ఆసిఫాబాద్‌అర్బన్: డెంగీ నివారణకు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్ సూచించా రు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పరిసరాల్లో మురుగునీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపా రు. వ్యాధిని అరికట్టేందుకు దోమ తెరలను వినియోగించాలని సూచించారు. డాక్టర్ వినయ్, సిబ్బంది వాసుదేవ శ్యాంలాల్, అశోక్, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


