శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్‌గా పనికి వచ్చేయాలి.. | No Matter What Happens At Home, I Have To Show Up' | Sakshi
Sakshi News home page

శాంతిలాంటి వాళ్లు ఎందరో..! ఏం జరిగినా..టెన్షన్‌గా పనికి వచ్చేయాలి..

Mar 4 2026 5:36 PM | Updated on Mar 4 2026 5:51 PM

No Matter What Happens At Home, I Have To Show Up'

మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..

ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్‌గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్‌ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. 

కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి. 

అతని చికిత్స సెషన్‌కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్‌ఫీజ్‌, ఆహారానికి, ట్రీట్‌మెంట్‌ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్‌లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. 

ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్‌ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. 

ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. 

(చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement