‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి’ | Perni Nani Condemns Attacks on YSRCP Leaders | Sakshi
Sakshi News home page

‘ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి’

Feb 1 2026 7:01 PM | Updated on Feb 1 2026 7:32 PM

Perni Nani Condemns Attacks on YSRCP Leaders

విజయవాడ: వరుసగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిన్న(శనివారం) అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఈరోజు(ఆదివారం) జోగి రమేష్‌ ఇంటిపై జరిగిన దాడులను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు.  

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అంబటి ధ్వజమెత్తారు. ‘ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కిందస్థాయి సిబ్బందిని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి అధికారుల నంచి ఆదేశాలున్నాయని కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచకం చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు. టీడీపీ దాడులను పోలీసులు అడ్డుకోవడం లేదు. ప్రశ్నించే వాళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి’ అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement