రాజమౌళి కొడుకుకి మహేశ్‌బాబు మద్దతు | Mahesh Babu Wishes To Rajamouli Son Karthikeya Birthday | Sakshi
Sakshi News home page

Mahesh Babu: నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: మహేశ్‌బాబు

Nov 22 2026 2:18 PM | Updated on Nov 22 2026 2:29 PM

Mahesh Babu Wishes To Rajamouli Son Karthikeya Birthday

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’. వీరిద్దరి కలయికలో వస్తోన్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి కుమారుడైన కార్తికేయ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో హీరో మహేశ్‌బాబు కూడా ఆ జాబితాలో చేరి శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కార్తీ… పెద్ద కలలు, మరిన్ని విజయాలు, నువ్వు పడే కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చే సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను. నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను.’ అని పోస్ట్‌ చేశారు. ఇప్పుడీ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. కాగా కార్తీక్‌ గతంలో ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాల బృందాల్లోనూ పనిచేశారు. 

వారణాసి విషయానికి వస్తే..
ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: అల్లుడు గిల్‌ కాదట.. యంగ్‌ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement