breaking news
Amaravati
-
వైఎస్సార్సీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ మేయర్, ఛైర్మన్ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పార్టీ అధిష్టానం వెల్లడించింది. ప్రకటించిన జాబితా ప్రకారం వివిధ ప్రాంతాల వారీగా అభ్యర్థులు, వారి సామాజిక వర్గాలు, రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయిమున్సిపల్ కార్పొరేషన్లువిజయవాడ కార్పొరేషన్: రాయన భాగ్యలక్ష్మి (నగరాలు) — రిజర్వేషన్: జనరల్గుంటూరు కార్పొరేషన్: తాడికొండ అలివేలు వెంకట నాగపద్మ శ్రీదేవి (వైశ్య) — రిజర్వేషన్: జనరల్ మహిళతిరుపతి కార్పొరేషన్: ఏచం వాసుదేవ యాదవ్ (యాదవ్) — రిజర్వేషన్: జనరల్కర్నూలు కార్పొరేషన్: ఊతకళ్ల సుశీల (మాదిగ) — రిజర్వేషన్: ఎస్సీ మహిళఅనంతపురం కార్పొరేషన్: చిట్లూరు రమేష్ గౌడ్ (గౌడ) — రిజర్వేషన్: బీసీచిత్తూరు కార్పొరేషన్: రామస్వామి చంద్రశేఖర్ (వన్నెకుల క్షత్రియ) — రిజర్వేషన్: బీసీమున్సిపాలిటీలుబొబ్బిలి: తుమ్మల అచ్యుతవల్లి (తెలగ) — రిజర్వేషన్: జనరల్ మహిళసాలూరు: బావిరెడ్డి రిబికా రాణి (గాజులకాపు) — రిజర్వేషన్: బీసీ మహిళఅమలాపురం: దూడల వీరితా దేవి (కాపు) — రిజర్వేషన్: జనరల్జంగారెడ్డిగూడెం: మేకా సత్యవతి (గౌడ) — రిజర్వేషన్: బీసీ మహిళనూజివీడు: కంచర్ల లవకుమార్ (మాదిగ) — రిజర్వేషన్: ఎస్సీజగ్గయ్యపేట: షేక్ హఫీజున్నీసా (ముస్లిం) — రిజర్వేషన్: జనరల్ మహిళపెడన: కాటకం నాగకుమారి (దేవాంగ) — రిజర్వేషన్: జనరల్ మహిళనాయుడుపేట: తంబిరెడ్డి రాజేశ్వరమ్మ (రెడ్డి) — రిజర్వేషన్: జనరల్ మహిళసూళ్లూరుపేట: మోదీ విమల కుమార్ (మాల) — రిజర్వేషన్: ఎస్సీ మహిళఎమ్మిగనూరు: కోడిగంటి శివన్న రఘు (పద్మశాలి) — రిజర్వేషన్: జనరల్నగర పంచాయతీలు:పాలకొండ: పాలవలస ఇందుమతి (తూర్పు కాపు) — రిజర్వేషన్: బీసీ మహిళముమ్మిడివరం: సానబోయిన సునీలాదేవి (శెట్టిబలిజ) — రిజర్వేషన్: బీసీ మహిళనందిగామ: చల్లా బ్రహ్మేశ్వరరావు (వైశ్య) — రిజర్వేషన్: జనరల్గిద్దలూరు: భూమా నరసింహారెడ్డి (రెడ్డి) — రిజర్వేషన్: జనరల్అద్దంకి: ఉడత్తు సురేష్ (వైశ్య) — రిజర్వేషన్: జనరల్చీమకుర్తి: మేడగం శ్రీదేవి (రెడ్డి) — రిజర్వేషన్: జనరల్దర్శి: వెన్నపూస వెంకటరెడ్డి (రెడ్డి) — రిజర్వేషన్: జనరల్ -
చంద్రబాబు,లోకేష్ డైరెక్షన్లోనే దాడులు: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,తిరుపతి : చంద్రబాబు,లోకేష్ డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నిక నామినేషన్ సమయంలో టీడీపీ గూండాలు జరిపిన దాడులపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయటి నుంచి గూండాలను తెప్పించి విధ్వంసం సృష్టించారు. మా కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయించారు. వాహనాలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. టీడీపీకి గెలిచే సత్తాలేదు. అడ్డదారిలో గెలిపించుకునేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు తీసుకోవడం లేదు. మాపై ఒత్తిడి ఉంది. తీసుకోలేమని అంటున్నారు.దమ్ముంటే నిజాయితీగా ఎన్నికలకు వెళ్లాలి’అని సవాల్ విసిరారు. -
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
సాక్షి,అమరావతి : కూటమిలో స్థానిక సంస్థల ఎన్నికలు కుంపట్లు రాజేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు మున్సిపల్ స్థానాల్లో పోటీ చేసేందుకు కూటమిలోని ఆశావాహులు పోటీపడుతున్నారు. అయితే, అధిష్ఠానం కొందరికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆశావహులు, రెబల్ అభ్యర్థులు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. తాము బరిలో దిగాలనుకుంటున్న స్థానాల్లో ఇతరులను ఎలా అభ్యర్థులుగా ప్రకటిస్తారంటూ నేతలు అధిష్ఠానాన్ని నిలదీస్తున్నారు.పార్వతీపురం మన్యం జిల్లాసాలూరు మున్సిపల్ స్థానాన్ని కూటమి నేతలు జనసేనకు కేటాయింపుటీడీపీ నిర్ణయంపై తిరగబడ్డ కార్యకర్తలుమంత్రి అచ్చం నాయుడు, గుమ్మడి సంధ్యారాణిలు ఎదుట వాగ్వాదంజనసేనకు సహకరించేదే లేదని హెచ్చరికలు జారీ చేసిన టీడీపీ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయం మేరకు సర్ధుకు పోవాల్సిందేనన్న మంత్రి అచ్చం నాయుడుఏలూరుటీడీపీలో రచ్చకెక్కిన మేయర్ సీటు వివాదంతమ నేతకే మేయర్ సీటు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన టీడీపీ కార్యాలయం వద్ద నిరసన టీడీపీ కార్యాలయానికి చేరుకున్న పార్లమెంట్ పరిశీలకురాలు పంచుమర్తి అనురాధ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే బడేటి చంటితో అనురాధ, చింతమనేని భేటీఅధిష్టానం నిర్ణయాన్ని చెప్పి కేడర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం అనకాపల్లి అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్న పాత్రుడికి షాక్ యలమంచిలి మున్సిపాలిటీలో జనసేన,బీజేపీ మధ్య రాజుకున్న వివాదంపొత్తులో భాగంగా యలమంచిలి మున్సిపాలిటీ బీజేపీ కేటాయింపుజనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన కర్రీ ఝాన్సీ రేపు బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు పిల్ల రమా కుమారిజనసేన మిత్ర ధర్మం పాటించకపోవడంపై బీజేపీ ఆగ్రహంబీజేపీకి ఇచ్చిన స్థానంలో జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేయడంపై అసంతృప్తి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ సూచన మేరకే కర్రి ఝాన్సీ నామినేషన్ దాఖలు కాకినాడ పెద్దాపురం కూటమీలో మరోసారి రాజుకున్న కుంపట్లు సామర్లకోట మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకు కేటాయింపుసామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవి ఆశించిన టీడీపీ దళిత నేత తాతపూడి కృష్ణబాబుజనసేనకు సీటు కేటాయించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన కృష్ణబాబు అనుచరులుపోస్టాఫీసు సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్త33 ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తే దళితులకు పార్టీ ఇచ్చిన గౌరవరం ఇదేనా అంటూ రగిలిపోయిన కృష్ణబాబుపిఠాపురంపిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు టీడీపీ షాక్పొత్తులో భాగంగా గొల్లప్రోలు నగర పంచాయితీ జనసేనకు కేటాయింపు జనసేనకు గొల్లప్రోలు కేటాయించడంపై టీడీపీ నేతల ఆగ్రహంగొల్లప్రోలు నగర పంచాయితీలో ఉన్న 23 వార్డుల నుండి బరిలోకి టీడీపీ అభ్యర్ధులు.నగర పంచాయితీ ఎన్నికల్లో అన్ని వార్డుల నుండి నామినేషన్లు ప్రకటించిన గొల్లప్రోలు టీడీపీ అధ్యక్షులు గుండ్ర సుబ్బారావుపశ్చిమగోదావరి జిల్లాతాడేపల్లిగూడెం చైర్మన్ సీటు కోసం రాజుకున్న వర్గ పోరు చైర్మన్ సీటు తమ పార్టీకి కేటాయించాలని టీడీపీ నేతలు ఆందోళన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంటీడీపీ నాయుకులు గొర్రెల శ్రీధర్‌కి చైర్మన్ సీటు ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం కర్నూలుకర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టిన మునిసిపల్ చైర్మన్ సీటుచైర్మన్ సీటు జనసేన పార్టీకే అంటూ మొదటి నుండి ప్రచారంమొదటి నుండి సీటు మీకే అని చెప్పి టిడిపి పార్టీకి కేటాయించడంపై బగ్గుమంటున్న జనసేన అభ్యర్థిఆదోనిలో జనసేన పార్టీ ఇన్ ఛార్జి భార్య స్వప్న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు.చైర్మన్ సీటు కేటాయింపులో మోసం చేశారంటూ ఆరోపించిన స్వప్న 2008లో ప్రజారాజ్యం పార్టీలో 2019 గాని టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు 2024లో కూడా మాకు అన్యాయం జరిగిందంటూ వాపోయిన స్వప్న అసంతృప్తిలో కార్యకర్తలు.. ఇండిపెండెంట్‌గా స్వప్న పోటీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్ స్థానం బీజేపీకి కేటాయించిన కూటమి అధిష్టానం చైర్మన్ టికెట్ ఆశించిన లెంక అప్పలనాయుడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు ససేమెరా అంటూ.. పరిశీలకు రాలు పంచమి అనురాధ.. ఎమ్మెల్యే చంటిని నిలదీసిన టిడిపి కార్యకర్తలుటీడీపీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలు -
కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,చిత్తూరు: ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే సత్తా లేక కూటమి నాయకులు తనపై హత్యాయత్యానికి దిగారని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి మండిపడ్డారు. దాడులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలు జరిపాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా గత మూడు, నాలుగు రోజులుగా బయట ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాల ముఠాలను తీసుకొచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కున్నూరులో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని మిథున్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థిని నామినేషన్ వేయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో తనపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పలు వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవనీయకుండా భయపెట్టే ప్రయత్నాలు సాగనివ్వబోమని ఇకపై హెచ్చరించారు.చంద్రబాబు, లోకేశ్ కుట్రే..కున్నూరు ప్రాంతంలో సాధారణంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను సమీకరించి గొడవలు సృష్టిస్తున్నారు. సుమారు 50 మంది వరకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల ప్రోద్బలంతోనే బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను సమీకరించి దాడులకు ప్రణాళిక రచించారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల తీర్పును గౌరవించడం, ప్రత్యర్థులతో రాజకీయంగా పోటీ పడడం. దాడులు చేసి భయపెట్టడం కాదు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పటికీ రిటర్నింగ్ అధికారి వాటిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. తమపై పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని, నామినేషన్లు స్వీకరించలేమని ఆర్ఓ చెప్పారు. నామినేషన్లు తీసుకోవడంతోపాటు కనీసం స్వీకరణకు సంబంధించిన రసీదు లేదా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే వేచి ఉన్నప్పటికీ ఆరు నామినేషన్లను కూడా స్వీకరించని పరిస్థితి నెలకొంది.ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసే ప్రాథమిక హక్కును కూడా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడంలో అర్థం ఏముంటుంది..? ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. దానికి బదులుగా ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలు లాక్కోవడం, దాడులు చేయించడం వంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది. నామినేషన్ల దాఖలు విషయంలో తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనే అంశంపై పార్టీ పెద్దలు, ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలపై పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతాం. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును గౌరవించకుండా దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించాలని చూడటం ప్రజా స్వామ్యానికే ప్రమాదకరమని చంద్రబాబు,లోకేశ్ గుర్తు పెట్టుకోవాలి.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు వెనుకాడకుండా ప్రజాస్వామ్య బద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తారు.ఇదీ చదవండి : కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. తలలు పట్టుకుంటున్న నేతలు -
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
స్థానిక సంస్థల ఎన్నిలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటిరోజే టీడీపీ నేతలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. దాడులపై స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. పుంగనూరు, రాయచోటి ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ? అంటూ ఆయన ప్రశ్నించారు. Updates: కడపలో టీడీపీ జోనల్ ఇంచార్జ్ శ్రీనివాసులురెడ్డి అరాచకంనామినేషన్ సెంటర్ వద్ద టీడీపీ గూండాల హల్చల్30వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ అడ్డగింతనామినేషన్ పత్రాలు లాక్కొని చింపేసిన టీడీపీ గూండాలుపోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాల అరాచకంఆర్డీవోకి ఫిర్యాదు చేసిన రవీంద్రనాథ్‌రెడ్డి, ఆంజాద్ బాషాతమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్వైఎస్సార్ కడప జిల్లాలో శ్రుతిమించిన టీడీపీ గూండాల దౌర్జన్యాలుకడపలో ఏఆర్ఓ రూమ్‌లో దూరి నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ గూండాలు ఏఆర్ఓ చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసిన పచ్చమూక ఏఆర్ఓ చేతి నుంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నా చర్యలు తీసుకోని పోలీసులుమాజీ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ దాఖలు అనంతపురం: గుత్తిలో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నరహరిపై రాళ్ల దాడిరాళ్ల దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులుగంటా నరహరి కారు అద్దాలు ధ్వంసం శ్రీ సత్యసాయి జిల్లా:ధర్మవరంలో రెచ్చిపోతున్న పచ్చమూకలువైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడినామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలపై రాళ్ల దాడిపచ్చమూక దాడిలో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలునామినేషన్ పత్రాలు లాక్కొని చింపేసిన టీడీపీ గూండాలుప్రేక్షకపాత్ర వహించిన పోలీసులుదాడుల్లో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి ర్యాలీ నిర్వహించిన కేతిరెడ్డిర్యాలీలో భారీగా పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు నంద్యాల:ఆళ్లగడ్డలో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కున్న పచ్చమూకనామినేషన్ పత్రాలు చింపేసిన భూమా విఖ్యాత్రెడ్డిటీడీపీ అరాచకాలపై గంగుల బిజేంద్రారెడ్డి ఫైర్దమ్ముంటే టీడీపీ ఎన్నికల్లో తలపడాలిటీడీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు కడపలో టీడీపీ గూండాల బరితెగింపువైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు చింపేసిన పచ్చమూకలుఆర్వోకి ఇచ్చిన నామినేషన్ పత్రాలను లాక్కుని మరీ చించివేతబాలస్వామిరెడ్డిపై టీడీపీ గూండాల దాడిపోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాల దాడులుటీడీపీకి గెలిచే సత్తాలేదు: ఎంపీ మిథున్రెడ్డిబయట వ్యక్తులను తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారురాళ్లతో దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారువాహనాలను ధ్వంసం చేసి నానా హంగామా చేశారురిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు తీసుకోవడం లేదుపైనుంచి ఒత్తిడి ఉంది.. నామినేషన్ల తీసుకోబోమంటున్నారుఅడ్డదారిలో గెలిచేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారుదమ్ముంటే ఎన్నికల్లో తలపడాలిఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే: జూపూడి ప్రభాకర్రావుజెడ్ కేటగిరీ భద్రత ఉన్న పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేకపోతే సామాన్య అభ్యర్థుల పరిస్థితి ఏంటి?ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది నామినేషన్లు వేయడానికా?ప్రతిపక్షాలపై దాడులు చేయడానికా?చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇంతటి అరాచకమా?ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం?ప్రజాబలం ఉన్నవాడు ఎన్నికల్లో పోరాడతాడు.. ఓటమి భయం ఉన్నవాడే దాడులకు దిగుతాడుస్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు తెగబడుతోందిదాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తారా?పోలీసులు ప్రజలకు రక్షకులా? అధికార పార్టీకి ప్రైవేటు సైన్యమా?టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు చేతులు కట్టుకుని నిలబడటమేనా శాంతిభద్రతల పరిరక్షణ?పోలీసులు రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి.. చంద్రబాబు ఆదేశాలకు కాదుచంద్రబాబు ప్రభుత్వానికి పోలీసులపై ఉన్న పట్టు.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందుకు కనిపించడం లేదు?నామినేషన్ల తొలిరోజే దాడులతో స్వాగతం పలికారు..పోలింగ్ నాటికి ఇంకెన్ని అరాచకాలు చేస్తారు?అన్నమయ్య జిల్లాలో శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యాలయంపైనే దాడి చేసి తగలబెట్టే ప్రయత్నం చేయడం ఎంతటి దౌర్జన్యం?పార్టీ కార్యాలయంలో ఎన్నికలపై చర్చించుకోవడం కూడా నేరమేనా?వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కూటమి ఎన్నికల వ్యూహమా?ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసులు గెలవాలి.. ప్రత్యర్థుల తలలు పగలగొట్టడం కాదుచంద్రబాబూ.. ఇదేనా మీ కార్యకర్తలకు నేర్పిన రాజకీయ సంస్కృతి?రాజకీయాల్లో సీనియారిటీ గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ముఖ్యంఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలిమా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలిపుంగనూరు దాడిపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలిదాడులకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయాలి.. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలిస్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలిఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తాంఈ అరాచకాలను రాష్ట్రానికే పరిమితం చేయం.. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్తాంఎన్నికల అక్రమాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేస్తాంటీడీపీ గూండాల దాడులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహంచంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరులో విధ్వంసంనామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారురిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు తీసుకోవడం లేదుపోలీసులు టీడీపీ కార్యకర్తలతో కలిసి పోయారు మళ్లీ ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తతధర్మవరంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గుండాలు దాడిరాళ్లతో వైఎస్సార్సీపీ నేతలపైకి దాడులువైస్సార్సీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు చిత్తూరు: ఎన్నికల అధికారుల ఏకపక్ష వైఖరి10.45 గంటలకే నామినేషన్ కేంద్రానికి వెళ్లిన వై ఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు3 గంటల పాటు తీసుకోవాలని కోరిన నామినేషన్ తీసుకొని ఎన్నికల అధికారులుజిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించని కలెక్టర్ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకా నాథరెడ్డి ఫోన్ చేసినా స్పందించని కలెక్టర్మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్ చేసినా స్పందించని కలెక్టర్టీడీపీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకొని అధికారులుకలెక్టర్ తీరుపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుఎంపీ మిథున్‌రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్ టీడీపీ గూండాల దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదు: వైఎస్ జగన్రెండున్నరేళ్ల పరిపాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారుఅందుకనే అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారు హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదురాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చారులోక్సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నాచంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారుపోలీసులను వాడుకుని అక్రమాలు చేస్తున్నారుదాడులు జరుగుతున్న పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందిఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొంటాంన్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తాంధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటాంరాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతాంపారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయిఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతాంప్రజలకు మంచి చేసిన చరిత్ర మాదిహింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుదిఎన్నికల కమిషన్ ఆఫీస్:నామినేషన్ మొదటి రోజే ప్రజాస్వామ్యాన్ని తగలబెడుతున్నారు: లేళ్ల అప్పిరెడ్డిఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ గుండాలు, నాయకులు దాడి చేశారుటీడీపీ గుండాలు దాడి చేస్తారనే సమాచారం ముందుగానే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చాంరాళ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారుచంద్రబాబు సొంతం నియోజకవర్గంలో ఈ దాడి జరిగిందిప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలవలేమని దాడులకు తెగబడ్డారుబయట దాడులు దాటుకొని లోపలకు వస్తే కనీసం అధికారులు నామినేషన్లు తీసుకోరుఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగితే టీడీపీ ఓడిపోతుందిఅప్రజాస్వామిక విధానాలపై ప్రజలు తీర్పు చెబుతారని ఎన్నికలను అడ్డుకుంటున్నారుపారా మిలిటరీ దళాలను తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలినోడల్ ఆఫీసర్ రాజకుమారికి సమస్య వివరించాంప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ఎస్ఈసీ బాధ్యత వహించాలిఎస్ఈసీ తన అధికారాలు బయటకు తీయాలిఆన్లైన్లో నామినేషన్ తీసుకోవాలి.. మరో అధికారిని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాంపుంగనూరు మున్సిపాలిటీ నామినేషన్లు అడ్డుకున్న టీడీపీ శ్రేణులుఎంపీ మిథున్ రెడ్డి వాహనంతో పాటు, కాన్వాయ్ లో ఉన్న 6 వాహనాలు ధ్వంసం9 మంది కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న సమయంలో దాడినామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వారిపై అకస్మాత్తుగా దాడి హత్యాయత్నంపుంగనూరు ఎన్.ఎస్. పేట లోని బసవరాజా జూనియర్ కాలేజి లో మెయిన్ గేట్ వద్ద ఎంపీ మిథున్ రెడ్డి పై హత్యాయత్నం, వాహనాలు ధ్వంసంకాలేజీ మెయిన్ గేట్ వద్ధ ఒక వాహనం ధ్వంసం , కాలేజీ లోపల ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలు పూర్తి గా ధ్వంసంముడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ పై దాడి చేసిన టీడీపీ అల్లరి మూకలుఎంపీ మిథున్ రెడ్డి ను టార్గెట్ చేస్తూ వాహనాలు విధ్వంసం2 నామినేషన్లు స్వీకరణ, మిగిలిన నామినేషన్లు తీసుకోకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులునామినేషన్ ప్రాంగణం లోకి 400 మందికి పైగా చేరుకుని నిరసనప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులురాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సంరాయచోటిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ను తగలబెట్టిన టీడీపీ గూండాలువాహనాలను కూడా టీడీపీ గూండాలు తగలబెట్టారువైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడులుధర్మవరంలో టీడీపీ కూటమి నేతల బరితెగింపువైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిలపై దాడిపుష్ప మణికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రి కి తరలింపునామినేషన్లు లాక్కెళ్లిన టీడీపీ, బీజేపీ గూండాలుపోలీసుల సమక్షంలో ఘటన మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిపై దాడికి కూడా తెగబడుతున్నారుప్రాణాలకు తెగించి అయినా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాంఎంపీపై దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి -
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం, అనుమానిత లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసును విచారించడానికి తమకేమీ అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొంది. అలాగే, సాయికృష్ణ తల్లి విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం నాలుగు వారాల లోపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించే అంశం కీలకంగా మారింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ నుంచి సాయికృష్ణ అదృశ్యం కావడం, పోలీసుల అదుపులో ఉండగానే అతడు మృతి చెంది ఉంటాడన్న ఆరోపణలు, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కేసును మరింత తీవ్రతరం చేశాయి. అయితే, ఈ కేసులో గతంలో వెలువడిన కీలక పరిణామాలు.. ఇప్పటివరకు జరిగింది ఇదే.. 1. మే నెలలో అదృశ్యంవిజయవాడకు చెందిన 25 ఏళ్ల గాదె సాయికృష్ణను మే నెల మొదటి వారంలో మార్కాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.2. పోలీసులపై తీవ్ర ఆరోపణలుతన కుమారుడిని పోలీసుల అదుపులో హింసించి చంపి ఉంటారని తల్లి ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణను చూసినప్పుడు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.3. సీఐ నాగరాజు అరెస్టుఈ కేసులో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు ప్రధాన నిందితుడిగా పేర్కొనబడ్డారు. ఆయనను సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.4. సీసీటీవీ ఫుటేజీపై అనుమానాలుమే 1 నుంచి జూన్ 1 వరకు పోలీస్‌స్టేషన్ డీవీఆర్‌లో సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదని ఫోరెన్సిక్ పరిశీలనలో గుర్తించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. సాయికృష్ణ మృతదేహం ఆచూకీ కూడా లభించకపోవడం కేసులో కీలక అంశంగా మారింది.5. సుప్రీంకోర్టు జోక్యం2026 సెప్టెంబర్ 23–24 తేదీల్లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరచలేదని, ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల దర్యాప్తులో లోపాలు, సీనియర్ అధికారుల పాత్రపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. సంబంధిత హైకోర్టు విచారణలను నిలిపివేసి, కేసును తానే పర్యవేక్షించాలని నిర్ణయించింది. అలాగే, సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సమర్పించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేతలు.. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవలేక అక్రమమార్గంలో వెళ్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు విఫలమైందని ఆయన మండిపడ్డారు.‘‘బందీపోటు దొంగల్లా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటిరోజే దాడులు చేస్తున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.ఓటమి భయంతోనే దాడులు..విజయనగరం: ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యులకే రక్షణ లేదని.. ఓటర్లను, అభ్యర్థులను భయపెట్టాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎంపీ మిధున రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం. చంద్రబాబు దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో నేడు చీకటి దినంచిత్తూరు: ప్రజాస్వామ్యంలో నేడు చీకటి దినం అని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండించారు, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం -
‘స్థానిక’ ఎన్నికలు.. ప్రారంభమైన కూటమి కుట్రలు
సాక్షి, పల్నాడు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు ప్రారంభమయ్యాయి. దాచేపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవిని తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ తరఫున నగర పంచాయతీకి నామినేషన్ వేయడానికి కొప్పుల రవి సిద్ధమవ్వగా.. రవికుమార్‌ను అక్రమంగా నిర్బంధించారు. మా అపార్ట్మెంట్లో మద్యం పెట్టి తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లారని తండ్రి సాంబయ్య తెలిపారు.. రవి కుమార్‌ను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారోనని కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.ఈ క్రమంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఎందుకు రవిని అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కొప్పుల రవిని తెల్లవారుజామున పోలీసులు తీసుకొచ్చారు. కార్ పార్కింగ్ ప్లేస్‌లో పోలీసులు మద్యం బాటిళ్లు పెట్టి రవిని అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్లారు. నామినేషన్ వేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణకు ఉంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరించి భయపెట్టి ఏకగ్రీవాలు చేయాలనుకుంటున్నారు. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపైన ప్రైవేట్ కేసులు వేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతాం’’ అని కాసు మహేష్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: సమరానికి ముందే ఉక్కుపాదం -
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా అధికారులు లెక్క చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా క్యాస్ట్ సర్టిఫికేట్లు, నో డ్యూస్ సర్టిఫికేట్లు జారీ చేయడం లేదు. నామినేషన్లు ప్రారంభమైనా సర్టిఫికేట్లు జారీ కాకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర బయటపడుతోంది. 24 గంటల్లో సర్టిఫికేట్లన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఎస్ఈసీ.. అయితే, ఆయన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా, ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరితే, ఆ వివరాలను నిర్ణీత గడువులోపు అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఎలాంటి కేసులు లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది.‘ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.. క్రై మ్ నంబర్ ఎంత వంటి వివరాలతో కూడిన ఒక అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రెండు రోజుల్లోగా లేదా నిర్ణయించిన గడువులోగా అభ్యర్థికి అందించేలా ఆదేశాలివ్వండి.’ అని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం అభ్యర్థించగా శుక్రవారం వాదనలు వింటామని జస్టిస్ వడ్డిబోయన సుజాత స్పష్టంచేశారు.ఇదీ చదవండి: సమరానికి ముందే ఉక్కుపాదం -
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి–2027లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టారు. ఇకపై పరీక్షల్లో జనరల్, జువాలజీ సబ్జెక్టులకు వేర్వేరు బుక్లెట్లను ప్రవేశపెడుతున్నారు. జనరల్ థియరీ సబ్జెక్టులన్నింటికీ ఇకపై ఏకరూపతతో కూడిన 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను అందిస్తారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు మాత్రం గతంలో ఉన్న 24 పేజీల బుక్లెట్ విధానమే కొనసాగుతుంది.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల బయాలజీ పరీక్షకు గతంలో బోటనీ, జువాలజీలకు వేర్వేరుగా ఇచ్చిన ఓఎంఆర్ షీట్ల విధానాన్ని రద్దు చేశారు. వాటి స్థానంలో ఒకే ఓఎంఆర్ షీట్‌తో పాటు 40 పేజీల సమాధాన బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే, పార్ట్–2 పరిధిలోని కోర్ ఎలక్టివ్ సబ్జెక్టుౖలెన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించి మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు వేర్వేరుగా ప్రత్యేక ప్రశ్నాపత్రాలను అందించనున్నారు. ఇటీవల జరిగిన 78వ బోర్డు సమావేశం నిర్ణయాల మేరకు పరీక్షా విధానంలో మార్పులు చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా వెల్లడించారు. -
బాబు సర్కారు మరో రూ.1,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం దసరా సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే సోమవారమే చంద్రబాబు సర్కారు రూ.1,000 కోట్ల బడ్జెట్ అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. -
అభ్యర్థులూ బహుపరాక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్–ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పలు నిబంధనలు పాటించాలి. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) చర్యలు తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి తెలుసుకుందాం.ప్రభుత్వ ఆస్తులపై ఫ్లెక్సీలు, వాల్ రాతలు నిషిద్ధంప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, గోడరాతలు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ప్రైవేట్ ఆస్తుల విషయంలో ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లు లేదా స్థలాలపై వారి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా పోస్టర్లు అంటించకూడదు. జెండాలు కట్టకూడదు. అనుమతి పొందినా.. ఆ ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయంలోనే చూపించాలి. నేతల విగ్రహాలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం ఉన్న ప్రముఖ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు కప్పాలి. నగదు, బహుమతుల పంపిణీఓటర్లను ఆకట్టుకునేలా నగదు, మద్యం, చీరలు లేదా ఇతర ఉచిత వస్తువుల పంపిణీ చేయడం తీవ్రమైన నేరం. రూ.50 వేల నగదు పరిమితిసరైన ఆధారాలు, బ్యాంకు పత్రాలు లేకుండా రూ.50 వేలకంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు. పట్టుబడితే అధికారులు ఆ సొమ్మును జప్తుచేస్తారు.విద్వేష ప్రసంగాలుకులాలు, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థన మందిరాలు ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు వంటి ఏ ప్రార్థనస్థలాన్ని కూడా ఎన్నికల ప్రచార వేదికలుగా, సమావేశ కేంద్రాలుగా ఉపయోగించరాదు. వ్యక్తిగత దూషణలుప్రత్యర్థి అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయకూడదు. కేవలం వారి రాజకీయ విధానాలు, గత ట్రాక్ రికార్డుపై మాత్రమే విమర్శలు ఉండాలి. అధికార దుర్వినియోగం ప్రభుత్వ వాహనాల వాడకం: అధికారపక్షంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో ముడిపెట్టకూడదు. ప్రభుత్వ వాహనాలు, యంత్రాంగం, సిబ్బందిని ప్రచారానికి వాడటం నిషిద్ధం. ప్రభుత్వ ప్రకటనలు: ప్రభుత్వ నిధులతో పత్రికలు, టీవీల్లో సంక్షేమ పథకాల ప్రకటనలు ఇవ్వకూడదు. లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై సీఎం లేదా మంత్రుల ఫొటోలు ఉండరాదు. కాన్ఫరెన్స్‌లు: అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించరాదు. కొత్త పథకాలు, శంకుస్థాపనలు: ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించకూడదు, నిధులు మంజూరు చేయకూడదు. కొత్తగా శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయకూడదు. మైకులు, సభలు, ఊరేగింపులు సమయ నియంత్రణ: రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు మైకులు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై పూర్తి నిషేధం ఉంటుంది. పగటిపూట ప్రచారరథాలు, మైకులు వాడాలన్నా, బహిరంగసభలు లేదా ర్యాలీలు నిర్వహించాలన్నా స్థానిక పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.మద్యం నియంత్రణ పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తి నిషేధం ఉంటుంది. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్‌రోజు నిబంధనలు స్లిప్పుల జారీ: పోలింగ్ కేంద్రాల బయట అభ్యర్థులు ఓటర్లకు ఇచ్చే గుర్తింపు స్లిప్పులు కేవలం తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. దానిపై ఎలాంటి పార్టీ గుర్తులు, అభ్యర్థి ఫొటోలు ముద్రించకూడదు. ప్రచార పరిమితి: పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదు. అక్కడ పార్టీల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదు. ఓటర్ల రవాణా: ఓటర్లను తమ వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి చేయకూడదు. ఇది ఎన్నికల చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. -
బీజేపీలో ‘బామ్మర్ది’ కోటా!
సాక్షి, అమరావతి: కూటమి పొత్తుల్లో మరో విచిత్రం ఇది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తి కోసం బీజేపీ నేతలు అనంతపురం మేయర్ సీటు పట్టుబట్టి మరీ తీసుకోవడం ఆ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బంధుప్రీతే ఇందుకు కారణమని పార్టీ నేతలు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థల్లో బీజేపీకి తిరుపతితో పాటు మరికొన్ని కార్పొరేషన్లు అడుగుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, గురువారం రాత్రి ప్రకటించిన సర్దుబాటులో బీజేపీకి వచ్చింది అనంతపురం, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలు. తిరుపతి వదులుకుని బీజేపీ నేతలు అనంతపురం సీటు కోసం పట్టుబట్టడమే బీజేపీ శ్రేణులను కంగు తినిపించింది.చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బంధుప్రీతే ఇందుకు కారణమన్న విషయం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని బావమరిది డాక్టర్ విక్రమ్ కోసమే అనంతపురం సీటు పట్టుబట్టి మరీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం మేయర్ సీటును ఆశిస్తున్న డాక్టర్ విక్రమ్, మాధవ్ సతీమణి ఇద్దరూ అన్నదమ్ముల సంతానం. విక్రమ్‌కు సీటు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, అనంతపురం మేయర్ స్థానాన్ని కోరి తీసుకోవడం వెనుక ఉద్దేశం అదేనని పార్టీ నేతలు చెబుతున్నారు. అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తిరుపతి కోసం సీనియర్ నేత భానుప్రకాష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తే. పార్టీ కోసం పనిచేసిన ఇలాంటి అనేక మందిని కాదని మాధవ్ బావమరిది విక్రమ్‌కు అనంతపురం మేయర్ సీటు ఇస్తే పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తాయని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. -
కోడ్‌ను పటిష్టంగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్‌ను) పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ సూచించారు. ఆయన 28 జిల్లాలకు ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. అనంతరం ఆయన వారితో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అనుసరించే విధానాలను స్థానిక సంస్థల ఎన్నికల్లోను పాటించాలని చెప్పారు. రాజకీయ ప్రతినిధులు కోడ్ ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోల్ మేనేజ్మెంట్ యాప్ ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు పోల్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ యాప్‌లో పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల నుంచి ఓటుహక్కును వినియోగించుకునే సామాన్య పౌరుల వరకు అందరికీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాల వారీగా ఎన్నికల పరిశీలకుల నియామకం పల్నాడు జిల్లాకు కె.కన్నబాబు, కృష్ణా జిల్లాకు ఎంఎం నాయక్, మార్కాపురం జిల్లాకు సీహెచ్.శ్రీధర్, పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంవీ శేషగిరిబాబు, బాపట్ల జిల్లాకు కేవీఎన్ చక్రధర్‌బాబు, ప్రకాశం జిల్లాకు హెచ్.రాణి, ఏలూరు జిల్లాకు మనాజిర్ జిలానీ సమూన్డెనీ, ఎన్టీఆర్ జిల్లాకు ఎస్.నాగలక్ష్మి, వైఎస్సార్ కడప జిల్లాకు పి.రంజిత్‌బాషా, చిత్తూరు జిల్లాకు శివశంకర్ లోతేటి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు పి.ప్రశాంతి, గుంటూరు జిల్లాకు సగిలి షణ్మోహన్, తూర్పు గోదావరి జిల్లాకు ఎం.గౌతమి, శ్రీసత్యసాయి జిల్లాకు పి.అరుణ్‌బాబు, అనంతపురం జిల్లాకు కె.శ్రీనివాసులు, కాకినాడ జిల్లాకు బి.లావణ్యవేణి, నెల్లూరు జిల్లాకు ఎస్.భార్గవి, నంద్యాల జిల్లాకు జె.వెంకటమురళి, పోలవరం జిల్లాకు చేతన్ టీఎస్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రోణంకి కూర్మనాథ్, అనకాపల్లి జిల్లాకు గోపాలకృష్ణ రోణంకి, అన్నమయ్య జిల్లాకు ప్రవీణ్ ఆదిత్య సీవీ, విజయనగరం జిల్లాకు ఎన్.తేజ్‌భరత్, కర్నూలు జిల్లాకు బి.శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు ఎస్.చిన్నరాముడు, శ్రీకాకుళం జిల్లాకు మల్లవరపు సూర్యతేజ, తిరుపతి జిల్లాకు మామిడిపల్లి వరప్రసాద్, విశాఖపట్నం జిల్లాకు గీతాంజలిశర్మ, రిజర్వ్ పరిశీలకులుగా జి.వీరపాండియన్, శోబిక ఎస్ఎస్ నియమితులయ్యారు. -
సర్దుబాటు కాదు.. లొంగుబాటు
సాక్షి, అమరావతి: నలభై శాతం వాటా అన్నారు. ఆరు మేయర్ పీఠాలు ఇవ్వాల్సిందేనని చర్చల్లో పట్టుబట్టినట్టు హడావుడి చేశారు. చివరకు చంద్రబాబు ఏం ఇచ్చారో అదే తీసుకున్నారు. ‘‘ఇక మనం చాపచుట్టేసినట్టే కనిపిస్తోంది.. పార్టీ బతకాలి అంటే స్థానిక ఎన్నికలు కీలకం.. అలాంటి వాటిలో కూడా దాసోహం అన్నారు. ఇది చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ తప్ప జనం కోసం, మన కోసం పుట్టిన పార్టీ కాదు..’’ అని జనసైనికులు మండిపడుతున్నారు. అధినాయకత్వం తీరుపై జనసైనికుల ఆగ్రహజ్వాలలు మిన్నుముడుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో కూటమి తరఫున సీట్ల పంపకం జాబితాను టీడీపీ కార్యాలయం గురువారం విడుదల చేసింది. జనసేనకు 4 కార్పొరేషన్లు ఇచ్చినట్టు చూపించినా, అందులో రెండింటికి ఇప్పట్లో ఎన్నికలే లేవు. ఈ నెల 28న ఎన్నికలు జరిగే 13 కార్పొరేషన్లలో జనసేనకు దక్కింది రెండే. అడిగినన్ని సీట్లు అలవోకగా సాధించేస్తాడనుకున్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ చర్చల వేళ ముఖం చాటేసి మౌనంగా హైదరాబాద్ వెళ్లిపోవడం, జాబితా వచ్చాకా నోరు మెదపకపోవడంతో జనసైనికులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇదేం పొత్తు.. దీన్ని సర్దుబాటు అంటారా? లొంగుబాటు అంటారా? లేక మన దౌర్భాగ్యం అంటారా? అని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 40% అడిగితే.. అరకొర విదిలింపుమంగళవారం జనసేన మంత్రి కందుల దుర్గేష్ పార్టీ లోగోతో ఎక్స్ లో పోస్టర్ విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవుల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులు కేటాయించాలని, 6 మేయర్లు, 38 మున్సిపల్ చైర్మన్లు, 1,937 వార్డులు సహా ప్రతి పదవిలో వాటా ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు ప్రకటించారు. ఆ డిమాండ్‌పై టీడీపీ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరుసటి రోజే సీఎంతో భేటీ తర్వాత ‘ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదు’ అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట మార్చారు. చివరికి చంద్రబాబు చెప్పినట్టు తల ఊపి ఆయన ఇచ్చిన అరకొర సీట్లను ఆనందంగా తీసుకుని తలాడించుకుంటూ బయటికి వచ్చారు. సర్దుబాటు వివరాలివీ 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు.. మొత్తం 123 పీఠాల్లో టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9 పంచుకున్నాయి. జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు.. బీజేపీకి రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు కేటాయించారు. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, ఒంగోలు, మచిలీపట్నం, విజయనగరం, చిత్తూరు, మంగళగిరి–తాడేపల్లి.. 11 కార్పొరేషన్లను టీడీపీ తన వద్దే ఉంచుకుంది. చర్చలు కొలిక్కి రాకముందే టీడీపీ గెజిట్ పత్రికల్లో వచ్చిన లీకులే చివరకు అధికారిక జాబితాగా మారాయి. చంద్రబాబు ముందే గీసిన గీత దాటకుండా జనసేన తలొగ్గిందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన వాటిలోనూ ఉత్తుత్తి సీట్లు పంచాయతీల విలీనం, డీలిమిటేషన్ వంటి కోర్టు కేసుల కారణంగా 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేనకు ఇచ్చిన కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్లు ఈ ఎన్నికలు లేని జాబితాలోనే ఉన్నాయి. శ్రీకాకుళంలో అయితే 2005 తర్వాత ఎన్నికలే జరగలేదు. జనసేనకు మిగిలింది విజయవాడ, ఏలూరు మాత్రమే. టీడీపీ తీసుకున్న 11 కార్పొరేషన్లలో మాత్రం ఎన్నికలు లేనిది మంగళగిరి–తాడేపల్లి ఒక్కటే. మున్సిపాలిటీల్లోనూ అదే తంతు. జనసేనకు ఇచ్చిన 21లో రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెంకు ఎన్నికలు లేవు. పశ్చిమ గోదావరిలోని రెండు కీలక పట్టణాలనూ కాగితాల్లోనే ఇచ్చారు. బీజేపీకి ఇచ్చిన రాజమహేంద్రవరం కార్పొరేషన్, బాపట్ల, కావలి మున్సిపాలిటీలకూ ఎన్నికలు లేవు. ఎన్నికలు జరిగే సీట్లు టీడీపీకి, ఎన్నికలు లేని సీట్లు మిత్రపక్షాలకు.. ఇదేనా పొత్తు ధర్మం అని జనసేన వర్గాలు నిలదీస్తున్నాయి. లెక్కలో ఎక్కువ చూపించి, ఎన్నికలు లేని సీట్లు అంటగట్టడం ద్వారా చంద్రబాబు మిత్రపక్షాలను అవమానించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అడిగినవన్నీ టీడీపీకే జనసేన పట్టుబట్టిన సీట్లు ఒక్కొక్కటిగా చేజారాయి. మచిలీపట్నం జనసేనకు దాదాపు ఖరారు అని మొదట్లో ప్రచారం జరిగినా చివరకు టీడీపీకే వెళ్లింది. ఒంగోలు, శ్రీకాళహస్తి అడిగినా ఇవ్వలేదు. జనసేనకేనని ప్రచారం జరిగిన అనంతపురం కార్పొరేషన్ బీజేపీకి వెళ్లింది. 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు రెండు దక్కితే, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి దక్కింది. నాయకత్వం మౌనం.. జనసైనికుల ఆగ్రహం కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని, కేడర్ సంతృప్తి చెందేలా పోటీ చేస్తామని జనసేన నేతలు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. జాబితా వచ్చాక ఒక్కరూ నోరు మెదపడం లేదు. 40 శాతం ఏమైంది, ఎన్నికలే లేని సీట్లు తీసుకుని ఏం చేయాలి, అడిగిన సీట్లన్నీ ఎందుకు వదులుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లే లేరు. ‘మనం 40 శాతం అడిగాం. వాళ్లు ఏం ఇవ్వాలనుకున్నారో అదే ఇచ్చారు. అందులోనూ రెండు కార్పొరేషన్లకు ఎన్నికలే లేవు. అయినా మన నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు?’ అని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఏం చెబితే అది చేయక తప్పని పరిస్థితిలో తమ నాయకత్వం ఉందని ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లతో సర్దుకున్నాం, స్థానిక ఎన్నికల్లోనూ అరకొర సీట్లతో సరిపెట్టుకోవాలా అని నిలదీస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోడ్డెక్కింది తామేనని, కూటమి కోసం ఎక్కువ త్యాగం చేసింది జనసేనేనని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని, ఆ త్యాగాలకు ఇదేనా ప్రతిఫలమని ప్రశ్నిస్తున్నారు. -
చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ
సాక్షి, అమరావతి: ఉదయం తొమ్మిదింటికి ఆఫీసు.. సాయంత్రం ఆరింటికి డ్యూటీ అయిపోవాలి. కానీ, ఎనిమిదైనా ల్యాప్‌టాప్ మూతపడదు. ఇంటికొచ్చాక కూడా వాట్సాప్‌లో బాస్ మెసేజ్‌లు, అర్ధరాత్రి మెయిల్స్. ఆ అదనపు గంటలకు రూపాయి జీతం ఉండదు. పోయేది మాత్రం నిద్ర, ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయం. ఇది ఒక్కరి గురించి కాదు. దేశంలో కోట్లాది మంది ఉద్యోగుల నిత్య జీవితం. తాజాగా వచ్చిన రెండు అంతర్జాతీయ నివేదికలు ఈ చేదు నిజాన్ని బయటపెట్టాయి.ప్రపంచంలోనే మనం ముందు..అంతర్జాతీయ హెచ్ఆర్ సంస్థ ఏడీపీ రీసెర్చ్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ పేరుతో 36 దేశాల్లో 39 వేల మందికి పైగా ఉద్యోగులను సర్వే చేసింది. జీతం లేకుండా అదనంగా పనిచేసే వారిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో 24 శాతం మంది ఉద్యోగులు వారానికి 16 గంటలకు పైగా పనిచేస్తున్నారు. మరో 40 శాతం మంది 6 నుంచి 15 గంటలు పనిచేస్తున్నారు. అంటే.. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు వారానికి కనీసం ఆరు గంటలు ఉచితంగా పనిచేస్తున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 16 గంటలకు మించి ఉచితంగా పనిచేసే వారు కేవలం 12 శాతం. 62 శాతం మంది వారానికి ఐదు గంటల లోపే అదనంగా పనిచేస్తున్నారు. భారత్ తర్వాత టర్కీ (23 శాతం), ఆస్ట్రియా (21 శాతం), అమెరికా (20 శాతం) ఉన్నాయి. కష్టపడి పనిచేస్తారని పేరున్న జపాన్, చైనా, తైవాన్లలో ఇది కేవలం ఆరు శాతం. చెక్ రిపబ్లిక్లో అయితే నాలుగు శాతమే. లంచ్ బ్రేక్ మానేయడం, ఆఫీసు సమయం అయిపోయాక కూడా ఉండిపోవడం, ఇంటి నుంచి రాత్రి వేళల్లో పనిచేయడం.. ఇవన్నీ జీతంలేని పని కిందకే వస్తాయని నివేదిక స్పష్టంచేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారే ఎక్కువ గంటలు ఉచితంగా పనిచేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.అదనపు పనిగంటలతో తీవ్ర ఒత్తిడి..ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన ఉత్పాదకత పెరగడంలేదని ఏడీపీ తేల్చిచెప్పింది. అదనపు గంటలు పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో సంతృప్తి తగ్గింది. వేరే ఉద్యోగం వెతుక్కునే ఆలోచనలు పెరిగాయి. వారానికి 70 గంటలు పనిచేయాలని కొందరు పారిశ్రామికవేత్తలు యువతకు సలహాలిస్తున్న వేళ ఈ నివేదిక చర్చనీయాంశమైంది. చేతిలో ఫోన్‌తో కునుకు దూరం..ఇక నిద్రను చెడగొడుతున్న మరో అతిపెద్ద శత్రువు స్మార్ట్‌ఫోన్. 87.6 శాతం మంది పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, వెబ్ సిరీస్‌లు, ఆఫీసు మెసేజ్‌లు.. అన్నీ నిద్రను దూరం చేస్తున్నాయి. ఆ గంటలు నిద్ర నుంచే..మరి ఈ అదనపు పని గంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిద్ర సమయం నుంచే. ఫిన్లాండ్కు చెందిన స్మార్ట్ రింగ్ సంస్థ ‘ఊరా’ తన భారతీయ వినియోగదారుల డేటాతో ‘స్టేట్ ఆఫ్ స్లీప్ 2026’ నివేదిక విడుదల చేసింది. భారతీయులు సగటున రాత్రి 12, రెండు గంటలకు పడుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆలస్యమైన సమయాల్లో ఒకటి. లేచే సమయం మాత్రం ఉదయం 7.43కే. ఫలితంగా సగటు నిద్ర 6 గంటల 28 నిమిషాలకు పరిమితమైంది. ఎక్కువ నిద్రపోయే దేశాల కంటే ఇది సుమారు 40 నిమిషాలు తక్కువ. ఆరోగ్యవంతులైన పెద్దలకు రోజుకు 7–9 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతారు.ప్రపంచం ఒకవైపు.. ఏపీ మరోవైపు..ఉద్యోగులు అలసటతో కుంగిపోతున్నారని, ఎక్కువ పని గంటలు ఉత్పాదకతను పెంచవని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్న సమయంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పూర్తి వ్యతిరేక దిశలో అడుగులేసింది.రోజువారీ గరిష్ట పని గంటలను 9 నుంచి 10కి పెంచింది. -
నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. విజయనగరం సహా రాష్ట్రవ్యాప్తంగా 13 నగర కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు కలిపి మొత్తం 100చోట్ల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ బుధవారమే షెడ్యూల్‌తో పాటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీచేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు 13 మేయర్ పదవులతో పాటు 922 కార్పొరేటర్ పదవులకు.. 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లో మొత్తం 87 చైర్మన్ పదవులు, 3,020 వార్డు కౌన్సిలర్ పదవులకు స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శుక్రవారం ఉదయం వేర్వేరుగా ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. అనంతరం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 18వ తేదీ సా.3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. విజయనగరం కార్పొరేషన్ పోలింగ్ తేదీ మార్పు?ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవమైన పైడితల్లమ్మ సిరిమానోత్సవం ఈనెల 27న జరగనున్నందున విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ తేదీని ఈనెల 28 నుంచి 29కి మార్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఉత్సవం రోజున పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ఉత్సవ విధుల్లో ఉండడంవల్ల ఎన్నికల విధులపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒకట్రెండు రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. -
బీసీ రిజర్వేషన్లు సరిగా లేవు.. ఎన్నికలు ఆపండి
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని, సహేతుక గణాంకాలను సేకరించకుండా రిజర్వేషన్లను ఖరారు చేశారని, ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వ చర్యల వల్ల బీసీలకు నష్టం కలుగుతోందంటూ గుంటూరు జిల్లా, చుండూరు మండలం ఆలపాడుకి చెందిన డాక్టర్ సీహెచ్ రవికుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా నిబంధనల ప్రకారం ప్రక్రియను నిలువరించవచ్చని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక వ్యాజ్యంలో తీర్పునిచ్చిందని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష చేసిన వాదనలు క్లుప్తంగా..» ఏకీకృత కుటుంబ సర్వే డేటా ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఈ నివేదికను ఆమోదించినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. దీనిని ఎందుకు రహస్యంగా ఉంచుతుందో మాత్రం అర్థం కావడం లేదు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించకుండానే ప్రభుత్వం దానిని ఆమోదించడమూ సరికాదు. అలాంటి నివేదిక ఆధారంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడం తగదు.» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన ట్రిపుల్ టెస్ట్‌ను చేపట్టకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసింది. » రిజర్వేషన్ల కల్పనకు బీసీ జనగణన తప్పనిసరి. అయితే ప్రభుత్వం ఆ పని చేయకుండా ఏకపక్షంగా బీసీలకు అసంబద్ధంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. » సరైన డేటా సేకరించకుండా రిజర్వేషన్లు నిర్ణయించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోతున్నాయి. -
సమరానికి ముందే ఉక్కుపాదం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు స్థానిక ఎన్నికల్లో గెలిచి సాధించేది ఏముంది. అధికారపార్టీకి పోటీగా నిలిచి అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. మంచిగా చెబుతున్నాను వినండి. మర్యాదగా పోటీ ఆలోచన విరమించుకోండి. నా మాట వినకపోతే తర్వాత పర్యవసానాలు మీరు తట్టుకోలేరు. – ఇది రైల్వేకోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు బెదిరింపుసాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్లో పోలీసుల ఓవరాక్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాగైనా గెలవాలన్న దుగ్థతో అధికారపార్టీ నేతల కనుసన్నల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై బెదిరింపుల పర్వానికి తెరలేపారు. కొందరు పోలీసులు మరీ అడ్డగోలుగా పేట్రేగిపోతున్నారు. ఇందులో భాగంగానే పల్నాడు, గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో పోలీస్ బాస్‌ల నుంచి సీఐ, ఎస్సై వరకు రంగంలోకి దించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగాలనుకుంటున్న ఆశావహుల వివరాలు నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. వారిపై ఏమైనా పాత కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు. లేదంటే కొత్త కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు పిలిచి బైండోవర్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ‘ఎన్నికల్లో పోటీ చేసి అనవసరంగా సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారు?’, ‘కేసుల్లో ఇరుక్కుంటే ఇబ్బందులు పడతారు’ అంటూ హెచ్చరిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ బైండోవర్ల ఉచ్చు? » విజయనగరం జిల్లాలో ఏకంగా 20 వేల మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం ప్రకటించారు. బైండోవర్ కేసుల్లో ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బైండోవర్ కేసుల్లో ఒక్కొక్కరి దగ్గర రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు సొంత పూచీకత్తు తీసుకున్నామన్నారు. » తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల కుటిల పన్నాగంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బైండోవర్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నియోజకవర్గంలో మొత్తం బైండోవర్ కేసుల్లో అత్యధికంగా వైఎస్సార్సీపీ నాయకులపై నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పుల్లంపేటలో 80, ఓబులవారిపల్లిలో 121, పెనగలూరులో 70, చిట్వేలిలో 190, కోడూరులో 120 వరకు బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు తెల్సింది. ఇప్పటికే నియోజకవర్గంలో లక్కిరెడ్డిరాజారెడ్డి, పలిగల రాజశేఖర్, జనార్ధన్, మల్లికార్జున, మహేష్, పోలిమహేంద్రరెడ్డి, సయ్యద్ ముస్తాక్, మల్లురామక్రిష్ణారెడ్డి తదితరులపై నమోదు చేసారు. ఇంకా నాయకులు, కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు అధార్ కార్డులు తీసుకొని రమ్మంటున్నారు. » జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో అధికార పక్షం పోలీసుల ద్వారా బెదిరింపుల పర్వం తీవ్రరూపం దాల్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్సీపీకి చెందిన ఓ బలమైన అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని, నియోజకవర్గ ఎమ్మెల్యే పీఏ గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ వేదికగా బెదిరింపులకు దిగారు. సదరు అభ్యర్థికి చెందిన వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తామని, వాటిని దెబ్బతీస్తామని హెచ్చరిస్తూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, మరికొందరు అభ్యర్థులను సైతం ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. » పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, దాచేపల్లి, పిగుడురాళ్ల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల్లో రెండు రోజుల్లోనే ఏకంగా 1,688మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. వారిలో దాదాపు 60శాతం వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతిపరులే కావడం గమనార్హం. » గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో 290మందిని బైండోవర్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి బైండోవర్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. » తిరుపతి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పలు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్, పార్టీ కార్యకర్తలు మూర్తి ప్రేమ్‌కుమార్, పి.మస్తాన్ తదితరులపై ఎటువంటి కారణాలు లేకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. »నంద్యాల జిల్లా పాణ్యంలో 38మందిని, అన్నమయ్య జిల్లా పీలేరులో 133మందిని బైండోవర్ చేశారు. » కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై బైండోవర్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలకు పోలీస్స్టేషన్ల నుంచి పిలుపులు వచ్చాయి. గతంలో మీపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి.. తక్షణమే స్టేషన్‌కు వచ్చి బైండోవర్ కావాలని బుధవారం పిలుపులు రావడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఈ విషయాన్ని డీఎస్పీ ఏబీజీ తిలక్ దృష్టికి తీసుకెళ్లారు. » శ్రీకాకుళం జిల్లాలో బైండోవర్ కేసుల నమోదు చేస్తున్నట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం ప్రకటించారు. వజ్రపుకొత్తూరు మండలంలోని 37 పంచాయతీల్లో 393 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వజ్రపుకొత్తూరు ఇన్చార్జి ఎస్ఐ అప్పలరెడ్డి తెలిపారు. హిరమండలంలో 55 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. » వైఎస్సార్ కడప జిల్లాలో రెండు రోజుల నుంచి పోలీసులు బైండోవర్లను ప్రారంభించారు. కడప కార్పొరేషన్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలు, రెండు మేజర్ పంచాయతీలు, 39 మండలాల పరిధిలో పోలీసు యంత్రాంగం బైండోవర్లు చేస్తున్నారు. కడప నగర కార్పొరేషన్ పరిధిలో దాదాపు 110 మందిని బైండోవర్ చేస్తే వారిలో కేవలం 85 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు కావడం గమనార్హం. కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 350 మందిని బైండోవర్ చేస్తే వారిలో ఏకంగా 290 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, సానుభూతి పార్టీల వారు ఉన్నారు. పిడుగురాళ్ల.. ‘నో డ్యూ’ ఇవ్వకుండా వేధింపులు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు పాక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న అధికారులు అదే అధికారపక్షం అభ్యర్థులకు ఆగమేఘాలపై ఇచ్చి పంపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిప్పుతూ, సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి, చివరకు మరుసటి రోజు రావాలని చెబుతున్నారు. పెడన.. భయపెట్టి తప్పించారు.... కృష్ణాజిల్లా పెడన పట్టణంలోని 18వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్ కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు ఒక ప్రైవేటు ఉద్యోగిని అభ్యర్థిగా రంగంలోకి దించారు. విద్యావంతుడు, స్థానికంగా మంచి పేరున్న వ్యక్తి కావడంతో పాటు వైఎస్సార్సీపీ అంటే అభిమానంతో బరిలో నిలబడేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. తాను కాకపోయినా తన భార్యనైనా నిలబెట్టడానికి ఆసక్తి చూపారు. వీరిద్దరిలో ఎవరు నిలబడినా సీటు వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని భావించిన అధికార పార్టీ నాయకులు సదరు అభ్యర్థిని పరోక్షంగా తాను ఉద్యోగం చేస్తున్న సంస్థలోని ఉన్నతస్థాయి వ్యక్తులతో హెచ్చరించినట్లుగా సమాచారం. దీంతో ఈ గొడవలు తనకెందుకని భావించి ఆయన విషయాన్ని వైఎస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చి, పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలియజేశారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలు..స్థానిక ఎన్నికల కోడ్‌ను అధికారపక్షం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. విజయనగరం రైతు బజారులో చంద్రబాబు ఫొటోతో బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఆయన చిత్రంతోనే అమ్మకాలు చేయాలంటూ అధికారులు ఆదేశించినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. గుంటూరు నగర వ్యాప్తంగా టీడీపీ నేతల ఫ్లెక్సీలు, ఎమ్మెల్యేతో పాటు మేయర్ పదవిని ఆశిస్తున్న నేతల ప్రచార చిత్రాలు కనిపిస్తున్నాయి. వాటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.‘‘కర్నూలులోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్, పెయింటర్ చిట్టిబాబు, ఎలక్ట్రీషియన్ నూర్ అహ్మద్‌లను పోలీసులు టార్గెట్ చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడమే వారు చేసిన నేరం. తెల్లవారు జామున వాళ్ల ఇళ్లలోకి చొరబడి తనిఖీల పేరుతో భయాందోళనలకు గురిచేశారు. బీరువాలు తెరిచి సామాన్లు చిందరవందరగా పడేశారు.’’తాడిపత్రి.. జేసీ అనుచరుల దాష్టీకం...తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేస్తే నీ భర్తను చంపేస్తామంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి సాయిజ్యోతిని టీడీపీ నేత జేసీ అనుచరుడు రఘు, రౌడీలతో కలిసి ఇంటికి వెళ్లి మరి బెదిరింపులకు దిగాడు. తాడిపత్రి పట్టణంలోని నగరంలోని శాస్త్రినగర్‌లో ఉంటున్న వైఎస్సార్సీపీ నేత మడ్డిపల్లి వేణుగోపాల్‌రెడ్డి, తన భార్య సాయిజ్యోతితో 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ అనుచరుడు రఘు 25మంది పచ్చమూకతో వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి హల్చల్ చేస్తూ భయాందోళనలు రేకెత్తించారు. ఈ ఘటన వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎస్పీ జగదీష్‌కు చెప్పినట్టు తెల్సింది. జిల్లా ఎస్పీ సూచనతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయచోటి... ‘బలైపోతావ్’ అంటూ మంత్రి బెదిరింపులు.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆశావహులను లక్ష్యంగా చేసుకుని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి బెదిరింపులకు దిగారు. గౌస్ అనే మైనారిటీ నాయకుడికి ఫోన్ చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని, బలైపోతావంటూ మంత్రి చేసిన హెచ్చరికల ఫోన్‌కాల్ వైరల్ అవుతోంది. ‘రిక్వెస్ట్ అనుకుంటారో.. బెదిరింపు అనుకుంటారో.. ఇంకేమనుకుంటారో మీ ఇష్టం’, ‘మీరు బలిపశువులు కావద్దు’ అంటూ హెచ్చరించడం గమనార్హం. ఈ ఎన్నిక తనకు ప్రతిష్టాత్మకమని, ఎవరూ పోటీకి దిగవద్దని, ఇంకా రెండున్నరేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని మంత్రి భయపెట్టేలా మాట్లాడడం శోచనీయం. రాయచోటిలోని వివిధ వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు మంత్రి ఇదే మాదిరిగా ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. -
మహిళాభివృద్ధితోనే వికసిత్ భారత్
సాక్షి, అమరావతి: గ్రామీణ మహిళలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మిగిలిపోకుండా సంపద సృష్టికర్తలుగా, దేశాభివృద్ధికి చోదకశక్తులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి స్థాయి నుంచి కోటీశ్వరురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళాభివృద్ధి ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని చెప్పారు. విజయవాడలో ఏర్పాటుచేసిన జాతీయ సారస్ మేళా–2026ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఉద్యోగాల కోసం వెదికేవారిగా కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని కోరారు. ఎస్‌హెచ్‌జీ ఉద్యమం గ్రామీణ ఆర్థికవ్యవస్థకు బలం ఇస్తోందని చెప్పారు. 12 ఏళ్లలో ఈ సంఘాలతో అనుసంధానమైన మహిళల సంఖ్య 10 కోట్లకు పైగా పెరగడం సంతోషదాయకమన్నారు. దేశంలో 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయని, వీటిద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సామాజికంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారని చెప్పారు. మహిళలు వ్యాపారాభివృద్ధితోపాటు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారి భాగస్వామ్యం పెరగడం దేశసమతుల్య, సమ్మిళిత అభివృద్ధికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా మార్పులు తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్ వేదికగా సారస్ మేళాలు జాతీయ సారస్ మేళాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మార్కెట్ వేదికలుగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఈ మేళాల ద్వారా తమ ఉత్పత్తులకు విస్తృత గుర్తింపుతో పాటు నేరుగా వినియోగదారులకు పరిచయం చేసుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. సారస్ మేళాల ద్వారా గ్రామీణ మహిళలకు, వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు బలోపేతమవుతున్నాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యసాధనలో స్వయం సహాయక సంఘాలు, జాతీయ సారస్ మేళాలు కీలకపాత్ర పోషించాలని రాష్ట్రపతి కోరారు. సంపద సృష్టికర్తలు మహిళలే: చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు చెప్పారు. గ్రామీణ మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు స్వయం ఏపీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది లక్షమంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, ఈ ఏడాది ఐదులక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మన ఎస్‌హెచ్‌జీలు సేవింగ్ మనీ స్థాయినుంచి మేకింగ్ మనీ స్థాయికి అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన 14 రోజులకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్ అవకాశాలు కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 11 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 1.10 కోట్లమంది సభ్యులున్నట్లు తెలిపారు. ఈ సంఘాలు సమష్టిగా రూ.69 వేలకోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయని, వాటి ఉత్పత్తులు సుమారు 3.5 కోట్ల మందికి చేరుతున్నాయని చెప్పారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వ్యాపారాలను విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహననాయుడు, కమలేష్ పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ముర్ముకు ఘనంగా వీడ్కోలు విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. విజయవాడ నుంచి ఆమె మధ్యాహ్నం 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితరులు వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.లక్పతి దీదీతో కొత్త అవకాశాలుగ్రామీణ మహిళల సాధికారతకు కేంద్రం అమలు చేస్తున్న లక్పతి దీదీ కార్యక్రమం కొత్త దిశానిర్దేశం చేసిందని రాష్ట్రపతి చెప్పారు. మహిళల ఆదాయాన్ని పెంచడం, వారిని స్వయం ఉపాధి మార్గాల్లో ప్రోత్సహించడం, కొత్త వ్యాపారాలను స్థాపించి విస్తరించుకునేందుకు అవకాశాలు కల్పించడం దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆదాయ వినియోగం, ఆస్తుల నిర్వహణలో వారికి స్వేచ్ఛ, నిర్ణయాధికారం ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు.మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన వనరులు, అవకాశాలు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే కొత్త నైపుణ్యాల అభివృద్ధికి, ఆదాయ మార్గాలను విస్తరణకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మహిళలు తమ సమయాన్ని, శ్రమను పూర్తిగా వ్యాపారాభివృద్ధికి వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడే మహిళల ఆర్థిక స్వాతంత్య్రం మరింత బలపడుతుందన్నారు. -
ఉచిత వైద్యం ఉత్తిదే..!
రోగుల ప్రాథమిక హక్కును సైతం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంకాలరాస్తోంది. ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో లంచావతారులను పెంచి పోషిస్తోంది. జీవించే హక్కులో ఆరోగ్య హక్కు కూడా భాగమేనన్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను విస్మరించడం విస్మయపరుస్తోంది. సర్కారు ఆస్పత్రులపై రోగుల చీదరింపులు, ఈసడింపులను ఐవీఆర్ఎస్ సర్వేలు స్పష్టీకరిస్తున్నా వైద్యశాఖలో స్పందన లేకపోవడం ధృతరాష్ట్రుడి పాలనను గుర్తుకు తెస్తోంది.సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో అయినా ఆస్పత్రుల సేవలు మెరుగ్గా ఉండి ఉంటాయని ఆశపడిన రోగులు కూడా చిరాకుపడడం ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. మందులు లేని, వైద్యులు రాని ఆస్పత్రులతో రోగుల ప్రాణాలకురక్షణ కల్పించాలనుకోవడం నేల విడిచి సర్కారు సాము చేయడమే..! సాక్షి, అమరావతి: ఉచిత వైద్యం అందదు..డబ్బులు ఇవ్వందే వైద్యం లేదు.. పరిశుభ్రత పట్టదు..వైద్యులు ఉండరు.. ఉచిత మందులు ఇవ్వరు. ఇదీ ప్రభుత్వాస్పత్రుల పనితీరు అంటూ రోగులు ఈసడించుకుంటున్నారు. సర్కారు ఆస్పపత్రుల పనితీరుపై ప్రభుత్వం చేయిస్తున్న ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) సర్వేలో రోగులు ఇదే విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్, డీఎంఈ ఆస్పత్రుల్లో సేవలు బాగోలేవని 30 శాతం మంది రోగులు వెల్లడించినట్టు ఈ సర్వే తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని ఆస్పత్రులు సైతం పనితీరులో ఘోరంగా అట్టడుగు స్థానాల్లో నిలవడం వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో వైద్య రంగం దుస్థితిని తేటతెల్లంజేస్తోంది. పబ్లిసిటీ స్టంట్..స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అంటూ ప్రతి మూడో శనివారం సీఎం చంద్రబాబు వివిధ జిల్లాలకు వెళ్లి హడావుడి చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం చేస్తున్న ఈ కార్యక్రమంపై శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో అపరిశుభ్రతను గాలికి వదిలేశారని, ఫలితంగానే ఆస్పత్రులు అధ్వానంగా మారాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రశ్నలు వేయగా డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులు ఘోరంగా ఉంటున్నాయని ఏకంగా 44 శాతం మంది తెలిపారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో 37 శాతం, పీహెచ్‌సీల్లో పరిశుభ్రతను 37 శాతం మంది చీదరించుకున్నారు. లంచం ఇస్తేనే వైద్యం.. అనారోగ్యం బారినపడి ప్రభుత్వాస్పత్రులకు వెళితే అక్కడ లంచాల కోసం వేధిస్తున్నట్టు బడుగు బలహీన వర్గాలకు చెందిన రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వీల్ చైర్, స్ట్రెచర్, బెడ్ ఇవ్వడానికి, ఇంకా వివిధ రకాల సేవలకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తేలింది. వైద్య సేవల కోసం లంచం డిమాండ్ చేశారా? అని డీఎంఈ ఆస్పత్రుల్లో సేవలు పొందిన రోగులను సర్వేలో ఆరా తీయగా 26 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో సేవలు పొందిన 27.2 శాతం, పీహెచ్‌సీలకు వెళ్లిన రోగులు 25 శాతం మేర లంచాల వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. పనితీరు పేలవం.. ఆస్పత్రుల్లో సేవలు, వసతులపై ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల్లో సీఎం చంద్రబాబు, ఆ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోని ఆస్పత్రులే అట్టడుగు స్థానంలో ఉంటున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో డీఎంఈ పరిధిలో సీఎం సొంత జిల్లా తిరుపతి 30 శాతానికిపైగా రోగుల అసంతృప్తిని మూటగట్టుకుంది. వైద్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురంలో ఏకంగా 34 శాతానికిపైగా రోగులు ప్రభుత్వ వైద్య సేవలను చీదరించుకున్నారు. సెకండరీ హెల్త్ పరిధిలోని ఆస్పత్రులకు సంబంధించి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 30 శాతం మంది ప్రజలు సేవలు ఏ మాత్రం బాగోలేవని తెలిపారు. -
స్థానిక పోరు.. సేవారంగానికి జోరు
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఎప్పుడు జరిగినా అభ్యర్థులు తమ గెలుపునకోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. రూ.కోట్లు ఖర్చు చేసి గెలిచేందుకు పోటీపడుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో సేవారంగానికి ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉందని అధ్యయనాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థులు ప్రచారసభలు, ర్యాలీలు, వాహనాలు, మైకులు, భోజన ఏర్పాట్లపై చేసే ఖర్చుతో పాటు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల తయారీకి స్థానిక ప్రింటింగ్ కేంద్రాలను ఆశ్రయించడం వల్ల చిరువ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. స్థానిక ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, టెంట్ నిర్వాహకులు, సౌండ్సిస్టమ్ టెక్నీషియన్లు, వంటవారు, క్యాటరింగ్ సిబ్బంది, ఆటో, కారు డ్రైవర్లకు అదనపు రోజువారీ పని లభిస్తుంది. సభలకు కుర్చీలు, మైకులు, జనరేటర్లు అద్దెకు ఇవ్వడం నుంచి కార్యకర్తలకు భోజనాలు సిద్ధం చేయడం వరకు పలు సేవలకు డిమాండ్ ఏర్పడుతుంది. ఈ పనుల్లో కొన్నింటికి అదనపు సహాయకులు అవసరమవడంతో కొందరు సామాన్యులకు తాత్కాలిక ఉద్యోగాలు దొరుకుతాయి. రోజువారీ కూలీలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అభ్యర్థులు నగదును పట్టణాలు, గ్రామాల్లోనే ఖర్చుచేయడం వల్ల స్థానిక వ్యాపారుల చేతుల్లోకి నగదు చేరి.. దుకాణాలు, రవాణా, ఆహారసేవలు వంటి అనుబంధ రంగాల్లోను నగదు చలామణి పెరగవచ్చని నివేదికల్లో వెల్లడైంది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో 9 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని ఉద్యోగ నియామక రంగానికి చెందిన సంస్థలు అప్పట్లో ముందస్తు అంచనా వేశాయి. వర్క్‌ఇండియా సంస్థకు సంబంధించిన అంచనాలు, పరిశ్రమవర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రచారానికి సంబంధించి ఆరునెలల్లో సుమారు రెండులక్షల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రచార నిర్వహణ, రవాణా, ఆహార సరఫరా, ప్రింటింగ్, భద్రత, ఐటీ సేవలు తదితర రంగాల్లో మరో నాలుగులక్షల నియామకాలు జరిగాయని అంచనా. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) అంచనా ప్రకారం.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం వ్యయం సుమారు రూ.1.35 లక్షల కోట్లకుపైనే ఉంది. 2019లో ఎన్నికల వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల మధ్య ఉంటుందని అప్పట్లో అంచనా వేయగా, 2024లో వ్యయం గణనీయంగా పెరిగింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) 2025లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ప్రచారం, ప్రకటనలకు అభ్యర్థులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇదంతా అంతిమంగా ప్రజల్లోకే వెళుతుంది. ఇందులోనే సేవారంగానికి కూడా కొంత చేరుతుంది. పలు వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు స్థానిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ఖర్చు అనేక వృత్తుల వారికి పనులు కల్పిస్తుంది. సభల నిర్వహణకు టెంట్లు, కుర్చీలు, మైకులు, జనరేటర్లు అవసరమవుతాయి. ప్రచార సామగ్రి కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించాల్సి ఉంటుంది. కార్యకర్తల రాకపోకలు, భోజన ఏర్పాట్లకు వాహనాలు, హోటళ్లు, క్యాటరింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపారులు, రోజువారీ కూలీలు, యువతకు తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రెజిల్లో ఎన్నికల ప్రచార సిబ్బందిపై నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన పరిశోధన నివేదిక ప్రకారం.. విజయం సాధించిన రాజకీయ ప్రచార బృందాల్లో పనిచేసిన కొందరికి తర్వాతి కాలంలోను ఉద్యోగ, ఆదాయ ప్రయోజనాలు కనిపించాయి. ముఖ్యంగా విజేతల బృందాల్లో పనిచేసినవారికి నాలుగేళ్ల తర్వాత వార్షిక ఆదాయంలో సుమారు 10 శాతం ప్రయోజనం కనిపించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అంటే.. స్థానిక ఎన్నికలు సేవారంగంలో తాత్కాలిక డిమాండ్‌ను పెంచే అవకాశం కల్పిస్తాయని రుజువైంది. ఎంతమంది అవసరం? 100 ప్రచారసభలు, సమావేశాల నిర్వహణకు వివిధ విభాగాల్లో అవసరమయ్యే సిబ్బందిపై ఒక అంచనా ఇలా ఉంది సేవా విభాగం అవసరమయ్యే సిబ్బంది టెంట్లు, షామియానా, కుర్చీల ఏర్పాటు 600–1,200 వంటవారు, క్యాటరింగ్, భోజనాల సరఫరా 800–2,000 ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు 200–400 సౌండ్సిస్టమ్, విద్యుత్ టెక్నీషియన్లు 200–500 డ్రైవర్లు, రవాణా సహాయకులు 200–600 బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు 200–600 ప్రింటింగ్, ప్రచారసామగ్రి తయారీ 200–500 -
నామినేషన్ వేసే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించండి
సాక్షి, అమరావతి: మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసే పరిస్థితిలో లేని అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ప్రతి కలెక్టర్ కార్యాలయం లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో తగిన ఏర్పాటు చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.‘స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా తనకు కలెక్టర్ కార్యాలయం లేదా ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెసులుబాటునివ్వాలని ఎవరైనా అభ్యర్థి వినతి పత్రం సమర్పిస్తే, దానిపై మూడు రోజుల్లోపు తగిన చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు గురువారం ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఈ మేరకు తీర్పు వెలువరించారు.క్రిమినల్ కేసుల వివరాలిచ్చేలా ఆదేశాలివ్వండిహైకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్.. నేడు విచారణసాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరితే, ఆ వివరాలను నిర్ణీత గడువులోపు అందించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఒకవేళ ఎలాంటి కేసులు లేకపోతే, ఆ విషయాన్ని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని తమ పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది.‘ఏ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.. క్రై మ్ నంబర్ ఎంత వంటి వివరాలతో కూడిన ఒక అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని రెండు రోజుల్లోగా లేదా నిర్ణయించిన గడువులోగా అభ్యర్థికి అందించేలా ఆదేశాలివ్వండి.’ అని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో కోర్టును కోరింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం అభ్యర్థించగా శుక్రవారం వాదనలు వింటామని జస్టిస్ వడ్డిబోయన సుజాత స్పష్టంచేశారు.నామినేషన్ల గడువును 6 రోజులకు పెంచాలిసాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల గడువును మాత్రమే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ భారత చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల చట్ట నిబంధనల ప్రకారం నామినేషన్ల గడువును ఆరు రోజులకు పెంచేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆయన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 3 రోజుల గడువు నామినేషన్ల దాఖలుకు ఎంత మాత్రం సరిపోదని స్పష్టంచేశారు. గత ఎన్నికల సమయంలో అనుభవాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నో డ్యూస్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రాలు వంటి డాక్యుమెంట్లను అధికారులు సమర్పించేందుకు సైతం తగిన గడువు అవసరమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. యథేచ్ఛగా జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ, సీఈసీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లను తొలగించలేదని.. సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదులో పేర్కొంది.ఎన్నికల కోడ్‌ను టీడీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణలో అధికారుల నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయి. ‘‘ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు, కటౌట్లను తక్షణమే తొలగించాలి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. అనుమతి లేని ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటును అడ్డుకోవాలి. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి’’ అని ఫిర్యాదులో లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు? -
అందుకే వైఎస్ జగన్‌పై ‘ఎల్లో మీడియా’ విష ప్రచారం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులతో ఎల్లో మీడియాతో కలిసి విష ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఫైర్ అయ్యారు.ఎన్నికలు రాగానే తాము చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఏ రాజకీయ పార్టీకైనా సహజమని, కానీ చంద్రబాబు మాత్రం ఎదుటివారిపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందడమే పనిగా పెట్టుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ధ్వజమెత్తారు. వంగవీటి నరేంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..:ఎన్నికలు రాగానే టీవీ సీరియళ్లలా అక్రమ కేసులు:ప్రపంచంలో ఎక్కడైనా ఎన్నికలొస్తే తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడుగుతారు. కానీ వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చరిత్ర కలిగిన చంద్రబాబు ఆలోచన విధానం ఎప్పుడూ వక్రీకరించే దిశలోనే ఉంటుంది. ఎన్నికలు రాగానే తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని జగన్‌గారిపై విష ప్రచారాలు మొదలుపెడతారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులు, వివేకానందరెడ్డి హత్య కేసు, లిక్కర్ స్కామ్ అంటూ ఆధారాలు లేని అంశాలను టీవీ సీరియళ్లలా ఏళ్ల తరబడి నడిపిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ఆరోపణకైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోరేవాళ్లు, నిందితులు అంతా నేడు చంద్రబాబు ఆఫీసుల చుట్టూనే తిరుగుతున్న వాస్తవం ప్రజలకు తెలియదా?.హామీల అమలులో ఘోర వైఫల్యం. ప్రజలకు వెన్నుపోటు:ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో ప్రజలను ఘోరంగా వంచించి వెన్నుపోటు పొడిచారు. తమ వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయంతోనే ఇప్పుడు జగన్ గారి కేసులంటూ తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే దమ్ము లేక, పత్రికల్లో ’ఈడీ ఎదురుదెబ్బ’, ’ వైఎస్ జగన్‌కు షాక్’ అంటూ రోజూ అసత్యాలు ప్రచురిస్తూ కాలం గడుపుతున్నారు.అది కోరుకున్నది స్వయంగా జగనే:సీబీఐ కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసులు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాల తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. పదేళ్ల క్రితం పెట్టిన కేసుల్లో ఇప్పుడు హడావిడిగా విచారణలు చేయిస్తూ జగన్ గారికి షాక్ తగిలిందని అసత్యాలు రాస్తున్నారు. చంద్రబాబులా మేము వ్యవస్థలను, పత్రికలను అడ్డుపెట్టుకుని గానీ, కేంద్రంతో పొత్తులు పెట్టుకుని గానీ ఏనాడూ కేసులను ఆపుకోలేదు. మాపై పెట్టిన తప్పుడు కేసుల విచారణను ఆపాలంటూ కోర్టులో మేము వేసిన ఒక్క పిటిషన్ అయినా చూపించగలరా? నింద పడినప్పుడు రాజ్యాంగబద్ధంగా అభ్యంతరాలు తెలపడం హక్కు. పైగా ఈ కేసులను వీలైనంత త్వరగా, న్యాయబద్ధంగా ముగించాలని న్యాయస్థానాలను కోరుతున్నది స్వయంగా జగనే24 క్రిమినల్ కేసులున్న చంద్రబాబు నీతులు చెప్పడమా?:2024 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చంద్రబాబు తనపై 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా పేర్కొన్నారు. వాస్తవానికి ఆయనపై రౌడీషీట్ తెరవాలి. గత ప్రభుత్వంలో ఆధారాలతో సహా సీఐడీ ఎంక్వైరీ చేసి స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేస్తే, అధికారంలోకి రాగానే వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ’మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ పేరుతో ఏడు కేసులను ఎలా మాఫీ చేయించుకున్నారో సమాధానం చెప్పాలి. దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులున్న పార్టీ వెన్నుపోటు పార్టీ. ముఖ్యమంత్రిగా ఎక్కువ కేసులున్న వ్యక్తుల్లో చంద్రబాబు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి శ్రీరంగనీతులు చెబుతూ ఇతరులపై నిందలు వేయడం సిగ్గుచేటు.దమ్ముంటే చేసిన పనులపై స్థానిక ఎన్నికల్లో తేల్చుకుందాం:ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక కుళ్లుకుంటున్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదనే భయంతోనే ఈ కుట్రలకు తెరలేపారు. కరోనా లాంటి గడ్డు కాలంలో కూడా మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చి ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లిన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి దమ్ము, చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన పనులతో ప్రజల్లోకి రావాలి. దీంతో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరికి బుద్ధి చెబుతారో తేలిపోతుందని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు? -
మాజీ మంత్రి అంబటిపై మరో అక్రమ కేసు
సాక్షి, గుంటూరు: స్థానిక ఎన్నికల వేళ కూటమి కక్ష సాధింపులకు దిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో అక్రమ కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన టీడీపీ గూండాల అరెస్ట్ కోరుతూ ఏప్రిల్‌లో కలెక్టరేట్ ఎదుట అంబటి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీక్ష చేసిన అంబటికి పట్టాభిపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు.తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 18 తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్ వద్ద 12 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. కాగా, గతంలో చంద్రబాబు సర్కార్.. అంబటి రాంబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి అన్యాయంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు? -
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో పిటిషన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ మరో పిటిషన్ వేసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న కేసు వివరాలు దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. అభ్యర్థులపై ఎక్కడ ఏఏ కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పిటిషన్ రేపు(శుక్రవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై నమోదైన, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించేలా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని కూడా వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు లేళ్ల అప్పిరెడ్డి.. ఎస్ఈసీకి లేఖ రాశారు. కూటమి సర్కారు పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ ఆశావహ అభ్యర్ధులపై చేస్తున్న వేధింపుల్ని ఈ లేఖలో ప్రస్తావించారు.వాటిని అడ్డుకోవడంతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు అవసరమైన వివరాలు అందించేందుకు రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా లేఖలో కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, వివిధ పోలీస్ స్టేషన్లలో తమ పార్టీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తద్వారా వారిలో భయాందోళనలు సృష్టించి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆటంకం కలిగిస్తున్నారన్నారు.ఇదీ చదవండి: 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు? -
14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుందా?. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా?. ఎన్నికల సంఘం నిర్ణయాలే దాని విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తున్నాయి’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సీఎస్‌గా పనిచేసిన అనిల్ చంద్ర పునేఠా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి.. ఎవరి ఆదేశాలకో తలొగ్గకూడదు’’ అని టీజేఆర్ పేర్కొన్నారు.‘‘అక్టోబర్ 16న కొత్త ఓటర్ల జాబితా వస్తుందని తెలిసినా 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?. కేవలం 30 గంటలు ఆగలేనంత తొందర ఎన్నికల సంఘానికి ఎందుకు వచ్చింది?. కొత్త ఓటర్ల జాబితా కోసం వేచి ఉండకుండా ఎన్నికలకు వెళ్లడంలో ఆంతర్యమేంటి?. కొత్తగా చేరే 11 నుంచి 13 లక్షల మంది ఓటర్ల హక్కులపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వలస వెళ్లినవారి వివరాలు సరిచూసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి...అక్టోబర్ 30 వరకు ఓటర్ల జాబితా ప్రక్రియ గడువు పొడిగించిన విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియదా?. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య సమాచార లోపం ఉందా?. ఉదయం ప్రకటించాల్సిన షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3.30 గంటలకు మార్చాల్సిన అవసరమేంటి?. మొదట ప్రకటించిన స్థానాల్లో మంగళగిరి, తాడేపల్లిని తర్వాత ఎందుకు తొలగించారు?. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని స్థానాలకే మినహాయింపు ఎందుకు?. ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నదెవరు? ముఖ్యమంత్రా, ఉప ముఖ్యమంత్రా, షాడో ముఖ్యమంత్రా?..పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంది?. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని మా అభ్యర్థులను బెదిరించిన ఘటనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో జరగాలని కోరాం. ఎన్నికల నిర్వహణ అధికార పార్టీ చేతుల్లో కాకుండా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉండాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు‘‘కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాజకీయ వివక్షపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంది?. నో డ్యూస్ సర్టిఫికెట్లు అందకపోతే అభ్యర్థుల నామినేషన్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. మా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎన్నికల సంఘం బహిరంగంగా ప్రకటించాలి. 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతాల మార్పులపై అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాలి. రాత్రి 11.45 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిన కేంద్రాల సంఖ్య ఎంత?. పోలింగ్ శాతం 68 శాతం స్థాయి నుంచి 81.78 శాతానికి చేరడంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి.’’ అని టీజేఆర్ డిమాండ్ చేశారు.‘‘ఈవీఎంల బ్యాటరీ రీడింగులపై లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు?. వీవీప్యాట్ వెరిఫికేషన్ కోరిన అభ్యర్థుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు?. హిందూపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీకి ఒక్క ఓటే రావడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది?. ఫారం-20 పత్రాల లభ్యతలో జాప్యంపై సమాధానం చెప్పాలి. పండుగల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరమేంటి?. దసరా, నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని అఖిలపక్ష సమావేశంలో కోరాం. సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి నేతలకు ప్రజల పండుగల ఇబ్బందులు కనిపించడం లేదా?కుప్పంలో ఇప్పటికీ రాజకీయ ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. విజయవాడ పరిసరాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రాజకీయ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ వైఎస్సార్సీపీకి మాత్రమేనా? అధికార కూటమి పార్టీలకు వర్తించదా?. కూటమి నేతల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది?. ఎన్నికల సంఘం ప్రజలందరినీ సమానంగా చూడాలి. పార్టీల ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘స్థానిక’ నగారా మోగింది -
భారత్‌కు అప్పుల గుబులు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వర్థమాన (అభివృద్ధి చెందుతున్న) దేశాలను అప్పుల భారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్య, వైద్య మౌలిక వసతుల కల్పన కంటే అప్పులపై వడ్డీల కోసమే ఏటా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. 2025 నాటికి భారత్‌పై ఉన్న మొత్తం అప్పుల భారం ఏకంగా రూ. 315 లక్షల కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్’ (యూఎన్సీటీడీ) నివేదిక వెల్లడించింది. గడిచిన 15 ఏళ్లలో ఈ అప్పులు అమాంతం పెరిగాయని, వర్థమాన దేశాల ప్రగతికి ఇది పెద్ద సవాలుగా మారిందని స్పష్టం చేసింది. యూఎన్సీటీడీ నివేదికలో ఏముందంటే...» ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై వడ్డీల కోసమే 2025లో రూ.95లక్షల కోట్లు వెచ్చించాయి. 2010లో వర్థమాన దేశాలు అప్పులపై వడ్డీల భారం రూ.34.50 లక్షల కోట్లు...కాగా 2025 నాటికి రూ.95 లక్షల కోట్లకు పెరిగాయి.» 51 వర్థమాన దేశాలు విద్య, వైద్య రంగంపై కంటే అప్పులకు వడ్డీల చెల్లింపు కోసమే ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాల్సి వస్తోంది. » అధిక వడ్డీ రేట్ల కారణంగా వర్థమాన దేశాలు ఏటా రూ.47,614 కోట్లు అధిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ఆ మొత్తంతో 13 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. 16లక్షల మంది బాలలకు పౌష్టికాహారాన్ని అందించవచ్చని యూఎన్సీటీడీ నివేదిక పేర్కొంది. -
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఆలస్యరుసుంతో దరఖాస్తుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ఖరారు చేశారు. దరఖాస్తు సమయంలో ఏపీ పరిధిలో ఎంబీబీఎస్ చదివిన ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.7 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.6 వేలు చొప్పున, ఏపీ వెలుపల ఎంబీబీఎస్ చదివిన బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.9 వేలు చొప్పున రుసుం చెల్లించాలి. దేశం వెలుపల ఎంబీబీఎస్ చదివిన బీసీ, ఓసీలు రూ.14 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.13 వేలు రుసుం చెల్లించాలి. గడువు ముగిశాక దరఖాస్తు చేసుకునేవారు నిర్దేశించిన రుసుంకు అదనంగా రూ. 20 వేలు సమర్పించాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్లను సంప్రదించాలి. ఎంబీబీఎస్ వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశంసాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్‌కు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువు విధించింది. -
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీకి కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఐదు విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం పీఆర్సీ చర్చల కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల సవరణపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అందులో పేర్కొన్నారు. ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కమిటీ చైర్మన్‌గా, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ అడ్మిన్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ సంస్థల సీఎండీలు సభ్యులుగా ఉంటారు. అవసరమైతే కాస్ట్ అకౌంటెంట్‌ను నిపుణుడిగా నియమించుకోవచ్చు. వేతన శ్రేణులు, అలవెన్సులు, పెన్షన్లు, కుటుంబ పెన్షన్లపై కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయనుంది. త్వరగా నివేదిక ఇవ్వాలి ఆరు నెలల గడువు ఉద్యోగులను నిరాశకు గురిచేస్తోందని, త్వరగా నివేదిక ఇవ్వాలని ఏపీ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసరాలు, విద్య, వైద్య ఖర్చులకు అనుగుణంగా మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. గతంలో తొలగించిన వెయిటేజీ ఇంక్రిమెంట్లను పునరుద్ధరించాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలని, వారిని సంస్థల్లో విలీనం చేసుకోవాలని కోరారు. 2004 వరకు నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పే రివిజన్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, ఉద్యోగ సంఘాలతో పరస్పర చర్చల ద్వారా న్యాయసమ్మతమైన వేతన సవరణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్పీఈ జేఏసీ) కోరింది. -
‘స్థానిక’ నగారా మోగింది
సాక్షి, అమరావతి: మున్సిపల్, మండల.. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 13 నగర కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలలో ఈ నెల 28వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కోర్టు కేసుల కారణంగా ఎన్నికల ముందస్తు కార్యక్రమాలు పూర్తి కాని మరో నాలుగు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో డిసెంబర్ ఆఖరులో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతల్లో.. నవంబర్ 26, 29, డిసెంబర్ 3వ తేదీల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మూడు కేటగిరీల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పాటే బుధవారమే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ నెల 18వ తేదీ మద్యాహ్నం 3 గంటల వరకు వరకు నామినేషన్ల స్వీకరణ చేపడతారు. 28న పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 13, 16, 19వ తేదీల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. కాగా, నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎస్ఈసీ తెలిపింది.మున్సిపల్ ఎన్నికల తేదీలు నామినేషన్లు స్వీకరణ : 16–10–2026 ఉదయం 11:00 గంటల నుంచినామినేషన్లు దాఖలకు చివరి తేదీ : 18–10–2026 మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల పరిశీలన : 19–10–2026ఉపసంహరణకు చివరి తేదీ : 21–10–2026 మధ్యాహ్నం 3 గంటల వరకుపోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ : 21–10–2026 మధ్యాహ్నం 3:00 గంటల తర్వాతపోలింగ్ తేదీ: 28–10–2026 ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకుఅవసరమైన చోట రీ పోలింగ్ : 29–10–2026 ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకుఓట్ల లెక్కింపు : 30–10–2026 ఉదయం 8:00 గంటల నుంచి..డిప్యూటీ మేయర్ లేదా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తేదీ : 05–11–2026 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ : 19–10–2026నామినేషన్ల స్వీకరణ మొదలు : 21–10–2026నామినేషన్లు దాఖలకు చివరి తేదీ : 23–10–2026 నామినేషన్ల పరిశీలన : 24–10–2026ఆపీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం : ఈ నెల 25, 26 తేదీల్లో ఉప సంహరణకు చివరి తేదీ : 27–10–2026పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ : 27–10–2026పోలింగ్ తేదీ : 03–11–2026అవసరమైన చోట రీ పోలింగ్ : 04–11–2026ఓట్ల లెక్కింపు : 05–11–2026జెడ్పీ చైర్మన్ లేదా ఎంపీపీల పరోక్ష ఎన్నిక : 11–11–2026ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లువిశాఖపట్నం రీజియన్ : పలాస–కాశీబుగ్గ, బొబ్బిలి, యలమంచిలి, పాలకొండ, నెల్లిమర్ల, ఇచ్ఛాపురం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్,పార్వతీపురం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), సాలూరు, నర్సీపట్నం.రాజమండ్రి రీజియన్ : తుని, అమలాపురం, నిడదవోలు, మండపేట, నర్సాపూర్, జగ్గారెడ్డిగూడెం, కొవ్వూరు, సామర్లకోట, పెద్దాపురం, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, తిరువూరు, గొల్లప్రోలు, కొండపల్లి, ఆకివీడు, విజయవాడ, రామచంద్రపురం, ఏలూరు, పిఠాపురం, పెడన, మచిలీపట్నం, జగ్గయ్యపేట.గుంటూరు రీజియన్ : తెనాలి, రేపల్లె,అద్దంకి, చీమకుర్తి,కనిగిరి,గిద్దలూరు, వెంకటగిరి,ఆత్మకూరు, సూళ్లురుపేట, నాయుడుపేట,దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, పిడుగురాళ్ల, గురజాల,దాచేపల్లి, మాచర్ల, గుంటూరు, నెల్లూరు, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మార్కాపురం, ఒంగోలు, చీరాల.అనంతపురం రీజియన్ : హిందూపూర్, గూడూర్ (కర్నూలు), గుంతకల్లు, ఆదోని, ఎమ్మిగనూరు, పుంగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు (నంద్యాల జిల్లా), ఆళ్లగడ్డ, గుత్తి, కల్యాణదుర్గం, మైదుకూరు, రాజంపేట, కుప్పం, బేతంచర్ల, పెనుకొండ, మదనపల్లె, మడకశిర, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగిరి, పుత్తూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాల, ఎర్రగుంట్ల, కదిరి, జమ్మలమడుగు, పలమనేరు, తిరుపతి, పులివెందుల, కమలాపురం. -
సత్వర విచారణ షాకా?
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మోపిన కేసుల్లో రోజువారీగా విచారణ జరిపేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. కేసులు సత్వరం ముగిసేలా సీబీఐతో పాటు ఈడీ కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తూ ఉండగా, అందుకు న్యాయమూర్తి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఈడీ పీపీకి ఆదేశాలు జారీచేసి విచారణ ప్రారంభించారు. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ చార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీలైనంత త్వరగా కేసులను ముగించాలని వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. మరోవైపు ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్‌ను ప్రజాక్షేత్రానికి దూరం చేసి కోర్టుల చుట్టూ తిప్పాలన్న చంద్రబాబు అండ్ కో కుట్రలు ఫలించలేదు. జగన్ వ్యక్తిగత హాజరు కోరుతూ బాబు డైరెక్షన్లో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, ఎల్లో మీడియా మాత్రం వ్యక్తిగత హాజరుకు ఆదేశాలంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అక్కసును వెళ్లగక్కింది. జగన్ న్యాయవాది విజ్ఞప్తికే న్యాయమూర్తి అంగీకరించగా.. జగన్‌కు షాక్ అంటూ విషం చిమ్మడం ప్రారంభించింది. సీబీఐ, ఈడీతో కలసి చంద్రబాబు.. వైఎస్ జగన్ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. బాబు మెప్పుకోసం పచ్చ మీడియా రోజంతా శివాలెత్తిపోయింది. ఆర్డర్ లేదు.. కాపీ కూడా లేదు.. బుధవారం ఉదయమంతా స్క్రోలింగ్‌లతో హడావుడి సృష్టించి పచ్చ మీడియా పైత్యాన్ని వెళ్లగక్కింది. కోర్టులో జరిగే పరిణామాలకూ వక్రీకరణలా? న్యాయస్థానాల్లో జరిగే పరిణామాలను ఎల్లోమీడియా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఈడీ కేసుల విచారణ విషయంలోనూ ఇదే ధోరణి స్పష్టమవుతోంది. ఈ కేసుల్లో సత్వర విచారణ చేపట్టాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తిని, జగన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు చిత్రీకరించడం వెనుక రా>జకీయ దురుద్దేశం తేటతెల్లమవుతోంది. సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈడీ కేసులను రోజువారీగా విచారించాలన్న జగన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసి.. విచారణ ప్రారంభిస్తున్నామని తెలిపారు. జగన్ వ్యక్తిగత హాజరుకు న్యాయమూర్తి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయలేదు. అయినా, వ్యక్తిగత హాజరుపై ఆదేశాలిచ్చినట్లుగా ప్రచారం చేస్తూ కోర్టు పరిణామాలను వక్రీకరించడమే కాకుండా ప్రజలను కూడా ఎల్లో మీడియా తప్పుదోవ పట్టిస్తోంది. సత్వర విచారణ కోరితే షాకా? నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారు. నిజానికి కేసుల విచారణ త్వరగా పూర్తికావాలని కోరడం న్యాయపరమైన ప్రక్రియలో భాగం. దశాబ్దకాలంగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా తేల్చాలని జగన్ కోరుతున్న నేపథ్యంలో రోజువారీ విచారణకు న్యాయస్థానం అంగీకరించడం ఆయనకు అనుకూల న్యాయపరమైన పరిణామం. కానీ.. బాబు, భజన మీడియా మాత్రం జగన్‌కు షాక్ అంటూ ప్రచారం చేసింది. కోర్టు ఉత్తర్వుల్లో లేని అంశాలను జోడించి సంచలనాత్మక కథనాల పేర పచ్చ మీడియా బాబు బాకా ఊదుతోంది. ప్రజలను కలవడం కోసం జగన్ ప్రారంభించనున్న మహా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని కొన్నాళ్లుగా చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. దీని కోసం సీబీఐ, ఈడీ కేసులను వినియోగించుకోవాలని తెర వెనుక అక్రమ రాజకీయం ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈడీతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఉన్నత న్యాయస్థానం.. ఈడీ తీరును తప్పుబట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు తాము ఎప్పటికప్పుడు సీబీఐ, ఈడీ కేసులను పర్యవేక్షిస్తున్నామని తేల్చిచెప్పింది. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పచ్చ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా జగన్ చేస్తున్న విజ్ఞప్తిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. దీనికి కూడా పచ్చ మీడియా వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఆయన విజ్ఞప్తిని ఎక్కడా ప్రస్తావన చేయకుండా సీబీఐ కోర్టు ఆదేశాలంటూ విషం చిమ్మింది. తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే.. నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? -
మళ్లీ తలొగ్గడమేనా?
సాక్షి, అమరావతి: ‘నలభై శాతం కావాలని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టాం. పోస్టర్లు వేసి ప్రకటించాం. మరి ఆ పట్టు ఎందుకు వదిలేశారు? ఎన్ని మేయర్ సీట్లు ఇస్తారో, ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని వార్డులు ఇస్తారో ఇంకా తేలనే లేదు. అలాంటప్పుడు సర్దుబాటు కుదిరిపోయిందని బయటకు వచ్చి ఎలా చెబుతారు? మన స్టాండ్‌పై మనం ఎందుకు గట్టిగా నిలబడటం లేదు?’ ఇదీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు తమ నాయకత్వాన్ని నిలదీస్తున్న తీరు. సీట్ల పంపకంపై చంద్రబాబుతో బుధవారం జరిగిన చర్చల తర్వాత జనసేన నేతలు చేసిన ప్రకటన చూసి ఆ పార్టీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. ఒక్కరోజు క్రితమే 2,091 పదవులు కావాలని పోస్టర్ విడుదల చేసిన పార్టీ, మరుసటి రోజే లెక్కలేమీ వేసుకోలేదనడం వారికి మింగుడుపడటం లేదు. ఇది దేనికి సంకేతం అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం కదా.. స్థానిక ఎన్నికల్లో మన బలానికి తగినట్టు సీట్లు కేటాయిస్తామన్నారు కదా.. ఇపుడు ఇలా జరుగుతున్నదేంటి? ఇంకెంత కాలం తగ్గి ఉండాలి? అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పోతుంది కదా.. ఇదే తగిన సమయం’’ అని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నిన్న పోస్టర్ విడుదల చేసిన మంత్రి.. నేడు సర్దుబాటు ప్రకటన మంగళవారం జనసేన మంత్రి కందుల దుర్గేష్ పార్టీ లోగోతో కూడిన పోస్టర్ ఒకటి ఎక్స్‌లో విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవుల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులు కేటాయించాలని జనసేన ప్రతిపాదించిందని ఎక్స్‌లో ప్రకటించారు. 6 మేయర్లు, 6 డిప్యూటీ మేయర్లు, 38 మున్సిపల్ చైర్మన్లు, 1,937 వార్డులు సహా ప్రతి పదవిలో వాటా అడిగినట్లు తెలిపారు. ఈ పోస్టర్‌ను జనసైనికులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈసారి తమ పార్టీ తగ్గదని సంబరపడ్డారు. కానీ బుధవారం సాయంత్రం చంద్రబాబుతో భేటీ ముగిశాక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు వారిని నిర్ఘాంతపరిచాయి. చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, స్థానిక పరిస్థితుల మేరకు ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటామని, ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదని ఆయన ప్రకటించారు. ఫ్రెండ్లీ పోటీలు ఉండవని, ప్రతి స్థానంలో కూటమి తరఫున ఒక్క అభ్యర్థే ఉంటారని తేల్చిచెప్పారు. పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల్లో కూటమిగా ప్రకటన చేస్తామని చెప్పారు. లెక్క తేలకుండా ఏకాభిప్రాయమా? ఎవరికి ఎన్ని సీట్లు అనేదే తేలకపోతే ఏకాభిప్రాయం దేనిపై కుదిరిందని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 40 శాతం అడిగి, ఇప్పుడు లెక్కలేమీ లేవంటే ఆ ప్రతిపాదనను వదిలేసినట్టేనా అని నిలదీస్తున్నారు. టీడీపీ మూడు మేయర్ సీట్లే ఇస్తామని తెగేసి చెబుతుంటే ఫ్రెండ్లీ పోటీ లేదని ముందే ప్రకటించేయడం వల్ల బేరమాడే బలం కూడా పోయిందని వారు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లతో సర్దుకున్నాం, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గామన్నారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికల్లో కూడా అదే జరిగితే పార్టీ ఎప్పటికి ఎదుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోడ్డెక్కింది తామేనని, కూటమి కోసం ఎక్కువ త్యాగం చేసింది జనసేనేనని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారని, ఆ త్యాగాలకు ఇదేనా ప్రతిఫలం అని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత ఒకరు వ్యాఖ్యానించారు. రెండు రోజులు.. సుదీర్ఘ చర్చలు.. అయినా తేలని పొత్తు సీట్ల సర్దుబాటుపై మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు చర్చలు సాగినా ఫలితం రాలేదు. బుధవారం ఉదయం జనసేన నేతలు మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఒక విడత సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజంతా సాగిన చర్చల్లోనూ ఏ పార్టీకి ఎన్ని మేయర్ సీట్లు, ఎన్ని మున్సిపాలిటీలు అనేది తేలలేదు. మరో భేటీలో ఖాయం చేసుకుంటామని ప్రకటించి సరిపెట్టారు. కార్యకర్తలను మభ్యపెట్టేందుకేనా...? ‘40 శాతం సీట్లలో పోటీ చేస్తామంటూ ట్వీట్ చేశారు కదా’ అని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని విలేకరులు అడిగితే, తాను అలాంటి ట్వీట్ చేయలేదని, ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.. కాసేపటికే మరలా అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. చర్చలు ఫలించాయని, ఎవరికి ఎక్కడ బలం ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందని మరో ట్వీట్ చేశారు.. దీనినిబట్టి చూస్తే జనసేన, టీడీపీ పొత్తుల మధ్య సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారం అంతా కేవలం కార్యకర్తలను మభ్య పెట్టేందుకేనని అర్థం అవుతోంది. జనసేన సీట్లు కోరడం, దానికి టీడీపీ అంగీకరించడం వంటివి కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలకే పరిమితమని, చంద్రబాబు ఇచ్చింది పవన్ కళ్యాణ్ తీసుకోవడం తప్ప, అంతకు మించి సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మాతో సమానంగా అడగడమేంటి?: టీడీపీలో అసంతృప్తి జనసేన కేడర్ ఇలా రగిలిపోతుంటే, టీడీపీలోనూ అసంతృప్తి చెలరేగుతోంది. రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న తమతో సమానంగా జనసేన పదవులు అడగడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బలం లేని చోట కూడా వాటా కోసం పేచీ పెట్టడం సరికాదని అంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి సగం పదవులు ఎగరేసుకుపోతే ఏళ్లుగా జెండా మోసిన తమ పరిస్థితి ఏంటని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు. జనసేనకు వెళ్తాయని ప్రచారం జరుగుతున్న విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, అనంతపురం వంటి చోట్ల టికెట్ ఆశించిన టీడీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. జనసేనకు చాలాచోట్ల మేయర్, ఛైర్మన్ పదవులకు తగిన అభ్యర్థులే లేరని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ మేయర్ సీటు కోసం జనసేన టీడీపీ నేత వంగవీటి రాధానే అరువు తెచ్చుకుంటోందని విమర్శిస్తున్నారు. ఒంటరి పోటీ బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.కూటమి ధర్మాన్ని విస్మరిస్తే ఒంటరిగా పోటీకూటమి ధర్మాన్ని పాటించకుంటే కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతామని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో రాజకీయ పక్షాలన్నీ కూటమి ధర్మాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. లేనిపక్షంలో రెండు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందని చెప్పారు. పొత్తు ధర్మాన్ని పాటించి సగం సీట్లకు పైగా ఇస్తామని గతంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారన్నారు. కచ్చితంగా పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించాలని అన్నారు.సోషల్ మీడియాలో యుద్ధం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. చర్చలు జరుగుతుండగానే 40 శాతం పోస్టర్ బహిర్గతం చేయడం ఏం పద్ధతంటూ టీడీపీ యాక్టివిస్టులు విరుచుకుపడుతుంటే, పొత్తు వల్లే గెలిచారంటే ఊరుకోబోమని జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏ ఊర్లో జనసైనికులు రోడ్డెక్కారో చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు బొలిశెట్టి ప్రకటనతో జనసైనికుల ఆగ్రహం సొంత నాయకత్వం వైపు కూడా మళ్లింది. 40 శాతం అడిగిన ఆ పార్టీకి చివరకు ఎంత దక్కుతుంది, సీట్లు ఆశించినా రాని వారు ఊరుకుంటారా, టీడీపీలో టికెట్ దక్కని ఆశావహులు ఏం చేస్తారనే ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపారు. -
గూఢచర్యం కేసులో కీలక నిందితుడు అరెస్టు
సాక్షి, అమరావతి: నౌకాదళానికి చెందిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని విదేశీ వ్యక్తులకు చేరవేసిన కేసులో పరారైన మరో నిందితుడు కె. శ్రీనివాస్ పోలీసులకు చిక్కినట్లు ఏపీ డీజీపీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023లో ఫేస్బుక్ ద్వారా ‘ఏంజెల్ పాయల్’ అనే పేరుతో పరిచయమైన గుర్తుతెలియని మహిళతో బొంగు రవి పరిచయం పెంచుకున్నాడు. తాను దుబాయ్‌లోని ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని.. నౌకలు, సిబ్బందికి సంబంధించిన లాజిస్టిక్స్ వ్యవహారాలు చూస్తుంటానని ఆమె నమ్మించింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న మహిళ విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ఉన్న నౌకలు, జలాంతర్గాముల వివరాలను పంపితే డబ్బులిస్తానని రవిని ప్రలోభ పెట్టింది. దీంతో రవి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి డాక్‌యార్డులో ఉన్న నౌకలు, జలాంతర్గాముల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఆమెకు చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా రవి బ్యాంకు ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం.. ఆ మొత్తంలో శ్రీనివాస్‌కు వాటా చెల్లించినట్లు పేర్కొన్నారు. దీనిపై విశాఖ మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో 2025 అక్టోబర్ 12న ఈ గూఢచర్యం కేసు నమోదైంది. నేవల్ డాక్‌యార్డులో పనిచేస్తున్న రవిని అరెస్టుచేయగా శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. అయితే, ఈనెల 11న శ్రీనివాస్ సౌదీ అరేబియా నుంచి భారత్‌కు తిరిగి వస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో విశాఖపట్నం సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. -
నడకతో మెదడుకు పదును
సాక్షి, అమరావతి: రోజూ క్రమం తప్పకుండా నడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యానికి మంచిది. ఈ అంశాన్ని ఇప్పటికే అనేక అధ్యయనాలు ధ్రువీకరించాయి. రోజువారీ నడక అలవాటు ఉన్న వారిలో మెదడు కూడా అత్యంత చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలో ఏకాగ్రత, పనులను పక్కాగా చక్కబెట్టే ఆలోచనా శక్తి గణనీయంగా మెరుగుపడుతున్నట్టు గుర్తించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ ఈ అంశంపై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం ఆల్ ఆఫ్ అస్ (ఏవోయూ) పరిశోధలో భాగంగా 18 నుంచి 93 ఏళ్ల వయసున్న 3,093 మందిని అధ్యయనం చేశారు. వీరి రోజువారీ అడుగుల సంఖ్యను లెక్కించేందుకు ‘ఫిట్‌బిట్’ డిజిటల్ ట్రాకర్లను అమర్చారు. 2009 నుంచి 2023 వరకూ దాదాపు 14 ఏళ్లపాటు నడక తీరుతెన్నులు, రక్తపోటు హెచ్చుతగ్గులను నిరంతరం పర్యవేక్షించారు. అదనపు అడుగులకు ఏకాగ్రత పెరుగుదలఅధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల నడక సరళిని బట్టి మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్–1లో రోజుకు సగటున 5,108 అడుగులు, గ్రూప్–2లో 8,875 అడుగులు, గ్రూప్–3లో 14,161 అడుగులు వేసేవారి చొప్పున వర్గీకరించారు. ఈ నేపథ్యంలో మొదటి గ్రూప్‌లో కంటే ఎక్కువగా నడిచే రెండు, మూడు గ్రూపుల్లోని వ్యక్తులు మెదడు సంబంధిత పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి అదనపు అడుగులకు ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తిలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది.మతిమరుపు ముప్పు నుంచి రక్షణనడక వంటి వ్యాయామాల వల్ల శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్) తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. మెదడు నాడీ కణాల మధ్య సంధానం (న్యూరోప్లాస్టిసిటీ) బలపడటంతో పాటు గ్లూకోజ్ మెటబాలిజం మెరుగవుతుంది. ఫలితంగా వయసు పైబడినా మెదడు పనితీరు మందగించదు. వృద్ధాప్యంలో దాపురించే అల్జీమర్స్, మతిమరుపు(డెమెన్షియా) ముప్పు నుంచి రక్షణకు ప్రత్యేకమైన మందుల కన్నా రోజూ ఉదయం, సాయంత్రం చురుగ్గా నడవడమే మేలని సూచించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
సాక్షిప్రతినిధి, విజయవాడ / విమానాశ్రయ (గన్నవరం): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. శ్రీ మహా చండీదేవి అలంకృత కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో దుర్గగుడికి విచ్చేసిన ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె సుమారు అక్కడ ఎనిమిది నిమిషాలపాటు ఉన్నారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆమె అక్కడి పూజారులను గుడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశీర్వచనం సందర్భంగా చదివిన ఒక శ్లోకాన్ని మళ్లీ చదివించుకుని దాని అర్థం అడిగి తెలుసుకున్నారు. ఇక్కడికి ఇంతకుముందు వేరే రాష్ట్రపతులు ఎవరైనా వచ్చారా అని వాకబు చేయగా.. జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్‌దయాళ్ శర్మ వచ్చారని.. ఆ తర్వాత వచ్చింది మీరేనని అర్చకులు బదులిచ్చారు. ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రపతికి దేవస్థానం ఈఓ వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, మంత్రి అనిత శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడ బసచేశారు.గన్నవరంలో ఘనస్వాగతం..అంతకుముందు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోజుల విజయవాడ పర్యటన నిమిత్తం ఆమె న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సా.6.10 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు, పలు శాఖల అధికారులు స్వాగతం పలికారు. నేడు జాతీయ సారస్ మేళాను ప్రారంభించనున్న రాష్ట్రపతిభవానీపురం (విజయవాడ పశ్చిమ): కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్లో నిర్వహించనున్న జాతీయ సారస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉ.7 గంటలకు ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనా«థ్ బుధవారం మేళా ఏర్పాట్లను పరిశీలించారు. -
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై దృష్టిసారించండి
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా, తుని మండలం, సీహెచ్ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన వ్యవహారంపై దృష్టిసారించాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుసుకోవాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు అమలుచేయడంలేదని, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది జి. శ్రీకాంత్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. కాగా, ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి వాదనలు వినిపిస్తూ, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలుసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నా యని తెలిపారు. మొత్తం మిస్సింగ్ వివరాలు తెలియజేస్తూ, గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,508 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 4,284 మంది ఆచూకీ తెలుసుకోగలిగామన్నారు. మిగిలిన 224 మంది ఆచూకీ లభించలేదన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేశామని ధర్మాసనానికి నివేదించారు. -
నిబద్ధత, నిరంతర అధ్యయనంతోనే రాణింపు
సాక్షి, అమరావతి: న్యాయవాద వృత్తిలో రాణించేందుకు దగ్గరి దార్లు ఏవీ ఉండవని, నిబద్ధత, నిరంతర అధ్యయనంతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీమలపాటి రవి యువ న్యాయవాదులకు ఉద్బోధించారు.హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్ఎఏ) బుధవారం యువ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకునే విషయంలో అవగాహన (ఓరియంటేషన్) కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్.. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ చీమలపాటి రవి ఈ సందర్భంగా యువ న్యాయవాదులతో తమ అనుభవాలను పంచుకున్నారు.‘కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలన చేయాలి. కోర్టులో ఎలా వ్యవహరించాలి.. ఎలా వాదించాలి.. వాదనలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఎక్కడ తగ్గాలి.. వంటి విషయాలు ఎవరూ.. ఎక్కడా నేర్పరు. వాటిని కోర్టు హాళ్లలోనే పరిశీలన ద్వారానే నేర్చుకోవాలి. న్యాయస్థానాల్లో సీనియర్ న్యాయవాదుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇతర న్యాయవాదులు ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు చేసే వాదనలను గమనించాలి. మేమూ అలా నేర్చుకునే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం’ అని వివరించారు. క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు న్యాయవాదుల సంఘం ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ (ఏఏజీ) సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) తేనేపల్లి నిరంజన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు యువ న్యాయవాదులు పాల్గొన్నారు. -
సర్ గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. నోటీసులు, అభ్యంతరాలను అక్టోబర్ 22లోగా పరిష్కరించి అక్టోబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అక్టోబర్12న గడువు పెంచాలంటూ రాసిన లేఖతో సర్‌ను పొడిగించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ పొడిగింపు విషయాన్ని ఓటర్లకు అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాల్సిందిగా కోరింది. -
స్వేచ్ఛగా, పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ చెప్పారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు ప్రకటించారు.కోడ్ సమయంలో ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా ఎలాంటి పథకాలను, అభివృద్ది కార్యక్రమాలను అమలు చేయకూడదని చెప్పారు. బ్యానర్ల ఏర్పాటు, విగ్రహాల విషయంలో పలు నియంత్రణలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు. కోడ్ కాలంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీ ఉండవని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పట్టిషంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్టు వెల్లడించారు. ఆన్లైన్ నామినేషన్లకు ఇప్పుడు సమయం లేదు నామినేషన్ వేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని జిల్లా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లకు సమయం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఆయా ఏర్పాట్లు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు పోటీచేయడంలో ఏ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమయ్యే కులధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు చేసిన 24 గంటల్లో జారీచేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించినట్లు చెప్పారు. నోడ్యూస్ పత్రాలను కూడా 24 గంటలలోపే ఇవ్వాలని ఆదేశించామన్నారు. వీలైనంత మేర వాటిని అందజేస్తారన్నారు. పోలింగ్ జరిగే ప్రతి చోట సీసీటీవీల ఏర్పాటు ఖర్చుతో కూడిన ప్రక్రియ అని పేర్కొన్నారు. పోలీసుశాఖ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినచోట సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీ వినతుల మేరకు ఆ సీసీటీవీల పుటేజీ 60 రోజులు రిజర్వు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించే అబ్జర్వర్ల ద్వారా మద్యం నియంత్రణకు చర్యలు చేపడతామని చెప్పారు. ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలయ్యేలా అబ్జర్వర్లు చర్యలు చేపడతారని తెలిపారు. ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితాలు ఇస్తే వాటితోనే ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన ఓటర్ల జాబితాల ఆధారంగా ఎన్నికలకు ముందస్తు కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అక్టోబర్ నాటికి ఉన్న తాజా ఓటర్ల జాబితాలు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ జాబితాలను ఇస్తే కొత్త జాబితాలతోనే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలింగ్ సమయానికి కొత్త జాబితాలు తమకు అందని పక్షంలో ఇప్పటికే తమవద్ద ఉన్న పాత ఓటర్ల జాబితాల మేరకు పోలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లిఖార్జున మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, వినతుల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినతుల పరిష్కారానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్‌శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు 4,027 మంది ఎన్నికల అధికారులు, వెయ్యిమంది ఎన్నికల స్క్వాడ్, 72 వేలమందిని ఎన్నికల సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. పోలింగ్ రోజు మున్సిపల్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లో కూర్చోకూడదన్న నిబంధన ఉందని తెలిపారు. పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్లో 50 శాతం రాయితీ ఉంటుందని ఆయన చెప్పారు. -
హోంగార్డుల వేతన వెతలు తీరేనా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల వేతనాల పెంపు అంశం మరోసారి తెరపైకొచ్చింది. వేతనాల పెంపు కోసం హోంగార్డులు హైకోర్టునాశ్రయించడంతో.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గత నెల 30న ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేతనాల పెంపుపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి మూడు నెలలు గడువు విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో పోలీస్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 16 వేల మందికి పైగా హోంగార్డులకు వేతనాల పెంపుపై ఆశలు చిగురించాయి. కానిస్టేబుళ్లతో సమాన వేతనం కోసం డిమాండ్.. కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు వేతనం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్‌కు బేసిక్ రూ.25,220కు డీఏ కలుపుకొని నెలకు రూ.35,560గా ఉంది. హోంగార్డులకు ఇప్పుడు ఇస్తున్న రూ.21,300 వేతనాన్ని కానిస్టేబుళ్ల మాదిరి రూ.35,560కు పెంచాలని కోరుతున్నారు. హోంగార్డుల వేతనాల పెంపుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా వారు డిమాండ్ చేస్తున్నారు. హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి రక్షక్ వర్సెస్ హిమాచలప్రదేశ్ కేసులో నెలలో 30 రోజుల డ్యూటీ అలవెన్స్ మొత్తం.. రాష్ట్ర పోలీస్ సిబ్బందికి వర్తించే కనీస వేతనానికి సమానంగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఒడిశా హోంగార్డులకు సంబంధించి కేసులోనూ సుప్రీం కోర్టు ఈ సూత్రాన్ని సమర్థించింది. వేతనాలను పెంచాలి రాష్ట్రంలో హోంగార్డులకు వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ హోంగార్డ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.గోవిందు, కె.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. గతంలోను సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి హోంగార్డులకు పోలీస్ కానిస్టేబుళ్లతో సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఎక్కడా పోటీ లేకుండా ఉండకూడదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు అత్యంత కీలక బాధ్యత తీసుకుని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-కోఆర్డినేషన్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు–కోఆర్డినేషన్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియకు చాలా తక్కువ సమయం ఇస్తున్నారని సజ్జల అన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పని తర్వాత మరో పని చేసే అవకాశం లేకుండా, అభ్యర్థుల ఎంపిక, పత్రాల సిద్ధత, నామినేషన్లు, ప్రచారం అన్నీ సమాంతరంగా జరగాల్సి వస్తోందని చెప్పారు.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పినట్లుగా, ఎక్కడా వైఎస్సార్సీపీ అభ్యర్థి లేకుండా పోటీ జరగకూడదని, ఏ స్థానం కూడా అన్కంటెస్టెడ్గా ఉండకూడదని సజ్జల స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికకు సమయం తక్కువగా ఉన్నందున, కో-ఆర్డినేటర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నదా లేదా అన్నది పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అసెంబ్లీ పరిశీలకులే కీలక లింక్అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎన్నికల పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారని, అందువల్ల అసెంబ్లీ పరిశీలకులు కోఆర్డినేటర్–పార్లమెంట్ పరిశీలకుడు–రీజినల్ కోఆర్డినేటర్–జిల్లా అధ్యక్షుడు–కేంద్ర కార్యాలయం మధ్య కీలక అనుసంధానకర్తలుగా పనిచేయాలని చెప్పారు. ఎక్కడైనా సమన్వయ లోపం, అభ్యర్థుల ఎంపికలో సమస్య, ప్రచార లోపం, నామినేషన్ ఇబ్బందులు కనిపిస్తే వెంటనే సరిదిద్దాలని, అవసరమైతే పైస్థాయికి నివేదించాలని సూచించారు.15–20 రోజులు 24/7 ఫీల్డ్‌లో ఉండాలిరానున్న 15 నుంచి 20 రోజులు పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో 24/7 అందుబాటులో ఉండటం తప్పనిసరి అని సజ్జల స్పష్టం చేశారు. “ఇది మీటింగ్‌లలో కూర్చొని ప్రోటోకాల్ ప్రకారం చేసే పని కాదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండాలి. సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. అభ్యర్థికి ‘మేమున్నాం’ అనే భరోసా కలిగించాలి” అని చెప్పారు. చిన్నపాటి అంతర్గత విభేదాల నుంచి, సీనియర్ నాయకులతో సమన్వయం, స్థానికంగా నాయకులను కలుపుకోవడం వరకు పరిశీలకులు చొరవ తీసుకోవాలని సూచించారు.అభ్యర్థులకు పూర్తి సపోర్టింగ్ సిస్టమ్కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, నామినేషన్ విధానం, లీగల్ అంశాలు, మీడియా ప్రచారం, డిజిటల్ ప్రచారం గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చని సజ్జల చెప్పారు. అందువల్ల వారు ప్రధానంగా ప్రజల్లో తిరిగి ప్రచారం చేయడంపై దృష్టి పెట్టేలా, మిగతా లీగల్, మీడియా, డిజిటల్, ఆర్గనైజేషనల్ పనులను పార్టీ వ్యవస్థ చూసుకుంటుందనే భరోసా ఇవ్వాలని సూచించారు.సర్టిఫికెట్లు ముందుగానే సిద్ధం చేయాలికుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ తదితర సర్టిఫికెట్ల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని సజ్జల హెచ్చరించారు. ఫైనల్ అయిన అభ్యర్థులు వెంటనే అవసరమైన పత్రాలకు దరఖాస్తు చేయాలని, 24 గంటల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలని పార్టీ తరఫున ఇప్పటికే లేఖలు ఇచ్చామని తెలిపారు. ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత వివరాలను వెంటనే కేంద్ర కార్యాలయానికి పంపించాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని సూచించారు.నామినేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోనివ్వకూడదునామినేషన్ ప్రక్రియలో ప్రత్యర్థులు లేదా అధికార యంత్రాంగం ఏవైనా అడ్డంకులు సృష్టిస్తే వాటిని వెంటనే గుర్తించి స్పందించాలని చెప్పారు. నామినేషన్ కేంద్రాల్లో ఉద్దేశపూర్వకంగా క్యూ సృష్టించడం, చివరి సమయంలో పత్రాలు తీసుకోకుండా చేయడం వంటి కొత్త ఎత్తుగడలు కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే నామినేషన్లు పూర్తి చేయాలని సూచించారు.ప్రతి ఘటనకు వీడియో ఆధారం ఉండాలిఎక్కడైనా నామినేషన్ అడ్డుకోవడం, పోలీసు జోక్యం, ప్రత్యర్థుల దౌర్జన్యం లేదా అధికారుల పక్షపాతం కనిపిస్తే వాటిని వీడియో రూపంలో రికార్డు చేయాలని సూచించారు. ఈ వీడియోలను మీడియా ప్రచారానికి మాత్రమే కాకుండా, ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు, న్యాయస్థానాల్లో ఆధారాలుగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.ప్రచారం పర్యవేక్షణ కూడా పరిశీలకుల బాధ్యతనామినేషన్ల తర్వాత అభ్యర్థుల ప్రచారం ఎంత సమర్థంగా జరుగుతోంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారా, మీడియా కవరేజ్ వస్తుందా, సోషల్ మీడియా ద్వారా అభ్యర్థి పేరు, గుర్తు ప్రజల్లోకి వెళ్తున్నాయా అన్నది కూడా పరిశీలకులు పర్యవేక్షించాలని చెప్పారు. ఏ అభ్యర్థి ప్రచారంలో వెనుకబడినా వెంటనే అలర్ట్ చేసి, అవసరమైతే కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకుడు లేదా కేంద్ర కార్యాలయం ద్వారా ఫాలోఅప్ చేయాలని సూచించారు.పోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాలు, కౌంటింగ్ ఏర్పాట్లపై నిఘాసమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ముందుగానే పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా అనుమానాస్పద ఏర్పాట్లు ఉంటే ఎన్నికల అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ఫలితం లేకుంటే అవసరమైతే న్యాయపరంగా సవాలు చేయాలని చెప్పారు.రోజువారీ రిపోర్టింగ్ వ్యవస్థకేంద్ర కార్యాలయం నుంచి రోజువారీ రిపోర్టింగ్ మెకానిజం ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని పార్లమెంట్ పరిశీలకులు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, కేంద్ర కార్యాలయంతో పంచుకోవాలని, అక్కడి నుంచి వచ్చే సూచనలు, గైడ్‌లైన్స్‌ను వెంటనే కిందిస్థాయికి చేరవేయాలని చెప్పారు.లీగల్–మీడియా టీమ్‌లతో నేరుగా కనెక్ట్ కావాలిఅత్యవసర పరిస్థితుల్లో పరిశీలకులు నేరుగా పార్టీ లీగల్, మీడియా టీమ్‌లను సంప్రదించవచ్చని సజ్జల చెప్పారు. లీగల్ సెల్, మీడియా విభాగం, కేంద్ర కార్యాలయంలో సంబంధిత నాయకులు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా తక్షణ స్పందన అవసరమైతే ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలని సూచించారు.ప్రజల్లోకి వేగంగా చేరే ప్రచారం అవసరంఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున డిజిటల్, సోషల్ మీడియా ద్వారా స్థానిక సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గత ప్రభుత్వంలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరవేయాలని సూచించారు.పరిశీలకుల పనితీరుకు కూడా ఇదే పరీక్షఈ ఎన్నికలను కోఆర్డినేటర్లకు మాత్రమే కాకుండా పరిశీలకులకు కూడా ఒక పరీక్షగా భావించాలని సజ్జల అన్నారు. ఎవరెంత సమర్థంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు, సమస్యలను పరిష్కరించారు, అభ్యర్థులకు అండగా నిలిచారు, కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేశారు అన్నది పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని చెప్పారు. “ఈ 15–20 రోజులు మీకు కేటాయించిన నియోజకవర్గంలో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. సమస్య ఎక్కడ ఉంది? దానికి పరిష్కారం ఏమిటి? వెంటనే ఎలా అమలు చేయాలి? అనే దృక్పథంతో పనిచేయాలి. ఇది అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సందేశం, ఆదేశంగా భావించాలి” అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ -
ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులపై నమోదైన/పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించేందుకు పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.ఇందులో ఆయన కూటమి సర్కార్ పోలీసుల సాయంతో వైఎస్సార్సీపీ ఆశావహ అభ్యర్ధులపై చేస్తున్న వేధింపుల్ని ప్రస్తావించారు. వాటిని అడ్డుకోవడంతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు అవసరమైన వివరాలు అందించేందుకు రాష్ట్ర డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్న వైఎస్సార్సీపీ నాయకులు, ఆశావహ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వేధిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేకపోయినా, వివిధ పోలీస్ స్టేషన్లలో తమ పార్టీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.ఇలాంటి చర్యలు వారిలో భయాందోళనలు సృష్టించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో వారు పాల్గొనడానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తమపై కేసులు ఎక్కడ నమోదు అయ్యాయో, ఏ పోలీస్ స్టేషన్లో లేదా ఏ జిల్లాలో కేసులు నమోదయ్యాయో కూడా అనేక మంది ఆశావహ అభ్యర్థులకు తెలియజేయడం లేదన్నారు. ఫలితంగా, సంబంధిత సమాచారాన్ని పొందడానికి వారు ఏ అధికారులను సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీంతో నామినేషన్ పత్రాల్లో కేసులకు సంబంధించిన పూర్తి, కచ్చితమైన వివరాలను సమర్పించడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్ఈసీకి రాసిన లేఖలో వెల్లడించారు.తమపై నమోదైన కేసుల వివరాలు, నమోదైన ప్రదేశాలు తెలియకపోవడం వల్ల అభ్యర్థులు ఎన్నికల్లో నష్టపోకుండా చూడాలని ఎన్నికల కమిషన్ ను లేళ్ల అప్పిరెడ్డి కోరారు. నేరాలు, నేరస్థుల రికార్డులను తెలుసుకోవడానికి పోలీసు శాఖ వద్ద ఇప్పటికే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (CCTNS) అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉందని, దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారని తెలిపారు.CCTNS ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని సంబంధిత రికార్డులను తెలుసుకోవచ్చని భారత ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత జిల్లా లేదా పోలీసు విభాగంతో సమన్వయం చేసుకుంటూ, అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు ప్రతి కేసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పేరు, క్రైమ్ నంబర్, సంవత్సరం, వర్తించే చట్టపరమైన సెక్షన్లు, ప్రస్తుత దర్యాప్తు స్థితి, తుది నివేదిక/ఛార్జిషీట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన సమగ్ర, ధృవీకృత ప్రకటనను లిఖితపూర్వకంగా అందించాలని కోరారు.ఒక కేసు నమోదు కావడం మాత్రమే నేరం చేసినట్లు నిర్ధారించదని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనాలని కూడా అప్పిరెడ్డి కోరారు. అలాగే శోధనలో తగిన రికార్డు ఏదీ లభించకపోతే, ఆ రికార్డుల్లో ఎటువంటి సమాచారం లభించలేదని లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. డేటాబేస్‌లోని వివరాలు అసంపూర్ణంగా ఉన్నా, ఆలస్యంగా అందుబాటులోకి వచ్చినా లేదా అదనపు ధ్రువీకరణ అవసరమైనా, ఆ ప్రకటనకు ముందు సంబంధిత విభాగాలతో పోలీసులు పూర్తి సమాచారం నిర్ధారించుకోవాలన్నారు. అందువల్ల, ఈ సౌకర్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా అమలు చేయడానికి డీజీపీ, అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.ఒక ఆశావహ అభ్యర్థి గుర్తింపు ధ్రువీకరణ కోసం అవసరమైన గుర్తింపు పత్రాలతో స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పైన పేర్కొన్న సమగ్ర, ధ్రువీకరించిన సమాచారాన్ని పోలీసులు అందించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రికార్డుల్లో ఎటువంటి కేసులూ గుర్తించకపోతే, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తులను స్వీకరించినట్లు గుర్తింపు ఇవ్వడంతో పాటు, నామినేషన్ గడువుకు తగినంత ముందుగా, నిర్ణీత సమయవ్యవధిలో సమాచారాన్ని అందించాలని కోరారు.ఈ విధానం సురక్షితంగా ఉండటంతోపాటు, అభ్యర్థులందరికీ సమానంగా అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులు దరఖాస్తులను స్వీకరించినట్లు అక్ నాలెడ్జ్ మెంట్ కూడా ఇవ్వాలని కోరారు. నామినేషన్ గడువుకు తగినంత ముందుగా, నిర్ణీత స్వల్ప వ్యవధిలో ఈ సమాచారాన్ని అందించాలని ఎస్ఈసీని కోరారు.అదే విధంగా, అభ్యర్థులు వేర్వేరు పోలీస్ స్టేషన్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా, డీజీపీ ఒక నోడల్ అధికారిని నియమించి, ప్రామాణిక దరఖాస్తు ఫారం, సమాధాన ఫారాన్ని జారీ చేసేలా ఎన్నికల సంఘం ఆదేశించాలని కోరారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా అందుబాటులో ఉంచాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కోరారు. అలాగే ఈ లేఖ ప్రతిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా పంపారు.ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల -
ముత్యాల నాయుడు మాతృమూర్తి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాతృమూర్తి బూడి సింహాచలమ్మ (88) వయోభారంతో కన్నుమూయడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సింహాచలమ్మ మృతి బూడి ముత్యాల నాయుడు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాతృ వియోగం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని బూడి ముత్యాల నాయుడికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఇదీ చదవండి: లే కన్నా.. ఇంటికెళ్దాం! -
ఇవాళ ఏపీలో పెద్ద డ్రామా నడిచింది!
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉదయం పెద్ద డ్రామా నడిచిందని.. జిల్లాల నుంచి పూర్తి సమాచారం రాకుండానే ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఎందుకు ప్రకటించిందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తలెత్తాయని.. మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ఎన్నికల విషయంలో కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతుందో చెప్పాలి’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘మంగళగిరిలో ఎస్టీలకు వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఆలస్యం చేయటం అన్యాయం కాదా?. చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత ఆత్రం ఎందుకు?. నెలా రెండు నెలలు ఆగితే వచ్చే నష్టమేంటి?. అక్టోబర్ 16న సవరించిన ఓటర్ల జాబితా వస్తుంటే పాత జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటి?. ఓటర్ల జాబితాలో 44 లక్షల మృతులు, డబుల్ ఓట్లు, వలస వెళ్లినవారి పేర్లు ఉన్నాయని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. మరో 11 లక్షల కొత్త ఓట్లు చేర్చాల్సి ఉండగా పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లడం వెనుక ఉద్దేశమేంటి?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘చనిపోయినవారి పేర్లతో ఓట్లు వేయించాలనుకుంటున్నారా?. డబుల్ ఓట్లను కొనసాగించాలనుకుంటున్నారా?. దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సినంత అత్యవసరం ఏమొచ్చింది?. అక్టోబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చి పండుగ రోజుల్లో నామినేషన్లు వేయమనడం ఎంతవరకు సమంజసం?. హిందూ ధర్మం గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబుకు హిందువుల ప్రధాన పండుగలు కనిపించడం లేదా?. రూ.14 వేల కోట్ల నిధుల కోసమే ఎన్నికలంటున్న చంద్రబాబు, డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో కేంద్రంతో మాట్లాడి గడువు ఎందుకు పొందలేరు?. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?..ఒక వైపు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు నామినేషన్లకు తొందరపెట్టడం ఏం న్యాయం?. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండోవర్లు, రౌడీషీట్లు, పాత కేసులతో ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌పై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. ప్రజల సమస్యలపై లేని ఆత్రం చంద్రబాబుకు స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు వస్తోంది?. సవరించిన ఓటర్ల జాబితాతో, ప్రతిపక్షాలకు తగిన సమయం ఇచ్చి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల -
వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా విష ప్రచారం: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌పై విష ప్రచారమే చంద్రబాబు నిత్య కార్యక్రమంగా మారిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను తిట్టనిదే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు రోజు గడవడం లేదు.. ప్రజలు నమ్మని పాత ఆరోపణలనే మళ్లీ కొత్త కథలుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్ జగన్‌పై మరోసారి రాజకీయ కుట్రలకు తెరలేపారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసుల పేరుతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించారు. ఒక ఎఫ్ఐఆర్ను 11 కేసులుగా మార్చి వైఎస్ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టారు. ఏళ్ల తరబడి కేసులను సాగదీస్తూ వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారు.‘‘కోర్టుల్లో విచారణకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు ప్రతిరోజూ హాజరవుతున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నాం. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారమెందుకు?. రోజువారీ విచారణ జరుగుతుండగా ఈడీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరమేంటి?. వైఎస్ జగన్‌పై ఈడీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు కేసులపై ఎందుకు లేదు?’’ అంటూ మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్ కేసుల్లో అత్యుత్సాహం.. చంద్రబాబు కేసుల్లో మౌనం.. ఇదేనా ఈడీ నిష్పక్షపాతం?. సీమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు ఏమైంది?. స్కిల్ స్కామ్‌లో రూ.44 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం నిజం కాదా?. ఆస్తులు జప్తు చేసిన ఈడీ.. ఆ కేసులో తదుపరి చర్యలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?. చంద్రబాబు అధికారంలోకి రాగానే స్కిల్ స్కామ్ కేసును మూసివేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏపీ సీఐడీ క్లోజర్ రిపోర్టు ఇస్తే ఈడీ దర్యాప్తు కూడా ఆగిపోతుందా?..స్కిల్ స్కామ్‌ను తొలుత వెలుగులోకి తెచ్చింది జీఎస్టీ అధికారులే. జీఎస్టీ అధికారులు గుర్తించిన అక్రమాలపై ఈడీ ఏం చర్యలు తీసుకుంది?. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ వ్యవహారంలో దర్యాప్తు ఏమైంది?. రూ.2 వేల కోట్ల అనుమానాస్పద లావాదేవీలపై వచ్చిన ఆరోపణలకు సమాధానమెక్కడ?. ఆ అనుమానాస్పద లావాదేవీల్లో డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఈడీ తేల్చిందా?. వైఎస్ జగన్ కేసుల్లో వేగం.. చంద్రబాబు వ్యవహారాల్లో జాప్యం.. ఎందుకీ ద్వంద్వ వైఖరి?..కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలి. చట్టం అందరికీ సమానమే అయితే చంద్రబాబు కేసులపైనా అదే చురుకుదనం చూపాలి. వైఎస్ జగన్‌పై కేసుల పేరుతో ఎల్లో మీడియా విష ప్రచారానికి తెరలేపింది. కోర్టులో జరగని పరిణామాలను జరిగినట్లు చిత్రీకరిస్తూ బ్రేకింగ్ వార్తలు ఇస్తున్నారు. ఈడీ పిటిషన్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్‌పై కొత్త కథనాలు అల్లుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఎల్లో మీడియా ప్రధాన అజెండా..స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ జగన్ కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ డ్రామాలు. వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తారంటే చంద్రబాబుకు రాజకీయ భయం పట్టుకుంటోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఆపకపోతే పరువు నష్టం దావాలు వేస్తాం...జర్నలిజం పేరుతో రాజకీయ కక్ష సాధింపు ప్రచారాలు చేయడం సరికాదు. దర్యాప్తు సంస్థలకు విశ్వసనీయత ముఖ్యం.. రాజకీయ ప్రయోజనాలకు వంతపాడటం కాదు. కేసులతో భయపెట్టాలని చూసినా జగన్ ప్రజల పక్షాన పోరాటం ఆపరు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబువి పిట్టలదొర మాటలేనా? -
లోకల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అభ్యర్థుల భద్రత, నామినేషన్ కేంద్రాలు మొదలుకొని ఓట్ల లెక్కింపు వరకు భద్రతా ఏర్పాట్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోటీ చేసే అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించే అంశంపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బుధవారం ఆదేశించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కల్పించడంతోపాటు నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సీసీటీవీ కెమెరాల నిఘా, లైవ్ వెబ్‌కాస్టింగ్ అందుబాటులో ఉంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల భద్రతకు సంబంధించి వివరాలు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.నామినేషన్ల దాఖలు తేదీ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో సహా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారో వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగడం, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత వంటి అంశాలపై తీసుకునే చర్యలకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఇదీ చదవండి: ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు -
కార్పొరేట్లకు అలా.. ఎస్సీ, ఎస్టీలకు ఇలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దళిత పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు సర్కారు సవతి తల్లి ప్రేమను మరోసారి చూపించింది. ఇప్పటివరకు పారిశ్రామిక రాయితీలు పూర్తిగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేసింది. సకాలంలో నగదు చెల్లించలేదంటూ 1,600 మందికిపైగా దళిత పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వారిలో 1,200 మంది ప్లాట్లను రద్దు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దళిత పారిశ్రామిక సంఘాలు వాపోతున్నాయి.ఒకపక్క కార్పొరేట్ సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా అప్పగించినా సకాలంలో డబ్బులు కట్టకపోతే మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై వారికి గడువు పెంచుతున్నాయని, అదే ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన పారిశ్రామిక బకాయిలు చెల్లించకుండా ప్లాట్లకు డబ్బులు కట్టలేదంటూ ఇలా నోటీసులు జారీచేసి రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 11న నోటీసులు జారీచేసి అక్టోబర్ 10లోగా కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతామని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బడా పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే ఎకారాలకు ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఎంఈలకు మాత్రం మార్కెట్ రేటు కంటే మూడు రెట్లు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం కేటాయించిన భూములపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోతుంటే దళిత పారిశ్రామికవేత్తలు కష్టపడి బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్ తెచ్చుకొని పరిశ్రమలు పెట్టే సమయానికి కుంటి సాకులు చెప్పి ఏపీఐఐసీ ఆ భూములు లాక్కోవడాన్ని వీరు తప్పు పడుతున్నారు. కార్పొరేట్లకు కంచాల్లో.. రూ.వేల కోట్ల విలువైన భూమలు తీసుకున్న ఆర్సలర్ మిట్టల్, బెంగళూరుకు చెందిన సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీలు సకాలంలో డబ్బులు చెల్లించకపోతే మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమై వాటికి గడువు పెంచిన విషయాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేస్తున్నారు. రూ.లక్ష కోట్లతో రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి 2,080.76 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇందుకు చెల్లించాల్సిన రూ.1,069 కోట్లు తమ దగ్గర లేవని.. మూడు విడతల్లో చెల్లిస్తామని ఆర్సలర్ మిట్టల్ లేఖ రాయగానే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై మరీ ఆమోదించిందంటున్నారు.అలాగే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కారుచౌకగా రూ.45 కోట్లకే చంద్రబాబు సర్కారు కేటాయిస్తే.. ఈ మొత్తం చెల్లించడానికి డబ్బులు లేవంటే ఎటువంటి వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించేందుకు 60 రోజులు గడువు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలే కాదు లులు, రేమాండ్, సిఫి ఇన్ఫినిటీ వంటి అనేక కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు చెల్లించడానికి గడువు ఇచ్చిందని.. దళితులు గడువు అడిగితే ఇవ్వకుండా కర్కశంగా రద్దు చేస్తూ నోటీసులు జారీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎస్సీ, ఎస్టీల ప్లాట్లు తిరిగి ఇవ్వాలి బడాబాబులకు పావలాకి రూపాయికి వేల ఎకరాలు ఇస్తున్న ఏసీఐఐసీ ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన చిన్నచిన్న ఎంఎస్ఎంఈ ప్లాట్లు రద్దుచేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చిన్నచిన్న కారణాలతో గత నెలలో ఏపీఐఐసీ దాదాపు 1,200 ప్లాట్లు రద్దు చేసింది. వాటిని వెంటనే తిరిగి ఇవ్వాలి. పరిశ్రమలు పెట్టుకోవడానికి మరో మూడేళ్లు గడువు ఇవ్వాలి. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రోత్సాహకాల చెల్లింపులోనూ ఇంతే పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రభుత్వం దళిత పారిశ్రామికవేత్తల పట్ల ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. వారంతా రాయితీల కోసం నెలల తరబడి ధర్నా చేస్తున్నా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని.. అదే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు చెందిన కంపెనీలకు ఏకంగా రూ.36.68 కోట్లు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా గ్రూపులకు రూ.15.60 కోట్లు, ఎంపీ బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌కు రూ.3.47 కోట్లు, అవంతి ఫీడ్స్‌కు రూ.2.53 కోట్లు, వల్లభనేని సుధాకర్చౌదరికి చెందిన మోహన్ స్పిన్‌టెక్స్‌కు రూ.60.50 కోట్ల ప్రోత్సాహకాలు ఎలా చెల్లించారని దళిత పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు. ఒకపక్క సబ్సిడీలు అందక, బ్యాంక్ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న దళిత పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించడానికి గడువు పెంచాలని లేకపోతే కనీసం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాట్ల రద్దు చర్యలను తక్షణమే ఆపాలి ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక ప్లాట్లు పొందిన సుమారు 1,600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను ప్రభుత్వం వేధించడం తగదు. కార్పొరేట్లకు ఎకరా రూపాయికే భూములిచ్చే ప్రభుత్వం, పేద ఎస్సీ, ఎస్టీలకు మాత్రం నోటీసులివ్వడం అన్యాయం. సెప్టెంబర్ 11న జీవో ఇచ్చి అక్టోబర్ 10 లోపు పూర్తి సొమ్ము చెల్లించమనడం లబ్ధిదారులపై భారం మోపడమే. సబ్సిడీలు అందక, బ్యాంక్ రుణాలు లభించక ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం గడువు పొడిగించాలి. ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ మొత్తాలను ప్లాట్ల ధరలో జమ చేసుకునే అవకాశం కల్పించాలి. – పినమాల నాగకుమార్, అధ్యక్షుడు, ఏపీ దళిత ఎంట్రప్రెన్యూర్స్ ఎంపవర్మెంట్ అసోసియషన్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం
సాక్షి, న్యూఢిల్లీ/ఉక్కునగరం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ నిర్వహణ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన భూముల ఈ–వేలంలో తొలిరోజు రూ.366.33 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) విశాఖపట్నంలోని ఈ స్థలాలకు ఈ–వేలం నిర్వహించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటన మేరకు.. తొలివిడత మొత్తం 150 ప్లాట్లు విక్రయమయ్యాయి. ఈ ప్లాట్లకు నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.312.48 కోట్లు కాగా, బిడ్ల ద్వారా రూ.366.33 కోట్ల విలువ నమోదైంది. రిజర్వ్ ధరతో పోలిస్తే 17.23 శాతం అధిక ధర లభించింది. అత్యధికంగా చదరపు గజానికి రూ.1.80 లక్షలకు పైగా ధర పలికింది. పారదర్శక విధానంలో ఈ–వేలం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర ప్రభుత్వసంస్థల వద్ద వినియోగంలో లేని మిగులు భూములు, భవనాలను ఉత్పాదక అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా ఎన్ఎల్ఎంసీ ఈ ప్రక్రియను చేపట్టింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌తో సమన్వయం చేసుకుంటూ ఎన్ఎల్ఎంసీ వేలాన్ని నిర్వహించగా, క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) లావాదేవీల సలహాదారుగా వ్యవహరించింది. రైల్‌టెల్‌కు చెందిన ఈ–నివిదా ఆన్లైన్ వేదిక ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఎల్ఎంసీ, ఆర్ఐఎన్ఎల్ సంయుక్తంగా 2026 సెప్టెంబర్‌లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాల్లో భూముల వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) నిబంధనలు, ఆన్లైన్ బిడ్డింగ్ విధానంపై వివరించారు. మిగిలిన ప్లాట్లకు అక్టోబర్ 30న వేలం తొలివిడత ఈ–వేలానికి వచ్చిన స్పందన నేపథ్యంలో మిగిలిన 216 ప్లాట్లకు అక్టోబర్ 30న ఈ–వేలం నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ను మార్చి అదే తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఆ ప్రకటనలో తెలిపింది. వేలంలో పాల్గొనాలనుకునే వారు అక్టోబర్ 27లోగా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని తెలిపింది. అందుబాటులో ఉన్న ప్లాట్ల వివరాలు, రిజర్వ్ ధరలు, అర్హత ప్రమాణాలు, పాల్గొనేందుకు అవసరమైన నిబంధనలను అధికారిక ఈ–వేలం పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్లాట్ల వివరాలను పరిశీలించి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. -
జైళ్ల శాఖ నుంచి.. పౌరసరఫరాల పీఠంపైకి..!
సాక్షి, అమరావతి: జైళ్ల శాఖ నుంచి.. ఏకంగా పౌరసరఫరాల సంస్థ పీఠంపైకి! ఐఏఎస్‌గా పదోన్నతి.. వెంటనే కీలక పోస్టింగ్! ఇదీ చంద్రబాబు మార్కు పాలనలో అధికారుల నియామకాల తీరు అంటూ అధికారవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా జేసీ, కలెక్టర్ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులకు అప్పగించే రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండీ బాధ్యతలను.. జైళ్ల శాఖలో పనిచేసిన ఎం.వరప్రసాద్‌కు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో వరప్రసాద్ ఆయన మన్ననలు పొందారనే ఆరోపణలు, ఆ తర్వాత ఆయనకు ఐఏఎస్ పదోన్నతి, కీలక పోస్టింగ్ దక్కడంతో ఈ నియామకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు చినబాబు కనుసన్నల్లోనే ఐఏఎస్ పదోన్నతులు, పోస్టింగులు, పదవీ విరమణ చేసిన అధికారుల పునర్నియామకాలు సాగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ క్యాడర్ అధికారులను పక్కనపెట్టి, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న అసంతృప్తి అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అర్హతలు, అనుభవం, సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాల్సిన చోట రాజకీయ ప్రాపకమే ప్రమాణంగా మారుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నాడు బాబుకు సపర్యలు.. నేడు కీలక పోస్టింగ్‌లు ఏపీక్యాడర్ ఐఏఎస్ పోస్టుల్లో 33 శాతం పదోన్నతుల ద్వారా వస్తారు. వాటిలో 85 శాతం రెవెన్యూ డిపార్టుమెంట్ నుంచి, 15 శాతం నాన్ రెవెన్యూ డిపార్టుమెంట్ నుంచి పదోన్నతి కల్పి స్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ అడుగులకు మడుగులొత్తే వారు ఏ డిపార్టుమెంట్లో ఉన్నా సరే, కన్ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో చేర్చి కేంద్రం వద్ద తమకున్న పలుకుబడితో వారికి ఐఏఎస్ క్యాడర్ వచ్చేలా చేస్తున్నారు. అయితే ఇక్కడ వరప్రసాద్ నియామకంలో కూడా ఇదే జరిగిందన్న వాదన విన్పిస్తోంది. యూపీపీఎస్సీ నిబంధనల ప్రకారం రాష్ట్ర పరిధిలో నాన్ రెవెన్యూ కేడర్‌లో గ్రూప్ వన్ సర్వీస్‌లో కనీసం 8 ఏళ్లకు తక్కువ కాకుండా పనిచేసిన వారికి ఐఏఎస్‌కు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. నాన్ రెవెన్యూ కోటాలో వాణిజ్యపన్నులు, మున్సిపల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వంటి ఇతర శాఖలకు చెందిన వారికి మాత్రమే కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. హోంశాఖ పరిధిలో ఉండే జైళ్ల శాఖ నుంచి ఇప్పటి వరకు కన్ఫర్డ్ ఐఏఎస్‌గా ఏ ఒక్కరికీ పదోన్నతి కల్పించిన దాఖలాలులేవు. జైళ్ల శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వరప్రసాద్‌కు చంద్రబాబు ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా పదోన్నతి జాతీయ స్థాయిలో కూడా ఇదే తొలిసారని చెబుతున్నారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న వరప్రసాద్ అనుకూలంగా వ్యవహరించారని, అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఆయన పేరు కన్ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో చేర్చారన్న వాదన విన్పిస్తోంది. ఇప్పటికే ఆ సమయంలో రాజమహేంద్రవరం జైలర్‌గా పనిచేసిన కోవెల దుర్గారమేష్ను ఏపీఎక్సైజ్ సర్వీస్ రూల్స్‌ను సడలించి మరీ ఎక్సైజ్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా నియమించిన విషయం తెలిసిందే.పునర్నియామకాలపై క్యాడర్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి మరోవైపు పదవీ విరమణ చేసిన అధికారులను పునర్నియామకాల పేరిట కీలకమైన పోస్టింగ్‌లు కట్టబెడుతూ పునరావాసం కల్పిస్తుండడం పట్ల అధికార వర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్)హోదాలో పనిచేసిన విజయానంద్‌ను పదవీ విరమణ తర్వాత పునర్నియామకం పేరిట ఎనర్జీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారు. 2017లో రిటైర్ అయిన రామశంకర్ నాయక్‌ను మత్స్యశాఖ కమిషనర్‌గా పునర్నియమించి రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇక తెలంగాణాకు చెందిన శరత్‌ను కూడా ఇదే రీతిలో రిటైర్ అయిన తర్వాత జేఈవోగా తిరిగి నియమించారు. వీరితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 75 మందికిపైగా రిటైరైన అధికారులు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. సీనియర్లను పక్కన పెట్టి రిటైరైన వారికి కీలక బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ కారణంగానే గడిచిన రెండేళ్లుగా ఏపీ క్యాడర్ అధికారులకు కేంద్రంలో విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు. -
కోర్టు తీర్పులకు విరుద్ధ చట్టాలను సహించం
సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను పునఃమదింపు నోటీసుల జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పన్ను తప్పించుకున్న ఆదాయంపై నోటీసులు ఇచ్చే విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన ‘ఫేస్‌లెస్’ (డిజిటల్) విధానానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణను హైకోర్టు తప్పుపట్టింది. ఫేస్‌లెస్ విధానం స్థానంలో సంబంధిత పరిధిలోని జ్యురిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్లే (జేఏఓ) నేరుగా నోటీసులు జారీ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆదాయపు పన్ను చట్టం 1961ని సవరిస్తూ కొత్తగా చేర్చిన సెక్షన్ 147ఏను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ఈ సెక్షన్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఫేస్‌లెస్ విధానం ద్వారా కాకుండా జేఏఓలు నేరుగా సెక్షన్ 148, 148ఏ కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా కొట్టేసింది. ఇవన్నీ కూడా అధికార పరిధి దాటి ఇచ్చినవేనని తేల్చి చెప్పింది. ‘ఈ–అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ స్కీమ్, 2022’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జేఏఓలకు సెక్షన్ 148 కింద నోటీసు ఇచ్చే అధికారం లేదు. ఈ పథకం ప్రకారం పన్ను తప్పించుకున్న ఆదాయంపై ఇచ్చే నోటీసులు (సెక్షన్ 148), రీ–అసెస్మెంట్ చర్యలన్నీ (సెక్షన్ 147) కేవలం డిజిటల్/ఫేస్‌లెస్ పద్ధతిలోనే జరగాలి. అంతే తప్ప జేఏఓలు నేరుగా నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు.’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సెక్షన్ 147ఏ ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు... ఫైనాన్స్ యాక్ట్, 2026 ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లో చేర్చిన సెక్షన్ 147ఏని, దానిని వెనుకటి తేదీ (రెట్రోస్పెక్టివ్) 01.04.2021 నుండి వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ మూల నిర్మాణంలో భాగమైన చట్టబద్ధ పాలన, అధికార విభజన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివేక్ చంద్రశేఖర్, శ్రీచరణ్ తేలప్రోలు, వినోద్ కె.రెడ్డి, జ్యోతిరత్న అనుమోలు తదితరులు వాదించారు. అంతేకాక పన్ను చెల్లింపుదారులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తోందన్నారు. సెక్షన్ 147ఏ కింద జేఏఓలు ఇచ్చే నోటీసులు.. ‘ఫేస్‌లెస్’ పద్ధతికి సంబంధించిన సెక్షన్ 151ఏకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల అవి చెల్లవని వివరించారు. కోర్టు తీర్పులను చెల్లకుండా చేయడానికే సెక్షన్ 147ఏ జేఏవోలకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని తిరిగి కల్పించడానికి, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చెల్లకుండా చేయడానికి ప్రభుత్వం నాన్–ఓబ్స్టాంటే క్లాజ్ (ఇతర చట్ట నిబంధనలను అధిగమించడం) తెచ్చి, సెక్షన్ 147ఏ ద్వారా ‘అసెసిగ్ ఆఫీసర్’ నిర్వచనాన్ని మార్చడానికి ప్రయత్నించింది. రీ–అసెస్మెంట్ నోటీసులన్నీ సెక్షన్ 151ఏ ప్రకారం ‘ఫేస్‌లెస్’ పద్ధతిలోనే జరగాలని, జేఏఓలకు నేరుగా నోటీసులు ఇచ్చే పరిధి లేదని గతంలోనే హైకోర్టులు స్పష్టంగా చెప్పాయి. సెక్షన్ 151ఏ ని లేదా అందులోని ఫేస్‌లెస్ పథకాన్ని అధికారికంగా సవరించకుండా, కేవలం సెక్షన్ 147ఏ ని తీసుకువచ్చి పాత తీర్పులను రద్దు చేయాలనుకోవడం న్యాయ సమీక్షలో నిలబడదు. 31.3.2026న ఆదాయపు పన్ను చట్టం 1961 చట్టం రద్దయింది. ఫైనాన్స్ యాక్ట్ 2026 ద్వారా 1961 చట్టంలో సెక్షన్ 147ఏను చేర్చారు. ఈ ఫైనాన్స్ యాక్ట్ 1.4.2026న అమల్లోకి వచ్చింది. కాబట్టి చట్ట సవరణ చేసే నాటికే 1961 చట్టం లేదు. అందువల్ల రద్దయిన చట్టానికి సవరణ చేసి తెచ్చిన సెక్షన్ 147ఏ చెల్లదు. – హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ -
ముంచుకొస్తున్న ఏఐ 'ముప్పు'
సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో భారత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెను ప్రభావం చూపనుంది. ఏకంగా 19.5 కోట్ల ఉద్యోగాలకు గండం ముంచుకొస్తోందని సెంటర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ఉద్యోగాల్లో నైపుణ్యాలను కూడా ఏఐ మెరుగుపరుస్తుందని పేర్కొంది. చెన్నైకు చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపై అధ్యయనం నిర్వహించింది.నివేదికలో ముఖ్యాంశాలివీ..» భారత్‌లో 24.6 శాతం ఉద్యోగాలు ఏఐ ప్రభావం పరిధిలోకి రానున్నాయి.» దేశంలో 19.5 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఆటోమేషన్ ప్రభావం పడనుంది. ఆటోమేషన్ ఫలితాలను బట్టి ఆ ఉద్యోగులను ఏ మేరకు కొనసాగించాలనేది నిర్ణయిస్తారు. » మహిళలు నిర్వహిస్తున్న ఉద్యోగాల్లో 37.6శాతం, పురుషులు నిర్వహిస్తున్న ఉద్యోగాల్లో 28.4 శాతం ఏఐ ఆటోమేషన్ ప్రభావానికి గురికానున్నాయి. » ఉద్యోగాలపై ఏఐ ప్రభావం అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 42శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనుంది. ఆ తరువాత స్థానాల్లో 37.9శాతంతో హరియాణా రెండో స్థానంలో, 32.9 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి.ఏఐ ప్రభావంతో దేశంలో 8% ఉద్యోగాల్లో ఉద్యోగుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది.» ఏఐతో దేశంలో నిరుద్యోగిత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 15ఏళ్లు నుంచి 34 ఏళ్ల వయసు ఉన్నవారిలో 1.87 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో మొత్తం నిరుద్యోగిత కంటే 20 ఏళ్ల నుంచి 29ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారిలో నిరుద్యోగిత రెట్టింపు ఉంది. దేశంలో 25 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు. » ఇక 15 ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఉన్నవారి రొటీన్ పనితోనే సరిపెట్టుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో రొటీన్ పనిలో నిమగ్నమైనవారు 55 శాతం మంది ఉన్నారు. -
స్థానిక ఎన్నికల ఓట్లను ఒకేసారి లెక్కించాలి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వల్ప వ్యవధిలో జరుగుతున్న నేపథ్యంలో ఒక ఎన్నికల ఫలితాలు మరో ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్లను ఒకేసారి లెక్కించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వైఎస్సార్సీపీ తరఫున మాజీమంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు, మహేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తాము చేసిన డిమాండ్లను వివరించారు. కన్నబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పోలీసులు, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని తాము ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల అనుమానాలు కలుగుతున్నట్టు చెప్పారు. కులధ్రువీకరణ పత్రాలను కేవలం యాప్ ద్వారానే తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలంటే సాంకేతిక సమస్యలు, ఇతర ప్రభావాల వల్ల సకాలంలో అందవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మీ సేవా కేంద్రాలు, ఆఫీసుల్లో నేరుగా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో కులధ్రువీకరణ పత్రాలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరినట్టు చెప్పారు. విశాఖ, గుంటూరు నగరాల్లో నోడ్యూస్ సర్టిఫికెట్ల జారీ విషయంలో జరిగిన పక్షపాత ఘటనలను ఎస్ఈసీకి వివరించామన్నారు. అభ్యర్థులు కులధ్రువీకరణ, నోడ్యూస్ సర్టిఫికెట్లు పొందే విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తమ పార్టీ నేత అప్పిరెడ్డి ఇప్పటికే మూడుసార్లు ఎస్ఈసీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించే బాధ్యతను ఎస్ఈసీ తీసుకోవాలని కోరామన్నారు. గతంలో ఘర్షణలు జరిగిన సున్నితప్రాంతాల్లో కేంద్ర బలగాలతో గస్తీ ఏర్పాటు చేయాలని సూచించినట్టు చెప్పారు. జూలై 15 నాటికి అర్హత గల ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించాలని తమ పార్టీ గతంలో ఎస్ఈసీకి లేఖ రాసిందని గుర్తుచేశారు. కోడ్‌ను కఠినంగా అమలు చేయాలి ఎన్నికల నియమావళి (కోడ్)ని కఠినంగా అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ, మీడియా సున్నితమైన అంశాలపై చేపడుతున్న తప్పుప్రచారాలను అడ్డుకోవాలని కోరామన్నారు. నోటిఫికేషన్ రోజు నుంచే బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో నిరంతర లైవ్ వీడియో అందరికీ అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. నగరాలు, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన అస్తవ్యస్తంగా జరిగినట్లు చెప్పామన్నారు. విశాఖపట్నంలో 30 వేల ఓట్లతో ఏర్పాటు చేసిన డివిజన్ పక్కనే.. మరో డివిజన్‌ను ఐదువేల ఓట్లతో ఏర్పాటు చేశారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. అక్రమాలను అడ్డుకుంటాంకాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థులు కలెక్టరు, ఆర్డీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని ఎస్ఈసీని కోరినట్లు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే పారామిలటరీ బలగాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే పోలీసులు తమ నాయకులను బైండవర్లు పేరిట బెదిరిస్తున్నారని చెప్పినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ వీడియోలు 90 రోజులు భద్రపరిచేలా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోయినా, నామినేషన్లు వేయనీయకపోయినా రాష్ట్రంలో విప్లవం వస్తుందని హెచ్చరించారు. దొంగతనంగా, అక్రమాలు చేసి గెలవాలనుకుంటే అన్ని రకాలుగా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
పుర పోరుకు సై
సాక్షి, అమరావతి: పుర పోరుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. అధికార యంత్రాంగం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు షురూ చేసింది. ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రాలకు తరలించింది. మున్సిపాలిటీల వారీగా పోలింగ్ బూత్‌ల తుదిజాబితా కూడా సిద్ధమైంది. 23 మున్సిపాలిటీల్లో రెండో విడతలో.. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో తొలి విడతలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లుచేశారు. మిగిలిన 23 మున్సిపాలిటీల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో 3,942 వార్డులున్నాయి.13 కార్పొరేషన్ల పరిధిలో 922 వార్డులు, 87 పురపాలికల్లో 3,020 ఉన్నాయి. ఎన్నికల కోసం మొత్తం 12,244 పోలింగ్ స్టేషన్లను ఖరారు చేశారు. రాష్ట్రంలోనే పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 120 వార్డులకు గానూ 1,990 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. మడకశిర, కమలాపురం పురపాలికల్లో 23 వార్డులు చొప్పున ఉండగా.. పోలింగ్ కేంద్రాలు కూడా 23 చొప్పునే ఉన్నాయి. -
ఆన్లైన్లో నామినేషన్లు!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్ధులు ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ రాజకీయ పార్టీల నుంచి అందిన సూచనను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ సహా మొత్తం 19 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లిఖార్జునతో కలసి ఎస్ఈసీ పునేఠ విలేకరులతో మాట్లాడారు. పోటీ చేసే ఆశావహులకు కులధ్రువీకరణ, నో డ్యూస్ పత్రాలు జారీలో జాప్యం జరుగుతోందని, ఎన్నికల్లో పారదర్శకత కోసం సీసీ టీవీ కవరేజీ పెద్ద ఎత్తున చేపట్టాలని, ఓటర్లను ప్రభావితం చేసే మద్యాన్ని నియంత్రించాలని, అభ్యర్థులకు పటిష్ట భద్రత కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. పోటీ చేసే అభ్యర్థులందరికీ కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు చాలా కీలకమని, ఆయా సర్టిఫికెట్లు తక్షణమే జారీ చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపారు.ఆయా పార్టీల నుంచి వచ్చిన ఇతర సూచనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందని చెప్పారు. సాధ్యమైనవి, సాధ్యమైనంత మేర అమలు చేస్తామన్నారు. కలెక్టరేట్ లేదా ఆర్డీవో కార్యాలయాల్లోనూ నామినేషన్లు స్వీకరించాలన్న వినతిపై ఆయన స్పందిస్తూ.. ఎన్నికలకు సంబంధించి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని వెంటనే మార్పు చేయడం కుదరదన్నారు. ఎక్కడైనా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు లేదా కలెక్టర్లనుంచి ప్రతిపాదన వస్తే పాటిస్తామన్నారు. పారా మిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్న విజ్ఞప్తులను పోలీస్‌శాఖకు పంపామని, పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్, ఎన్నికల సంసిద్ధత తెలియజేస్తూ సంబంధిత శాఖలు ధ్రువీకరణ పత్రాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపడతామని తెలిపారు. పండుగ రోజు ఎలాంటి ఎన్నికల కార్యక్రమాలు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు మేరకు ఓటర్ల జాబితాలపై నిర్ణయాలు ఉంటాయన్నారు. సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు మీటింగ్‌లా?: సీపీఎం తక్కువ వ్యవధి ఉండే స్థానిక సంస్థల ఎన్నికలను దసరా సమయంలో చేపట్టడం సరికాదని చెప్పాం. తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని కోరాం. సరిగ్గా నోటిఫికేషన్ జారీకి ముందు రాజకీయ పార్టీలతో మీటింగ్‌లు కాకుండా ముందే ఇలాంటి సమావేశం నిర్వహిస్తే బాగుండేదని చెప్పాం. నోటిఫికేషన్ జారీకి అంతా సిద్దం చేశాక పార్టీలతో మీటింగ్‌లు సరికాదు. నామినేషన్లు అన్లైన్లో కూడా సమర్పించేలా అవకాశమివ్వాలని కోరాం. కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 24 గంటల్లో అందించాలి. – వై వెంకటేశ్వరరావు (సీపీఎం)వ్యయ పరిమితులపై అభ్యంతరం: జనసేన కూటమిలో భాగస్వామి పార్టీగా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు సహకరిస్తాం. అభ్యర్థి ఎన్నికల వ్యయ వ్యత్యాసాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జనసేన తరఫున పిర్యాదు చేశాం. విశాఖలో మేయర్ వ్యయ పరిమితి రూ. 40 లక్షలుగా నిర్ణయించి కార్పొరేటర్ వ్యయం రూ. 20 లక్షలుగా నిర్దేశించడం సరికాదు. లౌడ్ స్పీకర్ల తీవ్రతను నియంత్రించాలని కోరాం. –శివశంకర్ (జనసేన)పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఓ ట్రైలర్: సీపీఐ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక జరిగిన పులివెందుల జడ్పీటీసీ, విద్యా కమిటీ ఎన్నికల మాదిరిగా స్థానిక ఎన్నికలు జరగకూడదని రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ను కోరాం. అధికార పార్టీ అక్రమాలకు అవి ఒక ట్రైలర్‌గా మేం భావిస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ప్రచారమే చేయకుండా చేశారు. విద్యా కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ సానుభూతి పరులు గెలవని చోట రద్దు చేశారు. పోలీసులే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించకుండా షెడ్యూల్ వెలువడే వేళ హడావుడిగా ముగించడం సరికాదు. గ్రామాల్లో కూడా సెప్టెంబరు వరకు ఓటు అర్హత ఉన్నవారికి అవకాశమివ్వాలని కోరాం. – జగదీష్, శంకర్ (సీపీఐ)అన్ని ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ వద్దు: బీజేపీ పండుగ నేపథ్యంలో మున్సిపల్, మండల జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ కాకుండా వేర్వేరుగా ప్రకటించాలి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అభ్యర్థులకు కొత్త జిల్లాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలి. పండుగ నేపథ్యంలో లౌడ్ స్పీకర్లకు అనుమతులు తదితర అంశాల్లో రాజకీయ పార్టీలకు వెసులుబాటు కల్పించాలి. అభ్యర్ధులకు కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో నేరుగా జారీ చేసేలా చర్యలు చేపట్టాలి. ఓటర్ స్లిప్‌లు ప్రభుత్వమే జారీ చేయాలి. – రమేష్ నాయుడు, శ్రీనివాసరాజు(బీజేపీ) పారా మిలటరీ బలగాలతో నిర్వహించాలి: కాంగ్రెస్ మొక్కుబడిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీటింగ్ పెట్టింది. స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఆయా వర్గాలకు ఒక్క రిజర్వేషనూ రాలేదు. ప్రకాశం జిల్లాలో బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు రాలేదు. పారదర్శక ఎన్నికల కోసం ఆన్లైన్లో నామినేషన్లు దాఖలుకు వీలు కల్పించాలి. స్థానిక పోలీసులతో ఎన్నికల నిర్వహణ వల్ల న్యాయం జరిగే అవకాశం ఉండదు. పారామిలటరీ బలగాలతో ఎన్నికలు జరపాలి. –మస్తాన్‌వలి (కాంగ్రెస్) -
నేడు విజయవాడకు రాష్ట్రపతి ముర్ము
సాక్షి, న్యూఢిల్లీ/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విజయవాడకు రానున్నారు. బుధ, గురువారాల్లో ఆమె విజయవాడలో పర్యటించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్రపతి నేడు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కొండపై వాహనాల రాకపోకలు, ప్రొటోకాల్ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. మధ్యాహ్నం 1.00 గంట నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎలాంటి ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రకటించారు. ఉదయం 6.00 నుంచి 8. 00 గంటల వరకు ఉండే ప్రొటోకాల్ దర్శనాలను మరో గంటపాటు పొడిగించి, రాత్రి 7.45 గంటల నుంచి కేటాయించిన స్లాట్‌ను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే, గురువారం విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సారస్ మేళాలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. -
ముష్టి వేస్తున్నారా?
సాక్షి, అమరావతి: ‘‘ముష్టి వేస్తున్నారా...? ప్రతిసారీ ఇదే నరకమా..? మాకు రావలసిన న్యాయమైన వాటా కోసం ఇంత దేబిరించాలా? ’’ ఇదీ జనసేన నేతల అంతర్మథనం. ‘‘అడుగుతున్నవే కొన్ని.. వాటిలోనూ కోతలు.. బలం ఉన్న స్థానాలనే అడుగుతుంటే వాటిని కూడా మార్చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలుసుకుని తాము ఆశిస్తున్న స్థానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంత పీకులాట అవసరమా’’ అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిసారీ మోసపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తగ్గించుకున్నామని, ఇపుడు కూడా తగ్గించుకోవాలంటే ఎలా అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాడో పేడో తేల్చుకుని అన్ని స్థానాల్లో రంగంలోకి దిగితే మేలని, అందుకు ఇదే సరైన సమయమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి కొన్ని స్థానాల్లో పట్టు సాధిస్తే వాటిపై పట్టుబట్టాల్సింది పోయి పార్టీ అధినాయకత్వం కూడా పట్టించుకోకపోతే ఎలా.. టీడీపీ చెప్పినదానికల్లా తలాడిస్తే ఎలా? ఇప్పటికైనా గట్టిగా స్పందించవద్దా? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కొలిక్కి రాని చర్చలు.. వాయిదా..మరోవైపు సీట్ల పంపకంపై మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. కూటమి పార్టీల మధ్య కసరత్తు కొలిక్కి రాలేదు. జనసేన అడుగుతున్న 6 మేయర్, 38 మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పల్లా శ్రీనివాసరావు మంగళవారం పొద్దుపోయేవరకు చర్చలు జరిపారు. అలాగే రిజర్వేషన్లు ప్రకటించడంతో.. జనసేన తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని అనుకుంటున్న స్థానాల్లో పరిస్థితి తలకిందులయ్యేలా మారింది. ఇది మరింత గందరగోళానికి కారణమయ్యింది. చర్చలు జరుగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేసేసి తమ ఆశలకు గండి కొట్టారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. అలిగినట్టు.. రాయబారం జరిగినట్టు..మంగళవారంనాటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలిగినట్లు ప్రచారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జనసేన కార్యాలయానికి వచ్చారు. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేనితో మాట్లాడుకోవాలని సూచించి పవన్ చర్చలకు దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పటికైనా అధినాయకత్వం స్పందించాలి..బలం ఉన్న చోటేగా అడుగుతున్నాం.. పార్టీకోసం కష్టపడిన నాయకులను ఇలా గాలికి వదిలేస్తారా అని జనసేన నాయకులు మధనపడుతున్నారు. అడుగుతున్నవే కొన్ని కదా.. వాటినీ ఇవ్వకపోతే ఎలా.. పార్టీ అధినాయకత్వం దీనిపై గట్టిగా నిలబడాలి.. ఇప్పటికైనా గట్టిగా స్పందించాలి అని నాయకులు, శ్రేణులు కోరుతున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉండడమేమిటి అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇదంతా పార్టీ అధినాయకత్వానికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా శ్రేణుల్లో రేకెత్తుతున్నాయి.అడిగిన చోటే వేటుమేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం జనసేన, బీజేపీ ముందుగానే జాబితాలు అందించాయి. కానీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు చంద్రబాబు రిజర్వేషన్లు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయించేశారు. దీంతో జనసేన, బీజేపీ ముందుగా అనుకున్న స్థానాలన్నీ రిజర్వేషన్లతో తారుమారైనట్లు తెలుస్తోంది. తాము కోరిన స్థానాలను రిజర్వు చేయడం సరికాదని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీట్లు ఇవ్వలేమని చెప్పకుండా, రిజర్వేషన్ల ముసుగులో తమ నాయకులను పోటీ నుంచి తప్పించారని మండిపడుతున్నాయి. సీటు ఇచ్చినట్టే ఇచ్చి, అక్కడ నిలబెట్టేందుకు అభ్యర్థే లేకుండా చేయడం నమ్మకద్రోహం కాక మరేమిటని నిలదీస్తున్నాయి.పిఠాపురం ఎస్సీ రిజర్వుడు..పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ పరిధిలోని పిఠాపురం మున్సిపాలిటీని ఎస్సీ రిజర్వుడుగా ఖరారు చేయించారు. ఇదంతా పవన్‌కు తెలియకుండా జరిగిందా అని పార్టీ నాయకులు, శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి సొంత ఇలాకా విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ జనసేన నేతల పరిస్థితి ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ఆక్రోశిస్తున్నారు. జనసేన కోరుతున్న పలు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాల విషయంలో ఇలాగే ఏకపక్షంగా రిజర్వేషన్లు మార్చినట్లు సమాచారం. జనసేన ఆశిస్తున్న కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లో వారిని సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజమండ్రిలో బీజేపీకి షాక్బీజేపీ విషయంలోనూ అదే తంతు. రాజమండ్రి మేయర్ స్థానంపై బీజేపీ ఆశలు పెట్టుకోగా ఆ స్థానాన్ని కూడా ఎస్సీకి రిజర్వ్ చేశారు. దీంతో అక్కడ పోటీకి సిద్ధమైన బీజేపీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. తమను సంప్రదించకుండానే రిజర్వేషన్లు ఖరారు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.చేసిందంతా చేసి.. నీతులుఈ నేపథ్యంలోనే రిజర్వేషన్లు మార్చాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాధవ్ చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆయన మాత్రం అందుకు అంగీకరించకుండా చట్టబద్ధమైన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదని సెలవిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చేసేదిలేక కొత్త స్థానాలు, కొత్త అభ్యర్థులను వెతుక్కునేందుకు కాస్త గడువు ఇవ్వాలంటూ జనసేన, బీజేపీలు అడుగుతున్నాయి.విజయవాడపైనా మెలికజనసేనకు విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ ఇస్తామని ప్రాథమికంగా ఆశ చూపిన టీడీపీ, ఇప్పుడు అందులోనూ మెలిక పెడుతున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతమైన ఉమ్మడి కృష్ణాలో రెండు కీలక కార్పొరేషన్లు జనసేనకు ఎలా ఇస్తామంటూ టీడీపీ నేతలు అడ్డం తిరుగుతున్నారు. విజయవాడ మేయర్ స్థానం అన్రిజర్వ్డ్ కావడం, జనసేన తరఫున వంగవీటి రాధా సతీమణి పోటీ చేస్తారన్న ప్రచారంతో అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. కాగా, బీజేపీ తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లు కావాలని కోరగా రెండింటికీ నో చెప్పినట్లు సమాచారం. వేరే ఏదైనా కార్పొరేషన్ చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. -
బరితెగించి బైండోవర్
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలమై ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు సర్కారు అధికారం అండతో అరాచకాలకు పదును పెట్టింది. సర్వత్రా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహంతో రెడ్‌బుక్ బరితెగింపు చర్యలకు తెగబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆశావహులను పోటీ నుంచి తప్పించేందుకు పోలీసులను అడ్డుపెట్టుకుని బైండోవర్ వేధింపులకు దిగింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే బైండోవర్ కుట్రలకు తెర తీసింది. వైఎస్సార్సీపీని నిలువరించేందుకు పోలీసులను పురిగొల్పింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆశావహులకు బైండోవర్ పేరుతో పోలీసుల బెదిరింపులు మొదలయ్యాయి. గుంటూరు, పల్నాడు..చిత్తూరు, అనంతపురం, కృష్ణా తదితర జిల్లాల్లో బైండోవర్ల పేరుతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను సైతం టార్గెట్ చేసి బైండోవర్ చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పాలక పక్షానికి ఎదురు నిలవకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయకుండా కక్షపూరితంగా పోలీసులను ప్రయోగించటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి వెళితే.. పోలీసులకు ఫోన్ కాల్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారిని సైతం పోలీసులు వదలడంలేదు. మున్సిపాలిటీలు, రెవెన్యూ కార్యాలయాలకు అధికారపక్ష నేతలు ఇచ్చిన డైరెక్షన్‌తో వారు పోలీసులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారు ఎవరైనా ఎన్ఓసీ కోసం మున్సిపాలిటీకి, కుల ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే చాలు.. వెంటనే పోలీసులకు ఫోన్ వెళుతోంది. దీంతో ఆశావహులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలంటూ బైండోవర్ చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పోలీసులు మరింతగా బరి తెగించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్న వారికి సీఐలు ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లకు రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మీరు పోటీ చేస్తే ఎన్నికల్లో గొడవలు జరిగితే మీదే బాధ్యత అంటూ హెచ్చరిస్తున్నారు. గొడవలకు మీపై కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. నామినేషన్ కూడా వేయకముందే బైండోవర్, ఆ తర్వాత ఏదైనా జరిగితే కేసులు పెడతామని పోలీసుల ద్వారా బెదిరిస్తూ చంద్రబాబు సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. సోషల్ మీడియానూ వదలని పోలీస్ జులుం.. స్థానిక ఎన్నికల వేళ సోషల్ మీడియాపై పోలీసులు మరింత జులుం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. పోలీసులు పల్నాడు జిల్లాలోని ఒక్క గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలోనే వీడియోలు పెట్టారనే సాకుతో ఏకంగా 600 మందికిపైగా బైండోవర్ చేయడం గమనార్హం. గురజాల మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుకు ‘సెల్ఫీ చాలెంజ్’ విసిరారు. కనీసం నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలు అమలు చేసి స్థానిక ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సెల్ఫీ చాలెంజ్ విసిరి సామాన్య ప్రజల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియోలు పోస్టు చేసిన వారిని పోలీసులు స్టేషన్‌కు రప్పించి బైండోవర్ పేరుతో వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేసిందని, బాగా పనిచేస్తోందని కొందరిని భయపెట్టి కౌంటర్ వీడియోలు చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోనూ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా జిల్లా కార్యదర్శి వాళ్ల సురేష్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. వైఎస్సార్సీపీ తిరుపూరు నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ జాకీర్‌తోపాటు పలువురు నేతలపై బైండోవర్ పేరుతో కక్ష సాధింపులకు దిగారు. గ్రామాల్లోనూ బైండోవర్లు.. పట్టణాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దశలో గ్రామాల్లో సైతం పోలీసులు బైండోవర్ల ప్రక్రియకు తెర తీయడం గమనార్హం. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇదే దారుణ పరిస్థితి నెలకొంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 15 నుంచి 20 మంది వరకు బైండోవర్లు చేసినట్టు సమాచారం. మాచర్ల, గురజాల, నరసరావుపేటలో ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా రూరల్ మండలంలో తుమ్మింద, గువ్వకల్లు, మురకంబట్టు, నాయని చెరువు, చెర్లోపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీకి చెందిన వారిని పథకం ప్రకారం పోలీసులు బైండోవర్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వం బైండోవర్ కుట్రలకు పదును పెట్టింది. పోలీసులు చేయాల్సింది ఇదీ..! ఎన్నికలు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ/బీఎన్ఎస్ఎస్) ప్రకారం అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడతారు. పాత నేరస్తులను, షీట్స్ ఉన్న వారిని, గొడవలకు సంబంధించిన ఎక్కువ కేసుల్లో నిందితులను రప్పించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బైండోవర్ చేస్తారు. ఎటువంటి గొడవలకు పాల్పడబోమని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సొంత హామీ (పూచీకత్తు)తో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తారు. పోలీసులు చేస్తోంది ఇదీ..! బైండోవర్ ముసుగులో వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులను ప్రయోగించి వైఎస్సార్సీపీ ఆశావహులను కేసుల పేరుతో బెదిరించి పోటీ నుంచి తప్పించేందుకు చంద్రబాబు సర్కారు పథకం వేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కీలక కార్యకర్తల నుంచి మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలకు పోలీసులు వరుసగా బైండోవర్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎలాంటి రాజకీయ నిరసనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తున్నారు. బాండ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇలా విపక్షాన్ని టార్గెట్ చేసి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చంద్రబాబు ప్రభుత్వం బైండోవర్, కేసుల పేరుతో పోలీసులను ప్రయోగించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. బాబుకు ఓటమి భయం.. చతుర్ముఖ కుతంత్రం!స్థానిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతుండటంతో పోలీసులను పావులుగా వాడుకునేందుకు చంద్రబాబు చతుర్ముఖ కుతంత్రం పన్నారు. యాక్టివ్‌గా ఉండే వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించడం.. బైండోవర్ పేరుతో వేధింపులకు పాల్పడటం.. శాంతి భద్రతల పేరుతో స్థానికంగా లేకుండా చేయడం... మలిదశ పోలింగ్ జరిగేలా చేసి అనుకూల పోలీసులు, అధికారులతో లబ్ది పొందే ఎత్తుగడ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై రెండున్నరేళ్లుగా అనేక అక్రమ కేసులను చంద్రబాబు సర్కారు బనాయించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీటిని తెరపైకి తెచ్చి బైండోవర్ పేరుతో బెదిరిస్తోంది. కీలకమైన నామినేషన్ల దశలో విపక్ష నాయకులు, కార్యకర్తలు స్థానికంగా లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. పోటీ చేయబోతున్న అభ్యర్థులపై అక్రమ కేసులు మోపి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. కొన్నిచోట్ల మలి దశ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కల్పించి పోలీసులను మోహరించి బూత్‌లను క్యాప్చర్ చేసి ఏకపక్ష ఎన్నికలకు కుటిల వ్యూహం పన్నింది. చట్టానికి లోబడి పనిచేసే అధికారులను గుర్తించి స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఫిర్యాదులు చేయించడం, తమకు అనుకూలమైన వారిని అక్కడకు రప్పించుకోవడం లాంటి అనైతిక చర్యలకు అధికార పక్షం ప్రణాళిక రచించింది. -
బరిలో బలమైన అభ్యర్థులు
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో... రెండున్నరేళ్లగా కొనసాగుతున్న దుర్మార్గ పాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ మరోమారు పార్టీ సీనియర్ నేతలతో మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక, సమర్థంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. సంబంధిత రీజినల్ కో–ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది. బాబు అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలిరాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారుల ద్వారా అక్రమాలు చేయిస్తున్నారన్నారు. విశాఖలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై రీజినల్ కో–ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీమ్‌ను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలపై బైండోవర్లు పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. -
ఏపీలో జడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు విడుదల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. బీసీలకు 3.. బీసీ మహిళలకు 3, జనరల్ 7.. జనరల్ మహిళలకు 7, ఎస్టీ 2.. ఎస్టీ మహిళకు 1, ఎస్సీలకు 2.. ఎస్సీ మహిళలకు 3 చొప్పున కేటాయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఎల్లో మీడియాకు ముందే సమాచారంస్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో నిబంధనలకు నీళ్లొదిలేశారు. పారదర్శకతకు పాతరేశారు. నిబంధనల ప్రకారం అధికారులు నిర్ధారించిన జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వ పెద్దలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఖరారు చేశారన్న చర్చ సాగుతోంది. రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయకముందే ప్రభుత్వ పెద్దలు వివిధ జిల్లా పరిషత్ రిజర్వేషన్లను నిర్ణయించేశారని, అవే వివరాలు ఎల్లో మీడియాకూ చేరాయని సమాచారం.జిల్లా పరిషత్ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఏ జిల్లా పరిషత్‌కు ఏ కేటగిరీ రిజర్వేషన్ రాబోతుందో ఎల్లో మీడియాలో ముందుగానే ప్రచురితమైంది. అవే వివరాలతో మంగళవారం రాత్రి రిజర్వేషన్లపై అధికారిక జీవో విడుదల కావడం గమనార్హం. విమర్శలు రాకుండా ఉండేందుకన్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్టీకి (ఎస్టీ మహిళ అని రాశారు) కేటాయించారని, కోనసీమ జిల్లాను ఎస్సీ మహిళకు (ఎస్సీ అని రాశారు) కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు. అధికార పార్టీ ఖరారు చేసిన జాబితా ఎల్లో మీడియాకు ముందుగానే అందిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లా పరిషత్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ..ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇదీ చదవండి: ‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’ -
4 రోజులపాటు ఏపీకి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో మంగళవారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో కోస్తా అంతటా 15వ తేదీ నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు (బుధవారం) కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇదీ చదవండి: అక్టోబర్ 17 వరకు సౌదీకి ఇండిగో విమానాలు రద్దు -
కుప్పం: మద్యం మత్తులో ఐఏఎస్ వికాస్ మర్మత్ వీరంగం
సాక్షి,బెంగళూరు: చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (కడ-kada), ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ పబ్‌లో మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తనిఖీలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుర్భాషలాడారు. ఈ ఘటనలో బెంగళూరు పోలీసులు వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్ పబ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు సదరు పబ్‌లో తనిఖీలు చేపట్టారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ అక్కడే ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆయన, విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లారు. అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాదు. రెచ్చిపోయి ప్రవర్తించారు.నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు..ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐఏఎస్ వికాస్ మర్మత్‌తో పాటు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ అనే వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కబ్బన్ పార్క్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 150/2026 కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేసి,దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి పబ్‌లో పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం చర్చాంశనీయంగా మారింది. ఇదీ చదవండి : ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్ జగన్ -
ఆ తల్లి ఆవేదనకు చలించిపోయిన వైఎస్ జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ దుస్థితిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఓ కుటుంబం.. ఆయన దృష్టికి తీసుకొచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌ను ముసునూరు మండలం వేల్పుచర్లకు చెందిన మహిళ జంగం మాధవి కలిశారు. తన18 నెలల పాప వినికిడి లోపంతో బాధపడుతుందని వైఎఎస్ జగన్ దృష్టికి తల్లి మాధవి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ వర్తించదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లి ఆవేదనకు వైఎస్ జగన్ చలించిపోయారు.రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదని చంద్రబాబు సర్కారు చేతులెత్తేస్తోంది. 2019–24 మధ్య పేద ప్రజల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసానిస్తూ అన్ని రకాల క్యాన్సర్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత పెద్ద జబ్బులకు ఉచిత చికిత్సలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ బలోపేతం చేసిన సంగతి తెలిసిందూ. అంతకు ముందు చంద్రబాబు పాలనలో 1059 ప్రొసీజర్లు ఉండగా, 2019 తర్వాత ఏకంగా 3,257కు ప్రొసీజర్ల సంఖ్యను పెంచింది. దీంతో కేంద్రం, దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో లేనన్ని ప్రొసీజర్లు ఒక్క ఏపీలోనే అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: దుబారా బాబు.. డిజిటల్ డాబు -
వైఎస్ జగన్‌తో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ల భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. జిల్లాల వారీగా వైఎస్ జగన్.. ముఖాముఖి నిర్వహిస్తున్నారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులపై వైఎస్సార్సీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి ఖరారయ్యారు. మిగతా అభ్యర్థులపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులంతా ఖరారయ్యే ఛాన్స్ ఉంది.కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న (సోమవారం) పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలే అజెండాగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేసి దిశానిర్దేశం చేశారు. పార్టీకి ప్రతి అనుబంధ విభాగం కీలకమన్నారు. అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు.ఇదీ చదవండి: మున్సిపోల్స్‌కు రె'ఢీ' -
దుర్గగుడిలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు నిజమే
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల తొలి రోజు బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేకపోయామని, అందువల్ల తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. దసరా ఉత్సవాల్లో తొలి రోజు భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో కమిషనర్ రామచంద్రమోహన్ సోమవారం దుర్గగుడికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్లాస్టిక్ వాడకం ఉండరాదనే ఉద్దేశంతో బబుల్స్ ద్వారా తాగు నీరు పంపిణీ చేశామని చెప్పారు. తాము ఊహించిన దానికన్నా అధికంగా భక్తులు తరలిరావటంతో ఆ ఏర్పాట్లు సరిపోలేదన్నారు. సోమవారం నుంచి మంచినీటి బాటిల్స్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. సామాన్య భక్తులకే త్వరతగతిన దర్శనం చేయటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రసాదాల కొరత లేకుండా, అన్నదానంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
టోల్‌ప్లాజాల్లో టాయిలెట్లు అపరిశుభ్రతపై ఎన్హెచ్ఏఐ సీరియస్
సాక్షి, అమరావతి : జాతీయ రహదారులపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న టోల్‌ప్లాజాల్లో టాయిలెట్ల అపరిశుభ్రతపై భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు పర్యవేక్షణ, అమలు వ్యవస్థను మరింత కఠినతరం చేస్తూ సోమవారం కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్లాజాల వద్ద టాయిలెట్ల అపరిశుభ్రత, నిర్వహణలో నిర్లక్ష్యం, టోల్ వసూలు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు, సూచిక బోర్డుల నిర్వహణలో లోపాలపై ఇకపై నిరంతర పర్యవేక్షణ చేపట్టనుంది. నిబంధనలు పాటించని, పదే పదే లోపాలను సరిదిద్దని టోల్ ఫీజు వసూలు సంస్థలను 15 రోజులపాటు, లోపాలను సరిచేసే వరకు ఎన్హెచ్ఏఐ టెండర్లలో పాల్గొనకుండా నిషేధించనుంది. జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎన్హెచ్ఏఐ 2025లో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించిన ప్రయాణికులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన, జియో ట్యాగ్ చేసిన, సమయ వివరాలున్న ఫొటోలను అప్లోడ్ చేయవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు చేసిన అర్హమైన ప్రతి వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు రూ.1,000 విలువైన ఫాస్టాగ్ రీచార్జ్‌ను బహుమతిగా అందిస్తారు. ప్రజల భాగస్వామ్యంతో లోపాలను సరిదిద్దే ప్రయత్నం.. గతేడాది క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ ప్రారంభించినప్పటికీ టోల్‌ప్లాజాల వద్ద లోపాలు సరిదిద్దలేదనే ఫిర్యాదులు రావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుని దానికి కొనసాగింపుగా కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ప్రజల భాగస్వామ్యం, క్రమం తప్పని తనిఖీలు, డిజిటల్ ఆధారాల నమోదు, నిర్ణీత గడువులో లోపాల పరిష్కారం ద్వారా జాతీయ రహదారులపై పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు, నిర్వహణ సంస్థల బాధ్యతను నిర్ధారించడమే ఈ కొత్త విధానం లక్ష్యమని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కొత్త విధానంలో భాగంగా ఎన్హెచ్ఏఐ అధికారులు కనీసం వారానికి ఒకసారి టోల్ ప్లాజాల్లోని టాయిలెట్లు, ఇతర సదుపాయాలను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు గుర్తిస్తే టోల్ ఫీజు వసూలు సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్ణీత గడువులోగా వాటిని సరిచేయాలని ఆదేశించాలి. లోపాలకు సంబంధించిన నోటీసులతోపాటు తేదీతో కూడిన ఫొటోలను ఎన్హెచ్ఏఐ డేటా లేక్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. సంబంధిత సంస్థ కూడా తన వివరణతోపాటు లోపాలను సరిచేసినట్లు నిరూపించే ఫొటోలను పోర్టల్‌లో సమర్పించాలి. క్షేత్రస్థాయి అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, నిర్దేశిత గడువులో సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలి. టోల్ ప్లాజాల నిర్వహణలో పదేపదే నిర్లక్ష్యం వహించే సంస్థలపై ఎన్హెచ్ఏఐ కఠిన చర్యలు తీసుకోనుంది. ఒక సంస్థ నిర్వహిస్తున్న మొత్తం టోల్ ప్లాజాల సంఖ్యతో పోలిస్తే, పరిష్కరించని లోపాలకు సంబంధించి జారీ చేసిన నోటీసుల సంఖ్య 10 శాతానికి చేరినా, దాటినా ఆ సంస్థను పనితీరు సరిగా లేని సంస్థగా ప్రకటిస్తారు. 15 రోజులపాటు టెండర్లో పాల్గొనకుండా నిషేధిస్తారు. -
యువతరం ఉద్యమిస్తోంది.. అధికారం దిగివస్తోంది!
సాక్షి, అమరావతి: చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో ప్రచారం.. వీధుల్లో నిరసనలు.. ఇదీ నేటి యువత పోరాట తీరు. అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వాల వైఫల్యాలపై యువత గళమెత్తుతోంది. విద్యార్థులతో మొదలైన ఆందోళనలు ప్రభుత్వాలనే కదిలిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రధానులు, అధ్యక్షులు పదవులు వదులుకోవాల్సి వస్తుండగా.. మరికొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నాయి. మనదేశంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాయి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని ఈ బొద్దింకలు ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానాష్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లోను జెన్‌జీ ఆందోళన నిర్వహిస్తోంది. ఏపీలోనూ మెగా డీఎస్సీ కుంభకోణానికి వ్యతిరేకంగా యువత తాజాగా ఉద్యమించింది.ఈ నేపథ్యంలో గేట్‌వే హౌస్ ఈ నెల 8న ప్రచురించిన ‘ది అవుట్‌కమ్స్ ఆఫ్ గ్లోబల్ యూత్ మూవ్మెంట్స్’ అధ్యయనం ఈ పరిణామాలపై ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు 39 దేశాల్లో యువత నేతృత్వంలో నిరసనలు నమోదైనట్లు వెల్లడించింది. వీటిలో 19 దేశాల్లో ప్రభుత్వాలు నిరసనకారుల డిమాండ్లకు కొంతమేర అంగీకరించడం, విధాన నిర్ణయాలను మార్చడం లేదా అధికారులు రాజీనామా చేయడం వంటి పరిణామాలు జరిగాయి. నాలుగు దేశాల్లో ఉద్యమాల ఫలితాలు ఇంకా తేలలేదు. అయితే కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్) విశ్లేషణ ప్రకారం.. యువత ఉద్యమం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగినా, ఆ తర్వాత అవినీతిని తగ్గించడం, ఆర్థికవ్యవస్థను మెరుగుపరచడం, వ్యవస్థాగత సంస్కరణలు అమలు చేయడం వంటి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో పాలనకు చరమగీతం 2024లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. అవినీతి, అధికార దుర్వినియోగంపై యువత గళమెత్తింది. నిరసనలు ఉధృతం కావడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆమె సుదీర్ఘపాలన ముగిసింది. శ్రీలంకలో అధ్యక్షుడి రాజీనామా 2022లో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇంధనం, ఆహారం, మందుల కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై యువతతో పాటు ప్రజలు ‘అరగలయ’ పేరుతో ఉద్యమించారు. నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు. నేపాల్‌లో జెన్‌జీ ప్రకంపనలు 2025లో నేపాల్‌లో సోషల్ మీడియా వేదికలపై నిషేధం, అవినీతి, రాజకీయ నాయకుల కుటుంబాల విలాసవంతమైన జీవనశైలిపై యువత నిరసనలకు దిగింది. పోలీసుల కాల్పుల్లో నిరసనకారులు మరణించడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా నిరసనలు విస్తరించడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. కెన్యాలో పన్నుల బిల్లుకు బ్రేక్ 2024లో కెన్యా ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నుల పెంపునకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. సోషల్ మీడియా ద్వారా సమీకరణ, వీధుల్లో ఆందోళనలతో ప్రభుత్వం ఒత్తిడికి గురైంది. అధ్యక్షుడు విలియం రూటో ప్రతిపాదిత ఆర్థిక బిల్లును వెనక్కి తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టారు. మరికొన్ని దేశాల్లోనూ ఇదే తీరు ఇండోనేషియా: 2025లో ఎంపీలకు అదనపు భత్యాలపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. మడగాస్కర్: నీరు, విద్యుత్ సమస్యలు, అవినీతిపై యువత ఆందోళనలు చేపట్టింది. నిరసనల అనంతరం అధ్యక్షుడు ఆండ్రి రాజోలినా అధికారాన్ని కోల్పోయారు. ఫిలిప్పీన్స్, పెరూ: 2025లో పెద్ద ఎత్తున నిరసనల నేపథ్యంలో ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు రాజీనామా చేసినట్లు సీఎఫ్ఆర్ విశ్లేషణ పేర్కొంది. తైమూర్–లెస్టే: పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు, మాజీ ప్రజాప్రతినిధులకు జీవితకాల పెన్షన్లపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం ఆ ప్రయోజనాలను రద్దు చేసింది. యూనిసెఫ్ అధ్యయనంలో కీలక అంశాలు యూనిసెఫ్ ఇన్నోసెంటీ కార్యాలయం 2024 మార్చిలో ప్రచురించిన యూత్, ప్రొటెస్ట్స్ అండ్ ది పాలీక్రైసిస్ నివేదిక యువత నిరసనల వెనుక ఉన్న కారణాలు, వాటి ప్రభావాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం.. » యువత సంప్రదాయ రాజకీయ మార్గాల కంటే నిరసనలు, ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతోంది. » రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలు యువతను ఉద్యమాల వైపు నడిపిస్తున్నాయి. » డిజిటల్ వేదికలు నిరసనకారులను సమీకరించడంలో, సమాచారాన్ని వేగంగా వ్యాప్తిచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. » యువత భాగస్వామ్యంతో జరిగే ఉద్యమాలు ఎక్కువమందిని కలుపుకొని సాగడం, వినూత్న పద్ధతులను ఉపయోగించడం వల్ల ప్రభావవంతంగా మారే అవకాశముంది. » ఉద్యమం విజయవంతమైనా యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు వంటి ప్రయోజనాలు అందుతాయని హామీలేదని నివేదిక హెచ్చరించింది. సోషల్ మీడియా నుంచి వీధి పోరాటం వరకు ప్రస్తుత యువత ఉద్యమాల్లో సోషల్ మీడియా కీలక సాధనంగా మారిందని గేట్‌వే హౌస్ అధ్యయనం పేర్కొంది. వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక వేదికల ద్వారా ప్రచారం, సమీకరణ సాగుతున్నాయని వివరించింది. అనేక ఉద్యమాలకు ఒకే నాయకత్వం ఉండకపోవడం, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా సమీకృతం కావడం మరో ప్రత్యేకతగా గుర్తించింది. అయితే అన్ని ఉద్యమాలు ఒకే విధమైన ఫలితాలను సాధించలేదు. కొన్ని ప్రభుత్వాలను మార్చగా.. మరికొన్ని విధానాల ఉపసంహరణతోనే ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో నిరసనకారుల డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్ల సోషల్ మీడియా ప్రచారంతో పాటు విస్తృత ప్రజామద్దతు, స్పష్టమైన డిమాండ్లు, ప్రజాస్వామ్యసంస్థల సహకారం కూడా కీలకమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. -
మరో న్యాయమూర్తికి బాబు బహుమానం!
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేసులకు సంబంధించి అనుకూల తీర్పునిచ్చిన అప్పటి న్యాయమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక పదవి కట్టబెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆయన ఎంపిక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత జస్టిస్ సత్యనారాయణమూర్తి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. హెచ్ఆర్సీ చైర్మన్ పోస్టు భర్తీ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపిక కమిటీ సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపికపై చర్చించారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తిని చైర్మన్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన వారికి వారి పదవీ విరమణ అనంతరం చంద్రబాబు కీలక పదవులు కట్టబెడుతున్నారు. చేసిన సాయం ఎంత పెద్దది అన్న దాన్ని బట్టి అంత మంచి పోస్టు ఇస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించిన విషయం తెలిసిందే.బాబుకు అనుకూలం.. జగన్‌కు వ్యతిరేకం...!జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 2016 నుంచి 2022 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా అనేకంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా తెర వెనుక మంత్రాంగాలు నడిపేవారని హైకోర్టులో అందరూ చెప్పుకునేవారు. మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతతో జస్టిస్ మూర్తికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెబుతుంటారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది.బెంచ్‌పై నుంచి తన అభిప్రాయాలను పెద్దగా వ్యక్తం చేయరు. పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు. కానీ ఆయన ఇచ్చే తీర్పులు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ ఆ తీర్పుల్లో ఉంటుంది. 2022లో ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా పలు కేసుల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు, చంద్రబాబుకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో దాఖలైన వ్యాజ్యాల్లో పలు వ్యాజ్యాలను ఆయన డ్రాఫ్ట్ చేసి ఇచ్చేవారని హైకోర్టులో టీడీపీ న్యాయవాదులు బహిరంగంగా చెప్పుకునేవారు.రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న జస్టిస్ మూర్తి...మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరుపుతుండగానే, అప్పటి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటూ కొత్త చట్టం తెచ్చింది. వాస్తవానికి ఏ చట్టాలను సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారో, ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి. అయితే త్రిసభ్య ధర్మాసనం మాత్రం ఆ పని చేయలేదు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. విచారణ సమయంలో ధర్మాసనం.. చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేమని తెలిపింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న దాని జోలికి వెళ్లబోమని చెప్పింది. అయితే తుది తీర్పు విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ తీర్పునిచ్చింది. రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ధర్మాసనం తన తీర్పులో ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమైంది. నిజానికి ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనాలు తీర్పులు వెలువరించినప్పుడు ఆ తీర్పులు ఏ న్యాయమూర్తి రాశారో ఆ న్యాయమూర్తి పేరును తప్పకుండా రాస్తారు. కాని రాజధాని తీర్పును ముగ్గురు న్యాయమూర్తుల్లో ఎవరు రాశారన్నది అధికారికంగా తెలియదు. అయితే ఆ తీర్పును జస్టిస్ సత్యనారాయణమూర్తే రాశారని అప్పట్లో హైకోర్టులో అందరూ చెప్పుకున్నారు.ఎవరెంత మేలు చేశారన్నదే ప్రామాణికం.. ఆ మేరకే జస్టిస్ మూర్తికి పోస్టు...రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి 2024 మార్చి 24 నుంచి ఖాళీగా ఉంది. ఈ పోస్టును భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్లుగా చర్యలు తీసుకోలేదు. తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు హెచ్ఆర్సీ చైర్మన్ పోస్టు భర్తీని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పోస్టును తనకు సహాయం చేసిన పలువురు విశ్రాంత న్యాయమూర్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తీవ్రమైన పోటీ ఉండటం, ఆ విశ్రాంత న్యాయమూర్తులందరూ తనకు ఏదో ఒక రకంగా సాయం చేసి ఉండటంతో ఎవరికి పదవి కట్టబెట్టాలో బాబు తేల్చుకోలేకపోయారు. దీంతో సుదీర్ఘ కాలంగా ఆ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ పోస్టుల భర్తీ గురించి ఎప్పుడు ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. చివరకు రాజధాని కేసుల్లో కావాల్సిన విధంగా తీర్పునిచ్చిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్ఆర్సీ పోస్టును కట్టబెట్టాలని చంద్రబాబు కొంత కాలం క్రితం నిర్ణయించారు. అయితే ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు న్యాయమూర్తులు కూడా ఈ పోస్టును ఆశించారు. వారందరికీ సర్ధి చెప్పుకునే క్రమంలో పోస్టు భర్తీ కొంత ఆలస్యమైంది. చివరకు చంద్రబాబు తనకు మేలు చేసిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్ఆర్సీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. -
పీఠాలపై పేచీ!
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. సీట్ల లెక్కలు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సోమవారం సమావేశమైనా ఎలాంటి స్పష్టత రాలేదు. కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ డుమ్మా కొట్టడం గమనార్హం. పొత్తు చర్చలు తాము ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడమే పవన్ గైర్హాజరుకు కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.మేయర్, చైర్మన్ పీఠాలపై పేచీమునిసిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కోరుతున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఆ పార్టీ కోరుతున్న స్థానాలకు టీడీపీ ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పొత్తు చర్చలు కొలిక్కి రాకముందే రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని జనసేన నేతలు నిలదీస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమంటూనే తమను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ పెత్తనం చెలాయిస్తోందన్న అసంతృప్తి జనసేన శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.భేటీ తర్వాత ఎవరి దారి వారిదేసమావేశం ముగిసిన తర్వాత కూటమి పార్టీ నేతలు ఎవరి దారి వారు పట్టడం చర్చనీయాంశమైంది. జనసేన, బీజేపీ నేతలు నేరుగా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో విడిగా సమావేశమై మంతనాలు జరిపారు. సమావేశంలో ఏం జరిగిందన్న దానిపై మూడు పార్టీల నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో పొత్తు చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.నెల్లూరు మేయర్ మాదేనంటూ హడావుడిచర్చలు ఇంకా తేలకముందే నెల్లూరు మేయర్ పీఠం బీజేపీకి ఖరారైందంటూ బీజేపీ నేతలు హడావుడి చేయడం గమనార్హం. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం వహించింది. టీడీపీ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. సీట్ల పంపకమే తేలకుండా ఒక్కో పార్టీ ఒక్కో ప్రకటన చేయడం కూటమిలో సమన్వయ లోపానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నేడు మళ్లీ భేటీప్రతిష్టంభన నేపథ్యంలో మంగళవారం మరోసారి సమావేశం కావాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి పవన్‌కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. అయితే మేయర్, చైర్మన్ పీఠాలపై టీడీపీ పట్టు వీడకుంటే ఈ భేటీ కూడా ఫలితం లేకుండానే ముగిసే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. -
టీడీపీ వర్సెస్ జనసేన
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట వెన్నుపోటు పార్టీ కూటమిలో పెద్ద చిచ్చు రగిలింది. ఆదివారం పోలవరం జిల్లా కాకవాడలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో దాడి చేయగా.. ‘కూటమి ప్రభుత్వం మీ అయ్య జాగీరా’ అంటూ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు ఊడిగం చేస్తున్నా ఇంతలా మాటలంటారా అంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాభిమానం దెబ్బతినేలా మాటలంటున్నా ఇంకా కొనసాగాలా.. ఇదే కరెక్ట్ టైమ్ మనం బైటకు రావడానికి అని జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.ప్రతి సారీ మనం ఎందుకు తగ్గాలి? రాజకీయంగా మనం కూడా ఎదగాలి కదా.. కాదూ కూడదంటే పొత్తుకు నమస్కారం పెట్టి ప్రతి చోటా అభ్యర్థులు ఉన్నారు.. పోటీ చేసి చూపిస్తారు.. అని రవితేజ పవనిజం పేరుతో ఓ జనసైనికుడు పోస్టు పెట్టాడు. ‘చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా ఎవరూ రోడ్డుపైకి రాకపోతే, అప్పుడు జన సైనికులు, వీర మహిళలు రోడ్లపైకి వచ్చారు’ అంటూ పవన్ కాకవాడ సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోయాయి. వాటిని జనసైనికులు తీవ్రస్థాయిలో కౌంటర్ చేస్తున్నారు. టీడీపీని ఉద్ధరించినట్టు మాట్లాడితే ఊరుకోం.. ‘‘వాళ్ల పార్టీకి సీట్లు కేటాయిస్తే అభ్యర్ధిని కూడా మనమే (టీడీపీ) సప్లయ్ చేయాల్సి వచ్చింది. వాళ్ల కార్యకర్తలకు తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. మనల్నే అడుక్కున్నారు. వీళ్లు వచ్చేశారంట టీడీపీని కాపాడడానికి..’’ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ‘‘కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే, అది కుక్క బుద్ధి మాత్రమే చూపిస్తుంది. కుక్క నిజ స్వరూపం ఈ రోజు చూపించింది’’ అంటూ పరోక్షంగా పవన్‌పై ఓ కార్యకర్త చంద్రబాబు వీడియోను జత చేసి పోస్టు చేశారు. ‘‘పొత్తు పేరుతో మీరు నెత్తిన పెట్టుకుంటే పెట్టుకోండి కానీ తెలుగుదేశం కార్యకర్తల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఆ సన్నాసులు టీడీపీని ఉద్దరించినట్లు మాట్లాడితే ఊరుకునే చేతకాని దద్దమ్మలం కాదు మేం.. ఆ కులసేన అధినేతను కాస్త నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడమని చెప్పండి..’’ అని మరో టీడీపీ కార్యకర్త ఘాటు పోస్టు పెట్టాడు. ‘‘ సొంతంగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవలేక, సొంత కార్యకర్తల వల్లే రెండు చోట్ల ఓడిపోయా అని పిల్ల సైనిక్లను తిట్టిపోసిన ఆయన మాటకు విలువ ఉందా’’.. ఇదీ మరో కార్యకర్త ప్రశ్న.‘‘మీ నాయకులు మీ సైనికులు మీ వీర మహిళలు మీ వెనకే నిలబడలేదు. మా లీడర్ కోసం రోడ్డు ఎక్కారా పవన్ కళ్యాణ్‌గారూ’’ అని మరో కార్యకర్త నిలదీశాడు. ‘‘ఒక్క కేబినెట్ మీటింగ్‌కి రారు.. వీరు త్యాగాలు చేసేశారా... గోదావరి జిల్లాలు దాటితే పావలాకి పనికిరాడు వీరు త్యాగాలు చేశాడా.. ఒకర్ని అడుక్కునే స్టేజ్‌లో ఉన్న మీరు త్యాగాలు చేశారా..?’’ మరో టీడీపీ కార్యకర్త ప్రశ్న ఇది.పొత్తుపెట్టుకుని జనసేన గెలిచిందంటే ఊరుకోం టీడీపీ కార్యకర్తల పోస్టులపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. నేరుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర నాటక అకాడమీ సభ్యురాలు శివపార్వతి రంగంలోకి దిగారు. ‘ఎక్స్’లో వరుస పోస్టులతో టీడీపీపై విరుచుకుపడ్డారు. ‘కూటమి ప్రభుత్వం నీ అయ్యా జాగీరా? అన్ని పార్టీల భాగస్వామ్యంతో వచ్చిందది. ఎవడురా నన్ను మాట్లాడొద్దు అనేది.. మీ తొక్కలో రూల్స్ మడిచి పెట్టుకోండి’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మా పార్టీ నాయకుడిని కానీ, మా పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్లు వాగితే మామూలుగా ఉండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పవన్‌ను చూసి నవ్విన వాళ్ళే ఆయన సపోర్ట్ కోసం దేబిరించారు తప్ప ఆయన ఎవరినీ నాకు ఇది చేయండి అని అడగలేదన్నారు. ‘2014లో సపోర్ట్ చేస్తే అధికారం రాగానే పవన్ కళ్యాణ్ ఎవరు అని అన్నారు. అలా అన్నవాళ్లే 2019లో 23కే పరిమితమయ్యారు. లక్షల మంది కేడర్ పెట్టుకుని సంపాదించిన సీట్లు 23 జస్ట్ మాకన్నా 2 ఎక్కువ అంతే’ అని పేర్కొన్నారు. వెంట వెంటనే గెలిచిన చరిత్ర కూడా ఎక్కడా లేదు అని వ్యాఖ్యానించారు. జనసేనకి బలం లేదని, రెండు చోట్ల ఓడిపోయారని, పొత్తు పెట్టుకుని గెలిచారని అంటే ఊరుకొనేది లేదని జనసేన శ్రేణులు టీడీపీని హెచ్చరించాయి. పరోక్షంగా లోకేశ్ పైనా విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. ‘టీడీపీ వాళ్లు చేసే అతికి జనసేన వాళ్ళు ఎవరైనా గట్టిగా స్పందిస్తే కేసులు పెట్టించి, వాళ్ళ మీద కోవర్ట్ ముద్ర వేస్తున్నారు. పైకి కూటమి స్ఫూర్తి, పొత్తు ధర్మం అని కథలు చెప్తారు’ అంటూ పేర్కొన్నారు. -
ఒంటరి వృద్ధులకు ఊరట
సాక్షి, అమరావతి: పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుంటే..తల్లిదండ్రులు మాత్రం భారత్‌లోని స్వస్థలాల్లోనే మిగిలిపోతున్నారు. పెద్ద ఇళ్లల్లో ఇద్దరే ఉంటున్న వృద్ధ దంపతులు,అత్యవసర సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లేవారు లేక ఇబ్బంది పడుతున్న వారు, రోజువారీ పనులకు సాయం అవసరమవుతున్న వారు పెరుగుతున్నారు. దీంతో సంప్రదాయ వృద్ధాశ్రమాలకు తోడు ‘సీనియర్ లివింగ్ కమ్యూనిటీలు’ కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ఇప్పుడు సామాజిక మార్పుతో పాటు కొత్త రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్ రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ సంస్థ ‘కొలియర్స్’ అంచనా.రూ.13 వేల కోట్ల పెట్టుబడులు 2025 నుంచి ఇప్పటివరకు సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల కోసం డెవలపర్లు, ఆపరేటర్లు, పెట్టుబడిదారులు రూ.13 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే మూడునాలుగేళ్లలో 75 వేల కొత్త యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు ఆరోగ్య సేవల సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు.ప్రధాన నగరాల్లో విస్తరణ ప్రస్తుతం టైర్–1 నగరాల్లో ఎక్కువగా ఉన్న ఈ రంగం ఇప్పుడు చిన్న నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వైపు విస్తరిస్తోంది. కొత్త ప్రాజెక్టుల్లో 30–40 శాతం టైర్–2, టైర్–3 నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రావచ్చని కొలియర్స్ అంచనా వేసింది. తిరుపతి, అయోధ్య, విశాఖ వంటి కేంద్రాలను సీనియర్ హౌసింగ్‌కు అనుకూల ప్రాంతాలుగా పేర్కొంది. హైదరాబాద్ వంటి నగరాలపై విదేశాల్లోని భారతీయుల ఆసక్తి కూడా పెరుగుతోంది.వృద్ధాశ్రమం నుంచి అపార్ట్మెంట్ వరకు.. కొత్తగా వస్తోన్న సీనియర్ లివింగ్ ప్రాజెక్టులు సాధారణ వృద్ధాశ్రమాలకు భిన్నంగా ఉంటున్నాయి. 1, 2, 3 బీహెచ్‌కేలు, విల్లాలు, కమ్యూనిటీ హాళ్లు, భోజనం, హౌస్‌కీపింగ్, ఫిట్నెస్, వైద్య సేవలు, అత్యవసర స్పందన, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు అందిస్తున్నారు. స్వతంత్రంగా జీవించగలిగేవారికి ‘ఇండిపెండెంట్ లివింగ్’, అదనపు వైద్యం లేదా రోజువారీ సహాయం అవసరమైన వారికి ‘అసిస్టెడ్ లివింగ్’ విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.భారత్‌లో 22 లక్షల యూనిట్ల అవసరంకొలియర్స్ 2026 నివేదిక ప్రకారం..దేశంలో ప్రస్తుతం సీనియర్ హౌసింగ్‌కు 20–22 లక్షల యూనిట్ల డిమాండ్ ఉంది. కానీ ఆర్గనైజ్డ్ సీనియర్ లివింగ్ రంగంలో అందుబాటులో ఉన్నవి 25 వేల యూనిట్లే. అంటే డిమాండ్‌లో కేవలం 1.3% మేరే వ్యవస్థీకృత సీనియర్ లివింగ్ సౌకర్యాలున్నాయి. 2030 నాటికి సీనియర్ హౌసింగ్ అవసరం 30 లక్షల యూనిట్లకు చేరుతుందని కొలియర్స్ అంచనా. అప్పటికి ఆర్గనైజ్డ్ సప్లై లక్ష యూనిట్లకు పెరగొచ్చని చెబుతోంది. తల్లిదండ్రుల భద్రత, వైద్యం, సామాజిక జీవనం కోసం సీనియర్ లివింగ్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని కొలియర్స్ నివేదిక పేర్కొంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడటం, ఉమ్మడి కుటుంబాల తగ్గుదల, ఆయుర్దాయం పెరగడం, వృద్ధుల సంఖ్య పెరగడం.. ఇవన్నీ కలిసి ‘‘సీనియర్ లివింగ్ కమ్యూనిటీ’’లకు డిమాండ్ పెంచుతున్నాయి. ఒకప్పుడు సేవా సంస్థలుగా ఉన్న వృద్ధాశ్రమాల స్థానంలో ఇప్పుడు వైద్యం, భద్రత, భోజనం, వినోదం, నివాసం అన్నీ కలిపిన కమ్యూనిటీలు వస్తున్నాయి. -
ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలు
సాక్షి, అమరావతి: పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ, మరికొందరికి అదనపు బాధ్య తలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సౌరభ్‌గౌర్, డి. మురళీధర్‌రెడ్డి, ఆమ్రపాలి, బాలాజీ దిగంబర్, నీలకంఠరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, తేజ్ భరత్, శ్రీనుకుమార్, వరప్రసాద్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. -
నేడు దుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు సీఎం విజయ్
సాక్షి, అమరావతి: తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విజయ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అవుతారు. రాత్రి ఏడు గంటలకు పున్నమి ఘాట్‌కు చేరుకుని విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొంటారు. 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై తిరుగుపయనమవుతారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో మంగళవారం అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
మున్సిపోల్స్‌కు రె'ఢీ'
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు రొటేషన్ పద్ధతిలో మేయర్లు, మున్సిపల్, నగర పంచాయతీల ఛైర్పర్సన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మేయర్లు, మున్సిపల్, నగర పంచాయతీల ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. అయితే తొలి విడతలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మిగిలిన వాటికి త్వరలో వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 120 వార్డులతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది కాగా.. రెండో స్థానంలో 86 వార్డులతో విజయవాడ కార్పొరేషన్ ఉంది. 60 వార్డుల చొప్పున చిన్న కార్పొరేషన్లుగా మచిలీపట్నం, చిత్తూరు ఉన్నాయి.కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లు ఇలా...ఎస్టీ జనరల్ 1: మంగళగిరి –తాడేపల్లి ఎస్సీ మహిళ 1: కర్నూలు ఎస్సీ జనరల్ 1: రాజమహేంద్రవరం బీసీ మహిళ 2: కాకినాడ, మచిలీపట్నం బీసీ జనరల్ 3: ఏలూరు, అనంతపురం, చిత్తూరు జనరల్ మహిళ 5: గ్రేటర్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప అన్ రిజర్వ్డ్ 4: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు కార్పొరేషన్లలో వార్డుల రిజర్వేషన్లు 1.విజయనగరం: మొత్తం వార్డులు 62 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–4, ఎస్సీ మహిళ–3, బీసీ జనరల్–12, బీసీ మహిళ–11, జనరల్ మహిళ–17, అన్రిజర్వ్డ్–14 2. గ్రేటర్ విశాఖపట్నం: మొత్తం వార్డులు 120 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్–25, బీసీ మహిళ–24, జనరల్ మహిళ–31, అన్ రిజర్వ్డ్–29 3. ఏలూరు: మొత్తం వార్డులు 62 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–4, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్–11, బీసీ మహిళ–11, జనరల్ మహిళ–16, అన్రిజర్వ్డ్–11 4 . మచిలీపట్నం: మొత్తం వార్డులు 60 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–3, ఎస్సీ మహిళ–2, బీసీ జనరల్–12, బీసీ మహిళ–12, జనరల్ మహిళ–16, అన్రిజర్వ్డ్–14 5. విజయవాడ: మొత్తం వార్డులు 86 ఎస్టీ జనరల్–1, ఎస్టీ మహిళ–1, ఎస్టీ జనరల్–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్–16, బీసీ మహిళ–15, జనరల్ మహిళ–22, అన్రిజర్వ్డ్–216. గుంటూరు: మొత్తం వార్డులు 76 ఎస్టీ జనరల్–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్–5, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్–14, బీసీ మహిళ–11, జనరల్ మహిళ–20, అన్రిజర్వ్డ్–18 7. ఒంగోలు: మొత్తం వార్డులు 62 ఎస్టీ జనరల్–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్–6, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్–9, బీసీ మహిళ–9, జనరల్ మహిళ–16, అన్రిజర్వ్డ్–15 8. నెల్లూరు: మొత్తం వార్డులు 72 ఎస్టీ జనరల్–2, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్–12, బీసీ మహిళ–11, జనరల్ మహిళ–19, అన్రిజర్వ్డ్–17 9. కర్నూలు: మొత్తం వార్డులు 68 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–6, ఎస్సీ మహిళ–6, బీసీ జనరల్–11, బీసీ మహిళ–10, జనరల్ మహిళ–18, అన్రిజర్వ్డ్–16 10. కడప: మొత్తం వార్డులు 66 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–4, ఎస్సీ మహిళ–4, బీసీ జనరల్–12, బీసీ మహిళ–12, జనరల్ మహిళ–17, అన్రిజర్వ్డ్–16 11 . అనంతపురం: మొత్తం వార్డులు 62 ఎస్టీ జనరల్–1, ఎస్టీ మహిళ–1, ఎస్సీ జనరల్–2, ఎస్సీ మహిళ–2, బీసీ జనరల్–13, బీసీ మహిళ–12, జనరల్ మహిళ–16, అన్రిజర్వ్డ్–15 12. చిత్తూరు: మొత్తం వార్డులు 60 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–5, ఎస్సీ మహిళ–5, బీసీ జనరల్–10, బీసీ మహిళ–9, జనరల్ మహిళ–16, అన్రిజర్వ్డ్–14 13. తిరుపతి: మొత్తం వార్డులు 66 ఎస్టీ జనరల్–1, ఎస్సీ జనరల్–4, ఎస్సీ మహిళ–3, బీసీ జనరల్–13, బీసీ మహిళ–12, జనరల్ మహిళ–18, అన్రిజర్వ్డ్–15 మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు.. ఎస్టీ జనరల్–02, ఎస్టీ మహిళ–01, ఎస్సీ జనరల్–07, ఎస్సీ మహిళ–07, బీసీ జనరల్–18, బీసీ మహిళ–18, జనరల్ మహిళ – 27, అన్రిజర్వ్డ్ –26 కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఎస్టీ మహిళ: గూడూరు ఎస్టీ జనరల్: అలూరు, ఆత్మకూరు ఎస్సీ మహిళ: చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గుత్తి, చీరాల ఎస్సీ జనరల్: ఉయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పొదిలి, బాపట్ల బీసీ మహిళ: ఆళ్లగడ్డ, సాలూరు, ఇచ్ఛాపురం, నర్సీపట్నం, ఎర్రగుంట్ల, జంగారెడ్డి గూడెం, పాలకొండ, తుని, పాలకొల్లు, కదిరి, పుంగనూరు, రాజంపేట, గుడివాడ, రాజాం, గుంతకల్లు, గూడూరు, నందికొట్కూరు, ముమ్మిడివరం బీసీ జనరల్: పిడుగురాళ్ల, పుత్తూరు, బేతంచెర్ల, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, మదనపల్లె, తాడిపర్తి, తిరువూరు, నంద్యాల, హిందూపురం, మడకశిర, నెల్లిమర్ల, పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, తాడిగడప, బి.కొత్తకోట జనరల్ మహిళ: కనిగిరి, కమలాపురం, కొవ్వూరు, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆత్మకూరు, నర్సాపూర్, పలాస–కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పొన్నూరు, భీమవరం, చిలకలూరిపేట, జగ్గయ్యపేట, ఆమదాలవలస, మాచర్ల, ఆదోని, నాయుడుపేట, డోన్, బొబ్బిలి, రేపల్లె, పార్వతీపురం, పులివెందుల అన్రిజర్వ్డ్: తణుకు, తెనాలి, గురజాల, తాడేపల్లిగూడెం, అమ లాపురం, ఎమ్మిగనూరు, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, కందుకూరు, మండపేట, దాచేపల్లి, నగిరి, చీమకుర్తి, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, గొల్లప్రోలు, అద్దంకి, పెద్దాపురం, ధర్మవరం, బద్వేల్, దర్శి, మార్కాపురం, మైదుకూరు, నర్సారావుపేట. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి?
సాక్షి, అమరావతి: వాన పడితే జలాశయాల్లా మారే రోడ్లు.. గుంతల రోడ్లు.. వీధి చివర కొండలా చెత్త.. దోమలు, జ్వరాలు.. గుక్కెడు తాగునీరు ఇవ్వలేని దుస్థితి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే కుక్కల బెడద.. పద్మవ్యూహంలా ట్రాఫిక్.. ఏ పట్టణానికి వెళ్లినా జనం నోట ఇదే మాట. ఈ పరిస్థితుల్లో వార్డుల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలని కూటమి పార్టీల శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. చంద్రబాబు రెండేళ్ల పాలనలో నగరాలు, పట్టణాలను గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల కోసం జనం వద్దకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా ఏమీ చేయలేకపోయామని, ఓట్లు ఎలా అడగాలని వాపోతున్నాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాల్టీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు జనం వద్దకు వెళ్లాలంటేనే వణుకుతున్నాయి. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని జనం పట్టించుకోలేదని, ఇప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు. సీఎం సొంత ఇలాకాలోనే దాహం కేకలు పట్టణాల దుస్థితికి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పమే నిలువెత్తు సాక్ష్యం. సొంత నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ఆయన పరిష్కరించలేకపోయారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసి మొత్తం సమస్య తీరిపోయిందని చెప్పుకుంటున్నారు. కానీ జనం మాత్రం సరిపడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర పట్టణాల పరిస్థితి మరీ దారుణం. కర్నూలు నగరానికి నీరందించే గాజులదిన్నె ప్రాజెక్టులో 1.5 టీఎంసీలే మిగిలాయి. వానలు పడకపోతే నగరం గొంతెండటం ఖాయం. పాలకొండ నగర పంచాయతీలో కుళాయి తిప్పితే మొదటి ఐదు నిమిషాలు బురద నీరే. మంచినీటి కోసం కుళాయిల దగ్గర సిగపట్లు పట్టాల్సిన దుస్థితి. గత్యంతరం లేక పేదలు సైతం 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 చెల్లిస్తున్నారు. రక్షిత నీరు అందించాల్సిన మున్సిపాల్టీలు చేతులెత్తేయడంతో నీళ్లు కొనుక్కోవడం పట్టణ పేదలకు అదనపు భారంగా మారింది. మురుగులో పట్టణాలు వర్షాకాలానికి ముందే డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయాలి. ఈ పనిని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చేయలేదు. ఫలితంగా చిన్న వానకే కాలువలు పొంగుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపైకి, లోతట్టు కాలనీల్లో నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. శివారు కాలనీల్లో అసలు డ్రైనేజీలే లేవు. మురుగు గుంతల్లో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేక పట్టణాల మురుగంతా నేరుగా చెరువులు, నదుల్లోకి వెళ్తోంది. వ్యర్థ జలాలతో చుట్టుపక్కల చెరువులన్నీ కలుషితమవుతున్నాయి. అదే నీరు తాగునీటి పథకాలు, బోర్లలోకి ఉబికి వస్తోంది. ఆ చెరువుల్లో పెరిగిన చేపలు తిని జనం అనారోగ్యం పాలవుతున్నారు. వాన పడితే చెరువులే వర్షపు నీరు పోయే దారిలేక ప్రధాన రహదారులే చెరువులవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నడిబొడ్డులోని మొగల్రాజపురం, ఆటోనగర్ సహా అనేక ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రోడ్డు చెరువును తలపించింది. రోడ్లపై డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లోనే వాన వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. అయినా రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. పడకేసిన పారిశుద్ధ్యం.. విజృంభిస్తున్న జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో పారిశుథ్యం అధ్వాన్నంగా మారిపోయింది. ఇంటింటి చెత్త సేకరణ పేరుకే మిగిలింది. వీధి చివర్లలో రోజుల తరబడి చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. తరలించే దారిలేక సిబ్బందే కుప్పలకు నిప్పు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ పొగతో చుట్టుపక్కల వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు పట్టణాల్లో వీధికుక్కలు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిలిచిన మురుగు, పేరుకుపోయిన చెత్త ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటివల్ల దోమలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి రాష్ట్రంలో మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కు చేరాయి. జూన్ నాటికే మలేరియాతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. డెంగీ కేసులు సైతం పెరిగాయి. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, ఎన్టీఆర్; కాకినాడ జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఫాగింగ్, దోమల నివారణ చర్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జ్వరాల బారిన పడిన పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. గుంతల రోడ్లు.. గంటల ట్రాఫిక్ పట్టణాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. వేసిన రోడ్లకూ నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హడావుడిగా అరకొరగా వేసిన రోడ్లు, చేసిన మరమ్మతులు అనేక చోట్ల వర్షాలకు కొట్టుకుపోయాయి. నాణ్యత లేకపోవడంతో ఆ రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. కొద్ది దూరం ప్రయాణానికే గంటల సమయం పడుతోంది. బిల్లుల్లేక ఆగిన పనులు పట్టణాల్లో అరకొరగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే పది నెలలుగా రూ.350 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, మెటీరియల్ ఖర్చులు భరించలేక కాంట్రాక్టర్లు ఆగస్టులో అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారు. మరోవైపు పనులు చేయకుండానే బిల్లులు దండుకున్న ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. ఏలూరు నగరపాలక సంస్థలో ఓ ఏజెన్సీకి రూ.5.36 కోట్లు, ఓ కాంట్రాక్టర్ పేరుతో రూ.2.67 కోట్ల బిల్లులు చెల్లించారు. పార్కులో జిమ్ పరికరాల మరమ్మతుల పేరుతోనే రూ.4.92 లక్షలు డ్రా చేశారు. అధికార పార్టీ నేతలు, వారి బినామీ కాంట్రాక్టర్ల కోసమే నిబంధనలు తుంగలో తొక్కి ఈ పనుల పందేరం సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన పనులకు డబ్బుల్లేవు, జరగని పనులకు బిల్లులు మాత్రం అందుతున్నాయి.ఎన్నికల ముందు శిలాఫలకాల హడావుడి రెండేళ్లకు పైగా పట్టణాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుకు స్థానిక ఎన్నికలు దగ్గర పడగానే అభివృద్ధి గుర్తొచ్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.7,469 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల పనులకు ఆగస్టులో హడావుడిగా పరిపాలనా అనుమతులు ఇచ్చి జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం ఈ పనులను ఎప్పటికి పూర్తి చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఇవన్నీ ఓట్ల కోసం వేసిన శిలాఫలకాలేనని పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వార్డుల్లోకి వెళ్లాలంటేనే వణుకు ఈ పరిస్థితుల్లో ఎన్నికలంటేనే టీడీపీ స్థానిక నేతలు బెంబేలెత్తుతున్నారు. వార్డుల్లోకి వెళ్తే పొంగుతున్న డ్రైనేజీలు, అందని తాగునీరు, గుంతల రోడ్లపై ప్రజలు నిలదీయడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. రెండున్నరేళ్లలో పట్టణాలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదని ఆ పార్టీ శ్రేణులే అంతర్గతంగా వాపోతున్నాయి. శిలాఫలకాలతో ఓట్లు రాలవని, కనీస వసతులు కల్పించలేని పాలనకు పట్టణ ఓటరు తగిన తీర్పు ఇవ్వనున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి,కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నగరపాలక సంస్థల (కార్పొరేషన్లు) మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 17 నగరపాలక సంస్థలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి మేయర్ రిజర్వేషన్ల కేటగిరీల వారీగా వివరాలు:బీసీలకు: 5 స్థానాలుఎస్సీలకు: 2 స్థానాలుఎస్టీకి: 1 స్థానంజనరల్ మహిళా: 5 స్థానాలుఅన్రిజర్వ్డ్ (ఓపెన్): 4 స్థానాలుకార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు:ఎస్టీ: మంగళగిరి - తాడేపల్లిఎస్సీ: రాజమండ్రి, కర్నూలుబీసీ మహిళ: మచిలీపట్నం, కాకినాడబీసీ (జనరల్/మహిళ): ఏలూరు, అనంతపురం, చిత్తూరుజనరల్ మహిళ: విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నంఅన్రిజర్వ్డ్: తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుఇదీ చదవండి : ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు -
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి సంబంధించిన విషయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందించారని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అలాగే రైతన్నలకు అండగా నిలిచారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందినప్పటికీ, ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి చవిచూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అన్ని సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏపీలో అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్నికల సంఘం పాత్రపై చర్చగత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం వ్యవహారశైలేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలైనప్పటికీ, ఎన్నికల సరళి, ఫలితాల మధ్య పొంతన లేకపోవడం వెనుక వ్యవస్థల ప్రభావం ఉందనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చేశారు. -
తొలి రోజే ఫ్లాప్ షో
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని దుర్గ గుడిలో దసరా ఉత్సవాల నిర్వహణలో తొలి రోజే రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మైసూర్ తర్వాత ఇక్కడే అత్యంత అద్భుతంగా చేస్తున్నామంటూ నెల రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. రాష్ట్రపతి, 11 మంది ముఖ్యమంత్రులు, పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఎంత మంది వీఐపీలు వచ్చినా, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని చెప్పారు. అయితే తీరా.. పదే పదే విజనరీగా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఇంటికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను నిర్వహించడంలో తొలి రోజే విఫలమయ్యారు.భక్తులకు అవససరమైన ఏర్పాట్లు చేయడంలో దుర్గగుడి అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు చేతులెత్తేశారు. ఉత్సవాలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే భక్తులకు క్యూలైన్లోనే అధికారులు చుక్కలు చూపించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి, ఎండకు తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి రోజు ఆదివారం కావడం, ఈ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఊదరగొట్టడంతో భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. వారికి దర్శనం అయ్యే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటింది. అంతే ఏకంగా 10 గంటలు పట్టింది. తర్వాత కూడా సరైన నిర్వహణ లేకపోవడంతో అమ్మవారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటలు పట్టిందంటే నిర్వహణ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ‘ఉదయం ఐదు గంటల నుంచి క్యూలో ఉన్నాం. ఇప్పుడు 10 గంటలైంది. ఇంకా కొండ దగ్గరకు రాలేదు. మంచి నీళ్లు లేవు.. బయటకు వెళ్లటానికి వీలు లేదు.. టాబ్లెట్ వేసుకోవాలన్నా అవకాశం లేదు.. ఇలాగైతే ఎలా.. మా లాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?’ అంటూ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది వస్తారని పదేపదే ప్రకటనలు గుప్పించిన అధికారులు.. తొలి రోజే అనేక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తొలి రోజు ఎంత మంది భక్తులు వస్తారు.. సెలవు రోజైతే పరిస్థితి ఏమిటి.. అనే అంశాలపై ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోక పోవటంతో మొదటి రోజు భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.టీడీపీ ఎంపీని నిలదీసిన భక్తులుదసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని భక్తులు నిలదీశారు. ఇవేం ఏర్పాట్లయ్యా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పినా ఎవరూ క్యూలైన్లలో ఉన్న భక్తుల విషయం పట్టించుకోలేదు. కేవలం వీఐపీల సేవలో తరించడానికే తమ శక్తియుక్తులను ధారపోశారు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఎక్కడైనా సమస్య ఉందని సమాచారం అందిస్తే యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం నుంచి క్యూఆర్ కోడ్, ఐవీఆర్‌ఎస్‌కు భక్తుల నుంచి సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయినా తూతూ మంత్రంగా తాత్కాలిక చర్యలు తీసుకున్నారే తప్ప చిత్తశుద్ధి కనిపించ లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరుగా వీఐపీ దర్శనాలుఈ ఏడాది ఉత్సవాల్లో ఎటువంటి వీఐపీ దర్శనాలు ఉండవని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు చెప్పినా, అమలు మాత్రం మరిచారు. ఉదయం దర్శనం ప్రారంభమైనప్పటి నుంచే ప్రముఖులు, రాజకీయ నాయకులకు తోడు పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన వారు క్యూ కట్టారు. కొండపైకి పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతించేలా పాసులను జారీ చేశామని చెబుతున్న దేవస్థానం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇందుకు ఆదివారం కొండపై ఉన్న వాహనాలే నిదర్శనం. మొత్తంగా ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా పోయింది.మీడియా ప్రతినిధుల ధర్నావన్టౌన్/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాత్రికేయులను దూరంగా ఉంచి ఇన్‌ఫ్లుయెన్సర్లకే ఎక్కువ పాస్‌లు ఇవ్వడాన్ని నిరసిస్తూ పత్రికల ప్రతినిధులు ఆదివారం ధర్నా చేశారు. పెద్ద మీడియా సంస్థలకు అరకొరగా పాస్‌లు జారీచేసిన అధికారులు చిన్నపత్రికలు, లోకల్ చానళ్లు, సీనియర్ జర్నలిస్టులు తదితరులకు పాస్‌లు నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు వారి వద్దకు వచ్చి పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రచారం చేసే బాధ్యతను వందమందికిపైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అప్పగించినట్లు తెలిసింది.సర్కారు తప్పిదానికి సీఎఫ్ఓ మూల్యంవన్టౌన్ (విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించడంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి రోజే విఫలమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సర్కారు.. తన తప్పిదాన్ని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్పైకి నెట్టేసింది. ఈ క్రమంలో ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథ్‌ను నియమించింది. ఇబ్బందులు ఇలా» హోల్డింగ్ పాయింట్లలో, క్యూలైన్లో మంచి నీటి సదుపాయం కల్పించలేదు. ఫలితంగా మహిళలు, చిన్న పిల్లలు అల్లాడిపోయారు. » భక్తులకు ఏ సమయానికి అమ్మవారి దర్శనం అవుతుందనే విషయాన్ని డిస్ ప్లే చేస్తామని చెప్పి.. చేయలేదు.» వాటర్ బబుల్స్ విధానం పూర్తిగా విఫలమైంది. » క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఉక్కపోతతో అల్లాడారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. » క్యూలైన్లలో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు.» భక్తులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సెల్ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వం సాయంత్రం గానీ స్పందించ లేదు. » గంటల తరబడి లైన్లలో ఉన్న వారికి కనీసం అన్న ప్రసాదాలు కూడా అందజేయలేకపోయారు.» భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో సాయంత్రం తర్వాత ఓం టర్నింగ్ వద్ద పాలు, బిస్కెట్లు అందించారు. » పోలీసు, రెవెన్యూ, ఆలయ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలియలేదు.కొందామన్నా మంచి నీళ్లు లేవుక్యూలైన్లో ఎక్కడా మంచి నీళ్లు లేవు. గంటల కొద్దీ సమయం పట్టినప్పుడు అధికారులు కనీసం మంచి నీళ్లయినా అందించాలి. కనీసం డబ్బులు పెట్టి కొనుగోలు చేద్దామన్నా క్యూలైన్ల దగ్గరలో అమ్మడం లేదు. నీళ్లు లేక దాహంతో అందరం చాలా ఇబ్బంది పడ్డాం. ఉత్సవాలను ఘనంగా చేస్తున్నామంటూనే ఇన్ని ఇబ్బందులా? – సుబ్బారావు, భక్తుడు, విజయవాడమాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి?క్యూలైన్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంతసేపు ఇలా వదిలేస్తే మాలాంటి ముసలోళ్ల పరిస్థితి ఏమిటి? ఐదు గంటలకు పైగా క్యూలైన్లో ఉన్నాం. ఇంకా దర్శనం కాలేదు. ఇలా అయితే ఎలా? ప్రభుత్వం నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలి. – 70 ఏళ్ల వృద్ధురాలు, విజయవాడ -
హెచ్ఆర్సీ నియామకాల్లో ఇంత హడావుడి ఎందుకు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (ఏపీ హెచ్ఆర్సీ) చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియను సోమవారం చేపట్టాలని భావించినప్పుడు, తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తగినంత సమయం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఆహ్వానం పంపడం వల్ల తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబుకు బొత్స లేఖ రాశారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతిని ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్), సాధారణ పరిపాలన శాఖకు కూడా బొత్స పంపారు. ‘అక్టోబర్ 12న ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్, మొదటి అంతస్తులో జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కావాలని నాకు అక్టోబర్ 11న సాయంత్రం 4.59 గంటలకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందింది. సమావేశానికి హాజరు కావడానికి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నేను విజయనగరంలో ఉన్నాను. ఇంత తక్కువ సమయంలో విజయనగరం నుంచి రాలేను’ అని బొత్స లేఖలో పేర్కొన్నారు. కీలక నియామకంపై ఇంత నిర్లక్ష్యమా?‘మానవ హక్కుల కమిషన్ నియామకం వంటి కీలక అంశంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఎంపిక కమిటీ సభ్యులకు అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని పరిశీలించడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం సరికాదు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరం. మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కచ్చితత్వం, జాగ్రత్త, పూర్తి స్థాయి పరిశీలన అవసరం. తగిన చర్చ, లోతైన పరిశీలన లేకుండా హడావుడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం సహేతుకంగా లేదు. ఈ కారణాలతో అక్టోబర్ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కాలేను. సమావేశానికి హాజరు కావడం నాకు ఇష్టం లేదు’ అని కూడా లేఖలో బొత్స స్పష్టంచేశారు. -
ఎస్పీ గన్‌మేన్ ఆత్మహత్య
వేటపాలెం: క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయి అప్పులపాలై చివరకు ఆర్థిక ఇబ్బందులతో బాపట్ల జిల్లా ఎస్పీ గన్‌మేన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామానగర్‌లో ఉంటున్న లేళ్ల వీరన్న (47) ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్పీ గన్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూ బాపట్ల వెళ్లి డ్యూటీ చేసి ఇంటికి వస్తుంటాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనశ్శాంతి కోల్పోయి రెండు రోజుల కిందట తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు చెప్పాడు. ఆమె వద్దని నచ్చజెప్పిందని సమాచారం. ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వచ్చిన వీరన్న రామన్నపేట పంచాయతీ శివారు కనక నాగవరపమ్మ దేవస్థానికి వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ మంచినీటి బావుల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మార్గం గుండా వెళ్లే వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి ఎస్పీ గన్‌మేన్‌గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా రూ.లక్షల్లో అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. అప్పులు తీర్చలేనని మనోవ్యథతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుబారా బాబు.. డిజిటల్ డాబు
సాక్షి, అమరావతి: ‘మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కారు. పంటలకు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని పూర్తిగా గాలికొదిలేసింది. పంటల్ని కాపాడేందుకు కనీస చర్యలు కూడా చేపట్టని ప్రభుత్వం ఉద్యాన రైతులను ఉద్దరిస్తున్నట్టు డప్పు కొట్టుకుంటూ డిజిటల్ సేవల పేరిట రూ.కోట్లను దుబారా చేస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఏకీకృత డిజిటల్ వ్యవస్థ ‘ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీ ఎయిమ్స్) 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉద్యాన శాఖలో డిజిటల్ సేవల కోసం ప్రత్యేకంగా ఏపీ ఉద్యాన సమాచార, నిర్వహణ వ్యవస్థ (ఏపీహెచ్ఐఎంఎస్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.20.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ నిధుల మంజూరుకు పరిపాలన ఆమోదం ఇస్తూ డిజిటల్ వ్యవస్థ ఏర్పాటుకు విధివిధానాలతో ఆదివారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్ల ఒప్పందం.. ఏడాదిలో సేవలు డిజిటల్ రూపంలో ఉద్యాన సమాచార వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్‌కు అప్పగిస్తున్నారు. ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.11.77 కోట్లు, ఐదేళ్లపాటు నిర్వహణ కోసం మరో రూ.8.85 కోట్లు కేటాయించారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐదేళ్ల పాటు ఈ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రాజెక్టును నాలుగు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఎయిమ్స్ 2.0 ఉన్నా.. ఇప్పటికే వ్యవసాయ శాఖకు ‘ఏపీ ఎయిమ్స్ 2.0’ అనే డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉంది. దీనికి అనుబంధంగా ఉద్యాన పంటలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తే సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ కోసం ప్రత్యేక డిజిటల్ సేవల పేరుతో నిధులు స్వాహా చేసేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.20.62 కోట్లను ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టేందుకే ఉద్యాన శాఖ పేరిట ప్రత్యేకంగా డిజిటల్ సేవలను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కుదరదు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన జారీ చేసిన జీవోను సవరిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు ఆదివారం మరో జీవో జారీ చేశాయి. గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్‌లకు జరిగే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం ఆమోదించిన బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను నిర్ణయించాలని పేర్కొంది. రిజర్వేషన్ల గణన, కేటాయింపునకు సంబంధించిన వివరణాత్మక విధానం.. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు, పదవుల నిర్ధారణ, కేటాయింపు, రోటేషన్‌పై కొత్త విధివిధానాలతో వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు భారీగా కోత పడే అవకాశం ఉంది. జెడ్పీ చైర్మన్ పదవులతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవుల్లో దాదాపు పది శాతం చొప్పున తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మభ్యపెట్టి లబ్ధి పొందేలా స్కెచ్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని తెలిసినా బీసీలను మభ్యపెట్టడానికి స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు సర్కారు తొలుత వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా జారీ చేసిన జీవోలు చెల్లవని తెలిసినా కపట నాటకం ఆడింది. ఈ జీవోలను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో) రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం 251 జీవో జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కల్పించే రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలతోపాటు మేయర్, చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లను తాజా ఉత్తర్వుల ప్రకారం ఖరారు చేయాలని స్పష్టం చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఆయా యూఎల్బీని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాగా.. మిగిలిన శాతం సీట్లు బీసీలకు దక్కనున్నాయి. అయితే మొత్తం రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికే పరిమితమవుతాయి. మరోవైపు వార్డుల పునర్విభజన జరిగిన నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లు నూతనంగా ఖరారు చేయనున్నారు. మేయర్లు, చైర్పర్సన్లకు మాత్రం 2021 ఎన్నికల్లో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.నేడు రిజర్వేషన్ల ఖరారు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్, నగర పంచాయతీల చైర్పర్సన్ల రిజర్వేషన్లు సోమవారం ఖరారు కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తొలి దశలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్లు మాత్రం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఖరారు చేయనున్నారు. -
చెత్తతోనూ 'దోపిడీ పంట'!
సాక్షి, అమరావతి: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు.. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, మద్యం అన్నిటిలోనూ వేల కోట్లు దోచేస్తున్నారు.. అమరావతి నిర్మాణాల పేరుచెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఎస్ఎఫ్టీకి రూ.20 వేలు చొప్పున నొక్కేస్తున్నారు. అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు అప్పగించేస్తున్నారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేసి వాటిలో కమీషన్లు కొట్టేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆకలి తీరడం లేదు. చివరకు చెత్తనూ వదలడం లేదు. చెత్త నిల్వల లెక్కలను కాగితాలపై పెంచేసి కాగితాలపైనే క్లియర్ చేసేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ వాటిలో కమీషన్లు కాజేస్తున్న విషయం బయటపడింది. చెత్తతోనూ ‘దోపిడీ పంట’ పండించవచ్చన్న విజనరీ చంద్రబాబు పాలనలో చెత్త కుంభకోణం విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అధికారంలోకి రాగానే ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలు, మంత్రి నారాయణ ప్రకటనలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఈ చెత్త లెక్కలను ఎలా పెంచుకుంటూ పోయారో తెలుస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా డబ్బులు చెల్లించడం, చెత్తను తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ తగలబెడుతుండడం చూస్తే కమీషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమౌతుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ లెక్కలు పెంచేసి.. కాగితాలపై క్లియర్ చేసి.. రూ.కోట్లు స్వాహా.. గత ప్రభుత్వ హయాంలో 123 మున్సిపాలిటీలలో లెగసీ చెత్త (దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త) 85 లక్షల టన్నులకు గానూ 4.10 లక్షల టన్నులను క్లియర్ చేసినట్లు తేల్చారు. ఆ విషయాన్ని 2024 జులై 11న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. కానీ 2025 మార్చి 16న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో లెగసీ చెత్తను మళ్లీ 85 లక్షల టన్నులుగా చూపించారు. అందులో 50 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. మళ్లీ 2025 సెప్టెంబర్ 23న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 84 లక్షల టన్నులున్నట్లు చూపించారు. అందులో 82 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులుగా చూపించారు. అందులో 1.08 కోట్ల టన్నులను ప్రాసెస్ చేసినట్లు చూపించారు. ఇదే ఏడాది జులై 31 నాటికి లెగసీ చెత్త మొత్తాన్ని 1.58 కోట్ల టన్నులకు పెంచేశారు. అందులో 1.34 కోట్ల టన్నులను ప్రాసెస్ చేశామని చూపించారు. లెగసీ చెత్త లెక్కలను ఇలా ఎందుకు పెంచుతున్నారో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. చెత్త లెక్కను కాగితాలపై పెంచుతున్నారు. చెత్తను క్లియర్ చేసేశామని కాగితాలపైనే చెబుతున్నారు. కానీ ఏమీ చేయకుండా టన్నుకు రూ.800 చొప్పున దాదాపు రూ. 1200 కోట్లకు పైగా నొక్కేయడానికి స్కెచ్ వేశారు. క్లియర్ చేసిన చెత్త కన్నా మొత్తం చెత్త తక్కువట.. లెక్కకు మించిన చెత్త మెక్కేయడంతో చంద్రబాబు సర్కారుకు మెదడు మొద్దు బారిపోయినట్లుంది. సుమారు 20 మున్సిపాలిటీలలో మొదట సమర్పించిన అఫిడవిట్లలో క్లియర్ చేసిన చెత్త కంటే... మొత్తం చెత్త తక్కువ అని తదుపరి అఫిడవిట్లో తెలియజేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో మూడు అఫిడవిట్లలో 5.12 లక్షల టన్నుల చెత్త ఉందని అందులో 5.11 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించారు. అంటే 5.11 లక్షల టన్నులకు బిల్లులు పెట్టుకుని తినేసినట్లే కదా.. కానీ మూడు నెలల తర్వాత సమర్పించిన అఫిడవిట్లో మొత్తం చెత్త 2.78లక్షల టన్నులని చూపించారు. తాడిపత్రిలో 1.27 లక్షల టన్నుల చెత్త ఉందని, అందులో 1.16 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించి మూడు నెలల తర్వాత 4వ అఫిడవిట్లో మొత్తం చెత్త 22 వేల టన్నులు అని తెలియజేశారు. అవకతవకలు ఈస్థాయిలో జరిగిన నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటపడవు. నచ్చిన కంపెనీలకే పనులు.. కాంట్రాక్టర్లపై చర్యల్లేవ్.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు మొదలు మొత్తం ప్రక్రియనంతటినీ అస్తవ్యస్తంగా మార్చేసింది. 2025 మార్చిలో సౌరాష్ట్ర కంపెనీకి కర్నూలు, పరిసరాల్లోని 11 డంపింగ్ యార్డులను కట్టబెట్టారు. మిగిలిన చోట్ల వేర్వేరు కంపెనీలకు పనులు అప్పగించారు. చెత్త మొత్తాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గడువులోగా పూర్తి చేస్తే 10శాతం అదనపు ప్రోత్సాహకం, విఫలమైతే 20శాతం పెనాల్టీ విధించాలి. అయితే 2025 గడువు ముగిసి, 2026 నాటికి కూడా పనులు పూర్తికాకపోయినా కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా క్లియర్ చేస్తున్నట్లు ఎన్జీటీకి తప్పుడు నివేదికలు సమర్పించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు చెల్లిస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. వేలాది ఇళ్లకు కనీసం ఇంటింటికీ చెత్త సేకరణ కూడా చేయడం లేదు. డంపింగ్ యార్డులలో అవినీతి కప్పిపుచ్చుకోవడానికి నిబంధనల ప్రకారం పెట్టాల్సిన సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చేసిన పర్యావరణ వినాశనం వర్ణనాతీతం. చెత్తను శాస్త్రీయంగా విడదీసి, బయో–మైనింగ్ ద్వారా భూమిని పునరుద్ధరించాల్సి ఉండగా, ఇక్కడ బిల్లులు మింగేయడానికి అడ్డదారి తొక్కారు. చెత్తను మట్టితో పూడ్చారు. టన్నుకు రూ.800 చొప్పున కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కయి చెత్తను ప్రాసెస్ చేయకుండానే భారీ ఎత్తున మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. చెత్తను మట్టితో కప్పివేయడం వల్ల (కేపింగ్) వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన విష ద్రావకం విడుదలై భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటిని పూర్తిగా విషపూరితంగా మారుస్తుంది. పర్యావరణానికి ఇంతటి ద్రోహం జరుగుతున్నా, పచ్చ చొక్కాల జేబులు నిండటమే లక్ష్యంగా ఈ దారుణాన్ని సాగనిచ్చారు.వైఎస్సార్సీపీ ‘క్లాప్’ విజయంకూటమి ‘చెత్త’ వైఫల్యంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 2న ప్రారంభించిన క్లాప్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పారిశుధ్య వ్యవస్థ రూపురేఖలను మార్చింది. నాడు కేంద్రం నిధులతో సంబంధం లేకుండా సొంత బడ్జెట్‌తో ప్రతి ఇంటికీ ఉచితంగా 1.2 కోట్ల డస్ట్బిన్లు పంపిణీ చేసి, 4,097 గార్బేజ్ ఆటోలను జీపీఎస్ ట్రాకింగ్‌తో నడిపింది. నిల్వ చెత్తను పర్యావరణ హితంగా క్లియర్ చేసింది. ఇంటింటి చెత్త సేకరణను తూతూ మంత్రంగా మార్చేసిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన క్లాప్ వాహనాలనూ డంపింగ్‌యార్డులకు పరిమితం చేసింది. విజయవాడతో పాటు పలు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో వాహనాలు మూలకు చేరాయి.100కుపైగా డంపింగ్ యార్డుల్లో చెత్తకు నిప్పునిబంధనల ప్రకారం పనులు చేయకపోగా, చెత్త పరిమాణాన్ని తగ్గించి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకున్న మరో అడ్డదారి చెత్తను తగలబెట్టడం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో దాదాపు 100 పైగా డంపింగ్ యార్డులలో రాత్రికి రాత్రే చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. దీనివల్ల వాతావరణంలోకి పీఎం2.5, పీఎం10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, డయాక్సిన్లు, బెంజీన్ వంటి అత్యంత క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు విషవాయువులు విడుదలయ్యాయి. చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతుంటే, మూగజీవాలు ఊపిరాడక మరణిస్తున్నాయి. చెత్త కాలి బూడిదవుతుంటే, ఆ బూడిదను కూడా క్లియర్ చేసినట్లు కాగితాలపై దొంగ లెక్కలు రాసి రూ.కోట్లు స్వాహా చేశారు. ప్రకాశం జిల్లా కొప్పోలులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త కడపలో కుమ్మేశారుకడప నగరంలో లెగసీ చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎన్జీటీకి సమర్పించిన మొదటి మూడు అఫిడవిట్లలో 1.08 లక్షల టన్నుల చెత్త ఉందని 100శాతం ప్రాసెస్ చేసేశామని చెప్పారు. మూడు నెలల తర్వాత సమర్పించిన నాల్గవ అఫిడవిట్లో లెగసీ చెత్త 8.41 లక్షల టన్నులుందని, అందులో 5.5 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేశామని చెప్పారు. లెగసీ చెత్త 100శాతం క్లియర్ అయ్యిందని చెప్పిన తర్వాత 800శాతం చెత్త పెరగడం ఎలా సాధ్యం? పైగా మూడు నెలల వ్యవధిలో 4.5 లక్షల టన్నుల చెత్తను అదనంగా ప్రాసెస్ చేశామనడం ఎలా సాధ్యం? దోపిడీకి ఇది ప్రబల సాక్ష్యం.ప్రొద్దుటూరులో పిండేశారుమూడు అఫిడవిట్లలో 2.06 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పి మొత్తం 2.06 లక్షల టన్నులూ క్లియర్ చేసేశామని చూపించారు. తర్వాత మూడు నెలలకు ఏకంగా 5.05లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్లో ప్రకటించారు. డంపింగ్ యార్డులో క్లియర్ అయిన చెత్త ఒక్కసారిగా అలా ఎలా పెరిగింది?కర్నూలులో కొట్టేశారు..కర్నూలులో 1.5 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని, మొత్తం క్లియర్ చేసేశామని మూడు అఫిడవిట్లలో చెప్పారు. మూడు నెలల తర్వాత 7.61 లక్షల టన్నుల చెత్త ఉందని చూపించారు. చెత్తను పెంచి క్లియర్ చేసి కొట్టేశారన్నమాట..అనంతపురంలో అడ్డగోలు లెక్క..మూడు అఫిడవిట్లలో 3.32 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. మొత్తం క్లియర్ చేసి 12 ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పారు. కానీ 2026 జనవరి నాటికి 7.10 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. ఇంతకన్నా అడ్డగోలు లెక్క ఎక్కడైనా ఉంటుందా?తిరుపతిలోనూ తినేశారు..మొదటి మూడు అఫిడవిట్లలో 2.04 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. పూర్తిగా తొలగించామని చూపించారు. 12 ఎకరాల డంపింగ్ యార్డును కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. 4వ అఫిడవిట్లో ఏకంగా 6.26 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. అంటే ఎంత తినేశారో అర్థం కావడం లేదూ?వైజాగ్‌లో దోచేశారు..మొత్తం 9.6 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని మూడు అఫిడవిట్లలోనూ చెప్పి మొత్తం క్లియర్ చేసినట్లు చూపించారు. మూడు నెలల తర్వాత 17.84లక్షల టన్నులకు చెత్తను పెంచేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో చేశారో తెలుస్తూనే ఉంది కదా..?గత ప్రభుత్వం క్లియర్ చేసిన చెత్తను కూడా కలిపేసి...మున్సిపాలిటీల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తకు గాను గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీకి) 2024 జులై 11న సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. కానీ 2025 మార్చి 16న 85 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందంటూ మరో అఫిడవిట్ ఇచ్చింది. అందులో 50 లక్షల టన్నులు క్లియర్ చేశామంది. 2025 సెప్టెంబర్ 23న మరో అఫిడవిట్లో 84 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పింది. అందులో 82 లక్షల టన్నులు క్లియర్ చేశామంది.అంతా క్లియర్ చేసేశాం మంత్రి నారాయణ గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసింది. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చెత్త తొలగింపును 2025 నాటికి పూర్తి చేయమన్నారు. ఇప్పటికే 84లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాం. అక్టోబర్ 2 నాటికి 85 లక్షలు పూర్తి చేస్తాం’ అని శాసన మండలి సాక్షిగా మంత్రి నారాయణ 2025 సెప్టెంబర్ 19న ప్రకటించారు.నాలుగో అఫిడవిట్లో 1.53 కోట్ల టన్నుల చెత్తఐదునెలలు తిరక్కుండానే కోట్ల టన్నులకు లెగసీ చెత్త పెరిగిపోయింది. లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులంటూ 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఐదో అఫిడవిట్లో 1.58 కోట్ల టన్నుల చెత్తమరో నాలుగునెలలయ్యేసరికి లెగసీ చెత్త లెక్క 1.58 కోట్ల టన్నులకు చేరుకుంది. 2026 జులై 31న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్లో చంద్రబాబు సర్కార్ ఈ కొత్త లెక్క చెప్పింది.1.05 కోట్ల టన్నుల చెత్త చంద్రబాబు‘గత ప్రభుత్వం 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లిపోయింది.’ అని 2026 జనవరి 24న సీఎం చంద్రబాబు చెప్పారు.ఏమిటీ చెత్త మర్మం?లెగసీ చెత్త 85 లక్షల టన్నుల్లో గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నులు క్లియర్ చేసిందని అఫిడవిట్లో చెప్పిన చంద్రబాబు 2026 జనవరి 24 నాటికి 1.05 కోట్ల టన్నుల చెత్త ఉందని ఎందుకు మార్చి చెప్పినట్లు? ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో చెత్త నిల్వలను ఏకంగా 1.53 కోట్ల టన్నులకు ఎందుకు పెంచేసినట్లు? జులై 31 నాటికి ఈ లెక్కను 1.58 కోట్ల టన్నులకు పెంచి మరో అఫిడవిట్ ఎందుకు వేసినట్లు? ఈ ఐదు అఫిడవిట్లలోనూ కోట్ల టన్నులు క్లియర్ చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటి వెనక ఏదో ‘దోపిడీ మర్మం’ ఉందని అర్థం కావడం లేదూ? -
నేటి నుంచి స్పెషల్ టెట్
సాక్షి, అమరావతి: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2026(స్పెషల్ టెట్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 32 పేపర్లకు సీబీటీ విధానంలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో 64, తెలంగాణలో 3, చెన్నైలో 2, బెంగళూరులో 2, బరంపురం (ఒడిశా)లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. హాల్‌టికెట్లను cse.ap.gov.in లేదా tet2dsc.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఇన్ సర్వీస్ టెట్ కోసం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 68,420మంది ఉపాధ్యాయులు 83,015 దరఖాస్తులు సమర్పించారు. -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువుదీరిన బెజవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉత్సవాలలో తొలిరోజైన ఆదివారం దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం.. ఉ.8 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. మొదటిరోజు ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుద్దీపాల ధగధగలు..ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మహా మండపం, మల్లేశ్వర స్వామివారి ఆలయం, రాజగోపురం, ఘాట్‌రోడ్డుతో పాటు చైనావాల్, కొండ దిగువన కనకదుర్గనగర్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటుచేసిన కంపార్టుమెంట్లలోకి భక్తులను తరలిస్తారు. ఇక హైదరాబాద్, తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటుచేసింది. వీవీఐపీలు, ప్రముఖుల రాక..ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పలువురు వీవీఐపీలు, ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారు. దీంతో.. నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా సుమారు 3,130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేస్తున్నారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డ్యాష్బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టమ్, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తారు. మొత్తం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాట్లుచేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం కొండపైన ఓం టర్నింగ్ వద్ద వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఇవ్వడంలేదు. పాస్ ఉన్న వాహనాలు ఓం టర్నింగ్ వరకు వెళ్లి అక్కడ డ్రాప్ చేసిన అనంతరం కిందకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.నేటి అలంకారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవి..శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లో ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే శ్రీమహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. -
జనంపై పుకార్ల ‘పంజా’..!
సాక్షి, అమరావతి: ‘అదిగో పులి అంటే..ఇదిగో తోక’ అన్నట్లుంది సామాజిక మాధ్యమాల్లో కొందరి వైఖరి. రాష్ట్రంలో ఎక్కడో పులి కనిపించిందనే సమాచారం వస్తే చాలు.. క్షణాల్లో వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, హెచ్చరికల సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఏ సమాచారం వాస్తవం? ఏది పుకారు? అనే గందరగోళం జనంలో ఏర్పడుతోంది. ఆరు నెలలుగా సంచారం కేంద్ర ప్రభుత్వం 2022 పులుల గణన ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లో 63 పులులు ఉన్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 3,682కు చేరింది. మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుంచి ఓ పెద్దపులి ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లాలో కనిపించింది. ఫిబ్రవరి 7న అటవీశాఖ అధికారులు బంధించి, పాపికొండల జాతీయ పార్కులో విడిచిపెట్టారు. ఆగస్టులోనూ గోదావరి ప్రాంతంలో పులి సంచారంపై వార్తలు వెలువడ్డాయి. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పశువులపై పులి దాడులు చేస్తోందనే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తమైంది. గోపాలపురం మండలం నందిగూడెం, టోకిరెడ్డిగూడెం పరిసరాల్లో పులి అడుగుజాడలు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. మళ్లీ కలకలం తాజాగా ఈనెల 9 నుంచి గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలలో పులి సంచారంపై ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి, కల్ధరి గ్రామాల మధ్య పొలాల్లో పులి కదలికలను గుర్తించారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం, చాగల్లు మండలం చిక్కాలపాలెం, అమ్మిగుంట, నిడదవోలు ప్రాంతాల్లోనూ పులి కనిపించిందనే ప్రచారం కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం, జగ్గన్నపేట గ్రామాల్లో శనివారం పులి సంచారం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. కొందరు తమ పంట చేలో పులి తారసపడిందని సమాచారం ఇవ్వడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు రామన్నగూడెం చేరుకుని తనిఖీలు చేపట్టారు. పుకార్లు..షికార్లు వివిధ గ్రామాల పేర్లతో వస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి చోటా పులి కనిపించిందనడానికి లేదు. ఫిబ్రవరిలో పాపికొండల అటవీ ప్రాంతంలో పులిని విడిచిపెట్టిన తర్వాత, అదే పులి మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందంటూ కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన ఓ వీడియోలో కనిపించిన పులి అది కాదని అటవీశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు: » పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయకూడదు. » రాత్రివేళ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. » పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. » పులి సంచారంపై సమాచారం ఉంటే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలి. » పాత వీడియోలు, ధ్రువీకరించని సందేశాలను ఇతరులకు పంపకూడదు. » అటవీశాఖ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలి. -
‘లోక్‌భవన్ ముట్టడి’పై పోలీసు ప్రతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటు హక్కును పరిరక్షించాలని కోరుతూ కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు శనివారం విజయవాడలో నిర్వహించిన లోక్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ శుక్రవారం అర్థరాత్రి నుంచే విజయవాడ, తాడేపల్లి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని వామపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. లోక్‌భవన్‌కు వెళ్లే అన్ని దారులను బారికేడ్లు, ఇనుప కంచెలతో మూసివేశారు. లెనిన్ సెంటర్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యాలయాలను పోలీసులు దిగ్బంధించారు. వందలాది మంది పోలీసులు మోహరించి పెద్ద సంఖ్యలో వాహనాలు తీసుకొచ్చి అరెస్టులు చేశారు. దీంతో.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన ‘ఛలో లోక్‌భవన్’ కార్యక్రమంతో విజయవాడ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల దాడిలో విద్యార్థి సంఘాల కార్యకర్తలు ముగ్గురు గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. వీరిని పోలీసులు కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. గాయపడ్డ వారిలో తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షురాలు జ్యోతి çస్పృహ తప్పిపడిపోగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకుడు వంశీ, ఏలూరు జిల్లా కార్యకర్త మాధవ్‌ను పోలీసులు గుండెపై తన్నటం, తోపులాటలో గాయపడ్డారు. వేర్వేరు పోలీసుస్టేషన్లకు నేతల తరలింపు.. ఇక విజయవాడ లెనిన్ సెంటర్లో ఆందోళనకు దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, వి. ఉమామహేశ్వరరావు, వి. రాంభూపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పి. ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఎం.రామకృష్ణ, ఎంసీపీఐయు నాయకులు ఖాదర్‌బాషా, ఎస్యుసీఐసీ నాయకులు కె. సుధీర్, కాంగ్రెస్ ఏపీ ఇన్చార్జి వి.మోహన్, ఆ పార్టీ నేతలు గిడుగు రుద్రరాజులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారు. వీరందరినీ ఇబ్రహీంపట్నం, భవానీపురం, కొత్తపేట టూటౌన్, సింగ్‌నగర్, నున్న, సత్యనారాయణపురం, కృష్ణలంక పోలీసుస్టేషన్లకు తరలించారు. కార్యక్రమానికి మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభానాద్రీశ్వరరావు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు ఎస్ఎల్ విల్లాస్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన చలో లోక్‌భవన్ నేపథ్యంలో ఆమెను నిర్బంధించారు. -
పాతకు కోత.. కొత్తకు బాట
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పెనుమార్పులకు నాంది పలకనుంది. రానున్న దశాబ్దంలో ఉద్యోగ అవకాశాలను విప్లవాత్మక రీతిలో ప్రభావితం చేయనుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగాల అవసరం భారీగా తగ్గిపోనుంది. అదే సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరచుకుంటున్నాయి. వెరసి శరవేగంగా మారుతున్న సమాచార, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే ఉద్యోగ భరోసా అన్నది స్పష్టమవుతోందని అమెరికాలోని ప్రముఖ సాంకేతిక సంస్థ ‘మెక్ కిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్’ కుండబద్దలు కొట్టింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపై ఆ సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 రంగాల్లో 3.60 కోట్ల ఉద్యోగాలకు కోత పడనుందని ఆ నివేదిక వెల్లడించింది. కొత్తగా 4 కోట్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మార్కెట్లోకి వస్తాయని భరోసా ఇచ్చింది. నివేదిక ఏం చెబుతోందంటే.. » ఏఐ, ఆటోమేషన్ టూల్స్ విస్తృతితో రానున్న పదేళ్లలో 21 శాతం ఉద్యోగాలకు కోత పడుతుంది. » దశాబ్దాలుగా కొనసాగుతున్న వాటిలో దాదాపు 3.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఇక ఉండదు. వీరు ఇతర ఉద్యోగ, ఉపాధి రంగాలకు మారాల్సి ఉంటుంది. » 2.5 కోట్ల ఉద్యోగులు మాత్రం నైపుణ్యాలను మెరుగుపర్చుకుని తమ ఉద్యోగాల్లో కొనసాగుతారు. » ఏఐ ప్రభావంతో కొత్తగా 4 కోట్ల ఉద్యోగాలు ఏర్పడతాయి. ఇప్పటివరకు లేని కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.» అంటే, ఏఐ ఉన్న ఉద్యోగాలను తుడిచిపెట్టేయడం కంటే.. ఉన్నవాటి కంటే ఎక్కువ ఉద్యోగాలనే సృష్టిస్తుంది. » ఏఐ వల్ల ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, రిటైల్ సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లోని కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు. » ఆరోగ్య సంరక్షణ (హెల్త్ కేర్), నిర్వహణ, నిర్మాణం (మేన్‌జ్‌మెంట్, కనస్ట్రక్షన్), సాంకేతిక (టెక్నాలజీ) విభాగాల్లో ఉద్యోగాల డిమాండ్ భారీగా పెరుగుతుంది. -
బాబు సర్కార్ నిర్వాకం.. రైతుకు శాపం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం రాష్ట్ర రైతులకు శాపంగా తయారైంది. మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల సేకరణకు ఆర్థిక చేయూత కోసం పంపే ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏపీ విషయంలో మాత్రం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నా.. చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. ఓ వైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది ఎకరాలు సాగుకు దూరమయ్యాయి. సాగైన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎంత మేర దిగుబడులు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోంది. పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో పంటల కొనుగోళ్ల కోసం ఏపీ పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ సీజన్లో కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, నూనెగింజలను కొనుగోలుకు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం భారీగా ఆర్థిక చేయూత ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా రూ.5,547.99 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. కానీ ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం కనిపించకపోవడం గమనార్హం.పొరుగున్న కర్ణాటక, తెలంగాణకు ఆర్థిక చేయూత...రాష్ట్రాల వారీగా కేటాయించిన కొనుగోళ్ల విలువను పరిశీలిస్తే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 4.66 లక్షల టన్నుల కందులు సేకరణకు రూ.3,937.70 కోట్లు, 6,250 టన్నుల పెసలు కొనుగోళ్లకు రూ.54.87 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కర్ణాటకకు 1.16 లక్షల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.659.27 కోట్లు, 38 వేల టన్నుల పెసలు సేకరణకు రూ.335.83 కోట్లు, 13 వేల టన్నుల పొద్దుతిరుగుడు సేకరణకు రూ.111.90 కోట్లు ఇలా ఈ రాష్ట్రంలో 1.67 లక్షల టన్నుల పంట ఉత్పత్తుల సేకరణకు రూ.1,107 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణలో 62 వేల టన్నుల సోయాబీన్ సేకరణకు రూ.353.90 కోట్లు, 11 వేల టన్నుల పెసల సేకరణకు రూ.94.52 కోట్లు కలిపి 73 వేల టన్నులు పంట ఉత్పత్తుల సేకరణకు రూ.448.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మరి ఇదే సమయంలో దేశంలోనే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న ఏపీలో రైతులకు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆర్ధిక చేయూత ప్రకటించకపోవడమే ఆందోళనకు గురిచేస్తుంది. రెండేళ్లుగా ఏ పంటకు దక్కని మద్దతు ధర..గడిచిన రెండున్నరేళ్ల గా రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. ప్రభుత్వ ఏజెన్సీలను రంగంలోకి దింపి రైతుల నుంచి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరలు కొనుగోలు చేసిన దాఖలాలూ లేవు. కనీసం కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపడం, ఆ మేరకు నిధులను రాబట్టి ధరలు పతనమైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి ఉపశమన చర్యలు చేపట్టకపోవడంతో రెండున్నరేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత సీజన్లో కందులు, పెసలు వంటి పప్పు ధాన్యాలతో పాటు మొక్కజొన్న పంటలే ఈ కాస్త సాగయ్యాయి. కనీసం వాటికైనా మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరికి అద్దం పడుతుంది. ఈ సీజన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఏపీ రైతుల గోడు పట్టదా?ఖరీఫ్ సీజన్లో వర్షాభావం, సాగునీటి కొరత, పెరిగిన పెట్టుబడుల ఖర్చులు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగు, ఎదుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభించక పోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల కొనుగోళ్లకు కేంద్రం మద్దతు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగకపోతే అయినకాడకి అమ్ముకొని మరింత నష్టపోతామని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అవసరమైన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, కోతలకు ముందుగానే పంట కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
బాసులు సేఫ్.. చార్జిషీటే ప్రూఫ్!
ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌లు పోలీస్ శాఖకు కళ్లు, చెవులు, ముక్కుగా పని చేస్తాయి. రాజకీయ నేతల కదలికల నుంచి శాంతిభద్రతల సమస్య వరకు.. తీవ్రవాద కార్యకలాపాల నుంచి తీవ్రమైన సమస్యల వరకు చీమ చిటుక్కుమంటే పోలీస్ బాస్‌లకు చేరవేస్తారు. మరి కాపు యువకుడు గాదె సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకొచ్చిన దగ్గర్నుంచి.. పోలీసులే కొట్టి చంపి కాల్చి బూడిద చేసే వరకు పోలీస్ బాస్‌లకు తెలియదంటే నమ్మాలా? సాయికృష్ణది ముమ్మాటీకి రాజ్య హత్య. ఇందుకు బాధ్యులైన బాసులను తప్పించేందుకు పౌర హక్కులను హననం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి : చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో నాన్ బెయిల్‌బుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) ఉందనే కారణంతో పట్టుకొచ్చిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను చట్ట ప్రకారం కోర్టుకు హాజరు పరచకుండా, రోజుల తరబడి లాకప్‌లోనే నిర్బంధించి పోలీసులే కొట్టి చంపేసిన దారుణ ఘటన వెనుక ఉన్న బాసులను రక్షించేందుకు సిట్ పడరానిపాట్లు పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో డైవర్షన్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని వెనుక ఉన్న బాసులను కాపాడేలా స్కెచ్ వేసింది. ఈ కేసులో కోర్టుకు సిట్ సమర్పించిన 263 డాక్యుమెంట్లతో పాటు 86 పేజీల ఛార్జిషీట్‌ను నిశితంగా గమనిస్తే.. అనేక అనుమానాలు, ఆధారాలన్నీ బాసుల వైపే వేళ్లు చూపిస్తున్నాయి. సాయికృష్ణను పట్టుకొచ్చి కొట్టి చంపే వరకు జరిగిన పోలీస్ టార్చర్ గురించి సిట్ చార్జిషీట్లో వివరించిన తీరు క్రైమ్ థిల్లర్‌ను తలపిస్తోంది. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృçష్ణను మే 6న తీసుకొచ్చింది. ఆపై సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో వేలాడదీసి తీవ్రంగా కొట్టారు. లాకప్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి దారుణంగా చిత్రవధకు గురిచేశారు. పోలీసులు దారుణంగా కొట్టడంతో కిడ్నీలు పగిలిపోయాయి. మర్మాంగం నుంచి రక్తస్రావం అయ్యింది. అతని పరిస్థితి విషమించడంతో ఒక పాత భవనంలోకి తీసుకెళ్లి నిర్బంధించారు. చివరకు పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక మే 12న చనిపోయాడు. అప్పటికి కూడా పోలీసులు ఈ ప్రక్రియకు ముగింపు పలకలేదు. సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి శ్మశానంలోకి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు.ఈ కస్టోడియల్ టార్చర్‌పై పూసగుచ్చినట్టు చార్జిషీట్లో పేర్కొన్న సిట్.. దీని వెనుక ఏం జరిగిందన్నది మాత్రం వివరించక పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీస్ బాస్‌ల ప్రమేయం లేకుండానే ఇంత జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ దారుణంలో అసలు దోషులను తప్పించేందుకు పక్కా స్కెచ్ వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సిట్ ద్వారా కథ నడిపించింది. నేరం మొత్తాన్ని సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుతోపాటు మరో ఆరుగురికి పరిమితం చేసి.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు, డీజీపీ హరీష్ కుమార్గుప్తాలను మాత్రం సురక్షితంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేసింది. అంతా తెలిసినా.. సీపీ మౌనం సాయికృష్ణ ఘటనపై సీపీ మౌనం వహించడం దేనికి సంకేతం అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డీజీపీ, సీపీ, ఏసీపీలకు ఏమి తెలియదన్నట్టు కథ నడిపిస్తున్నప్పటికీ.. సిట్ చార్జిషీట్లో ప్రస్తావించిన కొన్ని విషయాలు సీపీ ప్రమేయం ఉందనేది చెప్పకనే చెబుతున్నాయి. సీపీ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ టీమ్ సాయికృష్ణను పట్టుకొచ్చింది. అతని అరెస్టు సైతం సీపీ రిజిస్టర్లో నమోదైందని చెబుతున్నారు. విజయవాడ నగరంలోని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. అయినా.. ఆరు వారాలపాటు కమిషనరేట్ మొత్తానికి తెలిసినా మౌనం వహించారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులు పట్టుకొచ్చారని, ఆ తర్వాత కన్పించకుండా పోయాడని అతని తల్లి నేరుగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ కేసులో తమకేమీ తెలియదని న్యాయస్థానానికి పోలీసులు అబద్ధాలు చెప్పారు. సిట్ దర్యాప్తు చేపట్టిన నిందితుల జాబితాలో సీపీ పేరు లేదు. కనీసం 120 మంది సాక్షుల జాబితాలోనూ ఆయనను ఏం జరిగిందో అడగలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు నిర్వాకం. సిట్ చార్జిషీట్లోని అంశాలపై అనుమానాలెన్నో » ఈ ఏడాది మే 6వ తేదీ తెల్లవారుజామున మార్కాపురంలోని అద్దె ఇంట్లో సాయికృష్ణను విజయవాడ సీపీ పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకొచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించింది. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ పంపిన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అతన్ని అదే రోజున ఉదయం ఏడు గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించి రశీదు తీసుకుని, ఫొటో దిగారు. » ఆ అరెస్టు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్–2026లో 194, 195 పేజీల్లో నమోదైనట్టు సిట్ చార్జిషీట్ స్పష్టం చేసింది. అంటే తొలిరోజే సాయికృష్ణ అరెస్టు సీపీ పేరిట ఉన్న రికార్డుల్లోకి ఎక్కింది. మరి అతను కోర్టుకు వెళ్లాడా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? » మే 11న ఏడీసీపీ అధికారిక టాస్క్‌ఫోర్స్ వాట్సాప్ గ్రూపులో సాయికృష్ణ గురించి ఆరా తీశారు. ‘ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు’ అని సమాధానం వచ్చింది. ఇది సాక్షుల వాంగ్మూలంగా చార్జిషీట్‌లోనే నమోదైంది. » ఎన్బీడబ్ల్యూలో 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ఉండాల్సిన వ్యక్తి ఐదు రోజులుగా స్టేషన్లోనే మగ్గుతున్నాడని సీపీ కింది అధికారికి తెలిసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమాచారం సీపీ వరకు వెళ్లిందా? వెళ్తే ఆయన ఏం చేశారు? సిట్ ఈ ప్రశ్న అడగనే లేదు. సాయికృష్ణ స్టేషన్లో ఉన్న విషయం కమిషనరేట్‌కు సమాచారం చేరిందని చార్జిషీటే చెబుతోంది. » మే 8 తెల్లవారుజామున లాకప్ రిపోర్ట్ (డీఎస్ఆర్) కోసం ఏసీపీ సౌత్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. సెంట్రీ కానిస్టేబుల్ సాయికృష్ణ పేరు రాసి వాట్సాప్‌లో పంపాడు. ఏసీపీ ఆఫీసు దాన్ని డీఎస్‌ఆర్‌లో ఎక్కించింది. ఆ తర్వాత ఆ రిపోర్టులు ’నిల్’గా మారిపోయాయి. కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ ఆఫీసు రికార్డులనే తారుమారు చేశారు. ఎవరు చేశారు.. ఎవరి అండతో చేశారు.. అనే ప్రశ్నలకు చార్జిషీట్లో జవాబు లేదు. » స్పెషల్ బ్రాంచ్ డీఎస్ఆర్లోనూ సాయికృష్ణ లాకప్‌లో ఉన్నట్టు ఎంట్రీలు ఉన్నాయని సిట్ పేర్కొంది. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు నేరుగా సీపీ టేబుల్‌కే వెళ్తాయి. టాస్క్‌ఫోర్స్, ఏసీపీ ఆఫీసు, స్పెషల్ బ్రాంచ్ అనే మూడు దారుల్లోనూ సమాచారం కమిషనరేట్‌కు చేరింది. అయినా సీపీకి తెలియదంటే నమ్మేదెవరు? » కృష్ణలంక స్టేషన్ ముందున్న రెండు సీసీ కెమెరాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చార్జిషీటే రాసింది. ఆ కమాండ్ కంట్రోల్ సీపీ ఆధీనంలోనిదే. జూన్ 14 రాత్రి ఆ రెండు కెమెరాలనూ పీకేశారు. ఎన్వీఆర్లోని నాలుగు ఒరిజినల్ హార్డ్ డిస్క్‌లు తీసేసి కొత్తవి బిగించారు. మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల ఫుటేజీ మాయమైంది. సీపీ కమాండ్ కంట్రోల్ కళ్ల ముందే కెమెరాలు ఆగిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేరం మాత్రం ఒక హోంగార్డు, ఒక హెడ్ కానిస్టేబుల్ నెత్తిన పడింది. ఒరిజినల్ హార్డ్‌డిస్క్‌లు ఇప్పటికీ దొరకలేదని చార్జిషీటే ఒప్పుకుంది. కళ్లెదుటే సాక్ష్యాల తొలగింపు » కొడుకు కనిపించకపోవడంతో తల్లి గాదె విజయలక్ష్మి మే 28న సీపీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జూన్ 5న ఉన్నతాధికారులందరికీ రిజిస్టర్డ్ పోస్ట్‌లో వినతులు పంపారు. అయినా సీపీ పట్టించుకోలేదు. హైకోర్టు ఒత్తిడి పెరిగాక జూన్ 19న ఆమె నేరుగా కలిస్తేనే కేసు నమోదుకు ఆదేశించారు. ఆ 22 రోజుల్లోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రూమ్ గోడలపై ఉన్న రక్తపు మరకలను కత్తితో రుద్దేసి.. తొలగించి రంగులు వేశారు. మృతుడి ఫోన్‌ను గోవాకు పంపి ‘బతికే ఉన్నాడు’ అనే నాటకం ఆడారు. సీసీ కెమెరాలు పీకేశారు. ఈ సాక్ష్యాల ధ్వంసం అంతా ఆ 22 రోజుల్లోనే జరిగిందని చార్జిషీట్ చెబుతోంది. సీపీ సకాలంలో స్పందించి ఉంటే ఈ సాక్ష్యాలన్నీ మిగిలేవి కావా? » సాయికృష్ణ తల్లి వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్లో ప్రతివాదులు డీజీపీ, సీపీ. వారి తరఫున జూన్ 4న, మళ్లీ జూన్ 15న ‘సాయికృష్ణ మా కస్టడీలో లేడు’ అని హైకోర్టుకు సమాచారం వెళ్లింది. ‘మూడు ప్రత్యేక బృందాలు వేశాం. మార్కాపురం సహా పలుచోట్ల గాలించాం. 74 మందిని విచారించాం’ అంటూ న్యాయ స్థానానికే కట్టుకథ వినిపించారు. మూడు ప్రత్యేక బృందాలు వేసే అధికారం సీఐకి ఎక్కడిది? అది కమిషనరేట్ స్థాయి నిర్ణయం. అయినా ఈ అబద్ధానికి సీఐ ఒక్కడే బాధ్యుడని సిట్ తేల్చేసింది. » జూన్ 15న సీఐని వీఆర్‌కు పంపారు. అంటే ఆ రోజుకే పెద్దలకు అనుమానం వచ్చింది. అదే రోజు ‘కస్టడీలో లేడు’ అనే అబద్ధం సీపీ ప్రతివాదిగా ఉన్న కేసులో హైకోర్టుకు చేరింది. దాన్ని ఆమోదించిన అధికారి ఎవరో సిట్ కనీసం ఆరా తీయలేదు. » చార్జిషీట్లోని 120 మంది సాక్షుల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పెయింటర్, పెయింట్ షాపు యజమాని, హోటల్ సిబ్బంది ఉన్నారు. కానీ ఈ వ్యవస్థకు అధిపతి అయిన సీపీ పేరు మాత్రం లేదు. సీసీ టీవీ రికార్డుల కోసం ఆయనకు ఒక నోటీసు పంపి, ఆయన కార్యాలయం ఇచ్చిన జవాబుతో సిట్ సరిపెట్టుకుంది. సీఐ వాడిన రెండు ఫోన్లు ఇప్పటికీ దొరకలేదు. ‘ఎక్కడ పెట్టానో గుర్తులేదు’ అని సీఐ చెబితే సిట్ అదే రాసుకుని వదిలేసింది. ఆ ఫోన్లు బయట పడితే మే 6 నుంచి జూన్ 15 వరకు సీఐకి పై నుంచి ఎవరెవరు ఫోన్లు చేశారో బయట పడుతుంది. అందుకే ఆ ఫోన్ల జోలికి వెళ్లలేదా?కీలక పరిణామాలిలా..1) సాయికృష్ణపై రెండు కేసుల్లో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.2) మే 6 తెల్లవారుజామున సీపీ టాస్క్‌ఫోర్స్ బృందం మార్కాపురంలో అతన్ని పట్టుకుంది. 3) అదే రోజు ఉదయం 7 గంటలకు కృష్ణలంక స్టేషన్లో అప్పగించారు. 4) మే 6 నుంచి 9 వరకు నాలుగు రోజులు లాకప్‌లోనే ఉంచారు. 5) గంజాయి సమాచారం కోసం స్టేషన్ పై అంతస్తులోని క్రైమ్ రూమ్‌లో చేతులు హుక్కు వేలాడదీసి కొట్టారు. 6) దెబ్బలకు మోకాళ్లు వాచిపోయాయి. నడవలేకపోయాడు. మూత్రంలో రక్తం వచ్చింది. 7) మే 8న ఆర్ఎంపీ డాక్టర్‌ను స్టేషన్‌కు పిలిపించి ఇంజెక్షన్లు ఇప్పించారు. 8) అదే రోజు ఆ స్థితిలోనే గుణదల ప్రాంతంతోపాటు, ఒక హోటల్‌కు తిప్పారు. 9) మే 9న పరిస్థితి విషమించడంతో రాణిగారితోటలోని పాడుబడిన భవనానికి తరలించారు. 10) మే 12 మధ్యాహ్నం అక్కడే చనిపోయాడు. 11) అదే రోజు రాత్రి బైక్‌పై శవాన్ని స్వర్గపురి శ్మశానానికి తీసుకెళ్లారు. అప్పటికే కాలుతున్న ఓ చితిపై సాయికృష్ణ శవాన్ని వేసి కాల్చేశారు.12) మే 18న మళ్లీ వెళ్లి అవశేషాలు ఏమైనా మిగిలాయేమో చూసి వచ్చారు. 13) తుదకు లాకప్ రిజిస్టర్లలో సాయికృష్ణ పేరే లేకుండా చేశారు. రిపోర్టుల్లో ‘నిల్’ అని రాశారు. 14) సాయి కృష్ణ తల్లి మే 28న సీపీకి ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది జూన్ 19న.సీఐ దగ్గరే ఆగిన చార్జిషీట్» హైకోర్టు కేసులో డీజీపీ కూడా ప్రతివాది. తల్లి వినతులు డీజీపీకీ వెళ్లాయి. సిట్ ఏర్పాటైంది డీజీపీ ఉత్తర్వులతోనే. దర్యాప్తు చేసింది ఆయన కింద పనిచేసే ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు. తమ బాసే ప్రతివాదిగా ఉన్న కేసులో సొంత సీపీ పాత్రను వారు ఎలా విచారిస్తారు? అందుకే చార్జిషీట్ సీఐ దగ్గరే ఆగిపోయింది. » డీజీపీ, సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ కోరుతూ విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఆ విచారణ ముందుకు కదలకుండా ఏసీపీ మానస హైకోర్టుకు వెళ్లి ఆగస్టు 13న స్టే తెచ్చుకున్నారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? » చివరికి సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దర్యాప్తును తానే నేరుగా పర్యవేక్షిస్తానని ప్రకటించింది. సాయికృష్ణను మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరు పరచలేదు.. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది.. సీసీటీవీ ఫుటేజీ ఏమైంది.. మృతదేహం ఎందుకు దొరకలేదు.. అని ధర్మాసనమే నిలదీసింది. ఆ ప్రశ్నలన్నీ వేలెత్తి చూపిస్తున్నది పోలీస్ కమిషనరేట్ వైపే. » సీఐకి డిఫాల్ట్ బెయిల్ గడువు ముంచుకొస్తుండటంతో రెండు రోజుల ముందు హడావుడిగా చార్జిషీట్ వేశారు. బూడిద, ఎముకల ఎఫ్ఎస్ఎల్ నివేదిక, తల్లి రక్త నమూనాతో డీఎన్ఏ పోలిక, ఎన్వీఆర్ లాగ్స్, 15 మెమరీ కార్డులు, 6 హార్డ్‌డిస్క్‌ల డేటా అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని చార్జిషీటే ఒప్పుకుంది. పోస్టుమార్టం లేదు. శవ దహనం కథ అంతా ఒక నిందితుడి వాంగ్మూలంపైనే నిలబడింది. పెద్దల జోలికి వెళ్లకుండా, సగం ఆధారాలు కూడా లేకుండా వేసిన ఈ చార్జిషీట్ కోర్టులో ఎంత వరకు నిలుస్తుందన్నది ప్రశ్నార్థకమే. -
ఈ–కేవైసీ 28 శాతమే పూర్తి
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో భాగంగా రైతుల ఈ–కేవైసీ 28 శాతమే పూర్తయిందని వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు జి.బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. ‘ఈ–పంట నమోదులో రైతుల అగచాట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై శనివారం ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల భూమి విస్తీర్ణపు నమోదులకు గాను 2.70 కోట్ల నమోదులు (98 శాతం) పూర్తయ్యాయని చెప్పారు. అయితే 88,03,057 మంది రైతులకు గాను ఇప్పటివరకు 24,25,455 మందికే ఈ–కేవైసీ పూర్తయిందని, ఇది 28 శాతమేనని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగిస్తున్నామన్నారు. అప్లోడ్ చేసిన ఫొటోలను కృత్రిమ మేధతో పరిశీలించి 98 శాతం ఖచ్చితత్వం సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
సంక్షోభంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగం సంక్షోభంలో పడుతోంది. 2030 నాటికి 1.11 కోట్ల మంది వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. హెల్త్ వర్క్‌ఫోర్స్ లెవెల్స్, ట్రెండ్స్–2026 నివేదికను డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రచురించింది. భారత్ సహా 122 దేశాల వైద్యుల డేటాను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో వైద్యుల్లో 25 శాతం మంది 55 ఏళ్లు, ఆ పైన వయసులో ఉన్నట్లు తెలిపింది. వీరంతా వచ్చే దశాబ్ద కాలంలో రిటైరైతే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా ప్రపంచానికే వైద్యుల కొరత గండం పొంచి ఉన్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించకుండా రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని చంద్రబాబు బలిపీఠం ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కల్పన, ఎక్కువమంది వైద్యులను తయారుచేయాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను గత వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన విషయం తెలిసిందే. వీటిలో 10 కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అక్కడ తరగతులు ప్రారంభించకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నుతోంది. ఫలితంగా మన పేద విద్యార్థుల వైద్యవిద్య కల చెదిరిపోవడమే కాకుండా, రాష్ట్రానికి కొత్తగా వైద్యులు సమకూరే అవకాశాలు లేకుండాపోతున్నాయి. అనుమతులు వచ్చినా ప్రారంభించకుండా..ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతీ 10 వేల జనాభాకు 45 మంది వైద్యులు, నర్సులు ఉండాలి. కానీ, మన దేశంలో వీరు ఈ అవసరాలకు తగ్గట్లుగా లేరు. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2014 నుంచి దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే, 2014–19 మధ్య కేంద్రంలోని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేయకుండా చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం తలపెట్టారు. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయడంతో పాటు, ప్రతీ జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చేపట్టడమే కాకుండా వందేళ్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2023–24లో ఏకంగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా సార్వత్రిక ఎన్నికల నాటికే అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే, ఆ ఏడాది అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలన్నీ ప్రైవేట్‌కు ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పులివెందుల వైద్య కళాశాలను ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులిచ్చినా మాకు కళాశాల వద్దని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసి అనుమతులు రద్దుచేయించింది. ఇలా 2024–25లో నాలుగు, 2025–26లో ఆరు వైద్య కళాశాలలు చొప్పున 10 వైద్య కళాశాలలు ప్రారంభించకుండా చంద్రబాబు గాలికొదిలేశారు. తీవ్రంగా నష్టపోతున్న పేద విద్యార్థులుప్రైవేట్ మోజులో చంద్రబాబు కుట్రల కారణంగా రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు పెద్దఎత్తున ఎంబీబీఎస్, పీజీ సీట్లను కోల్పోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 చొప్పున రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కాకపోవడంతో మరో వెయ్యి సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ఈ లెక్కన మూడేళ్లలో ఏకంగా 3,500 మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రచించిన ప్రణాళిక ప్రకారం 10 వైద్య కళాశాలలు ప్రారంభమై ఉంటే.. మొదటి బ్యాచ్ విద్యార్థులందరూ 2030 నుంచి వైద్య పట్టభద్రులుగా బయటకు వచ్చేవారు. 2030లో 700 మంది, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏటా 1,750 మంది వైద్య పట్టభద్రులు రాష్ట్రానికి సమకూరేవారు. అంతేకాక.. ప్రతీ కాలేజీలో 20 వరకూ పీజీ సీట్లు సమకూరి భవిష్యత్తులో ఏటా 200 మంది కొత్త స్పెషలిస్ట్ వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. -
బీసీలకు వెన్నుపోటు అడ్డంగా దొరికినా బుకాయింపే
సాక్షి, అమరావతి : పార్లమెంట్ చట్టం ద్వారా తప్ప కేవలం జీవోలతో సాధ్యం కాని బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు సగం జనాభా ఉండే వెనుకబడిన తరగతి ప్రజలను మభ్యపెడుతోంది. ఈ క్రమంలో ఆడిన రాజకీయ డ్రామాలో అడ్డంగా దొరికి పోయినా, సీఎం చంద్రబాబు.. మంత్రులు మాత్రం ఇంకా బుకాయించడం మానుకోలేదు. బీసీలకు వెన్నుపోటు పొడవడం అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పైకి నెట్టేసి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ పిటీషన్ దాఖలు చేయకపోయినా, నింద మోపాలని చూస్తున్నారు. మరో వైపు 2020–21లో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అధికారుల స్థాయిలో ఏ స్థానంలో, ఏ సామాజిక వర్గ అభ్యర్థి పోటీ చేయాలనే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో నిలబడదని తెలిసీ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాక కేబినేట్ తీర్మానం పేరుతో మరో డ్రామాకు తెరతీసింది. టీడీపీ నేత ద్వారా కోర్టుకు వెళ్లి అడ్డగింత2020–21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ నేతను ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ (ఎపీఎస్ఈజీసీ)లో సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 96 జారీ చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా, మంత్రులు మాత్రం తాజాగా శనివారం (అక్టోబరు 10న) కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం దారుణం అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు 2020 జనవరిలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అప్పట్లో జనవరి 17వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత బిర్రు పత్రాప్‌రెడ్డి 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి.. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 2020 జనవరి–ఫిబ్రవరి నెలల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఐదేళ్ల కిత్రం ఎన్నికల్లోనే బీసీలకు 34 శాతం పదవులు 2020–21లో జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు రాష్ట్ర హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఆదేశాల అనంతరం కూడా అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు దాదాపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటికి రాష్ట్రంలో మొత్తం 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా, వాటిలో 34 మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకే కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు 2020 మార్చి 7వ తేదీన గెజిట్ నెంబరు 4 జారీ చేసింది. అప్పటికి ఉన్న 16 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు 5 పదవులు కట్టబెట్టింది. అయితే ప్రస్తుత వెన్నుపోటు ప్రభుత్వం.. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీలకు 34 శాతం పార్టీ పరంగా ఇవ్వనున్నామని చెప్పుకోవడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
ఈడీ.. ఎల్లో కేడీ!
సాక్షి, అమరావతి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థ. ప్రధానంగా మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్య చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడం దీని బాధ్యత. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్తా ‘ఎల్లో ఫోర్స్ డైరెక్టరేట్’గా రూపాంతరం చెందింది. బాధ్యతలను గాలికొదిలేసింది. చట్టాలను, కోర్టులను చట్టుబండలను చేసేసింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఆడమన్నట్టల్లా ఆడడం. ఏది చెబితే అది చేయడం... ఈడీ ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అనుకుంటే చంద్రబాబు జేబు సంస్థ అయిపోయిందని విమర్శకులంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని, వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. ఇప్పటికే రెగ్యులర్ విచారణ జరుగుతూ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న వ్యవహారంపై మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరమేమిటని ధర్మాసనం ప్రశ్నించింది, ఆర్థికల్ 21 ప్రస్తావనపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు, వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు, వాటిపై ముందుగానే ఎల్లో మీడియా లో కథనాలు, ఈడీ ప్రెస్‌నోట్, పొలిటికల్ పార్టీ తరహాలో చేసిన ట్వీట్ చూస్తే ఈడీ ఏ స్థాయికి ‘ఎల్లో ఫోర్స్’గా దిగజారిందో తేటతెల్లమవుతుంది. పలు కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు, దిగువ కోర్టులు పలు మార్లు మొట్టికాయలు వేసినా ఈడీ తీరు మారడం లేదు.అవినాష్‌కు నోటీసు.. ముందే ఎల్లో మీడియాలో..వివేకా హత్య కేసుతో ఎలాంటి సంబంధమూ లేని అవినాష్ రెడ్డిపై ఆరోపణలు, సీబీఐ దర్యాప్తు, చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు అన్నీ ముగిసి కోర్టులో విచారణ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత చంద్రబాబుకు మళ్లీ ఏడేళ్ల తర్వాత అవినాష్ అవసరమొచ్చాడు. వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. చంద్రబాబు చెప్పినట్టుగానే.. చెప్పిన సమయంలోనే ఓ నోటీసు ఇచ్చేసింది. ఇక్కడ విశేషమేమిటంటే.. అవినాష్ కు అక్టోబర్ 3న నోటీసు ఇస్తే.. నోటీసు ఇవ్వబోతున్న విషయం చంద్రబాబుకు సన్నిహితులైన ఎల్లో మీడియా అధినేతలకు మూడు రోజులు ముందే తెలిసిపోయింది. అక్టోబర్ 1నే ఈ నోటీసు విషయాన్ని ఎల్లో పత్రికలు, చానళ్లు ప్రముఖంగా ప్రచురించేసాయి.. ప్రసారం చేసేశాయి.అంటే అర్ధం కావడం లేదూ ఈడీ ఏం చేస్తుందో.. ఎవరి తరఫున పనిచేస్తుందో... ఒక్క అవినాషే కాదు.. చంద్రబాబు వేలు ఎవరివైపు తిరిగితే వాళ్లను వేధించడం ఈడీ ప్రధాన బాధ్యత అన్నట్టు అయిపోయింది. మిధున్‌రెడ్డి అయినా, కారుమూరి నాగేశ్వరరావైనా, సునీలైనా, అంబటి రాంబాబైనా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయినా.. విక్రాంత్‌రెడ్డి అయినా.. నోటీసులు, అరెస్టులు, వేధింపులు మామూలే. చంద్రబాబుకు అవసరమొచ్చినపుడు వెంటనే ఈడీ వాలిపోతోంది. బాబు ప్రత్యర్థులకు.. అంటే వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు.. జనం దృష్టిని మళ్లించడం మామూలైపోయింది. అంటే చంద్రబాబు రాజకీయ అవసరాలను తీర్చే ఒక పనిముట్టులా ఈడీ మారిపోయింది. టార్గెట్ జగన్... ఈడీ కొత్త మిషన్..ఈడీకి చంద్రబాబు ఇప్పుడు ఓ కొత్త మిషన్ అప్పగించారు. అదే టార్గెట్ జగన్. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ తమ వాణి వినిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రం నుంచి తప్పించి కోర్టుల చుట్టూ తిప్పాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందులో భాగంగానే వేగవంతమైన విచారణ పేరుతో వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ హైకోర్టును అభ్యర్థించడం. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం తప్ప ఇందులో ఈడీ చట్టబద్ధంగా చేస్తున్న డ్యూటీ ఏదీ లేదు. ఎందుకంటే సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై ఇప్పటికే రోజువారీ ట్రయల్ నడుస్తోంది. జగన్ తరఫున న్యాయవాదులు హాజరై తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగా వ్యక్తిగతంగా జగన్ హాజరు కావాలంటూ ఈడీ పిటిషన్ వేయడం కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం జరుగుతున్న దురుద్దేశ చర్య మాత్రమేనని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. చంద్రబాబు వేస్తున్న సొంత సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)లు ఆయన క్షేమం కోసం, ఆయన చెప్పినట్లు దర్యాప్తు చేయడం కోసం పరుగులు పెడుతుంటాయి. ఇపుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ అనే గౌరవాన్ని కోల్పోయిందని, చంద్రబాబు సిట్‌కు ఎక్స్టెన్షన్ ఆఫీసులా మారిపోయిందని న్యాయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి.కోర్టులెన్ని మొట్టికాయలు వేసినా..ఆల్రెడీ సీబీఐ కోర్టులో రెగ్యులర్‌గా విచారణ జరగడం, హైకోర్టుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేయడం జరుగుతున్నాయి. అయినా తుత్తర ఆగక ఈడీ అడిగినట్టుగానే కొద్దికాలం క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు వేగవంతమైన విచారణ జరగాలంటూ కేసు వేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెల్సిందే. అలాగే మరో రెండు కేసుల విచారణ సందర్భంగానూ కోర్టులు స్పష్టమైన తీర్పులిచ్చాయి. తెలంగాణ హైకోర్టులో జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తూ 2022 సెప్టెంబర్8న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అతి ముఖ్యమైన తీర్పునిచ్చింది. ఈడీ కేసులో తుది తీర్పును సీబీఐ ప్రధాన కేసులో తీర్పు వెలువడే వరకు వాయిదా వేయాలని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ కేసులో తీర్పు ముందుగా రావడం న్యాయ ప్రయోజనాలకు అనుకూలమని పేర్కొంది. నేరం ద్వారా ఆదాయం వచ్చిందని నిర్ధారించే ముందు, అసలు ఆ వ్యక్తి సంబంధిత నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో 2022 జులై 27న సుప్రీంకోర్టు కూడా ఇదే విధమైన తీర్పు ఇచ్చింది. అసలు నేరం జరిగిందా? ఎవరి పాత్ర ఎంత అనే విషయాలను సీబీఐ తేల్చాల్సి ఉందని, ఆ తర్వాతే నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాలను ఈడీ తేల్చ వచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. మరి జగన్ కేసుల విషయంలో ఈడీ ఎందుకు తొందర పడుతోంది? వాస్తవమేమిటో తేలకుండా తొందరపాటులో ఔచిత్యమేమిటి? ఎవరు చెబితే ఇలా నిబంధనలకు, న్యాయస్థానాలకు విరుద్ధంగా ఈడీ తొందరపడుతోంది...?తప్పుడు కేసులు.. త్వరగా ముగియాలనే..నిజానికి సీబీఐ, ఈడీ అక్రమంగా మోపిన అభియోగాలు, తప్పుడు కేసులు త్వరగా ముగిసిపోవాలని, నిజానిజాలేమిటో తేలిపోవాలనే వైఎస్ జగన్ కోరుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాదులు అనేకమార్లు స్పష్టం చేశారు. జగన్ తరఫు న్యాయవాదులు కానీ, జగతి తరఫు న్యాయవాదులు కానీ సీబీఐ అక్రమ కేసుల్లో ఎప్పుడూ వాయిదా తీసుకోలేదు. అంటే కేసులు త్వరత్వరగా విచారణ జరగాలనే కోరుకున్నారని అర్ధం కావడం లేదూ? పొలిటికల్ ప్రెస్‌నోట్.. ట్వీట్..కొత్తగా కేసులు నమోదైనప్పుడో, లేదా ఒక కేసుకు సంబంధించి రికవరీలు ఉన్నప్పుడో ఈడీ ప్రెస్నోట్లు విడుదలచేయడం సహజంగా జరుగుతుంటుంది. కాని, అకస్మాత్తుగా ఏ పరిణామం లేకుండానే, కొనసాగుతున్న కేసులగురించి, అందులోనూ కోర్టుల్లో ట్రయల్ నడుస్తున్న కేసులగురించి ఈడీ ప్రెస్‌నోట్ రిలీజ్చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ ప్రెస్ నోట్ చూస్తే అందులో అది దర్యాప్తు సంస్థ ప్రెస్‌నోట్ మాదిరిగా కాకుండా, పూర్తిగా రాజకీయ అంశాలతో ముడిపడినట్టుగా స్పష్టంగా ఉంది. ఈడీ ప్రకటన వెలువడిన వెంటనే ఎల్లో మీడియా మరింత శివాలెత్తిపోయింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని అర్ధం కావడం లేదూ? అయినా ఓ రాజకీయ పార్టీ ట్వీట్ చేసినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ట్వీట్ చేయడం చూస్తే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర దాగి ఉందో తెలుస్తూనే ఉంది.ఈడీ బరితెగింపును బట్టబయలు చేసిన హైకోర్టు..జగన్మోహన్రెడ్డిపై అక్రమంగా మోపిన కేసుల విచారణకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈడీపై కీలక ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షిస్తోందని, ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఇచ్చినప్పుడు మళ్లీ పిటిషన్ దాఖలు చేయడంలో ఈడీ ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. సంబంధిత కేసుల విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులు తమకు తెలుసని వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటు ఇతరులపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసుల్లో రోజువారీ విచారణ జరిపించి, త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసినప్పుడు, మరో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్నప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదని గుర్తుచేస్తూ, ఈడీ తన పిటిషన్లో ఆ నిబంధనను ఎలా ప్రస్తావిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, తాజా పిటిషన్ విచారణార్హతపైనా సందేహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్), సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నమోదైన సుమోటో కేసులతో కలిపి ప్రస్తుత పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. -
కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ముగ్గురు సీఎంల ముచ్చట నడుస్తోందని.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కేవలం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ.109 కోట్ల ప్రజాధనాన్ని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చుచేసిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా కేవలం ప్రచార ఆర్భాటాలతో పబ్లిసిటీ పీక్, విషయం మాత్రం వీక్ అన్న చందంగా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ లు ముగ్గురు ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో కోసం జరుగుతున్న ఖర్చును గణాంకాలతో సహా నిలదీశారు.గతంలో వైఎస్ జగన్ అందించిన 38 సంక్షేమ పథకాల్లో 34 పథకాలను అడ్డగోలుగా ఎత్తేసిన కూటమి ప్రభుత్వం, మిగిలిన అరకొర పథకాలనే ప్రతి నెలా జిల్లాల వారీగా పదే పదే ప్రారంభిస్తూ ప్రజల సొమ్ముతో ప్రచార ఈవెంట్లు నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు.రాజకీయాల్లో చంద్రబాబును మించిన బూటకపు స్టార్ లేడుసినిమాల్లో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నటులు ఉన్నారు. వాళ్లది నటన వృత్తి. కానీ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక మాయల మరాఠీగా మారారు. నటనలో, డ్రామాల్లో, బూటకాల్లో చంద్రబాబును మించిన స్టార్ దేశంలోనే లేడు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తెస్తే వివరాలు చెప్పడం ఆనవాయితీ. కానీ 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ' అన్నట్లు ఒకే పథకాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాలో మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ చంద్రబాబు ఈవెంట్ మేనేజర్‌గా మారారు. నిన్న ప్రకాశం జిల్లాలో జరిగింది కూడా అదే తతంగం. కేడర్‌ను ఉత్తేజపరచడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు.ఆత్మస్తుతి.. పరనింద.. జగనన్న జపం..ప్రపంచ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వింత జీవిని ఎక్కడా చూసి ఉండం. వేదిక ఏదైనా ఆయన నోట వినిపించేది మూడే విషయాలు. ఒకటి ఆత్మస్తుతి, రెండు పరనింద, మూడు జగనన్న జపం. 45 ఏళ్ల అనుభవం ఉందని సొంత డబ్బా కొట్టుకోవడం ఆత్మస్తుతి అయితే, ప్రసంగంలో 70 శాతం వైఎస్ జగన్‌ని విమర్శించడమే పరనింద. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల బుర్రల నిండా వైఎస్ జగనే ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్ జగన్ స్థానాన్ని చెరిపివేయలేక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. వర్షాభావం, కరువు, రైతాంగ సమస్యలపై మాట్లాడకుండా పదే పదే గత ప్రభుత్వంపై బురద చల్లడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరు, మీ ప్రసంగాల్లో వైఎస్ జగన్ పేరునే పదేపదే ప్రస్తావిస్తున్నారు? మీ ఆలోచనల్లో, మీ రాజకీయాల్లో జగన్‌గారే కనిపిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. వైఎస్ జగన్‌ని విమర్శించడం, ఆయన కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారం చేయడం మానేసి, మీ పాలన గురించి మాట్లాడండి. 28 నెలల పాలనలో ఏం సాధించారో, సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏమిటో, సూపర్ సెవెన్ గురించి ఏం చెబుతారో ప్రజలకు వివరించండి.మద్యం కేసు, వివేకానందరెడ్డి కేసు వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడం కాకుండా, మీ ప్రభుత్వ పరిధిలోని బాధ్యతలపై సమాధానం చెప్పండి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై దృష్టి పెట్టి, వారికి ఎంత పరిహారం ఇస్తారో ప్రకటించండి. జగన్‌గారిని విమర్శించడం కాదు.. మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పమని సవాల్ చేస్తున్నా.ముగ్గురు సీఎంలు.. హెలికాప్టర్లకే మంచినీళ్లలా రూ.109 కోట్లు ఖర్చుచంద్రబాబు తాను లక్ష కోట్ల అధిపతి ఎలా అయ్యారో ప్రజలకు టెక్నిక్ చెప్పాలి. హెరిటేజ్ దుకాణాలతో, రెండు ఎకరాలతో లక్ష కోట్లు ఎలా వచ్చాయి? ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. కరకట్ట ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్, అక్కడి నుంచి ప్రత్యేక విమానం, గమ్యస్థానంలో మళ్లీ హెలికాప్టర్.. ఇలా ఒక్క పర్యటనకే మూడు వాహనాలు వాడుతున్నారు. ఈయనతో పాటు అబ్బాయి లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఉంటే, ఇక్కడ ముగ్గురు సీఎంలు ఉన్నట్లుగా దోపిడీ సాగుతోంది.2024-25లో విమాన ప్రయాణాలకు రూ. 54.41 కోట్లు, 2025-26లో రూ. 54.63 కోట్లు.. మొత్తంగా 28 నెలల కాలంలో కేవలం విమానాలు, హెలికాప్టర్ల కోసమే రూ. 109.04 కోట్లు తగలేశారు. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పటికే రూ. 31 కోట్లు ఖర్చు చేసేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ కల్యాణానికి వెళ్తే టీటీడీ లెక్కల్లో రూ. 35 లక్షల ఖర్చు చూపించారు. లేస్తే ఖర్చు, కూర్చుంటే ఖర్చు అన్నట్లుగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారు.సభా వేదికలు, టెంట్లు, కుర్చీలు, మైకులు, విద్యుత్, ఎల్ఈడీ తెరలు, హెలిప్యాడ్లు, ప్రజల తరలింపునకు బస్సులు, ఇతర వాహనాలు, స్వాగత ఏర్పాట్లు, బ్యానర్లు, ప్రచార సామగ్రి, అధికారుల ద్వారా చెల్లించే బిల్లులు—వీటి ఖర్చులు ఇంకా అదనం. ఇవన్నీ ప్రజల సొమ్ము కాదా? ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ఇంత ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పర్యటనలకే ఇంత ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఈవెంట్ మేనేజ్మెంట్ పాలన - ప్రచార ఖర్చు రూ.44.62 కోట్లురాష్ట్రంలో పరిపాలన సాగడం లేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మార్చేశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుటుంబాలను కలవడం, టీ బంకుల వద్దకు వెళ్లడం, మర్మరాల వ్యాపారిణితో మాట్లాడటం వంటి కార్యక్రమాలను ప్రచార ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్టు ప్రకారం ప్రశ్నలు, సమాధానాలతో సాగిన ఈ కార్యక్రమం కోసం రూ.44.62 కోట్లు ఖర్చు చేశారు. రోజుకు వందల మందికి మర్మరాలు అమ్ముతూ వేలల్లో ఆదాయం వస్తోందని చెప్పిన వ్యాపారినికి ముఖ్యమంత్రి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు చేసినట్లు ప్రకటించడం కూడా ప్రచారానికే పరిమితమైంది. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన ప్రభుత్వం, ప్రచార కార్యక్రమాలకే ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నాం.ఒకే పథకానికి పదే పదే ప్రారంభోత్సవాలు..కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ పీక్స్.. రియాలిటీ వీక్ అన్నట్లుగా ఉంది. జగన్ హయాంలో 38 పథకాలు ఉంటే, బాబు వచ్చాక 34 పథకాలను పీకేశారు. ఇచ్చే అరకొర పథకాలకే వందల కోట్ల ప్రచారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో ఇప్పటివరకు 28 సార్లు వేర్వేరు జిల్లాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. మీ భూమి-మీ హక్కు పేరుతో 9 సార్లు సభలు పెట్టారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పేరుతో 21 సార్లు, సంజీవని ఆరోగ్య కార్యక్రమం పేరిట 4 సార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఒకే పథకాన్ని ఇన్నిసార్లు ప్రారంభిస్తూ ప్రజల పన్నుల సొమ్ముతో సభలు, ఫ్లెక్సీలు, డీజేలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు.దోపిడీ కోసమే పల్లె పండుగ.. ప్రాజెక్టుల వద్ద క్రెడిట్ చోరీ..పల్లె పండుగ పేరిట కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ నిధులతో రొటీన్‌గా జరిగే పనులను తెచ్చి రూ. 11 వేల కోట్ల నిధులు తమ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. గతంలో సీ-ప్లేన్ అంటూ పెద్ద డ్రామా ఆడారు, ఇప్పుడది ఎక్కడుందో తెలియదు. వెలుగొండ ప్రాజెక్టును 85 శాతం పూర్తి చేసింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి గారే. కానీ చంద్రబాబు అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడుకుని దండాలు పెడుతూ క్రెడిట్ చోరీ డ్రామాలు ఆడుతున్నారు. అనకాపల్లి జిల్లా జిల్లాకు గోదావరి జలాలు తరలింపు అంశంలో కూడా సేమ్ డ్రోన్లు, కెమెరాలు, బొక్కబోర్లా పడుకోవడం, అప్పటికే ఉన్న లిఫ్ట్ ద్వారా నీరు తరలించి పోలవరం కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లి తీసుకొచ్చినట్టుగా బిల్డప్ ఇస్తూ చంద్రబాబు హంగామా చేశాడు. అక్కడ కూడా చంద్రబాబు బొక్కబోర్లా పడుకుని దండాలు పెట్టాడు. కెమెరా అనగానే చంద్రబాబులోకి పది మంది ఎన్టీఆర్‌లు, చిరంజీవులు పూనినట్లు నటిస్తారు.పాస్ పుస్తకాలపై రంగుల మార్పు.. కమిషన్ల దందా..ప్రకాశం జిల్లా కొండేపికి వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు... వైఎస్ జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలకు కేవలం రంగు మార్చి ఇస్తున్నారని.. అయితే అందులో కూడా పేర్లు, సర్వే నంబర్లలో తప్పులతో ఉన్నాయని సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో రూ. 55.79 పైసలకే అత్యాధునిక క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో పుస్తకాలు ఇస్తే.. నేడు వాటి ధరను రూ. 76 చేసి.. ఒక్కో పుస్తకంపై పెంచిన రూ. 20 కమిషన్ ఎవరి జేబుల్లోకి వెళ్తోందని నిలదీశారు? వైఎస్ జగన్ హయాం కంటే ఒక్క విషయంలోనైనా మెరుగ్గా పరిపాలించానని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఒక్క ఎస్సీలకే రూ.70 వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా అందించారని.. ఆయన పెట్టిన అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్మెంట్, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని సుధాకర్ బాబు నిలదీశారు.ఇదీ చదవండి: పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల -
దసరా ఉత్సవాలకు సిద్ధమైన బెజవాడ దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు బెజవాడ దుర్గమ్మ దేవాలయం సిద్ధమైంది. ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 11 నుంచి 20 వరకూ దసరా మహోత్సవాలు జరగనున్నాయి. స్నపనాభిషేకం అనంతరం రేపు(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. దాంతో పది రోజుల పాటు రోజుకో అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.దసరా మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాలుఅక్టోబర్ 11 వ తేదీ బాలా త్రిపురసుందరీ దేవిఅక్టోబర్ 12 వ తేదీ గాయత్రీ దేవిఅక్టోబర్ 13 వ తేదీ అన్నపూర్ణాదేవిఅక్టోబర్ 14 వ తేదీ మహాచండీ దేవిఅక్టోబర్ 15 వ తేదీ లలితా త్రిపుర సుందరీ దేవి అక్టోబర్ 16 వ తేదీ సరస్వతి దేవి (మూలానక్షత్రం)అక్టోబర్ 17 వ తేదీ మహాలక్ష్మీ దేవిఅక్టోబర్ 18 వ తేదీ దుర్గాదేవి ( దుర్గాష్టమి)అక్టోబర్ 19వ తేదీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)అక్టోబర్ 20వ తేదీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం -
ఈసీకి వైఎస్సార్సీపీ కీలక లేఖ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటరు జాబితాలో చట్టబద్ధంగా నమోదైన అర్హులైన పౌరులందరినీ స్థానిక ఓటర్ల జాబితాలో చేర్చి, వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను (ఎస్ఈసీ) కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఒక లేఖ రాశారు.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి పాత ఓటరు జాబితాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, ఆ తర్వాత జూలై 15 వరకు నియమనిబంధనల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్న వేలాది మంది అర్హులైన ఓటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోతారని ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించేలా, సంబంధిత అనుబంధ మార్పులతో కూడిన తాజా జాబితాను తగినంత ముందుగానే ప్రచురించాలని ఆయన ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఇంకా లేఖలో ఏయే అంశాలు ప్రస్తావించారంటే..జూలై 15 వరకు నమోదైన ఓటర్లను పరిగణనలోకి తీసుకోవాలి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం, 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో నమోదైన అర్హులైన ఓటర్లందరినీ స్థానిక సంస్థల ఎన్నికల జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభమైన తేదీగా పేర్కొన్న 2026 జూలై 15వ తేదీ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ నిలిపివేయబడినట్లు భావిస్తున్నాం. కాబట్టి ఆ తేదీ వరకు నమోదైన వారిని తప్పనిసరిగా చేర్చాలి.ఫిబ్రవరి 5 నాటి పాత జాబితాతో అన్యాయం: ఈ ఎన్నికల కోసం కేవలం 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి ఓటరు జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తేదీ వరకే జాబితాను పరిమితం చేయడం వల్ల, 2026 జూలై 15 వరకు భారత ఎన్నికల సంఘం రికార్డుల్లో చట్టబద్ధంగా పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత జాబితాలో చేరిన పౌరులందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు.ప్రజాస్వామ్య హక్కును కాలరాయవద్దు: ఈ ఓటర్లందరూ నిర్దేశిత నమోదు ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. వారి పేర్లు ఇప్పటికే అధికారిక ఓటరు రికార్డుల్లో నమోదై ఉన్నాయి. తదనంతరం ఆమోదించబడిన చేర్పులను పరిగణనలోకి తీసుకోకుండా, పాత ఓటరు జాబితాతోనే ముందుకు వెళ్లడం వల్ల అర్హులైన పౌరులు తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోవలసి వస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే సమాన అవకాశం ప్రతి అర్హుడైన ఓటరుకూ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి, జాబితాను ముందే ప్రచురించాలి: ఈ నేపధ్యంలో 2026 జూలై 15వ తేదీ వరకు నవీకరించబడిన ఓటరు జాబితాలను, సంబంధిత అనుబంధంగా ఆమోదించబడిన మార్పులతో సహా వెంటనే స్వీకరించాలి. క్షేత్రస్థాయి అధికారులకు ఈ అంశంపై స్పష్టమైన, ఏకరూప మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు, నవీకరించిన స్థానిక సంస్థల ఓటరు జాబితాలను తగినంత ముందుగానే ప్రచురించాలి. తద్వారా ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడంతో పాటు, ఏవైనా పేర్లు గల్లంతై ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుందని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన -
సీపీఎం నేత గఫూర్ కుమారుడి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం నేత గఫూర్ కుమారుడు కిరణ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి.. కాలిఫోర్నియాలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ.. మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు.కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఎ. అబ్దుల్ గఫూర్, పి. నిర్మల గార్ల దుఃఖం వర్ణనాతీతం. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలన్న వైఎస్ జగన్.. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కిరణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఇదీ చదవండి: ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు -
పార్టీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా, అవసరమైనప్పుడు న్యాయపరమైన ఆయుధంలా నిలవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పూడి శ్రీహరి, లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైన దశలోకి వెళ్తున్నాయని, పార్టీ లీగల్ సెల్ ఇక సాధారణ అనుబంధ విభాగంగా కాకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని న్యాయపరంగా పర్యవేక్షించే వ్యవస్థగా పనిచేయాలని అన్నారు.రాష్ట్రంలో చట్టాలు, నిబంధనలు, ఎన్నికల వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలవడం లేదని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, దాడులు, వేధింపులు జరిగాయని, అలాంటి పరిస్థితుల్లో లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని అభినందించారు.ఎస్ఐఆర్ పూర్తయ్యేలోపే ఎన్నికలకు ఎందుకు తొందర?ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో చనిపోయినవారి, డూప్లికేట్, అనర్హ ఓట్లు తొలగిస్తున్న పరిస్థితుల్లో, కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని సజ్జల అన్నారు. ఎస్ఐఆర్ ఫైనల్ జాబితా త్వరలోనే రావాల్సి ఉన్నప్పుడు, దానికి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారిని జాబితాలో చేర్చకుండా ఎన్నికలు నిర్వహిస్తే వారి రాజ్యాంగబద్ధ హక్కు దెబ్బతింటుందని అన్నారు.బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలిబీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో పెట్టకుండా శాతం నిర్ణయించడం ఏ ప్రాతిపదికన జరిగిందో వెల్లడించాలని సజ్జల డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆధారాలు వెల్లడించాలని అన్నారు.నామినేషన్ దశ నుంచే అప్రమత్తంగా ఉండాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు పోరాటం నామినేషన్ దశ నుంచే ప్రారంభమవుతుందని సజ్జల అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్ఓసీలు, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అభ్యర్థులకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని, అందువల్ల ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయించాలని సూచించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నామినేషన్లకు చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు, ప్రత్యామ్నాయ అభ్యర్థులు, అవసరమైన లీగల్ టీమ్‌లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చెప్పారు.గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీగల్ నెట్వర్క్ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే న్యాయవాదులను మ్యాపింగ్ చేసి, వారి కాంటాక్ట్ వివరాలను కంప్యూటరైజ్ చేయాలని సజ్జల సూచించారు. గ్రామ స్థాయి అభ్యర్థికి కూడా తనకు అవసరమైనప్పుడు ఏ న్యాయవాదిని సంప్రదించాలో ముందుగానే తెలిసేలా వ్యవస్థ ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ వార్‌రూమ్, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు, రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే జిల్లా నుంచి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరి, అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్, కోర్టులను ఆశ్రయించేలా వ్యవస్థ పనిచేయాలని చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ముందుగానే గుర్తించి, అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.ప్రతి అక్రమాన్ని రికార్డు చేయాలిఎన్నికల సమయంలో అధికారులు, పోలీసులు లేదా ఇతరులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని ఆధారాలతో నమోదు చేయాలని సజ్జల చెప్పారు. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటన, ప్రతి అధికారిపై వచ్చిన ఆరోపణను డిజిటల్‌గా రికార్డు చేసి, అవసరమైతే లీగల్ చర్యలకు ఉపయోగించాలన్నారు. ఫీల్డ్ స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని మీడియా, సోషల్ మీడియా, లీగల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచింది: పొన్నవోలువైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వేధింపుల సమయంలో లీగల్ సెల్ వారికి భరోసాగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన, పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిన సందర్భాల్లో లీగల్ సెల్ వీధుల్లోనూ, కోర్టుల్లోనూ పోరాడిందన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేస్తున్న ప్రతి న్యాయవాదిని భవిష్యత్తులో పార్టీ గుర్తిస్తుందని, వారికి తగిన గౌరవం లభించేలా చూడాలని కోరారు.అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డివైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చని, అందువల్ల న్యాయవాదులు వారికి ప్రతి దశలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు.నామినేషన్ పత్రాలు నింపడం నుంచి దాఖలు చేయడం వరకు, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలు పొందడం వరకు లీగల్ సెల్ పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏ అభ్యర్థి నామినేషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురికాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్‌కు సమర్పించిన పత్రాలన్నింటినీ స్కాన్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు డిజిటల్ రూపంలో కూడా పంపితే, తర్వాత పత్రాలు లేవని చెప్పి తిరస్కరించే పరిస్థితుల్లో ఆధారంగా ఉపయోగపడుతుందని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించి అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని చెప్పారు.ప్రతి నియోజకవర్గంలో న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ అభ్యర్థులకు కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు జరిగినా వారికి ధైర్యం చెప్పి, చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత లీగల్ సెల్‌పై ఉందన్నారు. తాను కూడా అనేక కేసులు, జైలు జీవితం ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ, కష్టాలను భయపడకుండా గట్టిగా నిలబడటం ద్వారానే రాజకీయంగా ఎదగగలమని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే నాయకులే భవిష్యత్తులో మరింత ఉన్నత బాధ్యతలకు ఎదగగలరని అన్నారు. అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా దాఖలు కావడం నుంచి వారి గెలుపు వరకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లీగల్ సెల్ ప్రధాన పాత్ర పోషించాలి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం: మనోహర్రెడ్డిలీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం సాధారణ పార్టీ సమావేశం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించే బాధ్యతతో ఏర్పాటు చేసిన సమావేశం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలీస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలు, రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాల్లో న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.నియోజకవర్గ కమిటీలను వెంటనే పూర్తి చేసి, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరమైన న్యాయసహాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. లీగల్ సెల్లో నిజాయితీగా, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రోత్సహించాలని, అవకాశవాదులను దూరంగా ఉంచాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో పార్టీ అభ్యర్థులకు పూర్తి న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్ రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన -
AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక వివరాలు వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. 15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 16 రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు రోజుల తర్వాత ఫలితాలు రానున్నాయి.పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు.పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ ప్రకటించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు మెటీరియల్ సిద్ధం చేశాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్ -
ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మేనిఫెస్టోలో హామీకి చంద్రబాబు మంగళం పాడేశారు. 34 శాతం రిజర్వేషన్ హామీకి చంద్రబాబు ఎగనామం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. బీసీ రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది.బీసీ రిజర్వేషన్ల చట్టం చేయడంపై కనీసం చర్చించని చంద్రబాబు కేబినెట్.. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కనీసం ప్రయత్నించలేదు. కేంద్రాన్ని 34 శాతం రిజర్వేషన్ కోరుతూ కనీసం తీర్మానం చేయని కేబినెట్.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌కి ఆమోదం తెలిపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు భారీ కోత పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రులు వెల్లడించారు.ఆ జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్న మంత్రి అచ్చెన్నాయుడు.. 26.73 శాతం పంచాయతీ వార్డు మెంబర్లకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు. సర్పంచ్ లు 27.95 శాతం, ఎంపీటీసీలు 25.55, ఎంపీపీలు 24.60, జడ్పీటీసీలు 24.60, జడ్పీ ఛైర్మన్ లు 23.08 శాతం ఇస్తాం. అర్బన్ వార్డు మెంబర్లు 32.78శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మున్సిపల్ చైర్ పర్సన్లు 33.02, మేయర్లు 35.29 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు తీరని ద్రోహం జరిగింది. 2014-19 మధ్యలోనూ బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికలు పెట్టకుండా బీసీ నాయకత్వాన్ని తగ్గించేశారు. గతంలో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. బిర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి -
ఈ–పంట నమోదులో అన్నదాతలకు అగచాట్లు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా అమలైన ఈ–క్రాప్ నమోదును చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ–పంట నమోదులో ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కీలకమైన ఈ–పంట నమోదులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. సీజన్ ముగిసినప్పటికీ ఈ–పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్వీయ నమోదు, ప్రైవేటు సర్వేయర్ల నియామకం, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు.. ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు మాత్రం శూన్యమే. మరో రెండు వారాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న తరుణంలో రైతుల ఈ–పంట నమోదు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు కరువు బారిన పడిన రైతులు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పొందాలన్నా, పంటల బీమా పరిహారానికి అర్హత పొందాలన్నా ఈ–కేవైసీ కీలకం. సీజన్ ముగిసి పదిరోజులు కావొస్తున్నా ఈ–కైవేసీ నమోదు మాత్రం 19 శాతానికి పరిమితమైంది. స్వీయ నమోదుకు స్పందన శూన్యం..ఈ–పంట నమోదులో 2024 ఖరీఫ్ సీజన్లో రైతులకు మొదలైన కష్టాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్రరూపం దాల్చాయి. సీజన్ ప్రారంభమైన 20 రోజుల్లో ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ రెండున్నరేళ్లుగా ఏ ఒక్క సీజన్లోనూ అలా జరగలేదు. అప్లోడ్ చేసిన పంట ఫొటోలను కృత్రిమ మేధతో విశ్లేషణ చేస్తామని, ఈ పంట నమోదుతో పాటు ఈ–కేవైసీ సమాంతరంగా చేస్తామని బాబు ప్రభుత్వం డబ్బాలు కొట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో ఘోరంగా విఫలమైంది.లక్ష్యానికి ఆమడ దూరంలో..డిజిటల్ ఈ–క్రాప్ సర్వేలో ల్యాండ్ పార్శిళ్లతో పాటు రైతుల ఈ–కేవైసీ 100 శాతం పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మంజూరవుతాయి. రాష్ట్రంలో 2.76కోట్ల ల్యాండ్ పార్శిళ్లు ఉండగా, దాదాపు రెండు నెలల పాటు నమోదు ప్రక్రియ నత్తనడకనే సాగింది. చివరికి ప్రైవేటు సర్వేయర్లను నియమించడం, ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించడంతో దాదాపు 2.62 కోట్ల ల్యాండ్ పార్శిళ్లలో సాగు వివరాలను నమోదు చేయగలిగారు. కానీ కీలకమైన రైతుల ఈ–కేవైసీ నమోదు ఘోరంగా సాగుతోంది. ఈ సీజన్లో 84.34 లక్షల మంది రైతుల ఈ–కేవైసీ నమోదు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మొబైల్ యాప్‌లోనే ఈ–పంట/ఈ–కేవైసీ పూర్తి చేసే ఏర్పాటు చేశారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అయినా పని ఒత్తిడి సాకుతో వారు ఈ–కేవైసీ నమోదు జోలికి పోవడం లేదు.ఆర్బీకే సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వ్యవసాయేతర పనుల కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఈ–కైవేసీ నమోదు ముందుకు సాగడం లేదు. ఓ వైపు ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతున్నాయి. ఇతర పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మరోవైపు పంటల బీమా కోసం ప్రీమియం నమోదు చేసిన రైతుల వివరాలను బీమా కంపెనీలకు పంపాల్సిన సమయం ముంచుకొస్తోంది. కానీ రైతుల ఈ–కేవైసీ మాత్రం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. వారానికి నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేస్తున్నా ఫలితం మాత్రం కన్పించడం లేదు. దీంతో ఈ–కేవైసీ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఆలోచనశక్తికి ఏఐ వైరస్
సాక్షి, అమరావతి: సైన్స్ ప్రాజెక్టా? కృత్రిమ మేధ సిద్ధంగా ఉంది. వ్యాసం రాయాలా? ఏఐ సెకన్లలో రాసిచ్చేస్తుంది. కోడింగ్ ఎర్రరా? టూల్ సరిచేస్తుంది. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం విద్యారంగాన్ని పరుగులు పెట్టించడం నిజమే అయినా.. దానికి సమాంతరంగా విద్యార్థుల స్వతంత్ర ఆలోచనశక్తికి గండికొడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల చేతికి వచ్చిన సరికొత్త ‘కాగ్నిటివ్ ఆఫ్–లోడింగ్’ (మెదడు చేయాల్సిన ఆలోచనను మెషీన్‌కు అప్పగించే ధోరణి) యువతరాన్ని ఆలోచనశక్తి హీనులుగా మార్చేస్తోందంటున్నారు. ఇది భవిష్యత్ తరాలను వేగంగా ప్రమాదంలోకి నెడుతోందని ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న అధ్యయనాలు, సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యాసంస్థలు, డిజిటల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ–సింగపూర్), చీగ్ గ్లోబల్ (యూఎస్ఏ) నివేదికల ప్రకారం ఉన్నతవిద్య విద్యార్థుల్లో జనరేటివ్ ఏఐ సాధనాల వినియోగం శరవేగంగా పెరిగింది. మనదేశంలోను ఇంజినీరింగ్ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 50 శాతం మంది విఫలమవడానికి కారణం ఏఐపై అధికంగా ఆధారపడడమేనని చెబుతున్నారు. మెదడును శ్రమపెట్టే విద్యార్థే భవిష్యత్తులో సాంకేతికతను నడిపిస్తాడని, లేదంటే సాంకేతికతే ఆ విద్యార్థిని నడిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఏఐ వినియోగం కొత్తగా అరచేతిలోకి వచ్చిన కృత్రిమ మేధ మనుషుల మేధస్సును తుస్సుమనిపిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో తమ మెదడుకు పనిచెప్పకుండా, ఆలోచనకు పదును పెట్టకుండా సులభంగా పనిపూర్తయ్యే మార్గాల కోసం ఏఐని ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతున్నట్టు డీఈసీ సర్వేలో వెల్లడైంది. హోంవర్క్ చేసేందుకు, ప్రాజెక్టుల కోసం, అసైన్మెంట్లు, అనువాదాలు, పరీక్షల సన్నద్ధత, అకడమిక్ పేపర్ల ఎనాలసిస్.. ఇలా ఒకటేంటి అన్నింటికీ జనరేటివ్ ఏఐ సాధనాలపై ఆధారపడుతున్నట్టు గుర్తించారు. ఈ విధానం ఎక్కువగా, యూకే, లాటిన్ అమెరికా, భారత్, యూఎస్ఏ, యూరప్ దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుసలో యునైటెడ్ కింగ్డమ్ 92–95 శాతంతో మొదటిస్థానంలో ఉండగా మనదేశం 86–89 శాతంతో మూడోస్థానంలో ఉంది. యూకేలో అసైన్మెంట్లు, రీసెర్చ్ సారాంశాలు, కాన్సెప్ట్ క్లారిటీ కోసం, బ్రెజిల్, మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాజెక్టులు, అనువాదాలు, హోంవర్క్ కోసం ఏఐని వాడుతుండగా, భారతదేశంలో కోడింగ్ సమస్యలు, పరీక్షల సన్నద్ధత, ప్రాజెక్టుల కోసం, అమెరికాలో వ్యాసాలు, బ్రెయిన్ స్టార్టింగ్, క్విజ్ ప్రిపరేషన్ కోసం, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాల్లో థీసిస్ రీసెర్చ్, అకడమిక్ పేపర్ల తయారీకి వాడుతున్నారు.శాతాల పరంగా బ్రిటన్ మొదటిస్థానంలో ఉన్నప్పటికీ.. సంఖ్యాపరంగా చూస్తే భారతదేశమే ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. దేశంలో ఉన్న సుమారు 4.3 కోట్లమంది ఉన్నతవిద్య విద్యార్థుల్లో ఏకంగా 3.5 కోట్ల మందికిపైగా రోజూ లేదా వారానికి పలుమార్లు ఏఐని వాడుతున్నట్టు తేలింది. యూఎస్‌లో ఈ సంఖ్య 1.4 కోట్లు ఉండగా, యూకేలో సుమారు 20 లక్షల వద్ద ఉంది. ఆలోచన శూన్యం.. క్యాంపస్‌లలో వైఫల్యాలు: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యార్థుల్లో స్వంతంగా శోధించి నేర్చుకునే సంస్కృతి తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇది మానవ మేధస్సును నాశనం చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషయ పరిజ్ఞానం పెంచుకోకుండా కాపీ–పేస్ట్ సంస్కృతి విస్తరిస్తోందంటున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనాల ప్రకారం ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఆరుగురు (60 శాతం) ఏఐ ఇచ్చిన ఫలితాలను క్రాస్‌చెక్ చేయకుండా నేరుగా సబ్మిట్ చేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా గ్రంథాలయాలు, పుస్తకాల్లో చదివి పరిశోధన చేసే సమయం గతంతో పోలిస్తే సుమారు 45 శాతం తగ్గింది. » కాగ్నిటివ్ ఇంపాక్ట్ స్టడీస్ ప్రకారం.. నిరంతరం ఏఐ టూల్స్‌పై ఆధారపడే విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యం, సమాచారాన్ని నిలుపుకొనే జ్ఞాపకశక్తి సాధారణ విద్యార్థుల కంటే 20–25% తగ్గుముఖం పడుతోంది. » కార్పొరేట్ హెచ్ఆర్ సర్వేల ప్రకారం, దేశవ్యాప్తంగా క్యాంపస్ డ్రైవ్‌లలో పాల్గొనే భారతీయ ఐటీ, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 40–50 శాతం మంది ముఖాముఖి ఇంటర్వ్యూలలో ప్రాథమిక లాజిక్, మాన్యువల్ కోడింగ్ రాయడంలో విఫలమవుతున్నారు. కాలేజీల్లో ఆటోమేటెడ్ కోడ్ జెనరేషన్ టూల్స్ వాడటం వల్ల, మొదటి నుంచి సొంతంగా లాజిక్ నిర్మించే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోందని, దీంతో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇంటర్వ్యూలలో తేలిపోతున్నారని చెబుతున్నారు. » ఏఐ టూల్స్ కొన్నిసార్లు ఉనికిలో లేని తప్పుడు సమాచారాన్ని (ఏఐ హాలూసినేషన్) కూడా సరైనదేనన్నట్లు భ్రమింపజేస్తాయని, సర్వేల ప్రకారం 55 శాతం మంది విద్యార్థులు ఆ ఆధారాలను ధ్రువీకరించుకోకుండానే తమ ప్రాజెక్టుల్లో జోడిస్తున్నారని గుర్తించారు. భారత విద్యావ్యవస్థకు సవాళ్లు యూకే, యూఎస్ వంటి దేశాల్లో ఏఐ అకాడమిక్ ఎథిక్స్, డిటెక్షన్ సాఫ్ట్వేర్ల వినియోగం ఇప్పటికే మొదలైంది. భారత్‌లో సీబీఎస్ఈ, యూజీసీ వంటి విద్యామండళ్లు మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీవ్ర అంతరాలున్నాయి. విద్యార్థులకు ఇచ్చిన హోంవర్క్, అసైన్మెంట్లు నిమిషాల్లో పూర్తవుతుండటంతో అసలైన ప్రతిభను గుర్తించడం అధ్యాపకులకు పెద్ద సవాలుగా మారింది. దేశంలోని 80 శాతం విద్యాసంస్థల్లో సరైన ఏఐ–డిటెక్షన్ వ్యవస్థలు అందుబాటులో లేవు. పాశ్చాత్య దేశాల్లో విద్యార్థులు ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడానికి ఏఐని వాడితే, భారత్‌లో ఇంకా చాలామంది విద్యార్థులు శ్రమను తప్పించుకునే ‘షార్ట్‌కట్’గా మాత్రమే చూస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని పరిష్కారమార్గాలను అనుసరిస్తే విద్యార్థిని ‘మాస్టర్’గా నిలబెట్టవచ్చని పేర్కొంటున్నారు. » ప్రాజెక్ట్ పేపర్లను మాత్రమే చూసి మార్కులు వేసే విధానానికి స్వస్తి పలకాలి. విద్యార్థి సమస్యను ఎలా పరిష్కరించాడు, ఏయే దశల్లో ఆలోచించాడు అనే దానిపై తరగతి గదిలో ప్రెజెంటేషన్లు, లైవ్ వైవా తప్పనిసరి చేయాలి. » తరగతి గదిలోనే ఏఐని వాడటానికి అనుమతినిస్తూ.. ఆ టూల్ ఇచ్చిన సమాధానంలో ఉన్న తప్పులు, లోపాలు, హాలూసినేషన్లను గుర్తించమని (రివర్స్–లెర్నింగ్ ) విద్యార్థులకు టాస్్కలు ఇవ్వాలి. దీనివల్ల వారి విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్) మేల్కొంటుంది. » వారానికి కనీసం 2–3 గంటలు ఎలాంటి డిజిటల్ పరికరాలు లేకుండా పెన్ను, పేపర్‌తో ఆలోచించడం, గ్రూప్ డిస్కషన్లు నిర్వహించడాన్ని విద్యాసంస్థలు తప్పనిసరి చేయాలి. అలా అని సాంకేతికతను నిషేధించడం దీనికి పరిష్కారం కాదని.. అలాగే అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదన్న వాస్తవాన్ని కూడా పాఠశాల దశలోనే తెలియజేయాలని చెబుతున్నారు. ఏఐని ఒక సహాయకుడిగా మాత్రమే చూడాలన్న స్పృహను విద్యార్థుల్లో కలిగించాలని సూచిస్తున్నారు. -
సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు
సాక్షి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ మరణానికి కారణాన్ని సిట్ అధికారులు కోర్టు ముందు బయటపెట్టారు. కృష్టలంక స్టేషన్ అప్పటి సీఐ నాగరాజు.. సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడని సిట్ అధికారులు విజయవాడ కోర్టుకు నివేదించారు. సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురు నిందితులపై విజయవాడ కోర్టులో అభియోగ పత్రం (ఛార్జిషీట్) దాఖలు చేశారు. ఓ ఉన్నతాధికారి ఆమోదంతోనే సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు తెచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్లో తెలిపింది. అప్పటినుంచి చనిపోయేవరకు సీఐ నాగరాజు, మరికొందరి చేతిలో సాయికృష్ణ దారుణ హింసకు గురయ్యాడని తెలిపింది. 86 పేజీల ఛార్జిషీట్‌తో పాటు 263 డాక్యుమెంట్లను కోర్టుకు సిట్ సమర్పించింది. 120 మంది సాక్షులను విచారించినట్లు అందులో పేర్కొంది. ఇందులో ఇప్పటివరకు తెలియని పలు కీలక విషయాలున్నాయి. ఉన్నతాధికారి ఆమోదంతో సాయికృష్ణను తెచ్చారు ‘మే 5న నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న వారిని తీసుకు వచ్చేందుకు అదనపు సిబ్బంది కావాలని సీఐ నాగరాజు కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారిని కోరారు. ఆ అధికారి అనుమతినివ్వడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదే రోజు రాత్రి పది గంటలకు బయలుదేరి తెల్లవారుజాము 3.30 గంటలకు మార్కాపురం చేరుకున్నారు. అక్కడ పెయింటింగ్ పనిచేస్తూ బతుకుతున్న సాయికృష్ణను పట్టుకొచ్చి ఉదయం 8 గంటలకు కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని టాస్‌్కఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లో కూడా నమోదు చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజు, మరికొందరు కానిస్టేబుళ్లు కలిసి సాయికృష్ణను స్టేషన్ లోని రెండో అంతస్తుకు తీసుకువెళ్లి అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హెడ్‌కానిస్టేబుల్ తీశారు’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో స్పష్టం చేశారు. మూడు రోజుల తరువాత కూడా హింసను ఆపలేదు ‘కృష్ణలంకలోని ఆర్ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత గుణదలలో గంజాయి విక్రేతలను పట్టుకునేందుకు సాయికృష్ణను సీఐ నాగరాజు తదితరులు వారి వెంట తీసుకెళ్లారు. అయితే ఈ లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లో సాయి కృష్ణకు సంబంధించిన వివరాలను ఎక్కడా నమోదు చేయలేదు. ఆ తరువాత కూడా నాగరాజు తదితరులు సాయికృష్ణపై హింసను ఆపలేదు. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టడంతో రక్తస్రావం జరిగి సాయికృష్ణ మృతిచెందాడు. అనంతరం కృష్ణలంక స్టేషన్లో సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. స్టేషన్లో ఎక్కడా ఎలాంటి మరకలు లేకుండా పెయింట్లు వేయించారు. లాకప్‌లో సాయికృష్ణ ఆనవాళ్ళు లేకుండా కడిగేశారు’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. దుప్పట్లో చుట్టి.. దహనం చేశారు... ‘కస్టోడియల్ టార్చర్ తరువాత పోలీసుస్టేషన్లో సాయికృష్ణ ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఓ పాత భవనానికి తరలించారు. అక్కడ సాయికృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి దహనం చేశారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చిన నాటి నుంచి చనిపోయేంత వరకు కృష్ణలంక స్టేషన్లో ఉన్న కీలక ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు కీలకంగా వ్యవహరించారు. ఇందులో సీఐ సహా ఆరుగురు పోలీసులు కాగా ఒకరు సీఐ స్నేహితుడు సురేష్. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.’ అని అధికారులు వివరించారు. చంపిన తరువాత సెల్‌ఫోన్‌ను గోవా పంపి ఫోన్లు చేయించారు.. ‘కృష్ణలంక పోలీసుస్టేషన్ లోపల, బయట కలిపి 10 సీసీ కెమేరాలు ఉన్నాయి. 18 నెలలపాటు స్టోరేజి ఉండేలా నాలుగు 8 టీబీ హార్డుడిస్కులు ఉన్నాయి. వీటిల్లోని ఆధారాలను సీఐ నాగరాజు ఆదేశాలతో చెరిపివేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇక సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతని సెల్‌ఫోన్‌ను ఒక వ్యక్తికి ఇచ్చి గోవాకు పంపారు. అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేయించారు. తద్వారా సాయికృష్ణ ఇంకా బతికే ఉన్నాడనే అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేసినట్లు కూడా మా దర్యాప్తులో తేలింది’ అని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించాం.. ‘2026 మే 23న విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద లభించిన రెండు గుర్తు తెలియని మృతదేహాల వ్యవహారాన్ని కూడా విచారించాం. ఆ మృత దేహాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ వ్యవస్థకు సంబంధించిన డీవీఆర్, ఎన్వీఆర్, హార్డ్డిసు్కలు, మెమొరీ కార్డులు, మొబైల్ ఫోన్లు, పోలీస్‌స్టేషన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ సిబ్బంది కూడా నేర స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించింది. పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ ఉన్నట్లు తెలిపిన వ్యక్తులు, ఆయనతో సంబంధం ఉన్నవారు, సాంకేతిక ఆధారాలకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశాం’ అని సిట్ అధికారులు చార్జిషీట్లో తేల్చి చెప్పారు. నమోదు చేసిన సెక్షన్లు ఇవే.. బీఎన్ఎస్ సెక్షన్ 103(1), 127(4), 127(6), 238, 305, 316(5), 61(2) రెడ్ విత్ 3(5)తో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంస నిరోధక చట్టం – 1984లోని సెక్షన్ 3, సమాచార సాంకేతిక చట్టం – 2000లోని 65, 66 సెక్షన్లను కూడా చేర్చారు. సాయికృష్ణను పోలీసుల అదుపులోకి తీసుకున్న పరిస్థితులు, కస్టడీలో ఆయనకు జరిగినట్లు ఆరోపిస్తున్న చిత్రహింసలు, లాకప్ రికార్డుల నిర్వహణ, మొబైల్ ఫోన్ వినియోగం, సీసీ టీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జిషీట్లో పూర్తిగా సీఐ నాగరాజు అతని సిబ్బందిని ఇరికించే విధంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ప్రమేయాన్ని కప్పి పుచ్చేందుకే, పాడుబడిన భవనంలో సాయికృష్ణ చనిపోయినట్లు సిట్ పేర్కొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. -
ఎన్ని వేధింపులున్నా వెనక్కి తగ్గం
సాక్షి, అమరావతి: సమస్యలు పరిష్కరించకపోగా తమపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడ్డా ఏ మాత్రం వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడే సమ్మెలోకి వెళ్లామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. జీజీహెచ్‌లు, ధర్నా చౌక్‌ల్లోని నిరసన శిబిరాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు చేపట్టారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వేల సంఖ్యలో ఉద్యోగులు అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు.చంటి బిడ్డతో నిరసనవైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన ఉధృతంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా తిరుపతి రుయా ప్రాంగణంలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో గీత అనే స్టాఫ్‌నర్స్ తన చంటిబిడ్డతో కలసి పాల్గొన్నారు. ఆ చంటి బిడ్డ అమ్మఒడిలో నిద్రిస్తుండగా.. తల్లి మౌన దీక్షను కొనసాగించారు. – తిరుపతి తుడా -
అభాసుపాలయ్యాం..
సాక్షి, అమరావతి: బీసీల ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలవడంతో టీడీపీ శ్రేణులు తలెత్తుకోలేక లోలోన మథనపడుతున్నాయి. తాజా పరిణామంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ పిటిషన్ కోర్టులో నిలవదని న్యాయ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామాల్లో బీసీలకు ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చిపెట్టారని సీనియర్ నేతలు వాపోతున్నట్లు సమాచారం. అసాధ్యమని తెలిసీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి అనవసరంగా అభాసుపాలయ్యామన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ సభల్లో గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలు ఇప్పుడు బీసీల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని తలపట్టుకుంటున్నారు. 34 శాతం ఇవ్వలేమని తెలిసి కూడా చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం జీవోలు ఇచ్చి పార్టీని అభాసుపాల్జేశారని నేతలు మండిపడుతున్నారు. నిజానికి.. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటితే కోర్టులు అంగీకరించవన్నది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. 2020లో 59 శాతం రిజర్వేషన్లతో ఇచ్చిన జీవోనే హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులోనూ అప్పట్లో ఊరట దక్కలేదు. గతేడాది తెలంగాణ పెట్టిన బీసీ కోటాకు ‘సుప్రీం’లో పట్టిన గతి ఆయన కళ్ల ముందే ఉంది. అలాగే, గత పదిహేనేళ్లలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలోనూ ఇదే కారణంతో బీసీ కోటాలు కోర్టుల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసీ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బాబు ఎలా ప్రకటించారని పార్టీ సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారు.రాజ్యాంగ సవరణకు అడగని బాబు..బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఆ సవరణ కోసం కనీసం అడగలేకపోవడం చంద్రబాబు బలహీనతను బయటపెట్టిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అడిగే ధైర్యంలేక చెల్లుబాటు కాని జీవోలతో నాటకాలు ఆడామన్న విషయం బహిర్గతమైందని, బీసీల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని వారు అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఢిల్లీలో ఉంటే, ఓడిపోయే కేసు కోసం ‘సుప్రీం’ మెట్లెక్కడం వెనుక ఉద్దేశం కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడమేనని మనమే బయటపెట్టుకున్నామని వారు చెబుతున్నారు. మరోవైపు.. పార్టీలో ఇంత అసహనం వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం తన తప్పు ఒప్పుకోవడంలేదు. హైకోర్టు తీర్పు రాగానే ప్రతిపక్షమే కోర్టుకెళ్లి అడ్డుకుందంటూ నెపాన్ని వైఎస్సార్సీపీ పైకి నెట్టేశారు. అదే మాట అందరూ చెప్పాలంటూ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. కోర్టులో నిలవని హామీ ఇచ్చాక ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లిస్తామంటే ప్రజలు నమ్ముతారా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.పొత్తులపైనా ఆందోళన..ఇక కూటమిలో పొత్తుల లెక్కలపైనా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఏ కార్పొరేషన్ ఎవరికి, ఏ మున్సిపాలిటీ ఎవరికి అన్నది ఇప్పటికీ తేల్చకపోతే క్షేత్రస్థాయిలో తామెలా పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేతల స్థాయిలో ఇంకా భేటీలు, సమాలోచనల గందరగోళం కొనసాగుతుండగానే వైఎస్సార్సీపీ దూకుడు పెంచి నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అధికారంలో ఉండి కూడా ఇంతవరకూ ఏమీ తేల్చుకోలేక సతమతమవుతుంటే, వైఎస్సార్సీపీ మాత్రం స్థానిక ఎన్నికల వ్యూహాలను వేగంగా అమలుచేస్తుండడం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు. -
స్థానిక ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్థులకు తగినంత భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. లేఖల్లోని ముఖ్యాంశాలు..ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలి. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న విశ్వాసం మాకు లేదు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలి. నామినేషన్లనూ అడ్డుకునే అవకాశం కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదు. నామినేషన్ల ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలి.∙ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా అడ్డుకోవడానికి పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. -
దసరా ఉత్సవాల తొలి 3 రోజులకు వీఐపీ టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో తొలి మూడు రోజులకు వీఐపీ టికెట్లను ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం విడుదల చేశారు. రూ.వెయ్యిపై వీఐపీలకు బంగారు వాకిలి దర్శనం కల్పించనున్నారు. మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో ఈవో శీనానాయక్, ఈఈ ఎల్.రమా, ఆలయ టెక్నికల్ సిబ్బంది హరీష్ ఈ టికెట్లను విడుదల చేశారు. దసరా ఉత్సవాల్లో ఎటువంటి సిఫార్సులు లేకుండా భక్తులు జగన్మాత దివ్య దర్శనానికి సంబంధించి 11, 12, 13వ తేదీలకు రూ.1,000 టికెట్లను జారీ చేశామని, ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చునన్నారు. మన మిత్ర యాప్ ద్వారా భక్తులు ఈ టికెట్లను పొందవచ్చునని తెలిపారు. మూలా నక్షత్రం మినహా అన్ని రోజులకు విడతల వారీగా టికెట్లు విడుదల చేస్తామన్నారు. టికెట్లు పొందిన భక్తులు కుమ్మరి పాలెంలోని టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా కొండపైకి చేరుకుంటారని, దర్శనం అనంతరం మల్లికార్జున స్వామి వారి ఆలయం మీదగా కొండ దిగువనకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఆలయ సిబ్బందికి ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశారు. -
నూతన జెడ్పీలకు దిక్కెవరు?
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ప్రాతిపదికన రాష్ట్రంలో 15 నూతన జిల్లా పరిషత్‌లు ఏర్పడి రెండువారాలు గడిచినా ఇప్పటికీ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల(సీఈవో)ను నియమించలేదు. జెడ్పీ మొత్తం పర్యవేక్షించే ఉన్నతాధికారులు లేకపోవడంతో కీలక పనులపై దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లతోపాటు జెడ్పీ సీఈవోలదే కీలక పాత్ర. అసలే కొత్త జిల్లా పరిషత్‌లు కావడంతో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటికి అదనంగా ఇన్చార్జిలుగా కొనసాగుతున్న సీఈవోలు పూర్తి స్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాల అమలులో తీవ్ర కాలయాపన జరుగుతోందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో క్షేత్ర స్థాయి వరకు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లను జెడ్పీ సీఈవోలే పర్యవేక్షించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కీలక ఎన్నికల సమయంలోనూ మొత్తం 28 జిల్లాలకు సగానికి పైగా జిల్లాల్లో జెడ్పీ సీఈవోలు లేకపోవడంతో సాధారణ పాలనా వ్యవహారాలతోపాటు ఎన్నికల కార్యక్రమాల అమలులో ఇబ్బందులు తలెత్తున్నట్టు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీలోనూ చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై గురువారం అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ కొత్త జిల్లాల్లో జెడ్పీ సీఈవోలను నియమించకపోవడంపై చర్చకు వచి్చంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎలక్షన్ నోటిఫికేషన్‌కు ముందే 15 జిల్లాల జెడ్పీ సీఈవోలను నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. -
హైకోర్టుకు ‘తణుకు’ జనసంద్రం
సాక్షి, అమరావతి: మోసపోయిన చిట్టీల డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో తణుకుసహా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాల ప్రజలు వందల సంఖ్యలో హైకోర్టుకు పోటెత్తిన ఘటన శుక్రవారం చర్చనీయాంశంగా మారింది. తణుకుకు చెందిన గోలి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గోలి బాల భవానీ శంకర్ ‘శ్రీ దుర్గ భవాని చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో చిట్టీలు నిర్వహిస్తూ వచ్చారు. ఏజెంట్లను ఏర్పాటు చేసి తణుకు, ఇరగవరం, పెనుమంత్ర, అత్తిలి మండలాల్లో సామాన్యుల నుంచి రూ.42 కోట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేశారు. దీనిపై తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 13న కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో నిందితులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, ఫిర్యాదుదారులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అటు నిందితులను, ఇటు ఫిర్యాదుదారులను తదుపరి విచారణ సమయంలో తమ ముందు హాజరుపరచాలని తణుకు పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులనోటీసుల మేరకు దాదాపు 300 మంది బాధితులు చిట్టీల చెల్లింపులకు సంబంధించిన రసీదులను, కంపెనీ ఇచ్చిన పుస్తకాలు పట్టుకుని సొంత ఖర్చులతో బస్సులు, వ్యాన్లలో హైకోర్టుకు తరలివచ్చారు. ఇంత మంది ఒక్కసారిగా హైకోర్టు వద్దకు రావడంతో స్థానిక న్యాయవాదులకు, పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. హైకోర్టు ప్రాంగణం, క్యాంటీన్ అంతా వీరితో నిండిపోయింది.ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెప్పడంతో నిందితులు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి ‘సగం తణుకు ఇక్కడే ఉన్నట్లుంది’ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కోర్టు వెలుపల నిందితుల కారును బాధితులు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అర్థ గంట సేపు హైకోర్టు ప్రాంగణం ఆరుపులు, కేకలతో మార్మోగింది. జనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో హైకోర్టు ఎస్పీఎఫ్ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో తుళ్లూరు పోలీసులు హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు. అనంతరం బాధితులను అతి కష్టం మీద అక్కడి నుంచి పంపి, నిందితులను తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
భూముల రీ సర్వే చేసింది నేనే
కొండపి (ప్రకాశం జిల్లా): రాష్ట్రంలో భూ వివాదాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో హక్కులను పరిరక్షించేందుకు భూముల రీ సర్వే ప్రక్రియను తానే చేపట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొన్నారు. రీసర్వే 2.0 అనంతరం రాజముద్రతో కూడిన పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నర్సింగోలులో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ గ్రామ సభలో ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో భూములపై వివాదాలు సృష్టించారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. గతంలో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించామన్నారు. వివాదాల్లో ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాల్లోని 2,315 ఎకరాల గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని అన్నారు. అక్టోబరులోనే 790 గ్రామాల్లో 4 లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసింది తానే అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత న్యాయమూర్తులకు సన్మానం
సాక్షి, అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శుక్రవారం హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో వీరిని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేయడంలో ఆయన 420 అని మరోమారు స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారి అని మరోసారి తేలిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దు చేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9 వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. -
హామీ ఇచ్చి డ్రామా!
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో దాదాపు సగం జనాబా ఉండే బీసీలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీ డ్రామాగా ముగిసింది. చంద్రబాబు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీ, జీవో కథ అమలుకు నోచుకోకుండానే తెర పడింది. చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని... రాజ్యాంగ సవరణతోనే అది సాకారం అవుతుందని న్యాయ నిపుణులు, రాజకీయవేత్తలు మొదటి నుంచి చెబుతున్నా చంద్రబాబు తన నాటకాన్ని ముగించలేదు. బలహీన వర్గాలను ఓట్లు కోసం పావులుగా వాడుకుంటూ తన రాజకీయ డ్రామాను కొనసాగించారు. గత ఐదారేళ్లలో దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టంగా కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ... 40 ఏళ్లకు పైబడి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ‘బీసీలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు స్థానిక సంస్థల పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు’ అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఏడాది క్రితం తెలంగాణ ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా.. ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించాయంటూ, మొదలైన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఏదైనా ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తే సాధారణంగా కోర్టులు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోవు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించుతున్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటి అసాధారణ రీతిలో కోర్టు తీర్పులు వెలువడ్డ ఉదంతాలున్నాయి. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు సర్కారు మభ్యపుచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా బీసీలకు 34 శాతం అంటూ ఆగస్టులో ఉత్తుత్తి జీవోతో డ్రామాకు తెర తీసింది.న్యాయపరంగా చెల్లవని తెలిసినా రోజుకో డ్రామాసుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్న బీసీ రిజర్వేషన్ల జీవోతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండదని తెలిసీ సీఎం చంద్రబాబు తన డ్రామాను రోజుకో రకంగా రక్తి కట్టించారు. జీవో ఇచ్చిన వెంటనే చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ, మిత్రపక్ష కూటమి నేతలు అది అమలుకు నోచుకోకముందే అమలైనట్లుగా ‘జయహో బీసీ’ అంటూ సంబరాలు నిర్వహించారు. పార్టీ నేతలతో పాలాభిషేకాలు చేయించుకున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జీవో అమలు సాధ్యం కాదని చర్చించుకుంటూనే గత నెలన్నర రోజులకుపైగా గంభీరమైన ప్రకటనలు ఇస్తూ వచ్చారు. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా ఉన్నాయంటూ కొట్టివేసినా.. అత్యున్నత న్యాయస్థానానికి వెళతామంటూ ఇంకో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు. అందరూ ఊహించినట్టే సుప్రీంకోర్టు సైతం ఆ జీవో చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడం గమనార్హం. పార్లమెంట్లో చట్టబద్ధతతో అవకాశం ఉన్నా చిత్తశుద్ధి శూన్యంసుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే అందుకు పార్లమెంట్లో రాజ్యంగబద్ధంగా చట్టబద్ధత కల్పించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు చాలాకాలంగా చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగించడంలో టీడీపీ కూటమి పార్టీల మద్దతు కీలకం. ఇంత అవకాశం ఉన్నా బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రెండున్నరేళ్లుగా చంద్రబాబు తీసుకున్న చర్యలు శూన్యం. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. బీసీల రాజకీయ సాధికారతపై చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని బీసీ సంఘాలు, రాజకీయ వేత్తలు, రాజ్యాంగ నిపుణులు, ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నాయి.తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారం..బీసీలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో విపక్షంపై నిందలు మోపుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించే దుస్సాహసానికి బరి తెగించారు. ఐదేళ్ల క్రితం అడ్డుకుంది బాబు అండ్ కో నే... 2020, 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో నెంబరు 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. దీన్ని తప్పుబడుతూ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా చంద్రబాబు కోర్టులో కేసులు దాఖలు చేయించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు తగ్గించాలంటూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ప్రతాప్‌రెడ్డికి 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కూడా కట్టబెట్టడం గమనార్హం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు తీర్పు వెలువరించడంతో... న్యాయస్థానం ఉత్తర్వులను గౌరవిసూ్తనే పార్టీ పరంగా బీసీలకు 34 శాతానికి మించి అవకాశం కల్పించి మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధిని చాటుకోవడం గమనార్హం.బీసీ రిజర్వేషన్లపై ఇలా...2020 జనవరి 8..పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ, బీసీలకు మొత్తం 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం. స్థానిక ఎన్నికల నిర్వహణపై అంతకు ముందే దాఖలైన పిటిషన్లపై తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు. 2020 జనవరి 10స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్ల 50 శాతం దాటాయంటూ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి పొందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు. 2020 జనవరి 1559 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం.2020 మార్చి2సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత కేసు దాఖలు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఎన్నికలు పూర్తి.2024 ఎన్నికల ముందు..మన రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లోని కోర్టులు స్థానిక ఎన్నికల నిర్వహణలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టమైన తీర్పులు వెలువరించిన తర్వాత కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా దీన్ని అమలు చేసేందుకు అవకాశం ఉన్నా మూడేళ్లుగా మభ్యపెడుతూ బాబు డ్రామాలు. 2026 ఆగస్టు...స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలోనే స్పష్టంగా తీర్పులు వెలువరించిన న్యాయస్థానాలు. చట్టపరంగా చెల్లదని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు జీవోలు. 2026 అక్టోబరు 1బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు.సుప్రీంలో... హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన. 2026 అక్టోబరు 3: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు.2026 అక్టోబరు 9: హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయని పేర్కొంటూ చంద్రబాబు సర్కారు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. -
బాబు కపట నాటకానికి కోర్టులో తెర
ప్రభుత్వం నిర్వహించిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముంది? – సుప్రీం ధర్మాసనంసాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఎన్నికల మోసాలు, కపట నాటకం, మాయ వేషాలు సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి తేలిపోయాయి! బీసీ రిజర్వేషన్లపై బాబు దొంగాటకు నిమిషాల వ్యవధిలోనే అత్యున్నత న్యాయస్థానంలో తెర పడింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి అంతా బూటకమని బహిర్గతమైంది. చంద్రబాబు మోసపూరిత తీరును సాక్షాత్తూ సుప్రీంకోర్టు 1.42 నిమిషాల్లోనే బయటపెట్టింది. చంద్రబాబు సర్కారు చెల్లని డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం.. ఆ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించకుండా కట్టడి చేయడం.. ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే దానికి అందించి దాని ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామనడం.. జీవోలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. కమిషన్ నివేదిక పెండింగ్‌లో ఉందా లేదా? అలాంటప్పుడు దేని ఆధారంగా జీవోలిచ్చారని నిలదీసింది. ప్రభుత్వం చేసిన సర్వే (సమగ్ర కుటుంబ సర్వే), డేటాను ఆ కమిషన్ ఎలా పరిగణనలోకి తీసుకుంటుందని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాక ఈ సర్వేను ఏ చట్టం కింద చేశారు? ఆ చట్టం ఏమిటో మాకు చూపించండి.. అంటూ సూటిగా చంద్రబాబు సర్కారును నిలదీసింది. ఈ విషయంలో హైకోర్టు సరైన వైఖరినే తీసుకుందని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న గత తీర్పులను ఉద్దేశపూర్వకంగా బేఖాతర్ చేస్తూ.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బాబు సర్కారు ఇచ్చిన జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (ఎస్ఎల్పీ) కొట్టి వేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా గ్రామ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఎన్నికల, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చట్టపరంగా చెల్లదని తెలిసీ చంద్రబాబు బూటకపు జీవోలతో ఈ డ్రామాను నడిపినట్లు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది. గతేడాది తెలంగాణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% దాటడంతో అప్పటికే నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలంటూ అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ కోర్టులు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కోర్టులో న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసి కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ పార్టీ నేతలతో చంద్రబాబు పాలాభిషేకాలు చేయించుకున్నారు. అనుకూల ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంతో మభ్యపుచ్చే యత్నం చేశారు.ప్రభుత్వ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని హైకోర్టు తేల్చిందిగా..?: సుప్రీంహైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చా లేదా? అనే ప్రశ్న చాలాకాలంగా ఉత్పన్నమవుతోందన్నారు. స్థానిక సంస్థల వారీగా ప్రభుత్వం సేకరించిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ (సమగ్ర కుటుంబ సర్వే) డేటాను హైకోర్టు విశ్వసించకపోవడానికి ఎలాంటి కారణం లేదని రోహత్గి వాదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ సర్వే ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించింది. అంతేకాక రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి అవసరమైన శాస్త్రీయ డేటా ఏదీ కమిషన్ వద్ద లేదని, అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేమని కూడా హైకోర్టు చెప్పిందిగా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నియామకాన్ని ఎవరూ సవాలు చేయకపోవడంతో తాము ఆ కమిషన్ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొందని, ఇది చాలా సహేతుకమైన వైఖరి అని తెలిపింది.అసలు ఏ చట్టం కింద ఆ సర్వే చేశారు?కమిషన్ తన నివేదికను సమర్పించినప్పటికీ, ప్రభుత్వం దానిని ఆమోదించని విషయాన్ని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. ఈ సమయంలో రోహత్గీ జోక్యం చేసుకుంటూ, ఆ నివేదిక ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటాపై ఆధారపడిందని, దానిని తాము పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కమిషన్ నివేదిక ఇచ్చిందని రోహత్గీ నివేదించగా... ‘అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఏ చట్టం కింద చేపట్టారు? ముందు మాకు ఆ చట్టాన్ని చూపండి’ అని ధర్మాసనం పేర్కొంది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని రోహత్గీ కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఇది 57 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన కేసు అని రోహత్గీ ప్రస్తావించగా.. సారీ.. డిస్మిస్ అంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. మరోసారి రోహత్గీ జోక్యం చేసుకుంటూ.. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇక్కడే ఉందని, దానిని పరిశీలించాలని కోరగా, హైకోర్టు చాలా సహేతుకమైన వైఖరితో తీర్పునిచ్చిందని సుప్రీం ధర్మాసనంస్పష్టం చేసింది. డమ్మీ కమిషన్..డెడికేటెడ్ కమిషన్ నివేదిక విషయంలో చంద్రబాబు సర్కారు తీరుపై ఆది నుంచి సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషన్ నివేదికను బహిర్గతం చేయకపోవడాన్ని ఇప్పటికే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కమిషన్ నివేదికను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. మరి పట్టించుకోని కమిషన్ ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించినట్లు? డమ్మీ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని చంద్రబాబుకు తెలియదా? ఇదే విషయాలను హైకోర్టు సైతం ప్రస్తావించింది.అయితే హైకోర్టు తీర్పు తరువాత కూడా చంద్రబాబు బీసీలను మోసం చేయడం మానలేదు. అదొక డమ్మీ కమిషన్ అని హైకోర్టు తేల్చినా చంద్రబాబు ఆ కమిషన్‌ను మరికొంత కాలం పాటు పొడిగించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థించింది. అంతే కాదు.. చంద్రబాబు ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను పరిశీలించాలన్న వినతిని సైతం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. తద్వారా ఆ కమిషన్ నివేదికకు ఏమాత్రం విలువ లేనే లేదని చెప్పినట్లయింది. చట్టం తెలియదా బాబూ? అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు పార్లమెంట్లో చట్టం చేయకుండా సాధ్యం కాదన్న సంగతి స్పష్టంగా తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబుకు చట్టం తెలియదంటే ఎవరు నమ్ముతారు? అన్నీ తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీ ఇద్దాం.. ఎలాగూ కోర్టులు దాన్ని కొట్టేస్తాయి.. ఆ నెపాన్ని న్యాయస్థానాలపై నెట్టేయవచ్చునన్న రీతిలో బాబు వ్యవహరించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తనకు సన్నిహితుడైన బిర్రు ప్రతాప్‌రెడ్డిని రంగంలోకి దించారు. వైఎస్ జగన్ కల్పించిన రిజర్వేషన్లను హైకోర్టులో సవాలు చేయించి అక్కడ కొట్టేయించారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసేలా చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు నాడు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. 34 శాతం రిజర్వేషన్లు తాము అమలు చేసి చూపిస్తామంటూ నమ్మబలికారు. 50 శాతం పరిమితి దాటిన రిజర్వేషన్లు..రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఏడాది ఆగస్టు 20న చంద్రబాబు సర్కారు జీవో ఎంఎస్ నంబర్ 105 జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆగస్టు 19న జీవో ఆర్టీ నంబర్ 1065 తీసుకొచ్చింది. అయితే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు ఏకంగా 61.08 శాతానికి చేరుకున్నాయి. ఇది ఇందిరా సహానీ, డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావ్ గవాలీ కేసుల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఉల్లంఘించడమే. సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండా, రిజర్వేషన్ల వర్గీకరణను (ఏ,బీ,సీ,డీ,ఈ) అమలు చేయకుండా కేవలం కుటుంబ సర్వే ఆధారంగా ఒకే బ్లాక్‌గా రిజర్వేషన్లు కల్పించడాన్ని హైకోర్టులో పిటిషనర్లు సవాల్ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను ఈ నెల 1న కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నాటి నుంచి ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న ఆయన.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరిట మీరు ఇచ్చిన హామీలు మోసం. గతంలో మా ప్రభుత్వంలో వారికి వచ్చే పథకాలు రద్దుచేయడం మరొక మోసం. విద్యా దీవెన, వసతి దీవెనలకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయి పెట్టి చేస్తున్నది ఇంకో దారుణమైన మోసం. 143 హామీలతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో అతిపెద్ద మోసం. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?.@ncbn గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి! https://t.co/vbSjVEa2zf https://t.co/qA2PPsi4ga— YS Jagan Mohan Reddy (@ysjagan) October 9, 2026 -
స్థానిక ఎన్నికలు.. ఈసీకి వైఎస్సార్సీపీ 3 కీలక లేఖలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. అలాగే వీటి కాపీల్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.కేంద్ర సాయుధ పోలీసు బలగాలను తగిన సంఖ్యలో మోహరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర బలగాల మోహరింపు ఎన్నికల సంఘం సమర్థవంతమైన పర్యవేక్షణలో జరగాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల భద్రత బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర పోలీసులకు అప్పగిస్తే నిష్పక్షపాత వాతావరణం ఉంటుందన్న నమ్మకం తమకు లేదన్నారు. కూటమి పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని లేఖలో వెల్లడించారు.ఈ పరిస్థితులు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమై, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ప్రచారాన్ని నిరోధించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క పోలింగ్ రోజు మాత్రమే భద్రత కల్పించడం సరిపోదని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే కేంద్ర బలగాలను మోహరించి, ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతిపాదకులు, మద్దతుదారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలు, వార్డుల వంటి సన్నిహిత సమాజాల్లో బెదిరింపులు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతిపక్ష అభ్యర్థులు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు తమ చట్టబద్ధమైన ఎన్నికల బాధ్యతలను నిర్వహించకుండా పోలీసు అధికారాలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.ఎన్నికల్లో ఎవరు పాల్గొనాలి, ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలను అధికార పార్టీ ప్రభావం లేదా ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం నిర్ణయించకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు.సున్నితమైన ప్రాంతాల్లో స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ పర్యవేక్షణ బృందాలను నియమించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు వివక్ష లేకుండా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, అధికార యంత్రాంగాన్ని లేదా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జిల్లా కేంద్రాల్లో సమర్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు భయం, బెదిరింపులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యామ్నాయ సదుపాయం కల్పించాలని కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ, సంబంధిత అధికారులకు పత్రాల బదిలీ ప్రక్రియలో స్పష్టమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
బాబు పాలనంతా అబద్ధాలు.. ప్రచారాలు.. నాటకాలు..!
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, ప్రచారాలు, రాజకీయ నాటకాలేనని.. చేసిందే మళ్లీ మళ్లీ చేస్తూ.. చెప్పిందే పదే పదే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఒకే పెన్షన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడం చంద్రబాబు ప్రచార పిచ్చికి నిదర్శనం. కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారా?. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కొత్త నాటకం. న్యాయస్థానాల్లో నిలబడని బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించడం దుర్మార్గం. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాజకీయంగా సామాజికంగా పెద్దపీట వేసింది వైఎస్ జగన్’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.‘‘భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో వైఎస్ జగన్ చేసిన కృషిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన పనులకు పేర్లు మార్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రూపొందించిన పట్టాదారు పాసు పుస్తకాలనే చంద్రబాబు ఐదుసార్లు పంపిణీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. పాసు పుస్తకాలపై వైఎస్ జగన్ ఫొటో ఉందని దుష్ప్రచారం చేసినవాళ్లే ఇప్పుడు వాటిని పంపిణీ చేస్తున్నారు...రాయలసీమలో కరువు విలయ తాండవం చేస్తుంటే చంద్రబాబుకు ప్రచారం చేసుకుంటున్నారు. రాయలసీమలో పంటలు ఎండిపోతుంటే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాయలసీమకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న చంద్రబాబు.. బడ్జెట్లో ఎంత కేటాయించారో చెప్పాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో సమాధానం చెప్పాలి...రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం సిగ్గుచేటు. టమాటా, మిర్చి, పొగాకు రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో ఎన్నింటిని పూర్తిగా అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, రైతులను, పెన్షనర్లను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెడుతున్నారు...డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి పాలనలో ప్రతిపక్షాలను ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినా కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించడం లేదు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి.. సామాన్యుల ఆస్తులకు రక్షణ కరవైంది. ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...ముఖ్యమంత్రి, మంత్రుల ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. వైఎస్ జగన్ స్వర్ణ పాలనపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?. వైఎస్ జగన్ పాలన విధ్వంసమని ఆరోపిస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమంలో ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చిద్దాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు రాజకీయ నాటకాలను, అబద్ధపు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు.’’ అని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ -
ఎన్డీయేలో ఉండి ఏం లాభం బాబు?
సాక్షి, ఢిల్లీ/అమరావతి: వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. మాములు పొలిటికల్ డ్రామాలాడలేదు. ‘చెల్లని’ జీవోలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయగా, ఆ తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో నారా పొలిటికల్ డ్రామాపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబు కూడా ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయినా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిసినా చంద్రబాబు ఈ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీస్తున్నాయి. అసలు ప్రధానితో చంద్రబాబు కనీసం దీని గురించి మాటైనా ప్రస్తావించారా? అని అంటున్నాయి. షెడ్యూల్-9 డిమాండ్ ఉందిగా..బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కేంద్రం ద్వారా పరిష్కరించాలని, ఇందుకోసం సంబంధిత చట్టాన్ని తీసుకొచ్చి షెడ్యూల్-9లో చేర్చాలని బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారా? సాధ్యం కాదని తెలిసినా చెల్లని జీవోలతో నాటకమాడారా? అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.గతంలోనూ ఇదే తీరంటూ ఆగ్రహంబీసీల రిజర్వేషన్ల విషయంలో టీడీపీ గతంలోనూ అడ్డంకులు సృష్టించడం.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆనాడు టీడీపీ నేత ప్రతాప్‌తో పిటిషన్లు వేయించి రిజర్వేషన్లను అడ్డుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో చట్టం దిశగా అడుగులేయకుండా చెల్లని జీవోలు ఇచ్చారని మండిపడుతున్నారు.బీసీలను మరోసారి మోసం చేశారని, చంద్రబాబు తీరు వెన్నుపోటు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చంద్రబాబు చర్చించారా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? అని నిలదీస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతే ఆ కూటమిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు చేసిన రాజకీయ నాటకమేనని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టు -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీసీల రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం డిస్మిస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను(జీవోలను) హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ జీఓ 105ను, పురపాలక శాఖ జీఓ 1065ను జారీ చేసింది.అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాటిని కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎస్ఎల్పీ దాఖలుహైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం 2026లో కొత్తగా చేపట్టిన అధ్యయనాన్ని హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఉపశమనాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఊరట లభించలేదు.ఏపీ ప్రభుత్వ సర్వేను తప్పుబట్టిన సుప్రీం కోర్టుకేవలం సమగ్ర కుటుంబ సర్వేను ఎలా పరిగణలోకి తీసుకుంటాం?ప్రభుత్వ గణాంకాలు శాస్త్రీయంగా లేవన్న ధర్మాసనం.. ఏపీ హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉంది.. పిటిషన్ డిస్మిస్ఎన్నికలకు లైన్ క్లియర్!ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ నేపథ్యంలో.. హైకోర్టు ఇచ్చిన గడవులోపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే సర్ ప్రక్రియ పూర్తి కాకపోతే పాత జాబితాతో.. పూర్తయితే కొత్త జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, నోటిఫికేషన్ నాటికి ఏ జాబితా పూర్తయితే ఆ జాబితాను తీసుకోవాలని కోర్టు ఈసీకి సూచించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోపు నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: ఇదేం కవరింగ్ బాబూ! -
AP: రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 10వ తేదీ (శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ 2026–27 విద్యా సంవత్సరం కేలండర్ ప్రకారం దసరా సెలవులు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటించారు. అయితే, ఈనెల 10న రెండో శనివారం, మరుసటిరోజు ఆదివారం కావడంతో రెండురోజులు ముందే సెలవులు వచ్చినట్టయింది. పాఠశాలలు అక్టోబర్ 22న పునఃప్రారంభం అవుతాయి. -
మున్సిపల్ టెండర్లలో గోల్మాల్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రహదారులు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, రోడ్డు సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రెండు దశల్లో నిర్వహించిన టెండర్లలో గోల్మాల్ జరిగింది. రెండున్నరేళ్ల పాటు మున్సిపాలిటీల ప్రగతిని పట్టించుకోని సర్కారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎత్తుగడ వేస్తూనే.. అభివృద్ధి పనుల పేరుతో దోచుకోవడానికి సిద్ధమైంది. ఈ పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు చోటులేకుండా చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) విధానాన్ని తెరపైకి తెచ్చి ఎల్–1గా నిలిచారని చూపుతూ అస్మదీయులకు చెందిన నాలుగు కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు పనులు కట్టబెట్టింది. ప్రతి ప్యాకేజీలోనూ సరాసరిన 4.67 శాతం అధిక ధరలకు పనులు అప్పగించింది. తద్వారా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టి ‘నీకింత.. నాకింత’ అని పంచుకు తినేందుకు స్కెచ్ వేశారు. తొలిదశలో 106 పట్టణాలు/నగరాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి 16 ప్యాకేజీల కింద రూ.2,994.73 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు వేర్వేరుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం ప్రజారోగ్య విభాగం సర్కిళ్ల ద్వారా టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో సగటున 4.67 శాతం అధిక ధరలకు కోట్ చేసిన నాలుగు కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కించుకున్నాయి. మొత్తం 16 ప్యాకేజీల పనులను రూ.3,134.70 కోట్లతో చేపట్టేందుకు ముందుకొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.139.88 కోట్ల భారం పడనుంది. తాజాగా గురువారం నెల్లూరు సర్కిల్ పరిధిలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో రూ.272.42కోట్ల విలువైన పనులను మేఘా సంస్థకే అప్పగించారు. అంచనా వ్యయం కంటే 4.74 శాతం అధికంగా రూ.285.34 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు.ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాపై అధికంగా 12.92 కోట్ల భారం పడనుంది. అస్మదీయులకే పనుల అప్పగింత మున్సిపాలిటీల్లో చేపట్టనున్న పనులను సైతం చంద్రబాబు తన అస్మదీయ సంస్థలకే కట్టబెట్టారు. ఎన్సీసీ సంస్థకు రూ.767.10 కోట్ల విలువైన 4 ప్యాకేజీలు, మేఘా సంస్థకు తాజాగా కేటాయించిన వాటితో రూ.1,589.57 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇక సివెట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ.491.16 కోట్ల విలువైన మూడు ప్యాకేజీలు, ఎంపీ సీఎం రమే‹Ùకు చెందిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా–రిత్విక్ ప్రాజెక్ట్స్ (జాయింట్ వెంచర్)కు రెండు, రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఒక ప్యాకేజీ చొప్పున రూ.572.19 కోట్లవిలువైన మూడు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు. కౌన్సిళ్లు గడువు ముగిశాక.. ప్రభుత్వం ఖరారు చేసిన పనులకు ఆమోదం తెలుపుతూ ఆయా మున్సిపల్ కౌన్సిళ్లు తీర్మానాలు చేయాలి. అయితే.. ఎన్నికైన పాలక మండళ్ల గడువు ముగిసిన సమయంలో ఈ విధానాన్ని తెరపైకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావాల్సిన సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చి, తీర్మానాలు చేయించుకోవడానికి ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీతో చెల్లింపులు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మాణ సమయంలోనే 40 శాతం నిధులను పనులు జరిగే మున్సిపాలిటీలే చెల్లించాలి. మిగిలిన 60 శాతం నిధులను 40 త్రైమాసిక వాయిదాల్లో ఆయా మున్సిపాలిటీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎంపికైన సంస్థలు పనులు పూర్తి చేసిన తర్వాత కూడా మున్సిపాలిటీలపై దీర్ఘకాలిక చెల్లింపు బాధ్యత కొనసాగుతుంది. దీంతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనులు చేసే అవకాశం కూడా ఆయా మున్సిపాలిటీలకు ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లే కానీ.. మొత్తం పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.7,469.46 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో రూ.5,500 కోట్లు అసలు ప్రాజెక్టు వ్యయం కాగా, మరో రూ.1,969.46 కోట్లు పదేళ్ల కాలానికి వడ్డీగా చూపించింది. ప్రాజెక్టు వ్యయంతో పోలిస్తే వడ్డీ మొత్తం సుమారు 35.8 శాతం మేర ఉంటుంది. రూ.5,500 కోట్ల అసలు ప్రాజెక్టు వ్యయానికి అదనంగా రూ.1,969.46 కోట్ల వడ్డీ చెల్లించాలి. మరోవైపు యాన్యుటీల చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతాకు నిధులు సమకూర్చే బాధ్యతను పట్టణ, గ్రామ ప్రణాళిక విభాగానికి అప్పగించింది. -
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌పై సర్కారు కవరింగులు
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ప్రభుత్వం దాని కవరింగ్ కోసం నానా తంటాలు పడుతోంది. ‘వెబ్‌ల్యాండ్ హ్యాక్’ పేరుతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇచ్చిన వివరణలోనే వారి తప్పులన్నీ బయటపడ్డాయి. వెబ్‌ల్యాండ్ హ్యాక్ అవలేదని కేవలం రొటీన్ మెయింటెనెన్స్ కోసం 6వ తేదీ నుంచి రెండ్రోజులపాటు తామే సర్వర్లు నిలిపివేశామని తెలిపింది. అయితే, నిర్వహణ పేరుతో గతంలో ఎప్పుడూ వెబ్‌ల్యాండ్‌ను డౌన్ చేసిన సందర్భాలు లేవు. ప్రజలకు సంబంధించిన వివరాలు, సేవలతో ముడిపడి ఉన్న పోర్టల్స్‌ను మెయింటెనెన్స్, ఇతర కారణాలతో నిలిపివేస్తే ఆ విషయాన్ని ముందుగా ప్రజలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో సమాచారం ఇస్తారు. కానీ, ఇప్పుడు వెబ్‌ల్యాండ్ డౌన్ చేస్తే ముందే ఎందుకు ప్రకటించలేదు? ఏ కార్యాలయానికీ సర్క్యులర్ ఎందుకు పంపలేదు? ఇలాంటివి రాత్రి, సెలవు రోజుల్లో కాకుండా పని దినాల్లో, కార్యాలయాల పనివేళల్లో ఎందుకు ఆపేశారు? ఈ రెండ్రోజులు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగవని ఎందుకు ముందస్తుగా ప్రజలకు చెప్పలేదనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానంలేదు.అయితే, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడంలేదని క్రయవిక్రయాల కోసం వచ్చిన వారు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అడిగితే వెబ్‌ల్యాండ్ పనిచేయడంలేదని, ఆగిపోయిందని చేతులు దులుపుకున్నారు. నిర్వహణ కోసం నిలిచిపోయినట్లు ఎవ్వరూ చెప్పలేదు. అసలు మెయింట్‌నెన్స్ కోసం వెబ్‌ల్యాండ్ ఆగడం ఎప్పుడూ చూడలేదని రెవెన్యూ శాఖాధికారులే చెబుతున్నారు. అంటే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ కవరింగేనని స్పష్టమవుతోంది. ఊరూ, పేరు లేకుండా గుడ్డిగా వివరణ.. చివరికి.. సమాచార శాఖ ఇచ్చిన ఈ వివరణలో కనీసం ఏ శాఖ, ఏ అధికారి వివరణ పంపారో కూడా లేకపోవడం గమనార్హం. ఊరూ, పేరు లేకుండా కనీసం ఎక్కడ నుంచి వివరణ వచ్చిందో కూడా లేకుండా గుడ్డిగా రిజాయిండర్ పంపడాన్ని బట్టి ప్రభుత్వం, రెవెన్యూ శాఖలు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. సర్కారు డొల్లతనం బయటపడుతుందని.. ఇక వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయిన విషయం నిజమే అయినా దాన్ని అంగీకరిస్తే భూ రికార్డుల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని తప్పును సమర్థించుకుంటున్నారు. పోర్టల్‌ను ఓపెన్ చేస్తే గురువారం రాత్రి వరకూ హ్యాక్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా హ్యాక్ కాలేదని సర్కారు బుకాయిస్తోంది. అలాగే, ప్రైవేటు వ్యక్తులకు లాగిన్లు ఇవ్వలేదని చెబుతూనే ఎన్ఐసీ ద్వారా నియమించిన రిసోర్స్ పర్సన్లకు వెబ్‌ల్యాండ్ లాగిన్లు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది. అన్నింటికీ మించి.. కీలకమైన భూముల వ్యవహారాలు, రైతుల రుణాలు, ఈ–క్రాప్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ సర్వర్ కూడా లేకపోవడం మరో వైఫల్యమేనని ఒప్పుకున్నట్లైంది. బ్లాక్‌చెయిన్, ఐటీ వంటి గొప్పలు చెప్పే ప్రభుత్వం కనీసం బ్యాకప్ కూడా సిద్ధంచేయలేకపోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగం స్వయం సమృద్ధిని తుంగలో తొక్కి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) ప్రాజెక్ట్‌ల రూపంలో ముక్కలు ముక్కలుగా చంద్రబాబు సర్కారు అమ్మేస్తోంది. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు, పేదల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, పక్క రాష్ట్రాల్లో విఫలమైన డింక్ (డిజిటల్ నెర్వ్ సెంటర్) కార్యక్రమాన్ని సంజీవని పేరిట ప్రజల నెత్తిన రుద్దడం ద్వారా ఖజానాకు ప్రభుత్వం పెద్దఎత్తున గండికొడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రేడియాలజీ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ) సేవలను మరో పదేళ్లపాటు పీపీపీకి ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 2014–19 మధ్య రేడియాలజీ సేవలను పదేళ్లకు పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) ఇలా అన్ని ఆస్పత్రుల్లోని రేడియాలజీ సేవలను హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం కోసం వైద్య శాఖలో పైళ్లు వేగంగా కదులుతున్నాయని విస్తృత ప్రచారం నడుస్తోంది. తొలుత హెచ్‌ఎల్‌ఎల్‌కు సేవలన్నీ కట్టబెట్టి.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయులకు సబ్ కాంట్రాక్ట్‌లు అప్పగించేలా పావులు కదుపుతున్నారని సమాచారం. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించేలా..వైద్యరంగంలో బయటి సంస్థల దోపిడీకి క్రమంగా అడ్డుకట్టవేసి ప్రభుత్వ రంగంలోనే అన్నిరకాల సేవలను బలోపేతం చేయడం కోసం గత వైఎస్ జగన్ సర్కారు అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)లో డయగ్నోస్టిక్స్ విభాగం అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ నుంచి ఆస్పత్రులకు సీటీ, ఎంఆర్ఐ, క్యాథల్యాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి ఎంఎస్ఐడీసీ ద్వారా వాటిని నిర్వహించేలా అడుగులు వేశారు.ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప జీజీహెచ్లల్లో ప్రభుత్వమే సీటీ స్కాన్ యంత్రాలను సమకూర్చింది. ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి, వాటిని నిర్వహిస్తోంది. మిగిలిన చోట్ల పీపీపీ కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసినప్పుడు కొత్తగా పీపీపీకి ఇవ్వకుండా ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి అడ్డుకట్టకు వీలుండేది. కమీషన్ల కోసం ఖజానాకు గండి..ప్రస్తుతం పీపీపీ రేడియాలజీ సేవల కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. భవిష్యత్‌లో ఇది రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోనే పరికరాలు కొని ఆస్పత్రులను మరింత స్వయం సమృద్ధి చేసేలా గత ప్రభుత్వంలో అడుగులు వేశారు. ఆ విధానం ప్రకారం ప్రభుత్వమే పరికరాలను కొనుగోలు చేస్తే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు చేయడం ద్వారా వచ్చే డబ్బుతో పరికరాలకు ఈఎంఐ చెల్లించడంతో పాటు సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడానికి వీలుంటుంది. ఇలా కొన్నేళ్లకు ఈఎంఐలు పూర్తయ్యాక పరికరాలన్నీ పూర్తిగా ప్రభుత్వానికి మిగిలిపోతాయి. ఈ ఉత్తమమైన విధానాన్ని గాలికొదిలేసి కమీషన్ల కోసం పీపీపీ ప్రాజెక్ట్‌లను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఖజానాకు ప్రభుత్వ పెద్దలు గండికొడుతున్నారు.‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సు.. ప్రభుత్వ యంత్రాలు ప్రైవేట్‌కు..ప్రస్తుతం పీపీపీ సేవలు నిర్వహిస్తున్న సంస్థలు లాభాపేక్షతో ఒకే స్కాన్, ఎంఆర్ఐను రెండు, మూడు రకాలుగా విభజించి దొంగ బిల్లులు పెట్టుకోవడం, ఫేక్ రెఫరల్ స్లిప్స్‌తో స్కాన్లు చేసినట్టుగా చూపించడం.. అవసరం లేకున్నా రోగులకు ఒకటి కంటే ఎక్కువ స్కాన్లు నిర్వహించడం ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా 2019–24 మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవల నిర్వహణ కోసం కొనుగోలు చేసిన యంత్రాలను సైతం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) సాకుతో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నారు.కాకినాడ జీజీహెచ్‌లో గుండె సంబంధిత చికిత్సల కోసం గత ప్రభుత్వంలో రూ.7 కోట్లతో క్యాథల్యాబ్‌ను సమకూర్చారు. ఇప్పుడు ‘ముఖ్య’నేత సిఫార్సుతో ఈ అధునాతన పరికరాన్ని ఓఅండ్ఎం కింద ప్రైవేట్‌కు అప్పగించేశారు. ఏకంగా సింగిల్ బిడ్ వచ్చినా ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు ఇదే కాంట్రాక్టర్ అనంతపురం, ఒంగోలు జీజీహెచ్ల్లోని క్యాథ్‌ల్యాబ్‌లను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే డీఎంఈ నుంచి ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలుస్తోంది. -
మూడోరోజూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/తిరుపతి తుడా: రాష్ట్రంలో వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు గురువారం కొనసాగింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగులు అత్యవసర సేవలనూ బహిష్కరించి నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా అన్ని ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసి, 234 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని గడువు పెట్టినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. నేడు మౌన దీక్షలు..సమ్మె నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ, ఓపీ, ఐపీ వార్డులతో పాటు, రేడియాలజీ, పాథాలజీ, డయాలసిస్, ఇతర సేవలపై ప్రభావం పడుతోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్లడంతో నర్సింగ్, జీఎన్ఎం విద్యార్థులను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ప్రత్యామ్నాయంగా వైద్య శాఖ నియమించింది. అయితే రోగుల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వినూత్న నిరసనల్లో భాగంగా శుక్రవారం మౌన దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఏపీ వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.‘రుయా’లో 180 మందికి నోటీసులుఇక తిరుపతి రుయా ఆస్పత్రిలో విధులకు హాజరుకాలేదని అధికారులు గురువారం సుమారు 180 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నేళ్లుగా పేద రోగులకు సేవ చేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే షోకాజ్ నోటీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. -
ఒకే దశ పోలింగ్ వద్దు
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల సమస్యలతో పాటు ఎన్నికల ఏర్పాట్లలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లకు ఒకేరోజు పోలింగ్ కాకుండా రెండు దశల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సూచించారు. అదే మాదిరిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా రెండు దశల్లో నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో పాటు జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, నగర మున్సిపల్ కమిషనర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పిన కలెక్టర్లు, ఎస్పీలు.. ఒక్క దశలోనే ఎన్ని కలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను వివరించారు. రెండు దశల్లో 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరపండిరాష్ట్రంలో 17 కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు ఉండగా.. ప్రస్తుతం 13 కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీల్లోనే కొత్తగా వార్డుల విభజన జరిగి ఓటర్ల జాబితాలు, పోలీసు కేంద్రాల గుర్తింపు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగిలిన 23 చోట్ల కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడ్డాయి. అయితే, వాటిలోని 20 చోట్ల కోర్టు ఇబ్బందులు తొలగడంతో వాటిల్లో కూడా ఈనెల 17 కల్లా వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయిన వంద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, మిగిలిన 20 చోట్ల రెండు నెలల తర్వాత మరో విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణ రెండు దశల్లో జరపాలని కొందరు కలెక్టర్లు గురువారం నాటి సమావేశంలో కోరారు. ఎందుకంటే.. ఇతర అన్ని జిల్లాల కన్నా వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలన్నీ కలిపి మొత్తం తొమ్మిది వరకు ఉండడంతో ఒకేరోజు ఎన్నికతో శాంతిభద్రతల సమస్యతో పాటు ఏర్పాట్లలో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వారు ఎన్నికల కమిషనర్‌కు ఉదహరించారు. అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ శాంతిభద్రతల ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ జిల్లాలో రెండో దశల్లో ఎన్నికలు జరపాలని ఐదు జిల్లాల ఎస్పీలు కోరారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు మరోవైపు.. గ్రామ పంచాయతీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో.. గతంలో ఒక రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలన్నింటికీ ఒకరోజు నిర్వహించేలా కాకుండా.. మండలం మొత్తానికి ఒకరోజు ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాలను మూడుగా వర్గీకరించి కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 15వ రోజు పోలింగ్ పూర్తిచేసి, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికలను 25వ రోజుకల్లా పూర్తికి ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్ఈసీ సూచించారు. అలాగే, మండల పరిషత్ అధ్యక్ష, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీచేసిన 26 రోజుల్లోపు.. సర్పంచి ఎన్నికలను నోటిఫికేషన్ తర్వాత 15 రోజుల్లో పూర్తిచేయనున్నట్లు ఎస్ఈసీ ఆయా జిల్లాల జెడ్పీ సీఈఓ, డీపీఓలకు తెలిపారు. -
సాక్షి సోషల్ మీడియా ఖాతాలను ఎందుకు నిలిపేశారు?
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, కంటెంట్ నిలిపివేత చర్యలకు కారణం ఏమిటో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా ప్లాట్‌ఫామ్స్, గూగుల్ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏ కారణాలతో సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారో స్పష్టంగా చెప్పాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పలు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. సాక్షి న్యూస్, సాక్షి డిజిటల్ టీవీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను, సాక్షి టీవీ ఫేస్బుక్ పేజీని దేశవ్యాప్తంగా నిలిపివేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ (సాక్షి) డైరెక్టర్ వి.మురళి, ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) డైరెక్టర్ బీవీ రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, పోస్ట్‌లను తొలగించడానికి, నిలిపివేయడానికి ఇచ్చిన నోటీసులు, అభ్యర్థనలు, ఇతర వివరాలకు సంబంధించిన కాపీలను తమకు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్బుక్ ఇండియాలను ఆదేశించాలని హైకోర్టును సాక్షి తన పిటిషన్లో అభ్యచ్చిచింది. నిలిపేసిన సాక్షి సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తులోనూ అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని కోరింది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చంద్రబాబు, లోకేశ్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉన్న మొత్తం కంటెంట్‌ను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది చింతల సుమన్ ధర్మాసనాన్ని కోరారు. జగన్ కనెక్ట్స్, జగన్ వారియర్, వైఎస్సార్ కుటుంబ ఖాతాల నిలిపివేతపైనా నోటీసులు సాక్షి యాజమాన్యంతోపాటు జగన్ కనెక్ట్స్, వైఎస్సార్ కుటుంబం, వారియర్ జగన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలను తక్షణమే పునరుద్దరించేలా ఆదేశించాలంటూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై పార్టీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గురువారం విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదావేసింది. ఇప్పటికే దీనిపై కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కరువుపై కాకి లెక్కలు!
సాక్షి, అమరావతి: కరువు విలయంపై ముందుగానే సమాచారం ఉన్నా కప్పిపుచ్చి రైతన్నలను దారుణంగా వంచించిన చంద్రబాబు సర్కారు మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు సిద్ధమైంది. వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోగా కేవలం పొలాల్లో ఉన్న పంటల నష్టం పరిశీలనకే ఉపక్రమించింది. మిగతా రైతులను గాలికి వదిలేసింది. చంద్రబాబు పుణ్యమాని ఈ ఏడాది రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంది. లక్షలాది ఎకరాలు ఖాళీగా నెర్రలు చాస్తున్నాయి. సాగైన చోట తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు నేలపాలయ్యాయి. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలవాలి. యుద్ధప్రాతిపదికన నష్టాన్ని లెక్కించి పరిహారం అందించి మేమున్నామనే భరోసా కల్పించాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరువు మండలాలను ప్రకటించడంతోనే తమ బాధ్యత పూర్తయినట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. కర్ణాటకను చూసి సిగ్గు తెచ్చుకోవాలి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కర్నాటకలో 30 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా ఏపీలో ఏకంగా 53.4 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో చూస్తే మిజోరాం 58 శాతం లోటుతో ప్రథమ స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానంలో ఉంది. వాత్సవానికి ఏపీతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో కరువు ప్రభావం తక్కువనే చెప్పాలి. అయినా అక్కడి ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు స్పందిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది. ఏపీ కంటే ముందుగానే కర్ణాటకలో 217 తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి ప్రకటన చేశారు. మరో 1,520 తాలూకాలను కరువు జాబితాలో చేర్చే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రాథమికంగా దాదాపు రూ.60 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు కనీసం రూ.11 వేల కోట్ల తక్షణ సాయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని సాయం కోరేందుకు సిద్ధమవుతున్నారు. మరొక వైపు కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,250 కోట్లను తొలివిడత సాయంగా కర్ణాటక విడుదల చేసింది. అర్హులైన రైతులకు రూ.2,500 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. తాగునీటి కోసం రూ.306 కోట్లు, అత్యవసర ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.329 కోట్లు, పశుగ్రాసం కోసం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఢిల్లీ పర్యటనలో రైతుల కష్టాలు పట్టని బాబు చంద్రబాబు నిర్వాకం వల్ల కరువు తీవ్రత అధికంగా ఉన్న ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. సీజన్ ఆరంభం నుంచి సమీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతులను ఆదుకునే విషయంలో ఇవ్వడం లేదు. ఏపీలో సాధారణం కంటే ఈ ఏడాది దాదాపు 12 లక్షల ఎకరాల్లో సేద్యమే చేయలేదు. 13.15% మేర వరి నాట్లు పడలేదు. గతేడాదితో పోలిస్తే 29.7% ధాన్యం ఉత్పత్తి తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న 61.9%, జొన్న 69.2 %, చిరుధాన్యాలు 37.8% మేర ఉత్పత్తి తగ్గుతుందని లెక్క తేల్చారు. తొలుత రాష్ట్రంలోని 688 మండలాల్లో 550 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. చివర కు సీజన్ ముగిసిన తర్వాత 388 మండలాలకు పరిమితం చేసింది. 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ కరువు సాయం ఊసెత్తడం లేదు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలేదు. కరువు తీవ్రతను కేంద్రానికి వివరించి ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాబట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు బృందం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ఆ ఊసే మరిచి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకునేందుకు కరువు నిధులను రాబట్టే దిశగా కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. కనీసం రాష్ట్రంలో జరిగిన పంట నష్టం గురించి ప్రాథమికంగా వివరించే ప్రయత్నం చేసిన దాఖలాలే లేవు. కాకి లెక్కలతో సరి! కరువు మండలాల ప్రకటన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన అసలు పని మొదలవుతుంది. ప్రతి గ్రామంలో పంట నష్టాన్ని శాస్త్రీయంగా నమోదు చేయాలి. రైతువారీగా వివరాలు సేకరించాలి. సాగు పెట్టుబడి నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తక్షణ ఆర్థిక సాయం అందించాలి. పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు చేయాలి. రుణాల విషయంలో ఉపశమనం కల్పించాలి. ఇవేమీ చేయకుండా కరువు మండలాల జాబితా ప్రకటించి చేతులు దులుపుకొంటే కాకి లెక్కలుగానే మిగులుతాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సవాలక్ష షరతులతో అంచనాలు సీజన్ ముగిసిన తర్వాత మొక్కుబడిగా పంట నష్టం అంచనాలకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. పైగా బుధవారం (7వ తేదీ) రాత్రి ఆదేశాలిచ్చి.. 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జాబితా ప్రకారం కేంద్రానికి నష్టం అంచనాలు పంíపిస్తామని చెబుతున్నారు. వాస్తవంగా తుపానులు, వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాల సందర్భంలో దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఈ ఏడాది వర్షాలు పడలేదు. పంటలు సాగవ్వ లేదు. సాగైన చోట వర్షాభావంతో ఎండిపోయాయి. ఆరు తడులకు నీళ్లులేక, పెట్టుబడులు పెట్టలేక పంటను మేత కొదిలేయగా మరికొంతమంది దున్నేశారు. ఇవేమీ పట్టించు కోకుండా ప్రభుత్వం ఎప్పటిలాగే ఇన్పుట్ సబ్సిడీ కోసం పొలంలో ఉన్న పంటను మాత్రమే అదీ కూడా 33 శాతానికిపైగా దెబ్బతిన్న పంట నష్టాన్ని మాత్రమే జాబితాలో చేర్చాలని ఆదేశించడంపై రైతులు మండిపడుతున్నారు. పైగా పంట నష్టం ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదెకరాలకు మించకూడదని షరతు విధించడం గమనార్హం. ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉదారంగా స్పందించాల్సింది పోయి ఇలా ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న పొలాలు, ఎండిపోయిన, దున్నేసిన పొలాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. పంట ఉన్న పొలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తమ గతేమిటని తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం పైసా సాయం చేయలేదు 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఎకరానికి రూ. 20 వేల వరకు ఖర్చు చేశా. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. – శ్రీనివాసులు, నక్కలదిన్నెవడ్డిపల్లె, అన్నమయ్య జిల్లాపశువులకు మేతగా వదిలేశాఐదెకరాల్లో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టా. చేసేదేమీ లేక పంటను మేతగా పశువులకు వదిలేశా. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఇలాంటి నష్టం ఎప్పుడూ జరగలేదు. – గాదిలింగ, నిత్రపట్టి, కర్నూలు జిల్లా ఎకరాకు కనీసం రూ.25 వేలివ్వాలి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు, కాటకాలు సాధారణం. రైతులను ఉదారంగా ఆదుకోవడంలో దారుణంగా విఫలం. లోటు వర్షపాతంలో దేశంలోనే నెం.2లో ఉన్న ఏపీలో దాదాపు 550 మండలాల్లో కరువు ఉన్నట్టు తేలినా ప్రభుత్వం చివరికి 388 మండలాలకు కుదించింది. కనీసం కరువు ప్యాకేజీ అయినా ప్రకటించిందా అంటే అదీ లేదు. కరువు తీవ్రత పెద్దగా లేని కర్నాటకలో తక్షణ కరువు సాయం ప్రకటిస్తే ఏపీలో మాత్రం ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎకరాకు రూ.25 వేలకు తక్కువ కాకుండా సాయం అందించాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం వ్యవసాయ ఎమర్జెన్సీగా ప్రకటించాలి చరిత్రలో ముందెన్నడూలేని రీతిలో తీవ్ర దుర్భిక్షంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఉంది. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇంతటి సంక్షోభంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి. రైతులకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలి – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ఇంటి దొంగలపై వేటు!
సాక్షి, అమరావతి: డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(డా.ఎన్టీటీపీఎస్ –వీటీపీఎస్) ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘం(ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ) స్టోర్స్‌లో సొమ్ములు కాజేసిన ఇంటి దొంగలపై ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) చర్యలు చేపట్టింది. స్టోర్స్ నిర్వహణ, వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ నిర్వహించిన విచారణలో తేలింది. వీటికి బాధ్యులైన స్టోర్స్ మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ జెన్కో ఎండీ ఎస్.నాగలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి కె.వెంకటరమణను కూడా సస్పెండ్ చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇవీ అవకతవకలు.. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ప్రాంగణంలో వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పనిచేస్తోంది. శ్రీనివాస్ గతంలో ఎన్టీపీఎస్‌లో ఏఈఈగా పనిచేశారు. అనంతరం వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ వద్ద మెకానికల్ డీవైఈఈగా పనిచేస్తున్నారు. కాగా, స్టోర్స్, పెట్రోల్ బంక్ నిర్వహణలో అవకతవకలను ‘సాక్షి’ జూలై 13, 30న వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో వార్షిక ఆడిట్ నిర్వహించకుండా కాలం గడిపారనే విషయాన్ని బట్టబయలు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్.. ఆటో కేర్ సెంటర్‌కు సంబంధించి రూ.1,05,80,886.49 నగదు లోటు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. 9 అవకతవకల్లో 4 అంశాలకు శ్రీనివాస్ బాధ్యుడిగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయినా 4 నెలల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ‘సాక్షి’ ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి అధ్యక్షుడు, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతులు ఇచ్చి మరో విద్యుత్ కేంద్రానికి బదిలీ చేయడాన్ని నిలదీసింది.ఈ నేపథ్యంలో బాధ్యులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని సహకార శాఖ విచారణ అధికారి సిఫారసు చేశారు. సంబంధిత వ్యక్తుల ఆస్తులను నిబంధనల ప్రకారం షరతులతో జప్తు చేయాలని కూడా సూచించారు. ఇటీవలే దీర్ఘకాలిక సెలవు ముగించుకుని విధుల్లో చేరిన ఏపీ జెన్కో ఎండీ నాగలక్ష్మి అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్.. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో శ్రీనివాస్ డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీ హెడ్‌క్వార్టర్స్‌ను ముందస్తు అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. -
నాడు 243.. నేడు 29 పోస్టులే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌష్టికాహార లోపం నివారణ, మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన కీలకమైన మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీపై తీవ్ర గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన 243 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం 29 పోస్టులకే పరిమితం చేస్తూ జీవో జారీ చేయడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకంగా 214 పోస్టులను గాల్లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమేనని అభ్యర్థులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీల పర్యవేక్షణ, బాలింతలు, గర్భిణులకు పోషకాహార పంపిణీ బాధ్యతలను చూసే పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పరిస్థితిని సమీక్షించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 243 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 61 సీడీపీవో/ఏసీడీపీవో, 161 గ్రేడ్–1 సూపర్వైజర్, 21 చి్రల్డన్స్ హోమ్స్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. 2023లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీఎస్) సాధనకు 243 పోస్టులు అవసరమైతే, 2026 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 450కిపైగా ఉన్నట్టు సమాచారం. ఆ మేరకు పోస్టులు పెంచాల్సింది పోయి ఉన్నవాటిని కుదించడమేంటని అభ్యర్థులు బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులు హోంసైన్స్, సోషల్ వర్క్, న్యూట్రిషన్ వంటి ప్రత్యేక కోర్సులు పూర్తిచేసి, నోటిఫికేషన్ వస్తుందని ఏళ్లుగా నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఉద్యోగాల కల్పనపై పెద్దఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక ఉన్న పోస్టులకే కోత పెట్టడం వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆమోదం పొందిన మొత్తం 243 పోస్టులతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఖాళీల భర్తీకి తక్షణమే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు. -
14న దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రపతి ముర్ము 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. సుమారు 20 నిమిషాలు దుర్గగుడిలో గడుపుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 14న అమ్మవారికి జరిగే వైదిక కార్యక్రమాలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవస్థాన వైదిక కమిటీ సమావేశమై చర్చించింది. -
ఫీడ్.. దోపిడీ!
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అనుమతి లేదు.. రొయ్య రైతుల ఏకాభిప్రాయం లేదు.. అసలు రైతుల అభిప్రాయాన్ని అడిగినవాడే లేడు. అయినా రొయ్య ఫీడ్ ధరలను టన్నుకు మరో రూ.11వేలకు పెంచడానికి రంగం సిద్ధమయ్యింది. నేడో రేపో పెంచిన ధరలను అమలు చేయబోతున్నారు. ఫీడ్ కంపెనీలు ఇప్పటికే రెండు విడతల్లో టన్నుకు రూ. 16వేలు పెంచాయి. ఇప్పుడు మరో రూ.11 వేలు. ఇలా 8 నెలల వ్యవధిలో టన్నుకు ఏకంగా రూ.27వేల మేర ఫీడ్ ధరలు పెరగడమంటే మాటలా.. తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలే కాదు, సీడ్ ధరలదీ అదే దారి. ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాలదీ అదే దారి. ఎడాపెడా పెరుగుతున్న ధరలు రొయ్యరైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆక్వాఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు అనుయాయులవే. అందుకే వాళ్లు ఎలా కావాలంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్, ఫీడ్ ధరలను వాళ్లే నిర్ణయిస్తున్నారు. అష్టకష్టాలు పడి, అధికధరలను భరించి ఆక్వా సాగు చేసి రొయ్యపంట చేతికొచ్చేసరికి వ్యాపారులంతా సిండికేట్‌గా తయారయ్యి రేట్లు పడిపోయేలా చేస్తున్నారు. రైతులను ఆదుకోవలసిన చంద్రబాబు సర్కార్ ఈ సిండికేట్‌కు వంతపాడుతుండడాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా పెంపుఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టంతో పాటు ఫీడ్, సీడ్ «చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతుల పక్షాన నిలవాల్సిన రాష్ట్రప్రభుత్వం ఫీడ్కంపెనీల అడుగులకు మడుగులొత్తడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నాయి. రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ఫిబ్రవరిలో రూ.4వేలు, జూన్‌లో రూ.12వేల చొప్పున పెంచేశాయి. రైతుల ఆందోళనలతో రూ.2వేలు తగ్గించినట్టు నాటకాలాడిన కంపెనీలు 15 రోజులు తిరక్కుండానే దొడ్డిదారిన రూ.2వేలు పెంచి ఆ మేరకు రైతులపై భారం మోపాయి. 45 రోజులకోసారి ధరలపెంపును సమీక్షించుకునేందుకు కంపెనీలకు అవకాశం కల్పించారు.ప్రత్యేకంగా ఫీడ్ ధరల సమీక్ష కోసం రైతులు, ప్రాసెసింగ్, ఎగుమతిదారులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కమిటీలో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులు సిఫార్సు చేసిన ప్రభుత్వ అనుకూల రైతులకే చోటు కల్పించారు. వీరు ఫీడ్ కంపెనీలకు వంతపాడడం మొదలు పెట్టారు. ఈ దశలో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలను సాకుగా చూపి టన్నుకు రూ.37 వేలు తక్కువకాకుండా పెంచితే కానీ తమకు గిట్టుబాటు కాదని చెబుతూ కనీసం రూ.15 వేలు తక్కువకాకుండా పెంచేందుకు అనుమతినివ్వాలని ప్రతిపాదించాయి. ఈ మేరకు సబ్ కమిటీ ఆమోదం తెలపడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పెంపును అమలులోకి తీసుకొచ్చాయి. కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వతీరును నిరసిస్తూ ఆక్వారైతులు హైకోర్టును ఆశ్రయించారు.రైతుల ఏకాభిప్రాయం లేకుండా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులతో చర్చించి, వారి ఆమోదంతోనే ధరలను సవరించాలని సూచించింది. అప్పటివరకు పెంపును నిలిపి వేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. తాజాగా సబ్ కమిటీ ఆమోదంతో దొడ్డిదారిన టన్నుకు రూ.11వేలు పెంచేందుకు సిద్ధపడ్డాయి. ఈ పెంపును ఒకటి రెండు రోజుల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫీడ్ ధరల సబ్ కమిటీలో సభ్యులైన రైతుప్రతినిధులు కంపెనీలు ప్రతిపాదించిన ధరల పెంపు విషయమై ఆక్వా సాగయ్యే జిల్లా సంఘాల నేతలతో కానీ, రాష్ట్ర రైతు సంఘాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మేత ధరల భారమిలా2024 ఏప్రిల్‌లో టన్నుకు వెనామీ రొయ్యల మేత ధర రూ.82 వేలు, టైగర్ రొయ్యల మేత రూ.92 వేల మధ్య ఉండగా ప్రస్తుతం వెనామీ మేత రూ.1.18 లక్షలకు, టైగర్ మేత రూ.1.34 లక్షలకు చేరింది. అంటే రెండున్నరేళ్లలో టన్నుకు వెనామీ రైతులపై రూ.36 వేలు, టైగర్ రైతులపై రూ.42 వేల మేర భారం పడినట్టవుతుంది. మేత ధరల భారంతో కిలో రొయ్యల ఉత్పత్తికి వెనామీకి రూ.300కు, టైగర్‌కు రూ.450 ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఆక్వా రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీలు ఏడాది లేదా ఆరు నెలలకు సరిపడా ముడిసరుకులను ఒకేసారి ఇండెంట్ పెట్టి దిగుమతి చేసుకుంటాయే తప్ప నెలకోసారి దిగుమతి చేసుకోవని రైతు సంఘాలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా నవంబర్ లేదా డిసెంబర్లో ధరల సమీక్ష చేయాలే తప్ప ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల అంగీకారంలేకుండా, వారి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం ధరలు పెంచుకుంటూ పోతే తాము ఎలా సాగు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ధరల పెంపుపై నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడి వ్యయం పెరిగిపోతోందని, అదేసమయంలో కౌంట్ ధరలు మాత్రం ఇష్టానుసారంగా కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోకుండా వారికి ప్రభుత్వం వంతపాడడం సరికాదంటున్నారు.ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టుబడి ఆధారంగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ దోపిడికి గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. మరొక వైపు ఆక్వాసాగులో ఉపయోగించే పరికరాల ధరలు కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1000కు పైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది.మేత ధరల పెంపును నిరసిస్తున్నాంతాజాగా టన్నుకు రూ.11వేల మేర మేత ధరలు పెంచాలన్న ప్రతిపాదనలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.16వేల మేర భారం మోపారు. మేత కంపెనీలు, ప్రాసెసింగ్ నిర్వాహకులకు సిఫార్సులతో కూటమి ప్రభుత్వం నియమించిన ఫీడ్ ధరల రైతుల సబ్ కమిటీ సభ్యులతీరు వల్లే మాకీ పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల కోసారి ఫీడ్ ధరలు సమీక్షించే విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వతీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. – దుగ్గినేని గోపీనాథ్, కన్వీనర్, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య జగన్ హయాం.. ఆక్వా రైతుకు స్వర్ణయుగం.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్తంగా ఉన్న ఆక్వా జోన్స్‌ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీని వర్తింపచేసింది. ఆక్వాకు సంబందించిన విద్యుత్ సర్వీసుల్లో దాదాపు 90 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా, దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. పైగా ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్టులను తీసుకొచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడు సార్లు కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఉపసంహరింపచేయడంతో టన్నుపై రూ.8,600 మేర ఆదా అయ్యింది. పైగా 15 రోజులకోసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు.దొంగల్లా మేత కంపెనీలు200 ఎకరాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆక్వా సాగు చేస్తున్నాం. మేత కంపెనీలు దొంగల్లా తయారయ్యారు. తాజా పెంపుదలతో 8 నెలల వ్యవధిలో ఏకంగా రూ.27వేలు పెంచినట్టవుతోంది. మరొక వైపు కౌంట్ ధరలకు సైతం ఎడాపెడా కోతలేస్తూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు రైతులను దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్సిడీ వర్తించడం లేదు. ఓవర్ లోడ్ పేరిట ప్రతి నెలా రూ.12వేల వరకు అదనపు భారం పడుతోంది. జనరేటర్లతోనే ఆక్వా సాగు చేస్తే మేలన్నట్టుగా కన్పిస్తోంది. వైరస్లు, తెగుళ్ల కంటే చంద్రబాబు (సీబీ) వైరస్ వలనే ఆక్వా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. – వేగేశ్న వెంకటరాజు, చిన్నకాపురం, పశ్చిమగోదావరి జిల్లాఎకరాకు రూ.72వేల అదనపు భారంనేను 35 ఎకరాలు సాగు చేస్తున్నా. ఇప్పటికే టన్నుకు రూ.16వేల మేర పెంచిన కంపెనీలు తాజాగా మరో రూ.11వేల మేర పెంచనుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో ఎకరాకు రూ.72వేల మేర అదనంగా భారం పడుతోంది. కౌంట్ ధరల మధ్య వ్యత్యాసం రూ.30–50 నుంచి రూ.10–30కు తగ్గించేశారు. విద్యుత్ సబ్సిడీ వస్తుందని ఎదురు చూసాం. కానీ అమలుకు నోచుకోవడంలేదు. సర్దుబాటు చార్జీల పేరిట అదనపు భారం మోపుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆక్వా రైతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. – అల్లూరి కృష్ణంరాజు, ఖాతాల మెరక, పశ్చిమగోదావరి జిల్లావిద్యుత్ సబ్సిడీకీ ఎగనామంజోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ çసరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీని రెండున్నరేళ్లుగా అటకెక్కించేశారు. మరొక వైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదడంతో యూనిట్ రూ.1.50కే విద్యుత్ పొందే రైతు భూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు తప్ప ఈ రెండున్నరేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు ఈ రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. అదే సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, యూనిట్‌కు రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు ఛార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: వివేకా హత్య కేసుతో చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. వివేకా కేసులో న్యాయం జరగాలా? లేక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలా?. సునీత దంపతులు చంద్రబాబును కలవటానికి కారణం ఏంటి?. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసుల వార్తలు వచ్చిన వెంటనే సునీత దంపతులు.. చంద్రబాబును ఎందుకు కలిశారు’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు.‘‘వివేకా హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని చంద్రబాబును కలిశారా?. లేక కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం చర్చించారా?. సునీత కుటుంబానికి రాజకీయ పదవుల విషయంలో చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా పాత కేసులకు కొత్త స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. ప్రజలు సమాధానాలు అడిగితే క్రైమ్ థ్రిల్లర్ వినిపిస్తున్నారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది చంద్రబాబూ.. కానీ ఎడిటింగ్‌లోనే మీ రాజకీయ వ్యూహం బయటపడుతోంది’’ అంటూ శైలజానాథ్ చురకలు అంటించారు.‘‘గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు.. మరి వెన్నుపోటు పార్టీ చరిత్రను ప్రజలు మర్చిపోతారా?. వివేకా హత్య కేసులో నిందితులు చంద్రబాబు దగ్గరకు ఎందుకు వస్తున్నారు?. టీడీపీ కార్యాలయానికి దస్తగిరి కుటుంబం వచ్చారన్న వార్తలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?. వివేకా హత్య కేసులో నిందితులకు రాష్ట్ర మంత్రులు మద్దతుగా తెలపడం వెనుక కారణమేంటి?. సునీత ఏనాడైనా తన తండ్రి కేసును త్వరగా ముగించాలని ఎందుకు కోరటం లేదు?. వివేకా హత్య కేసులో రాజకీయ ఆరోపణలు మానుకోవాలి..ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా? లేక చంద్రబాబు ప్రభుత్వ సిట్ కథనాన్నే కొనసాగిస్తోందా?. రాష్ట్రంలో కరువు, రైతుల కష్టాలు, డీఎస్సీ అక్రమాలపై సమాధానం లేదు. చంద్రబాబుకు గొడ్డలి రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే వివేకానందరెడ్డి గుర్తుకొస్తారా?. ఆయన మరణానికి న్యాయం జరగాల్సిన అవసరం మిగతా రోజుల్లో ఉండదా?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ! -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్
సాక్షి,అమరావతి: ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.గత 68 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి విడుదల కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదోనిలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు ముగిశాయి.ఎమ్మెల్యే తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌సింగ్, లక్ష్మీకాంత్ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం తీర్పును గురువారానికి రిజర్వ్ చేసింది.ఇరువర్గాల వాదనలు, న్యాయస్థానం పరిశీలన అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనూ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఊరట పొందగా, ఇప్పుడు అట్రాసిటీ కేసులోనూ బెయిల్ రావడంపట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 68 రోజుల రిమాండ్ అనంతరం ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.ఇదీ చదవండి : ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ ఆగ్రహం -
ఈనెల 16న విశాఖలో వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభ
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో బీసీల గొంతుకను వినిపించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీన విశాఖలో ప్రతి ష్టాత్మకంగా ‘ఉత్తరాంధ్ర బీసీ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా ప్రధానంగా రెండు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ వేదిక ద్వారా తీవ్రంగా గళమెత్తనున్నారు. ఈ గర్జన సభ ద్వారా బీసీ వర్గాలకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణను వైఎస్సార్సీపీ ప్రకటించే అవకాశం ఉంది.ఇదీ చదవండి : ‘స్థితప్రజ్ఞుడు’ వైఎస్ జగన్ -
వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?: శ్యామల
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం.. యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపామంటూ సీఎం చంద్రబాబు సినిమా డైలాగులు చెబుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితకు టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆర్తనాదాలు హోంమంత్రి అనితకు ఏమాత్రం వినిపించడం లేదు. డేగ కన్నులంటూ ప్రచారం చేసుకుంటున్న ఈగల్ విభాగం సాధించిన వాస్తవ ఫలితాలేంటో స్పష్టం చేయాలి’’ అంటూ శ్యామల నిలదీశారు.‘‘అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయిని లేకుండా చేస్తామన్న హోంమంత్రి సవాల్ ఏమైంది? కూటమి నేతలు ఆడుతున్నది స్ట్రెయిట్ గేమ్ కాదు, యువత భవిష్యత్తును నాశనం చేసే టాక్సిక్ గేమ్. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం అత్యంత సిగ్గుచేటు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్రపై ప్రజలు నిలదీస్తున్నా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, యాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.’’ అని శ్యామల ధ్వజమెత్తారు.‘‘హోంమంత్రి చెప్పిన మూడు నెలల డెడ్‌లైన్ తర్వాతే రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆగస్టు 27న గోకవరంలో 75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సెప్టెంబర్ 2న విజయవాడ శివారులో గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు. సెప్టెంబర్ 4న అనకాపల్లిలో 3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న విశాఖ పెదగంట్యాడ వద్ద బెంగళూరు నుంచి తెచ్చిన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 27న అల్లూరి జిల్లా పెద్దబయలు వద్ద 1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. సెప్టెంబర్ 28న అనకాపల్లి జిల్లా కోడూరు జంక్షన్ వద్ద 5.5 కోట్ల విలువైన 43 లీటర్ల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.,,ఈ రోజు విశాఖపట్నంలో 50 గ్రాముల ఎండీఎంఏ, లీటర్ యాష్ ఆయిల్ దొరకడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హోంమంత్రి సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నా స్పందించడం లేదు. ఈగల్ వెబ్సైట్ లెక్కల ప్రకారమే 2,444 కేసులు, 6,332 అరెస్టులు, 6 లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రంలో గంజాయే లేదని ప్రచారం చేస్తూ వెబ్సైట్లో వేల కేసులు ఎలా చూపిస్తున్నారు. ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ, సేఫ్ క్యాంపస్ వంటి కార్యక్రమాల వల్ల ఒరిగింది శూన్యం.జగనన్న ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన ద్వారా 90 శాతం గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాం. నాడు గంజాయి సాగుదారులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో అనకాపల్లి కోడూరులో 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశాం. పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పట్టుబడుతున్న డ్రగ్స్ వెనుక ఉన్న ప్రధాన ఫైనాన్షియర్లు, సూత్రధారులను ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోంది. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై నమోదైన కేసుల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించాలి.రాష్ట్ర యువతకు కావాల్సింది టీవీ షోల వినోదం కాదు, డ్రగ్స్ ముప్పు నుంచి సంపూర్ణ రక్షణ. డ్రగ్స్‌పై కంటితుడుపు ప్రచారాలు కాదు, పూర్తిస్థాయి సరఫరా నెట్వర్క్ నిర్మూలన కావాలి. మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆదేశాలను పాటిస్తూ హోంమంత్రి అనిత కేవలం కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. విపక్ష నాయకులపై నిందలు వేయడం మాని హోంమంత్రి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ సమస్యను మరింత దిగజార్చింది’’ అని శ్యామల దుయ్యబట్టారు.ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం? -
వెబ్‌ల్యాండ్ హ్యాక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల యాజమాన్య హక్కుల రికార్డుల వివరాలున్న వెబ్‌ల్యాండ్ పోర్టల్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో భూపరిపాలనకు గుండెకాయ వంటి ఈ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా రెండురోజుల నుంచి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. పంటరుణాలు, ఈ–క్రాప్ నమోదు, ఎరువుల పంపిణీపైనా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని చిన్న సాంకేతిక సమస్య అని చెబుతోంది. వెబ్‌ల్యాండ్ హ్యాక్ అయి రెండురోజులు అయినా వాస్తవం బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది సర్వే నంబర్లు, ఎల్పీఎం నంబర్లు, భూయజమానుల పేర్లు, వారి ఆధార్ అనుసంధాన వివరాలు, అడంగల్, 1–బీ, మ్యుటేషన్ల చరిత్ర.. మొత్తం రాష్ట్ర భూసంపద వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లోనే ఉంటాయి. అలాంటి వ్యవస్థ మొత్తం హ్యాక్ అవడంతో ప్రజల భూములు మొత్తం ప్రమాదంలో పడినట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క క్లిక్‌తో యజమాని పేరు మారిపోయే ప్రమాదం నెలకొందని నిపుణులు చెబుతున్నారు. హెచ్చరికలు వచ్చినా నిద్రపోయిన సర్కారు రాష్ట్రంలో భూముల డేటా అంతా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఆధ్వర్యంలోని వెబ్‌ల్యాండ్ పోర్టళ్లలో ఉంటుంది. రీసర్వే పూర్తయిన గ్రామాలకు వెబ్‌ల్యాండ్–2, రీసర్వే కాని గ్రామాలకు పాత వెబ్‌ల్యాండ్ పనిచేస్తాయి. ప్రజలు తమ భూమి వివరాలు చూసుకునేందుకు మీభూమి పోర్టల్ ఉంది. పదిరోజులుగా ఈ పోర్టళ్లలో తరచు సమస్యలు వస్తున్నాయి. వారం కిందటే మీభూమి పోర్టల్ పూర్తిగా ఆగిపోయింది. అయినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ఫలితంగా రెండురోజుల కిందట మొత్తం వెబ్‌ల్యాండ్ వ్యవస్థే కుప్పకూలింది. వెబ్‌ల్యాండ్ నిర్వహణ అధికారికంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఐసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు లాగిన్ ఐడీలు, ఇతర కీలక యాక్సెస్‌లు విచ్చలవిడిగా ఇచ్చారని రెవెన్యూవర్గాల సమాచారం. భూరికార్డులను మార్చే అధికారం అధికారుల నుంచి ప్రైవేటు ఏజెన్సీలు, కార్పొరేట్సంస్థలు, వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. బ్లాక్‌చెయిన్ పేరుతో డేటా మొత్తం బయటకు ఇచ్చిన యాక్సెస్‌లు చాలవన్నట్లు ప్రభుత్వం ఇప్పుడు వెబ్‌ల్యాండ్ డేటా, రిజిస్ట్రేషన్ల డేటా, సర్వే డేటా మొత్తాన్ని ఒకేచోటకు చేర్చి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పోర్టళ్లను పూర్తిగా మార్చే పనిలో పడింది. ఈ ఏడాది జూలైలో చంద్రబాబు మీభూమి–బ్లాక్‌చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. చివరికి మొత్తం భూరికార్డుల వ్యవస్థనే అస్థవ్యస్థంగా మార్చి కుప్పకూలేలా చేశారు. డేటా మైగ్రేషన్ పేరుతో మొత్తం భూముల సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించడమే ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఉద్దేశమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములు మార్చేందుకేనా ఈ హ్యాకింగ్? ఈ హ్యాకింగ్ యాదృచ్ఛికంగా జరిగింది కాదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా భూరికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇది జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, 22–ఏ నిషేధిత జాబితాలోని భూములపై కన్నేసినవారే దీనివెనుక ఉన్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ వివరాలకు ముప్పు వెబ్‌ల్యాండ్‌లో భూయజమానుల ఆధార్ నంబర్లు, మొబైల్ నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. హ్యాకర్ల చేతికి ఈ వివరాలు చేరితే సైబర్ మోసాలు, నకిలీ దస్తావేజుల సృష్టికి అవకాశం ఏర్పడుతుంది. స్తంభించిన క్రయవిక్రయాలు రోజుకు సుమారు ఐదువేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రాష్ట్రంలో భూలావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందే అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్ తేదీలు ఖరారు చేసుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య ఖర్చులు, అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముకోవాలనుకున్న రైతులు డబ్బు చేతికి అందక అల్లాడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ల రూపంలో రోజూ రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఆదాయం కూడా ఆగిపోయి ఖజానాకు భారీనష్టం వాటిల్లుతోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదిలీలు కూడా ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో దేశానికే ఆదర్శం గత వైఎస్ జగన్ ప్రభుత్వం వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వేకి శ్రీకారం చుట్టింది. డ్రోన్లు, కార్స్ నెట్వర్క్ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రతి భూకమతాన్ని కొలిచి, ప్రతి పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించింది. రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించి, సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాలన్నది లక్ష్యం. వేలాది గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి కొత్త రికార్డులు రూపొందించింది. ఇక్కడ రీసర్వే జరుగుతున్న ఈ విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా అధ్యయనం చేశాయి. భూరికార్డుల ఆధునికీకరణలో ఏపీ దేశానికే మోడల్‌గా నిలిచింది. రీసర్వేని సక్రమంగా చేయలేకపోతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ వ్యవస్థను కూడా సమర్థంగా నిర్వహించలేక కుప్పకూల్చింది. వైఎస్ జగన్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. చంద్రబాబు పాలనలో భూరికార్డులు హ్యాక్ అయిన రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంది. -
నష్టాల ఊబిలో ఎస్డీఎస్టీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో కీలకమైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌కు సుమారు రూ.7,500 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు, నష్టాలు ఉన్నట్టు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. మరమ్మతులు, నిర్వహణకు కేటాయించే నిధులు కూడా తగ్గుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని నిర్వహించే ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి, బూడిద రవాణా, వేతన సవరణల పేరుతో రూ.302.04 కోట్ల ట్రూ అప్‌కు అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్సీని కోరింది. ఇందులో ఏపీఈఆర్సీ రూ.236.20 కోట్లకు అనుమతించింది. అంటే క్లెయిమ్ చేసిన మొత్తంలో రూ.65.84 కోట్లను తిరస్కరించింది. ఈ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రజల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసి ఏపీపీడీసీఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. వేతన క్లెయిమ్‌కు చుక్కెదురు.. వేతన సవరణ పేరుతో ఏపీపీడీసీఎల్ రూ.46.98 కోట్లు కోరింది. కానీ రూ.1,523.98 కోట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) వ్యయానికి అనుమతి ఉండగా.. వాస్తవ ఖర్చు రూ.972.03 కోట్లు మాత్రమే జరిగింది. అంటే రూ.551.95 కోట్లు ఖర్చు కాలేదు. దీంతో రూ.46.98 కోట్లు అదనంగా అవసరం లేదని ఏపీఈఆర్సీ తేల్చి చెప్పింది. అయితే ప్లాంట్ పనితీరును మెరుగుపరిచేందుకు 2024–25 వేతన సవరణలోని రూ.16.28 కోట్లను ప్రత్యేక కేసుగా ఆమోదించింది. ఆ మొత్తాన్ని 2026–27లో అదనంగా మరమ్మతులు, నిర్వహణ పనులకే ఖర్చు చేయాలని ఆదేశించింది. ఉద్యోగుల తప్పనిసరి ఖర్చుల తర్వాత మరమ్మతులు, నిర్వహణకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ప్లాంట్ పనితీరు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తంగా రూ.వేల కోట్ల నష్టాలు, పెరుగుతున్న ఇంధన వ్యయం, తక్కువ ప్లాంట్ అందుబాటు, నిర్వహణకు తగ్గుతున్న నిధులు.. ఇవన్నీ ఎస్డీఎస్టీపీఎస్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ భద్రతకు కీలకమైన ఈ ప్లాంట్ పనితీరు మెరుగుపడకపోతే భవిష్యత్తులో ఆర్థిక భారం మరింత పెరగడంతో పాటు విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొగ్గు ఖర్చే పెద్ద భారం.. ప్లాంట్ ఖర్చులు పెరగడానికి బొగ్గు ధరలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దేశీయ బొగ్గు ధర టన్నుకు రూ.4,700 నుంచి రూ.5,308కు పెరిగింది. 2024–25లో ప్లాంట్ ఇంధన వినియోగంలో సుమారు 24 శాతం ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు, దిగుమతి బొగ్గు కలిపి వాడారు. 2024–25లో స్టేజ్–2 వేరియబుల్ కాస్ట్ యూనిట్‌కు రూ.3.20గా అనుమతించగా, వాస్తవ ఇంధన ధరల సర్దుబాటు (ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్–ఎఫ్సీఏ) లెక్కల్లో అది రూ.3.41కు చేరింది. దీంతో ఒక్క ఏడాదికే స్టేజ్–2కు రూ.104.76 కోట్ల ట్రూ–అప్ అనుమతించాల్సి వచి్చంది. ఇక బూడిదను తరలించడానికే 2024–25లో రూ.14.56 కోట్లు ఖర్చయ్యాయి. అయితే బూడిద అమ్మకం ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని తీసివేసిన తర్వాత రూ.4.40 కోట్లను వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతించింది. -
పోలవరం ఇష్టారాజ్యం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర జీవనాడి పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందా? ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా? డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మాణం కోసం అనుసరిస్తున్న సాంకేతిక నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవా? అంటే అవుననే సమాధానం చెబుతోంది విదేశీ నిపుణుల కమిటీ ఏడో నివేదిక. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అమెరికా, కెనడాలకు చెందిన సి.రిచర్డ్ డొన్నెళ్లి, గియాన్ ఫ్రాంకో డీ సిస్కో, డేవిడ్ పాల్, సీన్ హించ్బెర్జర్లతో నిపుణుల కమిటీ(పీవోఈ)ని 2024లో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. ఇప్పటిదాకా ఏడు సార్లు విదేశీ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి.. సాంకేతిక సలహాలు అందించారు. ఈ ఏడాది మే 27–28న విదేశీ నిపుణుల బృందంలో ఒకరైన హించ్ బెర్గర్ మాత్రమే పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిగతా ముగ్గురు నిపుణులు ఈ పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారో అధికారికంగా అటు పీపీఏ గానీ, ఇటు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు గానీ అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. మిగిలిన ముగ్గురు నిపుణులతో సంప్రదించి.. పనులు సాగుతున్న పరిస్థితి, లోపాలను ఎత్తిచూపి వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలు, నాణ్యంగా పనులు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆగస్టు 28న ఏడో నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లకు హించ్ బెర్గర్ అందజేశారు. ప్రాజెక్టు భద్రతకు అత్యంత కీలకమైన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ ప్లాన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాన్ల కాపీలను తమకు అందజేయలేదని, అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదని నిపుణుల కమిటీ నివేదికలో ఎత్తిచూపింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ...గ్రేడింగ్ చేసిన రాళ్లెక్కడ?డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా బంకమట్టి (నల్లరేగడి మట్టి–క్లే)ను పోసి, దాని పక్కన ఇసుక, గ్రేడింగ్ చేసిన రాళ్లు వేసి ప్రధాన డ్యాంను నిర్మించాలి. ప్రధాన డ్యాంకు ఎగువన, దిగువన ఊట నీటికి అడ్డుకట్ట వేయడానికి, కోతకు గురి కాకుండా చేసేందుకు ఫిల్టర్ (గ్రేడింగ్ చేసిన చిన్న చిన్న రాళ్లను సమాంతరంగా ఏకరీతిగా పోసి, దాని పక్కన ఇసుక పొర, దానికి పక్కన గ్రేడింగ్ చేసిన రాళ్లతో మరో పొర వేస్తారు) వేయాలి. ప్రధాన డ్యాం గ్యాప్–2లో ఫిల్టర్ పనుల్లో పెద్ద పెద్ద రాళ్లను వేస్తున్నారని.. కాంట్రాక్టర్ భారీ బండరాళ్లను తెచ్చి, హో ర్యామ్స్ యంత్రాలతో వాటిని పగులగొట్టడం తాను కళ్లారా చూడటాన్ని విదేశీ నిపుణుడు హించ్ బెర్గర్ నివేదికలో ప్రస్తావించారు. గ్రేడింగ్ చేసిన రాళ్లను కాకుండా పెద్ద పెద్ద రాళ్లతో ఫిల్టర్ నిర్మిస్తే.. రాళ్ల మధ్య సందుల నుంచి ఊట నీరు ప్రవహించడంతోపాటు నదీ గర్భం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని.. ఇది ప్రధాన డ్యాంకు గండ్లు పడేందుకు దోహదం చేస్తుందని.. ఇది ప్రధాన డ్యాం భద్రతకే సవాల్‌గా మారుతుందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. స్కారిఫికేషన్ యంత్రాలెక్కడ?ప్రధాన డ్యాం నిర్మాణంలో రాతి, మట్టితో ఒక పొర వేసి దాన్ని భారీ రోలర్లతో గట్టిపరిచి.. దానిపై మరో పొర వేస్తూ సముద్రమట్టానికి 53 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించాలి. దిగువన ప్రధాన డ్యాం వెడల్పు దాదాపు 300 మీటర్లు ఉంటే.. పైభాగానికి వచ్చే సరికి 15 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇలా పొరలు పొరలుగా రాళ్లు, మట్టిని వేసి నిర్మించాలి. ఒక పొరను వేశాక దానిపై మరొక పొర వేసే ముందు కింది పొరను గీకి, రఫ్‌గా(స్కారిఫికేషన్) చేయాలి. అప్పుడు రెండు పొరలు బాగా అతుక్కుపోతాయి. కానీ.. స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేకపోవడంపై విదేశీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా పక్కనే ఉన్న పొలాల నుంచి ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్న వైనాన్ని విదేశీ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. స్కారిఫికేషన్ సక్రమంగా చేయకపోతే రెండు పొరలు సరిగ్గా అతుక్కోవని.. ఇది డ్యాం స్థిరత్వానికి, భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.డయాఫ్రంవాల్ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి.. కానీ దాన్ని నిర్మించడానికి తవ్వే కట్టర్ మందం 1.5 మీటర్లని.. లోతుకు వెళ్లే కొద్దీ కట్టర్ పక్కకు జరగడం లేదా తిరగడం వల్ల, ఒక ప్యానల్ మరో ప్యాన్లతో ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఆ జాయింట్లలో మందం తగ్గిందా లేదా అన్నది తేల్చాలని నివేదికలో సూచించిన నిపుణుల కమిటీ బంకమట్టిలో తేమ ఏది?డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా నల్లరేగడి–బంకమట్టిని వేయాలి. ఈ బంకమట్టిలో తగినంత తేమ ఉండాలి. అప్పుడే తగినంత మేర బంకమట్టి సాగి డయాఫ్రం వాల్‌కు రక్షణగా నిలుస్తుంది. కానీ.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌కు ఇరు వైపులా పోస్తున్న బంకమట్టిలో తగినంత తేమ లేక ఎండిపోయి ఉందని.. దీనికి సాగే గుణం ఉండదని.. దీని వల్ల డ్యాం నిర్మాణంలో అంతర్గతంగా పగుళ్లు ఏర్పడతాయని.. ఇది డ్యాం భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని హెచ్చరించింది. పూర్తి రికార్డులు లేకుండా అంచనా ఎలా?ప్రధాన డ్యాం గ్యాప్–1 వద్ద లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి కర్టెన్ గ్రౌటింగ్(బోరు వేసి అధిక ఒత్తిడితో సిమెంటు కాంక్రీట్‌ను పంపడం ద్వారా భూగర్భంలో చీలికలను మూసేయడం) చేయాలి. కానీ.. 2026, మే 25 నాటికి 242 గ్రౌటింగ్ హోల్స్కుగానూ 213.. 46 కర్టన్ గ్రౌటింగ్ హోల్స్కుగానూ 42 పూర్తి చేశారని.. వాటికి సంబంధించి ప్రైమరీ చెక్హోల్స్ ఫలితాలు మాత్రమే ఇచ్చారని.. సెకండరీ, టెర్షియరీ హోల్స్‌కు సంబంధించి పూర్తి రికార్డులు ఇవ్వకపోవడం వల్ల లీకేజీ నివారణ సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయలేమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్యానళ్లను సరిగా దించలేదు..డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం కట్టర్లు, గ్రాబర్లతో భూమిని తవ్వుతూ ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతూ.. రాతిపొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానళ్లను దించే వరకూ తవ్వుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం వెలుపలికి వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమం కాంక్రీట్ మిశ్రమంతో కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా ఏర్పడి.. పెద్ద గోడగా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. కానీ.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్యానళ్లను కఠిన శిలలోకి రెండు మీటర్ల లోతు వరకూ దించే విధాన్ని అత్యంత లోపభూయిష్టంగా చేశారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. కఠిన రాతి శిల పైపొర ప్యానల్‌కు తగిలినప్పటి నుంచి ఐదు నిముషాల వరకూ నిరంతరాయంగా రాతి ముక్కలు బయటకు వచ్చినప్పుడే రాతి పొరలోకి రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించినట్లుగా లెక్కించాలని స్పష్టం చేసింది.మరమ్మతుల పత్రాలివ్వలేదు..డయాఫ్రం వాల్ పైభాగాన్ని ట్రిమ్ చేసిన తర్వాత పరిశీలిస్తే.. ప్యానెళ్ల జాయింట్లు వద్ద, అలైన్మెంట్ వ్యత్యాసాలు, కాంక్రీట్ లోపాలు బయటపడ్డాయని నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. వాటిలో కొన్నింటికి మరమ్మతులు చేశారని గుర్తించింది. ఎంత లోతు వరకూ మరమ్మతులు చేశారు.. అందులో వినియోగించిన పదార్థాలు ఏమిటి? అధికారికంగా పీపీఏ తనిఖీ చేసి, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు ఏవీ తమకు ఇవ్వలేదని విదేశీ నిపుణులు నివేదికలో ఎత్తిచూపారు.మందాన్ని ధ్రువీకరించలేదు..డయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాలి. ఆ మేరకు నిర్మించామని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. కానీ.. దాన్ని నిర్మించేందుకు వినియోగించిన కట్టర్ యంత్రం మందం 1.5 మీటర్లు.. అది డయాఫ్రం వాల్ మందాన్ని ధ్రువీకరించలేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. భూమి లోపలకు వెళ్లే కొద్దీ కట్టర్ యంత్రం పక్కకు జరగడం లేదా తిరగడం.. ఒక ప్యానల్ మరో ప్యానల్‌తో జతచేసినప్పుడు(ఓవర్ ల్యాప్) డయాఫ్రం వాల్ వైశాల్యం మారిపోతుందని.. ఎక్కువ లోతుకు వెళ్లినప్పుడు గోడ మందం తగ్గిపోయే ప్రమాదం ఉందని.. అది 0.9 మీటర్లకు కూడా చేరే అవకాశం ఉందని గతంలోనూ తాజాగానూ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. డయాఫ్రం వాల్ మందం ఏకరీతిగా ఉందా లేదా తెలుసుకోవడానికి కట్టర్, కోడెన్ సర్వే డేటాలను కలిపి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని సూచించింది. ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో ఒక పొరపై మరొకటి వేసేటప్పుడు కింది పొరను రఫ్ చేయడానికి స్కారిఫికేషన్ చేయడానికి యంత్రాలు లేవని.. సమీపంలోని పొలాల్లో ట్రాక్టర్ టిల్లర్లతో స్కారిఫికేషన్ చేస్తున్నారంటూ ఫొటో సాక్ష్యాలతో నివేదికలో పేర్కొన్న నిపుణుల కమిటీ ప్యానళ్లలో నీటిబుడగలున్నాయి..డయాఫ్రం వాల్ నిర్మాణానికి వినియోగించిన 365 ప్యానళ్లలో 38 ప్యానళ్లలో నీటి బుడగలు (నీటి ఊట లేదా బ్లీడింగ్) కన్పించింది. కాంక్రీట్ మిశ్రమంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల సిమెంటు, ఇసుక, బెంటనైట్, కంకర విడిపోవడం(సెగ్రిగేట్) వల్ల బ్లీడింగ్ అయినట్లు గతంలో విదేశీ నిపుణులు ఎత్తిచూపారు. ఇది సీపేజీకి దారి తీస్తుందని పేర్కొన్నారు. కానీ.. అడ్డంగా తీసిన కోర్(సిమెంటు కాంక్రీట్) నమూనాలను పరీక్షించిన ఫలితాలు చూస్తే అవన్నీ బాగానే ఉన్నట్లు హించ్ బెర్గర్ పేర్కొన్నారు. కాగా ప్రధాన డ్యాంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుసరిస్తున్న సాంకేతిక ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ ఆక్షేపిస్తూనే.. డయాఫ్రం వాల్ పటిష్ఠంగా ఉందని.. సమర్థవంతంగా ఊట నీటిని అడ్డుకుంటుందంటూ నివేదికలో హించ్ బెర్గర్ పేర్కొనడం గమనార్హం!ప్రధాన డ్యాం పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రదేశంలో భూభౌగోళిక పరిస్థితుల ఆధారంగా నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసేలా ప్రధాన డ్యాం, నదీ తీరానికి కుడి వైపున రాతి నేలపై వరదను మళ్లించేలా స్పిల్ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఈ డిజైన్ ప్రకారం గోదావరి నదీ గర్భంలో గ్యాప్–1లో 564 మీటర్ల పొడవున, గ్యాప్–2లో 1750 మీటర్ల పొడవున రాళ్లు, మట్టితో ప్రధాన డ్యాంను నిర్మించాలి. నదీ గర్భంలో ఊట(సీపేజీ) నీటిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి ప్రధాన డ్యాంకు పునాదిగా డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని సీడబ్ల్యూసీ సూచించింది. కానీ ప్రధాన డ్యాం పనుల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని హించ్ బెర్గర్ గుర్తించారు.డయాఫ్రం వాల్ నిర్మాణంలోనూ లోపాలుగోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్‌ను 2016–18 మధ్య నిర్మించి సీఎం చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు ఆది నుంచి ఎత్తిచూపుతున్నారు. దీనివలన గోదావరి ప్రవాహ ఉద్ధృతికి ఆ డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. దాంతో ఆ దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్‌ను నిర్మించాలని విదేశీ నిపుణులు చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. 1,372.6 మీటర్ల పొడవున 1.5 మీటర్ల మందంతో గరిష్ఠంగా 97.6 మీటర్ల లోతు నుంచి డయాఫ్రం వాల్‌ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. 365 ప్యానళ్లతో 67,147.9 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ పనులు చేయాలి. డయాఫ్రం వాల్ పనులను 2025, జనవరి 18న ప్రారంభించి.. 2026, ఏప్రిల్ 2 నాటికి అంటే 439 రోజుల్లో పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ పనులు చేస్తున్న క్రమంలో విదేశీ నిపుణులు సందర్శించి.. పలు లోపాలను ఎత్తిచూపి.. వాటిని సరిచేయాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఏడో సారి సందర్శించినప్పుడూ అదే కథ. -
పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మరో వివాహిత మోజులో పడి పెళ్లైనా భార్యతో సరిగా గడపలేకపోయాడు ఆ ప్రబుద్ధుడు. నిత్యం నువ్వే గుర్తుకొస్తున్నావంటూ పాత బంధాన్ని కొనసాగించాలని ప్రియురాలిని వేధించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్లి గొంతు కోసి కసిదీరా పొడిచి హత్య చేశాడు. అనంతరం తానూ గాయాలు చేసుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యారావుపేట సీఐ చవాన్ కథనం ప్రకారం.. విజయవాడ అరండల్‌పేటకు చెందిన మహిళ (33)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈమె కుటుంబం మూడేళ్ల పాటు అరండల్‌పేటలోని నాగరాజు ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆ సమయంలో నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజుకు పెళ్లి కుదరడంతో ఆమె కుటుంబం మూడు నెలల కిందటే పక్క ఇంట్లోని రెండో అంతస్తుకు మారింది. నాగరాజుకు పెళ్లైనా భార్యతో సరిగా ఉండడం లేదు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను తీవ్రంగా వేధిస్తున్నాడు. మళ్లీ తమ ఇంట్లోకి అద్దెకు రావాలని ఆమెతో పాటు, భర్తను అడుగుతున్నాడు. దీనికి మహిళ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు కత్తి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. గొంతుకోసి శరీరంపై కసిదీరా పొడిచి చంపేశాడు. శరీరంపై 15 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అనంతరం తానూ చనిపోవాలని భావించి పొట్టపై, గొంతుపై గాయం చేసుకున్నాడు. భవనంపై నుంచి దిగివచ్చి పక్కన ఉన్న కాలువలో దూకాడు. స్థానికులు గమనించి నాగరాజును ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మరిచిపోలేకపోతున్నానని, అందుకే చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు మహిళ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
దివ్యాంగుల ఫాస్టాగ్ నిబంధనల్లో సవరణలు
సాక్షి, అమరావతి: దివ్యాంగ లబ్ధిదారులకు జాతీయ రహదారి టోలింగ్ వ్యవస్థను మరింత అందుబాటులోకి తెచ్చేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) కొత్త మార్గదర్శకాల్లో సవరణ చేసింది. దివ్యాంగులు రాయితీ పొందిన ఫాస్టాగ్ జారీ, పునరుద్ధరణలో మార్పు తీసుకొచ్చింది. శారీరక వైకల్యం కలిగిన వ్యక్తుల వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలకు, ‘దివ్యాంగజన్’ యాజమాన్యం కింద నమోదు చేసిన వాహనాలకు రాయితీ ఫాస్టాగ్ జారీ చేస్తారు. వైకల్య ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు, సంబంధిత రికార్డుల మేరకు వైకల్య శాతం ఆధారంగా రాయితీ ఫాస్టాగ్‌లు ఇస్తారు. వీటిని ఏడాదికోసారి రెన్యువల్ చేసుకోవాలనే నిబంధనను సవరించడంతో.. 70శాతం నుంచి నూరు శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు ఐదేళ్లపాటు, 40శాతం నుంచి 70శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులకు మూడేళ్లపాటు చెల్లుబాటులో ఉంటాయి. గడువు ముగిసిన తర్వాత మళ్లీ అర్హత ధ్రువపత్రాలతో జాతీయ రహదారుల ఫీజు నియమాలు–2008లకు లోబడి మళ్లీ రాయితీ ఫాస్టాగ్‌ను పునరుద్ధరించుకోవచ్చు. -
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ‘ఓటీపీఆర్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సర్వీస్ కమిషన్ చుక్కలు చూపిస్తోంది. ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్)లో చేసిన తాజా మార్పులు వారి పాలిట సమస్యగా మారాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ప్రభుత్వం జిల్లాల పునర్ విభజనతో పాటు మల్టీ జోనల్ విధానం తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల రీత్యా అభ్యర్థులు స్థానికతను నిర్ధారించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ క్రమంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యాభ్యాసం వరుస క్రమంలో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేయాలి. వాస్తవానికి రాష్ట్ర విద్యావిధానంలో ప్రతి తరగతి తప్పనిసరిగా చదవాలనే నిబంధన లేకపోవడంతో గతంలో కొంతమంది విద్యార్థులను వారి ప్రతిభ, వయసు ఆధారంగా కొన్ని తరగతులు చదవకుండానే నేరుగా మూడు, నాలుగు లేదా ఐదో తరగతుల్లో చేర్పించారు. దీంతో వారు కొన్ని తరగతులు చదవకుండానే డిగ్రీ, పీజీలు కూడా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓటీపీఆర్ నమోదులో మాత్రం ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో తప్పనిసరిగా నమోదు చేస్తేనే అప్డేట్ అయ్యేలా మార్పులు చేశారు. దీంతో ఒకటి నుంచి ఏడో తరగతి మధ్యలో ఒకటి రెండు తరగతులు చదవకుండా నేరుగా పైతరగతి చదివినా.. అలాంటి అభ్యర్థులు తమ ఓటీపీఆర్ వివరాలు నమోదు చేస్తే అప్డేట్ కావడం లేదు.ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో ‘టైప్ ఆఫ్ స్టడీ, జిల్లా, మండలం, గ్రామం/పట్టణం/నగరం, పాసైన సంవత్సరం, పాఠశాల పేరు’ వివరాలు నమోదు చేస్తేనే వెబ్సైట్లో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం కల్పించారు. దీంతో మధ్యలో కొన్ని తరగతులు చదవలేని వారి వివరాలు తీసుకోవడంలేదు. అలాగే, 7వ తరగతి వరకు చదవకుండా, నేరుగా ఓపెన్ స్కూలింగ్ విధానంలో పది, ఇంటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్డేట్ అవడం లేదు. ఈ విధానం మార్చాలని, లేకుంటే వేలాది మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు, ప్రతిభతో పైతరగతులు చదివిన అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రాజధానిలో మరో భూ మోసం
తాడికొండ: అమరావతి రాజధానిలో మరో భూ మోసం వెలుగు చూసింది. ఇటీవల బతికున్న మనిషిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తాడికొండకు చెందిన హనుమంతు సుబ్రహ్మణ్యశాస్త్రికి చెందిన పదెకరాల భూమికి ఆన్లైన్లో పేరు మార్చిన కేసులో తహసీల్దార్, ఆర్ఐ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురైనా నిందితుడు ఎవరో తేలకముందే రాజధాని ప్రాంతమైన తాడికొండ మండలం పెదపరిమిలో మరో భూ మోసం వెలుగు చూసింది. పెదపరిమికి చెందిన బాధిత రైతు నర్రా మల్లేశ్వరరావు బుధవారం తాడికొండలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. రూ.4 కోట్ల విలువైన తన 89 సెంట్ల భూమిని తమ గ్రామంలో టీడీపీకి చెందిన భాష్యం సురేష్‌చౌదరి రూ.1 కోటి 11 లక్షల 25 వేలకు కొనుగోలు చేసినట్లు ఈ ఏడాది జూన్ రెండోతేదీ అగ్రిమెంట్ సృష్టించారని మల్లేశ్వరరావు చెప్పారు. 60 రోజుల అనంతరం తాను రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ సురేష్ కోర్టు నోటీసులిచ్చారని తెలిపారు. అసలు అమ్మకం, కొనుగోలు జరగనప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని సురేష్ బాబాయిని తాను అడిగినట్లు తెలిపారు. సురేష్ బాబాయి లాయర్‌కి ఫోన్‌చేసి కొనుగోలు చేయకుండా ఇలా నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే లాయరు సమాధానం చెప్పలేదన్నారు. సురేష్ తనకు తెలియదని, తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తన ఆస్తి కాజేయాలన్న ఈ కుట్ర వెనుక తమ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి రామారావు, భాష్యం హనుమయ్య, గార్లపాడుకు చెందిన ఘట్టమనేని వాసు, పుట్టి హనుమంతరావు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని చీటింగ్ కేసు నమోదు చేయమని సెపె్టంబర్ 21న జిల్లా ఎస్పీని కోరితే తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సూచించారని తెలిపారు. తుళ్లూరు డీఎస్పీ, సీఐలను కలవగా సివిల్ కేసు అంటూ కేసు నమోదు చేయకుండా పక్కన పడేశారని ఆరోపించారు. తన భూమి వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు పంపానన్నారు. -
అంతర్జాతీయ, ప్రైవేట్ వర్సిటీల కోసం పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్ధలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తెచ్చేందుకు ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం–2026కు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, భారతీయ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు అర్హత ప్రమాణాలు, ప్రోత్సాహకాలు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రభుత్వం ఎంపిక చేసిన అకడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కూడా క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ఆ వివరాలు.. » రాష్ట్ర విద్యా వ్యవస్థ నిబంధనల్లో మార్పుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం–1982లోని పలు సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేసి, నోటిఫికేషన్ ఇచ్చి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు. » ఇళ్ల స్థలాల సమస్యను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మరో మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్దిదారులు వదిలేసిన రిజిస్టర్డు స్థలాల రిజి్రస్టేషన్ రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. » విధుల్లో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ ఇస్తారు. సేవలో ఉన్న పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఆమోదం. » 2026–27 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం జారీ చేసిన జీవోకు ఆమోదం. » సంక్షేమ వసతి గృహాలు, గురు కులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అందించే నెలవారీ డైట్ ఛార్జీలను పెంచే జీవోకు ఆమోదం. » గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించడానికి విశాఖపట్నంలోని మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు జీవోకు ఆమోదం. కేబినెట్ సమావేశానికి నలుగురు డుమ్మా రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్, కందుల దుర్గేష్ బుధవారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. కార్యక్రమాలు ఉన్నాయని ముగ్గురు, విదేశాల్లో ఉండడంతో ఒకరు గైర్హాజరయ్యారు. చంద్రబాబు కేబినెట్ సమావేశాలను సైతం సమీక్షా సమావేశాల తరహాలో నిర్వహిస్తుండడంతో మంత్రులు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి సమావేశానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు గైర్హాజరుకావడం పరిపాటిగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో వరుసగా మూడు కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రులు అసలు వాటి గురించే పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏడాదైనా కౌంటర్ దాఖలు చేయరా?
సాక్షి, అమరావతి: రోజూ జనాలకు సుద్దులు చెబుతూ కథనాలు వండివార్చే ఈనాడు దినపత్రిక యజమాని కిరణ్ సమీప బంధువుకు చెందిన కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఐపీఎల్) భూ అక్రమాలకు సంబంధించిన వ్యాజ్యంలో ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మిగిలిన ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయగా, ప్రభుత్వం ఒక్కటే కౌంటర్ దాఖలు చేయలేదని, కౌంటర్ దాఖలుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని నిలదీసింది. ఏడాదిగా కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని కౌంటర్ దాఖలులో అలసత్వం ప్రదర్శించిన అధికారి జేబు నుంచి వసూలు చేసి, దాన్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అప్పీళ్లతో పాటు ఇతర వ్యాజ్యాలు ఏవైనా ఉంటే, వాటన్నింటినీ ఈ పిల్‌కు జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెజ్ కోసం రైతుల నుంచి తీసి ఇచ్చిన భూములను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి తెలియకుండానే కేఐపీఎల్ అమ్మేసుకుంటున్నా బాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. తమ అక్రమాలను కప్పిపుచ్చుతూ, ప్రతిపక్షంపై బురదజల్లుతూ అన్ని రకాలుగా ఈనాడు పత్రిక సహకరిస్తుండటంతో బాబు సర్కార్ చోద్యం చూస్తోంది. బహుళ ఉత్పత్తుల ప్రత్యేక ఆర్థిక మండలి (ఎంపీఎస్ఈజెడ్) ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయకుండా ఆ భూములను థర్డ్ పార్టీ కంపెనీలకు అమ్మేసుకోవడం, ఏపీఐఐసీకి తెలియకుండా రుణాలు తీసుకుంటున్నా ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు బాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్ ఎస్ఈజెడ్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల పరిధిలోని 4,731 ఎకరాల భూమిని తీసుకున్న కేఐపీఎల్ అక్కడ ఎలాంటి సెజ్ ఏర్పాటు చేయలేదని, దీని పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, గూడూరుకు చెందిన నాను మునీంద్రరెడ్డి 2025 సెప్టెంబర్ లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన అప్పటి సీజే ధర్మాసనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, కేఐపీఎల్ తదితరులకు కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. భూ కేటాయింపులే పెద్ద మోసం కేఐపీఎల్కు భూ కేటాయింపులు భారీ మోసం. ఇంతకు మించిన మోసం దేశంలో ఎక్కడా జరగలేదు. బహుళ ఉత్పత్తుల ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి, రైతులకు చెందిన 4,731 ఎకరాల భూమిని పొందిన కేఐపీఎల్ ఇప్పటి వరకు అక్కడ ఏమీ చేయలేదు. చిన్నపాటి రోడ్డూ వేయలేదు. ఈ 17 ఏళ్లలో చిన్న నిర్మాణం కూడా చేయలేదు. భూములు అమ్మేసుకుంటోంది ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయాల్సింది పోయి, తీసుకున్న భూములను ఇతరులకు అమ్ముకుంటోంది. అంతేకాక కొన్ని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇలా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకుంది. ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం ఎస్ఈజెడ్ పేరుతో తీసుకున్న భూముల్లో రూ.30 వేల కోట్ల విలువ చేసే సిలికా శాండ్ ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,500 కోట్లు రాయల్టీ వస్తుంది. కేటాయించిన భూముల్లో కేఐపీఎల్ ఏమీ చేయకపోవడం వల్ల ప్రభుత్వం ఈ ఆదాయాన్ని కూడా కోల్పోతోంది. రూ.1,500 కోట్ల పన్ను మినహాయింపు కేఐపీఎల్ ఇన్ని అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. పైపెచ్చు ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల మేర పన్ను మినహాయింపులు ఇచ్చింది. మోసాల్లోకెల్లా ఇది అతిపెద్ద మోసం. ఇంత జరుగుతున్నా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. – సీనియర్ న్యాయవాది బండారుపల్లి ఆదినారాయణరావు వాదనలు -
తొలగించిన ఓటర్లపై నేడు ఇంటింటి సర్వే
సాక్షి, అమరావతి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్)పై వివాదం తీవ్రమవుతున్న తరుణంలో రాష్ట్రంలో తొలగించిన ఓటర్లను మరోసారి పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని, అలాగే అర్హత లేని వారికి ఓటు హక్కు ఉండకూడదన్నది కేంద్ర ఎన్నికల సంఘ నినాదమని, ఇందులో భాగంగా సర్‌లో తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా మరోసారి పరిశీలించాలని ఆదేశించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్ ఇంటింటి సర్వేలో ఆచూకీ దొరకని 44,89,512 మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, అలాగే వివరాలు సరిగా లేవని నోటీసులు జారీచేసి విచారణ తర్వాత మరో 1,73,071 మంది కలిపి మొత్తం 46,62,583 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు. ఈ తొలగించిన ఓటర్ల ఇళ్లకు గురువారం బీఎల్వోలు వెళ్లి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.ఫారం–6 ద్వారా తిరిగి నమోదుఈ సర్వేలో ఎవరి ఓటు అయినా తొలగించినట్లు గుర్తిస్తే, తిరిగి ఫారం 6 ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 16న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, వచ్చే ఏడాది జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత ఉందన్నారు. ఒకవేళ తుది ఓటర్ల జాబితా విడుదలలో వీరి పేర్లు లేకపోతే ఫారం–6 ద్వారా ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకునే హక్కు ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని సీఈవో పేర్కొన్నారు. -
చిరుద్యోగులపై చంద్రబాబు సర్కార్ ప్రతాపం
సాక్షి, అమరావతి: హక్కుల సాధన కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న చిరుద్యోగులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపుతోంది. ఏకంగా ఉద్యోగాలు ఊడగొట్టి రోడ్డున పడేస్తామని బెదిరిస్తోంది. సర్వీస్ రెగ్యులరైజేషన్, ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూనియన్ నాయకుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు దిగుతోంది. ఇంటెలిజెన్స్ పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆందోళనలు విరమించకపోతే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని కుటుంబసభ్యులను హెచ్చరిస్తున్నట్టు వెల్లడైంది. 30 మందికిపైగా నోటీసులు సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలుగా వివిధ రూపాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు.. ఇలా వివిధ విభాగాల్లోని 14 వేలమందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు వైద్యశాఖ షోకాజ్ నోటీసులు ఇస్తోంది.అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు సమ్మెకు నేతృత్వం వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన 30 మందికిపైగా ప్రతినిధులను ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. వీరందరికీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేసిన వైద్యశాఖ.. గురు, శుక్రవారాల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనక్కి తగ్గంసమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అత్యవసర సేవలను బహిష్కరించారు. జీజీహెచ్‌లు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున చేరి నిరసనలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడింది.తక్షణమే రెగ్యులర్ చేయమని కోరడం లేదు కోవిడ్ వ్యాప్తి సమయంలో మేమంతా ప్రాణాలకు తెగించి పోరాడాం. కొన్నేళ్లుగా పనిచేస్తున్న మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని మేం కోరుతున్నాం. వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా మేం డిమాండ్ చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఎప్పటిలోగా రెగ్యులర్ చేస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ప్రక్రియ అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని అడుగుతున్నాం. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తుంటే పోలీసులు మా నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్తున్నారు. ఉద్యోగాలు పోతాయని కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు. నిరసన తెలపడం భారత రాజ్యాంగం మాకిచ్చిన హక్కు. ఎన్ని బెదిరింపులకు దిగినా మేం బెదరం. – అజయ్‌కుమార్, కన్వీనర్, వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగసంఘాల జేఏసీ అన్ని సౌకర్యాలు కల్పించాలి వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు బుధవారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపుల్లో వీరు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. చట్ట ప్రకారం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలి: చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రజారోగ్య రంగానికి వెన్నెముకగా నిలిచిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత అమానుషంగా ఉందని, ప్రభుత్వ తీరువల్ల ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వారిని సైతం రోడ్డు మీదకు ఈడ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరు వల్ల వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న దాదాపు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆక్షేపించారు.ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. నేడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తీవ్ర మోసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీస చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ న్యాయబద్ధంగా రెగ్యులరైజ్ చేయాలని, అప్పటివరకు జీవో ఆర్టీ నెం:459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. రెండు నెలలుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు సేవలందించిన ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మర్చిపోయింది.అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజేషన్‌కు సమయం పడితే జీవో ఆర్టీ నెం: 459 ప్రకారం 100 శాతం గ్రాస్ శాలరీతో పాటు పే, డీఏ, హెచ్ఆర్ఏ వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం మినిమం టైమ్ స్కేల్‌తో పని చేస్తున్న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, రేడియోగ్రాఫర్లు, ఈసీజీ, అనస్తీషియా టెక్నీషియన్లకు న్యాయం చేయాలి. 14,600 మంది ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగుల కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశాం. దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అప్పట్లో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రభుత్వ సేవల్లో కొనసాగుతూ కష్టపడి పని చేస్తున్నారని, వారిని గుర్తించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తించేలా చర్యలు తీసుకున్నాం.అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్ని శాఖల్లో గుర్తించి రెగ్యులరైజ్ చేయడానికి చట్టపరమైన చర్యలు కూడా చేపట్టాం. 2023లో ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్‌ను కూడా తీసుకొచ్చాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి కడుపు కొట్టడం తప్ప, మేలు చేసే కార్యక్రమం చేయడం లేదు.ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మంచి పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఇస్తామని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పింది. మెడికల్ ఉద్యోగులతో పాటు అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ఉపాధ్యాయులు, సీహెచ్‌వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సహకార బ్యాంకు ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు తమ సమస్యల కోసం రోడ్డెక్కుతున్నాయి.రిటైర్ అయిన అధికారులకు పదేపదే రీ–అపాయింట్మెంట్లు ఇవ్వడం ఆపి, కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.


