నటిపై అసభ్య పోస్టులు పెట్టిన నటుడి అరెస్టు | Actor Arrested for Posting Obscene Comments on Actress Through Fake Social Media Account | Sakshi
Sakshi News home page

నటిపై అసభ్య పోస్టులు పెట్టిన నటుడి అరెస్టు

Mar 4 2026 7:31 AM | Updated on Mar 4 2026 12:21 PM

Actor Arrested for Posting Obscene Comments on Actress Through Fake Social Media Account

హైదరాబాద్‌:  సోషల్‌ మీడియాలో బోగస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్‌ పెట్టిన నటుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వరంగల్‌కు చెందిన సినీ నటుడు రుషిత్‌(26) రీల్‌ మాయ–1 పేరుతో మూడు వారాల క్రితం ఓ బోగస్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లలో ఓ నటి మీద అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడు.

 సదరు నటికి ఓ దర్శకుడితో లింక్‌ ఉందంటూ ఫేక్‌ ప్రచారం చేశాడు. దీంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు రుషిత్‌ బోగస్‌ అకౌంట్లపై లోతుగా దర్యాప్తు చేశారు. సదరు సోషల్‌ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసి ఆరా తీయగా నిందితుడి గుట్టు బయటపడింది. అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సినిమాల్లో వేషాలు వేసుకుంటూ కాలం గడుపుతున్న రుషిత్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement