ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో పచ్చమూకలు వైఎస్పార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఒక పథకం ప్రకారం ఈ దాడులకు వారు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీరికి అధికారపక్షం, పోలీసులు కొమ్ముకాస్తున్నారు.
టీడీపీ గుండాల అరాచకాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ గుండాలు అరాచకాలు
నేడు నామినేషన్లు పరిశీలన..
35 జడ్పీటీసీ స్థానాలకు 386 నామినేషన్లు దాఖలు
మొత్తం 444 ఎంపీటీసీ స్థానాలకు 2949 నామినేషన్లు దాఖలు
వీటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 1106
టిడిపి..1302 నామినేషన్లు దాఖలు
జిల్లా లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు అడ్డుకుని, చించివేత
టిడిపి గుండా గిరి, నిన్న చివరి రోజు నామినేషన్లు అడ్డుకుని దౌర్జన్యం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ లు విత్ డ్రా చేయాలని బలవంతంగా ఒత్తిళ్లు
నెల్లూరులోనూ అదే తీరు
- చిట్టమూరు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి అక్రమ అరెస్ట్
- నిన్న ఎంపీటీసీ దగ్గర నామినేషన్ దాఖలు చేపించిన సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి
- నిన్న తిరుపతిలో తల్లి విజయ లక్ష్మి దగ్గర జడ్పీటీసీ గా నామినేషన్ దాఖలు
- అర్ధరాత్రి సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సన్నారెడ్డిపై 331(3)351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చిట్టమూరు పోలీసులు
- శ్రీనివాసుల రెడ్డిని నాయుడుపేట కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- 14 రోజుల రిమాండ్ విధించిన నాయుడుపేట న్యాయస్థానం
వైయస్సార్ జిల్లాలో నిర్ధాక్షిణ్యంగా నామినేషన్ల తిరస్కరణ
- కడప జడ్పీ కార్యాలయంలో నేడు జడ్పీటీసీ అభ్యర్ధుల నామినేషన్ పత్రాల పరిశీలన
- 10 గంటలకు ప్రారంభం కానున్న స్క్రూటినీ
- వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థులను తీసుకుని స్క్రూటినీకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు
- అభ్యర్ధులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్‌ఈసీ సభ్యులు రాజోలి వీరారెడ్డి, సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పులి సునీల్, లీగల్ సెల్ నేత నాగిరెడ్డి
- నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలంటున్న వైఎస్సార్సీపీ
- మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు కుమ్మక్కై నిర్ధాక్షిణ్యంగా నామినేషన్ల తిరస్కరణ
- అలాంటి పరిస్థితులు జరగకుండా చూడాలని జిల్లా అధికారులను కోరిన రవీంద్రనాథ్ రెడ్డి
జనసేన అభ్యర్థులను..
పల్నాడు జిల్లాలో జనసేన అభ్యర్థులను చావబాదిన టిడిపి నాయకులు - బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన శ్రీనివాసరావు పై దాడి చేసిన తెలుగుదేశం నాయకులు
- జనసేన అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుని దాడి చేసిన తెలుగుదేశం నాయకులు
- జనసేన అభ్యర్థికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు
- హాస్పటల్లో చికిత్స పొందుతున్న జనసేన అభ్యర్థిని పరామర్శించిన గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు
- గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు కామెంట్స్....
- కూటమిలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలో అర్థం కావట్లేదు
- గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానానికి మా అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే తెలుగుదేశం నాయకులు దాడి చేశారు
- నామినేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం నాయకులు జనసేన అభ్యర్థి పై దాడి చేయడం దారుణం
- జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయకుండా దాడులు చేయడం హేయమైన చర్య
- మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేశారు
- టిడిపి నాయకులతో కొట్టించుకోవడానికి మేము ఆ పార్టీతో పొత్తు కట్టలేదు
- జనసేన అభ్యర్థి పై దాడికి ఎమ్మెల్యే ,జిల్లా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి.
- జనసేన అభ్యర్థులు తెలుగుదేశం నాయకులు కొడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు
- తెలుగుదేశం నాయకులు జనసేన నాయకుల్ని చంపుతామని బెదిరించారట
- ఎక్కువ చేస్తే తెలుగుదేశం నాయకుల నాలిక కట్టేస్తా
- తెలుగుదేశం నాయకుల తో చంపించుకోవడానికి మేము పొత్తులో కొనసాగట్లేదు
- పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వెంటనే స్పందించి దాడి చేసిన తెలుగుదేశం నాయకులతో జనసేన అభ్యర్థికి క్షమాపణ చెప్పించాలి వాళ్ల కాళ్లు పట్టించాలి. లేకపోతే ధర్నా చేస్తాం
- పల్నాడు జిల్లా ఎస్పీ వెంటనే జనసేన అభ్యర్థి పై దాడి చేసిన తెలుగుదేశం నాయకులు పై కేసు నమోదు చేయాలి వారిని అరెస్టు చేయాలి. లేకపోతే ఆందోళన చేస్తాం.
ఎన్టీఆర్ జిల్లాలో.. - తిరువూరు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
- సుందరయ్య కాలనీలో గత వైఎస్సార్‌సీపీ పాలనను గుర్తుచేసుకున్న వృద్ధురాలు
- వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై వృద్ధురాలి ప్రశంసలు
అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన విధానంపై కొనియాడిన వృద్ధురాలు.
తాడేపల్లిలో.. - ఏపీలో టీడీపీ గూండాలతో కలిసి పోయిన కొందరు ఖాకీలు
- వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా వేధింపులు
- స్థానిక ఎన్నికల్లో నామినేషన్లనూ వేయనీయకుండా అడ్డంకులు
- కొంతమంది పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆగ్రహం
- ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సహా మొత్తం 59 మందిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ
- వారందరిపై చర్యలకు ఎస్ఈసీ కి ఫిర్యాదు
- ఫలితం లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్
- ఇప్పటికే రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు చేసిన ఎంపీ గురుమూర్తి


