటలు, గేమ్స్ ఇలా అన్ని రంగాల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తుంది. చదువు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేలా రోజువారీ ప్రణాళికలు తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తల్లిదండ్రుల నంబర్లకు, ఇతర ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ధర కేవలం రూ. 13,999 మాత్రమే!క్యూట్ టైమ్ మేనేజర్!పిల్లల షెడ్యూల్ చూస్తే బిలియనీర్ బిజినెస్మెన్ కంటే తక్కువేమీ ఉండదు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హోంవర్క్, ఆ తర్వాత ఆటలు, ఇలా చాలానే ఉంటాయి. అందుకే, వాళ్ల బిజీ షెడ్యూల్‌కి బ్రిలియంట్ అసిస్టెంట్‌గా వచ్చింది ఈ స్మార్ట్ గాడ్జెట్. పేరు ‘చాంపియన్ కిడ్స్ అండ్ టీన్స్ స్మార్ట్‌వాచ్’. ఇది పిల్లలకి ఓ చిట్టి మేనేజర్లా పనిచేస్తుంది. హార్ట్‌బీట్ చెక్, నిద్ర ట్రాక్ చేయడంతో పాటు ‘నీళ్లు తాగు’ అని వేళకు గుర్తు చేస్తుంది. ఇలా మరెన్నో ఇందులో సెట్ చేసుకోవచ్చు. స్కూల్ మోడ్ ఆన్ చేస్తే, చదువుకు ఆటంకం రాకుండా మేనేజ్ చేస్తుంది. పనితో పాటు సరదా కోసం గేమ్స్, మ్యూజిక్, కెమెరా, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో సిమ్ వేసుకుని, ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అచ్చం ఓ మినీ ఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. రోజుకో వాచ్ డిస్ప్లే మార్చుకోవచ్చు. వర్షం వచ్చినా, చెమట పట్టినా నో టెన్షన్. ఎందుకంటే, ఇది వాటర్‌ప్రూఫ్. ధర రూ.2,499 మాత్రమే!కథల లోకానికి గెలాక్సీ గేట్!చిట్టి చెవుల్లోకి మెల్లగా కథలు జాలువారాలంటే, మామూలు హెడ్ఫోన్లు పనికిరావు. అందుకే వచ్చిందీ కొత్త ‘గెలాక్సీ హెడ్‌ఫోన్’. పిల్లల చెవులకు హాని చేయకుండా, హాయి గొలిపేలా కథలు వినిపిస్తుంది. ఇందులో ఏకంగా ఐదు వందలకు పైగా కథలు, పాటలు ముందే స్టోర్ చేసి ఉంటాయి. అవసరమైతే మరిన్ని కథలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్ ఏదీ అవసరం లేకుండానే నేరుగా దీనిని పెట్టుకుని కథలు వినవచ్చు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అనుగుణంగా వాల్యూమ్‌ను నియంత్రించేలా రూపొందించారు. ఒక్కసారి ఇది పెట్టుకున్న వెంటనే పిల్లలు కథల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అన్ బ్రేకబుల్ బాడీతో, డిటాచబుల్ మైక్‌తో, మెరిసే ఎల్ఈడీ లైట్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర కేవలం రూ. 2,999 మాత్రమే! -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్‌లో లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్‌లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌పై.. భారత్‌లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్‌కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
'భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయింది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలంగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా?, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ నిజంగా చనిపోయిందా అని తెలుసుకోవడానికి.. అమెరికా సృష్టించిన ఐదు ప్రధానమైన ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాధానం ఇచ్చాయో ఈ కథనంలో చూసేద్దాం.ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?చాట్‌జీపీటీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.గ్రోక్: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని గ్రోక్ పేర్కొంది.జెమిని: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని గూగుల్ జెమిని స్పష్టం చేసింది.మెటా ఏఐ: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెప్పింది.కోపైలెట్: భారతదేశ ఆర్ధిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కాదు, ఇది పూర్తిగా వ్యతిరేకం అని కోపైలెట్ వెల్లడించింది.ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలుభారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు.ఇండియానే ఆధారం''ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి'' అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్‌ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్‌బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్‌బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
ఈ ఐటీకి ఏమైంది..?
2000 సంవత్సరంలో వై2కే, 2017లో క్లౌడ్.. ఇప్పుడు ఏఐ.. ఇలా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగులకు సరికొత్త సాంకేతికతలు పెను సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ కల్పవృక్షంగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక్కసారిగా ‘కోత’ల గుబులు మొదలైంది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పరిశ్రమకు షాక్ తగిలింది. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బ, మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల ఆదాయాలకు చిల్లు పడుతోంది. దీంతో వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పులిమీదపుట్రలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కూడా ఉద్యోగులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. టీసీఎస్ చర్యలు ఆరంభమేనని.. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చనేది విశ్లేషకుల మాట.దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగాల తొలగింపు వార్త అటు ఐటీ రంగాన్నే కాదు.. స్టాక్ మార్కెట్లను సైతం కుదిపేసింది. పరిశ్రమ లీడర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా కంపెనీలు ఎలాంటి చర్యలకు దిగుతాయోనన్న భయమే దీనికి కారణం. వాస్తవానికి ఐటీలో కొత్త ఉద్యోగాలు గత రెండు మూడేళ్లుగా పెద్దగా పెరగడం లేదు. టీసీఎస్‌నే తీసుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.14 లక్షల గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే, 2019–20లో 4.48 లక్షలుగా ఉన్న కంపెనీ సిబ్బంది సంఖ్య తదుపరి మూడేళ్లలో ఏకంగా 1.7 లక్షలు పెరగడం విశేషం. ఆపై క్రమంగా దిగజారుతూనే ఉంది. 2023–24లో 6.01 లక్షలకు పడిపోయింది. 13,249 మంది సిబ్బంది తగ్గిపోయారు. గతేడాది కాస్త పుంజుకుని 6.07 లక్షలకు చేరుకుంది. తాజాగా 2025–26 తొలి త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 5,090 మంది సిబ్బంది జతయ్యారు. అయినప్పటికీ మొత్తం సిబ్బంది సంఖ్య మూడేళ్ల క్రితం నాటి గరిష్ట స్థాయి కిందే కొనసాగుతోంది. ఇక మిగతా కంపెనీల విషయానికొస్తే, టాప్–5 కంపెనీలు కలిపి ఈ ఏడాది క్యూ1లో కేవలం 4,703 ఉద్యోగులను మాత్రమే నికరంగా జత చేసుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్ మినహా మిగతా మూడు కంపెనీల్లో సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఐటీ నియామకాల్లో మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... టీసీఎస్ ప్రకటించిన 12,000 మంది సిబ్బంది కోతల్లో అత్యధికంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం చూపనుంది. భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా తీర్చిదిద్దడం, టెక్నాలజీలో పెట్టుబడులపై మరింత ఫోకస్ చేయడం, ఏఐ వినియోగం, మార్కెట్ విస్తరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి విస్తృత వ్యూహాలను కంపెనీ దీనికి కారణంగా చెబుతోంది. అంటే, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాల వైపే నడుస్తాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ‘ఆర్థిక ఒత్తిళ్లతో పాటు క్లయింట్ల అంచనాలు, అలాగే చురుకైన, ఫలితాల ఆధారిత డెలివరీ విధానాల దిశగా పరిశ్రమలో వస్తున్న మార్పులు వంటి అనేక అంశాలు టీసీఎస్ సిబ్బంది కోత నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థలో రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వ్యాఖ్యానించారుబెంచ్ సిబ్బంది విషయంలో కఠిన పాలసీని కంపెనీలన్నీ అమలు చేస్తుండటాన్ని చూస్తుంటే, సిబ్బంది సేవలను పూర్తిగా సది్వనియోగం చేసుకోవడంపై ఐటీ సంస్థలు దృష్టి పెడుతున్నాయనేందుకు నిదర్శనం. అయితే, టీసీఎస్ మాత్రం ఏఐకి తాజా కోతలకు సంబంధం లేదని చెబుతోంది. కానీ టెక్ పరిశ్రమలో సిబ్బంది నియామకాలను ఏఐ, ఆటోమేషన్ అనేవి మరింత ప్రభావితం చేస్తున్న తరుణంలో టీసీఎస్ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోపక్క, ఇటీవలి ఐటీ కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదాయాల్లో ఏమంత పెద్ద పెరుగుదల లేదు. క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యయాల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు... మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు.. ఇప్పటికే ఉద్యోగుల తగ్గింపు బాట పట్టాయి. ముఖ్యంగా సరికొత్త డిజిటల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగ విధులు, నైపుణ్యాలను మదింపు చేస్తూ అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం.. లేదంటే వేటు వేయడానికీ వెనుకాడటం లేదు. ‘మన ఐటీ కంపెనీల విషయానికొస్తే.. సమర్థవంతమైన, పనితీరు ఆధారిత సిబ్బంది విధానాల వైపు మార్పునకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని పాఠక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ ఆసరాతో తక్కువ వ్యయానికి మరిన్ని సేవలు కోరుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సంస్థల సిబ్బంది కోతలకు ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ ఆధారిత ఐటీ వైపు మారుతోంది. ప్రస్తుత మానవ నైపుణ్యాలతో పోటీ పడే ఏఐ ఏజెంట్లు.. ఇప్పుడున్న కొంత మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ జోరందుకుంటుంది’ అని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైజల్ కవూసా అభిప్రాయపడ్డారు. ఐటీ డిమాండ్ తగ్గడం, క్లయింట్ల ప్రాధాన్యతలు మారడం వల్ల ఎదురవుతున్న మార్జిన్ ఒత్తిళ్లు.. సిబ్బంది కోతకు దారితీస్తున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు లేకుంటే ఇంటికే... కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు టీసీఎస్‌తో పాటు దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏఐ, ఆటోమేషన్ బాట పడుతున్నాయి. మార్జిన్లు పెంచుకోవడానికి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఫలితాలు పొందాలనేది వాటి తాజా వ్యూహం. ప్రతి కంపెనీలో సిబ్బంది, విధానాలు, టెక్నాలజీ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. ‘కంపెనీలన్నీ తమ ప్రస్తుత సిబ్బందితో పాటు కొత్తగా తీసుకునే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్కిల్స్ పెంచుకోకుండా, భవిష్యత్తు విధానానికి అనుగుణంగా లేనివారిపై వేటు తప్పదు. దీర్ఘకాలంలో కంపెనీల్లో అనేక సానుకూల మార్పులతో మాటు కొన్ని ప్రతికూలతలు కూడా తప్పవు’ అని శర్మ అభిప్రాయపడ్డారు.పరిశీలిస్తున్నాం: ఐటీ శాఖ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను కేంద్ర ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్), ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీసీఎస్‌కు నోటీసులు ఇవ్వాలని కోరింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డాక్టర్.. ఏఐ ఏం చెప్పిందంటే..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది తమ కు ఉన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కూడా ఏఐ ద్వారా తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వైద్యు ల సలహా మేరకు చేయించుకునే మెడికల్ టెస్టులు, ల్యాబ్ రిపోర్టులను వైద్యులకు చూపించటానికి ముందే ఏఐ చాట్బాట్ల ద్వారా విశ్లేషించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు నిజ మైన వైద్యులకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇంటర్నెట్లో శోధించి చిట్కాలు తెలుసుకునే వారి ని ‘గూగుల్ డాక్టర్లు’గా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఏఐ చాట్బాట్లతో గతంకంటే ఎక్కువ విషయాలే తెలుస్తుండటంతో కొందరు తమకు అంతా తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ ఆన్లైన్ పరిజ్ఞానం బయట పెడుతూ నిజమైన వైద్యుల బుర్రలు తింటున్నారు. రోగుల మితిమీరిన సందేహాలతో వారిని సంతృప్తి పర్చలేక తమ తల ప్రాణం తోకకు వస్తోందని వైద్యులు వాపోతున్నారు. మంచీ.. చెడు రెండూ ఉన్నాయి.. జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీలో లభించే సమా చారంతో తమ రిపోర్టుల గురించి చర్చించే కొందరు రోగుల వాదనా పటిమ ఆశ్చర్యపరుస్తోందని ఢిల్లీలోని పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్, ఎయిమ్స్ పల్మనాలజీ విభాగం మాజీ అధిపతి డా.జీసీ ఖిల్నానీ తెలిపారు. తమకు ఉన్న వైద్య సమస్యలపై డాక్టర్లను సంప్రదించడానికి ముందే కొందరు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అనియంత్రిత సమాచారం ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.దీనివల్ల చాలామంది ఎంతో ఆందోళనతో తన వద్దకు వచ్చారని, వారికి అర్థమయ్యేలా వివరించేందుకు చాలా సమయం పట్టి ందని పేర్కొన్నారు. ఊహించుకునే అవకాశాలు ఉన్నాయ ని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో డాక్టర్లు రోగులకు సరైన చికిత్స అందించేందుకు మొగ్గుచూపుతారని తెలిపా రు. ఏఐ చాట్బాట్లు ఆరోగ్య సంరక్షణపై ఆశాజనకమైన సమాచారం అందిస్తున్నా, ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి మానవ పర్యవేక్షణతోపాటు బాధ్యతాయుతమైన వ్యవస్థల ఆవశ్యకత ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఏఐకి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: జాతీయ భద్రత దృష్ట్యా కృత్రిమ మేథకి (ఏఐ) ప్రభుత్వం మద్దతు అవసరమని నెక్స్‌జెన్ ఎగ్జిబిషన్స్ ఒక నివేదికలో తెలిపింది. పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ కోసం దీనిపై గణనీయంగా ఇన్వెస్ట్ చేయాలని, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 15 నగరాలకు చెందిన 200 పైగా కంపెనీలతో నిర్వహించిన సర్వే ప్రాతిపదికన నెక్స్‌జెన్ ఈ నివేదిక రూపొందించింది. జాతీయ భద్రత కోసం ప్రభుత్వం ఏఐకి క్రియాశీలకంగా మద్దతునివ్వాలనే విషయంపై ’ఏకీభవిస్తున్నాను’, ’మరింతగా ఏకీభవిస్తున్నాను’ అనే ఆప్షన్లకు 86 శాతం మంది సానుకూలంగా స్పందించినట్లు సంస్థ తెలిపింది. డిఫెన్స్‌లో ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, ప్రోత్సాహకాలు అవసరమని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో ఏఐ అంతరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసుకునే దిశగా ఏఐని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలసీపరంగా ఉన్న అనేక అంతరాలను ప్రభుత్వం, పరిశ్రమ పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది. ఎల్రక్టానిక్ యుద్ధాలు, సమాచార యుద్ధాలతో సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏఐ ఎంతో ఉపయోగకరమైన సాధనంగా ఉండగలదని నెక్స్‌జెన్ పేర్కొంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం 2024లో దేశీయంగా 23 లక్షల పైగా సైబర్‌దాడులు చోటు చేసుకున్నాయి. వీటి వల్ల రూ. 1,200 కోట్ల మేర ఆరి్థక నష్టం వాటిల్లింది. అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడుల విషయంలో అమెరికా, రష్యా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. -
8 వేల మంది ప్రొఫెషనల్స్‌కి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో 8,000 మంది ప్రొఫెషనల్స్‌కు కృత్రిమ మేధ (ఏఐ) సంబంధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికాకు చెందిన బీపీవో సంస్థ వర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ (వీజీఎస్) తెలిపింది. కాంటాక్ట్ సెంటర్ ప్రక్రియలను మెరుగుపర్చే వీఅసిస్ట్ టూల్‌తో ఈ శిక్షణా కార్యక్రమం తమ సంస్థ అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. కస్టమర్ల నుంచి వచ్చే క్వెరీలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, విశ్లేషించుకుని, సముచిత కేటగిరీల కింద వర్గీకరించడం (కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్, వ్యాపార అవసరాలు) ద్వారా కంపెనీ సిబ్బంది తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఏఐ రాకతో దేశీ బీపీవో రంగంలో కూడా శరవేగంగా పెను మార్పులు వస్తున్నాయని వీజీఎస్ ప్రెసిడెంట్ గగన్ ఆరోరా తెలిపారు. అధునాతన టెక్నాలజీలు, ఏఐ దన్నుతో 2033 నాటికి ఈ విభాగం 280 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం 2025లో ఇది 139.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులు, ఏఐ మధ్య సమతూకం సాధించడం ద్వారా ఏజెంట్ల పనితీరును మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు కూడా మరింత సంతృప్తికరమైన సేవలు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం. -
టెక్నాలజీతో మేలెంత? కీడెంత?
రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తున్న కాల మిది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగం... ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ విస్తరిస్తోంది కూడా. అయితే... నిత్యజీవితంలోకి చొచ్చుకొచ్చేస్తున్న కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత మన ఆలోచనా శక్తిపై చూపుతున్న ప్రభావం ఏంటి? వీటిపై ఆధారపడుతూ మనం మెదళ్లతో ఆలోచించడం తగ్గించేస్తున్నామా? తార్కికత, జ్ఞాపకశక్తి, హేతుబద్ధత వంటి మన మేధోశక్తులను టెక్నాలజీ కోసం చేజేతులా వదులుకుంటున్నామా?టెక్నాలజీ ప్రభావం మనపై ఎలా ఉంటుందో సులువుగా అర్థం చేసుకోవాలంటే... మొబైల్ అప్లికేషన్ల వాడకాన్ని గమనించండి. సోషల్ మీడియాలో రెండు, మూడు నిమిషాలుండే షార్ట్ వీడియోలు, రీల్స్‌కు కొన్ని కోట్ల మంది బానిసలైపోయారంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ పొట్టి వీడియోలు చూస్తూండటం తెలిసిందే. ఈ వ్యసనంలో మన మెదడుకు పనేమీ లేదు. చకచక కనిపిస్తున్న సమాచారాన్ని స్వీకరించడం మినహా. అయితే ఇలా చేయడం వల్ల మన మెదడు చాలా వేగంగా వినోదం అనే అనుభూతిని పొందుతుంది. ఇలా రోజూ గంటల తరబడి చూడటం అల వాటైన తర్వాత మన ఏకాగ్రత దెబ్బతింటుంది. డిజిటల్ డివైసెస్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపితే మన మెదడులోని నాడీ మార్గా(న్యూరల్ పాథ్‌వే)లలో మార్పులు జరుగుతాయని ఇప్పటికే జరిగిన కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.డిజిటల్ టూల్స్ జ్ఞాపకశక్తితో పని లేకుండా చేయ డమే కాకుండా... సంక్లిష్టమైన పనులను కూడా సులు వుగా అర్థమయ్యేలా చేయడం ద్వారా ఆలోచించే అవ సరం లేకుండా చేస్తాయి. ఇంకో మాటలో, నేర్చుకునేందుకు నేరుగా అవకాశం కల్పించకుండా విషయా లను అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెడతాయన్న మాట. అయితే ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ డిజైన్ బాగా ఉంటే మనకు మేలే జరుగుతుంది. ఆటో కంప్లీట్, డిజిటల్ కాలిక్యులేటర్లు, వ్యాకరణాన్ని సరిచేసే టూల్స్ వంటివి మన పనిని సులువు చేయడంతోపాటు ఈ పనులపై పెట్టాల్సిన శ్రమను తగ్గిస్తాయి. ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్‌ను తగిన రీతిలో వాడుకుంటే మన మెదడు సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రాసెస్ చేయగలదు. అవసరమైన విషయాలను జ్ఞాపకాల పొరల్లోంచి మెరుగ్గా అందివ్వగలదు. తద్వారా మన మేధాశక్తి మెరుగవుతుంది. ఇంటర్నెట్ ద్వారా మన మేధకు ఎదురయ్యే సవాళ్లూ ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా అతిగా సమాచారం అందడం వల్ల మెదడు దేనిని గ్రహించాలో తెలియక ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోంది. అధిక సమచారం మన నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనీ, మేధపై ఒత్తిడిని పెంచుతుందనీ... ఫలితంగా నేర్చుకున్నది మనకు గుర్తుండే అవకాశాలు తగ్గిపోతాయనీ ఇప్పటికే జరిగిన పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తగిన రీతిలో మన మెదడును వాడుకోకపోతే కాలక్రమంలో దీని నిర్మాణంలోనూ తేడాలొస్తాయి. అయితే టెక్నాలజీ నేరుగా మెదడు కుంచించుకు పోయేలా చేస్తుంది అనేందుకు ప్రస్తుతానికి స్పష్టమైన రుజువుల్లేవు. మన మెదడులోని న్యూరాన్లు అవసరా నికీ, కొత్త పరిస్థితులకూ, టూల్స్కూ తగ్గట్టుగా తమని తాము మార్చుకోగలవు. తగిన విధంగా వాడుకోక పోవడం వల్ల మెదడు చేసే కొన్ని పనుల సామర్థ్యం తగ్గవచ్చునేమో కానీ... టెక్నాలజీ ద్వారా కొన్నింటిని పెంచుకోవచ్చు కూడా. వీడియో గేమ్‌లను ఉదాహ రణగా తీసుకుంటే... వీటితోప్రాదేశిక తార్కికత (స్పేషి యల్ రీజనింగ్), మల్టీటాస్కింగ్ సామర్థ్యాలు పెరుగు తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అధిగమించడమెలా?డిజిటల్ టెక్నాలజీల ద్వారా వస్తున్న మేధో సంబంధిత సమస్యలను అధిగమించేందుకు: సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా ఇతర డిజిటల్ అలవాట్లను రోజులో నిర్దిష్ట సమయానికి పరిమితం చేయాలి. వారంలో ఒక రోజు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లో షార్ట్స్, రీల్స్‌ను చూడకుండా నియంత్రించుకోవాలి. ఏకాగ్రతను, వాస్తవికంలో ఉండేట్టు చేసే ‘మైండ్‌ఫుల్ నెస్ టెక్నిక్లను ఉపయోగించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మన మేధాశక్తికి బలం చేకూరుస్తుందనీ, జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు ఇతర లాభాలు చేకూరుస్తుందనీ పరిశోధనలు చెబు తున్నాయి. పుస్తకాలు చదవడం మన ఏకాగ్రతను పెంచేందుకు మంచి మార్గం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డిజిటల్ డీటాక్స్’ను మొదలు పెట్టాలి. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్‌ను నిర్దిష్ట సమయం పాటు దూరంగా ఉండే ఈ డిజిటల్ డీటాక్స్ వల్ల టెక్నాలజీపై ఆధారపడే అల వాటు తగ్గుతుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించడం, కళల పట్ల అభిరుచిని పెంచుకోవడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయి. రోజూ తగినంత సమయం నిద్రపోవడం కూడా మన జ్ఞాపకశక్తి బలపడేందుకు, మేధోశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ పద్ధ తులు అన్నింటినీ పాటించడం ద్వారా టెక్నాలజీ సవాళ్లను అధిగమించవచ్చు.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కృత్రిమ రచన
ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావ వాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది. కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!‘ఈ కంప్యూటర్ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్‌ను కనుగొనడం, ఇంటర్నెట్ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అద నపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్ ఫుట్‌ప్రింట్స్‌కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్ లెటర్’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్ రాండమ్‌హౌజ్, హార్పర్ కొలిన్స్ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించ బోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించ బోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్‌కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్ రైటర్‌నో, కంప్యూటర్నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది! సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగు తాడు కవి డేవిడ్ స్టీర్. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత టెడ్ చియాంగ్. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నా రన్నది విషయం కాదు; ‘ఐ యామ్ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పదబంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ. కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమో నని ఒక సృజనాత్మక భయం!త్రిపురనేని గోపీచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసు కోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచ యితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది! -
ఏఐతో హోమ్‌వర్క్!
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్‌వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.మొత్తం 29 దేశాలు..‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రైట్చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్‌జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్‌లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.పిల్లలు – ఏఐ⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%⇒ 62% చాట్‌జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20% -
హై‘పవర్’ డేటా సెంటర్స్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాష్ట్ర విద్యుత్ శాఖకు షాక్ ఇస్తోంది. అంచనాలకు మించిన విద్యుత్ డిమాండ్‌ను సృష్టిస్తుంది. అన్ని సాఫ్ట్వేర్ సంస్థలూ ఏఐతో కనెక్ట్ అవుతుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డేటా కేంద్రాలు పెరుగుతున్నాయి. బిగ్ డేటా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఒక్కోటి 500 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్‌ను ఉపయోగించే స్థాయిలో ఉంటాయని అంచనా. ఇది జెన్కోలో ఒక ప్లాంట్ సామర్థ్యంతో సమానం. ఇదే ఇప్పుడు విద్యుత్ శాఖకు గుబులు పుట్టిస్తోంది. అయితే, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా చేయాలని విద్యుత్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏం చేద్దాం? రాష్ట్రంలో పీక్ సమయంలో 15497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. 2034 నాటికి ఇది 33773 మెగావాట్లకు చేరుతుందని అంచనా. డిమాండ్‌లో ప్రధాన భూమిక ఐటీ కేంద్రాలదే. ముఖ్యంగా డేటా కేంద్రాల వల్లే డిమాండ్ పెరిగే వీలుంది. విద్యుత్ లభ్యతను పెంచకపోతే ప్రతిపాదిత డేటా కేంద్రాలు వెనక్కుపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది.కొత్తగా వచ్చి న యాదాద్రితో కలుపుకొంటే 5580 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలున్నాయి. 70 శాతం లోడ్ ఫ్యాక్టర్‌తో పనిచేసినా ఇవి 109 మిలియన్ యూనిట్లు ఇవ్వగలవు. అయితే, బొగ్గు కొరత, తరచూ బ్యాక్‌డౌన్ కారణంగా గరిష్టంగా రోజుకు 60 మిలియన్ యూనిట్లే ఇస్తున్నాయి. పీక్ సమయంలో రాష్ట్రంలో రోజుకు 308 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. డేటా కేంద్రాల ఏర్పాటుతో డిమాండ్ రెట్టింపు అయితే రోజుకు 600 మిలియన్ యూనిట్లు కావాలి. ఈ నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు జెన్కో మార్గాన్వేషణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం జెన్కోకు కీలకం. దీని సామర్థ్యం 4 వేల మెగావాట్లు. ఇక్కడ 55 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ బొగ్గుపై సింగరేణి సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 4 ర్యాకులతో బొగ్గు సరఫరా జరుగుతోంది. దీన్ని 14 రేకులకు పెంచాలి. దీంతో జెన్కో అధికారులు రైల్వే, సింగరేణితో భేటీకి సన్నద్ధమవుతున్నారు. కొనుగోలు తప్పదా? ప్రస్తుతం రోజుకు 300 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉంటేనే... మార్కెట్లో విద్యుత్ కొనాల్సి వస్తోంది. జెన్కో థర్మల్ 57, హైడల్ 25, సింగరేణి నుంచి 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. రోజూ 149 మిలియన్ యూనిట్లు కేంద్ర సంస్థలు, మార్కెట్ నుంచి సమకూర్చుకుంటున్నారు. మధ్యా హ్నం యూనిట్ గరిష్టంగా రూ.2.5కు లభిస్తున్నా, రాత్రిపూట మాత్రం యూనిట్ రూ.8 వరకూ వెళ్తోంది. రాబోయే రోజుల్లో రోజుకు 600 ఎంయూ డిమాండ్ ఉంటే... ధర ఎంత ఉన్నా మార్కెట్ నుంచి భారీగా కొనుగోలుచేయాల్సి రావొచ్చు.డిమాండ్ అందుకుంటాం కేంద్ర విద్యుత్ సంస్థల అంచనాను మించి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాల్లో వస్తున్న మార్పులూ కారణమే. అయితే, డిమాండ్‌ను అందుకునేందుకు జెన్కో అన్నివిధాలా సిద్ధమతోంది. యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం. ఇతర ప్లాంట్లలోనూ ఉత్పత్తి పెంచుతాం. ఎంత డిమాండ్ పెరిగినా అందుకోగల సామర్థ్యం జెన్కోకు ఉంది. –ఎస్.హరీశ్, సీఎండీ, తెలంగాణ జెన్కో -
జీసీసీల్లో హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల పరిస్థితి మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 3–6 శాతం క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మాత్రం 8–10 శాతం హైరింగ్ పెరిగింది. ఏఐ, ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీలాంటి విభాగాల్లో నిపుణులకు డిమాండ్ నెలకొంది. స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అన్ని విభాగాల్లోను పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ చేపట్టకుండా, దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చే, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడే నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్ .. ఎనర్జీ, టెక్నాలజీ..హార్డ్‌వేర్ లాంటి విభాగాల్లో నియామకాలకు డిమాండ్ నెలకొన్నట్లు వివరించింది. స్మార్ట్ ఫ్యాక్టరీలు, పారిశ్రామిక ఐవోటీ, ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్‌ఫాంలోకి పెట్టుబడుల ప్రవాహం కారణంగా తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ విభాగాల్లో అత్యధికంగా హైరింగ్ డిమాండ్ త్రైమాసికాలవారీగా 31 శాతం మేర పెరిగింది. మొత్తం జీసీసీ మార్కెట్లో 20 శాతం వాటాతో బీఎఫ్ఎస్ఐ గణనీయంగా నియామకాలు చేపట్టింది. ఏఐ ఆధారిత క్రెడిట్ రిస్క్ అనాలిసిస్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఈ విభాగంలో హైరింగ్ త్రైమాసికాలవారీగా 15 శాతం పెరిగింది. మరోవైపు హాస్పిటాలిటీ, ట్రావెల్..లాజిస్టిక్స్ విభాగంలో హైరింగ్ 25 శాతం, నిర్మాణ..ఇంజినీరింగ్ విభాగంలో 15 శాతం తగ్గింది. నివేదికలో మరిన్ని వివరాలు.. → భౌగోళికంగా చూస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్ గణనీయంగా ఉంది. 29 శాతం మార్కెట్ వాటాతో బెంగళూరు.. జీసీసీ హబ్‌గా కొనసాగుతున్నప్పటికీ, ప్రదాన మెట్రోలతో పోలిస్తే నియామకాల వృద్ధి అత్యంత తక్కువగా 3.20 శాతంగా నమోదైంది. ప్రథమ శ్రేణి నగరాల్లో పుణె (10.60 శాతం), చెన్నై (9.40 శాతం) అత్యధిక వృద్ధి నమోదు చేశాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా రిక్రూట్మెంట్పరంగా అధిక వృద్ధి నమోదైంది. కోయంబత్తూర్‌లో 34.10 శాతం, కోచిలో 27.60 శాతం, అహ్మదాబాద్‌లో 24.60 శాతం మేర వృద్ధి నమోదైంది. → ఏఐ, డేటా సైన్స్, ప్లాట్‌పాం ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో హోదాను బట్టి నిపుణుల కొరత 25 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటోంది. దీనితో హైరింగ్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. అత్యుత్తమ నైపుణ్యాలున్న వారికి మెట్రోల్లో రూ. 50–60 లక్షల స్థాయిలో ప్యాకేజీలు ఉంటున్నాయి. -
HYD: ట్యాక్స్ ఎగ్గొట్టే యత్నం.. పట్టించిన ఏఐ
స్థిరాస్తి విక్రయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (ఎల్టీసీజీ) ట్యాక్స్ ఎగవేయాలని పథకం వేసిన హైదరాబాద్ వ్యాపారి కొన్ని నకిలీ బిల్లులు సృష్టించారు. రూ.21.6 లక్షలు చెల్లించాల్సిన చోట రూ.7200 చెల్లిస్తే చాలన్నట్లు తయారు చేశారు. ఓ బిల్లులోని ఫాంట్‌పై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై ఉన్న తేదీ నాటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ లేదని నివేదిక వచ్చింది. దీని ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. గత్యంతరం పరిస్థితుల్లో సదరు వ్యాపారి రూ.21.6 లక్షలు చెల్లించి కేసు నుంచి బయటపడాల్సి వచ్చింది.హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా... ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఎల్టీసీజీ ద్వారా వచ్చే లాభంలో 30 శాతం పన్నుగా చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని మరో స్థిరాస్తి పైన లేదా దాని అభివృద్ధి కోసం వెచ్చిస్తే ఆ మొత్తానికి మినహాయింపు పొందవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 2000కు ముందు రూ.68 లక్షలు వెచ్చించి శివార్లలో ఉన్న ఓ పాత ఇంటిని ఖరీదు చేశారు. దీనికి మరమ్మతులు చేసి అదనపు హంగులు చేర్చారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా రూ.1.4 కోట్లకు విక్రయించారు. ఇలా సదరు స్థిరాస్తి విక్రయం ద్వారా 2002లో రూ.72 లక్షలు లాభం పొందారు. దీనిపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌గా రూ.21.6 లక్షలు చెల్లించాల్సి ఉంది.అయితే 2002–08 మధ్య తనకు చెందిన మరో ఇంటి అభివృద్ధి కోసం రూ.71 లక్షలకు పైగా వెచ్చించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. వీటిని ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తూ చేస్తూ తనకు క్యాపిటల్ గెయిన్గా కేవలం రూ.24 వేలు మిగిలినట్లు చూపించారు. ఇందులో 30 శాతం యడం ద్వారా ఆ మేరకు మినహాయింపు పొంది మిగిలిన రూ.7200 చెల్లించారు. ఈ వ్యవహారాన్ని సందేహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేస్తుండగా దానికి ఆయన నుంచి సమాధానాలు వెళ్తున్నాయి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా వీరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి.ఈ బిల్లుల్లోని లోటుపాట్లను గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏఐ టూల్ వినియోగించారు. వ్యాపారి సమర్పించిన బిల్లుల్లో 2002 జూలై 6 తేదీతో రూ.7.6 లక్షలది కూడా ఉంది. దీన్ని విశ్లేషించిన ఏఐ టూల్ అందులోని ఫాంట్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపింది. ఆ బిల్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోని కాలిబ్రి అనే ఫాంట్‌తో ముద్రించి ఉంది. డిజిటల్ సాన్స్–సెరిఫ్ టైప్ ఫేస్ ఫాంట్ అని గుర్తించిన ఏఐ టూల్ మరికొన్ని కీలకాంశాలను బయటపెట్టింది.దీన్ని 2002–2004 మధ్య డచ్ డిజైనర్ లూకాస్ డి గ్రూట్ రూపొందించారని, 2006లో విండోస్ విస్టాతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తేల్చింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఆ ఫాంట్ 2007 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. వర్డ్‌లో టైమ్స్ న్యూ రోమన్‌ని, పవర్‌పాయింట్, ఎక్సెల్, ఔట్లుక్ల్లో ఏరియల్న ఫాంట్‌కి బదులు ఇది అందుబాటులోకి వచ్చినట్లు ఆ టూల్ నివేదించింది. కంప్యూటర్ ప్రపంచంలోకి 2006లో అందుబాటులోకి వచ్చిన ఫాంట్‌తో 2002లో బిల్లు ముద్రితం కావడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సదరు వ్యాపారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక ఆ వ్యాపారి మొత్తం రూ.21.6 లక్షలు చెల్లించిన అధికారులకు క్షమాపణ చెప్పి వెళ్లారు.- శ్రీరంగం కామేష్ -
నిధులు ముద్దు... జాప్యం వద్దు!
ప్రభుత్వం ఇటీవల ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో ఒక నూతన పరిశోధన, అభివృద్ధి, నవీకరణ(ఆర్డీఐ) పథకానికి ఆమోదం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వంటి ప్రగాఢమైన సాంకేతిక రంగాల్లో నవీకరణ, వాణిజ్యపరమైన పరి శోధన–అభివృద్ధి (ఆర్–డి)లో ప్రైవేటురంగ పెట్టుబడులను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిధిని నెలకొల్పింది. దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు లేదా తక్కువ వడ్డీ రేట్లపై రీఫైనాన్సింగ్‌కు ఈ నిధులను వినియోగిస్తారు. జాతీయ లక్ష్యమైన స్వావలంబన సాధనకు చేయూతనందించదలచుకున్న ప్రైవేటు కంపెనీలు ఆర్–డి, టెక్నాలజీ అభివృద్ధి స్థాయిని పెంచాలనుకున్నప్పుడు వృద్ధి, రిస్క్ క్యాపిటల్ రూపంలో ఈ నిధులు అందుతాయి. కీలకమైన లేదా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న టెక్నాలజీల సమీకరణతో ప్రమేయం ఉన్నవాటితోపాటు, ‘టెక్నాలజీ సంసిద్ధత స్థాయి’ని హెచ్చుగా కనబరచిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తారు. పరిశోధనలో ఎక్కడున్నాం?‘ఆర్–డి’లో పెట్టుబడులు తక్కువగా ఉండటం, ప్రైవేటు రంగ వాటా పేలవంగా ఉండటంతో నూతన నిధిని సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. ఆర్–డిపై స్థూల వ్యయాన్ని (జీఈఆర్డీ)గా పిలుస్తారు. ఇది ఎంత ఉందనేదానిని బట్టే పరిశోధనల పట్ల సదరు దేశపు నిబద్ధతను అంచనా వేస్తారు. భారతదేశపు జీఈఆర్డీ అత్యల్పంగా 0.64 శాతంగా ఉంది. ఎదుగు బొదుగు లేకుండా ఉండి పోయిన ఈ సంఖ్య, వాస్తవానికి, 2019–20 నుంచి ఇంకా తగ్గిపోవడం ప్రారంభించింది. అయితే, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పెరుగు దలతోపాటు ఆర్–డి కాసుల మూట కూడా కాస్తోకూస్తో బరువు పెరుగుతూ రావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఆర్–డిపై వ్యయంలో భారత్ స్థానం ఎక్కడా చెప్పుకోతగినదిగా లేదు. ఈ విషయంలో అమెరికా 784 బిలియన్ల డాలర్లతో 2023లో మొదటి స్థానంలో నిలిచింది. చైనా (723 బిలియన్ల డాలర్లు), జపాన్ (184 బిలియన్ల డాలర్లు), జర్మనీ (132 బిలియన్ల డాలర్లు), దక్షిణ కొరియా (121 బిలియన్ల డాలర్లు), బ్రిటన్ (88 బిలియన్ల డాలర్లు), ఇండియా (71 బిలియన్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయని ‘వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్’ వెల్లడిస్తోంది. చైనాతో సహా ఆర్–డిపై అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో ప్రైవేటు రంగమే దానికి సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో మాత్రం జీఈఆర్డీకి ప్రభుత్వ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. మన దేశంలో ఆర్–డిపై మొత్తం వ్యయంలో ప్రైవేటు రంగ వాటా 36.4 శాతంగానే ఉంది. ప్రభుత్వ ఊతంతోనే ఎదుగుదల!ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడిని నష్ట ప్రమాదం లేకుండా మార్చేందుకు ఈ రకమైన ప్రోత్సాహక చర్యకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారేమీ కాదు. ప్రపంచీకరణ యుగంలో సాఫ్ట్వేర్, బయోటెక్నాలజీ విప్లవాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి విజయవంతమైన ఉదాహరణలుగా నిలవడం వెనుక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల మూల నిధులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) అనే కొత్త ఐడియానే తీసుకుందాం. ఉపగ్రహ డాటా–లింక్ సదుపాయాలు పంచుకోవడం, సరసమైన ధరలకు కార్యాలయాల స్థలాన్ని పొందడం, పన్నుల్లో భారీ వెసులుబాట్ల రూపంలో ఔత్సాహిక సాఫ్ట్వేర్ సంస్థలకు ఎంతో అవసరమైన సహాయం ఎస్టీపీ ద్వారా లభించింది. అలా ఉత్సాహం చూపిన చాలా సంస్థలు కోట్లాది డాలర్ల బృహత్ సంస్థలుగా రూపాంతరం చెందాయి. ఆర్–డి, ప్రాడక్ట్ డెవలప్మెంట్ ఔట్సోర్సింగ్ లోకి అవి విస్తరించాయి. భారతదేశపు జి.డి.పి.లో సాఫ్ట్వేర్ రంగ వాటా ప్రస్తుతం సుమారు 8 శాతంగా ఉంది.శాంతా బయోటెక్నిక్స్, భారత్ బయోటెక్ మొట్టమొదటి బయో టెక్నాలజీ, వ్యాక్సీన్ కంపెనీలు అదే కోవలో లబ్ధి పొందినవే. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో నెలకొల్పిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) ఆ రెండు సంస్థలకు ఉదారంగా నిధులు అందించింది. అవి కూడా నిధులను సద్వినియోగం చేసుకుని, హైదరాబాద్‌ను భారతదేశపు వ్యాక్సీన్ రాజధానిగా అవతరించేటట్లు చేశాయి. విద్యాసంస్థలతో కలిసి నడిస్తేనే...ఆర్–డిపై ఆసక్తి ఉన్న ప్రైవేటు రంగాన్ని తీసుకురావడంలోఇంతవరకు గడించిన అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇంకా పైకెద గడం, ఇంతకుముందు తెచ్చిన పథకాల్లోని లోటుపాట్లను సరిదిద్దు కోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. మొట్టమొదటగా, అటు వంటి పథకాల అమలులో, అధికార యంత్రాంగం నుంచి ఎదు రయ్యే జాప్యాలను తలచుకుని ప్రైవేటు రంగం ఎప్పుడూ జంకుతూ ఉంటుంది. కనుక, పాలనాపరమైన జోక్యం వీలైనంత తక్కువగాఉండేటట్లు చూడాలి. కొత్త ఆర్డీఐ పథకం పాలనాపరంగా పీడకలకు కారణమయ్యే దిగా కనిపిస్తోంది. ఈ పథకానికి ‘వ్యూహాత్మక దిశా నిర్దేశం’ చేసేందుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన గల ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ (ఎ.ఎన్.ఆర్.ఎఫ్.) గవర్నింగ్ బోర్డ్ పెద్ద తలకాయలా ఉంటుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించి, నిధులు ఇవ్వదగిన ప్రాజెక్టుల పరిధి, తరహాలపై సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల సాధికార బృందం ఒకటి ఉంటుంది. ఏయే రంగాల్లో, ఏయే తరహా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చవచ్చునో ఈ బృందం సిఫార్సు చేస్తుంది. వాటి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ అధికార యంత్రాంగపు పిరమిడ్‌కు అట్టడుగున వైజ్ఞానిక, సాంకేతిక శాఖ ఉండి ఈ పథకాన్ని అమలుపరుస్తుంది. రెండు అంచెల వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహం సాగుతుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. లోపల స్పెషన్ పర్పస్ ఫండ్ (ఎస్.పి.ఎఫ్.) అని ఒకటుంటుంది. అలాగే, ద్వితీయ స్థాయి ఫండ్ మేనేజర్లు కొందరుంటారు. కొల్లేటి చాంతాడు లాంటి అధికార యంత్రాంగాన్ని అలాఉంచితే... రూ. 10,000 కోట్ల నిధులతో డీప్ టెక్ ఫండ్ ఆఫ్ పంఢ్స్ పేరుతో ఆర్డీఐ లాంటి పథకం ఇప్పటికే ఒకటి ఉంది. అయినా, కొత్త దానికి ఎందుకు రూపకల్పన చేశారో అర్థం కాదు. స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో, ఏఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూ టింగ్ వంటి రిస్క్ ఎక్కువ ఉన్న రంగాల్లో వ్యాపారాల తొలి అభివృద్ధి దశల్లో పెట్టుబడులకు డీప్ టెక్ ఫండ్ సాయపడాల్సి ఉంది. బహుశా, ఒకే రకమైన పథకాలు రెండింటికి రూపకల్పన చేశామని గ్రహించినందువల్లనే కాబోలు, డీప్ టెక్ ఫండ్‌కు ఆర్డీఐ నిధులు తరలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నిధి మరో నిధికి నిధులిస్తే, ఇక అది ఏ ప్రయోజనాలను నిర్వర్తించనున్నట్లు? టెక్నాలజీ అభివృద్ధిని ప్రైవేటు రంగం చేపట్టాలని మనం కోరు కుంటున్నట్లయితే, విద్యా సంస్థలతో కలసి పనిచేయడమనే ప్రాథ మిక సూత్రం ఉండనే ఉంది. వాటితో కలసి అడుగులు వేస్తే, ఐడి యాలలో పురోగతిని త్వరగా అందిపుచ్చుకునేందుకు కంపెనీలకు వీలవుతుంది. పీహెచ్డీ హోల్డర్లు, సుశిక్షితులైన రిసెర్చర్లు, ఇంజనీర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంటారు. పరిశోధనా దశనుంచే సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటే, వస్తువులను అభివృద్ధిపరచ గల సమయాన్ని కంపెనీలు కుదించుకోగలుగుతాయి. దీనికి, విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో ముందడుగులో ఉన్న దేశాలు అదే చేశాయి.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-దినేశ్ సి. శర్మ -
లోక్‌సభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ
సాక్షి,న్యూఢ్లిలీ: పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్లో ఇక ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వేయనున్నారు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానున్నట్లు లోక్‌సభ తెలిపింది.గతంలో హాజరు నమోదు కోసం ఎంపీలు సంతకాల్లో రిజిస్టర్ చేసే వారు. ఇకపై రాతపూర్వకంగా సంతకం చేసే బదులు డిజిటల్ అటెండెన్స్ పడనుంది. అలాగే 12 భాషల్లో పార్లమెంట్ ఎజెండాను డిజిటల్ సంసద్ పోర్టల్‌లో అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ సహాయంతో స్పీచ్ టు టెక్స్ట్ రికార్డు కానుంది.లోక్‌సభ డిబేట్లను ఇకనుంచి రియల్ టైంలో ఏఐ టూల్స్ అనువదించనున్నట్లు లోక్‌సభ అధికారిక వర్గాల వెల్లడించాయి. -
3 గిగావాట్లకు డేటా సెంటర్లు
ముంబై: దేశీయంగా డేటా సెంటర్ల రంగం భారీ స్థాయిలో విస్తరిస్తోంది. 2030 నాటికి ఏకంగా 3 గిగావాట్ల సామర్థ్యాన్ని సంతరించుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన మల్టీ ఇయర్ గ్రోత్ ప్రాక్సీ ఆన్ ఇండియాస్ డేటా ఎక్స్ప్లోజన్ అండ్ లోకలైజేషన్ వేవ్ పేరిట ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.1 గిగావాట్లుగా ఉంది. డేటా, ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం, డేటా లోకలైజేషన్ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్న పాలసీపరమైన చర్యలు లాంటి అంశాలు డేటా సెంటర్లకు కీలక చోదకాలుగా ఉండనున్నాయి. దీనితో 2033 నాటికి డిమాండ్ 6 గిగావాట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే, సరఫరా మాత్రం 4.5 గిగావాట్ల స్థాయికే పరిమితం కానుంది. దీంతో 1.5 గిగావాట్ల మేర డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఏర్పడనుంది. లార్జ్ ఫార్మాట్, హైపర్‌స్కేల్ రెడీ మౌలిక సదుపాయాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ లేటెన్సీతో వర్క్‌లోడ్ భారాన్ని భరించగలిగే ఎడ్జ్–రెడీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఈ డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉంది. దీంతో ఈ పరిశ్రమ వార్షికంగా 25–30 శాతం మేర వృద్ధి నమోదు చేయనుంది. భారీగా పెట్టుబడులు.. డేటా సెంటర్ల వృద్ధికి అపార అవకాశాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిశ్రమలోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 1–1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12,870 కోట్లు) స్థాయిలో వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు రెట్టింపు కానున్నాయి. వివిధ రాష్ట్రాలు సబ్సిడీ రేటుకు స్థలాన్ని, విద్యుత్తును తక్కువ రేటుకు అందిస్తుండటం వంటి అంశాలు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే ఎస్టీటీ జీడీసీ, సిఫీలాంటి దిగ్గజాలుఈ రంగంలో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చే దిశగా మరిన్ని కొత్త సంస్థలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. 2031–32 నాటికి నిర్వహణ సామర్థ్యాలను 307 మెగావాట్లకు పెంచుకునేందుకు 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18,000 కోట్లు) వెచ్చించనుంది. 2025–26లో డేటా సెంటర్ సామర్థ్యం 28 మెగావాట్లుగా ఉండనుంది. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విధానాల తోడ్పాటు, విద్యుత్ లభ్యత, కనెక్టివిటీ మొదలైన అంశాలన్నీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ క్లయింట్ల నుంచి ఎంటర్ప్రైజ్, హైపర్‌స్కేలర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాంటి వాటికి పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉందని అనంత్ రాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సరీన్ తెలిపారు. -
ఏఐ ఆధారిత వైద్య సేవలు
ముంబై: అంతర్జాతీయ ప్రమాణాలతో, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకే అందించే ప్రణాళికలను అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రకటించారు. భారత్‌లో ఆరోగ్యం సంరక్షణ రంగాన్ని మార్చేసే స్వప్నాన్ని ఆయన ఆవిష్కరించారు. సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ – ఆసియా పసిఫిక్ (ఎస్‌ఎంఐఎస్‌ఎస్–ఏపీ) 5వ వార్షిక సమావేశం శుక్రవారం ముంబైలో జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడారు. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కంటే.. వ్యవస్థ వ్యాప్తంగా పునర్నిర్మాణం అవసరమన్నారు. మూడేళ్ల క్రితం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హెల్త్‌కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘హెల్త్‌కేర్ రంగంలో తగినంత వేగం లేకపోవడం వల్ల మేము ఇందులోకి ప్రవేశించలేదు. ఇప్పుడు ఆ వేగం సరిపడా లేకపోవడంతో అడుగు పెట్టాం’’అని అదానీ తెలిపారు. 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ మెడికల్ క్యాంపస్‌లను తొలుత అహ్మదాబాద్, ముంబైలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్టు గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ.. కరోనా మాదిరి మహమ్మారి, విపత్తు సమయాల్లో వేగంగా సదుపాయాలను విస్తరించేలా ఇవి ఉంటాయన్నా రు. వైద్య చికిత్సలు, పరిశోధన, శిక్షణకు అత్యుత్తమ కేంద్రాలుగా పనిచేస్తాయంటూ.. మయో క్లినిక్ అంతర్జాతీయ అనుభవం ఈ దిశగా తమకు సాయపడుతుందని అదానీ చెప్పారు. నేడు గుండె జబ్బులు, మధుమేహం కంటే కూడా వెన్నునొప్పి ఎక్కువ మందిని వేధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు.నచ్చిన చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ ‘నాకు బాగా నచి్చన చిత్రం మున్నా భాయ్ ఎంబీబీఎస్. నవ్వుకోవడానికే కాదు, సందేశం ఇవ్వడానికి కూడా. మున్నాభాయ్ మందులతో కాకుండా, మానవత్వంతో రోగుల బాధలను నయం చేశాడు. నిజమైన వైద్యం సర్జరీలకు అతీతమైనదని ఇది మనందరికీ గుర్తు చేసింది’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. -
మనిషిని నమ్మడమే మనకు రక్ష
బీజింగ్‌లో జరిగిన ‘చైనా డెవెలప్మెంట్ ఫోరమ్’లో భాగంగా ‘ఏఐ సమ్మిళిత వృద్ధి’ అనే అంశంపై 2025 మార్చి 24న ఇజ్రాయెల్ చరిత్రకారుడు, రచయిత యువల్ నోవా హరారీ ప్రసంగించారు. ఆ వీడియోను ‘ఏఐ అండ్ ద పారడాక్స్ ఆఫ్ ట్రస్ట్’ పేరిట తన యూట్యూబ్ ఛానల్లో జూన్ 30న పోస్ట్ చేశారు. ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం:హలో, ఎవ్రీవన్! ఈ సదస్సులో పాల్గొనడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఎక్కువ సమయం లేనందువల్ల కొద్దిసేపే మాట్లాడతాను. ముఖ్యంగా నేను మూడు ప్రశ్నలు లేవనెత్తదలిచాను. ఒకటి: కృత్రిమ మేధ (ఏఐ) అంటే ఏమిటి? రెండు: ఏఐ వల్ల కలిగే ప్రమాదం ఏమిటి? మూడు: ఏఐ యుగంలో మానవాళి ఎలా వర్ధిల్లుతుంది?ఏఐ చుట్టూ ఎంత ప్రచారం అల్లుకుందంటే, అయినదానికి కానిదానికి కూడా ఆ పదబంధాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐ అంటే ఆటొమేషన్ కాదని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఏఐ మన చేతుల్లోని పనిముట్టు కాదు. ఏఐ ఒక ఏజెంట్. ఒక యంత్రం ఆటొమేటిక్గా పనిచేయగలిగినంత మాత్రాన అది ఏఐ కాదు. దానికి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. దానికది మార్పు చేసుకోగలగాలి.1. నిజంగా ఏఐ ఏమిటో మనకు అర్థమైందా?కాఫీ మెషీన్నే తీసుకోండి. బటన్ నొక్కిన వెంటనే ముందుగా నిర్దేశించిన ప్రకారం ఎస్ప్రెసో కాఫీని అందిస్తుంది. ఇది ఏఐ కిందకు రాదు. ఆ యంత్రం నేర్చుకోవడం గానీ, కొత్తదాన్ని సృష్టించడం గానీ జరగలేదు. కానీ, మీరు బటన్ నొక్కకముందే, ‘‘మిమ్మల్ని నేను కొన్ని వారాలుగా గమనిస్తూ వస్తున్నాను. మీ గురించి నేను తెలుసుకున్న అన్ని విషయాలను బట్టి, మీరు ఎస్ప్రెసోను ఇష్టపడతారని అనుకుంటున్నాను’’ అందనుకోండి. అది ఏఐ అవుతుంది. మరుసటి రోజు అదే మెషీన్, ‘‘నేనొక కొత్త పానీయాన్ని కనుగొన్నాను. దాన్ని మీరు ఎస్ప్రెసో కన్నా ఎక్కువ ఇష్టపడతారనిపిస్తోంది. తాగి చూడండి’’ అందనుకోండి. అది సిసలైన ఏఐ అవుతుంది.ఏజెన్సీతోపాటు ఏఐకి ఉండే మరో ముఖ్య లక్షణం, అది పరాయిది. దాని తెలివితేటలు మనిషి లాంటివి కావు. ఆర్గానిక్ కాదు. అది మానవాళికి అనుభవంలో లేని నిర్ణయాలను తీసుకుంటుంది. ‘గో’ ఛాంపియన్ లీ సెడాల్ను 2016లో ఆల్ఫా–గో ఏఐ ఓడించడమే అందుకు తిరుగులేని ఉదాహరణ(‘గో’ అనేది ఒక బోర్డ్ గేమ్). ఒక మనిషిని ఏఐ ఓడించడమే కాదు, గెలవడం కోసం ఆల్ఫా–గో అంతవరకు గో ఆటలో వేలాది ఏళ్ళుగా మానవ ఆటగాళ్ళకు తట్టని వ్యూహాలను కనుగొంది. క్రీడల్లో గెలిచేందుకు కొత్త మార్గాలను లేదా కొత్త రకం కాఫీలను ఏఐ కనుగొనడం అంత ముఖ్యమైనదిగా కనిపించకపోవచ్చు. కానీ ఏఐ త్వరలోనే నూతన సైనిక, ఫైనాన్షియల్ వ్యూహాలను, కొత్త రకం ఆయుధాలను, కరెన్సీలను కనుగొనవచ్చు. కొత్త సిద్ధాంతాలను, మతాలను రూపొందించినా ఆశ్చర్యపోనవసరం లేదు.2.మనిషిని నమ్మరు, మెషీన్‌ను నమ్ముతారట!ఇపుడు ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏమిటనే రెండవ ప్రశ్నకు వెళదాం. ఏఐకి అపారమైన సానుకూల ప్రయోజనాలను సృష్టించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయనడంలో ఎవరికీ సందేహం లేదు. కొత్త ఔషధాలను కనుగొనడం నుంచి వినాశకర వాతావరణ మార్పును నివారించడం వరకు అది ఎంతగానో తోడ్పడవచ్చు.కానీ, ఏఐతో వచ్చిన ప్రాథమిక సమస్య ఏమిటంటే, అది అన్య(ఏలియన్) ఏజెంట్. ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఊహించలేం.సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని అభివృద్ధి పరచడంలోని ప్రధాన ఆంతర్యంలోనే నమ్మకానికి సంబంధించిన వైచిత్రి ఉంది. మనిషి తోటి మనిషిని నమ్మడానికి వెనకాడతాడు. కానీ, మనలో కొందరం విచిత్రంగా ఏఐని నమ్మి తీరాలని భావిస్తున్నాం. నేను ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్ళి, అక్కడ ఏఐని అభివృద్ధి చేస్తున్నవారిని కలుసుకున్నప్పుడు, సాధారణంగా వారికి రెండు ప్రశ్నలు వేస్తూంటాను. ‘దీనిలో పెను ప్రమాదాలే ఇమిడి ఉన్నా, ఏఐ అభివృద్ధి దిశగా అంత వేగంగా చొచ్చుకుపోతున్నారెందుకు?’ అన్నది మొదటి ప్రశ్న. దానికి ఇంచుమించుగా అందరూ చెబుతున్న జవాబు ఒక్కటే. ‘పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని మేమూ అంగీకరిస్తున్నాం. మేము నెమ్మదిగా అడుగులు వేసినంత మాత్రాన మా ప్రత్యర్థులు కూడా నెమ్మదిగా సాగుతారనే హామీ లేదు. ఏఐ రేసులో వారు గెలుస్తారు. ప్రపంచంలో అత్యంత కర్కశంగా వ్యవహరించేవారి ప్రాబల్యం పెరిగిపోతుంది. మానవ పోటీదారులను మేం నమ్మలేం. కనుక, వీలైనంత వేగంగా ముందుకు సాగాలి’. ‘మీరు అభివృద్ధి చేస్తున్న సూపర్ ఇంటెలిజెంట్ ఏఐలను నమ్మవచ్చని భావిస్తున్నారా?’ అన్నది నా రెండవ ప్రశ్న. మానవ పోటీదారులను నమ్మలేమని చెప్పిన అదే వ్యక్తులు, తాము అభివృద్ధి చేస్తున్న సూపర్ ఇంటెలిజెంట్ ఏఐలను నమ్మగలమని చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని గమనించారా? మానవులతో వ్యవహరించడంలో మనకు వేలాది ఏళ్ళ అనుభవం ఉంది. మానవ సైకాలజీ, బయాలజీల పట్ల విస్తృతమైన అవగాహన ఉంది. అధికారం కోసం మానవులు ఎంతగా అర్రులు చాస్తారో తెలుసు. అధికారం కోసం చేసే ప్రయత్నాన్ని అదుపాజ్ఞలలో పెట్టగల శక్తుల గురించీ మనకు తెలుసు. మనుషుల మధ్య నమ్మకాన్ని పాదుకొల్పే మార్గాలను కనుగొనడంలో కూడా మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. లక్ష సంవత్సరాల క్రితం, కొద్దిపాటి డజన్ల సంఖ్యలో మనుషులు సమూహాలుగా జీవించేవారు. వేరొక సమూహంలోని వ్యక్తిని నమ్మేవారు కాదు. నేడు 140 కోట్ల జనాభా కలిగిన చైనా వంటి దేశాలున్నాయి. భూగ్రహం మీది 800 కోట్ల మందిని అనుసంధానించే సహకార వ్యవస్థలున్నాయి. మన ప్రాణాలను నిలబెడుతున్న ఆహారం మనకు ఏమాత్రం పరిచయం లేనివారు పండిస్తున్నది. మనల్ని కాపాడుతున్న ఔషధాలను ఎవరో కనుగొన్నారు. అంతమాత్రాన మానవులందరి మధ్య నమ్మకం వెల్లివిరుస్తోందని కాదు. కానీ, మనం ఎదుర్కొంటున్న సవాల్ పట్ల మనకు ఒక అవగాహన ఉంది. మానవులతో పోలిస్తే ఏఐల పట్ల మనకున్న అనుభవం దాదాపుగా శూన్యం. మనం ఇప్పుడిప్పుడే మొదటి ప్రోటోటైపులను సృష్టించాం. ఆదిమ ఏఐలు కూడా అబద్ధం చెప్పగలవనీ, వాటిని సృష్టించిన మానవులే ఊహించని లక్ష్యాలను, వ్యూహాలను అనుసరించగలవనీ మనకు ఇప్పటికే అనుభవానికి వచ్చింది. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లు కోట్లాది మానవులతో వ్యవహరించడం ప్రారంభిస్తే ఏం కానుందో మనకు తెలియదు. ఇక, వాటితో అవి ఇంటరాక్ట్ అవడం మొదలెడితే ఏం జరుగుతుందో ఊహించడం ఇంకా కష్టం. ప్రస్తుతానికి, ఏఐని అభివృద్ధి చేస్తున్నది మానవులే కనుక, వాటిని సురక్షితమైనవిగానే డిజైన్ చేయడానికి ప్రయత్నించవచ్చునన్నది నిజమే. కానీ, నేర్చుకోగల సామర్థ్యం, తనను తాను మార్చుకోగల శక్తి ఉన్న యంత్రం మాత్రమే ఏఐ అనిపించుకుంటుందనే సంగతిని మరచిపోవద్దు. మనుషులు మొదట తమను ఎలా డిజైన్ చేశారనే దానితో ప్రమేయం లేకుండా ఏఐ మున్ముందు విప్లవాత్మకమైన, ఊహించడానికి అలవికాని రీతిలో రూపాంతరం చెందవచ్చు. అత్యంత తెలివితేటలున్న గ్రహాంతరవాసులు అంతరిక్ష నౌకలలో భూమి వైపు వస్తున్నారనీ, అవి 2030 నాటికి ల్యాండ్ కావచ్చనీ ఎవరైనా చెప్పారనుకుందాం. వారు మనతో స్నేహపూర్వకంగా మెలగుతారనీ, క్యాన్సర్‌ను నివారించేందుకు, వాతావరణ మార్పును అరికట్టేందుకు, వర్ధిల్లగల శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో సాయపడతారనీ ఆశిస్తాం. కానీ, గ్రహాంతరవాసుల సౌహార్ద్రతతో మన భవిష్యత్తును ముడిపెట్టడం ప్రమాదకరమని చాలామంది వారి అంతరాత్మ ప్రబోధం మేరకు అర్థం చేసుకుంటారు. అదే విధంగా, మనం తయారు చేస్తున్న ఏఐ ఏజెంట్లు మనపట్ల విధేయులైన సేవకులుగా ఉంటాయనుకోవడం పెద్దయెత్తున జూదమాడటమే.3. చింపాంజీలు కాక మనుషులే ఎందుకు పాలిస్తున్నారు?ఏఐ యుగంలో మానవాళి వికసనం ఎలా? దీనికి జవాబు తేలికే. మనుషులందరూ కలసి ఏఐని నియంత్రించవచ్చు. కానీ, మనలో మనమే కొట్లాడుకుంటే, ఏఐ మనల్ని దాని చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. నిజమైన సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేసేముందు, మొదట మనుషుల మధ్య మనం నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం మనం దానికి పూర్తి విరుద్ధమైన పని చేస్తున్నాం. పటిష్టంగా ఉండటమంటే ఎవరినీ నమ్మకపోవడం, ఇతరుల నుంచి పూర్తి వేరుగా ఉండటమని చాలా దేశాలు భావిస్తున్నాయి. కానీ, ఎవరితోనూ సంబంధం లేకుండా జీవించడం అసాధ్యం. వాస్తవానికి, పూర్తిగా వేరుపడటమంటే, ప్రకృతిలో, మరణించడం కిందే లెక్క. మన శరీరాన్నే తీసుకుంటే, ప్రతి నిమిషం, మనం గాలిని పీలుస్తూంటాం, వదులుతూంటాం. గాలిని లోపలికి పీలుస్తున్నామంటే బయటదానిని మనం నమ్ముతున్నట్లే లెక్క. గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకుని తిరిగి విశ్వంలోకి విడిచిపెడుతున్నాం. ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే జీవన గతికి ఆధారం. బయట ఉన్నవాటి అన్నింటిపైన అపనమ్మకం పెంచుకుని ఊపిరి పీల్చడం ఆపేస్తే చనిపోతాం. దేశాల విషయంలో కూడా అదే సత్యం వర్తిస్తుంది.ఉదాహరణకు చైనా వేలాది ఏళ్ళుగా ఇతర దేశాలకు దాని విజ్ఞానాన్ని పంచడం కొనసాగిస్తోంది. కన్ఫ్యూషియస్, మావో ఆలోచనల నుంచి గో, టీ, మందుగుండు సామగ్రి, ప్రింటింగ్ వరకు ఎన్నింటినో ఇచ్చింది. అలాగే, బుద్ధుడు, కారల్ మార్క్స్ నుంచి కాఫీ, ఫుట్‌బాల్, రైళ్ళు, కంప్యూటర్ల వరకు అది ఇతర దేశాల నుంచి చాలా తీసుకుంది. ఏ దేశానికి చెందిన ప్రజలైనా వారి దేశపు ఆహారానికి, క్రీడలకు, భావజాలానికి మాత్రమే పరిమితమైతే బతకడం అసాధ్యం కాకపోయినా, నిస్సారంగా మాత్రం ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒక వర్గానికి చెందినవాడు కావచ్చుగానీ, మొత్తం మానవాళిలో భాగమే. ఏఐ యుగంలో, మనం పంచుకున్న మానవ వారసత్వాలను మరచిపోతే, నియంత్రించలేని ఏఐకి సులభంగా లక్ష్యంగా మారతాం. గతంలో చోటుచేసుకున్న యుద్ధాలు, అన్యాయాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదివినవారు గతానుభవాలను తలచుకుంటూ, భవిష్యత్తులో ఎదురుకాగల కష్టాల గురించి భయపడుతూంటారు. ఇతర దేశాలను, ప్రజలను వారు ఆ రకమైన ఆందోళనతోనే చూస్తూంటారు. భయం, బాధ అస్తిత్వానికి ముఖ్యమైనవే. ఒక్కోసారి అవి మనల్ని ప్రమాదాల నుంచి కాపాడతాయి కూడా. కానీ, ఎవ్వరూ భయం, బాధను ఆధారం చేసుకుని బతకలేరు. ఆ రెండింటికన్నా నమ్మకం చాలా ముఖ్యమని చరిత్ర మనకు బోధిస్తోంది. ఈ భూగోళాన్ని చింపాంజీలు, ఏనుగులు కాక, మానవులే ఎందుకు పాలించారో తెలుసునా? వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉండబట్టి కాదు. అపరిచితుల పట్ల కూడా నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చో, పెద్ద సంఖ్యలోని జన సమూహాలతో సహకారాన్ని ఎలా ఇచ్చి పుచ్చుకోవచ్చో మనుషులకు తెలుసు కాబట్టి. ఈ సామర్థ్యాన్ని మనం వేలాది ఏళ్ళుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చాం. గతంలో కన్నా దానికి ఇప్పుడు అధిక ప్రాధాన్యం ఉంది. ఏఐ యుగంలో మనం బతికి బట్టకట్టడానికి, వికసించడానికి, ఏఐ కన్నా ఎక్కువగా తోటి మనుషులను నమ్మవలసి ఉంది. థాంక్యూ!యువల్ నోవా హరారీ -
కృత్రిమ మేధకు కేరాఫ్ అడ్రస్‌గా... ఏఐ సిటీ రాబోతోంది!
అడిగిన సమాచారాన్ని క్షణాల్లో కళ్లముందు ఆవిష్కరించే కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కల కాదు... వాస్తవం! ఐటీలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ దాన్ని సైతం సొంతం చేసుకునేందుకు, ఆ రంగంలో మనవాళ్లను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక విద్యనుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన పెంచి ప్రపంచ ఏఐ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక సిలబస్ రూపొందించే కార్యక్రమం మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చడీ, చప్పుడూ లేకుండా మన సమస్త జీవన రంగాల్లోకీ ఇప్పటికే ప్రవేశించింది. అనేక రంగాల రూపురేఖల్ని సంపూర్ణంగా మారుస్తోంది. పారిశ్రామిక రంగంలో దాని పురోగమనం కని విని ఎరుగని రీతిలో ఉంది. ఏఐ అసాధారణ వృద్ధి... ఉపాధికి సైతం పెను సవాలు విసురుతోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఏఐకి తగినట్టుగా ఎదగటం తప్పనిసరి.సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇకపై తెలివికీ, ఏఐ ఆధారిత పరిష్కారాలకూ రూపశిల్పులు కావాలి. కోడ్ ఉత్పాదన, డీబగ్గింగ్, ఆప్టిమైజేషన్లు ఇప్పుడు కీలకం. ఏఐకి తగిన సూచనలు అందజేయగల సమర్థమంతమైన ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సంప్రదాయ ప్రోగ్రామింగ్ లంత ప్రాధాన్యం కలిగినదిగా గుర్తించాలి. యాక్సిడెంటల్ కాంప్లెక్సిటీ (బాయిలర్ ప్లేట్ కోడ్, రొటీన్ టాస్క్స్)ని ఏఐ సునాయాసంగా ఛేదించగలుగుతోంది గనుక ఇంజినీర్లు ఉన్నత స్థాయి పరిష్కారాలిచ్చే ‘అసెన్షియల్ కాంప్లెక్సిటీ’పై దృష్టి పెట్టాలి. ఇవన్నీ సంక్లిష్టలతో కూడిన డిజైన్, ఎథికల్ ఏఐ అమలు, చిక్కుముడులతో ఉండే ఆర్కిటెక్చర్ వగైరాలను నిశితంగా పరిశీలించే నైపుణ్యంగల ఇంజినీర్ల అవసరాన్ని పెంచుతాయి. ఏఐ ఎథిక్స్ నిపుణులు, డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ సమన్వయంలో నిపుణులు, ఏఐ ఆడిటర్లు వంటి ఉద్యోగాలకు మంచి డిమాండు ఉండబోతోంది. కృత్రిమ మేథ డేటాను విశ్లేషిస్తుంది. కానీ దానికి సందర్భశుద్ధి ఉండదు. ఆరోగ్యం, ఆర్థికం, వ్యవసాయం వంటి భిన్న రంగాల అవసరాలనూ, అందులోని సమస్యలనూ అవగాహన చేసుకున్న ఇంజినీర్లు ఏఐను సమర్థమంతంగా, జాగ్రత్తగా వినియోగించటంలో ఉపయోగపడతారు. విమర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, భాగస్వామ్యం, కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి మనుషులకు మాత్రమే సాధ్యమైన లక్షణాలు. డెలాయిట్ నివేదిక ప్రకారం 90 శాతం యాజమాన్యాలు ఉద్యోగుల నుంచి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆశిస్తున్నాయి.ఇదీ చదవండి: పోషకాల రాగి : మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంజీసీసీలకు హైదరాబాద్ అడ్డాబహుళజాతి సంస్థలు భిన్న ప్రాంతాల్లో తమ వ్యూహాత్మక, సాంకేతిక, నిర్వహణ అవసరాల నిమిత్తం నెలకొల్పే ప్రపంచ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) హైదరాబాద్ అడ్డా అయింది. ఇక్కడ 355 జీసీసీలు ఉండగా, వీటిల్లో 3 లక్షలమంది నిపుణులు పనిచేస్తున్నారు. దేశంలోని జీసీసీల్లో ఇది 21 శాతం. ఎలీ లిలీ, మారియెట్ ఇంటర్నేషనల్, ఎవర్‌నార్త్, వ్యాన్ గార్డ్ వంటి ప్రపంచ సంస్థలు తమ జీసీసీలకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. వీటిల్లో అమెరికాలోనే పెద్దదయిన వ్యాన్‌గార్డ్ ఏఐ/ఎంఎల్‌పై ఫోకస్‌తో 2,300 మందిని రిక్రూట్ చేసుకోబోతోంది. అంటే హైదరాబాద్ గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందన్న మాట. ఈ జీసీసీ అడ్డా గ్లోబల్ వేల్యూ సెంటర్ల (జీవీసీ) ప్రధాన కేంద్రంగా మారటం ఎంతో దూరంలో లేదు. ఐపీ క్రియేషన్, హై వాల్యూ ప్రొడక్షన్, వీటికి తోడ్పడే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికత... జీవీసీలకు దారితీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందు తరాలను ఏఐ విప్లవంలో భాగం చేయడం కోసం తన విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయదల్చుకుంది. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ మౌలిక సూత్రాలను పరిచయం చేయాలని సంకల్పించింది. ఒకటి, రెండు తరగతుల్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పించటం, నాలుగు అయిదు తరగతుల గణితంలో ఏఐ ఫండమెంటల్స్‌ను ప్రవేశపెట్టడం దీని ధ్యేయం. ఇందుకు సంబంధించిన పైలెట్ ప్రోగ్రాం కోసం 20 జిల్లాల్లోని వంద ప్రాథమిక పాఠశాలల్ని ఎంచుకోవడం జరిగింది. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్ ఏఐ/ఏఎక్స్ఎల్) ప్రోగ్రాం 27 జిల్లాల్లోని 513 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విస్తరిస్తోంది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ గణిత శాస్త్రంలో ప్రత్యేకించి ఏఐ అంతర్భాగం కాబోతోంది. 5,560 మంది టీచర్లు ఏఐపై శిక్షణ పొందుతున్నారు. ఏఐని 2025–26 విద్యాసంవత్సరంలో అంతర్భాగం చేయటానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇప్పుడున్న సిలబస్‌లో 20 శాతాన్ని పునస్సమీక్షించటానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్ వంటివి ఈ కోర్సుల్లో అధ్యయనాంశాలు కాబోతున్నాయి. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏఐ/ఎంఎల్ ప్రోగ్రాంలలో కోర్సులు అందజేస్తోంది. ఏఐ సిటీ రాబోతోంది!విశాలమైన 200 ఎకరాల్లో ఏఐ సిటీ రూపుదిద్దుకుంటోంది. ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఈ సిటీలో భాగమవుతుంది. ఇందులో 25,000 జీపీయూలు (వీటిపై మొన్న ఏప్రిల్‌లో ఎంవోయూలు అయ్యాయి) ఉండబోతున్నాయి. పర్యవసానంగా దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు హైదరాబాద్ కేంద్రం కాబోతోంది.దుద్దిళ్ల శ్రీధర్బాబువ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి -
సాంకేతిక మార్గదర్శకులు!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్‌ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఆస్టరాయిడ్ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం కితాబిచ్చింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్ కంపెనీ ఈక్వల్ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..అగ్నికుల్ కాస్మోస్: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్‌ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్ లాంచ్‌ప్యాడ్‌ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్‌ప్యాడ్ ఉండేది. అగ్నిబాణ్‌ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ‘అగ్నిలెట్’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది.సైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేసైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ): టరీ): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.డెజీ: స్మైల్స్.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్‌లో 2018లో స్థాపించారు.ఈక్వల్: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్‌తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పూర్తి అయ్యే ఈ–పంప్స్ (చార్జింగ్ స్టేషన్) తయారు చేస్తోంది.ఫ్రేట్ టైగర్: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవలు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్‌తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ వేదికను రూపొందించింది.గెలాక్స్ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్. ఐదుగురు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్ ఇమేజింగ్ శాటిలైట్‌ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.సోలార్‌స్క్వేర్: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్ సేవలను అందిస్తోంది.ది ఈ–ప్లేన్ కో: ఐఐటీ మద్రాస్‌లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్ ట్యాక్సీని తొలుత మానవ పైలట్‌తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. పైలట్ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్‌కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్‌ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్‌ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్‌లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్‌లాంటి స్టార్టప్‌లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్‌ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్‌ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్‌లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్‌లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్‌పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్‌ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్‌పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్‌ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్‌మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్‌లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
ఒక్కమాటే..మంత్రము
మనం ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్ చేయాలన్నా.. బైక్/కారు బుక్ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా చెప్తే చాలు.. పని జరిగిపోతుంది. దేశంలోని అన్ని భాషలనూ అర్థం చేసుకుని, ఆయా భాషల్లో సేవలు అందించే ‘వాయిస్ ఏఐ’ రోజులు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ‘ఇండియా ఏఐ మిషన్’ జోరందుకుంది. రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికీ ‘వాయిస్ ఏఐ’ అనే కృత్రిమ మేధ మనకోసం ‘కార్యేషు కమాండర్’లా సిద్ధం కాబోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో ప్రస్తుతం ఉన్న 90 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో.. ఇంగ్లీష్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. డిజిటల్ అక్షరాస్యత ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లోని వారు వాయిస్ కమ్యూనికేషన్ ద్వారా తమ పనులు చక్కబెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా టెక్స్›్టను టైప్ చేయటానికి ఇష్టపడని, లేదా టైప్ చేయటం రాని వారి కోసం ఒక సరళమైన, స్పష్టమైన ‘వాయిస్ ఇంటరాక్షన్’ విధానాన్ని వృద్ధి చేసేందుకు భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ కంపెనీలు కృషి చేస్తున్నాయి.చెబితే చాలు... చేసి పెడుతుంది!రైతులు, గ్రామీణ వ్యాపారులు, గిగ్ వర్కర్లు, గృహిణులు సహా ఆన్లైన్ వినియోగదారులందరూ ఈ వాయిస్ ఎఐతో ఇంటర్నెట్ వాడకం స్వరూపాన్నే మార్చేయబోతున్నారని భారతీయ వాయిస్ ఏఐ స్టార్టప్ కంపెనీలు చెబుతున్నాయి. రైతులు ఇప్పటికే తమ ఫోన్లో ఒక్క మాట కూడా చదవకుండానే, ఒక్క బటన్ కూడా నొక్కకుండానే పంటల బీమా, క్రెడిట్ అర్హత, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే వ్యవసాయ విధానాల సమాచారం తెలుసుకుంటున్నారు. జ్ఞాని.ఏఐ ప్రయోగాత్మకంగా ఇటీవలే దేశంలోని 120 గ్రామాలలో 15 వేల కంటే ఎక్కువ మంది రైతులకు ఈ విధానంలో సమాచారాన్ని అందించింది. ఒక బాట్ (సాఫ్ట్వేర్ అప్లికేషన్) ద్వారా వారికి 3 నిమిషాల వాయిస్ కాల్ వచ్చింది. ఇది వాళ్ల స్థానిక భాష, యాసలోనే వాళ్లకు కావాల్సిన సూచనలూ, సలహాలూ అందించడం విశేషం.నాలుగు కంపెనీల ఎంపిక‘ఇండియా ఏఐ మిషన్’ కింద భారత ప్రభుత్వం రూ.10,372 కోట్ల పంచ వర్ష బడ్జెట్ కేటాయింపులతో ‘సర్వమ్’, సోకెట్ ల్యాబ్స్, జ్ఞాని.ఏఐ, గాన్.ఏఐ అనే నాలుగు స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసింది. ప్రాథమిక వాయిస్ ఏఐ మోడళ్లను, అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) తయారుచేసే బృహత్తర బాధ్యతలను వీరికి అప్పగించింది. ‘సర్వమ్’ ఏఐ.. 10 భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వ్యవస్థను రూపొందించింది. ఇది గణితం, కోడింగ్, బహుభాషా అవగాహన వంటి అనేక ప్రక్రియలను సులభంగా చేయగలదు. జ్ఞాని.ఏఐ 12 భారతీయ భాషలు సహా మొత్తం 40 ప్రపంచ భాషలను గుర్తించి సేవలు అందిస్తుంది. సోకెట్ ల్యాబ్స్ భారతీయ భాషలకు అనుగుణంగా ‘ప్రజ్ఞ–1బి’ అనే ప్రాథమికమైన ఏఐ మోడల్ని (ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ మాదిరిగా) రూపొందించింది. గాన్.ఏఐ అనేది ఇన్స్టంట్ ఏఐ వీడియోలు తయారుచేస్తుంది.‘భారత్‌లోనే తయారవ్వాలి – భారతదేశ అభివృద్ధికే పనిచేయాలి.. ఇదే ఇండియా ఏఐ మిషన్ ప్రధాన ఉద్దేశం’ అని కంపెనీల ఎంపిక సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ‘స్వదేశీ వాయిస్’ సవాళ్లు!భారతీయ స్టార్టప్‌లు నేటికీ పాశ్చాత్య డేటాసెట్లపై శిక్షణ పొందిన ఓపెన్ ఏఐ, డీప్గ్రామ్ వంటి నమూనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి భారతీయ భాషలు, అందులోని యాసలు, పేర్లు లేదా స్థానిక సూక్ష్మాంశాలను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, అందుకు అవసరమైన సాంకేతికను సాధించేందుకే కేంద్రం ‘ఇండియా ఏఐ మిషన్’కు శ్రీకారం చుట్టింది.భవిష్యత్తంతా మాటలదే..!గూగుల్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ వాడేవారిలో 60 శాతం భారతీయులు వాయిస్ అసిస్టెంట్ల ద్వారా సంభాషిస్తున్నారు. ‘వాట్ కన్సల్ట్’ నివేదిక ప్రకారం నెట్ సేవల్ని పొందే భారతీయుల్లో 76 శాతం మందికి స్పీచ్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీపై అవగాహన ఉంది. దీన్ని బట్టి, మాతృభాషలో స్మార్ట్‌ఫోన్‌తో మాట కలిపి దైనందిన పనుల్ని చక్కబెట్టుకునే అలవాటు దేశ ప్రజల్లో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భాష లేదా ఇతర భాషలలో ఉండే ఆప్షన్లను ఫోన్లో చేతి వేళ్లతో నొక్కటం ద్వారా ముందుకు సాగే ‘గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్’ (జి.యు.ఐ.) విధానానికి ఉన్న పరిమితులకు పరిష్కారంగా వచ్చిన ఈ ‘వాయిస్ ఏఐ’దే భవిష్యత్తంతా అని నిపుణులు అంటున్నారు.2022లో మొత్తం ఏఐ స్టార్టప్‌లలో 702 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే.. అందులో సుమారు 437 మిలియన్ డాలర్లు సంభాషణాపరమైన / వాయిస్ ఏఐ స్టార్టప్‌లలో పెట్టారు.ఎవరెవరు ఏమేం చేస్తారంటే..కొత్తగా తయారుచేయబోయే ఈ ఏఐ మోడళ్ల స్థాయిని వాటిలో ఉండే పారా మీటర్ల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్ని ఎక్కువ పారామీటర్లు ఉంటే అంత శక్తిమంతమైన మోడల్ అన్నమాట. సర్వమ్ ఏఐ రూపొందించిన సర్వమ్: ఎమ్, 2,400 కోట్ల పారామీటర్లు ఉండే మోడల్. ఇది భారతీయ భాషలన్నింటిలోనూ శిక్షణ పొందింది. స్టార్టప్‌లకు చేయూత నివ్వడం, సీసీటీవీ కెమెరాల్లాంటి భారతదేశంలో తయారయ్యే ఏఐ హార్డ్‌వేర్ వంటి వాటిని ప్రోత్సహించడం వంటి అదనపు బాధ్యతలు దీనికి అప్పగించింది ప్రభుత్వం. సోకెట్ ఏఐ: ఇది భారత దేశ మొట్ట మొదటి ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్‌ను తయారుచేస్తుంది. 12,000 కోట్ల పారామీటర్లతో అనేక భారతీయ భాషల్లో పనిచేసే దీన్ని ఆరోగ్య సంర క్షణ, విద్య, రక్షణ రంగాల్లో వాడతారు. జ్ఞాన్ ఏఐ: 1,400 కోట్ల పారామీటర్లతో రూపొందించే ఈ వాయిస్ మోడల్ వివిధ భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. రియల్ టైమ్‌లో కూడాస్పందించగలదు. కేవలం మాటలతోనే స్మార్ట్‌ఫోన్‌లో పనులు చేయాలనుకునేవారి కోసం స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్లు, టూల్స్‌ను ఇది తయారుచేస్తుంది. -
డిజిటల్ ఎకానమీలో భారత్ పవర్‌హౌస్!
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీ వృద్ధి పరుగులు తీస్తుండటంతో భారత్ తిరుగులేని శక్తి (పవర్‌హౌస్)గా ఆవిర్భవించిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో సుస్థిర ప్రగతికి భద్రత, విశ్వసనీయత అత్యంత కీలకమని, వీటిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా హెడ్‌గా ఇటీవలే ఎంపికైన ప్రీతి.. ఏఐ రంగంలో భారత్ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో గూగుల్ భద్రతా చార్టర్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.ఆన్లైన్ మోసాలు, స్కామ్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడం.. ప్రభుత్వం, కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి వంటి అంశాల్లో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ చార్టర్ ఒక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రీతి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ విషయానికొస్తే మరింత మెరుగైన, వృద్ధిదాయకమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు గూగుల్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాగా, గుత్తాధిపత్యానికి సంబంధించి భారత్‌లో గూగుల్‌పై కేసుల గురించి మాట్లాడుతూ.. గూగుల్ ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిరంతరం కలిసి పనిచేస్తామని ఆమె తేల్చిచెప్పారు.కొత్త టెక్నాలజీతో సవాళ్లు...ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీస్తున్నాయని.. అయితే, వాటివల్ల డీప్‌ఫేక్స్ వంటి సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రీతి అంగీకరించారు. ‘అందుకే మా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే ఏ కంటెంట్‌లో అయినా వాటర్‌మార్క్‌లు ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల యూజర్లు ఈ కంటెంట్‌లో దేనినైనా అప్లోడ్ చేస్తే, వాటిలోని ‘సింథ్ఐడీ’ని ఆయా షేరింగ్ టూల్స్ గుర్తించగలుగుతాయి’ అని వివరించారు. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని, డీప్‌ఫేక్స్ సవాళ్లను ఎదుర్కోవాలంటే పరిశ్రమవ్యాప్తంగా సహకారం అవసరమన్నారు. గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ ఈ కీలక అంశంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు.యూపీఐ.. అద్భుతంభారత్లో డిజిటల్ ఆర్థిక స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తమకు తిరుగులేదని నిరూపించిందన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) శరవేగంగా విస్తరించడం దీనికి మచ్చుతునక. గూగుల్ పే వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు అంచనాలను మించి విజయం సాధించాయి. కొన్నేళ్ల క్రితం యూపీఐ ప్రజల దైనందిన జీవితాల్లో ఇలా చొచ్చుకుపోతుందని ఎవరైనా ఊహించారా. ఇప్పుడు దేశంలో ఇదో అద్భుతమైన డిజిటల్ విప్లవంగా మారింది. వందల కోట్ల లావాదేవీలతో యూపీఐ ప్రజల వినియోగం, కొనుగోళ్ల తీరునే సమూలంగా మార్చేసింది’ అని ప్రీతి పేర్కొన్నారు. భారత్ కీలక మార్కెట్...గూగుల్‌కు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా కొనసాగుతోందని.. సమీప భవిష్యత్తులోనే ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరే దిశగా దేశ డిజిటల్ ఎకానమీ పరుగులు తీస్తోందని ప్రీతి పేర్కొన్నారు. అడ్వర్టయిజింగ్, క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ రంగాల్లో గూగుల్‌కు ఉన్న పట్టు, నైపుణ్యాలను భారత్ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు.దేశ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా డిజిటల్ రంగంలో గూగుల్ ఇతోధికంగా సహకారం అందిస్తున్న ‘ఈ కీలకమైన, ఉత్తేజకరమైన తరుణం’లో కంపెనీ ఇండియా హెడ్‌గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా ఉత్సాహాన్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గూగుల్ ప్రపంచవ్యాప్త వ్యూహంలో భారత్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుందనడానికి యూట్యూబ్ షార్ట్స్, జీపే తొలుత ఇక్కడే ప్రారంభించడం నిదర్శనమని కూడా గుర్తుచేశారు. -
ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్‌ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తోంది. భారత్‌లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్‌కు సరిపడా శక్తి ఉంది. భారత్‌లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు. -
ఏఐ చిప్ మార్కెట్ జోరు..
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) కృత్రిమ మేథ (ఏఐ) ప్రాసెసర్ మార్కెట్ 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) సీఈవో ’లీసా సూ’ తెలిపారు. 2023లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఏటా 60 శాతం మేర వృద్ధి చెందుతోందని వివరించారు. అడ్వాన్సింగ్ ఏఐ 2025 కాన్ఫరెన్స్‌లో ’ఎంఐ350 సిరీస్’ జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా లీసా ఈ విషయాలు వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన చిప్‌లు నలభై శాతం అధిక సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొన్నారు. డెవలపర్ కమ్యూనిటీ కొత్త ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు డెవలపర్ క్లౌడ్ యాక్సెస్ ప్రోగ్రాంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ’హీలియోస్ ఏఐ ర్యాక్ స్కేల్’ సొల్యూషన్ని కూడా ఏఎండీ ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించే 10 అతి పెద్ద కంపెనీల్లో ఏడు సంస్థలు తమ ఏఎండీ ఇన్స్టింక్ట్ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తున్నాయని, ఈ లిస్టులో భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఉందని లీసా చెప్పారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర దిగ్గజాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. -
ఏఐ మార్కెట్ @ 17 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ 2027 కల్లా ప్రస్తుత స్థాయి నుంచి మూడు రెట్లు వృద్ధి చెందనుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీల్లో ఒకటిగా భారత్‌ను నిలబెడుతూ 17 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతుండటం, డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, నిపుణులైన ప్రొఫెషనల్స్ లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్‌లో 16 శాతం మంది భారత్‌లో ఉన్నారు. దేశీ ఏఐ వ్యవస్థలో 6,00,000 మంది పైగా ఏఐ ప్రొఫెషనల్స్, 70 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. గత మూడేళ్లలో 2,000 పైగా ఏఐ స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయి. డిజిటల్ ఇన్ఫ్రా దన్ను.. ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశీయంగా వివిధ రంగాలను ఏఐతో అనుసంధానించేందుకు సహాయకరంగా ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్లు, విస్తృతంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా భారత్‌లో భారీ స్థాయిలో డేటా జనరేట్ కావడం ఏఐ మోడల్స్ శిక్షణకు ఉపయోగకరంగా ఉంటోంది. ఇక ప్రస్తుతమున్న 152 డేటా సెంటర్ల నెట్‌వర్క్‌కు అదనంగా 2025లో భారత్‌లో కొత్తగా 45 సెంటర్లు రానున్నాయి. రూ. 10,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన ఇండియాఏఐ మిషన్ జాతీయ స్థాయిలో ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. దీనితో ఏఐ మోడల్ శిక్షణ, పరిశోధన కోసం 10,000 పైగా జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) అందుబాటులోకి వస్తాయి. ‘ఏఐ అనేది వ్యాపార సంస్థలకు ఒక ఆప్షన్‌గా కాకుండా అవసరంగా మారింది. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా కూడా మరింత ధీమాగా పోటీపడగలుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం మాత్రమే కాకుండా మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం, అంతర్గత వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవడం వంటి అంశాలే అగ్రగామి కంపెనీలకు మిగతా సంస్థలకు మధ్య వ్యత్యాసాన్ని నిర్దేశిస్తాయని బీసీజీ ఇండియా ఎండీ మన్దీప్ కోహ్లి తెలిపారు. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్‌గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
ఎంట్రీ లెవల్‌కూ ఏఐ సవాల్!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొత్తంగా ఎంట్రీ లెవెల్ (తొలి స్థాయి)ఉద్యోగార్థులు, గ్రాడ్యుయేట్లకు డిమాండ్ భారీ ఎత్తున తగ్గిపోతోంది. రాను రాను మొదటి ఉద్యోగం దొరకడం అనేది కష్టంగా, సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఇప్పటికే వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), తాజా గ్రాడ్యుయేట్లు తమ తొట్టతొలి కొలువు దక్కించుకోవడాన్ని కూడా కష్టసాధ్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలకు అవసరమైన డాక్యుమెంట్ల విశ్లేషణ, సమావేశాలకు అవసరమైన బ్రీఫింగ్ నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ) రూపకల్పన, కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు లేదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వంటి పనులను ఏఐ సులువుగా చక్కబెట్టేస్తుండటమే ఇందుకు కారణం. ఏఐతో నెట్టుకొచ్చేస్తున్న కంపెనీలు.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత తమ కెరీర్ మొదట్లో ఎక్కువగా ఈ తరహా పనులే చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది. కంపెనీలు కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ వైపు మొగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సైతం తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్’ఉన్నతోద్యోగి ఒకరు.. ‘రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ అనేది అన్ని వైట్ కాలర్ జాబ్ (కార్యాలయాల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగం)ల్లో సగానికి సగం ఎంట్రీ లెవల్ జాబ్‌లను తుడిచి పెట్టేస్తుంది..’అంటూ ఇటీవల చేసిన ప్రకటనను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితికి తగ్గట్టుగానే కొన్ని కంపెనీలు ‘చాట్ జీపీటీ’ని ఇంటర్న్‌షిప్ చేసే జూనియర్ లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగిగా ఉపయోగించుకోవడాన్ని ఆచరణలో పెట్టేయడం గమనార్హం. కాగా వివిధ రంగాలకు సంబంధించిన ఎంట్రీ లెవల్ జాబ్లకు డిమాండ్ తగ్గుదలను తాము గమనించామని లండన్‌లోని రిక్రూట్మెంట్ సంస్థ ‘ఫ్రెష్ మైండ్స్’ప్రతినిధులు ఇటీవల వెల్లడించడాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. తమ సంస్థల్లో చేరబోయే ఉద్యోగులు ‘వర్క్ రెడీ ప్రొఫెషనల్స్’గా ఉండాలని ఆయా సంస్థలు కోరుకుంటున్నాయని వారు తెలిపారు. కొన్ని కంపెనీలు జూనియర్ పోస్టులను సైతం సీనియర్ ఉద్యోగులతో భర్తీ చేస్తున్న ఉదంతాలను వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ తన ‘స్టేట్ ఆఫ్ టాలెంట్ 2025’నివేదికలో ప్రస్తావించింది.సంసిద్ధులుకావాల్సిందే..: నిపుణులుప్రస్తుత పరిస్థితులన్నీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు మొదటి ఉద్యోగం సాధించడాన్ని సమస్యాత్మకంగా మారుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ యువత సాంకేతికంగా ఒక అడుగు ముందుకేసి తమకు సవాళ్లు విసురుతున్న వ్యవస్థలను అధిగమించేందుకు సంసిద్ధులై ఉండాలని సూచిస్తున్నారు. కృత్రిమ మేధనే ఓ ఆయుధంగా మలుచుకోవాలని చెబుతున్నారు. చాట్ జీపీటీ, గ్రోక్, తదితరాలను ఉపయోగిస్తూ తమపై పడే పనిభారాన్ని తగ్గించుకోవడంతో పాటు విధుల నిర్వహణలో వేగంగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు. సిద్ధమే అంటున్న యువత.. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ ఒకరు.. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 70 మంది ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ విద్యార్థులను ఏఐతో, ఎంట్రీ లెవల్ జాబ్స్ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ప్రశ్నించారు. ఏఐ వల్ల వారికి రావాల్సిన ఉద్యోగాల్లో భారీగా కోతగా ఏర్పడబోతోందా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అని అడిగారు. పలువురు విద్యార్థులు స్పందిస్తూ.. ఏఐ వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించడం లేదని చెప్పారు. తాము ఏఐనే ఓ సాధనంగా ఉపయోగించుకుని పని ప్రదేశాల్లో రాణించేందుకు సిద్ధమంటూ సమాధానమిచ్చారు. ఏఐ టూల్స్ వినియోగంలో తాము పైచేయి సాధించినందున తమకు పెద్దగా సమస్య ఎదురుకాబోదని అన్నారు. తమలో అత్యధికులు ఒక్క చాట్ జీపీటీనే కాకుండా... జెమిని, క్లాడ్, ఫైర్‌ఫ్లై, హేజెన్, గామా, హిగ్స్‌ఫీల్డ్, యుడియో, నోట్‌బుక్ ఎల్ఎం, మిడ్ జర్నీ వంటి వివిధ రకాల టూల్స్‌ను ఉపయోగిస్తున్నామంటూ ప్రశ్న అడిగిన ప్రొఫెసరే ఆశ్చర్యపోయేలా సమాధానమివ్వడం..ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా యువతలో వస్తున్న మార్పునకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.యువతను ప్రోత్సహిస్తే కంపెనీలకే మేలు కంపెనీలు కూడా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఎంట్రీ లెవల్ జాబ్‌లను ఏఐకు అప్పగించకుండా యువతకున్న టాలెంట్‌ను ఉపయోగించుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేసే పనికి సృజనాత్మకతను జోడించి కొత్త ఆవిష్కరణలు చేసేలా యువతను ప్రోత్సహించడం వల్ల కంపెనీలకే మేలు జరుగుతుందని చెబుతున్నారు. కేవలం ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితమవుతూ ఎక్కువ ఉత్పాదకత సాధనపై దృష్టి పెట్టకుండా వ్యూహాత్మకంగా, క్రియాశీలంగా పని చేసే వర్క్‌ఫోర్స్‌ను పెంపొందించుకుంటే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. -
IPL 2025 Final: అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు 'ఆ జట్టే' ఛాంపియన్ అని అంటున్నాయి..!
ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ ఇవాళ (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రదర్శనల ప్రకారం ఈ సీజన్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలానా జట్టు గెలుస్తుందని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌లు జరగగా.. ఆర్సీబీ 2, పంజాబ్ ఓ మ్యాచ్‌లో గెలిచాయి. దీని ఆధారంగా ఆర్సీబీకే స్వల్ప ఎడ్జ్ ఉందని చెప్పవచ్చు.మానవమాత్రుల అంచనాలను పక్కన పెడితే.. కృత్రిమ మేధ (Artificial Intelligence, AI) ఏం చెబుతుందో చూద్దాం. ప్రచుర్యంలో ఉన్న టాప్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఐపీఎల్ 2025 విజేత ఎవరని అడగగా.. దాదాపు అన్ని ఏఐ ప్లాట్‌ఫామ్‌లు (గ్రోక్, జెమిని, ఛాట్‌జీపీటీ) ముక్తకంఠంతో ఆర్సీబీని విజేతగా తేల్చాయి.X GROK: అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ పంజాబ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ను 101 పరుగులకే ఆలౌట్ చేసి, 60 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. జోష్ హాజిల్‌వుడ్ (11 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు), సుయాష్ శర్మ నేతృత్వంలోని RCB బౌలింగ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ (55.81 సగటుతో 614 పరుగులు), ఫిల్ సాల్ట్ విస్ఫోటకమైన ఫామ్‌లో ఉన్నారు.అహ్మదాబాద్‌లో RCB యొక్క చారిత్రక ప్రదర్శన (మొదట బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు గెలిచింది) మరియు ఒత్తిడిలో సామర్థ్యం వారికే స్వల్ప ఎడ్జ్‌ను ఇస్తాయి. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి నిపుణులు కూడా RCBకి మద్దతు ఇచ్చారు. వార్నర్ హాజిల్‌వుడ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంచనా వేశారు.అయితే, క్వాలిఫయర్ 2లో పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తమను తక్కువ అంచనా వేయొద్దని అలర్ట్ చేస్తుంది. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో పంజాబ్‌ను గెలిపించాడు. కైల్ జేమిసన్, యుజ్వేంద్ర చహల్ వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. అయితే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో పతనం ఒత్తిడిలో పంజాబ్ బలహీనతను సూచిస్తుంది.ప్రస్తుత ఫామ్, సమతుల్య జట్టు, ఈ సీజన్లో వారి జోరును పరిగణనలోకి తీసుకుంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2025 ఫైనల్‌ను గెలుస్తుందని అంచనా. ఆర్సీబీ బ్యాటింగ్ లోతు మరియు పెద్ద మ్యాచ్‌లలో అనుభవం వారిని ఛాంపియన్లుగా చేస్తాయి. -
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్‌క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్‌ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. -
గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ట్రెండ్స్ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన ఈ నివేదికలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్.. నెదర్లాండ్స్ .. దక్షిణ కొరియా.. భారత్ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి. అమెరికా టాప్.. అత్యంత విలువైన 30 గ్లోబల్ టెక్ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్‌కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది. -
గూగుల్ సంచలన యాప్.. ఇంటర్నెట్ లేకుండా ఏఐ..
విస్తృతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్‌ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్‌ను మొబైల్స్‌లో ఆఫ్‌లైన్‌లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్‌లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్‌ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్‌ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.ప్రస్తుతానికి ఈ యాప్‌ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్‌గా ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. -
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బీమాలో ఏఐకి విశ్వసనీయత సవాళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించడం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ బీమా పరిశ్రమలో మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించడంపై సమస్యలు ఎదురవుతున్నాయి. విశ్వసనీయత, డేటా నిర్వహణ దీనికి ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయి. కేపీఎంజీ ఇంటర్నేషనల్ రూపొందించిన ‘స్మార్ట్ ఇన్సూరెన్స్’ పరిశోధన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఏఐని పూర్తిగా విశ్వసించడంపై సందేహాలు నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 46 శాతం సంస్థలు తెలిపాయి. కేవలం 25 శాతం సంస్థలు మాత్రమే దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాయి. ఇక ఏఐ వినియోగాన్ని పెంచుకోవడంలో డేటా నిర్వహణ మరో కీలక సవాలుగా ఉంటోందని 72 శాతం ఇన్సూరెన్స్ సంస్థలు వెల్లడించాయి. మరోవైపు, ఏఐపై తొందరపడి ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో ఆ పెట్టుబడులు వృధా అవుతాయేమో అనే సందేహాలు ఉన్నట్లు మూడొంతుల మంది ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఓవైపు కార్పొరేట్లు పర్యావరణహితమైన విధానాలతో కార్యకలాపాలు నిర్వహించుకోవడంపై దృష్టి పెడుతుండగా మరోవైపు ఏఐ కోసం భారీ ఎత్తున విద్యుత్ కూడా ఉపయోగించాల్సి వస్తుండటం సైతం కృత్రిమ మేథ విస్తృతికి ప్రతిబంధకంగా ఉంటోంది. తమ సస్టైనబిలిటీ లక్ష్యాలు, ఏఐ విద్యుత్ వినియోగానికి మధ్య సమతౌల్యం పాటించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు 72 శాతం మంది ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ఏఐ ఉపయోగపడుతోందని, తమ ప్రోడక్టులు, సరీ్వసులకు కృత్రిమ మేథ కీలకంగా ఉంటోందని 57 శాతం మంది పేర్కొన్నారు.ఏం చేయాలంటే..ఈ నేపథ్యంలో ఏఐని తమ ప్రస్తుత వ్యవస్థలకు అనుసంధానించడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోగలిగే సంస్కృతిని పెంపొందించుకోవడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్ (ఇన్సూరెన్స్) ఫ్రాంక్ ఫాఫెన్జెలర్ తెలిపారు. ప్రస్తుతం బీమా పరిశ్రమ ఇన్సూర్టెక్, కృత్రిమ మేథ, డిజిటైజేషన్ మొదలైన వాటన్నింటినీ సమన్వయపర్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉందని కేపీఎంజీ భారత విభాగం హెడ్ (ఇన్సూరెన్స్) కైలాస్ మిట్టల్ తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు తగ్గట్లుగా ఏఐని వినియోగించుకోవడంపై కంపెనీలు వ్యూహాత్మకమైన మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అకౌంటింగ్ ప్రమాణాలను నిర్వచించేందుకు, రిసు్కలను ఎదుర్కొనేందుకు, గోప్యతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బీమా సంస్థలు పటిష్టమైన ఏఐ వ్యవస్థలను రూపొందించుకోవాలని పేర్కొంది. అలాగే, ముప్పులను నివారించేందుకు, అవాంఛనీయ ధోరణులను గుర్తించే క్రమంలో ఏఐ మోడల్స్‌ను నిరంతరం ఆడిట్ చేసేందుకు అధునాతన భద్రతా చర్యలు, సాధనాలను ఉపయోగించాలని సూచించింది.


