breaking news
Perni Nani
-
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు
ఏలూరు సిటీ: కూటమి నేతల రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసుల విధి ‘సత్యం వధ.. ధర్మం చెర’గానే మారింది. మొదట్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపై బుసలు కొట్టిన రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపైనా కోరలు చాస్తోంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై టీడీపీ మూకలు దాడికి తెగబడగా.. అసలు నిందితులను వదిలేసి అబ్బయ్య చౌదరి, మాజీ మంత్రి పేర్ని నాని, పార్టీ శ్రేణులపైనా తప్పుడు కేసులు నమోదు చేసి రెడ్‌బుక్ రాజ్యాంగం అంటే ఏమిటో పోలీసులు మరోసారి రుజువు చేశారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ నెల 21న వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి చొరబడి పామాయిల్ గెలలను కోస్తున్న వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అదే క్షేత్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ మూకలు బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో దాడి చేసి వీరంగం చేశారు.ఈ ఘటనపై బాధితుడైన అబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడికి యతి్నంచిన టీడీపీ మూకలను వదిలేసి ఆయనపైనే ఎదురు కేసు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సోదరులు చల్లగోళ్ల ప్రదీప్, తేజ, ఉప్పలపాటి ప్రసాద్‌తో పాటు మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనూ పోలీసులు వదల్లేదు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు ఇదే అంశంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నానిపైనా పోలీసులు మంగళవారం అక్రమ కేసు నమోదు చేశారు. అబ్బయ్యచౌదరి నివాసంపై బీరు సీసాలు, కర్రలు, రాడ్లతో టీడీపీ మూకలు దాడికి యతి్నంచిన విషయం తెలిసి మాజీమంత్రి పేర్ని నాని తదితరులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.అబ్బయ్య చౌదరి పొలంలో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండటంతో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఈ నెల 22న కొండలరావుపాలెంలో అబ్బయ్యచౌదరి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి.. ఆయనకు సంఘీభావం ప్రకటించింది. అనంతరం పేర్ని నాని, సాకే శైలజానాథ్ ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు వినతిపత్రం సమరి్పంచారు.అబ్బయ్య చౌదరి నివాసం, ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాడికి యతి్నంచిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిప్రంలో కోరారు. అనంతరం పోలీస్ జిల్లా కార్యాలయం వెలుపల మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా ఉంటే రాజకీయపరంగా చూసుకుందామని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం సరైన విధానం కాదని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు హితవు పలికారు.టీడీపీ నేతలు, కార్యకర్తల దాషీ్టకాలపై రాజకీయ విమర్శలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, రెండు వర్గాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేశారని ఏలూరు మండలం పాలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నేతల రవి ఈ నెల 25న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు పేర్ని నానిపై తప్పుడు కేసు నమోదు చేశారు. -
పేర్ని నానిపై అక్రమ కేసు
-
అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్
-
టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయి: పేర్నినాని
-
చింతమనేని.. నీ ఉడత ఊపులకు భయపడం: పేర్ని నాని
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులు తారాస్థాయికి చేరాయన్నారు. అబ్బయ్య చౌదరిని చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే అబ్బయ్య చౌదరి ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చింతమనేని ఉడత ఊపులకు భయపడేది లేదు. అబ్బయ్యచౌదరివ వెంట జగన్, పార్టీ మొత్తం ఉంది’’ అని పేర్ని నాని అన్నారు.దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో అబ్బయ్య చౌదరి పొలంలో చింతమనేని ప్రభాకర్ అనుచరుల దౌర్జన్యకాండను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. కొఠారు అబ్బయ్య చౌదరిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మాజీ మంత్రులు పేర్ని నాని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మి ఇజ్రాయిల్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తదితరులు.. పచ్చ మూకలు ధ్వంసం చేసిన పొలాలను పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్నీ లెక్కలు సరిచేస్తాం: సాకే శైలజానాథ్సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటారు. రాయలసీమ వాసులుగా దెందులూరులో జరిగిన ఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. బలహీనపరచాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్‌ను భయపెట్టి రేపు అడ్డం లేకుండా చూసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే చింతమనేనికి అది భ్రమ మాత్రమే.. పచ్చని చెట్లను నరికి వేయడం దారుణం. పోలీసులు స్వామి భక్తితో పని చేస్తున్నారు. రక్తం వచ్చేలాగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. డీఎస్పీనే టీడీపీ మూకలు తోసేస్తుంటే ఏం చేస్తున్నారు?. ప్రతి వాటిని గుర్తు పెట్టుకుంటాం?. టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు వచ్చి వీరంగం సృష్టించడం దారుణం. ఇప్పటికైనా పోలీసులకు సోయి ఉండాలి. ఎమ్మెల్యే మీకు జీతాలు ఇవ్వడు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. అన్ని లెక్కలు సరిచేస్తాం..దెందులూరులో పోలీసుల సాయం ధృతరాష్ట్ర కౌగిలి. నిలబడి సమాధానం చెప్పే రోజు వస్తుంది.. డేట్ నోట్ చేసుకోండి. అరాచకాలు చేసే వాళ్లని కేసులు పెట్టి లోపల వేయాల్సింది పోయి మా వాళ్లపై కేసులు పెడుతున్నారు. పోలీసుల ప్రభుత్వ అధికారులను గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ వైఎస్సార్సీపీ నాయకుడు ఒంటరి కాదు. బాడుగకు తెచ్చిన వారితో కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదు. జాగ్రత్తగా ఉండండి. మంచికి మంచి.. చెడుకు చెడు లెక్కలు సరిచేసే కాలం ఉంటుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక లెక్కలు సరిచేస్తాం’’ అని సాకే శైలజానాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
నామినేషన్ నుంచి పోలింగ్ దాక ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ‘‘14 నెలల పాలనలో అన్నివిధాలా వంచించిన కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న భయం పట్టింది. అందుకే పోలీసుల అండతో దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిశాయి. వారిని తరిమికొట్టడం ఖాయం’’ అని తేల్చిచెప్పారు.గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పులివెందుల, రాజంపేట నియోజకవర్గాల్లో ఒక్కో జెడ్పీటీసీ, కుప్పంలో ఎంపీటీసీ, ప్రకాశం జిల్లాలో సర్పంచ్ స్థానాన్ని ఎంచుకుని మరీ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం మహాగొప్పగా ప్రకటించిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై.. 13 నెలల టర్మ్ మాత్రమే ఉన్న జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తూ, నామినేషన్ల నుంచే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా రకరకాల తంతులు నిర్వహించారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాలు, అధికారులు తొత్తులుగా మారారని,, ఐఏఎస్‌లుగా రాష్ట్రంలో అత్యున్నత పదవులు వెలగబెట్టి, ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు సైతం తమ బాధ్యతలను విస్మరించారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుపుతున్నామని చెప్పడానికి, మీడియాకు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారని, కానీ పులివెందుల, ఒంటిమిట్టలో ఎవరినీ వెళ్లనివ్వకుండా, వాళ్లే ప్రయివేటు కెమెరాతో చిత్రీకరించారని పేర్ని అన్నారు. ‘‘ఈ వీడియోల్లో ఎక్కడా మహిళలు ఓటు వేసినట్లు కనిపించలేదు. అందరూ పురుషులే. అది కూడా జమ్మలమడుగు లేదా కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు చెందినవారు.ఈ మూడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలకు ఓట్లు గుద్దుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పులివెందులలో విచిత్రం ఏమంటే సాయంత్రం 5–6 గంటల మధ్య ఓటు వేసిన మహిళలంతా వి.కొత్తపల్లెలో పోలింగ్ స్టేషన్ నం.13లో ఓటు హక్కు వినియోగించుకున్నవారే. అక్కడ ఒక పురుష ఓటరు కూడా లేడు. అధికార పార్టీ బరితెగింపునకు ఇదో నిదర్శనం. క్యూ లైన్లో లేకుండానే 3,684 మంది మహిళలు ఓటు వేశారు. బహుశా దేశంలో దొంగలు పడ్డారంటే ఇదేనేమో! తండ్రికొడుకు ఇద్దరు దొంగలు పడ్డారని, ఇంత తంతు చేసి, మీరిచ్చిన లెక్కలతోనే దొరికిపోయారు’ అని అన్నారు. డ్రామా రక్తి కట్టేలా పోస్టులు.. డ్రామాను మరింత రక్తి కట్టించడానికి 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నాం థ్యాంక్స్ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో కొన్ని స్లిప్పుల పోస్టులు పెట్టారని, అంటే.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెబుతున్నారా? క్యూలైన్లో పురుషులు అదీ బయటివాళ్లు ఉంటే.. వారితో సమానంగా మహిళల ఓట్లు ఎలా వచ్చాయని పేర్ని నాని ప్రశి్నంచాచు. అంటే, జమ్మలమడుగు నుంచి వచ్చి దొంగఓట్లు వేసినవారు.. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని చెబుతూ పోస్టులు పెట్టారని ఎద్దేవా చేశారు. లోకేశ్... మీ పోస్ట్‌లోనే తెలుస్తోంది పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారని... అందులో ఉన్నది జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పొన్నతోట మల్లికార్జున్ అని పేర్ని నాని పేర్కొన్నారు. ‘‘ఇదీ వీళ్ల బండారం..! కలెక్టర్ పోస్ట్ పెట్టి తీసేస్తారు. మంత్రి దౌర్జన్యాల మీద, దొంగ ఓటర్ల మీద కేసులుండవు. ఓ సోదరి కుప్పంలో మీరు ఇలాగే చేశారని అంటోంది. కానీ, అక్కడ టీడీపీకి ఎంత ఖర్మ పట్టిందీ అంటే వాళ్ల చేతులతో వారే 680 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేశారు’’ అని తెలిపారు.వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానమేది బాబూ...? ఉప ఎన్నికల పోలింగ్‌లో ఏ జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు కట్టినట్టు చూపిస్తూ సమాధానం ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చాలెంజ్ చేశారని, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారని పేర్ని నాని గుర్తుచేశారు. ‘‘పోలింగ్ సరళి సీసీ టీవీ ఫుటేజీని, వెబ్ కాస్టింగ్ ను ప్రజల్లో పెట్టాలని వైఎస్ జగన్ అడిగితే, ఎందుకు భయం? వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చేసిన ట్వీట్లో ఆయన ముందున్నవారు దొంగ ఓటర్లు.అంటే, కలెక్టర్ దగ్గరుండి దొంగ ఓటింగ్ చేయించారా? క్యూలైన్లలోని దాదాపు 90 శాతం దొంగ ఓటర్లే. వీటిపైనే వైఎస్ జగన్ ప్రశ్నించారు’’ అని తెలిపారు. దీంతో చంద్రబాబు స్క్రీన్ ప్లే మార్చారని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఒకే రౌండ్ లో పూర్తి చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ‘‘ఎక్కడ తప్పు పడతారోననే భయంతో, కోర్టులు ప్రారంభమయ్యేలోగా ఉప ఎన్నిక ఫలితాలు తేల్చాలని ఆదరాబాదరాగా ఆదేశాలిచ్చారు.ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉప ఎన్నికలు జరుపుతున్నామని డ్రామా మాటలు చెప్పిన వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్.. ఒక్క మీడియాను కూడా ఓటింగ్ ను చూపించేందుకు బూత్‌లలోకి అనుమతించలేదు. కిరాయికి మాట్లాడుకున్న ప్రైవేటు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌తో ఫొటోలు, వీడియోలు తీయించి విడుదల చేశారు’ అని చెప్పారు.డీఐజీ.. ఎవరి ఆనందం కోసం ఈ నిర్వాకం రాయచోటి ఎమ్మెల్యేనో, ఎన్నికలున్న ఒంటిమిట్టలో ఓటరు కాకపోయినా రాష్ట్ర మంత్రి ఎలా పోలింగ్ స్టేషన్ కు వెళ్తారని పేర్ని నాని నిలదీశారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్‌ను కొట్టారని, మంత్రి మీద కేసు ఫైల్ చేశారో లేదో డీఐజీ కోయ ప్రవీణ్ సమాధానం చెప్పాలని పేర్ని నిలదీశారు. ‘ఇదంతా ఎన్నికల కమిషన్ కు కనబడ్డం లేదా? కేసు కట్టని అధికారులను సస్పెండ్ చేయరా? షోకాజ్ ఇవ్వరా? మీకు సిగ్గూ, శరం ఉందా ? పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న పనికి డీజీపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. పోలింగ్ బాగా నిర్వహిస్తున్నామని జబ్బలు చరుచుకున్న జిల్లా కలెక్టర్.. వెంటనే ఎక్స్ఖాతాలోని పోస్టును ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు.సునీతమ్మా.. మీ తండ్రే పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారా?‘‘అసెంబ్లీఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎక్కడాలేని విధంగా పోలైన ఓట్ల కంటే ఏపీలో 12 శాతం ఓట్లు అదనంగా లెక్కించారు. మొదటినుంచి మేం ఇది చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే చెబుతున్నారు. టీడీపీ కూటమికి 164 సీట్లు రావడం మీద దేశమంతా అనుమానంతో ఉంది. అది కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక లాంటిదే అని ప్రజలు అనుకుంటున్నారు’’ అని పేర్ని నాని అన్నారు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని బతికించారంటున్న నర్రెడ్డి సునీతారెడ్డి.. ఈ నియోజకవర్గంలో ఆమె తండ్రి వైఎస్ వివేకానే చాన్నాళ్లు రాజకీయం చేశారని, అంటే ఆయనే ప్రజాస్వామ్యాన్ని చంపేశారని చెబుతున్నారా?’’ అని ప్రశి్నంచారు. -
Perni Nani: దొంగ ఓట్లతో గెలిచారు.. పులివెందుల గడ్డ జగన్ అడ్డా
-
దొంగ ఓటు వేస్తున్నా..! నిజం ఒప్పుకున్న టీడీపీ కార్యకర్త
-
Perni Nani: ఓటరు ఓటు వేయకుండానే ఎన్నికలు భలే జరిపించారు
-
తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు అంటూ ఆధారాలు చూపించారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడమేంటి?. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ ప్రకారమే రీపోలింగ్ పెట్టింది.పులివెందులలో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూశారు. కిరాయి మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. టీడీపీ అరాచకాలకు ఉన్నతాధికారులు కూడా వంత పాడారు. సీసీ ఫుటేజీ, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయమెందుకు?. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. తండ్రీకొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు అని మండిపడ్డారు.టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందులలో ఎలా ఓట్లు వేశారు?. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఎక్కడా కూడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదు. గ్లాస్ దొంగలను.. సైకిల్, పువ్వు దొంగలు నమ్మలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారు. పులివెందులలో టీడీపీ నేతలే వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారు. కూటమిలో బీజేపీ, జనసేన డమ్మీ పార్టీలు. పులివెందులలో జరిగింది ఎన్నిక కాదు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా పార్టీల్లో చంద్రబాబు బ్రోకర్లు ఉన్నారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజం. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారా?. చంద్రబాబుకు పౌరుషం ఉంటే 2019-24 వరకు ఎంత జీతం తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
Perni Nani: ఉపఎన్నికలో ఓటుకు పదివేలు.. బాబు పాపపు సొమ్ము వద్దని ఎదురు తిరిగితే
-
ఓటరు స్లిప్‌లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి ప్రవర్తిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఒటర్ల ఇంటికి వెళుతన్న టీడీపీ నేతలు ఓటరు స్లిప్‌లు తీసుకుంటున్నారని, ఓటర్లు ఇవ్వకపోతే వారిని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వెల్లంపల్లి, జోగి రమేష్, మల్లాది విష్ణు, కల్పలతార్డెఇ, హఫీజ్ ఖాన్లు కలిశారు. దీనిలో భాగంగా టీడీపీ ప్రలోభాలపై ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందజేశార. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటిసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. ఓటుకి పది వేలు రూపాయలు ఆశచూపిస్తున్నారు. ఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. గన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కే రక్షణ లేదు. అవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారు. దాడులు చేస్తాం...కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పోలీసులు...షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు. రికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరు. చంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టిడిపి వాళ్లు 5 వేలు నొక్కేస్తున్నారు. రేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలి. కాల్ సెంటర్ పెట్టాలి...స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ‘దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు. చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా?, ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు. గతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించారు. పులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. పులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం ... లోపలా... బయట...సిసి కెమెరాలు పెట్టాలని కోరాం. పులివెందుల,ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించారు. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైఎస్సార్సీపీనే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది మా పార్టీ జెండానే’ అని తెలిపారు. -
పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు: పేర్ని నాని
-
టీడీపీ రౌడీల దాడి పై కర్నూల్ DIG వ్యాఖ్యలు ఏకిపారేసిన పేర్ని నాని
-
డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ 'వైఎస్సార్సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది.ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారానికి దూరం కాగానే వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు. -
Perni Nani: ఏమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాల దాడి
-
నాపై కోపంతో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేయకండి
-
మీ పోరాటం రైతులకు ధైర్యం ఇస్తుంది.. అశోక్ బాబుని పరామర్శించిన పేర్ని నాని
-
ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్
-
Perni Nani: చంద్రబాబు ప్రభుత్వంలో వేల కోట్లు మద్యం వ్యాపారంలో దోపిడీ జరిగింది
-
లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే.. బాబు ఒంటి నిండా అవినీతి మరకలే
సాక్షి, తాడేపల్లి: లిక్కర్ కేసులో సిట్ కట్టు కథలకు అడ్డే లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాల అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండి వారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదన్నదే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫాంహౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఇదే ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా?. లిక్కర్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వారికి బెయిల్ వచ్చే సమయంలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. ఈ నగదును 2024 జూన్‌లో రాజ్ కేసిరెడ్డి దాచాడని చెప్తున్నారు. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి 100 రోజులు దాటింది. ఆయన్ని లిక్కర్ డాన్ అని ఎల్లోమీడియా అరెస్టు సమయంలో రాసింది. ఆయనో మేధావని, క్రిమినల్ అని, సూత్రధారి, పాత్రధారి అని ఏవేవో రాశారు. మరి అలాంటి వ్యక్తి.. రూ.11 కోట్లను నగదును పెట్టెల్లో దాచాడని ఇప్పుడు రాస్తున్నారుముదురు క్రిమినల్ అయితే గోవానుంచి హైదరాబాద్‌కి విమానంలో వస్తాడా?. తప్పించుకునే ఆలోచనలు ఉన్నవాళ్లు ఇలా చేస్తారా?. మరి అలాంటి ముదురు 2024 జూన్ నుంచి అట్టపెట్టెల్లో డబ్బు పెడతాడా?. కథలు తప్ప.. లిక్కర్ కేసులో ఇప్పటివరకూ సిట్ కొత్తగా చెప్పేదేముంది. మొత్తం.. 375 కోట్ల పేజీల డేటా మాయం అని ఈనాడు రాసింది. కాని అది అబద్ధమని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈకేసు మొదలైన నాటినుంచి ఇలాంటి కథలు ఈ కేసులో చెప్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలు. లేని లిక్కర్ స్కాంను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారులిక్కర్ వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతి అన్నారు.. ఇప్పుడేమో.. 3వేల కోట్లు అంటున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో ఒక్క పైసా అవినీతి లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రతి బాటిల్ మీద క్యూర్ కోడ్ ఉంటుంది, అమ్మగానే ఆ డబ్బును బ్యాంకుల్లో జమచేశామని వారే బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. .. అక్రమాలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉంది. చంద్రబాబుకు తనకు జారీ అయిన ఐటీ నోటీసులో ఏముందో తెలియదా?. లెక్కలు చూపని రూ.2వేలు కోట్లు గుర్తించామని కేంద్ర ఆదాయపు పన్ను శాఖ చెప్పలేదా?. తాను దొరక్కుండా తన పీఎస్ శ్రీనివాస్‌ను చంద్రబాబు దేశం దాటించలేదా?. అధికారంలోకి రాగానే ఆ పీఎస్‌ను రప్పించి తిరిగి పోస్టింగ్ ఇప్పించలేదా?. ఏ పాపం చేయలేదు కాబట్టే వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు చరిత్ర పాపాల పుట్ట.. .. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సంతకాలతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా.. సాక్ష్యం లేకుండా తప్పుడు లిక్కర్ కేసును సృష్టించారు. ప్రజల్లోకి వెళ్లడానికి జగన్‌కు ఓ రూల్.. చంద్రబాబు,పవన్, లోకేష్‌కు ఓ రూలా?. నెల్లూరులో 40 శాతం మందికి నోటీసులు ఇసస్తున్నారు. వైఎస్సార్, జగన్ ఫొటోలు ఉన్న ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు. చివరకు.. జగన్ ఫొటో స్టేటస్ పెట్టుకున్నా నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు సహా అందరికీ అర్థమైంది. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి నోటీసులు ఇస్తారా?. చంద్రబాబు ఉడత ఊపులకు జగన్ భయపడరు. జగన్‌ను ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఆయన్ని చూడగానే ప్రజలకు ఓ ధైర్యం వస్తుంది’’ అని పేర్ని నాని అన్నారు.ఇదీ చదవండి: జగన్ అడుగులే.. పిడుగులయ్యాయా? -
పేర్ని నాని, అనిల్ కుమార్ పై కేసులు వైఎస్ జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
కేసులు పెట్టుకోండి.. కోర్ట్‌లో తేల్చుకుంటాం
-
Perni Nani: ఆయనొక పగటి వేషగాడు హారిక జోలికొస్తే.. తాట తీస్తాం
-
వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్‌బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్ డైరెక్షన్‌తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్పర్సన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు. -
సొల్లు కబుర్లు.. కూటమి బూతులు
-
ఎవడొస్తాడో రండిరా.. కొడాలి నాని వస్తున్నాడు.. లోకేష్ కు పేర్ని నాని వార్నింగ్
-
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్
సాక్షి,కృష్ణాజిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనొద్దని నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్‌లో చెప్పా.నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. 8వ తేదీన మాట్లాడితే 12వ తేదీన టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో నాపై డిబేట్లు పెట్టారు. పచ్చ పార్టీ మహిళలతో నన్ను బూతులు తిట్టించారు.చీకట్లో నేను తలలు నరికేయమన్నానని టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరమా...అతని కొడుకు లోకేష్ తరమా?రోజులు లెక్కపెట్టుకో కొల్లు రవీంద్ర. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ కన్నీరు మీ పచ్చ సైకోలను ఇంటికి పంపించడం ఖాయం.ఓయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినడం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినడం లేదు.బందరు బీచ్‌లో ఇసుక తింటున్నావ్..నువ్వు అన్నం తినడం లేదు.తోట్ల వల్లూరులో ఇసుక తింటున్నావ్.. నువ్వు అన్నం తినడం లేదు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయలు లేదు. కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు కోట్ల రూపాయల డబ్బులెక్కడివి. కొల్లు రవీంద్ర నీ దోపిడీ బందరును దాటి కృత్తివెన్ను వరకూ పాకింది.ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’అని హెచ్చరించారు. -
కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి,కృష్ణాజిల్లా: మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. ‘ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్ధించడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్రను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? తన భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త అయినా ఎలా స్పందిస్తాడో ఉప్పాల రాము కూడా అలాగే స్పందించాడు. హారిక కంట్లో కారిన ప్రతీ కన్నీటి చుక్కకు దేవుడు.. కాలమే సమాధానం చెబుతాడు. ఉప్పాల హారికకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం. మమ్మల్ని దాటుకునే ఎవరైనా మీ వరకూ రావాలి’అని స్పష్టం చేశారు. -
పేర్ని నానిపై అక్రమ కేసులు
-
పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ నేతల ఫిర్యాదులతో పేర్ని నానిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై కేసులు నమోదు చేశారు.టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. జీరో ఎఫ్ఐఆర్ కింద పేర్ని నానిపై 353(2), 196(1) సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు.అంతకుముందు పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. -
మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. సమావేశంలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. -
రప్పా రప్పా వ్యాఖ్యలపై పేర్ని నాని క్లారిటీ
-
జగన్ కొన్న స్కూల్ బెంచ్ అందమైన క్లాస్ రూమ్.. దానికి నీ కొడుకు పేరు పెట్టాడనికి సిగ్గుండాలి
-
కొంతమందికి కూలీ ఇచ్చి వైఎస్ జగన్ ను తిట్టిస్తున్నారు
-
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్‌ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్‌కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్‌కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్‌ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు. -
బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ @పామర్రు
-
మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. టీడీపీని ఏకిపారేసిన పేర్ని నాని
-
ముగ్గురు మూర్ఖులు.. జనం సొమ్ముతో సోకులు
వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని, అలాంటిది ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్‌ను ఆపగలిగారా? అని ప్రశ్నించారాయన. సాక్షి, కృష్ణా జిల్లా: కూటమి నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు చూసేవాళ్లుగానీ, వినేవాళ్లుగానీ లేకపోవడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని అన్నారాయన. బుధవారం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చిన కష్టం దేశంలో ఎక్కడ చూడలేదు. 164 సీట్లతో గెలిచానని కూటమి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. హెలీకాప్టర్లు , ప్రత్యేక విమానాల్లో తమ భార్య పిల్లల వద్దకు తిరుగుతున్నారు. కూటమి నేతలు జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారు. అయితే రైతుల కష్టాలు చూసేవాడు కానీ...వినేవాడు కానీ లేకపోవడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకని పరిస్థితి. పెసలు , మినుములు కొనేవాడు లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల వద్దకు జగన్ మోహన్ రెడ్డి వెళ్తానని చెప్పే వరకూ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బ్రతికే ఉన్నారా?. కర్ణాటక కేంద్రమంత్రికి ఉన్న స్పృహ కూడా ఈ రాష్ట్రానికి లేదు. ఇప్పుడు.. 3.5 లక్షల టన్నులు కొన్నామని అబద్ధాలు చెబుతున్నారు. నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు.. ఎవరికిచ్చారు?. ఒక్క రైతుకైనా ఇచ్చినట్లు చూపించండి. ముగ్గురు మూర్ఖులు కలిసి వైఎస్ జగన్‌ను ఇవాళ ఆపగలిగారా?. జగన్ వెళ్తుంటే మార్కెట్ యార్డు మూసేశారు. రైతులను... పంటను కొనే వ్యాపారులను రావొద్దని ఆపేశారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయండి అని కూటమి నేతలకు పేర్ని నాని సవాల్ విసిరారు. -
‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్ జెండా వదిలేదే లేదు’
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు. -
Perni Nani: నా ఇంటికి పోలీసులు అంటించిన పోస్టర్.. మీ బెదిరింపులకు బయపడటానికి..
-
వల్లభనేని వంశిని పరామర్శించిన కొడాలి నాని
-
ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని
-
‘పవన్.. నీదే టెంట్‌హౌజ్ పార్టీ.. కనీసం నీ శాఖ గురించైనా తెలుసా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి పేర్నినాని. ఏపీలో పోలీసు వ్యవస్థ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. బాబు రావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా?. టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగ మల్లేశ్వర రావు చేసిన నేరమా?. ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు.. ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ర్టంలో నరరూప రాక్షసులు రాజ్యం ఏలుతున్నారు. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండాల్సిన ఖాకీలు సైలెంట్ అయిపోయాయి. ఒక ముఖ్యమంత్రి గా అందరికీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయొద్దంటున్నారు. దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు ఇలా చేయటం సబబేనా?. వైఎస్సార్సీపీ వారిపై దాడులు చేయండి, పోలీసులు అండగా ఉంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగింది. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్లుగా ఆ గ్రామంలో సర్పంచ్‌గా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ కుటుంబమంతా రాక్షసులైతే జనం ఇన్నేళ్లుగా ఎలా గెలిపిస్తున్నారు?. ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వర రావుపై హత్యాయత్నం చేశారు. బాబూరావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవల వలనే నాగ మల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు. నిజానికి బాబూరావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగ మల్లేశ్వరరావు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారుమన్నవ గ్రామంలో వైఎస్సార్సీపీదే హవా. దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలకు కారకులెవరో అందరికీ తెలుసు. ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని ధూళిపాళ్ళ కోరుకుంటున్నారు?. రప్పా రప్పా అని పోస్టర్ పట్టుకున్నోడిపై కేసులు పెట్టినవాళ్లు మరి నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు.పవన్ కళ్యాణ్ చెబితేనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మరి ఆయన దగ్గరకు వెళ్దామంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు . చంద్రబాబుకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు, చెల్లెలు కలుగులో నుండి వస్తారు. మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా? జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ. చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పవన్ పార్టీ పెట్టారు.వైఎస్ జగన్‌ని అధికారంలోకి రానీయను అనటానికి పవన్ ఎవరు?. 2019లో కూడా జగన్‌ని అధికారంలోకి రానీయనని పవన్ అన్నారు. మరి ఏమైంది?. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు. సుగాలీ ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు. కనీసం కార్యకర్తలను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. హెలికాఫ్టర్‌లో పిల్లల్ని తీసుకుని తిరగటం తప్ప పవన్‌కి ఇంకేం తెలుసు?. కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్‌కి తెలియదు.పంచాయతీలకు రావాల్సిన రూ.2,800 కోట్లను ప్రభుత్వం పక్క దారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపటం లేదు?. రేషన్ బియ్యం షిప్పుల కొద్దీ బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. తిరుమలలో రోజూ అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయటం లేదు?. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించటం లేదు?. హెలికాఫ్టర్‌లో ప్రకాశం జిల్లాకు వెళ్లిన పవన్‌కి కరేడులో రైతుల సమస్యలు కనపడటం లేదా?. మీ ప్రభుత్వం 8 వేల ఎకరాలను మీ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంటే ఏం చేస్తున్నారు?.రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విధానాలు బాగ లేవంటూనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు?. చంద్రబాబు, లోకేష్ లకు సిగ్గు లేదా?. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వల్లభనేని వంశీని పరామర్శించిన పేర్ని నాని
-
నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికుంది.. పేర్ని నాని మాస్ వార్నింగ్
-
వంశీని జైల్లో పెట్టి.. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు
-
వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది: పేర్ని నాని
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన. సాక్షి, ఎన్టీఆర్: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు. అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్‌ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు. -
వల్లభనేని వంశీ విడుదల.. పేర్ని నాని రియాక్షన్
-
తండ్రి 420.. కొడుకు 840... అబద్ధాలు: Perni Nani
-
‘ఏడాదిలోనే చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల రూ.1.62 లక్షల కోట్లు’
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘ఓట్ల కోసం కూటమి నేతలు,ఎల్లో మీడియా వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు,లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు,పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని.. చంద్రబాబు,లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేశారు’అని ఆరోపించారు. -
పేర్ని నానికి భారీ ఊరట
సాక్షి, అమరావతి: ఇళ్ల పట్టాల కేసులో మాజీమంత్రి పేర్ని నానికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని వివరణ తీసుకోకుండా ఎలాంటి కేసు నమోదు చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాల అంశంలో తనపై ఆరోపణలు రావడంపై ఆయన హైకోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. అయితే ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు ఇవాళ కోర్టుకు వివరించారు. ఈ తరుణంలో.. ఒకవేళ భవిష్యత్‌లో ఈ అంశంపై కేసు కడితే పేర్ని నాని వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పేర్ని నాని వాదన పూర్తిగా విన్న తర్వాతే ప్రభుత్వం విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో తనపై చర్యలు తీసుకోకుండా జూన్ 11, 2025న పిటిషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలో అర్హులకే పట్టాలు ఇచ్చారని, తనకు, తన కుమారుడు పేర్ని కిట్టూకి ఈ వ్యవహారంలో ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. -
అభిమానం అంటే ఇదేనేమో.. జగన్ కు సైనికుడిలా పేర్ని నాని
-
పేర్నినానికి అరెస్టు వారెంట్ జారీ అంటూ తప్పుడు ప్రచారం..
సాక్షి,కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నానిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి దిగింది. 2019 నాటి కేసులో పేర్నినానికి మచిలీపట్నం కోర్టు ఆరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తేటతెల్లమైంది. ఓ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాల్సిన పేర్నినానిని..మరుసటి వాయిదాకు హాజరవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఏముందో చూడకుండా అరెస్ట్ వారెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఎల్లోమీడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అరెస్ట్ అంటూ ఎల్లో మీడియాలో పిచ్చి వార్తలు ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
ఇళ్ల పట్టాలకోసం జగన్ దగ్గరకు వెళ్తే నాతో అన్న మాట...
-
అందుకే కాకాణిపై కేసులు.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
మానసికంగా ఆ రోజే చచ్చిపోయా.. కానీ... పేర్నినాని ఎమోషనల్
-
మానసికంగా ఆరోజే చచ్చిపోయా.. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్సార్సీపీ కేడర్‌పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని) అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయయారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏవిధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ‘‘కూటమి మాయమాటలతో.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి గద్దె నెక్కింది. జూన్ 4వ తేదీన గెలిచి 12వ తేదీ (2024 అసెంబ్లీ ఫలితాలను ఉద్దేశించి) దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం.. ఈ మధ్య రోజుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే!. టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి. జగన్ జెండా మోసిన ప్రతీ కార్యకర్త ఇంట్లోకి జువ్వలు, టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. నాటి మొదలు.. అక్రమ కేసులు పెడుతున్నారు. 2019 నుండి 24 మద్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసారని కాకాణి గోవర్దన్‌పై తప్పుడు కేసు పెట్టారు. కొడాలి నాని బందర్లో ఎవరో తలలు పగలుకొట్టారని కేసు పెట్టారు. నా మీద , నా భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారు. నేను, నా అత్త మామలు కలిసి అద్దెకు ఇవ్వడానికి ఆ గోదాములు కట్టాం. నేను నమ్మిన వ్యక్తిని అక్కడ పెడితే.. ప్రభుత్వ ఉద్యోగులు, అతను కలిసి తప్పు చేశారు. గోదాములు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. బస్తాలు తరలింపులో తేడా వస్తుందని ఆ వ్యక్తి చెప్పాడు. తేడా వచ్చిన ఆ సొమ్ము కడతామని చెప్పాం. దీంతో జాయింట్ కలెక్టర్ లెటర్ రాసుకున్నారు. లెటర్ పైకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలైంది. గోదాములో బియ్యం షార్టేజ్ ఉంటుందని, ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. రూ. కోటి 80లక్షలు కట్టాలని చెబితే.. కోటి రూపాయలు అదే రోజు కట్టేశాం. మిగిలింది రెండు రోజుల్లో కడతామని చెప్పాం. కానీ అనూహ్యంగా అదే రోజు క్రిమినల్ కేసు పెట్టారు. ఆంధ్రజ్యోతిలో వార్త వొచ్చిందనే కేసు పెట్టారు. 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుకున్నామని ‘సీజ్ ద గోడౌన్’ అన్నారు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టి వదిలేయని చెప్పింది. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కేసులు(అదీ క్రిమినల్ కేసులు) లేవు.. ఒక్క నా మీద తప్ప. నా దగ్గర పని చేసే వ్యక్తే నన్ను ముంచేశాడని తర్వాతే తేలింది. నా పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. మానసికంగా ఆరోజే చచ్చిపోయా. నా భార్యను పిలిచి సీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ టైం నడుస్తోంది.. నడవనివ్వండి.. కచ్చితంగా మాకు ఒక రోజు టైం వస్తుంది అనుకున్నా. నా భార్యకు బెయిల్ వొచ్చే వరకు మాట్లాడవొద్దని లీగల్ టీం కోరింది.. ఆ మేరకే మాట్లాడడంలేదు. రాజకీయాల్లో తిరిగే వాళ్ల భార్యల పేరుతో బిజినెస్‌లు పెట్టొద్దు. నా భార్యని తీసుకొని రెండు రోజులుగా తిరుగుతూనే ఉన్నా. ఈ మధ్య.. ‘నకిలీ ఇళ్ల పట్టాల కధ కంచికేనా?’ అని ఈనాడు లో వార్త రాశారు. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోంది. 2019 ఎన్నికల్లో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పబ్లిక్ మీటింగ్‌లో మచిలీపట్నంకు సంబంధించిన ఒకటి పోర్ట్.. రెండోది ఇళ్ల పట్టాలు సమస్య చెప్పాం. అధికారంలోకి రాగానే రైతుల నుండి నవ్వుతూ భూములు తీసుకోవాలని నిర్ణయించాం. గిలకలదిండిలో స్థలాలు ఇవ్వాలంటే కోర్టు కేసు వేశారు. అయినా కూడా 15వేల 400 మందికి పట్టాలు ఇచ్చాం. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉంటున్న వాళ్లలో 819 మందికి ఇచ్చాం.అది బందరులో అచ్చు అయిన పట్టా. 19,410 మందికి పట్టాలు లబ్ది దారులకు ఆన్లైన్ అయి.. సచివాలయం నుండి మున్సిపల్, అక్కడ నుండి ఆర్డీవో, జాయిట్ కలెక్టర్ , సీసీఎల్ లో అప్రూవ్ అయ్యింది. అప్లికేషను నంబర్ల నుంచి వాటి నరిహద్దులతో సహా ఆన్లైన్లో అన్ని వివరాలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పట్టాలు పంచినప్పుడు.. నకిలీ పట్టాలు ముద్రించాలిన అవసరం ఏముంది?. 500 ఎకరాలు అమ్మిన ప్రతి రైతు దగ్గరకి పోలీసులు వెళ్తున్నారట. ఎంతకు అమ్మారు.. పేర్ని నానికి కమిషన్ ఇచ్చారా? అని అడుగుతున్నారట. ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్లో వేస్తామని అన్నారుగా. మరి ఇప్పటిదాకా ఎందుకు వేయలేకపోయారు?. నేను పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు?. ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్వి కాదని చెప్పే దమ్ముందా? ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమేనా? అని పేర్ని నాని ప్రశ్నించారు. -
కార్యకర్తలతో పేర్ని నాని కీలక భేటీ
-
Perni Nani: మంది సొమ్ముతో మజా..
-
Perni Nani: మీ వల్ల ప్రతి ఇంట్లో ఎన్ని దీపాలు ఆగాయో తెలుసా?
-
రాష్ట్ర ప్రజల ఉసురుతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది
సాక్షి,గన్నవరం: పథకాలు అడిగితే ఖజానా ఖాళీ అంటారు. లోకేష్, పవన్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడడానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడటానికి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు. ప్రశ్నిస్తే నోరుమెదపరని కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు.వెన్నుపోటు దినం కార్యక్రమంలో పేర్నినాని మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. వైఎస్ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేసారు.ఉచిత బస్సు తుస్సు మంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి.పనులు పూర్తి అయినవి బిల్లులు ఇంకా రాలేదు.పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది.. రూపాయి లేదని చెబుతారు. ప్రజల సొమ్ముతో విలాస జీవితం గడుపుతారు. భార్య పిల్లల్ని చూసేందుకు, దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్‌లో కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు.ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు.దేవుడి ఆస్తి ని కూడా నామినేషన్ పద్దతిలో అద్దెకు 99 ఏళ్లకు ఇస్తామని అంటున్నారు. అన్ని మతాలు మావే అని ఇప్పుడు హిందువులు కు మాత్రమే అంటున్నారు. ప్రధాని మోదీని,ఆయన సతీమణినీ తిట్టిన చంద్రబాబుకు పవన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.లోకేష్ ధగాకోరు అవినీతి పరుడు అన్న పవన్ చంద్రబాబు మరో 15ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. లక్ష కోట్లు అప్పు చేసి రాష్టాన్ని అప్పుల పాలు చేసిన కూటమి దిగిపోవాలి. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధం అన్న నేత చర్చ కు రమంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు.2019లో ఇళ్ల దొంగపట్టాలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? తప్పు ఉంటే ఎమ్మార్వోని జైల్లో వేయాలన్నారు. వంశీపై తప్పుడు కేసు పెట్టాడు. ఆస్తి తగాదాలో ఇప్పుడు వంశీపై కేసుపెట్టారు. వంశీపై 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజల అగ్రహావేశాలలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. -
సిగ్గు లేదు మీకు! కౌంట్ డౌన్ మొదలైంది.. గుర్తు పెట్టుకో చంద్రబాబు
-
వంశీ బయటకి వస్తాడు.. ఇక్కడి నుండే పోటీచేస్తాడు
-
‘న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోంది’
కృష్ణాజిల్లా: 115 రోజులుగా వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. చంద్రబాబు,లోకేష్ యముడిపాత్రలో ఉంటే సతీ సావిత్రిలాగా వంశీని ఆయన భార్య కాపాడుకుంటోందన్నారు పేర్ని నాని. న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోందని పేర్ని నాని తెలిపారు. వంశీ బయటకు రావడం, గన్నవరం ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఎప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారన్నారు పేర్ని నాని.ఈరోజు(శనివారం) కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ‘ వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు,కైలే అనిల్ కుమార్ , మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కిట్టు,పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి , గుడివాడ, గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘అధికార మదం చూపించుకోవాలనే వంశీపై తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు పెట్టారు. 14 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. 9 ఏళ్ల క్రితం వంశీ తనకు అన్యాయం చేశారని ఒకరు. వంశీ మీద ఒక కేసు తర్వాత మరో తప్పుడు కేసు బనాయిస్తున్నారు. దేవుడున్నాడు...న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందని ఆశతో ఉన్నాం.ఎన్ని తప్పుడు కేసులుపెట్టినా అంతిమంగా న్యాయం దొరుకుతుంది పోరాడుతున్నాం. చంద్రబాబు, లోకేష్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించి వంశీని ఏదోఒకటి చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే అనారోగ్యం వస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వగానే ఫైల్స్ వస్తాయి..ఆపరేషన్ చేయించుకోవాలి. చంద్రబాబు ఆరోగ్యం నాశనమైందని కారణం చూపించి బెయిల్ పై బయటికొచ్చారు. జైలు నుంచి బయటికొచ్చాక ఒక్క రోజు కూడా ఆసుపత్రికి వెళ్లలేదుచంద్రబాబు బెయిల్ పైన బయటికి వచ్చిన దగ్గర్నుంచి రోజూ చేసింది కుట్రరాజకీయాలే. ఈ ప్రభుత్వం పై పోరాడేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఈ కూటమి మోసాలను అడ్డుకునేందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబు తప్పుడు హామీలతో గెలిచి ప్రజలను మోసం చేస్తున్నాడు.పిల్లల చదువుల పై కూడా రాజకీయాలు చేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టుపెట్టుకోవాల్సి వస్తోంది. జూన్ 4వ తేదీన గన్నవరంలో వెన్నుపోటు దినం నిరసన తెలియజేస్తాం. రాష్టంలోని అన్ని ప్రాంతాల కంటే మిన్నగా గన్నవరంలో నిరసన చేపడతాం. వంశీ లేకపోయినా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలో విజయవంతం చేస్తాం. దేవాలయాల ఆస్తులన్నీ టిడిపి నేతల చేతుల్లోకి పోతున్నాయ్. విద్యాశాఖ మంత్రికి మాటలెక్కువ చేతలు తక్కువ. పదవ తరగతి మూల్యాంకనమే ఆ శాఖామంత్రి పని తీరుకు నిదర్శనం’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
‘చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయం’
సాక్షి,తాడేపల్లి: పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారంటూ’ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం.. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారు?. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్యపోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్సార్సీపీ జెండా పట్టుకున్నారా?. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా?. ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ అని ఎలా చెప్తారు?.అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడులాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా?. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే అక్కచెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా?. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు?. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు?. నారా లోకేష్ తన తాత ఖర్జూరనాయుడు అని ఎందుకు చెప్పుకోలేక పోతున్నారు?. ఇలాంటివేమీ మేము అడగ దలచుకోలేదు.రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని దియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలీదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదురాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది?. పోలీసులందరినీ వైఎస్సార్సీపీ నేతలను వేధించటానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోంది. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులను వాడటం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సరకాలంగా ఎందుకు అమలు చేస్తున్నారు?.పవన్ సినిమా వచ్చే ముందు ధియేటర్లలో విచారణ చేయటానికి సిగ్గు లేదా?’ అని వ్యాఖ్యానించారు. -
పల్నాడు జిల్లాలో టీడీపీ హత్య రాజకీయాలు: Perni Nani
-
ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani
-
సినిమా వాళ్లను బెదిరిస్తారా? పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని ఫైర్
తాడేపల్లి: చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఏపీ లోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్.. అందరికీ బాస్ అని చెప్పుకునే మోదీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలా అని సిగ్గు పడుతున్నారు. కడపలో జరిగేది మహానాడా.. దగానాడా.. వాళ్ళే చెప్పాలి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు.. ఇప్పుడు టీడీపీ వేరని కార్యకర్తలు ఏడుస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ మూటలు కట్టుకుంటున్నారు. ఒక చిన్న మూట ఇంకొకరికి ఇస్తున్నారు. పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుంది. కస్టోడియల్ టార్చర్‌కి ఏపీ పోలీస్ స్టేషన్లు వేదికలుగా మారిపోతున్నాయి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.‘‘లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. ఇప్పుడు లేని లిక్కర్ కేసును సృష్టించారు. లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్లోకి తెచ్చారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెచ్చారు. ఆ తర్వాత జగన్ పేరు తెస్తారు. ఇసుమంత కూడా బిడియపడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రోజుకో కథ వండి వారుస్తున్నారు. లక్షల కోట్ల పేజీల మెమరీ డిలీట్ చేశారని ఎల్లో మీడియా రాయిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినందున జగన్‌ని కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్షసాధిస్తున్నారు. జైలులో కూడా ఆయన నిత్య పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు. అరెస్ట్ అప్పుడే అన్నీ వెతికారు కదా.. మళ్ళీ ఇప్పుడు సోదాలు ఎందుకు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు...రాజ్యమే ప్రజలను హింసిస్తే ఆ ప్రజల ఆగ్రహంలో పాలకులు కొట్టుకుపోతారు. చంద్రబాబు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానంలో వెళ్లి తెచ్చుకుంటున్నారు. జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను.. నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఆ సొమ్మంతా ఏం చేశారు?. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇంట్ కరెంట్ కోసం యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నారు. జగన్ తన ప్రభుత్వంలో తక్కువ రేటుకే ప్రజలు సినిమాలు చూడాలి అని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్‌ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారు...అప్పుడు ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా..?. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా?. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా..?. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి.. సినిమా వాళ్ళను బెదిరించటానికి మీరు ఎవరు..?. అసలు వాళ్ల సమస్య ఏంటో తెలుసా మీకు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. -
వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్
-
వంశీని బలిగొనేందుకు బాబు సర్కార్ యత్నం: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్‌కు తరలించారని.. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని.. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘వంశీని బలి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. వంశీకి ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా కానీ.. చికిత్స అందించడం లేదు. చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతాం. సీఐ భాస్కర్ రావు అయిన, ప్రభుత్వం ఆసుపత్రి సూపరిండెంట్ అయిన ఎవరిని వదిలిపెట్టం’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు.న్యాయ పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ అరుణ్కుమార్వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం.. వంశీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్తాం. నిలబడలేని మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. -
వల్లభనేని వంశీని చంపేస్తారా..!
-
వల్లభనేని వంశీకి అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు
కంకిపాడు: విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు. కస్టడీ నిమిత్తం వంశీని కంకిపాడు తీసుకొచ్చారు. కస్టడీ అనంతరం స్టేషన్లోనే ఉంచారు. అస్వస్థతకు గురి కావడంతో వంశీని కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండికానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశాడంట. అప్పుడేమో చంద్రబాబుకి.. లోకేష్ కి సమ్మగా ఉందంట.. ఇప్పుడేమో పగలదీస్తారంట. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరు. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవలేకుండా చేస్తున్నారు. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారు. రేపైనా ఇలాగే ఉంటుంది. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వాసుపత్రి నుంచి వంశీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం వంశీని పోలీసులు కస్టడీకి తరలించారు.కంకిపాడు పీఎస్‌లో వంశీ విచారణ బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆరోపణలపై నమోదైన అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్‌ను శుక్రవారం కంకిపాడు పోలీసుస్టేషన్లో పోలీసులు విచారించారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీని 2 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. -
వల్లభనేని వంశీ కేసు కోసం ఢిల్లీ బాబాయ్ కి 2 కోట్లు ఖర్చుపెట్టారు..
-
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్‌ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.‘‘బ్రీఫ్డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్‌కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్‌ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్‌తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్‌లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
విడదల రజిని ఘటనపై పేర్ని నాని వార్నింగ్
-
‘విడదల రజిని పట్ల సీఐ ప్రవర్తన కరెక్ట్ కాదు’
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.నాపై సీఐ దౌర్జన్యం చేశారు..వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
పిఠాపురం లో దళితులు గ్రామ బహిష్కరణ చేస్తుంటే... అనితకు పేర్ని నాని దిమ్మదిరిగే కౌంటర్
-
ఎన్నికలముందు కారు టాప్‌పై ఇప్పుడు హెలికాప్టర్లో పవన్ పై పేర్ని నాని సెటైర్లు
-
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కలిశారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే సంగతిని పంకజశ్రీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తన భర్త వంశీపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్నారని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. పంకజశ్రీ వెంట వైఎస్సార్ సీపీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురామ్ లు ఉన్నారు. -
Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు
-
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
మచిలీపట్నంలో మంత్రి కనుసన్నల్లో మట్టి దందా.. ఏకిపారేసిన పేర్ని నాని
-
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. పేర్నినాని ఫైర్
-
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
సాక్షి, కృష్ణాజిల్లా: వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ ఇంటిపై గత అర్ధరాత్రి టీడీపీ రౌడీలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అబూ ఇంటి అద్దాలను టీడీపీ నేతలు పగలగొట్టారు. పార్టీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న ఆ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని.. అబూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధ్వంసమైన ఫర్నిచర్‌ను ఆయన పరిశీలించారు. టీడీపీకి చెందిన కొందరు తమ ఇంటి వద్ద భయాందోళన సృష్టిస్తున్నారంటూ పేర్ని నాని వద్ద అబూ తల్లి బేగం ఆవేదన వ్యక్తం చేశారు.అబూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ పేర్ని నాని, వైఎస్సార్సీపీ శ్రేణులు భరోసా ఇచ్చారు. టీడీపీ నేత కడియాల గణేష్, మరికొందరు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ అబూ ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ డీఎస్పీకి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకుంటే, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ పేర్ని నాని హెచ్చరించారు.గుడివాడలో రౌడీ రాజ్యం: పేర్ని నానివక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేంగా సమావేశం పెట్టడానికి వీల్లేదని అబూని టీడీపీ నేత కడియాల గణేష్ హెచ్చరించాడు. నా ఆదేశాలు ఖాతరు చేయకుండా మీటింగ్ పెడితే నీ అంతుచూస్తానని బెదిరించాడు. గణేష్ హెచ్చరించినా అబూ మీటింగ్‌కు హాజరయ్యారు. ముస్లింలు సమావేశం పెట్టినందుకు ఓ ఎస్ఐ వచ్చి కమ్యూనిటీ హాల్‌కు తాళం వేశారు. పోలీసు యూనిఫామ్ వేసుకుని కొందరు అధికారులు వ్యవస్థలను దిగజారుస్తున్నారు. ఇలాంటి పోలీసులను జిల్లా ఎస్పీ, డిజిపి అదుపులో పెట్టుకోవాలిపదిమంది ముస్లింలు కలిసి మీటింగ్ పెట్టుకోకూడదని ఏమైనా చట్టం ఉందా?. ముస్లింలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?. కమ్యూనిటీ హాల్‌కు తాళం వేయడంతో రోడ్డుమీదే ముస్లింలు మీటింగ్ పెట్టుకున్నారు. గత రాత్రి అబూ ఇంటిపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఐరన్ రాడ్లతో అబూ ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. అబూను చంపేస్తామని టీడీపీ రౌడీలు బెదిరించారు. గుడివాడలో రౌడీ రాజ్యం నడుస్తోంది.. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశాం. -
చంద్రబాబుని ఇమిటేట్ చేసిన పేర్ని నాని..
-
Perni Nani: వక్ఫ్ సవరణ బిల్లు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతోంది
-
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
గోరంట్ల మాధవ్ కేసులో పోలీసుల సస్పెండ్.. పేర్ని నాని రియాక్షన్
-
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు... లావు శ్రీకృష్ణదేవరాయులపై పేర్ని నాని ఫైర్
-
వైఎస్ జగన్ పై వంగలపూడి అనిత వ్యాఖ్యలకు దిమ్మతిరిగేలా పేర్ని నాని కౌంటర్
-
Perni Nani: చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు
-
ఇవేం డ్రామాలు బాబూ?: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రాజకీయాల్లో డ్రామాలు ఆడాలంటే చంద్రబాబును మించినవారు లేరంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శలా?. చంద్రబాబు సంస్కారం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.శుక్రవారం.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెన్నుపోటు రాజకీయాలు కాదు.. ప్రజలు అధికారం ఇవ్వాలని వైఎస్ జగన్ చెబుతుంటారు.. సిర్థమైన, బలమైన అభిప్రాయం ఉన్న నాయకుడు వైఎస్ జగన్’’ అని పేర్ని నాని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల మీద పడి కూటమి నేతలు హింసకు పాల్పడుతున్నారు. హత్యలకు కూడా తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు, మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. హెలికాఫ్టర్ మీదకు వైఎస్సార్సీపీ నేతలు ప్రజలను పంపారా? బాబూ ఇవేం మాటలు?. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, క్యాంప్‌లు పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అభిమాన్యుడు కాదు.. అర్జునుడు లాంటి వాడు మా లీడర్. చంద్రబాబు కుట్రలను చీల్చి చెండాడుతాడు’’ అని పేర్ని నాని చెప్పారు.‘‘డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు. జైల్లో ఉన్నప్పుడు ఎన్ని రకాల డ్రామాలు వేశాడో అందరికీ తెలుసు. ఆయన శరీరంపైన పొక్కులు వచ్చాయనీ, డీహైడ్రేషన్ వచ్చిందనీ, దోమలతో కుట్టించి చంపే ప్రయత్నం చేశారనీ డ్రామాలు ఆడారు. రాజకీయాల్లో డ్రామాలు, నాటకాలు చంద్రబాబుకే చెల్లు. డీసీజీఏ కూటమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. వారి దగ్గర నుండి హెలికాఫ్టర్ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చుకదా?. మీడియా ముసుగులో ఈనాడు పాపపు రాతలు రాస్తోంది. రామోజీరావు సంస్మరణ సభకి వచ్చిన జనానికి ఎంత డబ్బులు ఇచ్చి రప్పించారు?. సంస్కారం మరిచి వార్తలు రాయటం ఈనాడుకు అలవాటు..అధికారం టీడీపీ దగ్గర ఉంది, జనం జగన్ దగ్గర ఉన్నారు. హెలికాఫ్టర్ దగ్గర వరకు జనం వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. 2019 ఎన్నికల సమయానికి కూడా జగన్ ప్రతిపక్ష నేతే. అయినప్పటికీ ఈసీ గట్టిగా పనిచేసినందున జగన్‌కు భద్రత కల్పించారు. ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉన్నందున ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఖాకీల్లో 90 శాతం మంది జాగ్రత్తగానే పని చేస్తున్నారు. మిగతా పది శాతం దిగజారి వ్యవహరిస్తున్నారు. హోంమంత్రి అనిత హుందాతనం మరిచి ఎకసెక్కాలు చేస్తున్నారు..పదవులు శాశ్వతం కాదని ఆమెకి త్వరలోనే తెలుస్తుంది. చంద్రబాబు, పవన్, లోకేష్ అనునిత్యం జగన్ నామస్మరణ చేస్తునారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పుడు నిత్యం ఆయన గురించే ఎందుకు కలవరిస్తున్నారు?. ఖాకీ చొక్కా పరువు తీస్తున్న పోలీసులు ఆ ఉద్యోగానికి అనర్హులు. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి పోలీసులు మైక్ ఇచ్చి జనాన్ని కంట్రోల్ చేయించారు. అదే తోపుతుర్తి మీద అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టినవారిని ఏం అనాలి?. ఇలాంటి పను వలనే ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది. ఇప్పటికే ప్రాణ భయంతో జనం ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వారికి రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. అలాంటప్పుడు ఇది దిక్కుమాలిన ప్రభుత్వం కాక మరేమిటి?..టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలికి సిగ్గుఎగ్గూ లేదు. చంద్రబాబూ మీ ఆలోచనాతీరు మార్చుకోండి. సర్పంచ్ స్థాయి లేని వ్యక్తులకు కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించటం చంద్రబాబుకే చెల్లింది. జగన్ ప్రాణాలకు కేంద్రమే రక్షణ కల్పించాలి. కూటమి నేతలకు దుర్మార్గపు ఆలోచనలు పెరిగిపోయాయి. కొల్లి రవీంద్రకు అత్యధిక ఆదాయం వచ్చే శాఖలను కేటాయించారు. ఆయనకు సంచులు మోసే పదవి ఇచ్చారు. కానీ సంచులు కట్ చేసి దోచుకుంటున్నందునే ఆయన ఓఎస్డీని తొలగించారు. త్వరలోనే రవీంద్ర పదవి ఉండటం కూడా ఖాయమే. వీళ్ల అవినీతి, వేధింపులు తట్టుకోలేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలవుపై వెళ్లాడు.టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతే చంద్రబాబు, పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు గుడులు కూల్చితే జగన్ వాటిని తిరిగి నిర్మించారు. చంద్రబాబు రథాలను తగలపెట్టిస్తే జగన్ దాన్ని పునఃనిర్మాణం చేశారు. రాజకీయాల కోసం దేవుళ్ల తల నరికించితే తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసింది జగన్. హైందవ ధర్మాన్ని నిలపెట్టింది వైఎస్ జగన్’’ అని పేర్ని నాని తెలిపారు. -
Perni Nani: కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది
-
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.ఆ ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌లు విషం వైఎస్సార్సీపీ హయాంలో వరుసగా ఐదేళ్లు మదం పాలసీపై చంద్రబాబు, పవన్ విషంకక్కారు. చంద్రబాబు,పవన్,లోకేష్ బూటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులైపారిస్తున్నారు, గ్రామాల్లో పచ్చచొక్కాలు మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్తీమద్యాన్ని అమ్ముతోందని విషపు ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీమద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు’ అని నిలదీశారు.ఇది కూడా తిరుపతి లడ్డూ కల్తీ మాదిరి తప్పుడు ప్రచారమేనాలడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా?, అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు... తగలబెట్టారు...దాడులు చేశారుమద్యం కల్తీదోకాదో ఎందుకు టెస్ట్ లు చేయించలేదని ప్రశ్నిస్తున్నా. ఒక్క డిస్టిలరీ మీదైనా చర్య తీసుకున్నారా ?, రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారుకేరళ ,బెంగుళూరు మద్యమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు. చెప్పిన మాట అమలుకాకపోతే చొక్కాపట్టుకోమన్నాడు డిఫ్యాక్టర్ సీఎం. చొక్కాపట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచే కనిపించడుఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం ,సీఎం కొడుకు..డిఫ్యాక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు,జ్యోతికి చేతులు రావా.. ఈ రాష్ట్రానికి లోకేష్ నాయుడు అనధికార ముఖ్యమంత్రి కుప్పం,పిఠాపురం,మంగళగిరిలో మద్యం ఏరులై పారుతోందిప్రతీ బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతోంది. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించినదానికంటే 30% శాతం అధికంగా అమ్మాలనేదే ఏపీలో మద్యం పాలసీ’ అని మండిపడ్డారు. -
మా కుటుంబంపై ఎన్ని కేసులు పెట్టినా జగన్, పార్టీ ని వదిలే ప్రసక్తే లేదు
-
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్సీపీని వీడేది లేదు: పేర్ని నాని
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్.. సీజ్ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు. -
పేర్ని నాని కుటుంబంపై మరోసారి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
విజయవాడ,సాక్షి : పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. గతంలో పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. bnss 316(5) సెక్షన్‌ని పెట్టి ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తోంది. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ సెక్షన్ పేర్ని జయసుధకు వర్తించదని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. పేర్ని జయసుధకు ఇవ్వగానే పేర్ని నానిని పోలీసులు ముద్దాయిని చేశారు. పేర్ని నానికి హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఇద్దరికీ బెయిల్ మంజూరైనా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. రేషన్ బియ్యం కేసుల్లో ఎన్నడూ లేని రీతిలో మళ్లీ పేర్ని నాని భార్యని పోలీసులు టార్గెట్ చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. -
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు ఖాలిద్ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభుత్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్పదమైన సవరణలు చేసి వక్ఫ్‌ను బలహీన పరచడానికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మహాధర్నాలో జమాతే ఇస్లాం హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతషిమ్ ఖాన్, మజ్లిస్ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్, ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ షేక్ అసిఫ్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంవక్ఫ్ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి. – మౌలానాషా ఫజల్ రహీమ్ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్బీ వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందిరాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. మరోసారి పార్లమెంట్లో ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్ సవరణ బిల్లు. పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్ చెబుతోంది. రంజాన్ మాసంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత -
Perni Nani: మీ బెదిరింపులకు భయపడేది లేదు మీకు చేతనైనది చేసుకోండి
-
మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. లావుకు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు. -
పోలీసుల సమక్షంలోనే టీడీపీ కవ్వింపు చర్యలు: పేర్ని నాని
-
టీడీపీ, పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
అక్రమ కేసులతో అణచివేయలేరు: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని పరామర్శించారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టై రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఆ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు.పరామర్శ అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని.. విద్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభల పై రాళ్లు, కర్రలు విసిరేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు. టీడీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు’’ అని పేర్ని నాని వివరించారు.‘‘టీడీపీ కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు. తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు. జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. అసలు ఈ రాష్ట్రంలో చట్టం, ధర్మం, న్యాయం ఉందా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు. కిరాయి మూకలు, రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా?. చట్టాన్ని టీడీపీకి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం. టీడీపీ పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి. అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం’’ అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిని చట్టం ముందు నిలబెడతాం.. దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభ కంటే ముందు టీడీపీ ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు. టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించాం. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త. అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని ఆయన హెచ్చరించారు.టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు.. వారిపై కేసులు: తన్నీరు నాగేశ్వరరావుజగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తిరుపతమ్మకు పసుపు కుంకుమ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కార్యర్తలు రాళ్లు, బాటిల్స్ విసిరారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు. టీడీపీ ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారిపై కేసులు పెట్టారు. గత యాభై ఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తాం. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అణచివేయలేరు -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
‘మీరు వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’
కృష్ణాజిల్లా: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అది వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు మాజీ మంత్రి పేర్నినాని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగిన పేర్ని నాని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సూచించారు.‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క జగన్‌కే సాధ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు...ఆయన తొత్తు పవన్ కళ్యాణ్ ... జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎ న్నికల ముందు సూపర్ సిక్స్ ..షణ్ముఖ వ్యూహం అని హామీలిచ్చారు. కూటమి ఎమ్మెల్యేలు స్క్రిప్ట్ లు వేసుకుని బ్రతకాల్సిందే. ఐదేళ్ల క్రితం మన బ్రతుక్కి వచ్చింది 23 సీట్లు కాదా?, రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ధ్వజమెత్తారు పేర్ని నానివైఎస్సార్సీపీ నాయకుల అరెస్టుల వల్ల జనాల్లో జగన్ పరపతి ఏమీ తగ్గలేదని. అరెస్టులతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ నాయకులను ఏమీ చేయలేదన్నారు. పోసాని కృష్ణమురళిపై ఏ ఆధారాలు లేకుండానే 18 కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు పేర్ని నాని. -
దిక్కుమాలిన సంతకం... పేర్ని నాని సెటైర్లు
-
చంద్రబాబుకు పేర్నినాని వార్నింగ్
-
వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విష ప్రచారం చేస్తోంది
-
ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
-
Live: పేర్ని నాని PRESS MEET
-
చంద్రబాబు తప్పుడు మాటలు.. ఈనాడు రోత రాతలు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు...రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. -
పేర్ని నానికి హైకోర్టులో ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నానికి ఊరట
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా, ఏ2గా గోదాం మేనేజర్ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ఊరట దక్కింది.వైవీ విక్రాంత్ రెడ్డికి ఊరటమరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డి(YV Vikrant Reddy)కి కూడా ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాకినాడ పోర్టు, సెజ్ కు సంబంధించి 41 శాతం వాటాలు బలవంతంగా లాగేసుకున్నారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో విక్రాంత్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయితే కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో తనకు సంబంధం లేదని విక్రాంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఇవాళ మంజూరు అయ్యింది. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు YSRCP నేతలు నివాళులు
-
వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన సతీమణి పంకజ శ్రీ, పేర్ని నాని
-
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఫోన్ ట్యాపింగ్‌లకు నేను భయపడను: పేర్నినాని
-
తప్పుడు కేసుపై డీజీపీకి పేర్ని నాని ఫిర్యాదు
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమోదు అయిన విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డీజీపీకి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేస్తూ డీజీపీ(AP DGP) హరీష్ కుమార్ గుప్తాకు ఓ లేఖ రాశారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న గుంటూరు మిర్చి రైతులను బుధవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన జగన్, మరికొందరు వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నల్లపాడు పీఎస్‌లో టీడీపీ నేతలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది.అయితే ఆ పర్యటనలో పాల్గొనని పేర్ని నాని(Perni Nani)పై కూడా కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు. ఈ పర్యటనలో పాల్గొనకున్నా తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు తనపై ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారాయన. ప్రజాక్షేత్రంలో ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం.. అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని అన్నారాయన. ఈ అంశంపై విచారణ జరిపి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లపై, అలాగే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారాయన. ఇదీ చదవండి: సభ పెట్టలేదు.. మైక్ ముట్టలేదు.. ఇదేమీ దుర్మార్గం -
వీడియో: పోలీసుల అత్యుత్సాహం.. పేర్ని నాని హౌస్ అరెస్ట్
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేర్ని నాని హౌస్ అరెస్ట్...
-
మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ
సాక్షి, అమరావతి : రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇటీవల తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు బుధవారం వరకూ పొడిగించింది. నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రేషన్ బియ్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రావాల్సి ఉన్నా.. రాకపోవడంతో అత్యవసర విచారణ కోసం నాని తరఫు న్యాయవాది వీసీహెచ్ నాయుడు కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్ రూపంలో విచారణకు అంగీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థన మేరకు న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.పెనాల్టీ నోటీసులపై పూర్తి వివరాలివ్వండి.. ఇదే వ్యవహారంలో రూ.1.67 కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ పౌర సరఫరాల శాఖ ఇచి్చన నోటీసులను సవాలు చేస్తూ పేర్ని నాని సతీమణి, గోడౌన్ యజమాని జయసుధ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తమ ముందుంచాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులిచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత సాక్షి, అమరావతి : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదై ఉన్నందున చట్ట నిబంధనల ప్రకారం కింది కోర్టులోనే పిటి షన్లు దాఖలు చేసుకోవాలంది. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ సోమవారం తీర్పు వెలువరించారు. 2023లో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘ టనలో పోలీసులు పలువురిపై కేసులు నమో దు చేశారు. దీంతో కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దా ఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. వారికి నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయండిసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించని మైనర్ మినరల్ లీజుదారులకు నెల రోజుల్లో ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాలని గనుల శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఈ ట్రాన్సిట్ పర్మిట్లు ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కుంఢజడల మన్మథరావు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమకు ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ (ఫెమ్మీ) సెక్రటరీ జనరల్ చట్టి హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మథరావు నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ పర్మిట్లు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు. అంబటి పిటిషన్లో పూర్తి వివరాలివ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ, అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాలు సమరి్పంచాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసేలా గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. అంబటి రాంబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణ ఈ నెలాఖరుకి వాయిదా వేశారు. -
YSRCP సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని కుటుంబంపై చంద్రబాబు కక్ష
-
బాబ్బాబూ పుణ్యముంటుంది.. ఆయన్ను అరెస్టు చేయండి..
ఇళ్లకొచ్చి అడుక్కునే ముష్టివాళ్ల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. ట్రాఫిక్ సిగ్నళ్లలో, గుడులూ, హాస్పిటళ్లూ, హోటళ్ల దగ్గరే ‘బాబ్బాబూ ధర్మం చేయండి బాబూ.. పుణ్యముంటుంది బాబూ..’ అంటూ అడుక్కునే ముష్టివాళ్లు మనకు దండిగా కనిపిస్తుంటారు. ఈ ముష్టివాళ్ల సంగతి సరే.. నిజానికి ఇంకోరకం ముష్టివాళ్లు కూడా ఉంటారు. వారికి అనేకానేక వంకర ప్రయోజనాలు ఉంటాయి. ఆ వంకర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి అడ్డు పడేవారి మీద కక్ష పెంచుకుంటారు. ఆ కక్ష సాధించుకోవడానికి ఇంకో రకం ముసుగులు తగిలించుకుని, చవకబారు ముష్టెత్తుతూ ఉంటారు.పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి బియ్యం నిల్వల తేడా వచ్చిన కేసులో అటు పోలీసులకు, ఇటు పౌరసరఫరాల శాఖకు, ప్రభుత్వానికి లేని శ్రద్ధ పచ్చ మీడియాకు మాత్రం విపరీతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చట్టప్రకారం అవకాశం ఉన్నా లేకపోయినా కూడా.. పేర్ని నానిని అరెస్టు చేసేవరకు తాము కారుకూతలు కూస్తూనే ఉంటాం.. బురదచల్లుడు చవకబారు రాతలు రాస్తూనే ఉంటాం.. అనే ధోరణిని పచ్చ మీడియా ప్రదర్శిస్తున్నది.పేర్ని నాని స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాతనే.. బియ్యం నిల్వల్లో తేడా వచ్చిన సంగతి బయటపడింది. అప్పటికీ నిబంధనల ప్రకారం అధికారులు ఎంత జరిమానా విధించారో.. అదంతా కూడా డీడీల రూపంలో చెల్లించేశారు. అయినాసరే.. పేర్నినానిని అరెస్టు చేసేదాకా పచ్చమీడియా కళ్లు చల్లబడేలా కనిపించడం లేదు.‘మేం కేసు పెడతాం అంతే.. అరెస్టులు మాత్రం చేయం.. మీరు కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందేవరకు వేచిచూస్తూ ఉంటాం.. అన్నట్టుగా పోలీసులు వేచిచూస్తున్నారంటూ..’ పచ్చమీడియా వారి వెంటపడుతోంది. పేర్నినాని వ్యవహారం బయటకు వచ్చిన నాటినుంచి.. చట్టం తనశైలిలో తాను పనిచేసుకుంటూ పోతోంది. అయితే పచ్చమీడియా మాత్రం అత్యుత్సాహం ఆపుకోలేక.. ఆయనను అరెస్టు చేయడం లేదు, కొల్లు రవీంద్ర గానీ, పార్టీపెద్దలు గానీ.. ఆయన గురించి విమర్శలు చేయడం లేదు. అరెస్టు చేయాలని పోలీసుల వెంటపడడం లేదు.. పేర్ని నానితో కుమ్మక్కు అయినట్టుగా పనిచేస్తున్నారు.. అంటూ రకరకాల కారుకూతలు, చవకబారు రాతలు రాశారు.తీరా పచ్చమీడియా పోరు పడలేకపోతున్నట్టుగా.. కొల్లు రవీంద్ర కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఏదో పేర్నినాని మీద కొన్ని నిందలు వేసి దులుపుకున్నారు. ఆ తర్వాత.. రకరకాల మలుపులు తిరిగిన వ్యవహారంలో గోడౌన్ యజమానిగా రికార్డుల్లో ఉన్న జయసుధకు ముందస్తు బెయిలు వచ్చింది. పచ్చమీడియా పెద్దలు హతాశులయ్యారు. ఈలోగా పోలీసులు.. ‘విచారణలో తెలిసిన సమాచారం మేరకు..’ అనే ముసుగులో పేర్ని నాని పేరును కూడా ఏ6గా కేసులో చేర్చారు.కక్షపూరితంగా వేధించదలచుకుంటున్నారనే భయంతో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళితే.. నానా చెత్తరాతలు రాసిన పచ్చమీడియా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ తర్వాత జయసుధ విచారణకు హాజరైనా కూడా ఓర్వలేకపోతోంది. కుట్రపూరితంగా తన పేరును కూడా ఇరికించిన నేపథ్యంలో పేర్ని నాని ముందస్తు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోవడం కూడా పచ్చమీడియాకు కంటగింపే. ఆయనకు ముందస్తు బెయిల్ రావడం కూడా ఖరారే అని సంకేతాలు అందుతున్న వేళ.. తక్షణం ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ పచ్చ మీడియా పాపం.. ఆవేదన చెందుతోంది.టీడీపీ, జనసేనల్లో పేర్ని నాని సన్నిహితులున్నారని, వారే ఆయనను కాపాడుతున్నారని పచ్చ మీడియా పాపం కుమిలపోతున్నది. అయినా.. చట్టప్రకారం ఆయన దోషి అయితే గనుక.. కాపాడటం ఎవరి తరం అవుతుంది? జరిగింది నేరం కానప్పుడు.. బియ్యం నిల్వల తేడాకు సంబంధించి.. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం జరిమానా మొత్తం చెల్లించేసినప్పుడు.. ఇక ఆయనను ఏ రకంగా శిక్షించగలరని పచ్చ మీడియా ఆరాటపడుతున్నదో అర్థం కావడం లేదు. వ్యవహారం మొత్తం గమనిస్తే.. నాని అరెస్టుకోసం పచ్చ మీడియా ముష్టెత్తుకుంటున్నట్టుగా.. బాబ్బాబూ.. మీకు పుణ్యముంటుంది.. అరెస్టు చేయండి బాబూ.. అని దేబిరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.-ఎం.రాజేశ్వరి -
మహిళలను అవమానించేలా కూటమి చర్యలు
-
పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్ కు రప్పించే కుట్ర
-
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
పేర్ని నాని భార్యపై వేధింపులు..
-
హైకోర్టులో పేర్ని నానికి ఊరట
-
ఏపీ హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినానికి ఊరట దక్కింది. పేర్నినాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్నినానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు.పేర్ని నాని పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కోటి 68 లక్షలు పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో కోటి 67 లక్షలు రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని ఏ6గా కేసులో పోలీసులు చేర్చారు.ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..కాగా, ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎస్.సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురి ని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయీస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహి తుడు ఆంజనేయులును అరెస్టు చేశారు. వీరికి జడ్జీ 12 రోజులు రిమాండ్ విధించారు. -
బాబు సర్కార్ బరితెగింపు
-
ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు..
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది.పేర్ని నానిపై కక్ష సాధింపు కుట్రతో ఆయన కుటుంబానికి చెందిన గోదాముల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఏకంగా 4,500 బియ్యం బస్తాలు తగ్గాయని అధికారులు ఏకపక్షంగా నివేదిక ఇచ్చేశారు. గోదాములకు బియ్యం బస్తాలు తీసుకువచి్చనప్పుడు తేమ శాతం అధికంగా ఉంటుంది. దాంతో బియ్యం నిల్వలు బరువు ఎక్కువ ఉంటాయి. కానీ గోదాముల నుంచి బియ్యాన్ని తరలించేటప్పుడు తేమ శాతం తగ్గుతుంది. దాంతో బియ్యం నిల్వల బరువు తగ్గుతుంది. ఇది సహజం. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 4,500 బస్తాలు తగ్గాయని ఏకపక్షంగా నిర్ధారించేశారు.రూ.1.68 కోట్లు రికవరీ కింద చెల్లించాలని నోటీసులిచ్చారు. తమ తప్పు ఏమాత్రం లేకపోయినప్పటికీ.. అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పేర్ని నాని కుటుంబం అందుకు సమ్మతించింది. ఈ వ్యవహారంపై ఓ వైపు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తూనే మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా రూ.1.68 కోట్లు చెల్లించింది. నోటీసులకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా రికవరీగా చెల్లించమన్న మొత్తం చెల్లించేయడంతో నిబంధనల ప్రకారం దాంతో ఈ వ్యవహారాన్ని ముగించాలి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వేధించాలన్న ఏకైక కుట్రతో ఆ గోదాం యజమానిగా ఉన్న పేర్ని నాని సతీమణి జ యసుధపై అక్రమ కేసు నమోదు చేసింది.రికవరీ మొత్తం చెల్లించినప్పటికీ మరోసారి చెల్లించాలంటూ జేసీ ఈనెల 29న ఇచ్చిన నోటీసు బెయిల్‌ను సహించలేని ప్రభుత్వం ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ పేర్ని నాని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమ గోదాము వద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారాలుగా న్యాయస్థానానికి సమరి్పంచింది. తాము గోదాము నుంచి బియ్యాన్ని అక్రమంగా తరలించనే లేదని వీడియో ఆధారాలతో సహా తమ వాదనను బలంగా వినిపించింది. పేర్ని నాని కుటుంబ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. పేర్ని జయసుధకు సోమవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.రికవరీ మొత్తం చెల్లించాలని పేర్ని నాని కుటుంబానికి కృష్ణా జిల్లా జేసీ జారీచేసిన నోటీసుదాంతో చంద్రబాబు ప్రభుత్వం తమ పన్నాగానికి మరింత పదును పెట్టింది. అధికారులను సోమవారం మరోసారి ఆ గోదా ము కు పంపించింది. మరో రూ.1.67 కోట్లు రికవరీ మొత్తంగా చెల్లించాలని నోటీసులు ఇ చ్చింది. తద్వారా తమకు నిబంధనలు పట్టవని.. అక్రమ కేసులతో వేధించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు ప్రభుత్వం బాహాటంగా వెల్లడించింది. ముందు చెప్పిన రికవరీ మొత్తాన్ని చెల్లించినా సరే మరోసారి రికవరీ మొత్తం చెల్లించాలని నోటీసులివ్వడాన్ని పరిశీలకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే..'పేద బిడ్డలకు తెలుగే' -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసు.. పేర్ని నాని సతీమణికి ఊరట
సాక్షి,కృష్ణా : కూటమి ప్రభుత్వం నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి ఊరట దక్కింది. పేర్ని నానీ సతీమణి పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఇప్పటికే ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన.అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు.నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.... సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై పేర్నినాని కామెంట్స్
-
నా తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్న
-
కావాలనే ఆ టైం కి నోటీసులు అంటించారు
-
నా పైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంట్లో మహిళలను ఇబ్బందిపెడుతున్నారు
-
కూటమి నేతలు కొద్దిరోజులుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
-
నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏ తప్పు చేయలేదు: పేర్ని నాని
గుంటూరు, సాక్షి: రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు. సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్లో స్టాక్ ఉంచారు. మా గోడౌన్లో బియ్యం తగ్గిందని అధికారులు చెప్పారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. అధికారులు 3,800 బస్తాలు తగ్గాయని చెబితే.. నగదు చెల్లించాం. అయినా సరే మాపై కక్షగట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి(Kutami) నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ అని అన్నారాయన. అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా(Social Media) రచ్చ ఎక్కువైంది. మాపై ఎల్లో మీడియా, ఐటీడీపీ తప్పుడు రాతలు రాస్తోంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నేనెక్కడికి పారిపోలేదు. 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు బందరులోనే ఉన్నా. కేవలం లాయర్ల సూచన మేరకే ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. గోడౌన్ మేనేజర్‌ను అరెస్ట్ చేసి.. ఆయన ద్వారా నా పేరు చేర్చడానికి ప్లాన్ చేశారు. గోడౌన్‌ను పగలగొట్టి సరుకును తీసుకెళ్లారు. ఓ సీఐ ఈ స్వామికార్యాన్ని దగ్గరుండి జరిపించారు. ఇలా ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో నా భార్య గురించి దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే చాలామంది స్టేషన్‌కు తీసుకెళ్లి కొడుతున్నారు. రాజకీయ కక్ష ఉంటే నాపై తీర్చుకోండి. నా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని?’’.. .. సామాన్య ప్రజలు ఆలోచించాలి. నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశా. ప్రభుత్వం రూల్స్ ఏంటో నాకు తెలుసు. నేను మంత్రిగా చేసినప్పుడు.. ఇదే డీజీపీ నా శాఖలో పని చేశారు. ఆయనకు నేనేంటో తెలుసు. నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలనే ఆలోచన ఏనాడూ నాకు లేదు. కేవలం నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేసి ఉంటే ఈ ఐదు నెలలు ఏం చేశారు?. నా మీద అధికార పార్టీ, ఎల్లో మీడియా కక్ష కట్టాయి. వైఎస్ జగన్ కంటే నేనే వాళ్ల మొదటి టార్గెట్. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకుంటున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే రకరకాల కుట్రలు చేశారు. పీపీలను మారుస్తూ అడ్డంకులు సృష్టించారు. జనవరి 2వ తేదీలోగా నన్ను, నా కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకోవైపు.. నా దగ్గర రూ.5 వేల కోట్లు ఉన్నాయని టీడీపీ పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరే అంత డబ్బు ఉంటే సీజ్ చేస్కోండి. 3 శాతం లంచాలు తీసుకునేవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ తన శాఖలోని ఉద్యోగుల బదిలీలకు లంచాలు తీసుకున్నవాళ్లు కూడా నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెల 30న బెయిల్ తీర్పు ఉన్నందున అన్ని విషయాల గురించి మాట్లాడలేకపోతున్నా’’ అని పేర్ని నాని అన్నారు. -
పోలీసుల నోటీసులను రద్దుచేయండి..
సాక్షి, అమరావతి :రేషన్ బియ్యం కేసులో సాక్షులుగా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీసులు తమకు జారీచేసిన నోటీసులను సవాలుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దుచేయాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరగనుంది. మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో తమను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీసులు యత్నిçÜ్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బియ్యం మాయంతో తమకెలాంటి సంబంధంలేదన్నారు. గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చామని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకిచ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీసులు ఈ కేసు నమోదు చేశారన్నారు. తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై కోటిరెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగా నమోదుచేసిన కేసులో విచారణకు రావాలని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు
-
కూటమి కక్ష సాధింపు.. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు!
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
మాజీ మంత్రి పేర్ని నానికి YSRCP నేతల పరామర్శ
-
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
‘కెన్‌స్టార్’ షిప్పును పవన్ ఎందుకు వదిలేశారు: పేర్నినాని
సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లకూడదని పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. -
గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
‘గుర్తుంచుకో చంద్రబాబూ.. అధికారం ఎల్లకాలం ఉండదు’
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.‘‘పాత కేసులను తిరగదోడి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. గన్నవరంలో 8 మంది వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. న్యాయమూర్తి 307 కేసును తొలగించారు. కానీ బెయిల్ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పచ్చ చొక్కాల ఒత్తిడికి లొంగిపోయారు. కుంటిసాకులతో రెండురోజుల పాటు కాలయాపన చేసి పోలీస్ కస్టడీ కోరారు. రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు...అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైఎస్సార్సీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అడ్డగోలుగా పోలీసులను వాడుతున్నారు. పాతకేసులను తిరగదోడుతున్నందుకు డీజీపీకి మా సూటిప్రశ్న. పాతకేసులకు సంబంధించి ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారా?. తప్పుడు ఉద్యోగం చేశావని ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా?. చేసేవి దొంగ పనులు కాబట్టి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరి పై 10, 20 కేసులు పెడుతున్నారు.తమతో పాపాలు చేయిస్తున్నారని కొందరు పోలీసు అధికారులు బాధపడుతున్నారు. ఖాకీ యూనిఫాం వేసుకుని తప్పుడు కేసులు పెట్టి పాపాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండడు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఈ రోజు పసుపు చొక్కేలేసుకుని అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులు తప్పకుండా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్ని నాని హెచ్చరించారు. -
పేర్ని నాని నాతో ఎప్పుడూ అనే మాట...