టెకీ ఆత్మహత్యకేసులో సంచలనాల విషయాలు వెలుగులోకి
రూ. 2 లక్షల జీతం, బాగా చూసుకున్నా, ఆమెకు సంతృప్తి లేదు
కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త సూసైడ్ లెటర్
భార్య రేణుకతో పాటు, ఇద్దరు నిందితులు అరెస్ట్
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్
టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసి ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్ లెటర్‌లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.


