సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు | Massive fire breaks out at cloth godown in Surat Kharvasa | Sakshi
Sakshi News home page

సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు

Nov 14 2026 3:54 PM | Updated on Nov 14 2026 3:58 PM

Massive fire breaks out at cloth godown in Surat Kharvasa

గుజరాత్‌లోని సూరత్‌లోని ఖర్వాసా ప్రాంతంలో ఉన్న ఒక వస్త్ర నిల్వ గోదాములో  శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.   భారీగా మంటలు ఎగిసి పడటంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన  పొగ అలుముచకుంది. అధికారుల సమాచారం ప్రకారం అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి తరలించారు.  ప్రస్తుతం మంటలను ఆర్పే చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

సచిన్ ప్రాంతంలోని ఎక్లేరా గ్రామం సమీపంలో 8 నుంచి 9 బీఘాల విస్తీర్ణంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిల్వ ఉంచిన వ్యర్థ పదార్థాలు, వస్త్రపు ముక్కలు, స్క్రాప్ ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయాయి. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో, 10 నుంచి 12 అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపు  చేసేందుకు శ్రమిస్తున్నాయి. 

ఇదీ చదవండి: బెదిరింపులు, అసభ్య ప్రవర్తన : 22మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్‌

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement