మచిలీపట్నంలో టీడీపీకి బిగ్‌ షాక్‌ | Shock For Tdp In Machilipatnam South Mandal | Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో టీడీపీకి బిగ్‌ షాక్‌

Nov 24 2026 1:57 PM | Updated on Nov 24 2026 2:15 PM

Shock For Tdp In Machilipatnam South Mandal

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గం సౌత్ మండలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరారు. ఓడుగు నాగరాజు ఆధ్వర్యంలో వంద మందికి పైగా వైఎస్సార్‌సీపీలోకి చేరారు. కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజలను ఓటు బ్యాంకుగా తప్ప మనుషులుగా చూడడం మానేసిందంటూ మండిపడ్డారు. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలు పట్టి పీడిస్తున్నారు. అధికారం కోసం మనుషులను వాడుకుని అధికారం పొందిన తర్వాత విస్మరించడం కూటమి నైజం. కూటమి ప్రభుత్వ విధానాలపై విసుగు చెందిన కేపీటిపాలెం ప్రజలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీలోకి చేరిన వారికి పార్టీ అండదండగా నిలుస్తుందని పేర్ని నాని అన్నారు.

‘‘గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేపీటి పాలెం పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధిని పార్టీ శ్రేణులు ప్రజలకు తెలపాలి. కేపీటి పాలెం పంచాయతీ అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేసింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేపీటి పాలెంను పూర్తిగా విస్మరించింది. కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలు చేసే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు సాధనే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలి’’ అని పేర్ని నాని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌కు చుక్కెదురు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement