సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా! | Sangeet: Little girl dance with her nana and dada has 82 lakhs people smiling | Sakshi
Sakshi News home page

సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా!

Mar 4 2026 2:37 PM | Updated on Mar 4 2026 5:39 PM

Sangeet: Little girl dance with her nana and dada has 82 lakhs people smiling

‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక.  సంగీత్‌,  మెహిందీ అంటూ సాగే  ప్రీ వెడ్డింగ్‌ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి  హృదయాన్ని ఆకట్టుకునే  దృశ్యం  ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.

సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది.  ఇంతలో  చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

హైలైట్  ఏంటంటే  పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్‌కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఏకంగా  82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.


నెటిజన్ల సంబరం
ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.

(విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌)

 "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్‌కు వీరు స్టెప్పులేశారు.

ఇదీ చదవండి: వెజ్‌ బిర్యానీ షాప్‌ ఫ్రీజర్‌లో డెడ్‌బాడీ, షాకైన ఓనర్‌

 

Advertisement
 
Advertisement
Advertisement