'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..! | Rashmika Mandanna warning about Mis Use of AI Technology | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక వార్నింగ్..!

Dec 3 2025 3:53 PM | Updated on Dec 3 2025 4:04 PM

Rashmika Mandanna warning about Mis Use of AI Technology

టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.

సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ‍అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.

రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే కాన్వాస్‌. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా..  గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement