breaking news
Rich Dad Poor Dad
-
సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant. Two most valuable assets we control….our time and our money.Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025 -
‘గుడ్ న్యూస్.. పెద్ద క్రాష్ రాబోతోంది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ద్వారా ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి ఏదో క్రాష్ రాబోతోందని హెచ్చరించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ సహా అసెట్ క్లాసుల్లో బుడగలు పేలబోతున్నాయంటూ ఈ 78 ఏళ్ల ఇన్వెస్టర్, ఎంట్రాప్రెన్యూర్ సంకేతాలిచ్చారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో రాబర్ట్ కియోసాకి ఒక పోస్ట్ చేశారు. "బుడగలు పేలడం ప్రారంభించాయి.. బుడగలు పేలినప్పుడు బంగారం, వెండి, బిట్ కాయిన్ కూడా పతనమవుతాయి. గుడ్ న్యూస్’ అంటూ రాసుకొచ్చారు.క్రాష్ అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ రానున్న పతనాన్ని కొనుగోలు అవకాశంగా కియోసాకి పేర్కొన్నారు. ధరలు పడిపోతే తాను బంగారం, వెండి, బిట్ కాయిన్లలో ఎక్కువ పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం ధరలు తక్కువగా ఉన్నప్పుడు, భయం ఎక్కువగా ఉన్నప్పుడు అని ఆయన వివరించారు.BUBBLES are about to start BUSTING.When bubbles bust odds are gold, silver, and Bitcoin will bust too.Good news.If prices of gold, silver, and Bitcoin crash…. I will be buying.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) July 21, 2025 -
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
బ్యాంకులో డబ్బు ఉంటే పెద్దగా సంపద సృష్టి జరగదు. పైగా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి దాని విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం రూ.100కు కొనుగోలు చేసే వస్తువులను 10 ఏళ్ల తర్వాత కొనాలంటే అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సూత్రాన్ని తెలుపుతూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కొన్ని విషయాలను తన ఎక్స్‌లో పంచుకున్నారు. కొన్ని విలువైన ఆర్థిక అంశాలను కొందరు చాలా శ్రద్ధతో విని పాటిస్తారని, ఇంకొందరు చాలా తేలికగా తీసుకుంటారని చెప్పారు.‘పందులకు పాడటం నేర్పకండి.. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది. దాంతోపాటు మీ వల్ల పందికి కూడా చికాకు కలుగుతుంది. నేను ఒక స్నేహితురాలితో మాట్లాడుతుంటే పొదువు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆమె, తన భర్త స్థానిక బ్యాంకులో డాలర్ల రూపంలో పొదుపు చేశామని చెప్పారు. అందుకు ఆమె చాలా గర్వపడింది. తన పొదుపు విలువ రానున్న రోజుల్లో తగ్గుతుందని ఎంతో హెచ్చరించాను. ఆమె తీరు పాడటం నేర్చుకోవడానికి ఇష్టపడని పందిలా మారింది. ఈ సంఘటన 1973లో హవాయిలో జరిగింది’ అన్నారు.“DONT TEACH PIGS TO SING…. it wastes your time and you annoy the pig.”I was talking to a friend….about my age….and she was so proud that she and her husband are holding their financial future in dollars, in their local bank. When I attempted to caution her about the…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 4, 2025ఇదీ చదవండి: ధూళి రాకుండా ‘గాలి మేడ’‘అప్పటి నుంచి ఇప్పటివరకు డాలర్ విలువ 95 శాతం కోల్పోయింది. నేను గతంలో చేసిన హెచ్చరికలో భాగంగా ఆహారం ధర పెరుగుతుండడం గమనించారా అని ఆమెను అడిగాను. అప్పుడైనా అందులో దాగిఉన్న ద్రవ్యోల్బణ అంశాన్ని ఆమె గ్రహించలేకపోయింది. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నేను ఆశించను. మీరు అనుసరిస్తున్న తీరును నేను అభినందిస్తాను. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న నా స్నేహితుల గురించి నాకు దిగులు లేదు. డబ్బును దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్యాంకు ఖాతాల్లో సేవ్ చేసేవారు లూజర్స్‌తో సమానం. ఈ విషయాలు నా పుస్తకంలోనూ రాశాను’ అని తెలిపారు. -
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025 -
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్‌తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025 -
బంగారం కంటే వెండి ముద్దు
విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచనలు చేశారు.ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్‌కాయిన్ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్‌కాయిన్ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు.FYI: Silver is the best investment today….june 2025. Gold and Bitcoin are high and I am waiting for gold and Bitcoin to crash before I add to my position.That’s what I think.Do your own research.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు. -
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలు
ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుందని చెబుతూ.. పెట్టుబడిదారులు ఏం చేయాలో సూచించారు. అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ ఫియట్ కరెన్సీ(కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే విలువ)లపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిట్‌కాయిన్(బీటీసీ)ను కొనుగోలు చేయాలని చెప్పారు.GLOBAL MONETARY COLLAPSE COMING?Will you be richer or poorer when biggest debt bubble in history bursts.I recommend owning gold, silver, and BITCOIN if you want to be richer when the Global Debt Bubble bursts.BIGGEST LOSERS will be savers of fake fiat money and especially…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..ముందస్తు హెచ్చరికరాబర్ట్ కియోసాకి చాలాకాలంగా ఫియట్ ద్రవ్య వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నియంత్రణలేని ద్రవ్య ముద్రణ కారణంగా అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతాయని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ (బీటీసీ) వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఫియట్ కరెన్సీలు పతనమవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు. ఈ సంప్రదాయ మార్గాలపై ఆధారపడే వారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. -
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్‌టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది! ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు. -
రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
రిచ్‌డాడ్ పూర్‌డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రతిఒక్కరి భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు చేయాలో తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. దాంతో ఈ పోస్ట్ కాస్తా వివిధ సోషల్‌మీడియా ప్లాట్ఫామ్ల్లో వైరల్‌గా మారింది.ఎక్స్ వేదిక రాబర్ట్ కియోసాకి తెలిపిన పోస్ట్‌లో..‘మీ భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించబడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. దయచేసి దాన్ని వృథా చేయకండి. ఈ రోజు నేను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్నాను. దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి కొత్త పుస్తకంపై పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేస్తున్నారు..? దయచేసి మీ ఈ రోజును గొప్ప రోజుగా మలుచుకోండి. జాగ్రత్త’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపుYOUR FUTURE is decided TODAY!!!Saying it another way:“TODAY is the most IMPORTANT DAY of YOUR LIFE. Please do not waste it.”TODAY I am buying more BITCOIN and working on a new book on ENTREPRENEURSHIP.What are you doing today….for your future?You are important. Your…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 11, 2025 -
వెండిపై ‘రిచ్‌డాడ్ పూర్ డాడ్’ రాబర్ట్ కియోసాకి సంచలనం
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా తారా స్థాయికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 13 ఏళ్ల తర్వాత వెండి ధర ఔన్స్‌కు కొత్త గరిష్టం 35 డాలర్లు దాటింది. 2012 ఫిబ్రవరి తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. శుక్రవారం (జూన్ 6) 36 డాలర్లకు పైగా ట్రేడ్ అయిన వెండి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రిచ్‌డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై సంచలన అంచనాను వెల్లడించారు.వెండి ధర అకస్మాత్తుగా పెరగడానికి కారణమేమిటో ప్రస్తుతానికి తెలియలేదు. కానీ చాలా మంది మార్కెట్ విశ్లేషకులు, పరిశ్రమ నిపుణులు ఇది పూర్తిగా 'నిష్పత్తి ట్రేడింగ్' అని పిలుస్తున్నారు. అంటే బంగారం-వెండి నిష్పత్తి 100కు దిగువకు రావడమే వెండి ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.బంగారం-వెండి నిష్పత్తి అంటే.. ఒక ఔన్స్ బంగారంతో ఎన్ని ఔన్సుల వెండి కొనొచ్చే తెలిపే ఆర్థిక ప్రమాణాన్ని బంగారం-వెండి నిష్పత్తిగా పేర్కొంటారు. దీని దీర్ఘకాల సగటు 70 కాగా జనవరి నుంచి 100 వద్ద ఉంటూ వస్తోంది. నేడు (జూన్ 6న) బంగారం-వెండి నిష్పత్తి 93.33 వద్ద చలించింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 3,360 డాలర్లు, వెండి ధర 36 డాలర్లుగా ఉంది. బంగారం-వెండి నిష్పత్తిలో ఈ భారీ పతనమే ఇప్పుడు వెండి ధరలను ప్రేరేపించిందని తెలుస్తోంది.రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే.. తన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా ప్రసిద్ధి చెందిన రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి వెండి, బంగారంపై పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ మధ్య బిట్ కాయిన్లపై ఇన్వెస్ట్ చేయడాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర ఔన్స్‌కు 35 డాలర్లను తాకిన తరుణంలో రాబర్ట్ కియోసాకి ఓ సంచలన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "వెండి ఈ రోజు ఉత్తమ బేరం అని నేను నమ్ముతున్నాను. సిల్వర్ ఈ ఏడాది డబుల్ అంటే 70 డాలర్లు కావొచ్చని భావిస్తున్నాను'' అని ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.ఒక్క రోజే రూ.4వేలు పెరిగిన వెండిదేశంలో వెండి ధరలు అమాంతం ఎగిశాయి. శుక్రవారం (జూన్ 6) ఒక్కరోజే వెండి ధర కేజీకి రూ. 4వేలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కేజీ వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. మరోవైపు హైదరాబాద్ ప్రాంతంలో కేజీ వెండి రూ.4వేలు ఎగిసి రూ.1,17,000లను తాకింది. -
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా బిట్‌కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేస్తుందో వివరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్‌కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేసిందో నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా సులభం. అయితే ప్రతి ఒక్కరూ ఎందుకు బిట్‌కాయిన్ కొనుగోలుచేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరో రెండేళ్లలో 0.01 బిట్‌కాయిన్ కూడా చాలా అమూల్యమైందిగా మారుతుందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.బిట్‌కాయిన్ విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులుగా మారడానికి, ఆర్థికంగా స్వేచ్ఛను పొందటానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోండి.. అని కియోసాకి అన్నారు. బిట్‌కాయిన్ విలువ మాదిరిగానే.. బంగారం విలువ కూడా భారీగా పెరుగుతుందని చాలా రోజుల నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు.ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకిబిట్కాయిన్ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 0.57 శాతం పెరిగి రూ.93.38 లక్షలకు చేరింది. పెరుగుతోంది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని విలువ మరింత పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు.I cannot believe how easy Bitcoin has made getting rich…so easy.Why everyone is not buying and holding Bitcoin is beyond me.Even .01 of a Bitcoin is going to be priceless in two years…. and maybe make you very rich.Sure Bitcoin goes up and down….but so does real life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 26, 2025 -
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరగబోతోంది, ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, బంగారం రూ.21 లక్షలకు చేరుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా చాలా మంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.రాబర్ట్ కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను ''గ్రేషమ్స్ లా, మెట్కాల్ఫ్ లా'' గురించి వివరిస్తూ.. ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు. 'డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు' అని పేర్కొన్నారు.గ్రేషమ్స్ లా ప్రకారం.. 'చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు.. మంచి డబ్బు దాగిపోతుంది'. ఎలా అంటే యూఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోయే అవకాశం ఉంది. నిజమైన డబ్బును ఆదా చేయాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.మెట్కాల్ఫ్ లా అనేది.. నెట్వర్క్స్. దీనికి ఉదాహరణగా ''మెక్‌డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ నెట్వర్క్. మామ్ పాప్ బర్గర్స్ అనేది కాదు. ఫెడెక్స్ ఒక నెట్వర్క్. జో వన్-ట్రక్ డెలివరీ అనేది కాదు'' అని కియోసాకి వివరిస్తూ.. నేను బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అది ఒక నెట్వర్క్.. అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు. మీరు ధనవంతులు కావాలనుకుంటే.. చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..''వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి, ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు'' అనే మైఖేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. నేను యూఎస్ డాలర్లను ఆదా చేయను, ఎందుకంటే పొదుపు అనేది గ్రేషమ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే నేను నెట్‌వర్క్‌లు లేని చెత్త నాణేలలో పెట్టుబడి పెట్టను, ఎందుకంటే అవి మెట్కాల్ఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. అందుకే నేను బంగారం, వెండి, బిట్కాయిన్ల మీదనే పెట్టుబడి పెడతాను. అయితే ఈ చట్టాలని పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారు.ARE YOU BREAKING the LAWS?Most poor people are poor…. because they break the 2 most important laws of money.LAW #1: GRESHAM’s LAW: “When bad money enters a system….good money goes into hiding”In Rich Dad Poor Dad….I stated….“ Savers are losers.” In 2025 poor people…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2025 -
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం రాబోతోందని చెప్పిన.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్లో గోల్డ్ రేటు గణనీయంగా పెరుగుతుంది స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీవినీ ఎరుగని రీతిలో గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందని తెలుస్తోంది. ఆర్ధిక నిపుణులు కూడా పసిడి ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు''ఇక్కడ ముగింపు ఉంది. లక్షలాది మంది యువకులు, వృద్ధులు ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోతారు. బంగారం 25,000 డాలర్లకు చేరుతుంది. వెండి 70 డాలర్లకు చేరుతుంది. బిట్‌కాయిన్ 500000 డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ది బిగ్ ప్రింట్ పుస్తకాన్ని చదవండి. నేను ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న ముగింపు ఇక్కడ ఉందిని.. దేవుడు మన ఆత్మలపై దయ చూపాలి'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.THE END is HERE: WHAT if you threw a party and no one showed up?That is what happened yesterday. The Fed held an auction for US Bonds and no one showed up.So the Fed quietly bought $50 billion of its own fake money with fake money.The party is over. Hyperinflation is…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 21, 2025 -
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్కాయిన్లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025 -
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025 -
భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..
ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్ చేశారు.‘మార్కెట్ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్ క్రాష్ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్డాడ్స్ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్‌కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.Germany, Japan, and America have been the engines up to now. Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.I wrote about this crash in my book RICH DAD’s…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టంనాస్డాక్ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది. -
చరిత్రలోనే అతిపెద్ద స్టాక్‌మార్కెట్ క్రాష్ రాబోతోందా?
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్‌కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.2025 ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్‌లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.ఇది మంచి వార్తే..కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్‌కాయిన్‌లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్‌కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్‌లు, బాండ్లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్‌కాయిన్‌లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్‌కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.Better news billions will leave the stock and bond markets and…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025