తనూజ బర్త్‌డే.. బంగారు కానుకిచ్చిన మాధురి | Divvala Madhuri Gift Gold Earrings to Bigg Boss Thanuja Puttaswamy | Sakshi
Sakshi News home page

స్వర్గం నుంచి వచ్చిన స్వీట్‌ హార్ట్‌.. తనూజకు మాధురి సర్‌ప్రైజ్‌

Mar 5 2026 1:24 PM | Updated on Mar 5 2026 1:30 PM

Divvala Madhuri Gift Gold Earrings to Bigg Boss Thanuja Puttaswamy

ముద్దమందారం సీరియల్‌తో తెలుగువారికి దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఇటీవల తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఎంతోమంది స్నేహితులను సైతం సంపాదించుకుంది. వారిలో దివ్వెల మాధురి ఒకరు. బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మొదట తనూజపై విరుచుకుపడింది.

బిగ్‌బాస్‌ షోలో క్లోజ్‌
కట్‌ చేస్తే వారం తిరగకముందే అందరికంటే ఎక్కువ తనూజతో క్లోజ్‌ అయిపోయింది. మాధురి కటౌట్‌ చూసి భయపడ్డ తనూజ ఆమెను ముద్దుగా మ్యాడీ అని పిలుస్తూ ప్రేమగా పెత్తనం కూడా చెలాయించింది. అప్పటినుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక నేడు (మార్చి 5న) తనూజ 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే ఇది! 

మై స్వీట్‌ హార్ట్‌ 
దీంతో దివ్వెల మాధురి తనకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తనతో కేక్‌ కట్‌ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. హ్యాపీ బర్త్‌డే బంగారా.. మై స్వీట్‌ హార్ట్‌ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు తనూజ థాంక్యూ మ్యాడీ అని కామెంట్‌ పెట్టింది.

 

 

చదవండి: గర్భధారణలో కష్టాలు.. తనే నా మిరాకిల్‌ బేబీ: ప్రియాంక చోప్రా

Advertisement
 
Advertisement
Advertisement