బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే.. | Robert Kiyosaki Reveals His Best Investment Strategy | Sakshi
Sakshi News home page

బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..

Jun 2 2026 8:01 PM | Updated on Jun 2 2026 8:45 PM

Robert Kiyosaki Reveals His Best Investment Strategy

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది? అనే విషయాన్ని వెల్లడించారు. తనను ప్రతిరోజూ ఒక ప్రశ్న అడుగుతున్నారని, దానికి సమాధానం చాలా సులభమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

నేను ప్రభుత్వం ముద్రించే డబ్బులో పెట్టుబడి పెట్టను. నేను స్టాక్స్,బాండ్స్, ఈటీఎఫ్స్ కొనను. నా పెట్టుబడులు మొత్తం వ్యాపారాలు, బంగారు గనులు, చమురు బావులు, పశువులపైన ఉంటాయి. నా పశువులు కూడా డబ్బు సంపాదించి పెడతాయి. అవి పిల్లలను కన్న ప్రతిసారీ, నాకు రాబడి పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు.

 
 

ధనవంతులు ఎప్పుడూ కూడా నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. అంటే వారు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టతారన్నమాట. ప్రభుత్వం కేవలం డబ్బును ముద్రించగలదు. కానీ.. గోల్డ్, ఆయిల్, పశువులు వంటివాటిని ముద్రించలేదు. కాబట్టి ఇవే నిజమైన విలువైన ఆస్తులు. కాబట్టి డబ్బును నిజమైన ఆస్తుల్లో పెడుతున్నారా, లేదా ప్రతిరోజూ కొత్తగా ముద్రితమవుతున్న డాలర్లను ధనంగా పరిగణించే సిస్టమ్‌పై నమ్మకం పెడుతున్నారా? అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కియోసాకి వెల్లడించారు.

గోల్డ్, చమురు, పశువులపై పెట్టుబడి పెట్టడానికి డబ్బులేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో ప్రారభించడం మంచిది. ఉద్యోగం కాదు.. అదనపు ఆదాయం కోసం పనిచేయడం కూడా కాదు. మీరు విశ్రాంతి తీసుకున్నపుడు కూడా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని రిచ్ డాడ్ చెబుతారు.

ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement