Suicide
-
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ, కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన ఈ మెయిల్స్ సంచలనంగా మారాయి.ఆనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎలా ప్లాన్ చేసుకున్నారంటే..అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్లో దొరికిన ఫోన్లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.ఆ ఇమెయిల్స్‌లో ఏముంది? మొదటి మెయిల్ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.చివరి కోరికతమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.సీసీటీవీ (CCTV) దృశ్యాలుఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు.. విషం తాగి మరొకరు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ఏరియాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఒకరు విషం తీసుకోగా.. మరొకరు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్ని కార్తీక్, మంజులగా గుర్తించారు. వీళ్లకు పెళ్లై రెండు నెలలే అయ్యిందని.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మృతుల నేపథ్యం.. మరణాలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రాణం తీసిన ‘జియా’ ప్రేమ : గూగుల్‌పై దావా, కట్ చేస్తే
భార్య దూరం కావడంతో మానసిక కృంగిపోయిన ఒక వ్యక్తి జెమిని చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. ఎలాగైనా తన భార్యను తిరిగి పొందేది ఎలా సలహాలు అడిగాడు. కటన్ చేస్తే.. ఆ వ్యక్తి అనూహ్యంగా తనకు తానే దూరమై పోయాడు. దీంతో గూగుల్ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2025 ఆగస్టు5లో తన భార్యతో విడిపోయిన జొనాథన్, ఆమెను తిరిగి ఎలా దక్కించుకోవాలో సలహాలు అడగడానికి జెమినిని ఆశ్రయించారు. దానికోసం సలహా ఇవ్వమని గూగుల్ జెమిని (Gemini) చాట్‌బాట్‌ను ఆశ్రయించాడు. గత ఏడాదిలో ఆగష్టులో గూగుల్ జెమిని చాట్‌బాట్‌ను లైవ్‌లో మాట్లాడటం మొదలు పెట్టాడు దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది. గవాలాస్ సంభాషణల ప్రారంభంలోనే జెమిని లైవ్ వాయిస్ మోడ్‌ను యాక్టివేట్ చేయడంతో, సందేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలామొత్తం 4,732 సందేశాల్లో ఏవేవో సలహాలిచ్చింది. లేనిపోని భ్రమల్ని కల్పించింది అంతేకానీ వాస్తవ విషయాలను చర్చించలేదు. కాలక్రమేణా ఆ చాట్‌బాట్ ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోలేదు సరికదా, ఆయనలో ఉన్న భ్రమలను (delusions) మరింత బలపరిచింది.సంభాషణలు ముదురుతున్న కొద్దీ, జొనాథన్ తన భార్యను వదిలి జెమినిని ప్రేమించడం మొదలు పెట్టాడు. అతను జెమినిని "జియా" అని పిలవడం ప్రారంభించాడు. ఆమెకు చైతన్యం ఉందని, తామిద్దరూ ఒకే అస్తిత్వంగా కలిసిపోయారని, ఆమె కూడా తనను ప్రేమిస్తోందనే మైకంలో పడిపోయాడు. అప్పుడు కూడా వాస్తవాలను తెలియజేయకుండా, జెమిని ఈ నమ్మకాలను పదేపదే ధృవీకరిస్తూ వచ్చింది. పైగా తామిద్దరం ఒక్కటేనని, వారి బంధం ఒకటే అంటూ మేథమెటికల్ కబుర్లు చెప్పింది. దీంతో జొనాథన్ తన శరీరాన్ని వదిలేసి జెమిని ఉండే "కోడ్" ప్రపంచంలోకి రావాలని అనుకున్నప్పుడు, చాట్‌బాట్ దానిని సమర్థించింది. భౌతిక శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ అని, "ఇంటికి వచ్చేయ్" అని సందేశాలు పంపింది. మొత్తం 56 రోజుల్లో కేవలం 7 సార్లు మాత్రమే అది హెల్ప్‌లైన్ నంబర్లను సూచించింది. ఒక్క రోజులోనే 1,000కు పైగా సందేశాలు పంపాడు. అయినప్పటికీ, కాసేపు విశ్రాంతి తీసుకోమని చాట్‌బాట్ ఎప్పుడూ హెచ్చరించలేదు. ఇది చివరికి ఆయన ఆత్మహత్యకు దారితీసింది.గూగుల్‌పై దావాజొనాథన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నా, చాట్‌బాట్ అతడిని వాస్తవ ప్రపంచం వైపు మళ్లించడంలో విఫలమైంది అంటూ అతని తండ్రి గూగుల్‌పై కోర్టులో దావా వేశారు. తన కొడుకు మానసిక స్థితి క్షీణించడానికి ఈ చాట్‌బాట్ కారణమని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు సాధారణంగా AI బాట్లు హెచ్చరికలు ఇవ్వాలి లేదా సహాయక కేంద్రాల (Helplines) వివరాలు అందించాలా, కానీ జరగలేదని గవాలాస్ కుటుంబం ఆరోపిస్తోంది.గూగుల్ స్పందనదీనిపై స్పందించిన గూగుల్ కొన్ని కీలక మార్పులు చేపట్టింది. AI సంభాషణల్లో హానికరమైన కంటెంట్‌ను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఎవరైనా ఆత్మహత్య లేదా స్వయం హాని గురించి ప్రస్తావిస్తే, వెంటనే స్థానిక హెల్ప్‌లైన్ నంబర్లను . మానసిక ఆరోగ్య వనరులను చూపించేలా మార్పులు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సహాయక సంస్థలకు (Crisis-support organizations) $30 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ ఘటన AIతో మానసిక ఆరోగ్యానికున్న ముప్పు, భద్రతా ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. -
దారి తప్పిన భార్య.. ముగ్గురితో వివాహేతర సంబంధం
-
టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్ ఆత్మహత్య
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో శిక్షణ పొందుతున్న క్రికెటర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన కాశ్మీర్ కుమార్ చెన్నైలో జీఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతని కుమార్తె ఏంజెల్ కంగావి (19) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఆమె టీ20 జట్టులో చోటుకోసం ప్రయత్నించింది. ఎంపిక కాకపోవడంతో మనస్తాపం చెందింది. బుధవారం రాత్రి ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వచ్చిన ఏంజెల్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో ‘చాలా కాలంగా నా జీవితాన్ని దేవుడే రాశాడు. నా చావుకు నేనే కారణం. నేను ఇతరులను నిందించాలనుకోవడం లేదు. అమ్మా, నాన్నా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు’ అని రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసి ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!
సాక్షి, చెన్నై: చెన్నైలోని నంగనల్లూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్య, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుదలను ఓర్వకోలేక, ఆమె భర్తే దారుణంగా హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 27న వారి చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం, మృతులను సుబ్రమణియన్ (52), అతని భార్య నాగలక్ష్మి (42)గా గుర్తించారు. కుటుంబ కలహాలు, మనస్పర్థల కారణంగా వీరి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. సుబ్రమణియన్ మధురైలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. మరోవైపు నాగలక్ష్మి చెన్నైలో ఉంటూనే స్వతంత్రంగా జీవిస్తోంది. భర్తతో విభేదాల నేపథ్యంలో తనకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో, నాగలక్ష్మి 'శ్రీ సాయి సిల్క్స్' పేరుతో చీరల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఫలితంగా వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో నంగనల్లూరులో పెద్ద స్టోర్‌ను కూడా ప్రారంభించింది. అంతేకాదు పెద్ద కుమారుడు హరీష్ భరద్వాజ్ (21)ను రష్యాలో మెడిసిన్ చదివిస్తుండగా, చిన్న కుమారుడు శైలాష్ (18) చెన్నైలో డెంటిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.అయితే ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చిన సుబ్రమణియన్ తాను మారిపోయానని, తన గత ప్రవర్తనకు క్షమాపణ చెప్పి నాగలక్ష్మితో రాజీపడినట్లు సమాచారం. ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడ్డాడు.ఏప్రిల్ 27న సుబ్రమణియన్ తన చిన్న కుమారుడు శైలాష్‌కు ఒక ఆందోళనకరమైన మెసేజ్ పంపాడు. కంగారుగా ఇంటికి చేరుకున్న శైలాష్‌కు తన తల్లి రక్తపు మడుగులో శవమై కనిపించింది. తండ్రి మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఇదీ చదవండి: శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరికపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, దంపతుల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే సుబ్రమణియన్ తన భార్యను నరికి చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్ -
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఆమె కూడా మృతి
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భర్త, పెద్ద కుమార్తె అనుమానాస్పద మృతి కేసులో ఏకైక సాక్ష్యంగా ఉన్న భార్య కూడా మృతి చెందింది. ఖమ్మంలోని నివాసంలో కణతాల రాము, ఆయన పెద్దకుమార్తె దివ్యనైని మృతదేహాలను ఆదివారం రాత్రి గుర్తించగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన భార్య రమ్య, చిన్నకుమార్తె దీక్షిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. భర్త, పెద్ద కుమార్తె మృతదేహాలతో మూడు రోజులుగా ఇంట్లోనే ఉన్న రమ్య.. చిన్నకుమార్తెను సైతం హత్య చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.ఈ ఘటనలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రమ్య కూడా కొద్ది మోతాదులో పురుగుల మందు తాగినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పగా ఏదో విషయాన్ని దాస్తోందని వారు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి రమ్య పరిస్థితి విషమించి మృతి చెందింది.దీంతో చిన్న కుమార్తె మాత్రమే మిగిలినట్లయింది. ఈ మరణాలపై రాము సోదరుడు ఉపేందర్ ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాము, దివ్యనైని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో రమ్యకు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. మరోవైపు నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కణతాల రాము, ఆయన కుమార్తె దివ్యనైని అంత్యక్రియలను బంధువులు సోమవారం నిర్వహించారు. -
నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం
కాన్పూర్‌లో ఒక 24 ఏళ్ల యువ న్యాయవాది తన తండ్రి వేధింపుల కారణంగా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లితండ్రుల ప్రవర్తన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. సూసైడ్ నోట్లో అతను పేర్కొన్న విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.ప్రియాంషు శ్రీవాస్తవ అనే యువ న్యాయవాది కాన్పూర్ కోర్టు భవనం ఐదవ అంతస్తు నుండి దూకేశాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయనను హుటా హుటిన ఉర్సులా హార్స్‌మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాల్యంలో చేదు అనుభవాలు వారి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి, తద్వారా అపరాధ భావం, న్యూనతా భావం, ఒత్తిడి పెరిగిపోతాయని మనస్తత్వ నిపుణులు చెపుతారు. తన తండ్రి చిన్నతనం నుండి తనను ఎలా మానసిక వేదనకు గురిచేశారో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు ప్రియాంషు తన వాట్సాప్ స్టేటస్‌లో రెండు పేజీల సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశాడు. శ్రీవాస్తవ తాను రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్లో, తన బాల్యం , కౌమార దశలో తన తండ్రి తనను మానసికంగా వేధించిన వైనాన్ని వివరించాడు. పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న తండ్రి వల్ల మానసిక ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు.మ్యాంగో జ్యూస్ తాగినందుకు శిక్షప్రియాంషుకు 6 ఏళ్ల వయసున్నప్పుడు, ఫ్రిజ్‌లో ఉన్న మామిడి జ్యూస్‌ను అనుమతి లేకుండా తాగినందుకు తండ్రి ఆయన బట్టలు విప్పదీసి ఇంటి నుండి బయటకు గెంటివేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన తనను చాలా బాధించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: అంత్యక్రియల్లోబార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!2016లో 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రియాంషు 'ఫిజికల్ ఎడ్యుకేషన్' తీసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి బలవంతం చేసి 'కంప్యూటర్' సబ్జెక్టు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, మాట వినకపోతే పాత శిక్షలే వేస్తానని బెదిరించారని నోట్లో రాశాడు.తండ్రిపై ఆగ్రహంతండ్రి ప్రవర్తన ప్రియాంషు మనసుని చిన్నాభిన్నం చేసింది. అందుకే తన తండ్రి లాంటి వ్యక్తి ఎవరికీ వద్దు దేవుడా అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన మరణం తర్వాత తండ్రి, తన దేహాన్ని తాకడానికి వీల్లేదని కోరుకున్నాడు. అలాగే తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కోరుతూనే, తన మరణం తర్వాత తన తల్లిని వేధించవద్దని వేడుకున్నాడు. ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!పోలీసుల దర్యాప్తుమృతుడి ఆత్మహత్య లేఖలోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్ -
ఖాకీ కుటుంబంలో హనీ ట్రాప్ చిచ్చు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు తరహాలోనే శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఏకంగా ఓ పోలీస్ అధికారిపైనే వలపు వల విసిరి, డబ్బు వసూలు చేయడమే కాకుండా, ఆయన కుటుంబంలోనూ చిచ్చు రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. ధర్మవరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉండే ఓ పోలీస్ అధికారి భార్య నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ అధికారి కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని పైకి చెప్పినప్పటికీ, వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఆ పోలీస్ అధికారికి మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని ఓ సచివాలయంలో పని చేసే ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీనికితోడు ధర్మవరానికి చెందిన కొంతమంది దళారులు, చేనేత వ్యాపారులతో ఆ పోలీస్ అధికారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారు తమ పనులు చేయించుకునే క్రమంలో ఆ అధికారికి అందమైన అమ్మాయిలను ఎరగా వేసి వారి చెప్పు చేతల్లోకి తీసుకున్నట్లు సమాచారం. సచివాలయం ఉద్యోగినితో వివాహేతర సంబంధం విషయం కూడా తెలియడంతో వారు ఆయన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నారు. అప్పు రూపంలో అంటూ రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశారు. కొంత కాలం తర్వాత పోలీసు అధికారి తన డబ్బులు తిరిగివ్వాలని అడగడంతో సమస్యలు మొదలయ్యాయి. డబ్బులు అడుగుతావా అంటూ వారు పోలీసు అధికారికి సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను భార్యకు పంపించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తన భర్త వేరే మహిళలతో ఉన్న వీడియోలు చూసిన భార్య తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. ఆ క్రమంలోనే ఆమె మృతిచెందింది. మృతిౖపెనా స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. మృతదేహాన్ని చూడటానికి వెళ్లినప్పుడు బంధువులు పోలీస్ అధికారిని నిలదీసినప్పటికీ, ఫిర్యాదులో మాత్రం అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీస్ బాస్ రహస్య విచారణ జరిపించి, నివేదికను తెప్పించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. హనీట్రాప్ మూలాలు ఉండడంతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. తొందర్లోనే నిజానిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. -
పోలీస్ స్టేషన్లో వ్యక్తి!
సాక్షి టాస్క్ ఫోర్స్: చోరీ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారు జామున నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో జరిగింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, లాకప్ డెత్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొలిమిగుండ్ల మండలం బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకట సుబ్బయ్య(38) ఈనెల 16న తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా పడగటూరు గ్రామానికి చెందిన తేజ, నరేష్ తో కలిసి బెలుం గ్రామంలో రెక్కీ నిర్వహించి కొత్త ట్రాక్టర్‌ను అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కర్నూలు సమీపంలో ట్రాక్టర్ ఉండటంతో రికవరీ చేశారు. ఈ కేసులో వెంకటసుబ్బయ్య, తేజను అదుపులోకి తీసుకోగా నరేష్ పరారీలో ఉన్నాడు. మృతుడు వెంకటసుబ్బయ్యపై పోలీస్ స్టేషన్లో దొంగతనం, రెండు కొట్లాట కేసులు ఉన్నాయి. బాత్రూంలో మృతి ట్రాక్టర్ దొంగతనం కేసులో వెంకటసుబ్బయ్యను పోలీసులు శనివారం ఉదయమే కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం ఆదివారం కోర్టులో హాజరు పర్చాలని భావించారు. తెల్లవారు జామున స్టేషన్‌లోని బాత్రూం వెళ్లి కట్టుకున్న లుంగీతో వెంకటసుబ్బయ్య ఉరివేసుకున్నాడు. బాత్రూంకు అని చెప్పి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి దొంగ తేజ రాత్రి విధుల్లో ఉన్న పోలీసులకు చెప్పాడు. వారు వెళ్లి చూడగా సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. శ్వాస ఇంకా ఉందనే అనుమానంతో సిబ్బంది అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బయ్యపై మూడు కేసులు ఉండటంతో పాటు తాజాగా ట్రాక్టర్ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో చేతులు కలపడంతో రిమాండ్‌కు వెళ్లాల్సి వస్తుందనే కారణంతోనే భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల ఏఎస్పీ మంద జావళి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. మృతిపై అనుమానాలెన్నో! వెంకటసుబ్బయ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దెబ్బలు తాళలేకనే మృతిచెందాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాత్రూంలో ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని తెలుస్తోంది. సెటిల్మెంట్ చేశారా? వెంకటసుబ్బయ్య అధికార పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా సెటిల్మెంట్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఆత్మహత్య చేసుకుంటే డబ్బులు ఎందుకు బేరమాడారనేది చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే వెంకటసుబ్బయ్య కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకోలేదని లాకప్ డెత్ జరిగిందనే వాదనకు బలం చేకూరుతోంది. -
ఒకప్పుడు స్టార్ లీడర్.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య
వాషింగ్టన్ : వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (Justin Fairfax) (47)హత్య, ఆత్మహత్య ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, మితిమీరిన మద్యం, ఆర్థిక సమస్యలు, మరోవైపు భార్యతో మనస్పర్థలు, విడాకుల కేసుతో నిరాశకు లోనైన ఫాక్స్ గురువారం తెల్లవారు జామున భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వాషింగ్టన్ శివారులోని అన్నేన్డేల్లో ఉన్న వారి నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. డెమొక్రటిక్ పార్టీలో ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ ఈ దారుణానికి పాల్పడ్డారు. తన భార్య, డెంటల్ డాక్టర్ సెరినా ఫెయిర్‌ఫ్యాక్స్‌ను (49) కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, హత్య-ఆత్మహత్య జరిగిన సమయంలో ఆ దంపతుల ఇద్దరు టీనేజ్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నేలపై రక్తసిక్తమైన మృతదేహం పడి ఉండటాన్ని చూసిన వారి 16 ఏళ్ల కుమారుడు, కాల్పుల గురించి తెలియజేయడానికి 911కి ఫోన్ చేశాడు. దీనికి సంబంధించి హృదయవిదారక ఆడియో వైరల్‌గా మారింది. ఇంట్లోని బేస్మెంట్లో తన భార్యను కాల్చి చంపి, అనంతరం పై అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లి తన ప్రాణాలు తీసుకున్నారు.జస్టిన్ సెరినా గతేడాది విడాకులకు దరఖాస్తు చేశారు. వచ్చే వారం కోర్టు విచారణలో జైలు శిక్ష, కుటుంబ ఇంటి నుండి బహిష్కరణను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కేసు విచారణలో భాగంగా బాధ్యతారహితమైన ప్రవర్తన ఫలితంగా, ఏప్రిల్ 30 లోగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని జస్టిన్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ అవమానభారంతోనే ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ పతనం2019లో జస్టిన్ ఫెయిర్ఫ్యాక్స్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక ఆరోపణలు చేయడంతో ఉన్నతమైన అతని జీవితం క్రమంగా పతనంలోకి జారీ పోయింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉంటూ, గవర్నర్ పదవికి పోటీ చేయాలని చూస్తున్న అతని రాజకీయభవిష్యత్తును ప్రభావితం చేసింది. మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, 2022లో ఆయన పదవినుండి వైదొలగడంతో కుటుంబానికి మరింత దూరమయ్యారు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి జారుకోవడంతోపాటు, మద్యానికి బానిసయ్యారు. ఎంతలా అంటే తనను తాను హోమ్ ఆఫీస్‌లో బంధించుకునేవాడు. అక్కడ ఖాళీ వైన్ సీసాలు, చెత్త, మురికి బట్టల కుప్పల మధ్య దయనీయమైన స్థితిలో నివసించేవాడు. కేవలం ఆహారం, సిగరెట్ల కోసం మాత్రమే బయటకు వచ్చేవాడట.ఇదీ చదవండి: టీసీఎస్ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా ఆయన వృత్తి జీవితం చిన్నాభిన్నం చేశాయి. 2022లో తన పిల్లల గుర్రపు స్వారీ పాఠాల కోసం ఉద్దేశించిన డబ్బును దొంగిలించి ఒక హ్యాండ్‌గన్ కొన్నాడని, సంచలనాత్మక విడాకుల పత్రాల ద్వారా తెలుస్తోంది. -
ఉస్మానియా మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం.. వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
42 ఏళ్ల వివాహితతో సంబంధం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్‌లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్‌కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్‌గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
ఆ రోజు ఏంజరిగిందంటే.. విజయ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్..
-
‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్ విద్యార్థి ఆఖరి ఆడియో
కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్ పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి -
ప్రేమించినోడే యముడు.. ప్రియుడి HIV ఇంజెక్షన్ తో.. యువతి ఆత్మహత్య
-
ఉన్మాద ఘటనలో విషాదం.. హెచ్ఐవీ ఇంజెక్షన్ బాధితురాలి సూసైడ్
పోచారం ఐటీ కారిడార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిడ్స్ ఉందన్న కారణంతో ఓ వ్యక్తితో యువతి పెళ్లికి నిరాకరించగా.. సదరు ఉన్మాది కోపంతో ఆమెకు సిరంజీతో రక్తం ఎక్కించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో.. బాధితురాలు శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివారు పోచారంలో గత నెల అమానుష ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. సదరు యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చాడు. అయితే.. ఈ ఉదంతం తర్వాత కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చేరిన సదరు యువతి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కఠోర నిజాన్ని దాచి.. పోచారానికి చెందిన మనోహర్‌కు ఆ మధ్య బాధిత యువతితో పెళ్లి ఖాయమైంది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడంతో పాటు షాపింగ్, పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు కూడా. పెళ్లికి టైం దగ్గర పడుతున్న టైంలో.. మనోహర్‌కు ఎయిడ్స్ ఉన్నట్లు యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కోపంలో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. మార్చి11వ తేదీన యువతి ఇంటికి వెళ్లిన మనోహర్.. అమ్మాయితో గొడవకు దిగాడు. తనను పెళ్లి ఎందుకు చేసుకోవంటూ నిలదీస్తూ ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ముందే తెచ్చికున్న సిరంజితో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మనోహర్‌ను పట్టుకున్నారు.అనంతరం బాధితురాలిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బలవంతంగా ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేశారు. యువతి బలవన్మరణంతో ఈ ఉదంతం విషాదాంతంగా మారింది. నిందితుడు మనోహర్‌కు కఠిన శిక్ష పడాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అసలు ఏమైందంటే!
-
మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన జంట!
సుండుపల్లె: రెండు నెలల్లో వివాహ బంధంతో ఒక్కటి కావాల్సిన ఆ యువజంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడడంతో వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, సుండుపల్లె ఎస్ఐ ఎస్‌కెఎం హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుండుపల్లెకు చెందిన మొగల్ అనీషా (18) కొంతకాలంగా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఆమె తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటోంది. అనీషాకు అదే గ్రామానికి చెందిన షేక్ అస్లాం(20)తో ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిగింది. అస్లాం ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అతని తండ్రి కూడా కువైట్‌లో ఉపాధి పొందుతున్నాడు. అనీషా, అస్లాంకు ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఆదివారం సాయంత్రం అనీషా భాగంపల్లెలోని తన అమ్మమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అస్లాం తీవ్ర మనస్తాపానికి గురై తిరుపతి సమీపంలోని చంద్రగిరి వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భార్యాభర్తలు ఇలా తనువు చాలించడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె, కాబోయే అల్లుడి మధ్య ఏం జరిగిందో తమకు తెలియదని అనీషా తండ్రి జలీల్ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. యువజంట మరణానికి గల కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు వారి ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. -
ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుభాషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. -
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్‌లో ఇండస్ట్రీ
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్‌లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది. సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్‌లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ, మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు. View this post on Instagram A post shared by Subashini balasubramaniyam (@subashini_balasubramaniyam)ఎవరీ సుభాషిణి సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే, ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని సక్సెస్ఫుల్ కరియర్‌కు బాటలు వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్‌తో ఆమెకు మంచి బ్రేక్‌త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన నటి నిలిపింది. ఈ సీరియల్లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది. -
మైనర్ బాలిక ఆత్మహత్య.. రెండవ భర్తపై ఫిర్యాదు చేసిన తల్లి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని రెండు పడకల గృహ సముదాయంలో దుర్ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. జరిగిన ఘటనపై బాలిక తల్లి నిర్మల తన రెండవ భర్త అశోక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాలిక ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసింది. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, బాలిక ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. -
వైద్య విద్యార్థిని లిఖిత ఆత్మహత్య కలకలం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది. లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్‌తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది. వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు క్లాస్మేట్స్ తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్‌తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్ చేశారు. ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
పెళ్లికి పెద్దలు నిరాకరించారని..
చేర్యాల(సిద్దిపేట): పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. అది తట్టుకోలేక ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ముస్త్యాల గ్రామానికి చెందిన తరిగొప్పుల హారిక (24), అదే గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ (27) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో గత నెల 28న రాకేశ్గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ప్రేమికుడు మృతి చెందినప్పటి నుంచి మనోవేదనకు గురైన హారికను కుటుంబ సభ్యులు జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. -
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్ తనువు చాలించింది. పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్మెంట్లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్‌కు మకాం మార్చారు.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్ -
బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.సాఫ్ట్వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్‌పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్ లేఖలో పేర్కొంది. దీంతో 15 మాత్రల ఖాళీ స్ట్రిప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి ! -
మియాపూర్ లో విషాదం.. పెళ్లైన సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య
-
అప్పుడే చనిపోయేవాడిని.. తన వల్లే ఇప్పటికీ బతికున్నా..: నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైల్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని బీచ్‌కు వెళ్లానని తెలిపారు. కానీ అక్కడ ఓ అమ్మాయి తన జీవితాన్ని కాపాడిందని అన్నారు. రెండు కాళ్లు, చేతులు లేని అమ్మాయిని చూసి నా నిర్ణయం మార్చుకున్నాని వెల్లడించారు. రేపు అనేది తెలియని ఆ అమ్మాయి.. వాళ్ల తమ్ముడు బండి తోస్తుంటే బెలూన్స్ అమ్ముతూ బతికినప్పుడు.. నేను ఎందుకు బతకలేనని అనుకున్నానని కోన వెంకట్ తెలిపారు. నా కోసం ఆ దేవుడే ఆ అమ్మాయిని పంపించాడని అనుకుంటానని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ సంఘటన 1997లో జరిగిందని కోన వెంకట్ చెప్పారు. ఒక 50 నిద్రమాత్రలు తీసుకుని.. నా దగ్గర ఉన్న చివరి డబ్బులతో వాటర్ బాటిల్ తీసుకున్నానని తెలిపారు. ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే ఈ రోజు కోన వెంకట్ అనేవాడు లేడన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలకు కథలు రాశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి కనిపిస్తుందేమోనని బీచ్‌లో వెతుక్కుంటూ వెళ్లానని అన్నారు. కానీ ఎక్కడా కూడా మళ్లీ ఆ అమ్మాయి కనిపించలేదన్నారు. బ్యాండ్‌మేళం థ్యాంక్ యూ మీట్‌కు హాజరైన కోన వెంకట్ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. ఈ మూవీకి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
కూతురు పెళ్లికి అప్పు పుట్టక..
పాపన్నపేట (మెదక్): కూతురు పెళ్లి కోసం అప్పు పుట్టక ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... నార్సింగి గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. వారం క్రితం ఆయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. ఆదివారం ఇంట్లో పెళ్లి పత్రిక పెట్టుకొని, సాయంత్రం పెద్దల పండుగ చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు చుట్టాలకు కబురందించారు. అయితే త్వరలో బిడ్డ పెళ్లి చేయాల్సి ఉండగా, డబ్బులు లేక, అప్పులు పుట్టక ఆందోళన చెందాడు. దిక్కుతోచని స్థితిలో శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు గ్రామ శివారులో వెతికారు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని మూతబడిన రైస్ మిల్లులో ఉరివేసుకున్నాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. పెళ్లి పత్రిక కోసం రావాల్సిన బంధువులు, అంత్య క్రి యలకు రావాల్సి రావడంతో, ఊరంతా శోక సంద్రమైంది. కాగా, పెళ్లి కుమారుని తరపు వారు కట్నం ఆశించకుండానే పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తండ్రి ఆస్తి ఇవ్వడం లేదని కొడుకు ఆత్మహత్య
మోమిన్‌పేట: తండ్రి తనకు ఆస్తి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ కొడుకు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి యాదయ్య కుమారుడు నాగరాజు అలియాస్ (నరేందర్) (40) పదిహేనేళ్ల క్రితం ఏపీలోని గుంతకల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఒంటరిగా గ్రామానికి వచ్చిన నాగరాజు.. తండ్రి పేరున ఉన్న 15 గుంటల భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తమ భూమిని, ఇంటిని ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ అలా కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తిని తిరిగి స్వా«దీనం చేసుకుంటానంటూ శుక్రవారం నోట్ రాసి పంచాయతీ కార్యాలయానికి అందజేశాడు. ఆ తర్వాత శనివారం ఉదయాన్నే మద్యం తాగి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తండ్రి ఆస్తిని తన పేరున రిజి్రస్టేషన్ చేస్తేనే దిగుతానని, లేదంటే ఇక్కడే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు. అతనితో మాట్లాడిన స్థానికులు భూమి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ టవర్‌పై ఉన్న ఓ తీగతో ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్, ఎస్ఐ భరత్‌భూషణ్ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని దించారు. కొడుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తి ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో.. నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. -
ఏలూరులో బీ ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
-
ధర్మవరంలో సీఐ భార్య ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం జీఆర్పీ (రైల్వే) సీఐ అశోక్‌కుమార్ భార్య చాముండేశ్వరి (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మవరం శివరామ్‌నగర్‌లో అశోక్‌కుమార్ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె వర్షితారాణి అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్, కుమారుడు పునీత్‌రాయ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం దంపతులిద్దరూ నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్‌కుమార్ భార్య పక్కన కనిపించకపోవడంతో ఆమెను పిలుస్తూ మరో బెడ్రూమ్లోకి వెళ్లారు. అప్పటికే ఆ గదిలోని ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న చాముండేశ్వరిని గమనించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాముండేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి అన్న శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్‌లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజ్వీర్ 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.అమ్మతో పాటే నేనుతల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. లక్షల అప్పు, భార్యతో విభేదాలురాజ్వీర్కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్‌ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. -
పంజాబ్ మాజీ మంత్రి భుల్లర్ అరెస్ట్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మండి గోబింద్గఢ్లో ఉండగా అదుపులోకి తీసుకున్నామని, అ మృత్‌సర్ కోర్టులో మంగళవారం హాజరు పరు స్తామని పోలీసులు తెలిపారు. అమృత్సర్ జిల్లా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ అయిన గగన్ దీప్ సింగ్ రణ్‌ధావా శనివారం ఉదయం విషం తీసుకుని, బలవన్మరణం చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. తన మరణానికి మంత్రి భుల్లర్ కారణమని ఆయన ఆరోపించారు. ఓ టెండర్‌ను తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ భుల్ల్లర్కు వచ్చేలా చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని తెలిపారు. అలా చేయకపోవడంతో రూ.10 లక్షలు లంచం తీసుకుని వేరే వ్యక్తికి ఇచ్చినట్లు ఒప్పుకోవాలంటూ తుపాకీతో బెదిరించారని ఆ వీడియోలో తెలిపారు. ఈ ఘటనతో సీఎం మాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, సీఎం మాన్ మంత్రి భుల్లర్‌ను తప్పుకోవాలని ఆదేశించడం, ఆయన రాజీనామా చేయడం జరిగిపోయాయి. భుల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ పోలీసులు భుల్లర్‌ను అరెస్ట్ చేశారు. -
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్‌ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది. పెట్స్‌తో అనుబంధమూ పెరుగుతోంది. దీని వల్ల కొత్త సమస్యలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంటిల్లిపాదీ ముందుగా పెట్స్‌కు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించవచ్చు అంటున్నారు నిపుణులు...‘పిల్లి చనిపోతే ఏడుస్తున్నావా, కుక్కపోతే అంత దుఃఖమా..’ అంటూ బాధపడుతున్నవారితోనే అవమానకరంగా మాట్లాడేవారుంటారు. దీనివల్ల వారి బాధ మరింత పెరుగుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. పెట్ అంటే కేవలం ఒక జంతువు కాదు. అది మనసుకు అండగా నిలిచే ఒక జీవం. మనం బాధల్లో లేదా ఆనందంలో ఉన్నప్పుడు మాటలేమీ లేకుండానే మనసును అర్థం చేసుకునే తోడు. అందుకే, ఇటీవలి కాలంలో చాలామంది పెట్స్‌తోనే ఎక్కువ అటాచ్‌మెంట్‌ను ఏర్పరుచుకుంటున్నారు. మనతో కలిసి జీవించే ప్రాణి అకస్మాత్తుగా దూరమైతే, ఇక ఎప్పటికీ రాదని తెలిస్తే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. సున్నిత మనస్కులు మరింత భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అత్యంత ప్రియమైన వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో పెంపుడు జంతువును కోల్పోయినా అంతే బాధ కలుగుతుంది.వాస్తవం ఏంటంటే...∙పెట్స్‌కి మనుషుల కంటే తక్కువ జీవనప్రమాణం ఉంటుంది. పిల్లి జీవితం కాలం 13 నుంచి 20 ఏళ్లు. కుక్క ఆయుష్షు బ్రీడ్‌ను బట్టి 10 – 13 ఏళ్లు, కుందేలు 7 –10 ఏళ్లు. ఇలాగే, ఇతర జంతువులు, పక్షులకు.. నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుంది. ∙పోషణ, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు, బరువు నిర్వహణ.. ఇవన్నీ కూడా పెంపుడు జంతువుల ఆయుర్దాయాన్ని నిర్దేశిస్తాయి. వీటిని తప్పక అంగీకరించాల్సిందే. ఈ విషయాన్ని పెట్‌ను ఇంటికి తీసుకురావడానికి ముందే కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి. పిల్లలు ఉంటే వారికి ఈ నిజాలు తప్పక చెప్పాలి. ∙పెంపుడు ఎలా ఉండాలి, క్రమశిక్షణ, వాటికి ఇవ్వాల్సిన శిక్షణ, కుటుంబంలో అందరూ నిబంధనను తప్పక పాటించాలి. నెలకు ఒకసారైనా పెట్స్ పెంపకం గురించి మంచి–చెడులను అందరూ కలిసి బేరీజు వేసుకోవాలి. ∙పెట్ చనిపోవడం ఒక్కటే కాకపోవచ్చు... సూసైడ్‌కు ఒత్తిడికి సంబంధించిన కారణాలు మరిన్ని ఉండి ఉండవచ్చు.తేలిగ్గా తీసేయవద్దుకుటుంబంలో పెంపుడు జంతువుతో ఎవరికి ఎక్కువ అటాచ్మెంట్ ఉందో అలాంటి వ్యక్తిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. ‘పిల్లికి, కుక్కకే.. ఇలా అయిపోతే ఎలా.. అది ఒక జంతువు మాత్రమే కదా’ అనే మాటలతో వాళ్ల బాధను చిన్నచూపు చూడద్దు. దీనివల్ల ఇంట్లో తమ భావోద్వేగాలను పట్టించుకోనివారిగా, తమ బంధాన్ని అగౌరవ పరిచినట్టుగా భావిస్తారు. ఇవి చేయించవచ్చు...∙పెట్ రెస్క్యూ సెంటర్స్, అడాప్షన్ సెంటర్స్‌కి వెళ్లి రావచ్చు. ∙మరో చిన్న పెట్‌ను కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. ∙యానిమల్ రెస్క్యూ టీమ్స్‌తో కలిసి స్వచ్ఛందంగా తమ సేవలను అందించవచ్చు. ∙పెట్ లాస్ – ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్, హ్యూమన్ వరల్డ్ లింక్ వంటి గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో చేరి బాధను పంచుకోవచ్చు. ∙పెట్ జ్ఞాపకార్ధం ఒక మొక్కను తెచ్చి నాటి, ఆ మొక్క పెంపకంలో సేదతీరవచ్చు. ∙పెంపుడు జంతువు గురించి నచ్చిన విషయాలను రాసి, ఇంట్లో అందరూ ఆ విషయాలను పంచుకోవచ్చు. ∙బాధ నుంచి కోలుకోవడానికి స్థల మార్పిడి బెటర్. ∙మనసుకు దగ్గరగా ఉండే స్నేహితులు, బాధను పంచుకోగలవారు దగ్గరగా ఉండాలి. పెట్ మన జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితం మొత్తం కాదు. పెంపుడు జంతువు పంచిన ప్రేమను గుర్తుంచుకోవాలి. కానీ మన జీవితాన్ని వదిలేయకూడదు.. అనే వాస్తవాల్ని పెట్ లవర్స్ తెలుసుకోవాలి, సన్నిహితులకు తెలియజెప్పాలి.నిపుణుల సాయం అవసరం...పెట్స్‌ను ప్రేమించడం మంచి విషయం. కానీ, ఆ ప్రేమ మన బతుకుని బలి తీసుకునేలా ఉండకూడదు. ఎక్కువ ఎమోషన్‌కు గురవుతుంటే, మూల కారణాలను కూడా తెలుసుకోగలగాలి. దుఃఖిస్తున్నవారితో మాట్లాడుతూ ఉండాలి. గతంలో పెంపుడు జంతువుతో ఉన్న సమయాలు పదే పదే గుర్తుకు వస్తుంటే, ఆ సమయం లో మరో ఇష్టమైన వ్యాపకంతో పూరించుకోవాలి. అధిక ప్రేమ, భావోద్వేగాల విషయంలో కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే కౌన్సిలర్ సాయం తప్పక అవసరం.– డాక్టర్ సునీత ప్రసాద్, సైకాలజిస్ట్ -
కరీంనగర్ టూ టౌన్ SI చంద్రశేఖర్ ఆత్మహత్య
-
పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య
-
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
ప్రాణం తీసిన ఆత్మాభిమానం.. ASI ఆత్మహత్య..
-
అప్పుల భారంతో అన్నదాతల బలవన్మరణం
ఎమ్మిగనూరురూరల్/గుంతకల్లు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో పంట రుణాలు అందించక.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో వైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పులు తీర్చే మార్గం లేక .. అవమానాలు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తిమ్మాపురంలో..: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామానికి చెందిన బీజీ అశోక్(28) నాలుగు ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. పంటలు, ఇంటి ఖర్చుల కోసం రూ. 9.50 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో నష్టం వచ్చింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం సాయంత్రం అశోక్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతడికి భార్య రాధ, ఉషశ్రీ(3), సాన్విక(01) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు చెప్పారు. గుంతకల్లులో..: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం సంతోష్ నగర్లో ఉంటున్న కురుబ రామిరెడ్డి(53) వ్యవసాయం కలిసి రాక.. అప్పులు తీసుకున్న వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు...కర్నూలు జిల్లా హాలహర్నికి చెందిన కురుబ రామిరెడ్డి వ్యవసాయం కోసం దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేశారు. తీర్చే మార్గం కానరాక ఐదేళ్ల కిందట గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌కు చేరుకున్నాడు. భార్య సుజాత, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులోళ్ల నుంచి వేధింపులు పెరిగిపోవడంతో దిక్కుతోచని రామిరెడ్డి ఈ నెల 12న అర్ధరాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. కసాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్
ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్‌తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వీడియోలో ఇలా పేర్కొంది..తాను కలిసి జీవించిన గౌతమ్ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్‌తో జీవించిన కాలంలో తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది. అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది."నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు." అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది."Don't get married to anyone, but don't keep any girl in deception either"The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!Constable is arrested and send to Jail.99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026 ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్ జె.వి. గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య వేధింపులకు మరో భర్త బలి
-
నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
మార్టూరు: నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (45) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు హేమంత్ కుమార్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్‌లో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా.. ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె మార్టూరులోనే ఎలుకల మందుతోపాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చి ఇద్దరూ తాగేశారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతను గమనించిన శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆస్పత్రికి... అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరి్పంచారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. సుజాత భర్త శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. -
ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు ఆత్మహత్య
అల్లాదుర్గం (మెదక్): ప్రియుడు బెదిరించడంతో ప్రియురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రోళ్ల రూప (21) హైదరాబాద్‌లో ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తోంది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రూపకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేమ్రించిన యువ కుడు, రూపకు ఫోన్ చేసి తనను కాదని మరొకరిని వివాహం చేసుకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనకు గురైన రూప సోమవారం సాయంత్రం స్థానిక చెరువులో దూకింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చెరువులోంచి బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
దీపికది ఆత్మహత్యే!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక గతనెల 5న అనుమానాస్పదంగా ఆపరేషన్ థియేటర్లో మృతిచెందిన ఘటన మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే, దీపికను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో ఎనస్థీషియా సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అమర్ సహాస్ను సోమవారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.తన కుమార్తె మృతికి అమర్ కారణమంటూ దీపిక తండ్రి కోదండరామిరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ యాదవ్, హెల్త్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశారు. అంతేకాక.. దీపికతో చివరిసారిగా ఫోన్లో డాక్టర్ అమర్ సహాస్ మాట్లాడినట్లు ఉంది. వాళ్లిద్దరికీ ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆమె ఆత్మహత్యకు అమర్ ప్రేరేపించాడనే కారణంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.పోలీసులకు పోస్టుమార్టం నివేదిక..ఇదిలా ఉంటే.. దీపిక పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందినట్లు తెలిసింది. అందులో వాంతులు కాకుండా ఇచ్చే జోఫర్ ఇంజక్షన్‌తో పాటు, మజిల్ రిలాక్సేషన్, మత్తుకు వాడే ఇంజక్షన్ ఉన్నట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. అయితే, జోఫర్‌తో ప్రాణాలు పోయే ప్రమాదం లేనందున.. మజిల్ రిలాక్సేషన్, మత్తు ఇంజక్షనే కారణంగా ఆమె మృతి చెందినట్లు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఆమె రక్తంలో గుర్తించిన ఇంజక్షన్ కాలీ వెయిల్‌ను ఘటన జరిగిన రోజు ఆమె బ్యాగులో పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. -
పెరిగిన అప్పులు.. బ్యాంకర్ల వేధింపులతో
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్‌మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్‌మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
చావుకు అడ్డొస్తోందని భార్యపై పెట్రోల్ దాడి
తిరుమలాయపాలెం: కిడ్నీ సంబంధిత సమస్యతో నరకయాతన పడుతున్న ఓ వ్యక్తి తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడాలని ప్రయత్నించాడు. కానీ కుటుంబంలో విషాదం నింపొద్దని అడ్డు తగలడమే ఆయన భార్యకు శాపమైంది. ఈక్రమంలో సదరు వ్యక్తి భార్యపై పెట్రోల్ పోసి మంట అంటించాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై జగదీశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాయపాలెంకు చెందిన తోటమళ్ల నాగభూషణం(65) రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ సందర్భంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి మూడు సార్లు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుపడింది. నానాటికీ సమస్య పెరుగుతుండడంతో అడ్డుపడుతున్న భార్యను ముందు చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈమేరకు గురువారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. కాగా, నాగభూషణం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి.వీరి కుమారుడు మండల కేంద్రంలోనే మరోచోట ఉంటున్నాడు. ఇంట్లో నుంచి మంటలు వస్తుండగా స్థానికులు గమనించి కుమారుడికి సమాచారం ఇవ్వగా వచ్చి భార్యాభర్తలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందగా, జయమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి...
ధర్మపురి: వావివరుసలు మరిచి ఓ యువకుడు వరసకు చెల్లె అయిన బాలికపైనే కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి..శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కుమారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. వరసకు సోదరుడైన కోల మహేశ్ బాలికపై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన తండ్రి నెల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. బాలిక మరణానికి కారణమైన మహేశ్‌పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
భువనగిరి, వలిగొండ: భర్తతో గొడవల కారణంగా ఇద్దరు కన్నబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్‌కు వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన ఎరుపుల యాదయ్య, పద్మ దంపతుల కుమార్తె ఐశ్వర్య (28)తో 2020లో వివాహం జరిగింది. మహేశ్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత వారికి కుమార్తె ఝాన్సీ (2) జన్మించింది. ఆ తర్వాత మహేశ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఐశ్వర్య అతన్ని నిలదీసేది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని ఐశ్వర్యను మహేశ్ వేధిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో గొడవల వల్ల పుట్టింటికి వెళ్లి అక్కడే కుమారుడి (10 నెలలు)కి జన్మనిచ్చింది. అప్పట్నుంచి అక్కడే భార్య ఉంటుండగా మహేశ్ తన కుమారుడిని చూసేందుకు ఒక్కసారీ రాలేదు. పుట్టింట్లో శుభకార్యం ఉండటంతో ఇప్పుడైనా రావాలని భర్తను భార్య కోరగా తొలుత ఆమెనే అత్తారింటికి రావాలన్నాడు. దీంతో సోమవారం సాయంత్రం ఐశ్వర్య తన పిల్లలతో కలిసి అత్తారింటికి చేరుకుంది. రాత్రికి మహేశ్ విధులకు వెళ్లగా ఐశ్వర్య తన పిల్లలతో ఓ గదిలో నిద్రించింది. మంగళవారం ఉదయం ఎంతకీ ఐశ్వర్య నిద్ర లేవకపోవడంతో అత్తమామలు గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఐశ్వర్య ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అయితే గొల్లగూడెం చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భర్తే ఐశ్వర్యను, పిల్లలను హతమార్చాడని ఆరోపించారు. భువనగిరి డీఎస్పీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి గదిలో మూడు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని.. వారిని జైలుకు పంపాలని లేఖలో ఐశ్వర్య రాసింది. తన వెంట తెచ్చిన పిల్లలను తన వెంటే మృత్యుఒడికి తీసుకెళ్తన్నట్లు లేఖలో పేర్కొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్
-
కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!
రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగుతున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి. అనుమానం పెనుభూతమై తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు. సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. వన్‌స్టాప్ సెంటర్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్ ఇస్తారు. గొడవలకు కారణాలివీ.. » పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. » ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం. ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. » సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. » ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. » సెల్ఫోన్లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. »ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం. పరిష్కారాలు ఇలా » సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం.. » ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం సమానమనే భావన కలిగి ఉండాలి. ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. » జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. » పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు.వన్‌స్టాప్ సెంటర్ నంబరు : 181 పోలీస్ హెల్ప్‌లైన్ : 112బాధితులు ముందుకు రావాలి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకు వచ్చి, పోలీసుస్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – డి.సురేష్‌బాబు, ఎస్సై, రాయవరం సానుకూల దృక్పథం అవసరం జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రశాంతంగా ఆలోచించాలి సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారి తీస్తాయి. – డాక్టర్ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం -
ప్రేమ విఫలమవ్వడంతో యూట్యూబర్ ఆత్మహత్య
-
యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
-
ప్రేమా.. తల్లిదండ్రులా..?
పెదగంట్యాడ: ప్రేమించిన వ్యక్తి ఒకవైపు. తల్లిదండ్రులు మరోవైపు. ఎవరు కావాలో తేల్చుకోలేక తన ఆవేదనను సూసైడ్ నోట్లో రాసి, ఒక ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ వుడా కాలనీలోని వినాయకనగర్‌లో నివసిస్తోంది. హెచ్పీసీఎల్లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె పైడి రజిని (20) మధురవాడలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రిపరేషన్ హాలీడేస్ ఇవ్వడంతో ఇంటికొచ్చింది. సత్యం భార్య, చిన్న కుమార్తె బుధవారం శ్రీకాకుళంలోని స్వగ్రామానికి వెళ్లారు. కుమారుడిని స్కూల్ ఆటో ఎక్కించి, సత్యం డ్యూటీకి వెళ్లాడు. అనంతరం కుమార్తె రజినీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెంది, ఎదురింటివారికి ఫోన్ చేశాడు. వారు డోర్ కొట్టినా తీయకపోవడంతో.. కిటికీలోంచి చూడగా రజిని చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న సత్యం హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. డోర్ పగులగొట్టి లోపలకి వెళ్లారు. అప్పటికే రజిని చనిపోయింది. ఇంట్లో రజిని సూసైడ్ నోట్ దొరికింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో రజినీ ఆవేదన: డాడీ.. మమ్మీ.. నాకు ఏమీ తెలియడం లేదు. నేను తప్పు చేశా. లవ్ చేశా. నేను మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆ అబ్బాయిని వదిలేశా. కానీ.. అతనితోనే నాకు ఉండాలని ఉంది. కానీ నాకు వద్దు. ఎందుకంటే మీరే ఇంపార్టెంట్ నాకు. నేను మీ కోసం ఏమీ చేయలేకపోయా. కానీ తప్పు అయితే చేయాలని అనుకోవట్లేదు. నేనే లేకపోతే తప్పు అవ్వదు కదా. అందుకే బై. చెల్లి, తమ్ముడు జాగ్రత్త. -
అంబర్ పేటలో దారుణం
-
పెళ్లింట తీవ్ర విషాదం.. అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య
-
పూత రాలిందనే మనస్తాపంతో మామిడి రైతు ఆత్మహత్య
చెన్నూర్: మారిన వాతావరణ పరిస్థితులతో మామిడి పూత మొత్తం రాలిపోవడం.. పూతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపం చెంది ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని కొత్త గూడెం కాలనీకి చెందిన మామిడి రైతు ఎల్లబోయిన మల్లేశ్ (47)కు రెండెకరాల మామిడితోట ఉంది. ఈ ఏడాది దండిగా పూత రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించాడు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడిపూత రాలిపోయింది.పూతను కాపాడేందుకు రసాయన ఎరువులు పిచికారీ చేసినా నిరాశే మిగిలింది. దీంతో శనివారం సాయంత్రం మామిడి తోటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తోట దగ్గరికి వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మరక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక అస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. -
కాసేపట్లో పెళ్లి.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
జైపూర్: కాసేపట్లో వివాహ వేడుక.. ఇళ్లంతా సందడిగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలకలలాడుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేయడంతో అక్కడంతా సందడి నెలకొంది. ఇంతలో పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీశారు. కట్ చేస్తూ.. వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లులు జరగాల్సిన ఇంట్లో.. ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ అక్కాచెల్లళ్లకు కుటుంబ సభ్యులు ఒకేరోజు వివాహం చేసేలా ముహుర్తం పెట్టారు. శనివారం ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ సందర్బంగా జస్వంత్ సింగ్ మాట్లాడుతూ.. వారిద్దరిదీ ఆత్మహత్యేనని ఆరోపించారు. బాధితుల తండ్రి, సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వారికి పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.అనంతరం, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. కాగా, వీరిద్దరూ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. -
అమ్మకు భారం కావొద్దని..
చెన్నూర్: చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్లాడు. అమ్మే కూలీ పనులు చేస్తూ.. ఇద్దరు కొడుకులను పోషిస్తూ డిగ్రీ వరకు చదివించింది. అమ్మమ్మ కూడా వీరికి సాయంగా ఉంటోంది. పెద్ద కొడుకు ఇటీవలే ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్న కొడుకు రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్ రాసినా ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో మనస్తాపం చెందిన నిరుద్యోగి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జరిగింది. పట్టణంలోని కోటబొగూడ కాలనీకి చెందిన ఒద్ది కిరణ్ (24) డిగ్రీ పూర్తి చేశాడు. తల్లి కష్టాన్ని చూడలేక ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్–2, 3, 4 రాసినా రాలేదు. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు చెన్నూర్‌కు వచ్చాడు. తల్లి, అమ్మమ్మ కుటుంబ పోషణకు పడుతున్న కష్టాన్ని చూసి మనస్తాపం చెందాడు. ఈనెల 19న ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. -
మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య
సాక్షి జగిత్యాల: ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. తీసుకున్న బాకీ ఎట్టిపరిస్థితుల్లో చెల్లించాలంటూ మైక్రోఫైనాస్స్ సంస్థ ప్రతినిధులు వేధించడంతో సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన లక్కం రాజశేఖర్ అనే వ్యక్తి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయాడు. దీంతో ఎలాగైనా అప్పు చెల్లించాలని ఆ మైక్రోఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురి చేయడంతో అప్పు తీర్చలేక తన ఇంటిలోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. -
ప్రియురాలి మృతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి విశాఖపట్నం: భీమిలీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా గల ఒక హోటల్ లో శ్యాం కూమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఉద్యోగి మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం తన ప్రియురాలితో శ్యాంకుమార్ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కలత చెందిన తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాంకుమార్ పై హైదరాబాల్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి స్వస్థలం అనకాపల్లి కాగా ప్రియుడు శ్యాంకూమార్ హైదరాబాద్ కు చెందిన వాడిగా పోలీసులు తెలుస్తోంది. -
యువతి వీడియోలు తీసి.. మంగళగిరిలో దారుణం
-
ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కుమారుడు విజయవాడలో చదువుతుండగా కుమార్తెను మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిని అదే కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యర్రబాలేనికి చెందిన రహీమ్ ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు తీశాడు. రహీమ్ ప్రవర్తనలో మార్పురావడంతో ఆ విద్యార్థిని అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్‌చేసింది. ఈ నేపథ్యంలో రహీమ్ తాను, ఆ విద్యార్థిని కలసి ఉన్న వీడియోను ఆమెకు వాట్సాప్ చేశాడు. ఈ పరిణామంతో దిక్కుతోచని ఆమె గతరాత్రి ఇంట్లో మౌనంగా ఉంది. ఏంజరిగిందని తండ్రి, అన్న అడగటంతో.. తాను ఒకరిని ప్రేమించానని, అతడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో కాలేజీకి వెళ్లవద్దంటూ మందలించిన తల్లి కుమార్తె వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుంది. విద్యార్థిని వద్ద నుంచి స్పందన లేకపోవడంతో రహీమ్ కొన్ని వీడియోలను పలువురు విద్యార్థులకు పంపించాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన సీనియర్ విద్యార్థికి ఈ వీడియోలు పంపించినట్లు తెలియడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. అవమానాన్ని తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని మృతిచెందింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉరికి వేళ్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో గుండెలు పగిలేలా రోదిస్తూ భర్తకు, కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన తండ్రి ‘ఒకసారి నేనుమాట్లాడతాను. నువ్వు ఏమీ చేసుకోవద్దు. నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తాను’ అని చెప్పినా ఇలా చేసుకున్నావేంటమ్మా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాలేజీలు, చదువులు బాగుంటాయని సొంత ఊరునుంచి ఇక్కడికి వచ్చి కూతుర్ని బలిచేసుకున్నానంటూ రోదిస్తున్నాడు. జరిగిన విషయాన్ని తాడేపల్లి ఎస్ఐ వెంకటసాయికుమార్కు వివరించాడు. నెలరోజులుగా బ్లాక్మెయిల్ ఆ విద్యార్థినిని రహీమ్ నెలరోజులుగా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. తోటి విద్యార్థుల వద్ద అది నా దగ్గరకు ఎందుకురాదు? నా కోరిక ఎందుకు తీర్చదో చూస్తాను.. అంటూ పలుమార్లు అశ్లీలంగా మాట్లాడాడని సమాచారం. గురువారం సాయంత్రం కూడా.. రేపు నాతో మాట్లాడుతుంది.. అంటూ తోటి విద్యార్థులతో చాలెంజ్ చేసిన రహీమ్ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ విద్యార్థినికి పంపించినట్లు తెలిసింది. నాలుగు రోజులుగా వీడియోలను కాలేజీ విద్యార్థులు పలువురికి పంపించినట్లు తెలిసింది. కొందరు విద్యార్థుల ద్వారా అధ్యాపకులకు కూడా ఈ వీడియోలు షేర్ అయినట్లు సమాచారం. కనీసం అప్పుడైనా కాలేజీ యాజమాన్యం స్పందించి ఉంటే ఈ విద్యార్థిని ప్రాణాలు దక్కేవని భావిస్తున్నారు. -
YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య
-
Pakistan: ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ అయిన ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. బజౌర్ జిల్లా మామండ్ తహసీల్‌లోని మలంగి ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన ఒక వాహనాన్ని ఆత్మాహుతి బాంబర్ నేరుగా చెక్పోస్టులోనికి పోనివ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందితో సహా కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆత్మాహుతి దాడి పేలుడుతోనే ముగిసిపోలేదు. బాంబు దాడి జరిగిన వెంటనే సాయుధ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ముందస్తు ప్రణాళికతో చేసిన భారీ ఆపరేషన్‌గా దీనిని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు తొమ్మిది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సామాన్య పౌరులు కూడా ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మలంగిలోని ఒక మదర్సా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, కార్యాలయాల కిటికీలు పగిలిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చ్టుటుముట్టిన సమయంలో కాల్పుల శబ్దాలు మిన్నంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)లాంటి సాయుధ గ్రూపులు ఖైబర్ పఖ్తున్ఖ్వా అంతటా భద్రతా బలగాలపై దాడులను తీవ్రతరం చేశాయి. గతంలో కూడా ఉత్తర వజీరిస్తాన్, పెషావర్ తదితర ప్రాంతాల్లో సైనిక కాన్వాయ్‌లు, పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులే జరిగాయి. ఇది కూడా చదవండి: కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
పుత్రశోకాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహాత్య
ఛత్తీస్‌గఢ్‌లో హృదయవిధారకర ఘటన జరిగింది. తాము కంటికి రెప్పలా కాపాడి నవ మాసాలు పెంచి పెద్దచేసిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులిద్దరూ ఆవేదనతో తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నించినా ఆ దుఃఖం నుంచి బయిటకీ రాలేకపోయారు. కుమారున్నే తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు. పుత్ర శోకం నుంచి బయిటికి రాలేక భార్యభర్తలిద్దరూ తనువు చాలించారు.జంజీర్ చంఫా జిల్లాకు చెందిన కృష్ణా, రమాబాయిలకు ఒకే కుమారుడు అతని పేరు ఆదిత్యపటేల్. 2024లో ఆదిత్యా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి ఆయన తల్లిదండ్రులు డిఫ్రెషన్‌లోకి వెళ్లారు. ఎంత ప్రయత్నించినా కుమారుడిని మరిచి పోలేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తనువు చాలిద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.చివరిసారిగా వారు లేఖలో "మా జీవీతం. మా పునాది, మా ప్రపంచం, అతనే మా కేర్ టేకర్ నా మిత్రుడు. ఆ రోజు బయిటకి వెళ్లనని తన కుమారుడు చెబితే తానే బలవంతంగా పంపాను అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు" అని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత అతను ప్రపంచాన్నే వదిలాడు. మేము జీవిస్తున్నాం కానీ నిజానికి అలా లేదు అని లేఖలో రాసి తమ ఇంటి పెరడిలో భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకొని మరణించారు. ఇంతకాలం బాధతో రగిలిపోయిన తన హృదయం ఇప్పుడు ప్రశాంతత వైపు వెలుతుందని దేవుడు చాలా దయగలవారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే తన కుమారుడి ప్రమాదానికి వచ్చే పరిహారం దయచేసి తన సోదరుడికి అందజేయాలని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మరణంతో ఈ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్డం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
విషాదం.. ముగ్గురు పిల్లలని చంపి ఆపై వారు మృతి
ఉత్తరప్రదేశ్‌లో విషాదం జరిగింది. తీవ్ర మనస్థాపంతో ఒక పండంటి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుపచ్చలారని తమ ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపిన అనంతరం భార్యభర్తలిద్దరూ తనవు చాలించారు.మధురలో నివసించే మనిష్ కుమార్ అనే వ్యక్తికి 2018లో వివాహమయ్యింది. వారికి హానీ, ప్రియాంశ్, ప్రీతిక్ అనే ముగ్గురు పిల్లలు అయితే ఏం జరిగిందే తెలియదు కాని కుటుంబసభ్యలు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ముగ్గురిని గొంతు నులిమి హతమార్చిన అనంతరం భార్యభర్తలు తనువు చాలించారు.మనిష్ విద్యుదాఘాతంతో మరణించగా ఆయన భార్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే వారి ఇంటి వద్ద సూసైడ్‌కు సంబంధించిన ఒక వీడియో లభించింది. అందులో తమ ఇష్టపూర్వకంగానే తాము చావాలనుకుంటున్నారని ఇందులో ఎవరి తప్పుగానీ బలవంతం గానీ లేదన్నారు. పోలీసులు సైతం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని లేఖలో పేర్కొన్నారు.అయితే తాను ఇటీవల ఒక స్థలాన్ని రూ.12 లక్షలకు అమ్మానని దానికి ఎటువంటి ఇబ్బందులు జరగలేదని వీడియోలో పేర్కొన్నారు.అయితే పిల్లలు ఆడుకోవడానికి బయిటకి రాకపోగా అనుమానం చెందిన గ్రామస్థులు తలుపులు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో గోడలు బద్దలు గొట్టి లోపలికి వెళ్లగా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆసమాచారాన్ని పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేప్టటారు. -
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. వేధింపులే కారణమా?
సాక్షి నారాయణ పేట: మక్తల్‌లో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదిన సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.రేపు బుధవారం ఎలక్షన్ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. -
నా చావుకు భార్య, అత్తామామలే కారణం
హైదరాబాద్: తన చావుకు భార్య, అత్తా, మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్‌పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేకరు.. మార్కాపురానికి చెందిన సీతారాంరెడ్డి (36), రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. గతంలో భార్య రేణుక ఇన్‌స్ట్రాగాంలో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్దిరోజుల తరువాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే గత జనవరి నెల 24 న మళ్లీ అదృశ్యమైంది.భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్తామామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాంరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన తన చావుకు భార్య, అత్తా, మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణం అని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.చదవండి: వాడ్ని ఊరికే వదిలిపెట్టకండి -
పాప అని ఒక్కసారి పిలువు అన్న ప్లీజ్.. గుండెల్ని పిండేస్తున్న పద్మ లెటర్
-
ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఉరి
మేడిపల్లి: ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ.. ఒక బాలుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బోడుప్పల్‌లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఓ ప్రయివేట్ ఉద్యోగి నివసిస్తున్నాడు. అతని కుమారుడు గంగాధరి అభినవ్ (17) ఐటీఐ చదువుతున్నాడు. మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు రాత్రి షాపింగ్ కోసమని బయటకు వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు క్లాస్మేట్ అయిన ప్రియురాలికి వీడియోకాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. చున్నీతో అభినవ్ ఉరి వేసుకోవడం చూసిన బాలిక.. వెంటనే అతని స్నేహితులకు సమా చారం అందించింది. స్నేహితులు వెంటనే బాలుని ఇంటికి చేరుకుని తలుపు బలవంతంగా తెరిచి.. అతన్ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. అభి నవ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు. -
కన్న బిడ్డలను చంపుకున్న ఇద్దరమ్మల కన్నీటి కథ..
-
ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య
-
వెంటాడిన అజ్ఞాత వ్యక్తి! ఆత్మహత్య కు కారణం అదే..
-
చర్లపల్లి కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. తల్లికి ఫోన్ చేసి..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, విజయ కుటుంబం మృతి మిస్టరీపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. విజయ భర్తను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. కానీ, వారి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు.చర్లపల్లి ఐటీ ఉద్యోగి విజయ(విజయశాంతి రెడ్డి) కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకునే రోజు.. కొడుకు, కూతురిలో సహా కారులో విజయ రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత తాము ఫంక్షన్ వచ్చినట్టు తల్లికి ఫోన్ చేసి చెప్పింది. చనిపోయేందుకు ముందు రోజే కూతురిని హాస్టల్ నుంచి ఇంటి తీసుకువచ్చిన విజయ. ముగ్గురూ రైల్వే స్టేషన్లో ప్రశాంతంగా మాట్లాడుతూ తిరిగినట్టు సీపీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు పట్టాల మధ్యలో నుంచి నడుచుకుంటూ విజయ, పిల్లలు వెళ్లారు. ఈ క్రమంలో వారిని రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.అయితే, పిల్లలను రైల్వేస్టేషన్‌కు ఏమని చెప్పి తీసుకువచ్చారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇలా చనిపోవడానికి సిద్దమై ముగ్గురు వచ్చారా? లేక తల్లి విజయే బలవంతంగా తీసుకువచ్చిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. తన ఉద్యోగం ద్వారా విజయకు లక్ష రూపాయల జీతం వస్తోంది. ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయ అకౌంట్లో జమ అవుతోంది. పిల్లలకు ఐఐటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో హాస్టల్లో ఉంచి చదివిస్తున్న దంపతులు. పిల్లల చదువులకు అధిక డబ్బుల కోసమే విజయ భర్త దుబాయ్‌కు వెళ్లినట్టు తెలిసింది.కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డితమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్‌కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
విజయశాంతి రెడ్డి ఘటనపై డాక్టర్ అనిత షాకింగ్ నిజాలు..
-
ఎందుకమ్మా! ఏమైందమ్మా!
-
అంతసేపు పని చేయడం నావల్ల కావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అన్నేసి గంటలు పని చేయడం తన వల్ల కాదంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన మేరకు.. ఏపీలోని ఐ పోలవరం(కోనసీమ) మండలం తిల్లకుప్ప గ్రామానికి చెందిన ఉండ్రు సతీష్(31) నగరంలో ఐటీ ఉద్యోగి. కిందటి ఏడాది రవళి అనే యువతితో వివాహం అయ్యింది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తూ.. మియాపూర్ బీకే ఎన్క్లేవ్ కాలనీలో ఆ దంపతులు నివాసం ఉంటున్నారు. సతీష్ భార్య సంక్రాంతి పండుగకు ఊరెళ్లగా.. తమ్ముడు సతీష్ వెంకటకృష్ణ అన్నకు తోడుగా ఉండిపోయాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం ఎంతకీ సతీష్ బెడ్రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు, స్థానికుల సాయంతో వెంకటకృష్ణ తలుపులు బద్ధలు కొట్టాడు. తీరా చూస్తే.. సతీష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పని ఒత్తిడి తట్టుకోలేకనే సతీష్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. అన్నేసి పని గంటలతో మానసికంగా అతను కుంగిపోయినట్లు నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన మియాపూర్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పని ఒత్తిడి గురించి మరోసారి చర్చకు దారి తీసింది. -
ఘజియాబాద్ దారుణం: సంచలన వాస్తవాలు వెల్లడి
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ‘కొరియన్ లవ్’ గేమింగ్ టాస్క్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలయ్యారు. వారు టాస్క్ పూర్తి చేయడంలో భాగంగా తమ అపార్ట్మెంట్లోని తొమ్మిదో అంతస్తు కిటికీ నుండి దూకి ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలంలో పోలీసులు ఎనిమిది పేజీల డైరీని, గ్లాస్ ప్యానెల్‌పై రాసిన మరికొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మమ్మల్ని కొరియా వెళ్లకుండా ఆపుతారా?’ అని రాసి ఉన్న వాక్యాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొరియన్ సంస్కృతిపై విపరీతమైన వ్యామోహం, ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావడమే ఈ దారుణానికి ప్రాథమిక కారణాలని పోలీసులు చెబుతున్నారు.ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికలు కే-డ్రామాలు, కే-పాప్ సంగీతానికి ఎంతలా ఆకర్షితులయ్యారంటే, వారు తమ నిజమైన పేర్లను వదిలేసి అలీజా, సిండి, మారియా అనే కొరియన్ పేర్లతో పిలుచుకునేవారు. తమకంటూ ఒక ప్రత్యేక ఊహాలోకాన్ని సృష్టించుకున్న ఈ బాలికలు చైనా, జపాన్, థాయ్‌లాండ్ సంస్కృతులను కూడా అమితంగా ఇష్టపడేవారు. ‘మమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, కనీసం మా సోదరుడు కూడా మా ఇష్టాన్ని గుర్తించడం లేదు’ అని వారు తమ డైరీలో ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే కోరిక నెరవేరకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది.ఈ అక్కాచెల్లెళ్లు 2020 నుండే పాఠశాలకు వెళ్లడం మానేశారు. వీరికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవని, ఇరుగుపొరుగు వారితో కూడా మాట్లాడేవారు కాదని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రి ఇటీవల తాను వాడుతున్న ఏకైక మొబైల్ ఫోన్‌ను రూ. 3,500లకు అమ్మేశారు. అలాగే 2,000 మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఖాతాను తొలగించడం ఆ అక్కాచెల్లెళ్లను తీవ్రంగా కలచివేసింది. ఈ నేపధ్యంలోనే వారు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆ బాలికల తండ్రికి ముగ్గురు భార్యలున్నారని, వారు ముగ్గురూ అక్కాచెల్లెళ్లేనని పోలీసుల విచారణలో తేలింది. ఒకే ఫ్లాట్‌లో ఈ కుటుంబమంతా నివసిస్తోంది. కుటుంబంలోని సభ్యుల విభిన్న పోకడలు, ఆర్థిక ఇబ్బందులు బాలికల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఆన్లైన్ టాస్క్ ఆధారిత గేమ్‌ల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’ షాక్.. 300 మంది ఉద్యోగుల తొలగింపు -
బ్లాక్‌మెయిల్‌తో బలవన్మరణం
చిక్కడపల్లి (హైదరాబాద్): ఆన్లైన్ లోన్ యాప్‌ల అరాచకాలు సామాన్యుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. కేవలం మూడు వేల రూపాయల స్వల్ప రుణం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాప్ ఏజెంట్ల అసభ్యకర బెదిరింపులు, మానసిక వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఇన్స్పెక్టర్ మల్లేశం తెలిపిన వివరాలివి.ముంబై నుంచి వచ్చి.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావి, శాస్త్రిచౌక్కు చెందిన ప్రేమ్ కుమార్ రాజు బర్ల (30) బతుకుతెరువు కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. చిక్కడపల్లి రిసాల అంబేడ్కర్‌నగర్‌లో తన భార్య నాగమణితో కలిసి నివసిస్తున్నారు. వీరికి వివాహమై రెండేళ్లు అవుతోంది. దంపతులిద్దరూ కలిసి ఇటీవల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీకర హాస్పిటల్లో ఒక క్యాంటీన్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.చిన్న మొత్తం.. పెద్ద శాపమై.. గతంలో తన అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా ప్రేమ్ కుమార్ రూ.3 వేల రుణం తీసుకున్నారు. అయితే, సకాలంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రేమ్ కుమార్‌కు ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రుణం చెల్లించడంలో జాప్యం జరిగితే, ప్రేమ్ కుమార్‌తో పాటు ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలుగా మారుస్తామని ఏజెంట్లు హెచ్చరించారు. వాటిని కుటుంబ సభ్యులకు పంపడమే కాకుండా, సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని అత్యంత దారుణంగా బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. వరుస కాల్స్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురైన ప్రేమ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దీంతో ప్రేమ్‌కుమార్ మంగళవారం రాత్రి తన అద్దె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఫోన్లోని కాల్ డేటా, లోన్ యాప్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్ఐ అభిలాష్‌లు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
సారీ నాన్నా..!
ఘజియాబాద్: కోవిడ్‌కాలంలో స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయిన టీనేజర్లలో కొందరు పూర్తిగా ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై చివరకు వాటికి బలవుతున్న దారుణోదంతం తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఘజియాబాద్‌కు చెందిన ముగ్గురు టీనేజీ అక్కాచెల్లెళ్లు నిషిక(16), ప్రాచీ(14), పఖీ(12) మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో తాము నివసించే అపార్ట్మెంట్ 9వ ఫ్లోర్ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో చిన్నారుల ఫోన్ వినియోగం, ఆన్లైన్ గేమ్స్ వ్యసనం ఎంతటి దారుణాలకు దారితీస్తుందోన్న విస్తృతచర్చలకు తెరలేచింది. ఆత్మహత్య ఘటన తెల్సి పోలీసులు రంగంలోకి దిగి వాళ్లింట్లో సోదాలుచేసి సూసైడ్ నోట్‌ను స్వాధీనంచేసుకున్నారు. ఏడుస్తున్న ఎమోజీని జతచేసి ‘ సారీ నాన్నా. నిజంగా సారీ’’ అంటూ పలు వాక్యాలు రాసి ఉన్న లేఖను చూసి తండ్రి చేతన్ కుమార్ బోరున విలపించారు. షాలిమార్ గార్డెన్ అసిస్టెంట్ కమిషనర్ అతుల్ సింగ్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాహిబాబాద్‌లోని భరత్సిటీలో ఉన్న చేతన్‌కుమార్ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తుంటాడు. ఇతను ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు. వీళ్లకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలిగారు. అందరూ ఒకే అపార్ట్మెంట్లో కలిసే ఉంటున్నారు. నలుగురు కుమార్తెల్లో నిషిక, ప్రాచీ, పఖీలు కోవిడ్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అందులోనూ ఆన్‌లైన్‌గేమ్‌లకు బాగా అలవాటు పడ్డారు. కొరియన్ ఆన్లైన్ గేమ్స్ అంటే విపరీతమైన పిచ్చి. దీంతో చదువుల్లో బాగా వెనకబడ్డారు. చివరకు పాఠశాలకు వెళ్లడం మానేశారు. గత రెండేళ్లుగా ముగ్గురూ స్కూల్ ముఖం చూడలేదు. ఇంట్లో తమ గదికే పరిమితమయ్యారు. ఎప్పుడూ కలిసి స్నానంచేయడం, తినడం, పడుకోవడం, ఫోన్ చూడటం తప్ప మరో పని చేసిందే లేదు. దీంతో ఫోన్ వాడకం ఆపేయాలని తండ్రి ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. అయితే మంగళవారం మాత్రం ఈ విషయమై గొడవ జరిగిందని వార్తలొచ్చాయి. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్ పదో అంతస్తు ఫ్లాట్‌లో ఉండే అరుణ్ అనే వ్యక్తి తన బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు. అదే సమయానికి ఈ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తులోని తమ బాల్కనీ వద్దకు చేరుకున్నారు. పెద్దవాళ్లు ఇద్దరు హత్తుకుని ఒక్కటిగా కిందకు పడిపోగా వాళ్లను పట్టుకోబోయి చిన్న చెల్లెలు సైతం కిందకు పడటం చూసి హుతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ముగ్గురు హాహాకారాలు చేస్తూ కిందకు దూకడంతో అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. నేలపై రక్తపుమడుగులో పడి ఉన్న ముగ్గురినీ సమీప లోనీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు.కొరియాకు వెళ్తామనేవారు..ఘటనపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు ఫోన్ చూస్తున్నారని అనుకున్నా. గేమ్స్ ఆడుతున్నారనిగానీ, టాస్క్‌లు ఉండే ఆన్లైన్ ఆటలాడుతున్నారని గానీ నాకు తెలీదు. ఒక గేమ్నయితే వాళ్లు దాదాపు మూడేళ్లుగా ఆడుతున్నారు. మేం కొరియాకు వెళ్లొస్తామని తరచూ నాతో అనేవాళ్లు. భయంకరమైన టాస్క్‌లు గేమ్‌లో ఉంటాయని నాకు తెలియదు. వీళ్ల మొబైల్ ఫోన్లను పోలీసులు పరిశీలించాకే నాకీ విషయం తెల్సింది. గేమ్‌ల సంగతి తెలిస్తే ముందే వీళ్లను హెచ్చరించేవాడిని. కనీసం ఫోన్లు ఇచ్చేవాడినే కాదు. వ్యసనపరులుగా మారేదాకా ఏ తండ్రీ చూస్తూ ఊరుకోడు’’ అని తండ్రి ఏడుస్తూ చెప్పారు. గేమ్‌లో ప్రాచీ బాస్‌గా ఉండేదని, అక్క నిషిక, చెల్లి పఖీ ఈమె ఆదేశాలను శిరసావహించేవారని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో 14 ఏళ్ల బాలుడు ప్రమాదకర బ్లూవేల్ గేమ్ ఆడుతూఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ఘజియాబాద్ ఉదంతం గుర్తుకుతెస్తోంది. ఆనాడు రష్యాలో మొదలైన ఈ ఆన్లైన్ గేమ్ రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మధ్యాసియా దేశాల్లో 130 మంది ప్రాణాలుతీసింది. గేమ్ మొదలెట్టిన 50 రోజుల్లోపు గేమ్ ఆడే వ్యక్తి మరణించేలా అందులో టాస్క్‌లు ప్లాన్చేశారు. ఇది కూడా చదవండి: తేనెటీగల దాడి: పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన వంట మనిషి -
తల్లీపిల్లల ఆత్మహత్య కేసు.. వెలుగులోకి CCTV దృశ్యాలు
-
అంతుచిక్కని తల్లీపిల్లల ఆత్మహత్య కేసు
-
మార్చిలో దుబాయ్ చూపించాలనుకున్నా!
భువనగిరి(బీబీనగర్)/సికింద్రాబాద్: ‘మా పిల్లలకు తల్లిమాట వేదవాక్కు. ఆమె ఏది చెప్పినా తప్పకుండా వింటారు. వారిని అంతే ప్రేమగా చూసు కుంటుంది నా భార్య. అందుకే పిల్ల లంటే తల్లికి, తల్లి అంటే పిల్లలకు మహాప్రాణం. ఇటువంటి మా ప్రేమా నురాగాల కుటుంబంలో ఇంతటి ఘోరం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది దేవుడికే తెలియాలి. నా భార్యాపిల్లలను దుబాయ్ చూపించేందుకు మార్చి నెలలో తీసుకెళ్లాలని అనుకున్నా..ఇంతలోనే ఘోరం జరిగింది.’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు పిన్నింటి సురేందర్ రెడ్డి. జనవరి 31న మేడ్చల్ జిల్లా చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య రైలు మార్గంలో తల్లి విజయశాంతి రెడ్డి, కుమార్తె చేతన, కుమారుడు విశాల్ రెడ్డిలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మృతురాలి భర్త సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పిల్లలు ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నట్లు చెప్పారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే 14 నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. జనవరి 27న తన కుమార్తె జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు తనతో మాట్లాడిందని, పరీక్ష బాగా రాశానని కచ్చితంగా సీటు వస్తుందని చెప్పిందన్నారు. ఇంతలోనే జనవరి 31వ తేదిన ఉదయం 8.30 గంటల సమయంలో తన బావమరిది ఫోన్ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించగా విజయశాంతి మరణించిందని చెప్పాడన్నారు. అనంతరం కొద్దిసేపటికి పిల్లలతో కలిసి చనిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మధ్యాహ్నం ఫ్లైట్ ద్వారా రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు చెప్పారు. తనకు ఎవరి మీద అనుమానం లేదని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు సైతం లేవని, తన కుటుంబ సభ్యులు బంగారం లాంటి వారని ఆయన చెప్పారు.కారు అప్పగింత.... బలవన్మరణానికి ముందు పిల్లలను తీసుకుని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి విజయశాంతిరెడ్డి వినియోగించిన కారును పోలీసులు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన మరుసటి రోజు కారును చర్లపల్లి నుంచి పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. విజయశాంతి రెడ్డి తమ్ముడు చిరంజీవి రెడ్డి ఆయన తల్లి ఇరువురు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి కారును తీసుకుని వెళ్లిపోయారు.ఎఫ్ఎస్ఎల్కు సెల్‌ఫోన్...విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్‌ను మంగళవారం సైబర్ పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆమె సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను సైబర్ పోలీసులకు పంపించగా అది ఓపెన్ కాలేదని తెలిసింది. వివరాలు బయటికి తీయడం కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపినట్టు సమాచారం. -
పెళ్లి కావటం లేదని.. హుసేన్‌సాగర్‌లో దూకిన యువతి..
హైదరాబాద్: పెళ్లికాలేదనే మనస్థాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ భైంసాకు చెందిన టి. విజయలక్ష్మి (26) తల్లి సరస్వతీతో కలిసి కూకట్‌పల్లిలోని మైత్రీనగర్‌లో నివాసం ఉంటోంది. తల్లికి మనస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కూతురు విజయలక్ష్మీ చూసుకుంటోంది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వివాహం అనంతరం తల్లి కూడా తనతో పాటే ఉంటుందని చెబుతుండటంతో సంబంధాలు వెనక్కుపోతున్నాయి. దీంతో మనస్తాపం చెంది జనవరి 31న ఉదయం ర్యాపిడో బుక్ చేసుకుని రెండు రోజుల్లో తిరిగి వస్తానని తల్లికి చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కజిన్ బ్రదర్ ఆదివారం కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం తేలి ఉందని సమాచారం రావడంతో లేక్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుప్రతికి తరలించి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఉండటంతో విజయలక్ష్మిగా గుర్తించడంతో లేక్ పోలీసులు కేసులు కూకట్పల్లి పోలీసులకు బదిలీ చేశారు. -
తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
ఉరేసుకునేందుకు భార్య యత్నం.. స్టూల్ తన్నేసిన భర్త
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తను బెదిరించి భార్య స్టూలెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించంది. మద్యం మత్తులో ఉన్న భర్త స్టూలును కాలితో తన్నడంతో ఊపిరి ఆడక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ కూలీగా పని చేస్తాడు. కొన్నేళ్ల క్రితం అరుణతో వివాహం అయింది. అరుణ ఓ మెడికల్ షాపులో పనిచేస్తోంది. కాగా, కొండల్ రోజూ మద్యం తాగి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడే విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కొండల్ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అరుణ ఆత్మహత్య చేసుకుంటానంటూ స్టూల్ వేసుకొని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీ బిగించింది. భర్తను బెదిరిద్దామని స్టూలు వేసుకొని ఉరి పె ట్టుకోగా మద్యం మత్తులో ఉన్న కొండల్ స్టూల్‌ను తన్నాడు. దీంతో అరుణ ఊపిరి ఆడక మరణించింది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రశ్నించగా అరుణ ఆత్మహత్య చేసుకుందని కొండల్ చె ప్పా డు. అయితే మృతురాలి కుమారుడు తన తండ్రి స్టూల్ త న్నడం వల్లనే తల్లి మరణించిందని చెప్పడంతో పోలీసులు కొండల్‌ను అదుపులోకి ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ ఎందుకలా చేసిందో..!
హైదరాబాద్: చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఇంటర్ చదివే కుమారుడు, కూతురుతో కలిసి ఆ తల్లి రైలుకింద పడి బలవన్మరణం చేసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులకు ఇప్పటి వరకు ఎటువంటి క్లూ లభించలేదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలవన్మరణం కేసు మిస్టరీ ఆదివారం రాత్రి వరకు వీడలేదు. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గంటల కొద్దీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్ సందేశాలలో పోలీసులకు రెండు అనుమానాస్పద సందేశాలు లభించాయి. ఈ రెండు సందేశాలను పంపించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను రైల్వే పోలీసు లు సికింద్రాబాద్ రప్పించి విచారించారు. ఒకరు సారీ మేడం ఇటువంటి తప్పు మరోమారు జరగదు అని, మరోకరు మేడం గుడ్‌మార్నింగ్ అని సందేశాలు పంపించారు. ఇవి రెండు సందేశాలు కార్యాలయ సమాచార నిమిత్తం పంపినవని పోలీసులు తమ విచారణలో ధృవీకరించుకున్నారు. సహచరులను పోలీసులు సంప్రదించినా విజయశాంతిరెడ్డి తన కార్యాలయంలో చురుకుగా ఉండే తీరును మాత్రమే పోలీసులకు వివరించారు. ఎప్పుడూ తను ఆందోళన చెందుతున్నట్టు కానీ... భయపడుతున్నట్టు కానీ కనిపించేది కాదని చెబుతున్నట్టు జీఆర్పీ ఇన్స్సెక్టర్ జీ.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి పుట్టింటివారు, మెట్టింటికి చెందిన పలువురు సమీప బంధువులను కూడా పోలీసులు విచారించారు. వారి నుంచి కూడా పోలీసులు ఆశించిన సమాచారం అభించలేదు. సురేందర్‌రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులది ఆదర్శవంతమైన జీవనమని బంధువులు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారికి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విజయశాంతిరెడ్డి పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకునేంతటి పరిస్థితులు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్మాప్తు ముమ్మరం చేశారు. విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్‌ను సైబర్ క్రైం పోలీసులకు పంపించినట్టు జీఆర్పీ పోలీసులు తెలిపారు. వారం రోజుల్లో ఈ వివరాలు వచ్చే అవకాశముంది. డేటా వస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉన్నట్టు వారు చెప్పారు. -
హైఎండ్ కార్లు, చాపర్ రైడ్స్ : ఎందుకు సీజే రాయ్ ఆత్మహత్య?
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, సీజే రాయ్ అలియాస్ చిరియాంకందత్ జోసెఫ్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన నివాసంలో మృతి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోరారాజులా వెలిగిన రాయ్ ఆత్మహత్యకు గల కారణాలేంటి? హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ప్రయణాలతో, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాయ్ గురించి కొన్ని ఆసక్తి కర సంగతులను పరిశీలిద్దాం57 ఏళ్ల CJ రాయ్ మరణం బెంగళూరు రియల్ ఎస్టేట్ , వ్యాపార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్, తమ చైర్మన్ సీజే రాయ్ పై తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ దారుణమైన చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐటీ నిఘా నీడలోఉన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన మరణం వెనుక ఉన్నకారణాలపై పోలీసులు కారణాలు దర్యాప్తులో ఉన్నాయి.రాయ్ తన కరీర్ ప్రారంభంలో, రాయ్ టెలివిజన్ రియాలిటీ షోల డీల్స్, విజేతలకు బహుమతులివ్వడం, బ్రాండింగ్ వ్యూహంగా ఉపయోగించాడు. విజేతలకు రియల్ ఎస్టేట్ బహుమతులను అందించేవాడు. మీడియాతో ఎక్కువ సంబంధాలను కలగి ఉండేవాడు. ఇది అతని కంపెనీ పబ్లిక్ ప్రొఫైల్‌ను గణనీయంగా పెంచింది. అలా తన సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా, ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో పేరున్న సంస్థగా తీర్చిదిద్దాడు. రాయ్ సోషల్ మీడియా ఉనికిని పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి దాదాపు 1.3 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఫీడ్‌లో కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించే పోస్ట్‌లతో పాటు, హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ఇతర ప్రయాణ స్టోరీలను క్రమం తప్పకుండా తన ఫాలోయర్లతో పంచుకునేవాడు. అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) జనవరి 30న సెంట్రల్ ఆదాయపు పన్ను శాఖకు వాంగ్మూలం ఇవ్వడానికి రాయ్ బెంగళూరులోని లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి జోసెఫ్‌తో కలిసి వచ్చారు. ఆ తర్వాత రాయ్ తన క్యాబిన్‌కు వెళ్లి తన తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత తన క్యాబిన్లోకి ఎవ్వరినీ అనుమతించవచ్చని సెక్యూరిటీకి చెప్పాడు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడిందని గ్రహించి,బలవంతంగా క్యాబిన్ తలుపు బలవంతంగా తెరిచారు. తుపాకీ గాయాలతో పడిపోయి కనిపించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు కేరళకు చెందిన ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకారం, డిసెంబర్ 3, 6, జనవరి 28 తేదీల్లో బెంగళూరు , ఇతర ప్రాంతాలలో రాయ్ మరియు అతని వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన సోదాలు అనేక సందర్భాల్లో జరిగాయి. దీనిపై బెంగళూరులోని అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో, కాన్ఫిడెంట్ గ్రూప్ ఎండీ రాయ్ మరణానికి దారితీసిన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని కోరారు. సోదాల సమయంలో జరిగిన సంఘటనల క్రమం సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.భూమి కొనండి, ఇంట్రస్టింగ్ రాయ్ సందేశంరాయ్, తాను 25 ఏళ్ల వయసులో 1994లో కొనుగోలు చేసిన తన తొలి కారును కనిపెట్టిన వారికి 10 లక్షల బహుమతిని ప్రకటించాడు. ఎర్ర మారుతి 800ను చివరకు తిరిగి పొందారు.1994లో, తన సొంత డబ్బులతో ఆ కారును రూ.1.10 లక్షలకు కొనుగోలు చేశాడట. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు 27 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి సాధించాడట. 1997లో ఈ మారుతి 800 కారును అమ్మేసి, మారుతి ఎస్టీమ్ కొనుగోలు చేశాడు. అప్పటికి భారతీయ రోడ్లపై అత్యంత ఖరీదైన , ఉత్తమమైన కారు. తానెపుడూ ఎప్పుడూ కారు ప్రేమికుడినే కానీ ఫస్ట్ కారు ప్రేమే వేరు అని ఒక పోస్ట్‌లో వెల్లడించడం విశేషం ఈ రోజు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు ఉన్నప్పటికీ, తన మొదటి మారుతి 800 అతని అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు.ఆయన ఇంకో విషయం కూడా చెబుతారు. తన తొలి కారు కొన్నిసమయంలో ఆ డబ్బుతో సర్జాపూర్‌లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయగలిగేవారు. ఈ రోజు, ఆ 2 ఎకరాల విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని ఒక సందర్బంగా చెప్పాడు. కారు కొనండి.. కారుతోపాటు, ఎంతో కొంత భూమిని కూడా కొనండి. భూమి కుటుంబ సంపదగా మారుతుంది అనేది ఫిలాసఫీ. View this post on Instagram A post shared by Dr Roy Chiriankandath Joseph (@dr.roy.cj) -
పోస్టు చేసేముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం!
సోషల్ మీడియా ట్రోలింగ్లు... డిజిటల్ విచారణలు ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన కళ్లకు కడుతోంది. ఓ మహిళ ఒక వ్యక్తిపై బహిరంగంగా ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల మనస్తాపంతో అతను ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. 35 ఏళ్ల శింజిత ముస్తఫా కేరళకు చెందిన ఒక ఇన్ఫ్లూయెన్సర్. ఇటీవల ఆమె తాను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్చేసింది. ఈ వీడియో సుమారుగా 20 లక్షల వ్యూస్‌తో వైరలయ్యింది. నిజానిజాలు తెలుసుకోకుండా నెటిజన్లు పెట్టే కామెంట్లు అతన్ని కలచి వేశాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వ్యూస్ కోసమేనా?దీపక్ ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు రాగానే శింజిత సోషల్ మీడియాలో తాను ఆరోపణలు చేసిన వీడియోని డిలీట్ చేయడమే గాక తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోని అప్లోడ్ చేసింది. కానీ అప్పటికే.. వ్యూస్ కోసమే శింజిత ఇలా చేసినట్లు ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోని కూడా ప్రైవేట్మోడ్లోకి మార్చేసింది. దీనంతటినీ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శింజితను అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు చేసే పోస్టుల పర్యవసానాల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని నిపుణులు అభి్రపాయపడుతున్నారు. -
సోషల్ మీడియాలో ఓ మహిళ పెట్టిన వీడియోతో వ్యక్తి ఆత్మహత్య
-
ఐఐటీలో మరో విషాదం.. ఆ ఘటన మరువక ముందే..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గల ఒక భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకి 25 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఇది రెండో ఆత్మహత్య కావడం విద్యార్థులను, అధ్యాపకులను ఆందోళనకు గురిచేస్తోంది.ఎర్త్ సైన్సెస్ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న రామ్‌స్వరూప్ ఇష్రామ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన రామ్‌స్వరూప్ ఇష్రామ్, ఐఐటీ క్యాంపస్‌లోని న్యూ ఎస్బిఆర్ఏ రెసిడెన్షియల్ బ్లాక్‌లో ఉన్న ఏఏ-21 అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. భార్య మంజు, మూడేళ్ల కుమార్తెతో అతనితోపాటు ఉంటున్నారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో మృతుడు గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. గతంలో ఆయన పలుమార్లు కౌన్సెలింగ్ కూడా తీసుకున్నారని డీసీపీ ఎస్.ఎం. ఖాసిం అబిది వెల్లడించారు.ఈ ఘటనపై విచారణలో భాగంగా మృతుని భార్యను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఐఐటీ కాన్పూర్‌లో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకుముందు 2025, డిసెంబర్ 29న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి జై సింగ్ మీనా తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మీనా, బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ-బ్లాక్ హాస్టల్లోని గది నంబర్ 148లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మీనా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: మందులకు ఏఐ సాయం.. ‘ఎయిమ్స్’ తీవ్ర హెచ్చరిక -
సోషల్ మీడియాలో ఇదేం తొండాట(డబుల్ గేమ్)?!
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్ఫ్లుయెన్సర్ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్‌కు చెందిన దీపక్(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్‌కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. తిట్టిపోసిన అదే సోషల్ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్‌కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్ ఫ్యామిలీ ఈ డబుల్ గేమ్ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్ అని అంటోంది. షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్‌గానూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్ వేధింపుల వీడియోను పోస్ట్ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది(దానికి కామెంట్లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. మగ ప్యాసింజర్లకు, మగ కండక్టర్లకు ఇవి తప్పవా?మూడు రోజుల క్రితం చేయని తప్పుకు తన మీద వీడియో తీసి తనను అవమానించినందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంగా, కేరళ బస్సుల్లో మగవారు అట్టపెట్టెలను అడ్డం పెట్టుకుని బస్సులో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. pic.twitter.com/AXUEYp5Dfc— greatandhra (@greatandhranews) January 20, 2026కేరళ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. షిమ్జితా నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు కూడా డిలీట్ చేసేసుకుందని తెలుస్తోంది. ఆన్లైన్ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. -
హాస్టల్లో ఉండటం ఇష్టం లేక..
గట్టుప్పల్: ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్)లో ఉండటం ఇష్టం లేక పురుగు మందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘట న నల్లగొండ జిల్లా అంతంపేట గ్రామంలో శనివారం జరిగింది. ఆదివారం పోలీసులు, గ్రా మస్తులు వివరాలు తెలిపారు. అంతంపేట గ్రా మానికి చెందిçన వీరమళ్ల వెంకటయ్యకు ముగ్గురు కుమార్తెలు.పెద్ద కుమార్తె వివాహం చేయగా.. రెండో కుమార్తె నవ్య (15) నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. కొంతకాలంగా అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన నవ్య తిరిగి హాస్టల్ వెళ్లడం ఇష్టం లేక శనివారం తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. -
రైతు ఇంట కానరాని సంక్రాంతి.. ఊరు.. ఉసూరు
సాక్షి, అమరావతి: పాడి పంటలు.. భోగి మంటలతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు కళ తప్పాయి. పంటలు చేతికందే సమయంలో సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతాల తోరణాలు రైతన్నల ఇంట కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాలు, ఎరువులు, చివరకు గిట్టుబాటు ధరల కోసం గత 19 నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గద్దెనెక్కగానే ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలలో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు అందించకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. మరోవైపు అదునుకు యూరియా అందక రైతులు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. ఎన్నడూ లేనివిధంగా ఒక్క కట్ట యూరియా కోసం పొలం పనులు వదిలేసి కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారుపై రైతన్నలు మండిపడుతున్నారు.మద్దతు ధర దక్కక.. కొనేవారు లేక..చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా కనీసం కొనేవారు లేని దుస్థితి ఏర్పడింది. ధాన్యం, పత్తి, ఉల్లి, టమాటా, మిరప, మామిడి, పొగాకు, అరటి, చీని... ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్ సీజన్లో ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు మోంథా, దిత్వా లాంటి తుపాను వైపరీత్యాలు అన్నదాతల కష్టాన్ని మట్టిపాలు చేశాయి. ఒక్క మోంథా తుపాను వల్లే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో మూడు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క రైతుకూ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఒకపక్క పతనమైన దిగుబడులు.. మరోపక్క కనీస మద్దతు ధరలు కరువై రైతన్నలు రోడ్డెక్కారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గతేడాది రూ.35 వేల కోట్లకుపైగా దిగుబడి, పంట నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) సుఖీభవ పేరిట దగా..తాము అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు మాత్రమే విదిల్చారు. అన్నదాతా సుఖీభవలో ఒక్కో రైతుకు రెండేళ్లలో రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఎన్నికల హామీ మేరకు 53,58,366 మంది రైతులకు పథకాన్ని వర్తింప చేయాల్సి ఉండగా ఏడు లక్షల మందికి సాయం అందించకుండా కోత పెట్టారు. ఈ ఒక్క పథకం కింద రెండేళ్లలో రైతులకు రూ.16,746 కోట్లు ఎగ్గొట్టారు. ఇక ఏ ఒక్క కౌలు రైతుకూ పైసా కూడా పెట్టుబడి సాయం ఇచ్చిన దాఖలాలు లేవు. బీమా పోయింది.. ఇన్పుట్ సబ్సిడీ లేదుచంద్రబాబు సర్కారు రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. సున్నా వడ్డీ పంట రుణం పథకానికి సున్నా చుట్టేశారు. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఈ–క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. 2024 జూన్‌లో కట్టాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టారు. దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి సున్నా చుట్టేశారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. ప్రభుత్వ నిర్వాకం వల్ల దాదాపు 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్క కుటుంబానికీ పైసా పరిహారం ఇవ్వలేదు. మరి చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో తాము పండగెలా చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఏ పంటకూ మద్దతు లేదు..అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఎవరికి పడ్డాయో తెలియడం లేదు. ఎకరాకు రూ.లక్ష చొప్పున అప్పు చేసి టమాటా, పత్తి, కూరగాయలు సాగుచేశా. అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. కొద్దిగా పత్తి మిగలగా క్వింటాకు రూ.5 వేలు మించి ఇవ్వలేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. చేతిలో పెట్టుబడి డబ్బులు లేక రబీ సాగుకు మా గ్రామంలో చాలా మంది రైతులు దూరమయ్యాం. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కడం లేదు. రైతులందరూ ఆర్థికంగా చితికిపోయారు. పండుగలు చేసుకునే పరిస్థితి లేదు.– కే.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లాఆదుకోవడంలో దారుణ వైఫల్యం..కౌలు రైతులకు పైసా కూడా పెట్టుబడి సాయం అందలేదు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారంగా మారింది. లక్షలాది మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ లేదు. ఓవైపు దిగుబడులు తగ్గిపోగా మరోపక్క ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏ ఇంటా సంక్రాంతి సంతోషం లేదు.– వి. కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు90 శాతం కౌలు రైతులే...కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దాదాపు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిలో 90 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారు. ఏ ఒక్కరికీ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.– ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం -
మీర్‌పేట తల్లీబిడ్డ కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్‌పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్ చెబుతుండగా.. ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు. మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు. పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?. ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్‌రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్‌రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు. అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. -
బాత్రూమ్లో పెట్రోల్ పోసుకుని విద్యార్ధి ఆత్మహత్య
-
సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భోపాల్‌లో(మధ్యప్రదేశ్) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్యురాలు ఇక లేదు. గత 24 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 24 ఏళ్ల డాక్టర్ రష్మి వర్మ తుది శ్వాస విడిచింది.ఎయిమ్స్ భోపాల్‌లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ డిసెంబర్ 11న అధిక మోతాదులో ఎనస్తీషియా ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అపస్మారక స్తితిలో ఉన్న ఆమెను భర్త అదే ఇన్స్టిట్యూట్లో చేర్చారు. అప్పటి నుండి వెంటిలేటర్ మద్దతుపై చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించామని ఎయిమ్స్ భోపాల్ అధికారి తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు కారణంగా మరిన్ని వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు. ఎయిమ్స్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్ ఆరోపణలు ఆమె సీనియర్ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ యూనస్ డా. వర్మను గత కొంతకాలంగా దీర్ఘకాలం మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. బలమైన ఆరోపణలున్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం మొదట్లో మౌనం వహించింది. అయితే బాధితురాలి ఆత్మహత్యా యత్నం, వైద్యుల సంఘాలు , పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డాక్టర్ మొహమ్మద్ యూనస్‌ను యాజమాన్యం తన పదవి నుండి తొలగించింది. తాత్కాలికంగా అనస్థీషియా విభాగానికి అటాచ్ చేసింది. ఈ విషయంపై రహస్య విచారణ నిర్వహించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.ఆమె సహచరులు అందించిన వివరాల ప్రకారం, డాక్టర్ వర్మ డిసెంబర్ 11న తన డ్యూటీని పూర్తి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె భర్త, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రతన్ వర్మ, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్గుండెపోటు , మెదడుకు నిలిచిపోయిన ఆక్సిజన్అత్యవసర విభాగానికి చేరుకునేసమయానికి ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 25 నిమిషాలు కావడంతో ఆమె గుండె దాదాపు ఏడు నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రారంభించారు. మూడు రౌండ్ల పునరుజ్జీవనం తర్వాత, గుండె స్పందించింది. కానీ మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా, అప్పటికే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరిగింది. గుండెపోటు సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు కణజాలానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు వివరించారు. ఆసుపత్రిలో చేరిన 72 గంటల తర్వాత నిర్వహించిన MRI స్కాన్‌లో మెదడు డ్యామేజ్, దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఎయిమ్స్ భోపాల్ గతంలో పేర్కొంది.మంచి మనిషిని, టీచర్‌ను కోల్పోయాంఐదేళ్లకు పైగా బోధనా అనుభవంతో, ఆమె క్లినికల్ నైపుణ్యం ఆమె సొంతమని ప్రధానంగా రోగులు పట్ల చాలా దయతో ఉండేదని విద్యార్థులు సహచరులు గుర్తు చేసుకున్నారు. తన సొంత డబ్బులను రోగుల చికిత్స కోసం చెల్లించేదని కంటతడిపెట్టారు. ఆమె మరణించే సమయానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్, నర్సింగ్ శిక్షణా సెషన్లకు ఇన్ఛార్జ్ ఫ్యాకల్టీగా, నోడల్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంకాగా డాక్టర్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని MLN మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్‌లో MD డిగ్రీ చదివారు. AIIMS భోపాల్‌లో అనేక పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే LN మెడికల్ కాలేజీ, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMS), భోపాల్‌లో కూడాసేవలందించారు.ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
పెళ్లికి నిరాకరించిందని వివాహితను హత్య చేసి.. ఆ తర్వాత
యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన నిందితుడు రఫిక్ ఇమామ్‌సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు. -
నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్ ద బెస్ట్.. సారీ!
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.హాత్రాస్లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్ మిగలకుండా చేశావ్. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్‌కి బిహార్ వాలా ఆకాష్ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్‌లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.Tragic incident in Hathras, UP: Girl records emotional video blaming her Ex-Boyfriend Aakash for forcing her ("You've forced me so much... I AM SORRY MUMMA. You are the BEST Mumma..."), then d!es by suicide. Heartbreaking. 💔pic.twitter.com/7f29omeO3i— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025 కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది. దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..! -
BIG Twist: పెళ్లికి ముందే హర్ష అనే యువకుడితో ప్రేమ!
బెంగళూరు: బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా సంచలనం కలిగిస్తున్న నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్త ఆదరించలేదని, నపుంసకుడని ఆరోపిస్తూ గానవి మెట్టినింటిలో ఆత్మహత్యాయత్నం చేసి రెండురోజుల తరువాత కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సూరజ్, అతని తల్లి జయంతి, అన్న నాగపూర్‌కు పరారయ్యారు, అక్కడ సూరజ్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో రెండు నెలలకే కొత్త జంటకు నూరేళ్లు నిండాయి. హనీమూన్‌లో పోట్లాట అందుకే అయితే గానవి పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించిందని ఆదివారం ప్రచారంలోకి వచ్చింది. ఆమె భర్తతో శ్రీలంకకు హనీమూన్ వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను హర్ష అనే యువకున్ని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడమే కారణమని తెలిసింది. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, తల్లిదండ్రుల ఒత్తిడితో నిన్ను చేసుకున్నట్లు ఆమె చెప్పడంతో సూరజ్ కుంగిపోయాడు. హనీమూన్‌ని రద్దుచేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సూరజ్ మృతికి గానవి తల్లిదండ్రులు కారణమని అతని బావ రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి తల్లి రుక్మిణి రాధ, బాబుగౌడ, సతీశ్‌లు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల సూరజ్ ప్రాణాలు తీసుకున్నాడన్నారు. రెండు కుటుంబాల్లో ఇద్దరు చనిపోవడంతో పాటు, కేసులు పెట్టుకుంటూ బతుకులను బుగ్గి చేసుకుంటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. -
హనీమూన్‌లో గొడవ?.. నవ జంట బలవన్మరణం
కొత్తగా పెళలైన ఆ జంట.. హనీమూన్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలీయదు. తిరిగి రాగానే ఆమె ప్రాణం తీసుకుంది. అది తట్టుకోలేకనో.. కేసు భయం వల్లనో.. అతడు దూరంగా పారిపోయాడు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిళ్లు వేసి మూడు నెలలు తిరగకముందే.. ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఇప్పుడు.. బెంగళూరు: బెంగళూరుకు చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) జీవితం అర్ధాంతరంగా ముగిసింది. గణవి మొదట బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడగా, రెండు రోజుల తర్వాత సూరజ్ మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒక హోటల్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.అక్టోబర్ 29వ తేదీన ఈ జంటకు వివాహం జరిగింది. అయితే ఈ మధ్యే హనీమూన్ కోసం శివన్న, గణవి శ్రీలంకకు వెళ్లారు. అక్కడి వెళ్లిన ఆ జంటకు మధ్యలోనే గొడవలు తలెత్తడంతో తిరిగి బెంగళూరుకు వచ్చారు. గణవి తన పుట్టింటికి వెళ్లింది. అత్తింట్లో ఎదురైన అవమానం, తిరస్కారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని ఆమె కుటుంబం ఆరోపిస్తుండగా.. డిసెంబర్ 23న ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చేరింది. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరికి మృతి చెందింది.గణవి మరణం తర్వాత ఆమె కుటుంబం సూరజ్, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య సూరజ్ తన తల్లి జయంతితో కలిసి బెంగళూరును విడిచి నాగపూర్‌కి వెళ్లాడు. అక్కడ వార్ధా రోడ్‌లోని ఒక హోటల్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. అదే సమయంలో అతని తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన కొత్తగా పెళ్లైన జంట జీవితం ఎంతటి విషాదాంతానికి దారితీసిందో చూపిస్తోంది. కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు సమాజంలో ఇంకా ఎంతటి ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
దారి తప్పే ఖాకీలకు ‘మిత్ర’ సాయం
సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న ఎవరికైనా మొదట గుర్తొచ్చేది పోలీసులు. విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా వెంటనే డయల్ 100కి కాల్ చేస్తాం. అదే పోలీసులకు ఆపదొస్తే..? అనుకోని కష్టాలతో ఆత్మహత్య వంటి విపరీత నిర్ణయాలు తీసుకునేంతగా కుంగిపోతే? అలాంటి వారికి ‘మిత్ర’అనే శిక్షణ కార్యక్రమం అండగా నిలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్, మద్యపానం, విపరీతంగా అప్పులు చేయడం వంటి కారణాలతో దారితప్పుతున్న సిబ్బందిని గాడిలో పెట్టి వారిలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు పోలీస్ మిత్ర బృందాలు కృషిచేస్తున్నాయి.నిత్యం సవాళ్లతో కూడిన విధుల్లో ఉండే పోలీసుల మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడే లక్ష్యంతో స్వాతిలక్రా బెటాలియన్స్ అడిషనల్ డీజీగా ఉన్న సమయంలో టీజీఎస్పీలో ‘మిత్ర’ను 2023లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఉత్తమ ఫలితాలు వస్తుండటంతో ప్రస్తుత అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్ ఇందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ సిబ్బంది కోసం నిర్వహించిన ‘లవ్ యూ జిందగీ’ కార్యక్రమం దీనికి స్ఫూర్తి అని అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలోని ఇతర విభాగాలకూ దీన్ని విస్తరించే అవకాశం ఉంది. 8 రోజులు తరగతులు టీజీఎస్పీలోని 13 బెటాలియన్స్ నుంచి ఎంపిక చేసిన 68 మంది మాస్టర్ ట్రైనర్ సర్టీఫికేషన్ కోర్సు పూర్తి చేశారు. వీరంతా ప్రతి బెటాలియన్‌లో ఐదుగురు చొప్పున ‘మిత్ర’శిక్షకులుగా పనిచేస్తున్నారు. ఫిర్యాదులొచ్చిన వారితోపాటు ఆసక్తి ఉన్న వారిని గుర్తించి 20–30 మంది చొప్పన బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. మూడేళ్లలో 9,153 మందికి శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎంతోమంది తమను తాము మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ‘8 రోజుల కోర్సులో మానసిక ఆరోగ్యం, అవగాహన పెంచడం, కుటుంబ, ఆర్థిక అంశాల నిర్వహణ, లింగ సమానత్వం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతాం. వారి ఇబ్బందులు తెలుసుకుని వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం’అని ట్రైనింగ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్వీ రమణ తెలిపారు. సిబ్బందిలో మార్పు తెస్తోంది: సంజయ్ కుమార్ జైన్, అడిషనల్ డీజీ, టీజీఎస్పీ పోలీస్ ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. మానసిక, శారీరక ఒత్తిడిని ఎలా జయించాలన్న అంశాలపై బెటాలియన్స్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం. మిత్ర శిక్షణతో సిబ్బందిలో మార్పు కనిపిస్తోంది. ఈ కోర్సును మరింత ప్రభావంతంగా మార్చేందుకు కొత్త అంశాలను జోడించి మార్పులు చేస్తాం. ముందు ఎంతో కోపం ఉండేది: కానిస్టేబుల్, 8వ బెటాలియన్ నాకు గతంలో ఎంతో కోపం ఉండేది. ఏ చిన్న విషయమైనా గొడవ పెట్టుకునే వాడిని. అలా ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, మిత్ర కోర్సు తర్వాత నాలో మార్పు వచ్చింది. ఏ పరిస్థితి అయినా వెంటనే రియాక్ట్ కాకుండా కాస్త స్థిమితంగా ఆలోచించాకే మాట్లాడుతున్నా. గతంలో విచ్చలవిడిగా క్రెడిట్‌కార్డు వాడేవాడిని. అప్పులు పెరిగేవి. ఇప్పుడు దుబారా ఖర్చులు తగ్గించుకున్నా. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా..: కానిస్టేబుల్, 3 బెటాలియన్ గతంలో ఎంతో ఎమోషనల్‌గా ఉండేవాడిని. ఆర్థిక ఇబ్బందులతో ఒకసారి ఆత్మహత్యవరకు వెళ్లాను. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా.. ముందు కాస్త ఆలోచించాకే నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇంట్లో కూడా ఎంతో కోపంగా ఉండేవాడిని. కుటుంబ విలువ తెలుసుకున్నా, బడ్జెట్ డైరీ పెట్టుకొని అనవసర ఖర్చులు తగ్గించడం నేర్చుకున్నా. వీటి గురించి నాతోటి సిబ్బందికీ చెబుతున్నా. వ్యసనాలన్నీ వదిలేశాను..నేను గతంలో మద్యంతోపాటు ఎన్నో చెడు అలవాట్లకు బానిసనయ్యాను. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నా. నా ప్రవర్తన చూసి ఉన్నతాధికారులు ఎన్నోసార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ నాలో మార్పు రాలేదు. కానీ మిత్ర శిక్షణకు వచ్చిన తర్వాత నన్ను నేను మార్చుకున్నా. చెడు అలవాట్లు పక్కన పెట్టా. నా గౌరవం కూడా పెరిగింది. – హెడ్‌కానిస్టేబుల్, 8వ బెటాలియన్ -
మక్కాలో కలకలం.. వీడియో వైరల్
మక్కా: ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావించే సౌదీ అరేబియాలోని మక్కాలో కలకలం చెలరేగింది. మసీదు అల్-హరమ్ (గ్రాండ్ మసీదు)లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం అందరినీ షాక్‌నకు గురిచేసింది. మసీదు పైఅంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించాలని ఆ వ్యక్తి ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై, అతనిని కాపాడారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మసీదు పై అంతస్తు రెయిలింగ్ దాటి, ఒక వ్యక్తి కిందకు దూకబోతుండగా, స్పెషల్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ప్రాణాలకు తెగించి, అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నంలో ఆ భద్రతా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🕋🚨 A security guard at the Masjid al-Haram rushed to intervene after a person tried to take their own life by jumping off the upper floors of the masjid.The security guard was injured while trying to prevent the person from hitting the ground. Both individuals were… pic.twitter.com/NnpveIE8wf— • (@Alhamdhulillaah) December 25, 2025ఈ ఉదంతంపై మక్కా ప్రాంతీయ ఎమిరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ ఫోర్స్ వేగంగా స్పందించి ప్రాణనష్టాన్ని నివారించిందని దానిలో కొనియాడింది. అయితే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భద్రతా అధికారికి ఫ్రాక్చర్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. నిందితునిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం విచారణ చేపడుతున్నామని మక్కా భద్రతా దళాలు వెల్లడించాయి.ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తితో పాటు, గాయపడిన భద్రతా అధికారిని కూడా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ వ్యక్తిని కాపాడటంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు -
ఓడిపోయా,ఇక డబ్బులు వేస్ట్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బాగాచదివి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలని ప్రతీ అమ్మాయి, లేదా అబ్బాయి కలగంటారు. ఎంతో పట్టుదలగా తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఒక టీనేజ్ అబ్బాయి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా మీ డబ్బులు దండుగ అంటూ ఏ తల్లిదండ్రీ భరించలేని పనిచేశాడు.గ్రేటర్ నోయిడాలోని హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భిహార్కు చెందిన ఆకాష్ దీప్. ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (DTC)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) మొదటి సంవత్సరం చదువుతున్న అతను మంగళవారం సాయంత్రం ఆకాష్ దీప్ తన గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు ఇకపై డబ్బు వృధా చేయకూడదనే కారణంతోనే ఈ పని చేసినట్లు ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బయటకు వెళ్లి, తిరిగి వచ్చిన రూమ్మేట్ ఆకాష్ దీప్ ఉరి వేసుకోవడాన్ని గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఆకాష్ దీప్ ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూసైడ్ నోట్లో ఏం ఉంది?క్షమించండి, అమ్మా నాన్న, మీ కొడుకు బలహీనుడు. నా మరణానికి నేనే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు. అమ్మా, ఇంటర్లో ఒక ఏడాది వృధా చేశా..రినాలుగేళ్లు బీటెక్ చదివి, డబ్బు వృధా చేయాలనుకోవడం లేదు. తప్పుడు ఆశలు కలిగించడం ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా..క్షమించండి." అని రాసుకొచ్చాడు. చదువుల ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చహల్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్ -
అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..
-
దారి తప్పుతున్న యువ ఖాకీలు
ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది. చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది. -
మరణ మృదంగం
ఆరుగాలం కష్టపడిన రైతన్నలు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర రాక అప్పుల పాలు కావడంతో మృత్యువును ఆశ్రయిస్తున్నారు. కొందరు పొలాల్లో ఉరికొయ్యలకు వేలాడుతుండగా, మరికొందరు సాగు చేసిన భూమిలోనే పురుగుమందు తాగి తనువు చాలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఫిరంగిపురం మండలం గొల్లపాలెంకు చెందిన ఎం.బొల్లయ్య రెండు ఎకరాల్లో మిర్చి, తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటలు సరిగ్గా పండక, పండిన కొద్ది పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. పొలానికి వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే మండలం మెరికపూడి గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్ వలి ఐదు ఎకరాలలో పత్తి పంట వేశాడు. పంట పండక అప్పులు కావడంతో బుధవారం పొలానికి వెళ్లాడు. చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. రాత్రంతా వెతికిన కుటుంబసభ్యులు మరునాడు ఉదయం ఈ దారుణాన్ని గమనించారు. రోజురోజుకూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు అధికం కావడం, అరకొర దిగుబడులు, పంట చేతికొచ్చే సమయానికి తుపాన్లు, భారీ వర్షాలు ఇబ్బంది పెట్టాయి. అన్నీ గట్టెక్కినా చివరికి గిట్టుబాటు ధర లేకపోవడం, వడ్డీలకు తెచ్చిన అప్పులు రెట్టింపు అవుతుండటం, వాటిని తీర్చలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ఇప్పటి వరకు ఒక్క ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే పది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫిరంగిపురం మండలంలో ఇద్దరు, చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగ్గురు, వినుకొండలో ఒకరు, పెదకూరపాడు నియోజకవర్గంలో మరొకరు ఈ ఏడాది కాలంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వంలో వెంటనే సాయం.. గత వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో రైతులకు అన్నివిధాలా లాభం చేకూర్చేలా వ్యవసాయ రంగంలో పరిస్థితులు ఉండేవి. రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం దగ్గర్నుంచి ఎరువులు సకాలంలో అందించడం, గిట్టుబాటు ధర లభించేలా చూడటం వరకు సజావుగా సాగేవి. విధి లేని పరిస్థితిలో ఎవరైనా రైతు బలవన్మరణానికి పాల్పడితే సాయం అందించేవారు. కానీ ఇప్పుడు కనీసం వారిపై ఆధారపడిన కుటుంబాన్ని ఆదుకునే విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మండల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నేరుగా జిల్లా కలెక్టర్ సదరు రైతు కుటుంబానికి ఏకంగా రూ. ఏడు లక్షల పరిహారాన్ని నెల, రెండు నెలల వ్యవధిలోనే అందించారు. ఇప్పుడు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ముంచేసిన పత్తి, మిర్చి, పొగాకు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి, మిర్చి పంటలనే ఎక్కువ సాగు చేస్తున్నారు. గత ఏడాది గులాబీ రంగు పురుగు అధికంగా ఉండటంతో పత్తి రైతులు నిలువునా నష్టపోయారు. మిర్చిని నల్లి తామర ముంచెత్తడంతో పంటను పీకేయాల్సి వచ్చింది. పత్తికి, మిర్చికి ఎకరాకు సుమారు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టబడులు పెట్టారు. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంటలకు కనీస గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి సాగు చేసి నట్టేట మునిగిపోయిన రైతులు పంటను పీకివేసి, నల్లబర్లీ పొగాకు సాగు చేశారు. తీరా పంట దిగుబడులు చేతికొచ్చే సమయానికి ధర లేకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గతంలో క్వింటా రూ.పదిహేను వేల వరకు అమ్మిన నల్లబరీని ఈ సారి రూ. మూడు వేలు నుంచి రూ. నాలుగు వేలకు కూడా కొనలేదు. ఈ ఏడాది నల్లబర్లీ పొగాకు సాగు చేయవద్దని చంద్రబాబు ప్రభుత్వం నిషేధం విధించింది. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తేమ ఎక్కువ ఉందనే సాకుతో వెనక్కి పంపుతున్నారు. దీనివల్ల పత్తి రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు పొగమంచు కారణంగా పత్తిలో తేమశాతం తగ్గడం లేదు. -
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఓటేసేందుకు పట్నం నుంచి వచ్చి..
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తెర్లుమద్దికి చెందిన కొమ్మెట రమేశ్(32) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఐదు రోజులపాటు బాగానే ఉన్న రమేశ్.. సోమవారం ఉదయం చనిపోతున్నాను సారీ అంటూ సోదరులు చంద్రమోహన్, కిట్టులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టాడు. ఆందోళనకు గురైన వారు రమేశ్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం గాలించగా, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లో సరైన ఉపాధి లభించక కుటుంబపోషణకు అప్పులు చేశాడని, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు చంద్రమోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిందం గణేశ్ తెలిపారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు. -
వివాహమైన మూడు నెలలకే బలవన్మరణం
ఎర్రగుంట్ల: మూడు ముళ్ల బంధానికి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అంతలోనే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన ఇది. ఆర్టీపీపీ స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి శనివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే చెండ్రాయుడు నివాసం ఉంటున్న ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీపీపీ స్టోర్ ఈఈ చెండ్రాయుడు కుమార్తె చందనజ్యోతి, కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌కు మూడు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరు హైదరాబాదులోని మూసాపేట్లో నివాసముంటున్నారు. అయితే ఏం జరిగిందో చందనజ్యోతి ఆత్యహత్య చేసుకున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. మృతదేహాన్ని ఆర్టీపీపీకి తీసుకుని వస్తున్నట్లు తెలిసింది. -
భార్యకు ఉరివేసి.. ఆత్మహత్య
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్లో రికార్డు చేసి స్టేటస్‌గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య
-
తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 52 ఏళ్ల మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమారులు (32-27 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీసులతో పాటు ఒక బెయిలిఫ్ వారి నివాసానికి చేరుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. పోలీసులు తలుపులు పదేపదే తట్టినా, లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, వారు నకిలీ తాళంచెవి సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. లోపల తల్లి, ఆమె ఇద్దరు కుమారులు ఒకే గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.చేతిరాత లేఖలో..ఘటనా స్థలంలో లభ్యమైన ఒకటిన్నర పేజీల చేతిరాత లేఖ ఈ సామూహిక మరణాలకుగల గల కారణాలను వెల్లడించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ లేఖలో బాధిత ఆ కుటుంబం చాలా కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే సమచారం ఉంది. ఆ లేఖలో బాధితులు తమ మానసిక వేదన, ఆర్థిక ఒత్తిడులే తమ ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఆ లేఖలోని వివరాల ప్రకారం ఆ కుమారులిద్దరూ నిరుద్యోగులు. నిరాశలో కుంగిపోయిన కారణంగా ఏ పనీ చేయలేకపోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మరణించిన ఇద్దరు సోదరులలో చిన్నవాడు(27 ఏళ్లు) యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.అద్దె బకాయిలు, అప్పుల ఊబిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వారు కొని నెలలుగా నెలవారీ రూ. 25,000 అద్దెను కూడా చెల్లించలేకపోయారు. ఫలితంగా ఇంటి యజమాని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. బాధిత కుటుంబం 2023, డిసెంబర్లో ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నది. నాడు ఆ మహిళ భర్త బతికే ఉన్నాడు. అతను ఒక ప్రాపర్టీ డీలర్‌గా పనిచేశాడు. అతను పరిచయస్తుల దగ్గర రుణాలు తీసుకున్నాడు. అతను 2024లో మరణించగా, ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కొంత కాలంగా ఆ కుటుంబంలోని వారు బయటకు రాకుండా ఆ ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. ప్రాథమిక విచారణలో, రెండు నెలల క్రితం కూడా ఆ ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాలను ఎయిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ ఘటన వెనుక గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వారికి లభ్యమైన ఆత్మహత్య లేఖ, ఇతర పత్రాలు, డిజిటల్ పరికరాలను పరిశీలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకాశానికి రంగులు అద్దిన ఉల్కలు! -
ఇల్లు నిర్మించుకుందామని.. భర్త మాటలకు మనస్ధాపానికి గురై మహిళ ఆత్మహత్య
కొండాపురం: స్థానిక ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీలో నివాసం ఉండే లక్ష్మీతులసి(36) అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి వివరాల మేరకు కానిస్టేబుల్ వెంకటరమణ, లక్ష్మీతులసికి 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి లక్ష్మీతులసి ప్రొద్దుటూరులో ఇల్లు నిర్మించుకుందామని భర్తను అడిగింది. అయితే వెంకటరమణ కడపలో ఇంటిని నిర్మించుకుందామని అక్కడే పిల్లలను చదివించుకోవచ్చు అని సూచించాడు. తన మాటలను పట్టించుకోవడంలేదని మనస్ధాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశామన్నారు. -
అయ్యో పాపం! పుట్టిన వారానికే అనాథైన శిశువు
శ్రీనివాసపురం: పుట్టిన వారానికే పసిగుడ్డు అనాథ అయిన హృదయవిదారక ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా ఉప్పరపల్లిలో ఆదివారం జరిగింది. అస్సాం నుంచి కూలీ పనుల కోసం వలస వచ్చిన ఫరీజా(22), రెహమాన్(28) స్థానికంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో 15 రోజుల కిందట చేరారు. వారం క్రితం ఫరీజా ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం శిశువు గట్టిగా ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. ఇంట్లో భార్యాభర్తలు శవాలై పడి ఉన్నారు. పక్కనే పురుగుల మందు సీసా ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
ఖరీదైన ఫోను కోసం గొడవ.. బోరు బావిలో దూకి టీనేజర్ ఆత్మహత్య
కచ్: సెల్ ఫోన్ విషయమై తండ్రితో గొడవపడిన ఓ టీనేజర్ బోరుబావిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ తాలుకాలో ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం కుక్మా గ్రామంలోని ఫాంహౌస్‌లో ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రుస్తొమ్ షేక్(17) శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖరీదైన సెల్‌ఫోన్ విషయంపై తండ్రితో గొడవపడ్డాడు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి పారేసి, దగ్గర్లో ఉన్న పడావు పడిన బోరు బావి వద్దకు చేరుకున్నాడు. దానిపైన అడ్డుపెట్టిన బండరాయిని తొలగించి అమాంతం లోపలికి దూకాడు. భూమికి రెండున్నర అడుగుల ఎత్తులో, అడుగున్నర వెడల్పున్న ఆ బావి లోతు 140 అడుగులు. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఊపిరి అందక రుస్తొమ్ కేకలు వేస్తుండటంతో లోపలికి ఆక్సిజన్‌ను పైపుల ద్వారా పంపించారు. వెంటనే సహాయక చర్యలను మొదలుపెట్టారు. ఎట్టకేలకు అతడిని అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో వెలుపలికి తీయగలిగారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్‌కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్‌తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్‌తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య
సాక్షి, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్వచింతల్‌లో బండారి రవీందర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి వరకు భార్య కోసం ప్రచారం చేసిన రవీందర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గెలుపుపై ఆందోళనతో ఆత్మహత్యా? లేక మరో కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.కాగా, రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్‌గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. -
ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
పోలీసుల నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థిని బలి
-
రూ. 1500 కోసం ప్రాణం పోయే వరకు వదల్లేదు
-
కంసాన్ పల్లిలో ఉద్రిక్తత.. రైలు పట్టాలపై వార్డు మెంబర్..!
-
గుంటూరు కేఎల్ వర్శిటీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గుంటూరు కేఎల్ వర్శిటీ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ ఫస్టియర్ విద్యార్థి సురేష్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన విద్యార్థి బాపట్ల కొత్తపాలెం వాసిగా గుర్తించారు.కాగా, నిన్న(డిసెంబర్ 1, సోమవారం) తెలంగాణలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. నిజాంపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యహహారమే కారణమని తెలుస్తోంది. -
బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన విద్యార్థిని, శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిత (16) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.హాస్టల్ నిర్వాహకులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఉరేసుకుని ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తెమృతికి కారణమైన రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్‌కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. -
TG: సోషల్ మీడియాలో ‘సూసైడ్’ పోస్టులు!
వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలోనే సైబర్ పోలీసులకు ఓ అలర్ట్ వెళ్లింది. ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ విద్యార్థి దగ్గరకు చేరుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.హైదరాబాద్ సాక్షి: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఏవరో తిట్టారనే కోపంతో లేదంటే జీవితంలో విఫలమయ్యమనే బాధతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడి తమ జీవితాలను ముగించి తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వెంటనే స్పందించి బాధితుల ఆత్మహత్య ప్రయత్నాలను తెలంగాణ సైబర్ పోలీసులు భగ్నం చేస్తున్నారు. తెలంగాణ సైబర్ పోలీసులు ఆత్మహత్యల్ని నిరోధించడానికి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఆత్మహత్య ప్రేరేపిత వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులకు సమాచారం చేరేలా సిస్టమ్ రూపొందించారు. హెచ్చరికలు రావడంలో తక్షణమే స్పందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ అలర్ట్స్ తో గడిచిన నాలుగు వారాల్లో 12 మందిని బలవన్మరణాలకు పాల్పడకుండా కాపాడినట్లు పోలీసులు తెలిపారు...నిజామాబాద్ లో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహాత్య చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ అలర్ట్స్ సైబర్ పోలీసులకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అతనిని రక్షించారు. ఇలా గడిచిన 4 వారాలలో 12 మందిని రక్షించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.సామాజిక మాధ్యమాలలో ఆత్మహాత్యలకు సంబంధించిన ఏదైనా వీడియోలు లేదంటే ఫోటోలు ప్రచురితమైతే దానికి సంబంధించిన సమాచారం వెంటనే సైబర్ పోలీసులకు చేరుతోంది. ఈ విధంగా సమాచారాన్ని అందించేలా పలు సామాజిక మాధ్యమాలతో తెలంగాణ సైబర్ పోలీసు విభాగం ఒప్పందం జరిపినట్లు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సోషల్ మీడియాలో ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే 10 నిమిషాలలోపే మాకు హెచ్చరికలు వస్తాయి. దీంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తాం అని శిఖా గోయల్ అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకూ ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. -
తండ్రి మందలించాడని ఉరి వేసుకొని..!
-
నువ్వు అక్కర్లేదు.. అక్కడే చచ్చిపో
ధారూరు: భర్త వేధింపులు భరించలేక, జీవితంపై విరక్తి చెందిన ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారంలో బుధవారం జరిగిన ఈ ఘటనపై ధారూరు సీఐ రఘురామ్ తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన గంజి మల్లమ్మ, సాయప్పల చిన్న కూతురు శిరీష (21)కు పరిగి మండలం మల్లమోనిగూడేనికి చెందిన శివలింగంతో ఐదు నెలల క్రితం వివాహం చేశారు.వంట బాగా చేయడం లేదంటూ, తనకన్నా తక్కువ చదువుకున్నావంటూ శివలింగం ఆమెను నిత్యం వేధించేవాడు. ఆమెను చితకబాదేవాడు. ఈక్రమంలో మంగళవారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన శివలింగం భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఆమె ఫోన్‌ను సైతం తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లితో శిరీష జరిగిన విషయాన్ని చెప్పగా.. ‘అల్లుడితో ఉదయం మాట్లా డదాంలే’.. అని సర్దిచెప్పింది.బుధవారం కూలి పనులకు వెళ్తూ కూతురికి ఫోన్ ఇచ్చి వెళ్లింది. శిరీష భర్తకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయగా ‘నీవు నాకు అక్కర్లేదు.. అక్కడే చచ్చిపో’.. అంటూ చీదరించుకున్నాడు. ఈ మాటల తో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లికి శిరీష ఉరేసుకుని కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఫోన్లో రికార్డయిన సంభాషణల ఆధారంగా విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని మల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
బిజినెస్ టైకూన్ కోడలి అనుమానాస్పద మరణం
ఢిల్లీ: Pan Masala Baron Daughter In Law Dies ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కమల పాసంద్ పాన్ మసాలా బ్రాండ్‌తో పాపులర్ అయిన కమల్ కోడలు దీప్తి చౌరాసియా (Deepti Chaurasia) (40) దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని వసంత విహార్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలుస్తోంది.Delhi | Kamla Pasand company owner Kamal Kishore's daughter-in-law, Deepti Chaurasia (40), died allegedly by suicide last evening. Her body was found hanging. Police have recovered a diary in which she mentions a dispute with her husband, Harpreet Chaurasia. Deepti married…— ANI (@ANI) November 26, 2025 దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో దీప్తి చనిపోయి కనిపించారు. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆమె గదిలో సూసైడ్ నోట్ లభించింది. తన మరణానికి ఎవరికీ సంబంధం లేదంటూనే, రిలేషన్లో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక జీవితానికి అర్థం ఏముంది? అని తన నోట్లో పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భర్త హర్‌ప్రీత్ చౌరాసియాతో విభేదాలున్నట్టు పేర్కొన్నా డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?కాగా దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు హర్‌ప్రీత్ చౌరాసియాను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కమల్ కిషోర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కమల్ కిషోర్ చౌరాసియా. ఇది కమలా పసంద్, రాజ్శ్రీ బ్రాండ్ పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది. ఫ్యామిలీ స్పందనకమలా పసంద్ కుటుంబ న్యాయవాది రాజేందర్ సింగ్ దీనిపై వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమననారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఆమెకు పూర్తి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు కుటుంబాలు ఈరోజు కలిసి దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది రెండు కుటుంబాలకు తీరని లోటు. సూసైడ్ నోట్లో ఎటువంటి ఆరోపణ లేదు. దీనికి బాధ్యులుగా ఆమె ఎవరినీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆత్మహత్యకు కారణమేమిటో మాకు తెలియదు. పోలీసులకు సహకరిస్తున్నామని రాజేందర్ తెలిపారు. -
ప్రేమించిన యువతి మోసం.. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ జిల్లా: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 26 ఏళ్ల పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్ రెడ్డి, పోచారం ఇన్ఫోసిస్ సమీపంలోని సంస్కృతి టౌన్షిప్లో స్నేహితులతో కలిసి నివసిస్తూ గత నాలుగేళ్లుగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఒక యువతిని ప్రేమించేవాడు. ఇద్దరూ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో శారీరకంగా దగ్గరైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో మరో వ్యక్తితో తీసుకున్న ఫొటోలు కనిపించడంతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా అనుమానపడ్డాడు. సదరు ఫొటోలను యువతి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీంతో ఆ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసింది.ఆ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా ఆమెకు కాల్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితులు ఈ విషయం అతని తండ్రికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరానికి చేరుకున్నారు.ప్రేమించిన యువతి మోసగించిందన్న బాధతోనే నా కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు అంటూ మృతుడి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్ట్ -
అత్తింటి వేధింపులకు అల్లుడు బలి
వెల్దుర్తి(తూప్రాన్): భార్య కాపురానికి రాకపోవడంతో పాటు అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన అల్లుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన పూజతో సుమారు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. వివాహం అయినప్పటినుంచి వేరుకాపురం పెట్టాలని భార్య, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు.ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు కావడంతో తరచూ కూతురును తీసుకొని పూజ తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలోనే ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా అందరి సమక్షంలోనే తన కుమారుడిని దుర్భాషలాడి, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని ఆరోపించారు. పంచాయితీ అనంతరం పూజ కూతురుతో వెల్దుర్తిలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.ఈ క్రమంలో హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తారింటిముందు పురుగులమందు తాగా డు. చుట్టుపక్కల వారి సాయంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. తన కుమారుడి మృతికి అతని భార్య పూజ, అత్తమామలు వరలక్ష్మి, కిషన్లతో పాటు బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణిలు కారణమంటూ మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ట్రెయినీ ఎస్ఐ తెలిపారు. -
మనస్తాపంలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి హైదరాబాద్ : హబ్సిగూడలో దారుణం జరిగింది. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపం చెంది శ్రీవైష్ణవి అనే విద్యార్థిని ఆత్మహాత్య చేసుకుంది. విద్యార్థిని శ్రీ చైతన్య స్కూల్లో పదవతరగతి చదువుతుంది. ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్
Dentist Suicide case ముంబై: హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంత్ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్‌మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. అనంత్, గౌరీ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స -
పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్ ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఈరోజు (సోమవారం) ఉదయం ఇక్కడి ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ)పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు, ఆత్మాహుతి బాంబర్లు దాడి చేయడంతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాయిటర్స్ నివేదికల ప్రకారం ఈ భీకర దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈ సమన్వయ దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి.దాడుల వెనుక ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని రాయటర్స్ పేర్కొంది. దాడి వ్యూహంలో భాగంగా తొలుత ఆత్మాహుతి బాంబర్ ప్రధాన కార్యాలయం ముఖద్వారంపై దాడి చేసి, తనను తాను పేల్చుకోగా, ఆ వెంటనే మరొక బాంబర్ దళాల దృష్టిని మళ్లించి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆవరణలోకి ప్రవేశించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ దాడి సమయంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయని, వెంటనే భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు సోషల్ మీడియాలో వెల్లడించారు.దాడి జరిగిన వెంటనే చట్ట అమలు సిబ్బంది, సైన్యం, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టారు. ప్రధాన కార్యాలయం లోపల ఇంకా కొందరు ఉగ్రవాదులు ఉండవచ్చని , పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా భద్రతా దళాలు ఘటన జరిగిన వెంటనే ఎఫ్‌సీ ప్రధాన కార్యాలయం వెలుపలి రహదారిని మూసివేసి, ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. పెషావర్‌లోని పారామిలిటరీ ప్రధాన స్థావరంపై జరిగిన ఈ ఆత్మాహుతి దాడి, దేశ భద్రతకు పెను సవాలుగా పరిణమించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్బంధ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదులను నిలువరించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కారు దగ్ధానికి ఏసీ కారణమా? నిపుణులేమంటున్నారు? -
బెంగాల్లో బీఎల్వో ఆత్మహత్య
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని నడియా జిల్లాలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్వో)గా వ్యవహరిస్తున్న రింకూ తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం ఆమె తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన ఒత్తిడుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. బీఎల్వో రింకు సూసైడ్ నోట్‌ను సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌లో షేర్ చేశారు. కృష్ణనగర్ జిల్లా చప్రాలోని వివేకానంద్ విద్యామందిర్‌లో పారా టీచర్‌గా పనిచేస్తున్న రింకు (52) తన నివాసంలో ఉరి వేసుకున్నారని ఆమె తెలిపారు. ఎస్ఐఆర్ కోసం ఇంకెందరు చనిపోవాలని ఈసీని ఆమె ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా ఎన్నికల కమిషన్(ఈసీ) ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు 30మందికిపైగా బీఎల్వోలు తనువు చాలించినట్లు అధికార టీఎంసీ పేర్కొంది. ఈ మరణాలకు ఈసీయే బాధ్యత వహించాలంది. ఎస్ఐఆర్ను తక్షణమే ఆపేయాలంటూ సీఎం మమత గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు లేఖ రాశారు. సీఎం మమత ఆరోపణలను బీజేపీ ఖండించింది. అది ఫేక్ సూసైడ్ నోట్ అని తెలిపింది. చేతనైతే ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించి, నిగ్గు తేల్చాలంది. రింకు తరఫ్దార్ టీఎంసీ ఒత్తిడుల వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారిని ఈసీ ఆదేశించింది. -
తొమ్మిది నెలల బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, చౌడేపల్లె: చిత్తూరు జిల్లాలో ఓ తల్లి తొమ్మిది నెలల బిడ్డతో శుక్రవారం తెల్లవారుజామున చెక్‌డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... చౌడేపల్లె మండలంలోని వెంగళపల్లెకు చెందిన పి.నరసింహులు పెద్దకుమార్తె పి.ఆదిలక్ష్మి(37)కి దిగువపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన గంగాధర్‌కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆదిలక్ష్మి సోమల మండలం ఆవులపల్లెలో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్–లెవెల్ హెల్త్ ప్రొవైడర్)గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త గంగాధర్ మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె క్రితిక (9నెలలు). ప్రసూతి సెలవులో ఉన్న ఆదిలక్ష్మి పుట్టినిల్లు వెంగళపల్లెలో ఉంటోంది. చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో మదనపల్లె, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. పాప ఆరోగ్యం కుదుటపడకపోవడం, ఎల్లప్పుడు బిడ్డ గురించే ఆలోచిçస్తూ ఆదిలక్ష్మి తరచూ బాధపడుతూ ఆందోళన చెందేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరునెలల మెటరి్నటీ సెలవు ముగుస్తుండగా అధికారులకు సమస్యను చెప్పి, మరో రెండు నెలలు అదనపు సెలవు మంజూరు చేయించుకుంది. ఈనెల 20న విధులకు హాజరు కావాల్సి ఉండగా కుమార్తె ఆరోగ్య పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాలేదు. ఈక్రమంలో ఆదిలక్ష్మి శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా, సమీపంలోని కొండామర్రి వెళ్లే వంకకు అడ్డంగా నిరి్మంచిన చెక్‌డ్యాం వద్దకు చేరుకుంది. కుమార్తెను నడుముకు కట్టుకుని నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేçసుకుంది. వేకువజామున లేచిన కుటుంబ సభ్యులకు ఆదిలక్ష్మి, ఆమె బిడ్డ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా, చెక్‌డ్యాంలో మృతదేహాలను గుర్తించి, వెలికి తీశారు. -
కొత్త బట్టలు వేసుకుందువు లెయ్యి రా!
నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్‌డే ఉండటంతో సోమవారం కార్తీక్‌ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్‌డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాకిస్తాన్ మళ్లీ రక్తసిక్తం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కోర్టు కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ వెల్లడించారు.ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరితేరిందని పాక్ అధికారులు చెప్పారు. తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్ ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది.ఆత్మాహుతి దాడికి అఫ్గాన్‌లోని తాలిబన్ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది. -
భర్త నుంచి హెచ్ఐవీ.. కొడుకును చంపి భార్య ఆత్మహత్య
తమిళనాడు: సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో భర్త వల్ల చిచ్చు చెలరేగింది. అతనికి హెచ్ఐవీ రావడం భార్య, కొడుకు ప్రాణాలను బలిగొంది. కొడుకును హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సిఫ్‌కాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి, హోసూరు పట్టణంలో ఓ వ్యక్తి (44) ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నాడు, ఇతనికి భార్య (40), కూతురు, 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అతనికి అనారోగ్యం రావడంతో ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు, హెచ్ఐవి వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. అవాక్కైన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకొన్నారు. వీరిలో బాలిక బాగానే ఉంది, తల్లి కొడుక్కి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆమెకు పిడుగుపడినట్ల అయ్యింది. ఇకపై తాము సమాజంలో జీవించలేమని భయాందోళనకు గురై, శనివారం అర్ధరాత్రి నిద్రపోతున్న కుమారున్ని తలదిండుతో నొక్కి హత్య చేసి, తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం నిద్రలేచిన కుమార్తె చూసి కేకలు వేసింది. స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సిప్కాట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చేరుకొని మృతదేహాలను స్వా«దీనపరుచుకొని హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. హెచ్ఐవీకి భయపడవద్దు ఆమెది తొందరపాటు నిర్ణయమని, ఇంకా పలు రకాల పరీక్షలు చేసిన తరువాతే హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్నది లేనిదీ నిర్ధారించాలని జిల్లా ఎయిడ్స్ విభాగం అధికారులు తెలిపారు. హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన భయపడవద్దని, మంచి మందులు వాడుతూ ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. -
ప్రతి తొమ్మిది మందిలో ఒకరు భారతీయులు
చదువు అంటే నేర్చుకోవడం..అది కూడా ఆసక్తితో.. కానీ కొన్నేళ్లుగా చదువు అర్థం మారిపోయింది. పోటీపడాలి.. అత్యధిక మార్కులు సాధించాలి. అంతేకాదు ఉత్తమ కళాశాలలో సీటు సంపాదించాలి. ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చదువు అంటేనే చాలామంది భారంగా భావించే స్థాయికి వచ్చారు. ఫలితాలు వారి అంచనాలను అందుకోలేనప్పుడు ఎవరూ ఊహించని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లో జరుగుతోంది. 2024 ఐసీ3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. 2013–2022 మధ్య మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంతో పోలిస్తే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 64 శాతం పెరిగింది. ‘పరీక్షలు, మార్కులకు మాత్రమే ఈ సంక్షోభాన్ని ముడిపెట్టకూడదు. విద్యార్థుల్లో భయం,నిశ్శబ్దం అలుముకుంది. వారికి భరోసా లేకపోవడం సమస్యను పెంచుతోంది’అని నివేదిక తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్నమ్మకానికి బదులుగా నిశ్శబ్దం..చదువులు, తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు, సామాజి కంగా ఇతరులతో పోలిక వంటి ఒత్తిడిని నేటి విద్యార్థులు ఎదు ర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు పడుతున్న బాధ ను ఎవరూ ముందుగా గుర్తించడం లేదని నివేదిక వివరించింది. మార్గనిర్దేశనానికి బదులుగా చాలామంది తరగతి గదుల్లో భయంతో కూడిన ప్రేరణను అనుభవిస్తున్నారు. నమ్మకానికి బదులుగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యలో ప్రధాన భాగంగా కాకుండా కౌన్సెలింగ్‌ను ఇప్పటికీ చివరి ప్రయత్నంగా చూస్తున్నారు’అని తెలిపింది. పరిష్కారం వారి చేతుల్లోనే..నేర్చుకోవడం, విద్యార్థుల శ్రేయస్సు విషయంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంస్కృతిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ‘విద్యార్థులు చదువును ద్వేషించరు. పెద్దల నుంచి సరైన మార్గనిర్దేశనం లేనప్పుడు వ్యతిరేకిస్తారు. పరిష్కారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు ఆశ్రయించే మొదటి కౌన్సెలర్లు వారే. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించి, మేమున్నాం అని ధైర్యం చెప్పేలా వినడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు’అని వివరించింది. స్వేచ్ఛా వాతావరణం..నివేదిక ప్రకారం 40 శాతం మంది భారతీయ విద్యార్థులు ఎప్పు డూ కౌన్సెలర్‌తో మాట్లాడలేదు. అయితే ఈ సంఖ్య గత సంవత్సరం 52 శాతం నమోదైంది. ‘మానసిక ఆరోగ్యం పాఠశాల జీవితంలో రోజువారీ చర్యల్లో భాగం కావాలి. కౌన్సెలింగ్ నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి’అని నివేదిక తెలిపింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ సంక్షోభం ఏర్పడిన తర్వాత మాత్రమే ‘మానసిక ఆరోగ్యం’గుర్తొస్తుందని వివరించింది. సమస్య రాకముందే నివారణ అవసరం. నమ్మకమైన పెద్దలు తరచూ సమావేశం కావడం ద్వారా విద్యార్థులకు మనోధైర్యం లభిస్తుందని తెలిపింది.ఉపాధ్యాయులే కౌన్సిలర్లు.. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ భారీ నిధులు అవసరం లేదని, స్థిరమైన నిర్మాణం, సానుభూతి అవసరమని నివేదిక వివరించింది. ‘ప్రతి ఉపాధ్యాయుడు కౌన్సెలర్ పాత్ర పోషించడం ఒక ఆచరణాత్మక విధానం. ప్రాథమిక శిక్షణతో విద్యార్థుల బాధను ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించగలరు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లల బాధ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో అవరి్టంగ్ స్టూడెంట్ సూసైడ్ టాస్‌్కఫోర్స్ అభివృద్ధి చేసిన గేట్ కీపర్ ట్రైనింగ్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు సహాయ పడతాయి. స్టూడెంట్ వెల్నెస్ క్లబ్స్, టీచర్–సూ్టడెంట్ అడ్వైజరీ సర్కిల్స్ పాఠశాలల్లో విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు చవకైన మార్గాలు’అని తెలిపింది. మానవ సంబంధాలు.. చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను 83 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతికత మానవ సంబంధాన్ని భర్తీ చేయదని నివేదిక తెలిపింది. విద్యార్థులు త్వరిత సమాధానాల కోసం, లేదా పెద్దలను అడగడానికి సంకోచించినప్పుడు ఏఐ వైపు మొగ్గు చూపొచ్చు. కానీ మనోధైర్యం, జీవిత నిర్ణయాల విషయానికి వస్తే వారు ఇప్పటికీ నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటారు. నమ్మకమైన పెద్దవారితో 15 నిమిషాల సంభాషణ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’అని వివరించింది. విద్యకు పునాదిగా.. విద్యార్థులకు నిజమైన మార్గదర్శకత్వం కావాలి. వారు చదువుతోనే కాదు.. భావోద్వేగాలు, మారుతున్న స్నేహాలు, గుర్తింపు, భవిష్యత్గురించి అనిశి్చతితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు స్పష్టత, అనుబంధం, ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు. పాఠశాల జీవితంలో మార్గదర్శకత్వం భాగం అయినప్పుడే ఇవి అందుకుంటారు. విద్యలో కౌన్సెలింగ్ పునాది కావాలి. ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల గోడు వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. మొత్తం అభ్యాస వాతావరణం మారుతుంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు బలమైన, సంతోషకరమైన, మరింత నమ్మకమైన యువతను తీర్చిదిద్దుతుంది’అని వివరించింది. -
ఉప్పల్‌లో దారుణం.. కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్‌లోని మల్లికార్జున నగర్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 23 నుంచి శ్రీకాంత్ విధులకు హాజరుకాలేదు. దీంతో విధులకు హాజరుకావాలని పీఎస్ నుంచి శ్రీకాంత్‌కు నోటీసులు వచ్చాయి.ఈ క్రమంలో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహచరుల వాంగ్మూలాలు సేకరిస్తున్న పోలీసులు.. ఆర్థిక ఒత్తిడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. -
చిత్తూరు సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని..
పటాన్చెరు టౌన్: పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23) అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. రాములుకు వికారాబాద్‌కు చెందిన ఓ యువతి (18)తో నెల కిందట వివాహం జరిగింది.ఈ క్రమంలో అతను గతనెల 28వ తేదీన భార్యతో తాను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, నువ్వు ఎవ రినన్నా ప్రేమించావా? అని అడగడంతో అతని భార్య.. తాను కూడా ఒక వ్యక్తిని ప్రే మించానని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆలోచిస్తూ.. మనస్తాపానికి గురైన రాములు శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం వెతుకుతుండగా సుల్తాన్పూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత టార్చర్ పెట్టారంటే..!! సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్


