breaking news
YSRCP
-
‘అమరావతిలో లక్షల కోట్లు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎప్పుడూ విజన్‌తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్‌ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్‌బుల్‌గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్
-
‘చంద్రబాబు.. భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు’
సాక్షి,తాడేపల్లి: సాక్షి ఎడిటర్ మీద ఏడు కేసులు పెట్టారు. కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే సహించలేకపోతున్నారు. పరిపాలనలో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు. లిక్కర్ కేసు పుష్పక విమానం లాంటిది, కేసులు పెడుతూనే ఉంటారు.లిక్కర్ అక్రమ కేసుల్లో సిట్ భేతాళ కథలు అల్లుతూనే ఉంది. నేరారోపణలు చేస్తున్నారు కానీ.. ఆధారాలు చూపడంలో సిట్ విఫలం. సరైన ఆధారాలు సేకరించడంలో సిట్ పూర్తిగా విఫలమైంది. సిట్ ఇన్వెస్ట్‌గేషన్‌లో ఆంధ్రజ్యోతి,ఈనాడు ప్రధాన పాత్ర. చంద్రబాబు అల్లిన లిక్కర్ కథకు సిట్ అద్భుతమైన కథనాలు అల్లుతోంది.లిక్కర్ అక్రమ కేసు రూ.50వేల కోట్ల నుంచి రూ.11 కోట్లకు వచ్చింది..!!.భయపెట్టాలని చూస్తే భయపడేవారు ఎవరూ లేరు చంద్రబాబు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
‘పవన్.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్‌కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మా పవనన్ననే ప్రశ్నిస్తావా?.. -
బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి?: సీదిరి అప్పలరాజు
సాక్షి, విజయవాడ: న్యూఆర్‌ఆర్ పేటలో డయేరియా అదుపులోకి రాలేదు. మెడికల్ క్యాంప్‌లకు బాధితులు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామంటున్న బాధితులు చెబుతుండగా.. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అంటోంది. డయేరియాతో ఇద్దరు చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుండగా.. డయేరియా మరణాలను చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు. మెడికల్ క్యాంప్‌ను విజిట్ చేసి బాధితులను పరామర్శించాం. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు.‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైఎస్ జగన్ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్ జగన్ నాలుగు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు...క్యాంటమ్ కంప్యూటర్ అంటాడు. క్యాంటమ్ కంప్యూటర్ తో డయేరియా తగ్గించు. మాట్లాడితే ఏఐ టెక్నాలజీ అంటాడు. రండి ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా?. యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?. నేపాల్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేశామని నిన్న ఓ మంత్రి షో చేశాడు. ఆర్టీజీఎస్లో కూర్చున్నామని ఊదరగొట్టాడు. ఇక్కడ డయేరియా బాధితుల మాటేమిటి?. చంద్రబాబుకు ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల సేఫ్టీపై లేదు. మున్సిపల్ మంత్రికి అమరావతిలో భూములు అమ్మడం పైనే దృష్టి. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు...వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడంపైన ఉన్న శ్రద్ధ ప్రజల పై లేదు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి?. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన కావాలి. గతేడాది గుర్ల గ్రామంలో డయేరియాతో 13 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారు?. ఇదేనా ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ. స్థానిక ఎమ్మెల్యేకు కలెక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ స్థానిక సమస్య పట్ల లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మరణాలను దాచేస్తోంది. తక్షణమే న్యూ ఆర్.ఆర్.పేటను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలి. ఇంటింటికీ ఒక వాటర్ టిన్ సప్లై చేయాలి’’ అని అప్పలరాజు డిమాండ్ చేశారు. -
జగన్ పై షర్మిల కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుధాకర్ బాబు
-
సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్‌కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్‌ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. -
నాపై నమ్మకముంచి ఈ పదవి ఇచ్చిన జగనన్నకు నా ధన్యవాదాలు
-
జన సైనికుల ముసుగులో రౌడీలు.. ఆ దాడి హేయం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు(Jana Sainiks) దాడి చేయడం దారుణమని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. పోలీసులు వాళ్లను గనుక అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారాయన.‘‘ఆర్ఎంపీ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశారు. విలేఖరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాత్రం దానికే జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారువందమందికి పైగా జనసేన గూండాలు(Jana Sena Goons) గిరిధర్ పై దాడి చేశారు. గిరిధర్ ఇంటిపై బీభత్సం సృష్టించారు. రజకుడనే చిన్న చూపుతో గిరిధర్ పై దాడి చేశారు. మరి పవన్‌ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా?.. వాళ్ల మీద మీ ప్రతాపం ఎందుకు చూపించలేకపోతున్నారు??. దాడి చేయడానికి బలహీనులే మీకు కనిపిస్తారా???జనసేన ముసుగు ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని పోలీసులను, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. ఈ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని,నన్ను,నా కుమారుడ్ని నోటికొచ్చినట్లు తిడతారు. పవనను ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేస్తారు. గిరిధర్,సతీష్ ల పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్ని నాని అన్నారు.మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్(RMP Giridhar Attack) మంగళవారం ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ని నిలదీశారు. ఈ క్రమంలో.. ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ జన సైనికులు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. .. జనసేన పెద్దల ఒత్తిడితో గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గిరిధర్‌కు మద్దతుగా పీఎస్‌కు వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన శ్రేణులు కవ్వింపునకు దిగబోయాయి. దీంతో పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని ఠాణా వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు. ఇరు పార్టీల వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదీ చదవండి: మా పవనన్ననే నిలదీస్తావా? -
టార్గెట్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మళ్లీ జేసీ మార్క్ రాజకీయం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు.తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చారు.జేసీ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సుగాలి ప్రీతి ఉదంతం.. 33వేల మందికి పైగా మహిళలు అదృశ్యం తదితర అంశాలపై గతంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు ఓ మీడియా ఛానెల్లో విమర్శించినందుకు జనసేన మూకలు అతనిపై దాడి చేయడమేకాక అతని దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన కృష్ణాజిల్లాలో జరిగింది. పైగా అతనిని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించి, అతనిపైనే ఫిర్యాదు చేశారు. ఈ దుర్మార్గానికి సంబంధించిన వివరాలివీ.. బందరు మండలం మంగినపూడి గ్రామానికి చెందిన గిరి వైఎస్సార్సీపీలో క్రీయాశీల కార్యకర్త. ఇటీవల ఆయన ఓ మీడియా చానెల్లో మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి ఘటన జరిగింది ఎప్పుడు.. ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో పవన్‌కళ్యాణ్ తెలుసుకోవాలంటూ విమర్శలు చేశారు. నిజానికి అది టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని.. కానీ, బాధిత కుటుంబానికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, మహిళల అదృశ్యంపై డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేశారని ప్రశి్నస్తూ పవన్ విధానాలను ప్రశి్నంచారు.ఈ వీడియో వైరల్ అవడంతో జనసేన నాయకుడు కొరియర్ శ్రీనుతోపాటు దాదాపు యాభై మందికి పైగా గురువారం రాత్రి 10.30 ప్రాంతంలో గిరి ఇంటిపై మూకుమ్మడిగా దాడిచేశారు. ఇంట్లోని వస్తువులతో పాటు అతని దుకాణాన్ని ధ్వంసం చేశారు. అతనిపైనా విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. అంతేగాక.. గిరిని మోకాలిపై కూర్చోబెట్టి జనసేన నాయకులకు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. అలాగే, దెబ్బలు తిన్న గిరిపైనే బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసు పెట్టించేందుకు బరితెగించారు. జనసేన నేతలపై పేర్ని నాని మండిపాటు.. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నాని జనసేన నాయకులపై మండిపడ్డారు. అకారణంగా, అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు బనాయించాలని చూసినా.. దాడికి పాల్పడిన జనసేన నాయకులకు పోలీసులు కొమ్ముకాయాలని చూసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బందరు డీఎస్పీ సీహెచ్ రాజాను కలిసి హెచ్చరించారు.తమ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకుంటే ఎంత దూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ఏసుబాబు, ఎస్ఐ సత్యనారాయణ మంగినపూడి గ్రామానికి చేరుకుని వివరాలు నమోదుచేసుకున్నారు. మరోవైపు.. డీఎస్పీ కార్యాలయానికి పేర్ని నాని వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై జనసేన నాయకులు దాడి
-
ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి.. BC నాయకులతో సజ్జల కీలక సమావేశం
-
డయేరియా బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మెడికల్ క్యాంప్‌లో డయేరియా బాధితులను వైఎస్సార్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై మల్లాది విష్ణు మండిపడ్డారు. గంటగంటకూ బాధితులు పెరుగుతున్నారని.. వారికి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేకపోతోందన్నారు.‘‘ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి వంద మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 30 మందికి పైగానే చికిత్స పొందుతున్నారు. అధికారులు బాధితుల సంఖ్యను తగ్గించి చెబుతున్నారు. మంచినీటి వల్లే సమస్య వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. అధికారులు మాత్రం ఆహారం వల్ల అంటున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండా నీటి వల్ల కాదని ఎలా నిర్ధారిస్తారు?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు.‘‘మెడికల్ క్యాంప్‌కు వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. మున్సిపల్ మంత్రి వచ్చి చూసి వెళ్లిపోయారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోపోవటం వల్లే ఈ పరిస్థితి. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 48 గంటల నుంచి ఈ ప్రాంతం భయంకరమైన వాతావరణంలో ఉంటే అధికారులు మీటింగ్‌లకు పరిమితమయ్యారు...అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా..? పేషెంట్లను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
Ravindranath Reddy: ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే బాబు విజనరీ
-
Dulam Nageswara Rao: అదే నా ధైర్యం కైకలూరు గడ్డ DNR అడ్డా
-
MLC Parvatha: YSRCP అన్నదాత పోరుతో భయపడ్డ చంద్రబాబు
-
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్‌ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు: రవీంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని.. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని.. బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందంటూ దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించారని.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గొప్ప ఆలోచన చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.‘‘మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం.. ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు. ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబు మానుకోవాలి’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
ఇంత చెత్త వెధవ ఎక్కడా లేడు.. సతీష్ రెడ్డి సంచలన కామెంట్స్
-
మోసాలు, అబద్ధాలతో.. అట్టర్‌ఫ్లాప్ సినిమాకు 'బలవంతపు విజయోత్సవాలా'?: వైఎస్ జగన్
ఈ రోజు (బుధవారం) ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం, అగచాట్లు పడటం చూశారా? ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? అప్పుడు, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కానీ అప్పుడు ఈ దుస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు సీఎంగా జగన్ ఉన్నాడు. జగన్ అనే వ్యక్తికి రైతులు కష్టాలు పడకూడదు అనే తపన, తాపత్రయం ఉంది. రైతులకు మంచి చేయాలి అనే ఆలోచనలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అదే అప్పటికీ, ఇప్పటికీ తేడా. –మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్.. సినిమా అట్టర్ ఫ్లాప్ అని ప్రజలందరికీ అర్థమైంది. ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకు అనంతపురంలో బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు’ అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక వైపు దారుణమైన పాలన సాగిస్తూ, మరో వైపు మోసం చేస్తూ హామీలన్నీ ఎగ్గొడుతున్నారంటూ ఎత్తిచూపారు. కళ్లార్పకుండా జంకు బొంకు లేకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు అత్యంత నేర్పరి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుగా చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో బలవంతపు సంబరాలు చేసుకుంటున్నారని ఏకి పారేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ‘ఈనాడు’లో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ (ప్రకటన)ను.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం సంచికలో ఇచ్చిన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూపిస్తూ.. వాటిలో ఎగ్గొట్టిన హామీలను ఎత్తిచూపుతూ.. చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతారో, ఏ స్థాయిలో మోసం చేస్తారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనంటూ తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోలు, ఆ హామీల అమలు వల్ల ఒనగూరే ప్రయోజనంపై ఇంటింటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లను, ఇప్పుడు ఆ హామీల అమలు తీరును ఎత్తిచూపుతూ చంద్రబాబు మోసాలను సాక్ష్యాధారాలతో వివరించారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఆరోగ్యశ్రీకి మంగళం పాడటం.. యూరియా, ఇతర ఎరువులు దొరక్క రైతుల కష్టాలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక పోవడం, ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టడంపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నాణేనికి ఒక వైపు మాత్రమే చెబుతోందని.. మరో వైపు ఏం జరుగుతోందో ప్రజలకు వివరించడానికే మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రపంచంలో చంద్రబాబులా అబద్ధాలు చెప్పగలిగే నైపుణ్యం ఎవరికైనా ఉందా?⇒ చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో, ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్పై ఎన్నికలకు ముందు 2024 మే 9న ఈనాడులో ఇచ్చిన ప్రకటనలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి.. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం, ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఆ ప్రకటనలో ప్రచారం చేశారు. ⇒ ఈ రోజు (బుధవారం) అదే ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. ఆ స్థానంలోకి 204 అన్న క్యాంటీన్లు వచ్చాయి. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్ హామీల్లో గతంలో ఇచ్చినట్టు మనం అనుకోవాలట! ⇒ ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల ప్రకటనతో మోసం చేయడమే కాకుండా ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. ప్రతి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. అందులో ముందుగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో బటన్ నొక్కితే ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాల వల్ల ఒనగూరే ప్రయోజనం ఎంత అన్నది వస్తుంది. మెహరాజ్ బేగం షేక్‌కు ఇచ్చిన బాండుకు సంబంధించి బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య ఇది.. మీ సంక్షేమ వివరాలకు బటన్ నొక్కండి.. అని ఉంది. మెహరాజ్ బేగం షేక్ యూనిక్ కోడ్.. వయసు, లింగం, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు వచ్చాయి. వారికి ఆడబిడ్డ నిధి కింద రూ.1,500.. అంటే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నందున ఏటా రూ.36 వేలు, తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇద్దరికి రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతులు లేరు కాబట్టి సున్నా.. యువగళం కింద ఎవరూ లేరు కాబట్టి సున్నా.. అని పెట్టారు. మొత్తంగా ఆ కుటుంబంలో రూ.3.33 లక్షలు లబ్ధి పొందేందుకు అర్హత సాధించారని.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభమవుతుందని గ్యారంటీ ఇస్తూ.. వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ బాబు సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇలా ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ, జనసేన కూటమి సంయుక్తంగా ఓ వైపు చంద్రబాబు ఫొటో.. మరో వైపు పవన్ కళ్యాణ్ ఫొటో ముద్రించిన బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కూటమి నేతలు ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ కూటమి నేతలు ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లలు కన్పిస్తే నీకు రూ.15 వేలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు కనపడితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు.. చిన్నపిల్లల అమ్మమ్మలు కనిపిస్తే మీ వయసు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు, 20 ఏళ్ల పిల్లోడు బయటకొస్తే నీకు రూ.36 వేలు, రైతు కనిపిస్తే పీఎం కిసాన్ కింద ఇచ్చేది కాక అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇస్తూ బాండ్లు ఇచ్చారు. ఇంటిలో ఎవరు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికీ బాండ్లు చూపించి మోసం చేశారు.నాడు చంద్రబాబు ఏమన్నారో వినండి⇒ ‘ఒకటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ ⇒ ‘రైతులకు సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తాం. దీనిని టీడీపీలో నిర్ణయించాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌లు లేవు. పూర్తిగా మా ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత మాది’. ⇒ ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని.. సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే.. ఒక్కటే చెప్పండి.. మా చంద్రన్న చెప్పాడు.. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమీ అడగడానికి వీలులేదు. ఇది చంద్రన్న నాకిచ్చిన హక్కు అని గట్టిగా చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు’. ⇒ ‘నా ఆడ బిడ్డల కష్టాలు చూసి ఆలోచించా. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు దీపం ఆర్పేస్తున్నాడు. అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా’. ⇒ ‘ప్రతి ఒక్క మహిళను మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలని నా ఆలోచన. అందుకే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ అకౌంట్లో వేస్తాం’. ⇒ ‘ఇప్పుడు హామీ ఇస్తున్నా.. ఏపీలోని యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. ఇక్కడికి పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఎంత తమ్ముళ్లూ.. ఎంత.. రూ.3 వేలు ఇస్తాం’.చంద్రబాబూ.. ఇవన్నీ మోసాలు కావా?⇒ ఈ రోజు (బుధవారం) అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా? ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ పడ్డావు. ఇది మోసం కాదా? ⇒ నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడ్డావు. అవి ఇవ్వక పోవడం మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా? ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా? పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈ నెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. ⇒ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా బస్సుల్లో ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతివ్వడం మోసం కాదా?⇒ ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గాను, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా? ⇒ పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?⇒ తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి రూ.15 వేలు ఇస్తానన్నావు. తొలి ఏడాది రూ.15 వేలు ఎగ్గొట్టావు. రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టావు. మిగిలిన వారికి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా? ⇒ గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ రద్దు చేశావు. ఇది మోసం కాదా?యథేచ్ఛగా దోపిడీతో సంపద పెంచుకుంటున్న చంద్రబాబు ముఠా⇒ ఇసుకతో పాటు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కళ్లెదుటే దోచుకుంటోంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. అనధికారిక పర్మిట్ రూములు నడుస్తున్నాయి. అక్కడ ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ , లేటరైట్ ఇలా అన్ని వనరులను మింగేస్తూ చంద్రబాబు ముఠా సొంత సంపదను పెంచుకుంటోంది. ⇒ అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. నిజానికి చదరపు అడుగు రూ.4500తో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఫైవ్ స్టార్ వసతులతో లగ్జరీ నిర్మాణాలు చేయొచ్చు. కానీ.. రాజధాని అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.పది వేలు వెచ్చిస్తూ దోచుకుంటున్నారు. ⇒ ఇంకా శనక్కాయలు, పప్పు బెల్లాలకు ఇష్టం వచ్చినట్లుగా లూలూ ఉల్లూ.. ఉర్సా బర్సా.. అంటూ ఇష్టం వచ్చినోళ్లకు చంద్రబాబు భూములు పంచి పెడుతున్నారు. కుడి, ఎడమల దోపిడీ సాగిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీకి పరాకాష్ట 17 మెడికల్ కాలేజీలను స్కామ్‌లకు పాల్పడుతూ అమ్మేయడం. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంటే.. మరోవైపు చంద్రబాబు ఆదాయం, ఆయన అనుయాయుల సంపద పెరుగుతోంది. చంద్రబాబు ముఠా దోచేస్తోంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది.రికార్డు స్థాయిలో అప్పు.. అది ఎవరి జేబులోకి వెళ్తోంది? ⇒ 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది ఎవరి జేబులోకి పోతోంది? ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవు. ⇒ 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన, ఇవ్వని అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1,40,717 కోట్లు.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆ అప్పు ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య రూ.2,49,350 కోట్ల అప్పు చేశారు. ఏటా అప్పుల్లో వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్) 22.63 శాతం.⇒ మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, గత ఏడాది మేము దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.7,21,918 కోట్లకు చేరుకుంది. అంటే మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే.⇒ మా ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు. ⇒ రికార్డు స్థాయిలో అప్పు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ⇒ మా ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మరి అప్పుగా తెచ్చిన రూ.1,91,361 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో చంద్రబాబు ముఠా జేబులోకి వెళ్లాయి. -
నందిగామ: వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. నందిగామలో అన్నదాత పోరులో పాల్గొన్నందుకు అక్రమ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ర్యాలీపై నందిగామ ఏఎస్ఐ లంకపల్లి రవి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 30 నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు.అనుమతి లేకుండా నిరసన, ర్యాలీ చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావులతో పాటు మొత్తం 20 మంది పై కేసులు చేశారు. -
బాబు ప్రైవేట్ పిపాసకు ఏపీలో వైద్యం బలి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒట్టి అమాయకులన్న మాటలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కొందరు నేతల చేతిలో పదే పదే మోసపోతూంటారు మరి. ఒకసారైతే ఏమో అనుకోవచ్చు కానీ.. పదే పదే మోసపోతూంటే అది ప్రజల తప్పే కదా? ప్రస్తుత ముఖ్యమంత్రి.. గతంలోనూ ఈ పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడినే ఉదాహరణగా తీసుకోండి. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఈయన చెప్పేదొకటి. చేసేది ఇంకోటి. మూడుసార్లు సీఎంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిన రికార్డు మాత్రం లేదీయనకు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షించి వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్మించిన పది వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారానే నడపాలని నిర్ణయించారు. మెరుపువేగంతో పలు కళాశాలల నిర్మాణమూ సాగింది. ఐదింటిని ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా మొదలుపెట్టే క్రమంలో ఎన్నికలకొచ్చాయి. అధికారం జగన్ చేజారింది. చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఈ వైద్యకళాశాలలపై పగబట్టినట్టు వ్యవహరించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన 50 సీట్లు వద్దనేశారు. ప్రజల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఫలితంగా వందల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ప్రైవేటు పరం కానుంది. అయితే సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని, తమది సంపద సృష్టించే పార్టీ అని ఎన్నికల సమయంలో ఊరంతా ఊదరగొట్టిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సంపదను అప్పనంగా ఇంకొకరికి ధారాదత్తం చేస్తున్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి గత ప్రభుత్వం యాభై ఎకరాల భూమి కేటాయించింది. శాశ్వత నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్! ఎకరాకు వంద రూపాయల లీజంట. కాకపోతే ఆయన సంపద సృష్టిస్తానన్నారే గానీ.. పేదల కోసమని చెప్పారా ఏంటి? చెప్పలేదు లెండి! ఇంకో విచిత్రమూ ఉందిక్కడ. చంద్రబాబు ఈ మధ్య పదే పదే వల్లెవేస్తున్న పీ-4కు ఈ వైద్య కళాశాలల అమ్మకానికి లింకు పెట్టడం! ప్రభుత్వం నుంచి చౌక ధరలకు ఆస్తులు ఆస్తులు పొందిన వారు లేదంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు పీ-4 కింద పేదలను దత్తత తీసుకుని వారిని ఉద్ధరిస్తారని బాబు చెబుతున్నారు. పైగా సంపన్నులు-పేదల మద్య లింక్ పెట్టడానికి పి-4 విధానం తెస్తానని అన్నారు. అదేమిటో తొలుత చాలామందికి అర్ధం కాలేదు. ప్రభుత్వంలోకి వచ్చాక తన స్కీములు కొన్నిటిని ముఖ్యంగా ఆడబిడ్డ నిధి బదులు పి-4 తో సరిపెట్టుకోవాలని ఆయన ప్రత్యక్షంగా,పరోక్షంగా చెప్పారు. అంటే ఆయన ప్రైవేటువారికి సంపద సృష్టిస్తారు.ఆ తర్వాత వారు దయతలచి పేదలకు ఏదో కొంత విదిలిస్తారన్నమాట. 2024లో అనూహ్యంగా ఎన్నికై ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని విషయాలలో చంద్రబాబు యు-టర్న్ తీసుకున్నారో చెప్పనవసరం లేదు. బాబు ప్రైవేట్ పక్షపాతి అనేందుకు వైద్య కళాశాలల ఉదంతం తాజాది మాత్రమే. గతంలోనూ ఎన్నో కనిపిస్తాయి. అత్యంత విలువైన విశాఖ భూములను అణా, కాణికి తెగనమ్ముతూండటం గురించి చెప్పుకోవాలిక్కడ. గత ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ కోసం టాటా కన్సెల్టెన్సీ సంస్థ భూమి లీజుకు అడిగింది. వ్యవహారం ముందు నడుస్తూండగానే అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ప్రభుత్వం లీజుమాటను పక్కకు పెట్టేసి చాలా ఉదారంగా సుమారు 200 కోట్ల రూపాయల విలువైన ఇరవై ఎకరాల భూమిని 99 పైసలకు ధారాదత్తం చేస్తామని ప్రకటించింది. అయితే న్యాయస్థానాలు, ప్రజాసంఘాల విమర్శల నేపథ్యంలో దీన్ని లీజుగా మార్చారేమో తెలియదు. పనిలో పనిగా తమకు కావాల్సిన మరో కంపెనీకి 60 ఎకరాలు ఇదే పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కానీ.. వివాదం కావడంతో ఎకరా అర కోటికి ఇస్తున్నట్లు చెబుతున్నారు. పరోక్షంగా రూ.వంద కోట్ల లాభం చేసి పెట్టారన్నమాట. 1995-2004 మధ్య కాలంలో చంద్రబాబు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. వాటిలోని ఉద్యోగులందరికి వీఆర్ఎస్ ఇచ్చి పంపేశారు. ఆ సంస్థలను పొందిన కొన్ని కంపెనీలు అక్కడి భూమితోనే సంపద సృష్టించుకోగలిగాయి. విశాఖ స్టీల్‌ను ఎట్టి పరిస్థితిలోను ప్రైవేట్ పరం కానివ్వమని ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు 34 విభాగాల ప్రైవేటీకరణను ఖండించకపోగా తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు సందర్భంలోనూ బోలెడంత ఆదా అవుతుంందని, ఛార్జీలు తగ్గించవచ్చని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అనేవారు. కానీ వాస్తవానికి చేసింది సున్నా. మోపెడైన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగితే బషీర్ బాగ్ కాల్పులు జరిపించిన చంద్రబాబు నలుగురు యువకుల మరణానికి కారణమయ్యారు. ఉచిత విద్యుత్తునిస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. తదనంతర కాలంలో తన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని ప్రచారం చేసుకోగలిగారు నిస్సిగ్గుగా! అంతెందుకు! గత జగన్ టర్మ్‌లో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లెక్కించడానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేశ్ పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అవే స్మార్ట్ మీటర్లను ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీల పరం చేస్తున్నారు. దీనివల్ల బీమా కంపెనీలకు ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు ఆ సంస్థలకు సంపద అంటే ప్రజల ధనం చేరుతుందన్నమాట. జగన్ ప్రభుత్వం ద్వారా మద్యం షాపులను ఊరుబయట నడిపిస్తే, చంద్రబాబు సీఎం కాగానే వాటన్నిటిని తీసేసి ప్రైవేటు వారికి, ముఖ్యంగా తన పార్టీ వారికి ఆదాయ వనరుగా మార్చారు. అది సంపద సృష్టి అన్నమాట.పలు రోడ్లను ప్రైవేటు పరం చేస్తారట. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కూడా ఎల్లో మీడియా అండతో సమర్థించుకోవడం ఆరంభమైంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ప్రభుత్వ రంగంలో అయితే బాగా నడవవని కూడా ప్రచారం చేయిస్తారు. ప్రభుత్వ ప్రచారం కోసం రూ.2300 కోట్లతో ఫైబర్ నెట్ సంస్థను అభివృద్ది చేసి, నిర్వహణను ప్రైవేటు వారికి అప్పగిస్తారని ఎల్లో మీడియానే రాసింది. సూపర్ సిక్స్ వంటివాటి అమలుపై పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అని కూడా చంద్రబాబు కొన్నిసార్లు అన్నారు. అయినా ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపధ్యంలో కొన్ని హామీలనైనా కొంతమేరకైనా అమలు చేయక తప్పడం లేదు. వైద్య కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఘాటు ప్రకటన చేశారు. ‘‘కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందేరం చేస్తారా’’ అని ప్రశ్నించారు. 2019కి ముందు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ప్రభుత్వరంగంలో తెచ్చారా అని ఆయన చంద్రబాబును అడిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వైద్య కళాశాలలను మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.టీడీపీ మద్దతుదారుల్లోనూ చాలామందికి వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నచ్చడం లేదు. ఈ మధ్య లోకేశ్ విజన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా అదే తరహా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ప్రసంగం చూస్తే ఆయన ప్రస్తుత మంత్రి నారాయణ ద్వారా బ్రిడ్జి కోర్స్ చదివారట. మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలలోనే ఆయన చదువు కొనసాగింది. ప్రైవేటు యూనివర్శిటేలే బెటర్ అని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న ఆయన ప్రస్తుత విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవేవి పట్టవు కాబట్టి వీరికి ఇబ్బంది లేదు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు పేదల సంక్షేమానికి పుట్టిన పార్టీగా చెప్పేవారు. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చాక అది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంపద సృష్టించే పార్టీగా గుర్తింపు పొందుతోంది. సినిమాల ద్వారా ధనికుడు అయిన ఎన్టీఆర్. పేదల సంక్షేమం గురించి స్కీములు తెచ్చారు. అలాగే సంపన్న కుటుంబంలో పుట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ లు పేదల పక్షపాతులుగా పేరు తెచ్చుకున్నారు. పేదరికం నుంచే వచ్చిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శకు గురి అవుతున్నారు.. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత సంపన్న సి.ఎమ్.గా రికార్డు సాధించారు. ఆయన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల డార్లింగ్ గా గుర్తింపు పొందారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వైద్య కళాశాలలను పిపిపి పేరుతో ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిది తప్పు?ఆంధ్ర ప్రజలదా? లేక చంద్రబాబుదా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కూటమి వేధింపులు.. వైఎస్సార్సీపీ వెన్న రాజశేఖర రెడ్డి అరెస్ట్
సాక్షి, పల్నాడు: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా పిడుగురాళ్ల పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ వెన్న రాజశేఖర రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. -
యూరియా మాఫియా.. పంది కొక్కుల్లా.. టీడీపీ నేతలే..!
-
జగన్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన రైతన్నలు
-
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గం.11 కి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనే అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. -
YSRCP మద్దతు సీపీ రాధాకృష్ణన్ కే..!
-
Anakapalle: ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు
-
‘అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు. అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు. -
ఏపీలో రోడ్డెక్కిన అన్నదాత
-
టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసింది. కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్‌లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్‌కు ఓ వినతి పత్రం సమర్పించింది. ‘‘గత పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ జీవోతో మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని జగన్ వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్.. టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. -
అప్పటిదాకా మీకు నడ్డా నెంబర్ గుర్తుకు రాలేదా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదనట్లుగా ఉన్నాయన్న పేర్ని నాని.. రైతుకు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంలో రైతు కంట కన్నీరు ఆగటం లేదు. మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. చంద్రబాబు నాది నలభై ఏళ్ల అనుభవం.. నాకన్నా పోటుగాడు లేడంటాడు. జగన్ నిరసనలకు పిలుపునిచ్చే వరకు చంద్రబాబు స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నీ బాగానే ఉన్నాయంటారు. రైతులు యూరియా దాచుకున్నారని మొన్న అన్నాడు. రైతులు మూడుసార్లకు కలిపి ఒకేసారి 75 కేజీలు యూరియా తీసుకుని దాచుకున్నారు అని నిన్న అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి బాధ్యత ఏమైంది?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘కనీసం రైతులకు ఎంత యూరియా అవసరమో తెలుసుకోండి. మా లెక్క ప్రకారం 100 నుంచి 125 కేజీల యూరియా అవసరం ఉంటుంది. మీ లెక్క ప్రకారమైనా 75 కేజీలు ముందే తెచ్చుకోవటం తెలియదా?. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు. నడ్డాతో మాట్లాడేశారు.. యూరియా పార్సిల్ చేస్తున్నారు.. వచ్చేస్తుంది అన్నారు మోతమోగిస్తున్నారు. రైతు సమస్యలపై వైఎస్ జగన్ నిరసన అనేంత వరకు నడ్డా నెంబర్ మీకు గుర్తుకు రాలేదా?. ఎరువులు తెప్పించుకోవాల్సింది మే, జూన్‌లో కదా....రైతులు రోడ్డెక్కి అల్లాడుతుంటే మీకు కళ్ళు పోయాయా?. రైతులు ఎండలో నిలబడలేక క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే వైఎస్సార్సీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేస్తున్నారంటున్నారు. ఎవరిని మోసం చేయాలని మీరు ఇదంతా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వాళ్లను రోడ్డెక్కనివ్వరు.. ధర్నాలు చేయనివ్వరు. కానీ రైతులకు యూరియా అందుతుందా?. వైఎస్సార్సీపీ వాళ్లను పోలీసులను పెట్టి కట్టడి చేసే బదులు.. ఏ ఇంట్లో యూరియా దాచుకున్నారో బయటకు తెచ్చేందుకు వాడొచ్చు కదారాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. రైతు కష్టాలు చూపించటానికి ప్రజల దగ్గర ఉన్న ఫోన్లు చాలు. వైఎస్సార్సీపీ వాళ్లను, సోషల్ మీడియా వాళ్లను బొక్కలో వేయాలి అంటున్నారు...రేపు మీరు ఓట్ల కోసం వెళ్తే రైతులు, మిమ్మల్ని ఎందులో వేస్తారు?. ఈ రాష్ట్రంలో.. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని కార్యకర్తలు అంటున్నారు. మంత్రులు దోచుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు అంటున్నారు. మంత్రులను అడిగితే మాదేముంది బాబు, కొడుకులు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాడు అని మీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మీకు మూటలు మూటలు డబ్బులు చందాలు ఇచ్చిన వాళ్లు కూడా ఏడుస్తున్నారుఈ ప్రభుత్వం మాది అని భావిస్తున్న రెండు కులాలు ఏడుస్తున్నారు. కమ్మలు, కాపులు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకటం లేదంటున్నారు. దేశ విదేశాలు తిరిగి చందాలు పోగేశారు. ఇప్పుడు వాళ్ల పొలాలేమో ఎమ్మెల్యేలు ఆక్రమించుకుంటున్నారు. ఇవాళ ఇంటి పన్ను మారాలన్నా కూడా టీడీపీ వార్డ్ ఇంచార్జీకి 25 వేలు కప్పం కట్టాలి. బెజవాడలో పరిస్థితి ఎలా ఉందో మీకు చందాలు ఇచ్చినవాళ్లను అడిగితే చెప్తారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యాదనించారు. -
Guntur: దుమ్మురేపిన అంబటి ర్యాలీ
-
YSRCP అన్నదాత పోరులో ఇసుకేస్తే రాలనంత జనం
-
రైతుల కోసం చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా?: వైఎస్సార్సీపీ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ వైఎస్సార్సీపీ నేత ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో రైతులు అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్జగన్ హయాంలో రైతుల ఇంటి వద్దకే ఎరువులు వచ్చేవి. రైతుల పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు.అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అనకాపల్లి నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయాల్లో వినతి పత్రాలను సమర్పించామన్నారు. రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ముందు చూపులేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో ఏనాడు రైతు ఇబ్బంది పడలేదు. ఆర్బికేలు ద్వారా సమయానికి యూరియా విత్తనాలు అందించాము. రైతులకు డోర్ డెలివరీ చేసి యూరియా విత్తనాలు అందించిన చరిత్ర వైఎస్సార్సీపీది.. ఎకరా ఉన్నా.. అర ఎకర ఉన్నా.. 5 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్న ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. కుటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.ఏలూరు జిల్లా: మాజీ మంత్రి కారూమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులను ప్రభుత్వం హేళనగా మాట్లాడం దారుణమన్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పండించిన రైతుకి గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రజలకు ధరలు అందడం లేదుజ రైతులు లాభపడింది లేదు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.? రైతులను నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీరు ఉంది.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. వెన్నుముక అయినా రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఏడాదిన్నర అయినా కూడా పూర్తి స్థాయిలో ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. రైతు పక్షాన పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నిర్బంధించడం దురదృష్టకరం. యూరియా సహా రైతులుకు అవసరమైన ఎరువులను వెంటనే పంపణీ చేయాలి. బ్లాక్ మార్కెట్‌ను నియత్రించాలి. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉచిత పంటల బీమాను పునరుదించి అందరికి వర్తింపజేయాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి.తిరుపతి: అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతను బఫేలా చూడటం దారుణం. యురియా బ్లాక్‌లో అమ్ముకొంటున్నారు. యూరియా ద్వారా రూ.300 కోట్లు బ్లాక్ మార్కెట్ దోచుకున్నారు. రైతుల సమస్యలు యురియా కొరతపై ఆర్డీవో వినతి పత్రం సమర్పించాము. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా వైఎస్ జగన్ నిలిచారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. యురియా కొరతపై రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైతులు యురియా కోసం నిలబడితే బఫే కోసం క్యూలో నిలబడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం చాలా దారుణమన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారుఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. యూరిచాపై మాట్లాడితే కేసులు పెట్టమని చంద్రబాబు చెప్పాడు.. రైతులు ర్యాలీ చేస్తే దాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకున్నా కానీ ముందుకు వచ్చాం.. ఆర్డీవోకి వినతి పత్రం ఇచ్చాం. -
YSRCP Annadata Poru: పులివెందులలో అన్నదాత పోరుకు భారీగా తరలివస్తున్న రైతులు
-
YSRCP Annadata Poru: కదం తొక్కిన రైతన్నలు.. ఖబర్దార్ బాబు
-
వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల ఓవర్ యాక్షన్
-
నందిగామలో ఉద్రిక్తత.. ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో ‘అన్నదాత పోరు’ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి బయల్దేరిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యానికి దిగారు. గంపలగూడెం మండలం రాజవరం గ్రామ శివారులో వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నాఉ. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.వైఎస్సార్సీపీ 'అన్నదాత పోరు'పై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నిరసనలు ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రైతులు, పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పోలీసులతో బెదిరింపుకు దిగుతూ.. నోటీసులు ఇస్తూ అరెస్టు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పదిమంది, 15 మందితోనే నిరసనలు చేయాలని ఆంక్షలు విధించింది.ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని.. రైతులు, రైతు నేతలు స్పష్టం చేశారు. యూరియా కొరత, ఇతర సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో కార్యాలయాల సమీప ప్రాంతాలకు చేరుకున్న రైతులు.. పోలీసులు, కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివస్తున్నారు. చంద్రబాబు సర్కార్ విధించిన ఆంక్షలను చేధించుకుని రైతులు ఉద్యమిస్తున్నారు. యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు ఘెరంగా విఫలమయ్యారని... పోలీసుల ద్వారా ఎన్ని ఆంక్షలు విధించినా ఆందోళన ఆపేది లేదని రైతులు అంటున్నారు.ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు.. శాంతియుత ఆందోళనలకు తరలివస్తున్నాయి. -
బాబు గుండెల్లో భయం.. YSRCP అన్నదాత పోరుపై కుట్రలు
-
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో వైఎస్సార్సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. తన నివాసానికి వైఎస్సార్సీపీ ఎంపీలను పీయూష్ ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడా రఘునాథ్‌రెడ్డి.. కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.కాగా, ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఇవాళ (మంగళవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరుగుతోంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. -
YSRCP అన్నదాత పోరుపై పోలీస్ ఆంక్షలు
-
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
Annadata Poru Updates: వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ లైవ్ అప్డేట్స్.. -
నేడు 'అన్నదాత పోరు'కు YSRCP శ్రేణులు సన్నద్ధం
-
Annadata Poru: నేడే రైతన్న రణభేరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ఆర్డీవోలకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేయనున్నారు.ఎమ్మార్పీపై బస్తాకు రూ.200 అధికంకూటమి ప్రభుత్వంలో యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సీజన్లో ఒక్క యూరియా కట్ట కోసం గంటల తరబడి ప్రైవేట్ దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు పడిగాపులు కాస్తున్న దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. నల్ల బజార్లో కనీసం రూ.200 అధికంగా చెల్లిస్తే గానీ బస్తా యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగు మందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు.కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన నేతలు నల్లబజార్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క యూరియా రూపంలోనే దాదాపు రూ.200 కోట్ల మేర రైతులపై భారం మోపి కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పలుచోట్ల అక్రమంగా తరలిపోతున్న యూరియాను రైతులే పట్టుకుని పోలీసులకు అప్పగించినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దీన్ని బలపరుస్తోంది. కృష్ణా జిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాలకు అద్దం పడుతున్నాయి. సర్కారు కళ్లు తెరిపించేలా ’అన్నదాత పోరు’.. రైతాంగం డిమాండ్లపై కూటమి సర్కారు దిగి వచ్చేలా అన్నదాత పోరును వైఎస్సార్సీపీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ కోసం శ్రేణులు కదం తొక్కనున్నాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించనుంది. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేయనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతోపాటు మార్కెట్లో పోటీ పెంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గళమెత్తనుంది.ప్రైవేట్ వ్యాపారులతో ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఒప్పించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేయనుంది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అన్నదాత పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో, 7న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ, 8న మండల కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆదుకోవాల్సింది పోయి బెదిరిస్తున్న బాబు.. ఒకవైపు యూరియా సమస్యతో అన్నదాతలు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు వారిని బెదిరిస్తూ మాట్లాడటం, అసలు సమస్యే లేదని కొట్టిపారేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు కనిపిస్తున్నా మభ్యపుచ్చేలా, బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇక్కట్లను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఎరువుల అవసరంపై ప్రణాళికలు లేకపోవడం, సమీక్షలు నిర్వహించకపోవడం కూటమి సర్కారు బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయి.అన్నదాత కన్నెర్రతో కలవరం..అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్సార్ సీపీ ఆందోళనలకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలన చేతగాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గోడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమమయ్యారు. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్‌ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్‌పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్‌కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్‌లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
‘అసుర.. అసుర.. భూబకాసుర’..400కోట్ల విలువైన ఆలయ భూములపై కన్నేసిన చంద్రబాబు
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్క్లబ్ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న ఈ దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, విలువైన ఆలయ భూములను పద్ధతి ప్రకారం తమ వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ప్ క్లబ్‌లకు ఎలా కేటాయిస్తారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శిధిలావస్థకు చేరిన ఈ ఈ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షలు కేటాయించి వైయస్ జగన్ జీర్ణోద్దరణ చేశారు. నేడు కూటమి ప్రభుత్వం మాత్రం విలువైన ఆ ఆలయ భూములు కబ్జా చేసేందుకు కలెక్టర్‌ని అడ్డం పెట్టుకుని పావులు కదుపుతోంది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు కౌలుకిచ్చిన ఈ భూముల్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో రాత్రికిరాత్రే కంకర, మట్టి, ఇసుక తరలించి లెవలింగ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేసిన ఈ భూకేటాయింపులను హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఒక్క గజం భూమి కూడా కబ్జా కానివ్వం. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే న్యాయస్థానాల్లోనే వైఎస్సార్సీపీ పోరాడుతుంది. సనాతన ధర్మ పరిరక్షకులు దీనిపై స్పందించాలి:మచిలీపట్నంలో గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన సుమారు 40 ఎకరాల భూమిని దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగా 35 ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరిట, మరో 5 ఎకరాలను గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు పేరిట భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించాలని సూచిస్తూ స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాయడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు అండతో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో కలెక్టరే ఈ భూపందేరం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. కూటమి నాయకులు ఆలయ భూములను కాజేస్తున్నారని మేం చేసే ఆరోపణలు కాదు.. టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా 'అయ్యో సామీ' పేరిట కథనం ప్రచురించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం దేవాదాయ శాఖ భూములిచ్చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకునే బీజేపీ నాయకులు, ఆలయ భూములను అప్పనంగా కట్టబెట్టేస్తుంటే చోద్యం చూడటం ఆశ్చర్యకరమైన విషయం. దీనికి బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురంధీశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమాధానం చెప్పాలి. రిక్రియేషన్ ముసుగులో పేకాట ఆడుకోవడం కోసం భూములు కట్టబెట్టేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఎన్నికల్లో ఓట్ల కోసమే దేవుడి పేరు వాడుకుంటారా? ఆలయ అభివృద్ధికి రూ.1.80 కోట్లు కేటాయించిన వైఎస్ జగన్:కలెక్టర్ లేఖ రాసిందే తడవుగా రాత్రికి రాత్రే ఈ ఆలయ భూములను చదును చేసేశారు. ఇప్పటికే ఆ భూములను వేలం ద్వారా పలువురు రైతులు కౌలుకు పొందారు. బొర్రా రవికి ఏడెకరాలు, అబ్బూరి శ్రీనివాసరావు, అనుముల రామారావుకి, ఈపూరు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తులకు వ్యవసాయం చేసుకోవడానికి మే 15న కౌలుకు అనుమతులు ఇచ్చారు. వారి కౌలు గడువు ముగియక ముందే ఆఘమేఘాల మీద ఈ భూములను స్వాధీనం చేసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గోల్ప్కోర్ట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. 2017 లోనే ఈ ఆలయ భూములు కాజేయాలని టీడీపీ నాయకులు స్కెచ్ వేసుకున్నారు. అందులో భాగంగానే శ్రీ వేకంటేశ్వరస్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడికి అడాప్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఈ దోపిడీకి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం పరిధి నుంచి తిరిగి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ భూములను తీసుకొచ్చారు. పాడుపడిపోయి, దూపదీప నైవేద్యాలకే కరువైన ఈ గుడికి నాటి సీఎం వైయస్ జగన్ రూ.1.80 కోట్లు కేటాయించి చినజీయర్ స్వామితో అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారు. ఒకపక్క మేం హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా ఆలయాల అభివృద్దికి నిధులు కేటాయిస్తుంటే, కూటమి నాయకులు మాత్రం ఆలయాల పేరిట ఉన్న విలువైన భూములపై కన్నేసి దోచుకునే పనిలో పడ్డారు.ఆలయ భూముల పరిరక్షణకు న్యాయపోరాటం:ఏదైనా భూకేటాయింపులు నిబంధనల ప్రకారం జరగాల్సిందే. ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేస్తామంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. బీజేపీ, వీహెచ్‌పీ మాతో కలిసొచ్చినా రాకోపోయినా పర్లేదు.. భూకేటాయింపులు ఆగేదాకా పోరాడతాం. జరగని తప్పులు జరిగినట్టుగా చూపించడానికి దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్, తాను భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ కూర్చోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై వైయస్సార్సీపీ తరఫున న్యాయపరంగా పోరాడతాం. భూమిని చదును చేయడానికి ఇసుక, కంకర, మట్టి తరలించిన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక్క గజం స్థలం అన్యాక్రాంతమైనా ఊరుకునేది లేదు. పనులను అడ్డుకుంటున్న దేవాదాయ శాఖ అధికారులను ఎంపీ కేసినేని చిన్ని మనషులు బెదిరిస్తున్నారు. పోలీసులు దీనిపై తక్షణం కలగజేసుకుని చదును చేసే పనులు ఇక్కడితే ఆపేయించాలి. -
‘చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం’
తాడేపల్లి: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు భయం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు సిట్ అనేది జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం. చంద్రబాబు హయాంలో మంచి నీళ్లు దొరకవు. మద్యం దొరుకుతుంది. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానాకి లిక్కర్ కేసు పెట్టారు. ఇది కుట్ర పూరిత లిక్కర్ కేసు. లేని అభూతకల్పనను సృష్టించి జగన్‌కి సన్నిహితులుగా ఉన్నవాళ్లను, ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ ఆడిస్తున్న కట్టు కధ లిక్కర్ కేసు. ఏం లేదు కాబట్టే నెమ్మదిగా ఎదుర్కొంటున్నాం..అమాయకులు అయిన వారితో స్టేట్మెంట్స్ ఇప్పించి మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు కుట్రలో పడ్డారు. చంద్రబాబుకు అనుకులంగా వాగ్మూలం ఇచ్చారు కాబట్టే కేంద్ర సర్వీస్‌లోకి పంపారు. సిట్ దర్యాప్తు లోప భూయిష్టంగా మారిపోయింది. ఎందుకు సిట్ చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయింది?, 90 రోజులు పాటు చిత్ర హింసలకు గురిచేశారు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాకా బెల్ట్ షాపులను లేకుండా చేశారు. మద్యాన్ని తాగుతున్న వాళ్లను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వమే అమ్మింది. ధర పెంచింది. మద్యా న్ని అందని ద్రాక్షగా జగన్ చేస్తే.. చంద్రబాబు చదువును, ఉపాధిని అందని ద్రాక్షగా చేశారుఉ. కిల్లీ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. టీనిపై టీడీపీ సవాల్‌కి సిద్ధం. గత ప్రభుత్వ హయంలో డిస్కరీలు అన్నింటికి చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చినవే.. చర్చకు సిద్దం. కోర్టు అడిగినా ప్రభుత్వానికి సిగ్గులేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బ్యారెక్ మొత్తం ఇచ్చాం. దోమలు కుడుతున్నాయని ఒకసారి, డెంగ్యూ అని ఒకసారి , దద్దుర్లు వస్తున్నాయని బెయిల్ కావాలని అడిగారు. అన్ని రోగాలకు బెయిల్ మందు అని చంద్రబాబు అడిగారు. రాజమండ్రి నుండి భారీ ర్యాలీ చేశారు. ఇన్ని రోగాలు ఉన్నవాడు ర్యాలీ చేస్తారా?, ఎంతమందిని అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రజలకోసం జగన్ చేసే యుద్దన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు. ప్రజల తరపున జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబుకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది.. న్యాయం నిలబడుతుంది.. వంద మద్యం కేసులు పెట్టినా మా గుండె ధైర్యాన్ని తగ్గించలేరు’ అని టీజేఆర్ స్పష్టం చేశారు. -
Chilli Farmers: YSR జిల్లా పులివెందుల మార్కెట్ యార్డు వద్ద టెన్షన్
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎంపీల మాక్ పోలింగ్
సాక్షి,న్యూఢిల్లీ: వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎంపీలు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది.రేపు ఉదయం పదిగంటలకు ప్రారంభమై.. ఐదుగంటల వరకు కొనసాగుతోంది. ఆరుగంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ ఎన్నికల్లో చెల్లని ఓట్లను అరికట్టేందుకు అన్నీ పార్టీల ఎంపీలు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో నిర్వహించిన మాక్ పోలింగ్ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. మాక్ పోలింగ్‌కు ముందే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ను పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. తమ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైఎస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు. -
రైతులకు కూటమి చేస్తున్న మోసాలు చెప్పడానికే YSRCP అన్నదాత పోరు
-
కరువుసీమలో కల్పతరువుపై కన్నెర్ర
అనంతపురం జిల్లా రూపులేఖలు మార్చి.. కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కరువు, పేదరికంతో కునారిల్లుతున్న ప్రజలను ఆపన్నహస్తంతో ఆదుకున్న ఆర్డీటీ సంస్థను కేంద్ర, రాష్ట్ర పాలకులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఆర్డీటీ, సత్యసాయి సంస్థలు గుర్తుకొస్తాయి. ఈ రెండు సంస్థలు కరువు రక్కసి నుంచి ప్రజలను కాపాడడంలో, గూడు లేనివారికి ఇళ్లు, పేదరికంతో మగ్గుతున్న వారికి ఉన్నతవిద్యను అందించి.. వారి జీవితాల్లో మార్పునకు విశేషకృషి చేశాయి. ఇలాంటి ఆర్డీటీ సంస్థ సేవలు కొనసాగకుండా, పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్‌ను ఆర్డీటీకి రెన్యువల్ చేయకపోవడంతో ఆ సంస్థ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పేదలు ఆందోళన చెందుతున్నారు. – అనంతపురంఉవ్వెత్తున ఉద్యమంఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను 2025లో రెన్యూవల్ చేయలేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ఆర్డీటీ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్సార్సీపీ కూడా ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలోనూ ఆందోళనలు జరిగాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్డీటీ పరిరక్షణ కమిటీ నిరాహార దీక్షలు చేపట్టింది. సామాన్య ప్రజల నుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన కూటమి పార్టీలు ఆర్డీటీకి మద్దతు ఇస్తామంటూ కంటితుడుపుగా ప్రకటించాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని విన్నవించారు.వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మీడియాముఖంగా ఆర్భాటంగా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి దాదాపు నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ అతీగతీ లేదు. కూటమి ప్రభుత్వానికి ఆర్డీటీ కార్యకలాపాలు కొనసాగాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సామాన్య ప్రజలు ప్రశి్నస్తున్నారు. మొక్కుబడిగా వెళ్లడం.. వినతి పత్రం ఇవ్వడం తప్ప ఆర్డీటీ పరిరక్షణకు ప్రజాప్రతినిధుల గళం పెద్దగా వినిపించడంలేదనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.నిరుపమాన సేవలు సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి నేటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలతో పేదలను ఆదుకుంది. ఆదుకుంటోంది. స్పెయిన్ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆర్డీటీపై అవగాహన ఉంది. దీంతో శక్తిమేర ఆరి్థకసాయం అందిస్తున్నారు. ఆర్టీటీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సంస్థ ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లు ఖర్చుచేసేంత మొత్తం (సుమారు రూ.వెయ్యికోట్లు) ఆర్డీటీ సంస్థ ఖాతాల్లో ఉంది. లైసెన్సు పునరుద్ధరణ అయ్యేవరకు ఈ నిదుల్ని ఖర్చుచేయరాదని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో డబ్బున్నా.. ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించకపోతే ఏటా ఉమ్మడి అనంతపురం జిల్లా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన సేవలను కోల్పోవాల్సి వస్తుంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం ఆర్డీటీ సంస్థ పరిరక్షణకు వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి .. ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలిపింది. తాజాగా భారీస్థాయిలో బైక్ ర్యాలీ చేపట్టే దిశగా సమాయత్తం అవుతోంది. ఇందుకు జిల్లా ఎస్పీ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యరథి సీపీ రాధాకృష్ణన్‌ను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) సీపీ రాధాకృష్ణన్‌తో వైబీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను కలిశారు సుబ్బారెడ్డి. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 11 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు రాధాకృష్ణన్‌కు సుబ్బారెడ్డి వెల్లడించారు. తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాధాకృష్ణన్. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది వైయస్ జగన్ అభిమతమని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం లేకున్నా పోటీ చేస్తున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా రేపు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) ఒంటి గంటకు సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. -
‘రైతుల ఆత్మహత్యలు.. మంత్రుల హేళన వ్యాఖ్యలేంటి?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం. కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో యూరియా అడుగుతున్న రైతులపై మంత్రులు హేళనగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం మానుకోమంటున్నారు. 280 రూపాయల యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు అమ్ముతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.రైతు భరోసా 40వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. -
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్‌పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్‌కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్‌కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్‌ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్‌లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్‌షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎనుముల మారుతి ప్రసాద్‌రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వంగల భరత్ కుమార్‌రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. -
రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదలయ్యారు. మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చిన కోర్టు.. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదే రోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది.ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. మిథున్‌రెడ్డి పిటిషన్‌కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్‌రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
‘ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది’
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంతో రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిన్నంటికీ తాళాలు వేశారని మండిపడ్డారు. రైతులకు విత్తనం మొదలు అమ్మేవరకూ పూర్తి భరోసా ప్రభుత్వానిదేనని, ఇప్పుడు యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం క్యూలైన్లో ఉండి ఇబ్బంది పడటం చూస్తున్నామన్నారు.ప్రభుత్వ తరుపున కట్టే ఇన్సురెన్స్ ఈ ప్రభుత్వం కట్టడం లేదన్నారు.రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై 9వ తేదీన ఆర్డీవో కార్యాలయాలో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం ఆర్డివో కార్యలయంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు.వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తారీఖున ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల పైన వినత పత్రాన్ని అందజస్తామన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం రైతు సమస్యలపై మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్‌రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
పేదల కోసం జగన్ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే..!
-
ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ‘అన్నదాత పోరు’ పోస్టర్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం. రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్‌కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైఎస్సార్సీపీ నేతలు వెళ్తే మళ్ళీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్..
-
రూ.5000లకే మెడికల్ కాలేజీ..! సింగపూర్ కంపెనీతో బాబు డీల్.. బట్టబయలు చేసిన కారుమూరి
-
కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి
మహానంది: అధికార పార్టీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బుసిగారి నాగరాజు తమ్ముడు సురేష్‌పై నలుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ గురువారం రాత్రి ఆర్ఎంపీ వద్ద వైద్యం పొంది ఇంటికి వస్తుండగా అయ్యలూరిమెట్ట సమీపంలోని చెరువు, గోదాం ప్రాంతంలో నలుగురు అటకాయించారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. సురేష్ ను స్థానికులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై ఎస్ఐ గంగయ్యయాదవ్ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దౌర్జన్యాలు: శిల్పా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇప్పటికే నాలుగు హత్యలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ ను ఆస్పత్రిలో పరామర్శించిన శిల్పా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఓ యువకుడిపైన, వైశ్యులతో పాటు మరికొందరిపైనా దాడి చేశారన్నారు. గ్రామాల్లో పదిమంది టీడీపీ నాయకులు ఉంటే తలా ఒక బెల్ట్‌షాప్, మంత్రులకు శాఖల తరహాలో టీడీపీ నాయకులకు దోపిడీ శాఖలు కేటాయించారని ఆరోపించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే దాడి చేసినా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. -
Palnadu: కర్రలతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూకల దాడి
-
YSRCP కార్యకర్త సురేష్ పై కత్తులతో TDP గూండాల దాడి
-
జగన్ మెడికల్ కాలేజీలు తెస్తే.. బాబు నాశనం చేస్తున్నారు
-
Kiliveti Sanjeevaiah: RBK లు పెట్టి రైతులకు ఎలాంటి కష్టం రానివ్వలేదు..
-
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు అంటే ఒక ఉద్యోగిగా కాదు.. పిల్లల భవిష్యత్ తీర్చి దిద్దేవారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అందరి జీవితాల్లో వెలుగులు నింపగలిగిన శక్తి టీచర్లకే ఉంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్లకే ప్రాధాన్యత. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండేలా విద్యాలయాలను తీర్చిదిద్దారు. పిల్లలను స్కూల్‌కి పంపటం తల్లిదండ్రులకు భారం కాకూడదని జగన్ ఆలోచించారు. పిల్లలకు మంచి చదువులు, సదుపాయాలు కల్పించారు. మంచి ఆహారం కోసం గోరుముద్ద కార్యక్రమాన్ని తెచ్చారువిద్యార్థులకు ఇచ్చే బ్యాగ్, షూస్, పుస్తకాలతో సహా అన్నీ జగన్ చెక్ చేసేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్ అంతగా ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మెడికల్ కాలేజీలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్‌కు తీసిపోకుండా నిర్మాణాలు చేపట్టారు. పేద, మధ్య తరగతి వారందరికీ మంచి వైద్యం అందాలని చూశారు. అలాంటి మెడికల్ కాలేజీలను నిర్వహించలేనప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకు?.కార్పొరేట్ చేతుల్లోకి విద్య, వైద్యం వెళ్తే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఆ ఆలోచనతోనే స్కూళ్లను రూపురేఖలు మార్చారు. కార్పొరేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వ స్కూల్స్‌కు పోటీగా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ విద్యా వ్యవస్థ పతనం దిశగా వెళ్తోంది. వైఎస్ జగన్ విద్యారంగంపైనే అత్యధిక సమీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఓట్లు లేకపోయినా జగన్ రాజకీయం కోసం ఆలోచించలేదు. వారి భవిష్యత్తు బాగుండాలి కోరుకున్నారు. ఉపాధ్యాయులకు అత్యంత గౌరవం ఇచ్చారు -
జగన్ వస్తారు.. వాటిని వెనక్కి తీసుకుంటాం.. మెడికల్ కాలేజీలు కొనేవారికి వార్నింగ్
-
‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్‌కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
బేస్తవారిపేట: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... కంభం మండలం దరగ గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్య (25) వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. బుధవారం రాత్రి 10గంటల సమయంలో బ్రహ్మయ్యకు ఫోన్ రావడంతో హడావుడిగా బయటకు వెళ్లాడు. అతను గురువారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామంలోని యువకులు చుట్టుపక్కల గాలించగా.. బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో సాయిబాబా ఆలయానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ప్లాట్లలో బ్రహ్మయ్య చెప్పులు కనిపించాయి. అక్కడే రక్తపు మరకలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని చిల్లచెట్ల పొదల్లో బ్రహ్మయ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అతడ్ని కత్తులతో పొడిచి, ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు స్థానికులు గుర్తించారు. వినాయక నిమజ్జనం సమయంలో వివాదం వల్లే?గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో వివాదం జరిగిందని, దీనిపై కక్ష పెట్టుకుని బ్రహ్మయ్యను హత్య చేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. గ్రామంలో ఒకరిపై తమకు అనుమానం ఉందని కంభం సీఐ మల్లికార్జున, ఎస్ఐ ఎస్వీ రవీంద్రారెడ్డికి చెప్పారు. కాగా, బ్రహ్మయ్య హత్య కేసులో రాజకీయ కోణం లేదని మార్కాపురం డీఎస్పీ నాగరాజు చెప్పారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్‌లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్‌దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో YSRCP కార్యకర్త దారుణహత్య
-
లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్‌తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్‌ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
MLC Kumbha Ravibabu: న్యాయం చేయమని అడిగితే అంత అలుసా..!
-
100కోట్ల GST ఎగ్గొట్టిన పవన్ బాబా!
-
బాబూ.. ఈ ఫొటో నకిలీ అని నిరూపించే దమ్ముందా?: వైఎస్సార్సీపీ సవాల్
సాక్షి, అమరావతి: రైతులకు యూరియా సహా ఎరువులను సరఫరా చేయలేని సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు బారులు తీరిన ఫొటోలను పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి నకిలీవని నిరూపించగలరా? అని సవాల్ విసిరింది.‘రైతులకు ఎరువుల సరఫరా విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం ఆక్రోశం! రాష్ట్రంలో ఎరువుల కొరత లేదంట! ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫస్ట్రేషన్! మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ ఫోటో ఫేక్ అంటూ పచ్చ సైకోల సర్క్యులేషన్! మరి ఈ ఫోటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోనే కాదు.. రైతులు క్యూలు కట్టిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ప్రజల పరిశీలనకు ఇక్కడ పెడుతున్నాం. చంద్రబాబు నిజాలకు పాతర వేసి, బుల్డోజ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటశాల మండలం లంకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ఇవాళ్టి దృశ్యాలివీ! చేతనైతే వీటిని నకిలీవని నిరూపించండి..!’ అని సవాల్ విసిరింది. రైతులకు ఎరువుల విషయంలో వెల్లువెత్తుతున్న వాస్తవాలపై ఒక ఫేక్ సీఎం @ncbn ఆక్రోశం. రాష్ట్రంలో ఎరువుల కొరతే లేదంట. ప్రెస్మీట్లో బొంకుల బాబు ఫ్రస్టేషన్. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు చేసిన ట్వీట్ ఫొటో ఫేక్ అంటూ పచ్చసైకోల సర్క్యులేషన్. ఈ ఫొటో నకిలీదని నిరూపించగలరా? ఆ ఫొటోయే… https://t.co/dkFKyEEYAv pic.twitter.com/HILCefZooJ— YSR Congress Party (@YSRCParty) September 3, 2025 -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్‌కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
ఏపీ ఆదాయం.. అసలు వాస్తవం ఇదే: బుగ్గన
సాక్షి, తాడేపల్లి: గత నెలలో రాష్ట్ర ఆదాయాలు పడిపోవటంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుగ్గన తెలిపిన వివరాలను ఎక్స్‌లో వైఎస్సార్సీపీ పోస్టు చేసింది. గత ఆగస్టు నెలలో ఎస్.జీ.ఎస్.టీ. ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉంది. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవటానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణం’’అని బుగ్గన పేర్కొన్నారు.‘‘గత ఆగస్టు 23న వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆదాయాలు, పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7.0 శాతం మాత్రమే ఉంది. నికర GST ఆదాయాల CAGR 6.94 శాతం మాత్రమే. ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల అనేది వాస్తవ వృద్ధి కాదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.Note on SGST revenues for Augsut 2025 by Sri Buggana Rajendranath ( @BugganaRaja )Quite contrary to the narrative of the State Government, concerning the GST revenues growth during August, 2025, the year-on-year growth of GST revenues during August 2025 over August 2024 of 21%… https://t.co/gYGXjj11sM— YSR Congress Party (@YSRCParty) September 3, 2025‘‘మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం CAGRతో ఉందని చెప్తున్నారు. వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి 7 శాతం మాత్రమే. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితం. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి చక్కని విధానాలను రూపొందించాలి. అది వదిలేసి జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవటానికి తాపత్రయ పడుతోంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్‌ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్‌లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
కొనసాగుతున్న కక్ష.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు
సాక్షి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లిక్కర్ అక్రమ కేసులో భాగంగా దాదాపు 20 మంది బృందంతో వచ్చిన సిట్.. తుమ్మలగుంటలో చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు చేపట్టింది. లిక్కర్ కేసులో A 37 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెడుతోంది. చిత్తూరులో వైఎస్సార్సీపీ నేత విజయనందరెడ్డి ఇంట్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. బీవీ రెడ్డి కాలనీ, నలంద నగర్లో విజయనందరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.చంద్రబాబు సర్కార్.. పోలీసులతో బెదిరింపులకు దిగుతోంది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ విజయానందరెడ్డితో పాటు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. -
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు అక్రమ కేసు
-
YSRకు వంగ గీత ఘన నివాళి
-
ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి మేం అండగా ఉంటాం: ధర్మాన
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్‌రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు ప్రశ్నించారు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్‌రెడ్డితో వైఎస్సార్సీపీ నేతలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మిధున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది.కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు.ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు. న్యాయ వ్యవస్థ నిర్ధారించనంత వరకూ వ్యక్తిగానే చూడాలి.వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం.చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. సహజంగానే ప్రత్యర్ధులకు కోపం ఉంటుంది. చార్జిషీటు వేయనివ్వడం లేదని మండిపడ్డారు. -
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్‌కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్‌కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్‌కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్‌కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్‌కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్‌కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
Amarnath: 5 సంవత్సరాల పరిపాలన ముందు.. నీ 30 సంవత్సరాల అనుభవం జీరో
-
మిమ్మల్ని రాష్ట్రాన్ని దాటించే వరకు వదిలిపెట్టం కాసు మహేష్ రెడ్డి స్వీట్ వార్నింగ్
-
నీ సవాల్ కి నేను రెడీ.. మైక్ ఇచ్చే దమ్ముందా..?
-
సీఎం అయ్యి వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తాడు.. బాబుకు అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
చింతమనేని నిన్ను చంపమన్నాడని.. వికెట్స్,బ్యాట్స్ పట్టుకొని..
-
బాబు నీ సవాల్ కు నేను రెడీ.. ఆ దమ్ము నీకుందా
-
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హెరిటేజ్‌లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6 ‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు. యూరియా కూడా అందించలేకపోతున్నారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్‌లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 6న జరగాల్సిన వైఎస్సార్సీపీ కార్యక్రమం 9కి వాయిదా పడింది. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై 6న ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ తొలుత నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమాన్ని 9కి వాయిదా వేసినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.కాగా, యూరియా దారిమళ్లుతోందని ‘సాక్షి’ చెప్పింది నిజమైంది. రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియాతో సహా ఇతర ఎరువులను టీడీపీ నేతలు బరితెగించి పెద్దఎత్తున పక్కదారి పట్టించి బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తున్నారంటూ ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై విజిలెన్స్ విభాగం స్పందించి వారం రోజులపాటు దాడులు నిర్వహించింది.దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష చేశారు. దాడుల్లో యూరియా పెద్దఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయినట్లు గుర్తించామని.. 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వా«దీనం చేసుకుని 191 కేసులు నమోదు చేశామని అధికారులు వివరించారు. టీడీపీ నేతలు దారి మళ్లించిన యూరియా, ఇతర ఎరువులు వివిధ జిల్లాల్లోని 598 ప్రాంతాల్లో ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్నట్లు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. స్టాక్ రికార్డుల్లో లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న రూ.1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్‌చేసి 67 కేసులు నమోదు చేశారు.మరోవైపు.. అక్రమంగా నిల్వ ఉంచిన మరో రూ.4.30 కోట్ల విలువైన 1,911 టన్నుల ఎరువులనూ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 124 కేసులు నమోదుచేశారు. నిబంధనలు అతిక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న మరో ఎనిమిది దుకాణదారులపైనా క్రిమినల్ కేసులు నమోదుచేశారు. -
ఆ ధైర్యం చంద్రబాబుకు లేదు
-
సాక్షిపై దాడులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘తొలుత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. -
YSRCP Shyamala: వైయస్సార్ చనిపోయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు
-
దెందులూరులో టీడీపీ నేతల గూండా గిరి
సాక్షి, ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండా గిరికి తెగబడ్డారు. వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం శ్రీరామవరం వెళ్లిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు.క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరీ నాని, కొందరు టీడీపీ కార్యకర్తలు.. కామిరెడ్డి నానిపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలోనే పచ్చ మూకలు రెచ్చిపోయి.. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో 50 మందికిపైగా పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
‘శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్సార్’
తాడేపల్లి : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్సార్ 16వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత వైఎస్సార్‌కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు సహా పలువురు పార్టీ నేతల పాల్గొన్నారు.దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్సార్. ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం చేయగలిగిన వ్యక్తి వైఎస్సార్. మనకు తెలియకుండానే మన జీవితాల్లో మార్పులు తెచ్చిన నేత. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు కట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ అందించినా ఆయనకే చెల్లింది. మన ఇంట్లో మనిషిలా మన జీవితాల్లో వైఎస్సార్ ఉన్నారు. కొన్ని కోట్ల మందికి వైఎస్సార్‌తో జ్ఞాపకాలు ఉన్నాయి. తన పాలనా దక్షతతో వైఎస్సార్ అందరినీ ఆకట్టుకున్నారు. వైఎస్సార్ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ ఆశయాలను భావి తరాలకు అందించటంలో అందరం కలిసి కదులుదాం. వైఎస్ఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయి. రైతులకు ఉచిత కరెంట్....ఆరోగ్య శ్రీ పథకాలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. వైఎస్ఆర్ రాష్ట్ర ప్రజలకు ఆదర్శ ప్రాయుడు.. వైఎస్ఆర్ వెళుతూ వెళుతూ మనకు వారసత్వాన్ని ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. రాజశేఖర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు...జగన్‌ని అంతగా ఆదరిస్తున్నారు.వందేళ్లయినా వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. వైఎస్ జగన్ వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. అలాంటి వైఎస్సార్సీపీ మనం ఉండటం అదృష్టంగా భావించాలి. కొందరు నేతలు చేస్తున్న దుష్ట రాజకీయం ఎంతో కాలం నిలవదు. అధికారం కోసం అడ్డ దారులు తొక్కుతున్న వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్రవిజయవాడ: తన సంక్షేమ పథకాలతో పేద ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) వైఎస్సార్ 16వ వర్థంతిని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ ,మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ నాయకులు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్ ,పూనూరు గౌతమ్ రెడ్డి , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, ఇంకా పార్టీకి చెందిన పలువురు నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ మరణించినా పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేశారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు హయాంలో పేదలకు చేసిందేమీ లేదు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగంలా సాగింది. వైఎస్సార్ పెట్టిన మంచి పథకాలను కూడా చంద్రబాబు తీసివేశారు’ అని పేర్కొన్నారుదేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించాం. పార్టీ శ్రేణులు అందరూ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయనపై అభిమానాన్ని చూపించారు. వైఎస్సార్ పేరు చెబితే సంక్షేమం అభివృద్ధి గుర్తుకు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలను వైఎస్సార్ ఆదుకున్నారు. వైఎస్సార్ పాలనను ఒక ఐకాన్‌గా తీసుకుని ప్రక్క రాష్ట్రాల వారు పాలన చేస్తున్నారు. చంద్రబాబు ముప్పై ఏళ్ల పాలనలో ఒక మంచి పథకం గుర్తుకు రాదు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు తప్ప ఆయన పేరు చెబితే ఏమి గుర్తుకు రాదు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్ ముందుకు వెళ్తున్నారు. జగన్ పాలనలో ప్రజలందరికీ మంచి జరిగింది. పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారు.కూటమి పాలనలో ప్రజలకు సంతోషం కరువైంది. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు.’ అని విమర్శించారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ పాలన సువర్ణ అధ్యాయంలా నిలుస్తుంది. మంచి వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడారుప్రతి పథకం పక్కాగా అమలు చేసి ప్రజలకు సేవ చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు చేస్తుంది. కూటమి పాలనలో ప్రజా స్వామ్య విలువలు దిగజారాయి’ అని మండిపడ్డారు. -
ధైర్యంగా ఉండండి... అండగా నిలుస్తా: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూటమి ప్రభుత్వంలో పడుతున్న బాధలు, సమస్యలను ప్రజలు వివరించారు. ప్రజల బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ‘నేనున్నాను...’ అంటూ భరోసా ఇవ్వడంతోపాటు ధైర్యాన్ని నింపారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి వెన్నుదన్నుగా ఉంటానని మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ... ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క పోలీసు వ్యవస్థనే కాకుండా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైఎస్ జగనమండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలిగానీ కీడు చేయకూడదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని ఆయన గుర్తుచేశారు.కక్ష సాధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం టీడీపీ కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది.ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందురెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్‌యాదవ్, కడప మేయర్ సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కమలాపురం ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ రెడీ
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. యూరియా కొరతపై ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారి సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. గతంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు అన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉంటే, ఇప్పుడు యూరియా కొరతతో పాటు పలు సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా విత్తనాలు, ఎరువులతో సహా అన్నీ సమస్యల మాదిరిగానే ఉన్నాయి. యూరియాను రైతులకు అందించకుండా టీడీపీ నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు వినతి పత్రాలు స్వీకరించి ఆర్డీవోలకు అందజేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనుంది వైఎస్సార్సీపీ. -
‘వెన్నుపోటుదారుడిని మహా నాయకుడిగా చెప్పుకోవడం సిగ్గుచేటు’
తాడేపల్లి : టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు అసలు సిగ్గుందా? అని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తి చంద్రబాబని, వ్యవస్థలను మేనేజ్‌చేసి సీఎం అయిన నీచ చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. వైఎస్ జగన్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. అధికార కూటమి కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని, రాజ్యాంగ బద్ధంగా ప్రజల సమస్యలపై చర్చించే టైమ్ ఇవ్వమని అడుగుతున్నా చంద్రబాబు చలించడం లేదన్నారు. వైఎస్ జగన్‌ను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.‘కాంగ్రెస్ నుండి వచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. భార్యతో రికమెండేషన్ చేయించుకుని టీడీపీలో చేరిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలు గెలిపించుకున్న ఎన్టీఆర్‌ని కుట్రతో పదవి నుండి తొలగించిన రోజు ఇది. అక్రమంగా పదవి పొందిన చంద్రబాబు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు ఎలా పండుగ చేసుకుంటున్నారు?, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నారు. అసలు ఇలాంటి రోజును పండుగ చేసుకోవాలంటున్న చంద్రబాబుకు మానవత్వం ఉందా?, అనాటి ఘోరం ఈనాటి తరానికి తెలియక పోవచ్చు. గవర్నర్ ఎదుట ఎమ్మెల్యేల బలం చూపించకుండానే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. వెన్నుపోటుదారుడిని మహా నాయకుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారు?, కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ దగ్గరకు కుట్రతోనే చేరారు. ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఆరోజు చంద్రబాబుకు మద్దతు లేదుఆ తర్వాత మరిన్ని కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో ఏం జరిగిందో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బయట పెట్టాలి. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని ఎన్టీఆర్ పదేపదే కోరినా స్పీకర్ యనమల రామకృష్ణుడు అవకాశం ఇవ్వలేదు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని స్త్రీ లోలుడుగా ఎల్లోమీడియా చిత్రీకరించింది. కుటుంబ సభ్యులు కనీసం భోజనం కూడా పెట్టలేదు. సంప్రదాయాల ప్రకారమే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్వనాశనం చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టే ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉండనిచ్చారుదేశ చరిత్రలో వెన్నుపోటు అనే పేటెంట్ చంద్రబాబుకే ఉంది. ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇచ్చిన హామీలను అమలు చేయాలేనప్పుడు ఎందుకు ఇచ్చారు?, చంద్రబాబు అంటేనే ఫేక్ ఫేక్. రాజధాని రైతుల కడుపు కొట్టిన వ్యక్తి చంద్రబాబు. హైవే మీద నుండి రాజధానికి వెళ్లటానికి ఇప్పటికీ రోడ్డు లేదు ఎవరిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారు. తనలాగే తనకు కూడా ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారేమోనని చంద్రబాబు భయపడిపోతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే సూపర్ సిక్స్ సహా అనేక హామీల గురించి ప్రశ్నిస్తారని చంద్రబాబుకు భయం’ అని విమర్శించారు. -
సంబరాల బాబూ.. బుడమేరు ప్రక్షాళన ఏమైంది?
సాక్షి, తాడేపల్లి: విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఏడాది గడిచినా నష్ట పరిహారం ఇవ్వకుండా వంచించిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీశారన్న వెలంపల్లి, పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే వరద నీరు ఇళ్లలోకి చేరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు, ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేవలం సీఆర్డీఏకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సంబరాలు దేనికి చంద్రబాబూ..? చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను వంచిస్తూనే ఉంది. చేసే ప్రతి పనిలోనూ ప్రచార ఆర్భాటం తప్ప హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన విజయవాడ వాసులు ఏడాది గడిచినా పరిహారం అందక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు తాను తొలిసారి సీఎం అయ్యి 30 ఏళ్లు పూర్తయిపోయిందని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారు.గతేడాది బుడమేరు వరదల కారణంగా విజయవాడ నీట మునిగినప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రులు నగరంలో తిరిగి ఫొటోలకు ఫోజులిచ్చి హామీలిచ్చి వెళ్లిపోయారే గానీ ఏడాది పూర్తయినా బాధితులకు పరిహారం అందలేదన్న సంగతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయారు. బుడమేరు వరదల కారణంగా విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ బాధితుల కష్టాలు కూటమి ప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదు.సీఎం అయ్యి 30 ఏళ్లయిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారో చెప్పాలి. గతేడాది వరదలొచ్చినప్పుడు బుడమేరు ఆధునికీకరణ పనులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. రాత్రింబవళ్లు అక్కడే నిద్ర చేసి వరద ముంపు సమస్యను పరిష్కరించానని ప్రచారం చేసుకున్న మంత్రి రామానాయుడు, బుడమేరు ఆధునికీకరణ పనులపై ఆ తర్వాత కొన్నాళ్లు హడావుడి చేసి వదిలేశారు. బుడమేరు ప్రక్షాళన ఏమైందో ఆయన సమాధానం చెప్పాలి.రూ.6800 కోట్ల నష్టం జరిగితే.. ఏ మేరకు సాయం చేశారు..? వరదల కారణంగా నష్టపోయిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడామని, ఇంట్లో పాడైపోయిన ఎలక్రిక్ వస్తువుల కోసం ఎలక్ట్రిసిటీ కంపెనీలను సంప్రదించామని వారితో మీటింగ్‌లు పెట్టిన సీఎం చంద్రబాబు.. బాధితులకు మాత్రం పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. స్కూటర్లు, ఆటోలు కొత్తవి ఇవ్వలేదు సరికదా కనీసం ఉచితంగా రిపేర్ కూడా చేయలేదు. ఇంట్లో బురద కడగడానికి ప్రభుత్వమే మనుషులను పంపిస్తుందని చెప్పినా సొంతంగానే ఎవరికి వారే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సర్వే పేరుతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితులను వదిలేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవారు డోర్ లాక్ అని రాసుకుని వెళ్లారు. మీ ఇళ్లలో వారం రోజులు నీళ్లు నిలవలేదు కాబట్టి సాయం ఇవ్వలేమని అడ్డగోలు కండిషన్లు పెట్టి వరద బాధితులను ఈ ప్రభుత్వం హేళన చేసింది.ప్రచారంలో మాత్రం డ్రోన్లతో ఇంటింటికీ సాయం అందించామని చెప్పుకున్నారు. సుమారు 2.68 లక్షల కుటుంబాలను వరద ముంచేసిందని దాదాపు రూ.6800 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. వరద బాధితుల సహాయార్థం దేశవిదేశాల నుంచి దాతలు స్పందించి దాదాపు రూ. 400 కోట్లకుపైగా విరాళాలు అందజేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా మాత్రమే పరిహారం అందించి చేతులు దులిపేసుకుంది. మరీ దారుణంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, పెరుగన్నం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్ పంపిణీ చేసినట్టు దొంగ లెక్కలు చూపించి కూటమి ఎమ్మెల్యే భారీగా దొచుకుతున్నారు. కుమ్మరిపాలెంలో వరద సాయం కోసం మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీస్తే దారుణంగా పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు.విజయవాడను గాలికొదిలేశారు:పేరుకేమో అమరావతి రాజధాని, కానీ ఎక్కడా కాలవల్లో కనీసం పూడికలు తీయడం లేదు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడ బ్రాండ్ ఇమేజ్‌ని పూర్తిగా దెబ్బతీశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక్క సీఆర్డీఏకి మాత్రమే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నగర పాలక సంస్థల సమస్యల మీద ఆయన ఇంతవరకు రివ్యూ చేసిన దాఖలాలు లేవు. విజయవాడ అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చంద్రబాబు పేరు చెబితే లిక్కర్ షాపులు తప్ప ఏ ఒక్క పథకం కూడా గుర్తురాదు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందని వినాయకుడి మండపంలో నిలబడి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. విజయవాడ వరదల పాపం చంద్రబాబుదే. ఆయన నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు వరదలతో విజయవాడ మునిగిపోయింది. తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ప్రజలను ముంచేశాడు. ఇప్పటికైనా బుడమేరు వాగును ప్రక్షాళన చేసి ఆధునికీకరణ పనులను తక్షణం పూర్తి చేయాలి. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. లేదంటే బాధితుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. -
రైతులకు ఎరువులు అందేవరకు మా పోరాటం ఆగదు
-
ఇది కాకాణి నిజాయితీ నీకు దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించు
-
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
వైఎస్ జగన్ ఒక పెళ్లికి వెళితే వచ్చిన జనం కూడా నీ సభకు రాలేదు
-
‘ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి’
విజయవాడ: బుడమేరు వరదకు ఏడాది పూర్తైన నేపథ్యంలో బాధితులకు మద్దతుగా, ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. సింగ్‌నగర్‌లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్ఆర్సిపి నేతలు, శ్రేణులు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఇదే ప్రాంతం వరదతో మునిగిపోయింది. ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కానీ పరిహారం సక్రమంగా అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కృష్ణానదికి వరద వచ్చి కృష్ణలంక ముంపునకు గురైంది. రిటైనింగ్ వాల్ కటి కృష్ణలంక ప్రజల కష్టాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. దేవుడి పాదాల సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాకు అభివృద్ధి పట్టదు. ప్రజల కష్టాలు తెలియని అసమర్ధ ఎమ్మెల్యే బోండా ఉమా. బోండా ఉమాకు తెలిసింది ప్రజల పై రౌడీయిజం చేయడమే. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘వరద వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు ప్రజలను ముంచేసింది. వరదలు వచ్చి ఏడాదైనా ప్రజల్లో భయం పోలేదు. వానపడితేనే ఈ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. ఏడాదైనా నేటికీ బుడమేరు వరద బాధితులకు పరిహారం అందలేదు. నష్టపరిహారం పేరుతో దొంగ సర్వేలు చేశారు. అబద్ధపు సాకులతో ఎంతోమందికి అన్యాయం చేశారు. సాయం కోరుతూ వెళ్లిన బాధితులను కలెక్టరేట్‌లోకి రానివ్వలేదు. సిగ్గులేకుండా కలెక్టరేట్ గేట్లకు తాళాలేశారు. దేశ చరిత్రలో వరద విరాళాల్లో అవినీతి చేసిన ఏకైక పార్టీ టీడీపీనే. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం’ అని హెచ్చరించారు.విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరం కనీవినీ ఎరుగని రీతిలో బుడమేరు ప్రజలను ముంచేసింది. ప్రజలు నిలువెల్లా వణికిపోయారు. ప్రపంచ రాజధాని అమరావతి కడుతున్నామని కబుర్లు చెబుతున్నారు. టెక్నాలజీ అంతా మాకే తెలుసంటారు. కానీ వరద వస్తున్న విషయాన్ని గుర్తించి ప్రజలను కాపాడలేకపోయారు. జగన్ రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంక ప్రజలను ముంపు నుంచి తప్పించారు. చంద్రబాబు బుడమేరు ప్రక్షాళన చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ నేటికీ ఆదిశగా అడుగులు వేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరోమారు బుడమేరు ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. బుడమేరు ఆక్రమణలు తొలగించే వరకూ మా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటనకు ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని బదులిచ్చారు. ఎన్డీఏ అభ్యర్థన మేరకు ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా సుదర్శన్‌రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్న జగన్..న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారని కితాబు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించ వద్దని విజ్ఞప్తి చేశారు. -
సుగాలి ప్రీతీని అడ్డుపెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యావ్.. పవన్ పై YSRCP మహిళలు ఫైర్
-
వైఎస్సార్సీపీ బీసీ నాయకురాలిపై టీడీపీ మూకల దాడి
గంగవరం: చిత్తూరు జిల్లాలో ఓ వైఎస్సార్సీపీ మండల బీసీ నాయకురాలిపై టీడీపీ మూకలు శనివారం విచక్షణారహితంగా దాడి చేశాయి. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామంలో బోయ సామాజికవర్గానికి చెందిన కవిత ఇటీవలే వైఎస్సార్సీపీ మండల బీసీ మహిళాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బాధితురాలి సోదరి నందినిపై గతంలో తేజ అనే యువకుడు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డాడు.దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు గంగవరం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసును రాజీ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు నందిని, కవితలను తేజ బెదిరించాడు. ఈక్రమంలో వినాయక చవితి పండుగ కోసం సోదరి ఇంటికి నందిని వచ్చింది. అయితే తేజ ఆలకుప్పం గ్రామం టీడీపీ నేత రాజన్నకు విషయం చెప్పాడు.ఆయన ప్రోద్బలంతో పండగ రోజు నందిని, ఆమె సోదరి కవిత, తల్లి తిమ్ములమ్మపై తేజ, ఇతర నేతలు దాడి చేసి గాయపరిచారు. పాత కేసును రాజీ చేసుకోకుంటే ప్రాణం తీయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు పలమనేరులోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా టీడీపీ నేతల దాడిపై బాధితులు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
పులివెందులలో వైయస్ జగన్ మూడు రోజుల పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెపె్టంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 2వ తేదీ ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 3వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
‘కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. -
రుషికొండలో పవన్, నాదెండ్ల కొత్త డ్రామా: అమర్నాథ్
సాక్షి, విశాఖ: రుషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీపడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. రుషికొండలో పవన్ డ్రామా చేశారు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రుషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు రుషికొండ పర్యాటక ప్రాంతంగా మారింది. చంద్రబాబు హైదరాబాద్‌లో 200 కోట్ల రూపాయలతో పెద్ద భవనం కడతే అది పూరి గుడిసె.. అమరావతిలో ఐదు ఎకరాల్లో చంద్రబాబు రాజభవనం కడితే అది స్కీమ్ ఇల్లు. వైఎస్ జగన్ ఇల్లు కట్టుకుంటే అవి మాత్రం ప్యాలెస్. రుషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. అందుకే రుషికొండ భవనాలు దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. రుషికొండ భవనం సీలింగ్ కట్ చేశారు. కట్ చేసిన ప్రాంతంలో పవన్ ఫోటో షూట్ చేశారు. చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం చిన్నపాటి వర్షానికి కారిపోతుంది. చదరపు అంగుళానికి రూ.13వేలు పెట్టి కట్టారు. వాటి దుస్థితి చూడండి. అవి పవన్‌కు కనిపించడం లేదా?. ఏరోజైనా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమరావతి సచివాలయానికి వెళ్లారా?. ఎన్నికల్లో రుషికొండ భవనాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రుషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు. పర్యాటక రిసార్ట్ అంటూ ఎందుకు జీవో విడుదల చేశారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్డ్ చేయడానికే రుషికొండలో పవన్ డ్రామాకు తెరలేపారు. రుషికొండలో పవన్, నాదెండ్ల మనోహర్ ఫోటో షూట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.స్టీల్ ప్లాంట్ కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పవన్ కళ్యాణ్ తెరలేపారు. విశాఖ ఉక్కు నా ఆత్మ అంటూ చంద్రబాబు ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఈవెంట్ల కోసం విశాఖ, పేమెంట్లు కోసం అమరావతి వాడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చేతగాని వ్యక్తులు ఎవరో పవన్‌ను చూస్తే తెలుస్తుంది. వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డున పడ్డారు. వారి గురించి చంద్రబాబు, పవన్ ఒక మాట మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మా వైఖరి మారలేదు. మొదటి నుంచి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. స్టీల్ ప్లాంట్‌పై మా వైఖరి ఒకటే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కూటమి గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే చెప్పారు. వైఎస్ జగన్ వలనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు, పవన్, లోకేష్ వైజాగ్ వస్తున్నారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్‌పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. తప్పుడు హామీలు, అబద్ధాలతో కూటమి అధికారంలోకి వచ్చింది. స్టీల్ ప్లాంట్ కార్మికుల అవస్థలు కూటమి నేతలు పట్టించుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్‌పై గతంలో పవన్ కల్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు ఏం అయ్యాయి? అని ప్రశ్నించారు. -
సంచార జాతుల్లో వెలుగులు నింపిన జగన్
సాక్షి, అమరావతి: ఉదర పోషణకు ఊరూరా సంచారం.. రోడ్డు పక్కన, మురికి కాల్వల గట్టున జీవనం.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుర్భరం.. ఇది రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు సంచార జాతుల జీవన చిత్రం. అటువంటి సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అయితే కూటమి పాలనలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోని దారుణ పరిస్థితికి జారిపోయారు. ఈ నెల 31న విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవన చిత్రానికి సంబంధించిన కథనం ఇది. దుర్భర జీవనం... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కళారూపాల ద్వారా పరిరక్షిస్తూ ధర్మప్రచారకులుగా ఊరూర తిరుగుతూ జీవనోపాధి పొందేవారిని సంచార జాతులుగా పరిగణించారు. కనీసం సొంత ఊరు, ఇల్లు, చిరునామా, కుల «ధృవీకరణ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేక దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోని దుర్భర బతుకులు వారివి. పూసలు, దండలు, వనమూలికలు అమ్ముతూ, తలవెంట్రుకలు వంటివి కొంటూ, గొడుగులు బాగుచేస్తూ, సవరాలు అమ్ముతూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, చిన్న చిన్న సర్కస్‌లు చేస్తూ, ఖాళీ సమయంలో భిక్షాటన చేస్తూ బతుకులు వెళ్లదీసే పరిస్థితి వారిది. సంచార జాతుల స్వాతంత్య్రం– 1952బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ద్వారా దాదాపు 500 కులాల వారికి ‘జన్మతః నేరస్తులు’ అనే ముద్ర వేసింది. ఈ చట్టం వల్ల వారు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారు. ఫలితంగా గౌరవంగా బ్రతకలేక, చాలా మంది రహస్యంగా సంచార జీవితం గడుపుతూ భిక్షాటనపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు కాలేదు. నిరంతర పోరాటాల తరువాత 1952 ఆగస్టు 31న ఈ కులాలను విముక్త జాతులుగా ప్రకటించారు. అందుకే సంచార జాతులు ఆ రోజును తమ నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, వారి జీవనస్థితి మెరుగుపడేందుకు చేసిన కమిటీలు, కమిషన్ల సిఫార్సులు పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి.సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంరాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు, చిరునామా (నెటివిటి సర్టిఫికెట్)లు, ఆధార్, రేషన్‌కార్డులు జారీకి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిలో అనేకమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సంచార జాతుల పిల్లలకు చదువులను చేరువ చేసేలా అమ్మ ఒడిని వర్తింపజేశారు. చేయూతతోపాటు నవరత్నాలతో అనేక సంక్షేమ పథకాల ద్వారా సంచార జాతులకు రూ.1,288.44కోట్లకుపైగా లబ్ది చేకూర్చడం విశేషం. వారిలో 32 సంచార జాతుల కోసం ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గుర్తింపు లేని తోలుబొమ్మలాటల కులస్తులను గుర్తించి బీసీ–బీ సీరియల్ నంబర్ 25లో చేర్పించారు. హామీలను నెరవేర్చని కూటమి సర్కార్కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. ఎంబీసీలకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, దేవాలయాల పాలక మండలిలో సభ్యత్వం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ, మైనార్టీల మాదిరిగానే కో–అప్షన్ మెంబర్‌గా ఎంబీసీలకు అవకాశం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సంచార జాతుల గుర్తింపు కార్డుల మంజూరు... ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది.జగన్ పాలనలో గుర్తింపుజగన్ పాలనలోనే సంచార జాతులకు గుర్తింపు దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. –పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక రిసార్ట్
ప్రతి విషయంపైనా ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేస్తూ దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నైజం అని మరోసారి నిరూపితమైంది...! విశాఖపట్నం రుషికొండ భవనాల సాక్షిగా... ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా... చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించినదంతా తప్పుడు ప్రచారమేననితేలిపోయింది..! రుషికొండలో నిర్మించినది మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది...! అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... దాదాపు ఏడాదిన్నర పాటు రుషికొండ భవనాలను విస్మరించింది...! ఇప్పుడు అది వైఎస్ జగన్ ప్యాలెస్ కాదు.. పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ నిజాన్ని ఒప్పుకొని నాలుక్కర్చుకుంది...! ...అయితే, ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు... రుషికొండ భవనాలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ముందుపెట్టి పెద్ద డ్రామా ఆడింది..! సీఎం చంద్రబాబు డైరెక్షన్లో... రుషికొండ భవనంలో పవన్ కళ్యాణ్ తన నట కౌశలాన్ని చూపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్‌గానూ కొనసాగించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా సాగిందిలా..సాక్షి, అమరావతి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్... శుక్రవారం ఉదయం హఠాత్తుగా రుషికొండపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యద్భుత పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. అద్భుతంగా నిర్మించిన ఈ భవనంపై గతంలోనూ ఏడుపు ప్రదర్శించిన పవన్ మరోసారి అదే కంటగింపు కొనసాగించారు. రూ.లక్షల్లో కరెంట్ బిల్లు వస్తోందంటూ ఆరోపించారు. రూ.450 కోట్లతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏమంటే, రుషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్నిచూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేటుకు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు... పవన్ కళ్యాణ్‌ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది. నాసిరకం అని ముద్ర వేసే కుట్ర: రాజధాని పేరిట రూ.వేల కోట్లతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు... కేవలం రూ.450 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలను చూసి అచ్చెరువొందారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పారీ్టల నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రుషికొండ నిర్మాణాల వ్యయాలను బేరీజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయం పైనా చర్చ లేవనెత్తారు. దీంతో రుషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు కుట్ర ప్రారంభించారు. ఏడాదిన్నర ఖాళీగా ఉంచి... దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చూసినప్పుడు లోపల సీలింగ్ విరిగి పడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే.. బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే.. 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కిందపడుతుంది. కానీ, ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్‌ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే, పవన్ వస్తున్నారని తెలిసి.. ప్రభుత్వం ఇదే అదనుగా సీలింగ్‌ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే.. కావాలని రుషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇల్లు ఖాళీగా ఉన్నా కరెంటు బిల్లు రాదా? రుషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే, పటిష్ఠ నిర్మాణాన్ని ఏడాదిన్నరగా వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా? అంటూ అధికారులు గుసగుసలాడడం కనిపించింది. అయినప్పటికీ, ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పేనని చెప్పడం చూస్తే... అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరమ్మతుల పేరుతో కొట్టేసి.. ప్రైవేట్‌కు ఇచ్చేసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్‌కు ఇచ్చేందుకు స్కెచ్ వేశారు. టూరిజం భవనాలు కాబట్టి.. టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి, దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రుషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కానీ, ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి? అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రైవేట్‌కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే తనపై వ్యతిరేకత వస్తుందని భావించి, పవన్‌ను పావుగా వాడుకున్నట్లుంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌తో చంద్రబాబు మాట్లాడి రుషికొండ భవనాలను పరిశీలించాలని ప్రైవేట్‌కు ఇవ్వాలా? ఎలా వాడాలి? అనేదానిపై మీడియాతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. బాబు పథకం ప్రకారమే... అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి.. సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కర్నూలుకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి హత్య అంశాన్ని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ లబి్ధకి ఉపయోగించుకున్నారు. దీనిపై ప్రీతి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదట సుగాలి ప్రీతి కేసు ఫైల్ పైనే సంతకం చేస్తానని పవన్‌కళ్యాణ్ చెప్పిన వైనాన్ని ప్రస్తావిస్తూ సూటిగా ప్రశ్నిoచారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసేందుకు పవన్.. విశాఖలో రుషికొండ డ్రామాకు తెరతీశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రులూ.. ఏం చేద్దాం చెప్పండి..! రుషికొండ భవనాలు పర్యాటక శాఖ రిసార్ట్ అంటూ వాస్తవాన్ని అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భవనాలను సముచితంగా ఉపయోగించుకునేలా అధ్యయనానికి, సిఫార్సులు చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ రిసార్ట్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ఉత్తర్వుల్లో సూచించారు.విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కిక్కురుమనకుండా..» అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ మాట మారిందేల? » ప్లాంట్ ప్రైవేటీ కరణపై జనసేనాని రెండు నాల్కల ధోరణివిశాఖ స్టీల్ ప్లాంట్‌లోని కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గురించి పవన్ కిక్కురుమనలేదు. అసలు ఆ విషయం రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూసేందుకు వెళ్లారు. అందులో సీలింగ్ వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేశారు. అటు రూ.వేల కోట్ల విలువైన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ ఇలా పూట గడిపేశారని విశాఖ యువత దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో టీడీపీ, జనసేన ఎంపీల బలం ఉన్న ఈ సమయంలో పవన్‌కళ్యాణ్ కీలకమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై విశాఖ పర్యటనలో బేలగా మాట్లాడారు. ఇది కార్మికులతో పాటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేంద్రం మెడలు వంచైనా ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు ప్రతిఘటిస్తుంటే.. ‘‘ఢిల్లీ అంటే ఏమనుకుంటారు?’’ అంటూ వారిని పరోక్షంగా తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వేగంగా చేపడుతున్న ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలేవీ చేపట్టకపోగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ధోరణి కనబరిచారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా దీక్షకూ సిద్ధమని మాట్లాడిన జనసేన అధినేత, ఇప్పుడు కార్మికులను తప్పుపట్టేలా మాట్లాడుతున్నారు. క్యాప్టివ్ మైన్స్ తేవడం చేతకాక వైఎస్సార్సీపీపై నిందలా? » చంద్రబాబు, పవన్ చేతికానితనంతోనే ప్రైవేటీకరణ » వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతకానితనం వల్లే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగంగా కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉంటూ టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్‌ను సాధించలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ లాస్లో ఉన్నట్టు చూపించి అమ్మేసే పనిలో ఉంటే మౌనం దాల్చారని పేర్కొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని... తాము ఉద్యోగులు, కార్మికుల తరుఫున పోరాడతామని చెప్పారు. ఈ ప్లాంట్‌కు జపాన్, కొరియా, అమెరికా, రష్యాల్లో మార్కెట్ ఉందని, క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేనలు చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపింది వైఎస్ జగన్. ఆపలేక చేతులెత్తేసింది మీరు. చిత్తశుద్ధి లేని కూటమి నాయకులు, ఎన్నికలకు ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారు’ అంటూ జూపూడి మండిపడ్డారు. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్‌కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
Nellore: YSRCP కార్యకర్త శ్రీనివాసులుపై TDP గుండాల దాడి
-
విశాఖలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంపై పోతిన సెటైర్లు
-
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనపై చిన అప్పలనాయుడు ఫైర్
-
ఎట్టకేలకు న్యాయం గెలిచింది.. ‘సుప్రీం’ తీర్పుపై పెద్దారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట(Big Relief For Kethireddy Pedda Reddy) లభించింది. నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘‘మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో.. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు.14 నెలలుగా దూరంఏపీలో కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు.తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతీసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు. జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి, ఇటు వైఎస్సార్సీపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు.దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంత ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు. పెద్దారెడ్డి రియాక్షన్సుప్రీం కోర్టు తీర్పుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఎస్పీ కి అందజేస్తా.. త్వరలో తాడిపత్రి వెళ్తాను. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా.. సేవ చేస్తా. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు పోలీసులకు సహకరిస్తాను అని అన్నారాయన. -
కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్ స్కాంను సృష్టించి.. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక నెపంతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైఎస్ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. -
వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని పరామర్శించిన YSRCP లీడర్ మక్బూల్
-
కుప్పం చేసిన పుణ్యం ఏంటి..? కళ్యాణదుర్గం చేసిన పాపం ఏంటి..?
-
తలలు నరుకుతామంటే చూస్తూ.. హౌస్ అరెస్ట్ పై చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్
-
కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం అని కాకాణి అన్నారు.హౌజ్ అరెస్ట్‌లో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది అని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసును నిరసిస్తూ కాకాణి, చంద్రశేఖర్ కావలికి పయనం అయ్యారు. అయితే.. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాను అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపునకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలనుసారం వేదాయపాళెం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
Big Question: YS జగన్ పూజ చేస్తే మీకేంటి..? ఎందుకంత భయం..
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా.. ఇది జగనన్న సైన్యం..
-
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్‌లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. .@ncbn గారూ మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2025 -
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
జైల్లో మిథున్ రెడ్డిని కలిసాక YSRCP నేతల రియాక్షన్
-
గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు...అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు...అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు...తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘చంద్రబాబూ.. మూల్యం చెల్లించుకోక తప్పదు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అభూత కల్పనలతో లిక్కర్ స్కాం కేసు తయారు చేశారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్‌తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పుడు జైలు వద్ద పవన్ కళ్యాణ్ మాటలు కోటల దాటాయి. ఇప్పుడు ఆయన గడప కూడా దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జైల్లో మిథున్ రెడ్డిని హింస పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా సెంట్రల్ జైలు వద్ద భారీ గేడ్లు కట్టారు’’ అంటూ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు.. మనీ ట్రైల్ ఎలా జరిగిందో 90 రోజులైనా నిరూపించలేకపోయారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు ఇచ్చారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు. -
Raptadu: నువ్వు గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ
-
తోపుదుర్తి జోలికి వస్తే... మహానందరెడ్డిపై YSRCP నేతలు సంచలన వ్యాఖ్యలు
-
నన్ను చంపాలని చూస్తే.. నరసాపురం సీఐపై YSRCP దళిత నేత సంచలన వ్యాఖ్యలు
-
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుక కోసేస్తా.. టీడీపీ నేత వ్యాఖ్యలకు YSRCP నేతలు వార్నింగ్
-
Karumuri Venkat : టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అర్హత BR నాయుడికి లేదు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు (ఫొటోలు)
-
వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. -
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.వినాయకచవితి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్..‘రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి’ అని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#VinayakaChaturthi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2025 -
పోలీసుల సాక్షిగా.. టీడీపీ నేతల గూండాగిరీ
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై గూండాగిరి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు మౌనవ్రతం వహించారు. వివరాల్లోకి వెళితే, వైఎస్సార్సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం చిలమత్తూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.ప్రెస్‌మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు.టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఒకానొక దశలో పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించినా కిమ్మనకపోవడం గమనార్హం. పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోండి..: వైఎస్సార్సీపీ నాయకులకే పోలీసుల సలహా కాగా, దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ నాయకులను వదిలేసి, పార్టీ కార్యాలయం వదిలి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్సీపీ నాయకులకే పోలీసుల సలహా ఇవ్వడం గమనార్హం. ‘‘మీరు పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోతేనే, టీడీపీ నేతలు వెళ్లిపోతారు’’ అంటూ పోలీసులు అనడంతో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ససేమిరా అన్నాయి.తమకు ప్రెస్‌మీట్ నిర్వహించుకునే హక్కు, పార్టీ కార్యాలయంలో ఉండే హక్కు ఉందని వారు స్పష్టం చేశారు. దీంతో ఒక దశలో సీఐ జనార్దన్ ..ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, మండల కనీ్వనర్ రామకృష్ణారెడ్డిలను బెదిరిస్తూ మాట్లాడారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతలు కూడా వినకపోవడంతో చివరకు పోలీసులు ఎంపీపీ, కనీ్వనర్తో మాట్లాడి అక్కడి నుంచి వారిని బందోబస్తు నడుమ పంపించి వేశారు.ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత వెళ్లేప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండా బాబూరెడ్డి ఎంపీపీని అసభ్య పదజాలంతో దూషించడం గమనార్హం. కాగా, ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన అంశంపై ‘సాక్షి’ ఈ నెల 24న ‘ప్రాణం తీసేందుకే ప్లాన్ చేశారా?.. ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం వెనుక సూత్రధారులెవరు?’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. అయితే.. టీడీపీ నేత నాగరాజు యాదవ్ తనపైనే ఈ వార్త రాశారంటూ ‘సాక్షి’కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బెదిరింపులకు దిగారు. -
నేడు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విజయవాడ రాణిగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణిగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.వైఎస్ జగన్‌ను వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావులు తాడేపల్లిలో మంగళవారం కలిశారు. చవితి వేడుకలను పురస్కరించుకుని వినాయకుడి మట్టి ప్రతిమను అందజేశారు. రాణిగారితోటలో నిర్వహించే చవితి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.