breaking news
Tamil Nadu
-
బస్సు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!
సాక్షి, తమిళనాడు: ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు సెల్ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడడంపై నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రయాణికులు బ్లూటూత్, ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా తమిళనాడు రవాణా శాఖ కొత్త నిబంధనలను, ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయమై రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి నిర్మల్‌రాజ్, చైన్నె మహానగర రవాణా సంస్థ, ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ, అన్ని రీజినల్ ప్రభుత్వ రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. -
విజయ్ సర్కార్ ఆంక్షలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాలకు సరఫరా బంద్!
తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగానికి కీలకమైన రఫ్ స్టోన్, ఎం-శాండ్, మెటల్ జెల్లీ వంటి నిర్మాణ సామగ్రిని పొరుగు రాష్ట్రాలకు తరలించడంపై తమిళనాడు ప్రభుత్వం మూడు నెలలు తాత్కాలిక నిషేధం విధించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తమిళనాడు నిర్ణయం దక్షిణ రాష్ట్రాల మధ్య మౌలిక వసతుల అభివృద్ధి, వనరుల వినియోగం, ప్రాంతీయ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.అయితే, ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, రహదారులు, గృహ నిర్మాణాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల కారణంగా తమిళనాడులో నిర్మాణ సామగ్రికి డిమాండ్ భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పనిచేస్తున్న క్వారీల నుంచి లభిస్తున్న రాళ్లు, నిర్మాణ అగ్రిగేట్లు స్థానిక అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయని పేర్కొంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో సరఫరా తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.ఈ నిషేధం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వెళ్లే నిర్మాణ సామగ్రిపై వర్తించనుంది. అయితే.. పుదుచ్చేరి, కారైకాల్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే అక్రమ మైనింగ్, ఖనిజ రవాణా చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ముఖ్యంగా కేరళలో నాణ్యమైన రాయి అగ్రిగేట్‌ల లభ్యత పరిమితంగా ఉండటంతో తమిళనాడులోని తిరునెల్వేలి, తెంకాసి, కన్యాకుమారి ప్రాంతాల నుంచి వచ్చే నిర్మాణ సామగ్రిపై అనేక ప్రాజెక్టులు ఆధారపడుతున్నాయి. జాతీయ రహదారులు, విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పనులకు సరఫరా అంతరాయం కలగవచ్చని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరింది.ఎందుకు ఈ నిర్ణయం?కాగా, తమిళనాడులో ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కొత్త రహదారులు, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం రాళ్లు, ఇసుక, ఇతర అగ్రిగేట్‌ల అవసరం పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నిర్మాణ సామగ్రిలో కొంత భాగం పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో స్థానిక మార్కెట్లో సరఫరా తగ్గుతోందని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ధరలు పెరిగి నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయని వాదిస్తోంది.తమిళనాడు నిర్ణయం సహజ వనరుల నిర్వహణ, రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముందుకు తెస్తోంది. ఒక రాష్ట్రంలోని ఖనిజ వనరులు మరో రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రాంతీయ అభివృద్ధి అవసరాల మధ్య సమతుల్యతపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ అంశం కేవలం నిర్మాణ సామగ్రి రవాణా సమస్యగానే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మధ్య వనరుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి సమన్వయానికి సంబంధించిన అంశంగా మారింది. మూడు నెలల నిషేధ కాలంలో నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా పరిస్థితులు, ప్రాజెక్టులపై ప్రభావాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిషేధాన్ని కొనసాగించాలా, సడలింపులు ఇవ్వాలా అన్నదానిపై నిర్ణయం తీసుకోవచ్చు. -
గుండు కొట్టించుకుంటే 15 వేలు..!
తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు. ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు. తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలుఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులుతమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ… pic.twitter.com/zcggDhinxs— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026 -
డిప్యూటీ సీఎంగా సౌమ్య అన్బుమణి?
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమని , ఎమ్మెల్యే సౌమ్య మంత్రి కానున్నారన్న చర్చ ఊపందుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలోకి నలుగురు ఎమ్మెల్యేల్ని కలిగిన పీఎంకే చేరబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. టీవీకేతో ఇటీవల కాలంలో పీఎంకే సన్నిహితంగా ఉంటూ వస్తోంది. తాజాగా పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు, అధికారాలు అన్బుమణికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అప్పగించేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు పీఎంకే సిద్ధమవుతున్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో సౌమ్య అన్బుమనికి మంత్రి పదవి అప్పగించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం విజయ్ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు ఇప్పటికే చర్చజోరుగా సాగుతుండటం గమనార్హం. -
కోల్‌కత్తాలో కొత్తగా..
తమిళసినిమా: కోలీవుడ్‌లో ఏస్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే వచ్చే సమాధానం దర్శకుడు మణిరత్నం అనే. సాధారణంగా ఒక్కో దర్శకుడికి ఒక్కో ముద్ర ఉంటుంది. అయితే ఏ తరహా కలనైనా తనదైనశైలిలో తెరపై ఆవిష్కరించి విజయం సాధించగల సత్తా కలిగిన దర్శకుడు మణిరత్నం. ఈయన రోజూ, బొంబాయి వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాన్ని హృద్యంగా తెరకెక్కించగలరు, దళపతి,నాయకన్ వంటి యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ కథా చిత్రాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనూ గలరు. అదే విధంగా ఓ కణ్మణి వంటి రోమాంటిక్ కథా చిత్రాలతో కురక్రారును అలరించగలరు. పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక కథా చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగని మణిరత్నం చేసిన చిత్రాలు అన్నీ హిట్ అని చెప్పట్లేదు. ఇటీవల ఆయన చేసిన థగ్ లైఫ్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ యూత్ ఫుల్ లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు పొందడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఆయన విజయ్ సేతుపతి నటి, సాయి పల్లవి ని ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్నారు. ఈ చిత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇటీవల కోల్‌కత్తాలో షూటింగ్ ను ప్రారంభించుకుని అక్కడ ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జి దాని పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్. అక్కడ ఓ బ్యూటీఫుల్ పాటను చిత్రీకరిస్తున్నారు తెలిసింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించిన ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్,లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతిని, సాయి పల్లవిని మణిరత్నం పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా మీసం, గడ్డాలతో ముదురుగా కనిపించే విజయ్ సేతుపతిని యంగ్‌గా చూపించే ప్రయత్నం చేస్తు న్నారు. ఇది యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రంగా ఉంటోందని పిస్తోంది. -
బాధిత బాలలకు న్యాయం పొందే అవకాశం బలోపేతం
కొరుక్కుపేట: ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ), మద్రాస్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్ఎస్డబ్ల్యూ) విద్యార్థి అభివద్ధి మండ లి (ఎస్డీసీ) సహకారంతో విద్యార్థి అనువాదకుల కోసం ఒక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పోలీసు విచారణలు, న్యాయపరమైన విచారణలు, కౌన్సెలింగ్ సెషన్లు, వైద్య పరీక్షలు , పునరావాస ప్రక్రియల సమయంలో భాషాపరమైన అడ్డంకులను ఎదుర్కొనే పిల్లలు , కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛంద కార్యకర్తల నెట్వర్క్ అయిన స్టూడెంట్ ట్రాన్స్‌లేటర్ ఇనిషియేటివ్ ప్రారంభానికి ఈ ఓరియంటేషన్ నాంది పలికింది. -
ఫైబర్ సిమెంట్ బోర్డుల ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన రేనాటస్ గ్రూప్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సామగ్రుల బ్రాండ్ రెనాకాన్ , రెనాటస్ ప్రొడక్ట్స్ రెనాఫ్లెక్స్ పేరిట ఫైబర్ సిమెంట్ బోర్డులను ఆవిష్కరించింది. స్థానికంగా వీటిని రేనాటస్ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ సెల్వసుందరం పరిచయం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుకూల నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ నుండి పూర్తి స్థాయి నిర్మాణ పరిష్కారాల సంస్థగా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయిగా వివరించారు. రూ.350 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లోని నాయిడుపేటలో రెనాకాన్ ప్రపంచ స్థాయి సమగ్ర తయారీ కేంద్రాన్ని నెలకొల్పినట్టు పేర్కొన్నారు. 12 నెలల రికార్డు వ్యవధిలో నిర్మించిన ఈ ప్లాంట్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యామినార్ ఫ్లో టెక్నాలజీని భారత్‌కు పరిచయం చేశామన్నారు. ఆధునిక నిర్మాణ రంగానికి అవసరమైన సునిశితమైన, అత్యుత్తమ నాణ్యత కలిగిన సుస్థిర నిర్మాణ సామగ్రిని ఇది అందిస్తుందన్నారు. విజన్ 2047, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా, వేగవంతమైన, సురక్షితమైన, పర్యావరణ అనుకూల నిర్మాణాలకు రెనాఫ్లెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. తమిళనాడులోని 3 ప్లాంట్ల ద్వారా ఏడాదికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద నిర్మించే 1 కోటి అదనపు గృహాలు, సరసమైన అద్దె గృహాల సముదాయాల నిర్మాణాలను వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ధీమావ్యక్తం చేశారు. -
స్థానిక ఆర్థిక స్థితిపై సమీక్షాకు మరింత గడువు
సాక్షి, చైన్నె: రాష్ట్ర పన్ను, పన్నుయేతర ఆదాయాన్ని పెంచడానికి, రాబడి లీకేజీలను అరికట్టి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ కె.పి. కృష్ణన్, ట్యాక్స్ పరిశీలన నిపుణుడు అరవింద్ మోదీ, మాజీ ఐఆర్ఎస్ అధికారి నజీబ్ షా, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.ఎ. సిద్ధిక్, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్ ఎం. సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ కమిటీ రాష్ట్ర ఆర్థిక స్వయం సంవృద్దిని బలోపేతం చేయడం, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు కావలసిన ఆర్థిక వనరులను సృష్టించడం, పన్ను నిబంధనలను సక్రమంగా అమలు చేయడం, ఆదాయ లీకేజీలను అరికట్టడం, పన్ను రేట్లు, రుసుములు , మినహాయింపులను క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నది. అలాగే అలాగే కొత్త , ఇప్పటివరకు ఉపయోగించని ఆదాయ వనరులను గుర్తించడం ద్వారా రాష్ట్ర పన్ను, పన్నుయేతర ఆదాయాన్ని స్థిరంగా పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించనుంది. కో– ఆర్డినేటర్‌గా రాజ గోపాల్ ఈ కమిటీ కో–ఆర్డినేటర్‌గా ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజగోపాల్ సుంకర వ్యవహరిస్తారు. అవసరమైతే టాస్మాక్ , స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, ఖనిజ వనరులు, వాణిజ్య పన్నులు , రవాణా వంటి శాఖల కోసం ప్రత్యేక ఉప–కమిటీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే, ఏ ప్రభుత్వ శాఖ లేదా అధికారుల నుండి అయినా నేరుగా పత్రాలు, డేటాను కోరే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కల్పించారు. ‘ఆదాయం’ పెంపునకు కమిటీ స్థానిక సంస్థల ఆర్థిక స్థితి సమీక్షా కమిషన్ గడువు పొడిగించేందుకు నిర్ణయించారు. 2025లో డీఎంకే ప్రభుత్వ హయంలో 7వ రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు విశ్రాంత ఐఏఎస్ అధికారి అలావుద్దీన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిషన్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల (పంచాయతీలు, పురపాలక సంఘాలు మొదలైనవి) ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, సమగ్ర నివేదికను ఆగస్టు 31 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని మొదట గడువు నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఈ నివేదిక సమర్పణ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. దీనికి సంబంధించిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల స్థితిగతులను పరిశీలించి, సమగ్ర సిఫార్సులను ప్రభుత్వానికి అందించేందుకు ఆర్థిక కమిషన్‌కు మరో 4 నెలల అదనపు సమయం లభించింది. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
– 50 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా మురుగంజేరి వద్ద రోడ్డుకు ఒడ్డును వున్న విద్యుత్‌స్తంభాన్ని లారీ ఢీకొట్టడంతో స్థంభం కూలిపోయింది. ఈ ప్రమాధంలో మూడు ద్విచక్ర వాహనాలకు పాక్షికంగా దెబ్బతినగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నష్టం కలగలేదు. అయితే స్తంఽంభం కూలిన క్రమంలో 50 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు ఇజల్లా మురుగంజేరి వద్ద తిరుపతి–చైన్నె జాతీయ రహదారి ఒడ్డున హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం ఉంది. ఈ స్తంభాన్ని చైన్నె నుంచి తిరువళ్లూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం కుప్పకూలి రోడ్డులో పడింది. అయితే స్తంభం కూలిన క్రమంలో రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం కలగలేదు. విద్యుత్ స్తంభం ద్విచక్ర వాహనంపై పడడంతో వాహనచోదరకులు భయంతో పరుగులు పెట్టారు. -
కావేరి రచ్చ!
సాక్షి, చైన్నె : తమిళనాడులో కావేరి జల వివాదం రచ్చ మళ్లీ తెరపైకి వచ్చింది. రాజ్యసభలో జల శక్తి శాఖ సహాయ మంత్రిసహాయ మంత్రి రాజ్‌భూషణ్ వ్యాఖ్యలతో తమిళనాట నేతలలో ఆగ్రహం బయలు దేరింది. కావేరి విషయంలో తమిళనాడుకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా తమిళ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంఘాలు సైతం అగ్గి మీదు బుగ్గిలా శివాలెత్తుతున్నాయి. వివరాలు.. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందే.గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏటా 177 టీఎంసీల నీటిని తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాల్సి ఉంది. గత డీఎంకే పాలనలో నైరుతీ రుతు పవనాలు సజావుగా పడటంతో కర్ణాటక నుంచి కావేరి పరవళ్లు తొక్కింది. గత నాలుగేళ్లుగా నిర్ణీత జూన్ 12వ తేదీన మేట్టూరు డ్యాం నుంచి నీటిని కురువై సాగు నిమిత్తం విడుదల చేశారు. అయితే, తమిళనాట అధికార మార్పు నేపథ్యంలో ఈ ఏడాది కురువైకు నీళ్లు కరువైంది. కర్ణాటక నుంచి వాటాగారావాల్సిన నీళ్లు ఇంత వరకు విడుదల కాలేదు. అదే సమయంలో కావేరి తీరంలోని మేఘదాతు వద్ద జలాశయం నిర్మాణానికి కర్ణాటక ప్రయత్నాలు విస్తృతం చేస్తుండటంతో తాజాగా ఆగ్రహావేశాలు బయలు దేరి ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్య సభలో కర్ణాటకకు అనుకూలంగా కేంద్ర సహాయమంత్రి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. కావేరీ నదిపై ఎలాంటి నిర్మాణం చేపట్టినా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు 2026 ఫిబ్రవరి 16నాటి తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని మంత్రి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. ఈవ్యవహారంపై సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కుట్ర.. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి స్పందిస్తూ..... 1892, 1924 నాటి ఒప్పందాల ప్రకారం దిగువన ఉన్న తమిళనాడు అనుమతి లేకుండా కర్ణాటక ఎలాంటి కొత్త డ్యామ్‌లు కట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నటుల్ తెలిపారు. జూలై 16 వరకు తమిళనాడుకు 25.31 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా, కర్ణాటక కేవలం 3.37 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందన్నారు. తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తాకట్టు పెట్టేశారు ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్పందిస్తూ.... అధికారాన్ని కాపాడుకునేందుకు సీఎం విజయ్ తమిళనాడు హక్కులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ యజమానులను ఎదిరించలేక, తన అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడ లేని పరిస్థితులలో ఉన్నారని మండి పడ్డారు. మేఘదాతు వద్ద ఆనకట్ట కట్టడానికి కర్ణాటకకు తమిళనాడు అనుమతి అవసరం లేదంటూ కేంద్ర సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం కావేరీ వ్యవహారంలో తమిళనాడు హక్కులను ప్రశ్నార్థకంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కావేరి నది ఎందుకు వెనక్కి తగ్గినట్టో..! వీది పీపుల్స్ నేత అన్నామలై సపదిస్తూ, తమిళనాడు రైతుల హక్కులను, ప్రయోజనాలను పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం తన మునుపటి స్పష్టమైన వైఖరి నుంచి ఉన్నపళంగా వెనక్కి తగ్గడం కర్ణాటక ఎన్నికల రాజకీయం కోసమేనా ..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవ్యవహారంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్‌లోనే మాట్లాడుతూ... ఈ డ్యామ్ నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేసేందుకు కర్ణాటకకు ఇచ్చిన అనుమతి కొన్ని నిబంధనలకు లోబడి ఉందని, అంతరాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం దిగువన ఉన్న రాష్ట్రాల అనుమతి లేకుండా ఎలాంటి ఆనకట్టలను నిర్మించలేరని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన విషయంలో కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా, పారదర్శకంగా, ఒకే నిలకడైన వైఖరితో వ్యవహరించాలని కోరుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. తిప్పి కొడుదాం.. ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ అంతర్జాతీయ నీటి పంపిణీ చట్టాలు , సహజ న్యాయసూత్రాల ప్రకారం దిగువ ప్రాంత రాష్ట్రమైన తమిళనాడుకు ఉన్న కావేరీ నీటి హక్కులను కేంద్ర ప్రభుత్వ అండదండలతో లాక్కోవడానికి కర్ణాటక ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. రైతు సంఘం నేత పీఆర్ పాండియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ....తమిళనాడును నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి కుట్ర తాజాగా స్పష్టమైందన్నారు. కావేరీ నదిపై ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏర్పాటై పనిచేస్తున్న కావేరీ యాజమాన్య అథారిటీని కాదని, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మేకేదాటులో అక్రమంగా డ్యామ్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. మరో రైతు మహోద్యమం తథ్యమని హెచ్చరించారు. -
త్వరలో ప్యార్.. ప్రేమ.. కల్యాణం
తమిళసినిమా: కొన్ని చిత్రాల పేర్లే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి చిత్రమే త్వరలో తెరపైకి రానుంది. దీని పేరు ప్యార్ ప్రేమ కల్యాణం. ఓడి పోయ్ కల్యాణం పండ్రదా? ఇల్లై కల్యాణం పన్నిట్టు ఓడి పోరదా? ( పారిపోయి పెళ్లి చేసుకునేదా ? లేక పెళ్లి చేసుకుని పారిపోయేదా?) అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ ద్వారా దర్శకుడు ఇళన్ కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన ఇంతకుముందు హరీష్ కళ్యాణ్ ,రైసా విల్సన్ జంటగా ప్యార్ ప్రేమ కాదల్ చిత్రంతోపాటు కవిన్ హీరోగా స్టార్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే స్టార్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఇళన్ హీరోగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ప్యార్ ప్రేమ కల్యాణం.. ఇందులో కుటుంబస్తన్ చిత్రం శాన్వి మేఘ్నా నాయకిగా నటించారు. కుటుంబ నేపథ్యంలో సాగే వినోదభరిత కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం గురించి మీడియా ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొంటూ పెళ్లి చేసుకున్న తర్వాత కథానాయకి భక్తులతో కలిసి అత్తారింటికి దారేది నిరాకరిస్తుంది అన్నారు .దీంతో కథానాయకుడు పిల్లలకు వస్తానన్నారు ఆ తర్వాత జరిగే కుటుంబ గలాటానే ఈ చిత్రం అన్నా రు. సాంప్రదాయాలు, గొడవలు, కుటుంబంలో సమస్యలు భావిద్రేకాంత పోయిన తరంగాలు నవ్వులు ఆలోచనలు కలిసిన చక్కని పయనమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. చివరిగా ఆనందంగా జీవించడానికి విధి విధానాలను ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదని చెప్పే చక్కని సందేశం తో కూడిన చిత్రం ఇది అని చెప్పారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్, యోగిబాబు, ఎమ్మెస్ భాస్క ర్, గీతా కై లాసం, ఇళంగో కుమరవేల్, సెంథిల్, మారనచ, టిప్స్ సైరస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా శ్రీనిధి సాగర్, రైజ్ ఈస్ట్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో నేరుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. -
ఆధ్యాత్మికం అంటే..?
తమిళసినిమా: సంగీత జ్ఞానిగా పేరుగాంచిన ఇళయరాజా తన సంగీతంతో అన్ని వర్గాల వారిని గత అర్ధ శతాబ్దానికి పైగా అలవిస్తూ వస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సంగీతానికి అంతమే లేదని చెప్పవచ్చు. సినిమా పాటలనే కాకుండా అనేక భక్తి రస గీతాలను తన మధురమైన సంగీత భణీలతో ఓలలాడిస్తూ వస్తున్నారు. ఇళయరాజా రాసి న, సంగీత బాణీలు కట్టి రూపొందిన పల్లి ఎళుచ్చి పావై పాడళ్ గల్ పాటల ఆల్బమ్‌ను సోమవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని మ్యూజిక్ అకాడమీ ఆవరణలో విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ తాను 1980 నుంచి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణను చేయడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. తాను గిరి ప్రదక్షిణ చేయడం వల్లే ఆ తర్వాత పలువురు గిరి ప్రదక్షిణ చేయడం మొ దలు పెట్టారని అక్కడ స్వామీజీలు చెబుతుంటారు అన్నారు. అంతేకాకుండా తాను పౌర్ణమి నాడు తిరువణ్ణామలైకు వెళ్లినప్పుడే వర్షం కురుస్తుందని కూడా చెబుతుంటారన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా కాలి బాటనే గిరిప్రదక్షిణ చేస్తానని చెప్పారు.. కాళ్లకు ము ళ్ళు గుచ్చుకున్నప్పుడు పాప పరిహారం అని స్వామీజీలు చెబుతారన్నారు. తాను అక్కడ ఒక శివలింగం వద్ద కూర్చుంటానని అలా ఒకసారి మాణిక్యవాచకం పాడిన పాటలను గుర్తుకు తెచ్చుకుంటానన్నారు. అలా ఇంటికి వచ్చిన మూడు నెలల తరువాత పాడికిడైత్త పరం పొరుళ్ అనే పాట మదిలో మెలిగిందన్నారు. ఆ పాటలో తాను రాసిన తమిళ భాషా అనే సందేహం తనకే కలిగిందన్నారు. అది భగవంతుడు ఇచ్చిన సంగీతం అనీ, అసలు సంగీతం అంటేనే దైవత్వం అని పేర్కొన్నారు. -
మళ్లీ తమిళ్ తాయ్ వాల్తు వివాదం
సాక్షి, చైన్నె: తమిళ తాయ్ వాల్తు (తమిళ తల్లిగీతం) రాసిన మనోన్మణియం సుందరనార్ పేరిట ఉన్న విద్యా సంస్థలోనే రాష్ట్ర గీతంకు ప్రాధాన్యత కరువైంది. మూడో స్థానానికి రాష్ట్ర గీతం నెట్టబడటంతో సర్వత్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాదం నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ హాజరైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించింది. వివరాలు.. తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. రాజ్‌భవన్ ఆదేశాల మేరకు స్నాత్కోత్సవంలో ప్రార్థనా గీతాల క్రమాన్ని ఈ వేడుకలో మర్చారు. మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన, మూడో స్థానంలో తమిళ్ తాయ్ వాల్తు పాడేలా ప్రణాళిక రూపొందించారు. తమిళ్ తాయ్ వాల్తు గీతాన్ని రాసిన మనోన్మణియం సుందరనార్ పేరిట ఉన్న విశ్వ విద్యాలయములోనే రాష్ట్ర గీతాన్ని మూడో స్థానం ఇచ్చి అవమానించారన్న విమర్శలు, ఆగ్రహాలు బయలు దేరాయి. రాష్ట్రంలోని కార్యక్రమాలలలో తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా , రాజ్ భవన్ ఆదేశాలకు ఆ వర్సిటీ వీసీ చంద్రశేఖర్ తలొగ్గక తప్పలేదు. సర్వత్రా ఆగ్రహం డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, గ్రాడ్యుయేషన్ ఉత్సవ వేడుకలో సాధారణంగా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తమిళ్ తాయ్ వాల్తును మూడో సారిగా మూడో స్థానంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళ సంస్కృతిని, మాతృగీతాన్ని అవమానించడమేనంటూ ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరగడం నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు గవర్నర్ పాల్గొన్న ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించడం గమనార్హం. తమిళనాడులో రాష్ట్రగీతానికే ప్రథమ స్థానం: తమిళనాడులో తమిళ్ తాయ్ వాల్తుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో రాజ్ భవన్ భిన్నమైన మార్గదర్శకాలను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని న్యాయ శాఖ మంత్రి నిర్మల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైన్నెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ పాలిత పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల మాతృగీతాలనే మొదట ఆలపిస్తున్నారని, అయితే, తమిళనాడులో దానికి భిన్నంగా చేయడం మంచి పద్దతి కాదన్నారు. ్ట తమిళనాడులో తమిళ మాతృగీతానికే మొదటి స్థానం ఇవ్వాలన్నారు. ఆ గీతాన్ని రాసిన సుందరనార్కు దక్కని గౌరవం విద్యార్థుల నిరసన గవర్నర్ అర్లేకర్ హాజరైన ఈ కార్యక్రమంలోఓ వైపు తమిళ్ తాయ్ వాల్తు వివాదం, మరో వైపు విద్యార్థులకు పట్టాల ప్రదానం వివాదం బయలు దేరింది. మొదట 871 మందికి గవర్నర్ స్వయంగా పట్టాలు ప్రధానం చేస్తారని ప్రకటించారు. అయితే, , చివరి నిమిషంలో కేవలం 113 మంది గోల్డ్ మెడలిస్ట్ వర్గాలకే పరిమితం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు, పీహెచ్డీ పట్టదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకలో తిరుచెందూరు ఆదిత్యనార్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండేసి బంగారు పతకాలను దక్కించుకున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా శాఖమంత్రి విశ్వనాథన్ బహిష్కరించారు. అదే సమయంలో డీజీపీ మహేశ్‌కుమార్ అగర్వాల్ సైతం దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. అయితే, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా బహిష్కరించలేదని, అధికారుల గైర్హాజరీ వెనుక కేవలం రవాణా, పరిపాలనాపరమైన శోధనలు , భద్రతా కారణాలే ఉన్నాయని డీజీపీ వివరణ ఇవ్వడం గమనార్హం. -
మణిక్యం ఠాకూర్‌పై కేసు కొట్టివేత
– కోర్టు ఉత్తర్వు కొరుక్కుపేట:తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు మణిక్యం ఠాకూర్ పై 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున విరుదునగర్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు విరుదునగర్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మణి క్యం ఠాకూర్ ఈ కేసు విచారణను నిలిపివేయాల ని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ఇలంధిరాయ న్ ముందు విచారణకు వచ్చింది. ఇంతకుముందు, పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులలో, సంబంధిత న్యాయాధికార సంస్థ కేసు నమోదు చేయడానికి కోర్టు నుండి ముందస్తు అనుమతి పొందాలని, అయితే ఈ కేసులో పోలీసులు అలా చేయకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కొట్టివేయాలి కోరారు. దీంతో న్యాయమూర్తి మణిక్యం ఠాకూర్‌పై ఉన్న కేసును కొట్టివేయాలని ఆదేశించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో.. కొరుక్కుపేట:తంజావూరులో తమిళనాడు పౌల్ట్రీ వ్యాపారుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు దురైరాజ్ మాట్లాడుతూ పౌల్ట్రీ ఉత్పత్తి సంస్థలు మేతతో పాటు బతికున్న కోళ్లను పంపిస్తుండటం వల్ల మాంసం నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. దీనివల్ల ఆహార భద్రత, పరిశుభ్రత, పౌల్ట్రీ వ్యాపారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందువల్ల, మేత నియంత్రణ చర్యలను అమలు చేయాలని తమిళనాడు అభ్యర్థించింది. దీంతో 31వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా దుకాణాలను మూసివేసి చికెన్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని, దీనివల్ల రోజూ జరిగే 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలపై ప్రభావం పడుతుందన్నారు. తమకు మద్దతుగా, వారు పుదుచ్చేరి రాష్ట్రంలో దుకాణాలను మూసివేసి, చికెన్ అమ్మకాలను నిలిపివేస్తామని ప్రకటించారు. కేరళ రాష్ట్ర సంఘం కూడా తమ మద్దతును తెలియజేసింది. 31వ తేదీలోగా మా డిమాండ్లపై తగిన చర్యలు తీసుకుంటే నిరసనను విరమించుకుంటామని వారు తెలిపారు. చైన్నెలో మౌళి–ఏ టైమ్‌లెస్ ట్రెడిషన్ నృత్య రూపకం సాక్షి, చైన్నె: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భరతనాట్య విద్వాంసురాలు, పరిశోధకురాలు బాలాదేవి చంద్రశేఖర్ తమ ప్రతిష్టాత్మక నృత్య రూపకం మౌళి – ఏ టైమ్‌లెస్ ట్రెడిషన్‌ను ఆగస్టు 2న చైన్నెలో ప్రదర్శించనున్నారు. ఇందుకు వేదికగా తిరువాన్మియూర్లోని భరతకళాక్షేత్ర ఆడిటోరియాన్ని ఎంపిక చేశామని నిర్వాహకులు ప్రకటించారు. బాలా దేవి చంద్రశేఖర్ స్వీయ రచన, కొరియోగ్రఫీలో రూపొందిన మౌళి ప్రదర్శన పండరీపూర్ ఆధ్యాత్మిక వారసత్వం, వార్కరీ సంప్రదాయాల నేపథ్యంతో సాగే ఒక సుదీర్ఘ పరిశోధనాత్మక భరతనాట్య రూపకం అని వివరించారు. భక్తి, సమత్వం, కరుణ, మాతృత్వపు ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ రూపకం ప్రేక్షకులను పండరీపూర్ క్షేత్ర తీర్థయాత్ర అనుభూతిలోకి తీసుకెళ్తుందన్నారు. భరతనాట్యం, సంగీతం, సాహి త్యం కథాకథనాల సమన్వయంతో సాగే ఈ ప్రదర్శన ఆధ్యాత్మికతకు సరిహద్దులు లేవనే సందేశాన్ని అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా బాలా దేవి చంద్రశేఖర్ మాట్లాడుతూ భరతనాట్యం ద్వారా సమానత్వం, కరుణ ఆధ్యాత్మిక సమత్వాల అమూల్యమైన విలువలను నేటి తరానికి అందించడమే తన ఉద్దేశంగా ప్రకటించారు. ఆగస్టు 2న భరతకళాక్షేత్ర ఆడిటోరియం వేదికగా జరిగే ఈ ప్రదర్శనకు అందరీకీ ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ధనుష్ ఇంటి వద్ద అభిమాన సందడి సాక్షి, చైన్నె: సినీ నటుడు ధనూష్ ఇంటి వద్ద మంగళవారం అభిమానులు హోరెత్తాయి. ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపేందుకు ఎగబడ్డారు.సినీ నటుడు ధనూష్ ఇటీవల కాలంగా అభిమాన సంఘానికి ప్రత్యేక జెండా పరిచయం చేయడం, సేవ కార్యక్రమాలు విస్తృతంచేయడం, రాజకీయ వ్యాఖ్యల తూటాలను పేల్చడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఆయన బర్తడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పోయేస్ గార్డెన్‌లోని ఇంటి వద్దకు వందలాదిగా అభిమానులు పోటెత్తారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. ఒంటి గంట సమయంలో బయటకు వచ్చిన ధనూష్ అభిమానులందర్నీ పలకరించారు. వారి నుంచి ఆశీస్సులు, కానుకలు అందుకున్నారు. అందర్నీ పలకరిస్తూ ఫొటో దిగారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. -
ప్రభుత్వానికి మద్దతుగా డిస్ట్రిక్ట్12
కొరుక్కుపేట: రాష్ట్ర ప్రభుత్వ పెరంబూర్ 2.0 కార్యక్రమానికి మద్దతుగా ఎంఎస్ఎంఈ రంగం కోసం ఎస్పీఆర్ ఇండియా ’డిస్ట్రిక్ట్12’ స్మార్ట్ ఆఫీస్ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్య అతిథిగా తమిళనాడు వణిగర్ సంఘం పెరమైప్పు రాష్ట్ర అధ్యక్షులు ఎ.ఎం. విక్రమ్ రాజా , ఇతర ప్రముఖులు పరిశ్రమ నాయకుల సమక్షంలో ప్రారంభోపన్యాసం చేశారు. ‘డిస్ట్రిక్ట్12‘ అనే స్మార్ట్–ఆఫీస్ స్పేస్ ప్రారంభోత్సవానికి చైన్నె నలుమూలల నుండి ఎంఎస్ఎంఈలు, చిన్న వర్ధమాన ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారులు వ్యాపార యజమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ప్రారంభోత్సవానికి వ్యాపారం, క్రీడలు, వినోదం, న్యాయం , జీవనశైలి రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత అనిరుద్ధ శ్రీకాంత్, బిగ్ బాస్ తమిళ ఫేమ్ సంయుక్త డిస్ట్రిక్ట్ 12ను ప్రత్యేకంగా సందర్శించారు. -
14 ఏళ్ల బాలికకు మిట్రల్ వాల్వ్ మార్పిడి
సాక్షి, చైన్నె: తీవ్రమైన మిట్రల్ వాల్వ్ సమస్యతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, మంచానికే పరిమితమైన 14 ఏళ్ల బాలికకు ఎంజీఎమ్ హెల్త్‌కేర్ వైద్యులు అత్యంత సంక్లిష్టమైన మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ బాలిక తీవ్రమైన మిట్రల్ రెగర్జిటేషన్ , లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఆవుట్ ఫ్లో ట్రాక్ట్ అడ్డంకితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పాడైపోయిన మిట్రల్ వాల్వ్ వలన రక్తం శరీరం నలుమూలలకు పంప్ కావడానికి బదులుగా వెనక్కి ఎడమ కర్ణికలోకి లీక్ అవుతున్నట్టు పరిగణించారు. దీంతో గుండైపె తీవ్రమైన ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ఉండటం, గుండె రక్తనాళాల మార్గంలో ఇరుకు ఏర్పడటం వలన పరిస్థితి మరింత జటిలంగా మారడంతో ఈ శస్త్రచికిత్స ద్వారా పాడైన వాల్వ్‌ను తొలగించి కొత్తది అమర్చడం ద్వారా గుండెలో రక్త ప్రసరణను పునరుద్ధరించారు. తొలుత రోగికి ఉన్న రెండు అరుదైన వైద్య పరిస్థితుల కారణంగా అనేక ఆసుపత్రులు ఈ శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించాయి. గుండె సాధారణంగా ఉండాల్సిన ఎడమ వైపు కాకుండా ఛాతీ మధ్యభాగంలో ఉండే మెసోకార్డియా అనే అరుదైన జన్మనిర్మిత సమస్య ఈ చిన్నారికి ఉండటం గమనార్హం. ఈ విలక్షణమైన అమరిక వల్ల మిట్రల్ వాల్వ్‌ను చేరుకోవడం వైద్యులకు సవాలుగా మారింది. దీనికి తోడు, బాలిక మోర్కియో సిండ్రోమ్ అనే అరుదైన జన్యు సంబంధిత జీవక్రియ లోపంతో బాధపడుతోంది. దీంతో ఎముకలలో వైకల్యం ఏర్పడి, మెడ ఎముకలు స్థిరత్వాన్ని కోల్పోవడంతో అనస్థీషియా సమయంలో ఇది తీవ్ర ప్రమాదకరమైనది కావడం వస్స మెడ భాగానికి ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పీడియాట్రిక్ కార్డియాక్ అండ్ హార్ట్ – లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్.కె.ఆర్ నవీన్ డేవిడ్సన్ ఈ ఓపెన్ హార్ట్ సర్జరీని నిర్వహించారు. -
ఇతర రాష్ట్రాలకు.. రవాణాపై నిషేధం
సాక్షి, చైన్నె : తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ రాళ్లు, కంకర, ఇసుక, ఎం శాండ్, రాళ్లు వంటి ఖనిజాల రవాణాకు నిషేధం విధిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ఖనిజాలతో వెళ్లాల్సిన వాహనాలన్నీ సరిహద్దులకే పరిమితం చేశారు. వివరాలు.. తమిళనాడు నుంచి నల్లరాళ్లు (గ్రానైట్/రాళ్లు), కంకర (జల్లి), ఎం–శాండ్ వంటి ఖనిజాలను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే వాళ్లు అధికమయ్యారు.కొన్ని క్వారీలు ఇక్కడతవ్వకాలకు అనుమతి పొంది, అధికారుల సహకారంతో రాష్ట్రాల సరిహద్దులను దాటిచ్చేస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని తిరున్వేలి, , తెన్కాసి, కోయంబత్తూర్ తదితర జిల్లాల నుండి కేరళకు పెద్ద ఎత్తున ఖనిజ సంపద అక్రమంగా తరలి వెళ్తున్నది. గత డీఎంకే పాలనలో అధికార పార్టీకి చెందిన ఓ గాడ్‌ఫాదర్ మద్దతుతో ఈ అక్రమ రవాణా యదేచ్చగా సాగుతూ వచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ ప్రభుత్వం ఈ అక్రమ రవాణాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా దృష్టి పెట్టింది. కొన్ని క్వారీలను స్వయంగా గనుల శాఖ మంత్రే పరిశీలించినప్పటికీ, అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్ మాత్రం తగ్గలేదు తమిళనాడు నుండి కేరళకు వెళ్లే జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ఆ రోడ్డులో ఖనిజాల రవాణాను నిషేధించినప్పటికీ స్మగ్లింగ్ ఆగలేదు. బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్రమ రవాణా కొనసాగింది. అదే సమయంలో ఈ అక్రమ రవాణా రూపంలో తమిళనాడులో పై ఖనిజాలకు కొరత అన్నది తప్పలేదు. దీంతో తమిళనాడు నుంచి రాళ్లు, కంకర, ఎం–శాండ్ వంటి ఖనిజాలను ఇతర రాష్ట్రాలకు తరలించడంపై 3 నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వ ప్రకటించింది. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళవారం కన్యాకుమారి, సెంగోట్టై, తేని , కోయంబత్తూరు వైపుగా కేరళకు ఉన్న మార్గాలలో ఎక్కడిక్కడక భారీ లారీలను ఆపేశారు. ఖనిజాలతో వెళ్లే లారీలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసి వెనక్కు పంపించే పనిలో పడ్డారు. దీంతో సరిహద్దులలోని చెక్ పోస్టుల వద్ద ఈ వాహనాలు బారులుదీరాయి. శాశ్వత నిషేధమే లక్ష్యం ఇతర రాష్ట్రాలకు ఖనిజాల రవాణాపై తాత్కాలికంగా కాకుండా శాశ్వత నిషేధం విదించాలని పిఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, తమిళనాడు నుంచి కేరళ వెళ్లే అన్ని రహదారుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఖనిజాల స్మగ్లింగ్ జరుగుతోందో లేదో పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. అనుమతి పొందిన వాళ్లు సైతం ఇతర రాష్ట్రాలకు తరలింపునకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆహ్వానిస్తున్నామని, అయితే, ప్రస్తుతం 3 నెలలకు మాత్రమే విధించిన ఈ నిషేధాన్ని శాశ్వత నిషేధంగా మార్చాలని కోరారు. అప్పుడు ఖనిజ దోపిడీ, అక్రమ రవాణా పూర్తి స్థాయిలో కట్టడి చేయగలమన్నారు. ఇప్పటి వరకు జరిగిన దోపిడిపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎక్స్‌ప్రెస్‌లన్నీ తాంబరం నుంచే..!
సాక్షి, చైన్నె: చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల కారణంగా, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరం నుంచే నడిపించాలని రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 734.91 కోట్ల వ్యయంతో 2023 ఫిబ్రవరిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లోని మొదటి 5 ప్లాట్‌ఫారమ్‌లను వెడల్పు చేసి ఆధునీకరించే పనుల కోసం, రైళ్లను తాంబరం స్టేషన్‌కు మార్చే ప్రక్రియ గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో దశల వారీగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా తాంబరం టెర్మిన ల్కు మార్చారు. ఆ తర్వాత, ఎగ్మూర్ స్టేషన్‌లోని 1వ ప్లాట్‌ఫారమ్ నుండి 11వ ప్లాట్‌ఫారమ్ వరకు అనుసంధానించేలా భారీ వంతెన నిర్మాణ మొదటి విడత పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. దీంతో ఉళవన్, అనంతపురి, రామేశ్వరం వంటి కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫిబ్రవరి 3 నుండి ఏప్రిల్ 4 వరకు తాత్కాలికంగా తాంబరం స్టేషన్‌కు మార్చి అక్కడ నుంచే నడిపారు. ఇవే కాకుండా, సబర్బన్ (సబర్బన్ ఎలక్ట్రిక్) రైళ్ల సేవల్లో కూడా ఫిబ్రవరి 20 నుండి ఏప్రిల్ 3 వరకు 43 రోజుల పాటు తాత్కాలిక మార్పులు చేశారు. ఆ తర్వాత ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో, ఎగ్మోర్ స్టేషన్ నుండి ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితిలో, 3వ విడతగా ఇనుప వంతెన నిర్మాణ పనుల నిమిత్తం కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరానికి మార్చాలని నిర్ణయించారు. తాంబరం రైల్వే స్టేషన్ మళ్లీ తాంబరంకు మార్పు.. ఈ వంతెన నిర్మాణం కోసం 500 టన్నులకు పైగా బరువున్న క్రేన్లను ఉపయోగించి ఇనుప గర్డర్లను అమర్చనున్నారు. ఈ వంతెన 18 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం గాంధీ ఇర్విన్ రోడ్డు వైపు ఉన్న 1 నుండి 5 ప్లాట్‌ఫారమ్‌ల వరకు ఇనుప వంతెన అమర్చనున్నారు. దీనిని వరుసగా 6 నుండి 11 ప్లాట్‌ఫారమ్‌ల వరకు పొడిగించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా ఎగ్మోర్ నుండి నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లీ తాంబరానికి మార్చాలని నిర్ణయించారు. దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనుల వలన కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాంబరానికి మార్చే విషయమై దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. అనుమతి వచ్చిన వెంటనే ఈ మార్పులు అమలులోకి వస్తాయన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైలు సేవల్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబర్బన్ రైళ్లను 5, 6 ప్లాట్‌ఫారమ్‌ల నుండి నడపడంపై కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు. కాగా, దక్షిణ చైన్నె వైపుగా ఉన్నతాంబరం ప్రస్తుతం మూడో రైల్వే టెర్మినల్‌గా రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచే దక్షిణ తమిళనాడు వైపుగా సాగే అనేక రైళ్లు బయలు దేరుతున్నాయి. తాజాగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్నీ ఇక్కడి నుంచే సేవలు మళ్లీ మొదలెట్టిన పక్షంలో ఆ పరిసరాలు కిటకిటాలడాల్సిందే. -
2031 నాటికి రాజకీయాల్లోకి ధనుష్?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు వ్యాప్తంగా తన అభిమాన సంఘాలకు ప్రత్యేకమైన జెండా,చిహా్నలను (తెలుపు, ఎరుపు రంగు నక్షత్రం) కేటాయించడం, జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2031 నాటికి ధనుష్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమం మారింది. ధనుష్ వ్యాఖ్యల చర్చ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో నిర్వహించిన నిధుల సేకరణ, రక్తదాన శిబిరం , విద్యా సహాయ వితరణ కార్యక్రమంలో నటుడు ధనుష్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 2002 నుంచి 24 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.అభిమానులు తనకు విస్తృతమైన కుటుంబం. జీవితంలో ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం, అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండండి అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అభిమానులకు పలు ఉపదేశాలు ఇస్తూనే ఆయన జాతీయ అవార్డుల గురించి స్పందించి ఉండటం తాజాగా చర్చకు దారి తీసింది. కాగా, ధనుష్ చూపిన బాటలోనే నడుస్తామని, తమ నాయకుడు ధనుష్ చెప్పినట్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామని, ఆయన మార్గదర్శకత్వంలో తమిళనాడు అంతటా పర్యటించి, ప్రజలకు సేవ చేస్తామని, . 2031 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో మంచి మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
తాగునీటి సరఫరాపై దృష్టి
సాక్షి, చైన్నె: చైన్నె,శివారు పరిసర ప్రాంతాల్లోని తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు గృహాలలో నివాసితులకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కిర్లోష్ కుమార్ తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఎన్నోర్, వ్యాసర్పాడి, పట్టినపాక్కం, చేట్ పట్, కన్నగి నగర్, ఎళిల్ నగర్, సెమ్మంజేరి, కొట్టివాక్కం, అయ్యప్పాక్కం సహా 207 ప్రాజెక్ట్ ప్రాంతాల్లో లక్షకు పైగా నివాస గృహాలను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. ఈ హౌసింగ్ బోర్డు, క్వార్టర్స్‌లలో లక్షలాది మంది నివసిస్తుండగా, మెట్రో వాటర్ (చైన్నె తాగునీటి సరఫరా బోర్డు) అందిస్తున్న నీరు సరిపోవడం లేదని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. కన్నగి నగర్,ఎళిల్ నగర్లలో నీటి ట్యాంకులను రెండు రోజులకు ఒకసారి మాత్రమే నింపడం వలన తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర నీటి కొరత ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలు – ప్రత్యేక కమిటీ ఈ సమస్యలపై స్పందించిన గృహనిర్మాణ శాఖ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. 5 మంది సభ్యుల కమిటీని రంగంలోకి దించారు. అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు, చైన్నె మెట్రో వాటర్ బోర్డు, కార్పొరేషన్ జోనల్ అధికారులు ఈ ప్రత్యేక కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆయా ప్రాంతాలలో తాగునీరు, పారిశుధ్యం తదితర ప్రాథమిక సౌకర్యాలను క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పిస్తారు. తాజాగా ఈ కమిటీ ఒక్కియం తురైపాక్కం, సెమ్మంజేరి ప్రాంతాలలో తనిఖీలపై దృష్టి పెట్టింది. చైన్నె మెట్రో వాటర్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఆనంద్ పేర్కొంటూ, ఎళిల్ నగర్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల భూగర్భ నీటి నిల్వ ట్యాంక్ నిర్మాణం, పంప్ సెట్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.కన్నగి నగర్లో 38 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్, 24 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ నీటి నిల్వ ట్యాంక్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ నిర్మాణ పనులన్నీ సెప్టెంబరు నాటికి పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకురానున్నామన్నారు. దీంతో ఇక్కడి వేలాది కుటుంబాలకు తాగునీటి ఎద్దడి నుంచి శాశ్వత ఉపశమనం లభించనున్నుట్టు పేర్కొన్నారు. -
ఆలస్యం ఎందుకో..నాకే తెలియదు!
సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో మంత్రుల శాఖల కేటాయింపు ఆమోదంలో చోటుచేసుకుంటున్న ఆలస్యంపై ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాఖల కేటాయింపు ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందో తనకే అర్థం కావడం లేదని అయోమయం వ్యక్తం చేశారు. ఎన్సీసీ కెడెట్ల సముద్ర సాహస యాత్ర ప్రారంభం ఎన్సీసీ కెడెట్లు చేపట్టిన తూర్పు తీర సముద్ర నౌకాయాన యాత్ర – 2026 ను పుదుచ్చేరి తేంగాయ్త్తిట్టు చేపల రేవు వద్ద సీఎం రంగ స్వామి ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈయాత్ర సోమవారం నుంచి నుండి సెప్టెంబరు 27 వరకు కొనసాగనుంది. మొత్తం 100 మంది కేడెట్లు పాల్గొంటున్నారు. పుదుచ్చేరి నుండి కడలూర్, రామేశ్వరం, తూత్తుకుడి, కన్యాకుమారి మీదుగా చైన్నె వరకు మొత్తం 800 కిలోమీటర్ల మేర ఈ సముద్ర యాత్ర సాగనుంది. విద్యార్థులకు సముద్ర సాహస యాత్రల వలన్ల మనోధైర్యం, ప్రతికూలతలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతాయని, దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని ఈసందర్భంగా సీఎం పేర్కొన్నారు. శాఖల కేటాయింపులో వివాదం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రంగస్వాసామితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ఎన్.ఆర్. కాంగ్రెస్ – బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు, మొండిపట్టు కొనసాగుతున్నాయి.జూలై 20న మంత్రుల శాఖల కేటాయింపుల నివేదికను సీఎం రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్నాథన్కు సమర్పించారు. గంటల్లో ఆమోదం వస్తుందని భావించినప్పటికీ, వారం రోజులు గడిచినా ఎల్జీ నుండి అనుమతి లభించలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా కీలక శాఖలను తమకే కేటాయించాలని కూటమి భాగస్వామి అయిన బీజేపీ ఒత్తిడి తెస్తున్నందునే ఎల్జీ సంతకం చేయడం లేదని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తనకే తెలియడం లేదని అయోమయం వ్యక్తం చేయడం గమనార్హం.అలాగే, బీజేపీ ఏమైనా ప్రాధాన్యత ఉన్న శాఖల కోసం ఒత్తిడి తెస్తోందా? అని ప్రశ్నించగా, సీఎం స్పందించకుండా కేవలం ‘నమస్కారం’ అని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. -
రాజా ముత్తుపాండికి అభినందల వెల్లువ
సాక్షి, చైన్నె : స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. పోటీల మూడో రోజున భారత్ వెయిట్‌లిఫ్టింగ్‌లోనే ఏకంగా ఒక స్వర్ణం, రెండు రజతాలతో కలిపి మొత్తం 3 పతకాలు సాధించి సత్తా చాటింది. ఇందులో తమిళనాడుకు చెందిన రాజా ముత్తుపాండి రజతం సాధించడం రాష్ట్రంలో ఆనందం వెల్లి విరిసింది.తమిళనాడుకు చెందిన వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండి పురుషుల 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. కాగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రాజా ముత్తుపాండి పురుషుల 65 కేజీల బాడీవెయిట్ విభాగంలో స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తం 286 కేజీల బరువు ఎత్తి రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటారు. సీఎం విజయ్ రూ. 30 లక్షలు ప్రోత్సాహం తమిళనాడుకు గర్వకారణంగా నిలిచిన రాజా ముత్తుపాండిని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన తూత్తుకుడి వీరుడు రాజా ముత్తుపాండికి తన హదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఘనతకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటిస్తున్నామన్నారు. ఆయన విజయం ఎంతో మంది యువతకు స్ఫూర్తినివ్వాలి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సైతం అభినందించారు. కాగా, రాజా ముత్త పాండి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చిన్న తనం నుంచి కష్ట పడి చదువుకుంటూ , వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటూ వచ్చాడని పేర్కొన్నారు. అతడి శ్రమకు గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. -
మేమంతా ఒకే గూటి పక్షులే..
తమిళసినిమా: గుడ్‌నైట్, లవర్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్స్ సంస్థతో కలిసి నియో క్యాస్టిల్ క్రియేషన్స్,ఇరా ఎంటర్ టైన్మెంట్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్,ఇరా శరవణన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మించిన తాజా చిత్రం అన్బే డయానా. పారి ఇళవళగన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన కథానాయకుడిగా నటించిన ఇందులో నటి రమ్య రంగనాథన్, నటి రోజా, చేతన్, పరితాపంగళ్ గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్ శంకర్ సంగీతాన్ని అందించారు.ఈ నెల 17వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపడుతుండటంతో థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు.ఈ వేదికపై నిర్మాతలలో ఒకరైన సత్య కరికాలన్ మాట్లాడుతూ విద్యారంగం నుంచి వచ్చిన తనకు అన్బే డయానా చిత్రం మంచి అనుభవాన్నిచ్చిందన్నారు. ఇందుకు కారణం అయిన నిర్మాతలు ఇలా శరవణన్, యువరాజ్ గణేశన్ లకు ధన్యవాదాలు అన్నారు. తామంతా ఒకే గూటి పక్షులమేననీ, మరిన్ని మంచి చిత్రాలు కలిసి చేస్తామని చెప్పారు. విజయాన్ని పక్కన పెట్టి పారిఇళవళగన్ హీరోగా నిలబడాలన్న ఇంటెన్సివ్ తో రూపొందించిన అన్బే డయానా అని, అది ఇప్పుడు నెరవేరిందని నిర్మాత యువరాజ్ గణేశన్ పేర్కొన్నారు. నటి రోజా ఈ చిత్రం లో నటించడానికి అంగీకరించడమే పెద్ద బలం అదే విధంగా మ్యాజిక్ పాత్రలో నటించిన హీరోయిన్ రమ్య రంగనాథన్ చాలా బాగా నటించారనీ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు దర్శకుడు, కథానాయకుడిగా పారి ఇళవళగన్ పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఆయన అన్నారు. -
టాస్మాక్ బార్లకు నిబంధనల సడలింపు
సాక్షి, చైన్నె: తమిళనాడులో టాస్మాక్ మద్యం దుకాణాలకు అనుబంధంగా నడిచే బార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు టాస్మాక్ వైన్ షాప్ ఉన్న భవనంలోనే బార్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉండేది. దానిని సడలిస్తూ, వైన్ షాప్ ఉన్న ప్రదేశానికి 100 మీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే బార్‌కు ఉండాల్సిన కనీస విస్తీర్ణాన్ని 15 చదరపు మీటర్ల నుండి 20 చదరపు మీటర్లకు పెంచారు. భవన యజమానుల వద్ద నో–అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చేవారే టెండర్ వేసే పరిస్థితి మారడంతో తాజాగా ప్రతిఒక్కరికీ టెండర్లలో పాల్గొనే అవకాశాలు పెరిగాయి. దీంతో టాస్మాక్ బార్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. రూ. 100 కోట్ల స్థలం కబ్జా కేసు సాక్షి, చైన్నె: కరూర్‌లో రూ. 100 కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుకు సంబంధించి అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ సోమవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు–1లో విచారణకు హాజరయ్యారు. వివరాలు.. కరూర్ జిల్లా వాంగల్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి, తన వద్ద ఉన్న రూ. 100 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని నకిలీ పత్రాల (ఫోర్జరీ) ద్వారా మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్, ఆయన తమ్ముడు శేఖర్ , వారి అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 2024 జూన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కరూర్ టౌన్ పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ సీబీసీఐడీకి బదిలీ అయ్యింది. నెల రోజులకు పైగా పరారీలో ఉన్న విజయభాస్కర్‌ను 2024 జులై 16న కేరళలోని త్రిస్సూర్‌లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ కరూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు–1లో సాగుతోంది. జూలై 20న కోర్టుకు హాజరైన మాజీ మంత్రి విజయభాస్కర్ ఛార్జ్‌షీట్ కాపీని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం మేజిస్ట్రేట్ భరత్‌కుమార్ సమక్షంలో జరిగిన తదుపరి విచారణకు విజయభాస్కర్ స్వయంగా హాజరయ్యారు. ప్రేమించలేదని విద్యార్థిపై కత్తితో దాడి – పోలీసులకు భయపడి యువకుడి ఆత్మహత్య అన్నానగర్: తనను ప్రేమించడానికి నిరాకరించిన ప్లస్–1 విద్యార్థిని ఇంట్లోకి చొరబడిన యువకుడు, ఆమెను కత్తితో పొడిచి, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా, చిదంబరం సమీపంలోని సి. ముట్లూరు ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ శేఖర్ కుమారుడు అయ్యప్పన్ (28), పక్క గ్రామానికి చెందిన ఓవిద్యార్థినిని రెండేళ్లుగా ప్రేమించమని వేధిస్తున్నాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించడంతో.. ఆదివారం సాయంత్రం విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న అయ్యప్పన్, తనను ప్రేమించమని బలవంతం చేశాడు. విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన అయ్యప్పన్, కత్తితో విద్యార్థిని మెడ, వీపు పై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. విద్యార్థిని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థినికి అక్కడ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందుతోంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో, సి.ముట్లూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళశాల వెనుక చెట్టుకు అయ్యప్పన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతదేహాన్ని చిదంబరంలోని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు భయపడి బాలికను కత్తితో పొడిచిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చైన్నె సచివాలయం వద్ద మహిళ ఆత్మహత్యా యత్నం తిరువొత్తియూరు: విలుప్పురం జిల్లాకు చెందిన సుమారు 45 ఏళ్ల అర్చన అనే మహిళ భూమి వివాదం సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, చైన్నె సచివాలయంలోని ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదు చేయడానికి సోమవారం వచ్చింది. ఆ సమయంలో తన సమస్యకు పరిష్కారం దొరకలేదని మనస్తాపం చెంది, ధరించిన చీరకి నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడి ఆసుపత్రికి తరలించారు. -
చైన్నెలో ఇంటర్నేషనల్ లా పరిశోధనా కేంద్రాలు
– ప్రారంభించిన ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ స్టడీస్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అండ్ రెఫ్యూజీ లా విభాగాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్ అధికారికంగా ప్రారంభించారు. ఎస్ఆర్ఎమ్ స్కూల్ ఆఫ్ లా 2026 విద్యాసంవత్సరానికి కొత్తగా చేరిన 350 మందికి పైగా విద్యార్థుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జస్టిస్ వి. రామసుబ్రమణియన్ ఈసందర్భంగా మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిజాయితీ, పట్టుదల, జీవితాంతం నేర్చుకునే తత్వం ఎంతో ముఖ్యంగా పేర్కొన్నారు. చట్టపరమైన జ్ఞానాన్ని బోధించవచ్చు అని, అయితే, నైతిక ప్రవర్తన, కరుణ, విశ్లేషణాత్మక ఆలోచన, మానసిక పరిపక్వత మాత్రమే ఉత్తమ లాయర్లుగా తీర్చిదిద్దుతాయన్నారు. మానవ సంఘర్షణలను పరిష్కరించడంలో, చట్టాన్ని సరైన రీతిలో విశ్లేషించి న్యాయాన్ని కాపాడటంలో లాయర్ల అవసరం ఎంతో ఉందో ఆయన వివరించారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ – ఇండియా ఎ.ఆర్.ఎల్. సుందరేశన్ , ఖైతాన్ – కో పార్టనర్ వివేఖ్ శ్రీరామ్, ఆవిద్యా సంస్థ ప్రొ–వైస్ ఛాన్సలర్ (లా) ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి పాల్గొన్నారు. -
ఆన్లైన్ నామినేషన్లు!
అసెంబ్లీలో చట్ట సవరణకు పట్టు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కొత్త విధానాలను అమలు చేసేందుకు విజయ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు స్థానిక ఎన్నికల్లో ఆన్లైన్ ద్వారా నామినేషన్లు స్పీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. సాక్షి, చైన్నె: తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ ద్వారానే నామినేషన్ దాఖలు చేసే విధంగా కొత్త విధానం తీసుకురావాలన్న నినాదం తెర మీదకు వచ్చింది. ఇందుకోసం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని పౌర సమాజం, సామాజిక కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాలకులు ఈ వ్యవహారంపై పరిశీనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నేపథ్యం – పదవీ కాలాలు తమిళనాడులోని 38 జిల్లాల పరిధిలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలలో 37 జిల్లా పంచాయతీలు, 397 పంచాయతీ యూనియన్లు, 12,570 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,06,453 వార్డులు ఉన్నాయి. వార్డు కౌన్సిలర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ (అధ్యక్షుడు) పదవులకు సంబంధించి 1,18,978 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఉప సర్పంచ్, యూనియన్ చైర్మన్, జిల్లా పంచాయతీ చైర్మన్ వంటి 5,973 స్థానాలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. కార్పొరేషన్లు.. ఇక, నగర పాలక సంస్థలుగా 25 కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీలు, 478 నగర పంచాయతీలు ఉండగా, వీటిలో 12,838 వార్డులు ఉన్నాయి. 12,838 కౌన్సిలర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరుఉతాయి. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి 13,373 స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. గ్రామీణ స్థానిక సంస్థల్లో 28 జిల్లాల పదవీ కాలం ఇప్పటికే ము గియగా, కాంచీపురం, వేలూరు సహా మిగిలిన 9 జిల్లా ల పదవీ కాలం అక్టోబరు 19తో పూర్తికానుంది. నగర పాలక సంస్థల పదవీ కాలం 2027 మార్చి1తో ముగి యనుంది.ఆన్లైన్ నామినేషన్ల ఆవశ్యకత స్థానిక సంస్థల్లో మొత్తం 1,31,816 పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనుండటంతో, సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రధాన సమస్యలు – పరిష్కారం అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు చేరుకోవడం వలన ప్రధాన రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ–సేవ కేంద్రాల ద్వారా ప్రజలు కుల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న తరహాలోనే నామినేషన్లను కూడా ఆన్లైన్లో స్వీకరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్మారేషన్ (ఇతరుల పేరుతో దరఖాస్తు చేయడం) అరికట్టేందుకు ఆధార్ ఓటీపీ ప్రామాణీకరణ ఆధారంగా ఆన్లైన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేయవచ్చని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆగస్టులో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు చట్ట సవరణ తీసుకొస్తే ఎన్నికల నిర్వహణ మరింత సజావుగా, డిజిటల్ విధానంలో పారదర్శకంగా సాగుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికల దిశగా రాష్ట్ర ఎన్నికల అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ తదుపరి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అంతలోపు ఆన్లైన్లో నామినేషన్ల ప్రక్రియను సైతం అమలు చేసే దిశగా పాలకులు పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. -
అనర్హత వేటు వ్యవహారం!
సాక్షి, చైన్నె: అభ్యర్థుల అనర్హత పిటిషనన్‌పై విచారణకు సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో పాటుగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి సమన్లు జారీ చేశారు. ఈనెల 30న స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆర్.శాంతి ఆ సమన్లలో పేర్కొన్నారు. విశ్వాస పరీక్ష: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలు సాధించినవ విషయం తెలిసిందే. అయితే, టీవీకే చీఫ్ విజయ్ తన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కోరినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగా మే 13న సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి సీ.వీ. షణ్ముగం నాయకత్వంలో ఎస్.పి. వేలుమణి, సి. విజయభాస్కర్ సహా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. పళని స్వామి నాయకత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. విప్ ఉల్లంఘన – అనర్హత పిటిషన్: విప్ ఉల్లంఘించి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 25 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని పళనిస్వామి వర్గం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు వినతిపత్రం ఇచ్చింది.అదే సమయంలో సీ.వీ. షణ్ముగం వర్గానికి చెందిన ఇసక్కి సుబ్బయ్య (అంబసముద్రం), మరగదం కుమారవేల్ (మదురాంతకం), సత్యభామ (ధారాపురం), జయకుమార్ (పెరుందురై) నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇక, షణ్ముగం వర్గంలోని మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు క్షమాపణ లేఖ ఇవ్వడంతో వారిపై అనర్హత చర్యల పిటిషన్‌ను పళని స్వామి వెనక్కి తీసుకున్నారు. వివరణకు సమన్లు పార్టీ మారిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలను ఇప్పటికే జూలై మొదటి, రెండో వారంలో స్పీకర్ విచారించారు. వారి నుంచి మరిన్ని వివరణలు తీసుకోవాల్సి ఉన్నందున, ఈనెల 30న స్పీకర్ ఛాంబర్లో హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో ఫిర్యాదుదారుడైన ఎడప్పాడి పళని స్వామి కూడా స్వయంగా వచ్చి తమ వాదనలను వినిపించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఉచిత సిలిండర్ సబ్సిడీ, 5 కొత్త జిల్లాలు
– పీఎంకే మాదిరి ఆర్థిక బడ్జెట్ విడుదల సాక్షి, చైన్నె: గత వారం మాదరి వ్యవసాయ బడ్జెట్‌ను విడుదల చేసిన పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తాజాగా మాదిరి ఆర్థిక బడ్జెట్‌ను ప్రకటించారు. చైన్నెలోని టీనగర్లో జరిగిన కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు. రాష్ట్రంలో రూ.300 గ్యాస్ సబ్సిడీ, 5 కొత్త జిల్లాల ఏర్పాటు, సంపూర్ణ మధ్యపాన నిషేధం వంటి అనేక సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు. బడ్జెట్ పరిమాణం – ఆర్థిక అంచనాలు 2026–27 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు రాబడి రూ. 6,71,891 కోట్లుగా అంచనా వేశారు. ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా పన్నుయేతర ఆదాయాన్ని రూ.2,17,945 కోట్లుగా సమకూర్చాలని ప్రతిపాదించారు. మొత్తం వ్యయం రూ. 6,96,149 కోట్లు కాగా, ఇందులో రూ. 50,000 కోట్లను పాత అప్పుల అసలు చెల్లింపులకే కేటాయించి, రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమైన హామీలు – సంక్షేమ పథకాలు ● రాబోయే 5 ఏళ్లలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.. మొదటి విడతగా 2026–27 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 6 నెలల్లో లక్ష ఉద్యోగాలు. ● ప్రభుత్వ పాఠశాలలకు 25,000 మంది ఉపాధ్యాయులు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు 5,000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–4 కింద 17,000 మంది నియామకం. ● తమిళంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు. బోర్డు ప్రకటనలు తమిళంలో లేని దుకాణాలకు రూ.10,000 జరిమానా. ● గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ (ఏడాదికి గరిష్టంగా 6 సిలిండర్లు). ● గృహిణుల ఆర్థిక సాయం రూ.2,000కు పెంపు (రైస్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి). ● గర్భిణులకు ప్రసూతి ఆర్థికసాయం రూ. 25,000కు పెంపు. -
విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబో రిపీట్?
తమిళ సినిమా: సామాజికపరమైన సమస్యలను తెరపై ఆవిష్కరించడంలో దిట్ట దర్శకుడు వెట్రిమారన్. ఆడుగళం చిత్రంతో దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన దర్శకుడు బాలు మహేంద్ర శిష్యుడు అన్నది తెలిసిందే. ఆ తర్వాత పొల్లాదవన్, విచారణై, వడచైన్నె , విడుదలై, విడుదలై –2 పలు వైవిధ్య భరిత కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయన శింబు కథానాయకుడిగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ది క్రియేషన్స్ కలైపులి ఎస్ ధాను నిర్మిస్తున్న ఇందులో నటుడు విజయ్ సేతుపతి,, ఆండ్రియా, ప్రియాంక మోహన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా దర్శకుడు వెట్రిమారన్ మరోసారి విజయ్ చతుపతి కథానాయకుడు చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. గిరి కాంబినేషన్లో ఇంతకుముందు విడుదలై, విడుదలై 2 చిత్రాలు రూపొంది మంచి విజయాన్ని సాధించాయి. అదేవిధంగా తాజాగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న అరసన్ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీంతో వీరి కాంబినేషన్లో నాలుగవ చిత్రం తెరకెక్కనుదన్న మాట. అయితే దర్శకుడు వెట్రీ మారన్ ప్రస్తుతం రూపొందిస్తున్న అరసన్ చిత్రం తర్వాత ధనుష్ హీరోగా తమిళ్ మురుగన్, వడచైన్నె– 2 చిత్రాలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేసిన తర్వాతే విజయ్ సేతుపతితో చేసే చిత్రం ఉంటుందని సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
అంతర్జాతీయ కరాటే పోటీలకు నవశక్తి ఎంపిక
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కేంద్రానికి చెందిన ర్యాలీ నవశక్తి మరోసారి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు వేదికగా నిర్వహించిన 29వ ఆల్ ఇండియా షిటోర్యు–డు కరాటే చాంపియన్‌షిప్–2006 పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో ఓపెన్ కేటగిరీ కటాస్ విభాగంలో నవశక్తి ప్రతిభ చాటి రజత పతకం సాధించింది. అంతేకాకుండా నవశక్తివరల్డ్ షిటోర్యు ఇంటర్నేషనల్ కరాటే సిరీస్–2006 పోటీలకు ఎంపికై ందని, ఈ పోటీలకు జపాన్ దేశంలోని యెకహమా నగరం ఆతిథ్యమిస్తోందని వెంకీ మార్షల్స్ అకాడమీ నిర్వాహకుడు, కరాటే కోచ్ వెంకటేష్ తెలిపారు. సోమవారం చైన్నెలో నవశక్తిని సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు అభినందించారు. జపాన్‌లో కూడా ప్రతిభ చాటి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. -
విరాటపర్వం ఎంతో ప్రత్యేకం
కొరుక్కుపేట: మహా భారతంలో విరాట పర్వానికి ఎంతో ప్రత్యేకత ఉందని ద్విశతావధాని, అవధాన విద్వన్మణి డాక్టర్ బులుసు అపర్ణ అన్నారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 175వ ప్రసంగం విరాటపర్వం –తిక్కన నాటకీయత పై ఆదివారం రాత్రి ఉపన్యాసం జరిగింది. దీనికి చైన్నె టి.నగర్ లోని ఆస్కా కృష్ణా హాలు వేదికై ంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్విశతావధాని, అవధాన విద్వన్మణి డాక్టర్ బులుసు అపర్ణ వక్తగా విచ్చేసి విరాటపర్వం –తిక్కన నాటకీయత పై ఉపన్యసిస్తూ.. మహా భారతంలో విరాట పర్వంకి ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. విరాటపర్వాన్ని తిక్కన గొప్పగా రచించారని తెలిపారు. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి కొన్ని పద్యాలు పాడి అందరినీ అలరించి, వక్త అపర్ణను సభకు పరిచయం చేశారు.డా. బులుసుఅపర్ణ 17 ఏళ్ల ప్రాయంలోనే అష్టావధానం చేయడం ప్రారంభించి 300 పైగా అష్టావధానాలు చేయడం గర్వకారణమని కొనియాడారు. -
ఎం.కన్నన్ మృతి
కొరుక్కుపేట: రోటరీ క్లబ్ గవర్నర్, మాజీ కౌన్సిల్ సభ్యుడు ఎం. కన్నన్ ఇకలేరు. ఈ విషయం తెలుసుకున్న తమిళ మానిళ కాంగ్రెస్ (టీ ఎం సి) పార్టీ అధ్యక్షుడు జి.కె. వాసన్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి జి.ఆర్. వెంకటేష్, ఏఐఏడీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ రాయపురం ఆర్. మనో, రోటరీ టి. రాజేశ్వరన్, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, లూయిస్ రాజన్, కళ్యాణి,మారి తదితరులు కన్నన్ పార్ధీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు. తిరుత్తణి: అనుమానస్పద రీతిలో డీఎంకే కార్యకర్త మృతిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి నుంచి పొదటూరుపేటకు వెళ్లు రాష్ట్ర రహదారిలో బుచ్చిరెడ్డిపల్లె వద్ద సోమవారం వేకువజామున వ్యక్తి తల నలిగిన స్థితిలో మృతదేహం రోడ్డుకు పక్కలో పడివుండడం గుర్తించిన అటువైపు వెళ్లిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి పోలీసులు సంఘటనా ప్రాంతం చేరుకుని మృతేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో పొదటూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు రజినీ(48) డీఎంకే కార్యకర్తగా తెలిసింది. అరక్కోణం ప్రాంతంలో బందువుల ఇంటి వేడుకల్లో పాల్గొని ఆదివారం రాత్రి బైకులో ఇంటికి వెళ్తుతుండగా అనుమానస్పద రీతిలో మృతి చెందినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడా లేక హత్యకు గురియైయాడా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువల్లూరు: రోడ్డు విస్తరణ పనుల కోసం జరిగిన తవ్వకాల నేపథ్యంలో గ్యాస్ పైప్ లైన్ పగిలి లీకేజీ గురి కావడం తీవ్ర కలకలం సష్టించింది. తిరువళ్లూరు జిల్లా పుదు సత్రం సమీపంలో తిరుపతి –చైన్నె రోడ్డు విస్తరణ పనుల కోసం జెసిబి యంత్రం ద్వారా రోడ్డుకి ఇరువైపులా తవ్వకాలను చేస్తున్నారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్ లైన్ పైపు హఠాత్తుగా పగిలి లీకేజీ ఏర్పడింది. దీంతో వాసన రావడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతంలో నీటిని చల్లారు. అనంతరం పైప్‌లైన్ తగిన ప్రాంతానికి సమీపంలోని కనెక్షన్ వద్ద మూసివేసి, సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మంగళాపురానికి చెందిన పీ.సురేష్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ...ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో నమోదు చేసిన కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పుచ్చినట్లు పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే వైద్యలింగం మెడకు అవినీతి ఉచ్చు
సాక్షి, చైన్నె: మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే ఆర్. వైద్యలింగంకు సంబంధించిన రూ.28 కోట్ల అవినీతి కేసులో పునర్విచారణ చేపట్టేందుకు చైన్నె ప్రిన్సిపల్ సెషనన్స్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ విచారణను త్వరగా ముగించి మూడు నెలల వ్యవధిలో తుది నివేదికను దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. 2011–2016 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో వైద్యలింగం గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో చైన్నె పెరుంగళత్తూరులోని శ్రీరామ్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి రూ. 28 కోట్ల లంచం తీసుకున్నారని అరప్పోర్ ఇయక్కమ్ ఆరోపించింది. ఆధారాలతో సహా ఆ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతతో 2022లో అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది. ఈ ఫిర్యాదు ఆధారంగా 2024 సెప్టెంబరులో కేసు నమోదు చేసింది. కాగా, ఈ ఏడాది జనవరిలో వైద్యలింగం అన్నాడీఎంకే పార్టీని వీడి డీఎంకే పార్టీలో చేరారు.అదే సమయంలో వైద్యలింగంపై మోపిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టులో నివేదిక సమర్పించారు. కోర్టు తాజా ఆదేశాలు రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ, పరిపాలనా మార్పుల నేపథ్యంలో, గతంలో సమర్పించిన కేసు మూసివేత నివేదికను ఉపసంహరించుకుని, ౖవైద్యలింగంపై మళ్లీ సమగ్ర విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆ శాఖ అధికారులు కోరారు. ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. కార్తికేయన్, మాజీ మంత్రి ౖవైద్యలింగంపై మరింత విచారణ జరిపేందుకు కేసు పునర్విచారణకు అవినీతి నిరోధక శాఖకు అనుమతినిచ్చారు. అలాగే 3 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి విచారణ కోర్టుకు తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
శివకార్తికేయన్‌తో జత కుదిరింది..!
తమిళసినిమా: క్రేజ్ ఉన్న తారలకు అవకాశాలు కొత్తేమీ కాదు. అలా ఒక క్రేజీ జంట కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నటుడు శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉన్న కథానాయకుడు ఈయన. అమరన్ చిత్రంతో ఈయన స్టార్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. శివకార్తికేయన్ ఇటీవల నటించిన పరాశక్తి చిత్రం కూడా బాగుందనిపించుకుంది. ప్రస్తుతం ఈయన నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి భాగ్యలక్ష్మి భోర్సే నాయికిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నట్లు ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో నటుడు శివకార్తికేయన్ మరో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ బాలకష్ణన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన నటుడు శింబు హీరోగా చిత్రం చిత్రం చేయనున్నట్లు సమాచారం జరిగింది. అయితే ఆ చిత్రం డ్రాప్ అయిందని,అదే కథను ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించనున్న తెలిసింది. కాగా ఇందులో క్రేజీ నటి కారాదు లోహర్ నాయకిగా నటించనున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కయాదు లోహర్ -
క్రీడలతోనే శారీరక ఉల్లాసం
వేలూరు: విద్యార్థులకు క్రీడలతోనే శారీరక ఉల్లాసం పెరుగుతుందని కాట్పాడి డీఎస్పీ విజికుమార్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సన్‌బీమ్ సీబీఎస్సీ పాఠశాలలో వార్షికోత్సవ క్రీడా దినోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాలలోని టీచర్లతో పాటు తల్లిదండ్రులపై ఆదారపడి ఉందన్నారు. విద్య అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు వెళ్లడంతో పాటు దేశాభివృద్ధి సాధించగలమన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివే విధంగా అలవాటు చేయాలే తప్పా కఠినంగా శిక్షించి ప్రతి నిమషం చదువుపైనే ద్యేష పెట్టే విధంగా చేయరాదన్నారు. పాఠశాలలోను, నివసించే ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమ శిక్షణ గల విద్యార్థులుగా ఉండగలరన్నారు. విద్యార్థులకు ఇష్టమైన పనులు చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులు వీరి జీవితాలను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు పట్టుదల, క్రమ శిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లును అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తంగ ప్రకాశం, వైస్ చైర్మన్ జార్జీ అరవింద్, విద్యార్థి నాయకుడు రోహిత్ రామ్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన తిరువణ్ణామలైలోని క్రివాలాబతిలోని ప్రధాన ఆలయాల్లో ఇడుకు వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో గుహలాండి మూడు ప్రవేశాలున్నాయి. వెనుక ద్వారం గుండా పడుకొని ఈ ఆలయంలోకి ప్రవేశించి చేతులు జోడించి నెమ్మదిగా కదిలి ముందు ద్వారం గుండా బయటకు రావాలి. కాగా రెండు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన దాసరి మణిమకుమార్ గుహలో చిక్కుకొని శ్వాస ఆడకుండా మృతి చెందగా, ఆదివారం సాయంత్రం ఆంధ్ర రాష్ట్రానికే చెందిన మరో మహిళ ఈ గుహలో చిక్కుకొని ఊపిరి ఆడకుండా పోవడంతో ఆస్పస్థతకు గురయ్యారు. దీంతో అరుణాచలేశ్వరాలయ జాయింట్ కమిషనర్ భరణీధరణ్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా ఆలయం వద్ద వృద్ధులు, గర్భవతులు, స్థూలకాలం ఉన్నవారు గుహలోనికి వెళ్లరాదని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్‌లో ఇన్‌ప్లోను అంచనా వేయడంతో పాటు రిజర్వాయర్‌కు నీటి మట్టం అమాంతం పెరిగే సమయంలో ఆటోమెటిక్‌గా షట్టర్లను ఎత్తుడానికి రూ.32 కోట్ల వ్యయంతో సెన్సార్ బోర్డు, శాటిలైట్ నిఘా పరికరాలను ఏర్పాటు చేసినట్టు పీడబ్ల్యూడీ అధికారులు వెల్లడించారు. కాగా చైన్నెకు తాగునీటిని అందించే పూండి, పుళల్, చోళవరం, చెమరంబాక్కం తదితర రిజర్వాయర్లను నిత్యం పర్యవేక్షణ, నీటి ఇన్‌ప్లోను నియంత్రించడం, డేటా సేకరణ, మిగులు జలాలను దిగువకు విడుదల చేయడానికి సెన్సార్ టెన్నాలజీని ఉపయోగించాలని తాజాగా నిర్ణయించారు. ఇందు కోసం ఇన్‌ఫ్లోను అంచనా వేయడానికి శాటిలైట్‌ను, అత్యవసర సమయంలో గేట్లును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడానికి సెన్సార్ బోర్డులను పూండి రిజర్వాయర్‌లో అమర్చారు. తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా బాల్‌రెడ్డి కండ్రిగకు చెందిన వికలాంగురాలైన హేమావతి తన ఇద్దరుపిల్లలు కుమారరాజ, చిత్రతో కలిసి తమ సొంతింట ఉంటున్నారు. ఈ క్రమంలో హేమావతి పేరిట ఉన్న ఇంటి పట్టాను రెవెన్యూ అధికారులు, అదే గ్రామానికి చెంది 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట బదలాయించారు. ఇది తెలుసుకున్న హేమావతి దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కవితను కలిసింది. తమకు న్యాయం చేయడంతో పాటు తప్పు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని ఊత్తుకోట పోలీసు లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్టాలిన్‌కు వ్యతిరేకంగాహైకోర్టులో పిటిషన్ సాక్షి, చైన్నె: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్‌ను ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్లో అనేక విషయాలను గోప్యంగా ఉంచారని, వాస్తవానికి ట్రస్టుకు సంబంధించిన వివరాలతో పాటుగా మరెన్నో వివరాలను పొందుపరచ లేదని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ ధర్మాధికారి బెంచ్ పరిశీలించింది. అయితే, వివరాలన్నీ తమిళంలో ఉండటంతో ఆంగ్లంలో తర్జుమా చేసి సమర్పించాలంటూ పిటిషన్‌కు సమయాన్ని కేటాయించారు. అనంతరం విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు. నిజాయితీతో పనిచేయాలి సాక్షి, చైన్నె : ప్రశ్నా పత్రాలను తయారు చేసే ఉపాధ్యాయులు నిజాయితీతో పనిచేయాలని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి. కామకోటి తెలిపారు. కేంద్రం ప్రభుత్వం పరీక్షల సంస్కరణకు సంబంధించి నియమించిన ఉన్నత స్థాయి టాస్క్‌పోర్స్ కమిటీలో తనకు అవకాశం కల్పించిన నేపథ్యంలో సోమవారం చైన్నెలో వి. కామకోటి సోమవారం మాట్లాడుతూ, ప్రశ్నా పత్రాలను తయారుచేసే ఉపాధ్యాయులు నిజాయితీతో వ్యవహరించాలని, బాధ్యతతో పనిచేయాలని హితవు పలికారు. అలాగే, ప్రశ్న పత్రాలను సాంకేతిక పరంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
ఆగాయం చిత్రానికి బిగ్ సపోర్ట్
తమిళసినిమా: దినందోరుమ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నాగరాజ్ ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దినందోరుమ్ నాగరాజ్‌గా ముద్ర వేసుకున్నారు. ఈయన అంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్నలే,కాక్క కాక్క చిత్రాలకు కథా రచయితగా పని చేశారు. కాగా తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆకాయం అని టైటిల్‌ను నిర్ణయించారు. కన్నిమాడమ్ చిత్రం ఫేమ్ శ్రీరామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి ఆలిషా మిరాణి నాయకిఇగా పరిచయం అవుతున్నారు. నటి షీలా, కనిక ,సంతాన భారతి, జయ ప్రకాష్, గిరి ద్వారకేష్ ,మెయ్యప్పన్ చిత్రం ఫేమ్ శ్రీ మణికంఠన్, దీప ,మహారాజా చిత్రం ఫేమ్ సంజన నమితాస్ ,డైరెక్టర్ హరిహరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ నల్ల ముత్తు ఛాయాగ్రహణం, రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డెల్టా టాకీస్ పతాకంపై జయచంద్రన్, కార్తీకదేవి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు విజయ్ సేతుపతి తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చసినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. వైవిధ్యభరిత కథకు కమర్షియల్ అంశాలను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి చిత్రాన్ని కూడా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రిటైర్డ్ ఐఏఎస్ సహాయంకు తుపాకీ భద్రత
సాక్షి, చైన్నె: తమిళనాడు డీజీపీకి చైన్నె హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహాయంకు తక్షణమే తుపాకీతో కూడిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ భద్రతను కల్పించాలని న్యాయమూర్తి సూచించారు. మధురై జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలను సహాయం వెలుగులోకి తెచ్చారు. ఆతదుపరి పరిణామాలతో సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు సహాయంను ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. ప్రభుత్వానికి సుమా రు రూ.1,11,000 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా మధురై ప్రత్యేకకోర్టులో విచారణ కొనసాగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు 2014 నుండి ఆయనకు అందిస్తున్న పోలీస్ సెక్యూరిటీని 2023లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉపసంహరించుకున్నారు. కాగా నిందితుడి ఆభ్యర్థన మేరకు హైకోర్టు తక్షణమే కనీసం ఒక తుపాకీ పోలీసుతో భద్రత పునరుద్ధరించాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. సహాయం భద్రతపై దాఖలైన వినతిపత్రాన్ని సమగ్రంగా సమీక్షించాలని సూచించారు. -
బడ్జెట్ రూపకల్పనపై అభిప్రాయాల సేకరణ
సాక్షి, చైన్నె: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముందుగా, రాష్ట్రంలోని రైతులు , వ్యవసాయ ఆధారిత రంగాల ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించేందుకు చైన్నెలోని అన్నా శతాబ్ది గ్రంథాలయ ప్రాంగణంలో సోమవారం రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వ్యవసాయం , రైతు సంక్షేమ శాఖ మంత్రి వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఆహార సరఫరా, చేనేత, సహకార, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, పర్యావరణ , ఎంఎస్ఎంఈ శాఖలకు చెందిన పదిమంది మంత్రులతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇందులో రైతుల భాగస్వామ్యం గురించి వివరించారు. చైన్నె మినహా మిగిలిన 37 జిల్లాల రైతుల అభిప్రాయాలను సేకరించి సీఎంకు నివేదించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ బడ్జెట్లో భూసార పునరుద్ధరణ, నీటి నిర్వహణ, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, యువతకు అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పంటలకు మద్దతు ధరల రక్షణ , పంట భీమా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభిప్రాయాలను సేకరించారు. కాగా, రైతు సంఘాల ప్రతినిధులతో దక్షిణ భారత రైతు సంఘం నేత అయ్యాకన్ను సచివాలయం సమీపంలో నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ని పోలీసులు బుజ్జగించారు. కరువై దెబ్బ తినడంతో రైతులను ఆదుకోవాలని ఆయన నినదించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
జలాశయాల పూడికతీతకు శ్రీకారం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని, తమిళనాడు వ్యాప్తంగా జలాశయాలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, జలాశయాల్లో పూడికతీత , పునరుద్ధరణ పనులను నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్. ఆనంద్ వేగవంతం చేశారు. చైన్నెలోఈ పనులను ఉదయం మంత్రి ప్రారంభించారు. కూవం నది, పల్లికరనై చిత్తడి నేలలు, ఓక్కియం మడువు ప్రాంతాలలో శనివారం ఉదయం పూడికతీత పనులను మంత్రి పరిశీలించారు. ఈపనులను ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తూ మంత్రి పరిశీలించడం విశేషం. కూవం నది తీరంలోని అమింజికరై పడికుప్పంలలో ఉదయం 9 గంటలకు ఒక్కియంలో 11 గంటలకుపనులను పరిశీలించారు. ఒక్కియం చెరువు, కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. 2.63 కిలోమీటర్ల పొడవు, 80 నుండి 140 మీటర్ల వెడల్పు ఉన్న ఈ కాలువ ద్వారా వర్షపు నీరు పల్లికరనై చిత్తడి నేల నుండి బకింగ్‌హామ్ కాలువ మీదుగా సముద్రంలోకి చేరుకుంటుంది. మొదటి దశలో 2,650 మీటర్ల పూడికతీత పనులు చేపట్టారు. వరద ముప్పు నివారణ చర్యల్లో భాగంగా మంత్రి ఆనంద్ తదుపరి పరిశీలన 28వ తేది మనపాక్కం సమీపంలోని అడయార్ నది, షోళింగనల్లూరు, అక్కరై వంతెన వద్ద సౌత్ బకింగ్‌హామ్ కాలువ పనుల పరిశీలన జరగనున్నది. 29వ తేదీన వేలచ్చేరి, నారాయణ పురం చెరువులను పరిశీలించనున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలు రాకముందే జలాశయాల పూడికతీత పనులన్నీ ఆలస్యం లేకుండా, ఎటువంటి లోపాలు జరగకుండా పూర్తి చేయాలన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం అని పేరొకటూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 వేల చెరువులలో నీటిపారుదల పనులు ముమ్మరం చేయాలని సూచించారు. -
ఆగస్టు 1న రాహుల్ రాష్ట్ర పర్యటన
సాక్షి, చైన్నె: తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఏఐసీసీ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగస్టు 1న తమిళనాడులో పర్యటించనున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సెల్వపెరుంతొగైను తప్పించి మాణిక్యం ఠాకూర్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేస్తూ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించి వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో యువతను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేర్పించడం, శ్రేణుల్లో రాజకీయ చైతన్యం నింపడం లక్ష్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తమిళనాడులో పర్యటించి బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పరిస్థితులలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ ప్రకటనను ప్రస్తావిస్తూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ వివరాలను ప్రకటించారు. రాష్ట్ర పర్యటనకు రాక రాహుల్ గాంధీ రాక తమిళనాడు కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపుతుందని వ్యాఖ్యలు చేశారు. 2029 పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడమే లక్ష్యంగా తమిళనాడు కాంగ్రెస్ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో అప్పుడే భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొన్నాయని పేర్కొంటూ, ఆగస్టు 1న ఇక్కడకు రానున్నట్టు ప్రకటించారు. కాగా, చైన్నె శివారులో కాంగ్రెస్ నేతలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకలో రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. -
ప్రజాక్షేత్రంలో పతనం కావడం ఖాయం
సాక్షిచ, చైన్నె: విమర్శలు చేసినంత మాత్రాన అరెస్టులకు పాల్పడుతున్న పాలకులు కోర్టులలో మొట్టికాయలు తినడమే కాకుండా, ప్రజాక్షేత్రంలోనూ ఘోర పరాజయాన్ని చవిచూడటం ఖాయమని ప్రతిపక్ష నేత, డిఎంకె యువజన నాయకుడు ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. పాలయంకోటై సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న డిఎంకె ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సోమవారం పరామర్శించిన అనంతరం ఆయన స్పందిస్తూ, నిరంకుశత్వంతో కూడిన ప్రభుత్వ పగటిపూట కక్షసాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ అయిన దమ ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పాలయంకోటై సెంట్రల్ జైలులో కలవడం జరిగిందన్నారు. జైలులో ఉన్నప్పటికీ ఆయన మునుపటి కంటే అత్యంత ఉత్సాహంతో, ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చట్టపరమైన పోరాటం డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ మార్గదర్శకత్వంలో లాయర్లు చేపడుతున్న బెయిల్, చట్టపరమైన చర్యల వివరాలను ఆయనకు వివరించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. డీఎంకే అనేది మిసా, ఎమర్జెన్సీ కాలాలనే ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీ అని, అనుకోకుండా అధికారంలోకి వచ్చి విచక్షణారహితంగా పాలిస్తున్న ఈ ప్రభుత్వం చేసే అరెస్టులకు డీఎంకే చివరి కార్యకర్త కూడా భయపడడని ఈ సందర్భంగా ఉదయనిధి హెచ్చరించారు. -
ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలచే మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయ కూరలు, పుష్పాలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోం హర నామ స్మరణాల మద్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామి వార్లును అధికార నందీ వాహణంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాలాల నడుమ ఊరేగించారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు, స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు చేసి దీపారధన పూజలు చేసి ప్రార్థనలు జరిపారు. -
‘ఆ ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు’.. సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి,చెన్నై: మద్రాస్ హైకోర్టులో సీఎం విజయ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం, సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు. ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై సోమవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. దీంతో సీఎంగా విజయ్‌కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం విజయ్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. -
క్రీస్తు జీవిత చరిత్రతో 'ప్రజాపతి'
యేసుప్రభు జీవిత చరిత్రతో ఇంతకుముందు పలు సినిమాలు వచ్చాయి. తాజాగా 'ప్రజాపతి' పేరుతో మరో మూవీ తెరకెక్కబోతోంది. అల్లేలూయ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ సమర్పణలో బి.రూబెర్ట్ కథ,దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రమిది. ప్రజాపతి పేరుతో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ఈయన గత 25 ఏళ్లుగా నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కాగా ప్రభు ఆదేశాలు మేరకు ఈ నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పూనుకున్నట్లు బి.రూబెర్ట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.చిత్ర నిర్మాణానికి ముందే ట్రైలర్‌ను రూపొందించడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపతి చిత్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్న రూపేష్ ఆహ్వానించడంతో ఇందులో పాల్గొనడానికి అంగీకరించాను. ఎందుకంటే ఇది ఈ కాలంలో జరగాల్సిన ముఖ్యమైన ప్రయత్నం గా నేను భావించాను. ఇప్పుడు సమాజానికి మంచి విషయాన్ని ప్రకటించడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో అక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకునే విధంగా రూపొందాలని సూచించడంతో పాటూ శుభాకాంక్షలు అందించారు. చిత్ర ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు
సాక్షి,చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని సెంగమలపట్టిలో ఆదివారం ఉదయం అనుమతి లేకుండా ఒక వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమ యజమానిసహా ముగ్గురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు దాటికి మృతుల శరీరావయవాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడటంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. రేకుల షెడ్డు పక్కనే నిలిపి ఉంచిన ఒక కారు, బైక్ ధ్వంసమయ్యాయి. అలాగే సమీపంలోని మూడు ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న శివకాశి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ధ్వంసమైన బాణసంచా పరిశ్రమ -
తిరుత్తణి ఆలయంలో కావళ్ల సందడి
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆడినెల ఆదివారం సందర్భంగా కావళ్ల సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడినెలలో ఆడికృత్తిక తెప్పోత్సవం వచ్చే నెల 4 నుంచి 8 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. ఆడినెల ప్రారంభంతో తిరుత్తణి ఆలయంకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆడినెల ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మెట్లు మార్గంతో పాటు, ఘాట్‌రోడ్డులో భక్తజనం కొండ ఆలయంలో పోటెత్తారు. భక్తులు చాలా మంది కావళ్లతో కొండ ఆలయంకు మురుగన్భక్తులు పాటలు ఆలపిస్తూ చేరుకున్నారు. సర్వ దర్శన క్యూలైన్ మార్గంలో మూడు గంటలు, రూ. వంద ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వేకువజామున మూలవర్లకు పంచామృత అభిషేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి మహా దీపారాధన నిర్వహించారు. రాత్రి వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణరథంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఆడినెల ఆదివారం 72 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
స్నాతకోత్సవాల్లో తమిళ్ తాయ్ వాల్తు తప్పనిసరి
సాక్షి, చైన్నె: విద్యా సంస్థల స్నాతకోత్సవాలలో తప్పని సరిగా తమిళ్ తాయ్ వాల్తు గీతం ఆలపించాల్సిందేనన్న ఉత్తర్వులు జారీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం స్పందిస్తూ,. తిరునెల్వేలి మనోన్మణీయం సుందరనార్ విశ్వవిద్యాలయ 33వ స్నాతకోత్సవం జూలై 28న జరగనుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ అర్లేకర్ హాజరుకానున్నారన్నారు. అయితే రాజ్‌భవన్ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం, మూడో స్థానంలో రాష్ట్రగీతం తమిళ్ తాయ్ వాల్తు ఉన్నట్టు వివరించారు. ఈ సమాచారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీలలో గవర్నర్ పాల్గొన్నా సరే తప్పని సరిగా తమిళ్ తాయ్ వాల్తుకు తొలి ప్రాధాన్యత ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తమిళ్ తాయ్ వాల్తు గేయాన్ని రచించిన మనోన్మణీయం సుందరనార్ పేరిట ఉన్న విశ్వవిద్యాలయంలో ఆయన గీతానికి మూడో స్థానం దక్కుతుండటం వేదన కలిగిస్తుందన్నారు. గవర్నర్లు పాల్గొనే కార్యక్రమాల్లో మొదట వందేమాతరం, ఆపై జాతీయ గీతం, చివరగా రాష్ట్ర గీతం పాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పంపిన ఉత్తర్వుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇందుకు చెక్ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు శాసనసభలో గవర్నర్ ప్రసంగం ప్రారంభంలో మొదట తమిల్ తాయ్ వాల్తు ఆలపించే సంప్రదాయం ఉందనే విషయాన్ని గుర్తుచేసిన మాణిక్యం ఠాగూర్, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సైతం ఇదే విధానం అనుసరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
వరద నివారణకు రూ.165 కోట్లు
సాక్షి, చైన్నె: చైన్నె దక్షిణంలోని శివారు ప్రాంతమైన తాంబరం , దాని పరిసరాల్లో ప్రతి ఏటా వర్షాకాలంలో తలెత్తే వరద ముప్పును అరికట్టేందుకు తాంబరం మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 165 కోట్ల వ్యయంతో 7 ప్రధాన చెరువులనుఏ పునరుద్ధరించడానికి , పూడిక తీయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. చైన్నెకు దక్షిణంలో ఉన్న తాంబరం పరిసరాలలో అనేక చెరువులు నిండినా, తెగినా, ఆ ప్రబావం చైన్నెనగరంపై ప్రతి ఏటా వర్షాల సీజన్లో పడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిసరాలలో ఆక్రమణల తొలగింపునకు పదే పదే కోర్టులు సైతం ఉత్తర్వులు జారీ చేసినా ఇన్నాళ్ళు ఫలితం శూన్యం.తాజాగా రాష్ట్రంలో అధికార మార్పు నేపథ్యంలో తాంబరం కార్పొరేషన్ అధికారులు వరద నివారణ లక్ష్యంగా దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఆక్రమణల తొలగింపు – పునరుద్ధరణ చెరువులు, నీటిమార్గాల ఆక్రమణల వల్ల వర్షాకాలంలో తూర్పు, పశ్చిమ తాంబరం ప్రాంతాలు తీవ్రంగా ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి మాడంబాక్కం, వీరరాఘవన్, నెమిలిచ్చేరి, నన్మంగళం, సైలెయూర్, పీకంకరనై , రాజకీజ్పాక్కం లోని 7 చెరువలలోని ఆక్రమణలను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు లోతుగా పూడిక తీయనున్నారు. కార్పొరేషన్ పరిధి విస్తరణ తాంబరం విస్తరణలో భాగంగా మేడవాక్కం, కోవిలంపాక్కం, ముడిచూర్, పెరుంపాక్కం సహా 19 గ్రామ పంచాయతీలు 2027లో తాంబరం కార్పొరేషన్లో విలీనం కానున్నాయి. దీనివలన కార్పొరేషన్ పరిధిలోని మొత్తం చెరువుల సంఖ్య 35కి పెరుగుతుంది. ఇప్పటికే కార్పొరేషన్ 10 చెరువులను విజయవంతంగా పునరుద్ధరించింది. 2,000 దుకాణాల ఆక్రమణలపై చర్యలు చెరువులు, వాటి సమీపంలో సుమారు 2,000 మంది ఫుట్ పాత్ వ్యాపారులు ఉన్నట్లు కార్పొరేషన్ సర్వేలో తేలింది. ఆక్రమణలకు గురైన ప్రాంతాల వివరాలతో జాబితా సిద్ధం చేశామని, త్వరలోనే తొలగింపు చర్యలు చేపడతామని చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రాజెక్టులో చేపట్టే పనులు చెరువుల నుంచి నుండి పూడిక తీత, కలుపు మొక్కల తొలగింపు. గట్లను బలోపేతం చేసి ఎత్తు పెంచడం, తూములు , అదనపు ఆనకట్టల పునర్నిర్మాణంకు చర్యలు తీసుకోనున్నారు. వీటిలో మురుగునీరు కలవకుండా శుద్ధి కర్మాగారాలకు మళ్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. చెరువుల చుట్టూ కంచెలు వేయడం, నడక దారులు , చెట్ల పెంపకం, సీసీటీవీ నిఘా ఏర్పాటుకు నిర్ణయించారు. -
ఇకపై ధ్వజస్తంభానికీ.. అనుమతి తప్పనిసరి!
సాక్షి, చైన్నె: తమిళనాడులోని ఆలయాల్లో కొత్తగా ధ్వజస్తంభం ప్రతిష్టించాలన్నా లేదా పాతదాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలన్నా కమిషనర్ నుండి కనీసం 15 రోజుల ముందే ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి చేశారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ టి.జి. వినయ్ అన్ని అన్ని ఆలయాలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల ముందే దరఖాస్తు లిస్టెడ్, నాన్–లిస్టెడ్ ఆలయాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించారు. కొత్త ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు కనీసం 15 రోజుల ముందు కమిషనర్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి లేదా ధర్మకర్తల తీర్మానం ప్రతి, ప్రాంతీయ స్థపతి అభిప్రాయం, డ్రాయింగ్ కమిటీ సిఫార్సు, ఆలయ అర్చకుల లేఖ, ముహూర్తం పత్రిక, కొత్త ధ్వజస్తంభం రంగు ఫోటో , పాత ధ్వజస్తంభాన్ని తొలగించేందుకు పొందిన అనుమతి పత్రం కాపీలను జతచేయాలని పేర్కొన్నారు. దాతల విరాళాలు – కవచాల అమరిక దాతల ద్వారా ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుంటే, వారి సమ్మతి లేఖతో పాటు ఆర్థిక ఆధారాల ధృవీకరణ పత్రాలను అందించాలని తెలిపారు. అలాగే ధ్వజస్తంభానికి బంగారం, వెండి లేదా రాగి కవచాలు అమర్చాలనుకుంటే దానికి విడిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని వివరించారు. ఇప్పటివరకు ధ్వజస్తంభం లేని ఆలయాల్లో మొదటిసారి ప్రతిష్ఠిస్తుంటే, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ తీర్మానంతో పాటు ఆగమ పండితుల (శివాచార్య/ భట్టాచార్య) సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి చేశారు. ధ్వజస్తంభ ఏర్పాటు ప్రక్రియ అంతా పూర్తిగా ఆగమ శాస్త్రాల ప్రకారమే జరగాలని, ప్రాంతీయ సహాయ లేదా డిప్యూటీ కమిషనర్ సమక్షంలో, స్థపతి, ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సిబ్బంది భద్రతను నిర్ధారిస్తూ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. వీడియో రికార్డింగ్ – పురాతన వస్తువుల భద్రత పాత ధ్వజస్తంభం కింద ఏదైనా విలువైన వస్తువులు లభిస్తే, వాటి వివరాలను రికార్డు చేసి తిరిగి కొత్త ధ్వజస్తంభం కిందనే నిక్షిప్తం చేయాలని, పనుల ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఘట్టాన్ని ఫోటోలు, వీడియోలు తీసి ఆలయ రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను వీడియో ఆధారాలతో సహా కమిషనర్‌కు సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొనడం గమనార్హం. -
మళ్లీ నిరాశే!
● మదురై, కోయంబత్తూరు మెట్రో నివేదిక తిరస్కరణ సాక్షి, చైన్నె: మదురై, కోయంబత్తూరు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సమర్పించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరోసారి తిరస్కరించి వెనక్కి పంపింది. తగినంత జనాభా లేదనే కారణంతో ఈ ప్రాజెక్టులకు అనుమతి నిరాకరించింది. రూ.22,000 కోట్లకు పైగా వ్యయంతో ప్రణాళిక తమిళనాడు ప్రభుత్వం మదురైలో రూ. 11,360 కోట్ల వ్యయంతో (తిరుమంగళం నుండి ఒత్తకడై వరకు 31.93 కి.మీ) , కోయంబత్తూరులో రూ. 10,740 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రానికి సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపించింది. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం మెట్రో సేవలు పొందేందుకు సదరు నగరం కనీసం 20 లక్షలు (2 మిలియన్లు) లేదా అంతకంటే ఎక్కువ జనాభాను కలిగి ఉండాలి. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా: 2011 అధికారిక గణాంకాల ప్రకారం కోయంబత్తూరు జనాభా 15.84 లక్షలు కాగా, మదురై జనాభా 15 లక్షల కంటే తక్కువగా ఉంది. గత ఏడాది నవంబర్ తొలి సారిగా ఈ నివేదిక ఢిల్లీకి చేరగా తిరస్కరణకు గురైంది. మళ్లీ ఈ ఏడాది మే నెలల రెండోసారి పంపిని ఈ నివేదికలను కేంద్రం వెనక్కి పంపుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. మెట్రోకు బదులుగా బస్సు రవాణా వ్యవస్థను మెరుగుపరచవచ్చని సూచించింది. తమిళనాడు ప్రభుత్వం వాదన 2011 తర్వాత అధికారిక జనాభా గణన జరగకపోవడం వల్లే ప్రస్తుత జనాభాను నిరూపించలేకపోతున్నామని, ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో జనాభా గణనీయంగా పెరిగిందని తమిళనాడు స్పష్టం చేసింది. కోయంబత్తూరు పారిశ్రామిక నగరంగా, మదురై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నిత్యం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయని, కాబట్టి శాశ్వత జనాభాతో పాటు ఈ ఫ్లోటింగ్ జనాభాను పరిగణనలోకి తీసుకోవాలని కోరినప్పటికీ కేంద్రం తిరస్కరించింది. కేంద్రం తీరుపై ఈ రెండు నగరాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నాలుగు దశాబ్దాల తర్వాత..
వేదికగా అపూర్వ కలయిక తిరుత్తణి: ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్ధులు నాలుగు దశాబ్దాల తర్వాత కలిశారు. తిరువలంగాడు యూనియన్‌లోని కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో 1984–87 విద్యా సంవత్సరాల్లో తెలుగు మీడియంలో టెన్త్, ప్లస్‌టూ చదువుకున్న 60 మంది పూర్వ విద్యార్థుని, విద్యార్ధులు పాఠశాల చదువు పూర్తి చేసుకుని పై చదువులు చదవి దేశ విదేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆరు వసంతాలు నిండిన వారంతా కుటుంబాలతో సంతోష జీవితం గడుపుతున్నారు. చదువుకున్న బడి, పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుల చొరువతో మంచి స్థితికి చేరుకున్న వారు తమ బడిలో కలుసుకుని, గురు వందనం చేయాలని నిర్ణయించి మూడు నెలలుగా బడి మిత్రులను అన్వేషించి వాట్సాప్ ద్వారా ఒక్కటైయ్యారు. దీంతో ఆదివారం పాఠశాల వేదికగా అపూర్వ కలయిక వేడుకకు పాఠశాల వేదికై ంది. విద్యార్థి దశలో విడిపోయి జీవిత చరమాంకంలో కలుసుకోవడం వారిలో అమితానందం నింపింది. విద్య నేర్పిన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. పాఠశాలకు తమంతుగా రూ. 1.50 లక్షల విలువైన గ్రిల్ అందజేశారు. -
పుదుచ్చేరి కూటమిలో విభేదాలు
సాక్షి, చైన్నె: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పుదుచ్చేరి బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద అధికారికంగా నివాళులర్పించే కార్యక్రమంలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమిలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ మంత్రులు, నేతలు విడిగా వచ్చి అమరవీరులకు నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి బీచ్ రోడ్డులోని స్మారక స్థూపం వద్ద నిర్వహించిన అధికారిక వేడుకలో లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్, ముఖ్యమంత్రి రంగస్వామి, అసెంబ్లీ స్పీకర్ అన్బళగన్, మంత్రులు రాజవేలు, శివకొళుందు మరియు ఎమ్మెల్యేలు హాజరై పుష్పగుచ్ఛాలు ఉంచి సైనికులకు నివాళులర్పించారు. కూటమిలో విభేదాలు – బీజేపీ దూరం పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. అయితే, గతంలో ఇచ్చిన మంత్రి పదవుల కేటాయింపుపై ముఖ్యమంత్రి రంగస్వామి సానుకూలంగా స్పందించకపోవడంతో బీజేపీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. సీఎం రంగస్వామి పంపిన పలు ఫైళ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్ కూడా ఆమోదం తెలపడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. విడిగా వచ్చి నివాళులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పూర్తయిన తర్వాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం నాయకత్వంలో రాష్ట్ర మంత్రి నమశ్శివాయం, మాజీ స్పీకర్ సెల్వం తదితర బీజేపీ నాయకులు విడిగా వచ్చి వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. -
రంగంలోకి రాందాసు కుమార్తె, మనవడు
పీఎంకే రాజకీయాలలో ట్విస్టు చోటు చేసుకుంది. పార్టీలో చీలిక దిశగా రాందాసు కుమార్తె శ్రీగాంధీ ప్రయత్నాలు చేపట్టారు. తన కుమారుడు ముకుందన్తో కలిసి పుదుచ్చేరి సీఎం రంగస్వామి ద్వారా పావులు కదుపుతుండటం చర్చకు దారి తీసింది. పీఎంకే అసంతృప్తి వాదులందర్నీ, వన్నియర్ సంఘాల నేతలన్నీ ఏకం చేసి, తమిళనాట ఎన్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు విస్తృతం చేశారు. ఉత్తరతమిళనాడు వైపుగా రంగన్న చూపు ఆగస్టు 4న కీలక ప్రకటన సేలం పీఎంకే మాజీ ఎమ్మెల్యే అరుళ్‌తో పాటు పలువురు కీలక నేతలు పుదుచ్చేరిలో రంగస్వామిని కలిసి ఎన్.ఆర్. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా రాందాసు కుటుంబానికి చెందిన వారు సైతం భేటి కావడంతో ప్రాధాన్యత నెలకొంది. ఆగస్టు 4న చైన్నెలో భారీ సభకు పీఎంకే అసంతృప్తి వాదులు కసరత్తులు చేస్తుండటం గమనార్హం. ఆగస్టు 4న పుదుచ్చేరీ సీఎం రంగస్వామి పుట్టినరోజును పురస్కరించుకుని చైన్నెలో ఒక భారీ బహిరంగ సభ వేదికగా తమిళనాడు ఎన్.ఆర్. కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించడమే కాకుండా, పీఎంకేలో చీలిక దిశగా అక్కడున్న ముఖ్య నేతలు, సీనియర్లను తమ వైపుగా తిప్పుకుని పదవులు అప్పగించేందుకు రంగన్న సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి రాందాసుతో శ్రీగాంధీసాక్షి, చైన్నె : పీఎంకేలో గత ఏడాదిన్నర కాలంగా సాగిన పరిణామాలు గురించి తెలిసిందే. ఈ ప్రయాణంలో తనను వారసుడైన అన్బుమణి మోసం చేశాడంటూ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు తీవ్ర ఆరోపణలు, ఆగ్రహాలు, ఆవేదనలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయనకు పక్క బలంగా కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్తో పాటుగా సీనియర్ నేతలు అనేక మంది నిలబడ్డారు. అన్బుమణికి చెక్ పెట్టే దిశగా శ్రీగాంధికి పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ పదవిని సైతం రాందాసు కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై, తమిళనాట అధికార మార్పు పరిణామాల నేపథ్యంలో తాజాగా తండ్రి రాందాసు, తనయుడు అన్బుమణి ఏకం అయ్యారు. రాందాసు ఏకంగా రాజకీయ సన్యాసం పుచ్చుకుని పీఎంకే బాధ్యతలన్నీ అన్బుమణికి అప్పగించేశారు. అయితే, తమను రాందాసు వాడుకుని వదిలేశారన్న ఆగ్రహంతో వన్నియర్ సంఘాల నేతలు, కుటుంబానికి చెందిన కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్తో పాటుగా ఎందరో నేతలు తీవ్ర అసహనంతో ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా పీఎంకేకు ట్విస్టు ఇచ్చే దిశగా శ్రీగాంధీ అడుగుల వేగం పెంచడం చర్చకు దారి తీసింది. రంగస్వామితో రామదాస్ కుమార్తె, మనుమడు భేటీ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామానికి దారి తీసే ఆవిష్కరణ ఆదివారం పుదుచ్చేరి వేదికగా జరిగింది. రాందాసు కుటుంబ వివాదాల రాజకీయం ట్విస్టు రాజకీయాలకు వేదిక అయింది. పీఎంకేకు చెందిన పలువురు కీలక నేతలు ఎన్.ఆర్. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. పీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా ఇన్నాళ్లు పదవిలో కొనసాగి తాజాగా తప్పుకున్న రాందాసు కుమార్తె శ్రీగాంధి, యువజన నేత ముకుందన్ పరుశురామన్లు పుదుచ్చేరి సీఎం రంగస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ సందర్భంగా రంగస్వామి వారికి విభూతి పూసి, ఆశీర్వదించడం గమనార్హం. రానున్న రోజులలో తమిళనాడులో ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, విస్తరించే అంశంపై తాజాగా రంగస్వామితో శ్రీగాంధి, ముకుందన్ భేటి సందర్భంగా చర్చలు జరిగినట్లు సమాచారం. పుదుచ్చేరితో పాటు తమిళనాడుకు చెందిన పలువురు ముఖ్య నాయకులు త్వరలోనే ఎన్.ఆర్. కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలిసిందే. రంగస్వామితో భేటీ అనంతరం ముకుందన్ మాట్లాడుతూ తాము పెద్దాయన రాందాసును కలిసి స్పష్టంగా చెప్పేశామని, ఇకపై పీఎంకే పార్టీలో మనుగడ సాధించ లేమని స్పష్టం చేశారు. పెద్దాయన కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పామన్నారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామితో జరిపిన భేటీకి సంబంధించి వివరాలను త్వరలోనే శుభవార్త చెప్తామని వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం విజయ్‌కు పుదుచ్చేరి సీఎం రంగస్వామికి మధ్య స్నేహ పూర్వక బంధం ఉంది. ఇది తాజాగా రాజకీయ అనుబంధం కానున్నది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ టీవీకేకు ఉత్తర తమిళనాడులోని అనేక జిల్లాలలో పెద్దగా ఫలితం దక్కలేదు. ఈ పరిస్థితులలో విజయ్‌కు పక్కబలంగా భవిష్యత్తులో ఉండే దిశగా రంగస్వామి తన పార్టీని ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాలకు విస్తరించి, వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను గురి పెట్టే దిశగావ్యూహాలకు పదును పెట్టారు. ఆ దిశగా కడలూర్, విల్లుపురం, కళ్లకురిచి, తిరువణ్ణామలై, నాగపట్నం, మయిలాడుదురై సేలం వంటి ప్రాంతాల్లో తనకు ఉన్న ఆదరణను పరిగణించి ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో బలాన్ని చాటి , ఎన్నికలలో పోటీ చేయాలని ఆయన చాలా కాలంగా భావిస్తున్నారు. తాజా పరిణామాలతో ఎన్ఆర్ కాంగ్రెస్‌ను తమిళనాడులో విస్తరింప చేయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందుకు అస్త్రంగా రాందాసు కుమార్తె శ్రీగాంధి, మనవడు ముకుందన్లతో పాటుగా పీఎంకే అసంతృప్తి వాదులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
జీవీ ప్రకాష్ కుమార్, శీను రామసామి కాంబోలో..
తమిళసినిమా: సంగీత దర్శకుడిగా శతకప్రయాణం చేసిన జివీ. ప్రకాష్ కుమార్, కథానాయకుడిగానూ వరుసగా చిత్రాలు నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆయన తాజాగా వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడుగా పేరుగాంచిన శీను రామస్వామి దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇడిముళక్కమ్ అనే టైటిల్ ని నిర్ణయించారు. స్కై మాన్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పై కలైమగన్ ముబారక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటి గాయత్రి శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో శరణ్య పొన్వన్నన్,సౌందరరాజా, యోగిబాబు, బాబా భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి అశోక రాజా ఛాయాగ్రహణం, ఎన్ ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇది తమిళనాడులోని దక్షిణాది జిల్లాల నేపథ్యంలో రూపొందుతున్న పగ ,ప్రతీకారం ఇతివత్తంతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కథాచిత్రంగా ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని రెండు ఎనర్జిక్ ఐటెం సాంగ్స్‌తో కూడిన లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేసినట్లు చెప్పారని పేర్కొన్నారు. అందులో ఒకటి వైరమత్తు రాసిన గానా విళక్కు మయిలే అనే పల్లవితో సాగే పాట, వావరదన్ రాసిన అండి తేదీని సందైయిల్ అనే పల్లవితో సాగే పాట చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ లిరికల్ వీడియోలు సోనీ సంస్థ విడుదల చేసినట్లు చెప్పారు. కాగా జీవీ ప్రకాష్ కుమార్, దర్శకుడు శ్రీను రామసామిల రేర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ఇడిముళక్కమ్ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. -
క్రీస్తు జీవిత చరిత్రతో.. ‘ప్రజాపతి’
తమిళసినిమా: యేసుప్రభు జీవిత చరిత్రతో ఇంతకుముందు పలు చిత్రాలు రూపొందాయి. తాజాగా ప్రజాపతి పేరుతో మరో బ్రహ్మాండ చిత్రం తెరకెక్కబోతోంది. అల్లేలూయ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ సమర్పణలో బి.రూబెర్ట్ కథ, దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ఇది. ప్రజాపతి పేరుతో యేసు క్రీస్తు జీవిత చరిత్రను ఈయన గత 25 ఏళ్లుగా నాటకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. కాగా ప్రభు ఆదేశాలు మేరకు ఈ నాటకాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పూనుకున్నట్లు బి.రూబెర్ట్ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. చిత్ర నిర్మాణానికి ముందే ట్రైలర్‌ను రూపొందించడం విశేషం. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాపతి చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్న రూపేష్ ఆహ్వానించడంతో ఇందులో పాల్గొనడానికి అంగీకరించాను. ఎందుకంటే ఇది ఈ కాలంలో జరగాల్సిన ముఖ్యమైన ప్రయత్నం గా నేను భావించాను. ఇప్పుడు సమాజానికి మంచి విషయాన్ని ప్రకటించడం చాలా అవసరం ఆ ఉద్దేశంతో అక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకులను హత్తుకునే విధంగా రూపొందాలని సూచించడంతో పాటూ శుభాకాంక్షలు అందించారు. చిత్ర ట్రైలర్ చాలా అద్భుతంగా ఉందన్నారు. -
కట్టా కుస్తీ చిత్ర దర్శకుడితో..
తమిళసినిమా: ఇటీవల వేరు వేరు చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. విష్ణు విశాల్ హీరోగా కట్టా కుస్తీ 1,2 చిత్రాలను రూపొందించి మంచి విజయాలను అందుకున్న దర్శకుడు సెల్లా అయ్యావు. అదేవిధంగా తొలిసారిగా కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించి ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు కెన్ కరుణాస్. కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన యూత్ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో కెన్ కరుణాస్ తదుపరి చిత్రం ఏమిటి అన్న ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానంగా ఆయన తన తదుపరి చిత్రాన్ని వెట్రిమారన్ దర్శకత్వం వహించి నున్న రాజన్ వగైయరా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కట్టాకుస్తి చిత్రం సెల్లా అయ్యావు దర్శకత్వంలోనూ కెన్ కరుణాస్ హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కట్టా కుస్తీ –2 చిత్రంలో కీలకపాత్రను పోషించిన నటుడు కరుణాస్‌కు దర్శకుడు సెల్లా అయ్యావు తో మంచి స్నేహం ఏర్పడిందని, దీంతో ఆయన దర్శకత్వంలో తన కొడుకు కెన్ కరుణాస్ హీరోగా నటుడు కరుణాస్ చిత్రాన్ని నిర్మించడానికి సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానం
కొరుక్కుపేట: ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మోటుపల్లికి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు వరించింది. చైన్నెలో ఆదివారం జరిగిన నేషనల్ కన్వెన్షన్ ఆన్ బోర్డ్స్ 2026లో భాగంగాయూఏఈకి చెందిన ట్రైస్టార్ గ్రూప్ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ)– ఇండియా నిర్వహించిన ఐ ఓ డి గ్లోబల్ సన్మాన కార్యక్రమంలో, ఐడియల్ అవార్డులతో పాటు ఐఓడి గ్లోబల్ ఎక్సలెనన్స్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. పరివర్తన యుగం కోసం అత్యుత్తమ పనితీరు కనబరిచే బోర్డులను నిర్మించడంఅనే అంశంపై ప్రసన్న కుమార్ మోటుపల్లి విశిష్ట వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి , ఇనన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ జాతీయ ఛైర్మన్ జస్టిస్ యు.యు. లలిత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ జాతీయ వైస్–ఛైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ వర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విజయ దివాస్..!
సాక్షి, చైన్నె: కార్గిల్ వీరులకు వీర వందనం సమర్పించే విధంగా చైన్నె, తిరుచ్చి, పుదుచ్చేరి, నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లలోని అమర వీరుల స్తూపాల వద్ద ఆదివారం కార్యక్రమాలు జరిగాయి. చైన్నెలోని వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ వర్గాలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాయి. వివరాలు.. 1999లో పాకిస్తాన్‌పై జరిపిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయోత్సవాన్ని అంది పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఎందరో వీరులు అమరులయ్యారు. ఈ విజయోత్సవంతో పాటూ అమర వీరులకు నివాళులర్పించే విధంగా ఏటా జూలై 26వ తేదిన కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చైన్నె మెరీనా తీరంలోని వార్ మోమోరియల్ పరిసరాలను వివిధ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఆర్మీ వర్గాలు పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించాయి. దక్షిణ భారత ఏరియా ఆర్మీ అధికారి అధికారుల, నావికాదళం, వైమానిక దళం అధికారులు వార్ మెమోరియల్ స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర వందనం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను పంచుకున్నారు. సైనికుల సేవలను గుర్తు చేశారు. ఇక, తిరుచ్చి కంట్రోన్మెంట్లోని మేజర్ శరవణన్ స్మారక స్తూపం వద్ద పలు సంఘాలు, ఆర్మీ వర్గా లు, మాజీ సైనికుల కుటుంబాలు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు అంజలి ఘటించారు. చైన్నెలో దక్షిణ భారత ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ వి. శ్రీహరి నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి. కార్గిల్ యుద్ధంలో దేశ విజయం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల అసమాన ధైర్యసాహసాలను, అత్యున్నత త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ స్మారక కార్యక్రమంలో త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) సంయుక్తంగా గౌరవ వందనం సమర్పించగా, ఆర్మీ బ్యాండ్ వినిపించిన ’‘ాస్ట్ పోస్ట్’ ధ్వని వీరమరణం పొందిన సైనికులకు కృతజ్ఞతాంజలి ఘటించింది. కమోడోర్ సువరతన్ మాగన్ (తమిళనాడు – పుదుచ్చేరి నావల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్), ఎయిర్ కమోడోర్ తపన్ శర్మ (తాంబరం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్), మురుగన్ (కోస్ట్ గార్డ్ రీజియన్ ఈస్ట్ డిస్ట్రిక్ట్–5 కమాండర్)లతో పాటు రక్షణ దళాల పూర్వ సైనికులు, వీర నారీమణులు, ఎన్సీసీ క్యాడెట్లు, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరులకు అంజలి ఘటించారు. చారిత్రక నేపథ్యం.. కాగా, చైన్నె వార్ మెమోరియల్‌ను టీ–55 ట్యాంక్, నావికాదళానికి చెందిన చారిత్రక చిహ్నాలతో ఆధునీకరించారు. చైన్నె విజయ్ వార్ మెమోరియల్ ప్రాంగణంలో ఈ వేడుకలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాలకు సాయుధ దళాల త్యాగాలను, దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా యుద్ధ ఫిరంగులు, యుద్ధనౌకల నమూనాలతో కొత్త రూపుదిద్దుకున్న చైన్నె యుద్ధ స్మారక చిహ్నం, సైనిక వారసత్వ సముదాయంగా వార్ మెమోరియల్‌ను మార్ప చేశారు. మెరీనా బీచ్‌కు, చారిత్రక సెయింట్ జార్జ్ కోటకు మధ్య ఉన్న ఈ యుద్ధ స్మారక చిహ్నాన్ని మొదట్లో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో వీరమరణం పొందిన చైన్నె ప్రెసిడెన్సీ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. కాలక్రమంలో, స్వాతంత్య్రం తర్వాత జరిగిన అన్ని యుద్ధాలు, సైనిక చర్యల్లో అమరులైన త్రివిధ దళాల వీరులను గౌరవించే జాతీయ స్మారక చిహ్నంగా ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం దీనిని భారత సేనల వీరత్వాన్ని చాటిచెప్పే అత్యుత్తమ సైనిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దారు. భారత ఆర్మీ దక్షిణ్ భారత్ ఏరియా హెడ్‌క్వార్టర్స్, తమిళనాడు ప్రభుత్వం , చైన్నె కార్పొరేషన్లు సంయుక్తంగా ఈ అభివృద్ధి పనులను పూర్తి చేశాయి. ప్రత్యేక బైక్ ర్యాలీ కార్గిల్ యోధుల స్మారకార్థం, యువతలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్‌హౌస్ (ఉత్తండి) నేతృత్వంలో రైడర్లు, భారత సైనిక దళాల సభ్యులతో కూడిన ప్రత్యేక మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని లెఫ్టినెంట్ జనరల్ వి. శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. -
తిరువళ్లూరులో మారథాన్ పోటీలు
తమిళనాడు పేరిట నిర్వహణ తిరువళ్లూరు: మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మాజీ అద్యక్షుడు అన్నామలై వియ్ ద లీడర్ పేరుతో నిర్వహించిన మరథాన్ పోటీల్లో వందలాది మంది పాల్గోన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆపార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వియ్ ద లీడర్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వేర్వేరు కార్యాక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మత్తు పదార్దాలు లేని రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్డడానికి యువత భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే అన్నామలై మద్దతుదారుల ఆధ్వర్యంలో తిరువళ్లూరులోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్థానిక మెడికల్ కళాశాల వరకు ఐదు కిలోమీటర్ల మేరకు మారథాన్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, యువత, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గోన్నారు. పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారితో పాటు అందరికి బహుమతులను నిర్వాహకులు లయన్ పన్నీరుసెల్వం, పాండూరు శేఖర్, పళణి, పెరుమాల్‌తో పాటు పలువురు అందజేశారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికులతోనే గుట్కా, మత్తు పదార్థాలు, మాత్రలు, గంజాయి పెరిగిందన్నారు. తద్వారా ఆసాంఘిక కార్యక్రమాలు సైతం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా వుండాలని, క్రీడలతో పాటు ఇతర విషయాలపై ఆసక్తిచూపాలని పిలుపు నిచ్చారు. -
మాట మార్చిన మంత్రి!
త్వరలోనే అధికారిక ప్రకటన సాక్షి, చైన్నె : సీఎం విజయ్ కర్ణాటక పర్యటనపై వ్యవసాయ మంత్రి వినోద్ మాట మార్చేశారు. త్వరలో సీఎం విజయ్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని దాట వేశారు. కాగా కావేరి వివాదం నేపథ్యంలో తమిళనాడు– కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉత్కంఠ పెరుగుతున్నది. సరిహద్దులలో నిఘాను రెండు రాష్ట్రాల పోలీసులు పెంచేశారు. వివరాలు.. తమిళనాడు – కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందే. తాజాగా తమిళనాట టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినానంతరం కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మానం దిశగా కర్ణాటక తీవ్ర కసరత్తు చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక వెళ్తున్నారని, ఈ వ్యవహారంపై అక్కడి సీఎం డీకే శివకుమార్‌తో భేటీ కానున్నారని రాష్ట్రవ్యవసాయ మంత్రి వినోద్ ప్రకటించారు.దీంతో సీఎం కర్ణాటక పర్యటనకు వ్యతిరేకంగా, మద్దతుగా స్వరం అన్నది తమిళనాట బయలు దేరింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఈ పర్యటనను ఆహ్వానించినా, సీపీఎం, సీపీఐ, వీసీకే మౌనంగా ఉంటున్నాయి. అదే సమయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఈ పర్యటనను వ్యతిరేకించారు. గతంలో సాగిన చర్చల విఫలం గురించి ప్రస్తావిస్తూ, తమిళనాడు హక్కులను తాకట్టు పెట్ట వద్దని, కోర్టు ఇచ్చిన తీర్పును నీరుగార్చే అడుగులు వేయవద్దు అని సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళణి స్వామి అయితే అఖిల పక్షం ఏర్పాటు చేయాలని, అందరు కలిసికట్టుగా అడుగుల వేద్దామని పిలుపు నిచ్చారు. అలాగే, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సైతం సీఎం విజయ్ కర్ణాటక పర్యనను వ్యతిరేకించారు. ఈ వ్యతిరేక పరిణామాల నేపథ్యంలో తమిళనాడు – కర్ణాటక సరిహద్దులలో ఉత్కం అన్నది బయలు దేరింది. ఆదివారంకూడా కన్నడం సంఘాలు ఓ వైపు, తమిళ రైతు సంఘాలు మరోవైపు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాల బస్సులు ఆయా రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాల్సి వచ్చింది. ఉత్కంఠ మరింత ఉధృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన.. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి వినోద్ మాట మార్చేశారు.ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక పర్యటనకు సంబంధించి పార్టీ లేదా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని దాట వేయడం గమనార్హం. తంజావూరు జిల్లా కుంభకోణం డివిజన్ పరిధిలోని కావేరి, అరసలార్, పళవార్, మోరి మరియు ఆళియనార్ కాలువల్లో రూ. 70 లక్షల వ్యయంతో మొత్తం 31 కిలోమీటర్ల మేర పూడికతీత పనులను మంత్రి వినోద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మీడియా ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక పర్యటనపై స్పష్టత నిచ్చారు. ఆగస్టు 3న సీఎం విజయ్ కర్ణాటక వెళ్తున్నారని తమరు చెప్పారే, అయితే, పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజమోహన్ అది ఖరారు కాలేదని అంటున్నారే? అని విలేకరులు ప్రశ్నించగా ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి లేదా పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని మంత్రి వినోద్ దాట వేయడం గమనార్హం. -
సింగప్పెన్.. గర్జన
సాక్షి, చైన్నె: తమిళనాడులో మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడానికి ప్రారంభించిన సింగప్పెన్ గర్జన మార్మోగుతున్నది. ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్యలు చేపడుతున్నది. జూన్ 10న ప్రారంభమైన ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా ఇప్పటివరకు 2,000కి పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుని, 187 కేసులు నమోదు చేసినట్లు తమిళనాడు హోం శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు,బాలికలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడం లక్ష్యంగా సీఎం విజయ్ ఈ టాస్క్ పోర్సును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక విభాగం ఐజీ పర్యవేక్షణలో దూసుకెళ్తున్నది. తమకు సమాచారం అందగానే ఉరకలు తీస్తూ, దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం గత వారంలో అందిన 346 ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టి, 28 క్రిమినల్ కేసులు ఈటాస్క్ పోర్సు నమోదు చేసింది. అలాగే, తప్పిపోయిన 6 గురు మహిళలు, 14 మంది పిల్లలను సురక్షితంగా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. మానసిక వికలాంగులైన 14 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక బాల్యవివాహాన్ని అడ్డుకోవడంతో పాటు, పాఠశాల విడిచిపెట్టిన 51 మంది పిల్లలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,580 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 9,397 సున్నితమైన ప్రాంతాల్లో తీవ్రమైన పెట్రోలింగ్ నిర్వహించారు. రెండు వారాలలో ఫలితం జూన్ 10 నుండి జూలై 23 వరకు సాధించిన మొత్తం ఫలితాలు , మొత్తం ఫిర్యాదులు – కేసులుల గురించి అధికారులు వివరించారు.మొత్తం 2,032 ఫిర్యాదులపై చర్యలు తీసుకుని, 187 కేసులు నమోదు చేశారు. తప్పిపోయిన మొత్తం 96 మంది మహిళలు, పిల్లలను కాపాడారు.బాల్యవివాహాల నిరోధం చట్టం మేరకు ఇప్పటివరకు 22 బాల్యవివాహాలను విజయవంతంగా అడ్డుకున్నారు. బడి మానేసిన 169 మంది పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. మానసిక వైకల్యం కలిగిన 57 మందికి పునరావాసం కల్పించారు. నేరాలు జరిగే అవకాశం ఉన్నవిగా గుర్తించిన 58,346 ప్రాంతాల్లో ముమ్మర నిఘా మరియు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ విభాగం మరింత దూకుడుగా ముందుకు సాగి అబలలకు భద్రత పరంగా కవచంగా ఉంటున్నట్టు హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
భక్తిశ్రద్ధలతో చైన్నెలో బోనాల పండుగ సంబరాలు
కొరుక్కుపేట: చైన్నె తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉదయం 9.30గంటలకు షావుకారుపేట సమీపంలోని మింట్ రేణుకా పరమేశ్వరి (చిన కడమ్మన్) ఆలయం నుంచి ప్రారంభమమైన బోనాల ఊరేగింపు కొండితోపు పార్కు సమీపం రాతినమ్ వీధిలో ఉన్న ఆదిశక్తి ఆలయాన్ని చేరుకుంది. కుల, మతాలకతీతంగా నగరంలోని పలుప్రాంతాల్లో నివశిస్తున్న తెలంగాణ ఆడ పడుచులు, ఒగ్గు కళాకా రులతో జరుపుకోనున్న ఈ బోనాల పండుగలో అమ్మవారి ఆశీస్సులు పొందుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు బోనాలు సమర్పించగా, చిన్నారులు, యువత సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.అంజయ్య, ఎం.పరుశురాములు, ఎస్ కె షఫి, ఎం.రమేష్, సీహెచ్ గిరి, సీహెచ్ నరసింహ, ఎన్.అశోక్, జంపయ్య, రాజు, జానకిరామ్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొని బోనాలు పండుగను విజయవంతం చేశారు. -
తిరుత్తణి ఆలయ హుండీలో కానుకల చోరీ
– నిందితుడి అరెస్టు తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో హుండీ కానుకలు చోరీ చేస్తూ రెడ్‌హ్యాండడ్‌గా పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం భక్తులు రద్దీగా వున్న సమయంలో ఉత్సవర్ల మండపం ఎదురుగా వున్న హుండీ వద్ద చాలా సేపు ఓ భక్తుడు వేచివుండడంతో సందేహం చెందిన ఆలయ అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా హుండీలో కానుకలు చెల్లించే విధంగా హుండీలో చేతిద్వారా కరెన్సీ నోట్లు తీసుకోవడం గుర్తించి రెడ్ హ్యేండడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి హుండీ నుంచి చోరీ చేసిన రూ. 9,170 స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు కరూర్ జిల్లా కోందిమలైకు చెందిన శక్తి వడివేల్గా గుర్తించి రిమాండ్ నిమిత్తం కోర్టులో హజరుపరిచి ఆదివారం జైలుకు తరలించారు. ఆలయ హుండీ లెక్కింపులో గోల్మాల్ సాక్షి, చైన్నె : కోయంబత్తూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ కోనియమ్మన్ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు సమయంలో రూ. 30,000 దొంగిలించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను దేవాదాయశాఖ సస్పెండ్ చేయగా, దొంగతనానికి పాల్పడిన సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నెల 15వ తేదీన అధికారుల సమక్షంలో కోనియమ్మన్ ఆలయ హుండీలను తెరిచి కానుకలు లెక్కిస్తుండగా, అక్కడున్న కొందరు సిబ్బంది లెక్కింపులోకి రాకుండా ఒక నోట్ల కట్టను దాచిపెట్టి అందులోని రూ. 30,000 అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. విచారణ – పోలీసు అరెస్టులు: ఆలయ కార్యనిర్వహణ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉక్కడం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. టికెట్ కౌంటర్ ఉద్యోగి సుబ్రమణియన్‌తో పాటు పూజారి కృష్ణరాజ్, మరో ఇద్దరు సిబ్బందితో పాటుగా మొత్తం నలుగుర్ని అరెస్టు చేసి కోయంబత్తూరు న్యాయస్థానంలో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలించారు. అధికారులపై చర్యలు:ఈ ఘటనపై దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ముగ్గురు ఆలయ అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారి స్థానంలో నూతన అధికారులను నియమించారు. రాష్ట్రంలో అవినీతి, లంచగొండితనాన్ని సహించేది లేదని, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలు అడిగితే ప్రజలు ఇవ్వవద్దని సీఎం విజయ్ స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈ వేగవంతమైన చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కల్పాకంలో ఇంక్యుబేషన్ ఒప్పందం సాక్షి, చైన్నె: అంతరిక్ష వాతావరణంలో జీపీయూ ఆధారిత కంప్యూటింగ్ కార్యకలాపాల కోసం రేడియేషన్ రక్షణ వ్యూహాలను అభివృద్ధి చేయడంపై కల్పాక్కంలోని ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషనన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కల్పాక్కంలోని ఐజీసీఎఆర్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో సాంకేతికతల వినియోగం, పరిశోధనా ల్యాబ్ నుండి భూమికి , అంతరిక్షానికి అనే ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెంగళూరు ఇస్రో యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రోత్సాహంతో దేశంలోని స్టార్టప్ రంగానికి, ఐజీసీఏఆర్ వంటి అగ్రగామి పరిశోధనా కేంద్రాలకు మధ్య అనుసంధానం, సహకారం వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అంతరిక్ష సాంకేతికతపై ఒప్పందం మైల్ స్వామి అన్నాదురై మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషనన్స్ అనే డీప్–టెక్ సంస్థతో అంతరిక్షంలో జీపీయూ కంప్యూటింగ్ కోసం రేడియేషన్ రక్షణ విధానాలను రూపొందించడంపై ఈ ఇంక్యుబేషన్ ఒప్పందం ఈ సందర్భంగా కుదిరింది. ఈ ఒప్పంద పత్రాలను ఐజీసీఎఆర్ డైరెక్టర్ శ్రీకుమార్ జి. పిళ్లై, అటల్ ఇంక్యుబేషన్ ) డైరెక్టర్ ఎన్. సుబ్రమణ్యన్ సంస్థ ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. కాగా ముంబై బాబా అణు పరిశోధనా కేంద్రంసాంకేతికత బదిలీ విభాగాధిపతి డేనియల్ బాబు అణుశక్తి శాఖ ప్రస్తుత సాంకేతిక బదిలీ, ఇంక్యుబేషన్ విధానాలపై ఈ సందర్భంగా ప్రసంగించారు. అలాగే తమిళనాడు స్టార్టప్ బృందం ప్రముఖ పరిశోధనా సంస్థల నుండి సాంకేతిక హక్కులు పొందే కొత్త స్టార్టప్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలను సమర్పించింది. -
హెల్త్ ఇన్స్పెక్టర్ పరీక్షల్లో అక్రమాలు..
● నియామకాలను రద్దుకు అన్నామలై పట్టు సాక్షి, చైన్నె : హెల్త్ ఇనన్‌స్పెక్టర్ పరీక్షలో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో, ప్రస్తుత నియామక ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి కఠిన పర్యవేక్షణలో తిరిగి పరీక్ష నిర్వహించాలని వీ ది లీడర్స్ వ్యవస్థాపకుడు అన్నామలై డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం ఆయన స్పందిస్తూ, గత డీఎంకే పాలనలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా హెల్త్ ఇన్‌న్‌స్పెక్టర్ (గ్రేడ్–2) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, కేవలం 15 రోజుల్లోనే హడావుడిగా పరీక్షలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీతో సహా పలు అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ అక్రమాలపై గతేడాది ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సిబిసిఐడి విచారణకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఆ విచారణ ఇంకా పూర్తి కాలేదన్నారు.. ఇలాంటి పరిస్థితిలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాతో తమిళనాడు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయడం తీవ్ర తప్పిదంగా మండిపడ్డారు. న్యాయస్థానానికి వివరించడంలో విఫలం కోర్టు సూచనల మేరకే నియామక పత్రాలు ఇచ్చా మని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... విచారణ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని, కష్టపడి చదివిన అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం కోర్టుదృష్టికి తీసుకువెళ్లి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులైన యువతకు న్యాయం జరగాలంటే అన్ని పరీక్షా కేంద్రాల సిసిటివి ఫుటేజీలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన దోషులపై కఠి న చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న జరిగిన పరీక్షను, తదనంతర నియామకాలను తక్షణమే రద్దు చేయాలనికోరారు. పారదర్శకతతో, తీవ్ర నిఘా నడుమ తిరిగి పరీక్షను నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు తావులేకుండాచూడాలని అన్నామలై విజ్ఞప్తి చేశారు. -
క్లుప్తంగా
తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన పొన్నుస్వామి(75) ఆదివారం తన పొలం నుంచి పశువులకు గడ్డిని తీసుకొచ్చి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని క్రాస్ చేసే సమయంలో తిరుత్తణి నుంచి చైన్నెకు వేగంగా వెళ్లిన కారు ఢీకొంది. ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు డ్రైవర్ కారును రోడ్డులో విడిచిపెట్టి పరారయ్యాడు. గ్రామీణులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. దీంతో చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. తిరుత్తణి ఏఎస్పీ శుభమ్దిమాన్, ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని గ్రామస్తులుతో చర్చలు ఆందోళన విరమింపజేశారు. తిరువొత్తియూరు: పూందమల్లి సమీపంలోని కుత్తంబాక్కం ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు బస చేసినట్లు క్యూ విభాగానికి చెందిన పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా ఆవడి కార్పొరేషన్ శ్రీక్యూశ్రీ విభాగం పోలీసులు కుత్తంబాక్కం ప్రాంతంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడి ఒక ఇంట్లో బస చేసి ఉన్న బంగ్లాదేశ్ దేశస్తులైన మహమ్మద్ మున్నా (27), సుల్తానా (40), నర్కేష్ (45), మహమ్మద్ లైసెల్ (30), బాబు (13), రత్న (4) అనే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆ ఆరుగురిని సేలంలోని పునరావాస కేంద్రంలో అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. సాక్షి, చైన్నె: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసంబంధ పాఠ్యపుస్తకాలను అందించే ఆరు దశాబ్దాల సుదీర్ఘ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, రాజస్థాన్ యూత్ అసోసియేషన్ 63వ వార్షిక పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైన్నెలోని వల్లూవర్ కోట్టం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీలంక డిప్యూటీ హైకమిషన్ , వాణిజ్య శాఖ మంత్రి జి.ఎల్. జ్ఞానదేవ ప్రారంభించారు. డి.జి. వైష్ణవ్ కళాశాల కార్యదర్శి అశోక్ కుమార్ ముంధ్రా , మెడ్ కోడ్ సర్వీస్ ఇంక్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ రాజేష్ సురానా గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వైఏ బుక్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ గౌతమ్‌చంద్ జైన్‌ను సన్మానించారు. రాజస్థాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేక్ బాంబ్ సభలో మాట్లాడుతూ, పుస్తకాల ఖరీదు కారణంగా ఏ అర్హత గల విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే ఒకే ఒక లక్ష్యంతో ది బుక్ బ్యాంక్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందన్నారు. సభ్యులు, దాతలు, వాలంటీర్ల నిరంతర మద్దతుతో గత 63 సంవత్సరాలుగా 1.60 లక్షల మందికి పైగా విద్యార్థులపై సానుకూల ప్రభావాన్ని చూపగలిగామని. రాబోయే సంవత్సరాలలో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తిరువొత్తియూరు: మదురై మేలూరుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పెరియపుల్లాన్ కుమారుడు ఉలగలాపతి ( 21). ఇతడు చైన్నెలోని ఒక ప్రైవేట్ లా కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉలగలాపతి వేళచ్చేరిలో ఉంటూ రోజూ మోటార్ సైకిల్‌పై కాలేజీకి వెళ్లి వచ్చేవాడు. గత 22వ తేదీన అతడు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గాంధీ మండపం ఫ్లైఓవర్ నుండి గిండి వైపు వెళ్తుండగా, సర్దార్ పటేల్ రోడ్డులోని హైవేస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ సమీపంలో వెనుక నుండి వచ్చిన ఒక జేసీబీ వాహనం ఉలగలాపతి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిపోయిన అతనిపై జేసీబీ వాహనం దూసుకెళ్లడంతో, ఉలగలాపతి ప్రాణాలు కోల్పోయాడు. మైలాపూర్ ఇన్ స్పెక్టర్ భువనేశ్వరి కేసు విచారణ చేపట్టారు. బాలుడు నడిపినట్లు.. పోలీసుల విచారణలో ఆ జేసీబీ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడు నడిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. జేసీబీ వాహన యజమాని రాజ్‌కుమార్, ఆ బాలుడు మైనర్ అని తెలిసి కూడా, ఎలాంటి భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ లేని స్థితిలో అతడిని పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని జైలుకు తరలించారు. 17 ఏళ్ల మైనర్ బాలుడిని కెల్లిస్ లో వున్న ప్రభుత్వ జువైనెల్ హోమ్‌కు చేర్చారు. బాలుడి కుటుంబం చాలా పేదరికంలో ఉండటం వల్లే, అతడు చిన్న వయసు నుంచే జేసీబీ వాహనాన్ని నడుపుతున్నట్లు విచారణలో తెలిసింది -
ఆలయాల్లో దర్శన రుసుం పద్ధతిని రద్దు చేయాలి
తిరువళ్లూరు: హిందూ ఆలయాల్లో దర్శన టోకెన్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ హిందూ మున్ననీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పెద్దకుప్పంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూ మున్ననీ జిల్లా అధ్యక్షుడు వినోధ్ఖన్నా అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా బీజేపీ గ్రామాల అభివృద్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ హిందూ దేవాయాల్లో దర్శనం కోసం డబ్బులు వసూలు చేసి టోకెన్లను మంజూరు చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దర్శనం కోసం టోకెన్లు మంజూరు చేసే విధానం లేదని 1967వ సంవత్సరంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే టోకెన్లను వసూలు చేయడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు. క్రిస్టియన్, ముస్లిం ఆలయాలకు లేని టోకెన్లు హిందూ దేవాలయాలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 1987వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖకు 5.25 లక్షల ఎకరాలు వున్నట్టు ప్రకటించారని అయితే 2019 నాటికి 4.78 లక్షలకు ఎకరాలకు ఎలా తగ్గిందన్నారు. దేవదాయశాఖకు చెందిన 1.23 లక్షల ఎకరాల భూమి, 22600 దుకాణాలు, 33627 స్థలాను అద్దెకు ఇచ్చారని గుర్తు చేశారు. అద్దెకు ఇచ్చిన స్థలం ద్వారా వచ్చే ఆధాయం ఎక్కుడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల ద్వారా ఏడాదికి వెయ్యి కోట్లు రూపాయల మేరకు ఆదాయం వస్తుందన్న ఆయన వీటిని ఉపయోగించి ఆలయాలను అబివృద్ది చేయవచ్చన్నారు. అనంతరం దర్శనంకు డబ్బులు వసూలు చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు హిందూ మున్ననీ నేతలు పాల్గొన్నారు. -
ఐడీఎఫ్సీ ఫలితాలలో రికార్డు
సాక్షి, చైన్నె: ఐడీఎఫ్సీ బ్యాంక్ క్యూ 1ఎఫ్వై 27 రికార్డు ఫలితాలను ఆ సంస్థ ఎండీ వి.వైద్యనాథన్ ఆదివారం స్థానికంగా ప్రకటించారు. ఈ మేరకు రూ. 1,075 కోట్ల నికర లాభంతో ఏటా 132.4% వృద్ధిని సాధించినట్టు వివరించారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదుచేసిన రూ.463 కోట్లతో పోలిస్తే ఇది 132.4% భారీ వృద్ధిని నమోదు చేసిందన్నారు. బ్యాంక్ మొత్తం కస్టమర్ బిజినెస్ రుణాలు, డిపాజిట్లు ఏటా 18.6% పెరిగి రూ. 6,04,776 కోట్లకు చేరిందన్నారు. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.2% వృద్ధి సాధించిందని వివరించారు. మొత్తం రుణాలు ఏటా 20.6% పెరిగి రూ.3,05,370 కోట్లకు చేరాయని, మోర్ట్గేజ్, వాహన, కార్పొరేట్ , కన్స్యూమర్ లోన్స్ విభాగాల్లో బలమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. రిటైల్, అగ్రి , ఎంఎస్ఎంఈ రుణాలు ఏటా 18.2% పెరిగి రూ.2,41,118 కోట్లకు చేరాయని ప్రకటించారు. రాబోయే రోజుల్లో వర్షపాతం, ఇంధన ధరల వ్యత్యాసాల వంటి భౌగోళిక–రాజకీయ లేదా స్థూల ఆర్థిక అనిశ్చితులను తట్టుకోవడానికి ముందుజాగ్రత్తగా రూ.515 కోట్ల ప్రోవిజన్ ఏర్పాటు చేశామ న్నారు. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 15.05% గాను, సీఈటీ–1 నిష్పత్తి 13.33% గాను బలంగా ఉందన్నారు. ఉన్నతమైన కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలతో అత్యుత్తమ బ్యాంకింగ్ సంస్థను నిర్మించడమే తమ లక్ష్యంగా వ్యాఖ్యానించారు. కొరుక్కుపేట: మెరీనా బీచ్ వైపున, కామరాజర్ రోడ్డులోని బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా స్క్వేర్ వద్ద, రూ. 78 లక్షల వ్యయంతో పూర్తి ఏసీ సౌకర్యాలు గల బస్ షెల్టర్‌ను నిర్మించాలని చైన్నె కార్పొరేషన్ యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. ఈ విషయమై కల్పించనున్న సౌకర్యాల గురించి కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆశ్రయం సజావుగా పనిచేసేలా చూసేందుకు, ఇందులో సీసీటీవీ కెమెరాలు, వై–ఫై సౌకర్యం, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, ఎల్ఈడీ లైట్లు , పురుషులకు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, యూవీ ట్రీట్మెంట్ సౌకర్యంతో కూడిన 3,000 లీటర్ల సామర్థ్యం కలిగిన బయోసెప్టిక్ ట్యాంక్, 14 కిలో లీటర్ల సామర్థ్యం గల భూగర్భ జల నిల్వ ట్యాంక్, ఓ ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొరుక్కుపేట: వరల్డ్ ఉమెన్స్ ఫౌండేషన్ 2000 ఆధ్వర్యంలో యూనిటీ రన్ మారథాన్ 2026ను చైన్నెలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు డాక్టర్ సత్య రమేష్ నేతత్వంలో నిర్వహించిన యూనిటీ రన్‌ను తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ సి.ఎం.కె.రెడ్డి, ఎతిరాజ్ కళాశాల ఛైర్మన్ వి.ఎం.మురళీధరన్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం రన్ విజేతలకు జ్ఞాపికలు, పతకాలు అందజేశారు. ఏఐటీఎఫ్ కార్యదర్శి ఎస్. గజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. -
రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు ఆదర్శ్ బెటాలా
సాక్షి ,చైన్నె: రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ కాస్మోస్ 2026–27 సంవత్సరానికి కొత్త అధ్యక్షుడిగా ఆదర్శ్ బెటాలా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రోటరీ క్లబ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే, ఆదర్శ్ నూతన ఆవిష్కరణలు, ప్రభావవంతమైన సేవతో నడిచే రోటరీ నాయకత్వంలోని కొత్త తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు . క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు రొటేరియన్ బింధ్య ఆయనకు సమర్థవంతంగా మద్దతు ఇస్తారు , అదే సమయంలో ప్రథమ మహిళ కోమల్ బెటాలా రోటరీ సంవత్సరం పొడవునా క్లబ్ సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో అధ్యక్షుడికి తోడుగా నిలువనున్నారు. ప్రముఖ రోటేరియన్లు, ప్రముఖులు, కార్పొరేట్ నాయకులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పిడిజి రొటేరియన్ మహావీర్ బోత్రా ముఖ్య అతిథిగా , మహమ్మద్ ఆసిఫ్ అలీ గౌరవ అతిథిగా విచ్చేశారు.. ఈ సందర్భంగా మిషన్ 35 పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కొరుక్కుపేట: ఎస్‌కేపీడీ హాస్టల్ అలూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దీనికి చైన్నె జార్జిటౌన్‌లోని ఎస్‌కేపీడీ కన్వెన్షన్ సెంటర్ వేదికై ంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ టి. జగదీష్‌బాబు సభకు అధ్యక్షత వహించి అసోసియేషన్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ట్రస్టీ డాక్టర్ తవ్వ వేదగిరీశ్వర రావు, టస్టీలు తాతా బద్రీనాథ్, సి. ఆర్. కిషోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తవ్వ వేదగిరీశ్వర రావు మాట్లాడుతూ వాసవీ అమ్మవారి ఆశీస్సులతో ఎస్ కె పి డి హాస్టల్ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనవ్యక్తం చేశారు. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌కేపీడీ హాస్టల్‌కు విరాళంగా రూ.75 వేలు విలువతో స్టీల్ కబ్ బోర్డు, ప్లాస్టిక్ చెర్లు, ఇంటర్ నెట్ వసతి, తదితర ఏడు రకాల సహాయకాలను అతిథులతో కలసి జగదీష్ బాబు, ఎంఏ నరసింహన్, గుర్రం బాలాజీ, ఎస్. రాముడు, ఎంకే రవీంద్రన్, కె.గోపాల శెట్టి లు అందజేశారు. కార్యక్రమంలో ముందుగా వాసవాంబను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. -
సెల్ఫీ తీస్తుండగా ఉగ్ర అల.. విద్యార్థిని మృతి, యువకుడు గల్లంతు
సాక్షి, చెన్నై : రీల్స్, సెల్పీల వ్యామోహంతో సముద్రంలో దిగి మరీ వీడియో చిత్రీకరించుకుంటూ వచ్చిన విద్యార్థుల బృందాన్ని భారీ అల తాకింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులను జాలర్లు రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. మరొకరు మరణించారు. శనివారం చెన్నై ఎన్నూర్ బీచ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు.. చెన్నై సూరపట్టులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న కృతిక (19), ఆకాష్ (21), పవిత్ర, తరుణ్, శివాని అనే ఐదుగురు విద్యార్థుల బృందం ఎన్నూర్ రామకృష్ణా నగర్ సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. సముద్రం మధ్యలో ఉండే రాళ్లపై నిలబడి సెల్ఫీ, వీడియోలు తీసుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా వచ్చిన ఉగ్ర అలల తాకిడికి వారంతా సముద్రంలో పడిపోయారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో అక్కడున్నవారు ఇద్దరు విద్యార్థులను అతికష్టంపై రక్షించారు. సముద్రంలో మునిగి పోయి కొన ఊపిరితో ఉన్న కృతికను రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలల్లో కొట్టుకుపోయిన మరో విద్యార్థి ఆకాష్ కోసం అగి్నమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు తీరం వెంబడి తీవ్రంగా గాలింపు చేపట్టారు. బతికి ఉండేందుకు ఛాన్స్ లేని దృష్ట్యా, చెన్నై తీరంలో మృతదేహం ఏదైనా ఒడ్డుకు కొట్టుకువచ్చిందా? అని ఆరా తీస్తున్నారు. కాగా, మృతి చెందిన కృత్రిక పుదుచ్చేరికి చెందిన విద్యార్థి కాగా, ఆకాశ్ చెన్నై తిరునగర్ కు చెందిన వైదీశ్వరన్ కుమారుడిగా గుర్తించారు. -
ఆకలిని తట్టుకోలేక గడ్డి తిని యువతి మృతి..!
అన్నానగర్ (చెన్నై): తిరువళ్లూరు జిల్లాలోని గుమ్మిడిపూండి–రెట్టంపేడు రహదారి పై ఆత్తుపాక్కం గ్రామం ఉంది. ఆర్యతమ్మన్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైందని గ్రామ పరిపాలనా అధికారి రమేష్ శనివారం ఉదయం గుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. ఆ సమయంలో, ఆలయ ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహం ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిదని వెల్లడైంది. ఆమె ఎవరు? ఏ గ్రామానికి చెందినది అని తెలియదు. ఆమె గడ్డి తిన్నందున ఆమె నోరంతా గడ్డితో నిండి ఉంది. ఆకలితో గుడి గేటు వద్ద గడ్డి మొక్కలు తిన్నడం తో ఆ యువతి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. గుమ్మిడిపూండి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీసై మురుక్కు –2 కు డేట్ ఫిక్స్
తమిళసినిమా: ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్‌లతో సంగీత ప్రియులను ఆకట్టుకుని, ఆ తర్వాత సినీ సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ,ఆపై కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమైన నటుడు హిప్ హాప్ ఆది. ఇలా సినిమా రంగంలోని పలు శాఖలో తన ప్రతిభను చాటుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హిప్ హాప్ ఆది తాజాగా మీసై మురుక్కు –2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన 2017లో కథానాయకుడిగా సంగీత దర్శకుడుగా బాధ్యతలు నిర్వహించి విజయానికి సాధించిన మీసై మురుక్కు చిత్రానికి సీక్వెల్ కావడం గమనార్హం. తన తాజా చిత్రం నుంచి హిప్ హాప్ ఆది మీడియాకు విడుదల చేసింది ప్రకటనలో పేర్కొంటూ మీసై మురుక్కు చిత్రంతో ప్రారంభమైన తన సక్సెస్ ఫుల్ పయనం ఇప్పుడు కోట్లాది మంది భావనగా మారిందన్నారు. దాన్ని ఇప్పుడు మరోసారి మీసై మురుక్కు –2 చిత్రంతో అనుభవించే తరుణం వచ్చిందన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వాళ్లంతా థియేటర్లను సంగీత ఉత్సవముగా మార్చడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మీసై మురుక్కు –2 చిత్రం మాత్రమే కాదని, థియేటర్లో జరగనున్న బ్రహ్మాండ సంగీత ఉత్సవం అని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ , వినోదం ,స్నేహం,కుటుంబ అనుబంధాలు, ఉత్సాహపరిచే సంగీతం అంటూ ప్రేక్షకులను అలరించే మంచి కాలక్షేప కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు , దర్శకత్వం ,సంగీతం బాధ్యతలను ఈయన నిర్వహించారు. నటి చైత్ర జె .ఆచార్, కేతిక శర్మ, రమ్యా రంగనాథన్ నాయకలుగా నటించిన ఇందులో హర్షద్ ఖాన్, కరుణాస్, నాజర్, ఆడుగళం నరేన్, కరుణాకరన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అవ్నీ మూవీస్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల అధినేతలు నటి కుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ కలిసి నిర్మించారు. -
విద్యార్థుల ఆందోళనలతో.. సీఎంకు వ్యతిరేకంగా కుట్ర
సాక్షి, చైన్నె : విద్యార్థుల పోరాటాలను తాము మనస్పూర్తిగా గౌరవిస్తున్నామని, అయితే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళనలను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మళ్లించేందుకు కుట్ర, ప్రయత్నాలు చేస్తున్నారని దేవాదాయ శాఖమంత్రి ఎస్ రమేషన్ ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలో అలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి రమేష్, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షా విధానంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ముఖ్యమంత్రి ఇప్పటికే పూర్తి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, విద్యను తిరిగి రాష్ట్ర జాబితా లోకి తీసుకురావడమే దీనికి శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శాసనసభలో నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ బిల్లు ప్రవేశపెట్టే విషయమై ముఖ్యమంత్రే సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు. పళని ఆలయ భూముల వివాదంపై వివరణ పళని ఆలయ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణల గురించిమంత్రి స్పందిస్తూ, పళని ఆలయ భూముల వ్యవహారంపై ప్రస్తుతం విచారణ వేగంగా జరుగుతోందన్నారు.. నేరస్థులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించబడతారన్నారు. అయితే కొందరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై నిందలు వేస్తున్నారన్నారు. అసలు ఈ కేసును సీబిసీఐడీ విచారణకు అప్పగించాలని స్వయంగా తానే ముఖ్యమంత్రిని కోరాననని పేర్కొన్నారు. అప్పుడే నిజమైన దోషులు బయటకు వస్తారని, ఈ సమస్య వచ్చే వరకు పళనిలో అలాంటి ఒక భూమి ఉందనే విషయం కూడా తనకు తెలియదన్నారు. తనబంధువులకు, తనకకు ఇందులో సంబంధం ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమయపురం ఆలయంలో పనిచేస్తున్న పళనివేల్ అనే అధికారి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోందని, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు ఆయనను సస్పెండ్ చేశామని తెలిపారు. తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడదపై తనిఖీలు చేపట్టామని, త్వరలోనే అక్కడ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. -
హెచ్ఐటీఎస్లో మెరిసిన విద్యార్థులు..
సాక్షి, చైన్నె : హెచ్ఐటీఎస్ ఫ్యాషన్ డిజైన్ విభాగంలో వార్షిక గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ షో రాజిల్ దాజిల్ 12.ఓ పేరిట పడూర్‌లో నిర్వహించారు. ఎంజీఆర్ ఆడిటోరియంలో ఐదు గంటల పాటు సాగిన ఈ వేడుకకు 300 మందికి పైగా పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు , ఫ్యాష న్ ప్రేమికులు తరలి వచ్చారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూపొందించిన వివిధ డిజైన్లను ఏడు ప్రధాన ర్యాంప్ వాక్‌లలో ప్రదర్శించారు. వీటితో పాటు పలువురు ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు ప్రత్యేక షోకేష్ వాక్‌లలో సందడి చేశారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ విజన్ ఎక్స హెడ్ డాక్టర్ కౌస్తవ్ సేన్‌గుప్తా విద్యార్థులు సరికొత్త భావనలతో, సృజనాత్మకంగా డిజైన్ చేసిన వస్త్రాలను వీక్షించి అభినందించారు. సరికొత్త శైలులు, వినూత్న రంగుల కలయికతో విశిష్టమైన డిజైన్లను రూపొందించడంలో విద్యార్థుల కృషిని కొనియాడారు.ఇండియన్ టెర్సైన్ బిజినెస్ఆఫీసర్ షెహనాజ్ షెరీఫ్, ఆ విద్యా సంస్థ ప్రో ఛాన్సలర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, ఫ్యాషన్ విభాగం అధిపతి డాక్టర్ అనీష్ షర్మిల మాట్లాడుతూ తమ డిజైన్ ప్రక్రియలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, కేసీజీ ఫ్యాషన్ బ్యాంక్ అనే కార్యక్రమం ద్వారా పాత వస్త్రాలను రీసైకిల్ చేసి, కొత్త దుస్తులుగా మార్చి ఎన్జీఓ ల సహాయంతో పేదలకు అందిస్తున్నామని, దీని ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గిస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమం ముగింపులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు. -
పర్సనలైజ్డ్ క్యాన్సర్ సంరక్షణపై చర్చలు
సాక్షి, చైన్నె : క్యాన్సర్ చికిత్సారంగంలో సాంప్రదాయ పద్ధతుల నుండి వ్యక్తిగతీకరించిన ఆధునిక చికిత్సల వైపు మార్పు వేగంగా జరుగుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. క్యాన్సర్ వైద్యంలో వస్తున్న నూతన పురోగతులపై చర్చించేందుకు భారత్ , విదేశాల నుండి 250 మందికి పైగా ఆంకాలజిస్టులు, సర్జన్లు, రేడియేషన్ నిపుణులు, పరిశోధకులు చైన్నెలో శనివారం సమావేశమయ్యారు. వీఎస్ హాస్పిటల్స్ (, వీఎస్ మెడికల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన వీఎస్ ఇంటర్నేషనల్ ప్రిసిజన్ ఆంకాలజీ సమిట్ –20026 పేరిట మూడు రోజుల పాటుగా ఈ సదస్సు జరగనున్నది. ప్రిసిజన్ మీట్స్ ప్రోగ్రెస్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరగడం అతిపెద్ద ఆరోగ్య సవాలుగా మారిన నేపథ్యంలో సాంప్రదాయంగా అందరికీ ఒకే రకమైన చికిత్స విధానాన్ని స్వస్తి చెప్పి, ప్రతి రోగి వ్యాధి లక్షణాలు, డీఎన్ఏ ఆధారంగా వ్యక్తిగతీకరించిన ప్రిసిజన్ క్యాన్సర్ కేర్ అందించడంపై ఈ సదస్సు ద్వారా నిపుణులు ప్రాధాన్యతనిచ్చారు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, అడ్వాన్స్డ్ రేడియేషన్ విధానాలు, రోబోటిక్ , మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, ఆర్గాన్ ప్రిజర్వేషన్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సులో అసోం క్యాన్సర్‌కేర్ సెంటర్డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ రవి కణ్ణన్ , ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ . సుబ్రమణియన్, వీఎస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుందర్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ముత్తు సుబ్రమణియన్ , ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విజయ్ , వీఎస్ గ్రూప్ సీఓఓ ప్రసన్న శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
సత్యమూర్తి భవన్లో వాస్తు మార్పులు
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయమైన చారిత్రాత్మక సత్యమూర్తి భవన్లో వాస్తు ప్రకారం మార్పులు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కామరాజ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అనేక మంది అగ్ర నాయకులు సందర్శించిన ఈ చారిత్రాత్మక భవనంలో, కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాతి మార్పులు చేపట్టడం పరిపాటిగా వస్తున్నది. చైన్నె రాయపేటలోని ఈ భవనంలో తాజాగా వాస్తు మార్పులు సాగుతుండటం గమనార్హం. ఇటీవల మాణిక్యం ఠాకూర్ అధ్యక్ష బాధ్యలు స్వీకరించారు. కర్మయోగి కామరాజర్ పాలన త్వరలో తమిళనాట వస్తుందని ప్రకటించారు. అదే సమయంలో తాజాగా టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగమైంది. ఐదుదశాబ్దాల అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులయ్యారు. ఈ పరిస్థితులలో తాజాగా పార్టీ నాయకత్వంలో బాధ్యతలు చేతులు మారిన నేపథ్యంలో, పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక వాస్తు నిపుణుడు సత్యమూర్తి భవనాన్ని పరిశీలించి ఉన్నారు. నిపుణుల సలహా ప్రకారం నాయకుడు లేదా అధ్యక్షుడి గది నైరుతి దిశలో ఉండాలని సూచించినట్టు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అమరికలలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నట్లు ఆయన గుర్తించి ఉండటం గమనార్హం. రాబోయే కాలంలో పార్టీకి మంచి సువర్ణావకాశాలు ఉన్నందున, వాస్తు పరమైన అడ్డంకులు ఏవీ ఉండకూడదని భావించి, అధ్యక్షుడు గదిని భవనం రెండవ అంతస్తుకు (నైరుతి దిశ) తరలించాలని నిర్ణయించారు. ఈ మార్పుల ఆధారంగా భవన పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
క్లుప్తంగా
అన్నానగర్ (చైన్నె): తిరువళ్లూరు జిల్లాలోని గుమ్మిడిపూండి–రెట్టంపేడు రహదారి పై ఆత్తుపాక్కం గ్రామం ఉంది. ఆర్యతమ్మన్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైందని గ్రామ పరిపాలనా అధికారి రమేష్ శనివారం ఉదయం గుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. ఆ సమయంలో, ఆలయ ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహం ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిదని వెల్లడైంది. ఆమె ఎవరు? ఏ గ్రామానికి చెందినది అని తెలియదు. ఆమె గడ్డి తిన్నందున ఆమె నోరంతా గడ్డితో నిండి ఉంది. ఆకలితో గుడి గేటు వద్ద గడ్డి మొక్కలు తిన్నడం తో ఆ యువతి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. గుమ్మిడిపూండి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెక్కిన మట్టికుండ లభ్యం సాక్షి, చైన్నె: తమిళనాడులోని ప్రసిద్ధ పురావస్తు క్షేత్రమైన కీళాడిలో జరుగుతున్న 11వ దశ తవ్వకాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అరుదైన మట్టి కుండ ఒకటి వెలుగుచూసింది. ఈ ఎరట్రి మట్టి కుండపై చేప ఆకృతి స్పష్టంగా చెక్కబడి ఉండటం పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోదననున వేగవంతం చేశారు. అడుగు వ్యాసం, అడుగు ఎత్తు కలిగిన ద్వివర్ణ ఎరుపు రంగు కుండ లభించింది. దీని పైభాగంలో చేప గుర్తు గీసి ఉంది. సంగం కాలం నాటి కీళాడి ప్రజల కళాత్మక సంప్రదాయం, సంకేతాత్మక సంప్రదాయాలు , హస్తకళా నైపుణ్యానికి ఈ ఆవిష్కరణ ఒక ముఖ్య ఆధారంగా నిలుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. సాక్షి, చైన్నె: చైన్నెలోని ప్రముఖ సామాజిక వేదిక సూపర్ చైన్నె నిర్వహించిన సూపర్ చైన్నె అరాట్టై కార్యక్రమంలో ప్రముఖ తమిళ వక్త, రచయిత్రి, భారతీ భాస్కర్‌ను ఐకాన్ ఆఫ్ ది మంత్ పురస్కారంతో సత్కరించారు. నవిన్స్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ చేతుల మీదుగా భారతీ భాస్కర్‌కు ఐకాన్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందజేశారు. మాటలు ఆయుధం కంటే శక్తివంతమైనవి అని, ప్రసంగం అంటే బిగ్గరగా మాట్లాడటం కాదని, అవతలి వ్యక్తికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడమేనని ఈసందర్భంగా భారతీ భాస్కర్ తెలిపారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో మాట్లాడటంతో పాటు సానుభూతితో వినడం కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సూపర్ చైన్నె మేనేజింగ్ డైరెక్టర్ రంజీత్ రాథోడ్ను్ ఈసందర్భంగా ఇదే వేదికపై సూపర్ చైన్నె సమ్మర్ క్లిక్స్ 2026 ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన 10 మంది ఫొటోగ్రాఫర్లను కూడా సత్కరించారు. కొరుక్కుపేట: తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై వంటి డెల్టా జిల్లాల్లో కురువాయి సాగు ఆశాజనకంగా ఈ మనిద నేయ మక్కల్ కచ్చి నాయకుడు, ఎమ్మెల్యే జవహిరుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, పంట కోత వేగానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాలు తెరవకపోవడంతో, రైతులు తమ వరిని ఆరుబయట ఉంచడానికి మూటలను కుప్పలుగా వేయవలసి వస్తోంది. వర్షం పడితే, వరి తడిసి నాణ్యత క్షీణిస్తుంది, దీంతో వారి శ్రమ ఫలం పూర్తిగా వృథా అయ్యే ప్రమాదం ఉంది.ప్రస్తుతం, తంజావూరులో 257, తిరువారూరులో 189, మైలాడు సెక్టార్లో 144 , నాగపట్టణంలో 124 కేంద్రాలతో సహా మొత్తం 714 ప్రభుత్వ ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కోతకు వస్తున్న వరి పరిమాణానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని క్షేత్రస్థాయి రైతుల అభిప్రాయం. అనేక చోట్ల 5,000 నుండి 10,000 వరి బస్తాలు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అందువల్ల, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అదనపు ప్రభుత్వ వరి సేకరణ కేంద్రాలను తెరవాలి. ఇప్పటికే పనిచేస్తున్న కేంద్రాలలోతగినంత సిబ్బంది, తూకం యంత్రాలు, బస్తాలలో నింపే సౌకర్యాలు, నిల్వ గిడ్డంగులు , రవాణా సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, నిల్వ ఉండిపోయిన వరి కట్టలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన సేకరించి, ఆ మొత్తాన్ని ఆలస్యం చేయకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. -
పీఎంకేలో.. ఇక అన్బుమణి శకం
పీఎంకేలో ఇక అన్బుమణి శకం పూర్తి స్థాయిలో మొదలైంది. తండ్రి, తనయుడి మద్య ఉన్న వివాదం ముగిసింది. పీఎంకే పూర్తిగా అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. వయోభారం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాజకీయాల నుంచి సీనియర్ నేత రాందాసుతప్పుకోవడంతో వారసుడి ఆధిక్యానికి రూట్ క్లియర్ అయినట్లయ్యింది. సాక్షి, చైన్నె : తమిళనాట అత్యధిక జనాభా కలిగిన వన్నియర్లను ఏకం చేసి దివంగత కాడు వెట్టి గురు సహకారంతో సంఘాన్ని నెలకొల్పిన రాందాసు 1989లో దానిని పాటాలి మక్కల్ కట్చిగా (పీఎంకే) మార్చారు. వన్నియర్ల ఆధిపత్యం లక్ష్యంగా దూకుడుగా ముందడుగు వేస్తూ పార్టీ వ్యవస్థాపకుడిగా రాందాసు ఆది నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా తొలి నాళ్లలో అడుగులు వేశారు. 2001లో అన్నాడీఎంకేతో జత కట్టి 20 చోట్ల గెలిచారు. 2006లో డీఎంకేతో జత కట్టి 18 చోట్ల గెలిచారు. ఈ సమయంలో మైనారిటీ ప్రభుత్వంగా డీఎంకే పాలన సాగాల్సి వచ్చినా, మంత్రి వర్గంలో మాత్రం చేరలేదు. అయితే, జాతీయ స్థాయిలో పీఎంకేను తీసుకెళ్లే దిశగా యూపీఏ పాలనలో కేంద్ర మంత్రుల పదవులలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు చక్రం తిప్పారు. కూటములు మార్చడంలో దిట్టా.. ఆ తదుపరి పరిణామాలతో ప్రతి ఎన్నికలలోనూ కూటములను మార్చి మార్చి సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను సైతం రాందాసు దూరం చేసుకున్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని తొలినాళ్లలో స్వయంగా ప్రకటించిన రాందాసు కాలక్రమేనా తన వారసుడు అన్బుమణిని తెర మీదకు తెచ్చారు. అన్బుమణి సీఎం అభ్యర్థి అంటూ ఒంటరిగా ఎన్నికలలోకి వెళ్లి భంగ పడ్డారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో జత కట్టి పరువు దక్కించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో జత కట్టి డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్‌ను కూడా గల్లంతు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి పదవిని తన వారసుడు అన్బుమణికి అప్పగించి తైలాపురంకు తొలుత రాందాసు పరిమితమైనా, గత రెండేళ్లుగా తండ్రి, తనయుడి మధ్య సాగుతూ వచ్చిన వారసత్వ సమరంతో 2026 అసెంబీ ఎన్నికల సమయంలో పీఎంకే రెండు ముక్కలైన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ పాలకుల సహకాారంతో పార్టీ, చిహ్నం తనదేనని ఎన్నికలలోకి వెళ్లిన అన్బుమణి శిబిరానికి నాలుగు చోట్ల విజయం దక్కింది. అయితే రాందాసు శిబిరం భంగపడాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల రోజులుగా రాందాసు ఇంట సాగుతూ వచ్చిన పరిణామాలు పీఎంకే వర్గాలలో జోష్‌ను నింపేశాయి. రామన్న రాజకీయ నిష్క్రమణ నాలుగుదశాబ్దాల రాజకీయ ప్రయాణానికి శనివారం రాందాసు ముగింపు పలికారు. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని కోనేరికుప్పంలో ఉన్న రాందాసు కుటుంబానికి చెందిన సరస్వతి కళాశాలలో బర్తడేవేడుకలు జరిగాయి. తన 88వ బర్త్‌డే సందర్భంగా భార్య సరస్వతి, కుమారుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, కోడలు సౌమ్య అన్బుమణితో కలిసి వేదికపై రాందాసు తన రాజకీయ నిష్క్రమణ ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని, పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని, అంతా అన్బుమణి చూసుకుంటారని రాందాసు స్వయంగా ప్రకటించడంతో ఇక పీఎంకేలో వారసుడి శకం పూర్తి స్థాయిలో మొదలైందన్న జోష్ కేడర్‌లో నెలకొంది. అన్బుమణికి తాను, కోడలు సౌమ్య అండగా ఉంటామని రాందాసు ప్రకటించడంతో ఇక, పూర్తి స్థాయిలో పార్టీ బలపేతం దిశగా అడుగు వేగాన్ని పెంచేందుకు నేతలు సన్నద్ధమయ్యారు.అయితే, అన్బుమణితో వివాదం నేపథ్యంలో జీకే మణి, అరుల్ వంటి అనేక మంది నేతలు రాందాసు వెన్నంటి నిలిచారు. అంతేకాదు, రాందాసు కుమార్తె శ్రీగాంధీ కూడా అండగా నిలబడ్డారు. అయితే మున్ముందు పార్టీలో వీరి పరిస్థితి ఏమిటో? అన్నది కాలమే సమాధానం చెప్పనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
చిత్తడి నేలల వివాదంలో వివరణకు ఆదేశం
ప్రభుత్వానికి నోటీసులు సాక్షి, చైన్నె: చైన్నెలోని పల్లికరణై రామ్సర్ చిత్తడి నేలల సమీపంలో 1,250 అపార్ట్మెంట్ల నిర్మాణానికి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి(ఈఐఏఏ) వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. చైన్నె పల్లికరణై రామ్సర్ చిత్తడి నేలల ప్రాంతంలో బ్రిగేడ్ అనే ప్రైవేట్ నిర్మాణ సంస్థ 1,250 అపార్ట్మెంట్లను నిర్మించేందుకు గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి, సీఎండీఏ ఈ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశాయి. దీనిని నిరసిస్తూ అరప్పోర్ ఇయక్కమ్, అన్నాడీఎంకే తరఫున దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, చిత్తడి నేలలకు సంబంధించిన కేసులు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ అంశంపై కూడా అత్యున్నత న్యాయ స్థానం ఆశ్రయించాలని గతంలో ఆదేశించింది. పర్యావరణ అనుమతుల రద్దు రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినానంతరం పల్లికరణై చిత్తడి నేలల చుట్టూ 1 కిలోమీటరు పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిషేధం విధించారు. ఇందులో భాగంగా సదరు బ్రిగేడ్ సంస్థకు గతేడాది జనవరిలో మంజూరు చేసిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి ఈనెల 18న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సీఎండీఏ కూడా ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. హైకోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ సీఎండీఏ, పర్యావరణ మండలి నిర్ణయాన్ని సవాలు చేస్తూ బ్రిగేడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన పర్యావరణ అనుమతులను రద్దు చేసే ముందు తమ వైఖరిని లేదా వివరణను కోరకుండా అధికారులు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, తమిళనాడు ప్రభుత్వ ఈ చర్య సమర్థనీయం కాదని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మహమ్మద్ షఫీక్, దీనిపై రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు విచారణను జూలై 28కి వాయిదా వేశారు. పళ్ళికరణై చిత్తడి నేలలు -
రోడ్లు సాహసాలకు కాదు.. సురక్షిత ప్రయాణానికి..!
సాక్షి,చైన్నె : రహదారులు సాహసాలు (స్టంట్లు) చేయడానికి కాదు, సురక్షితమైన ప్రయాణానికేనని చైన్నె నగర పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ విద్యార్థులకు హితవు పలికారు. చైన్నెలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చైన్నె మెట్రోపాలిటన్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్రాడ్వేలోని రాజా అన్నామలై మండపంలో ప్రత్యేకావగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ అమల్‌రాజ్, ప్రమాద సమయాల్లో గోల్డెన్ అవర్‌లో బాధితులను కాపాడి ప్రాణాలు నిలిపిన పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్లు, నర్సులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు , సాధారణ పౌరులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జనవరి 1 నుండి చైన్నెలో 2,206 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. 280 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాలు తగ్గినప్పటికీ, వీటిని పూర్తిగా నివారించేందుకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు 18 ఏళ్లలోపు మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్‌లు, ఇతర వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ అలా ఇచ్చి ప్రమాదం జరిగితే, వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. రోడ్లు విన్యాసాలు చేసే వేదికలు కావు అని, ద్విచక్ర వాహ నడిపేవారే కాకుండా వెనుక కూర్చునేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై కళారూపాల ద్వారా అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత నీయా నానా గోపీనాథ్ అవగాహన ప్రసంగం చేశారు. విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం ముగింపులో 800 మందికి పైగా విద్యార్థులు, పోలీసు అధికారులు కలసి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ చాముండేశ్వరి, జాయింట్ కమిషనర్ పగలవన్, డిప్యూటీ కమిషనర్లు బాలాజీ, మేగలినా ఐడెన్, ముత్తుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భూస్కాంలో పాలకులే నిందితులు
సాక్షి, చైన్నె : పళనిలో జరిగిన రూ. 100 కోట్ల భూ రిజిస్ట్రేషన్ అక్రమాల్లో తమిళగ వెట్రి కళగం(టీవీకే) ప్రభుత్వమే మొదటి నిందితుడని అన్నాడీఎంకే మాజీ మంత్రి, దిండిగల్ తూర్పు జిల్లా కార్యదర్శి దిండిగల్ సి. శ్రీనివాసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పళని దండాయుధపాణి స్వామి ట్రస్టుకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిరసిస్తూ, ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ శనివారం పళని జంక్షన్లో అన్నాడీఎంకే తరఫున భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న దిండిగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ ‘‘స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం, లంచం తీసుకోం, అవినీతిపరులను వదిలిపెట్టం అని చెప్పే ముఖ్యమంత్రి విజయ్... పళని భూ రిజిస్ట్రేషన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సంబంధిత మంత్రులకు తెలియకుండా ఇది జరగదు. కాబట్టి ఈ కుంభకోణంలో మొదటి నిందితుడు టీవీకే ప్రభుత్వమే’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసు బయటపడగానే తాము నిజాయితీపరులం అన్నట్లు సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు.ఆ విభాగం ఏమైనా అమెరికా నుంచి వచ్చిందా? ముఖ్యమంత్రి ఏం చెబితే విచారణ సంస్థలు అదే నివేదిక ఇస్తాయని విమర్శించారు. భూమి అమ్మినవారు, కొన్నవారు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న నేరస్థులను పట్టుకొచ్చే పోలీసులు పళనిలోని ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల హెచ్చరిక: పళని భూ కుంభకోణంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ ముసుగును తొలగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పళని ఎమ్మెల్యే రవి మనోహరన్, దిండిగల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పరమశివం, మాజీ ఎంపీ కుమారసామి సహా భారీ సంఖ్యలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
లారీ నడుపుతుండగా గుండెపోటు – డ్రైవర్ మృతి తిరువొత్తియూరు: శ్రీపెరంబుదూర్ సమీపంలో లారీ నడుపుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో, ప్రమాదాన్ని నివారించేందుకు లారీని సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపివేసి డ్రైవర్ ప్రాణాలు విడిచారు. తిరువళ్లూర్ జిల్లా పూందమల్లి సమీపంలోని చెంబరంబాక్కం గ్రామానికి చెందిన హరిసెల్వం (55). ఈయ న శ్రీపెరంబుదూర్ సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థ నుండి పెయింట్ డబ్బాలను లోడ్ చేసుకుని తన లారీని నడు పుకుంటూ వెళ్తున్నారు. చెంగల్పట్టు – శ్రీపెరంబుదూర్ రోడ్డులో ప్రయాణిస్తూ పొందూర్ సమీపంలోకి రాగానే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో బాధపడుతున్నప్పటికీ, డ్రైవర్ సెల్వం సమయస్ఫూర్తితో వ్యవహరించి లారీని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపారు. తర్వాతి కొద్ది నిమిషాల్లోనే సెల్వం డ్రైవర్ సీట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయ నతో పాటు ప్రయాణిస్తున్న క్లీనర్/సహాయకు డు ఎళిలరసన్ వెంటనే శ్రీపెరంబుదూర్ పోలీ సు స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సెల్వం మతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎలక్ట్రిక్ రైలు సేవల్లో మార్పులు కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ నుంచి గూడూరు మార్గంలో ఉన్న గుమ్మిడి పూండి యార్డ్‌లో శుక్రవారం నుండి నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు శనివారం, ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, గుమ్మిడి పూండి మార్గంలో విద్యుత్ రైలు సర్వీసులో మార్పులు చేశారు. కొన్ని రైలు సర్వీసులను రద్దు చేశారు. రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సిన మోర్ మార్కెట్–గుమ్మిడిపూండి ఎలక్ట్రిక్ రైలు పొన్నేరి – గుమ్మిడిపూండి మధ్య రద్దు చేశారు. రాత్రి 11.20 గంటలకు బయలుదేరాల్సిన మోర్ మార్కెట్ – గుమ్మిడిపూండి ఎలక్ట్రిక్ రైలు పొన్నేరి – గుమ్మిడిపూండి మధ్య రద్దయ్యింది. గుమ్మిపూండి – పొన్నేరి మధ్య రాత్రి 10.30 గంటలకు బయలుదేరాల్సిన గుమ్మిపూండి–మూర్ మార్కెట్ ఎలక్ట్రిక్ రైలు, గుమ్మిడిపూండి నుండి ఉదయం 3.50 గంటలకు బయలుదేరే, గుమ్మిడిపూండి మీంజూర్ మధ్య ఉన్న మూర్ మార్కెట్‌కు చేరుకునే ఎలక్ట్రిక్ రైలును శనివారం, ఆదివారం రద్దు చేశా రు. అలాగే గుమ్మిడిపూండి నుండి ఉదయం 4.50 గంటలకు బయలుదేరే గుమ్మిడిపూండి – పొన్నేరి మధ్య ఉన్నమోర్ మార్కెట్‌కు చేరుకోవలసిన ఎలక్ట్రిక్ రైలును శనివారం, ఆదివారం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. స్పృహ తప్పిపడి పోలీసు మృతి అన్నానగర్: చైన్నెలోని కొండితోప్పు పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పెరుమాల్ స్వస్థలం తూత్తుకుడి ముడివానాథనందల్. ఇతను చైన్నెలోని సెక్యూరిటీ బ్రాంచ్ (ఎస్.సి.బి.)లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి చైన్నె వేప్పేరి భద్రతా విభాగం ఆఫీసులో రాత్రిడ్యూటీలో ఉన్న అతని స్నేహితుడు శేషన్ తో పెరుమాళ్ సెల్ ఫోలో మాట్లాడాడు. నేను మీతో మాట్లాడాలి. ఆఫీసు నుండి బయటకు రా అని అతన్ని పిలిచాడు. ఆ తర్వాత, ఇద్దరూ ఆఫీసు బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెరుమాళ్ హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన కానిస్టేబుల్ శేషన్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, అతడిని కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అతనిని పరిక్షించిన వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. అనంతరం, పోలీస్ అధికారి పెరుమాల్‌ను పోస్ట్‌మార్టం గదికి తీసుకువెళ్లారు. మృతుడైన పోలీస్ పెరుమాళ్‌కు వివాహమై భార్య సెంబక వల్లి, దివ్యశ్రీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. సెంబగ వల్లి ప్రస్తుతం 9 నెలల గర్భవతి. ఆమెను నెల రోజుల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి తీసుకువెళ్లారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే మరణించిన పెరుమాళ్ మృతి అతని కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది. 450 కిలోల గుట్కా అక్రమ రవాణా – ఇద్దరు ఆంధ్రా వ్యక్తుల అరెస్టు తిరువళ్లూరు: తమిళనాడు ప్రభుత్వం నిషేదించిన గుట్కాను ఆటోలో తరలించిన చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఇద్దరిని ఊత్తుకోట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, గుట్కా, మత్తు పధార్దాలను నిషేధించి, రాష్ట్రంలో తీవ్రంగా తనీఖీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా పరిదిలో పోలీసులు తనీ ఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో అనుమానస్పదంగా వెళ్ళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసు కుని తనిఖీ చేశారు. పోలీసుల తనీఖీల్లో ఆటోలో 450 కిలోల గుట్కా వస్తువులు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో వున్న చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన బషీర్, గణేష్ తదితర ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వీరిద్దరు ఆంధ్ర నుంచి నిషేధిత గుట్కాను తరలించి తమిళనాడులో విక్రయిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
10వ అంతస్తులోకి.. సీఎం ఛాంబర్
●శరవేగంగా పనులు సాక్షి,చైన్నె: సీఎం విజయ్ కోసం నామక్కల్ కవింజ్ఞర్ మాళిగైలోని 10వ అంతస్తులో ప్రత్యేక కార్యాలయం రూపుదిద్దుకుంటోంది. ఈ పనులను వేగవంతం చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తమిళనాడు సచివాలయం సెయింట్ జార్జ్ కోటలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న వారు అంతా జార్జ్ కోటలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ కోటలో స్థలం కొరతతో పాటుగా కొన్ని సమస్యలు ఎదురైనట్టు సమాచారం. దీంతో సీఎంవిజయ్ తన కార్యాలయాన్ని జార్జ్‌కోట నుంచి పక్కనే ఉన్న నామక్కల్ కవింజ్ఞర్ మాళిగైకు మార్చేందుకు ఆదేశాలుజారీ చేసి ఉన్నారు. దీంతో ఈ భవనంలోని 10వ అంతస్తు పూర్తిగా సీఎం కార్యాలయం కోసం ప్రత్యేక హంగులతో రూపదిద్దుకుంటోంది. ఈ పనులు రెండు మూడు రోజులలో ముగించి సీఎం విజయ్ కొత్త కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగించే దిశగా చర్యలు విస్తృతం చేసి ఉన్నారు. అదే సమయంలో జార్జ్ కోటలో ఉన్న సచివాలయంకు సంబంధించిన మంత్రులు, కీలక అధికారుల కార్యాలయాన్ని మరోచోటకు మార్చేందుకు సైతం శరవేగంగా కసరత్తు జరుగుతుండటం గమనార్హం. అయితే జార్జ్ కోట పురాతన భవనం నుంచి కాకుండా ఇదే ప్రాంగణంలో ఉన్న నామక్కల్కవింజ్ఞర్ మాళిగైలోకి సీఎం మారుతుండటం వాస్తు పరమైన అంశమా..? అన్న చర్చ ఊపందుకుంది. -
కింగ్ ఫిషర్ బీర్ కంపెనీలో అమ్మోనీయం గ్యాస్ లీకేజీ
తిరువళ్లూరు: ప్రముఖ బీర్ కంపెనీ (కింగ్ పిషర్ )లో స్వల్పంగా అమ్మోనీయం గ్యాస్ లీకేజీ కారణంగా నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి భయంతో ఉద్యోగులు, కార్మికులు పరుగులు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే సంస్థ నిర్వాహకులు సకాలంలో లీకేజీని గుర్తించి అరికట్టడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్ వద్ద యునైటెడ్ బ్రేవరీస్గా పిలువబడే కింగ్‌షిషర్ బీర్ కంపెనీ వుంది. ఈ పరిశ్రమలో బీర్‌ను బాటిల్స్‌లో నింపడానికి కార్బన్–డై ఆకై ్సడ్‌తో పాటు నైట్రోజన్ తదితర వాయువును ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రీమియం బీర్లలో నురుగు, తాజాధనం కోల్పోకుండా ఉండడానికి, చిల్లింగ్ చేయడానికి అమ్మోనీయంను సైతం ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా అమ్మోనీయం ట్యాంకర్ నుంచి స్వల్పంగా లీకేజీ ప్రారంభమైంది. దీంతో ట్యాంక్ ఆపరేటర్‌తో పాటు ముగ్గురు మహిళ కార్మికులకు వాంతులు రావడంతో పాటు అస్వస్థతకు గురై కిందపడడంతో తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సంస్థ ఉద్యోగులు లీకేజీని అరికట్టి పెను ప్రమాదం జరగకుండా నివారించారు. కాగా అమ్మోనీయం లీకేజీ కారణంగా పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది బయటకు భయంతో పరుగులు పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్పృగ తప్పిన వారికి సంస్థలో వైద్యులు ప్రాధమిక చికిత్సను అందించారు. కాగా లీకేజీ కారణంగా దాదాపు గంట పాటు బీర్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాగా ఇటీవల కన్నిగైపేర్ వద్ద రొయ్యెల ప్రోసెసింగ్ సంస్థలో అమ్మోనీయం గ్యాస్ లీకేజీ కారణంగా 18 మంది మృతి చెందిన క్రమంలో శనివారం బీర్ కంపెనీలో లీకేజీ వ్యవహరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. -
నాట్య కళాశాల గురువులను గౌరవించే విధంగా..!
తమిళసినిమా: ప్రముఖ నృత్య దర్శకుడు, కలైమణి అవార్డు గ్రహీత శ్రీధర్ మాస్టర్ బ్రహ్మాండ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం చైన్నెలో నిర్వహించారు. దీనికి వేల్స్ ప్రాంగణం వేదిక అయ్యింది. శ్రీధర్ ఏఆర్ఎస్ డాన్స్ అకాడమీ తరపున ఈయన నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనలో 1973 నుంచి 2026 వరకు చిత్ర రంగంలో పని చేస్తున్న నూతన 125 మంది నత్య దర్శకులు, తమిళనాడులో నృత్య పాఠశాలలను నిర్వహిస్తున్న 38, మంది నాట్య గురువులు పాల్గొన్నారు. దీని గురించి శ్రీధర్ మాస్టర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను శిష్య బందానికి ఉత్సాహం కరిగించే విధంగానూ, తమిళనాడులోని నృత్య పాఠశాలలను నిర్వహిస్తున్న 38 మంది నాట్య గురువులను గౌరవించే విధంగా డాన్స్ డాన్ 2 పేరుతో ఈ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న నృత్య దర్శకుల్లో ఎంజీఆర్, జయలలిత చిత్రాలకు పని చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇది తమతో పాటు ముందు తరం వారికి, భవిష్యత్తు తరాల వారికి ఒక అన్వేషణ లా ఈ నృత్య ప్రదర్శన ను నిర్వహించినట్లు చెప్పా రు. కాగా ఈయన తన కూతురుతో కలిసి పలు చైన్నె లో పలు నాట్య పాఠశాలలను నిర్వహిస్తుండడం గమనార్హం. -
చైన్నె మెట్రో విస్తరణ
సాక్షి, చైన్నె : చైన్నె శివారు ప్రాంతాల ప్రజల రవాణా సౌకర్యార్థం కిలాంబాక్కం బస్టాండ్ నుండి చెంగల్పట్టు వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీకి టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటికే చైన్నె విమానాశ్రయం నుండి కిలాంబాక్కం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉన్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా చెంగల్పట్టు వరకు మార్గాన్ని పొడిగించాలని ప్రణాళిక రూపొందించారు. రూట్ – వ్యయం: ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 9,335 కోట్లుగా నిర్ణయించారు. విమానాశ్రయం, తాంబరం రైల్వే స్టేషన్, కిలాంబాక్కం బస్ స్టాండ్లను అనుసంధానిస్తూ 15.46 కి.మీ మార్గంలో 13 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల రద్దీ, నిర్మాణ వ్యయం, స్టేషన్ల ప్రదేశాలు మరియు నేల స్వభావాన్ని విశ్లేషించి మెట్రో యాజమాన్యం త్వరలోనే తుది నివేదిక సిద్ధం చేయనుంది. -
లాకప్ మరణాలపై నోరు విప్పేది ఎప్పుడో?
సాక్షి, చైన్నె: తమిళనాడులో లాకప్ (కస్టడీ) మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఎప్పుడు తన మౌనాన్ని వీడతారని డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ ఘాటుగా ప్రశ్నించారు. నాగర్‌కోయిల్ జైలులో శబరివర్మన్ అనే విచారణ ఖైదీ కొట్టి చంపిన వివాదం సద్దుమనగక ముందే, తూత్తుకుడిలో అరుణాచలం అనే విచారణ ఖైదీ పోలీస్ స్టేషన్లోనే దెబ్బలకు బలికావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వరుస ఘటనలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో శనివారం స్పందిస్తూ ...‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నన్ను చూసి ’సారీ చెబితే సరిపోతుందా?’’ అని ఉద్రేకంతో ప్రశ్నించిన మహానుభావుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సారీ కూడా చెప్పే ధైర్యం లేక ఎక్కడ దాక్కున్నారు?’’ అని ఎద్దేవా చేశారు. బాధ్యత, క్షమాపణ అనే పదాలు సీఎం నిఘంటువులోనే లేవా?, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే కనీస మానవత్వం కూడా లేని ఈ నిర్దయ టీవీకే ప్రభుత్వం తీరుకు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇతర రాజకీయ నేతల ఖండన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ లాకప్ డెత్‌లపై స్పందిస్తూ, కన్యాకుమారి జిల్లాలో ఒక దివ్యాంగుడిని పోలీసులు కొట్టి చంపారన్న వార్తల నుంచి తేరుకోకముందే, తూత్తుకుడిలో అరుణాచలం అనే యువకుడు కస్టడీలో మరణించడం దారుణంగా పేర్కొన్నారు. శాతాన్కుళం ఘటన తర్వాత కూడా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఇది నిరూపిస్తుదన్నదన్నారు. కస్టడీ మరణాలను పూర్తిగా అరికట్టేలా పోలీసు శాఖను సీఎం ప్రక్షాళన చేయాలన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి సీమాన్ స్పందిస్తూ, మూడు నెలల పాలన కూడా పూర్తికాకముందే టీవీకే ప్రభుత్వంలో 4 కస్టడీ మరణాలు జరగడం పాలనా విఫలత్వానికి అద్దం పడుతోందన్నారు. ఎంతటి నేరస్తుడికై నా శిక్ష పడాల్సింది కోర్టుల ద్వారానే కానీ, పోలీసుల దౌర్జన్యాల ద్వారా కాదు. అరుణాచలం మృతిని హత్య కేసుగా నమోదు చేసి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక కుట్రల వలలో చిక్కుకోవద్దు కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు చట్టబద్ధమైన హక్కులను దెబ్బతీసేందుకు కర్ణాటక పన్నిన కుట్రల వలలో పడకూడదని, వెంటనే ఈ చర్చల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫలించని చర్చల చరిత్ర తమిళనాడు కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందేనని గుర్తు చేస్తూ, 1960ల నుండి 1990 వరకు కావేరీ జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య 50కి పైగా దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పరిష్కారమూ లభించలేదని వివరించారు. అందుకే దివంగత మాజీ సీఎం ఎం.కరుణానిధి హయాంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి, కావేరీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయించామని స్టాలిన్ గుర్తుచేశారు. కావేరీ నదిపై మేఘదాతు వద్ద కర్ణాటక ఆనకట్ట నిర్మించాలనే ప్రయత్నం తమిళనాడు రైతుల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమన్నారు.గతంలో కర్ణాటక సీఎం యడియూరప్ప తనను చర్చలకు పిలిచినప్పుడు,చర్చలకు తావులేదని స్పష్టంగా తిరస్కరించామన్నారు. రైతుల ఆగ్రహం కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలకు తమిళనాడు సీఎం విజయ్ వెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడంపై కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పా టు కాగా, మళ్లీ చర్చలకు వెళ్లడం అనేది తమిళనాడు గత 30 ఏళ్లుగా చేసిన న్యాయపోరాటాన్ని నీరుగార్చడమేనని విమర్శించారు. ముందుగా స్టాలిన్ రైతు సంఘాల నేతలతో సంప్రదింపు జరిపారు. కాగా, ఆగస్టు 3న కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సీఎం విజయ్ భేటి కానున్నారని వ్యవసాయ మంత్రి వినోద్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
సంప్రదాయ గ్రంథాలపై ఆసక్తి పెంచుకోవాలి
కొరుక్కుపేట: విద్యార్థి దశ నుంచే సంప్రదాయ గ్రంథాలు, చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకోవాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) చైన్నె అధ్యక్షులు పి.రవీంద్రకుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనా లతో వార్షిక అంతర్ పాఠశాలల శ్లోకాల–2026 రెండ్రోజుల పోటీలను శనివారం ఆరంభం అయ్యాయి. చైన్నె అశోకనగర్లో ఉన్న జీఆర్టీ మహాలక్ష్మి విద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. తొలిరోజు రామాయణం బాలకాండలోని తాటకీ సంహారం, రామశివధనుర్భంగం ఘట్టాలపై నిర్వహించిన చిత్రలేఖనం, ఆలవందార్ స్త్రోత్రం, నాలాయర దివ్యప్రబంధం, రామానుజ నూట్రాండి, శ్రీ విష్ణుసహస్రనామంపై అవదానం పోటీల్లో 1200 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. శ్రీసిటీ, వైవీఎస్ గోపురం కంపెనీ, నాయుడు హాల్, వివిధ వైశ్య ధర్మ సంస్థల సహకారంతో పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, విద్యా సామగ్రిని రవీంద్రకుమార్‌రెడ్డి అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జెట్ చైన్నె ఆధ్వర్యంలో, 32వ వార్షిక రెండ్రోజుల పోటీల్లో పాల్గొనేందుకు నగరం లోని పలు పాఠశాలల్లోని సుమారు 1,300 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరికి ఆధ్యాత్మిక గ్రంథాల్లోని సారాంశాన్ని నేర్పుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో నిర్విరామంగా ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక పోటీల ద్వారా విద్యార్థుల్లో భక్తిభావాన్ని పెంపొందింపజేస్తున్నామన్నారు. ఏర్పాట్లను జెట్ చైన్నె నిర్వాహక కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించి పాల్గొన్న విద్యార్థులు, గురువులు తల్లిదండ్ర లకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. -
16న చైన్నెలో అన్నామలై పాదయాత్ర
సాక్షి, చైన్నె : పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ’వి ద లీడర్స్’ సంస్థ నాయకుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆగస్టు 16న చైన్నెలో ఒక భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన అనంతరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వి ద లీడర్స్ అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థలో సభ్యత్వ నమోదు వేగంగా సాగుతోంది. సాధారణ ప్రజలు ఎక్కువగా సమకూరే ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 19.32 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ పరిస్థితులలో ఆగస్టు 16న చైన్నెలోని ఎగ్మోర్ రాజరత్నం మైదానం సమీపంలో పాదయాత్ర నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి లభించినట్లు వీది లీడర్స్ వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో వి ద లీడర్స్ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. రాజకీయ వ్యూహం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఉద్యమం నేరుగా పోటీ చేస్తుందని అన్నామలై ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం కోయంబత్తూరులో ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి, అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ఆగస్టు నెల మొత్తం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని వి ద లీడర్స్ నిర్ణయించింది. ఆగస్టు 2న కన్యాకుమారిలో అన్నామలై పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సభ్యత్వంపై అన్నామలై స్పష్టత తమ సంస్థ సభ్యత్వం 50 లక్షలకు చేరుకున్న తర్వాత దీనిని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తామని, . ఒకవేళ ఉప ఎన్నికల నాటికి ఆ లక్ష్యాన్ని సాధించలేకపోతే వి ద లీడర్స్ కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నామలై ప్రకటించారు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాబోయే 6 నెలల్లో వెల్లడిస్తామని అన్నామలై తెలిపారు. తమిళనాడు నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ మార్పులో భాగస్వాములవుతున్నారని,. స్థానిక ఎన్నికలకు ముందు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును పొందడమే తమ ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. -
21 వేల ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 21 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సెకండరీ గ్రేడ్ టీచర్ల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పార్థిబన్ అన్నారు. ఆ సంఘం సమావేశం వేలూరులోని టీచర్స్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2013 నుంచి 2022 సంవత్సరం వరకు అనేక మంది టీచర్లు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించినప్పటికీ వారికి ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదని దీనికి బదులుగా అర్హత పరీక్ష ధృవీకరణ పత్రాన్ని జీవిత కాల ధృవీకరణ పత్రంగా మార్చారని తెలిపారు. వీటి ద్వారా గత 13 సంవత్సరాలుగా తమకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా కాల యాపన చేస్తున్నారన్నారు. గత 2024 సంవత్సరంలో కేకవలం 2,768 పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందని వీటిలో తమకు అవకాశం కల్పించలేదన్నారు. ఆ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 జిల్లాలో మాత్రమే నియామకాలు జరిగిందని వీటిపై ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ నియాకాలు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని గత నెల 17వ తేదిన చైన్నైలో మహా ధర్నా నిర్వహించడం జరిగిందని, అయినా ప్రభుత్వం తమ సమస్యలపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సమన్వయ కర్త విష్ణుప్రియ, రాష్ట్ర కోశాధికారి లోకేశ్వరి, నిరుద్యోగ పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఒరెండ అంటున్నా సుశీగణేశన్..!
తమిళసినిమా: సినిమాకు పబ్లిసిటీనే ప్రాణం అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావాలంటే చిత్రానికి ఒక అట్రాక్షన్ అవసరం. దాన్ని క్రియేట్ చేసేది పబ్లిసిటీ. చిత్రంలోని ఏదో ఒక ముఖ్య అంశంతో దర్శక నిర్మాతలు హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి యుక్తిని ప్రదర్శించడంలో దర్శకుడు సుశీ గణేశన్ దిట్ట. ఫైవ్‌స్టార్ చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన ఈయన ఆ తర్వాత విరుంబుగిరేన్, తిరుట్టు పేర్లే, కందసామి, తిరుట్టుపయలే 2 వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు కాగా తాజాగా సుమారు 9 ఏళ్ల తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 85శాతం పూర్తి అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఇప్పటివరకు వెళ్లడించలేదు. తారాగణం ఎవరు ?సాంకేతిక వర్గం ఎవరు, నిర్మాత ఎవరు ? వంటి విషయాలను కానీ, చిత్ర టీజర్, ఆడియో వివరాలను గాని ప్రకటించలేదు. అలాంటిది ఒరెండ అంటూ చిత్ర టైటిల్ వీడియోను మాత్రమే ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో తన కథ చిత్రాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో తన తాజా చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ దశ్యాలను పోస్ట్ చేస్తూ తన తదుపరి చిత్రం, త్వరలో వస్తున్నాయ్ అని పేర్కొన్నారు. వరెండా అంటే వస్తున్నాడా అని అర్థం ఇది బాగా వాడుకలో ఉన్న పదం కావడంతో ఇప్పుడు ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది. -
మాకు పెళ్లి అవుతోంది.. రంజనితో మాట్లాడడం మానేయ్!
తమిళనాడు: తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పోలీసు అధికారిణి రంజని (24) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె 2022లో పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం తిరుప్పూర్ జిల్లా సాయుధ దళాలలో పనిచేస్తూ కాంగేయం రోడ్డులోని నల్లూరు పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమె గది తాళం వేసి ఉండడంతో తోటి పోలీసు అధికారులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో రంజని ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న నల్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని రంజని మృతదేహాన్ని తిరుప్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజని మెట్రోపాలిటన్ సాయుధ దళాలలో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారితో ప్రేమలో ఉందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమె సెల్ పరిశీలించారు. మరణానికి ముందు ఏ నంబర్ల నుంచి కాల్ వచ్చిందో, ఎంతసేపు మాట్లాడిందో వంటి వివరాలను సేకరించారు. రంజనితో చివరిసారిగా మాట్లాడిన ముగ్గురు పోలీసు అధికారులను గుర్తించి స్టేషన్‌కు పిలిపించి విచారించారు. రంజని, తిరువణ్ణామలైకి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ వ్యవహారం బయటపడిన తర్వాత, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లికి అంగీకరించినట్టు తేలింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో రంజని తిరుప్పూర్‌లో పనిచేస్తున్న ఒక వివాహితుడైన పోలీసుతో తన సెల్ ఫోన్లో తరచుగా మాట్లాడేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు పోలీసును బెదిరించాడు. ‘మాకు పెళ్లి అవుతోంది, నువ్వు రంజనితో మాట్లాడడం మానేయాలి అని అతను చెప్పాడు. దీంతో ఆమె ఫోన్ మాట్లాడుతునే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
‘జననాయకన్’ చూస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది
సాక్షి, చెన్నై : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
డీఎంకేకు బిగ్ షాక్.. లొంగిపోయిన సెంథిల్ బాలాజీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణల కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 8న ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినప్పటికీ.. కోర్టు విధించిన షరతులు, విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.ఈ కేసులో సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్‌కు ఈ నెల 8న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.కె.ఇళందిరైయన్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చారు. 15 రోజుల్లోగా చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి రూ.25 వేల సొంత పూచీకత్తులు, ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించారు.ఈ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సెంథిల్ బాలాజీ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి పూచీకత్తు పత్రాలను సమర్పించారు. దీంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కార్తికేయన్ బెయిల్ మంజూరు చేసి, శనివారం నుంచి విచారణాధికారి ముందు హాజరై సంతకం చేయడానికి అనుమతించారు. అశోక్ కుమార్ మరో కేసు నిమిత్తం కరూర్‌లో ఉండడంతో, ఆయన సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. -
కర్ణాటకకు సీఎం విజయ్.. డీకేతో సమావేశం
సాక్షి, చెన్నై/బనశంకరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై కావేరి జలాల పంపిణీతో పాటు మేకెదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు.ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ కుంభకోణంలో శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయకపోవడంతో మెట్టూరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు.కావేరి జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో నీటి విడుదల, రైతుల ప్రయోజనాలు, మేకెదాటు ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
రౌడీ కోతిని పట్టుకునేందుకు అటవీ అధికారులు క్యాంపు
విల్లుపురం: ఒకే ఒక్క కోతి.. దాదాపు మూడు నెలల నుంచి ఆకస్మికంగా దాడులు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిన్నారులపై దాడులు చేస్తోంది. ఇటీవల ఓ బాలిక చెవి కొరికేసింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ రౌడీ వానరాన్ని బంధించేందుకు గ్రామంలోనే ఏకంగా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. పలు చోట్ల బోన్లను అమర్చారు. అవసరమైతే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ల బృందాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఆ వానరం చిక్కడం ఖాయమని ధీమాతో చెబుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరుతెరి గ్రామంలో ఓ వానరం చిన్నారులు, ఆ దారిని వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. ఈ నెల 21వ తేదీన 8వ తరగతి చదివే బాలికపై పడి, చెవి కొరికేసింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆ వానరం ఒంటరిగానే సంచరిస్తోందని, ఏదైనా సర్కస్ కంపెనీకి చెందనది అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
క్లుప్తంగా
తిరుత్తణి: స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిసర ప్రాంతాల పరిశుభ్రత పట్ల నర్సింగ్ విద్యార్థినులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా తిరుత్తణిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం పరిసర ప్రాంతాల శుభ్రత పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి మెడికల్ ఆపీసర్ డాక్టర్ చంద్రకు మార్ ఆధ్వర్యంలో ప్రయివేటు నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్న అవగాహన ర్యాలీ చేపట్టారు. నర్సింగ్ విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి పరిసర ప్రాంతాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రత పట్ల నర్సింగ్ విద్యార్థినులు, వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కొరుక్కుపేట: మంత్రి రమేష్ కొన్ని రోజుల క్రితం చైన్నెలోని వడపళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిపాలనలో కొన్ని అవకతవకలు, అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పరిపాలనాపరమైన అవకతవకలకు బాధ్యుడైన జూనియర్ అసిస్టెంట్ హరి గోవింద్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పళని తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయ ఉద్యోగి మణికంఠన్ ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు కూడబెట్టాడని ఒక ఫిర్యాదు వచ్చింది. రెండు నెలల క్రితం పళనిపై దాడులు జరిగాయి. ఈ పరిస్థితిలో హిందూమత దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలు, పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా వారిపై చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ పరిపాలనలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధార్మిక శాఖ వర్గాలు హెచ్చరించాయి. కొరుక్కుపేట: ఆషాడ మాసం రెండో శుక్రవారం సందర్భంగా కొల్లూర్ మూకాంబిగై పాద పూజ ను శ్రీ వాసవి మహిళా విభాగ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీనికి చైన్నె జార్జిటౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహామండపం వేదికై ంది. గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పూజల్లో సంస్థ నిర్వాహకులు, సభ్యులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొంటున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎస్‌కేపీడీ దేవస్థానం మహా మండపంలో కొల్లూర్ మూకాంబిగై అమ్మవారిని విశేషంగా అలంకరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా పాద పూజ నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లను శ్రీ వాసవీ మహిళా విభాగ్ అధ్యకురాలు టి.లావణ్య, ఉపాధ్యక్షురాలు కల్పన బాబు, కార్యదర్శి సరళ బాలాజీ, కోశాధికారి సరళ మనోహర్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. తిరువొత్తియూరు: పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన చెత్తకు నిప్పు పెట్టడంతో పూరి గుడెసి కాలిపోయిందని, బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ జాతీయ మైనారిటీ విభాగం కార్యదర్శి వేలూరు సైదు ఇబ్రహీం డిమాండ్ చేశారు. పెరియపాళెం సమీపం ఎల్లాపురం యూనియన్ కొడుంగయూర్ పంచాయతీకి చెందిన కారాణి గ్రామం, సెల్లియమ్మన్ కోవిల్ వీధిలో సెంథిల్ (43) నివసిస్తున్నాడు. ఇతనికి భార్య సరిత, కుమార్తె మీరా, కుమారుడు సునీల్ ఉన్నారు. మీరా కారణి గ్రామ బీజేపీ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 6వ తేదీన కోడువెలి పంచాయతీ కార్యదర్శి ఉమానాథ్ ఉత్తర్వుల మేరకు పారిశుద్ధ్య కార్మికులైన సుమన్, కోమల, సెల్వి చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడి సెంథిల్ పూరిగుడెసి కాలిపోయింది. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలు, ఆధార్ కార్డ్, పాఠశాల ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, రూ.95 వేల నగదు, బంగారు నగలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై పంచాయతీ కార్యదర్శి ఉమానాథ్, పారిశుధ్య కార్మికులపై వెంగల్ ఎస్ఐ సెంథిల్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ మైనారిటీ విభాగం కార్యదర్శి వేలూరు సైదు ఇబ్రహీం బాధితులను పరామర్శించారు. కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి బాధితులకు ప్రత్యామ్నాయ స్థలంతో పాటు ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ పథకాల సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
ఆగిన ప్రధాన రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, చైన్నె : తమిళనాడులో ప్రతిపాదించిన 5 కొత్త రైల్వే ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభ వేదికగా ఆరోపించారు. లోక్‌సభ సమావేశాల్లో డీఎంకే ఎంపీ అరుణ్ నెహ్రూ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడులో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణే అతిపెద్ద అడ్డంకిగా మారిందని స్పష్టం చేశారు. తమిళనాడులోని రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 4,612 హెక్టార్ల భూమి అవసరమైందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,178 హెక్టార్లను (26% మాత్రమే) సేకరించి అప్పగించిందని వివరించారు. అత్తి పట్టు – పుత్తూరు, పట్టుక్కోటై –మన్నార్గుడి, తంజావూరు – పట్టుక్కోటై, దిండివనం – తిరువణ్ణామలై, మొరప్పూర్ – ధర్మపురి ప్రాజెక్టులు మినహా తాంబరం – చెంగల్పట్టు 4వ లైన్, అరక్కోణం – చెంగల్పట్లు డబ్లింగ్, ఈరోడ్ – కరూర్ డబ్లింగ్, తిరుపతి – కాట్పాడి డబ్లింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పెరంబలూరు ప్రజల విజ్ఞప్తి మేరకు నామక్కల్ – అరియలూరు మార్గంలో కొత్త లైన్ తుది సర్వేకి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. -
నూకాలమ్మ ఆలయంలో చోరీ
పళ్లిపట్టు: దుండగులు నూకాలమ్మ ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని కానుకలను చోరీ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పళ్లిపట్టు యూనియన్‌లోని అత్తిమాంజేరిలో నూకాళమ్మ ఆలయంలో ప్రతిఏటా యాదవులు కొలుపు వేడుకలు నిర్వహించడం పరిపాటి. ఈ ఏడాది కొలుపు వేడుకలు సోమవారం నుంచి బుధవారం వరకు వేడుకగా నిర్వహించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దుండగులు ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని కానుకలు చోరీ చేశారు. హుండీని ముళ్ల పొదల్లో పడేశారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి చోరీ జరిగిన విషయం గుర్తించి ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పొదటూరుపేట ఇన్స్పెక్టర్ రాఖీకుమారి తన సిబ్బందితో ఆలయం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం ఆధారాలు సేకరించారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతవారం ఇదే తరహాలో ఆర్కేపేట సమీపంలోని ఎస్వీజీపురంలో అమ్మవారి ఆలయంలో చోరీ చోటుచేసుకోవడం గమనార్హం. -
చైన్నెలో మిస్సాబ్‌కాన్ – 2026 సదస్సు ప్రారంభం
సాక్షి, చైన్నె : సాంకేతికత, వైద్యం మేళింపుతో ఆరోగ్య సంరక్షణకు భవిష్యత్తు అని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వీ కామకోటి తెలిపారు. చైన్నెలోని ది లీలా ప్యాలెస్ హోటల్లో శుక్రవారం మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ వార్షిక అంతర్జాతీయ సదస్సు (మిస్సాబ్‌కాన్ – 2026)ను ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి ప్రారంభించారు. ఈ సదస్సు ఈనెల 26వ తేదీ వరకు జరగనుంది. ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సరిపోయేలా అందుబాటులో ఉండే, వ్యక్తిగతీకరించిన, ముందస్తు అంచనాతో కూడిన వైద్య పరిష్కారాలను అందించాలంటే సాంకేతికత, ఇంజినీరింగ్, వైద్య రంగాల కలయికే ఏకై క మార్గమని తెలిపారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు మెడిసిన్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కొత్త కార్యక్రమాలను ప్రారంభించాయని తెలిపారు. భవిష్యత్తులో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇంజినీరింగ్ పరిష్కారాలు అవసరమయ్యే రంగాలలో బయోలాజికల్ సైన్సెస్, హెల్త్‌కేర్ అగ్రస్థానంలో నిలుస్తాయని పేర్కొన్నారు. 800 మంది ప్రతినిధులు హాజరు ఈ సదస్సుల్లో 16 విదేశాల నుంచి 100 మందికి పైగా ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్సా నిపుణులతో పాటు మొత్తం 800 మంది సర్జన్లు పాల్గొననున్నారు. వెన్నెముక శస్త్రచికిత్సలో వచ్చిన ఆధునిక పోకడలపై చర్చించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్పైన్ సొసైటీ అయిన పసిఫిక్ అండ్ ఆసియన్ సొసైటీ ఆఫ్ మినిమల్లీ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెన్నెముక సమస్యల చికిత్సపై నిబంధనలను రూపొందించడంతో పాటు, యువ వైద్యులకు అధునాతన శిక్షణ ఇవ్వడం, ప్రపంచ స్థాయి వైద్య సాంకేతికతను భారత్‌కు తీసుకురావడమే ఈ మిస్సాబ్ సొసైటీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఛాన్సలర్ వి.ఆర్.వెంకటాచలం, ట్రస్టీ సంయుక్త సంచాలకులు వెంకటాచలం, శ్రీ రామచంద్ర స్పైన్ సర్జరీ విభాగం అధిపతి – మిస్సాబ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.కార్తీక్ కై లాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుధీర్ గణేశన్ తదితరులు పాల్గొన్నారు. -
రియల్ హీరోగా మారండి!
సాక్షి, చైన్నె : తమిళనాడులో లాకప్ డెత్‌లు జరుగుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, కరెంట్ ఛార్జీల బాదుడు కొనసాగుతోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ విమర్శించారు. ఆమె శుక్రవారం కడలూరులో విలేకరులతో మాట్లాడారు. ‘ఇది సినిమా కాదు.. రీల్ హీరో కాస్తా రియల్ హీరో కావాలంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి’ అని సీఎం విజయ్‌కు హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు, పనితీరుపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. తాము నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని, అధికారులతో మాట్లాడుతున్నామని వివరించారు. ఇంతవరకు ఎక్కడా ఒక్క టెండర్ వేయలేదని, అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇది సీన్ క్రియేట్ చేయడానికి, ఫొటో షూట్లు దిగడానికి, రీల్స్ చేయడానికి సినిమా కాదని, కోట్లాది మంది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్యగా ముఖ్యమంత్రి విజయ్ గుర్తించాలని పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. విపరీతంగా పెరిగిన ధరలు మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని, నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని ప్రేమలత విజయకాంత్ డిమాండ్ చేశారు. థియేటర్లలో కూర్చుని సినిమాలు చూసి ఏడవడం, డ్రామాలు ఆడటం కాదని, ప్రజల బతుకుదెరువు సమస్యలు, ఎల్‌నినో ప్రభావంతో తమిళనాడు కరువు వైపు వెళ్తోందన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని పేర్కొన్నారు. కరువు, నిత్యావసరాల ధరల భారం నుంచి ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడాలన్నారు. పెరిగిన లాకప్ డెత్‌ల సంఖ్య నెలల వ్యవధిలో తమిళనాడులో లాకప్ డెత్‌ల సంఖ్య పెరగడం ఆందోళనను కలిగిస్తోందన్నారు. తూత్తుక్కుడిలో మళ్లీ జరిగిన లాకప్ డెత్‌పై స్పందిస్తూ ఎవరినీ కొట్టి చంపే హక్కు పోలీసులకు ఏ చట్టమూ ఇవ్వలేదన్నారు. అనుమానితులను స్టేషన్‌కు తీసుకెళ్తే విచారించి కోర్టులో ప్రవేశపెట్టాలని, తప్పు ఉంటే న్యాయస్థానమే శిక్ష విధిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి లాకప్ డెత్‌లు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగిపోయాయని, కరెంట్ ఛార్జీల భారం తీవ్రమైందని ఆరోపించారు. పాలనలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని, కంటి తుడుపు చర్యలే మళ్లీ జరుగుతున్నాయని విమర్శించారు. రీల్ హీరోగా ఉన్నవారు రియల్ హీరో అనిపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరాలని ప్రేమలత స్పష్టం చేశారు -
వినతుల పరిస్కారంలో జిల్లాకు లాస్ట్ ర్యాంకు
తిరువళ్లూరు: ముఖ్యమంత్రి విభాగం, గ్రీవెన్స్‌డే, అగ్రి గ్రీవెన్స్‌డేకు వచ్చే వినతులను పరిష్కరించడంలో జిల్లా లాస్ట్ ర్యాంకులో ఉందని, వచ్చే 20 రోజు ల్లో అన్ని వినతులను పరిష్కరించి ర్యాంకును మెరుగు పరచాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి సంక్షేమ పథఽకాలు, స్వయం ఉపాధి సంఽఘాలకు రుణాల పంపిణీ చేశారు. మంత్రి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలో కలెక్టర్ల సమా వేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై వచ్చిన నివేదికను పరిశీలించగా జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. ఇకపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రజలు ఇచ్చిన వినతులపై జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలని సూచించారు. రానున్న 20 రోజుల్లో పెండింగ్ వినతులను పరిస్కరించాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు సమన్వయంతో పనిచే యాలని పేర్కొన్నారు. అనంతరం ఐదుగురు విక లాంగులకు కృత్రిక కాళ్లు, తదితర పరికరాలను అందజేశారు. 269 మందికి రూ.14.14 లక్షల విలువైన కుట్టుమిషన్లు, 85 స్వయం ఉపాధి సంఘాలకు రూ.15 కోట్ల విలువ చేసే రుణాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ ఐఏఎస్ అధికారి కార్తికేయన్, ఎమ్మెల్యేలు డాక్టర్ అరుణ్‌కు మార్, కుట్టి అలియాస్ ప్రకాశం, విజయకుమార్, రమేష్‌కుమార్, డాక్టర్ రవి, విజయప్రభు, ఎస్పీ సాయి ప్రణీత్, డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ ఇందుబాల, సబ్కలెక్టర్లు అబ్దుల్, రఫీక్, ఆవడి కార్పొరేషన్ కమిషనర్ శరణ్య పాల్గొన్నారు. -
భార్య గొంతు కోసి హత్య
వేలూరు: అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు తాలూకా పరిధిలోని ఉడయరాజ్పాళ్యం గ్రామానికి చెందిన బాబు, శ్రీదేవి(34) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబుకు భార్యపై అనుమానం ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో శ్రీదేవి ముగ్గురు పిల్లలను తీసుకుని గత నెల తన అమ్మగారింటికి వెళ్లింది. అనంతరం పెద్దల చర్చలు జరపడంతో రెండు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చింది. గురువారం రాత్రి తన పిల్లలతో కలిసి శ్రీదేవి ఇంటి మిద్దైపెన నిద్రపోయింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పిల్లలు మిద్దైపె నుంచి కిందకు దిగి వచ్చారు. ఆ సమయంలో తన తల్లి శ్రీదేవి తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారు ఆంబూ రు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. బాబు పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దంపతుల మధ్య ఏర్పడిన ఘర్షణతోరనే బాబు తన భార్యను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీ కావడంతో పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. -
అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన
తిరువళ్లూరు: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భారీగా పొగలు కమ్ముకుంటే సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న అంశంపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. తిరువళ్లూరు జిల్లాలోని కన్నిగైపేర్ వద్ద అమ్మోనియం గ్యాస్ లీకేజీ, గుమ్మిడిపూండి వద్ద బాయిలర్ పేలి దుర్ఘటనతో పాటు పలు ప్రమాధాలు జరుగుతున్నాయి. ప్రమాధంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయడానికి ప్రజల్లో ఆందోళన వుంది. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు సహాయక చర్యల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలను ఎలా చేయాలన్న అంశంపై తిరువళ్లూరు అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం ఉదయం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి లోకనాధన్, డిప్యూటి డైరెక్టర్ విల్సన్, సెల్వరాజన్ పాల్గొన్నారు. లోకనాధన్ మాట్లాడుతూ పొగల్లో చిక్కుకున్న వారిని సైతం ప్రజలు చిన్నపాటి భద్రత చర్యలను చేపట్టి రక్షించవచ్చన్నారు. -
రూ.300 కోట్ల స్థలం ఆక్రమణ
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని చెంగల్పట్టు జిల్లా తాంబరం సమీపంలో ఉన్న అగరం దక్షిణం గ్రామంలో సుమారు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై వారం రోజుల్లోగా చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని న్యాయస్థానం తీవ్రంగా హెచ్చరించింది. మాడంబాక్కం ప్రాంతానికి చెందిన సంతానం అనే వ్యక్తి ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అగరం దక్షిణం పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది కుమ్మకై ్క నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ పట్టాలను సృష్టించి విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వివరించారు. దాన్ని బ్యాంకుల్లో పెట్టి రూ.3 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారని, ఆ మొత్తాన్ని ఎన్నికల నిధులుగా మళ్లించి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం జరిగిందని, దీనిపై విజిలెన్స్ విభాగానికి, తాంబరం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామస్వామి ధర్మాసనం విచారించింది. న్యాయవాది వాదనలు వినిపిస్తూ భూ కుంభకోణంలో డీఎంకే మాజీ మంత్రి సోదరితో పాటు పలువురు నాయకుల హస్తం ఉండడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి మోసానికి పాల్పడిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోని పక్షంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విచారణను వచ్చే వారం రోజులకు వాయిదా వేశారు. -
మన్నార్గుడి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలి
కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే తరఫున మన్నార్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కామరాజ్ గెలుపొందారు. ఆ తర్వాత టీవీకేకి మద్దతు ఇచ్చారు. దీంతో ఆయనను ఏఎంఎంకే నుంచి బహిష్కరించారు. అసెంబ్లీలో ఆయన టీవీకే ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఏఎంఎంకే తరఫున గెలిచిన ఏకై క ఎమ్మెల్యే కామరాజ్ కావడంతో, ఫిరాయింపుల నిరోధక చట్టం ఆయనకు వర్తించలేదు. అయినప్పటికీ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏఎంఎంకే అధికార ప్రతినిధి కరికాలన్ స్పీకర్ లేఖను సమర్పించారు. తిరుత్తణి: రాత్రి సమయంలో బస్సులు నడపకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు రాస్తారోకో చేపట్టారు. తిరుత్తణి కొత్త బస్టాండు నుంచి అరక్కోణం, కాంచీపురానికి వెళ్లే బస్సుల కోసం గురువారం రాత్రి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచివుండిన ప్రయాణికులు ఆగ్రహం చెంది రాస్తారోకో చేపట్టారు. పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని ప్రయాణికులతో చర్చలు జరిపారు. అరక్కోణం రోడ్డు మార్గంలో ఆక్రమణలు తొలగింపుతో కాంచీపురం మార్గంలో వెళ్లు బస్సులను బైపాస్ రోడ్డు మార్గంలో మళ్లించారని, దీంతో కొత్త బస్టాండుకు బస్సులు రావడం లేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కొత్త బస్టాండుకు బస్సులు నడిపి ప్రయాణిలను తరలించారు. రాత్రి సమయంలో ప్రయాణికుల రాస్తారోకోతో కలకలం రేపింది. -
సెయింట్ జార్జ్ కోటలో తీవ్ర స్థలాభావం
సాక్షి, చైన్నె : చైన్నె కామరాజర్ మార్గంలోని తమిళనాడు సచివాలయం (సెక్రటేరియట్) నిర్వర్తిస్తున్న చారిత్రక సెయింట్ జార్జ్ కోట ప్రాంగణంలో ప్రస్తుతం తీవ్ర స్థలాభావం ఏర్పడింది. దీంతో సచివాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సెయింట్ జార్జ్ కోట పురాతన భవనం. ఇక్కడే సచివాలయం, అసెంబ్లీ సమావేశ మందిరం ఉన్నాయి. ఈ భవనంలో మంత్రులు, అధికారుల కార్యాలయాలకు సరిపడా స్థలం లేదు. శాసనసభ భవనం, ఎమ్మెల్యేల గదులు కూడా చిన్నవిగా ఉండడం పెద్ద సమస్యగా మారింది. పక్కనే నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10 అంతస్తుల భవనం ఉంది. దీన్ని ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నప్పటికీ, భవనం మొత్తంలో స్థలాభావం నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆది నుంచి సమస్యే సచివాలయంలో స్థలం కొరత ఆది నుంచి ఉంది. 2006లో అప్పటి సీఎం కరుణానిధి ఓమండూరార్ కాంప్లెక్స్‌లో కొత్త సచివాలయాన్ని, బ్రహ్మాండ అసెంబ్లీ భవనాన్ని వందల కోట్లతో నిర్మించారు. ఇది కరుణానిధి కళల సౌధంగా మారింది. 2010లో దీనిని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. 2011లో జయలలిత అధికారంలోకి వచ్చాక దాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి, సచివాలయ కార్యకలాపాలను తిరిగి సెయింట్ జార్జ్ కోటకే తరలించారు. ప్రస్తుతం కొత్తగా టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం విజయ్ సచివాలయ తరలింపు ప్రతిపాదనలపై అధికారులతో చర్చిస్తుండడం గమనార్హం. డిఫెన్స్ స్థలంపై దృష్టి చైన్నెలోని సెయింట్ జార్జ్ కోటలోని ప్రస్తుతం ఉన్న భవనాల్లో వివిధ ప్రభుత్వ శాఖల విస్తరణకు, అధునాతన సౌకర్యాల ఏర్పాటుకు స్థలం చాలకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. సైనిక బలగాల ఆధీనంలో ఉన్న స్థలాన్ని లీజుకు లేదా అద్దె ప్రాతిపదికన తీసుకుని, అక్కడ నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే గిండిలోని పరిశోధనా సంస్థ భవనం, పట్టినంబాక్కంలోని ఖాళీ స్థలాలతో పాటు సైన్యానికి చెందిన స్థలాలను పరిశీలిస్తున్నారు. సైనిక స్థలమైతే క్రమం తప్పకుండా అద్దె చెల్లించి సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. -
క్లుప్తంగా
మూర్ఛ వస్తే ప్రాణమే పోయింది! –మృతుడు తమిళనాడు వాసి గుడిపాల: మూర్ఛకు గురై లారీ డ్రైవర్ మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలోని అల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా వాలాజా మండలం, కొండకుప్పం పంచాయతీకి చెందిన రామచంద్రన్(31) ఎస్ఆర్ఎం కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో ఖాళీ బ్యారెల్ డ్రమ్ములను లోడ్ చేస్తుండగా అతను ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుప్పకూలాడు. అతనితో పాటు ఉన్న జయరామ్, రాజశేఖర్ వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చిన సిబ్బంది రామచంద్రన్‌ను పరీక్షించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ఇక్కడి వచ్చారు. భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైన్నె కీల్పాకంలో కలకలం – దాడిలో ఖైదీ మృతి సాక్షి, చైన్నె : చైన్నె కీల్పాక్కంలోని ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని క్రిమినల్ వార్డులో చికిత్స పొందుతున్న ఒక విచారణ ఖైదీపై తోటి రోగి దాడి చేశాడు. దీంతో అతను చికిత్స పొందుతూ మరణించాడు. కోయంబత్తూరు జిల్లా అలియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అరెస్టయిన జహీర్ మానసిక ఆరోగ్య సమస్యలతో కీల్పాక్కం ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని క్రిమినల్ వార్డులో చేరాడు. అదే వార్డులో తెన్కాసి జిల్లా కడయం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టయిన అరవింద్ స్వామి చికిత్స పొందుతున్నాడు. ఈనెల 20న టాయిలెట్ సమీపంలో జహీర్, అరవింద్ స్వామి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన అరవింద్ స్వామి, జహీర్‌పై దాడి చేశాడు. కేకలు విని అక్కడికి వచ్చిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని రక్షించి మెరుగైన వైద్యం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శుక్రవారం మరణించాడు. దీనిపై డాక్టర్ సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్రటేరియట్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్ స్వామిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. యువకుడి హత్య తిరువొత్తియూరు : తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం సమీపంలోని కచ్చేరి దళవాయిపురంలో యువకుడు హత్యకు గురయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దళవాయిపురం ఉత్తర వీధికి చెందిన మరియప్పన్ కుమారుడు మలైరాజ్ (30) టైల్స్ వేసే కూలి కార్మికుడు. అతను ప్రతిరోజూ సాయంత్రం ఊరి చివరన ఉన్న వాగు ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం సేవించేవాడు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలిసి వాగు ప్రాంతానికి వెళ్లాడు. చాలా సమయమైనా మలైరాజ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. వాగు ప్రాంతంలో మలైరాజ్ శవమై పడి ఉండడాన్ని చూశారు. ఒట్టపిడారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కార్తీక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మలైరాజ్ మతదేహాన్ని స్వాధీనం చేసుకుని తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగానే మలైరాజ్ హత్యకు గుర య్యాడా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మహిళ హత్య కేసులో దంపతుల అరెస్టు అన్నానగర్: పుదుచ్చేరి, కరువాడికుప్పం, సెంగేరి అమ్మన్ కోవిల్ స్ట్రీట్‌లోని సర్ప్రైజ్ పేరిట మహిళ కళ్లకు గంతలు కట్టి కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. సెంగేరి అమ్మన్ కోవిల్ స్ట్రీట్‌లో ఉన్న అపార్ట్మెంట్ భవనంలో మణి, రమణి (43) దంపతులు నివసిస్తున్నారు. వారు హోటల్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం మణి కూరగాయలు కొనడానికి పెద్ద సంతకు వెళ్లాడు. రమణి తన హోటల్ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. మణి ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. పక్కన ఉన్న చిన్న సందులో ఆమె మృతిచెంది ఉంది. పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ బాలమురుగన్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. ముఖం, తలపై కత్తిరితో పొడిచినట్లు గుర్తించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులు లేవు. ఆభరణాల కోసమే హత్య చేసినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా పరిశీలించగా రమణి సోదరి కుమారుడి స్నేహితుడైన ప్రవీణ్‌కుమార్‌పై అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నగల కోసం రమణిని చంపినట్లు ఒప్పుకున్నాడు. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. రమణి పగలు ఒంటరిగా ఉంటుందని, ఆమె నగలు చోరీ చేయాలని ప్లాన్ చేసినట్టు పేర్కొన్నాడు. భార్య ఈశ్వరి, తాను చీర కొని ఆమె ఇంటికి వెళ్లినట్టు తెలిపాడు. చీరను రమణికి సర్ప్రైజ్గా ఇచ్చి ఇంకో సర్ప్రైజ్ ఉందని ఆమె కళ్లకు గంతలు కట్టి సందులోకి తీసుకువెళ్లామని పేర్కొన్నాడు. అక్కడ ఆమెను కొట్టి హత్య చేసినట్టు అంగీకరించాడు. ఆమె నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలిపాడు. దీంతో ప్రవీణ్ కుమార్ (24), అతని భార్య ఈశ్వరి (21)ని పోలీసులు అరెస్టు చేశారు. -
పొంచి ఉన్న జలగండం
జూలై ముగుస్తున్నా వరుణుడు కరుణించలేదు. రుతుపవనాల జాడ లేదు. తమిళనాట ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ చుక్క నీటిబొట్టు బంగారమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు మేట్టూరు, వైగై, భవానిసాగర్ తదితరాలు ఖాళీ అవుతున్నాయి. నీటి విడుదల ఆగిపోవడంతో డెల్లా జిల్లాల్లో కురవై సాగు ప్రశ్నార్థకంగా మారింది. రాబోవు రోజుల్లో వర్షాలు కురవకపోతే సాగునీటి సంగతి దేవుడెరుగు మైళ్లకొద్దీ నడిచినా బొట్టు నీరు దొరకని తాగునీటి గండం నెలకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, చైన్నె : రుతుపవనాల విఫలం, ఎల్‌నినో ప్రభావంతో తమిళనాడు తీవ్రమైన నీటి సంక్షోభంలోకి కూరుకుపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యామ్‌లు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతుండడంతో వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా, తాగునీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన తీవ్రమవుతోంది. రాష్ట్రంలోని 90 ప్రధాన జలాశయాల్లోని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 224.3 టీఎంసీలు. ప్రస్తుతం 31 శాతం (71.2 టీఎంసీలు) నీరు మాత్రమే ఉంది. 52 జలాశయాల్లో నీటిమట్టం 25 శాతం కంటే తక్కువకు పడిపోయింది. 17 డ్యామ్‌లలో 26–50 శాతం, 12 డ్యామ్‌లలో 51–75 శాతం నిల్వలు ఉండగా, 6 డ్యామ్‌లు మాత్రమే పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. డెల్టా జిల్లాల్లో కావేరి జలాలు కరువవడంతో రైతులు బోరు బావుల్ని నమ్ముకుని కొంత మేరకు సాగు చేస్తున్నా, పంట చేతికి వచ్చేది అనుమానంగా ఉంది. ఇక రాజధాని నగరం చైన్నెకి నీరు అందించే 5 ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం 44 శాతం (5.84 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ఏడాది నైరుతి పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పవనాలు కూడా అనుకూలించకపోతే చైన్నెకి తాగునీటి ముప్పు తప్పదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తక్షణ చర్యలు అవసరం వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిపుణులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేస్తే తమిళనాడు కరువు కోరల్లో చిక్కడం ఖాయమన్న ఆందోళనలు తప్పడం లేదు. 2027 వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర తాండవం చేస్తుందేమోనన్న బెంగ ప్రజల్లో బయలుదేరింది. ఇప్పటికే చైన్నెకి నీరు అందించే రిజర్వాయర్లు ఎండిపోయే పరిస్థితులు ఉండడం, కడలూరు జిల్లా వీరానం రిజర్వాయర్ నుంచి నీటి పంపిణీ ఆగిపోవడం కలవరాన్ని రేపుతోంది. సమావేశంలో పళణి స్వామి తదితర నేతలుసాక్షి, చైన్నె : ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వివిధ జిల్లాల నిర్వాహకులతో నిర్వహిస్తున్న సంప్రదింపుల సమావేశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పార్టీ అంతర్గత విభేదాల కారణంగా పలువురు సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా జరిగిన కోయంబత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి హాజరుకాలేదు. ఇది కాస్త పార్టీ వర్గాలలో చర్చకు దారి తీసింది. అలాగే, విల్లుపురం జిల్లా భేటీకి సీనియర్ నేత సీవీ షణ్ముగం సైతం రాలేదు. ఈ ఇద్దరు నేతలు సీఎం విజయ్ విశ్వాస పరీక్ష సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు, పదవుల కేటాయింపులపై అసంతృప్తితోనే వీరు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విల్లుపురం, తిరువారూర్, సేలం జిల్లాల ప్రతినిధులతో చర్చలు ముగించారు. శనివారం చైన్నె, తిరువళ్లూరు సౌత్ జిల్లాల నిర్వాహకులతో పళనిస్వామి సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఎంతమంది నేతలు దూరం కానున్నారో వేచి చూడాల్సిందే. ఇది వరకు జరిగిన వివిధ జిల్లాల సమావేశానికి అనేక మంది మాజీ మంత్రులు, ముఖ్య నేతలు దూరంగా ఉండడంతో మున్ముందు అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో అన్న చర్చ ఊపందుకుంది. వివిధ జిల్లాల్లో కరువు చాయలు 71 అడుగుల సామర్థ్యం ఉన్న వైగై డ్యామ్‌లో నీరు అడుగంటింది. దీంతో నత్తలు, ముత్యపు చిప్పలు చనిపోయి గుట్టలుగా పడి ఉన్న దృశ్యాలు అక్కడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ నీటిపై ఆధార పడ్డ తేని, విరుదునగర్, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాలో సాగు, తాగునీరు కరువయ్యే పరిస్థితి నెలకొంది. 105 అడుగుల లోతు ఉన్న ఈరోడ్ భవానీసాగర్ డ్యామ్ నీటిమట్టం 57.10 అడుగులకు పడిపోయింది. నీటి ప్రవాహం తగ్గడంతో ఈ జలాశయం మీద ఆధార పడిన 2.47 లక్షల హెక్టార్ల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం రైతుల్ని కలవరంలోకి నెట్టినట్టింది. 13 జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు ఆధారమైన సేలం జిల్లా మేట్టూరు డ్యామ్‌కు కర్ణాటక నుంచి కావేరి నీరు విడుదల కాలేదు. దీంతో తూర్పు–పశ్చిమ కాలువల ద్వారా నీరు రాకపోవడంతో పరిసరాల్లోని 100కు పైగా చెరువులు ఎండిపోయాయి. నీలగిరి జిల్లాలో ఒకప్పుడు జలపాతాలు, భారీ వర్షాలతో అలరిస్తూ రెండో చిరపుంజిగా పేరుగాంచిన దేవవిల్ ప్రాంతం సహా ఊటీ, కూనూర్లలో తీవ్రమైన ఎండలు, నీటి కొరత నెలకొంది. పాండియార్–పున్నంబుళా నదుల్లో ప్రవాహం తగ్గి, కాఫీ, టీ, మిరియాల తోటల సాగు దెబ్బతింటోంది. తిరునల్వేలి జిల్లాలోని 143 అడుగుల పాపనాశం డ్యామ్ నీటిమట్టం 67 అడుగులకు పడిపోగా, మణిముత్తారు, పేచ్చిపారై, గుండారు, సాత్తనూరు తదితర రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోయింది. జిల్లాలోని 103 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. తూత్తుకుడి జిల్లాలోని 91 చెరువుల్లో దాదాపు అన్నీ ఎండిపోయాయి. -
రాష్ట్రంలోనే నంబర్ 1
● పర్యాటక రంగంలో తిరుచ్చి సరికొత్త రికార్డు సాక్షి, చైన్నె : తమిళనాడు పర్యాటక రంగంలో తిరుచ్చి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడులో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు కొదవ లేదు. ఇందులోనూ కొన్ని పర్యాటక కేంద్రాలు, మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు నిత్యం ప్రజలతో రద్దీతో ఉంటాయి. ఆ దిశగా గత ఏడాది తమిళనాడును సందర్శించిన మొత్తం పర్యాటకుల సంఖ్యలో తిరుచ్చి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పర్యాటక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, తిరుచ్చి మలైకోటై (రాక్ ఫోర్ట్) పిళ్లయార్ ఆలయం, సమయపురం మారియమ్మన్ ఆలయం, జంబుకేశ్వరర్ ఆలయంతో పాటు సమీపంలోని ముక్కొంబు వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రాంతాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు తరలివచ్చినట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, భద్రతా చర్యలు చేపట్టడం, రవాణా సౌకర్యాలను సులభతరం చేయ డమే తిరుచ్చి జిల్లా ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారణమని తెలిపారు. పర్యాటకంగా ప్రసిద్ది చెందిన ఊటీ, కొడైకెనాల్, కన్యాకుమారి వంటి ప్రదేశాలను ఈ సారి వెనక్కు నెట్టి తిరుచ్చి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆగస్టులో కొత్త పార్టీ! సాక్షి, చైన్నె : తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తనకొత్త రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక కసరత్తు చేపట్టారు. ఆగస్టులో తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం వెలువడింది. అంతలోపు వీ ది లీడర్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా సభ్యత్వ నమోదుకు సిద్ధమయ్యారు. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ ది లీడర్స్ పేరిట సామాజిక–రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా లక్షలాది మంది మద్దతుదారులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వీ ది లీడర్స్ బృందం సభ్యులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తున్నారు. యువత, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులను కలుపుకుని అవినీతి రహిత పాలన, కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నెలలో జరగబోయే భారీ బహిరంగ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించి, రాబోయే రాజకీయ కార్యాచరణను అన్నామలై ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అన్నామలై మేధావులు, నిపుణులు, రాజకీయ విశ్లేషకులతో కలిసి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ‘జననాయకన్’ చూస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ వ్యాఖ్య సాక్షి, చైన్నె : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమి ళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో పదేళ్ల జైలు
వేలూరు: ఐదు సంవత్సరాల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కార్మికుడికి వేలూరు పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన సుబ్రమణి(64) గత సంవత్సరం ఏప్రిల్‌లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ తీసి ఇస్తానని తెలిపి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటిలో ఎవరూ లేక పోవడంతో చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు గుడియాత్తం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్మికుడు సుబ్రమణిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ వేలూరు కోర్టులో జరిగింది. సుబ్రమణిపై నేరం రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మోనిక తీర్పు చెప్పారు దీంతో పోలీసులు నిందితుడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
వీరరాఘవుడి ఆలయంలో జ్యేష్టాభిషేకం
తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జ్యేష్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఆషాడమాసం రెండవ శుక్రవారం రోజు సాయంత్రం జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అభిషేకం కార్యక్రమానికి అవసరమైన నీటిని నాలుగు వెండి బిందెలు, ఒక బంగారు బిందెతో పుష్కరిణిలోని నీటిని శుక్రవారం ఉదయం ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం కనకవల్లి అమ్మవారికి శేష అభిషేకం చేశారు. సాయంత్రం జ్యేష్టాభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీటితో అభిషేకం చేపట్టారు. ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిర్వహించే జ్యేష్టాభిషేకం కారణంగా శుక్రవారం ఉదయం, సాయంత్రం స్వామి వారి దర్శనాన్ని రద్దు చేశారు. స్వామి వారి దర్శనం శనివారం ఉదయం 6.15 గంటలకు ప్రారంభమవుతుందని అర్చకులు, ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. -
త్వరలో వెండి తెరపైకి అప్పాకుట్టి
తమిళ సినిమా: మంచి వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని వరుసగా నటిస్తున్న నటుడు విజయ్ ఆంటోని. ఈయన సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత కథానాయకుడిగా అవతారమెత్తి,, ఆపై నిర్మాతగా మారి విజయాలను అందుకుంటున్నారు. అలా సంగీత దర్శకుడాగా కథానాయకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా రాణిస్తున్న ఈయన బిచ్చగాడు చిత్రంతో నటుడుగా స్టార్ అంతస్తుకు చేరుకున్నారు. ఇటీవల ఈయన దర్శకుడు శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన నూరుసామి చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. తాజాగా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అప్పా కుట్టి. నటి ప్రీతి అస్రారాణి నాయకి. ఇందులో బేబీ లిదన్బా, భగవతి పెరుమాళ్, హరిప్రియ, అరువి మదన్ కుమార్, చిత్రా లక్ష్మణన్, శ్రీజ రవి, వేట్టై ముత్తుకుమార్, జాన్సన్ దివాకర్, మురుగానందమ్, మూనార్ రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని సంగీతాన్ని, రాజీవ్ రాజేంద్రన్ ఛాయాగ్రహణంను అందించారు. ఇది తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చాటే వైవిధ్య భరిత కథా చిత్రంగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఎం మారన్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం కుటుంబ అనుబంధాలతో పాటు యాక్షన్ వంటి పలు కమర్షియల్ అంశాలు చోటుచేసుకుంటాయని దర్శకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య హద్దులు లేని ప్రేమ, త్యాగం, పరస్పర అవగాహన వంటివి ముఖ్య అంశాలుగా రూపొందిస్తున్న కథా చిత్రం అప్పాకుట్టి అని తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగించే ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, త్వరలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకుందని చెప్పారు. తాజాగా విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా చిత్రం రెండో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినట్లు ఇది ప్రేక్షకుల్లో చిత్రంపై మరింత అంచనాలను రేకెత్తిస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. అప్పాకుట్టి చిత్రంలో బేబిలిదన్యాతో విజయ్ ఆంటోని విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా చిత్రం రెండో పోస్టర్ విడుదల -
ఆగస్ట్ 14న తెరపైకి బ్లాక్
బ్లాక్ చిత్రంలో ఓ దృశ్యం తమిళ సినిమా: ఐ అండ్ ఐ పోలీస్ పతాకంపై వై.వైర ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. దీనికి కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను ఎస్పీ.పొన్ శంకర్ నిర్వహిస్తున్నారు. కొట్టుక్కాళి, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన దీహాన్, ధూమ్, క్రిష్, సర్ధార్ చిత్రాల ఫేమ్ బాలీవుడ్ నటి మిక్కీ మక్కీజా, అభినవ్ కోశాలి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో బోజ్పురికి చెందిన శాంత ఆనంద్, బెంగాలీకి చెందిన పప్పూషా, కేరళ, కర్ణాటకకు చెందిన పలువురు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబయి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ పూర్తిచేసినట్లు చెప్పారు. పదేళ్ల కుర్రాడు దీహాన్ పెంపకంలో పెరుగుతాడని ఒకానొక పరిస్థితుల్లో అతను ఢిల్లీకి వెళ్తాడని చెప్పారు, అతను అక్కడ ఎటు వెళ్లాలో తెలియక దేశం మొత్తం తిరుగుతాడన్నారు అలా అనుకోకుండా తీవ్రవాదులతో కలిసి పయనించాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అలా అతను పోలీసులకు పట్టుబడతాడన్నారు. అతను ఎందుకు ఢిల్లీ వెళ్లాడు, అతను నిజంగానే తీవ్రవాదిగా మారాడా? ఆ తరువాత ఏం జరిగింది అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం బ్లాక్ అని చెప్పారు. దీనికి ఛాయాగ్రహణంను నువరదరాజన్, సంగీతాన్ని రాజా రవీంద్రన్ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే అనుమతులు
మంత్రి రాజ్‌కుమార్ వేలూరు: డీటీసీపీ స్థలాలకు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి రాజ్‌కుమార్ తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని వీఐటీ యూనివర్సిటీలో శుక్రవారం తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్ల సమాఖ్య, వేలూరు సివిల్ ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. దీనికి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తమన్ అధ్యక్షత వహించగా మంత్రి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాను మెకానికల్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ సివిల్ ఇంజినీరింగ్ రంగంలో పనిచేశానని తెలిపారు. సివిల్ ఇంజినీర్లు ఎదుర్కొనే సమస్యలు తనకు బాగా తెలుసన్నారు. గతంలో భవన నిర్మాణాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి కోసం సంవత్సరం పట్టేదన్నారు. తమ ప్రభుత్వం నెల రోజుల్లోనే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి రేటు 38 శాతంగా ఉందని, 2047 నాటికి ఈ సంఖ్య 50 శాతానికి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంజినీర్లు తెలిపిన సమస్యలపై రానున్న బడ్జెట్ సమావేశంలో సానుకూల ప్రకటన వెలువడనుందన్నారు. వాస్తు శిల్ప రంగంలో తమిళులు అద్భుతమైన నైపుణ్యం కలిగిన వారని వెల్లడించారు. రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రాండ్ అనకట్టు దీనికి నిదర్శనమన్నారు. అనేక క ళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో లేవన్నారు. ఇటువంటి సదస్సులను ఇంజినీర్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభు, రాష్ట్ర కార్యదర్శి అరుల్, కోశాధికారి కర్ణన్, ఉపాధ్యక్షులు వైద్య నాథన్, సంయుక్త కార్యదర్శి శివకుమార్, ఎమ్మెల్యేలు సుధాకర్, సిందు, తెండ్రల్‌కుమార్, వినోద్‌కన్నన్, వేలూరు సివిల్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎస్ అర్జునన్, డీటీసీపీ కమిటీ చైర్మన్ వెంకటేశన్, తదితరులు పాల్గొన్నారు. -
నిరసనలు ఉధృతం
సాక్షి, చైన్నె : తమిళనాడులో నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. విద్యార్థులు ఎక్కడికక్కడ పోరుబాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలకు పూనుకున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా, నీట్ రద్దుకు పట్టుబడుతూ తమిళనాట మూడో రోజు శుక్రవారం కూడా ధర్నాలు, నిరసనలు కొనసాగాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్, న్యాయ కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. రాష్ట్రంలోని చైన్నె, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి వంటి నగరాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరి నిరసనలను హోరెత్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలో నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ, నీట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి లోకం సమర శంఖం పూరించింది. నిరసనల హోరు ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ సంయుక్తంగా చైన్నె ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియం సమీపంలో భారీ నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చైన్నె నుంగంబాక్కంలోని లయోల కళాశాల విద్యార్థులు, రాజధాని కళాశాల విద్యార్థులు సైతం పోరుబాట పట్టారు. కడలూరు, చిదంబరంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా, రహదారి దిగ్బంధం చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అలాగే కడలూరు జవాన్స్ భవన్ వద్ద సీఐటీయూ, రైతు సంఘాలు, మహిళా సంఘాల కూటమి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరగ్గా, వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన పోస్టాఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. తంజావూరు, నాగపట్నంలోనూ విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉలుందూరు పేటలో డీఎంకే యువజన విభాగం పోరు ఉత్కంఠను రేపింది. డీఎంకే విద్యార్థి, యువజన విభాగాలు సైతం పోరుబాటకు సిద్ధంకావడంతో మున్ముందు నిరసనలు మరింతగా హోరెత్తే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు వద్దు నిరసన సందర్భంగా రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో విద్యార్థులను అణచి వేసే విధంగా పోలీసులు అరెస్టులు చేయడాన్ని సీపీఎం కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో తాము పునరాలోచించాల్సి ఉంటుందని పరోక్షంగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా శనివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్, రాష్ట్ర మంత్రి ఎన్ ఆనంద్ నేతృత్వంలో సభకు ఏర్పాట్లు చేశారు. నీట్‌కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు సైతం గళాన్ని వినిపిస్తున్నారు. దర్శకులు అమీర్, పా రంజిత్, వెట్రి మారన్, నటుడు సత్యరాజ్, నటి రేవతి తదితరులు నీట్‌కు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులను, అరెస్టులను ఖండించడమే కాకుండా నిరసనలో భాగమయ్యారు. చైన్నె కళాశాలలో నిరసన -
క్రీడలతో మానసిక ఉల్లాసం
వేలూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలుగుతుందని, విద్యార్థినులు క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని కళాశాల కార్యదర్శి మేరీ జోస్ఫిన్ రాణి తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అగ్జిలియమ్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో కళాశాల ఆవరణంలో శుక్రవారం గెలుపొందిన విద్యార్థినులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ యుక్త వయస్సులో విద్యార్థినులు విద్యతోపాటు క్రీడలపైనా ఆసక్తి చూపాలన్నారు. ప్రస్తుతం క్రీడా సర్టిఫికెట్లతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌ల మోజులో పడకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడున్న వారు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారని, వారిని ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. కళాశాల విద్య పూర్తి చేసుకొని వివాహాలు చేసుకున్నామా అని లేకుండా జీవితంలో ఏమి సాధించాము, ఏమి సాధించాలని ప్రశ్నించుకోవాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని అధిగమించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరోగ్య జైసిలీ, డిప్యూటీ ప్రిన్సిపాల్ అమల వలర్మది, అబిబ్యూలా, తమిళ విభాగం డీన్ సెంథిల్ సెల్వి పాల్గొన్నారు. -
ఇద్దరి బిడ్డలతో మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుత్తణి: ఆడ బిడ్డలు పుట్టారన్న సాకుతో భర్త విడిచిపెట్టాడని, అతనిని తమతో కలపాలని ఒక మహిల తన ఇద్దరి బిడ్డలతో కలిసి తిరుత్తణి ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కేపేట యూనియన్‌లోని వంగనూరుకు చెందిన గీత(27)కు అమ్మయార్‌కుప్పానికి చెందిన మోహన్(30)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదట పాప జన్మించింది. ఆడబిడ్డ పుట్టడంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త వరకట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపారు. గతేడాది పెద్దలు పంచాయితీ చేసి దంపతులను ఒకటి చేశారు. దీంతో గీత రెండో సారి గర్భం దాల్చింది. ఆరు నెలల కిందట మళ్లీ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మోహన్, అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం చెంది గీతను ఇద్దరి బిడ్డలతో సహా బలవంతంగా పుట్టింటికి పంపారు. అప్పటి నుంచి భర్తతో కాపురం కోసం గీత పోరాడుతోంది. తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో శుక్రవారం తన ఇద్దరి బిడ్డలతో తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయం చేరుకుంది. తనకు న్యాయం చేయడం లేదని వాపోయింది శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే వున్న పోలీసులు ఆమెను కాపాడారు. అధికారులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి గీత, ఆమె బిడ్డలకు న్యాయం చేస్తామని తీసుకెళ్లారు. -
ఉన్నత లక్ష్యాలతో చదవాలి
కొరుక్కుపేట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు కసితో చదవాలని ఇందిరా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇందిరా రాజేంద్రన్ పిలుపునిచ్చారు. తెలుగు మహాజన సమాజం నిర్వహణలో కొనసాగుతున్న శ్రీ వేణుగోపాల్ విద్యాలయం 46వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె తేనాంపేట, కామరాజ్ అరంగం వేదికై ంది. పాఠశాల అధ్యక్షులు కె.అనిల్‌కుమార్ రెడ్డి, ఇందిరా రాజేంద్రన్, గౌరవ అతిథిగా ప్రీస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రియదర్శిని రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. పదవ తరగతి, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులకు వాచ్‌లను అందించి అభినందించారు. 25 సంవత్సరాలపైగా తెలుగు మహాజన సమాజానికి సేవలందించిన ఎం.విఎస్ఆర్ శర్మను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షుడు కె.ఆనంద్ కుమార్ రెడ్డి, కోశాధికారి కె.రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఇలంగో, ప్రధానోపాధ్యాయురాలు వి.శీలా, కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, తెలుగు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల శాఖల కేటాయింపులో జాప్యం
సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ ఇంకా తేలకపోవడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి రంగస్వామి సమర్పించిన మంత్రుల పోర్ట్‌ఫోలియో (శాఖల) జాబితాకు లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్ ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తుండడంతో బడ్జెట్ సమర్పణపై సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి రంగస్వామి ఈనెల 20న మంత్రుల శాఖల కేటాయింపు జాబితాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేశారు. సాధారణంగా వెంటనే ఆమోదం లభించాల్సి ఉండగా, నాలుగు రోజులు గడిచినా గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గతంలో బీజేపీకి కేటాయించిన కొన్ని కీలక మంత్రి పదవులను ఈసారి వారికి ఇవ్వకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై బీజేపీ సైతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటినా, ఇంత వరకు శాఖల కేటాయింపు జరగకపోవడం గమనార్హం. చిక్కుల్లో రూ.14,500 కోట్ల బడ్జెట్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ.14,500 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. శాఖల కేటాయింపు పూర్తయి, కొత్త అసెంబ్లీ కొలువుదీరితే తప్ప బడ్జెట్‌ను ఆమోదించే వీలులేకపోవడంతో సీఎం రంగస్వామి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు పుదుచ్చేరి రాజకీయాలను ఉత్కంఠలో పడేశాయి. -
మొబైల్లో 8 వేల అశ్లీల చిత్రాలు!
తమిళనాడు: సేలం కొండలాంపట్టి ప్రాంతానికి చెందిన మణికండన్ (39) అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇతను పలువురు మహిళలను రహస్యంగా అశ్లీల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలపై గతంలో అరెస్ట్ అయ్యాడు. ఇతని మొబైల్ ఫోన్లో సుమారు 8,000 అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పొల్లాచ్చి తరహాలో సేలంలోనూ ఇలాంటి దారుణం జరిగిందని రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ కేసును సీబీ–సీఐడీకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో అరెస్ట్ అయిన మణికండన్, గత నెల 16వ తేదీన కోర్టు నుండి బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన కేవలం ఒక వారంలోనే, మంగళం మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 27 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి తన ఫిర్యాదులో, మణికండన్ తనను రహస్యంగా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపించి తనతో లొంగిపోవాలని లేదంటే భర్తకు పంపిస్తానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ కవిత మణికండన్‌ను అరెస్ట్ చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శాలిని ఆత్మహత్య
తమిళనాడు: పూందమల్లిలో భర్తతో గొడవపడిన అనంతరం వీడియో పోస్ట్ చేసి ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పూందమల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సెల్వన్ (36) భార్య శాలిని (33). వీరు ప్రేమించుకుని 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా, అతని భార్య కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తు వచ్చింది.ఈ స్థితిలో, బుధవారం శాలిని బిడ్డను కొట్టింది. బిడ్డను ఎందుకు కొడుతున్నావని అడిగి, సెల్వన్ తన భార్య శాలినిపై విచ్చలవిడిగా దాడి చేసి జిమ్‌కు వెళ్లాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి తలుపు లోపలి భాగం తాళం వేసి ఉంది. ఎంత తట్టిన చాలా సేపటి వరకు తలుపు తెరవకపోవడంతో, తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శాలిని ఉరి వేసుకుని ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం గురించి పూందమల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలు శాలిని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం చెన్నైలోని కిల్పాక్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అంతేకాకుండా, పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తేలిందేమిటంటే, ఆత్మహత్య చేసుకునే ముందు శాలిని, తన భర్త తనను కొట్టి, తిడుతు వేధిస్తున్నాడని వీడియోను రికార్డ్ చేసి, దానిని తన బంధువులకు, స్నేహితులకు పంపింది. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూందమల్లి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
రెండు స్వర్ణ పతకాలతో మెరిసిన తమిళనాడు
సాక్షి, చైన్నె : చైన్నె వేదికగా ఎనిమిది రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన యోనెక్స్న్స్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో తమిళనాడు జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 5 విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుని రెండు స్వర్ణ పతకాలను సాధించి టాప్‌లో నిలిచింది. హర్యానా, ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక క్రీడాకారులు కూడా వివిధ విభాగాల్లో పతకాలు సాధించి మెరిశారు. బహుమతుల ప్రదానం గురువారం జరిగిన ముగింపు వేడుకల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ సిగమణి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. క్రికెట్‌తో సమానంగా బ్యాడ్మింటన్క్రీడ శరవేగంగా విస్తరిస్తోందని, ఆదరణ, క్రీడా విజయాల పరంగా క్రికెట్‌తో ఉన్న వ్యత్యాసాన్ని దాదాపు తగ్గించే స్థాయికి ఎదిగిందని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు..
సాక్షి, చైన్నె: పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి అధికార పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్ హామీ ఇచ్చినట్లు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దళవాయి సుందరం, అగ్రి కృష్ణమూర్తి తెలిపారు. చైన్నె సచివాలయంలో తమిళనాడు శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు: అన్నాడీఎంకే గుర్తుపై గెలిచిన సి.విజయభాస్కర్, ఇసక్కి సుబ్బయ్య సహా 6 గురు ఎమ్మెల్యేలు హార్స్ ట్రేడింగ్ ద్వారా అధికార టీవీకే పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు. వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. స్పీకర్ అడిగిన వివరణకు స్పందన శాసనసభాపక్ష నేత, విప్ ఎప్పుడు, ఎక్కడ ఎన్నికయ్యారు అనే వివరాలను స్పీకర్ కోరారని, చట్టప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే విప్‌ను నియమించే అధికారం ఉంటుందని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సమర్పించిన వివరణ లేఖను స్పీకర్‌కు అందించామని, త్వరలోనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నుండి ఖాళీ కాగితాలపై సంతకాలు సేకరించారనడం అబద్ధమని, ఎవరూ ఖాళీ కాగితాలపై సంతకాలు చేయరని స్పష్టం చేశారు. విప్ ఆదేశాలను ఉల్లంఘించే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడమే చట్టమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం పార్టీలు సూచించిన వ్యక్తులనే విప్ వంటి పదవుల్లో స్పీకర్ గుర్తించాలని, స్పీకర్ చట్టానికి లోబడి నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన అన్నాడీఎంకే బలహీనపడదని స్పష్టం చేశారు. -
పెండింగ్ కేసుల తగ్గింపునకు కోర్టుల సంఖ్య పెంపు
సాక్షి, చె,న్నై : తమిళనాడులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దిగువ కోర్టుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వెల్లడించారు. చైన్నె హైకోర్టులోని ప్రముఖ న్యాయవాదుల సంఘం మద్రాస్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 150 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి, ఎంతో మంది ప్రముఖ న్యాయవాదులను, న్యాయమూర్తులను అందించిన మద్రాస్ బార్ అసోసియేషన్ తనను సన్మానించడం పై కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చట్టం, న్యాయ శాఖలో ఇంకా కొన్ని లోపాలు, సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేసుల పెండింగ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా దిగువ కోర్టుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ప్రతి 200 కేసులకు ఒక కోర్టు ఉండేలా చర్యలను వేగవంతం చేయాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మద్రాస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వి.ఆర్. కమలనాథన్, కార్యదర్శి జె. బోతిరాజ్, కోశాధికారి వి.టి. బాలాజీ, అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన క్రిమినల్ అడ్వకేట్ జాన్ సత్యన్, టీవీకే న్యాయవాదుల విభాగం రాష్ట్ర నిర్వాహకుడు ఎస్. అరివళగన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన రోడ్లలో ఆక్రమణల తొలగింపు
తిరుత్తణి: †Æý‡$-™èl¢×ìæ ç³rt-׿…ÌZ {糫§é¯]l Æøyýl$Ï B{MýS-Ñ$…_ §ýl$M>-×êË$ ò³§ýlª-G-™èl$¢¯]l HÆ>µr$ ^ólçÜ$¢…-yýlyýl…™ø {sêíœMŠS çÜÐ]l$çÜÅ ¡{Ð]l… AÐ]l#™ø…-¨. çœÍ-™èl…V> {ç³Ä¶æ*×ìæ-MýS$ÌS íœÆ>ŧýl$ Ðól$Æý‡$ VýS$Æý‡$-ÐéÆý‡… ´ùÎçÜ$ º…§øºçÜ$¢ ¯]lyýl$Ð]l$ B{MýSÐ]l$-׿-ÌS¯]l$ OòßæÐólÔ>Q A«¨-M>-Æý‡$Ë$ ™öÌS-W…-^éÆý‡$. †Æý‡$-™èl¢×ìæ ç³rt׿…ÌZ° AÆý‡-MøP׿… Æøyýl$z, Ð]l*Æð‡PsŒæ, Ð]l*´ùïÜ Æøyýl$z, _™èl*¢Æý‡$ Æøyýl$z, AMýSPĶæ$Å Ò«¨, O»ñæ´ë‹Ü çÜà {糫§é¯]l ÆøyýlÏÌZ °™èlÅ… Ðéçßæ¯éÌS Æý‡©ªV> Ð]l#…r$…-¨. D Æøyýl$z¯]l$ ÐéÅ´ë-Æý‡$Ë$ B{MýSÑ$…^èl$-Mø-Ð]lyýl…™ø Ðéçßæ-¯éÌS {sêíœMŠS çÜÐ]l$çÜÅ ¡{Ð]lOÐðl$…-¨. Byìl-MýS–-†¢MýS Ðólyýl$-MýSË$ çÜ…§ýlÆý‡Â…V> B{MýS-Ð]l$-׿Ë$ ™öÌSW…_ {sêíœMŠS çÜÐ]l$çÜÅ ç³ÇÚëP-Æ>-¯]lMìSి hÌêÏ MýSÌñæ-MýStÆŠ‡ MýSÑ™èl B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ OòßæÐól Ô>Q A«¨M>-Æý‡$ÌS º–…§ýl… ´ùÎ-çÜ$ÌS ç³sìæçÙt º…§øºçÜ$¢ ¯]lyýl$Ð]l$ ™öÍÆøk AÆý‡-MøP׿… Æøyýl$z Ð]l*Æý‡Y…ÌZ CÆý‡$-OÐðl-ç³#ÌS Æøyýl$z B{MýS-Ñ$…_ ÑçÜ¢-Ç…-_¯]l MýSrt-yé-ÌS¯]l$ gôæïܽ ÝëĶæ$…-D™ø ™öÌS-W…-^éÆý‡$. C§ól ™èlÆý‡-àÌZ ç³rt׿ ÐéÅç³¢…V> B{MýSÐ]l$-׿Ë$ ™öÌSW…^èl-¯]l$-¯]l²r$Ï OòßæÐólÔ>Q A«¨-M>Æý‡$Ë$ ™ðlÍ´ëÆý‡$. -
కాకంగళ్ చిత్ర షూటింగ్ పూర్తి..!
తమిళసినిమా: కాక్కా ముట్టై,కుట్రమే దండనై చిత్రాల కథా రచయిత ఆనంద్ అన్నామలై దర్శకుడిగా అవతారమెత్తి రూపొందిస్తున్న చిత్రం కాకంగళ్. మాయవరం పిక్చర్స్ పతాకంపై ఈయన కథ, కథనం ,సంభాషణలు, కూర్పు, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ యోగి బాబు, విధార్ధ్, లిజోమోల్ జోష్, గురు సోమ సుందరం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ బుధవారంతో పూర్తి అయిందని దర్శక నిర్మాత ఆనంద్ అన్నామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది మానవ అనుబంధాలను, ఆధ్యాత్మిక అన్వేషణ వంటి వైవిద్య భరిత కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిందని, కాగా బుధవారం నటుడు యోగిబాబు పుట్టిన రోజు కూడా కావడంతో రెండు వేడుకలను పెట్టింపు ఉత్సాహంతో కేక్ కట్ చేసి జరుపుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్, సౌండ్, డిజైనింగ్, నేపథ్య సంగీతం , వీఎఫ్ ఎక్స్, డీఐ తదితర నిర్మాణాంత కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో వైవిద్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానిఠకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించినట్లు దర్శక నిర్మాత ఆనంద్ అన్నామలై పేర్కొన్నారు. -
కల్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్ ఎంట్రీ షురూ
తమిళసినిమా: ఏ రంగంలోనైనా సక్సెస్ ప్రభావం చాలానే ఉంటుంది. అలా టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి విజయం కోసం ఎదురుచూసిన నటి కళ్యాణి ప్రియదర్శన్. నట వారసత్వంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ తొలి రోజుల్లో సరైన సక్సెస్‌లు లేక డీలా పడ్డారనే చెప్పాలి. అయితే ఆ మధ్య తమిళంలో నటుడు శింబుకు జంటగా నటించిన మానాడు చిత్ర విజయం ఈమెకు కాస్త ఊరట నిచ్చింది. అలాంటిది ఇటీవల కళ్యాణి ప్రియదర్శినన్ మలయాళంలో నటించిన లోకా చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నటి కళ్యాణి ప్రియదర్శన్‌కు యాక్షన్ హీరోయిన్గా పేరు తెచ్చి పెట్టింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసే సమయం ఆసన్నమైంది. అక్కడ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ జంటగా నటించరున్నారు. జాంబి థ్రిల్లర్ కథాంశంతో రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. తొలి చిత్రంతోనే భారీ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా కళ్యాణి ప్రియదర్శన్ అదష్టమని చెప్పాలి. ఇందులో ఆమెది యాక్షన్ తో కూడిన కథా పాత్రగా ఉంటుందని తెలిసింది. దీంతో కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం ఒక అంతర్జాతీయ శిక్షకుడి వద్ద ఫైట్స్ లో శిక్షణ పొందడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం ఆగస్టు నెలలో ప్రారంభం కానట్లు సమాచారం. కాగా దీని తర్వాత నటి కళ్యాణి ప్రియదర్శన్ తనకు స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన లోకా. చాప్టర్ 2 చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. తమిళసినిమా: కొందరు దర్శకులకు తమకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. అలా రామ్‌కు నైవిద్య భరిత కథా చిత్రాలుగా దర్శకుడిగా పేరు ఉంది. చిత్రాల్లో కమర్షియల్ అంశాలతో పాటు, జనరంజికమైన, అంతేకాకుండా జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను పొందే విధంగా ఉంటాయి. ఇంతకు ముందు రామ్ దర్శకత్వం వహించిన కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి పేరంబు, ఇటీవల తెరకెక్కించిన పరందుపో వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. రామ్ తాజాగా దశరథ వహించిన ఏళు కడల్ ఏళుమలై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ ఒకటవ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ది హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు నివిన్ బాలి చిన్న గ్యాప్ తర్వాత తమిళంలో కథానాయకుడు నటించారు. అదేవిధంగా ఇటీవల కథానాయకుడుగా అవతారమెత్తిన నటుడు సూరి ఇందులో స్టైలిష్ పాత్రను పోషించారు. ఇక నటి అంజలి కథానాయక నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా చిత్ర టీజర్ ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ పొందినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. నటుడు నివిన్ బాలి గెటప్పు, వైవిద్య భరిత నటన, నటుడు సూరి వినోదం, నటి అంజలి నటన ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పారు. చిత్రం చాలా రోజుల క్రితమే నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శింపబడి పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకుందని. దీంతో కాస్త ఆలస్యం అయినా చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న తెరపైకి ఏళు కడల్ ఏళు మలై -
చైన్నె వైద్యుడి అరుదైన ఘనత
సాక్షి, చైన్నె : దక్షిణ ఆసియాలో ఏడాదిలోనే 300కి పైగా ఎవాల్యూషన్ మెడియల్–పివట్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి చైన్నె సర్జన్ ఘనత సాధించారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స రంగంలో కేవలం నొప్పులను నివారించడమే కాకుండా, మోకాలి సహజమైన కదలికలను పునరుద్ధరించడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ కొత్త విధానంలో చైన్నె పార్వతి హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వెట్రి కుమార్ సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఎవాల్యూషన్ మెడియల్–పివట్ నీ సిస్టమ్ ఉపయోగించి ఏడాది కంటే తక్కువ సమయంలోనే 300కి పైగా టోటల్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన దక్షిణ ఆసియాలోనే ఘనత సాధించిన సర్జన్‌గా ఆయన నిలిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ’ఎవాల్యూషన్ ట్రూ మెడియల్–పివట్ సాంకేతికత మోకాలికి సహజమైన స్థిరత్వాన్ని , కదలికలను ఇస్తుందని వివరించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు తాము మోకాలి మార్పిడి చేయించుకున్నామనే విషయాన్నే మరిచిపోయేలా సాధారణ జీవితానికి త్వరగా తిరిగి రాగలుగుతున్నారన్నారు. ఆధునిక మోకాలి మార్పిడి అనేది కేవలం నొప్పిని తగ్గించడానికే పరిమితం కాదని, . ప్రతి ఒక్కరి మోకాలి నిర్మాణం ప్రత్యేకమైనదిగా వివరించారు. ఆ ప్రత్యేకతను గౌరవిస్తూ చికిత్స అందిస్తే రోగికి అత్యంత సహజమైన కదలికలు లభిస్తాయనానరు. ఈ 300 శస్త్రచికిత్సలు కేవ లం సంఖ్య మాత్రమే కాదు, 300 మంది జీవితాల్లో వచ్చిన మార్పు. సరైన క్లినికల్ విధానం , ఆవిష్కరణలు మోకాలి సహజ పనితీరును ఎలా పునరుద్ధరించగలవో డాక్టర్ వెట్రి నిరూపించారని ఈసందర్భంగా మైక్రో పోర్ట్ ఆర్థోపెడిక్స్ సీనియర్ జనర ల్ మేనేజర్ డాక్టర్ ముకేష్ పర్మార్అభినందించారు. -
తూత్తుకుడిలో లాకప్ డెత్ కలకలం..?
సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అక్రమ మద్యం విక్రయాల ఆరోపణలపై అరెస్టయిన అరుణాచలం (24) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. పోలీసుల తీవ్ర దాడి కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అరుణాచలం కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కేసు నేపథ్యం: అముదా నగర్‌కు చెందిన అరుణాచలం (24) స్థానిక టాస్మాక్ బార్లో పనిచేస్తున్నాడు. జూలై 17న అతని వద్ద 120 అక్రమ మద్యం సీసాలు ఉన్నాయంటూ తూత్తుకుడి దక్షిణ వి భాగం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ సమయంలో అరుణాచలం స్పృహతప్పి పడిపోవడంతో పోలీసులు అతడినిసొంత పూచీకత్తుపై విడుదల చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స ఫలించక ఉదయం అతను ప్రాణాలు విడిచాడు. రోడ్డు దిగ్బంధం.. పోలీసుల దాడికి వ్యతిరేకంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోస్టుమార్టం నిలిపివేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తేవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, డీఎంకే జిల్లా కార్యదర్శి జి. గీతాజీవన్ ఆధ్వర్యంలో రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందించారు. అయితే, తూత్తుకుడి జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచలాన్ని అరెస్టు చేసిన తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి ఎలాంటి బాహ్య గాయాలు లేవని, ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు ధ్రుకరించారు. పోలీసు స్టేషన్ సీసీ కెమెరా దృశ్యాల ప్రకారం.. అతను ఇతర ఖైదీలతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడని వివరించారు. వెంటనే అతని తల్లిని పిలిపించి జాగ్రత్తగా ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. అరుణాచలం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎంపీ కనిమొళి సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా స్పందించారు. గత వారం నాగర్‌కోయిల్ ఘటన తర్వాత ఇప్పుడు తూత్తుకుడిలోనూ పోలీసుల వేధింపులకు గురై ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం అత్యంత వేదన కలిగిస్తున్నదన్నారు. -
వీసీకే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై ఢిల్లీలో లాఠీచార్జ్ చేసిన పోలీసుల తీరును నిరసిస్తూ, కాంగ్రేస్, వీసీకే ఆద్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు పెద్దకుప్పంలో జరిగిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు శశికుమార్ అద్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యదేశంలో పోరాటం చేయడానికి ప్రజలకు వున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందన్నారు. దీంతో పాటూ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ ఆందోళనలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఏకాటూరు ఆనందన్, రాష్ట్ర కార్యదర్శి సీపీ మోహన్‌దాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిదివాకర్, ఓబీసీ విభాగం వర్కింగ్ కమిటి రాష్ట్ర అద్యక్షుడు వెంకటేషన్, మైనారీటి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్‌రహ్మాన్, మండల అధ్యక్షుడు పూండి షణ్ముగం, నగర అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. వీసీకే ఆధ్వర్యంలో ధర్నా: నీట్ పరీక్షల నిర్వాహణలో విఫలమైన కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష పేపర్లు లీకేజీ వ్యవహరంపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ వీసికే ఆధ్వంర్యంలో ఈకాడు బీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీనియర్ నేత నీలవానత్తునిలవన్, రీజినల్ కో– ఆర్డినేటర్ ధళపతిసుందరం, జిల్లా కన్వీనర్ అరుణ్గౌతమ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఆర్ఎన్ సింగ్ ‘బియాండ్ ది ఐవీ లీగ్’ పుస్తకం
సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వే జీఎం ఆర్.ఎన్. సింగ్ రచించిన ‘బియాండ్ ది ఐవీ లీగ్ : ట్రెయిట్స్, స్కిల్స్ అండ్ విజ్ డమ్ దట్ మేక్ గ్రేట్ లీడర్స్ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. చైన్నె పెరంబూరులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సైమన్ – షుస్టర్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, రిటైర్డ్ డీజీపీలు రవి, శంకర్ జీవ, రైల్వేబోర్డు సభ్యుడు నవీన్ గుల్లాటి, ఐసీఎఫ్ జీఎం సుబ్బారావులు అందుకున్నారు. భారతీయ రైల్వేలో మూడు దశాబ్దాలకు పైగా విభిన్న హోదాల్లో పనిచేసిన అనుభవంతో ఆర్.ఎన్. సింగ్ ఈ పుస్తకాన్ని రూపొందించారు. -
నెమ్మేలి ప్లాంట్‌లో.. తగ్గిన తాగునీటి సరఫరా
చైన్నె నగరం సమీపంలోని నెమ్మేలి సముద్రపు నీటి శుద్ధి కర్మాగారంలో తాగునీటి సరఫరా సగానికి సగం పడిపోయింది. ప్లాంట్‌లోని ప్రధాన శుద్ధీకరణ విడిభాగాలైన ఫిల్టర్లు , మెంబ్రేన్లు (ఫిల్టరింగ్ బ్లాక్స్) కొరత ఏర్పడటమే ఇందుకు కారణంగా సమాచారాలు వెలువడ్డాయి. రోజువారీ ఉత్పత్తి 25 కోట్ల లీటర్ల నుండి ఒక్కసారిగా 13 కోట్ల లీటర్లకు తగ్గిపోవడంతో, దక్షిణ చైన్నె పరిధిలోని పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెమ్మేలి ప్లాంట్ సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని నెమ్మేలిలో సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే శుద్ధీకరణ కర్మాగారం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉత్పత్తి అయ్యే నీటి దక్షిణ చైన్నెలోని పలు ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుంది. గత డీఎంకే హయంలో నిర్లవణీకరణ పథకం మేరకు ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. విదేశాల నుండి ఫిల్టర్ల సరఫరా ఆగిపోవడంతో.. సముద్రపు నీటిని ఉప్పురహితంగా మార్చే ప్రక్రియలో అత్యంత కీలకమైన ప్రత్యేక ఫిల్టర్లను కొన్ని నెలలకొకసారి మార్చాల్సి ఉంటుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా విదేశాల నుండి రావాల్సిన ఈ ఫిల్టర్ల రవాణాకు ఆటంకం ఏర్పడింది. 250 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో ఉత్పత్తి 100 మిలియన్ లీటర్లకు, అలాగే 110 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో నీటి ఉత్పత్తి 100 మిలియన్ లీటర్లకు పరిమితమైంది. నీటి చౌర్యం నెమ్మేలి మెయిన్ పైప్లైన్లకు రంధ్రాలు చేసి దొంగతనంగా నీటిని మళ్ళిస్తుండటం వల్ల మిగిలిన నీరు కూడా ప్రజలకు సరిగ్గా అందడం లేదు. కాగా గత 20 రోజులుగా 3 నుండి 4 రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని, వార్డుల్లో కేవలం 25 శాతం అవసరాలు మాత్రమే తీరుతున్నాయని స్థానిక కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త ఫిల్టర్ల రవాణా ప్రారంభమైందని, పాత ఫిల్టర్ల మార్పిడి పనులు శరవేగంగా చేపట్టనున్నామని, నీటి సరఫరా బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. నీటి చౌర్యం అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఈ నెలాఖరు నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో ప్లాంట్ల నుండి సాధారణ స్థాయికి నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా తగ్గిన ప్రాంతాలలో ఇతరప్రాంతాల నుంచి ట్యాంకర్లద్వారా నీటిని అందించే పనిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘ ప్రక్రియ నీటి శుద్ధి ప్లాంట్‌ను ఒకసారి నిలిపివేస్తే, తిరిగి సాధారణ ఉత్పత్తి స్థాయికి చేరుకోవడానికి దాదాపు 9 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఈ సరఫరా అంతరాయం కారణంగా దక్షిణ చైన్నె పరిధిలోని షోళింగనల్లూరు, అడయార్, పెరుంగుడి, అలందూర్, తేనాంపేట తదితర ప్రాంతాలలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఒకవైపు ఉత్పత్తి తగ్గితే, మరోవైపు పైప్‌లైన్ పగుళ్లు – లీకేజీలు సైతం తాజాగా సమస్యగామారి ఉన్నాయి. మెట్రో రైల్ పిల్లర్ల నిర్మాణాలు , ఇతర పనుల వల్ల ప్రధాన సరఫరా పైపులు దెబ్బతింటున్నాయి. పైపులలో నీటి పీడనం తగ్గడంతో ఇళ్లలోని ట్యాంకులు 30 శాతానికి మించి నిండడం లేదు. కొన్నిచోట్ల దుర్వాసనతో కూడిన కలుషిత నీరు వస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -
‘విజన్ 2030’ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తమ అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్షిక సదస్సు ఇమేజిన్ 2026 కు ముందు చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం విజన్ 2030 రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలో లైవ్ ఎంటర్టైన్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, బిజినెస్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్లు , సాంస్కృతిక, టూరిజం రంగాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 7 నుండి 9 వరకు చైన్నెలోని ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా ఇమేజిన్ 2026 సదస్సును నిర్వహించనున్నట్టు ప్రకటించారు. భారతదేశాన్ని ప్రపంచ ఎక్స్పీరియన్స్ క్యాపిటల్ గా నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు సమిత్ గార్గ్ తెలిపారు. అసోసియేషన్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ గోపాల్ మాట్లాడుతూ... ఈ సదస్సు తొలిసారిగా చైన్నెలో జరగడం దక్షిణ భారత ఈవెంట్ రంగానికి ఒక గొప్ప మైలురాయిగా వివరించారు. ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు, కళాకారులు, సాంస్కృతిక మూలాలు తమిళనాడులో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.. ఈ సదస్సు ద్వారా 800 మందికి పైగా పరిశ్రమ దిగ్గజాలు, నిర్ణయాధికారులు చైన్నెకి రానున్నారని తెలిపారు.ఈఈఎంఏ వ్యవస్థాపక సభ్యుడు సిద్ధార్థ్ గణేరివాలా మాట్లాడుతూ ఈ సదస్సులో వ్యాపార వృద్ధి – విధానాలు, అధునాతన సాంకేతికత – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుస్థిరత – పర్యావరణ పరిరక్షణ , నైపుణ్యాభివృద్ధి – గ్లోబల్ ప్రాక్టీసెస్ గురించి చర్చించనున్నామని వివరించారు. -
చైన్నె 28 సీక్వెల్ –3కి సిద్ధం
తమిళసినిమా: క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన సక్సెస్ఫుల్ చిత్రాలలో చైన్నె 28 ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వ వహించిన ఇందులో నటుడు శివ, జయ్, నితిన్ సత్య, విజయ్ వసంత్ , అరవింద్ ఆకాష్, ఇళంగో రవి తదితరులు ప్రధాని పాత్రలు పోషించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తర్వాత మాసు ఎంగిరా మాచలామణి, బిరియాని వంటి చిత్రాలను చేసిన వెంకట్ ప్రభుకు ఆ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో మళ్లీ తనకు మంచి విజయాన్ని సాధించిన చైన్నె 28 చిత్రానికి పార్ట్ 2 ఎక్కించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శింబు హీరోగా మానాడు వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన వెంకట ప్రభు ఈమధ్య విజయ్ హీరోగా గోట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఆశించిన విజయాన్ని చేరుకోలేకపోయింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా రూపొందించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. తదుపరి నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అది ఏమైందో గానీ, తాజాగా తనకు కలిసి వచ్చిన క్రికెట్ క్రీడ నేపథ్యంలో చైన్నె 28 చిత్రానికి మూడవ భాగాన్ని తెరకెక్కించడానికి వెంకట్ ప్రభు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథా చర్చలను ఇటీవల మలేషియాలో తన టీమ్‌తో కలిసి నిర్వహించి పూర్తి చేసిన వెంకట్ ప్రభు ఇప్పుడు చెత్త షూటింగ్‌ను థాయిలాండ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఒడిశా నుంచి గంజా తరలిస్తున్న నలుగురి అరెస్ట్
వేలూరు: ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు గంజా తరలించి విక్రయం చేస్తున్న నలుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి రైలు మార్గంలో గంజా తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో కాట్పాడి రైల్వే పోలీసులు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో రైల్వే పోలీసుల తనిఖీలను చేసి నలుగురు యువకులు ట్రావెల్ బ్యాగులతో వాలాజ రైల్యే స్టేషన్లో దిగి నడిచి వెళ్తుండగా రైల్వే పోలీసులు వారిని నిలిని బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకెల్లి పరిశీలించగా అందులో మొత్తం 28 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒడిశా రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అదే విధంగా వీరు తరచూ ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిను తీసుకొచ్చి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విక్రయం చేస్తున్నట్లు తెలిసింది. -
చెక్ బౌన్స్ కేసు...
సాక్షి, చైన్నె : ‘మన్నార్ వగైయారా’ సినిమా నిర్మా ణం కోసం తీసుకున్న రూ.4.5 కోట్ల రుణానికి సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ తమిళ నటుడు విమ ల్కు చైన్నె కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. రుణం – చెక్ బౌన్స్ : నటుడు విమల్ నటిస్తూ నిర్మించిన చిత్రం ’మన్నార్ వగైయారా’. ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన సినీ ఫైనాన్షియర్ గోపి వద్ద రూ. 4.5 కోట్ల రుణం తీసుకున్నారు. సినిమా విడుదలైనప్పటికీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో విమల్ ఒక చెక్కును ఫైనాన్షియర్‌కు అందించారు. ఫైనాన్షియర్ గోపి ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో అది బౌన్స్ అయింది. దీంతో ఆయన విమల్‌పై చైన్నె కోర్టులో చెక్ మోసం కేసు దాఖలు చేశారు. కోర్టు తీర్పు – పరిణామాలు : గురువారం కేసు విచారణలో భాగంగా ఫైనాన్షియర్ తరఫున న్యాయవాది ఆర్. వెంకటేష్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, విమల్‌పై ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడమే కాకుండా, తీసుకున్న రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించారు. తీర్పు వెలువడే సమయంలో నటుడు విమల్ కోర్టులోనే ఉన్నారు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకుంటామని, అంతవరకు శిక్ష అమలును నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా, దానికి అంగీకరించిన న్యాయమూర్తి శిక్షపై తాత్కాలికంగా స్టే విధించారు. -
క్లుప్తంగా
టీవీకే జిల్లా కార్యదర్శిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని మాసాపేట పంచాయతిలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన భవ్యలక్ష్మి ఈమె ఆర్కాడు పోలీస్ స్టేషన్లో రాణిపేట టీవీకే జిల్లా కార్యదర్శి విజయ్ మోహన్‌పై ఫిర్యాదును అందజేశారు. అందులో.. గత పది నెలల క్రితం విజయ్ మోహన్ తనకు పార్టీలో పదవి ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి వీడియో ఫోన్ కాల్లో తనను నగ్నంగా ఉండమని మాట్లాడాడు. ఆ సమయంలో తన నగ్న దృశ్యాలను స్క్రీన్ షాట్ తీసుకొని భద్ర పరుచుకొని అప్పటి నుంచి తన కోరికలు తీర్చాలని పలుమార్లు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుక్కల దాడిలో జింక మృతి తిరుత్తణి: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన శోకాన్ని మిగిల్చింది. తిరువలంగాడు సమీ పంలోని వీరరాఘవపురం కాప్పు అటవీ ప్రాంతంలో జింకలు, నెమలి సహా అనేక వన్య ప్రాణులు నివాశముంటున్నాయి.ఈక్రమంలో పయయనూరు గ్రామ శివారులోని సతీష్‌కుమార్ అనే రైతు జామ తోటలో గురువారం తాగునీటి కోసం ప్రవేశించిన దాదాపు ఆరేళ్ల కృష్జ జింకను అక్కడున్న కుక్కలు చుట్టిముట్టి తీవ్రంగా గాయపరచడంతో జింక మృతి చెందింది. ఆ ప్రాంతం వాసుల సమాచారం మేరకు తిరువలంగాడు పోలీసులు తిరుత్తణి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది మృతి చెందిన జింకకు పశుసంవర్ధక శాక డాక్టర్ల ద్వారా పోస్టుమార్టం నిర్వహించి పూడ్చి పెట్టారు. తిరువలంగాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి నిధి అగర్వాల్ సందడి సాక్షి, చైన్నె: ప్రముఖ నటి నిధి అగర్వాల్ చైన్నె ట్రేడ్ సెంటర్లో గురువారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సందడి చేస్తూ, హెయిర్ డేర్ యూ రిచువల్స్ను ఆవిష్కరించారు. అలాగే, కొరియన్ సాంకేతికత ఆధారంగా రూపొందించిన అధునాతన వాటర్ ఫిల్ట్రేషన్ (నీటి శుద్ధి) పరికరాన్ని ఈ సందర్భంగా ఆమె పరిచయంచేశారు. సహ వ్యవస్థాపకురాలు గాయత్రి దేవి, బ్రాండ్ ఆర్కిటెక్ట్ డైసీ మోర్గాన్‌లు ఈసందర్భంగా సరికొత్త ఆవిష్కరణ గురించి వివరించారు. ఎన్ఐటీ మహిళ ప్రొఫెసర్ అశ్లీల వీడియోలను.. అన్నానగర్: తిరుచ్చిలోని తిరువెరుంభూర్లో ఎన్ఐటీ కళాశాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నడుపుతోంది. ఈ కళాశాలలో జిల్లా, రాష్ట్రం వెలుపల, విదేశాల నుండి వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా జెరాల్డ్ (50) పనిచేస్తున్నాడు. ఇతను ఎన్ఐటీ రెసిడెన్స్‌లో ఉంటాడు. ఇతనికి అదే కళాశాలలోని ఓ మహిళ ప్రొఫెసర్‌కి కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో జెరాల్డ్ తన సెల్ ఫోన్లో వారిద్దరినీ కలిసున్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసేవాడు. ఈ క్రమంలో గత సంవత్సరం, వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీని కారణంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, జెరాల్డ్ ప్రొఫెసర్ తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో జెరాల్డ్ అశ్లీల వీడియోలు, ఫోటోలను ప్రొఫెసర్ భర్త, కొంతమంది విద్యార్థుల సెల్ ఫోన్లలో పంపాడు. మహిళా ప్రొఫెసర్ దిగ్భ్రాంతి చెంది, తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు జెరాల్డ్‌పై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితిలో, సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం జెరాల్డ్ ను అతని ఇంట్లో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బావిలోకి దూకిన భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి అన్నానగర్: దిండుక్కల్ జిల్లాలోని నీలకోట్టై సమీపంలోని సుత్తి కాలడి పట్టికి చెందిన అజిత్ కుమార్ (27) ఆటో డ్రైవర్. అజిత్‌కుమార్ ఆత్తూరు సమీపంలోని కూలంపట్టికి చెందిన పవిత్ర (22) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత, నాలుగు నెలల క్రితం, వారి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవిత్ర మూడు నెలల గర్భవతి. అజిత్‌కుమార్ తరచుగా మద్యం తాగి ఇంటికి వస్తాడు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో, పవిత్ర తన భర్తను బెదిరించి, ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన భర్త అజిత్ కుమార్ తన భార్యను కాపాడటానికి బావిలోకి దూకాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. దీని గురించి నీలకొట్టై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించబడింది. ఫైర్ డిపార్ట్మెంట్ స్టేషన్ ఆఫీసర్ భాస్కరన్ నేతత్వంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో పడిపోయిన అజిత్‌కుమార్, అతని భార్యను వారు రక్షించి పైకి తీసుకువచ్చారు. అనంతరం వారిని నీలకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు అజిత్‌కుమార్ అప్పటికే మరణించినట్లు తెలిపారు. అతని భార్య చికిత్స పొందుతోంది. నీలకోట్టై ఇనన్‌స్పెక్టర్ సత్యకుమార్ కేసు నమోదు చేసి ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు. -
సత్‌వచ్చారిలో ఆక్రమణల తొలగింపు
వేలూరు: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని సత్వచ్చారి వద్ద ఉన్న సర్వీస్ రోడ్డులో ఆక్రమణలు ఉన్నందున తరచూ ట్రాపిక్ సమస్య ఏర్పడుతున్నట్లు వేలూరుకు చెందిన ఒకరు చైన్నె హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని జాతీయ రహదారుల శాఖకు చైన్నె హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో గురువారం ఉదయం జాతీయ రహదారుల శాఖ అధికారులు వేలూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి హైకోర్టు పంపిన తీర్పు లేఖను పంపింది. దీంతో ఆక్రమణలు తొలగించాలని దుకాణదారులకు గత పది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు మైకు ద్వారా దుకాణ దారులకు తెలిపారు. పల్లిగొండ టోల్గేట్ ప్రత్యేక అధికారి జస్టిన్ సామ్సన్, అసిస్టెంట్ మేనేజర్లు సురేష్‌ల ఆదేశాల మేరకు పోలీసులు, జేసీబీ సాయంతో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు. కొంత మంది దుకాణ దారుల వీటిని అడ్డుకోవడంతో పోలీసులు దుకాణ దారులతో చర్చలు జరిపి అక్కడి నుంచి పంపించి వేశారు. -
నిఘానీడలో తీరం
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి హై అలర్ట్ ప్రకటించారు. నిఘా నీడలోకి తీర ప్రాంతాల్ని తీసుకొచ్చారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సిబ్బంది అలెర్ట్‌గా ఉన్నారో లేదో అని పసిగట్టే విధంగా 48 గంటల సాగర్ కవచ్ మాక్ డ్రిల్‌కు శ్రీకారంచుట్టారు. వివరాలు.. గతంలో జరిగిన ముంబై పేలుళ్ల తదుపరి సముద్ర తీరాల్లో భద్రతను పర్యవేక్షించే రీతిలో ఆరు నెలలకు ఒక పర్యాయం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సాగర్ కవచ్ నినాదంతో ఈ డ్రిల్ పోలీసులకు ముచ్చమటలు పటిస్తున్నదని చెప్పవచ్చు. రాష్ట్రంలోని చైన్నె మొదలు కన్యాకుమారి వరకు ఉన్న 13 సముద్ర తీర జిల్లాల్లో 48 గంటల పాటుగా ఈడ్రిల్ సాగుతుంది. బుధవారం ఉదయాన్నే ఆరున్నర గంటలకు ఈ డ్రిల్‌కు శ్రీకారంచుట్టారు. పోలీసులు, కోస్ట్‌గార్డ్, నావికాదళం, సముద్ర తీర భద్రత విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో తొలి రోజు ఈ డ్రిల్ సాగింది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై పోలీసులు సముద్ర తీరాల్లో వేకువ జామున ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఆయా సముద్ర తీర గ్రామాల్లో సైతం పోలీసులు రంగంలోకి దిగడంతో హడావుడి పెరిగింది. సముద్ర మార్గం గుండా మారు వేషాల్లో సిబ్బంది కొందరు ఆయా ప్రాంతాల్లోకి చొరబడనున్నారన్న సమాచారంతో, వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ప్రధానంగా వాహనాల తనిఖీలు జోరుగా సాగగా, మరో వైపు సముద్రతీరాల్లో జాలర్ల గ్రామాల్లోమఫ్టీలో ఉన్న సిబ్బంది ఆ మారు వేషగాళ్లను పట్టుకునేందుకు నిరీక్షించక తప్పలేదు. చైన్నె తీరం, ఈసీఆర్ మార్గంలో పోలీసులు అడుగడుగున చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీలో నిమగ్నం అయ్యారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసి అనుమతించారు. అప్రమత్తంగానే ఉన్నమని చాటే విధంగా సిబ్బంది ముందుకు సాగారు. -
రైల్వే బోర్డు డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ కృష్ణకుమార్
సాక్షి, చైన్నె: రైల్వే అత్యున్నత పరిపాలనా విభాగమైన రైల్వే బోర్డులో డైరెక్టర్ జనరల్ (రైల్వే హెల్త్ సర్వీసెస్ )గా నార్త్ వెస్టర్న్ రైల్వే చీఫ్ ప్రిన్సిపల్ మెడికల్ డైరెక్టర్‌గా డాక్టర్ ఓ. కృష్ణకుమార్ నియమితులయ్యారు. ఆయన ప్రతిభ, నాయకత్వ పటిమ , ప్రజాసేవలో చూపిన అంకితభావానికి ఈ నియామకం ఒక నిదర్శనంగా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా నార్త్ వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ పంకజ్ శర్మ ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ కృష్ణకుమార్ నేపథ్యం.. కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ జిల్లాకు చెందిన కృష్ణకుమార్ చైన్నెలోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎండీ పట్టా పొందారు. 1990 బ్యాచ్ ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీస్) అధికారిగా 1991 ఆగస్టు 26న రైల్వే సర్వీస్‌లో చేరారు. విశిష్టమైన 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన భావ్‌నగర్, వడోదర తదితర ప్రాంతాలలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ నుండి వెస్టర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ వరకు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. వడోదరలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించినందుకు వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ నుండి 3 సార్లు ’హెల్త్ సర్వీసెస్ ఎఫిషియన్సీ షీల్డ్ అందుకున్నారు. తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం తిరువొత్తియూరు: తిరుచ్చి పొన్మలై సమీపంలోని ఆలత్తూరైకి చెందిన రత్తినం భార్య తమిళక్కొడి (69). పది రోజుల క్రితం ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడటంతో తమిళక్కొడి ఎడమ కాలికి ఫ్రాక్చర్ అయింది. దీనికి చికిత్స కోసం ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారం క్రితం తమిళక్కొడికి శస్త్రచికిత్స పూర్తయింది. ఆ తర్వాత ఆమెను పాత భవనంలోని 500వ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తమిళక్కొడికి సహాయంగా ఆమె కుమారుడు అక్కడే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున మంచంపై పడుకుని ఉన్న తమిళక్కొడి ఎడమ కాలి బొటనవేలిని ఎలుక కొరకడంతో రక్తగాయమైంది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి డీన్ కుమారవేల్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. అలాగే వెంటనే తమిళక్కొడికి చికిత్స అందించారు. దీని తర్వాత తమిళక్కొడిని ఐసీయూ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎలుక కొరకడం వల్ల వృద్ధురాలి కాలి బొటనవేలు గాయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యవసరం కొరుక్కుపేట: బాలికలకు ఆత్మరక్షణ విద్య అత్యవసరమని రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మైత్రి అధ్యకురాలు డాక్టర్ విద్యాహరి అయ్యర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మైత్రి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా బాలికలకు ఆత్మరక్షణ వర్క్‌షాప్ గురువారం ఘనంగా నిర్వహించారు. చైన్నె గోపాలపురం లోని ఎం.డబ్ల్యూ.ఏ. మెట్రిక్యులేషన్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి రొటేరియన్ డాక్టర్ విద్యాహరి అయ్యర్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా రొటేరియన్ శాలిని దువ్వూరి, గౌరవ అతిథులుగా రొటేరియన్ నాగలక్ష్మి, రొటేరియన్ జయ సత్యలు పాల్గొని ఆత్మరక్షణ వర్క్‌షాప్‌ను ఆరంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నానాటికీ బాలికలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు, దాడుల నుంచి వారిని వారు రక్షించుకునేలా అమ్మాయిలకు పాఠశాలలోనే ఆత్మ రక్షణ విద్య అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
వేలూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు వైద్య సేవలు అందజేయడంలో నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. వేలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు 16వ స్నాతికోత్సవం కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ రోహిణీదేవి అధ్యక్షతన బుధవారం ఉదయం అడుక్కంబరైలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సేవలకన్నా వైద్య సేవలు ముఖ్యమైనదన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు డాక్టర్లు ముఖ్య పాత్ర వహిస్తారన్నారు. వైద్య విభాగంలో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలకు వెళ్లకుండా రోగులకు అవసరమైన మందులను కనుగొనేందుకు ఆసక్తి చూపాలన్నారు. అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రస్తుతం డాక్టర్ పట్టాలను సాదించారని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు అధికంగా నిరుపేదలు కావడంతో వారి పట్ల ప్రేమగా పలకరించి వైద్య సేవలు అందజేయాలన్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టరేట్ డిగ్రీ పట్టాలతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేలయగన్, సిందు, తెండ్రల్‌కుమార్, సుధాకర్, సుకుమార్, మెడికల్ కళాశాల సూపరిండెంట్ రది తిలగం, వైస్ ప్రిన్సిపాల్ మరుగౌరీ విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రూ: 3 లక్షల విలువైన ఎర్రచందనం సీజ్
వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సోమనాయకన్బట్టి గ్రామంలోని పచ్చయప్పన్‌కు సొంతమైన ఇంటిలో ఎర్రచందనం దాచి ఉంచినట్లు అటవీశాఖ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో తిరుపత్తూరు అటవీశాఖ అధికారి మహేంద్రన్ ఆదేశాల మేరకు సుమారు పది మందికి పైగా అటవీశాఖ సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెల్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న కొంత మంది ఎర్రచందనాన్ని తాకట్టు పెట్టి జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. అక్కడున్న వారు అటవీశాఖ సిబ్బందిని చూసిన వెంటనే అక్కడ నుంచి పరారీ అయ్యారు. అనంతరం సిబ్బంది ఇంటిలో అకస్మిక తనిఖీలు చేయగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన సుమారు 60 కిలోల బరువు గల రెండు ఎర్రచందనం తుండ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడ ఉన్న ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకొని కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ రెండు ఎర్రచందనం విలువ సుమారు రూ: 4 లక్షలు ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు తెలిపారు. జూదం ఆడుతున్న ప్రాంతంలో ఇద్దరు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నారు. -
చైన్నెలో వృద్ధుల సంరక్షణ కేంద్రం
సాక్షి, చైన్నె: వైద్య సహాయం, పునరావాసం, ఆతిథ్యాన్ని సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో వృద్ధుల సంరక్షణ కేంద్రంగా చైన్నెలో ప్రీమి యం సీనియర్ కేర్ సెంటర్ ఓరా సీనియర్ కేర్ ఆవిష్కృతమైంది. దీనిని బుధవారం అటవీ శాఖమంత్రి ఆర్వి రంజిత్‌కుమార్ ప్రారంభించారు. చైన్నె వేప్పేరిలో మహిళా పారిశ్రామిక వేత్త ఛవి సురానా దీనిని స్థాపించారు. వృద్ధాప్యంలో ప్రశాంతత, గౌరవం, ఆత్మీయమైన వాతావరణం, నాణ్యమైన వైద్య సంరక్షణ ఒకే చోట అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అసిస్టెడ్ లివింగ్, ట్రాన్సిషనల్ కేర్ – ఆసుపత్రి డిశ్చార్జ్ తర్వాత సంరక్షణ, రీహ్యాబిలిటేషన్ (పునరావాస వైద్యం), దీర్ఘకాలిక వైద్య సంరక్షణ, 24 గంటల పర్యవేక్షణ, వైద్య సిబ్బంది లభ్యత వంటి సేవలను ఇక్కడ ఏర్పాటు చేశామని ఛవి సురాన ఈసందర్భంగా వివరించారు.వృత్తిపరమైన వైద్య సంరక్షణ కావాలా లేక కుటుంబానికి దగ్గరగా ఉండాలా అనే అయోమయంతో అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటాయని, ఆ రెండింటినీ ఒకే చోట అందిస్తూ, సీనియర్ సిటిజన్లను కేవలం రోగులుగా కాకుండా, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆత్మీయ వాతావరణంలో చూసుకోవడమే ఓరా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైన్నెకి చెందిన ప్రముఖ వైద్యులు, సమాజ ప్రముఖులు పాల్గొని ఫెసిలిటీని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి రంజిత్‌కుమార్ వైద్యులను, ఇక్కడ సేవలు అందించేందుకు ఎంపికై న వారిని సత్కరించారు. -
నీట్ రద్దు , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా నినాదంతో తమిళనాట విద్యార్ధి లోకం కదం తొక్కింది. పోరు బాటను ఉధృతం చేయడానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కొనసాగాయి. చైన్నెలో అనేక చోట్ల ఆందోళనలు జరగ్గా పోలీసులు అడ్డుకోవడం
ప్రజాస్వామ్య హక్కులపై దాడి శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువతకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడి అని టీవీకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం తీవ్రంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. యువత చేపట్టిన శాంతియుత పోరాటానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతంగా పేర్కొన్నారు. కాగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటే విద్యను తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలని, లేకుంటే, ఈ సమస్యకు పరిష్కారం లభించదదని విద్యా శాఖ మంత్రి రాజ్ మోహన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో విద్యార్థులపై పోలీసుల అరెస్టుల పర్వం గురించి ప్రశ్నించగా, ‘‘రోడ్డు అనేది ఆందోళనలు చేయడానికి సరైన వేదిక కాదని,రాత్రి వేళల్లో పనులన్నీ ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారికి ఇబ్బంది కలగకూడదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్ణీత పద్ధతిలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. ఎగ్మూర్‌లో విద్యార్థుల ఆందోళనసాక్షి, చైన్నె : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీకి వ్యతిరేకంగా, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ చైన్నెలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనకు దిగాయి. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. రాజరత్నం స్టేడియం వద్ద ఉత్కంఠ ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియం సమీపంలో నిరసన తెలిపేందుకు ఉదయం నుంచే విద్యార్థులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే అక్కడ నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతించాలని విద్యార్థులు కోరినప్పటికీ, పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో, పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి సిద్ధంగా ఉంచిన బస్సుల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీట్ రద్దే అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారం ‘నీట్ పరీక్షను రద్దు చేయడమే అన్ని సమస్యలకూ శాశ్వత పరిష్కారంగా మారుతుందని డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిందన్నారు. నీట్ పరీక్ష పూర్తిగా అక్రమాలు, అక్రమ పద్ధతుల కోసమే రూపొందించబడిందని మొదటిసారిగా హెచ్చరించింది తామేనని వివరించారు. అందుకే ఈ పరీక్ష ప్రవేశపెట్టిన నాటి నుంచే నీట్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ డిఎంకె దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు గుర్తుచేశారు. విద్యార్థుల అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా నీట్ రద్దుకు నిరసనలు తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్ ముట్టడి తిరువొత్తియూర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని సమీపంలోని కళ్యాణ మండపానికి తరలించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి విద్యార్థులు కాలడిపేటలోని తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్‌న్‌ను అకస్మాత్తుగా ముట్టడించారు. అరెస్ట్ చేసిన తమ సహచరులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చైన్నెలో పలు చోట్ల నిరసనలు సాగగా, పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని అనుమతి కోరినప్పటికీ పోలీసులు నిరాకరించడాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రు ఖండించారు. చైన్నె ప్రెసిడెన్సీ కాలేజీ, టీ నగర్ పరిసరాల్లో ధర్నాలు హోరెత్తాయి. టీ నగర్‌లోని సీపీఐ కార్యాలయం ఆవరణలో విద్యార్థులు బైటాయించి నిరసనకొనసాగిస్తున్నారు. ఈ నిరసనకు డీఎంకే మద్దతు ప్రకటించింది. చైన్నెలోని ప్రభుత్వ కళాశాలల వద్ద సాయంత్రం విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాగా గురువారం విద్యార్థులందరూ తరగతుల బహిష్కరణ నినాదంతో ఆందోళనలను ఉధృతం చేయడానికి విద్యార్థి సంఘాల సమ్మేళనం పిలుపు నిచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని కళాశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. -
బియ్యం ధరలకు రెక్కలు
సాక్షి, చైన్నె: తమిళనాడులో కేవలం 15 రోజుల వ్యవధిలోనే బియ్యం ధరలు రెండోసారి భారీగా పెరిగాయి. తాజా పెంపుతో పొన్ని బియ్యం ధర కిలో రూ. 80కి, ఇడ్లీ బియ్యం ధర రూ. 50కి చేరింది. ఈ నిరంతర ధరల పెరుగుదలతో సామాన్య, నిరుపేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన అదనపు భారం పడ్డట్లయ్యింది. తమిళనాడు వార్షిక బియ్యం అవసరం 91 లక్షల టన్నులు. అందులో స్థానిక రైతులు 75 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఆధారపడుతున్నారు. తమిళనాడులో కర్ణాటక పొన్ని రకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈసారి అక్కడ నుండి దిగుమతులు తీవ్రంగా దెబ్బతినడంతో, స్థానిక వ్యాపారులు తమిళనాడులో పండే జాతీయ పొన్ని రకాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించారు. పెరిగిన రవాణా ఖర్చులు డీజిల్ ధరలు పెరగడం, రవాణా (ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు అధికమవ్వడం కూడా ధరల మంటకు కారణమైంది.ఽ వివిధ రకాల బియ్యం రకం నెల క్రితం ఉన్న ధర కంటే, తాజాగా కిలోకు రూ. 30 వరకు పెరిగింది. ఇందులో 15 రోజులలో రెండు సార్లు ధర పెరగడం గమనార్హం. కర్ణాటక పొన్ని కిలోకు గత నెల రోజులలో రూ. 55 – రూ 65కు పెరిగి, తాజాగా రూ 80 వద్ద ఆగింది. ఇడ్లీ బియ్యం రూ. 35 నుంచి రూ. 40కు పెరిగి, తాజాగా రూ. 50 వద్ద ధర ఉంది. పొన్ని బియ్యం 25 కేజీల బస్తా ధర రూ. 350 నుండి రూ. 500 వరకు పెరిగినట్లు హోల్‌సేల్, రిటైల్ డీలర్లు తెలిపారు. ఇది చిల్లర వర్తకం వద్దకు చేరే కొద్ది కిలోకు అదనంగా రూ.2 నుంచి రూ. 5 వరకు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పడే ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది తమిళనాడులో కరువై వరి సాగు నీళ్లు లేక కరిగిన నేపథ్యంలో రానున్న కాలంలో ఈ ధర రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే,కర్ణాటకలో కూడా నైరుతీ ఈ ఏడాది కరుణించనినేపథ్యంలో అక్కడి నుంచి దిగుమతి అన్నది మరింతగా తగ్గే ప్రమాదం ఉందని వర్తకలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆందోళనకరం: అన్బుమణి రామదాస్ మార్కెట్లో బియ్యం లభ్యతను పెంచి ధరలను తగ్గించేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పీఎంకే అధ్యుడు అన్బుమణి రాందాసు డిమాండ్‌చేశారు. తమిళనాడులో 15 రోజుల క్రితం కిలో బియ్యం ధర రూ. 15 వరకు పెరగ్గా, ఇప్పుడు మళ్లీ కిలోకు రూ. 3 నుండి రూ. 15 వరకు పెంచారని వివరించారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే తినే బియ్యం ధర కిలోకు రూ. 30 వరకు పెరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదన్నారు. వర్షాలు పడకపోవడం వలన డెల్టా , కావేరి తీర ప్రాంతాల్లో సాగు తగ్గిందని చెబుతున్న కారణాన్ని తాము అంగీకరించలేమన్నారు. గత ఏడాది కురువై, సంబా, తాళడి పంటలు బాగా పండాయని, ప్రస్తుత సీజన్ కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. రాబోయే నెలల్లో బియ్యం రాక తగ్గుతుందనే ముందస్తు అంచనాతో వ్యాపారులు కృత్రిమంగా ధరలను పెంచారని రైతులు భావిస్తున్నారన్నారు. బియ్యం ధరలను అదుపు చేయడానికి బియ్యం ఎగుమతులపై తక్షణమే కేంద్రం నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హోల్‌సేల్ వ్యాపారుల వద్ద ఉన్న బియ్యం నిల్వలపై పరిమితి విధించాలని, వీటి ద్వారా మార్కెట్లో బియ్యం సరఫరా పెంచి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని, . తమిళనాడులోని రైస్ మిల్లులు, హోల్‌సేల్ వ్యాపారుల వద్ద ఉన్న బియ్యంలో 20 శాతాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, రేషన్ షాపులు , సహకార విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు విక్రయించాలని కోరారు. -
గుమ్మిడిపూండి మార్గంలో ‘ఈఎంయూ’ అవస్థలు
సాక్షి, చైన్నె : చైన్నె సెంట్రల్ – గుమ్మిడిపూండి విద్యుత్ రైలు మార్గంలో సాంకేతిక లోపాలు, సిగ్నల్ సమస్యలు , ట్రాక్‌ల కొరత కారణంగా ప్రతిరోజూ ఎలక్ట్రిక్ రైళ్లు(ఈఎంయూ) 45 నిమిషాల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నిసార్లు గంటల తరబడి సర్వీసులు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే, ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవ్వడానికి మరో రెండేళ్లు పడుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. సమస్యకు ప్రధాన కారణాలు: చైన్నె నుండి చెంగల్పట్టు వరకు 3 ట్రాక్‌లు, అరక్కోణం వరకు 4 ట్రాక్‌లు ఉన్నాయి.ఈదృష్ట్యా ఈ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లు వేగంగా రాక పోకలు జరుగుతున్నాయి. అయితే, సెంట్రల్ – గుమ్మిడిపూండి మార్గంలో కేవలం 2 ట్రాక్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిపైనే ఈఎంయూ (ఎలక్ట్రిక్), ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తూ, బేసిన్ బ్రిడ్జ్, తిరువొత్తియూర్, మీంజూర్, ఎన్నూర్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ రైళ్లను గంటల తరబడి నిలిపివేస్తున్నారు.అలాగే, అనేక సందర్బాలలో సిగ్నల్ వైఫల్యాలు, ఓవర్ హెడ్ విద్యుత్ వైర్లు తెగిపోవడం, రైలు ఇంజన్లలో లోపాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ ఒక్క నెలలోనే ఇలాంటివి 7కి పైగా ఘటనలు జరిగి ఉండటం గమనార్హం. ఈ దృష్ట్యా, నగరంలోకి వివిధ పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వచ్చేప్రయాణీకులు గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. అనేక సందర్భాలలో ఇదేం నరకం అన్నట్టుగా పరిస్థితి మారుతున్నది. సకాలంలో గమ్యస్థానాలకు వె ళ్లే పరిస్థితులు లేక పోవడంతో తీవ్ర అసహనాన్ని రైల్వేయంత్రాంగంపై వ్యక్తం చేస్తున్నారు. రూ. 368 కోట్లతో కొత్తలైన్లు సెంట్రల్ నుండి అత్తి పట్టు వరకు ఇప్పటికే 4 లైన్లు ఉన్నాయి. అత్తిపట్టు నుండి గుమ్మిడిపూండి వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరానికి 3వ , 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే బోర్డు రూ. 368.42 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ పనుల కోసం ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయని, అదనపు ట్రాక్‌ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాతే గుమ్మిడిపూండి మార్గంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగుతాయని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ రైలు సేవలు


