భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్‌ | Rich Dad Poor Dad Robert Kiyosaki Says Gold Surges, Silver Blast Off | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్‌

Mar 2 2026 2:40 PM | Updated on Mar 2 2026 4:51 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Says Gold Surges, Silver Blast Off

ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్‌కాయిన్‌ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.

బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు,  డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.

వెండి, బిట్‌కాయిన్‌పై..
కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్‌కాయిన్‌ను డిజిటల్ గోల్డ్‌గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement