‘ఆ మహిళది ఆత్మహత్య కాదు.. హత్య’.. భూమన సంచలన వ్యాఖ్యలు | bhumana karunakar reddy Demands Justice in PK Layout Woman Death case | Sakshi
Sakshi News home page

‘ఆ మహిళది ఆత్మహత్య కాదు.. హత్య’.. భూమన సంచలన వ్యాఖ్యలు

Nov 24 2026 2:52 PM | Updated on Nov 24 2026 2:57 PM

bhumana karunakar reddy Demands Justice in PK Layout Woman Death case

సాక్షి,తిరుపతి : టీటీడీ మాజీ ఛైర్మన్,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళది ఆత్మహత్య కాదని, ఆమెను హత్య చేశారని అన్నారు.

‘ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంట్లో మహిళ హత్య జరిగింది. అక్టోబర్‌ 27న పీకే లేఅవుట్‌లో మహిళది ఆత్మహత్య కాదు.. హత్య. ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూటమి ప్రభుత్వం కాపాడింది. మేం అధికారంలోకి వచ్చాక నిందితుడిని అరెస్టు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం సోమవారం రేణిగుంట మండలంలోని ఆంజనేయపురంలో వెంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా వేల ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలసిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని నేలమట్టం చేసింది. దేవాలయాల కూల్చివేతపై మంగళవారం భూమన మీడియాతో మాట్లాడారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement