మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం | YSRCP Leader Perni Nani Takes On Chandrababu Govt: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం

Feb 25 2026 5:30 AM | Updated on Feb 25 2026 5:30 AM

YSRCP Leader Perni Nani Takes On Chandrababu Govt: Andhra Pradesh

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల పర్వం 

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేరి్ననాని 

ఆలయాల విధ్వంసకారుడు చంద్రబాబు 

వాటిని పునరి్నరి్మంచింది వైఎస్‌ జగన్‌  

కల్తీ నెయ్యి పాపం ముమ్మాటికీ కూటమిదే 

బాబు ‘డెయిరీ మాఫియా’కు పాబ్లో ఎస్కోబార్‌ ఎవరు? 

హెరిటేజ్‌లో వాటాలున్న కంపెనీలకే నెయ్యి టెండర్లు 

కిలో నెయ్యి రూ.278తో కొన్నప్పుడు అది కల్తీ కాదా బాబూ? 

లడ్డూలో జంతు కొవ్వు లేదని సిట్‌ తేల్చినా విష ప్రచారమేనా? 

మత రాజకీయాల కోసం మంటలు పెడుతున్న బాబు, పవన్‌ కళ్యాణ్‌  

ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచార జీవో ఇచ్చింది గత చంద్రబాబు సర్కారే 

2014 నుంచి నెయ్యి కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్దమా?

సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్‌ జగన్‌పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు.  నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్‌ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. 

మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు  
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు.   

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్‌కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా­లు ఎందుకు చేస్తాడు?  జగన్‌ హయాంలో ఆల­యాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా?  

ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ?  
2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం?  

కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆత్మపరిశీలన చేసుకున్నారా?  

టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్‌ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు ఎలా ఇచ్చారు?  

చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్‌ ప్రభుత్వం పునర్‌ నిరి్మంచింది.   డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.    

కల్తీ నెయ్యి పాపం మీదే  
మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు?  మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా?  

2024 జూన్‌లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్‌ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్‌ రిపోర్ట్‌ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్‌ రిపోర్ట్‌ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్‌ ఇప్పటికే బయటపెట్టింది.  

ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్‌ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్‌ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్‌ జగన్‌కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే.  

వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? 
తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్‌ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్‌ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్‌ లో రూ.364కు, ఏప్రిల్‌ 2017లో రూ.411కు, అక్టోబర్‌ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్‌ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్‌ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్‌ డెయిరీకి చెందిన ఆశిష్‌ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్‌ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్‌లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. 

బయటపడ్డ హెరిటేజ్‌–ఇందాపూర్‌ బంధం  
తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్‌ పిటిషన్‌ వేసింది. బోలేబాబా ఆర్గానిక్‌కూ, సీబీఐ చార్జిషీట్‌లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్‌కూ సంబంధం లేదని అందులో చెప్పా­రు. తమకు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు.  కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్‌ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది.   

దీన్నిబట్టి భారత్‌లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్‌ కాలర్‌ డాన్‌ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్‌ ఎవరు?  
బాబూ ఇదేనా మీ భక్తి? 
మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా?  

చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్‌ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా?  అవి జగన్‌ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్‌కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది?  

మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు 
బోలేబాబా డెయిరీకి పొమిల్‌ జైన్, విపుల్‌ జైన్‌ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్‌నర్‌. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్‌ జైన్, విపుల్‌ జైన్‌ ఇద్దరికీ హెరిటేజ్‌లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్‌ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్‌కు దగ్గరా? ఏఆర్‌ డెయిరీ ఓనర్‌ రాజు రాజశేఖర్‌ డిండిగల్‌లో హెరిటేజ్‌ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? 

నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్ర­బాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి.  సీఎఫ్టీఆర్‌ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్‌ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్‌ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement