సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో, అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ వీడింది.
అలాగే, తమిళనాడు నుంచి క్రిస్టోఫర్ తిలక్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ, హర్యానా నుంచి కరమ్ వీర్ సింగ్, చత్తీస్‌గఢ్ నుంచి ఫులోదేవి నేతంను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఉదయం జాబితాను విడుదల చేసింది. కాగా, నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. బీఆర్‌ఎస్ నుంచి నామినేషన్ వేయకుంటే.. ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
Congress releases a list of candidates for the Rajya Sabha Biennial elections.
Abhishek Manu Singhvi and Vem Narender Reddy from Telangana.
Phulo Devi Netam from Chhattisgarh.
Karamvir Singh Boudh from Haryana.
Anurag Sharma from Himachal Pradesh.
M. Christopher Tilak from Tamil… pic.twitter.com/o2JwrC5Ax2— ANI (@ANI) March 5, 2026


