పెన్‌గంగ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పెన్‌గంగ వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

సిర్పూర్‌(టి): నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలం మీదుగా ప్రవహిస్తున్న పెన్‌గంగ నది వరద ఉధృతిని శనివారం ఎస్పీ నితిక పంత్‌ పరిశీలించారు. వెంకట్రావ్‌పేట్‌–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలోని హైలెవల్‌ వంతెన వద్ద వరద ఉధృతి ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వాహనా ల రాకపోకలు నిలిపివేయాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెన్‌గంగ పరీ వా హక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారులు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజ లకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపా రు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో టు చేసుకోకుండా రోప్‌లు, లైఫ్‌బాయ్‌లు, లైఫ్‌ జా కెట్లు తదితర అత్యవసర రక్షణ కిట్లు అందుబా టులో ఉంచామని తెలిపారు. మత్స్యకారులు చేపల వే టకు వెళ్లొద్దని, పడవ ప్రయాణాలు చేయరాదని సూచించారు. అనంతరం పారిగాం గ్రామ సమీపంలోని వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ వహీదొద్దీన్‌, ఎస్సై సాగర్‌ ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

కౌటాల: ప్రాణహిత, వార్థా నదుల సరిహద్దు గ్రా మాల ప్రజలు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్‌ సూచించారు. మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని పరిశీలించారు. నదుల్లో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోందని, ఎవరూ అటు వైపు వెళ్లవద్దని తెలిపారు. రోప్‌లు, లైఫ్‌ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వహీదొద్దీన్‌, కౌటాల సీఐ సంతోష్‌ కుమార్‌, సర్పంచ్‌ సూరజ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement