'KJQ' (KJQ - కింగ్ జాకీ క్వీన్) సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఆగస్టు 2, 2026 న హైదరాబాదులోని అవసా హోటల్‌లో ఘనంగా జరిగింది.
ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి కేకే (KK) దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7, 2026న విడుదల కానుంది.
ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సంపత్ నంది, సందీప్ రాజ్ తదితరులు హాజరయ్యారు.


