Komaram Bheem
-
పెద్దవాగులో ఇసుక ‘తోడే’ళ్లు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ట్రాక్టర్ చేడ్వాయి గ్రామానికి చెందినది. ఈనెల 14న ఉదయం 6గంటలకు ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పెంచికల్పేట్ ఎస్సై అనిల్‌కుమార్ పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశారు. పెంచికల్పేట్: జిల్లాలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు నదులు, వాగులు, ఒర్రెల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లే కున్నా పెద్ద ఎత్తున యంత్రాలను ఉపయోగిస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుకను పగలు డంప్ చేస్తూ రాత్రివేళ ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. అధికారులు అడపాదడపా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వంతో విలువైన ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో..ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారులకు ఇసుక వాహనంలో డీడీ రూ.143 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది ట్రాక్టర్ యజమానులు ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి పత్రాలు తీసుకుంటున్నారు. అక్రమంగా పంచాయతీ కార్యదర్శుల వద్ద అప్రూవల్ తీసుకుని ప్రైవేట్‌లో ట్రాక్టర్ ఇసుకను రూ.1,800 నుంచి రూ.2వేలకు విక్రయిస్తున్నారు. మరోవైపు బ్రిక్స్ ప్లాంట్ యజమానులు ఒక్కో ప్లాంట్ వద్ద పదుల సంఖ్యలో ఇసుక ట్రిప్పులను డంప్ చేసి రాత్రివేళ ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిల్వలున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తే చర్యలు ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక తీసుకువెళ్లేందుకు డీడీలు చెల్లించాలి. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా చట్టం ప్రకారం చర్యలు తప్పవు. ఇప్పటికే మండల స్థాయిలో ఇసుక రవాణాకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. – గంగాధర్, మైనింగ్ ఏడీ, కుమురంభీం ఆసిఫాబాద్ఒకటే డీడీ.. పది ట్రిప్పులుపెంచికల్పేట్ వద్ద పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణాకు బ్రిక్స్ప్లాంట్ యజమానులు తెరలేపా రు. నిబంధనల ప్రకారం ‘మన ఇసుక’ వాహనంలో రూ.700 డీడీకి ఒక ట్రిప్పు ఇసుక మాత్రమే పెద్దవాగు నుంచి తరలించాల్సి ఉంది. అక్రమార్కులు ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ సెలవు దినాలు, రాత్రివేళ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. ని బంధనల ప్రకారం పెంచికల్పేట్ వైపు పెద్ద వాగు నుంచి ఇసుక తరలించాల్సి ఉండగా.. దహెగాం మండలంలోని లగ్గాం నుంచి ఇసుకను పెంచికల్పేట్ మండలానికి తరలిస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద సిబ్బందిని నియమించడంతో అక్రమార్కుల కన్ను ఎల్లూర్ బొక్కివాగుపై పడింది. ప్రతీరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. డీడీలు చెల్లించి ఇసుక తరలించాల్సి ఉండగా అక్రమ మార్గంలో పరిశ్రమల వద్ద పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసుకుంటున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న విద్య అందించనున్నట్లు కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించగా ఆమె హాజరయ్యారు. జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన, స్పోర్ట్‌లో జాతీయ స్థాయిలో పాల్గొన్న విద్యార్థులకు నగదు, ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో లలిత, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎస్వో శ్రీనివాస్, లతీఫ్, శాంతికుమార్, భాగ్యలక్ష్మి, ఏసీజీ జనార్దన్, ఎంఈవో సుభాష్, ఏఎంసీ చైర్మన్ మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, విండో చైర్మన్ అలీబిన్ తదితరులున్నారు. -
మాడిపోతున్నారు!
కాగజ్‌నగర్ మండలంలోని కోయవాగు గ్రామానికి చెందిన మేకర్తి పెంటయ్య (55) కాగజ్‌నగర్ మార్కెట్లో హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత నెల 30న ఎండలోనే పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అలసటగా ఉందని చెప్పి నీరు తాగి పడుకున్నాడు. కొద్దిసేపటికి అపస్మాకరస్థితికి చేరుకోగా వెంటనే కుటుంబీకులు 108కు సమాచారం ఇచ్చారు. కాగా, పెంటయ్య వడదెబ్బతో మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్ కాలనీకి చెందిన దివిటి తిరుపతి (45) పాత ఇనుప సామగ్రి కొనుగోలు, విక్రయాలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజులాగే ఈ నెల 4న ఎండలో పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అస్వస్థతకు గురై ఇంటికి వచ్చాడు. వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు కౌటాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కౌటాల: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. గాలిలో తేమ తగ్గిపోతోంది. ఉద యం 7గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడైనా తగ్గడం లేదు. చిన్నారులు, గర్భిణులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వడదెబ్బతో పలువురు మృతి చెందా రు. ఎండలు మండిపోతుండడంతో వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. మూగ జీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. జిల్లాలో ఈసారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వారంపాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. సాయం సరే.. నిర్ధారణేది?వడగాలులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వడగాలుల ప్రభావంతో లేదా వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే.. బాధిత కు టుంబానికి రూ.4లక్షల పరిహారం ఇవ్వనుంది. అ యితే వడదెబ్బ మృతులను నిర్ధారించడంలో అధి కారులు అలస్వతం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే వెంటనే తహసీల్దార్, ఎస్సై, స్థానిక ప్రభుత్వ వైద్యుడితో కూడిన త్రిసభ్య కమిటీ దానిని నిర్ధారించి కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కాగా, అధికారులు మధ్య సమన్వయం లేక ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో బాధి త కుటుంబాలకు సాయం అందడం లేదు. ఇటీవలి వడదెబ్బ మరణాలునిర్మానుష్యంగా కౌటాల–బెజ్జూర్ ప్రధాన రహదారిఐదురోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలుసామ్యానుడిపై సెగ..ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమి తమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్, కౌటాల ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం జనంతో రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, కాగజ్‌నగర్, కౌ టాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కరోజు ఇంటి వద్ద ఉంటే పూట గడవని దినసరి కూలీల బాధలు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితుల్లో పనులకు వెళ్తూ సన్‌స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఎండలో తిరగొద్దు పెరిగిన ఎండల దృష్ట్యా తప్పనిసరైతేనే గొడుగు, టోపీ ధరించి బయటకు వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లకపోవడమే మంచింది. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, వణుకు పుట్టడం, వాంతులు చేసుకోవడం లాంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ గురైన వ్యక్తిని చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ తాగించాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. – సీతారాం, డీఎంహెచ్‌వో -
అమ్మమ్మ ఇంటికి వచ్చి.. అసువులు బాసి..
దహెగాం: అమ్మమ్మ ఊరికి వచ్చిన బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని లోహా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రమేశ్ తెలి పిన వివరాల ప్రకారం.. బెజ్జూర్ మండలం కుంట లమానెపల్లి గ్రామానికి చెందిన పొర్సెటి శ్రీనివాస్–శారద దంపతులు నాలుగురోజుల క్రితం కుమారుడు శ్రీవర్ధన్ (5), ముగ్గురు కుమార్తెలతో కలిసి తునికాకు సేకరణకు శారద తల్లిదండ్రుల గ్రామమై న లోహాకు వచ్చారు. శనివారం పిల్ల లను ఇంటి వద్ద ఉంచి తునికాకు సేకరణకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాగా, శ్రీవర్ధన్తోపాటు శారద సోదరుడు తలాండి సంతోష్ పిల్లలు కీర్తి కుమార్, కీర్తన వాంతులు, వి రోచనాలు చేసుకుని కనిపించారు. ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వారు వెంటనే ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. కా గా, ఆదివారం ఉదయం శ్రీవర్ధన్ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కీర్తికుమార్, కీర్తనను మంచి ర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా క్షేమంగా ఉన్నా రు. చిన్నారుల అస్వస్థతకు కారణం తెలియరాలే దు. కాగా, శ్రీవర్ధన్ మృతిపై ఎలాంటి అనుమానం లేదని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ముగిసిన విద్యావారోత్సవాలు
కాగజ్‌నగర్‌టౌన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాలు ఆదివారం ముగిశాయి. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముగింపు వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎం మేనేజర్ గిరి ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. విద్యావారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు అనేక విషయాలు నేర్చుకోవ డం అభినందనీయమని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి ఎస్పీఎం మిల్లు తరఫున తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపా రు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. కళాశాల ప్రిన్సి పల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం, జనార్దన్, దేవేందర్, శారద, రాజేశ్వర్, దత్తాత్రేయ, వెంకటేశ్వర్, కృష్ణవేణి పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కౌటాల(బెజ్జూర్): గ్రామీణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెడిలైఫ్ ఆస్పత్రి సహకారంతో ఆదివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనారోగ్యం బారిన పడకుండా ప్రజలు ముందస్తు వైద్యపరీక్షలు చేయించుకోవడమే మేలని పేర్కొన్నారు. వేసవి నేపథ్యంలో ఎండల్లో తిరగవద్దని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు భద్రతతో పాటు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమస్యలుంటే స్థానిక పోలీస్‌స్టేషన్ లేదా ‘డయల్ 100’ను సంప్రదించాలని సూచించారు. వైద్యశిబిరంలో 600మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదొద్దీన్, కౌటాల సీఐ సంతోష్‌కుమార్, బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా, పోలీసులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
భట్రాజు సంఘం కార్యవర్గం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సంధ్యా కాంప్లెక్స్‌లో ఆదివారం భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారిగా చెన్నమాధవుని రామరాజు, పర్యవేక్షణాధికారిగా మనో జ్రాజు వ్యవహరించారు. అధ్యక్షుడిగా అడ్లూ రి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శిగా జగన్నాథరాజు, కోశాధికారిగా శ్రీనివాసరాజు, గౌరవాధ్యక్షుడిగా శ్రీహరిరాజు, ముఖ్య సలహా దారుగా ప్రసాద్‌రాజు, ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా నరేందర్‌రా జు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సత్యనారాయణ రాజు, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరాజు, వంశీరాజు ఎన్నికయ్యారు. యువజన విభా గం జిల్లా అధ్యక్షుడిగా సాయిప్రసాద్రాజు, ప్రధాన కార్యదర్శిగా రేవంత్‌రాజు, సంయుక్త కార్యదర్శిగా రామరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కాసు వీణాదేవి, ప్రధాన కార్యదర్శి గా సరోజ, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా స్వర్ణలత, కోశాధికారిగా సరస్వ తి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శైలజ, కార్యవర్గ సభ్యులుగా పూజ, అభినయశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. -
గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కౌటాల: గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. మండలంలోని కన్నెపల్లి సర్పంచ్ మోర్ల పార్వతి ఆది వారం కాంగ్రెస్‌లో చేరగా ఆయన పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. కన్నెపల్లి గ్రామాన్ని మో డల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా మని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్, మండలాధ్యక్షుడు నికాడే గంగారాం, నాయకులు సిడాం గణపతి, శ్యాంరావు, మోర్లె పాండురంగ్ తదితరులున్నారు. -
అభయహస్తం అందేదెప్పుడో!
కెరమెరి మండల కేంద్రానికి చెందిన ఈ మహిళ పేరు పాతాడే భారత్‌బాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అభయహస్తం పథకం కింద ఏడాదికి రూ.365 చొప్పున వరుసగా ఐదేళ్లు మొత్తం రూ.1,825 చెల్లించింది. లబ్ధిదారులు ఎంత చెల్లిస్తారో.. ప్రభుత్వం కూడా తన వాటాగా అంతే చెల్లిస్తుంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.3,650 జమయ్యాయి. ఇప్పటివరకు వడ్డీతో కలిపి ఈమెకు సుమారు రూ.10వేల వరకు ఇవ్వాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది. ఈ సమస్యలో ఒక్క భారత్బాయిదే కాదు.. జిల్లాలో అనేకమంది స్వయం సహాయక సంఘాల మహిళలది. కెరమెరి: అభయహస్తం డబ్బుల కోసం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏళ్లతరబడి నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఈ పథకాన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎత్తివేసింది. కనీసం అప్పటివరకు జమ చేసిన బీమా డబ్బులు కూడా ఇవ్వడంలేదు. లబ్ధి దారులకు డబ్బుల చెల్లింపునకు 2022లో వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాలని అప్పటి ప్రభుత్వం డీ ఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. జిల్లాలో సుమారు 36,256 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు అభయహస్తం డబ్బులు చెల్లించారు. పథకం ఎత్తివేసి 11 ఏళ్లయినా డబ్బులు తిరిగి చెల్లించడంలో ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తోంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. మహిళలకు ఆసరా కల్పించేందుకే..అభయహస్తం పథకంలో చేరేందుకు 18నుంచి 60ఏళ్లు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులుగా నిర్ణయించారు. 55ఏళ్ల లోపు మహిళలు ఏడాదికి రూ.365 చెల్లించారు. 55 ఏళ్లుదాటినవారు ఏడాదికి రూ.500 చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తే 60 ఏళ్లు దాటగానే జీవితాంతం నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఎవరైనా సభ్యులు సహజ మరణం పొందితే రూ.35వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75వేలు, దహస సంస్కారాలకు తక్షణ సహాయంగా రూ.5వేలు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. బీమా ప్రీమియం చెల్లించిన వారి చదువుకునే ఇద్దరి పిల్లలకు ఉపకార వేతనాలు అందజేసే అవకాశం కల్పించారు. 8,9,10 తరగతులతో పాటు ఇంటర్ చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.1,200 ఉపకార వేతనాన్ని అందించేలా ప్రణాళికలు తయారు చేశారు. ఏళ్లు గడుస్తున్నా అంతేనా..2009 నుంచి 2014 వరకు స్వయం సహాయక సంఘాల మహిళలు చెల్లించిన డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తామని 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు సేకరించాలని డీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. అభయహస్తం బాండు, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు, సెల్ నెంబర్ కూడా సేకరించారు. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు చేశాక డబ్బులను ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ గడిచి మూడేళ్లయినా ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. దాదాపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 36,256 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు అభయహస్తం డబ్బులు కోసం వేచి చూస్తున్నారు. జిల్లాకు రూ.230 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన అప్పటి ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదు. ఎలాంటి ఆదేశాలు రాలేదు గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం లబ్ధిదారుల వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం సూచించినట్లు వివరాలతో నివేదిక పంపించాం. అభయహస్తం డబ్బుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – దత్తారావు, డీఆర్డీవో -
విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కళా నైపుణ్య సాంస్కృతిక దినోత్స వం (కళాయవనిక) కార్యక్రమంలో డీఈవో లలితతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రతీ ఒ క్కరి జీవితంలో విద్యతో పాటు పైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం, క్రీడలు వ్యక్తిగత విజయానికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా చేస్తున్న బోధనతో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు హస్తకళలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చినవారిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి
గర్భిణులు, బాలింతల్లో ఏడు శాతం కంటే తక్కువగా రక్తం ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. 7–9 ఎనీమియా ఉంటే సుక్రోజ్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 9 గ్రాముల రక్తం దాటితే మాత్రలు వేసుకోవాలి. ఉదయం 11గంటల లోపు ప్రయాణాలు ముగించేయాలి. చల్లటి పానీయాలు తీసుకోవడం చాలా మంచిది. నీటిశాతం అధికంగా ఉండే పళ్ల రసాలు తాగాలి. ఎక్కడికి వెళ్లినా ఓఆర్ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. పల్లిపట్టి అధికంగా తినాలి. – సీతారాం, జిల్లా వైద్యాధికారి -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్‌అర్బన్: డెంగీ నివారణకు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్ సూచించా రు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పరిసరాల్లో మురుగునీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపా రు. వ్యాధిని అరికట్టేందుకు దోమ తెరలను వినియోగించాలని సూచించారు. డాక్టర్ వినయ్, సిబ్బంది వాసుదేవ శ్యాంలాల్, అశోక్, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఎనీమియా పడగ..!
ఈ చిత్రంలో కనిపిస్తున్న కెరమెరి మండలంలోని కెస్లాగూడ (ఓజీగూడ)కు చెందిన మడావి సుమన్బాయికి రెండేళ్ల క్రితం గర్భస్రావమైంది. అప్పటినుంచి ఆమె అనారోగ్యంతో బాధ పడుతోంది. రక్తం తక్కువగా ఉండడంతో పలుచోట్ల చికిత్స చేసినా పెరగలేదు. కొద్దిరోజుల క్రితం ఆమెకు క్షయ సోకింది. ఇందుకు సంబంధించిన మాత్రలు వాడుతోంది. శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను కుటుంబీకులు జైనూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేయకుండానే ఇంటికి పంపించారు. దీంతో ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం కెరమెరి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందింది. రక్తహీనతతో మహిళలు మరణించడం జిల్లాలో ఇది కొత్తేమి కాదు. -
ఎస్పీఎం ఎన్నికలు లేనట్లేనా?
కాగజ్‌నగర్‌టౌన్: ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో కళకళలాడిన జిల్లాలోని అతిపెద్ద పరిశ్రమ ఎస్పీఎం పేపర్ మిల్లు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మిల్లు పునరుద్ధరణపై ఆశలు వ్యక్తమవుతున్న తరుణంలో కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడం ఆ వర్గాల్లో అనేక అనుమానా లకు తావిస్తోంది. ప్రస్తుతం మిల్లులో 393 మంది ప ర్మినెంట్ కార్మికులు పని చేస్తున్నారు. ట్రేడ్ యూని యన్ ఎన్నికలు ఎనిమిదేళ్లుగా నిర్వహించలేదు. అ ప్పటినుంచి తాత్కాలిక కమిటీలతోనే వ్యవహారాలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి ఎన్నికలపై యా జమాన్యం, సంబంధిత కార్మిక శాఖ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. 2014లో అప్పటి యాజమాన్యం వివిధ కారణాలతో షెడ్‌డౌన్ చేసింది. అనంతరం 2018లో ఎన్సీఎల్టీ కోర్టు తీర్పు ఆధారంగా జేకే మిల్లు యాజమాన్యం కార్మికులపై ఆంక్షలు విధించి విధుల్లోకి తీసుకుంది. ఎనిమిదేళ్లుగా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని కార్మికులు వాపోతున్నారు. కోర్టు కేసు కొట్టివేసినా..మిల్లు పునరుద్ధరణ తర్వాత మిల్లు యాజమాన్యం ఇక్కడి గుర్తింపు కార్మిక సంఘాలకు అర్హత లేదని రెండేళ్ల క్రితం హైకోర్టులో కేసు వేసింది. ఇందుకు ఇ క్కడున్న కార్మిక సంఘాల నాయకులు తమకు అర్హ త ఉందని పూర్తి ఆధారాలను హైకోర్టుకు అందజేశా రు. దీంతో ఎస్పీఎం యాజమాన్యం వేసిన కేసు కొ ట్టేసింది. మళ్లీ తాజాగా నూతన నాలుగు లేబర్ కోడ్ ల విధానం ప్రకారం కార్మిక శాఖకు బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని కార్మిక శాఖపై ఎ స్పీఎం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తె లంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ మాత్రం ఎన్నికలు జరగన్వికుండా చేస్తుండడంతో యాజమాన్యం తీరుపై గుర్తింపు సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఎటూ తేలని ఎన్నికల వ్యవహారంమిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కార్మికశా ఖ ఉన్నతాధికారులకు ఆరునెలల క్రితమే వినతిపత్రాలు ఇచ్చారు. మిల్లులో ట్రేడ్ యూనియన్ ఎన్నిక ల కోసం ఇక్కడున్న కార్మిక సంఘాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అందరికీ నోటీసులు పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కార్మికశాఖ అధికారులకు ట్రేడ్ యూనియన్ నాయకులు అందజేసినా ఎన్నికల విషయంలో ఎటూ తే లని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 11న ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు హైదరాబాద్‌లోని కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి దాసరి హరిచందనను కలిసి ఎస్పీఎం మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని వినతిపత్రం అందజేశారు. కార్మికుల సంఖ్య తగ్గడమే కారణమా?ప్రస్తుతం మిల్లు పునరుద్ధరణ ఉద్యోగాల భరోసా, పెండింగ్ బకాయిల చెల్లింపులు లాంటి కీలక అంశాలు ముందున్నవేళ కార్మిక సంఘం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు కార్మిక సంఘం నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు జరిగితే కార్మికుల అభిప్రాయాలకు ప్రతిబింబంగా కొత్త నాయకత్వం వచ్చే అవకాశం ఉంటుందని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లగలదని కార్మికులు పేర్కొంటున్నారు. మరో వైపు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి మిల్లు పరిస్థితులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం, పరిపాలన కారణాలు కూడా కారణమై ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘం ఎన్నికలు జరగాల్సిందేనని కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత సంఘం ప్రతినిధుల చట్టబద్ధత ఏమిటనే.. అనేక ప్రశ్నలు కార్మికుల్లో వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు, కార్మికశాఖ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. -
‘ఆలయాన్ని నిర్మించేదాకా ఉద్యమిస్తాం’
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పురాతన అంకమరాజు ఆలయాన్ని పునర్నిర్మించేదాకా ఉద్యమిస్తామని అంకమరాజు హక్కుల పోరాట సమితి సభ్యుడు కేశవ్‌రావ్, ఆలయ పూజారి ఆత్రం పాండు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం చేపట్టాలని శనివా రం జిల్లా కేంద్రంలోని అంకమరాజు ఆలయం వద్ద ఆదివాసీలతో కలిసి నిరసన తెలిపారు. మొదట అంకమరాజు ఆలయం నుంచి ర్యాలీగా డోలు వా యిద్యాలతో గాంధీచౌక్, వివేకానందచౌక్, అంబేడ్కర్‌చౌక్, జగ్జీవన్రాంచౌక్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వేలాది ఏళ్ల క్రితం పట్టణంలోని ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అంకమరాజుకు గోల్కొండ న వాబులను గడగడలాడించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అంకమరాజు మరణించిన 1,700 ఏళ్ల క్రితం సమాధి, వీరాంజనేయ స్వామి, మహంకాళిమాత దేవతలున్నా నేటికీ ఆలయ అభివృద్ధిని అధి కారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు ప ట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇ ప్పటికై నా చొరవ చూపి అంకమరాజు, వీరాంజనేయస్వామి, మహంకాళి మాత గుడి నిర్మించేలా చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఆలయ నిర్మాణం కో సం త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవిలో గర్భిణులు, బాలింతలు తగిన జాగత్రలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంతవరకు ప్రయాణాలు తగ్గించాలి. రోజుకు 4–5లీటర్ల నీరు తాగాలి. మధ్యాహ్నం బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్లడం మంచిది. వేసవికాలంలో గర్భిణుల్లో ఉమ్మ నీరు తగ్గే అవకాశముంది. అందుకే డీహైడ్రేషన్‌కు గురవకుండా చూడాలి. 100 కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైతే వడదెబ్బ తాకినట్లు భావించాలి. కొ బ్బరి బోండాలు, మజ్జిగ, విటమిన్ సీ, పండ్ల ర సాలు ఎక్కువగా తీసుకోవాలి. స్నానం చేశాక శ రీరానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. తేలికగా జీ ర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేపుళ్లకు దూ రంగా ఉండాలి. రక్త హీనతతో బాధపడే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే తోటకూర, పాలకూర, ఇతర ఆకుకూరలతో పాటు బెల్లం, వేరుశెనగలు, నువ్వులు, ఖర్జూ రం, ఎండు ద్రాక్ష తినాలి. చికెన్, లివర్, గుడ్లు తీసుకోవడం ద్వారా రక్తం త్వరగా పెరుగుతుంది. విటమిన్ ‘సీ’ కోసం నిమ్మరసం, ఉసిరి వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. టీ, కాఫీకి దూరంగా ఉండాలి. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. మండల కేంద్రంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆరబెట్టి న తాలు లేని ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులకు సూచించారు. మిల్లర్లు ధాన్యం త్వరగా అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు, గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేసి ఎప్పటికప్పు డు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత ఉన్నందున కేంద్రం వద్ద నీ డ, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. జి ల్లా వ్యవసాయాధికారి వెంకట్, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, ఏఈవో ఆదిత్య ఉన్నారు. ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహనదహెగాం మండలంలోని ఐనం గ్రామంలో ఉద్యానవన, పట్టుపరిశ్రమ, వ్యవసాయశాఖ, ఆత్మ సౌజ న్యంతో ఆయిల్‌పాం సాగు, సాగులో మెళకువలు, లాభాలపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ హరిత హాజరై మాట్లాడారు. ఆయిల్‌పాం సాగు ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని, రైతులు సాగుకు ముందుకురావాలని సూచించారు. 90 శాతం సబ్సిడీపై మొక్కలు అందించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ వెల్ములే ప్రశాంత్, జిల్లా ఉద్యానవన అధికారి నదీం, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, డీసీవో మోహన్, ఏడీఏ మనోహర్, మాట్రిక్ సీఈవో ఉదయ్‌కుమార్, ఉద్యానవనశాఖ అఽధికారి సుప్రజ, ఏవో రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ బలోపేతంపై సమీక్షఆసిఫాబాద్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం, బలోపేతంపై కలెక్టర్ హరి త సమీక్ష నిర్వహించారు. సభ్యత్వం పెంచి సొసైటీ ని బలోపేతం చేయాలని కోరారు. జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పరిశ్రమల యజమానులు, ఉపాధ్యాయులు, ఉ ద్యోగులు, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇండియ న్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మండల స్థా యి అధికారులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సంబంధిత శాఖల అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
అధికారుల సలహాలు పాటించాలి
చింతలమానెపల్లి: పంటల సాగులో రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అమిర్ భాషా, కారుణి అరుణ సూచించారు. శనివారం మండలంలోని బాలాజీఅనుకోడ గ్రా మంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించగా వీరు హాజరయ్యారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాలు, ఎరువుల యాజ మాన్యం, చీడలు, వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చు తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, అవసరం మేరకే రసాయన ఎరువుల విని యోగంతో ప్రకృతిని సంరక్షించడం, పంట మార్పి డి ద్వారా సుస్థిర ఆదాయం పొందడం లాంటి అంశాల గురించి వివరించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను సాగు చేయాలని, సాగు నీటిని ఆదా చేసి భావితరాలకు అందించాలని సూచించారు. నా ణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల్లో సమతుల్య ఎ రువుల వినియోగం, సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతుల గురించి వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు పరిష్కారం చూపా రు. ఏవో కార్తీషా, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. -
తనిఖీలు నిర్వహించి.. అవగాహన కల్పించారు
వాంకిడి: మండలంలోని బెండార గ్రామంలో శనివా రం డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గంజాయి విక్రయం, ఇతర అక్రమ కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలుపాలని కోరారు. సైబర్ మోసాలు, అపరిచిత కాల్స్ లింక్‌లు, ఓటీపీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువు, ఉపాధి, క్రీడల వైపు దృష్టి మళ్లించాలని వివరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ ప్రజలకు ఎల్ల ప్పుడు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారికంగా శివాజీ జయంతి నిర్వహించేందుకు కృషి
చింతలమానెపల్లి: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని ఖర్జెల్లి గ్రామంలో శుక్రవా రం శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజలు చేసి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరె కుల సంఘ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. శివాజీ జీవితం ఆదర్శప్రాయమని, మహనీయుడి చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆరె కులస్తులకు ఓబీసీ ధ్రువీకరణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చింతలమానెపల్లి మండలంలో కమ్యూనిటీ భవనాన్ని ప్రజలందరికీ ఆమోదయోగ్యమయ్యేలా నిర్మిస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయి స్తామని తెలిపారు. శివాజీ మహరాజ్ స్ఫూర్తితో హైందవ ధర్మ రక్షణకు అంతా నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చాపిడె సత్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాస్, చౌదరి నానయ్య, టోంబ్రె శ్రీనివాస్, డుబ్బుల నానయ్య, డుబ్బుల వెంకన్న, సుల్కరి ఉమామహేశ్, చౌదరి రంగయ్య, ఒడీల భాస్కర్, అశోక్ ఆచార్య, వాను పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిపాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో డీఈవో లలితకు సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఎంఐఎస్, సీసీవో, సీఆర్పీలకు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఇ బ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీసీవో సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, ఎంఐఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు గేడేకర్ సంతోష్, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, సీసీ రాము, నాయకులు సందీప్, నాగేష్, తిరుపతి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాస్త ఊరట!
ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర పెంచడంతో రైతులకు కాస్త ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ 2025– 26 సమావేశంలో వానాకాలం నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపారు. జిల్లా రైతులు పండించిన పలు పంటలకు లాభదాయకమైన ధర లభించనుంది. ముఖ్యంగా జిల్లాలో ప్రధానంగా సాగువుతున్న పత్తి, వరి, మొక్క జొన్న, కందులకు ధర పెరిగింది. అయితే పత్తికి పెంచిన స్థాయిలో వరికి పెంచకపోవడం నిరాశ కలిగిస్తోంది. జిల్లాలో పంటల సాగు ఇలా..జిల్లాలో 1.44 లక్షల మంది రైతులు ఉండగా, వానాకాలం సీజన్లో సుమారు 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తిని పండిస్తారు. స్థానికంగా సాగునీటి వనరులు తక్కువగా ఉండటంతో కాటన్పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఆ తర్వాత 47,228 ఎకరాల్లో వరి, 3,017 జొన్న, 7,668 మొక్కజొన్న, 1200 ఎకరాల మిర్చితో కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇక యాసంగిలో మాత్రం 30 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. గతంతో పోలిస్తే వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. విత్తనాలు, ఎరువులు, భూమి కౌలుతో పాటు కూలీల రేట్లు పెరగడం రైతులకు భారంగా మారింది. దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడులు భారం అవుతున్నాయి. ఏటా పెరుగుతున్న ఖర్చులతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. కాడెద్దులు కనుమరుగు కాగా, ట్రాక్టర్లు, యంత్రాల వినియోగం పెరిగింది. తాజాగా ఇంధన ధరలు పెరగడంతో డీజిల్, పెట్రోల్ భారం సైతం వారిపై నేరుగా పడనుంది. మార్కెటింగ్ పెరిగితే..పంటలకు మద్దతు ధర పెంచినా క్షేత్రస్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తేనే రైతులకు మేలు జరగనుంది. దళారులు అన్నదాతలను దోచుకోకముందే స్థానిక అవసరాలకు అనుగుణంగా సమయానికి కేంద్రాలు తెరుచుకోవాలి. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను అమ్ముకునే అవగాహన కలిపంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పత్తి, వరిధాన్యం కొనుగోళ్ల సమయంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం కొనుగోళ్లు సరళతరం చేసి, మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. శుభ పరిణామం కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచడం శుభపరిణామం. ఏటా వ్యవసా య సాగు ఖర్చులు పెరుగుతు న్నా రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఎట్టకేలకు ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం రైతులకు ఊరట లభిస్తుంది. – పిప్రె రాజన్న, రైతు, మోతుగూడ, మం.ఆసిఫాబాద్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ధర పెంపుతో పాటు రైతులకు అనుకూలంగా మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వరి పంటకు స్వల్పంగా క్వింటాల్‌కు రూ.72 పెంచితే పత్తికి రూ. 557 పెంచారు. మిగితా పంటలకు కూడా మద్దతు ధర పత్తి లాగే పెంచాలి. – కోలె రవీందర్, గుండి, మం.ఆసిఫాబాద్ మద్దతు ధరలు(రూ.లలో)పంట రకం 2025–26 2026–27 పెరిగిన ధర పత్తి(పొడవు పింజ) 8,110 8,667 557 పత్తి(మధ్య రకంపింజ) 7,710 8,267 557 వరి ఏ గ్రేడ్ 2,389 2,461 72 వరి సాధారణం 2,369 2,441 72 దేశీజొన్న 3,749 4,073 324 హైబ్రిడ్ జొన్న 3,699 4,023 324 మొక్కజొన్న 2,400 2,410 10 కందులు 8,000 8,450 450 సోయాబిన్ 5,328 5,708 380 రాగులు 4,887 5,205 319 సజ్జలు 2,775 2,900 125 పెసలు 8,768 8,780 12 మినుములు 7,800 8,200 400 నువ్వులు 9,936 10,436 500 గడ్డినువ్వులు 9,537 10,052 515 పొద్దుతిరుగుడు 7,721 8,343 622 వేరుశనగ 7,263 7,517 254 పత్తికే పెద్దపీటకేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 14 పంటలకు మద్దతు ధర పెరిగింది. ఇందులో పత్తికే పెద్దపీట వేశారు. పత్తి క్వింటాల్‌కు రూ.557 పెంచారు. దీంతో పొడువు పింజ పత్తి రూ.8,667, మధ్యరకం పింజ క్వింటాల్ రూ.8,267కు చేరింది. ఇక మరో ప్రధాన పంట వరికి మాత్రం నామమాత్రంగా రూ.72 మాత్రమే పెంచారు. వరిధాన్యం సాధారణ రకానికి క్వింటాల్ రూ.2441, ఏ గ్రేడ్ వరిధాన్యం ధర క్వింటాల్ రూ.2,461 నిర్ణయించారు. దీంతోపాటు జిల్లాలో అత్యధికంగా సాగు చేసే జొన్న, కందులు, మినుములు, సజ్జలు వంటి పంటలకు ఆశించిన స్థాయిలో పెంచారు. -
స్పందన అంతంతే..!
కాగజ్‌నగర్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. విద్యావారోత్సవాల్లో భాగంగా ఈ నెల 11 నుంచి ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 300 మంది విద్యార్థులు అనుత్తీర్ణులు కాగా, వారి కోసం నాలుగు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా ఆశించిన స్థాయిలో హాజరు నమోదు కావడం లేదు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 20 మంది మాత్రమే హాజరువుతుండటంతో పాఠశాలలు వెలవెలబోతున్నాయి. శిక్షణ కేంద్రాలు ఇవే..జిల్లాలోని విద్యార్థుల కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీహెచ్ఎస్(బాలికలు)లో ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి మండలాల విద్యార్థులు 79 హాజరు కావాలి. అలాగే కాగజ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డ్)లో కాగజ్‌నగర్, కౌటాల, సిర్పూర్(టి) మండలాల విద్యార్థులు 123 మంది, పెంచికల్పేట్ జెడ్పీహెచ్ఎస్లో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం విద్యార్థులు 66 మంది, సిర్పూర్(యు)లో టీజీఎంఎస్ మోడల్ స్కూల్లో సిర్పూర్(యు), లింగాపూర్, జైనూర్ విద్యార్థులు 32 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడకుండా జూన్ 3 వరకు వస్తే రవాణా ఖర్చుల నిమిత్తం రూ.1000 చెల్లించనున్నారు. అలాగే నోట్‌బుక్స్, పెన్నులు సైతం ఉచితంగా అందిస్తున్నారు. అవగాహన లోపమా, నిర్లక్ష్యమా? పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయులతో బోధన కొనసాగుతోంది. జూన్‌లో జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయి. ఇంటి దగ్గర చదివేందుకు అనువైన పరిస్థితులు లేని ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కానీ ఉచిత శిక్షణపై విద్యార్థులకు సమాచారం లేకపోవడం, విద్యార్థుల్లో పరీక్షలపై భయంతో తరగతులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. మరికొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఫెయిలైన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లలను దగ్గరలోని శిక్షణ కేంద్రాల్లో చేర్పించాలని వారు కోరుతున్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
వాంకిడి: పశువుల అక్రమ రవాణా అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీఎస్పీ అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిందని తెలిపారు. అక్రమ రవాణా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. శుభకార్యాల్లో డీజే వాడకం నిషేధమని, ఎవరైనా డీజేలు పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. యువత మత్తుమాయలో పడకుండా ఉన్నత భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్ పాల్గొన్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. విద్యావా రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన గ్రంథాల య దినోత్సవానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఈవో లలితతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడు తూ యువత పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయాల్లో నవలలు, చరి త్ర పుస్తకాలు, మహనీయుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాల సాధనకు గ్రంథాలయాలు చక్కని వేదికగా ఉపయోగపడతాయన్నారు. అనంతరం గ్రంథాలయంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రంథాలయశాఖ అధికారులు, కవులు పాల్గొన్నారు. ప్రకృతి విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలిఆసిఫాబాద్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. న్యూఢిల్లీ నుంచి శుక్రవారం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి హాజరయ్యారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వర్షాకాలంలో వరదలు, విపత్తులతో ఆస్తులు, ప్రాణనష్టం జరగకుండా అధికా రులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ, అతిభారీ వర్షాలు కురిసే సమయంలో జనజీవనం స్తంభించిపోతుందని, ఆ సమయంలో ప్రజలను రక్షించి పునరావాసం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెస్క్యూ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అరకొరగా ‘భరోసా’
ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాకాలం ముంచుకొస్తోంది.. ఖరీఫ్ పంటల సాగుకు భూములను రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే యాసంగి(రబీ) సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదు. యాసంగి పంటల సీజన్ ముగింపు దశకు వచ్చినా నేటికీ వందశాతం నిధులు విడుదల కాలేదు. ప్రస్తుతం కేవలం రెండెకరాల లోపు మాత్రమే పెట్టుబడి సాయం పరిమితం కాగా, మిగిలిన వారి ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఖాతాల్లో రూ.1.31 కోట్లు జమ జిల్లా వ్యాప్తంగా 1,44,511 మంది రైతులు ఉన్నారు. అందరికీ పెట్టుబడి సాయం అందించడానికి రూ.2.68 కోట్ల నిధులు అవసరం. సాధారణంగా యాసంగికి సంబంధించిన రైతుభరోసా నిధులను డిసెంబర్, జనవరిలోనే విడుదల చేస్తారు. కానీ ఈసారి మార్చి 22న మొదటి విడత విడుదల చేశారు. ఎకరం వరకు భూమికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత నెల 20న రెండో విడతలో రెండెకరాల్లోపు రైతులకు సాయం అందించారు. రెండు విడతల్లో కలిపి జిల్లాలోని 1,34,239 మంది రైతులకు రూ.1.31 కోట్ల నిధులు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.1.37 కోట్లు జమ కావాల్సి ఉంది. మిగతా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. పెట్టుబడికి ఇబ్బందిపంటల పెట్టుబడి విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తామని చెబుతోంది. గత వానాకాలంలో రైతులందరికీ నిధులు జమ అయ్యాయి. కానీ యాసంగి వచ్చేసరికి పథకం అమలులో జాప్యం జరుగుతోంది. గతంలో పంట పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక అప్పులు చేయాల్సిన అవసరం కొంతమేర తగ్గింది. పథకం అమలు చేయడంలో రెండేళ్లుగా జాప్యం జరుగుతుండటంతో మళ్లీ అన్నదాతలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. యాసంగిలోనే పూర్తిస్థాయి సాయం అందకపోవడంతో ఇక వచ్చే వానాకాలంలో ఏమేరకు ఇస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఘనంగా టీజీఎఫ్డీసీ ఆవిర్భావ వేడుకలు
కాగజ్‌నగర్: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆవిర్భావ వేడుకలు గురువారం కాగజ్‌నగర్‌లోని ఆ సంస్థ డివిజన్ కార్యాలయ ఆవరణలో ఘనంగా జరుపుకొన్నారు. డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల రేంజ్‌ల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డివి జనల్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ టీజీఎఫ్ డీసీ పురోగతి కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ప్లాంటేషన్లు, అటవీ ప్రాంతాల్లో పని చేసే సిబ్బందికి క్రీడాపోటీలు నిర్వహించ డం ద్వారా బృంద నాయకత్వం, మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేశ్(మంచిర్యాల రేంజ్), ఎడ్ల లక్ష్మణ్(కాగజ్‌నగర్ రేంజ్), ఎ.జలపతి(బెల్లంపల్లి రేంజ్), సిబ్బంది పాల్గొన్నారు. -
అందరి భాగస్వామ్యంతోనే అటవీ అభివృద్ధి
చింతలమానెపల్లి: ప్రజలందరి భాగస్వామ్యంతోనే అటవీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎఫ్‌డీవో అప్పయ్య అన్నారు. ఖర్జెల్లి, దిందా బీట్లలో నెలకొన్న పోడు సమస్యపై గురువారం ఖర్జెల్లి గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అటవీ అధికారులు, పోడు రైతులకు మధ్య ఉన్న పోడు సమస్యను ఇరువర్గాలు పరిష్కరించుకున్నాయి. ఎఫ్‌డీవో మాట్లాడుతూ అటవీ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు అటవీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అటవీ భూముల విషయంలో ఆయా గ్రామాల ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. పలువురు పోడు రైతులు మాట్లాడుతూ అడవుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు. కొత్తగా అటవీభూములు ఆక్రమించమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో సుభాష్, సిబ్బంది పాల్గొన్నారు. -
కుమురం భీం
7‘లోలెవల్’ తిప్పలు తప్పేదెప్పుడో..? లోలెవల్ వంతెనలతో వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఎండాకాలంలో ఎత్తు పెంచే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.ఆకాశం రోజంతా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయ. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. సందడిగా సమ్మర్ క్యాంపులు సింగరేణి పలు వేసవి క్రీడాశిబిరాలు ఏర్పాటు చేసింది. గోలేటిలోని విద్యార్థులు తమకు నచ్చిన క్రీడలో మెలకువలు నేర్చుకునేందుకు శిబిరంలో సాధన చేస్తున్నారు.శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 -
అన్ని గ్రామాలకు శుద్ధజలం అందించాలి
కెరమెరి: వేసవిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అన్ని గ్రామాలకు శుద్ధజలం అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని ధనోరా మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను గురువారం సందర్శించారు. పంప్‌హౌస్ నుంచి ఎన్ని మండలాలకు నీటి సరఫరా అవుతుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మోటర్లు, పైప్లైన్ల మరమ్మతులు ఉంటే తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని కొఠారి కొలాంగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ పీడీ టీఎన్ ప్రకాశ్‌రావుతో కలిసి పరిశీలించారు. 110 ఇళ్లు మంజూరు కాగా, 108 ఇళ్ల ప్రారంభించారని, ఏడు పూర్తయ్యాయని తెలిపారు. 86 ఇళ్లు స్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్‌కుమార్, సర్పంచ్ మడావి శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు. లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపికఆసిఫాబాద్రూరల్: 2026– 27 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద 3, 5, 8వ తరగతుల్లో విద్యార్థుల ఎంపిక కోసం గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీటీడీవో రమాదేవితో కలిసి కలెక్టర్ హరిత లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 56 సీట్లల్లో పీవీటీజీ విద్యార్థులకు ఐదు సీట్లు కేటాయించగా, మిగితా 46 సీట్లను లక్కీడ్రా ద్వారా భర్తీ చేశామన్నారు. మూడో తరగతలో 29 మంది, ఐదో తరగతిలో 14 మంది, ఎనిమిదో తరగతిలో 13 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో శకుంతల, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓటరు సవరణకు ఏర్పాట్లుఆసిఫాబాద్: జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం న్యూఢిల్లీలోని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు హాజరయ్యారు. ముఖ్య ఎన్నికల అధికారి ఓటరు ప్రత్యేక సవరణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అధికారులు, సూపర్వైజర్లను నియమించి, శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
అప్రకటిత కోతలతో సతమతం
ఆసిఫాబాద్: జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో దాదాపు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం లేకుండా కరెంట్ కట్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో గంటల తరబడి అంతరాయం ఉంటుండడంతో రాత్రిళ్లు నిద్రలేక ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా ఏకంగా జిల్లా కేంద్రంలోనే అర్ధరాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలలో 132/33 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, 33/11 కేవీ సబ్ స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో 34 వరకు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ కనెక్షన్లతోపాటు వివిధ రకాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 17 లక్షల యూనిట్లు వినియోగిస్తుండగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతోంది. పెరిగిన వినియోగంఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగిస్తున్నారు. అలాగే ప్రతీ ఇంట్లో విద్యుత్ గృహోపకరణాల వాడకం పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో మామూలు రోజులతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 30 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గ్రిడ్‌పైనా ఒత్తిడి పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్యతో తరచూ ఉపకరణాలు కాలిపోతున్నాయి. అన్ని మండలాలకు సబ్స్టేషన్లు లేకపోవడంతో పక్క మండలం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఈ క్రమంలో ఈదురు గాలులు వీస్తే ముందస్తుగానే కరెంట్ కట్ చేస్తున్నారు. విద్యుత్ కోతలు లేవు జిల్లాలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవు. కేవలం వర్షం, ఈదురుగాలులు వచ్చినప్పుడు మాత్రమే ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. 160 కేవీ ట్రాన్స్ఫార్మర్లు గతంలో నాలుగు ఉండగా, ప్రస్తుతం 16కు పెంచాం. కేవలం మెయింటెనెన్స్ ఉన్నపుడు మాత్రమే విద్యుత్ కట్ చేస్తున్నాం. చిరువ్యాపారుల నష్టంతరచూ విద్యుత్ అంతరాయంతో వెల్డింగ్, జిరాక్స్, చిన్న పరిశ్రమలు.. ఇతర చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం కూడా లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే రోగులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ జనరేటర్లు లేవు. చాలాచోట్ల సోలార్, ఇన్వర్టర్లతో కాలం వెల్లదీస్తున్నారు. సంబంధిత అధికారులు విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
పే స్లిప్‌లు ఏవి..?
తిర్యాణి: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో నూతన నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో చేతికందే పే స్లిప్పుల పంపిణీ నిలిచిపోయింది. ఎంత పని చేశా మో, ఖాతాల్లో ఎంత జమ అవుతుందో తెలియడం లేదు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంత కూలీలతోపాటు చదువురాని పేదలు దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. యాప్‌లపై అవగాహన లేకపోవడం, వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. జూలై 1 నుంచి వీబీ జీరామ్ జీ2005 నుంచి అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. జూలై 1 నుంచి దీని స్థానంలో వీబీజీ రామ్‌జీ చట్టాన్ని అమలు చేయనున్నారు. పని దినాల సంఖ్య 125 రోజులకు పెంచనున్నారు. జిల్లావ్యాప్తంగా 1.22 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 2.42 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 84 వేల యాక్టీవ్ జాబ్‌కార్డులు ఉండగా, 1.53 లక్షల మంది యాక్టీవ్ కూలీలు ఉన్నారు. నిలిచిన పే స్లిప్లుజిల్లాలో ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేపడుతున్న కూలీలకు వేతన స్లిప్పులు ఇవ్వడం లేదు. నాలుగేళ్ల క్రితం వరకు సక్రమంగా అందజేసినా ప్రస్తుతం వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ పంపిణీ నిలిపివేశారు. పే స్లిప్‌లో కూలీ పేరు, పని ప్రదేశం, ఎన్ని రోజులు పని చేశారు.. రోజువారీ వేతనం ఎంత మొత్తం వచ్చింది అనే వివరాలతోపాటు వంద రోజులు నిండడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం పూర్తిగా ఉంటుంది. తద్వారా కూలీలకు ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో, ఎంత వేతనం వస్తుందో స్పష్టంగా తెలిసేది. ప్రస్తుతం స్లిప్‌ల పంపిణీ కాకపోవడంతో వారానికి ఎంత వేతనం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతీ వారం వేతన వివరాలు తెలిస్తే ఒక వారం తక్కువ డబ్బులు పడినా తదుపరి వారం గరిష్ట వేతనం కోసం పని చేసేందుకు కూలీలు ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కూలీలు నష్టపోయే అవకాశం..!సాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన నిధులను పోస్టాఫీసు లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీసు ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ వారాల పేమెంట్లు జమ చేస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన కూలీలు అధికంగా ఉండటంతో తమ ఖాతాల్లో ఎంత నగదు జమ అయిందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో బీపీఎంలు నగదు విత్‌డ్రా సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినా సమీపంలో ఏటీఎం కేంద్రాలు అందుబాటులో లేవు. దీంతో మినీ ఏటీఎం నిర్వాహకులను ఆశ్రయించాల్సిందే. ఆ సమయంలోనూ అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. కూలీల వేతన వివరాలను జన్ మన్ రేగా అనే యాప్‌లో పొందుపరుస్తున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో కూలీలకు దానిపై అవగాహన లేకపోవడంతో ఉపయోగపడటం లేదు. -
విద్యార్థినికి అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: పార్కింగ్‌కు సమస్యకు వినూత్న పరిష్కారం చూపిన జిల్లాకు చెందిన విద్యార్థి మమతతోపాటు గైడ్ టీచర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ప్రత్యేకంగా అభినందించారు. పార్కింగ్ మేనేజ్మెంట్ ఇన్ క్రౌడెంట్ ప్లేస్ అనే డిజైన్‌కు ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నుంచి అధికారిక నమోదు లభించడం జిల్లాకు గర్వకారణమన్నారు. జిల్లాలో విద్యార్థులు, యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో లలిత పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
కాగజ్‌నగర్‌టౌన్: రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పీఏసీఎస్‌లో మక్క, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నిల్వ చేసే గోదాంలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్‌ఆర్‌వో కాలనీలోని ఎఫ్ఏసీ గోదాంను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీఓ మోహన్, తహసీల్దార్ మధుకర్, మార్కెటింగ్ ఎస్‌డబ్ల్యూసీ అశ్వక్, పీఏసీఎస్ మేనేజర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఆవులు, దూడల అక్ర మ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లో కి తీసుకుంటే చర్యలు తప్పవని, వ్యక్తిగత దాడుల కు పాల్పడటం నేరమని ఎస్పీ నితిక పంత్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ప శువుల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్ట పరమైన అంశాలపై గోరక్షణ కమిటీతో స మావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ గోరక్షకుల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయ డం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యల కు పాల్పడవద్దని సూచించారు. సమాచారం తెలిస్తే వెంటనే 87126 70505, 87126 70557, స్థానిక పోలీసులు, డయల్ 100కు సమాచారం అందించా లన్నారు. ఇప్పటికే జిల్లాలో 14 చెక్‌పోస్టులు ఏర్పా టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, గోరక్షక్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. కించపర్చే పోస్టులు పెడితే కేసులు నమోదువాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు, వర్గాలు, సమాజాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేయడం, పోస్టులు పెట్టడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అసభ్యకర, విద్వేషపూరిత పోస్టులు గమనిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఆసిఫాబాద్: జిల్ల కేంద్రంలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్థానిక కొట్నాక భీమ్రావు పిల్లల పార్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్, షాదీఖానా, పిల్లల పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలంబిన్ అహ్మద్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మరమ్మతులకు భూమిపూజ
దహెగాం: గుంతలతో అధ్వానంగా మారిన మండలంలోని ఇట్యాల నుంచి గొర్రెగుట్ట వరకు బీటీరోడ్డు మరమ్మతులకు గురువారం ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూ జ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెన్యువల్ బీటీ కోసం ఎంఆర్ఆర్ పథకం కింద రూ.1.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ.1,700 కోట్లు అవసరమని సంబంధిత శాఖ ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. గొర్రెగుట్ట నుంచి కేస్లాపూర్ వరకు బీటీరోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గజ్జెల జయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఏకైక కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. ఈ హృదయ విదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నికాడి గీత, భీంరావు దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి తరుణ్(14 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. వాంకిడి మండలంలోని బంధువుల ఇంటి వద్ద శుభకార్యం ఉండటంతో కుటుంబ సభ్యులంతా వెళ్లి బుధవారం తిరుగుపయనమయ్యారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు చేరుకుని కాగజ్‌నగర్ వెళ్లే బస్సు ఎక్కేందుకు వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్ బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా, ఉట్నూర్ డిపోకు చెందిన డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తుండగా, బస్సు నానమ్మ ఒడిలో ఉన్న బాలుడికి తాకింది. దీంతో తరుణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. మంచిర్యాలలో బాలుడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బస్టాండ్ ఎదుట ఆందోళన బాలుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసిఫాబాద్‌కు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, తెలంగాణ ఆదివాసీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. బాలుడి మృతి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డీఎం రాజశేఖర్ అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. తక్షణ సహాయం కింద రూ.25 వేలు చెల్లిస్తామని, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనల్లో వివిధ సంఘాల నాయకులు చిరంజీవి, దినకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
సరైన ధ్రువపత్రాలు లేకుంటే చర్యలు
చింతలమానెపల్లి: జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘అదరక..బెదరక!’ అనే కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. బుధవారం కౌటాల మండల కేంద్రంలోని పశువుల సంతను ఎస్పీ నితిక పంత్ పరిశీలించి నిర్వాహకులు, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువులకు సరిపడా దాణా, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వారసంతల్లో ఆవుల క్రయవిక్రయాలు నిషేధమని స్పష్టం చేశారు. పశువుల రవాణా, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం సిర్పూర్(టి) మండలంలోని పెద్దబండ చెక్‌పోస్ట్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో కౌటాల సీఐ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నస్పూర్: ఉద్యోగులు, పెన్షనర్లకు పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ భరత్‌కుమార్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రయాస్ కో ఆర్డినేషన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగి పీఎఫ్, పెన్షన్ సెటిల్మెంట్ల కోసం అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్‌లో పెండింగ్స్‌ను జీరో పెండింగ్‌లోకి తేవడమే లక్ష్యంగా సీఎంపీఎఫ్ కార్యాలయం వారు తలపెట్టిన కార్యక్రమమే ప్రయాస్ అన్నారు. ఉద్యోగులు చిన్న చిన్న కారణాలకు పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసి వాటిని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. తాను గతంలో అండర్ గ్రౌండ్ మైన్లలో ఇంజినీర్‌గా విధులు నిర్వహించానని, క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల సాధక బాధలు తెలుసన్నారు. జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారం ఎంతో కష్టంగా ఉండేదన్నారు. ప్రస్తుతం సీఎంపీఎఫ్ అధికారులే ఉద్యోగుల వద్దకు రావడం శుభపరిణామం అన్నారు. సమావేశంలో సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్–2 గోవర్ధన్, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, డీజీఎం (పర్సనల్) అనిల్‌కుమార్, సీనియర్ పీవో సురేందర్, జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శి సందీప్, శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల సంక్షేమాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రవేశాలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేసే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో 2026– 27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలు పాత పద్ధతిలోనే ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 49 జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఇందులో 13 కస్తూ రిబా గాంధీ విద్యాలయాలు, ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులం, మూడు మైనార్టీ గురుకులాలు, నాలుగు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు, రెండు మోడల్ స్కూళ్లలో పాఠశాల విద్యతోపాటు ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11 ఉండగా, ప్రైవేట్ కాలేజీలు ఐదు ఉన్నాయి. మొత్తం 49 కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీతోపాటు ఒకేషనల్ గ్రూపుల్లో సుమారు 8 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. గతేడాది జిల్లాలోని 11 ప్రభుత్వ కళాశాలల్లో ఫస్టియర్‌లో 2,577 మంది, సెకండియర్‌లో 2,048 మంది విద్యనభ్యసించారు. విలీనం చేయాలని భావించినా.. ఇంటర్మీడియట్‌ను రద్దు సీబీఎస్ఈలో తరహాలో 11, 12 తరగతులను కూడా పాఠశాలల విద్యలోనే కొనసాగించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. తర్వాత గణనీయంగా డ్రాపౌట్స్ తగ్గించవచ్చని సూచించింది. అయితే ప్రవేశాలకు తక్కువ సమయం ఉండటం, పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండటంతో విద్యార్థుల ప్రయోజనాలను భంగం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో యథావిధిగా పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేట్‌లో అడ్మిషన్ల జోరు..! ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ప్రైవేట్ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల సమాచారం, ఫోన్ నంబర్లు తీసుకుని కాంటాక్ట్ అవుతున్నారు. కాలేజీల ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఫీజు తగ్గిస్తామని ప్రలోభపెడుతున్నారు. ఇంటర్‌తోపాటు నీట్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా సిద్ధం చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. జిల్లాకు చెందిన కళాశాలల యాజమాన్యాలతోపాటు మంచిర్యాల, కరీంనగర్‌కు చెందిన కాలేజీల యాజమాన్యాలు కూడా ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్‌గా రూ.5వేలు తీసుకుని విద్యార్థుల ఆధార్ నంబర్, పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యపదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులతో కూడిన విద్యతోపాటు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. ఇక్కడే మెరుగైన విద్య అందుతుంది. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ప్రలోభా లకు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం. మొదటి విడత ప్రవేశాలకు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. – రాందాస్, డీఐఈవో -
నెలాఖరులోగా మ్యాపింగ్ పూర్తిచేయాలి
ఆసిఫాబాద్: ఈ నెలాఖరులోగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లు, సూపర్వైజర్లతో బుధవారం నియోజకవర్గ స్థాయి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఏసీఎంలు, సూపర్వైజర్లు మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బూత్‌స్థాయి అధికారులు తమ పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. మరణించిన ఓటర్లు, గ్రామం వదిలి వెళ్లిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. సెర్ప్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా అందించాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో ధాన్యం కొనుగోళ్లు, గోనె సంచుల లభ్యత, మొక్కజొన్న కొనుగోలు, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ధ్రువపత్రాల జారీ, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జనగణన– 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్యుమరేటర్లకు వివరాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌ల్లో ప్రతీ ఇంటిని సందర్శించాలని ఆదేశించారు. ఇంటి యజమానులు కూడా సిబ్బందికి సహకరించి, పారదర్శకంగా వివరాలు అందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసిఫాబాద్ డివిజన్లో ఐకేపీ ద్వారా 6 కేంద్రాలు, కాగజ్‌నగర్ డివిజన్లో ఐకేపీ ద్వారా 15 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.రైతుతో మాట్లాడి.. సూచనలు చేసిరెబ్బెన: మండలంలోని కొమురవెళ్లికి కౌలుదారు సందీప్ తాను సాగు చేసిన పొలం వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై కలెక్టర్ హరిత స్పందించారు. బుధవారం సదరు కౌలురైతుతో ఫోన్లో మాట్లాడారు. తేమ, మట్టిగడ్డలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే తప్పకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను కొనుగోలు కేంద్రానికే ధాన్యం తీసుకువస్తానని తెలిపాడు. -
● గోలేటి ఓసీపీ ప్రారంభం కోసం తీవ్రంగా ప్రయత్నాలు ● కొనసాగుతున్న భూసేకరణ, పునరావాస కేంద్రం పనులు ● ఇంకా లభించని స్టేజ్–1 అనుమతులు ● ఈ సంవత్సరంలో ఉత్పత్తి లేనట్లే..
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా భవిష్యత్తుకు జీవం పోసే గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అనుమతుల అడ్డంకులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. యాజ మాన్యం ఈ ఓసీపీ ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. రెండేళ్ల క్రితమే గోలేటి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందని సింగరేణి ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం ప్రతిబంధంగా మారింది. స్టేజ్– 1 అనుమతులే కీలకం బెల్లంపల్లి ఏరియా ఒకప్పుడు భూగర్భ గనులు, ఓసీపీలతో కళకళలాడేది. కాలక్రమేణా భూగర్భ గనులు మూతపడగా, బొగ్గు నిల్వలు నిండుకుని ఓసీపీలు సైతం వాటి దారిలోనే మూతపడ్డాయి. ఒకానొక దశలో బెల్లంపల్లి ఏరియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏరియాకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా యాజమాన్యం కాలానుగుణంగా బొగ్గు ఉత్పత్తిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. భూగర్భ గనుల్లో ఆశించిన లాభాలు రాకపోవడం, లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో ఓసీపీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాకు మరో రెండు దశాబ్దాల పాటు ఢోకా ఉండకుండా గోలేటి, ఎంవీకే ఓసీపీ ఏర్పాటుకు సంస్థ ముందుకొచ్చింది. మూసివేతకు గురైన గోలేటి వన్, గోలేటి వన్– ఏ, అబ్బాపూర్ ఓసీపీ భూభాగాన్ని కలుపుకుని గోలేటి ఓసీపీకి రూపకల్పన చేసింది. ఈ ఓసీపీలో 38.98 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు అందుబాటులో ఉండగా.. ఏడాదికి సుమారు 3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రాజెక్టు కోసం 1358.28 హెక్టార్ల భూభాగం అవసరం ఉండగా ఇందులో 594.07 హెక్టార్ల భూమి ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో ఉంది. మిగిలిన 665.914 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 90 శాతం అటవీశాఖకు చెందిన భూమి ఉండటంతో గోలేటి ఓసీపీ ఏర్పాటు సమస్య జటిలంగా మారుతోంది. అటవీ భూముల అనుమతులకు స్టేజ్– 1 అనుమతులు ఎంతో కీలకం. వీటి కోసం సింగరేణి యాజమాన్యం దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. స్టేజ్–1 అనుమతులు వస్తే దాదాపు 90 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. శ్రీరాంపూర్ ఏరియాలో 68.04 హెక్టార్లను సింగరేణి భూమిని అటవీశాఖకు అప్పగించారు. అయితే సింగరేణి అధికారుల అంచనా ప్రకారం జూన్ వరకు స్టేజ్–1 అనుమతులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా దానిపై కచ్చితత్వం లేదు. అనంతరం ఈసీ, స్టేజ్– 2 అనుమతుల ప్రక్రియ చర్యలు మొదలుకానుంది.కొనసాగుతున్న పునరావాస పనులు గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే మరోవైపు ఇతర అడ్డంకులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అవసరమైన ప్రైవేటు భూములను సేకరిస్తున్నారు. ఇప్పటికే సోనాపూర్ గ్రామంలో అవసరమైన 59 హెక్టార్ల భూమిని సేకరించి పరిహారం సైతం అందిస్తున్నారు. గోలేటి, సోనాపూర్ ప్రాంతంలో సింగరేణికి అవసరమైన మిగిలిన భూమిని సైతం త్వరలో సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక గోలేటి ఓసీపీ ఏర్పాటులో సోనాపూర్ గ్రామాన్ని తొలగించాల్సి ఉండగా.. వారి కోసం గోలేటిలోని సింగరేణి నర్సరీ సమీపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్నిరకాల అనుమతులు వచ్చేలోగా పునరావాస కేంద్రాన్ని పూర్తి చేసి సోనాపూర్ వాసులను తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్టేజ్–1 అనుమతులు వచ్చాక చేపట్టాల్సిన స్టేజ్–2 అనుమతుల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారుల అంచనా ప్రకారం జూన్ వరకు స్టేజ్–1 అనుమతులు వస్తాయని, జనవరిలోగా మిగిలిన అనుమతులు తీసుకుని ఓసీపీని ప్రారంభిస్తామని ఆశిస్తున్నారు. అనుకున్నట్లు జరిగితే జనవరిలో ఓసీపీలో ఓబీ పనులు మొదలై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది. తీవ్రంగా ప్రయత్నిస్తున్నాంగోలేటి ఓసీపీ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. స్టేజ్– 1 అనుమతులు వస్తే ఓసీపీ ఏర్పాటుకు మార్గం సులువైనట్లే.. శ్రీరాంపూర్ ఏరియాలో 68.04 హెక్టార్ల భూమిని అటవీశాఖ కోసం కేటాయించాం. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారి బదిలీ కావడంతో అనుమతుల ప్రక్రియ కొంత ఆలస్యమైంది. సోనాపూర్ ప్రజల కోసం పునరావాస కేంద్రం సిద్ధం చేస్తున్నాం. ఒకవైపు అటవీశాఖ భూమి కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రైవేటు భూమిని సేకరిస్తున్నాం. జూన్ వరకు స్టేజ్–1 అనుమతులు రావచ్చు. అవి రాగానే ఈసీతో పాటు స్టేజ్–2 అనుమతులు తీసుకుని జనవరిలో గోలేటి ఓసీపీలో ఓబీ పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు రూపొందించాం. – విజయ భాస్కర్, బెల్లంపల్లి ఏరియా జీఎం -
చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం
కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని బురదగూడ చెరువు పునరుద్ధరణ పనులను బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు కట్ట తెగి ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఓఎండీఎం నిధులు రూ.35 లక్షలు మంజూరు చేయించామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభంలోగా చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొత్రే లక్ష్మి, ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్, డీఈ తిరుపతి, ఏఈ స్వామి, నాయకులు గోపాల్, ప్రభాకర్, కార్తీక్, భరత్, బాబురావు, వెంకటేశ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడు కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,467 మంది పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 1,632 మంది, ఒకేషనల్ విభాగంలో 138 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 697 మంది, జనరల్ విభాగంలో 89 మంది ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నం నిర్వహణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు కొనసాగనున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, 90 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాపీయింగ్ తావులేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. విద్యార్థులు పరీక్ష సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉంది. పరీక్ష కేంద్రాలు ఇవే.. సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్, కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వసుంధర డిగ్రీ కళాశాల, రెబ్బెన, కౌటాల, జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతాయి. వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, పెంచికల్పేట్, తిర్యాణి, సిర్పూర్(యు), సిర్పూర్(టి) మండలాల విద్యార్థులకు దూరభారంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. -
బాలికకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ విఫలం
ఆసిఫాబాద్: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వేధింపులకు గురైన మైనర్ బాలికకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బండి భగీరథ్ అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదని, ఆ పార్టీ నాయకుల మౌనం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. కుమారుడి ఆగడాలకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు బయటపడినా నిందితుని అరెస్టు చేయడంలో కాలయాపన మండిపడ్డారు. మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బాధితురాలిని బెదిరించడం వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరని ప్రశ్నించారు. బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, నాయకురాలు మర్సోకోల సరస్వతి, రెబ్బెన పీఏసీఎస్ చెర్మన్ కార్నాథం సంజీవ్, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, నాయకులు జాబరి రవీందర్, సాలంబిన్ అహ్మద్, మామిడి లక్ష్మి, అహ్మద్, అశోక్, నిస్సార్, అన్సార్, సమద్, నారాయణ, వాజిద్, శ్రవణ్, జీవన్ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆసిఫాబాద్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా జైనూర్, కాగజ్‌నగర్, కౌటాల మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 900 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 40 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 9 చోట్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దహెగాం, లగ్గాం, ఒడ్డుగూ డ, గిర్వెల్లి, చంద్రవెల్లి, సాలిగాం, దుబ్బగూడ, వీరవెల్లి, గుడ్లబోరి, సిర్పూర్–టి, సీతానగర్, రవీంద్రనగర్ కేంద్రాలకు ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో గోనె సంచుల కొరత లేదని, స్థానిక రైతుల వద్ద ఉంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల హమాలీలపై ఆధారపడకుండా స్థానికులను వినియోగించుకోవాలన్నారు. ప్రతీ కేంద్రానికి వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధి కారులను బాధ్యులుగా నియమించాలని, జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలోని కేంద్రాలను ప్రతిరోజూ సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డీఆర్డీవో దత్తారావు, సహకార శాఖ అధికారి మోహన్, ఆర్టీవో రాంచందర్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు. -
జై హనుమాన్
జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆలయ అర్చకుడు ఒజ్జల శిరీష్‌శర్మ గణపతిపూజ, స్వస్తి పుణ్యహవచనము, నవగ్రహారాధన, రుద్రాభిషేకం, ఫల, పత్ర, పుష్పార్చన, మంగళహారతి, మహామంత్రపుష్పం, మహాదాశీర్వచనము నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తనయుడు సాయినాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు గుండా వెంకన్న, ధర్మపురి వెంకటేశ్వర్లు, పిన్నా వివేక్, రూప్నార్ రమేశ్, శ్రీనివాస్, బాబుగౌడ్, సుధాకర్, గణపతి, మురళీగౌడ్, లక్ష్మణమూర్తి, నారాయణమూర్తి పాల్గొన్నారు. –ఆసిఫాబాద్‌అర్బన్ -
పశువుల అక్రమ రవాణాపై నిఘా
జైపూర్: పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు భద్రత పటిష్టతపై మంచిర్యాల జిల్లా జైపూర్ అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో పశువుల మార్కెట్లపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం అక్రమ రవాణా, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతరం సమాచార మార్పిడి కొనసాగాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకునేందుకు పోలీస్‌శాఖ అప్రమత్తంగా పని చేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఇదేం ‘పరీక్ష’!
భవిష్యత్‌లో డాక్టర్ కావాలనే ఎన్నో ఆశలతో నీట్ రాసిన విద్యార్థులపై ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. పరీక్ష రద్దుతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు కష్టపడి పరీక్ష రాస్తే ఒక్కసారిగా రద్దు చేయడం మానసిక వేదనకు గురి చేస్తోందని వాపోయారు. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – మంచిర్యాలఅర్బన్/నిర్మల్రూరల్మానసిక ఒత్తిడి పెరుగుతుంది మళ్లీ నీట్ రాయమనడంతో మాపై మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. రెండేళ్లు కష్టపడి మొన్ననే పరీక్ష బాగా రాసాం. మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఒక్కసారిగా రద్దుచేసి మళ్లీ పరీక్ష రాయమంటే భయమేస్తోంది. హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకున్నాం. మళ్లీ అక్కడికి వెళ్లి చదవాలంటే దూర భారంతోపాటు వ్యయప్రయాసలు పడాల్సిందే. ఒక రాష్ట్రంలో లీకై తే దేశ మొత్తం మంది విద్యార్థులను బలి చేయడం అన్యాయం. – మంగ్లారపు నక్షత్ర, నిర్మల్ రద్దుతో నిరాశ ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోవాలని తల్లిదండ్రులు, నా కల. నేను రెండేళ్లుగా ఎంతో కష్టపడ్డాను. తీరా చూస్తే నీట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ కావడం అత్యంత బాధాకరం. ఇలాంటి చర్యల వల్ల మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. నీట్ పేపర్ లీకేజీ పునరావృతం కాకుండా చూడాలి. మళ్లీ పరీక్షలు రాయాలంటే కొంత మేర ఇబ్బందిగా చెప్పవచ్చు. – ప్రాణహిత, నీట్ విద్యార్థిని, మంచిర్యాలరాత్రింబవళ్లు కష్టపడ్డాను రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివాను. తెల్ల కోటు వేసుకోవాలనే ఆశతో నీట్‌కు సిద్ధమయ్యాను. ఎన్టీఏ పరీక్ష రద్దుతో నిరాశ నెలకొంది. నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పడంతో ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. తల్లిదండ్రులు కూడా ఇబ్బందికి గురయ్యారు. పేపర్ లీక్ అనేది బాధాకరం. మళ్లీ పరీక్ష రాయాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. అంతా సంతోషంగా ఉంటామని అనుకున్నా నేపథ్యంలో పరీక్షలు రద్దుకావడం బాధాకరం. – నేహ అంజుం, నీట్ విద్యార్థిని, మంచిర్యాల -
నేడు పాలిసెట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం పాలిసెట్ నిర్వహించనున్నారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1,064 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 551 మంది, బాలికలు 513 మంది ఉన్నారు. వాంకిడి మండలంలోని బెండార బాలికల డిగ్రీ కళాశాలలో 252 మంది, ఆసిఫాబాద్‌లో మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో 240 మంది, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 332 మంది, గిరిజన బాలికల గురుకుల కళాశాలలో 240 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. గంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయం కంటే నిమిషం అలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచీలు, మొబైళ్లకు అనుమతి లేదు. పరీక్ష ప్యాడ్, హెచ్‌బీ పెన్సిల్, ఎరైజర్, షార్ప్‌నర్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్, ఆధార్ కార్డు, హాల్ టికెట్ మాత్రమే వెంట తెచ్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ కోఆర్డినేటర్ కనకయ్య సూచించారు. -
గిరిజనుల అభివృద్ధికి కృషి
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో రాష్ట్ర గవర్నర్ మార్గదర్శకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కుమురంభీం, ఎడ్ల కొండు జన్మించిన గ్రామంలో సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అటవీ భూములు కలిగి ఉండి చనిపోయిన రైతుల వారసులకు హక్కులు కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు పీవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండు, గ్రామస్తులు కిష్టయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా నర్సింగ్ డే
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చీఫ్ నర్సింగ్ అధికారి విజయమ్మ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఇందుమతి, పద్మను శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ ప్రేమ, ఓర్పు, నేర్పు, సహనానికి ప్రతిరూపంగా అమ్మ నిలుస్తుందని.. అటువంటి త్యాగగుణం అణువణువునా నింపుకున్నవారే నర్సులని పేర్కొన్నారు. అతి తక్కువ వేతనాలతో సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపా రు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమయంలోనూ చాలామంది నర్సులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, స్రవంతి, ప్రసాద్, హెడ్ నర్స్ సఫియా, ఏసు కరుణ, ఎఫ్తర్ రాణి, కుసుమ కుమారి, నర్సింగ్ ఆఫీసర్స్ శ్రీదేవి, భాగ్యలక్ష్మి, లలిత, పద్మ, హేమలత, సుమిత్ర, శ్రీలక్ష్మి, ప్రణయ్, ఈసీజీ టెక్నీషియన్ మారుతి తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాల విద్యార్థులకు జిల్లా కేంద్రంలో తరగతులు కొనసాగుతున్నాయన్నారు. రూ.1000 రవాణా భత్యం చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజూ విద్యార్థులు హాజరయ్యేలా సంబంధిత ఉపాధ్యాయులు చొరవ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సచ్చిదానంద, ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, కాగజ్‌నగర్ ఏరియా ఆస్పత్రితోపాటు సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ డీఎంఈ, టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా సకాలంలో వేతనాలు అందడం లేదన్నారు. ఏజెన్సీలు కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి, ప్రతినెలా 5లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డీసీహెచ్ఎస్ అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. నాయకులు దేవ్‌రావ్, మారుతి, ప్రవీణ్, సాయి, లలిత, కళావతి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
15న దేశవ్యాప్త సమ్మె
కాగజ్‌నగర్‌రూరల్: మే 15న దేశవ్యాప్త జాతీ య గ్రామీణ సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్ తెలిపారు. మండలంలోని తుంగమడుగు గ్రామంలో ఉపాధిహామీ పని ప్రదేశాన్ని సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మే 15 జాతీయ గ్రామీణ సమ్మె, మే 20 కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పని ప్రదేశంలో కనీస వసతులు లేకపోవడంతో ఎంపీడీవో ఉజ్వల్ కుమార్‌కు సమాచారం అందించారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
ఘనంగా సామల సదాశివ జయంతి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలో సోమవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ జయంతిని తెలుగు సాహితీ సదస్సు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని సామల సదాశివ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ సదాశివ మాస్టారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌లో కనిపించే సాహిత్య కళా వైవిధ్యం సామల సదాశివ కవితల్లో కనిపిస్తుందన్నారు. ఉర్దూ, పార్శీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. సాహిత్య, చిత్రలేఖన రంగాల్లో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు సాహితీ సదస్సు అధ్యక్షుడు పెండ్యాల కిషన్‌శర్మ, క్రియాశీలక అధ్యక్షుడు కటుకం మధుకర్, ఎంఈవో ప్రభాకర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అధికారి జాడి దేవాజీ, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతికుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
కనికరం చూపండి
భార్యాభర్తలం ఇద్దరం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సొంతిల్లు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రెండో జాబితాలో మాపేరు ఉంది. పేదలమైన తమపై అధికారులు కనికరం చూపి ఇల్లు మంజూరు చేయాలి. – సుమన్జీత్కౌర్, రెబ్బెన ఇంటిని కూల్చివేయొద్దుచింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలోని సర్వే నం.174లో రెండు గుంటల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నా. 20 ఏళ్లుగా అందులోనే ఉంటున్నా. అప్పటి సర్పంచ్ ఇంటి నిర్మాణం కోసం పట్టా కూడా ఇచ్చారు. నా వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి నా ఇంటిని కూల్చివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలి. – నగేష్, డబ్బా, మం.చింతలమానెపల్లి విరాసత్ చేయండి దహెగాం మండలం కమ్మర్పల్లి శివారులోని 12.23 ఎకరాల భూమి ఉంది. తాత, తండ్రి మరణించినందున ఆ భూమిని తన పేరిట విరాసత్ చేయాలి. ప్రస్తుతం రైతుభరోసా, ఇతర పథకాలను లబ్ధి పొందలేకపోతున్నాను. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు భూమిని పరిశీలించి న్యాయం చేయాలి. – సజ్జత్ అలీఖాన్, బెజ్జూర్ -
ఎస్పీఎంలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు(ఎస్పీఎం) లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందనను కలిసి వినతిపత్రం అందించారు. ఎనిమిదేళ్లుగా పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదని తెలిపారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మిక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. -
మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హమాలీలు, వాహనాలు, గన్నీబ్యాగుల కొరతను నివారించాల ని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరయ్యారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సహకార శాఖ అధికారి మోహన్, డీఏవో వెంకటి, డీటీవో రామ్‌చందర్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్ పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతీ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దహెగాం మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన శంకరమ్మ, ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్వాడీకి చెందిన వేముల మంజుల వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన మనీష విన్నవించింది. జీవనోపాధి కోసం ఆర్థిక చేయూత అందించాలని వాంకిడి మండలం వెల్గి గ్రామానికి చెందిన బాదిరావు అర్జీ అందించాడు. కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆసిఫాబాద్ మండలం సాలెగూడకు చెందిన పరాస్, సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామానికి చెందిన అంజి వేర్వేరుగా దరఖాస్తులు అందించారు. సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్ కాలనీవాసులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
పోటీతత్వంతో విజయం
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకుంటే విజయం సాధించవచ్చని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. పట్టణంలోని డివిజన్ రిసోర్స్ సెంటర్లో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్, ఇతర ఎంట్రెన్స్ కోచింగ్ సోమవారం ముగిసింది. నాలుగేళ్లు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించడంపై కోఆర్డి నేటర్ కటుకం మధుకర్, ఉపాధ్యాయులను అభినందించారు. అంతకుముందు సామల సదాశివ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవాజీ, సాబీర్, మోహన్, రవి, శ్యాంసుందర్, త్రివేణి, శాంతికుమార్ పాల్గొన్నారు. -
‘బీజేపీ స్పందించకపోవడం దురదృష్టకరం’
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు బీజీపీ అధిష్టానం స్పందించకపోవడం దురదృష్టకరమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్నేహం పేరుతో మైనర్ బాలికకు అన్యాయం చేసినా బీజేపీ నాయకులు మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఉబెద్ బిన్ మహియా, భీంరావు, నాయకులు విజయ్‌కుమార్, తిరుపతి, కాంతారావు, సుజాయిత్ ఖాన్, దిలీప్, సంతోష్, కామేశ్, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో ఆగని పశువుల అక్రమ రవాణా ● అక్రమాల నియంత్రణ కోసం 11 చెక్‌పోస్టులు ఏర్పాటు ● తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసుశాఖ
చింతలమానెపల్లి: జిల్లాలో నూతన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమార్కులు ఏమాత్రం బెదరకుండా పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. చెక్‌పోస్టులు, తనిఖీలను లెక్కచేయకుండా దందాను కొనసాగిస్తున్నారు. ఇటీవల చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద జరిగిన ఘటన అక్రమార్కుల బరితెగింపును తెలియజేస్తోంది. జిల్లాలో స్మగ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు శాఖ పలు ప్రాంతాల్లో నూతనంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ప్రజల సహకారం, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. చింతలమానెపల్లి మండలం గూడెం, వాంకిడి, సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట, సి ర్పూర్(టి)లతోపాటు అదే మండలంలోని పెద్దబండ, చింతలమానెపల్లి మండలం డబ్బా క్రాస్ రోడ్, బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి క్రాస్‌రోడ్, కాగజ్‌నగర్ రూరల్ వంజీరి, దహెగాం మండలం కల్వాడ, జైనూర్లోని రాణి దుర్గావతి చౌక్, వాంకిడి టోల్‌ప్లాజా, ఆసిఫాబాద్ మండలం గుండి, రెబ్బెన మండలం కొమురవెల్లి, తిర్యా ణి మండలం ఎగ్గండిల వద్ద కొత్తగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఈ 11 చెక్‌పోస్టుల వద్ద తనిఖీల కోసం సిబ్బందిని నియమించారు. బరితెగించి తరలింపు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరి హద్దున ఉంది. కౌటాల పశువుల సంతకు గడ్చిరోలి జిల్లాలోని అహేరి, ఆళ్లపల్లి, చంద్రపూర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మూగజీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వాంకిడి మండలంలోని సోనా పూర్‌కు చంద్రాపూర్ జిల్లా నుంచి పశువులను తరలిస్తుంటారు. ఈక్రమంలో ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా వ్యాపారాలను అడ్డుకోవడం అక్రమార్కుల కు మింగుడు పడడం లేదు. బరి తెగిస్తూ తనిఖీలు చేసే క్రమంలో వాహనాలు ఆపకుండా వెళ్లిపోతున్నారు. అయితే పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజలు, సంస్థలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సమాచారాన్ని అధికారులకు అందించి సహకరించాలని కోరుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత దహెగాం: మండలంలోని రాంపూర్ నుంచి బెల్లంపల్లి వైపు అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని సోమవారం కర్జి సమీపంలో పట్టుకున్నామని ఎస్సై చుంచు రమేశ్ తెలిపారు. మూడు ఎద్దులను స్వాధీనం చేసుకుని ఎండీ సోహెల్, ఎండీ రహీదుద్దీన్, జహీర్‌పై కేసు నమోదు చేశామన్నారు.చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామం వద్ద సరిహద్దు చెక్‌పోస్ట్‌లో శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిండగా ఓ లారీలో నిబంధనలకు విరుద్ధంగా పశువులు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 37 ఆవులు, రెండు దూడలు స్వాధీనం చేసుకున్నారు. మరో లారీని ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకెళ్లిపోయాడు. ఎస్సై జీవన్ మార్గంలోని గ్రామాలకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో రెండో లారీని ఖర్జెల్లి గ్రామం వద్ద పట్టుకున్నారు. రెండు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి పదిమందిపై కేసు నమోదు చేశారు. -
రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తత
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా రహదారిని విస్తరించేందుకు అధికారులు సోమవారం చర్యలు ప్రారంభించారు. రహదారికి అడ్డుగా ఉన్న దుకాణాలను జేసీబీ సాయంతో తొలగించేందుకు సిద్ధమవుతుండగా, అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. అరగంట పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటన స్థలానికి డీఎస్పీ వహీదుద్దీన్ చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. పోలీసుల బందోబస్తుతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. పనులు త్వరగా ప్రారంభించాలి రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే గేటు వరకు రోడ్డుకు ఇరువైపులా రోడ్డు విస్తరణ పనలను త్వరగా చేపట్టాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. దుకాణాల ఎదుట శిథిలాలు ఉండటంతో వినియోగదారులు రాకపోవడంతో వ్యాపారం దెబ్బతింటుందని వాపోయారు. నిధుల లేమితో అర్ధంతరంగా పనులు నిలిపివేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. -
మెరుగైన వసతుల కల్పనే లక్ష్యం
రెబ్బెన: విద్యార్థినుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని గంగాపూర్ కేజీబీవీలో సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు ప్రారంభించారు. ఎమ్మె ల్యే కోవ లక్ష్మితో కలిసి అదనపు తరగతి గదుల నిర్మాణం, బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సీ ఎస్ఆర్, ఉపాధిహామీ, సర్వశిక్ష అభియాన్ నిధులతో జిల్లాలోని ప్రతీ పాఠశాలలో వసతులను కల్పి స్తున్నామని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ అడ్వా న్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. అనంతరం తుంగెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన ప్రీ ఫ్యాబ్రిక్ టాయిలెట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మ, సర్పంచులు వెంకటేశంచారి, భరద్వాజ్, బుచ్చక్క, మాదాసు రవీందర్, ఉప సర్పంచ్ వరలక్ష్మి దుర్గారావు, మాజీ సర్పంచ్ వినోద పాల్గొన్నారు. 15 రోజుల్లో ఓటరు మ్యాపింగ్ పూర్తిచేయాలి ఆసిఫాబాద్: 15 రోజుల్లో ఓటర్ల సమగ్ర సవరణ ఓటర్ల మ్యాపింగ్ 90 శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామం వదిలి వెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలను నోటీసులు జారీ చేసి తొలగించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి కలెక్టర్ కె.హరిత హాజరయ్యారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళల సహకారంతో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దా ర్లు రియాజ్ అలీ, సూర్యప్రకాశ్, కవిత, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు జమీల్ పాల్గొన్నారు. -
బడుల్లో సందడి..!
కాగజ్‌నగర్‌టౌన్: విద్యా ప్రమాణాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు విద్యాశాఖ వారోత్సవాలు నిర్వహించనుంది. రోజుకో కార్యక్రమం చొప్పున అధికారులు ఏడు రకాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. సర్కారు బడులపై విశ్వా సం పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడం, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులను భాగసామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏడు రోజులు..ఘనంగా నిర్వహించాలిఆసిఫాబాద్రూరల్: తెలంగాణ విద్యాశాఖ వారోత్సవాలను 11 నుంచి 17 వరకు ఘనంగా నిర్వహించాలని డీఈవో లలిత ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ప్రారంభానికి సిద్ధమైన రెబ్బెన కేజీబీవీ భవనం -
మొండి ‘చేయి’!
కేడర్‌కు ‘చేయి’ఇచ్చేవారేరి?స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కోసం కష్టపడుతున్న వారికోసం అధిష్టానాన్ని ఒప్పించి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కేడర్ కోరుతోంది. ఇక కొందరు తమ బయోడేటాను గాంధీ భవన్‌తో సహా ఢిల్లీ వరకు పంపించారు. అయితే తమకు పదవులు వచ్చేలా స్థానిక ప్రజాప్రతినిధులే చొరవచూపాలని కోరుతున్నారు. త్వరలో భర్తీ చేయబోయే ఉమ్మడి జిల్లా సహకార శాఖలో డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు, డివిజన్ స్థాయి మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల, గ్రామస్థాయిలో ప్రాథమిక సహకార సంఘాల్లో నియామకంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో ‘హస్తం’పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల్లో నిరాశే మిగిలింది. ఇటీవల ప్రకటించిన పదవుల్లో ఏ ఒక్కరికీ అవకాశం దక్కక అనేక మంది సీనియర్లు నారాజ్‌లో ఉన్నారు. అసంతృప్తి చెందిన నాయకులు ఇటీవల ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లకు పదవుల్లో అవకాశం ఉంటుందని ఆశించిన వారందరికీ భంగపాటే ఎదురైంది. ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్ష పదవులు ఆశించిన వారితో పాటు ఆదివాసీ, మహిళా, కార్మిక, రైతు, యువ నాయకులతో సహా సీనియర్లు ఉన్నారు. ఆశావహులు అనేకం ఉమ్మడి జిల్లాలో అనేక మంది సీనియర్లు పదవుల పై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్ ని యోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శ్యామ్‌నాయక్, ఓ యూ విద్యార్థి నాయకుడు దుర్గం భాస్కర్ ఆశావహుల్లో ఉన్నారు. నిర్మల్‌లో డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్, మంచిర్యాల జిల్లాలో కేవీ ప్రతాప్, డా.నీలకంఠేశ్వర్రావు, నూకల రమేశ్, న్యాతరి స్వా మి, తదితర యువ నాయకులు ఉన్నారు. ఆదిలా బాద్ జిల్లాలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కంది శ్రీనివా స్‌రెడ్డి, బోథ్ ఇన్చార్జి అడె గజేందర్, గండ్రాత్ సుజాత, సాజిత్‌ఖాన్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక పార్టీపై అసంతృప్తితో బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపురావు ఇటీవల కవిత ఏర్పాటు చేసిన పార్టీలో చేరగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్లో చేరారు. ఒకే ఒక్కరికి దక్కిన పోస్టు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించలేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన కొట్నాక తిరుపతి గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ (జీసీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భారత్ జోడో యాత్ర సమయంలో తిరుపతి వెంట ఉన్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి మద్దతు ఉండడంతో ఒక్కరికే నామినేటెడ్ పదవి దక్కింది. ‘మాజీ’ల ఆశలు గల్లంతు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధుల ఆశలు గల్లంతయ్యాయి. వీరిలో సీనియర్ మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాల చారీ, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, తదితర మాజీ ప్రజాప్రతినిధులకు నామినేటెడ్ పదవుల్లో ఆవకాశం రాలేదు. -
ఏళ్లుగా ‘ఉత్తి’పోతలే..!
బోర్లు, బావులే ఆధారం సాండ్‌గాం సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఏటా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుండే. నాలుగేళ్లుగా అది నిరుపయోగంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో పంటలు పండడం లేదు. బోర్లు, బావులపై ఆధారపడి సాగు చేస్తున్నాం. అధికారులు, పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. వెంటనే వినియోగంలోకి తెచ్చి అన్నదాతలకు సాగునీరందించాలి. – దామోదర్, మాజీ సర్పంచ్, సాండ్‌గాం ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎత్తిపోతల పథకం కౌటాల మండలం వీర్దండి సమీపంలోని పెన్‌గంగ నది తీరాన ఉంది. 2011లో దాదాపు 3 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో దీనిని నిర్మించారు. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. ఈ నెల 7న గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తిపోతల పథకంలోని యంత్రాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.లక్షల నష్టం వాటిల్లింది. కౌటాల: జిల్లాలో పెన్‌గంగ, వార్దా, ప్రాణహిత వంటి జీవనదులు ఉన్నా సాగుకు మాత్రం చుక్క నీరందని దుస్థితి నెలకొంది. కాలంతో సంబంధం లేకుండా నదులు నిత్యం జలకళతో ఉన్నప్పటికీ భారీ ప్రా జెక్టులు లేకపోవడంతో స్థానిక రైతులు ఇప్పటికీ 90 శాతం పంటలు కేవలం వర్షాధారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి. ఏళ్లుగా నిరుయోగంగా ఉన్న యంత్రాలకు రక్షణ కరువైంది. దుండగులు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఎత్తుకెళ్తున్నారు. పథకాలు సరే.. ఫలితమేది?ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదుల నుంచి నీటిని మళ్లించి పంటలను కాపాడటానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చే శారు. ప్రాణహిత నదిపై సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లో ఏడు ఎత్తిపోతల ప థకాలు నిర్మించారు. కౌటాల మండలంలో తుమ్మిడిహెట్టి, వీర్ధండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. గతంలో సాండ్‌గాం ఎత్తిపోతల పథకం ద్వారా వీరవెల్లి, కౌఠి, సాండ్‌గాం, పార్డీ గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందింది. అప్పట్లో రైతులు ఏటా మూడు పంటలు పండించి ఆదర్శంగా నిలిచారు. ధాన్యం కొనుగోలు కోసం సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, రైతుల మధ్య సమన్వయ లోపం కారణంగా నాలుగేళ్లుగా సాండ్‌గాం పథకం కూడా మూలనపడింది. పచ్చని పొలాలు ఇప్పుడు బీళ్లుగా మారా యి. పెద్ద ప్రాజెక్టులు అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో సాండ్‌గాం పథకం పునరుద్ధరిస్తే ఆయకట్టు రైతులకు భరోసాగా ఉంటుంది. అన్నదాతల ఆక్రందనఆరుగాలం శ్రమించే అన్నదాతకు చివరకు కన్నీటి వేదనే మిగులుతోంది. వారి ఆక్రందనను వినేవారు కరువవుతున్నారు. రేయింబవళ్లు చెమట చుక్కలు చిందించి సాగు చేసిన పంటలు, చేతికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. ప్రకృతి పగబట్టినప్పుడల్లా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు సక్రమంగా కురవకపోతే సాగు ప్ర శ్నార్థకంగా మారుతోంది. నిరుపయోగంగా ఉన్న ప థకాలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతు న్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసిన దాఖలాలు లేవు. రానున్న వర్షాకాలం సీజన్ ప్రారంభంలోగా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.ఎత్తిపోతల పథకాల వివరాలుమండలం గ్రామం ఆయకట్టు వ్యయం కౌటాల తుమ్మిడిహెట్టి 1,000 3 కౌటాల సాండ్‌గాం 5,000 29 చింతలమానెపల్లి రణవెల్లి 4,750 28 చింతలమానెపల్లి కోర్సిని 3,995 36 చింతలమానెపల్లి గూడెం 2,000 17.50 సిర్పూర్(టి) హుడ్కిలి 1,400 3 సిర్పూర్(టి) లోనవెల్లి 1,100 2 కెరమెరి సుర్జాపూర్ 1,200 3 కాగజ్‌నగర్ జంబుగ 400 1.5 -
నైపుణ్యం పెంచుకుందాం రండి..
ఆసిఫాబాద్‌రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ అంశాల్లో నైపుణ్యం పెంచుకునేందుకు వీలు గా జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో 15 రో జులపాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నా రు. ఈ నెల 11 నుంచి 25 వరకు 6 నుంచి 9వ తరగతి వివిధ ఆటలు, నృత్యాలు, సృజనాత్మకత, కళలు, జీవన నైపుణాలు నేర్పించనున్నారు. ఇందుకోసం జిల్లాలో పది పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేయగా, ఒక్కో క్యాంపులో వందమంది చొప్పున అవకాశం కల్పిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విభిన్న అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. రూ.50వేల చొప్పున నిధులుపీఎంశ్రీ పాఠశాలల్లో 15 రోజుల పాటు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందులో విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.15 చొప్పున వెచ్చించి స్నాక్స్ సమకూర్చుతారు. ప్రతీ స్కూల్లో నలుగురు వలంటీర్ల(ట్రైనర్లు)ను నియమించారు. వీరికి రూ.3 వేలు చొప్పున మొత్తం రూ.12 వేలు ఖర్చు చేస్తారు. ఇక కలర్లు, స్కెచ్‌లు, ఆట వస్తువులు, ఇతర మెటీరియర్ కోసం రూ.10 వేలు కేటాయించారు. పిల్లలకు ఇష్టమైన డ్యాన్స్, యోగా, కథ చెప్పడం, వ్యక్తిత్వ వికాసం, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు తదితర అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ఎంపికై న స్కూళ్లు ఇవే..జిల్లాలో మొత్తం 18 పీఎం పాఠశాలలు ఉండగా, ఇందులో ఎంపిక చేసిన పది పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. ఆసిఫాబాద్, సిర్పూర్(యు) మోడల్ స్కూ ళ్లు, రెబ్బెన ఉన్నత పాఠశాల, చింతలమానెపల్లి మండలంలో బాబాసాగర్ ఉన్నత పాఠశాల, దహెగాం మండలంలో చిన్న రాస్పెల్లి, కాగజ్‌నగర్ ఓల్డ్ జెడ్పీహెచ్ఎస్, కాగజ్‌నగర్ ఉన్నత పాఠశాల, పెంచికల్పేట్ ఉన్నత పాఠశాల, సిర్పూర్(టి) ఉన్నత పాఠశాల, వాంకిడి ఉన్నత పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. సమీప ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. -
ఖర్జెల్లిలో ‘పోడు’ ఉద్రిక్తత
చింతలమానెపల్లి: మండలంలోని ఖర్జెల్లి రేంజ్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో అటవీశాఖ నిర్వహిస్తున్న కందకాల తవ్వకాలను శనివారం గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఖర్జెల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఖర్జెల్లి బీట్ పరిధిలో 174ఎకరాల పోడు భూములను అటవీ అధికారులు గుర్తించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పోడు భూములుగా గుర్తించిన భూముల్లో కందకం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖర్జెల్లి గ్రామ రైతులు తవ్వకాల వద్దకు చేరుకున్నారు. అటవీ అధికారులు, పొక్లెయినర్‌ను అడ్డుకున్నారు. పొక్లెయినర్‌కు అడ్డుగా పడుకోవడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటవీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులు, అటవీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో 174 ఎకరాల భూమిలో ఒకవైపు మాత్రమే స్వాధీనం చేసుకుంటామని మిగతా భూమిలో రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది. షరతులతో రైతులకు మిగతా భూమిని పంచనున్నట్లు ఒప్పందం కుదిరింది. అటవీ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది, ఖర్జెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. -
నూతన నియామకం
రెబ్బెన: గోలేటి స్పో ర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన దీకొండ సంజీవ్‌కుమార్‌ను ప్రకటించినట్లు రీజి యన్ చైర్పర్సన్ లయన్ బొమ్మ బాపురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. క్లబ్ ఆధ్వర్యంలో పేదల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన రీజియన్ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో క్లబ్‌కు మరింత మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. -
అమ్మ అంటే భరోసా
ఆసిఫాబాద్‌అర్బన్: సమాజానికి పరిచయం చేసిన అమ్మే నాకు తొలి గురువు. బిడ్డల భవిష్యత్ కోసం నిత్యం శ్రమిస్తూ వాళ్ల ఆనందంలోనే తమ సంతోషాన్ని చూసుకునే అమ్మ గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం. సృష్టిలో అమ్మే మనకు తొలిగురువు. అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటాను. అమ్మ అనే పిలుపులో ఎంతో మాధుర్యం ఉంటుంది. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మ చూపించిన మార్గంలో వెళ్లినందునే. అమ్మ అంటే భరోసా, ఓ ధైర్యం. – సిద్దంశెట్టి సుహాసి, బీజేవైఎం రాష్ట్ర నాయకురాలు -
గాలి దుమారం.. రైతులు ఆగం
దహెగాం: అకాల వర్షాలతో ధాన్యం రైతులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో ఽఆరబెట్టిన ధాన్యం కుప్పలుగా చేసి టార్పాలిన్లు కప్పడాని కి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి దుమారంతోపాటు చిరు జల్లులు కురిశాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందునా ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు. -
అమ్మ దయతోనే ఈ స్థాయికి..
ఆసిఫాబాద్‌అర్బన్: మంచి సమాజ నిర్మాణానికి, తన బిడ్డలను సరైన దారిలో నడిపిస్తూ అహర్నిశలు వారి భవిష్యత్ కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్న అమ్మకు వందనం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా అమ్మ దయే. మా అమ్మ కూలీ పనులు చేసుకుంటూ నేను ఎదగడానికి మూల కారణమైంది. ఇప్పటికీ అమ్మ సలహాలు తీసుకుంటాను. అమ్మ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అమ్మ ఏమి సూచించినా అది మన విజయానికి ఒక మెట్టే అవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం కృషి చేయాలి. – ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షురాలు -
అమ్మే సర్వస్వం
కౌటాల: మా నాన్న సంఘ కిరణ్‌కుమార్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తారు. నాన్న ఎప్పుడు పనిలో బిజీబిజీగా ఉంటారు. అన్ని పనులు అమ్మే చేస్తూ ఉంటుంది. నాకు మా చెల్లికి హోమ్ వర్క్‌లో అమ్మ సాయం చేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియజేస్తుంది. పదో తరగతి పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావడానికి అమ్మే కారణం. నేను వార్షిక పరీక్షలకు ప్రిపేర్ కావడానికి అన్నీ సిద్ధం చేసింది. నేను భయం లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అమ్మే నేర్పింది. – తల్లి గౌతమి, చెల్లి రిత్వికవర్మతో నిఖిత వర్మ, కౌటాల -
అమ్మ ప్రేమ లేనోళ్లే నిజమైన పేదోళ్లు
ఆసిఫాబాద్: అమ్మ లేకుంటే జీవితమే లేదు. చిన్నప్పుడే నాన్న పోవడంతో అమ్మే అన్నీ తానై పోషించింది. ఇంట్లో విస్తరాకులు కుట్టి కుటుంబాన్ని పోషించింది. అమ్మ చేతి వంట ఏదైనా రుచికరమే. అమ్మ తన ఆకలిని మరిచి పిల్లల కడుపు నింపుతుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని పెంచే అమ్మ బిడ్డలకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ లేని వారే నిజమైన పేదవాళ్లు. అమ్మ త్యాగాలు వర్ణించలేనివి. అమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. – ఇరుకుల్ల మంగ, ఏఎంసీ చైర్మన్ -
ఇళ్లల్లో పని చేసి చదివించింది
కౌటాల: మా ఊరిలో పనులు లేక మా తల్లి దండ్రులు మహారాష్ట్రకు వెళ్లి 20ఏళ్లు అక్కడే పని చేశా రు. నాన్న శంకర్ తాపీమేసీ్త్ర. నాన్న సంపాదన సరిపోక అమ్మ రోజూ ఐదా రు ఇళ్లలో పని చేసి ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం నేను ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న. మా పెద్ద తమ్ముడు రైల్వేలో, మా రెండో తమ్ముడు ఫార్మా కంపెనీలో, మా చిన్న తమ్ముడు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. మా అందరికీ వివాహాలు చేసిన మా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు. – తల్లి తారాబాయితో జ్యోతి, యాపలగూడ, కౌటాల -
ఎస్టీపీపీ సందర్శన
జైపూర్: జైపూర్ ఎస్టీపీపీని శనివారం సింగరేణి బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ నల్ల పూరి రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరం రమేశ్ సందర్శించారు. ఇటీవల ఎస్టీపీపీ బ్రాంచ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన లైజన్ ఆఫీసర్‌గా ఎన్నికై న వీరబ్రహ్మం (డీజీఎం)ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్టీపీపీ జీఎం నర్సింహారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్టీపీపీలో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ఆఫీస్ గది ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎస్వోటూ జీఎం శంకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకుర్మోహన్సింగ్, బీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ రాకేశ్, ట్రెజరర్ అరుణ, సభ్యులు రవిచంద్ర, శ్యామల, నిసరొద్దీన్, రాజు, రాజేశ్, నరేశ్ తదితరులున్నారు. -
బాల్య వివాహం అడ్డగింత
వాంకిడి: మండలంలోని గోయెగాం గ్రామంలో నిర్వహిస్తున్న బాల్య వివాహాన్ని శనివా రం అధికారులు అడ్డుకున్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌కు అందిన సమాచారం మేరకు బాలల రక్ష భవన్, పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు బాల్య వి వాహాలతో కలిగే అనర్థాలు, చట్ట పరమైన చర్యల గురించి వివరించారు. బాలికను సఖీ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్ తెలి పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగినచర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఏసీడీపీవో ఉమా ఫాతిమా, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ దుర్గం దీపక్, కేస్ వర్కర్లు వెంకటేశ్వర్లు, సుకన్య ఉన్నారు. -
అమ్మను మించిన దైవం లేదు
ఆసిఫాబాద్: సృష్టిలో అమ్మ ను మించిన దైవం లేదు. అమ్మ సృష్టికి మూలం. నిస్వార్థ ప్రేమకు ప్రతీక. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర వెలకట్టలేనిది. దేవుడు అన్ని చోట్ల ఉండలేకనే అమ్మను సృష్టించాడు. ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి. నా ఉన్నతిలో మా అమ్మ భీమ్‌బాయి పాత్ర ఎంతో కీలకం. చిన్నప్పుడు అమ్మ చేతి వంట ఇప్పటికీ మరచిపోలేనిది. నాకు అమ్మానాన్నలే స్ఫూర్తి. వారి త్యాగాలను స్మరించుకోవాలి. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో తల్లుల ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కృషి చేయాల్సిన అవసరముంది. – కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆసిఫాబాద్ -
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య తెలిపారు. శనివారం ఆర్కే–7 గనిని వారు సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని సర్ఫేస్ డ్యూటీలో పెట్టాలని సీఎంవో సిఫారసు లేఖ ఇస్తున్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్మికుల సమస్యలను గని మేనేజర్ తిరుపతికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏరియా సెక్రటరీ బాజీసైదా, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, పిట్ సెక్రటరీ మారుపల్లి సారయ్య, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సదానందం, నాయకులు బానేశ్, యాదగిరి తదితరులున్నారు. -
హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలి
రెబ్బెన: సింగరేణిలో పనిచేస్తున్న బీసీ, ఓబీసీ ఉద్యోగుల హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేయాలని బీసీ, ఓబీసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లపు రమేశ్, ఏరియా ఇన్చార్జి పేరం రమేశ్ సూ చించారు. శనివారం బెల్లంపల్లి ఏరియా బీసీ, ఓబీ సీ ముఖ్య నాయకుల సమన్వయ సమావేశాన్ని గో లేటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాలో బీసీ, ఓబీసీ కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమానికి అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నా రు. బీసీ, ఓబీసీ ఉద్యోగులంతా ఐక్యంగా హక్కుల కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ భవిష్యత్ కా ర్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఏరియా లైజ న్ అధికారి ఎం.రవికుమార్, కార్యదర్శి పేరం శ్రీని వాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మారం శ్రీనివాస్, మాసాడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. జీఎంకు సన్మానంబెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న విజయబాస్కర్‌రెడ్డి ఈ నెలాఖరుతో రిటైర్డ్ అవుతున్నందున గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో బీసీ, ఓబీసీ అసోసియేషన్ నాయకులు అతడిని కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ, ఓబీసీ లైజన్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎం.రవికుమార్‌ను జీఎం చేతుల మీదుగా సన్మానించారు. డీవైపీఎం రాజేశ్వర్‌రావు, కమిటీ సభ్యులు స్వామి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్: వరి ధ్యానం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోళ్లు, రైతు నమోదు అంశాలపై కార్యదర్శి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రైతు నమోదు ప్రక్రియ అన్ని జిల్లాల్లో వందశాతం పూర్తయ్యేలా చూడాలని సూచించారు. జనగణన–2027లో భాగంగా ఈ నెల 10నుంచి ఇళ్లగణన చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులున్నారని, వీరంతా స్వీయగణన చేసుకోవాలని ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11నుంచి నిర్వహించనున్న విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతు నమోదు ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యా వారోత్సవాలు, ఇళ్ల గణన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
గౌడ సంఘం అభివృద్ధికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: గౌడ సంఘం అభివృద్ధికి కృషి చే స్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివా రం కాగజ్‌నగర్ మండలంలోని ఈజ్గాం గ్రామంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గౌ డ కులస్తుల ఐక్యత, సామాజిక అభివృద్ధికి కమ్యూనిటీ హాల్ ఎంతగానో ఉపయోగపడనుందని తెలి పారు. ఎమ్మెల్సీని గౌడ కులస్తులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ సంగీత, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కొండ్ర జగ్గాగౌడ్, ఈజ్గాం అధ్యక్షుడు తిరుపతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజంకౌటాల: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. మండలంలోని తాటిపల్లి గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివా రం ముగిశాయి. ఈ సందర్భంగా గెలుపొందిన తా టిపల్లి జట్టుకు రూ.25వేల నగదు, షీల్డ్, రెండో బ హుమతి వీరవెల్లి జట్టుకు రూ.13 వేల నగదుతో పా టు బహుమతులు అందించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహించడానికి సహకరిస్తామని పేర్కొన్నారు. యువ త చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తాటిపల్లి సర్పంచ్ బడగే సంతోష్, డీసీసీ జి ల్లా ఉపాధ్యక్షుడు దుర్గం జానకీరావు, మండలాధ్యక్షుడు నికాడే గంగారాం తదితరులున్నారు. -
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు
కాగజ్‌నగర్‌టౌన్: అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ బోరిగాం శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. కాగజ్‌నగర్‌కు మొదట విడతలో 630 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చేశామని, మిగిలిన అర్హులకు మరో విడతలో అందిస్తామని తెలిపారు. పట్టణంలో రహదారి విస్తరణ, డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రహదారుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుమురంభీం ప్రాజెక్టు ఆయకట్ట పనులు సీడబ్ల్యూసీ నివేదిక రాగానే ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. పట్టణానికి రూ.18 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం చేపడితే ఈ ప్రాంతానికి సాగునీరు అంది భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సమష్టిగా కృషి చేద్దామని తెలిపారు. పోడు భూములు సాగు చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్న సమస్యను పరిష్కరించాలని, కార్మికుల సంక్షేమం కోసం ఎస్పీఎం యజమాన్యం దృష్టి సారించాలని కోరారు. అనంతరం 288 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, గృహనిర్మాణ శాఖ పీడీ టీఎస్ ప్రకాశ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
పత్తి సాగుకే జై..!
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో వానాకాలం సాగు హడావుడి మొదలైంది. యాసంగి పంటలు కోత దశలో ఉండగా, ఇప్పటికే అన్నదాతలు ఖరీఫ్ పంటల కోసం చేలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ 2026 ఖరీఫ్ సాగు ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారు 4.52 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందులో పత్తి పంటకు రైతులు పెద్దపీట వేస్తుండగా, తర్వాత స్థానంలో వరి సాగు ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతూ.. ఎరువుల కృత్రిమ కొరతకు తావులేకుండా ముందస్తుగా స్టాక్ సిద్ధం చేస్తున్నారు. మూడో వంతు దూదిపంట ఈ వానాకాలం సీజన్లో పంట సాగు అంచనాలు వేసిన అధికారులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. జిల్లాలోని రైతులు అధికంగా వర్షాధారంగా పత్తి పంటపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది సైతం అధికంగా పత్తి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. 4,52,202 ఎకరాల సాగు భూమిలో దాదాపు మూడోవంతు పత్తి సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఉన్న ప్రాజెక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు వర్షాధార పంటలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం విస్తీర్ణంలో అగ్రభాగం పత్తికే దక్కింది. పత్తి పంట 3,70,919 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. 7,40,726 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని పేర్కొన్నారు. అలాగే 42,228 ఎకరాల్లో వరి సాగుకు 11,750 క్వింటాళ్ల విత్తనాలు, 20,817 ఎకరాల్లో కంది పంట సాగుకు 800 క్వింటాళ్ల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. సోయాబీన్ 1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాల్లో సాగుకు అంచనా వేయగా, మరో 11,254 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎరువుల అవసరం ఇలా.. జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత లేకుండా అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వానా కాలం సీజన్లో సాధారణ సాగుకు మించి పంటలు సాగవుతాయని అంచనాలు రూపొందించిన అధికారులు, అవసరమయ్యే ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. యూరియా 60,081 మెట్రిక్ టన్నులు, డీఏపీ 40,000 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 10,013 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 20,027 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20,027 మెట్రిక్ టన్నులు అవసరమని నివేదించారు. అలాగే జిల్లాకు కావాల్సిన ఇతర ఎరువుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదించారు. -
● జిల్లాలో రెట్టింపు అయిన ధరలు ● ట్రాక్టర్ లోడ్ రూ.4వేల పైనే.. ● ఆన్లైన్ విధానంతో లబ్ధిదారులకు కష్టాలు
వాంకిడి: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ పేరుతో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుంది. యా ప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇసుక రీచ్‌ల వద్ద ఉండే అధికారి పత్రాలు పరిశీలించి ట్రాక్టర్లకు అనుమతులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం స మకూరుతున్నా క్షేత్రస్థాయిలో ఇసుక ధరలు అ మాంతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ము ఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై నేరుగా ప్ర భావం పడుతోంది. రూ.2వేల ట్రాక్టర్ లోడు ప్రస్తు తం రెట్టింపు అయ్యింది. దూరానికి అనుగుణంగా అదనపు చార్జీలు సైతం వసూలు చేస్తున్నారు. మొదటి విడతలో 8,625 ఇళ్లు.. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం జిల్లాలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 8,625 గృహాలు మంజూరు చేసింది. బేస్మెంట్ దశలో 3,392 ఇళ్లు ఉండగా, గోడ దశలో 1,558, స్లాబ్ వేసినవి 2,018, ఫినిషింగ్ దశలో 190 ఇళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం విడతలవారీగా రూ.5 లక్షలు చెల్లిస్తోంది. అయితే చాలామంది చేతిలో డబ్బులు లేక అప్పులు తీసుకుంటున్నారు. రాడ్లు, సిమెంట్, ఇటుకలు, తదితర సామగ్రి రేట్లు గణనీయంగా పెరిగాయి. స్లాబ్ కోసం వాడే లిఫ్ట్‌లు, మిల్లర్లు, మేసీ్త్రలు కూడా భారీగా రేట్లు పెంచేశారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ అమలు తర్వాత ఇసుక ధరలు అమాంతం పెరిగి పేదలపై మరింత ఆర్థిక భారం పడుతోంది. మన ఇసుక వాహనం యాప్ రాకముందు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పట్లో తనిఖీలు నిర్వహించి ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కూడా రూ.1500 ఉన్న ట్రాక్టర్ లోడ్ రూ.2 వేలకు చేరింది. ఆన్లైన్ విధానం అమలు తర్వాత ఏకంగా రూ.4వేలకు చేరింది. 23 ఇసుక రీచ్‌లు భవన నిర్మాణ రంగంలో ఇసుక ప్రధానమైనది. గ్రామాల సమీపంలోనే రీచ్‌లు ఉన్నా భారీగా ధర వెచ్చించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ఇసుక వాహనం యాప్ వచ్చాక ఆర్థిక భారం మరింతగా పెరిగిందని ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్, పెంచికల్పేట్, రెబ్బెన, సిర్పూర్(టి) మండలాల్లో ఇసుక లభ్యతను గుర్తించి అధికారులు యాప్‌లో వివరాలు పొందుపరిచారు. 8 మండలాల్లో 23 ఇసుక రీచ్‌లు గుర్తించారు. యాప్‌లో ఒక ట్రాక్టర్ ఇసుక లోడ్ కోసం ఇందిరమ్మ ఇల్లు అయితే రూ.114.97, ఇతర గృహ నిర్మాణాలకు అయితే రూ.774.96 యాప్‌లోనే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ట్రాక్టర్ యజమానులు మాత్రం ఇతరులకు తీసుకునే రేట్లే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్ద వసూలు చేస్తున్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
● అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చే యాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం డీఐఈవో రాందాస్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ ఈ నెల 13 నుంచి 21 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఫస్టియర్‌లో 1,770 మంది, సెకండియర్‌లో 697 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. -
రోడ్డున పడిన ‘సంతలు’
కౌటాల: గ్రామీణ ప్రజల పాలిట ‘మినీ మార్కెట్లు’గా పేరొందిన వారసంతలు స్థానిక పంచాయతీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వసతుల కల్పనలో మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. పల్లెలు, మండల కేంద్రాల్లో ప్రాముఖ్యత ఉన్న ఈ సంతలపై సామాన్యులు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు ఆధారపడుతుంటారు. అయితే, సరైన స్థలాలు, షెడ్లు లేకపోవడంతో వ్యాపారులు రోడ్లకిరువైపులా తాత్కాలిక డేరాలు వేసుకుని క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా.. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. పైగా రోడ్ల పక్కనే దుకాణాలు నిర్వహిస్తుండటంతో సంత రోజున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సంతలే ఆధారం..జిల్లాలోని 15 మండల కేంద్రాలతోపాటు పలు గ్రా మాల్లో సైతం వారసంతలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు వారసంతలకు వస్తుంటారు. చాలాచోట్ల నిత్యం కూరగాయలు దొరకవు. సంతలకు వచ్చి వారానికి సరిపడా కూరగాయలు, వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సంతల నిర్వహణ ద్వారా పంచాయతీలకు రూ.లక్షల్లో ఆదా యం వస్తోంది. ఏటా నిర్వహించే వేలంలో ఎక్కువ పోటీ పడిన వారికి కేటాయిస్తారు. కానీ ఎక్కడా కూడా సంతల్లో ప్రత్యేక షెడ్లు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పార్కింగ్ లేవు. అధికారుల పర్యవేక్షణ కొరవడి కౌటాల, రవీంద్రనగర్, సిర్పూర్(టి), బెజ్జూర్ మండలాల్లో వారసంత స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. స్థలం సరిపోక కొందరు వ్యాపారులు రోడ్ల పక్కన, దుకాణాల ముందు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. కొందరు దుకాణ యజమానులు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు సంతను దక్కించుకున్న వారు కూడా వసూళ్లు చేసుకుంటున్నారు. వసతులు లేక..మార్చిలో జిల్లాలోని అన్ని వారసంతల నిర్వహణకు అధికారులు వేలం పాటలు నిర్వహించారు. పన్నుల ద్వారా, పన్నేతర ఆదాయంగా వారసంతల ద్వారా జిల్లాకు సుమారు రూ.7 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. వానాకాలంలో వానకు తడుస్తూ, ఎండాకాలంలో ఎండకు ఎండుతూ సరుకులు కొనాల్సిన దుస్థితి నెలకొంది. మహిళా వ్యాపారులు కనీసం మరుగుదొడ్లు లేక ఊపిరి బిగపట్టుకొని ఉంటున్నారు. వారాంతపు సంతలు జరిగే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నిధులు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. కానీ పంచాయతీ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో పనులు చేపట్టడం లేదు. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడటంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు. వారసంతల్లో సౌకర్యాల కల్పనపై జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిని సంప్రదించగా ఆయన స్పందించలేదు. సంతల్లోనే కొంటాం ప్రతీ వారం నిర్వహించే వారసంతల్లోనే కూరగాయలు, పప్పులు, నూనెలు, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తాం. కౌటాల వారసంతకు కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, సిర్పూర్(టి) మండలాల నుంచి వ్యాపారులు, వినియోగదారులు వస్తున్నారు. సౌకర్యాలు లేక నేలపైనే కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్నారు. లక్షల్లో ఆదాయం వస్తున్నా పట్టించుకోవడం లేదు. – శ్రీలత, యాపలగూడ స్థలం సరిపోవడం లేదు కౌటాల వారసంతలో పశువులు, వీధికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వారసంత స్థలం ఆక్రమణకు గురికావడంతో స్థలం సరిపోవడం లేదు. చిరు వ్యాపారులు రోడ్డుపైనే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతీ సోమవారం కౌటాలలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నిధులను వినియోగించి అధికారులు సౌకర్యాలు కల్పించాలి. – శంకర్, కౌటాల వేలం ద్వారా ఆదాయం ఇలా.. -
చేతికొస్తున్న గెల
ఈ ఫొటోలోని రైతు పేరు మల్లయ్య. సిర్పూర్(టి) మండలం డబ్బా గ్రామంలో నాలుగేళ్ల క్రితం 8 ఎకరాల్లో ఆయిల్‌పాం మొక్కలు నాటాడు. ఈ ఏడాది నుంచి గెలల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో గెల 15– 20 కిలోల వరకు ఉందని రైతు వెల్లడించారు. ఇలా.. రైతులు నాలుగేళ్లపాటు ఓపికతో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే దాదాపు 25 ఏళ్లపాటు దిగుబడి పొందే అవకాశం ఉంది. కాగజ్‌నగర్‌టౌన్: వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. సంప్రదాయ పంటల్లో పెరుగుతున్న పెట్టుబడి, నష్టాలను తప్పించుకునేందుకు ఆయిల్‌పాం సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం నాటిన మొ క్కలు ప్రస్తుతం దిగుబడి ఇస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఎన్ఎంఈఓ– ఓపీ పథకం కింద 90 శాతం సబ్సిడీతో మొక్కలు, యంత్రాలు ఇస్తుండడంతో జిల్లాలో మరింత మంది తోటల సాగుకు ముందుకొస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు ఏటా లక్ష్యం మేర మొక్కలు నాటేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం 1,334 ఎకరాల్లో సాగు ఆయిల్‌పాం తోటలు సాగువుతున్నాయి. ఇందులో అత్యధికంగా దహెగాం మండలంలో 364 ఎకరాలు, కాగజ్‌నగర్‌లో 316, రెబ్బెనలో 163 ఎకరాల్లో తోటలు ఉండగా, అత్యల్పంగా కెరమెరిలో 14 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏజెన్సీలో తిర్యాణి మండలంలో ఇప్పటివరకు తోటలు లేవు. ఉద్యాన శాఖ నుంచి రాయితీలుఆయిల్పాం సాగు చేసే రైతుకు నీటి సౌకర్యం ఉండాలి. అంతేకాకుండా మొక్క రూ.193 ఉండగా ప్ర భుత్వం రూ.173 రాయితీ కల్పిస్తుంది. దీంతో రైతు కు మొక్కకు కేవలం రూ. 20 చెల్లిస్తే లభిస్తుంది. ఒక ఎకరంలో 9 మీటర్ల అంతరంతో 57 మొక్కలు నా టాలి. మొక్కల సంరక్షణ, నిర్వహణకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లపాటు రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఆ సమయంలో అంతర పంటలు సైతం సాగు చేసుకోవచ్చు. మొక్క నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక గెల 15 కి లోల నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. టన్నుకు ప్రస్తుతం రూ.23,501 ఽగిట్టుబాటు ధర ఉంది. అలాగే రైతులకు టీజీఎంఐపీ ద్వారా బిందుసేద్యం పరికరాలను సైతం రాయితీపై అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ రైతులైతే 90 శాతం, చిన్న సన్నకారు, బీసీ రైతులకు 80శాతం, ఇతరులకు 70శాతం రాయితీ కల్పిస్తున్నారు. అన్ని వర్గాల రైతులు 65శాతం రాయితీపై 25 పైపులు, 5 స్ప్రింకర్లు పొందవచ్చు. మార్కెటింగ్ సులువుమరోవైపు వరి, పత్తికి మద్దతు ధర దక్కకపోవడంతోపాటు చీడపీడల బెడద, పంట దిగుబడి తగ్గడంతో ఆరుకాలం శ్రమించినా లాభం ఉండటం లేదు. కానీ ఆయిల్‌పాం మార్కెటింగ్ సులువుగా ఉంటుంది. రైతులకు టన్నుకు రూ.23,500 చెల్లిస్తూ కంపెనీ ప్రతినిధులే పంటను తీసుకెళ్తారు. ట్రాన్స్‌పోర్టు భారం కూడా ఉండదు. అంతర పంటలైన పత్తి, పప్పు దినుసుల సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం సైతం ఉంటుంది. ఇక్కడి నేలలు అనుకూలం ఆయిల్‌పాం సాగు పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కాగజ్‌నగర్ డివిజన్లో 950 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాలు గేళ్ల క్రితం మొక్కలు నాటిన రైతులకు గెలలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటంతో కేవలం రూ.20 చెల్లించి మొక్కలు తీసుకోవచ్చు. ఇక్కడి నేలలు, భూసారం ఆయిల్‌పాం సాగుకు ఎంతో అనుకూలం. నీటి సౌకర్యం ఉన్న రైతులు ఆయిల్‌పాం సాగు చేయాలంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలి. – సుప్రజ, కాగజ్‌నగర్ డివిజన్ హార్టికల్చర్ అధికారి మండలాల వారీగా వివరాలుమండలం సాగు(ఎకరాల్లో) ఆసిఫాబాద్ 54.48 రెబ్బెన 163.28 తిర్యాణి 0.00 వాంకిడి 29.10 కాగజ్‌నగర్ 316.98 కౌటాల 22.30 సిర్పూర్(టి) 45.80 బెజ్జూర్ 18.55 చింతలమానెపల్లి 39.03 దహెగాం 364.00 పెంచికల్పేట్ 127.88 జైనూర్ 55.18 కెరమెరి 14.63 లింగాపూర్ 64.78 సిర్పూర్(యు) 18.73 మొత్తం 1,334.68 -
అమాత్యా.. ఆలకించండి
కౌటాల: ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటనశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి రానున్నారు. మంత్రి పర్యటనపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. బరాజ్ నిర్మాణంలో సందిగ్ధతను తొలగించడంతోపాటు జిల్లాలో పర్యాటక అభివృద్ధి, సాగునీటి, ఇతర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన చాలామందికి సరైన పరిహారం అందలేదు. ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని, భూమికి బదులుగా భూమి అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ‘ఉత్తి’పోతలే..చుట్టూ జీవ నదులున్నా జిల్లా రైతంగానికి సాగునీరందని దుస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ప్రాణహిత ప్రాజెక్టు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రాణహిత, వార్దా, వైన్‌గంగ నదుల ఒడ్డున గతంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆయకట్టు భూములు బీడుగా ఉంటున్నాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తెస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. అలాగే ఇతర ప్రాజెక్టులు, చెరువుల కాలువు అధ్వానంగా మారాయి. ఏళ్లు పూడిక తీయకపోవడంతో ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. పర్యాటకంపై పట్టింపేది..?జిల్లాలో జీవనదులతోపాటు 2,44,540 హెక్టార్లలో అందమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ముఖ్యంగా కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని దట్టమైన అడవులు, పెద్దవాగు, ప్రాణహిత, వార్దా నదుల పరీవాహక ప్రాంతాలు వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నాయి. పెద్దపులులతోపాటు ఇతర వన్యప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. ప్రాణహిత పరీవాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా గుర్తించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి దొరుకుతుంది. పర్యాటక శాఖ మంత్రి దృష్టి సారించి జిల్లాను ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్ వేతనాలు చె ల్లించాలని డిమాండ్ చేస్తూ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఎస్సీ, బీసీ పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులకు 14 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు సత్యశ్రీ, రేవతి, కవిత, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి
రెబ్బెన: ఉచిత కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కలెక్టర్ కె.హరిత తెలిపారు. మండల కేంద్రంలో మహిళా సాధికారత సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ఉచిత శిక్షణ శిబిరాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతులు, మహిళలు ఖాళీగా ఉంటూ ఇంటికే పరిమితం కాకుండా నచ్చి న స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలన్నారు. మహిళలు వస్త్రధారణపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అందుకు అనుగుణంగా ఎంబ్రాయిడరీకి సైతం డిమాండ్ ఉందని తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు మరో నలుగురికి ఉపాధి కల్పించాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సొసై టీ అధ్యక్షురాలు కుసుమ విజయ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌గౌడ్, దుర్గం రాజేష్, అడప విమల పాల్గొన్నారు. ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలిఆసిఫాబాద్: జనగణనలో భాగంగా ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలని జనగణన రాష్ట్ర సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ముఖ్య ప్రణాళిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 10లోగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మెటీరియల్ కిట్లు, గుర్తింపు కార్డులు అందించాలన్నారు. శిక్షణ బ్యాచ్‌ల హాజరు, సీఎంఎంఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లను నియమించి, 1,994 ఇళ్ల జాబితా బ్లాక్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. సిబ్బందికి అన్ని స్థాయిల్లో శిక్షణ పూర్తి చేశామన్నారు. సమావేశంలో జిల్లా సీఈవో వాసుదేవరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7మేమింతే.. మారమంతే..! ఓ వైపు ప్రాణాలు పోతున్నా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు. ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. 9లోu వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా కాస్త తగ్గుతుంది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. నర్సరీల్లో మొక్కలు సిద్ధం వనమహోత్సవం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి, రెండో వారంలో మొక్కలు నాటనున్నారు. 9లోu శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026 -
విద్యతోనే సామాజిక అవగాహన
వాంకిడి: విద్యతోనే సామాజిక అవగాహన పెరుగుతుందని డీఆర్డీవో దత్తారావు అన్నా రు. వాంకిడి మండలం ఖమానలోని రైతువేదికలో గురువారం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధి కారత కేంద్రం ఆధ్వర్యంలో కిశోర బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాలికలు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కిశోర బాలికల కోసం ప్రత్యేక సమ్మర్ క్యాలెండర్ తీసుకువచ్చామని తెలిపారు. అంతకుముందు బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా, ప్రేమ పేరుతో మోసాలు, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, రక్తహీనతకు కారణాలు తదితర అంశాలపై మహిళా సాధి కారత కేంద్రం డీఎంసీ శారద, జెండర్ స్పెషలిస్ట్ రాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, ఏపీఎం ధన్‌రాజ్, సీసీలు భీంరావు, రమేశ్, వీవోలు ఆనంద్‌రావు, మోహన్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. -
జీరో బిల్లుకు చిల్లు..!
రెబ్బెన: అధిక ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నుంచి ఎండలు పెరగగా, ఏప్రిల్ నెలాఖరు నాటికి 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇక మే ప్రారంభంలోనే 45 డిగ్రీ దాటడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలోనూ కుదురుగా ఉండలేని పరిిస్థితి. చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లపై ఆధారపడటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. దీంతో చాలామంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. రెండు నెలల్లోనే జీరో బిల్లు లబ్ధిదారుల సంఖ్య వేలల్లో తగ్గిపోయారు. ఇక మేలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 200 యూనిట్లు దాటితే..రాష్ట్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. గృహ అవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఆ పరిధిలోపు కరెంట్ వాడితే బిల్లు కట్టాల్సి ఉండదు. నెలలో 200 యూనిట్లకు మించి ఒక యూనిట్ అదనంగా వినియోగించినా పూర్తిస్థాయిలో బిల్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఎండల తీవ్రతను తట్టుకోలేక ఇళ్లలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఉక్కపోతకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లను అధికంగా వాడుతుండటంతో 200 యూనిట్ల పరిధి దాటుతోంది. గృహజ్యోతి వినియోగదారులు జీరో బిల్లుకు దూరమవుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొదటి కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.19 లక్షలు ఉన్నాయి. మార్చిలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 81,253 ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన 80,025 మంది జీరో బిల్లు పొందారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండలకు విద్యుత్ వాడకం పెరిగి 3080 మంది జీరో బిల్లుకు దూరయ్యారు. ఏప్రిల్‌లో గృహజ్యోతి లబ్ధిదారులు 81,812 మంది ఉండగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన లబ్ధిదారుల సంఖ్య 76,945కు పడిపోయింది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో 3,080 మంది లబ్ధిదారులు గృహజ్యోతి సబ్సిడీకి దూరమయ్యారు. మే మొదటి వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటాయి. ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. విద్యుత్ కోతలు సైతం విధించడంతో కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గింది. అయితే మళ్లీ ఎండలు పెరిగితే కరెంట్ వాడకం గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. మే నెలలోనూ గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.పొదుపు చేస్తేనే ఫలితం -
గూడు చెదిరింది..!
దెబ్బతిన్న దుర్గం శంకర్ ఇల్లు ధ్వంసమైన అల్లూరి నాందేవ్ ఇల్లు బామానగర్లో గాలివానకు రేకులు లేచిపోయిన ఇంటి వద్ద బాధితుడుదహెగాం మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి పలువురు ఇళ్ల పైకప్పులు లేచిపోవడంతో నిల్వ సరుకులు, వస్తువులు, దుస్తులు తడిసిపోయాయి. ఇనుప రేకులు ఎగిరిపోయి విద్యుత్ స్తంభాలపై చిక్కుకున్నాయి. ప్రాణపాయం తప్పినా భారీగా ఆస్తినష్టం జరిగింది. దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, ఒడ్డుగూడ, బ్రహ్మన్చిచ్యాల, బామానగర్, చినరాస్పెల్లి, కుంచవెల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బామానగర్ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మణ్ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. అలాగే అల్లూరి నాందేవ్, దుర్గం శంకర్, దూట అంకులు, చింతపూడి అర్జయ్య, ధర్మయ్య ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. గ్రామంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు రాత్రంతా అంధకారంలోనే ఉన్నారు. మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో ఏఈ రవీందర్ బుధవారం తెలిపారు. ఒడ్డుగూడ సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెవెన్యూ అధికారులు ఆస్తి నష్టం వివరాలను సేకరించారు. అకాల వర్షంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. – దహెగాం -
సీఎం పర్యటన రద్దు!
ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన రద్దయింది. గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, జిల్లా యంత్రాంగం తుమ్మిడిహెట్టి వద్ద ఏర్పాట్లు సైతం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రాఫిక్, భద్రత, జన సమూహ నియంత్రణ, వర్షాకాల పరిస్థితులపై సమీక్షించారు. కౌటాల మండలంలో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మళ్లీ సంప్రదింపులు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో పర్యటన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ఒప్పించేందుకు వారం రోజుల్లో సీఎం మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బరాజ్ ఎత్తుపై స్పష్టత వస్తేనే.. తుమ్మిడిహెట్టి సమీపంలో 148 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణానికి గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో బరాజ్ ఎత్తు 150 మీటర్లు ఉండాలని నిర్ణయించారు. ఈ ఎత్తుతో నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు సాగునీరందుతుంది. ఈ క్రమంలో ఎత్తు పెంపుపై సందిగ్ధతను తొలగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఎత్తుపై స్పష్టత వస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. సమస్యల పరిష్కారంపై ఆశలు నూతనంగా ఏర్పడిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అనేక సమస్యలు తాండవం చేస్తున్నాయి. కుమురంభీం, వట్టివాగు, చెలిమెల ప్రాజెక్టుల కా ల్వలు అధ్వానంగా ఉన్నాయి. గిరిజన ప్రజలకు రహదారి సౌకర్యం లేక రాకపోలకు అవస్థలు పడుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాకు వరాలు కురిపిస్తారని, సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఆశపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఎంకు సమస్యలు విన్నవించే అవకాశం దక్కేది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టేవారు. కానీ పర్యటన రద్దుతో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారవుతుందని ఆశిస్తున్నారు. -
రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలి
కౌటాల: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలని డీఏవో వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో అందిస్తున్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతోపాటు సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు వినియోగించుకోవాలన్నారు. ఒకే రకమైన పంట సాగు చేయకుండా మార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కుమురం మాంతయ్య, ఏవో ప్రేమలత, సీఈవో రాజేశ్, ఏఈవోలు అంజన్న, ఘన్‌శ్యాం, కవిత, కల్పన, రేష్మిత తదితరులు పాల్గొన్నారు. -
చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తత అవసరం
సిర్పూర్(టి): చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి నిత్యం అప్రమత్తత అవసరమని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని పెద్దబండ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేసి రిజిస్టర్ పరిశీలించా రు. జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోళ్లు ప్రా రంభమైన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా అయ్యే అవకాశం ఉందనన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు, గడ్డిమందు, మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. మెరుగైన వైద్యసేవలందించాలి చింతలమానెపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండలంలోని బాబాపూర్– రవీంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయమే చేరుకుని సిబ్బంది హాజరు తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం దిందా గ్రామానికి వెళ్లే మార్గంలో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులు ఆదేశించారు. సమీపంలోని ప్రాణహిత నదిని సందర్శించారు. నీటి ప్రవాహం వివరాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. -
పేటెంట్ రావడం అభినందనీయం
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన విద్యార్థిని అప్ప మమత తయారు చేసిన పార్కింగ్ నిర్వహణ ప్రాజెక్టుకు అధికారిక పేటెంట్ రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలో విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయమన్నారు. విద్యార్థినికి సహకరించిన ఉపాధ్యాయులు మౌల్కర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, జాగరి రమేశ్ పాల్గొన్నారు. -
● జిల్లాలో నత్తనడకన వరిధాన్యం కొనుగోళ్లు ● అకాల వర్షాలతో రైతులు ఆగమాగం
తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతు శేఖర్దహెగాం: వరిధాన్యం కొనుగోళ్లలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఓ వైపు అకాల వర్షాలు అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తుండగా, అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు అట్టహాసంగా ప్రకటించినా ఇప్పటివరకు ఒక్క మండలంలో మినహా ఎక్కడా గింజ వడ్లు కొనలేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని కా పాడుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. వర్షానికి మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గంపలపల్లి, కొత్తూరు కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతోనైనా జిల్లా యంత్రాంగం కొనుగో ళ్లు వేగవంతం చేస్తే రైతులకు ఊరట దక్కుతుంది. వానకు ఆగమాగం కొనుగోళ్లలో జాప్యంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి దహెగాం మండలంలో రైతులు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఉరుములు, మెరుపులు, గాలివానలో ప్రాణాలను పణంగా పెట్టి టార్పాలిన్లు కప్పి కాపాడుకున్నారు. గాలితీవ్రతకు కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఆగలే దు. అడుగు భాగంలోకి వర్షపు నీరు చేరి వడ్లు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పది రోజు లు దాటినా నేటికీ గింజ కూడా కొనలేదని మండిపడ్డారు. సొసైటీల ద్వారా ఇచ్చిన టార్పాలిన్లు సరిపోక అద్దెకు తెచ్చుకున్నామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని తేమశాతం కోసం మళ్లీ ఆరబెట్టాల్సి న పరిస్థితి ఏర్పడింది. అంతేకాక మండలంలో కోత దశలో ఉన్న వరిపంట నేలకొరిగింది. పలు గ్రామాల్లో కోతలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. దహెగాం మండలం లగ్గాం శివారులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు40 కొనుగోలు కేంద్రాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో సొసైటీ ఆధ్వర్యంలో 19, ఐకేపీ ఆధ్వర్యంలో 21 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు రెబ్బెన మండలంలో కేవలం 25 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దహెగాం, కాగజ్‌నగర్, రెబ్బెన, ఆసిఫాబాద్ తదితర మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు పంటను అమ్ముకునేందుకు కేంద్రాల వద్ద ఆరబెడుతున్నారు. దహెగాం మండల కేంద్రంతోపాటు లగ్గాం, ఒడ్డుగూడ, కుంచవెల్లి, గిరవెల్లి, కర్జి, చంద్రపల్లి, పీపీరావు కాలనీ, హత్తిని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. -
మళ్లీ పాతవారికే బాధ్యతలు
కాగజ్‌నగర్‌టౌన్/కౌటాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించేవరకు వారే పదవుల్లో కొనసాగనున్నారు. డిసెంబర్లో పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జీలను నియమించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం పాత చైర్మన్లను తిరిగి కొనసాగించాలని ఉత్తీర్వులు జారీ చేసింది. జిల్లాలో 12 సహకార సంఘాలు ఉండగా 155 మంది డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పాత పాలకవర్గాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా.. సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్‌నగర్, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి) నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. దహెగాంలో కొండ్ర తిరుపతిగౌడ్, కౌటాలలో కుమురం మాంతయ్య, కాగజ్‌నగర్‌లో ఉమామహేశ్వర్రావు మళ్లీ చైర్మన్లుగా కొనసాగనున్నారు. సిర్పూర్(టి)లో మాజీ చైర్మన్ మానెపల్లి బాపు ఇటీవల మృతి చెందడంతో ఇక్కడ ఇన్చార్జి చైర్మన్‌గా డబ్బా గ్రామానికి చెందిన జుమిడి తులసీరాంకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఒక్క లింగాపూర్ మినహా మిగిలిన అన్నిచోట్ల పాత సింగిల్ విండో చైర్మన్లే బాధ్యతలు స్వీకరించనున్నారు. 20వేల మందికి సభ్యత్వం జిల్లాలోని 12 పీఏసీఎస్‌ల్లో 20 వేల మందికి పైగా రైతులు సభ్యత్వం పొందారు. వీరికి పంటల సాగు కోసం సల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడంతోపాటు సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు, ఎరువులు అందిస్తారు. సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్లు, సభ్యుల పదవీకాలం 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలలపాటు పదవీ కాలం పొడిగించింది. ఆ తర్వాత డిసెంబర్లో ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. మళ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించనున్నారు. -
సకాలంలో రుణాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రైతులు తీసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, ట్రాక్టర్ లోన్లు సకాలంలో చెల్లించాలని ఆసిఫాబాద్ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడోరోజు బుధవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దళారుల ద్వారా మోసపోకుండా కందులు, జొన్నలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సహకార సంఘాల ద్వారా గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రుకుం ప్రహ్లద్, ఏవో మిలింద్, జిల్లా సహకార బ్యాంక్ మేనేజర్ సీహెచ్ వెంకట్ రవీందర్, ఎస్బీఐ మేనేజర్ తిరుపతి, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఆసిఫాబాద్/దహెగాం: జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అరగంట పాటు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. దహెగాం మండలంలో వర్షం కురవడంతో రైతులు, వారసంతకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. దుగుట లక్ష్మణ్, అంకులు, అల్లూరి సురేందర్, డొకే శంకర్, సామెర రాజన్న, చింతపూడి అర్జయ్య, ధర్మయ్యతోపాటు పలువురి ఇళ్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఇళ్లలోని వస్తువులు తడిసిపోయాయి. బామానగర్లో విద్యుత్ స్తంభా లు నేలకొరిగాయి. రేకులు ఎగిరిపోయి స్తంభాలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కురిసిన వర్షం.. తడిసిన మక్కలుకౌటాల: మండల కేంద్రంలోని నాబార్డు గోదాం వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన మక్కలు అకాల వర్షానికి తడిశాయి. పొల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట తడవకుండా రైతులు కుప్పలపై కవర్లు కప్పారు. తడిసిన మక్కలు కొనుగోలు చేయాలని కోరారు. కాగా, అకాల వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉక్కపోత, వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు. -
కనీస వేతనం రూ. 20 వేలు ఇవ్వాలి
ప్రభుత్వం అందించే రూ.5 వేల వేతనం కూడా సక్రమంగా చె ల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ‘సమాన పనికి సమాన వేతనం’ నిబంధ న అమలు పర్చాలి. కనీస వేతనంగా రూ.20 వేలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. – చింతకుంట్ల రవి, వీవోఏ, గోలేటి, మం.రెబ్బెన సమ్మె నోటీసు ఇచ్చాం ప్రభుత్వం తమ న్యా యమైన ఆరు డిమాండ్లను పరిష్కరించకపో తే ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతాం. ఇందుకు సంబంధించిన నోటీసు సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌కు అందజేశాం. ఈ నెల 6 నుంచి 15 వరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. డి మాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం. – గజ్జెల్లి భీమేశ్, వీవోఏల సంఘం జేఏసీ రాష్ట్ర కోశాధికారి -
నిధులు మంజూరు చేయాలని వినతి
రెబ్బెన: జిల్లాలో 2023– 24 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఎఫ్సీ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయించి నిధులు మంజూరు చేయాలని మాజీ జెడ్పీటీసీ వేముర్ల సంతోష్, గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు కోరారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్‌లో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ 2023–24 సంవత్సరంలో జిల్లాలో 176 పనులకు కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు కేటాయించిందన్నారు. 116 పనులు పూర్తి చేయగా రూ.3.94 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేసినా నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయించేందుకు కృషి చేయాలని కోరారు. -
రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం
కాగజ్‌నగర్‌రూరల్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని వంజీరి రైతు వేదికలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డివిజన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూసారం దెబ్బతిని వరి, పత్తి సాగులో దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఆయిల్‌పాం, డ్రాగన్‌ఫ్రూట్, కూరగాయల సాగుతో ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తుందని, అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కోసిని రైతులు మాట్లాడుతూ గ్రామ శివారు నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో మంటలు చెలరేగి పామాయిల్ చెట్లు కాలిపోతున్నాయని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ విద్యుత్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వందశాతం రాయితీపై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హర్టిక ల్చర్ డివిజన్ అధికారి సుప్రజ, ఏడీఏ మనోహర్, ఏవో రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య పాల్గొన్నారు. -
వేసవి క్రీడాశిక్షణ శిబిరం ప్రారంభం
రెబ్బెన: సింగరేణి(డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని మంగళవారం ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 25 రోజుల పాటు ఈ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. ఫుట్‌బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో శిక్షకులు మెలకువలు నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కిరణ్, సీఎంవోఏఐ ఉపాధ్యక్షుడు వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ ఎస్వీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, శిక్షకులు నరేష్, సంపత్, ఓమిత్ పాల్గొన్నారు. -
సరిహద్దే సమస్య..!
కౌటాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు 18ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతామని అన్నదాతలు ఆశపడ్డారు. కానీ ఏళ్లుగా వారి ఆశలు ఆడియాసలుగానే మిగిలిపోయాయి. ఈక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిపై నూతనంగా బరాజ్ నిర్మిస్తామని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాణహిత నదిపై నిర్మించిననున్న బరాజ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించనున్నారు. నది సమీపంలో జిల్లా, మండల అధికారులు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పర్యటనపై ఎలాంటి హడావుడి లేకపోవడంతో సీఎం వస్తారా.. లేదా టూర్ రద్దవుతుందా అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం సైతం దీనిపై స్పష్టతనివ్వడం లేదు. వర్షాధారంగా పంటల సాగుజిల్లాలో పెన్‌గంగ, వార్దా, ప్రాణహిత నదులున్నా సాగుకు మాత్రం చుక్కనీరు అందని దుస్థితి నెలకొంది. స్థానిక రైతులు 90 శాతం భూముల్లో ఇప్పటికీ వర్షాధారంగా వివిధ పంటలు పండిస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా ఇక్కడి నదులు జలకళతో ఉన్నా భారీ ప్రాజెక్టులు లేవు. దీంతో దేశంలోనే వెనుకబడిన జిల్లాలో ఒకటిగా కుమురం భీం ఆసిఫాబాద్ నిలిచిపోయింది. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుష్కలంగా నీరుందని, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఆయన మరణానంతరం అధికారం చేపట్టిన ప్రభుత్వాలు ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఒప్పందం కుదిరేనా..?తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నది సరిహద్దున మహారాష్ట్ర ఉంది. అవతలి వైపు చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలోని పలు గ్రామాలు ఉన్నాయి. ఇ క్కడ ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలోని భూమి ముంపునకు గురవుతుందని అక్కడి ప్రభుత్వం ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్వరాష్ట్రంలో 2015లో అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభు త్వ పెద్దలతో ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తుపై చర్చలు కూడా జరిపారు. కానీ అవి ఫలించకపోవడంతో గత ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పట్టించుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలతో మహారాష్ట్ర ప్రభుత్వం బరాజ్ నిర్మాణానికి దిగి వస్తుందా.. అభ్యంతరం చెబుతుందా అనేది వేచి చూడాలి. మహారాష్ట్ర పెద్దలను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒప్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. సీఎం పర్యటనపై సందేహాలుబరాజ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రానున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 1న కలెక్టర్ హరితతోపాటు ఎస్పీ నితిక పంత్, జిల్లా ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం టూర్ కు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సభ వద్ద బారికేడ్లు, వేదిక, వీఐపీ, వీవీఐపీల గ్యాలరీ, అధికారులు, మీడియాకు పాసులు, భోజనాలు, తాగునీరు.. ఇలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇటీవల సమీక్ష సమావేశంలో ఆదేశించారు. మండల అధికారులు నాలు గు రోజులుగా హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు వ్యవసాయ భూములను చదును చేయిస్తున్నారు. కా నీ ముఖ్యమంత్రి వస్తున్నా ఆశించిన రీతిలో హ డావుడి లేకపోవడం, ప్రజాప్రతినిధులు సైతం జనసమీకరణకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో అసలు సీఎం పర్యటన ఉందా..? రద్దవుతుందా అనే సందేహం కలుగుతోంది. దీనిపై జిల్లా అధికారులు ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. దాదాపు సీఎం పర్యటన రద్దు కావొచ్చనే చర్చ జరుగుతోంది. -
వీవోఏల పోరుబాట..!
తిర్యాణి: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్న వీవోఏలు(గ్రామ సంఘ సహాయకులు) సమస్యల పరిష్కారం కోసం పోరుబాటకు సిద్ధమవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతుందని, సెర్ప్ ఉద్యోగులకు దీటుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రూ.5 వేల వేతనం మాత్రమే చెల్లిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల బలోపేతంలో కీలకంజిల్లా మొత్తంగా 386 మంది వీవోఏలు విధులు నిర్వహిస్తుండగా, 8,236 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అందులో 94,569 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మ హిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ) బలోపేతంతోపాటు పేదరిక నిర్మూలనలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నా రు. ప్రభుత్వం అందించే రూ.ఐదు వేల వేతనానికి తోడుగా గ్రామ మహిళా సంఘాలు లాభాల్లో ఉంటే అందులో నుంచి మరో రూ.మూడు వేల వేతనం తీసుకునే వెసులుబాటు ఉంది. గ్రామ సంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడంతో పాటు పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధి. గ్రామ సంఘం, మహిళా సంఘాల ఆర్థికపరమైన అంశాలు, పొదుపు, రుణాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం వంటివే కాకుండా, ప్రభుత్వ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తారు. బ్యాంకు రుణాలను అందించి, తిరిగి వాటిని సక్రమంగా చెల్లించేలా చూడటం వంటి విధులు నిర్వర్తిస్తారు. కార్యాచరణ ఇదే..సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సెర్ప్ సీఈవో కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు -
ఆయిల్‌పాం సాగుకు ముందుకు రావాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని రైతులు ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకురావాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, ఆసిఫాబాద్, జైనూర్ ఏఎంసీ చైర్పర్సన్లు ఇరుకుల్ల మంగ, విశ్వనాథ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నదీం, జిల్లా వ్యవసాయాధికారి వెంకటితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందని, నీటి సౌకర్యం కలిగిన రైతులు సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొదటి నాలుగేళ్లు అంతర పంటలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు. చీడ పురుగులు, పశువులు, కోతుల బెడద ఉండదని, రైతులు అధిక లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పత్తి, వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, కూరగాయల పంటలు పండించాలని సూచించారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వంట నూనెలను దిగుమతి చేసుకుంటున్నామని, అదే ఆయిల్‌పాం సాగు పెరిగితే ఇక్కడే వంట నూనెలు చౌకగా దొరుకుతాయన్నారు. ప్రతీ రైతు కుటుంబానికి సరిపడా పంటలు, కూరగాయలు పండించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘హౌరా’కు పచ్చజెండా ఊపేనా..?
కాగజ్‌నగర్‌టౌన్: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉ న్న కాజీపేట– కాగజ్‌నగర్ మీదుగా హౌరాకు నేరుగా రైలు నడపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వ చ్చింది. హౌరా రైలు నిలిచిపోవడంతో జిల్లా నుంచి కలకత్తాకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా బెంగాలీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గం గుండా కలకత్తా(హౌరా)కు వారానికి కనీసం ఒక్క రైలు కూడా లేకపోవడం ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌరాకు ప్రయాణించాలంటే కాగజ్‌నగర్ ప్రాంతవాసులు ముందుగా కాజీపేటకు వెళ్లి అక్కడి నుంచి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నారు. ప్రత్యామ్నాయంగా కొందరు మహారాష్ట్రలో ని వర్ధా వరకు వెళ్లి అక్కడి నుంచి గీతాంజలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హౌరా మెయిల్ రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో సమయం, ఖర్చులు రెండూ పెరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగాలీ కుటుంబాలకు అవసరంకాగజ్నగర్ ప్రాంతంలో సుమారు 12 వేల మంది కి పైగా బెంగాలీలు నివసిస్తున్నారు. వీరికి ఈ మార్గం గుండా హౌరాకు నేరుగా రైలు అవసరం మరింత కీలకంగా మారింది. పండుగలు, అత్యవసర సందర్భాల్లో స్వస్థలాలకు వెళ్లడం కష్టసాధ్యంగా మారుతుంది. ఈ సమస్యపై ఇప్పటికే స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే జోన్, రైల్వే బోర్డు అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అలాగే ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం ప్రతినిధులు కూడా పలు దఫాలుగా రైల్వే అధికారులను కలిసి కాగజ్‌నగర్ మార్గం గుండా హౌరా రైలు నడపాలని వినతి పత్రాలు అందించారు. 10న ప్రధాన మంత్రి పర్యటనఈ నెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొత్త రైళ్లు, క్రమబద్ధీకరించిన సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కాగజ్‌నగర్ మార్గం గుండా హౌరా రైలు ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న హౌరా రైలును మళ్లీ నడిపించాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
‘పీఎంశ్రీ’ నిధుల్లో అవకతవకలు..!
సిర్పూర్(టి): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలనే సదుద్దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంశ్రీ పాఠశాలల నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు 2024– 25 విద్యా సంవత్సరానికి గాను రూ.13.71 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ బినామీ పేర్లను వెండర్లుగా చూపించి నిధులు సొంత అకౌంట్లోకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడే మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, ఉపాధ్యాయుడి పేరుతో నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధానోపాధ్యాయుడే ప్రస్తుతం ఎంఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా నిధులు స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిధులు పక్కదారి..పాఠశాలలో నామమాత్రంగా పనులు చేపట్టి బినా మీల పేర్ల మీద నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. ప్రధానోపాద్యాయుడి భార్య అకౌంట్లోకి రూ.3,91,980, ఓ ఉపాధ్యాయుడి అకౌంట్లోకి రూ.3.28 లక్షలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి అకౌంట్‌కు రూ.2.31లక్షలు, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్‌కి రూ.53వేలు మళ్లించి డ్రా చేసుకున్నారు. పనులు చేపట్టి సామగ్రి కొనుగోలు చేసిన వ్యాపార దుకా ణాలకు జీఎస్టీ బిల్లులతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై ఇప్పటి కే మండల కేంద్రానికి చెందిన పలువురు కలెక్టర్‌తో పాటు ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు.కలెక్టర్‌కు నివేదించాం.. పీఎంశ్రీ నిధుల వినియోగంపై సిర్పూర్(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు జిల్లాలోని మొత్తం 18 పీఎం శ్రీ స్కూళ్ల వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నాకు తెలియదు. – ఎల్.లలిత, డీఈవో -
పల్లె బాటలో శాస్త్రవేత్తలు
ఆసిఫాబాద్‌రూరల్: రైతులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వారికి నిపుణుల సూచనలు అందించేందుకు ఏప్రిల్ 27 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. సాగులో వస్తున్న మార్పులు, పాటించాల్సిన పద్ధతులు, ఇతర అంశాలపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు జిల్లాలోని 64 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై అవగాహనఎనిమిది బృందాల్లోని సభ్యులు షెడ్యూల్ వారీగా పల్లెలు తిరుగుతూ అన్నదాతలతో చర్చా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందంలో వ్యవసాయ శాస్త్రవేత్తతోపాటు మండల వ్యవసాయధికారి, ఏఈవోలు, వ్యవసాయ విద్యార్థి ఉన్నారు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా పంటల సాగులో రైతులు చేస్తున్న తప్పులు, సాగు ఖర్చు తగ్గించుకునే పద్ధతులు, ఎలాంటి పంటలు పండించాలి.. మార్కెటింగ్ వ్యూహాల గురించి వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నరకాలు పెంచడంతో పంట మార్పిడిపైనా అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా విపత్తులను తట్టుకుని దిగుబడి సాధించడం గురించి వివరిస్తున్నారు. అలాగే రసాయన ఎరువులు వీలైనంత వరకు తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాలురైతు ముంగిట్లో కార్యక్రమం కోసం జిల్లాలో 64 గ్రామాలను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ, కోసార, గుడిగుడి, ఎల్లారం, వా వుదం, ఈదులవాడ, సిర్పూర్(యు) మండలం పంగిడి, రెబ్బెన మండలం రాజారం, నారాయణ పూర్, నంబాల, గంగాపూర్, కొండపల్లి, పెంచికల్పేట్ మండలం చేడ్వాయి, గుండ్లపేట్, బొంబాయిగూడ, లోడ్పల్లి, కొండపల్లి, కౌటాల మండలం తాటిపల్లి, తుమ్మిడిహెట్టి, గుడ్లబోరి, గురుడుపేట, సాండ్‌గాం, సిర్పూర్(టి) మండలం నవేగాం, లోనవెల్లి, లక్ష్మీపూర్, వేంపల్లి, సిర్పూర్(టి), జైనూర్ మండలం జంగాం, జైనూర్, ఉషేగావ్, రాసిమెట్ట, దుబ్బగూడ, వాంకిడి మండలం సవాతి, సామెలా, ఖిరిడి, లంజన్‌వీర, కోమటిగూడ, బెజ్జూర్ మండలంలో బెజ్జూర్, కుశ్నపల్లి, అంబఘాట్, ముంజంపల్లి, రెబ్బెన, దహెగాం మండలం కర్జి, కల్వాడ, పెసరికుంట, కొత్మీర్, దహెగాం, కాగజ్‌నగర్ మండలం జంబుగా, సీతానగర్, వంజిరీ, బోడేపల్లి, నజ్రుల్‌నగర్, చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ, కోర్సిని, రణవెల్లి, కర్జవెల్లి, డబ్బా, కెరమెరి మండలం ధనోరా, సాంగ్వి, గోయగాం, కెరమెరి, తిర్యాణి మండలంలోని తిర్యాణి, గిన్నెధరి, మాణిక్యాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. రైతులు హాజరుకావాలి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 64 గ్రామాలను ఎంపిక చేశాం. అధిక దిగుబడి, పంటల సాగు విధానం, భూసారం ఆధారంగా సాగు చేసే పంటల గురించి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. రైతులు స్థానికంగా ఉండి అవగాహన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలి. – మిలింద్, జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకుడు -
చట్ట పరిధిలో ఫిర్యాదుల పరిష్కారం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సో మవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వి విధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ధైర్యంగా సంప్రదించాలిమహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యం సంప్రదించాలని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌లో జిల్లాలో 83 హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి, 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 13 ఫిర్యాదులు స్వీకరించగా, ఏడుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. 4 కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2 కేసుల్లో కౌన్సెలింగ్ అందించినట్లు వివరించారు. వేధింపులకు గురైతే ఆసిఫాబాద్ షీటీం నం.87126 70564, కాగజ్‌నగర్ షీటీం నం.87126 70565 లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దని, అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్‌తో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలు స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను సైతం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఈ నెల 10లోగా స్వీయ గణన చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నడుస్తున్న దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన డాక్ నారాయణ ఫిర్యాదు చేశారు. తమ పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని చింతలమానెపల్లి మండల కేంద్రానికి చెందిన అమృత అర్జీ అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన గాడె స్వాతి, రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామానికి చెందిన భాస్కర్ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. మొదటి జాబితాలో ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని బెజ్జూర్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి ఫిర్యాదు చేయగా, తన పేరును లిస్టు 3 నుంచి మొదటి జాబితాకు మార్చాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పూజిత దరఖాస్తు చేసుకుంది. పెంచికల్పేట్ మండలం పోతెపల్లి శివారులోని 190, 191 సర్వే నంబర్లలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని వినతిపత్రం అందించారు. తన పట్టా భూమి ఇతరుల పేరుతో నమోదైందని, వివరాలు మార్చాలని చింతలమానెపల్లి మండలం బాలాజీఅనుకోడ గ్రామానికి చెందిన శంకర్ దరఖాస్తు చేసుకున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణాశాఖ కమిషనర్ ఇల్లంబర్దితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కుప్పలను ఎత్తు ప్రాంతాల్లో ఉంచుకోవాలన్నారు. అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షామియానాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాయిశ్చర్ యంత్రాలు, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు పంపించాలని ఎక్కడా జాప్యం జరగొద్దన్నారు. మే చివరినాటికి 80 శాతం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ కె.హరిత మాట్లాడారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, డీటీవో రాంచందర్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గడువులోగా సీఎంఆర్ అందించాలిఖరీఫ్ సీజన్ సీఎంఆర్ గడువులోగా అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమ వారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఖరీఫ్ సీఎంఆర్, వరిధాన్యం దిగుమతిపై రైస్‌మిల్లర్ల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని రైస్ మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి అందించాలన్నారు. 2025– 26 యాసంగి వరి ధాన్యాన్ని అర్హత గల బాయిల్డ్ రైస్ మిల్లర్లు, రా రైస్‌మిల్లర్లు కేటాయించిన మేర దిగుమతి చేసుకోవాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత, అధికారులు పాల్గొన్నారు. -
ధరల మోత.. హోటళ్ల మూసివేత
కాగజ్‌నగర్‌టౌన్: యుద్ధ ప్రభావం పరోక్షంగా జిల్లా ప్రజలపై పడుతోంది. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్, నాన్ డొమెస్టిక్ సిలిండర్ల ధరను పెంచడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్టు నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. చమురు సంస్థల నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.1000 పెంచాయి. రూ.2350 ఉన్న సిలిండర్ ప్రస్తుతం ఒకేసారి రూ.3,350 చేరింది. 14.2 కిలోల డిమెస్టిక్ సిలిండర్ ధర కూడా గతంలో రూ.60 పెరగడంతో ప్రస్తుతం రూ.987 లభిస్తోంది. చిరువ్యాపారులకు కష్టకాలంఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో దాదాపు 100 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. మండల కేంద్రాల్లోనూ నడుస్తున్నాయి. కాగజ్‌నగర్ పట్టణంలో రెండు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ ఎజెన్సీలో 2,500 డొమెస్టిక్, 180 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో 18వేల డెమెస్టిక్ సిలింర్లు, 168 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర పెరగడంతో టీష్టాల్స్, బజ్జీల బండ్లు, చిన్న హోటళ్లు నడిపే వారికి కష్టకాలం మొదలైంది. సాధారణంగా రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఒకేసారి రూ.వెయ్యి పెరగడంతో టిఫిన్ రేట్లు పెంచే పరిస్థితులు ఏర్పడ్డాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రోజుకు రూ.3వేలు కేవలం సిలిండర్ వినియోగానికే వెచ్చిస్తే హోటల్ నడపడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో టిఫిన్ రేట్లు పెంచినా గిరాకీ పడిపోతుందని చెబుతున్నారు. వినియోగదారులపైనా భారంవాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో హోటళ్లలో టీ రూ.12 నుంచి రూ.15, టిఫిన్లు రూ.40 నుంచి రూ. 50, భోజనం రూ.80 నుంచి రూ.100కు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజల పై తీవ్ర భారం కానుంది. గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో కేవలం హోటల్ యజమానికే కాకుండా, ఆ హోటల్లో పనిచేసే సుమారు 10 మంది దినసరి కూలీలపైనా ప్రభావం చూపుతోంది. పెంపు సరికాదు ఉదయం 5 గంటల నుంచి హోటల్లో టిఫిన్లు తయారు చేయడానికి కష్టపడితే రోజుకు రెండు సిలిండర్లు కావాలి. ప్రస్తుత ధరలతో రూ.6వేలు వెచ్చించాలి. వాణిజ్య సిలిండర్ల ధర పెంపు సరికాదు. టిఫిన్ సెంటర్లు నడపడం సాధ్యం కాదు. – లక్ష్మణ్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కాగజ్‌నగర్ రోడ్డున పడతాం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఆరు నెలల్లో రూ.800 పెరగగా, ఇప్పుడు ఒక్కసారిగా రూ.1000 పెంచారు. ఇటీవల గ్యాస్ లేక రెండు రోజులు టిఫిన్ సెంటర్ మూసివేశాను. నష్టమైనా తప్పదని సోమవారమే మళ్లీ తెరిచాను. హోటల్ కిరాయి, కరెంటుబిల్లులు, సరకుల ధరలతో రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. – కిశోర్, హోటల్ యజమాని, కాగజ్‌నగర్ -
సింగరేణిలో మరో సంఘం
శ్రీరాంపూర్: సింగరేణిలో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్) పేరిట కార్మికుల ముందుకు వస్తోంది. సుధీర్ఘకాలం కార్మిక నేతగా పని చేస్తున్న గోదావరిఖనికి చెందిన టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య సారథ్యంలో ఏర్పడుతోంది. ఏప్రిల్ 27న రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్‌లో ఈ–2926 నంబర్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. కంపెనీలోని పరిస్థితులపై కొన్ని నెలలుగా పలువురు కార్మిక సంఘాల నేతలు, మేధావులతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నూతన సంఘానికి భీజం పడింది. సోమవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ సంఘాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. జూన్‌లో మహాసభ ఏర్పాటు చేసి సంఘం నిర్మాణం చేయనున్నారు. కొత్త సంఘం ఆవిర్భావంపై సింగరేణి కార్మికుల్లో చర్చ జరుగుతోంది. కార్మికుల హక్కుల పరిరక్షణ, సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. సింగరేణిలో ఇప్పటికే ఐదు జాతీయ సంఘాలతోపాటు తెలంగాణ భావజాలంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతీయ సంఘాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీజీబీకేఎస్ ఏర్పాటుపై ట్రేడ్ యూనియన్ నేతలు దృష్టి సారించారు. బొగ్గు గని పుట్టిన రోజే..మే 4కు బొగ్గు గని చరిత్రలో ప్రత్యేక స్థానముంది. 1774లో జార్ఖండ్‌లోని రాంచీలో దేశంలోనే మొదటి బొగ్గు గని ఏర్పాటైంది. ఆ రోజే బొగ్గు గని కార్మికుడు పుట్టినట్లు భావిస్తారు. దీంతో ఆ రోజును గుర్తుగా కార్మికులు ఎప్పుడూ స్మరించుకునేలా నేడు యూనియన్ను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం కంపెనీ వ్యాప్తంగా కెంగర్ల మల్లయ్య అనుచరులు, సీనియర్ కార్మిక సంఘం నేతలు, కార్మికులు మేడారానికి వెళ్తున్నారు. కంపెనీని కాపాడేందుకే.. ప్రస్తుతం కంపెనీ అస్థిత్వం కోల్పోయే ప్రమాదముంది. కొత్త గనులు లేవు. ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఉన్న గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పటికే కంపెనీకి రూ.50వేల కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది. దీంతో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇలాగే కొనసాగితే సంస్థను అంబానీకో, అదానీకో అప్పగించే అవకాశముంది. 30ఏళ్ల క్రితం సింగరేణికి ఇలాంటి దుస్థితి వస్తే అప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు వచ్చాయి. కంపెనీని కాపాడుకునేందుకు కార్మికుల హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా యూనియన్ను నడిపిస్తాం. – కెంగర్ల మల్లయ్య, టీజీబీకేఎస్ వ్యవస్థాపకుడు -
‘దాదర్’ పట్టాలెక్కేనా?
బెల్లంపల్లి: కాజీపేట–ముంబై మధ్య గతంలో రాకపోకలు సాగించిన దాదర్ (ముంబై) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (నంబర్ 07197/98) రైలును ఏడాది క్రితం అర్ధంతరంగా రద్దు చేశారు. అప్పటినుంచి ఈ రైలు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. రైల్వేశాఖ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో ముంబైకి వెళ్లడానికి ఉన్న ఒక్కగానొక్క సౌకర్యం కూడా దూరమైంది. కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్యలోని ప్రయాణికులకు దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోలేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డా యి. రైల్వేశాఖ ఎప్పటికప్పుడు అర్ధంతరంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తూ, కొత్త రైళ్లను ప్రవేశ పెడుతూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటుండగా దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాతో అనుసంధానందాదర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తే పాత అనుబంధం మళ్లీ చిగురిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌తో విడిపోయిన అనుబంధం పెనవేసుకుంటుంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌తో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. తగ్గనున్న దూరభారం కాజీపేట నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లడానికి ఈ మార్గం అత్యంత దగ్గరవుతుంది. ప్రతిపాదిత రూట్‌ను అమలు చేస్తే దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ మార్గం ఆదిలాబాద్ నుంచి కాజీపేట వయా నిజామాబాద్, చర్లపల్లితో పోలిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గం ద్వారా కాజీపేట నుంచి ఆదిలాబాద్‌కు దాదాపు 162 కిలోమీటర్ల దూరం తగ్గడానికి అవకాశాలున్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలున్న దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించి, క్రమబద్ధీకరించాలని ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నా రైల్వేశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్రమబద్ధీకరించేందుకు చొరవ చూపాల్సిన అవసరాన్ని రైలు ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. దాదర్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలి దాదర్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడంతో ముంబై వెళ్లడానికి ఉత్త ర తెలంగాణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో వెళ్లాల్సి వస్తోంది. అర్ధంతరంగా రద్దు చేసిన దాదర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల రైలు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. నాసిక్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే భక్తులకు ఉపయుక్తం కానుంది. రైల్వేశాఖ అధికారులు ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి. – మంతెన శ్రీనివాస్, రైలు ప్రయాణికుడు, బెల్లంపల్లి పునరుద్ధరణకు మీనమేషాలుదాదర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించి అత్యధిక ప్రాంతాలు, వేలాదిమంది ప్రయాణికులకు రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాల్సి న అవసరముంది. కాజీపేట జంక్షన్ నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, మజ్రికదాన్, ఆదిలాబాద్ మీదుగా నాందేడ్, పర్భానీ, జల్న, శంభాజీనగర్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థాణే, దా దర్ (ముంబై)కి రైలు నడపడంతో కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రయాణికులకు సౌలభ్యం కలిగే అవకాశాలున్నా అమలు చేయడం లేదు. ఏ కారణంగానో రైల్వేశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
ప్రశాంతంగా నీట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నీట్ ప్రశాంతంగా ము గిసింది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఉదయం 11 గంటల వరకే విద్యార్థులు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 11.30 గంటల నుంచి ప్రధాన గేట్ వద్ద పోలీసులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనంతరం బయోమెట్రిక్ తీసుకుని లోపలికి పంపించారు. పరీక్ష సమయం కంటే నిమిషం ముందు వచ్చిన ఖమానా, కౌటాలకు చెందిన నలుగురు విద్యార్థుల వద్ద గుర్తింపు కార్డులు లేకపోవడంతో అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొత్తం 316 మంది విద్యార్థులకు 303 మంది హాజరు కాగా, 13 మంది గైర్హాజరయ్యారని నీట్ కోఆర్డినేటర్ లక్ష్మీనరసింహం తెలిపారు. కలెక్టర్ కె.హరిత పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. -
భీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి
కెరమెరి: కుమురంభీం పోరాటం ప్రజలకు స్ఫూర్తి దాయకమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లోని భీం విగ్రహానికి ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ అధికా రి రమాదేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, ఫొటో గ్యా లరీ, గుస్సాడీ నృత్యాల ప్రతిమలను తిలకించారు. గ్రామస్తులు ఆయనను శాలువాతో సత్కరించారు. భీం ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పెందుర్ రాజేశ్వర్, మ్యూజియం క్యూరేటర్ ఆడె దుందేరావు, ప్రధానోపాధ్యాయులు ఆత్రం మోతీరాం, కురం జంగు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆదివాసీల ఆత్మబంధువు హైమన్డార్ఫ్ఆసిఫాబాద్: ఆదివాసీల ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్, జెట్టి ఎలిజబెత్ దంపతులని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జైనూర్ మండలం మార్లవాయిలోని డార్ఫ్ దంపతులు, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డార్ఫ్ మ్యూజియం, రీడింగ్ లైబ్రరీ, కాటేజ్, గుస్సాడీ శిక్షణ కేంద్రం, గోండ్వానా పంచాయతీరాజ్ సెంటర్, దర్బార్ స్థలం, 1941లో డార్ఫ్ దంపతులు నివసించిన ప్రదేశం, ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన మహనీయులు ఆదివాసీల సంక్షేమం కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. డార్ఫ్ దంపతుల చిత్రపటం, నివేదిక పుస్తకం అందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్రావు, గ్రామస్తులు ఆత్రం మాణిక్‌రావు, దేవరీ కనక గణపత్, ఆత్రం రాజేశ్వర్, జైనూర్ ఏఎంసీ డైరెక్టర్ లింగు తదితరులు పాల్గొన్నారు. -
షెడ్లు నిర్మించాలి
పెరుగుతున్న ఎండ తీవ్రతను భరించలేకపోతున్నాం. ప్రతిరోజూ రెబ్బెన మండలం కొండపల్లి గ్రామం నుంచి పండించిన దోసకాయలు తీసుకువచ్చి విక్రయిస్తుంటా. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారం చేస్తే రూ.1000 వరకు గిరాకీ అయితది. నీడ కోసం రోడ్డు పక్కనే గొడుగు ఏర్పాటు చేసుకున్నా. ప్రభుత్వం స్పందించి పక్కా షెడ్లు నిర్మించి ఇవ్వాలి. – ప్రేమల్ఎండకు నీరసం వాంకిడి మండలం బెండారా గ్రామం నుంచి సొంతంగా పండించిన దోసకాయలు, కందగడ్డలు విక్రయించేందుకు ఆసిఫాబాద్ పట్టణానికి వస్తా. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ రోడ్డు పక్కనే వ్యాపారం చేసుకుంటా. సాయంత్రం 4 గంటల వరకు ఎండలోనే ఉండి ఇంటికి వెళ్లిన తర్వాత నీరసంగా ఉంటుంది. మున్సిపల్ అధికారులు చిరువ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలి. – సెండె భీంరావ్ సల్లటి నీళ్లు కూడా ఉండవ్.. కాగజ్‌నగర్ మండలం ఈస్గాం నుంచి తాటిముంజలను తీసుకువచ్చి ఆసిఫాబాద్‌లో అమ్ముతుంటా. రోజుకు సుమారుగా 200 ముంజలు అమ్ముడుపోతాయి. సాయంత్రం వరకు ఎండలోనే వడగాలులకు వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది. సల్లటి నీళ్లు కూడా ఉండవ్.. దినమంతా వేడి నీళ్లనే తాగాలి. పక్కా షెడ్లు ఇస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. – బిశ్వజిత్ మండల్ -
ఉద్యమకారులకు పింఛన్ అమలు చేయాలి
ఆసిఫాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు రూ.25 వేల పింఛన్ స్కీం అమలు చేయాలని జిల్లాకు చెందిన పలువురు ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాగౌడ్, ఉద్యమకారులు గంధం శ్రీనివాస్, సీహెచ్ రవి, జాడి అశోక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్.. మరో చాన్స్
ఆసిఫాబాద్: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) పథకానికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. మే 1నుంచి జూలై 31వరకు గడువు విధించింది. గడువులోపు చెల్లించేవారికి పీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం ఇలాంటి అవకాశం ఇవ్వగా కొందరే వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మరోసారి రాయితీ అవకాశం అవకాశం కల్పించడం ప్లాట్ల యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం 2020 ఆగస్టు 31న ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించింది. అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 131 జారీ చేసింది. జిల్లాలో 7,698 దరఖాస్తులుఎల్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభమవడంతో జిల్లా వ్యాప్తంగా 7,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్లు కలిగిన యజమానులు ఒక్కో ప్లాట్‌కు రూ.వెయ్యి చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. వీటిలో 1,014 మంది దరఖాస్తుదారులు రూ.1.92 కోట్లు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగా, పరిశీలించిన అధికారులు 78 మందికి ప్రొసీడింగ్‌లు జారీ చేశారు. ఎల్1, ఎల్2, ఎల్3 మూడు దశల్లో అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎల్1 స్టేజీలో పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎల్2లో డీపీవో, ఎల్3లో అదనపు కలెక్టర్ పరిశీలించిన తర్వాత చివరగా అధికారుల ధ్రువీకరణ అనంతరం ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ పత్రాలు జారీ చేస్తారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని భావించినప్పటికీ గతంలో ఆశించిన స్పందన రాలేదు. 13శాతం దరఖాస్తు దారులే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. దరఖాస్తు దారులు ఫీజు చెల్లించి ఏడాది గడుస్తున్నా 896 దరఖాస్తులు ఇంకా ఎల్1 స్టేజీలోనే ఉన్నాయి. ఇలా వినియోగించుకోవాలిఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో సిటిజన్ లాగిన్లోకి వెళ్లాలి. దరఖాస్తు నంబర్ లేదా ప్లాట్ వివరా లు ఇచ్చి పేమెంట్ స్టేటస్ చూడాలి. అనంత రం దరఖాస్తు స్థితి ఎల్1/ఎల్2/ఎల్3 చూసి పెండింగ్ ఫీజులు, వివరాలు తెలుసుకోవాలి. పోర్టల్‌లోనే నెట్ బ్యాంకింగ్ లేదా ఇతర పే మెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చు. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కనిసిప్తే వెంటనే చెల్లింపు పూర్తి చేయాలి. కార్డ్ పేమెంట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. దీంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ చెల్లించే అవకాశముంది. 25శాతం రాయితీ ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. పూర్తి ఫీజు చెల్లింపు అనంతరం డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.వీటికి వర్తించదుశిఖం, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లోని లే అవుట్లలోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదు. నిషేధిత జాబితాలో లేని లే అవుట్లు మాత్రమే పరిగణనలోకి వస్తాయి. లే అవుట్లో కనీసం 10 శాతం ప్లాట్లు ఇప్పటికే విక్రయించి ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అర్హత ఉండదు. చెరువుకు 200 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అనుమతులు అవసరం. -
‘ప్రజాపాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి’
కాగజ్‌నగర్‌టౌన్: ప్రజల భాగస్వామ్యంతోనే సంక్షే మ పథకాలు సక్రమంగా అమలవుతాయని, ప్రజా పాలనతోనే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని ఎస్పీఎం క్లబ్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేర్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అర్హులందరికీ ల బ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వైద్యం, వ్యవసాయ సమస్యలపై చర్చించారు. సర్పంచులు గ్రామంలో నెలకొ న్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అధికారులు శాఖలవారీగా నివేదికలు చదివి వినిపించారు. మున్సిపల్ చైర్పర్సన్ సాహిన్ సుల్తానా, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, తహసీల్దార్ మధూకర్, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డీఎస్పీ వహీదొద్దీన్, ఏడీఏ మనోహర్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. కుర్చీలు లేక తిప్పలు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరయ్యారు. హాల్లో వేసిన కుర్చీలు నాయకులు, అధికారులతోనే నిండిపోయాయి. దీంతో చాలామంది జనం గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. అధికారులు చేసిన ఏర్పాట్లపై ప్రజలు అసహనం వ్యక్తంజేశారు. -
నీట్‌కు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో నీట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య వృత్తిలో చేరాలనే ఆశతో రోజుల తరబడి చదివిన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు 316 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 227 మంది బాలికలు, 89 మంది బాలురు ఉన్నారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 14 గదులు ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. విద్యార్థులను ఉదయం 11నుంచి 1.30గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ నిర్వహించి సెంటర్లోకి ప్రవేశ అనుమతి కల్పిస్తారు. 28మంది ఇన్విజిలేటర్లు, ఒక పరిశీలకుడు, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 2024 అనుభవం నేపథ్యంలో..జిల్లాలో 2024లో మొదటిసారిగా నీట్ నిర్వహించగా తప్పిదం జరిగింది. ఆధికారుల నిర్లక్ష్యంతో పేపర్ తారుమారైంది. పరీక్షా పేపర్లు రెండు సెట్లుగా రూపొందించగా ఒక సెట్ పేపర్ ఎస్బీఐలో మరో సెట్ కెనరా బ్యాంక్‌లో ఉంచారు. సెంటర్‌కు మెయిల్ ద్వారా ఎన్టీఏ అధికారులు పంపించిన నిబంధనల ప్రకారం ఎస్బీఐలో ఉంచిన సెట్ పేపర్ వాడాల్సి ఉండగా.. కెనరా బ్యాంక్‌లో ఉంచిన సెట్ పేపర్ తీసుకువచ్చి పరీక్ష రాయించారు. దేశవ్యాప్తంగా జీఆర్‌ఐడీయూ సెట్ నిర్వహించగా ఆసిఫాబాద్‌లో మాత్రం ఎన్‌ఏజీఎన్‌యూ సెట్ నిర్వహించారు. అయితే మిగతా సెంటర్లలో ప్రశ్నాపత్రానికి బార్ కోడ్ ఉండగా జిల్లా కేంద్రంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలకు ఎలాంటి బార్ కోడ్ లేకుండానే జవాబు పత్రాలు ఇచ్చారు. దీంతో 229 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడింది. అప్పటి కలెక్టర్ చొరవ తీసుకుని కన్వీనర్‌తో మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాగా, గత తప్పిదం పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు సూచనలుపరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం నీట్ నిర్వహణకు అన్ని ఏ ర్పాటు పూర్తి చేశాం. పరీక్ష కు 316 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల మేరకు విద్యార్థులను క్షుణంగా తనిఖీ చేసి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తాం. పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తాం. – లక్ష్మీనరసింహం, నీట్సిటీ కోఆర్డినేటర్ -
అనాలోచిత నిర్ణయాలతో అనర్థాలు
ఆసిఫాబాద్‌అర్బన్: అనాలోచిత నిర్ణయాలు అనర్థాలకు దారి తీస్తాయని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేశ్ పేర్కొన్నారు. యుక్త వయస్సులో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టవచ్చని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ డ్రైవ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. స్పష్టమైన లక్ష్యంతో జీ వితంలో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్య క్తులతో స్నేహాలు ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని తెలిపారు. వీలైనంత వరకు సోషల్ మీడి యా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని పే ర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులు భవిష్యత్‌లో ఆరో గ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఫీల్ రెస్పాన్స్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగంతో కలిగే శారీరక, మానసిక, సా మాజిక సమస్యల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటుతో వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. నర్సింగ్ విద్యార్థులు కమ్యూనిటీ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. చైల్డ్ ప్రొటక్షన్ అధికారి శ్రవణ్, కౌన్సిలర్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డ్రగ్ వ్యసనం నుంచి బయట పడేందుకు కౌన్సిలింగ్, కుటుంబ మద్దతు, సరైన మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుని, ఒత్తిడిని సానుకూల మార్గాల్లో ఎదుర్కోవాలని సూచించారు. ప్రి న్సిపాల్ పద్మ మాట్లాడుతూ.. చెడు వ్యసనాలతో క లిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమా ల ద్వారా విద్యార్థులో బాధ్యత పెరుగుతుందని తె లిపారు. ఈ సందర్భంగా మదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం పెంపుతో పాటు సమాజంలో డ్రగ్స్ రహిత వా తావరణం నెలకొల్పడానికి ఇది ముఖ్యమైన ముందడుగు అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. -
‘అర్హులందరికీ సంక్షేమ ఫలాలు’
ఆసిఫాబాద్: అర్హులందరికీ సంక్షేమ పథకలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల మంగ, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గంలో 36,179 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు సాయమందిస్తున్నట్లు తెలిపారు. వివిధ పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 4నుంచి 9వరకు నిర్వహించనున్న రైతు వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసి ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో లోకేశ్వర్‌రావు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుపగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తంజేశారు. గ్యాస్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందడంలేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కాదని అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపించారు. సింగరేణి ప్రాంతానికి రావాల్సిన రూ.80కోట్ల నిధులు విడుదల చేస్తే రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు డీఎంఎఫ్టీ నిధులు ఇస్తుండగా, ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యేకు కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్ చొరవ తీసుకుని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, మాట్లాడుతూ.. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై విమర్శించడం తగదని సూచించారు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని.. ఇది రాజకీయ సమావేశం కాదని, వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని కోరారు. వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. -
తుమ్మిడిహెట్టిపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఈనెల 7నాటి సీఎం పర్యటనకు ముందే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని శివాజీ భవన్లో జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్ ఎత్తు 148 నుంచి 150 అడుగులకు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవాల్సిన బాధ్యత సిర్పూర్ ఎమ్మెల్యేతో పా టు ఆదిలాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిపై ఉందని పేర్కొన్నా రు. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద ని, రెండు విడతల్లో మంజూరు చేసి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కార్తిక్, రాజేందర్ తదితరులున్నారు. ఆసిఫాబాద్‌రూరల్: రైతులు పంటల సాగులో సేంద్రియ ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త మహేశ్ సూచించారు. ‘రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలో ఎల్లారం గ్రామంలో రైతులకు సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రతీ సంవత్సరం ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానం పాటించాలని సూచించారు. కార్యక్రజుమంలో ఏఈవో స్వాతి, ప్రియ, సుగంధి, సర్పంచ్ సీతారాం, రైతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన రైతులు -
స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్‌బ్యాక్
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్–2026 కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్ మున్సి పాల్టీలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సేకరణ ముమ్మరంగా సాగుతోంది. శనివారం మున్సిపల్ సిబ్బంది వార్డులు, ఆయా కాలనీల్లో తిరుగు తూ ప్రజల అభిప్రాయాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. చెత్త సేకరణ, బహిరంగ మలవిసర్జన రహిత పట్టణం, తడి, పొడి చెత్త వేరు చేయడం, వీ ధుల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల పరిస్థితి, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై మొత్తం ఏడు ప్రశ్నలకు ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. చాలా బా గుంది.. నుంచి అస్సలు బాగాలేదు.. వరకు నాలుగు ఆప్షన్లలో సమాధానం నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
చెరువు అభివృద్ధికి కృషి చేయాలని వినతి
రెబ్బెన: మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరు వు అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక సర్పంచ్ దుర్గం భరద్వాజ్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో పాటు భూగ ర్భ జలాల పెంపునకు కీలకమైన ఎల్లమ్మ చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. పిచ్చిమొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ఎగువునున్న ఎన్టీఆర్ కాలనీ ముంపునకు గురవుతోందని తెలిపారు. గతంలో కురి సిన వర్షాలతో కట్ట దెబ్బతిని చెరువు ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొన్నారు. కట్టను బలోపేతం చేయడంతో పాటు పూడికతీత పనులు చేపట్టి చెరువును అభివృద్ధి చేయాల ని కోరారు. చెరువు ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వెంటనే చెరువు అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని 15–18 ఏళ్లలోపు బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. శని వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 2నుంచి జూన్ 10వరకు నిర్వహించనున్న వేసవి శి బిరాలపై జిల్లా స్థాయి సమన్వయం, క్షేత్రస్థాయి సి బ్బందికి అవగాహన, నిర్మాణాత్మక శిక్షణ ప్రణాళిక అమలుపై ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, వివిధ శాఖల అధికా రులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో వేసవి శిబి రాలు నిర్వహించాలని సూచించారు. శిబిరంలో వే సవిలో విద్య కొనసాగింపు, ఆరోగ్య సేవల సమన్వ యం, భద్రత అవగాహన, జీవన నైపుణ్యాలు, బా ల్య వివాహాల నివారణ కార్యక్రమాలపై దృష్టి సా రించాలని సూచించారు. రోజువారీ కార్యక్రమాలు ఒకరికొకరు తెలుసుకోవడం, బాల్య వివాహాల ని రోధం, ఆరోగ్య మేళా, అవగాహన, వ్యక్తి గత అవసరాలు, సవాళ్లు, సురక్షిత గ్రామ ప్రణాళిక, సురక్షిత గ్రామం, సమాజంతో సంభాషణ, ఆర్థిక అవగాహ న, శారీరక దారుఢ్యం, ఆటలు, విద్యా కేరీర్, మార్గదర్శనం, సైబర్ భద్రత, స్వతంత్ర ప్రమాణానికై శిక్షణ ఇచ్చి వారిలో మనోధైర్యం నింపాలని సూచించా రు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి వేసవి శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాల ని వివరించారు. డీఆర్డీవో దత్తారావ్, డీటీడీవో ర మాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, సెర్ప్ డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి ఆసిఫాబాద్: కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్దకు ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి రానున్నందున అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరిత సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని సీఎం, మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. హెలీప్యాడ్, వేదిక, బారికేడ్లు, వీఐపీ గ్యాలరీ, అధికారుల పాసులు, మీడియా పాసులు, పారిశుద్ధ్య పనులు, తాగునీరు, వీఐపీలకు అల్పాహారం, భోజనాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది క్యాంపులతో సిద్ధంగా ఉండాలని, విద్యుత్ సరఫరా ప్రత్యామ్నాయంగా జనరేటర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
తుమ్మిడిహెట్టికి రెండో ముఖ్యమంత్రి
పరిశీలించిన కలెక్టర్, అధికారులుకౌటాల: ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్పీ పి.నితిక పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్ శుక్రవారం కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీరు తదితర వివరాలపై ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, నీటి పారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత నది బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారని తెలిపారు. సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం ప రిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 150మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం, వంద టీఎంసీల నీటి వినియోగానికి ఇటీవల రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలో ముంపు ఏర్పడితే పరిహారం చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్లనాటి సాగునీటి కల సాకారం వైపు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బరాజ్ నిర్మించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి శివారు ప్రాణహిత నది వద్దకు రానున్నారు. 18ఏళ్లుగా ఎదురుచూపులు.. ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీరందించాలి. ఆ తర్వాత ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడి నుంచి ఆరు జిల్లాలకు నీరివ్వాలి. ఇందుకోసం భూసేకరణ, 71కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి రూ.11వేల కోట్లు వెచ్చించారు. అయితే 152మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఏర్పడుతుందని అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో జరిగిన చర్చల్లో 148మీటర్ల ఎత్తు వరకు అంగీకరించారు. పూర్తి స్థాయి ఎత్తుకు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. రీడిజైన్‌లో గోదావరి–ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా నదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల సాగునీటికి డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.2008లో నాటి కాంగ్రెస్ సర్కారు హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని ప్రారంభ సమయంలో సందర్శించారు. మళ్లీ 18ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ నెల 7న ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గతంతో పోలిస్తే బరాజ్ నిర్మాణం, కాలువలు, భూ సేకరణ ఇతర వ్యయం ఎల్లంపల్లి వరకే భారీగా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ ఎత్తు విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేదు. గోదావరిపై ఉన్న సుందిళ్ల బరాజ్‌కు తరలించడమా, లేక పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళ్తారా? అనేది తుది ప్రతిపాదన వెల్లడి కావాల్సి ఉంది. దీంతో పెరిగిన ఖర్చులతో రూ.20వేల కోట్ల వరకు అవుతుందనే అంచనా ఉంది.భారీగా పెరగనున్న వ్యయం -
కార్మికుల ఐక్యతకు ప్రతీక ‘మేడే’
ఆసిఫాబాద్: కార్మికుల ఐక్యతకు ప్రతీక మేడే అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వద్ద జెండా అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మేడేను పండగలా కాకుండా పోరాట దినంగా జరుపుకోవాలన్నారు. కార్మిక ఐక్యతను బలోపేతం చేస్తూ దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాము వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై కార్మికులు మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు దిన్కర్, రైతు సంఘం నాయకులు తిరుపతి, శ్రీకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్కిషన్, మండల అధ్యక్షుడు కమలాకర్, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుపెల్లి సుధాకర్, నాయకులు, కార్మికులు మాట్ల రాజయ్య, సమ్మయ్య, నంది పద్మ, శ్రీలక్ష్మి, రమ పాల్గొన్నారు. -
సీజన్‌కు ముందే దందా..!
రెబ్బెన మండలం కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీనివాస్ వద్ద నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానిక రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్ వద్ద నుంచి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.37 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. ఏప్రిల్ 28న పోలీసులు ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఆసిఫాబాద్ పట్టణ సమీపంలో ఏప్రిల్ 15న పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన వ్యాపారి రాచర్ల మహేశ్, సాయికిరణ్ కారులో తరలిస్తున్న 80కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. విచారణ అనంతరం పోలీసులు వ్యాపారి మహేశ్ ఇంటి వద్ద మరో 5.70 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.27లక్షల ఉంటుందని, గుజరాత్ నుంచి తెచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. చింతలమానెపల్లి: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాల దందా ప్రారంభమైంది. ‘అధిక దిగుబడి, తక్కువ ఖర్చు’ అని మాయమాటలు చెబుతూ కొందరు రైతులకు అంటకట్టేందుకు క్వింటాళ్ల కొద్దీ దిగుమతి చేసుకుని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి అధికంగా సాగు చేస్తుండగా నకిలీ విత్తనాలతో లాభాలు పొందేందుకు వ్యాపారులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. గతేడాది మంచిర్యాల, బెల్లంపల్లి తదితర పట్టణాల నుంచి కాగజ్‌నగర్, వాంకిడి, సిర్పూర్(టి) ప్రాంతాలకు సరఫరా చేసి విక్రయించారు. వివిధ ప్రాంతాల నుంచి సరఫరా..ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాలు, మహారాష్ట్రలోని ఇందన్ఘాట్, నాగపూర్, గుజరాత్లో వడోదర, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి నకలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దందా ఏటా కొనసాగుతోంది. విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించినప్పుడు నివేదిక రావడానికి సుమారు ఆరు నెలలకు పైగా సమయం పడుతోంది. అలాగే ప్రధాన వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వీరిని పట్టుకోవడం పోలీసుశాఖ, వ్యవసాయ శాఖలకు కష్టతరంగా మారుతోంది. గతేడాది కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో స్థానిక వ్యాపారులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన సురేశ్ అనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారిపై మాత్రం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయగలిగారు. అనర్థాలే ఎక్కువ..నకిలీ విత్తనాలకు జెనటిక్ ఇంజినీరింగ్ కమిటీ అనుమతులు ఉండవు. అధిక దిగుబడి వస్తుందనుకున్నా కలిగే అనర్థాలే ఎక్కువ. భూసారం తీవ్రస్థాయిలో తగ్గుతుంది. జన్యు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడంతో పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి కనీసం పరిహారం అందదు. దీంతో విత్తనాల క్రయ, విక్రయాల నివారణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాయి. పూర్తిస్థాయి అనుమతులు లేకుండా విక్రయిస్తే విత్తన చట్టం– 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం– 1986 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. నాణ్యత లేని విత్తనాలను ఇతర ప్రముఖ బ్రాండ్ల పేరుతో అమ్మితే ఆయా కంపెనీలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తారు. రైతులకు తీవ్ర నష్టం నకిలీ విత్తనాల వినియోగంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. సరైన సమయంలో విత్తనాలు విత్తి దుక్కి దున్నితే కలుపు నివారించుకోవచ్చు. గడ్డి నివారణకు పర్యావరణ హితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన మందులు వినియోగించాలి. నకిలీ విత్తనాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకట్, జిల్లా వ్యవసాయ అధికారి నిఘా పెడితేనే కట్టడినకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఇటీవల సమావేశం నిర్వహించారు. చింతలమానెపల్లి మండలం గూడెం, సిర్పూర్(టి) మండల కేంద్రం, వెంకట్రావుపేట, వాంకిడి మండలంలోని జాతీయ రహదారిపై మహారాష్ట్రకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏఈవోలను తనిఖీ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ మరిత, జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాల గుర్తింపు, నష్టాల గురించి వారికి వివరిస్తే కట్టడి సాధ్యమవుతుంది. -
ఘనంగా బుద్ధ పౌర్ణిమ వేడుకలు
వాంకిడి: మండలంలోని వాంకిడి జేత్వాన్ బుద్ధ విహార, ఖమాన గ్రామంలోని నాగ్‌సేన్ బుద్ధ విహార, ఇందాని, ఖిరిడి, సరాండి, బంబార గ్రామాల్లోని బుద్ధ విహారాల్లో శుక్రవారం భగవాన్ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధుడు, అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాంకిడిలో 70 ఫీట్ల పంచశీల్ జెండాతో ర్యాలీ చేపట్టారు. బుద్ధుడు చూపిన మార్గంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్ఎస్డీ జిల్లా అధ్యక్షుడు మార్షల్ దుర్గం సందీప్, నాయకులు జైరాం ఉప్రె, శేఖర్ జాడె, కిషన్ ఖోబ్రగడె పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
దహెగాం: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని సివిల్ సప్లై డీఎం రజిత అన్నారు. మండలంలోని లగ్గాంలో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. తేమ 17 శాతం కంటే మించకుండా ఉండాలని, తాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకుండా టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ర మహేశ్‌గౌడ్, డీసీఏవో శ్యాముల్, ఏవో రామక్రిష్ణ, డీటీ గణేశ్, సీఈవో బక్కయ్య, ఏఈవోలు ఆదిత్య, ఆనంద్ పాల్గొన్నారు. -
యోగా పోటీలకు ఎంపిక
రెబ్బెన: యోగాసన భారత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వ రల్డ్ యోగాసన చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన చెల్లుబోయిన ఏడుకొండలు ఎంపికైనట్లు యో గాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేసరి ఆంజనేయులుగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. హర్యానాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో శనివారం జరిగే కీలక పోటీల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. సీనియర్ బీ విభాగం సింగిల్ లెగ్ బ్యాలెన్స్ ఆసనాల పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే దేశం తరఫున ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుందని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొలిపాక కిరణ్‌కుమార్, రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను అభినందించారు. -
కార్మికుల సంక్షేమానికి పథకాలు
ఆసిఫాబాద్: కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు ఈ– శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి సమగ్రంగా వివరించారు. బాల వ్యవస్థ నిర్మూలనకు అంకితభావంతో పనిచేస్తున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్‌కు ఉత్తమ అధికారిగా, స్పెషల్ కేటగిరీ కింద చైల్డ్ లేబర్‌గా గుర్తించి ప్రస్తుతం చదువుకుంటున్న బాలుడు సన్నీకి ప్రోత్సాహక అవార్డు, ఉత్తమ యాజమాన్యం కింద సమర్థవంతమైన నిర్వహణకు జిన్నింగ్ మిల్లు యజమాని రఫీక్ జివానికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఏపీడీ రామకృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి, డీఎంహెచ్‌వో సీతారాం, కార్మికశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్, విజయ్‌కన్నా తదితరులు పాల్గొన్నారు. -
జీరో ప్రమాదాలే లక్ష్యం..!
ఆసిఫాబాద్: ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. విద్యుత్ వాడకంలో వినియోగదారుల్లో భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రాణాంతకమైన ప్రమాదాలను సున్నాకు తగ్గించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. విద్యుత్ భద్రత అనేది కేవలం విద్యుత్ బిల్లు చెల్లించడమే కాదు, తన కుటుంబ భద్రత కూడా అనే నినాదంతో అధి కారులు వినియోగదారులకు అవగాహన కల్పించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,77,479 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 1,41,942 గృహ, 15,004 వాణిజ్య, 633 పరిశ్రమలు, 15,258 వ్యవసాయ, ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 17.35 లక్షల యూనిట్లు వినియోగం ఉండగా, ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సురక్షితంగా ఎలా వాడాలి.. షాక్ తగిలితే ఏం చేయాలి, వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లో ఉండే ప్రమాదాలు, తదితర అంశాల గురించి వివరించనున్నారు. కార్యక్రమాలు ఇవే..అవగాహన కల్పించేందుకే వారోత్సవాలు రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఆసిఫాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రాన్స్‌కో ఎస్ఈ ఉత్తమ్ జాడేతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలని, విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని సూచించారు. నిర్లక్ష్యం, అలసత్వం, అజాగ్రత్తతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. -
కార్మికుల బతుకు పోరు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు గడుపుతున్నారు కార్మికులు. నిద్ర నుంచి మేల్కొనగానే పనికోసం అన్వేషణ మొదలవుతుంది. పనిదొరికితే ఆ రోజు గడుస్తుంది. లేదంటే పస్తులే. ఎండైనా వానైనా, చలినైనా తట్టుకుని కష్టపడాల్సిందే. తమ కుటుంబాల పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి, కష్టమైనా ఇష్టంగా పనులు చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వారి రాత మాత్రం మారడం లేదు. మేడే సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిలో నిమగ్నమైన కార్మికుల బతుకుపోరాట చిత్రాలు ఇవీ. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
స్క్రాప్ దుకాణాల తనిఖీ
కాగజ్‌నగర్‌టౌన్: ‘తుక్కు.. ప్ర మాదాల ముప్పు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. గురువారం పట్టణంలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న దుకాణాలకు జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఈఈ ప్రణీల్ సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా.. ట్రేడ్ లైసెన్స్, ఫైర్ ఎన్ఓసీ, పొల్యూషన్ అనుమతి, కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్ నిర్వహించడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని వారిపై మున్సిపల్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది దేవా, ఫారుక్, రమేశ్ పాల్గొన్నారు. ఎఫెక్ట్ -
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
జన్నారం: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన ఓ బాలిక వేసవి సెలవులో పిన్ని, బాబాయి ఇంటికి వచ్చింది. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన డోంగరి లక్ష్మణ్ సదరు బాలికతో సాన్నిహిత్యం ఏర్పర్చుకొని ఆమెతో పొటోలు దిగాడు. ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో బాలిక తల్లి గత నెల 28న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపి 29న నిందితుడిని అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల జొన్న పంట దగ్ధం
బోథ్: మండల కేంద్రంలోని లాల్‌పిచ్ మైదానం సమీపంలో సాగుచేసిన 13 ఎకరాల జొన్నపంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. గురువారం సాయంత్రం పంటచేలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సింగం వెంకటరమణకు చెందిన ఎనిమిది ఎకరాలు, గోవింద్‌కు చెందిన రెండెకరాలు, మాధవ్‌కు చెందిన మూడెకరాల్లో పంట పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు ఇచ్చోడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. సింగం వెంకటరమణకు రూ.4 లక్షలు, గోవింద్‌కు రూ.1.50 లక్షలు, మాధవ్‌కు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెడిగూడలో (ఆర్)లో.. సాత్నాల: మండలంలోని మెడిగూడ (ఆర్)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జొన్నపంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన చిట్యాల రాములు రెండెకరాల్లో సాగు చేసిన జొన్నపంటను కోసి పంటచేలోనే ఉంచాడు. గురువారం పంటచేల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి నిప్పులు ఎగిసి పడడంతో పంటకు నిప్పంటుకుని క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానిక రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో జొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.1,50,000 నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. కుంటాలలో.. లోకేశ్వరం(కుంటాల): కుంటాల మండలంలోని కల్లూర్‌లో 11 కేవీ విద్యుత్ తీగలు గాలికి ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి గ్రామానికి జొన్నపంట దగ్ధమైంది. అందకూర్కు చెందిన వెంకట్ వారం రోజుల క్రితం జొన్నచేను కోసి పంటను కల్లూర్‌లోని సాయిరాం చేనులో ఆరబెట్టాడు. 11 కేవీ విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. జొన్నపంటతో పాటు రైతులు సాయిరాం, బలిరాంకు చెందిన వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యాయి. జొన్న పంట విలువ రూ.20 వేలు, పరికరాల విలువ రూ.10 వేలు ఉంటుందన్నారు. -
శ్రమశక్తి అవార్డుకు ఎంపిక
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా వాటర్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన కార్మిక నాయకుడు జక్కుల రాజేశం శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగే మేడే వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. 1986లో సింగరేణి సంస్థలో చేరిన రాజేశం సాజక్, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, టీబీజీకేఎస్ సంఘాల్లో క్రీయాశీలకంగా పని చేశారు. సికాస ఉద్యమం బలంగా ఉన్న సమయంలో వారితో కలిసి పోరాడి శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్యనగర్, తదితర సింగరేణి భూముల్లో కార్మికులకు గుడిసెలు వేయించారు. తాళ్లపల్లి ఎంపీటీసీగా, సర్పంచ్‌గా సేవలందించారు. అమరులైన కార్మికులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరాంపూర్ బస్టాండ్‌లో కార్మిక విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ విగ్రహం, బస్టాండ్ ఆయన సర్పంచ్‌గా ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవే. 2018లో రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికీ కార్మికుల సమస్యలపై తన గళం విప్పుతూనే ఉన్నారు. కార్మికవర్గ పోరాటాల్లో ఆయన చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీరాంపూర్: ఐఎన్టీయూసీ కేంద్ర, బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు శ్రమశక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో సింగరేణిలో ఉద్యోగంలో చేరిన శంకర్రావు ప్రస్తుతం శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఒకే సంఘంలో పని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుండడమే కాకుండా అందరితో సన్నిహితంగా మెలుగుతారు. తనకు అవార్డు రావడం సంతోషకరంగా ఉందన్నారు. -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంజాల్ గ్రామానికి చెందిన మూడారపు ప్రణయ్‌కుమార్ (28) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య వినీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. బైకును తప్పించబోయి.. ఎడ్లబండిని తాకి.. వేమనపల్లి: ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు పక్కనే నిలిచి ఉన్న ఎడ్లబండిని తాకడంతో విద్యుత్ స్తంభం విరిగి బస్సుపై పడింది. దీంతో గ్రామంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద వారసంత జరుగుతోంది. సుంపుటం నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బస్టాండ్ సమీపంలోకి రాగానే డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి మరోవైపు నిలిపి ఉన్న ఎడ్లబండిని తాకించాడు. ఎడ్ల బండి విద్యుత్ స్తంభానికి తాకడంతో స్తంభం విరిగి ఆర్టీసీ బస్సుపై పడిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో పెను ప్రమాదం తప్పింది. వార సంత జరిగే ప్రదేశంలోనే ఈ ఘటన జరగడం, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ శాఖ ఏఈ దీక్షిత్, సబ్ ఇంజినీర్ ఆకాష్, నీల్వాయి ఎస్సై జగదీష్‌రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. -
10 వరకు స్వీయ గణనకు అవకాశం
ఆసిఫాబాద్‌అర్బన్: జనాభా గణన– 2027లో భాగంగా మే 10 వరకు స్వీయ గణన ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం స్వీయ గణన, ఉపాధిహామీ పథకం, నకిలీ విత్తనాలు, మందులు, ఇంధన కొరత, యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జనగణన– మన అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా గణన 2027లో మొదటి విడతగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ద్వారా తమ ఇంటి వివరాలు, 33 అంశాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు, 1,689 హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంధన కొరత లేదుజిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ తెలిపారు. డి మాండ్‌కు సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా ఉంద ని పేర్కొన్నారు. అనవసరమైన వదంతులు నమ్మొద్దన్నారు. ఉపాధిహామీ పనిప్రదేశాల్లో కూలీలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రానున్న వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులు నకిలీ పత్తి విత్తనాలు, మందులు కొనుగోలు చేయొద్దని సూచించారు. అనుమతి లేకుండా విత్తనాలు, మందులు కొనుగోలు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, వ్యవసా య శాఖ అధికారి వెంకటి, డీపీఆర్వో సంపత్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


