దేవిశ్రీ ప్రసాద్‌కి అవమానం.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌! | Devi Sri Prasad Fans Fires On Mythri Movie Makers And Ustad Bhagat Singh Director Harish Shankar | Sakshi
Sakshi News home page

‘ఉస్తాద్‌..’ వివాదం.. ఫైర్‌ అవుతున్న డీఎస్పీ ఫ్యాన్స్‌!

Mar 5 2026 12:02 PM | Updated on Mar 5 2026 12:19 PM

Devi Sri Prasad Fans Fires On Mythri Movie Makers And Ustad Bhagat Singh Director Harish Shankar

సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ టాలెంట్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్‌ లవర్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్‌ సాంగ్‌ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్‌ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్‌ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్‌శంకర్‌పై డీఎస్పీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.

డీఎస్పీ అవుట్‌..తమన్‌ ఇన్‌
పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌. మార్చి 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్‌ అయ్యాయి. బ్యాగ్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్‌లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్‌ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.

రెండోసారి..
మైత్రీ మూవీ మేకర్స్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మధ్య గ్యాప్‌ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్‌కి 20 రోజుల ముందు బీజీఎం తమన్‌ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్‌ ఇచ్చారు. 

వర్క్‌ నచ్చలేదా?
ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని  డీఎస్పీ ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. వర్క్‌ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement