సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్, పాన్ ఇండియా స్టార్ రష్మికా దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో ఇది జరిగింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)
డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు రష్మికకు ఒక్కసారిగా జారిపడటంతో ఆమె నడుముకు బలమైన గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. రష్మికను పరీక్షించిన వైద్యులు శరీరంలోని నడము భాగంలో బలమైన దెబ్బ తగిలిందని నిర్ధారించారు. గాయం తీవ్రత దృష్ట్యా ఆమె కనీసం 6 వారాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారు.
ఈ అనుకోని ప్రమాదం కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్న పలు సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఆమె కోలుకునే వరకు డాన్స్, ఫైట్ సీన్లతో కూడిన షెడ్యూల్స్ అన్నింటినీ దర్శకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్స్ వరసగా గాయాల బారిన పడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే రామ్ చరణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరులు గాయాలపాలయ్యారు. ఇప్పుడు రష్మికకు కూడా అలానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈమె పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈమె చేతిలో రణబాలి, మైసా మూవీస్ ఉన్నాయి. మరి ఏ మూవీ సందర్భంగా ఈ ఘటన జరిగిందనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)


