మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ

Feb 10 2026 7:30 AM | Updated on Feb 10 2026 7:30 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ

శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో రూపుదిద్దుకున్న దక్షిణామూర్తి స్వామి పీఓపీ సెట్‌ భక్తులు, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జ్ఞానానికి ప్రతీకగా భావించే దక్షిణామూర్తి స్వామి దీక్షాస్వరూపంలో విరాజిల్లుతూ, ఆయన పాదాల వద్ద ఉపదేశాన్ని గ్రహిస్తున్నట్లుగా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నలుగురు మహర్షుల రూపకల్పన అత్యంత హృద్యంగా రూపొందించారు. ఈ సెట్టింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రావిచెట్టు సహజత్వాన్ని ప్రతిబింబించేలా, కొమ్మలు–ఆకుల వరకు సూక్ష్మ వివరాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతాప్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ప్రతాప్‌, శ్రీనివాసులు, బాలు, సంతోష నైపుణ్యంతో రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement