బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, సీజే రాయ్ అలియాస్ చిరియాంకందత్ జోసెఫ్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన నివాసంలో మృతి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోరారాజులా వెలిగిన రాయ్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ప్రయణాలతో, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాయ్ గురించి కొన్ని ఆసక్తి కర సంగతులను పరిశీలిద్దాం
57 ఏళ్ల CJ రాయ్ మరణం బెంగళూరు రియల్ ఎస్టేట్ , వ్యాపార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్, తమ చైర్మన్ సీజే రాయ్ పై తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ దారుణమైన చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐటీ నిఘా నీడలోఉన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన మరణం వెనుక ఉన్నకారణాలపై పోలీసులు కారణాలు దర్యాప్తులో ఉన్నాయి.
రాయ్ తన కరీర్ ప్రారంభంలో, రాయ్ టెలివిజన్ రియాలిటీ షోల డీల్స్, విజేతలకు బహుమతులివ్వడం, బ్రాండింగ్ వ్యూహంగా ఉపయోగించాడు. విజేతలకు రియల్ ఎస్టేట్ బహుమతులను అందించేవాడు. మీడియాతో ఎక్కువ సంబంధాలను కలగి ఉండేవాడు. ఇది అతని కంపెనీ పబ్లిక్ ప్రొఫైల్‌ను గణనీయంగా పెంచింది. అలా తన సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా, ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో పేరున్న సంస్థగా తీర్చిదిద్దాడు. రాయ్ సోషల్ మీడియా ఉనికిని పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి దాదాపు 1.3 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఫీడ్‌లో కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించే పోస్ట్‌లతో పాటు, హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్‌లు, ఇతర ప్రయాణ స్టోరీలను క్రమం తప్పకుండా తన ఫాలోయర్లతో పంచుకునేవాడు. అతని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
జనవరి 30న సెంట్రల్ ఆదాయపు పన్ను శాఖకు వాంగ్మూలం ఇవ్వడానికి రాయ్ బెంగళూరులోని లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి జోసెఫ్‌తో కలిసి వచ్చారు. ఆ తర్వాత రాయ్ తన క్యాబిన్‌కు వెళ్లి తన తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత తన క్యాబిన్‌లోకి ఎవ్వరినీ అనుమతించవచ్చని సెక్యూరిటీకి చెప్పాడు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడిందని గ్రహించి,బలవంతంగా క్యాబిన్ తలుపు బలవంతంగా తెరిచారు. తుపాకీ గాయాలతో పడిపోయి కనిపించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.

మరోవైపు కేరళకు చెందిన ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకారం, డిసెంబర్ 3, 6, జనవరి 28 తేదీల్లో బెంగళూరు , ఇతర ప్రాంతాలలో రాయ్ మరియు అతని వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన సోదాలు అనేక సందర్భాల్లో జరిగాయి. దీనిపై బెంగళూరులోని అశోక్నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో, కాన్ఫిడెంట్ గ్రూప్ ఎండీ రాయ్ మరణానికి దారితీసిన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని కోరారు. సోదాల సమయంలో జరిగిన సంఘటనల క్రమం సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భూమి కొనండి, ఇంట్రస్టింగ్ రాయ్ సందేశం
రాయ్, తాను 25 ఏళ్ల వయసులో 1994లో కొనుగోలు చేసిన తన తొలి కారును కనిపెట్టిన వారికి 10 లక్షల బహుమతిని ప్రకటించాడు. ఎర్ర మారుతి 800ను చివరకు తిరిగి పొందారు.1994లో, తన సొంత డబ్బులతో ఆ కారును రూ.1.10 లక్షలకు కొనుగోలు చేశాడట. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 27 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి సాధించాడట. 1997లో ఈ మారుతి 800 కారును అమ్మేసి, మారుతి ఎస్టీమ్ కొనుగోలు చేశాడు. అప్పటికి భారతీయ రోడ్లపై అత్యంత ఖరీదైన , ఉత్తమమైన కారు. తానెపుడూ ఎప్పుడూ కారు ప్రేమికుడినే కానీ ఫస్ట్ కారు ప్రేమే వేరు అని ఒక పోస్ట్‌లో వెల్లడించడం విశేషం ఈ రోజు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు ఉన్నప్పటికీ, తన మొదటి మారుతి 800 అతని అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు.
ఆయన ఇంకో విషయం కూడా చెబుతారు. తన తొలి కారు కొన్నిసమయంలో ఆ డబ్బుతో సర్జాపూర్‌లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయగలిగేవారు. ఈ రోజు, ఆ 2 ఎకరాల విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని ఒక సందర్బంగా చెప్పాడు. కారు కొనండి.. కారుతోపాటు, ఎంతో కొంత భూమిని కూడా కొనండి. భూమి కుటుంబ సంపదగా మారుతుంది అనేది ఫిలాసఫీ.


