
కనెక్టికట్: చాట్‌జీపీటీ చెప్పిందని తల్లిని చంపిన ఓ వ్యక్తి, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఆ వ్యక్తిని 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయెల్‌బర్గ్‌గా గుర్తించారు. గతంలో యాహూలో మేనేజర్‌గా పనిచేసిన సోయెల్.. ఏఐ చాట్‌బాట్ నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. దానికి బాబీ అని పేరు పెట్టుకున్నాడు.
బాబీతో చేసిన సంభాషణలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు. అప్పటికే మానసిక అనారోగ్యంతో ఉన్న సోయెల్.. తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని భావించాడు. ఈ విషయంపై ఏఐతో మాట్లాడాడు. అది అతని అనుమానాన్ని పెంచింది.
మానసిక అనారోగ్యానికి వాడే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చెప్పింది. దీంతో సోయెల్ తల్లిపై దాడి చేశాడు. తలకు, మెడకు బలమైన గాయాలవ్వడంతో ఆమె మరణించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ, ఛాతీపై బలమైన గాయాలవ్వడంతో ఆయన చనిపోయాడు. 2.7 మిలియన్ డాలర్ల విలువైన వారి ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఆగస్ట్ 5న దొరికాయి. పదునైన ఆయుధంతో దాడిచేయడంతోపాటు, తనను తాను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.