లెనిన్‌ @ వంద కోట్లు | Akhil Akkineni Lenin Enters Rs 100 Crore Club | Sakshi
Sakshi News home page

లెనిన్‌ @ వంద కోట్లు

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

Akhil Akkineni Lenin Enters Rs 100 Crore Club

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన ‘లెనిన్‌’ చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని యూనిట్‌ గురువారం అధికారికంగా ప్రకటించి,పోస్టర్‌ విడుదల చేసింది. అఖిల్‌ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలై, మంచి విజయం అందుకుంది.

ఈ మూవీ 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు యూనిట్‌ పేర్కొని, ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అఖిల్‌ కెరీర్‌లో వంద కోట్ల కలెక్షన్స్‌ సాధించిన తొలి చిత్రంగా ‘లెనిన్‌’ నిలిచింది. ఇదిలా ఉంటే... అక్కినేని నాగచైతన్య ‘తండేల్‌’ సినిమాతో గత ఏడాది వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement