breaking news
Kumuram Bheem District News
-
మూడో విడతకు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడతలో ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, 236 వార్డులు, కాగజ్‌నగర్‌లో 28 జీపీలు, 266 వార్డులు, రెబ్బెనలో 24 పంచాయతీలు, 214 వార్డులు, తిర్యాణిలో 29 జీపీలు, 222 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ మండలంలో ఏడు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుంపెల్లి కేంద్రంలో చిర్రకుంట, పాడిబండ, తుంపెల్లి, కోసార, మాలన్‌గొంది, రాజంపేట్లో రాజంపేట్, సాలెగూడ, గోవింద్పూర్, గుండి, బూర్గుడలో బూర్గుడ, ఈదులవాడ, చిలాటిగూడ, చోర్పల్లి, మోతుగూడలో అప్పపల్లి, రౌటసంకెపల్లి, మోతుగూడ, రహపల్లి, బాబాపూర్‌లో బాబాపూర్, అంకుసాపూర్, కౌటగూడ, అడలో అడ, మానిక్‌గూడ, ఎల్లారం, మోవాడ్ క్లస్టర్లో మోవాడ్, వెంకట్పూర్, అడ దస్నాపూర్, వావుదాం పంచాయతీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రహపల్లి, చిలాటిగూడ రిజర్వేషర్ల ప్రకారం సర్పంచ్ అభ్యర్థులు లేరు. కేవలం 25 పంచాయతీల్లోనే సర్పంచులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. కొత్త పంచాయతీ ‘రాజంపేట్’కొత్త పంచాయతీ రాజంపేటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో భాగంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం రాజంపేట్ను విభజించి గత ఫిబ్రవరిలో కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 1,950 వరకు కుటుంబాలు, 2,800 మంది నివసిస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్, 10 వార్డుల్లో ఐదు ఎస్టీ, ఐదు ఇతరులకు రిజర్వ్ చేశారు. పంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎవరు నిలుస్తారో ఈ నెల 17న తేలనుంది. ముగిసిన రెండోవిడత గడువురెండో విడత నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి)లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. -
బరిలో నిలిచేదెవరో..?
కెరమెరి(ఆసిఫాబాద్): తొలి విడత నామినేషన్ల ప్రక్రి య తుది దశకు చేరుకుంది. బుధవారం నామినేష న్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం తుది జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. దీంతో బరిలో నిలిచేదెవరో తేలనుంది. జైనూర్ మండలంలోని 26 సర్పంచ్ స్థానాలకు 126 నామినేషన్లు రాగా, కెరమెరి మండలంలో 31 పంచాయతీలకు 154, లింగాపూర్‌లో 14 పంచాయతీలకు 79, సిర్పూర్–యూలో 15 పంచాయతీలకు 56, వాంకిడిలో 28 పంచాయతీలకు 106 నామినేష న్లు వచ్చాయి. ఆయా మండలాల్లో వార్డు సభ్యుల స్థానాలకు 1,424 నామినేషన్లు దాఖలయ్యాయి. జి ల్లాలో అత్యధిక పంచాయతీలు ఉన్న కెరమెరి మండలంలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. ఈ మండలంలోని 250 వార్డులు ఉండగా 11 వార్డులకు నామినేషన్ దాఖలు కాలేదు. జోడేఘాట్‌లో రెండు, రింగన్ఘాట్లో 2, పార్డలో ఒకటి, కొఠారిలో రెండు, అగర్వాడలో రెండు, ఝరి, సావర్ఖేడాలో ఒక్కో వార్డులో ఎవరూ పోటీకి ముందుకు రాలేదు. మంగళవారం అధికారులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసహరించుకోవాలనుకుంటే సకాలంలో రావాలని కెరమెరి ఎంపీడీవో సురేశ్ సూచించారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, హౌజింగ్ అధికారి ప్రకాశ్‌రావుతో కలిసి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 498 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 391 ఇళ్ల పనులు ప్రారంభించారని, మిగితా 107 నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 458 ఇళ్లు మంజూరు కాగా, 150 నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. జాప్యానికి కారణాలు తెలుసుకుని, మెప్మా కింద మహిళా సంఘాలకు రుణ సదుపాయం అందించాలని సూచించారు. ఈ నెల 20లోగా పూర్తయిన ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ డీఈ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రేపు రోశయ్య వర్ధంతిమాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన కొణిజేటి రోశయ్య వర్ధంతి గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దు
ఆసిఫాబాద్: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘ఫ్రాడ్ కా పుల్ స్టాప్’ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం డీజీపీ బి.శివధర్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించగా, ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు. ఆన్లైన్ వర్క్‌షాప్‌కు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, బీఎడ్ కళాశాలల విద్యార్థులు 130 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం అవగాహనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఓటీపీ, యూపీఐ మోసాలు, గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్, ఉద్యోగ అవకాశాలు, ఆన్లైన్ ట్రేడింగ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియాలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రవీందర్, తేజస్విని, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ జిల్లా కమిటీ ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల్లో రెండోరోజు మంగళవారం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నా రు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలుగా ఆర్.త్రివేణి, జిల్లా కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా శంకర్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బాలకిషన్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమాచారి, పద్మ, కమిటీ సభ్యులుగా స్వరూప, శారద, మాయ, అరుణ, ఛాయ, మోరేశ్వర్, చంద్రన్న, ప్రభాకర్, ఆనంద్, గంగామణి, శంకర్ ఎన్నికయ్యారు. -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. దహెగాం మండలం కొత్మీర్, దహెగాం పంచాయతీలతోపాటు పెంచికల్పేట్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోస్టల్ బ్యాలెట్, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ.. వంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. దహెగాం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బీబ్రా జెడ్పీ ఉన్నత పాఠశాల, పెంచికల్పేట్ మండలం దరోగవల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన తీరు, వంటశాల, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. -
ఖోఖో జట్టుకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీటీడీవో రమాదేవి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థినులు క్రమశిక్షణ, సా మర్థ్యం, కఠోర శ్రమతో సాధించిన ఈ విజ యం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీ డీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో గన్ కల్చర్!
కౌటాల/చింతలమానెపల్లి: కౌటాల మండలంలో తుపాకులు పట్టబడడం కలకలం సృష్టించింది. మాఫియా, ముఠాలు, కిడ్నాపర్ల కార్యకాలాపాల తరహాలో ఓ వ్యక్తి గన్ కొనుగోలు చేసి స్థానిక వ్యాపారిని బెదిరించడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన గన్ కల్చర్.. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు, పిస్టళ్లు తెప్పించుకుని దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సినిమాలు, యూట్యూబ్ వీడియోల ప్రభావం..ఇటీవల వచ్చిన సినిమాలు, యూట్యూబ్ వీడియోల్లోని మాఫియా ప్రభావం యువతపై పడుతోంది. స్మగ్లర్లు, దొంగలను హీరోలుగా చిత్రీకరించడంతో ఆకర్షితులై అదే మార్గాలను ఎంచుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి నేరాలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూట్యూబ్‌తోపాటు ఆన్లైన్లో తుపాకులు లభించే ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ యువకుడు బిహార్ రాష్ట్రానికి చెందినవారిని సంప్రదించి గన్ కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. కొత్తగా విష సంస్కృతి..జిల్లాలో తుపాకుల సంస్కృతికి సంబంధించి ఎ లాంటి తీవ్రమైన ఘటనలు నమోదు కాలేదు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ప్రముఖులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు వద్ద లైసెన్సు తుపాకులు మాత్రమే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మావోయి స్టు సానుభూతిపరుల వద్ద మాత్రమే నాటు తుపాకులు, తపంచాలు లభ్యమయ్యాయి. కొందరు గుట్టుచప్పుడుగా వన్యప్రాణులను వేటాడేందుకు నాటు తుపాకులు వినియోగించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే గడిచిన దశాబ్ద కాలంగా ఎలాంటి ఘటనలు వెలుగులోకి మాత్రం రాలేదు. పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కౌటాల మండలం సాండ్గాంలో రెండు తుపాకులు లభ్యం కావడాన్ని పోలీ సులు తీవ్రంగా భావిస్తున్నారు. కాల్పులకు తెగబడితే పలువురు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండేది. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడంతో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉపేక్షించం యువత ఈజీ మనీ కోసం పెడదారి పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆగడాలు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. యూట్యూబ్‌లో నేరపూరిత వీడియోలు చూసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ నిషేధిత చిత్రాలు, సమాచారం కోసం వెతికి నేరాలకు పాల్పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. జిల్లాలో గన్ కల్చర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. – నితిక పంత్, ఎస్పీ బిహార్ టు సాండ్‌గాం..కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన కర్బంకర్ అజయ్ అనే యువకుడు బిహార్‌కు వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి సాండ్గాంకు తీసుకువచ్చాడు. అజయ్ ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారంతో బిహార్‌కు వెళ్లి అక్కడే గన్ వినియోగించే విధానం తెలుసుకున్నాడు. అక్కడే మూడు బుల్లెట్లతో సాధన కూడా చేశాడు. రైలు మార్గం ద్వారా ఎలాంటి తనిఖీలు దొరకకుండా సాండ్గాంకు తుపాకీని తీసుకురావడం గమనార్హం. ప్రాణహిత నది తీరంలో ఒకసారి గాలిలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే అజయ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. -
గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వమే గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్ఎఫ్ఎంఎస్ ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు. నూతన టెండర్లను పిలిచి రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, సిబ్బంది మాధవి, గంగన్న, నీల, కమల, కృష్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
జాప్యం.. అన్నదాతకు శాపం
దహెగాం(సిర్పూర్): ఓ వైపు కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, మరోవైపు వాతావరణ మార్పులు రైతులను భయపెడుతున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో రెండు, మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉండటంతో పంటల రక్షణకు కోసం అపసోపాలు పడుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ధాన్యం కుప్పల వద్ద నిత్యం కాపలా ఉంటున్నారు. చినుకులకు తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ముమ్మరంగా వరికోతలు, పత్తితీత పనులుఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 3.45 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి పూతకాత రాలింది. చెట్లపై ఉన్న కాయలు నల్లబడ్డాయి. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేచోట కూడా ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్లు మించడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం పత్తితీత పనులు ముమ్మరం చేశారు. అకాల వర్షాలతో వరికోతలు ఆలస్యం కాగా, ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. కొనుగోళ్ల తీరుతో నష్టంజిల్లాలో 41 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారు. మంగళవారం కాగజ్‌నగర్, పెంచికల్పేట్ మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు జిల్లాలో సీసీఐ కేంద్రాల ద్వారా 1,57,710 క్వింటాళ్లను పత్తి కొనుగోలు చేయగా.. ప్రైవేటులో 11,909 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొదటి విడత పత్తి తీత పనులు పూర్తవుతున్నాయి. రెండో విడతలో చాలా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసిన పత్తిని ఆరుబయట పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. చినుకులకు తడవకుండా ఇళ్లలో నిల్వ చేసుకోవాలని, ఆరుబట ఉంటే టార్పాలిన్లు కప్పుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు. పత్తి ఒకసారి తీసినం ఈ ఏడాది 30 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. గత నెలలో భారీ వర్షాలకు పూతకాత రాలింది. మరోసారి పూత రావాలని మందులు పిచికారీ చేసిన. ఇటీవల మొదటి విడత పత్తితీత పూర్తయింది. ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మబ్బులు ఉండటంతో ఇంట్లోనే నిల్వ ఉంచిన. – దేశు, రైతు, దేవులగూడకోతలు పూర్తి కాలేదు మూడెకరాల్లో వరి సాగు చేసిన. గత నెలలో కురిసిన వర్షాలకు పొలం ఆరలేదు. రెండు రోజులుగా మబ్బులు వస్తున్నాయి. పొలంలోకి హార్వెస్టర్ రావడం లేదు. కోత అయిన తర్వాత ప్రైవేటు వాళ్లకే అమ్ముతా. – చప్పిడి రమేశ్, దహెగాం -
రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపి ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయస్థానంలో నిలిచారు. మహిళలు, పురుషుల్లో సమానత్వం అనే అంశంపై ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులు శరణ్య, హరిణి, వెన్నెల, అలేఖ్య, గంగలను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక చేశామని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, న్యాయ నిర్ణేతలు వెంకటేశ్వర్లు, రంగయ్య, గైడ్ టీచర్లు అరుణ, నవీన, సులోచన పాల్గొన్నారు. -
కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిపుణులతో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8లోగా అన్ని పీఎం శ్రీ పాఠశాలల్లో నిపుణులతో కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రూప్– 1 అధికారులు, ఇతర అధికారులతో తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివా స్, ఎస్వో దేవాజీ, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక సమస్యతో సతమతం
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో పంచాయతీ నామినేష న్ల పర్వం ఊపందుకుంది. ఈ తరుణంలో పోటీ చేసే అభ్యర్థులను ధ్రువపత్రాల కష్టాలు వెంటా డుతున్నాయి. సాంకేతిక సమస్యలతో మీసేవ కేంద్రాల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సైతం ధ్రువపత్రాలు పొందడం ఆలస్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యధ్రువపత్రాల జారీకి పారదర్శకత పాటిస్తూ తక్షణ సేవలను అందించేందుకు జిల్లావ్యాప్తంగా 59 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. సర్వర్ సమస్యలు తలెత్తడంతో ధ్రువపత్రాల జారీలో అంతరాయం ఏర్పడుతోంది. నివాస, ఆదాయ, కులం, జనన, మరణ ధ్రువపత్రాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. డిక్లరేషన్ తప్పనిసరిఅభ్యర్థుల కులం సర్టిఫికెట్‌ను గెజిటేడ్ స్థాయి అధికారి లేదా డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కాని రెవెన్యూ శాఖకు చెందిన అధికారి సంతకంతో డిక్లరేషన్ చేయాల్సి ఉంది. అధికారి పూర్తి హోదా, ముద్రతో ఉన్న డిక్లరేషన్‌ను అభ్యర్థి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ధ్రువపత్రాల కోసం దరఖాస్తు పెట్టుకునే మీసేవ పోర్టల్‌లోనే సమస్య తలెత్తి, పత్రాల జారీ పక్రియలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరి ష్కారం అవుతుందని పేర్కొంటున్నారు. సర్వర్ సమస్య ఉంది జిల్లాలో 59 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. మూడు రోజులుగా మీసేవలో సాంకేతిక లోపంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. సర్వర్ ఇష్యూతో ఓపెన్ అవడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం. – గౌతం రాజ్, జిల్లా ఈసేవ మేనేజర్నామినేషన్ల వేళ.. వెలవెలజిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఐదు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం దహెగాం, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీచేసే అభ్యర్థులకు కులం, ఆదాయ, నివాస పత్రాలు సమర్పించాల్సి ఉంది. మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ధ్రువపత్రాలు జత చేయాలి. కీలకమైన ఈ సమయంలో సాంకేతిక లోపంతో ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాలోని పలు మీసేవ కేంద్రాలు వినియోగదారులు లేక వెలవెలబోయాయి. -
భవితకు బాసట
ఉచిత శిక్షణ.. ఆసిఫాబాద్‌రూరల్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని బాలికలు ఉన్నత చదువులకు మార్గం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంపిక చేసిన కేజీబీవీల్లో నీట్, ఐఐటీ, క్లాట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా బాలికలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మూడు కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి ప్రస్తుతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి శిక్షణసాధారణంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్స రం విద్యార్థులు బీటెక్, మెడిసిన్, ఇతర ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంబంధిత కోర్సుల్లో ప్రవేశం కోసం కార్పొరేట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. అయితే పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించలేక కోచింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో అనుకున్న విద్యాసంస్థల్లో సీటు పొందలేకపోతున్నారు. ఈ తరుణంగా కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించింది. నీట్, ఐఐటీ, క్లాట్ శిక్షణ కోసం ని ధులు మంజూరు చేసింది. అవసరమైన మెటీరి యల్, పుస్తకాలు అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేలా నీట్, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేలా ఐఐటీ, జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా క్లాట్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సైకాలజిస్టులను కూడా నియమించన్నుట్లు అధికారులు తెలిపారు. సంతోషంగా ఉంది నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు నీట్, ఐఐటీ, క్లాట్‌పై శిక్షణ అందించడం సంతోషంగా ఉంది. శిక్షణతో చాలామంది బాలికలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కలుగుతుంది. నాకు డాక్టర్ కావాలని ఉంది. – అక్షర, బైపీసీ సెకండియర్ విద్యార్థినులకు వరం కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు ఉచిత శిక్షణ వరంలాంటిది. మంచి కార్పొరేట్ సంస్థల్లో మాదిరి రాష్ట్రం ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థినులు దీనిని సద్వినియోగం చేసుకుని ర్యాంకులు సాధించాలి. – భాగ్యలక్ష్మి, కేజీబీవీ ఎస్వో మూడు కేజీబీవీలు ఎంపికజిల్లాలోని 15 కస్తూరిబా విద్యాలయాల్లో మొ త్తం 4,177 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఏటా వార్షిక పరీక్షల్లో కేజీబీవీ వి ద్యార్థినులు సత్తా చాటుతున్నారు. కొన్ని వి ద్యాలయాలు వందశాతం ఫలితాలు సాధి స్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) కేజీబీవీలను ప్రభుత్వం యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా గుర్తించింది. ఆసిఫాబాద్‌లో నీట్, కాగజ్‌నగర్‌లో ఐఐటీ, సిర్పూర్(టి)లో క్లాట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. -
కనీస వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాల ని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణకు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్ఎఫ్ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని, వెంటనే నూతన టెండర్లు పిలవాలన్నారు. కార్మికులకు అపాయింట్మెంట్ లేటర్స్, ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు మంగళవారం నుంచి ఈ నెల 4 వరకు ఆస్పత్రి ఆవరణ లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 5న హైదరాబాద్‌లోని కోటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, నాయకులు, కార్మికులు నగేశ్, కృష్ణ, నీల, రాజ య్య, గంగన్న, కమల పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలి
వాంకిడి(ఆసిఫాబాద్): అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్టును సోమవారం సందర్శించారు. వాహనాల తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో భద్రత ఏర్పాట్లు పటిష్టం చేశామన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్ఎస్టీ బృందాలు క్రమం తప్పకుండా రోస్టర్ విధానంలో పని చేయాలని ఆదేశించారు. నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు అక్రమంగా తరలించే అవకాశం ఉందని, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏరియాలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
● ఇన్చార్జి జీఎం నరేందర్ రెబ్బెన(ఆసిఫాబాద్): నవంబర్‌లో బెల్లంపల్లి ఏరియా 101 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. నవంబర్‌లో ఏరియాకు 3.50 లక్షల ట న్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.53 లక్షల ట న్నులతో 101 శాతం ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వందశాతం వార్షిక ఉత్పత్తిని సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత నెలలో సింగరేణిలో కేవలం రెండు ఏరియాలు మాత్రమే వందశాతం ఉ త్పత్తి సాధించగా.. అందులో బెల్లంపల్లి ఒక్కటని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగ పులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్‌లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులుల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్‌జోన్‌లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా .. సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే..జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టైగర్ ట్రాకింగ్‌పై శిక్షణజన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్‌లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు.తోడు కోసమేనా..?జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పులిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చిన్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోసమే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆరు రోజులు పులి మకాం వేయడం ఇదే మొదటిసారి. తోడు కోసమా.. మరెందుకనే విషయంపై స్పష్టంగా చెప్పలేం. ఇక్కడ ఉన్నది మాత్రం మగ పులి అని ఆనవాళ్ల ఆధారంగా చెప్పవచ్చు. పులి ఉన్న చోటు శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దు. – రామ్మోహన్, ఎఫ్‌డీవో -
ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. అందరిని భాగస్వాముల ను చేస్తేనే బలమైన ఐక్య కార్యాచరణను అమలు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న, ఉపాధ్యక్షుడు ఇందురావు, నాయకులు రాజ్ కమలాకర్‌రెడ్డి, హేమంత్, రమేశ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
ఆసిఫాబాద్: తెలంగాణ నూతన మద్యం పాలసీ(2025– 27) సోమవారం నుంచి అమల్లోకి రానుంది. కొత్త దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గత నెలలో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకా ణాలకు 727 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.21.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్కో దుకాణానికి సగటున 20, గూడెం దుకా ణానికి అత్యధికంగా 67 దరఖాస్తులు వచ్చా యి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించారు. 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు గడువు పెంచి రీ టెండర్లు నిర్వహించారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారు సోమవారం కొత్త షాపులు ప్రారంభించనున్నారు. అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన దుకాణాలను కొందరు గుడ్‌విల్ కింద కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల వరకు నిర్వహణ2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల వరకు కొత్త మద్యం దుకాణాల కు జిల్లా ఎకై ్సజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లతో దు కాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. సా మాజిక భద్రత నిబంధనలతో ప్రభుత్వం నియమిత ప్రదేశాల్లో మాత్రమే షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల జోష్..కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు ఈసారి పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నా యి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సగటు న సుమారు రూ.23.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో మద్యం పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మద్యం వ్యాపారులకు ఎన్నికల వేళ లాభాలు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మార్పీకే అమ్మాలి జిల్లాలో సోమవారం నుంచి 2025– 27 సంవత్సరానికి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాల లొకేషన్లు గుర్తించి 15 మండలాల్లోని 32 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశాం. దుకాణాలు దక్కించుకున్న వారు నిబంధనలు పాటిస్తూ ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి. – జ్యోతికిరణ్, జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి -
నామినేషన్ల జోరు
ఆసిఫాబాద్: జిల్లాలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పూర్తికా గా, రెండో విడత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శనివా రం వరకు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు 521 నా మినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 1,426 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివా రం తొలివిడత నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మరోవైపు రెండో విడత ఎన్నికల్లో భాగంగా బెజ్జూర్, దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని 113 పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 29 నామినేషన్లు రాగా, 992 వార్డు సభ్యుల స్థానాలకు 34 నామినేషన్లు వచ్చాయి. ప్రచారానికి ఏర్పాట్లుతొలి విడత నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పోస్టర్లు, బ్యానర్లు సిద్ధ చేసుకోవడంతోపాటు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ప్ర ధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే అభ్యర్థులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రవాణా, విద్య, వైద్యం తదితర సమస్యలపై ప్రచారం చేస్తున్నారు. -
ఈదురుగాలులతో గజ గజ
● మళ్లీ పెరిగిన చలి ● గణనీయంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ● రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ)లో 9.7 డిగ్రీలుగా నమోదుతిర్యాణి(ఆసిఫాబాద్): దిత్వా తుపాను ప్రభా వంతో జిల్లావ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు వీయడంతో ఇ బ్బంది పడుతున్నారు. పగలు కూడా చాలా మంది స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గిరిజనులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆదివా రం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ) మండలంలో 9.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిర్యాణి మండలంలోని గిన్నెదరిలో 10.8, తిర్యాణిలో 11.2, కెరమెరిలో 11.4, వాంకిడిలో 12.9, లింగాపూర్ 13.5, పెంచికల్పేట్ 13.6, సిర్పూర్(టి), రెబ్బెనలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
‘బీఆర్ఎస్లోనే తగిన గుర్తింపు’
కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తే అవమానాలకు గురై నామమాత్రపు నాయకులుగా మిగిలిపోతారని, బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న సిర్పూర్(టి) మాజీ ఎంపీపీ మాలతి మనోహర్ ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఆయన మాట్లాడుతూ దోపిడీ నాయకుల నుంచి విముక్తి కోసం బీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. కార్యకుమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, తన్నీరు పోచం, మనోహర్, వాసు, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దులు కట్టుదిట్టం!
చింతలమానెపల్లి(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే దేశీదారు మద్యం, డబ్బు, ఇతర సామగ్రి జిల్లాలోని రవాణా కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలో మూడు దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో చెక్పోస్ట్లుజిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల నుంచి మహారాష్ట్రకు రవాణా మార్గాలు ఉన్నాయి. వాంకిడి, సిర్పూర్(టి) మండలం పోడ్సా, మాకిడి, చింతలమానెపల్లి మండలంలోని గూడెం నుంచి మహారాష్ట్రలోని గ్రామాలకు వెళ్లొచ్చు. పోడ్సా, గూడెం వద్ద పెన్‌గంగ, ప్రాణహిత నదులు హద్దులుగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాంకిడి మండలంలోని జాతీయ రహదారితోపాటు సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట, ఇదే మండలంలోని దుబ్బగూడ వద్ద ఎన్నికల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్ట్‌లో రెవెన్యూ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ లేదా జీపీవోలు ఇద్దరు, మరో ఇద్దరు ఏఎస్సైలు, లేదా పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల చెక్‌పోస్టులతోపాటు చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగే మండలాల పరిధిలో ఎస్సైలు, పోలీసులు సైతం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు అక్రమాలపైనా దృష్టి సారిస్తున్నారు. భిన్న పరిస్థితులుకుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పొరుగున మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు ఉన్నాయి. త్వరలో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో నిబంధనల అమలు విషయంలో తేడాలు ఉన్నాయి. గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. మహారాష్ట్రలో వినియోగించే కొన్నిరకాల వస్తువులపై తెలంగాణలో నిషేధం ఉంది. జిల్లాలో పత్తి, వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండటంతో సరిహద్దుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50వేల కంటే ఎక్కువ నగదు కలిగి ఉన్నా, అనుమతి లేకుండా వస్తువులను తరలించినా స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాల్లో వచ్చే వారు వాహనాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తే బిల్లులు, పన్ను చెల్లించిన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు సహకరించాలి కౌటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్పీ నితిక పంత్ పే ర్కొన్నారు. అక్రమ రవాణా, నగదు పంపిణీ, మద్యం సరఫరా వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు వాంకిడి, వెంకట్రావ్పేట, దుబ్బగూడ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాల తనిఖీలు, నాకబంది చేపడతామని వివరించారు. -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
పెంచికల్పేట్/బెజ్జూర్: పెంచికల్పేట్ మండలం ఎ ల్కపల్లి, బెజ్జూర్ మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీ లించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ని ర్వహించాలన్నారు. దాఖలైన నామినేషన్లను పరిశీ లించి నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది అవసరాలు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ తిరుపతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలిచింతలమానెపల్లి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స జావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని ఆదివారం సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో హరిప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పరిశీలించి.. సూచనలు చేసిదహెగాం: మండల కేంద్రంలో రైతువేదిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం పరి శీలించారు. ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల్లో ఏ కాలమ్ కూడా ఖాళీగా వదిలిపెట్టకుండా నింపేలా చూడాలన్నారు. సర్పంచ్ అభ్యర్థికి జనరల్ రూ.2,000, ఎ స్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, వార్డు అభ్యర్థులు జనరల్ రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్ అమౌంట్ చెల్లించాలన్నారు. కేంద్రంలోకి అభ్యర్థితోపాటు బలపరిచే ఇద్దరు, ముగ్గురిని మా త్రమే అనుమతించాలని సూచించారు. తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సీఐ కుమారస్వామి, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు. -
కట్టుబాట్ల పేరు.. మారని తీరు
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని ఓ తండ్రి కక్ష పెంచుకుని కోడలిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దహెగాం మండలం గెర్రె గ్రామంలో చోటు చేసుకుంది. తలాండి శ్రావణి(22) శివార్ల శేఖర్‌ను ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకుంది. శేఖర్ తండ్రి శివార్ల సత్తయ్య కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని చూడకుండా గొడ్డలితో దాడి చేసి శ్రావణిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. గ్రామస్తులు ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. కులంలోని ఇతరులు వారిని కార్యక్రమాలకు పిలిస్తే జరిమానా విధిస్తామని కులపెద్దలు తీర్మానం చేశారు. సమాజంపై అవగాహన ఉన్న ప్రజాప్రతినిధి కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కొందరు తమ కుల దేవతను కాకుండా ఇతర మందిరానికి వెళ్తున్నారని కులపెద్దలు ఆ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వారితో ఎవరూ మాట్లాడవద్దని, ఇళ్లలోకి వెళ్లవద్దని, పెళ్లిలకు పిలువొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు చాలా గ్రామాల్లో జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు. కౌటాల(సిర్పూర్): టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా సమాజంలో ఇంకా కులం, మతం, ఆర్థిక అంతరాలు తొలగడం లేదు. కారణమేదైనా పరువు, ప్రతిష్టల పేరిట హత్యలు జరుగుతున్నాయి. తమ వారిని కోల్పోయి ఓ వైపు.. హంతకులుగా మారి జైళ్లల్లో మగ్గుతూ మరో వైపు.. రెండు వైపులా కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. అలాగే ఏటా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పట్టింపులతో నష్టంకాలంతోపాటు ఎన్నో విషయాల్లో మార్పు వచ్చినా కులమతాల విషయంలో మాత్రం పట్టింపులను వదలిపెట్టడం లేదు. పిల్లలకు ఇష్ట్రపకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇస్తున్నా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం కట్టుబాట్లు పెడుతున్నారు. కులాంతర వి వాహాలు చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఈ కోవలోనే దహెగాం మండలంలో గర్భిణిని పరువు హత్య చేయడం కలకలం రేపింది. ఏటా జిల్లాలో కులం పేరిట దూషణాలు, కుల బహిష్కరణలు, దాడులు, ప్రతిదాడులు కూడా పె రుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2023లో 24 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, 2024 లో 34 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు పరువు హత్యలు, కుల బహిష్కరణ వంటి ఘటనల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారనే దానిపై అవగాహన ఉండడం లేదు. ఘటనలు జరిగిన సమయంలో మాత్రమే అధికారులు గ్రామాల్లో అవగా హన కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు, కుల బహిష్కరణ, శిక్షలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. దాడులు పెరిగాయి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో కుల బహిష్కరణ, పరువు హత్యలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. శ్రావణి కుటుంబానికి పరిహారంతో ఐదెకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కఠిన శిక్షలు తప్పవు పరువు హత్యలకు పాల్ప డితే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అవగాహన లేకనే ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నారు. కుల బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పిస్తాం. గ్రామీణ ప్రజలకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తాం. – ఎండీ వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్ -
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ విలేజ్ నం.3లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇంద్రజిత్ సన జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమరేందర్, పీడీ రమేశ్ ఆదివారం తెలిపా రు. నవంబర్ 3 నుంచి 5 వరకు వికారాబాద్‌లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. డిసెంబర్1 నుంచి 6 వరకు మధ్యప్రదేశ్‌లోని ఉదయ్రాయ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంద్రజిత్‌ను ఉపాధ్యాయులు కాళిదాస్ మండల్, వెంకటేశ్ తదితరులు అభినందించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య రెబ్బెన: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకా రం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన సంగెం మల్లక్క (80) వృద్ధాప్యంతో తన పనులు చేసుకోలేక బాధపడుతోంది. ఎనిమిది నెలల క్రితం అనారోగ్యానికి గురై తుంటి ఎముక విరిగింది. కుటుంబ సభ్యులు శస్త్రచికిత్స చేయించిన నయం కాలేదు. నొప్పి భరించలేక చనిపోతానంటూ కుటుంబ సభ్యులకు చెబుతూ బాధపడుతుండేది. రెండునెలల క్రితం గోదావరిఖనిలో ఉన్న కుమారుడు మధుకర్.. తల్లిని తీసుకెళ్లాడు. శుక్రవారం పింఛన్ డబ్బులు తీసుకునేందుకు మల్లక్క.. స్వగ్రామానికి వచ్చింది. మధ్యాహ్నం గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంట్లో మంచంపై పడి ఉంది. మధుకర్ తమ్ముడి భార్య పద్మ గమనించి పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కుమారుడు మధుకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం. ఐదు పర్యాయాలు ఏకగ్రీవంతాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు. -
అభివృద్ధిలో మార్క్
లక్ష్మణచాంద: ఈయన పేరు అట్ల రాంరెడ్డి. లక్ష్మణచాంద సర్పంచ్‌గా 31 ఏళ్లుగా పనిచేశారు. 1970 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. 1970లో ఎన్నికై 1981 వరకు సర్పంచ్‌గా కొనసాగాడు. 1988 వర కు, అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జ రిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గ్రా మ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ప్రాథమికను ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్, బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు, లక్ష్మణచాంద నుంచి న్యూ కంజర్, మండల కేంద్రం నుంచి ధర్మారం, తిర్పెల్లి నుంచి అనంతపేట్ వరకు రోడ్డు నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో 1988లో సహకార జూనియర్ కళాశాలఏర్పాటు చేయించారు. 1998లో ఎస్వీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. -
20 ఏళ్లుగా సేవలు..
ఇచ్చోడ: ఈయన పేరు పాముల మోతీరాం. ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ సర్పంచ్‌గా 20 ఏళ్లుగా ప్రజలకు సేవలందించారు. 1974 నుంచి 1994 వరకు పైసా ఖర్చుచేయకుండా నాలుగు పర్యాయాలుగా సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మొదట, రెండుసార్లు వార్డు సభ్యుడిగా, ఆపై సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డు సభ్యుడిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా రెండుసార్లు చొప్పున జనరల్, ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో కోకస్‌మన్నూర్‌లో వేసవిలో నీటి ఎద్దడి ఉండేది. 1983లో బోథ్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించారు. -
ఓసీ ఏర్పాటుతో ఇబ్బందులు ఉండవు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 రాకతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మందమర్రి జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆర్కే4 గడ్డ ప్రాంత ప్రజలు శనివారం సాయంత్రం జీఎంను తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓసీ మ్యాప్ చూపెడుతూ గని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు కానుందో వివరించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పాత గనులు కలుపుతూ ఏర్పాటు అవుతుందని ఏ ఒక్కరికి నష్టం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఎస్ఓటు జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తులు లేకున్నా మంచి పేరుంది
మందమర్రిరూరల్: ఈయన పేరు లింగాల మల్లయ్య. మందమర్రి మండలం అందుగులపేట పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2006లో (జనరల్), 2012లో (ఎస్సీ జనరల్) జరిగిన పోటీల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి ప్రజలకు సేవలందించారు. 2017లో (జనరల్ సీటు) కావడంతో ఓడిపోయాడు. 2001లో ఎస్సీ మహిళ రిజర్వేషన్‌తో ఆయన భార్య లక్ష్మి పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతం అందుగులపేటకు రిజర్వేషన్ మారడంతో పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఇంటి వద్ద టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు ఎలాంటి ఆస్తులు లేవని, గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. -
సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఓ విద్యావంతురాలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన బానోత్ కావేరి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోసం మహారాష్ట్రలో శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతోంది. ఈమె తండ్రి బానోత్ గజానంద్ నాయక్ 15ఏళ్లు నార్నూర్ సర్పంచ్‌గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్ మారడంతో తన వారసురాలిగా కావేరిని బరిలోకి దింపారు. మండల కేంద్రం నార్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. పుట్టినగడ్డకుసేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు కావేరి తెలిపారు. -
సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు..!
లక్సెట్టిపేట: ‘నన్ను ఆ గూడెం సత్యనారాయణ స్వామే తిరిగి రప్పించాడు. నా ఆరోగ్యం గురించి సహకరించిన వారికి, దేవుళ్లకు ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తన ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యులు వెళ్లవద్దని చెప్పినా సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ అయిందని, మరోసారి చిన్నపాటి సర్జరీ కోసం మళ్లీ కోయంబత్తూరు వెళ్తున్నట్లు తెలి పారు. తనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎవరికీ రావొద్దని, వచ్చినా చికిత్స అందుబాటులో ఉండేందుకు మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని, సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్నానని, అందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాలుగు నెలల తర్వాత పట్టణానికి వచ్చిన పీఎస్సార్‌కు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ వరకు బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల సర్పంచ్ అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేష్, చెల్ల నాగభూషణం, చింత అశోక్‌కుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్, దాసరి ప్రేంకుమార్, రాజు పాల్గొన్నారు. -
ఉదయం అలా.. సాయంత్రం ఇలా
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోపాటు మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి మేము పార్టీలో చేరలేదని, వారే మాకు కండువా కప్పారని తెలిపారు. కాగా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు. -
విద్యార్థినిని వేధించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని విద్యానగర్‌లోని పారామెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఫైజాన్.. నెల క్రితం కళాశాలలో పరీక్ష ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఇబ్బందులకు గురిచేశాడు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని పగులగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసి ఫైజాన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రీలాన్స్ జర్నలిస్టుపై.. ఆదిలాబాద్‌రూరల్: పట్టణానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు ఫిరోజ్‌ఖాన్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 26న సాయంత్రం ఫిరోజ్‌ఖాన్‌తోపాటు మరో వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సరిగా డ్యూటీ చేయడం లేదని రెస్టారెంట్లు తనిఖీ చేయడం లేదని బెదిరించారు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మావల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం కారు నిలిపిన చోట ఫొటో తీసి, అధికారిగా ఉండి బ్లాక్‌ఫిల్మ్ పెట్టావని వార్త రాసి అధికారికే పోస్టు చేశారు. ‘రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం’నేరడిగొండ: రైతుల ఆత్మహత్యల గోసను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన కౌలు రైతు సోలాంకి శ్రీకాంత్ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకోగా, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రెండు మూడేళ్లుగా పంట దిగుబడి రాలేదని మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. పంటకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి జీవో నం.194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నాయకులు బుపేందర్, సంతోష్, ప్రమోద్ ఉన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జీల నియామకంఆదిలాబాద్: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను శనివారం నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాలకు కె.ఓదెలు, నిర్మల్‌కు గోపిడి స్రవంతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులను నియమించారు. -
భర్త రెండు పర్యాయాలు..భార్య ఏకగ్రీవానికి నిర్ణయం
ఇంద్రవెల్లి: ఈయన పేరు కినక జుగాదిరావ్. ఇంద్రవెల్లి మండలం వాల్గోండ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2014లో వాల్గోండహిరపూర్ ఉమ్మడి పంచాయతీ సర్పంచ్‌గా ఈయన విజయం సాధించారు. సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. హీరపూర్ నుంచి వేరు అయిన వాల్గోండ పంచాయతీకి 2019 ఎన్నికల్లో తొలి సర్పంచ్‌గా గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం వాల్గోండ పంచాయతీ (ఎస్టీ మహిళ) రిజర్వేషన్ వచ్చినప్పటికి ఆయన భార్య సునీతకు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇటీవల పంచాయతీ పరిధి గ్రామాల ప్రజలు నిర్ణయించారు. -
డోంట్ వర్రీ.. రికవరీ..!
కౌటాల: ప్రస్తుతం సెల్‌ఫోన్ లేకుండా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంతటి విలువైన మొ బైల్ ఫోన్లు ఒక్కోసారి అపహరణకు గురవుతుంటా యి. కొన్నిసార్లు మనమే ఎక్కడో మిస్ చేసుకుంటాం. ఆ తర్వాత బాధ పడుతుంటాం. అయితే ఇ దంతా గతం.. ప్రస్తుతం సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి దొ రుకుతోంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజి స్టర్ (సీఈఐఆర్) వెబ్సైట్ అందుబాటులోకి వచ్చా క.. పోయిన ఫోన్లను ట్రేస్ చేయడం, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులభమైంది. సెల్‌ఫోన్ పోతే ఫిర్యాదు ఇలా.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీఈఐఆర్ సౌ లభ్యం అందుబాటులో ఉంది. ముందుగా ఫోన్ పో యిన వెంటనే బాధితుడు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ ఫోన్ ఈఎంఈఐ నంబర్ విధిగా పొందుపర్చాలి. ఎక్కడ పోయింది అనే వివరాలు అందజేయాలి. బాధితులు ఎఫ్ఐఆర్ ప్ర తి అందిన తర్వాత www.ceir.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్ ఓపెన్ చేసి అందులో ‘బ్లాక్ ఫోన్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోన్ వివరాలు, పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, చిరునామా, పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు నంబర్, ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు సూచించిన బాక్స్‌ల్లో నింపాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయగానే పోగొట్టుకున్న ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇక దానిని ఎవరూ ఆపరేట్ చేయలేరు. దానిలో డాటా సురక్షితంగా ఉంటుంది. సీఈ ఐఆర్ వెబ్‌సెట్‌లోకి వెళ్లి ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తో బ్లాక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయదు. అందులో వేరే సిమ్‌కార్డు వేసినా వెంటనే బాధితుడికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ మెసేజ్‌తో యూజర్ పో గొట్టుకున్న సెల్‌ఫోన్ ఏ ప్రాంతంలో ఉన్నదో సులభంగా తెలుసుకునే అవకాశముంది. పాత ఫోన్‌తో పరేషన్.. ఎవరైనా తక్కువ ధరకు సెల్‌ఫోన్ అమ్ముతున్నారని కొనుక్కుంటే లేనిపోని చిక్కులు కోరి తెచ్చుకున్నట్లే. అది కొట్టేసిన ఫోన్ అయితే కొనుగోలుదారు మొ బైల్ ఆన్ చేయగానే పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఆ స్థలానికి వెళ్లి విచారించగా వేరేవాళ్ల వద్ద కొ న్నామని వారు సమాధానం చెప్పడంతో మందలించి వదిలేస్తున్నారు. కొన్నవారు ఆర్థికంగా నష్టపోతున్నారు. సెల్‌ఫోన్ ఎక్కడ కొన్నాడు? కొన్న బిల్లు? బాక్స్ అడిగాకే ఆ ఫోన్ కొనాలి. లేదంటే తిప్పలు పడాల్సి వస్తుంది. పాత ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా..? బ్లాక్ లిస్ట్‌లో ఉందా? అన్న విషయం కేవైఎం (నో యువర్ మొ బైల్) విధానంలో ముందే తెలుసుకోవచ్చు. మొబైల్లో కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్ చేసి 15 అక్షరాల ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేసి 14,422కు ఎస్ఎంఎస్ చేయాలి. సెల్ఫోన్లలో విలువైన సమాచారం ఉండడంతో వాటి వినియోగం, కొనుగోలు విషయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. స్పీడ్‌గా రికవరీ సెల్ఫోన్లో కీలక సమాచారం ఉంటుంది. అది అపహరణకు గురైతే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతారు. జిల్లాలో 6.50 లక్షల వరకు జనాభా ఉంటే అందులో దాదాపుగా 5లక్షలకుపైగా ఫోన్లు విని యోగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా అన్ని వయస్సులవారిలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. గతంలో సెల్‌ఫోన్ అపహరణకు గురైనా.. పోగొట్టుకున్నా దొరకడం కష్టంగా ఉండేది. కానీ, గతేడాది మార్చి 15నుంచి రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వైబ్సెట్ అందుబాటులోకి తేవడంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ ఇట్టే దొరికిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో బాధితులు పో గొట్టుకున్న, చోరీ అయిన సెల్ఫోన్లు గుర్తించడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజంలో ఉంది. జిల్లాలో రెండేళ్లుగా 2వేల వరకు సెల్ఫోన్లు పోవడంతో పోలీసులు 1300కు పైగా మొబైల్ఫోన్లను గుర్తించారు. సుమారు రూ.14లక్షల విలువైన సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు. -
ఆయుధాల రికార్డును అప్డేట్ చేయాలి
ఆసిఫాబాద్: బెల్ ఆఫ్ ఆర్మ్‌లోని ఆయుధాల రికార్డులను నిరంతరం అప్డేట్ చేయాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సాయుధ పోలీస్ దళాన్ని సందర్శించి పలు విభాగాలను తని ఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించారు. ఆ యుధాల భద్రతా ప్రమాణాలు, అమ్యునిషన్ నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, బాధ్యతలు, పరికరాల సంరక్షణ, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై ఆర్ఐ ఎంటీవో అంజన్న ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పాత రికార్డులను భద్రపరచాలని, అమ్యునిషన్ డంప్‌లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్మూరర్ వ ర్క్‌షాప్‌లో మరమ్మతుల వేగం పెంచాలని, డ్యామే జ్ పరికరాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా వెంటనే రిపేర్ చేయాలని ఆదేశించారు. స్టోర్స్‌లోని సామగ్రిపై నెలకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సమర్ధవంతమైన పోలీసింగ్, ఆయుధాలు–విభాగాల భద్రత కోసం సాయుధ దళ పోలీసుల విధి నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆమె వెంట ఆర్ఎస్సై లవన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ విద్యను మరింత బ లోపేతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్న త పాఠశాలలో ప్రీప్రైమరీ పాఠశాలలకు ఎంపికై న 41మంది ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల కంటే మె రుగ్గా విద్య అందుతుందనే నమ్మకం తీసుకురావా లని తెలిపారు. 3నుంచి 6ఏళ్ల పిల్లలకు బ్రెయిన్ డెవలమ్మెంట్ అధికంగా ఉంటుందని, చిన్న పిల్లలకు చక్కని ప్రేమ అప్యాయతలతో బోధించాలని సూ చించారు. వారి అభిరుచిని తెలుసుకోవాలని, పిల్ల లు ఇష్టపడేలా సిలబస్‌లోని అంశాలతో పాటు మంచి విలువలు నేర్పించాలన్నారు. విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు అర్థరహితం’
ఆసిఫాబాద్: డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ సీనియర్ నా యకుడు వసంత్‌రావు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు మసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్తో కలిసి శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. శ్యాంనాయక్ కెరమెరిలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ సమక్షంలో విశ్వప్రసాద్‌పై చే సిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలి పారు. శ్యాంనాయక్ జిల్లాలో ఎంవీఐగా ఉన్నపుడు వసూళ్లకు పాల్పడడం తెలిసే ప్రజలు గత ఎన్నికల్లో ఓటు వేయలేదని, ఇందుకు డీసీసీ అధ్యక్షుడిని బా ధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తిర్యాణికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్‌గౌడ్, ఆయన సతీమణి, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌పై శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు విశ్వప్రసాద్తోనే ఉంటారని, ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని డిమాండ్ చే శారు. నాయకులు సలీం, రవీందర్, సాయి, కలీం, జావిద్, మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కౌటాల: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి హెచ్చరించారు. కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం విషయంలో నిరసన తెలిపిన ఘటనపై శనివారం ఆయన కాగజ్‌నగర్ సబ్ కలెక్ట ర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన, పారిశుధ్య సిబ్బందిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. పాఠశాల హెచ్ఎం నారా యణ్సింగ్ను సస్పెండ్ చేస్తూ ఎంఈవో హన్మంతు ఆరోపణలపై వివరణ కోరారు. విద్యార్థుల నిరసన ఘటన రోజు విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల నుంచి విధి నిర్వహణలో అలసత్వం, ఘటనకు కారణాల పై వివరణ తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ను కచ్చితంగా పాటించాలని సూచించారు. పాఠశాలలోని చేతిపంపునకు వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ఆవరణలో నీరు నిల్వ కుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశా ల చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాహ్న భోజన నాణ్యత ను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, కార్యదర్శి సాయికృష్ణ తదితరులున్నారు. -
తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: తాగిన మైకంలో ఒకరు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలోని పాత ఉట్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఉట్నూర్‌లో నివాసముండే రా థోడ్ నూర్సింగ్ (63) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొ డవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు సర్ధి చెబుతుండగా అకస్మాత్తుగా కింద పడ్డాడు. ఈ సమయంలో అతడి తలకు దెబ్బ తగలగా ఆస్పత్రికి వెళ్తామని చె ప్పినా వినలేదు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటిలోని గది లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన స్థానిక ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మిస్టరీగా బాలిక మరణం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7) మృతి మిస్టరీగా మారింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక సోమవారం అదృశ్యం కావడం.. మూడు రోజు ల తర్వాత గురువారం బావిలో శవమై తేలడం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన బావి ఇంటి నుంచి దూరంగా ఉంది. బాలిక ఒక్కరే అంతదూరం ఒంటరిగా వెళ్లలేని విధంగా పరిస ర ప్రాంతాలున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉండొచ్చని, మరోవైపు చి న్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి చంపి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నా యి. బాలిక అదృశ్యమైన రోజు పోలీస్ డాగ్‌స్క్వాడ్ ఇంటివద్దే కొద్దిసేపు సంచరించాయి. మృతదేహం లభించిన రోజు మాత్రం డాగ్‌స్క్వాడ్ బా వి నుంచి ఇంటి వద్దకు వచ్చాయి. బాలిక మృతి పై గ్రామంలో పలు విధాలుగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ మరణానికి కారణాలేమిటనేది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహం నీళ్లలో ఎ క్కువ రోజులు ఉండడంతో కారణాలు కనుగొ నడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఆందోళన బాలిక మృతిపై న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు వంద మందికిపైగా శుక్రవారం దండేపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు ప్రయత్నం చేశారు. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. ఇదే సమయంలో కేసు విచారణలో భా గంగా దండేపల్లి స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే బయట కు వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చే స్తామని, పోస్టుమార్టం నివేదిక రాగానే దాని ఆ ధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. జైలుకు పంపించి శిక్షపడేలా చూస్తామని భరోసానివ్వడంతో వారు వెళ్లిపోయారు. పోలీసు విచారణ ముమ్మరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీపీ ప్రకాశ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎ స్సై సురేష్ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. విచారణ వేగవంతం చేశారు. -
ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారగా.. గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్‌గూడ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గూడెం గ్రామానికి సర్పంచ్ లేక 38 ఏళ్లవుతోంది. నెల్కివెంకటాపూర్ గ్రామంతోపాటు కొత్తగా ఏర్పాటైన వందుర్‌గూడ పంచాయతీకి గత 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. శుక్రవారం వరకు ఈ మూడు గ్రామాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గూడెం ఏజెన్సీ గ్రామం కానప్పటికీ.. గూడెం గ్రామంలో 2,140 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవ్వరూ లేరు. అయినప్పటికీ ఈ గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్పంచ్ పదవితో పాటు సగం వార్డు స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామంలో గిరిజనులెవరూ లేరు. 1987 నుంచి గూడెం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఆ గ్రామానికి సర్పంచ్ లేక 38ఏళ్లు గడిచింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ.. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు వందుర్‌గూడ గ్రామం నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. వందుర్గూడను నెల్కివెంకటాపూర్ నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే వందుర్‌గూడ పంచాయతీ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. వందుర్గూడను విడదీయడంతో నెల్కివెంకటాపూర్‌లో గ్రామంలో గిరిజనులెవరూ లేని పరిస్థితి ఏర్పడింది. నెల్కివెంకటాపూర్ గ్రామం కూడా ఏజెన్నీ గ్రామం కావడంతో ఇక్కడ గిరిజనులు లేని కారణంగా గత 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎస్టీ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదు. దీంతో అప్పటి పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రెండు గ్రామాల పంచాయితీ ఎటూ తేలక పోవడంతో, ఈసారి కూడా ఎన్నికలు జరగడం అనుమానమే. -
ఖాతాల కోసం అభ్యర్థుల పాట్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపేందుకు గతంలో ఉన్న సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కాకుండా మళ్లీ కొత్తగా ఖాతా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు బ్యాంక్‌లు, పోస్టాఫీసులకు వెళ్లి కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌కు రూ.2వేలు కావడంతో చాలామంది పోస్టాఫీస్‌లో రూ.200తో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. దండేపల్లి పోస్టాఫీస్ శుక్రవారం ఖాతాలు తెరిచేందుకు వచ్చినవారితో సందడిగా మారింది. సర్పంచ్ పదవికి వేలం?సారంగపూర్: మండలంలోని మహవీర్‌తండా గ్రా మపంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలం పాటలో మహవీర్‌తండాకు చెందిన ఓమహిళ తరఫున వారి కుటుంబీకులు పాల్గొని రూ.5.60లక్షలకు పదవి దక్కించుకున్నట్లు సమాచారం. మహవీర్‌తండా, దుర్గానగర్ ఈరెండు తండాలు ఒకే పంచాయతీ కాగా, వీటి పరిధిలో 500 మంది ఓటర్లున్నారు. ఈ తండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్, మహవీర్తండాల ప్ర జలు సర్పంచ్ పదవి తమకంటే తమకేనంటూ పో టీకి దిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జామ్ గ్రామ సమీపంలో ఇరుగ్రామాల ప్రజలు పంచాయితీకి కూర్చున్నారు. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహవీర్‌తండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని రూ.5.60లక్షలకు దక్కించుకున్న ట్లు తెలిసింది. అయితే.. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని, వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటి స్థలం కోసం టవరెక్కి నిరసన
జైపూర్: మండల కేంద్రానికి చెందిన అహ్మద్ అనే యువకుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థ లం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సె ల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ సరిపడా స్థలం లేక ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని వాపోయాడు. స్థలం కే టాయించాలని టవర్ ఎక్కి నిరసన తెలుపగా స్థాని కంగా కలకలం రేపింది. దీంతో ఘటనా స్థలానికి ఎస్సై శ్రీధర్ చేరుకుని యువకుడితో మాట్లాడారు. అతనికి నచ్చజెప్పడంతో అహ్మద్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. ఎస్సై మాట్లాడుతూ.. అహ్మద్‌ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు నిర్మించకపోవడంతో హోల్డ్‌లో పెట్టారని తెలి పారు. ఇంటి ని ర్మాణానికి స్థ లం కేటాయించి ఆదుకోవాల ని కోరారు. -
ఎస్పీఎం విభాగంలో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యుత్‌శాఖ కార్యాల య ఆవరణలోని ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్ రూర ల్ వర్క్‌షాప్‌లో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి ఆరుగురు దుండగులు వర్క్‌షాప్‌లోకి చొరబడి ఏడు ట్రాన్సఫార్మర్ జాబ్లలోని కాప ర్ తీగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన కాపర్ వై రు విలువ సుమారు రూ.3.5లక్షలు ఉంటుంద ని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలాన్ని ట్రాన్స్ కో ఎస్ఈ జాదవ్శేష్రావు పరిశీలించారు. చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అశోక్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్, క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మేమున్నామనీ..
మంచిర్యాలక్రైం: మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సఫలమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో వీటి పనితీరు ఈ ఏడాది బాగుంది. షీ టీమ్స్ ని రంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా క ల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్లు, బ స్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిల భర తం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న విద్యార్థినులు, మహిళలకు షీ టీమ్స్ అండగా ఉంటూ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బృందాల్లోని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పై కెమెరాలు వినియోగిస్తున్నారు. అవసరమనుకుంటే పరిసర ప్రాంతాలను వీడియో రికార్డు చేస్తున్నారు. సరైన ఆధారాలతో పోకిరీలను అదుపులోకి తీసుకుని ఈవ్‌టీజింగ్, మహిిళలను వేధించిన కేసులో పట్టుబడిన వారికి పోలీస్ పద్ధతిలో వారి చేష్టలను కుటుంబ సభ్యులకు చూపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తు్ాన్నరు. మహిళలను బహిరంగంగా వే ధించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వే ధించేవారి తాట తీస్తున్నారు. వీరు చేసిన ఆపరేష న్స్, నిర్వహించిన అవగాహన సదస్సులు మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. మహిళలు, బాలికలను వేధించినా.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలుంటాయి. విద్యాలయాలనుంచి తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, ఏ ఇతర విద్యాలయాల్లో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అ వకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనా లు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో పిల్లలకు రక్షణ కల్పించేందు ప్రభుత్వం 2012 లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. చట్టంలో పే ర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా బీఎన్ఎస్ 63 ప్రకారం 18ఏళ్లలోపు వారి పై లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. పిల్లలపై లైంగికదాడికి పా ల్పడితే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.జిల్లా ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కౌన్సిలింగ్ అవగాహన రెడ్‌హ్యాండెడ్‌గా సదస్సులు పట్టుకున్నవి మంచిర్యాల 210 22 188 285 148 ఆదిలాబాద్ 217 25 192 190 43 ఆసిఫాబాద్ 142 37 105 206 63 నిర్మల్ 30 14 88 115 276సమాచారం ఇవ్వడం ఇలా..వేధింపులకు గురైనవారిలో చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పోలీస్‌శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.6303923700 నంబర్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేయవచ్చు. క్యూ ఆర్‌కోడ్, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి నిర్భయంగా సమాచారం అందించవచ్చు. షీటీమ్ బృందాలు ఘటనా స్థలానికి రహస్యంగా చేరుకుని సమస్య పరిష్కరిస్తారు.ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు షీ టీమ్ కేసుల వివరాలు -
హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
నిర్మల్‌చైన్‌గేట్: హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లే దంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ చ ర్చకు సిద్ధమా.. అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఓపెన్ డిబేట్‌కు మంత్రి సిద్ధపడితే శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్దకు జర్నలిస్టుల సమక్షంలో చ ర్చకు రావాలన్నారు. లేదంటే డేట్, టై మ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేద ని, పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినవి రూ.6.30 లక్షల కోట్లయితే రూ.5వేల కోట్లకే కట్టబెట్టడం కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో మంత్రితోపాటు మొత్తం కేబినె ట్, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వాటా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి ల్యాండ్ లూటీకి పాల్పడుతోందన్నారు. -
మహిళలే టార్గెట్..!
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మాటలతో బురిడీ కొట్టించి నగలతో మాయమవుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను చూస్తే అమాయకులు, వృద్ధ మహిళలు, ఇంట్లో ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నారు. కొత్తరకం దొంగతనాలకు పాల్పడ్డారు. జిల్లాలో పోలీసులు ఓ వైపు ఎన్నికల బందోబస్తులో బిజీగా మారగా, దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. మభ్యపెట్టి.. మాయచేసి ఇటీవల రెబ్బెన మండలం గోలేటి, కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన రెండు చోరీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న మహిళలను మభ్యపెట్టి నగలతో ఉడాయించారు. గతంలో జిల్లాలోని పలు ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని హుండీలు, విగ్రహాలను ఎత్తుకెళ్లేవారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు పోలీసుల చర్యలతో ప్రస్తుతం అవి ఆగిపోయాయి. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ వరుస చోరీలు జరిగాయి. ప్రస్తుతం మహిళలనే టార్గెట్‌గా చేసుకుని దుండగులు బంగారు నగలు దోచుకుంటున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలిపోలీసుల గస్తీ నిరంతరం పటిష్టం చేశాం. కాగజ్‌నగర్ పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దొంగలను గుర్తించి త్వరలో పట్టుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక టీం ఏర్పాటు చే శాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలి. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు’కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో చిలుక వీరమ్మ అనే వృద్ధురాలి వద్ద నుంచి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించిన ఇద్దరు దుండగులు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. ‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు. తీసుకోండి’ అంటూ గేటు బయటి నుంచి పిలిచారు. గేటు తీసుకుని ఇంట్లో నుంచి వృద్ధురాలు వచ్చేలోగా ఒక వ్యక్తి లోపలికి తోసుకుని వచ్చి నోరుమూసి వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మెడలోని రెండు తులాల బంగారు చైన్ అపహరించి బైక్‌పై పారిపోయినట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ టౌన్ ఎస్సై సుధాకర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. -
కనుల పండువగా కాలభైరవ జయంతి
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో కాలభైరవ స్వామి జయంతి(మహా కాలాష్టమి) శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. మహాకాలాష్టమి రోజున కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. గారెల మాలలు, మద్యం, స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. ఉదయం స్వామి అభిషేకం పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సామూహిక కాలభైరవ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. -
ఊపందుకున్న నామినేషన్లు
● రెండోరోజు 222 దాఖలుఆసిఫాబాద్: జిల్లాలో గ్రామ పంచాయతీ నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో రెండోరోజు కదలిక వచ్చింది. తొలి రోజు జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లోని 115 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 15 నామినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం సర్పంచులకు 111 నామినేషన్లు, వార్డు సభ్యులకు 111 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 242కి చేరింది. కాగా శనివారంతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 నుంచి బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం దాఖలైన నామినేషన్లు మండలం సర్పంచ్ వార్డు స్థానం స్థానంజైనూర్ 20 32 కెరమెరి 29 25 లింగాపూర్ 20 06 సిర్పూర్(యూ) 14 12 వాంకిడి 28 36 -
సామాజిక విప్లవకారుడు పూలే
ఆసిఫాబాద్‌అర్బన్: అణగారిన వర్గాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూప్నార్ రమేశ్ మాట్లాడుతూ అనేక పాఠశాలలను ప్రారంభించి ఎంతో మందిని విద్యావంతులుగా చేశారని కొనియాడారు. స్వయంగా భార్యకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దా రని తెలిపారు. మహనీయుడి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కేశవ్‌రావు, మారుతిపటేల్, మెంగాజీ, నికోడె రవీందర్, నాగోశే శంకర్, బాబురావ్, శ్యాం, అసద్, జలపతి, తిరుపతి, నాందేవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల అన్నం.. నీళ్ల చారు
కౌటాల(ఆసిఫాబాద్): ప్రతిరోజూ మధ్యాహ్న భోజ నంలో పురుగుల అన్నం.. నీళ్ల పప్పు వండి పెడుతున్నారని కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. పాఠశాల నుంచి భోజనం ప్లేట్లతోనే బయటకు వచ్చి కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ బియ్యాన్ని శుభ్రం చేయకుండా అన్నం వండుతున్నారని, మెనూ ప్రకా రం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. ప్రతిరో జూ పప్పు కూర పెడుతున్నారని, కూరగాయలు వండడం లేదన్నారు. నాసిరకం భోజనం తినలేక వాంతులు చేసుకుంటున్నామని వాపోయారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని తొలగించా లని డిమాండ్ చేశారు. రెండు గంటలపాటు రో డ్డుపై విద్యార్థులు నిరసన తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. కౌటాల తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంఈవో హన్మంతు, ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కార్మికురాలిపై చర్యలు తీసుకుంటామని, మెనూ ప్రకారం భోజనం అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. -
‘నూతన విద్యావిధానంపై ఉద్యమిద్దాం’
ఆసిఫాబాద్‌రూరల్: నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాలీ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన 20వ జిల్లా మహాసభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా దేశంలో విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా వారి అభివృద్ధి కోసం పీడీఎస్‌యూ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. అందరికీ సమానమైన విద్య అవకాశాలు దక్కాలని జార్జిరెడ్డి, చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి వంటి వారు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు తరుణ్, సమీర్, వసంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణను శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ పత్రాలు, ధ్రువీకరణ, అభ్యర్థుల వివరాలు, రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని, ప్రచారాలు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్ తదితరులు ఉన్నారు. కంచన్‌పల్లిలో పర్యటన లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కంచన్‌పల్లి గ్రామంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. నామినేషన్ కేంద్రంతోపాటు గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద చేపట్టిన ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంచందర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు అట్ట హాసంగా సాగాయి. ఈ పోటీలను డీటీడీవో రమాదేవి ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన శిక్షకులు నాగరాజు, మణికంఠ ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, ఏటీడీవో శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్, చైర్మన్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్ జీసీసీ మేనేజర్ మనోహర్ గత ఆరు నెలల్లో సాధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సభ్యులు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరలకే డీఆర్ డిపో ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కందులు, మొక్కజొన్న, సోయా వంటి పంటలు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అనంతరం జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌ను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ మనోహర్, అటవీశాఖ డిప్యూటీ రేంజర్ హేమలత, సిబ్బంది చందు, ప్రదీప్, కృష్ణ, సత్యం, ప్రవీణ్ పాల్గొన్నారు. ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి ఆసిఫాబాద్: జీసీసీ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డివిజనల్ మేనేజర్, సొసైటీ చైర్మన్ సందీప్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సొసైటీ అకౌంటెంట్ సదాశివ్, అటవీశాఖ రేంజ్ అధికారి గోవింద్‌చంద్ సర్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్యాముల్ మాథ్యూస్, దయాకర్ పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్ (58)కు సంతానం కాకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతని భార్య భాను స్థానికుల సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘ఎస్పీఎం యాజమాన్యం మొండి వైఖరితో నష్టం’
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరితో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్(రి.నం.2381) ఉపాధ్యక్షుడు గోలెం వెంకటేశ్ అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని కోసినిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మిల్లులో పనిచేస్తున్న శాశ్వత కార్మికులకు యాజమాన్యం జీతం స్లిప్‌లలో ఓటీ అని చూపించకుండా గుడ్‌విల్ అని నమోదు చేయిస్తుందన్నారు. అనారోగ్య సమస్యలతో లోకల్ ఆఫీస్ సెలవులు పెడితే లీవ్ డబ్బులు ఇవ్వడం కుదరదని చెబుతున్నారని మండిపడ్డారు. పాత మాదిరిగానే కార్మికులకు ఓటీ స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు శ్యాంరావు, రాజమౌళి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. -
సమ్మె చేస్తేనే వేతనాలు!
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తేగానీ వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసినా రెండు నెలల జీతాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని, పూట గడవక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా అందక అవస్థలు కాగజ్‌నగర్ బల్దియా పరిధిలో 141 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనాల రూపంలో రూ.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ నెలనెలా గడువులోగా వేతనాలు చెల్లించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఏ నెల కూడా సక్రమంగా జీతాలు అందడం లేదు. మున్సిపాలిటీలో నిధుల కొరతతోపాటు ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువగా ఉండడంతో నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను సంప్రదించగా 15 రోజుల్లో వేతనాలను అందిస్తామని చెప్పారని కార్మికులు వెల్లడించారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ముధోల్: మండల కేంద్రంలోని మజీద్ చౌక్ సమీపంలో గడ్డమొళ్ల రమేశ్‌కు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు రమేశ్ ఇంటిముందు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం ఇంటికి తాళంవేసి కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఆసమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్ మీటర్లోంచి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న బట్టలు, బీరువా, ఫ్రిడ్జి, కూలర్‌తో పాటు కిరాణా షాపుకోసం తీసుకువచ్చిన బియ్యం, పప్పులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గమనించిన స్థానికులు సిలిండర్ బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సమాచారం అందించినప్పటికీ రావడంలో ఆలస్యం జరగడంతో అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది. ఘటనలో సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఎస్సై బిట్ల పెర్సీస్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కౌటాల(ఆసిఫాబాద్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని మళ్లీ ఇప్పుడు అర్హత పరీక్ష రాయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంపత్, విజయ్, దేవరావు, సీమ, భీంరావు, ఇందిరా, మనీషా, మా ధురి, అర్చన, తిరుమల తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రైలు కూతేది.?
రెబ్బెన(ఆసిఫాబాద్): దశాబ్దాలు గడుస్తున్నా కీలకమైన ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ పరిస్థితి మారడం లేదు. నిజాం కాలంలో ఏర్పాటు స్టేషన్లో కొత్త ట్రైన్లకు హాల్టింగ్ ఇవ్వడం లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఒక్కగానొక్క స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉన్నా నిరాద రణకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతున్నవే తప్పా కొత్తవాటికి హాల్టింగ్ సౌకర్యం కల్పించడం లేదు. ఇంటర్ సిటీ మినహా రైళ్లన్నీ ప్యాసింజర్ స్థాయివి కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్యాసింజర్ రైళ్లే దిక్కు.. జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైనా ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి కానరావడం లేదు. ఈ స్టేషన్ గుండా నిత్యం వందలాది మంది ప్రయాణికులు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటం, జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు కావడంతో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. ప్యాసింజర్ రైళ్లు మినహా ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్ పేర్లతో పిలుస్తున్నా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ మినహా మిగిలినవన్నీ ప్యాసింజర్ స్థాయి రైళ్లే.. అవి కూడా సికింద్రాబాద్, కాజీపేట, కొత్తగూడెం, కరీంనగర్, సిర్పూర్ టౌన్ మధ్య మాత్రమే నడుస్తున్నాయి. గతంలో ఈ స్టేషన్లో ఆగిన ఆజ్నీ, సింగరేణి, నాగ్‌పూర్ ప్యాసింజర్లకు కరోనా తర్వాత హాల్టింగ్ సైతం ఎత్తివేశారు. దీంతో విజయవాడ, తిరుపతి, చైన్నె, నాగ్‌పూర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాగజ్‌నగర్, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లపై ఆధారపడుతున్నారు. సమయంలోపాటు డబ్బులు వృథా అవుతున్నాయి. దశాబ్దాల క్రితం మంజూరైనవే.. ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్లలన్నీ కొన్ని దశాబ్దాల క్రితం మంజూరు చేసినవే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం గోలేటి, జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, మండల కేంద్రాల నుంచి వ్యక్తిగత పనులు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఇతర అవసరాల కోసం సూదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారు వేలల్లో ఉంటారు. ఇటీవల కాగజ్‌నగర్‌తోపాటు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో వందేభారత్‌తోపాటు పలు రైళ్లకు కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును గోలేటి సీహెచ్‌పీ ద్వారా సింగరేణి యాజమాన్యం రైలుమార్గంలో సరఫరా చేస్తోంది. దీంతో ఆసిఫాబాద్ స్టేషన్‌కు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ప్రయాణికుల టికెట్ల ద్వారా కొంతమేర ఆదాయం సమకూరుతున్నా కొత్త రైళ్ల హాల్టింగ్‌కు మోక్షం కలగడం లేదు.ప్రస్తుతం ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లో ఆగుతున్న రైళ్లు కాజీపేట వైపు.. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కరీంనగర్ మెమో సింగరేణి ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రామగిరి ఎక్స్‌ప్రెస్ బల్లార్షా వైపు.. రామగిరి ఎక్స్‌ప్రెస్ (సిర్పూర్ టౌన్ వరకు) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (కాగజ్‌నగర్ వరకు) కరీంనగర్ మెమూ (సిర్పూర్ టౌన్ వరకు) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (కాగజ్‌నగర్ వరకు) -
సరిహద్దు పల్లెల్లో సందడి
కెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు చర్చలోకి వస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ నుంచి.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ గ్రామాలపై ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కెరమెరి మండలంలోని సరిహద్దు పల్లెల్లో సందడి నెలకొంది. తొలి విడతలో భాగంగా డిసెంబర్ 11న అక్కడ పోలింగ్ జరగనుంది. 14 గ్రామాలు.. 3,456 మంది ఓటర్లు కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ పంచాయతీలు ఏళ్లుగా రెండు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తండా, ముకదంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరి గ్రామాలు ఎవరి ఆధీనంలో ఉండానే విషయంలో వివాదం ఉంది. ప్రతీ పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉన్నాయి. 3,456 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం కెరమెరి మండలంలోని ఎనిమిది క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పరంధోలి, ముకదంగూడ, అంతాపూర్ పంచాయతీలు పరంధోళి క్లస్టర్లో ఉండగా, బోలాపటార్ జీపీ కెలి– బి క్లస్టర్లో ఉంది. రిజర్వేషన్లలో భాగంగా అంతాపూర్ జీపీ జనరల్ మహిళ, భోలాపటార్ ఎస్టీ మహిళ, ముకదంగూడ ఎస్టీ మహిళ, పరంధోలి జనరల్‌కు కేటాయించారు. తొలిరోజు నామినేషన్లు నిల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద గ్రామాల్లో గతంలో పోటీ చేసినవారితో పాటు యువతరం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం నాలుగు జీపీల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆశావహులు నామినేషన్ పత్రాలను ఇళ్లకు తీసుకెళ్లారు. పరంధోలి, అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల్లో సర్పంచ్ స్థానం కోసం ఐదు లేదా ఆరుగురు, ముకదంగూడలో ముగ్గురు పోటీలో ఉండే అవకాశం ఉంది. జనవరిలో మళ్లీ ఎన్నికలు..! 2024 నవంబర్ 20 మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. 2,985 మంది ఓటర్లకు 1,852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా డిసెంబర్ 11న తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో స్వల్ప వ్యవధిలోనే ప్రజలు రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్లో చేర్చిన ఎన్నికల అధికారులు
ఎన్నికల గుర్తులు సిద్ధంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుర్తులు సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్‌గా అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణము, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు‘నోటా’కు చోటు..నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌చైన్‌గేట్: పల్లె పోరు హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బ్యాలెట్ పత్రంలో ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ సరైన వారు లేరని ఓటరు భావించినప్పుడు ఓటును నోటాకు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో పవిత్రమైంది. ఓటరు తన ఇష్టానుసారం నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. సరైన అభ్యర్థులు లేరని భావించినప్పుడు తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉండాలనే అభిప్రాయం ఏళ్లుగా చర్చకు వచ్చిన అంశమే. ఈ నేపథ్యంలోనే ‘నోటా’ భారత ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ భావనకు చట్టబద్ధత లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నింటిలోనూ నోటాకు స్థానం కల్పించింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటింగ్ యంత్రాల చివరి బటన్‌గా నోటా ప్రత్యక్షమైంది. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితంలో మార్పేమీ ఉండదు.ఒక్క క్లిక్‌తో ఓటరు జాబితా ప్రత్యక్షంనిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్లైన్లో ఉంచింది. సదరు వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితా చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.tsec.gov.in వెబ్సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09–2025 ఆప్షన్ క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చాకోడ్‌ను ఎంటర్ చేసి వార్డువైజ్ డేటాపై క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్‌గా ఓటరు లిస్ట్ వస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు. -
నిప్పు.. భూసారానికి ముప్పు
చెన్నూర్‌రూరల్: ఏటా వరికోతలు పూర్తికాగానే పొలంలో ఉండే వరికొయ్యలు, ఇతర మూ లా లకు రైతులు నిప్పుపెడుతుంటారు. దీంతో పంటచేనులో భూసారం బుగ్గిపాలవుతుందని వ్య వసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పొలాలను హార్వెస్టర్లతో కోయించడంతో వరిగడ్డి(పశుగ్రాసం)కొయ్యలు ఎక్కువ మొత్తంలో మిగిలి ఉంటున్నాయి. పొ లం పనులు మొదలు పెట్టే రైతులు వ్యర్థాలు ఉండకూడదని పంట మూలాలకు నిప్పంటించి మళ్లీ సాగుకు సిద్ధం అవుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతో వరి కోతల ప్రక్రియ చేపడుతుండటంతో ఎలాంటి కుదుళ్లు లేకుండా నేల మట్టంగా కోసేవారు. ప్రస్తుత తరుణంలో కూ లీల కొరత ఉండటంతో చిన్నపాటి రైతులు కూ డా యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతొ సుమారు అడుగు నుంచి అడుగున్నర మేర వరికొయ్యలు మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇ లాంటి చర్యలతో భూమిలో సారం తగ్గి పోవడమే కాకుండా, పంటకు మేలు చేసే క్రిములు కూడా పూర్తిగా నశించే పోయే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పుతో భూసారానికి ఎంత ముప్పు కలుగుతుందనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.వరికొయ్యలు కాల్చొద్దు కోతలు ముగిసిన తర్వాత వరి కుదుళ్లను దుక్కిలో కలిపి దున్నితే భూసార విలువలు పెరుగుతాయి. నిప్పు పెడితే భూసారం దెబ్బతింటుంది. దున్నే ముందు నీటితడులు అందించి భూమి నానిన తర్వాత అందులోనే కలియ దున్నితే భూమిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. అలాగే పొలంలో జీలుగ పంట వేసి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగ పడుతుంది. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
అధికారి నిర్లక్ష్యం.. తప్పిన పెనుప్రమాదం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకేఓసీ గనిలో గురువారం అధికారి నిర్లక్ష్యంతో బొలెరోను డోజర్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గనిలో మొదటి షిప్టులో పనులు జరుగుతుండగా తన కన్వినెన్స్ బొలెరోలో వచ్చిన మేనేజర్ వాహనం దిగి పనిప్రదేశానికి వెళ్లాడు. ఉద్యోగులతో మాట్లాడుతుండగా డ్రైవర్ వాహనాన్ని తిరిగి వెళ్లడానికి అనుకూలంగా తిప్పిపెట్టాడు. అక్కడే డోజర్ ఆపరేటర్ కోల్ లెవల్ పనులు చేపట్టే క్రమంలో వెనకకు వచ్చి బొలెరోను బలంగా ఢీకొట్టాడు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలోంచి కిందకు దూకడంతో స్వల్పగాయాలుకాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో అధికారి నిర్లక్ష్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పనిస్థలం వరకు కన్వినెన్స్ వెహికిల్స్ రాకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సదరు అధికారి ఎందుకు వచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
రక్షణపై అవగాహన అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగులు, అధికారులకు రక్షణపై అవగాహన అవసరమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో గురువారం అన్ని విభాగాల అధిపతులతో వార్షిక రక్షణ పక్షోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రక్షణ సూత్రాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు కళాకారుల పాటలు, నాటికల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ సూత్రాల అమలు, రక్షణ పద్ధతులు పాటించడంలో ఏరియాకు మొదటి స్థానం వచ్చేలా ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఖైరిగూర పీవో నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఎస్కే మదీనా బాషా, సీహెచ్‌పీ ఇన్చార్జి కోటయ్య, వర్క్‌షాప్ హెచ్ఓడీ జ్ఞానేశ్వర్, ఖైరిగూర మేనేజర్ శంకర్, ఎంవీటీసీ మేనేజర్ మధుసూదన్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్తోపాటు వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులతోపాటు కోచ్‌లు, పీడీలను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అమలయ్యేనా?
నస్పూర్/మంచిర్యాలక్రైం: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనుంది. 2025–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్‌శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో గ తంలో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ని ర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా? మా మూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్... ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ప్రశాంతి హాస్పటల్ పక్కనే ఓ వైన్స్ కొనసాగుతోంది. కాలేజ్ రోడ్, హమాలివాడ, ఐబీ సమీపంలో లక్సెట్టిపేటరోడ్లో ఉన్న వైన్స్‌లు హాస్పటల్స్‌కు దగ్గరలోనే, రోడ్డుపక్కనే ఉన్నాయి. నస్పూర్ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలు ఉండగా ఆరు జాతీయ రహదా రికి ఆనుకుని ఉన్నాయి. సీసీసీలోని రాయల్ గార్డెన్ సమీపంలో స్కూల్స్ జోన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చే యాలని, ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. క్లస్టర్ తొలగింపుతో వ్యాపారులకు ఊరట...ఈసారి పట్టణాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బడి, గుడి, హాస్పిటల్స్‌కు వంద మీటర్ల దూరం అనేది అమలులో ఉంది. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే, స్టేట్‌హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు.నిబంధనల మేరకే.. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. సమాచారం ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న ప్రైవేటు హాస్పటల్స్‌కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తాం. – కేజీ నందగోపాల్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి, మంచిర్యాల -
విద్యుత్ షాక్‌తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి
నార్నూర్: విద్యుత్ షాక్‌తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాంబ్లె హన్మంతు (37) గురువారం ఉదయం ఇంట్లో బట్టలు సర్దుతుండగా విద్యుత్ తీగలకు చేయి తగలడంతో షాక్‌కు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జాగృతి యాత్రకు ఎంపికబాసర: జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహోన్నత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా యువత కోసం ఉద్దేశించబడిన యాత్రలో ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న జశ్వంత్‌కు చోటు దక్కింది. కేవలం 15 రోజులలో దేశం మొత్తం చుట్టివచ్చే ఈ రైలుయాత్రలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు వారికి మార్గ నిర్దేశం చేస్తారు. సాధారణంగా 21 ఏళ్ల పైబడిన వారే ఈ యాత్రకు అర్హులైనప్పటికీ 18 ఏళ్ల జశ్వంత్ తన ప్రతిభతో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ విద్యార్థిని అభినందించారు. -
నవోదయలో యూత్ గ్రామ సభ
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం కేంద్ర విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆదేశాల మేరకు మోడల్ యూత్ గ్రామసభ నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులు, గ్రామస్తుల పాత్రలు పోషించారు. ఆరోగ్యం, కూరగాయల పెంపకం, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంపు, హెల్త్ క్యాంప్, మహిళల స్వయం ఉపాధి, వ్యవసాయ పంటలకు మద్దతు ధర తదితర అంశాలపై 45 నిమిషాలపాటు చర్చించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కోసిని మాజీ సర్పంచ్ నగునూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హరీబాబు, శ్రీఅంకిత్ పాల్గొన్నారు. -
వంద పడకలకు అప్‌గ్రేడ్
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని వైద్య విధాన పరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్‌సీ) 30 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 కోట్ల నిధులను మంజూరు చేసింది. సివిల్ పనుల కోసం రూ.18కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్నారు. నూతన భవన నిర్మాణం కోసం పురాతన పీహెచ్సీ భవనాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలోనే 100 పడకల ఆస్పత్రిని కట్టేందుకు అధికారులు స్థలాన్ని చదును చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాత భవనాలు నేలమట్టం వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ సమీపంలో, ఇతర ప్రభుత్వ స్థలాల కోసం ఎమ్మెల్యే, ఆర్అండ్బీ అధికారులు ప్రయత్నాలు చేశారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీహెచ్సీ బిల్డింగ్తోపాటు సుమారు 40ఏళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేశారు. ప్రస్తుతం చదును చేసిన ఆ స్థలంలోనే జీ+2 పద్ధతిలో భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సీహెచ్‌సీ జీ+1తో కొనసాగుతున్న భవనంపై మరో అంతస్తు నిర్మించనున్నారు. 30 పడకల ఆస్పత్రిగా కొనసాగుతుండగా, భవన నిర్మాణం పూర్తయితే వంద పడకలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులను చేపట్టనున్నారు. మెరుగైన వైద్యసేవలకు ఆస్కారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు కాగజ్‌నగర్ సామాజిక ఆస్పత్రికి కీలక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గర్భిణులు స్కానింగ్, ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొత్త ఆస్పత్రి పూర్తయితే కీలకమైన వైద్యులు, పరికరాలు సమకూరనున్నాయి. శంకుస్థాపనకు ఏర్పాట్లు 30 పడకల నుంచి వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి పాత భవనం కూల్చివేసి చదును చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – అవినాష్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ మెరుగైన వైద్యం అందించాలని.. మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్షతో రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించాం. ఎల్లగౌడ్‌తోటలో ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తాం. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషీయన్, ఎనస్థషీయా, ఈఎన్టీ సర్జన్‌తో సహా ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. – పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే -
సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవి డ్, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలి సి బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించా రు. లింగాపూర్, కెరమెరి, సిర్పూర్(యూ), జైనూర్, వాంకిడి మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల పరిశీలన, తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
నేటి నుంచి నామినేషన్లు
కెరమెరి/లింగాపూర్/వాంకిడి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి జిల్లాలోని ఐదు మండలాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. తొలి విడతలో జైనూర్ మండలంలోని 26 పంచాయతీలు, 222 వార్డులు, కెరమెరి మండలంలోని 31 పంచాయతీలు, 250 వార్డులు, లింగాపూర్ మండలంలోని 14 పంచాయతీలు, 112 వార్డులు, సిర్పూర్(యూ) మండలం 15 పంచాయతీలు, 124 వార్డులు, వాంకిడి మండలం 28 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఐదు మండలాల్లోని 114 సర్పంచ్ స్థానాలతోపాటు 944 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతోపాటు మీడియా సెల్, ఎంపీఎంసీ కమిటీ, గ్రీవెన్స్ సెల్, కంట్రోల్ రూంల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేపట్టనున్నారు. -
సృజనాత్మకత.. విజ్ఞాన ప్రదర్శన
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థి దశలోనే శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించే దిశగా విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలోనే విజ్ఞాన మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలికేందుకు జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో 53వ రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనాక్ జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నిత్య జీవితంలో సవాళ్లు– వైజ్ఞానిక పరిష్కారాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి వనరుల వినియోగం, వినోదాత్మక గణిత నమూనాలు అనే అంశాల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి 400 మంది విద్యార్థులు 300 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో 280 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, 120 ఇన్స్పైర్ మనాక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ముగిసిన ప్రదర్శనలు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలు బుధవారం ముగిశాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన 35 మంది విద్యార్థులకు ప్రొఫెసర్ శంకర్, కోకన్వీనర్ దేవాజీ, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎస్వో శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 21 మంది, ఇన్స్పైర్ మనాక్ ప్రాజెక్టులో 12, సైన్స్ సెమినార్లో ఒక్కరు. టీఎల్‌ఎంలో ఒక్కరు రాష్ట్రస్థాయిలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణ ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణకు కాగజ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అజయ్‌కుమార్ ప్రాజెక్టు రూపొందించాడు. గైడ్ టీచర్‌గా తిరుపతయ్య వ్యవహరించారు. తిరుపతి, శ్రీశైలంతోపాటు జిల్లాలో కెరమెరి ఘాట్ రోడ్లు ఉన్నాయి. మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేందుకు స్తంభాలపై సెన్సార్ లైట్లు ఏర్పాటు చేశాయి. మూల తిరుగుతున్న సమయంలో రెడ్‌లైట్ వెలుగుతుంది. అటువైపు నుంచి వచ్చే వాహనం డ్రైవర్ అప్రమత్తమై నెమ్మదిగా వస్తారు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఎరువులు, విత్తనాలు వేసే యంత్రం చాలా మంది రైతులు భుజంపై మోస్తూ విత్తనాలు, ఎరువులు వేస్తారు. వారి కష్టాలు తీర్చేందుకు సిర్పూర్(టి) ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శివశంకర్, వరుణ్‌తేజ ప్రాజెక్టు రూపొందించారు. స్మార్ట్ సాలిడ్ ఫర్టిలైజర్ స్ప్రే మిషన్‌తో రోజుకు ఐదెకరాల వరకు విత్తనాలు, డీఏపీ మందులు వేసుకోవచ్చు. రూ.5వేల ఖర్చుతోనే మిషన్ తయారు చేసుకోవచ్చు. లక్ష్మణ్ గైడ్ టీచర్‌గా వ్యవహరించారు. ప్రమాదాల నివారణకు స్మార్ట్ బస్సు కర్నూల్ బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రమాదాల నివారణకు స్మార్ట్ బస్సు ప్రాజెక్టును కాగజ్‌నగర్ ఆశ్రమ పాఠశాలకు చెందిన సునీల్ రూపొందించాడు. బస్సుకు నాలుగు వైపులా ఏదైన వాహనం తగిలితే ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నప్పుడు అలారం మోగుతుంది. రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. గైడ్ టీచర్‌గా ప్రీతి వ్యవహరించారు. భూకంపాన్ని ముందే గుర్తించేలా.. ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి రాకేశ్, గైడ్ టీచర్ రమేశ్ సాయంతో భూకంపాన్ని 30 నిమిషాల ముందే గుర్తించే పరికరం రూపొందించాడు. ఎర్త్ క్విక్ అలారం ఏర్పాటు చేసుకుంటే ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించవచ్చు. భూమిలో సెన్సార్ ఏర్పాటు చేసుకుని సోలార్ బ్యాటరీతో స్తంభానికి లైట్ ఏర్పాటు చేసుకుంటే భూకంపం వచ్చే ముందు అలారం మోగుతుంది. దీనికి రూ.2వేల లోపే ఖర్చవుతుంది. -
కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి అమలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం నుంచి బుధవారం ఎన్నికల నిర్వహణపై అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతలు, పర్యవేక్షణపై సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఎస్‌హెచ్‌వోలు, వీపీవోలు ప్రతీ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పెట్రోలింగ్ బలోపేతం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో రౌడీ షీటర్లు, బైండోవర్ చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలతో ఏర్పాట్లపై సమీక్షించారు. గురువారం ఉద యం 10.30 గంటల నుంచి మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్టాటిస్టిక్ సర్వేయలెన్స్, ప్లయింగ్ సర్వేయలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. మొదటి విడతలో లింగాపూర్, సిర్పూర్– యూ, జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో ఫారం– 1 నోటీసు ప్రకటించి 27 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్యా లెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సింగిల్ నామినేషన్లు వచ్చే స్థానాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం ఆసిఫాబాద్‌అర్బన్: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రాజ్యాంగం అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత పౌరులు ప్రాథమిక హక్కులతో ప్రశాంతంగా జీవించేందుకు రాజ్యాంగం మా ర్గదర్శకమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి పనిచేయాలని సూచించారు. అ నంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది.7ఆత్మ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలో మంగళవారం ఆత్మ చైర్మన్‌గా తాళ్లపల్లి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవలందించాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు సూచించారు. ఏవో రామకృష్ణ, ఏఈవోలు తదితరులు ఉన్నారు. ఐసీడీఎస్ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర ఆదిలాబాద్‌లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ఎర్రజెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
మహిళల ఆర్థిక ఎదుగుదలకు చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్లో డీఆర్డీవో దత్తారావు అధ్యక్షతన మంగళవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి చీరల పంపిణీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ చీరలు అందిస్తామని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న జిల్లా సమైఖ్య భవనం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాల తిరిగి చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని, జిల్లాలో 98శాతం తిరిగి చెల్లింపు జరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీతోపాటు రూ.2.70 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ.26.53 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, డీపీఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీసులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు’
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసులను అడ్డుపెట్టుకుని బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందం కారణంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు లహుకుమార్, మారుతి పటేల్, నాందేవ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌తో కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 335 సర్పంచ్ స్థానాలకు కేవలం 20 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. కాగజ్‌నగర్ డివిజన్లో 11.11శాతం, ఆసిఫాబాద్ డివిజన్లో 7.21శాతం స్థానాలు మాత్రమే దక్కాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో ప్రసాద్, కిరణ్, అరుణ్ లోయ, అనిల్ తదితరులు ఉన్నారు. -
అక్రమ కట్టడాలు కూల్చివేత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని పాత చెక్‌పోస్టు ఎదురుగా ఉన్న కాలనీలో అనుమతులు లేకుండా బీడీపీపీ భూముల్లో నిర్మించారంటూ రెండు ఇళ్లకు సంబంధించి ప్రహరీలను మంగళవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని తలుపులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ గజానంద్, తహసీల్దార్ రియాజ్ అలీ, టీపీఎస్ యశ్వంత్‌కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులు చేపట్టగా.. సీఐ బాలాజీ వరప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చినా యజమానులు స్పందించకపోవడంతోనే కూల్చివేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే.. ఇదే నెలలో గృహ ప్రవేశాలు చేయగా, అధికారుల తీరు విస్మయానికి గురిచేసిందని యజమానులు పేర్కొంటున్నారు. అదే రహదారిలో మిగిలిన నిర్మాణాలను వదిలివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీడీపీపీ భూముల్లోని అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
● ఆ విద్యార్థులంతా ఏ బడిలో చేరారు..? ● వివరాలు క్లియర్ కాకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు పాఠశాల మారే సమయంలో ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే టీసీతోపాటు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. పాఠశాల నుంచి టీసీ జారీ చేస్తూ హెచ్ఎం విద్యార్థి వివరాలను ఆన్లైన్ డ్రాప్‌బాక్స్‌లో ఉంచుతారు. సదరు విద్యార్థి కొత్తగా చేరిన స్కూల్ హెచ్ఎం డ్రాప్‌బాక్స్ నుంచి ఆ వివరాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యార్థి కొత్త బడిలో ప్రవేశం పొందినట్లు పరిగణిస్తారు. డ్రాప్‌బాక్స్ ఖాళీ చేయకుంటే ఆ విద్యార్థి ఏ పాఠశాలలో చేరనట్లుగానే భావిస్తారు. ఇలా జిల్లాలో 3,643 మంది డ్రాప్‌బాక్స్‌లో ఉండటం కలవరపెడుతోంది. బడిలో పాఠాలు వింటున్నా ఏ బడికి చెందని వారిగా మిగులుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలులు గడిచినా ఇంకా వారి వివరాలు డ్రాప్బాక్స్లోనే ఉండిపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై ఇటీవల రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు జూమ్ మీటింగ్ ద్వారా ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవో, సీఆర్పీలతో సమీక్షించారు. డెడ్‌లైన్ విధించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంతోనే సమస్య జిల్లాలో 1,263 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, కేబీజీబీలు ఉన్నాయి. 18 జూనియర్ కళాశాలు ఉన్నాయి. పాఠశాలల్లో 92 వేల మంది, కళాశాలల్లో 4,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు, టీసీలు ఇవ్వడం గత నెల వరకు దాదాపు పూర్తయ్యింది. అయితే టీసీలు పొంది విద్యార్థులు పాఠశాలలు మారే సమయంలో యూడైస్ ప్లస్‌లోని డ్రాప్‌బాక్స్‌లో నమోదవుతారు. వీరు కొత్త బడిలో చేరితే సంబంధిత పాఠశాలల యాజమాన్యం వారి వివరాలను డ్రాప్‌బాక్స్ నుంచి తీసుకుంటుంది. అయితే కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో 3,643 మంది ఇంకా డ్రాప్బాక్స్లోనే ఉన్నారు. విద్యాశాఖ లెక్కల పరిధిలోకి వారు రావడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. స్కూళ్లలో చదువుకుంటున్నా బడిబయట పిల్లలుగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. తల్లిదండ్రులు చొరవ తీసుకుని 11 అంకెల పర్మినెంట్ అకౌంట్ నంబర్(పెన్) ఆధారంగా ఆన్లైన్లో వివరాలు తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. గిరిజనులే అధికం.. జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో గిరిజనులు నివాసం ఉంటున్నారు. నిరక్ష్యరాసులు కావడం, అవగాహన లేకపోవడంతో గిరిజన విద్యార్థులే ఎక్కువ మంది డ్రాప్‌బాక్స్‌లో ఉంటున్నారు. టీసీ తీసుకుని వెళ్లిపోతే మళ్లీ అసలు స్కూల్లో చేరుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. కొందరు తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలస వెళ్లిపోతే వారి సమాచారం తెలియడం లేదు. సంబంధిత సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది డ్రాప్‌బాక్స్‌లో ఉన్న విద్యార్థులను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి ప్రవేశాలు సక్రమంగా చేపడితే ఈ సమస్య ఉత్పన్నం కాదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
కట్టుబాట్లు పాటిద్దాం.. ఖర్చులు తగ్గిద్దాం
కెరమెరి: వివాహాది శుభకార్యాల్లో కట్టుబాట్లకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చందన్‌శావ్, మండల అధ్యక్షుడు పెందోర్ మోతిరాం అన్నారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం కార్యక్రమానికి అవసరమైన తక్కువ మంది మాత్రమే వెళ్లాలని, వధువును వరుడి ఇంటికి రాత్రివేళాల్లో తీసుకెళ్లాలని, రెడీమేడ్ మండపం పెట్టొద్దని, కట్నకానుకలు ఆర్థిక రూపంలో ఇవ్వాలని, తదితర మరో పది నిబంధనలు విధిస్తూ తీర్మానం చేశారు. దీనిని సార్మెడీలు, గ్రామ పటేళ్లు, దేవారీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో నాయకులు జంగు, సోము, మడావి రఘునాథ్, దండు, తుకారాం, భీంరావు, ప్రభాకర్, జాలింశావ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పోరు గర్జన’కు అనుమతివ్వాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసీ ఆస్తిత్వ పోరు గర్జన సభకు అనుమతివ్వాలని ఆదివాసీ సంఘాల నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం ఇచ్చారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి మారు తి మాట్లాడుతూ డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో నిర్వహించే సభకు ఆదివాసీ రాష్ట్ర నాయకులు, ప్రజలు హాజరవుతారని తెలిపారు. చట్ట బద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన ఎజెండాతోపాటు ఆది వాసీల ఆస్తిత్వం, హక్కుల కోసం సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావ్, నాయకులు సుధాకర్, జగన్, యాదోరావ్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జీవో నం.12 సవరించి భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ నాలుగు స్కీంలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో 12ను విడుదల చేసిందని తెలిపారు. బీమా కంపెనీలకు అక్రమంగా నిధులు కూడా బదిలీ చేశారని ఆరోపించారు. తక్షణమే సీఎస్సీ హెల్త్ టెస్టులు రద్దు చేస్తూ కార్మికులకు హెల్త్ కార్డులు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, ఆనంద్‌రావు, రవి, రాజన్న, తిరుపతి, కమలాకర్, రాంచందర్, రాజన్న పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీలేని రుణాలు
ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా నుంచి మంత్రి సీతక్క, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీవోలు, మహిళా సమాఖ్య సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 25లోగా చీరల పంపిణీతోపాటు మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందించడం పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. ఈ నెల 25న కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో చీరలు పంపిణీ, చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో దత్తారావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల బీమా పెంపు ఆసిఫాబాద్‌అర్బన్: భవన నిర్మాణ కార్మికుల బీమా సాయం పెంచినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సహజ మరణానికి బీమా సాయాన్ని రూ.1.20 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచిందని తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ప్రమాద బీమాను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. బీమా పథకాలు, గ్రూప్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి, ఇన్చార్జి సహాయ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల సొంతింటి ‘కల’!
సిర్పూర్(టి): జిల్లాలోని గిరిజనులకు సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన గిరిజన పల్లెల్లో అటవీశాఖ నిబంధనలు అడ్డుగా మారాయి. అటవీశాఖ పరిధిలో గ్రామాలు ఉన్నాయని, రిజర్వ్ ఫారెస్ట్ అంటూ అధికారులు పనులు అడ్డుకుంటున్నారు. దశాబ్దాలుగా నివాసముంటున్న వారు అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు మంజూరై నెలలు గడుస్తున్నా జిల్లాలోని పలు గ్రామాల్లో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ‘పైలెట్’ గ్రామంలోనూ.. సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత కంటే ముందే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు మంజూరు కావడంతో గ్రామస్తులు సంబురపడ్డారు. ఎంతో ఆశగా నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే అటవీశాఖ అధికారులు నిర్మాణ పనులు నిలిపివేశారు. ఒకవైపు ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఎంపిక చేస్తే.. మరోవైపు అధికారులు గ్రామం అటవీశాఖ పరిధిలో ఉందంటూ అడ్డుకోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి జీపీ పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని అటవీశాఖ అధికారులు, ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వేలు నిర్వహించారు. సర్వే రిపోర్టులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బెజ్జూర్, పెంచికల్పేట్, కౌటాల మండలాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. -
ప్రారంభమైన బాల వైజ్ఞానిక ప్రదర్శన
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో సోమవారం 53వ రాజ్యస్తరీయా బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. జిల్లా సైన్స్ అధికారి మధుకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 400 మంది విద్యార్థులు ఏడు అంశాలపై 300 ప్రదర్శనలు నమోదు చేసుకున్నారనన్నారు. ఇందులో 280 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, 120 ఇన్స్పైర్ మనాక్ ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉన్నట్లు పేర్కొన్నారు. 20 మందితో కూడిన జ్యూరీ కమిటీ సభ్యులు(జడ్జీలు) పరిశీలించి 33 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. -
గుణాత్మక విద్యను అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీడీవో పలు సూచనలు చేశారు. ఐదు రోజులపాటు నిర్వహించే శిక్షణను ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేర్చుకున్న నూతన విద్యా విధానాలతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎస్వో షేకు, హెచ్ఎం లక్ష్మయ్య, రిసోర్స్పర్సన్లు అమరేందర్, మహేశ్వర్ పాల్గొన్నారు. -
వైన్‌షాపు ఎత్తివేయాలని మహిళల ధర్నా
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం గ్రామ పంచాయతీ పంచశీల నగర్లో ఏర్పాటు చేసిన వైన్‌షాప్‌ను ఎత్తివేయాలని మహిళలు సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈజ్గాం చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఉండటంతో మందుబాబులతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. గంటపాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు మహిళలకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు మమత రానా, కాజల్ బిశ్వాస్, సుచిత్ర, డీవైఎఫ్ఐ ఉపాధ్యక్షురాలు నిఖిల్, నాయకులు ఇంద్రమండల్, ప్రకాశ్, రాణా, ప్రశాంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా పూరి గుడిసెలో..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎంతో సంబురపడ్డాం. కానీ అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఏళ్లుగా పూరి గుడిసెలో పిల్లలతో కలిసి ఉంటున్నాం. సొంతిళ్లు కట్టుకోవాలనే కల కలగానే మిగిలిపోతోంది. – సుమన్‌బాయి, లబ్ధిదారు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న మేడిపల్లి గ్రామ పంచాయతీలోని 17 మంది, పూసిగూడ గ్రామంలోని 20 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. మిగితా లబ్ధిదారుల స్థలాలకు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ప్రవీణ్‌కుమార్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో -
టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ నెల 25న ప్రధాన మంత్రికి ఈ– మెయిల్, పోస్టు ద్వారా వినతిపత్రాలను పంపిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఎంపీలను కలిసి విన్నవిస్తామన్నారు. ఎన్సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 ఆగస్టు 23 ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభ్యులు సుభాష్, రవికుమార్, శ్రీనివాస్, శివ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భీం పోరాటం స్ఫూర్తిదాయకం
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురంభీం పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కెరమెరి మండలం జోడేఘాట్‌ను సందర్శించి భీంకు నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. మ్యూజియంలోని గుస్సాడీ ప్రతి మలు, ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు తిలకరించారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ హ క్కుల కోసం భీం సాగించిన పోరాటం మరువలేని దన్నారు. ఇలాంటి పుణ్యభూమిని సందర్శించడం అదృష్టమని పేర్కొన్నారు. అంతకు ముందు ఆది వాసీలు పూలమాలతో ఎస్పీకి స్వాగతం పలికారు. తలపాగా చుట్టి నుదుటిన తిలకం దిద్దారు. గిరిజనుల భద్రతపై ప్రత్యేక దృష్టి మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ గ్రామాల్లోని ఆదివాసీలకు 50 బ్లాంక్లెట్లు, యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
● 335 పంచాయతీల్లో 162 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయింపు ● గిరిజన ప్రాంతాల్లో అధికం ఎస్టీలకే.. ● బీసీలకు తగ్గిన స్థానాలు
ఆసిఫాబాద్: జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా రిజర్వేషన్లు కేటాయించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం 50 శాతం మించకుండా ఖరారు చేశారు. ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు సైతం చేపట్టారు. రెండు రోజులుగా ఎంపీడీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఎస్టీలకే అధికం.. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా కేటాయించారు. సర్పంచ్ స్థానాలకు ఆర్డీవో, వార్డు సభ్యులకు ఎంపీడీవోలు నిబంధనల మేరకు రిజర్వేషన్లు నిర్ణయించారు. మహిళల రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా ఖరారు చేశారు. 335 పంచాయతీల్లో 198 ఎస్టీలు, 32 ఎస్సీలు, 20 బీసీలు, 85 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మొత్తం పంచాయతీల్లో 162 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఏజెన్సీలోని జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్‌లో మొత్తం స్థానాలు ఎస్టీలకే కేటాయించగా, కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి, వాంకిడిలోనూ వారికే ఎక్కువ స్థానాలు రిజర్వ్ చేశారు. అలాగే 2,874 వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధికంగా 1,660 ఎస్టీలకు, 226 ఎస్సీలు, 231 బీసీలు, 757 జనరల్ కేటగిరీకి ఖరారు చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో అధిక స్థానాలు ఎస్టీలకే కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించగా, తాజాగా కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రొటేషన్ పద్ధతి అమలు చేశారు. త్వరలో షెడ్యూల్.. జిల్లాలో 3,53,895 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 2,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఇలా.. మండలం పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ ఆసిఫాబాద్ 27 19 1 3 4 బెజ్జూర్ 22 9 4 00 9 చింతలమానెపల్లి 19 9 2 1 7దహెగాం 24 5 6 1 12జైనూర్ 26 26 - - -కాగజ్‌నగర్ 28 9 3 6 10 కెరమెరి 31 23 1 - 7కౌటాల 20 10 3 1 6లింగాపూర్ 14 14 - - -పెంచికల్పేట్ 12 2 3 1 6రెబ్బెన 24 4 6 3 11సిర్పూర్–టి 16 6 2 2 6సిర్పూర్–యూ 15 15 - - -తిర్యాణి 29 26 - - 3వాంకిడి 28 21 1 2 4 -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారి 20 నెలలు గడుస్తున్నా నేటికీ కార్మికులకు పాత పద్ధతిలోనే పంచాయతీ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. జీవో నం.60 ప్రకారం వేతనాలు అందించాలని కలెక్టర్‌కు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శి శంకర్, నాయకులు కృష్ణమాచారి, సంజీవ్, మల్లేశ్, వినోద్, ప్రభాకర్, అశోక్, బాలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరణించిన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని జైనూర్ మండలం నాయక్‌తండాకు చెందిన జాదవ్ సుజాత దరఖాస్తు చేసుకుంది. రేషన్ కార్డు మంజూరు చేయాలని జిల్లా కేంద్రానికి చెందిన పెంద్రం సత్యవతి అర్జీ అందించింది. గీత కార్మికుడినైన తనకు లైసెన్స్ మంజూరు చేయాలని దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన కొండ్ర భాస్కర్‌గౌడ్ విన్నవించాడు. తన పట్టా భూమిని ఇతరు కబ్జా చేశారని, విచారణ చేప ట్టి న్యాయం చేయాలని తిర్యాణి మండలం చెలిమల కొలాంగూడకు చెందిన టేకం గంగారాం దరఖాస్తు కోరాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జైనూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్రీమంత, కాగజ్‌నగర్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన ఫర్జీన్ సుల్తానాతోపాటు రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామస్తులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలల వేతనం ఇప్పించాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన బోర్ మెకానిక్ మహమ్మద్ అమీనొద్దీన్ వేడుకున్నాడు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా రు. గతంలో అందించిన దరఖాస్తుల వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు.రోడ్డు లేక అవస్థలు రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని కాగజ్‌నగర్ మండలం నవేగాం, నాయకపుగూడ, లైన్‌గూడ, ఎల్లాపూర్ గ్రామాల ఆదిమ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి మండల కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో గుంతల పడి బురదమయంగా మారుతుందన్నారు. అత్యవసర సమయంలో రోగులను, ప్రసవం కోసం గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతున్నామని అన్నారు. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. -
‘డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీలకు మొండిచేయి’
ఆసిఫాబాద్: డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో జీవో 46 ప్రతులు దహనం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో డీసీసీ పదవులు బీసీలకు ఒక్కటి కూడా ఇవ్వక పోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు బీసీలపై ప్రేమ ఉంటే 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ అవుడపు ప్రణయ్, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, సంఘ నాయకులు సిరికొండ సాయికృష్ణ, జూలూరి విలాస్, చాపిడి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేస్తోంది!
వాంకిడి: అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పేరుతో సమీకృత పాఠశాల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నిర్మించేందుకు అధికారులు స్థలాలు పరిశీలించారు. గతేడాది స్థల సేకరణ పూర్తికాగా ఇటీవల టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. దీంతో త్వరలో సమీకృత విద్యాలయ భవన నిర్మాణానికి పునాదులు పడనున్నాయి. వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఈ మేరకు కంపెనీ జీఎం మహీదర్ ఇటీవల స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్వహించే భూమిపూజ కార్యక్రమం అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల్లో నిర్మాణం..ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించగా మొదటి విడతలోనే ఆసిఫాబాద్ నియోజకవర్గానికి అవకాశం దక్కింది. ఈ మేరకు జిల్లా అధికారులు త్వరితగతిన స్థల సేకరణ ప్రక్రి య పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో సమీకృత విద్యాలయ భవనాల నిర్మాణానికి త్వరలో పునాదులు పడనున్నాయి. ఇందుకు వాంకిడి మండలంలోని ఇందాని గ్రామం నెలవుగా మారింది. ఇందాని గ్రామ శివారులోని సర్వే నంబర్ 324 లో గల 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రూ.200 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతో పాటు సమీపంలోని గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయని మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో నిర్మించనున్నారు. సుమారు 3000 మంది విద్యార్థులు కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా ఒకే చోట చదువుకునేలా భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలు నిర్మించనున్నారు. ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. సుమారు 25 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ భవనాలు, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆటస్థలాలు, హాస్టల్ భవనాలు, సిబ్బందికి నివాస సముదాయాలు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మనసికోల్లాసం కోసం వివిధ క్రీడలకు ప్రత్యేక మైదానాలు, వ్యాయామ శాలలు, గ్రంథాల యం, డైనింగ్ హాల్, తదితర సౌకర్యాలు కల్పిస్తా రు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా సమీకృత భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్
కాగజ్‌నగర్‌టౌన్: ఫిట్ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని ఆదివా రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొ న్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 5కే ర న్ శారీరక దృఢత్వం కోసమే కాకుండా యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఐ క్యతను పెంపొందిస్తుందన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్లో పాల్గొన్న యువతీయువకులను అభినందించారు. రన్లో పాల్గొన్న వారికి బ హుమతులు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు శ్యాంరావు, సత్యనారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు అడుగు
ఆసిఫాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అడుగు పడింది. రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 46ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించనున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లాలో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేశా రు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 2024 ఫిబ్రవరి 1న గత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లాలో 335 పంచాయతీలు..జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు జరపడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నాహక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, శాంతి భద్రతలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 198, ఎస్సీ 32, బీసీ 20, జనరల్ 85 స్థానాలు కే టాయించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 22 వరకు ఓటరు జాబితాలోని అ భ్యంతరా లు పరిష్కరించగా, ఆదివారం తుది జాబితా ప్రకటించారు. సమస్యాత్మక, అతి స మస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా సేకరించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. -
‘సత్యసాయి బోధనలు శాంతికి మార్గదర్శకాలు’
ఆసిఫాబాద్‌అర్బన్: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని, సత్యసాయి బాబా చేసిన సేవ, ధర్మ మార్గం ఎల్లవేళలా అనుసరణీయమని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన శ్రీ సత్యసా యి బాబా శత జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సేవే పరమావధిగా సేవ కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారని కొనియాడారు. ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో సంపత్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జైనూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రత విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతి భద్రతల విషయంలో రాత్రి పర్యవేక్షణ, పికెటింగ్, పెట్రోలింగ్‌ను కొనసాగించాలని ఎస్సై రవికుమార్‌కు సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేశ్ ఉన్నారు. -
నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని రిటైర్మెంట్ భవనంలో తెలంగాణ అంగన్వాడీటీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడే అవకాశముందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలన్నారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ పేరుతో వాహనాల్లో ఆహారాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని, దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల అవసరం లేకుండా పోతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3నుంచి 6 సంవత్సరాల పిల్లలను విద్యాశాఖలో విలీనం చేసి, ఐసీడీఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి త్రివేణి, మాచర్ల వినోద, అరుణ, ఉమాదేవి, సువర్ణ, అనసూర్య, రాధా, మల్లేశ్వరీ, సరిత, నిర్మల, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన ధర్మయుద్ధం
ఉట్నూర్‌రూరల్: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ధర్మయుద్ధం సభ నినదించింది. అప్పటిదాకా పోరాటం ఆగదని సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇదే డిమాండ్‌తో ఆదివాసీలు ఉట్నూర్‌లోని ఎంపీడీవో గ్రౌండ్లో నిర్వహించిన ఆదివాసీ ధర్మయుద్ధం సభ విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి తొమ్మిది తెగల ఆదివాసీలు, ఆయా సంఘాల నాయకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తుడుం మోగిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ మేధావులు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు ఎవరేమన్నారంటే..ధర్మయుద్ధం సభకు హాజరైన తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులు, మేధావులు, పెద్దలు ముందుగా ప్రసంగించారు. రాంజీగోండు, కుమురంభీం, సూరు, ఇతర ఆదివాసీ పోరాట యోధులున్న కాలంలో లంబాడీలు లేరని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని లంబాడీలు వేరే కులాల్లో కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. ఆదివాసీలకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు పొందుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అన్ని రంగాల్లో ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని వాపోయారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ జాతికి ఎవరూ అన్యాయం చేయొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. సమాజంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆదివాసీ పెద్దలు, మేధావులు, నాయకులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తానని తెలిపారు. ఆదివాసీల కోసం పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని, ఇప్పుడు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సభకు జీసీసీ చైర్మన్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, సభ సమన్వయ కర్త మెస్రం దుర్గు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, వివిధ సంఘాల నాయకులు నగేశ్, గణేశ్, దాదేరావ్, నాగు, రాజు, జంగు, వెంకట్రావ్, ప్రభాకర్, అశోక్, విఠల్‌రావ్, విజయ్, సంధ్యారాణి, రామారావు, గంగారాం, జైవంత్‌రావ్, పోచయ్య, కనక యాదవ్రావ్, పుర్క బాపురావ్, మహారాష్ట్ర ఆదివాసీ నేతలు తిరుమల్ మహా బావుజీ, సువర్ణ వేర్కడే తదితరులు హాజరయ్యారు. అడుగడుగునా ఆంక్షలుఆదివాసీ ధర్మయుద్ధ సభ నేపథ్యంలో ఉట్నూర్ పట్టణంలో బంద్ పాటించారు. పట్టణంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సభకు వెళ్లేదారులు, అష్టకూడలి, అంబేడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఐటీడీఏ ఏరియా, తెలంగాణ చౌక్, కేబీ కాంప్లెక్స్, పాత ఉట్నూర్, ఎక్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. ఈ కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్స్ రోడ్డు వద్దకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, కరీంనగర్, రామగుండం సీపీలు గౌస్ ఆలం, అంబర్ కిషోర్ ఝా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ సభ శాంతియుతంగా సాగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సంప్రదాయ నృత్యాలు చేస్తున్న ఆదివాసీ విద్యార్థులు, కళాకారులు భారీగా సభకు తరలివచ్చిన ఆదివాసీలు సభ తీర్మానాలివే.. -
పేద గిరిజనులకు కేంద్రం అండ
ఆసిఫాబాద్: గూడు లేని పేద గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని పీవీటీజీ లబ్ధిదారులకు పీఎం జన్మన్ కింద మంజూరైన ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరు కాని అర్హులకు రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. పీవీటీజీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మల్టీపర్సస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాకు 2,169 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో అత్యధికంగా ఆసిఫాబా ద్, తిర్యాణి మండలాలకే వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎవరికి వారే ఇళ్లు నిర్మించుకుంటే నాణ్యత ప్రమాణాలు బాగుంటాయని చెప్పారు. జెడ్పీ సీఈవో లక్ష్మీనారా యణ, హౌసింగ్ పీడీ ప్రకాశ్, డీఈ వేణుగోపాల్, విండో చైర్మన్ అలీబిన్అహ్మద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్రావు, మంజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. తిర్యాణి మండలం సుంగాపూర్‌లో.. తిర్యాణి: మండలంలోని సుంగాపూర్ గ్రామంలో ఎంపీ గోడం నగేశ్ 18మంది జన్మన్ పథకం లబ్ధి దారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఇళ్ల మంజూ రు పత్రాలు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స మావేశానికి హాజరై మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారికి వచ్చే విడతలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ డేవి డ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, నాయకులు హన్మాండ్ల జగదీశ్, శ్రీదేవి, ఆత్రం చంద్రశేఖర్, గుణవంత్‌రావు, రమేశ్ తదితరులున్నారు. -
ప్రణాళికతో ముందుకు సాగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: లక్ష్యాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలని కాగజ్‌నగర్ అసిస్టెంట్ ట్రెజరీ అధికారి పంకజ్ పాల్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్, ఇందుకు పాటించాల్సిన సలహాలు, సూచనలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విజయం ఎవరి సొత్తు కాదని, నిజాయితీగా కష్టపడితే తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించారు. మంచిర్యాల అసిస్టెంట్ ఆడిట్ అధికారి అరవింద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్ పాల్గొన్నారు. -
ఆర్టీవో అవినీతిపై విచారణ చేపట్టాలి
కాగజ్‌గనర్ టౌన్: ఆసిఫాబాద్ ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కోసిని గ్రామంలోగల ఆయన నివా సంలో విలేకరులతో మాట్లాడారు. ఆసిఫాబాద్ ఆర్టీ వో ఆఫీస్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింద ని, ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ అధికారులు వస్తే ముందే సమాచారం తెలుస్తుందని, ఆరోజు ద ళారులు, ఏజెంట్లు కార్యాలయానికి రాకుండా జాగ్ర త్త పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ఆదాయం తగ్గిందని, ఆర్టీఐ అధికారులు వాహనదారులను వేఽధిస్తున్నారని ఆరో పించారు. స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నట్లు తెలిపారు. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి కు లాంతర వివా హం చేసుకుని హత్యకు గురైతే బాధిత కు టుంబానికి చట్టప్రకారం రావాల్సిన పరిహారం నెల గడిచినా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్ల ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ దివారం నిర్వహించనున్న ప్రతిజ్ఞా దివస్‌లో కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట శ్యాంరావు, సత్యనారాయణ, వెంకటేశం, అంజన్న, హన్మంతు తదితరులున్నారు. -
ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం
ఉదయం, సాయంత్రం విద్యార్థినులకు మెళకువలు నేర్పిస్తూ మంచి క్రీ డాకారిణులుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధిశాఖ క్రీడారంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే ప్రోత్సాహంగా ఉంటుంది. – అరవింద్, హ్యాండ్‌బాల్ కోచ్ మరిన్ని వసతులు కల్పించాలి పాఠశాలలోని విద్యార్థి నులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉంది. సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ తదితర వసతు లు కల్పించాలి. ఇప్పటివరకు ఖోఖోలో 20మంది జాతీయ, 60 మంది రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. – తిరుమల్, ఖోఖో కోచ్ జాతీయ స్థాయిలో రాణించేలా.. అథ్లెటిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో 30 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక బంగారు, రెండు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించేలా బాలికలకు మంచి శిక్షణ ఇస్తున్నాం. – విద్యాసాగర్, లెవల్–2 అథ్లెటిక్స్ కోచ్ -
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆసిఫాబాద్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ నితికా పంత్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ యాపల్‌గూడ రెండో పోలీస్ బెటాలియన్ నుంచి బదిలీపై వచ్చిన నితికా పంత్ శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలపారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉండి చట్టపరమైన సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాలికలు, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గతంలో సంగారెడ్డి ఏఎస్పీగా, మేడ్చల్ డీసీపీగా, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఆదిలాబాద్ బెటాలియన్ కమాండెంట్‌గా నితికా పంత్ విధులు నిర్వర్తించారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ఇప్పటివరకు తొమ్మిదిమంది ఎస్పీలు ఇక్కడ విధులు నిర్వహించారు. తాజాగా తొలి మహిళా ఎస్పీగా నితికా పంత్ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. -
మంచి శిక్షణ ఇస్తున్నారు
మా పాఠశాలలో కోచ్‌లు రోజూ మంచి శిక్షణ ఇస్తున్నారు. వారి సలహాలు, సూచనలు పాటిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తున్నాం. ప్రస్తుతం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. – మాడావి చిన్నుబాయి, పదోతరగతి అంతర్జాతీయ పోటీల్లో గెలవాలి నేను రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నా లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే. ఇదే లక్ష్యంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ కోచ్‌ల పర్యవేక్షణలో కష్టపడి సాధన చేస్తున్నాను. – ఆడే నందిని, పదోతరగతి కోచ్ కావాలని ఉంది ఖోఖోలో రెండుసార్లు జా తీయ, ఎనిమిది సార్లు రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని వివిధ పతకాలు సాధించా ను. భవిష్యత్‌లో కోచ్‌గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. – కుమ్మ సత్యశీల, పదోతరగతి ఆరు స్వర్ణాలు సాధించాను హ్యాండ్‌బాల్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పా ల్గొని విజయం సాధించా లనేది నా లక్ష్యం. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి పోటీ ల్లో ప్రతిభ కనబర్చి ఆరు బంగారు పతకాలు సాధించాను. జాతీయ స్థాయిలో రెండుసార్లు పాల్గొన్నాను. – సిడాం అనిత, విద్యార్థిని -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర ఖోఖో పోటీలకు ఆసిఫాబాద్ ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులు కోరెంగ బాపురావ్, ఆత్రం పవన్‌కుమార్ ఎంపికైనట్లు హెచ్ఎం కనక కర్నూ, పీడీ హీరాబా యి శనివారం తెలిపారు. వీరు ఈనెల 23నుంచి 25వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతగి జేపీఎస్ఎస్లో నిర్వహించనున్న అండర్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న విద్యార్థులను శనివారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో రమాదేవి, డీవైఎస్వో అశ్వఖ్ హైమద్, జిల్లా పాఠశాల క్రీడల అధికా రి వెంకటేశ్, గిరిజన క్రీడల అధికారి షేకు, ఏసీఎంవో దువ్, జీడీడీవో శకుంతల, ఏటీడీవో శివకృష్ణ, హెచ్‌డబ్ల్యూవో మధుకర్, ఖేలో ఇండియా కోచ్ కడతల రాకేశ్, అధ్యాపకులు అభినందించారు. -
జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాల పంట పండిస్తున్నారు. ఈ పాఠశాలను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతున్నారు. పాఠశాలలోని ము
● క్రీడాకారుల కార్ఖానాగా స్పోర్ట్స్ స్కూల్ ● పతకాల పంట పండిస్తున్న బాలికలు ● రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణింపు ● సర్కారు ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు విద్యార్థినులు సాధించిన ఘనత ఈ పాఠశాలలో మంచి ప్రతిభ, నైపుణ్యం గల ము గ్గురు కోచ్‌లు బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, ఖోఖో కోచ్ తిరుమలేశ్ నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతున్నారు. పాఠశాల ప్రారంభించిన 2019 నుంచి 2025 వరకు 76మంది విద్యార్థినులు జాతీయ, 386 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ముగ్గురు బంగారు పతకాలు, 12 మంది కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. అథ్లెటిక్స్ విభాగంలో 30 మంది వి ద్యార్థులు పాల్గొనగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. ముగ్గురు జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. హ్యాండ్‌బాల్‌లో 35మంది జాతీ య స్థాయికి, ఒకరు అంతర్జాతీయ స్థాయిలో ఆడా రు. ఖోఖోలో 20మంది జాతీయస్థాయిలో ఆడి పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో 386మంది పాల్గొనగా.. ఇందులో 113 బంగారు పతకాలు, 25 సిల్వర్, 44 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ప్రతీ ఆటలో ఓటమి ఎరుగని క్రీడాకారిణులుగా సత్తా చాటుతున్నారు. జాతీయస్థాయి జావెలిన్ త్రో అండర్ 14 విభాగంలో 40 మీటర్ల త్రోలో దేశంలోనే తొలి క్రీడాకారిణి విద్యార్థిని సాక్షి రికార్డు సాధించింది. ఈ క్రీడా పాఠశాల ప్రారంభంలో ఇచ్చిన క్రీడా కిట్లు మినహా ఇప్పటివరకు ఎలాంటి క్రీడా సామగ్రి ఇవ్వలేదు. దీంతో క్రీడల సాధన సమయంలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని క్రీడా మైదానం కూడా సరిగా లేదు. వానాకాలంలో ఇందులో నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. రన్నింగ్ ట్రాక్ కూడా అనుకూలంగా లేదు. సింథటిక్స్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే క్రీడలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తెస్తున్న పలువురు క్రీడాకారిణుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
కార్మికుల హక్కులను హరించొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: కార్మిక హక్కులను హరించే నా లుగు లేబర్ కోడ్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని శనివారం కలెక్టరేట్ ఎదుట సీఐటీ యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి పరమైన భ ద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లను నవంబ ర్ 21, 2025 నుంచి అమలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని సీఐటీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, సమ్మె, ధర్నాలు చే సినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాలు గు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, శ్రీకాంత్, మాట్ల రాజు, సమ్మయ్య, శంకర్, మాయ, సుగుణ, ప్రభాకర్, మాన్కు, ప్రసాద్ పాల్గొన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో.. కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాల కు సిద్ధమవుతున్నారని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు సంజీవ్, రమేశ్, మల్లేశ్, తిరుపతి, సువర్ణ, సరిత, కుమారి ఉన్నారు. -
కుమురం భీం
రైతు స్థాయిలో విత్తనోత్పత్తి రైతులు దిగుబడిని ధాన్యంగా కాకుండా విత్తనంగా మలుచుకుంటే లాభదాయకమని వ్య వసాయాధికారులు సూచిస్తున్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 7పరిహారం అందించాలని ధర్నా కులదురహంకార హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి పరిహారం అందించి న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం వైవిధ్యంగా మేఘావృతమవుతుంది. చలి పెరుగుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. -
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నా రు. మండలంలోని కొలాంసాలెగూడలో శుక్రవారం పర్యటించారు. పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన నూతన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు జలపతి, కార్యదర్శి పద్మ పాల్గొన్నారు. ఎనోలి కొలాంగూడలో దుప్పట్లు పంపిణీవాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని ఎనోలి కొలాంగూడలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి శుక్రవారం రాజు ఫౌండేషన్ ద్వారా 20 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీఎం జన్మన్ పథకం కింద గ్రామానికి 19 ఇళ్లు మంజూరైనా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
‘ప్రైవేటు’లోనూ దక్కని ప్రాణం..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సర్కారు దవాఖానాలో పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే అక్కడా ప్రాణాలకు భరోసా లేకుండా పో తోంది. జిల్లా కేంద్రం మంచిర్యాలలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించడం ఆందోళన కలిగి స్తోంది. రెండ్రోజుల క్రితం జగిత్యాలకు చెందిన నాలుగు నెలల బాలుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్‌కు చెందిన ఓ బాలికకు జ్వరం రాగా వారం రోజులుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రక్తకణాలు తక్కువగా ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్న వైద్యులు.. ఆకస్మాత్తుగా గురువారం రాత్రి నుంచే బాలిక పరిస్థితి విషమించింది. పరిస్థితి చేయి దాటాక కుటుంబ సభ్యులకు చెప్పి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు. ముందస్తుగానే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. బాలిక ఉదయమే చనిపోయినా ఆస్పత్రి యాజమాన్యం చెప్పకుండా రాత్రి వరకు హైడ్రామా నడిపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పరిస్థితి గమనించి పలుమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల తర్వాత ఆందోళన చేశారు. గతంలోనూ ఈ ఆస్పత్రిలో ఓ చిన్నారి చనిపోయిన ఘటన జరిగింది. సర్కారులో అరకొర వైద్యంజిల్లా ఆస్పత్రితో సహా కమ్యూనిటీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరకొర వైద్య సేవలే అందుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి నిత్యం వందలాది మంది ఓపీ వస్తున్నారు. వారి నాడీ పట్టి చూడకుండానే ఓపీ చీటిపై నాలుగైదు రకాల మందులు రాసి పంపిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే తప్ప శ్రద్ధ వహించడం లేదు. ఈ నెల 10న మందమర్రికి చెందిన కాసర్ల తిరుపతి తన కొడుకు హర్షవర్ధన్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని నేరుగా ప్రజావాణిలో కలెక్టర్‌కే ఫిర్యాదు చేశాడు. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాల వారు డబ్బు ఖర్చు చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. సర్కారు దవాఖానాల్లో పని చేస్తున్న చాలామంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లను నడుపుతున్నారు. ఇటీవల ఓ మహిళ చెవి నొప్పితో జిల్లా ఆస్పత్రికి వెళ్లగా.. ఓసారి చెవిని చూసి ఓ చీటిపై మందులు రాసి మరో చీటి ఇచ్చి తమ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. పర్యవేక్షణ కరువుప్రైవేటు ఆస్పత్రులు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ తనిఖీలు కరువయ్యాయి. ఆస్పత్రుల అనుమతులు, రెన్యూవల్ చేసేటప్పుడు కనీస సౌకర్యాలు ఉన్నాయా..? లే వా..? అని పర్యవేక్షించడం లేదు. గతంలో పలు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. పలు క్లినిక్‌ల్లో అర్హతలకు మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. అలాంటి ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ప్రైవేటు ఆస్పత్రుల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో ఇటీవల కాలంలో అత్యవసర సేవలు, మాతాశిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులు, ఆపరేషన్లు చేస్తూ రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇక గుండె, ఆర్థో సంబంధిత వైద్యంతోపాటు పలు రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటుకు యాజమాన్యం విపరీతమైన ఖర్చులు చేస్తున్నాయి. దీంతో ఆ పెట్టుబడి మళ్లీ రాబట్టేందుకు రోగులపై ఫీజుల భారం మోపుతున్నారు. కొందరు ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, మధ్యవర్తులతో రెఫర్ చేయిస్తూ కమీషన్లు ఇస్తున్నారు. వీటన్నింటిపైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే నియంత్రణకు వచ్చే అవకాశం ఉంది. -
జిల్లా కన్వీనర్‌గా కేసరి ఆంజనేయులు గౌడ్
రెబ్బెన: ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్‌గా రెబ్బెన మండలం గోలేటికి చెందిన కేసరి ఆంజనేయులుగౌడ్ నియామకమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జిల్లా కమిటీని శుక్రవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా ఆంజనేయులు గౌడ్, కోకన్వీనర్లుగా బండి రాజేందర్, చేపూరి నవీన్‌గౌడ్, షిండే సోమేశ్వర్లను నియమించారు. ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ ప్ర ధాని మోదీ పిలుపుతో స్వదేశీ సంకల్పం ద్వా రా స్వావలంబన వైపు దేశం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో ప్రజా ఉద్యమం మొదలైందన్నారు. సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజు ఉద్యమం ప్రా రంభం కాగా, డిసెంబర్ 25న వాజ్‌పేయ్ జ యంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. -
ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్‌గూడ పోలీస్ కమాండెంట్ నితిక పంత్ జిల్లాకు రానున్నారు. ఐదున్నర నెలలకే..జూన్ 5న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా కాంతిలాల్ పాటిల్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఐదున్నర నెలలు మాత్రమే విధులు నిర్వర్తించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు. ముఖ్యంగా గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. డ్రోన్ కెమెరాలతో మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగును గుర్తించి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 72 గంజాయి కేసులు నమోదు చేసి, 122 మందిని అరెస్టు చేశారు. రూ.1,15,41,002 విలువైన 2,245కిలోల గంజాయిని పట్టుకున్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపి నిందితులను అరెస్టు చేయించారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడిన గుజరాత్‌కు చెందిన పంకజ్ లాలాజీ, శైలేష్ సల్లుభాయ్లను అరెస్టు చేసి, డబ్బులు రికవరీ చేయించారు. సైబర్ నేరాల నుంచి రక్షించుకునే విధానాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. -
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
దహెగాం(సిర్పూర్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరిధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో సొసైటీ, ఐనం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లర్లు కోత విధిస్తున్నారని తెలిపారు. యాసంగి ధాన్యానికి బోనస్ అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో దత్తారావు, డీసీఎస్వో వసంత లక్ష్మి, డీఏవో వెంకటి, ఏడీఏ మనోహర్, సహకార సంఘం చైర్మన్ తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, ఏవో రామకృష్ణ, సీఈవో బక్కయ్య తదితరులు పాల్గొన్నారు. బొప్పురం రోడ్డు నిర్మాణానికి భూమిపూజదహెగాం మండలం బొప్పురం గ్రామానికి మంజూరైన బీటీరోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమి పూజ చేశారు. ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రోడ్డు నిర్మాణంతోపాటు, ఒర్రైపె వంతెన కోసం రూ.3.13 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. -
బడులకు నిధుల వరద
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిధులు మంజూరయ్యాయి. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 శాతం నిధుల ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మండల విద్యా వనరుల కేంద్రం, క్లస్టర్ పాఠశాల సముదాయాలకు కూడా నిధులు మంజూరయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయులకు ఊరట లభించనుంది. నిధులు విడుదల ఇలా..జిల్లాలోని 715 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త, ఆశ్రమ పాఠశాలలతోపాటు 67 స్కూల్ కాంప్లెక్స్ సముదాయాలు, 15 ఎమ్మార్సీలకు మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. ఆయా పాఠశాలల్లో 37,510 మంది విద్యార్థులు చదువుతున్నారు. 15 ఎమ్మార్సీలకు ఒక్కో దానికి రూ.45,000, 67 క్లస్టర్ పాఠశాల సముదాయాలకు రూ.16,500 చొపున విడుదలయ్యాయి. బడిబాట కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.1000, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2000, గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్కు వందశాతం మంజూరయ్యాయి. పాఠశాలలకు రూ.500 చొప్పున కేటాయించారు. రెండేళ్ల నుంచి నిధులు వేగంగా మంజూరవుతుండడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిధుల వినియోగానికి సంబంధించి మాత్రం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్ట(పీఎఫ్ఎంఎస్)తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా..ప్రభుత్వం పాఠశాల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏటా రెండు విడతలుగా నిధులు విడుదల చేస్తుంది. విద్యార్థులు 1 నుంచి 30 మంది ఉంటే రూ.10 వేలు, 31 నుంచి వంద మందిలోపు ఉంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 500 మంది వరకు ఉంటే రూ.75 వేలు చొప్పున కేటాయిస్తారు. ఈ నిధులను తాగునీటి, పాఠశాలలకు సంబంధించిన చిన్నపాటి మరమ్మతులు, చాక్‌పీసులు, రిజిస్టర్లు, ఇతర రికార్డులు కొనుగోలు, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ఇక మండలాలకు ఎంతో కీలకంగా ఉన్న ఎమ్మార్సీల్లో మండల విద్యాధికారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవో, మెసెంజర్లు విధులు నిర్వహిస్తారు. వీటికి మంజూరైన నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఫర్నీచర్, కంప్యూటర్ల మరమ్మతు, ఇంటర్నెట్ బిల్లులు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం వెచ్చించనున్నారు. అయితే ఈసారి పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదు.జిల్లాకు మంజూరైన నిధులుకాంపొనెంట్ పాఠశాలలు నిధులు స్కూల్ గ్రాంటు 715 రూ.77,10,000 బడిబాట 688 రూ.8,81,000 గర్ల్స్ ఎంపవర్మెంట్ 98 రూ.49,000 -
ధాన్యం మాయం..!
కౌటాల మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో ఈ నెల 19న ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మిల్లులో 1,353.700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యంలో 33,842 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ధాన్యాన్ని దారి మళ్లించిన సదరు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదించారు. సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్పేట్లోని ఓ రైస్ మిల్లులో ఈ నెల 17న అధికారులు తనిఖీలు నిర్వహించారు. 43,190 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లును సీజ్ చేశారు... ఇలా జిల్లాలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి లబ్ధి పొందుతున్నారు. కౌటాల(సిర్పూర్): ప్రభుత్వం నుంచి మిల్లింగ్ కోసం తీసుకున్న వరి ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. సీఎంఆర్ దందా ద్వారా అక్రమంగా రూ.కోట్లలో సంపాదిస్తున్నారు. ఏడాదికి రెండు సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లులకు అప్పగిస్తోంది. నిబంధనల ప్రకారం 67 శాతం బియాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఈ ప్రక్రియను కొంతమంది మిల్లర్లు అక్రమ ధనార్జనకు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబియ్యాన్ని కొని సీఎంఆర్‌గా అప్పగిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో అధికారులు దాడులు చేయగా, వేలాది బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు. గడువు ముగిసినా అంతే..జిల్లాలో 2022– 23 సంవత్సరానికి సంబంధించి మూడు మిల్లుల నుంచి 58 ఏసీకేలు(ఒక్క ఏసీకే 290 క్వింటాళ్లు), 2023– 24కు సంబంధించి 98 ఏసీకేలు రావాలి. ఈ మిల్లర్లకు పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినా లెక్క చేయడం లేదని తెలుస్తోంది. అలాగే 2024– 25లో యాసంగి సీజన్‌కు సంబంధించి పది మిల్లులకు 7,593 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ వరకు గడువు ముగిసింది. ఇంకా 28 ఏకేసీల బియ్యం అప్పగించాల్సి ఉంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి 13 మిల్లులకు 10,695 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. అక్టోబర్ 31తో గడువు ముగిసింది. ఇప్పటికీ ఇంకా 41 ఏసీకేల బియ్యం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం మళ్లీ గడువు పెంచుతుందనే ఆశతో బియ్యం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. వేల బస్తాలు పక్కదారి..అధికారులు చేపట్టిన తనిఖీల్లో సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్పేట్లోని ఓ రైస్ మిల్లులో దాదాపుగా రూ.4.45 కోట్ల విలువైన 43,190 బస్తాల ధాన్యం, కౌటాలలోని మరో రైస్ మిల్లులో రూ.3.50 కోట్ల విలువైన 33,842 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సిర్పూర్(టి), కౌటాల మండలాల్లోని రైస్ మిల్లుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో దాదాపు 77 వేల ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు మిల్లులోనే ఈ స్థాయిలో ధాన్యం గోల్మాల్ జరిగితే.. మిగితా మిల్లుల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రశ్న తలెత్తుతోంది. తనిఖీలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం.. ఆస్తులను జప్తు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని, వారికి మళ్లీ ధాన్యం ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. తనిఖీలు చేపడుతున్నాం జిల్లాలోని రైస్ మిల్లుల్లో తరుచూ తనిఖీలు చేపడుతున్నాం. మిల్లుల్లో ధాన్యం బస్తాలు తక్కువగా ఉంటే పూర్తిస్థాయిలో పంచనామా నిర్వహించి సీజ్ చేస్తాం. మిల్లర్లు గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాలి. సకాలంలో బియ్యం ఇవ్వని వారిపై చర్యలు తీసుకుంటాం. – వసంత లక్ష్మి, డీసీఎస్వో -
సమస్యాత్మక కేంద్రాల జాబితా అందించాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిలతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ ఇన్స్పెక్టర్లతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో తీసుకోవా ల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గొడవలు జరిగిన, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను తహసీల్దార్, ఎంపీడీవో, సబ్ ఇన్స్పెక్టర్ సంతకాలతో అందించాలని ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డెడికేషన్ కమిటీ కేటాయించిన ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ నెల 22లోగా ఓటరు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ, 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌లు, సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్ ఏరియాలో రోడ్డుపై నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గురువారం మార్కెట్‌ను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా డ్రెయినేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, వ్యాపారులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ఆసిఫాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుతో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన విజ్ఞానం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉందన్నారు. పుస్తక పఠనాన్ని ప్రతిఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో అన్నిరకాల పుస్తకాలతోపాటు వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్లొద్దు’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లొద్దని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జేఏసీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత రాస్తారోకో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ప్రణయ్, నాయకులు కోట వెంకన్న, వైరాగడె మారుతి, లహుకుమార్, శ్రీనివాస్, ఆనంద్, శ్రీకాంత్, సాయికృష్ణ, యాదగిరి, నాందేవ్, హనుమంతు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన మహేశ్ జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ యాదగిరి తెలి పారు. పాఠశాల ఆవరణలో గురువారం పీడీ కోట యాదగిరి, వైస్ ప్రిన్సిపాల్ రహీం, సంతోష్‌తో కలిసి విద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అండర్– 17 హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని అన్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు కర్ణాటకలో జరిగే పోటీల్లో రాష్ట్ర జట్టు తరుఫున మహేశ్ పాల్గొంటాడని తెలిపారు. -
85.55 క్వింటాళ్ల బియ్యం స్వాహా
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌకధరల దుకాణంలో భారీ అవినీతి బయటపడింది. పేదలకు పంపిణీ చేయాల్సిన 85.55 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని సేల్స్‌మెన్ పక్కదారి పట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నవంబర్ నెలలో పంపిణీ చేయాల్సిన సన్నబియ్యం పూర్తిస్థాయిలో అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు అవినీతి జరిగినట్లు గుర్తించారు. ఆలస్యంగా బయటపడిన అవినీతిపై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా వివరాలు వెల్లడించారు. ఈ– పాస్ మిషన్ ప్రకారం గతంలో మిగిలిన 94 క్వింటాళ్లు బియ్యంతోపాటు నవంబర్‌కు సంబంధించి మరో 83.94 క్వింటాళ్ల బియ్యం జీసీసీకి వచ్చాయని తెలిపారు. 175 క్వింటాళ్ల నుంచి సేల్స్‌మెన్ కుర్సెంగా రత్నకిశోర్ ఈ–పాస్ ద్వారా 97.45 క్వింటాళ్లను మాత్రమే పంపిణీ చేశాడని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు ఆర్ఐతో విచారణ చేపట్టగా.. మిగతా 85.55 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించి లెక్కలు చూపెట్టలేదన్నారు. దీంతో సదరు సేల్స్‌మెన్‌పై కేసు నమోదు చేసి, సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అవినీతికి పా ల్పడిన సేల్స్‌మెన్ నుంచి బియ్యాన్ని రికవరీ చేయించి, డిసెంబర్లో రెండు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని సివిల్ సప్లై అధికారులు వెల్లడించినట్లు తహసీల్దార్ తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతి భద్రత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డెడికేషన్ కమిటీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామని వివరించారు. ఈ నెల 23 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని ఆయన తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా ఆడిట్ అధికారి రాజేశ్వర్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బాలల హక్కులపై అవగాహన
ఆసిఫాబాద్‌రూరల్: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం మండలంలోని అంకుసాపూర్ పాఠశాలలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీసీపీవో మహేశ్ బాలల హక్కులపై అవగాహన కల్పించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ మాట్లాడు తూ బాలలు జీవించే, రక్షణ పొందే, అభివృద్ధి చెందే హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ హక్కులకు భంగం కలి గితే 1098 చైల్డ్ హెల్ప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి హక్కులపై ప్ర తిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ సిబ్బంది ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, జము న, రవళి, వెంకటేశ్వర్లు, రాణి పాల్గొన్నారు. -
బడుల బలోపేతం దిశగా..
కెరమెరి(ఆసిఫాబాద్): పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర విద్యాశాఖ నూతన ప్రణాళికలు అమలు చేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూనే.. ఉపాధ్యాయులకు సైతం ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్ర, శనివారాల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణపై విధివిధానాలపై ఎస్పీడీ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశాలు ఇలా..జిల్లాలో 67 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో అన్ని యాజామాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలు 992 ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న 2,200 మంది స్కూల్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు శుక్రవారం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఉపాధ్యాయులందరికీ ఒకేసారి కాకుండా ప్రాథమిక తరగతులు బోధించే టీచర్లలో ఈ నెల 21న సగం మందికి, 22న మిగిలిన వారికి సమావేశాలు కొనసాగుతాయి. అలాగే ఈ నెల 27న భాషా ఉపాధ్యాయులకు, ఈ నెల 28న ఇతర సబ్జెక్టుల వారికి సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయి. పీరియడ్, టాపిక్ల వారీగా వివరిస్తారు. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్లను సైతం ఇటీవల 50శాతం విడుదల చేశారు. జిల్లాలోని 67 స్కూల్ కాంప్లెక్స్‌లకు రూ.6,21,900 మంజూరు చేయగా, ఒక్కో ఎమ్మార్సీకి రూ.41,460 చొప్పున అందాయి. వీటిపైనే చర్చ..ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే వారికి సులువుగా అర్థమవుతుందనే అంశంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నారు. ఎస్ఏ, ఎఫ్ఏ పరీక్షల ఫలితాలు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, తొలిమెట్టు కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుండగా.. దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, గతేడాది నుంచి ఎంపిక పాఠశాలల్లో అమలు చేస్తున్న ఆర్టిఫిషియల్ బోధన ప్రగతిపై చర్చించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో బోధన తీరును వివరిస్తారు. ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల్లో సైన్స్ ప్రయోగాలు, పాఠశాల గ్రంథాలయాల బలోపేతం, అన్నిరకాల పరీక్షల ఫలితాలపై సమీక్షించనున్నారు. 2025– 26 స్కూల్ క్యాలెండర్ ప్రకారం ఏడు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, ఈ నెలతో నాలుగు సమావేశాలు పూర్తి కానున్నాయి. సామర్థ్యాల పెంపునకు దోహదం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాల పెంపునకు దోహదపడతాయి. ఉపాధ్యాయులందరూ ఈ సమావేశాలకు హాజరు కావాలి. రిసోర్స్పర్సన్లు వివరించే అంశాలపై అవగాహన పెంచుకుని, వాటిని పాఠశాలల్లో అమలు చేయాలి. చదువులో వెనుబడిన పిల్లలపై ప్రత్యేక శద్ధ వహించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ -
అవినీతిపై ఏసీబీ కత్తి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లంచగొండి అధికారుల్లో ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) దడ పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లాలో ఆయా శాఖల్లో అధికారులను వలపన్ని పట్టేస్తోంది. నెలనెలా రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన కొందరు అధి కారులు అత్యాశకు పోతున్నారు. ప్రతీ పనికి ఓ ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే ప్రభుత్వ శాఖల్లో చాలామంది అధికారులు లంచాలకు మరిగారు. దీంతో ఏ పని చేయాలన్నా పైసలు ముట్టజెప్పాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఆయా స్థాయిలో వ్యవస్థీకృతంగా వసూళ్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ ల్లో అధికారులు అధికంగా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వీరితోపాటు పోలీసు, లేబర్, మార్కెటింగ్, హెల్త్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సహకార, సివిల్ సప్లయి శాఖల్లోని అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. రూ.లక్షల సొమ్ము సీజ్ చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ సాగుతోంది. ఏసీబీ కేసులతో అధికారులు విధుల నుంచి సస్పెన్షన్‌కు గురవుతున్నారు. 11 నెలల్లో 20కేసులుప్రభుత్వ అధికారుల్లో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి జాఢ్యాన్ని ఏసీబీ వదిలిస్తోంది. ఫిర్యాదు ఇవ్వగానే అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో లంచగొండుల్లో వణుకు పుడుతోంది. దీంతో ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఏసీబీ వలకు చిక్కుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత 11నెలల్లో 20 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాలలో కార్యాలయాలు ఉన్నాయి. గత మేలో నస్పూర్‌లో కార్యాలయం ప్రారంభం కాగా, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వారికి ఫిర్యాదులు చేసేందుకు మరింత చేరువైంది. దీంతో బాధితులు నేరుగా కార్యాలయానికి వెళ్లే అవకాశం కలుగుతోంది. నస్పూర్‌లో కార్యాలయం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలోనే 15 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇవే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో అవినీతికి ఆస్కారమున్న కార్యాలయాల్లోకి ఆకస్మికంగా వెళ్లి ఫైళ్లు, రికార్డులు పరిశీలిస్తున్నారు. నగదు, ఆన్లైన్ అనుమానిత లావాదేవీలపై దృష్టి సారించి కూపీ లాగుతూ విచారణ చేస్తున్నారు. జాగ్రత్త పడుతున్న అధికారులుఎవరైనా బాధితులు ఏసీబీని ఆశ్రయించగానే అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. ఒక్కోసారి సినిమాల్లో మాదిరి అధికారులు వలపన్ని పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మంచిర్యాల, బెల్లంపల్లిలో ఒకేరోజు ఒకే సమయంలో ఒకే కార్మిక శాఖలో ఇద్దరు అధికారులను పట్టుకుని సంచలనం సృష్టించారు. గతంలో ఏడాదికి పదిలోపు కూడా కేసులు నమోదయ్యేవి కావు. దీంతో పౌరుల్లోనూ చైతన్యం లేక సర్కారు కార్యాలయాల్లో లంచాలు ఇవ్వడానికే చాలామంది అలవాటు పడ్డారు. ఇక కొందరైతే ఆయా శాఖల్లోని అధికారులకు డబ్బులు చెల్లించుకోలేని వాళ్లు తమ సమస్యలు పరిష్కారం కాక ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోవడంతో చాలామంది అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఏసీబీని ఆశ్రయిస్తున్నారని లంచం తీసుకునేందుకు భయంతో మెసులుకుంటున్నారు. మరికొందరు అధికారులు మాత్రం తమ వక్రబుద్ధిని వేర్వేరు మార్గాల్లో ప్రదర్శిస్తున్నారు.లంచమడిగితే.. ఒకే ఫోన్కాల్ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే ఆదిలాబాద్, నస్పూర్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబరు 1064, వాట్సాప్ నంబరు 9440446106,dg&acb@telangana.g ov.inకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవ చ్చు. ఏసీబీ డీఎస్పీ నంబరు 91543 88963 కు నేరుగా కాల్ చేసి వివరాలు అందిస్తే అధి కారులు సూచించినట్లు చేసి అవినీతి అధికా రుల ఆట కట్టించవచ్చు. అధికారులు తమ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడితే ఆ ధారాలతోనూ ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు అంటున్నారు. బాధితులకు ఆయా శాఖల్లో తమకున్న సమ స్య సైతం తీరిపోతుందని చెబుతున్నారు. -
కనుల పండువగా దీపోత్సవం
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం కార్తిక దీపోత్సవం కనుల పండువగా సాగింది. లక్సెట్టిపేటకు చెందిన ప్రణవ్‌శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివలింగార్చన, గణపతి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సోనేరావు దంపతులతోపాటు కుమారుడు సాయినాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు క్షేమంగా ఉండాలని, ప్రతిఒక్కరూ సుఖ శాంతులతో గడపాలని కార్తిక దీపోత్సవం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా మహిళలు పెద్దఎత్తున హాజరై దీపాలు వెలిగించారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నాయకులు మర్సుకోల సరస్వతి, బుర్స పోచయ్య, గంధం శ్రీనివాస్, సాంగ్డె జీవన్ పాల్గొన్నారు. – ఆసిఫాబాద్‌అర్బన్ -
‘కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ విఫలం’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రూప్నార్ రమేశ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపకుండా అన్యాయం చేస్తోందని, పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయడం సిగ్గుచేటన్నారు. గురువారం అంబేడ్కర్ చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించే శాంతియుత రాస్తారోకోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కోకన్వీనర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు సాయికృష్ణ, సంజీవ్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా జోనల్‌స్థాయి పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆద ర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఆశ్రమ పాఠశాల ల జోనల్‌స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యా యి. ఆసిఫాబాద్, మంచిర్యాల, జైనూర్, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై డీటీడీవో రమాదేవితో కలిసి పోటీలను ప్రారంభించారు. డీఎస్వో షేకు మాట్లాడుతూ జోనల్‌స్థాయి క్రీడాపోటీలకు 800 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు అథ్లెటిక్స్‌లో 8 అంశాలు, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, చెస్, క్యారమ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. రెండోరోజు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు లక్ష్మయ్య, శివకృష్ణ, శ్రీనివాస్, సురేశ్, జీవరత్నం, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వర్రావు, కోచ్‌లు అరవింద్, తిరుమల్, విద్యాసాగర్, పీఈటీలు పాల్గొన్నారు. -
కుమురం భీం
వాతావరణం ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. జిల్లావ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతుంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. 7గ్రంథాలయంలో ముగ్గుల పోటీలు ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో బుధవారం ముగ్గులు, మెహందీ పోటీలు నిర్వహించారు. లైబ్రేరియన్లు ప్రవీణ, స్వర్ణలత, సదానందం, రికార్టు అసిస్టెంట్ సతీదేవి, సిబ్బంది పాల్గొన్నారు.వేధిస్తున్న కూలీల కొరత వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో కూలీల కొరత నెలకొంది. వరి కోతలు, పత్తితీత పనులు ఒకేసారి రావడంతో కూలీలు దొరకడం లేదు. -
పిల్లలు బడిలో ఉండాలి
బడి బయట పిల్లలను గుర్తించేందుకు గురువారం నుంచి సర్వే ప్రారంభమవుతుంది. వివరాలను ప్రబంద్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. బడిబయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలి. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రక్రియను పర్యవేక్షించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, సమగ్ర శిక్ష జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ రవాణా భత్యం చెల్లించాలి కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీలు సర్వేలో భాగంగా ఆవాస ప్రాంతాల్లో తిరుగుతూ బ డిబయట పిల్లలను గు ర్తిస్తారు. వారికి ప్రభుత్వం రవాణా భత్యం(ట్రావెలింగ్ అలవెన్స్) ఇ వ్వాలి. ప్రతీరోజు పాఠశాలలు, పర్యవేక్షణ ప నులకు వెళ్తున్నాం. ప్రస్తుత వేతనాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. – దహేగాం పవన్ కుమార్, సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు -
మహిళలకు ‘ఇందిరమ్మ’ చీరలు
బెజ్జూర్(సిర్పూర్): మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ సి ద్ధం చేసింది. బుధవారం హైదరాబాద్‌లో సీఎం రే వంత్‌రెడ్డి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించగా, గురువారం నుంచి జిల్లాలో చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాకు 35,758 చీ రలు చేరగా, మిగిలినవి త్వరలో సరఫరా అవుతా యని అధికారులు వెల్లడించారు. రాంపూర్ గోదాంలో 24,720, జైనూర్ గోదాంలో 3,937, కౌటాల గో దాంలో 7,101 చీరలను నిల్వ ఉంచారు. వీటిని ప్ర ధాన నిల్వ కేంద్రాలుగా గుర్తించారు. గోదాములకు వచ్చే ప్రతీ రవాణా వాహనాన్ని అధికారులు స్వయ ంగా తనిఖీ చేసి డిజిటల్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. పారదర్శకత, చీరల క్వాలిటీ పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశా రు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో చీరలు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పంపిణీకి ఏర్పాట్లు ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో చీరల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. మొదట స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు అందించాలని భావించినా.. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారందరికీ అందించనున్నారు. మొదటి విడతగా గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు 335 గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయనున్నారు. అనంతరం రెండో విడతగా మార్చి 1 నుంచి 8 వరకు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ప్రక్రియ పూర్తి చేస్తారు. సిర్పూర్ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్ నియోజకవర్గానికి నోడల్ అధికారిగా ఆర్డీవో లోకేశ్వర్‌రావు వ్యవహరించనున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాలు, పంచాయతీ సిబ్బంది పంపిణీ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. చీర తీసుకున్న మహిళల పేరు, ఆధార్ వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నారు. ఈ విషయంపై జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ యాదగిరిని సంప్రదించగా, ఉన్నతాధికారుల మేరకు చీరల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలు, గృహ నిర్మాణ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, ఇంటి పన్నుల వసూళ్లు, సెర్ప్ కార్యకలాపాలు, ఉపాధిహామీ పథకం పనుల గుర్తింపు అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల పనులు వందశాతం ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటి పన్ను వందశాతం వసూలు చేసి పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఏకరూప చీరల పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాశ్‌రావు తదితరుల పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాగజ్‌నగర్‌రూరల్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. కాగజ్‌నగర్ మండలం చింతగూడలోని ఎంపీయూపీఎస్, కేజీబీవీలను బుధవారం సందర్శించారు. వసతులు, మధ్యాహ్న భోజనం, రిజిస్టర్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. -
ఈపీ ఆపరేటర్లకు పదోన్నతి పరీక్షలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఖైరిగూర ఓసీపీలో బుధవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఈపీ ఆపరేటర్లకు పదోన్నతి కోసం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల నుంచి ఈపీ ఆపరేటర్లు హాజరయ్యారు. డీ గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ కోసం నిర్వహించిన పరీక్షకు 9 మంది, సీ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్ పదోన్నతి కోసం 38 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్వోటూజీఎం రాజమల్లు, కార్పొరేట్ మెంబర్ శ్రీరాంపూర్ డీజీఎం పర్సనల్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, పర్సనల్ హెచ్‌వోడీ మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎండీఎం’ నిర్వాహకులకు ఊరట
ఆసిఫాబాద్‌అర్బన్: మధ్యాహ్న భోజన ధరలను ప్రభుత్వం పెంచడంతో నిర్వాహకులకు ఊరట లభించనుంది. నిత్యావసర ధరలతో వంట చేసేందుకు సతమవుతుండగా, ఎట్టకేలకు రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఒకే నెలలో రెండుసార్లు పెంపు ఉత్తర్వులు రావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద 992 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 42,370 మంది విద్యార్థులు చదువుతున్నారు. ధరల పెరగడంతో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహాలతో కూడిన ఆహారం అందనుంది. ఒక్కో విద్యార్థి భోజనం కోసం చేసే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయి. వారంలో మూడు రోజుల విద్యార్థులకు కోడిగుడ్లు అందిస్తుండడంతో పెంచిన వాటి ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి భోజన నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటనతో పరిస్థితి కొంతమేర మారనుంది. పెంపు ఇలా.. ప్రభుత్వం పెంచిన ధరలు మే 1 నుంచి అమలు లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద 1,491 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పెరిగిన ధరల ప్రకారం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 25,540 మంది ఉండగా, వీరికి రోజుకు రూ.6.78 చొప్పున చెల్లించనున్నారు. అలాగే ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న వారు 10, 579 మంది ఉండగా, ఒక్కొక్కరికి రూ.10.17 చొ ప్పున, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 6,251 మందికి రూ.13.17 చొప్పున చెల్లించనున్నారు. సకాలంలో అందని బిల్లులు మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా చేస్తోంది. మిగిలిన కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాల్సి ఉంది. వీటికి ప్రభుత్వం ప్రతినెలా బిల్లులు చెల్లిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. అలాగే గ్యాస్ భారం కూడా ఇబ్బందిగా మారింది. అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం వండిపెట్టడం ఇబ్బందిగా మారిందని, బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరుతున్నారు. ఎండీఎం ధర పెంపు వివరాలు తరగతి గత నెలలో ఈ నెల 4న ప్రస్తుతం 1–5 రూ.5.45 రూ.6.19 రూ.6.78 6–8 రూ.8.17 రూ.9.29 రూ.10.17 9–10 రూ.8.17 రూ.9.29 రూ.13.17 -
సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు
కాగజ్‌నగర్‌టౌన్: రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటి అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని దుర్గానగర్ రైతువేదికలో బుధవారం డ్రాప్ట్ సీడ్బాల్పై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ డ్రాప్ట్ సీడ్ బాల్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన నిబంధనలు, సంస్కరణల గురించి వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి సుప్రజ, ఏవో రామకృష్ణ, కేవీకే బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, ఏఈఓలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
ఆసిఫాబాద్: తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ బాధ్యత పిల్లలదేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళాశిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండ ర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పా టు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు కలెక్టర్ వెంకటే శ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ సివిల్ జడ్జి డీకే రాణి, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రా వుతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధులు– తల్లి దండ్రుల పోషణ, సంక్షేమ చట్టం– 2007పై అవగా హన కల్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మా ట్లాడుతూ యువత మత్తుకు బానిలసై క్షణికావేశంలో నేరాలు చేస్తున్నారని, ఆస్తుల కోసం కన్నవారికి, తోడబుట్టిన వారికి హాని చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తల్లిదండ్రులను పోషించని కుమారులు, కుమార్తెలపై 28 కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆసిఫాబాద్ డివిజన్లో ఆర్డీవో, కాగజ్‌నగర్ డివిజన్లో సబ్ కలెక్టర్ స్థాయి ట్రిబ్యునల్స్ పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆస్తులు తీసుకుని పోషణ, సంరక్షణ పట్టించుకోకుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. నిరాదరణకు గురైన వారు టోల్‌ఫ్రీ నం.14567ను సంప్రదించాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం– 2007 పోస్టర్ ఆవిష్కరించారు. వందేమాతరం గీతాలాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, జిల్లా అధికారులు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న యువజనోత్సవం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు కనువిందు చేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. కళా కారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. జానపద నృత్య విభాగంలో గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు మొదటిస్థానంలో నిలిచారు. ఉపన్యాసంలో గిరిజన బాలికల పాఠశాలకు చెందిన మొనరాణి ప్రథమ స్థానం, అరుణ్ ద్వితీయ స్థానం సాధించారు. జానపద పాటల్లో గిరిజన బాలికల పాఠశాల విద్యార్థిని వైష్ణవి మొదటిస్థానం, శివాత్మిక ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో అశ్వక్ అహ్మద్, న్యాయ నిర్ణేతలు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో మళ్లీ సందడి!
ఆసిఫాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఆదేశించినట్లు సమాచారం. మంత్రివర్గ నిర్ణయంతో మళ్లీ జిల్లాలోని గ్రామాల్లో సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గత నెలలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పుతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు డీఆర్ఆర్డీ శాఖ కోర్టుకు తెలియజేస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. 335 పంచాయతీలుజిల్లాలో 335 గ్రామ పంచాయతీల్లో 2,874 వార్డులు ఉన్నాయి. 3,53,895 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 345 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముందుగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత జిల్లాలోని 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రిజర్వేషన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత నెలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా.. తాజాగా నిర్ణయంతో రిజర్వేషన్లు 50 శాతం లోబడి ఉండనున్నాయి. బీసీల రిజర్వేషన్ల శాతం 27కు తగ్గే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు ఎవరికి అనుకూలిస్తాయోననే ఉత్కంఠ ఆశావహుల్లో ఉంది. 2016లో తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించగా, గత నెలలో నోటిఫికేషన్లో బీసీ జనరల్‌కు కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఏ వర్గాన్ని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
పోగొట్టుకున్న 41 మొబైళ్లు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీ సు కార్యాలయంలో మంగళవారం 41 మంది బాధితులకు పోగొట్టుకున్న మొబైళ్లను ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రూ.44.76 లక్షల వి లువైన 373 మొబైళ్లు రికవరీ చేశామని తెలి పారు. బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, డీ సీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీకోర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సీసీ కిరణ్ పాల్గొన్నారు. పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలిపొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పే ర్కొన్నారు. వాహనాలు, పాదాచారులు, పశువులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.


