‘రాకా’ సినిమా రెండు భాగాలుగా రానుందా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట.
తండ్రి...ఇద్దరు కొడుకులు... ఇలా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట అల్లు అర్జున్. ఈ సినిమా మేజర్ షూటింగ్ ముంబైలోని ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా గురించిన ఓ అంశం తెరపైకి వచ్చింది. ‘రాకా’ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ అంశానికి సంబంధించి ఇటీవలే అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ చర్చించుకున్నారని, ‘రాకా’ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని భోగట్టా.
అంతేకాదు... రెండు భాగాల చిత్రీకరణను ఒకేసారి పూర్తి చేసి, పెద్ద గ్యాప్ లేకుండా వెంట వెంటనే రిలీజ్ చేయాలన్నది అట్లీ ప్లాన్ అని సమాచారం. అలాగే ఈ ఏడాదిలోపే షూటింగ్‌ను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట అల్లు అర్జున్ అండ్ టీమ్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.


