Khammam
-
ప్రమాణాలపై ప్రభావం
చేతిరాత శారీరక, మానసిక శ్రమతో కూడినదే అయినా విద్యార్థి మనో వికాసానికి దోహదపడుతుంది. కానీ నేటితరం పిల్లలు చదువుపై చూపిస్తున్న శ్రద్ధ రాతపై చూపడం లేదు. పిల్ల ల్లో చేతిరాతలో నైపుణ్యం తగ్గితే విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతుంది. – చిన్నప్పయ్య, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లెందు నిరంతర సాధన చేతిరాతను మెరుగుపర్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతీ విద్యార్థి ప్రాథమిక చదువు పూర్తయ్యే వరకు ఫోర్ రూల్, సింగిల్ రూల్ నోట్‌బుక్స్ సొంతంగా నిర్వహించుకోవాలి. సెలవుల్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సత్ఫలితాలు అందుకోవచ్చు. – బాలు, ఉపాధ్యాయుడు, మర్రిగూడెం, ఇల్లెందు మండలం -
●కృష్ణవేణికి ర్యాంక్‌ల పంట
ఎప్‌సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంజనీరింగ్, ఇతర విభాగాల్లో ఏ.శిశిర్ సాయి రాష్ట్ర స్థాయి 39వ ర్యాంక్ సాధించగా, ఎస్ఎస్.లక్ష్మి 77, ఎస్.గిరీశ్వర్‌రెడ్డి 213, జేఎల్ఎస్.మైత్రేయి 330, ఈ.హర్షిత్ 364, ఏ.మోక్షితసాయి 464, జె.చరణ్‌తేజ్ 549, ఎం.సాయి సాత్విక 604, ఆర్.మేదిని 1,165, జి.ప్రహర్ష 1,431, కె.భరత్ కుమార్ 1,508, పి.కావేరి 1,547, ఎం.జశ్వంత్‌సాయి 1,560, ఎస్.డీ.సామ్యా సమర్ 1,595, పి.హర్షవర్థన్ 1,631, పి.జశ్వంత్‌కుమార్ 1,740, ఎం.వెంకటేశ్వర్లు 1,896వ ర్యాంక్‌లు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు. -
రూ.కోటి స్వాహా కేసులో సైబర్ నేరస్తుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట నమ్మించి రూ.కోటి మేర మోసం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలి పారు. జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వాట్సాప్‌కు ప్రకటన పంపించి, ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు నమ్మించారు. దీంతో ఆమె ముందుకు రాగా ట్రేడింగ్ లింక్‌ల ద్వారా సుమారు రూ.కోటి మేర సైబర్ నేరస్తులు కాజేశా రు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి, ఆమె ఖాతా నుంచి రూ.13లక్షలు ఏపీలోని మొగల్తూరుకు చెందిన కడలి చంద్రశేఖర్ ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు సీఐ రవికుమార్, ఎస్ఐలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్, సిబ్బందిని సీపీ సునీల్‌దత్ అభినందించారు. -
●రెజొనెన్స్ జయకేతనం
ఎప్‌సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు తెలిపారు. విద్యార్థులను అభినందించాక వారు వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎల్.రామ్మోహన్‌రెడ్డి 591వ ర్యాంక్, ఎం.డీ.నిఖత్ పర్వీన్ 868, కె.సంతోష్ 1,772, ఎం.హారిక 2,387, ఎం.మోక్షిత 3349, ఎస్.లిఖిత 4,286, జి.భరత్‌చంద్ర 5,470, ఎం.మన్వితశ్రీ 5,871, బి.సంయుత 6,723, అగ్రికల్చర్ విభాగంలో కె.సింధు 673, ఎం.పద్మ వచన్ 1,979, కె.హారిక రెడ్డి 2,121, విష్ణు 3,295, కె.నవ్య 4,971, టి.శ్రీలహరి 6,987, సీహెచ్.ధన్యత 9,002, షేక్ రంషా రూహి 9,136వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పింఛన్ బెనిఫిట్లు చెల్లించి ప్రాణభిక్ష పెట్టండి
రిటైర్డ్ హెచ్ఎం వెంకయ్య వినతిఖమ్మం మామిళ్లగూడెం: ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేసిన తాను కేన్సర్ తో పాటు ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతుండగా.. ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెని ఫిట్లు అందక కోసం చికిత్స కోసం తల్లాడుతున్నానని ఖమ్మంకు చెందిన చెరుకుపల్లి వెంకయ్య వాపోయారు. ఈమేరకు బెనిఫిట్లు చెల్లించి తనకు ప్రాణ భిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయిన తనకు దాదాపు రూ.60 లక్షలు రావాల్సి ఉందని తెలిపారు. తన గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరగక రెండు స్టంట్లు వేశారని, దీనికి తోడు కేన్సర్ బారిన పడ్డానని చెప్పారు. ఇప్పటికే ఉన్న డబ్బు చికిత్సకు ఖర్చు చేయగా, ఇంకా రూ.10 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారన్నారు. ప్రాణా పాయ పరిస్థితిలో ఉన్నందున బెనిఫిట్లు విడుదల చేసి తన ప్రాణం కాపాడాలని వెంకయ్య కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి గురుప్రసాద్, మాడుపల్లి బాబు, అల్లంకి జయపాల్, తెల్లపూట జమాలయ, మేళ్లచెరువు బాబు, కోటపింజర రాము, చెరుకుపల్లి మురళి, దూరి జయరాజు, తెల్లూరి యాదగిరి, మన్నె గురుమూర్తి, కోట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కథారచనల్లో మెళ కువలు నేర్పుతున్నా..
ఆంగ్ల మాధ్యమ విద్యాప్రభావంతో మాతృభాషకు ప్రాధాన్యత తగ్గుతున్న నేటి తరుణంలో మాతృభాష అయిన తెలుగు ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా విద్యార్థులతో కథలను విరివిగా చదివించడమే కాక, కథా కార్యశాలల ద్వారా కథా రచనలో మెళకువలను నేర్పించి విద్యార్థులే స్వయంగా కథలు రాసేలా ప్రోత్సహిస్తున్నా. ఆ ప్ర యత్నంలో భాగంనే గత ఏడాది మా పాఠశాల విద్యార్థి ఆవుల పోతురాజు రాసిన కథలతో ‘నాన్నే నా హీరో’ కథా సంకలనం వెలువడింది. అలాగే శతక సాహిత్యంలో పేరెన్నికగన్న వేమన శతకాన్ని నేర్పించి బాల అవధాన కార్యక్రమాన్ని నిర్వహించాం. మున్ముందు వివిధ ప్రక్రియల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భా విస్తున్నాం. ఇందుకు సహకరిస్తున్న పాఠశాల హెచ్ఎం, గార్లపాటి–బొల్లేపల్లి ట్రస్ట్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. – సత్తుపల్లి టౌన్ -
●శ్రీచైతన్య ప్రభంజనం
ఎప్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్‌లతో ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. రాష్ట్రస్థాయిలో బి.సాయి చరణ్ 8వ ర్యాంక్ సాధించగా, ఎల్.అక్షయ గుణ 60వ ర్యాంక్‌తో అగ్రస్థానాన నిలిచారన్నారు. అలాగే, ఎం.అక్షర 85వ ర్యాంక్, ఎం.వర్ష 148, కె.మణిశంకర్ 204, ఎస్.శ్రీనిధి 244, పి.అర్షిత 290, కె.హాసిని 341, డి.సాయి ప్రణవ్ 374, బి.శ్రీనిధి 377, వి.స్నేహిత 482, ఎం.అమాన్ శ్రీసాయి 525, జి.గీతిక 560, ఎనమన్మోయి 629, వై.హాషిష్ 639, ఎన్.భార్గవ్ 677, బి.ప్రణయ్ 715వ ర్యాంక్ సాధించారన్నారు. ఇంకా 100 లోపు ముగ్గురు, 500లోపు 11 మంది, వేయి లోపు 25మంది, 2వేల లోపు 42మంది, 5వేల లోపు 108 మంది ర్యాంక్‌లు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్‌తో పాటు అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్, డీన్లు వర్మ, జె.కృష్ణ, ఏజీఎంలు బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు. -
నేను రాసిన కవిత
భయపడకు నేస్తం! బతుకు ఒకదారి ప్రయత్నం చూపును రహదారి అడ్డు గోడలుంటాయి మరి చూసుకుని పోవాలి సరాసరి కష్టాలు వస్తేనేం భయపడకు నేస్తమా అధిగమిస్తేనే పోగలం ముందుకు భాగ్యమున్నప్పుడు ఎగిరిపడకు గర్వాన్ని అణచుకుంటే గెలుపు నీదే సుమా!– జె.భానుప్రకాష్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్తుపల్లి – సత్తుపల్లి టౌన్అపదలో ఉన్న వారికి సాయం చేయి బాధలో ఉన్న వారికి సంతోషాన్ని కలగజేయి.. మనిషి బతుకన్నాక మంచిని చేయి మూర్ఖత్వం నీకు ససేమిరా వలదోయి.. -
వానాకాలం సాగుకు సై..
వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలోని వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందించారు. ఎప్పటిలాగే రానున్న వానాకాలంలో సీజన్లోనూ వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, పెసర, మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ సాగవుతాయని గుర్తించారు. – ఖమ్మంవ్యవసాయంపంటల వారీగా ప్రణాళిక ఖరారు ● అన్నీకలిపి 6.47లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా ● ఈసారి కూడా వరి, పత్తికే అగ్రస్థానం ● సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చేలా సన్నాహాలువానాకాలం సాగుకు సంబంధించి పంటల వారీగా అంచనాలు రూపొందించాం. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో తొలుత సాగు మొదలుపెట్టే పత్తి విత్తనాలను సమకూర్చేందుకు సన్నాహాలు ప్రారంభించాం. అలాగే, భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు కూడా సరఫరా చేస్తాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలోని 21 మండలాల్లో పంటల సాగుకు 6,47,754 ఎకరాల భూమి అనువుగా ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. గత ఏడాది అన్నీ కలిపి 6,17,858.31 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. కానీ రానున్న సీజన్లో దాదాపు 30 వేల ఎకరాలు పెరిగే అవకాశముందని భావిస్తూ 6.45ఎకరాల్లో పంటలు సాగవుతాయనే నిర్ధారణకు వచ్చారు. ఇందులో ప్రధాన పంట అయిన వరి 3,20,301 ఎకరాల్లో సాగవుతుందని అంచనాల్లో పొందుపరిచారు. ఇక మరో ప్రధాన పంట పత్తి 2,69,715 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే వరి 15 వేల ఎకరాల్లో, పత్తి 13 వేల ఎకరాల్లో పెరగనుంది. అంతేకాక పత్తి, మిర్చికి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఈమేరకు మిర్చి సాగు 33 వేల ఎకరాలుగా ప్రణాళికలో పొందుపర్చారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో 1.06 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. కానీ ధర పతనం కావటం, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో ఏటేటా తగ్గుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది మిర్చికి మంచి ధర రావడంతో వానాకాలంలో సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. వానాకాలం సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తన ప్రణాళికలను సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వరి విత్తనాలు 80 వేల క్వింటాళ్ల మేర అందుబాటులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద వరి, పెసర, మినుము, కంది వంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక 2.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనుండగా, ఎకరాకు రెండు చొప్పున 5.38 లక్షల విత్తన ప్యాకెట్లకు గాను 6.74 లక్షల విత్తన ప్యాకెట్లను అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. అంతేకాక తొలకరి వర్షాలు కురవగానే రైతులు భూసారాన్ని పెంచేలా సాగు చేసే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సమకూర్చనున్నారు. ఈ విత్తనాలను పీఏసీఎస్, ఆగ్రోస్ సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. -
●రైతులే హమాలీలు
వేంసూరు: ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్ని కావు. అయితే, వేంసూరు మండలంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మండలంలోని కల్లూరుగూడెం సివిల్ సప్లయీస్ గోదాంకు వెళ్లే దారి లేక రెండేళ్లుగా నిరూపయోగంగా ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు పేరుకుపోతున్నాయనే విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో గోదాంను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో రైతులు సంతోషించగా.. మండలంతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకురావడం మొదలైంది. కానీ కేవలం 20మంది హమాలీలే ఉండడం, వందల సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో దిగుమతిలో జాప్యం జరిగి రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా ట్రాక్టర్ల యజమానులు రైతుల నుంచి రోజుకు రూ.వేయి మొదలు రూ.1,500 వరకు వెయిటింగ్ చార్జీ డిమాండ్ చేస్తున్నారు. కొందరు రైతులు డబ్బు చెల్లించే పరిస్థితి లేక ఎవరి మొక్కజొన్న బస్తాలను వారే అన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాక పైరవీ చేసే వ్యక్తులు, రాజకీయ పలుకుబడి వారి మక్కలు తొలుత అన్లోడ్ చేస్తున్నారని శనివారం వాగ్వాదం జరగగా తహసీల్దార్ మాణిక్‌రావు నచ్చజెప్పారు. -
చేయూత.. పరీక్ష !
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హులను తొలగించేందుకు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను సరిచూసేందుకు ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ – ముఖ గుర్తింపు విధానం)ను ప్రారంభించారు. గ్రామీణ, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన యాప్‌ల ద్వారా ఆధార్ నంబర్ సహా లబ్ధిదారుల లైవ్ ఫొటోను నమోదు చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 1,76,950 మందికి చేయూత పెన్షన్ల ద్వారా ప్రభుత్వం నెలకు రూ.42 కోట్లు విడుదల చేస్తోంది. మరణించిన వారి గుర్తింపునకే ప్రాధాన్యం పింఛన్ జాబితాలో మరణించిన వారిని గుర్తించేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రస్తుతం జీవించి ఉన్నారా, లేదా అనేది క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుని.. ఎవరైనా మరణిస్తే పేరు తొలగిస్తారు. తద్వారా కేవలం అర్హులైన వారికే ప్రభుత్వ సాయం అందుతుందని చెబుతున్నారు. ఈనెల 15వ తేదీన మొదలైన డ్రైవ్ జూన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. వారికే బాధ్యతలు గ్రామీణ ప్రాంతాల్లో చేయూత లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందికి అప్పగించారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం శానిటరీ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలను అప్పగించాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. జనగణన, ఎస్ఐఆర్ వంటి కార్యక్రమాలతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ పనులతో వార్డు ఆఫీసర్లు తీరిక లేకుండా ఉన్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా ఉద్యోగులు నేరుగా పెన్షన్లు అందుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి తమ ఫోన్లోని యాప్ ద్వారా ఆధార్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుడి ఫొటోతీసి ఆధార్ డేటాబేస్‌లోని ఫొటోతో సరిపోల్చుకుంటూ (బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్) ప్రక్రియ పూర్తి చేస్తారు. తొలిరోజు సాంకేతిక సమస్యలు జిల్లాలో చేయూత లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియకు నెల గడువు విధించారు. లబ్ధిదారులందరినీ లైవ్‌లో గుర్తించాల్సి ఉండటంతో ఈ గడువు నిర్దేశించారు. అయితే సర్వే ప్రారంభమైన తొలి రోజు యాప్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయినా వాటిని సరిచేసుకుంటూ సర్వే కొనసాగించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆ తర్వాత అర్హులకు.. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నా.. ఎప్పటి నుంచి అనేది ప్రకటించలేదు. జిల్లాల్లో అనర్హులతో పాటు చనిపోయిన వారి పెన్షన్లు తొలగిస్తే కొత్త వారికి చోటు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మృతుల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సర్వే ద్వారా వారిని గుర్తించి తొలగిస్తే.. కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. -
ఏదులాపురంలో ఎప్పుడూ అంతే..
● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యంఖమ్మంరూరల్: ఏదులాపురం సొసైటీ అధికారులు, సిబ్బంది తీరు మారుతుందనే ఎన్నటికీ నెరవేరేలా కనిపించడం లేదు. తప్పులపై తప్పులు చేస్తూ రైతులను ముప్పు తిప్పలు పెట్టే ఉద్యోగులను ఇదేమిటని ప్రశ్నిస్తే... ‘మేం అంతా బాగా చేస్తున్నాం కదా... ఎందుకు మారాలి’ అని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. గత ఖరీఫ్ సీజన్లో తరుగు పేరిట రైతుల నుండి అందిన కాడికి దోచుకున్నది చాలదన్నట్లు ఈ యాసంగి మక్కల కొనుగోళ్లలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ల సమయాన అక్రమాలు బయటపడడంతో సొసైటీలోని ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అయినా తీరు మార్చుకోకపోవడం గమనార్హం. వీరికి మద్దులపల్లి మార్కెట్లోని కొందరు సిబ్బంది జత కలవడం రైతుల ఇక్కట్లు మరింత పెరగడానికి కారణమైంది. ఉచిత కాంటాలకు తిలోదకాలు పంట ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్‌కు తీసుకొస్తే నిబంధనల ప్రకారం ఉచితంగా కాంటా వేయాలి. కానీ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో మాత్రం వే బ్రిడ్జి నిర్వాహకులు రైతులు తెచ్చే మక్కల తూకం వేయడానికి డబ్బు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తూ, ఇదేమిటని రైతులు అడిగితే ‘పైవాళ్లే తీసుకోమంటున్నారు’ అని సిబ్బంది చెబుతున్నారని సమాచారం. ఇదికాక కొందరు సిబ్బంది రాత్రి వేళ దొడ్డిదారిన ట్రాక్టర్ల లోడ్‌ను నేరుగా కాంటా వద్దకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్కెట్ చైర్మన్ ఆ మార్గంలో ట్రెంచ్ కొట్టించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రైతులను కాదని.. కొందరు వ్యాపారులు గ్రామాల్లో రైతుల వద్ద తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేసి ట్రాక్టర్లలో మద్దులపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రైతులు మక్కల కాంటా కోసం రోజుల తరబడి రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వీరందరినీ కాదని వ్యాపారులు తెచ్చిన మక్కలను మాత్రం ఉద్యోగులు క్షణాల్లో కొనుగోలు చేసి కాంటా వేయడం కళ్ల ముందే జరిగిపోతుంటుంది. ఇందుకు గాను వ్యాపారుల నుంచి క్వింటాకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వసూళ్లపై ఆగ్రహం వే బ్రిడ్జి వద్ద కాంటాపేరుతో ఉద్యోగులు, హమాలీలు అక్రమ వసూళ్లకు పాల్పడతున్నారని ఆగ్రహిస్తూ మక్కల రైతులు నాలుగు రోజుల క్రితం పెద్దతండాలోని గోదాం వద్ద ఆందోళన చేపట్టారు. ట్రక్కుకు రూ.300, బస్తాకు రూ.6 దిగుమతి ఖర్చుల పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవికాక ట్రక్కుకు అదనంగా రూ.500 కూడా అడుగుతున్నారని వాపోయారు. గోదాం ఉద్యోగులు, హమాలీలు ఒక్కటై డబ్బు ఇచ్చిన వారి పంటనే కాంటా వేయడం, దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. అలాకాక నిరాకరిస్తే ఆ రైతుల ట్రాక్టర్లను గోదాం లోపలికి అనుమతించకుండా రోజుల తరబడి నిలిపేస్తున్నారని విమర్శించారు.ఏ వ్యాపారి నుంచి కూడా మా సిబ్బంది డబ్బు తీసుకోవడంలేదు. వ్యాపారులు తీసుకొచ్చిన మక్కలను కూడా కొనుగోలు చేయడంలేదు. బయట ఒకరిద్దరు రైతులతో మాట్లాడుకుని వ్యవహారం చేస్తే మాకేం సంబంధం? రైతులు నేరుగా మక్కలు అమ్మకానికి తీసుకొస్తే అన్నీ సరిచూశాకే కాంటా వేస్తున్నాం. డబ్బు కూడా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. – మహమద్ అలీ, సీఈఓ, ఏదులాపురం సొసైటీ -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. ఇద్దరితో వివాహేతర సంబంధం..
మధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ.. సదరు మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని కల్పనగా గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27), మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చి వెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది.ఇద్దరం కలిసి మాట్లాడుదాం..కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు.కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కాగా, కల్పన వివాహేతర సంబంధం కారణంగా ఆమె కుమారుడు ఒంటరైపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
ప్రకృతి ఒడిలో పసితనం!
● ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లకు దూరంగా గొత్తికోయ చిన్నారులు ● అడవే ఆటస్థలం.. ప్రకృతే ఆటబొమ్మ బొమ్మలాటలో నిమగ్నమైన పిల్లలు రైలు బండి ఆడుతూ... చెట్ల కొమ్మే జారుడుబండగా..కరకగూడెం: వేసవి సెలవులు వచ్చాయంటే పట్టణాలు, మైదాన ప్రాంతాల పిల్లలు ఇళ్లకే పరిమితమై స్మార్ట్ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్‌తో పాటు ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తుంటారు. ఉదయమో, సాయంత్రమో కాసేపు అలా బయటకు వచ్చి ఆడుకుంటారు. కానీ, అడవిని నమ్ముకుని బతికే గొత్తికోయ గూడేల్లో పిల్లల ముచ్చట్లే వేరు. వీరంతా అడవి ఒడిలోనే స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈత కాయల వేట.. గొత్తికోయ గ్రామాల్లోని చిన్నారులకు ఈత చెట్లే వేసవి పిక్నిక్ స్పాట్లు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే గుంపులుగా ఈత చెట్ల వద్దకు వెళ్లి కాయలను ఏరుకుంటూ, తింటూ గడుపుతారు. ప్రకృతి ప్రసాదించిన తీయని పండ్లను సేకరించడమే వారికి పెద్ద ఆట. మట్టిబొమ్మలు, చికుబుకు రైళ్లు వీరి ఆటల్లో ప్లాస్టిక్ బొమ్మలు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఉండవు. అడవిలో దొరికే మట్టి, రాళ్లు, ఆకులతోనే బొమ్మలాట ఆడుకుంటారు. ఒకరినొకరు పట్టుకుని చికుబుకు.. అంటూ రైలు బండి ఆడుతూ ప్రకృతి ఒడిలో పరుగులు తీస్తున్నారు. ఇవికాక వాటర్ రోలర్‌ను తోసుకుంటూ గడపడం, పెద్ద చెట్ల కొమ్మలను జారుడు బండల్లా మార్చుకుని జారుతూ సందడి చేస్తుండడం కనిపిస్తోంది. ఈత చెట్టు కింద కాయలు ఏరుతున్న చిన్నారులు -
మహిళా డెయిరీపై కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరా మహిళా డెయిరీపై అధికారులతో సమీక్షించారు. తొలుత కలెక్టర్ ఈ కార్యక్రమానికి సంబంధించి బడ్జెట్ త్వరగా విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, మైనారిటీ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ఫోన్లో కోరారు. అనంతరం ఆయన మహిళా డెయిరీకి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులకు అనుమతులు, గేదెల పంపిణీ, పశువుల షెడ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. డీఆర్డీఓ శ్రీరామ్, సీపీఓ శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, మైనార్టీ అభివృద్ధి శాఖల అధికారులు జి.జ్యోతి, ముజాహిద్, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి పురంధర్, పంచాయతీరాజ్ ఈఈ మహేష్, విజయ డెయిరీ డీడీ కె.రవికుమార్‌తో పాటు జయశ్రీ, ఎస్.విజయ్‌చంద్ర పాల్గొన్నారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ ఖమ్మం సహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం వీసీ ద్వారా ఎస్ఐఆర్, మ్యాపింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 15నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ చేపట్టాలని తెలిపారు. ఇక జూన్ 25నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించే సమయాన పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పారు. ఆపై జూలై 31న ము సాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలను వివరించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమైన ఆయన నివాసాలకు వెళ్లినప్పుడు ధ్రువపత్రాలు లేకపోతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు విస్తృత ఉపాధి లైసెన్స్డ్ సర్వేయర్లకు భవిష్యత్‌లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కలెక్టర్ దివాకర తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి లైసెన్స్డ్ సర్వేయర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ భూ భారతి పోర్టల్ మ్యాపింగ్ అమల్లోకి వచ్చినందున తిరుమలాయపాలెం మండలంలో రీ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కొందరు సర్వేయర్లను వినియోగించుకుంటామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో అమల్లోకి వస్తే సర్వేయర్లకు పని, ఆదా యం లభిస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సర్వేలు చేయించుకున్నా ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో తప్పు చేస్తే లైసెన్స్ రద్దుచేస్తామన్నారు. విధానమైన నిర్ణయాలు, సమస్యలపై ప్రభుత్వానికి తెలియచేస్తామని వెల్లడించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పాల్గొన్నారు. ధాన్యం దిగుమతుల్లో జాప్యం లేదు ధాన్యం దిగుమతుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ‘సాక్షి’లో శనివారం ‘దిగుమతుల్లో జాప్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 309 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఆపై ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం మిల్లులోనూ 80మంది హమాలీల ద్వారా రోజుకు 30 – 32 లారీల మేర దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిల్వలు పేరుకుపోకుండా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని సూచించారు.కలెక్టర్ దివాకర టీఎస్ -
మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి
ఖమ్మంమామిళ్లగూడెం: మున్నూరుకాపుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఖమ్మంలో శనివారం జరిగిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కులస్తులు ఐక్యంగా ఉంటూ అందరి సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రం సంఘం సమావేశంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి దేవేంద్రం, కోశాధికారిగా మడూరి పూర్ణచంద్రరావు, గౌరవ అధ్యక్షుడిగా కొత్త సీతారాములు ఎన్నికయ్యారు. అలాగే, యువజన విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా తోట రమేష్, మాటేటి కిరణ్ కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పగడాల మంజుల, తోట సుజలారాణిని ఎన్నుకోగా ఎంపీ రవిచంద్ర సత్కరించారు. ఇంకా ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, నాయకులు గుండాల కృష్ణ, కొత్తా సీతారాములు, మేకల భిక్షమయ్య, కనకం జనార్దన్, పొదిల రవికుమార్, శెట్టి రంగారావు, లక్కినేని రఘు, గీతా వెంకన్న, పొన్నం వెంకటేశ్వర్లు, బచ్చు విజయ్‌కుమార్, జాబిశెట్టి శ్రీనివాసరావు, ఆళ్ల కృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, తోట గణేష్, తోట రామారావు, మాటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం పాల్గొన్నారు. -
హలీడే ట్రిప్..
హలో ఫ్రెండ్స్.. నా పేరు ధ్రువన్ తేజ్. ఐదో తరగతి చదువుతున్నా. మా కుటుంబం ఈ వేసవి సెలవుల్లో కర్ణాటక రాష్ట్రంలో టూర్‌కు వెళ్లాం. మొదటగా మైసూర్ ప్యాలెస్ చూశా. చాలా అద్భుతంగా ఉంది. అక్కడే శ్రీచాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఆ తర్వాత కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్, ఓరొయానో మాల్‌ను చూశాను. ఈ ప్రదేశాలన్నీ చాలా బాగున్నాయి. నేను నా కుటుంబ సభ్యులం చాలా ఆనందంగా గడిపాం. అలాగే ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తూ చల్లగా ఉండే ఊటీకి వెళ్లాం. అక్కడకు వెళ్లగానే చల్లని వాతావరణం చాలా.. చాలా నచ్చింది. అక్కడే రోజ్ గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూశాం. రోజ్‌గార్డెన్ ఇంకా బాగా నచ్చింది. ఈ టూర్‌ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. – సత్తుపల్లి టౌన్ -
మామిడి మంట
● ధరల పెరుగుదలతో పచ్చడి ప్రియం ● మార్కెట్లోకి అరకొరగా మామిడికాయలు ● ఇతర సామగ్రి ధరతో బెంబేలు మధిర: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు చీడపీడలు ఆశించడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి పడిపోయింది. దీంతో మే నెల రాగానే పచ్చడి కాయలతో పాటు ఇతర రకాల అమ్మకాలు జోరందుకోవాల్సి ఉన్నా ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. పలు కారణాలతో పచ్చడి పెట్టుకునే రకాలు మార్కెట్లో అరకొరగానే లభిస్తున్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, తెల్లగులాబీ వంటి రకాలను పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు. కానీ, కొరత కారణంగా ఒక్కో కాయ రకాల ఆధారంగా రూ.20 నుంచి రూ.50కి పైగా ధర పలుకుతోంది. దీనికి ఇతర సామగ్రి ధరలు కూడా పెరగడంతో జనం పచ్చడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. తెగుళ్ల బెడదతో మామిడి సీజన్ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలిపోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావడంతో పాటు పండు ఈగ పురుగు ఆశించింది. దీంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో ఒక్కో చిన్న రసం, పెద్ద రసం చెట్టుకు వేయికిపైగా కాయలు కాసేవి. కానీ ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల నేపథ్యాన కొన్ని చెట్లు కాయలే కాయకపోగా మరికొన్ని చెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామిడికాయలు పచ్చడికి పనికి రాకపోవడంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్ పెరిగిది. స్థానికంగా కొరత కారణంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నూజివీడు, విస్సన్నపేట, ఎ.కొండూరు తదితర మండలాల నుంచి చిరువ్యాపారులు పచ్చడి మామిడి కాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏవీ ఆ ఘుమఘుమలు? దాదాపుగా మామిడికాయ పచ్చడి తినని వారెవరూ ఉండరు. మధ్యతరగతి, సామాన్య కుటుంబాల్లో ఉదయం పనులు, కూలీకి వెళ్లేవారు పచ్చడితో భోజనం చేసి బయలుదేరతారు. మిగతా కుటుంబాల్లోనూ ఏటా వేసవిలో పచ్చడి పెట్టుకోవడం ఆనవాయితీ. ఏడాదంతా నిల్వ ఉండేలా మామిడి పచ్చడి పెట్టడం కనిపించేది. కానీ ఈసారి కాయల కొరత, సామగ్రి ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కానరావడం లేదు. కొందరు పచ్చడి పెట్టినా 100కు బదులు 50, 50కి బదులు ఇరవై కాయలతో సరిపెట్టుకుంటున్నారు. ధరాఘాతం ఏడాది పాటు నిల్వ ఉండే మామిడి పచ్చడి తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలు మండిపోతున్నాయి. చిన్న కాయ అయినా ముక్కలు కొట్టడానికి రూ.5 నుంచి రూ.10 తీసుకుంటున్నారు. ఇదికాక నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇక పచ్చడి పెట్టేందుకు అవసరమైన లావు రకం మిర్చి కేజీ రూ.500 పైగా పలుకుతుండడం గమనార్హం. అంతేకాక వెల్లుల్లిపాయలు రూ.230, మెంతులు రూ.160, పల్లీ నూనె రూ.190, నువ్వుల నూనె రూ.410 మేర ధర పలుకుతున్నాయి. -
నేటి నుంచి కాకరవాయిలో సమగ్ర భూసర్వే
తిరుమలాయపాలెం: సమగ్ర భూసర్వే ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. సమగ్ర సర్వే కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని కాకరవాయిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఆదివారం నుంచి క్లస్టర్ల వారీగా భూసర్వే చేపట్టనున్నందున రైతులు పాత పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్‌బుక్స్ తదితర ఆధారాలతో సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూసమస్యలు పారదర్శకంగా పరిష్కారమవడమే కాక అనుభవదారులుగానే మిగిలిన రైతులకు పూర్తి స్థాయి యజమాన్య హక్కులు అందుతాయని చెప్పారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, డీటీ సుధీర్, ఆర్ఐలు పవన్‌కుమార్, లక్ష్మణ్, సర్పంచ్ గూడురు ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రవాణాశాఖలో సేవలకు అంతరాయం ఖమ్మంక్రైం: జిల్లాలోని అన్ని రవాణాశాఖా కార్యాలయాల్లో శనివారం సేవలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్లు డౌన్ కావడంతో ఈ పరిస్థితి ఎదురైందని అధికారుల ద్వారా తెలిసింది. ఈమేరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు కాసేపు వేచి ఉండి వెనుదిరిగారు. అయితే, శనివారం స్లాట్లు బుక్ చేసుకున్న వాహనాదారులు సోమవారం సేవలు పొందొచ్చని ఇన్చార్జ్ ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్ -
అత్యుత్సాహంతో అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కూడళ్లలో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలతో పాలకులు అభాసుపాలవుతున్నారన్న చర్చ జరుగుతోంది. లకారం ట్యాంక్‌బండ్ వద్ద మాజీ ప్రధాని పీ.వీ.నరసింహా రావు విగ్రహం ఉన్న ఆవరణలోనే మంత్రి తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పైలాన్ నిర్మాణం చేపట్టారు. ఇది మాజీ ప్రధానిని అగౌరవపర్చడమేనని బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం నిరసన తెలపగా... ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రాత్రికి రాత్రి నిర్మాణాన్ని తొలగించారు. 2020లో ఏర్పాటు మాజీ ప్రధాని, భారతరత్న పీ.వీ.నరసింహారావును గౌరవిస్తూ 2020లో ఆయన 100వ జయంతి ఉత్సవాలను గత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆ సమయాన ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక చుట్టూ రెయిలింగ్ పెట్టి మొక్కలు నాటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 40 ఏళ్లు పూర్తవడంతో కొందరు నేతలు పైలాన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేకపోగా, పీవీ విగ్రహం వెంటే నిర్మిస్తుండడంతో ఆయన అభిమానులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు శుక్రవారం నిరసనకు దిగి కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో బ్రాహ్మణసంఘం నేతలు సైతం అభ్యంతరం చెబుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రికి రాత్రే తొలగింపు మాజీ ప్రధానిని గౌరవించాల్సిన వ్యక్తులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలే విగ్రహం వెంటే పైలాన్ నిర్మిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులకు బ్రాహ్మణ సంఘం నేతలు, అభిమానుల నుంచి ఫిర్యాదులు అందడంతో తొలగింపుపై కేఎంసీ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత సిబ్బందితో సగం మేర పూర్తయిన పైలాన్‌ను తీయించారు. బ్రాహ్మణసంఘం పాలాభిషేకం లకారం సర్కిల్లోని పీవీ విగ్రహానికి శనివారం సాయంత్రం ఖమ్మం నగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. విగ్రహం వద్ద చేపట్టిన పైలాన్ నిర్మాణాన్ని తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మారంరాజు రాధాకృష్ణ, మాటూరి లక్ష్మీనారాయణ, ఊటుకూరు వెంకట రవికాంత్, పర్చా రంగారావు, జమలాపురం కేశవరావు, చాగంటి రామకృష్ణ, ఊటుకూరు చంద్రశేఖరరావు, సూరావర్జుల వాసు, శ్రీకాంత్, సరస్వతి కుమార్, దేవులపల్లి నరసింహారావు, వల్లూరు విజయ్‌కుమార్, సత్యనారాయణచార్యులు, శ్రీధర్ పాల్గొన్నారు.కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలా జరిగింది. మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు వంటి మహోన్నత వ్యక్తిని కించపరిచేలా ఎలాంటి చర్యలు ఉండకూడదు. కార్యకర్తలు ప్రచార ఆర్భాటం కన్నా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి. పైలాన్ నిర్మిస్తున్నారనే విషయం తెలియగానే తొలగించాలని కేఎంసీ కమిషనర్‌ను ఆదేశించా. –తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి -
విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విజయ డెయిరీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణ, రైతులకు మద్దతు ధర, మహిళల భాగస్వామ్యంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమకు అపారమైన అవకాశాలు ఉన్నందున రైతుల్లో విశ్వాసం పెంపొందిస్తే పాల సేకరణ పెరుగుతుందని తెలిపారు. అలాగే, మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం చైర్మన్ అమిత్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యమైన పాల సేకరణకు విస్తృత అవకాశాలు ఉన్నందున, డెయిరీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సహకార శాఖ రిజిస్ట్రార్ రాహుల్‌రాజ్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో రాష్ట్ర మంత్రి తుమ్మల -
శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలోని స్వామి విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన బాలుర గురుకుల కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బి.అరుణకుమారి పర్యవేక్షించారు. మొత్తం 539 సీట్లకు గాను దరఖాస్తుల పరిశీలన అనంతరం 480 మంది విద్యార్థులను ఎంపిక చేసి కృష్ణసాగర్, కిన్నెరసాని, దమ్మపేట, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం కళాశాలల్లో సీట్లు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు బీ.ఎల్.నారాయణరావు, జి.హరికృష్ణ, భాస్కర్, ఎం.దేవదాస్, రమేష్, సీతారాం నాయక్, పద్మావతి, హేమలత తదితరులు పాల్గొన్నారు. జేఈఈ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు ఖమ్మంక్రైం: జేఈఈ(అడ్వాన్స్డ్) పరీక్షలు ఆదివారం జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద ఉదయం 5–30నుంచి రాత్రి 8–30గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈమేరకు కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాకుండా కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాజీకి అనుకూలమైన కేసులు పరిష్కరించాలి ఖమ్మంలీగల్: రాజీకి అనుకూలమైన కాంపౌండబుల్ కేసులను గుర్తించి జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం మహిళా కోర్టు న్యాయమూర్తి ఉసికల శీనయ్య సూచించారు. వచ్చేనెల 20న నిర్వహించనున్న లోక్ అదాలత్‌పై శనివారం ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు. లోక్‌అదాలత్ విజయవంతం అయ్యేలా పోలీసు అదికారులలు సహకరించాలని సూచించారు. స్టేషన్ల పరిధిలో రాజీకి పరిష్కారానికి అనువైన కేసులను గుర్తించి ఇరుపక్షాలను సమన్వయం చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం డీఎల్ఎస్ఏ కార్యదర్శి పి.దేవీమానస మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని వెల్లడించారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
వైరా: మహిళలు పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోగా, ప్రస్తుత పాలకుల విధానాలపైనా బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సమాఖ్య జిల్లా మహాసభలు శనివారం వైరాలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. మహిళల్లో ప్రగతి శీల మార్పుల దిశగా సమాఖ్య పని చేస్తోందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులకు అనుగుణంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం బిల్లు పేరిట చేస్తున్న యత్నాల్లో అవకాశవాదం దాగి ఉందని చెప్పారు. కాగా, బీజేపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనీస న్యాయం అడగడాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఓ యువతిపై అఘాయిత్యం చేసినా ప్రజాప్రతినిధులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయమని చెప్పారు. ఇక కాంగ్రెస్ మహిళలకు హామీ ఇచ్చినట్లుగా నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మాట్లాడుతూ.. మహిళా చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. సమావేశానికి పోటు కళావతి, దండి శ్రీజ, సీహెచ్ సీతామహాలక్ష్మి, బేబీ రాణి అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, నాయకులు యర్రా బాబు, దొండపాటి రమేశ్, ఏపూరి లతాదేవి, తాటి నిర్మల, బత్తినేని నీరజ, నల్లమోతు శైలజ, మందడపు రాణి, కర్నాటి నళిని, ఏపూరి పద్మ, కారం కోటమ్మ, లలిత, లక్ష్మి, రంజాన్‌బీ తదితరులు పాల్గొన్నారు.మహిళా సమాఖ్య జిల్లా సభల్లో రాష్ట్ర కార్యదర్శి జ్యోతి -
మాట్లాడుకుందామని పిలిచి హత్య?
● వెంచర్లో ప్రాణాలు కోల్పోయిన మహిళ ● వివాహాతేర సంబంధాలే కారణమని అనుమానాలుమధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ ఆ మహిళ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మధిర మండలంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27) – మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమాన వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చివెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది. ఇద్దరం కలిసి మాట్లాడుదాం.. కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఈ క్రమాన తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు. కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు పలు అంశాలపై వాట్సప్ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. -
రేపు మాక్ ఎక్సర్రైజ్
ఖమ్మంసహకారనగర్: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై ప్రణాళిక కోసం సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం ఆయన పలు శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. సోమవారం ఉదయం 8 గంటలకు మాక్ ఎక్సర్సైజ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా మున్నేటి వరదలు లేదా ఇతర విపత్తులు ఎదురైనప్పుడు యంత్రాంగం స్పందించాల్సిన తీరుపై మాక్ ఎక్సర్సైజ్ ఉంటుందని తెలిపారు. ఎస్ఐలు ఎ.విశ్వతేజ, పి.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లును తనిఖీ చేసిన డీసీఎస్ఓ ముదిగొండ: మండలంలోని వనంవారికిష్టాపురంలో రైస్‌మిల్లును డీసీఎస్ఓ చందన్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. మేడేపల్లికి చెందిన రైతు ఊటుకూరు సైదులు సదరు మిల్లులో క్వింటా ధాన్యానికి ఏడు కిలోల తరుగు తీస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో డీసీఎస్ఓ విచారణ చేపట్టారు. ధాన్యం తూర్పార పట్టాకే తీసుకురావాలని చెప్పామే తప్ప తరుగు తీయలేదని మిల్లు యజమాని బదులిచ్చాడు. ఆ తర్వాత రైతు వాంగ్మూలం కూడా సేకరించిన డీసీఎస్ఓ, రైతులను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సివిల్ సప్లయీస్ డీటీ నాగలక్ష్మి, ఆర్ఐ కల్యాణి, జీపీఓ బాలకృష్ణ పాల్గొన్నారు. ఖాతా నుంచి రూ.లక్ష స్వాహా సీపీ కార్యాలయం ఎదుట హల్చల్ ఖమ్మంక్రైం: మద్యం మత్తులో ఓ వ్యక్తి పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు శనివారం హడావుడి చేశాడు. ప్రకాష్‌నగర్ ప్రాంతానికి చెందిన పందిరి శివ కొంతకాలంగా భార్యతో గొడవపడి దూరంగా ఉంటున్నాడు. ఈనేపథ్యాన తననెవరూ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ మద్యం మత్తులో వచ్చిన ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకోన్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అడ్డుకోబోగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. ఈమేరకు శివను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు. -
సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తా..
మమ్మీ, డాడీ ఈ సెలవుల్లో సైకిల్ కొనిచ్చారు. దీంతో తొలుత డాడీ సాయంతో సైకిల్ తొక్కడం నేర్చుకున్నా. ఇప్పుడు సొంతంగానే సైకిల్ తొక్కగలుగుతున్నా. అయినా రోడ్లపైకి వెళ్లకుండా ఉదయం, సాయంత్రం వీధిలోనే ప్రాక్టీస్ చేస్తున్నా. సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం సైకిల్ తొక్కుతుండగా.. స్కూల్‌కు కూడా ఈసారి సైకిల్‌పైనే వెళ్తాను. –అంజన్‌కుమార్, బెస్తకాలనీ, శ్రీనివాసనగర్, ఖమ్మం సైకిళ్లపై క్రేజీ ఎన్నటికీ తగ్గదు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సైకిల్‌పై మోజు చూపుతున్నారు. నడక నేర్చుకునే పిల్లల నుంచి అన్ని వయసుల వారికి అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు మోడళ్లు లభిస్తాయి. వేసవి సెలవులు మొదలు స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. –అబ్దుల్ హమీద్, సైకిల్ స్టోర్స్, కస్బాబజార్, ఖమ్మం -
‘సుడా’లో సవాళ్ల స్వాగతం!
● అనుమతుల్లో జాప్యం.. అసంపూర్తిగా మాస్టర్ ప్లాన్ ● మరోపక్క ఉద్యోగులు, సిబ్బంది కొరత ● జిల్లా వ్యాప్తంగా విస్తరించినా అన్నీ సమస్యలే ఖమ్మంమయూరిసెంటర్: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) నూతన సారథికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత 29 నెలలకు పైగా కమిటీ లేకపోవడంతో అధికార యంత్రాంగమే బండిని నెట్టుకొచ్చింది. ఇటీవల చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను నియమించగా త్వరలోనే పూర్తిస్థాయి పాలకవర్గం కొలువుదీరనుంది. ఖమ్మం నగరంతో పాటు సుడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై పాలకవర్గం దృష్టి సారిస్తే తప్ప గాడిన పడే అవకాశం లేదు. ఈనెల 13న ఎలాంటి హడావుడి లేకుండా సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇకపై పరిపాలనపైనా దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. మాస్టర్ ప్లాన్.. ఏళ్ల నాటి నిరీక్షణ ‘సుడా’ పరిధిలోని ప్రజలు, రియల్టర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రధాన అంశం మాస్టర్ ప్లాన్. ఖమ్మం నగరం శరవేగంగా విస్తరిస్తున్నా పాత మాస్టర్ ప్లాన్ ఇంకా పైనల్ పబ్లికేషన్ దశకు చేరలేదు. నగరంలోని రెండు ప్రాంతాలకు సంబంధించి ప్లాన్‌లో మార్పులు చేయాలని పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆటంకం ఎదురైనట్లు తెలుస్తోంది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. మాస్టర్ ప్లాన్‌ను త్వరగా ఆమోదించి గెజిట్ విడుదల చేయించడం కొత్త చైర్మన్ ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెబుతున్నారు. అనుమతుల్లో పారదర్శకత సుడా పరిధి విస్తరించిన తర్వాత వెంచర్లు, భారీ భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో పాలకవర్గం లేని సమయంలో జారీ అయిన కొన్ని అనుమతులపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిశాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టే వారు వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పారదర్శకమైన పాలనను అందించాల్సి ఉంది. కేఎంసీ ఉద్యోగులే ... గత ప్రభుత్వ హయాంలో సుడా పాలకవర్గం ఉన్నప్పుడు డీసీసీబీ బ్యాంక్ భవనంలోని ఓ భాగాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు. పాలకవర్గం రద్దయ్యాక అక్కడి నుంచి ఖాళీ చేసి ఫర్నీచర్‌ను కేఎంసీకి చేర్చారు. తిరిగి ఇటీవల చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక అదే భవనంలో కార్యలాపాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు చైర్మన్ సూచనలతో అవసరమైన మరమ్మతులు మొదలుపెట్టారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సుడా’కు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా లేకపోవడంతో కేఎంసీ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త పాలకవర్గం చొరవ తీసుకుని ప్రత్యేక ఉద్యోగులు, సాంకేతిక సిబ్బందిని నియమించుకుంటేనే దరఖాస్తుల పరిశీలన, అనుమతుల్లో జాప్యాన్ని అరికట్టవచ్చు. దృష్టి సారిస్తేనే.. సుడా చైర్మన్ తొలుత పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. సుడా పరిధిని జిల్లా అంతటికీ విస్తరించిన నేపథ్యాన నిబంధనల అమలు, అతిక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఆదాయ వనరులను పెంచుకోవాలి. ఇటీవల సుడా నిధులను అభివృద్ధి పనులకు కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల సౌకర్యాల కోసం వెచ్చించారనే విమర్శలు వస్తున్నందున మార్పులపై దృష్టి సారించాలి. 2017లో ఏర్పాటు, 2024లో విస్తరణ స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యాక ఖమ్మం నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. 2017 అక్టోబర్ 24న గత ప్రభుత్వం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మంరూరల్, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామపంచాయతీలను కలిపి 573 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సుడాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్ నెలలో పరిధిని విస్తరించారు. దీంతో కామేపల్లి, ఏన్కూర్, కారేపల్లి మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాల గ్రామపంచాయతీలను చేర్చారు. 17 మండలాల పరిధిలోని 279 గ్రామపంచాయతీలు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేయగా.. పరిధి పెరిగిన నేపథ్యాన అభివృద్ధి, పరిపాలనను పర్యవేక్షించడం కొత్త పాలకవర్గానికి సవాల్‌గా మారనుంది.ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని డీసీసీబీ బ్రాంచ్ భవనం మొదటి అంతస్తులో ‘సుడా’ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగించేందుకు సీఈఓ ఎన్.వెంకటఆదిత్య అనుమతించారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుడా’ సొంత భవనం ఏర్పాటుచేసుకునేంత వరకు గతంలో మాదిరి బ్రాంచ్ భవనంలోని మొదటి అంతస్తులో కొనసాగింపుకు అవకాశం కల్పించారు. -
తెలిసిన నిజం..
సత్తుపల్లిటౌన్: రామాపురం అనే గ్రామంలో స్నేహితులు రాజు, రాము ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతూ ఆటపాటల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటూ బహుమతులు గెలిచేవారు. ఓసారి రాజు రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలు ఎంపికయ్యాడని తెలిసి రాము సంతోషించాడు. కానీ అదే పాఠశాలలో చదువుతున్న సోముకు ఇది నచ్చలేదు. రాజుతో స్నేహం పెంచుకుని పిజ్జా, బర్గర్ వంటివి కొనిచ్చేవాడు. ఇది గమనించిన రాము.. రాజును కలిసి జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం మంచిది కాదని హెచ్చరించాడు. కానీ సోము మాత్రం తనతో స్నేహాన్ని రాము తట్టుకోవడం లేదని చెబుతూ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాడు. ఒకరోజు వాళ్ల వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, మరికొందరితో ఖో–ఖో సాధన చేయిస్తున్నాడు. సోము కూడా అందులో పాల్గొన్నాడు. కొన్నాళ్లుగా జంక్ ఫుడ్ తింటున్న రాజు బరువు పెరిగి వేగంగా పరిగెత్తలేక కడుపునొప్పితో కిందపడిపోయాడు. అప్పుడు సోము.. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే పరిగెత్త లేకపోతున్నావు, ఇలా జరగాలనే తాను జంక్‌ఫుడ్ అలవాటు చేయించానని చెప్పాడు. దీంతో రాము తన స్నేహితుడు రాజు పరిస్థితి చూసి బాధతో కుంగిపోయాడు. ఆ వెంటనే రాజును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. కొన్నాళ్లకు రాజు కోలుకోగా.. తన తప్పు తెలుసుకోవడమేకాక జంక్‌ఫుడ్ మానేసి వ్యాయామ ఉపాధ్యాయుడు, రాము సాయంతో ఖో–ఖో మరింత సాధన చేసి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. అంతేకాక జంక్‌ఫుడ్‌తో ఎదురయ్యే నష్టాలను మరికొందరికి వివరించి దానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు.నీతి: స్నేహితులు, శతృవులు ఎవరో గుర్తించి అందుకు అనుగుణంగా మెదిలితే కష్టాలు దరిచేరవు. -
ప్రమాదవశాత్తు బాలుడు మృతి
సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనంపై పెట్టి ఉన్న ఇనుప పైపులు పడడంతో బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం సిద్ధారంలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్ధారం గ్రామానికి చెందిన తడికమళ్ల రాజేశ్ – సంతోషి కుమారుడు చైతన్య (20 నెలలు)ను ఇంటి ముందు గంధం రాములు ఇంట్లో ఆడుకునేందుకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు ఆడుకుంటూ బైక్ దగ్గరకు వెళ్లాడు. అది ఒరగడంతో వాహనానికి పెట్టి ఉన్న 150 కేజీల బరువైన మోటార్లు తీసే చైన్ బ్లాక్ పైపులు చైతన్యపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు... నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలికొండకు చెందిన ఆరిగోట్ల ప్రభాకర్(46) తన భార్య మమతతో కలిసి హైదరాబాద్‌లో తాము పనిచేస్తున్న ఏరియా మౌలాలీకి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం చందంపల్లి శివారు జాతీయ రహదారిపై ప్లైఓవర్ వంతెన వద్దకు రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో భార్యభర్తలకు తీవ్రగాయాలు కాగా ప్రభాకర్‌ను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. డీజే శబ్దంతో అపస్మారక స్థితిలోకి.. తల్లాడ: బంధువుల ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా డీజే శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తం కట్టిందని చెప్పడంతో కుటుంబీకులు చికిత్సకు చేతిలో నగదు లేక ఆవేదన చెందుతున్న ఘటన ఇది. తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీకాలనీకీ చెందిన 18 ఏళ్ల సంగసాని పార్థు సమీప బంధువు ఇంట్లో పెళ్లి సందర్భంగా గురువారం రాత్రి డీజే పాటలకు మరికొందరు యువకులతో నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచనతో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇప్పటికే చికిత్సకు రూ.50 వేలు వరకు ఖర్చవగా, మరో రూ.6 లక్షలు అవుతుందని చెప్పడంతో నిరుపేదలైన పార్థు కుటుంబీకులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. డీజే శబ్దం తీవ్రతే పార్థు అనారోగ్యానికి కారణమని తెలుస్తుండగా, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబం కావడంతో చికిత్స కోసం దాతలు చేయూతనివ్వాలని కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల పట్టివేత తిరుమలాయపాలెం: బక్రీద్ నేపథ్యాన గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, లారీ, వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 50 గోవులను పట్టుకున్నారు. మండలంలోని సుబ్లేడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు సమీపాన తిరుమలాయపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీశ్, సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న లారీ, వ్యాన్‌లో 50 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్, ఏపీకి చెందిన వాహనాల డ్రైవర్లు షేక్ జమీల్, కోన ముస్లీతో పాటు పశువులను తరలిస్తున్న శేఖర్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి గోవులను పండితాపురం తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రాణాపాయం -
ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలతో పాటు ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లో మొదటి దఫా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న విద్యార్థులు https:/iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 25నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. డీఎల్ఈడీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ప్రత్యేక గిరిజన డీఎల్ఈడీ కళాశాలలో 2026–28 విద్యాసంవత్సరానికి తెలుగు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, 50 సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. భద్రాచలం డీఎల్ఈడీ కళాశాలతో పాటు ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, వివరాలకు 99595 75539, 86390 84543 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. ప్రశాంతంగా గురుకుల కళాశాలల ప్రవేశపరీక్ష ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి జోన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు జోనల్ అధికారి కె.అలివేలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 2,519 మంది విద్యార్థులకు గాను 2,232 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు కేంద్రాల్లో 1,217 మంది విద్యార్థులకు గాను 1,014 మంది హాజరయ్యారని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చొద్దు వైరా: రైతులు పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా భూసారాన్ని పాడు చేసుకోవద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సూచించా రు. వైరా మండలం సోమవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన నిప్పంటిన వరి కొయ్యలను శుక్రవారం ఆయన ఆర్పివేయించారు. అనంతరం డీఏఓ వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించారు. మంటలతో భూసారాన్ని పెంచే సూక్ష్మ జీవులు చనిపోవడమే కాక, సమీపంలోని పంట నిల్వలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈమేరకు రైతులెవరైనా నిప్పంటిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైరా ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ మేడా రాజేష్ పాల్గొన్నారు. డెంగీ నివారణకు విస్తృత అవగాహన ఖమ్మంవైద్యవిభాగం: డెంగీ బారిన పడకుండా ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించడం ద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని శనివారం నిర్వహించనుండగా, శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నివారణ చర్యలను విస్తృతం చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. శుభ్రమైన నిల్వ నీటిలో పెరిగి, పగటి సమయాన మాత్రమే కుట్టే దోమల ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి డెంగీ నివారణను ప్రజలు వ్యక్తిగత బాధ్యతగా భావించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఇంటి పరిసరాలు, కూలర్లు, డ్రమ్ములు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. అలాగే, దోమల నివారణ కోసం దోమ తెరలు వినియోగించాలని, డెంగీ లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన లార్వా నిరోధక, ఫాగింగ్, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. -
ఉపాధి తగ్గుతోంది..
గత రెండు, మూడేళ్లుగా జిల్లాలోని కూలీలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోలేకపోతోంది. జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాల సంఖ్యలో హెచ్చుతగ్గులతో ఈ పరిస్థితి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయాన ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందాయి. జిల్లాలోని 20 మండలాల్లో పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతుండటంతో అధికారులు అదే స్థాయిలో పనిదినాల లక్ష్యాలను కేటాయిస్తూ వచ్చారు. కానీ ఆ పరిస్థితి క్రమేణా మారిపోతోంది. ఇక జూలై 1నుంచి వీబీజీ–రామ్‌జీ పథకం అమల్లోకి జిల్లాపై మరింత ప్రభావం పడుతుందని చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంపనిదినాల్లో హెచ్చుతగ్గులు గత ఐదేళ్ల లక్ష్యాలను పరిశీలిస్తే పనిదినాల సంఖ్యలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కరోనా కన్నా ముందు జిల్లాలో 70 లక్షల నుంచి 80 లక్షల పనిదినాలను కేటాయించినా కూలీల డిమాండ్ నేపథ్యాన పూర్తయ్యాయి. కానీ 2021 –22లో జిల్లాకు 64 లక్షల పనిదినాలు కేటాయిస్తే 65.63 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఆ మరుసటి ఏడాది 54 లక్షలకు కుదించగా.. 57.80 లక్షల పనిదినాలు, 2023–24లో కేవలం 46 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా.. అధిక డిమాండ్‌తో 54.79 లక్షల పనిదినాలను కల్పించారు. ఇక 2024–25 ఏడాదిలో పనిదినాల సంఖ్య 62.17 లక్షలకు పెంచారు. కానీ 60.24 లక్షల మంది కూలీలకు పనులు చూపించారు. గత ఏడాది (2025–26) మాత్రం 34.9 లక్షల పనిదినాలనే ఖరారు చేయడంతో 35.57 లక్షల మంది కూలీలు పనులకు వెళ్లారు. నెలన్నరే గడువు జిల్లాలో 3,05,336 జాబ్ కార్డులు ఉండగా, 6,28,717 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 71,573 కుటుంబాలకు చెందిన 1,08,078 మంది కూలీలు పని కావాలని కోరుతున్నట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. యంత్రాంగం మాత్రం 31,112 కుటుంబాలకే పని కల్పిస్తోంది. రోజువారీగా 60వేల మందికే పని దొరుకుతుండడం గమనార్హం. మరోపక్క ఈనెలాఖరు నాటికి జిల్లాకు 16.89 లక్షల పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తే కేవలం 5.85 లక్షలే పూర్తయ్యాయి. పాత పథకం మరో నెలన్నర మాత్రమే కొనసాగనుండగా.. కొత్త పథకం వస్తే లక్ష్యాలు మారనున్నాయి. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కూలీలకు పని కల్పిస్తే వారికి మేలు జరగడంతో పాటు జిల్లాకు నిధులు మంజూరవుతాయి. కార్యదర్శులకే బాధ్యత గ్రామాల్లో ఉపాధి పనులకు సంబంధించి పూర్తి బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పనుల డిమాండ్ స్వీకరణ, కల్పన, సౌకర్యాల ఏర్పాటు, మేట్ల ద్వారా హాజరు నమోదు బాధ్యతలన్నీ వీరే నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే అనేక పనులతో సతమతమవుతున్న కార్యదర్శులకు ఈ బాధ్యతలు తలకు మించిన భారంలా మారాయి. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ పనులు చేయగా, చాలా గ్రామాల్లో వారు లేకపోవడంతో కార్యదర్శులకు అప్పగించినట్లు తెలుస్తోంది.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి వీబీజీ–రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. వంద రోజుల పనిదినాలను 125 రోజులకు మారుస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా.. కొన్ని కార్మికసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాలే కొత్త పథకంలోనూ రావాలంటే కూలీలతో పనులు ఎక్కువగా చేయించాలి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మే, జూన్ నెలల్లో యంత్రాంగం భారీ స్థాయిలో పనులను కల్పించాల్సిన అవసరముంది.ఏటేటా పడిపోతున్న పనిదినాల సంఖ్య కూలీలకు పని విషయంలో కేంద్రం నిబంధనలు కఠినం చేస్తోంది. ఇన్నాళ్లు 90 శాతం నిధులను కేంద్రమే భరించగా ఇప్పుడు 60శాతానికి పరిమితం చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం 40శాతం కేటాయించాల్సి రావడంతో అనుకున్న స్థాయిలో పనుల కల్పన కష్టమే. – బాగం హేమంతరావు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర రైతుసంఘంకేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కొన్నేళ్లుగా నిధులు సరిగా కేటాయించడం లేదు. కొన్నిసార్లు నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదు. కొత్త పథకంతో కూలీలు హక్కులు కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచడంతో పనులు తగ్గుతాయి. – పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర రైతు సంఘం -
భగ్గుమంటున్న భానుడు
ఖమ్మంవ్యవసాయం: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారడంతో జనం అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రత 40–45 డిగ్రీల మధ్య నమోదవుతోంది. శుక్రవారం కూడా గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఎండ తీవ్రతకు వడదెబ్బ మరణాలు సంభవిస్తుండగా, పశుపక్షాదులు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడగాలులతో జనం బయటకు వచ్చే పరిస్థితి ఉండడం లేదు. ఎండ ప్రభావం కారనంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు అవస్థ పడుతున్నారు. తిమ్మారావుపేటలో గరిష్టం జిల్లాలోని ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో శుక్రవారం గరిష్టంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గౌరారం, బాణాపురంలో 43.8, పమ్మిలో 43.7, రావినూతలలో 43.6, గుబ్బగుర్తిలో 43.5, సిరిపురం, కలెక్టరేట్, ఏన్కూరులో 43.2, వైరాలో 43, మధిరలో 42.9, వైరా ఏఆర్ఎస్లో 42.7, నాగులవంచలో 42.6, తల్లాడలో 42.5, ఖానాపురంలో 42.4, చింతకాని, కుర్నవల్లిలో 42.3, నేలకొండపల్లిలో 42.2, ఎర్రుపాలెంలో 42.1, ప్రకాష్‌నగర్, కొణిజర్లలో 42 డిగ్రీలుగా నమోదైంది. అంతేకాక ముదిగొండ, మధిర ఏఆర్ఎస్లో 41.9, కల్లూరులో 41.7, గేటు కారేపల్లిలో 41.5, పెద్దగోపతి, రఘునాథపాలెం, లింగాలలో 41.3, ఖమ్మం ఎన్ఎస్పీ గెస్ట్‌హౌస్, బచ్చోడులో 41.1, సత్తుపల్లి, పంగిడిలో 41, సత్తుపల్లి ఓసీ, కూసుమంచిలో 40.9, కాకరవాయిలో 40.8, మంచుకొండలో 40.6, తిరుమలాయపాలెం, గాంగారంలో 40.5, వేంసూరు, సదాశివునిపాలెంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండ తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరి -
మోత మోగింది..
ఖమ్మంసహకారనగర్: అందరూ భావిస్తున్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరవై రోజుల క్రితం పెట్రోల్, డీజిల్‌కు ఇక్కట్లు వచ్చినప్పుడే ధరల పెంపునకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేసేలా శుక్రవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లు బంక్‌ల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో విషయం తెలియక బంక్‌లకు వచ్చిన వినియోగదారులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 223 బంక్‌లు, 8 లక్షల లీటర్ల వినియోగం జిల్లాలో అన్ని కంపెనీలవి కలిపి 223 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు పెట్రోల్ 3 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయి. అంతేకాక డీజిల్ సుమారు 5 లక్షల లీటర్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. ప్రస్తుతం పెట్రోల్ లీటర్ ధర రూ.107.94 ఉండగా రూ.3.39 పెంపుతో రూ.111.33కు చేరింది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.96.13 ఉండగా, రూ.3.27 పెంపుతో రూ.99.13కి పెరిగింది. 2022 అక్టోబర్ తర్వాత ధరలు పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ పెంపుతో రోజుకు పెట్రోల్ వినియోగదారులపై సుమారు రూ.9 లక్షలకు పైగా, డీజిల్ వాహనదారులకు రూ.15 లక్షలకు మించి అదనపు భారం పడనుంది. సామాన్యుల జీవితాలపై భారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, రవాణా ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో ఇంధన ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పెంపుదల ప్రజల జీవనంపై నేరుగా పడనుంది. ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. డీజిల్ ధరలు పెరగడంతో సరుకు రవాణా ఖర్చులు అధికమై.. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక పెట్రోల్ ధర పెరిగిన కారణంగా ఉద్యోగులు, చిరువ్యాపారుల నెలవారీ ప్రయాణ ఖర్చుల్లో తేడా రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు, మోటార్లు నిర్వహించే రైతులు కూడా ధరల పెంపుతో ఇబ్బంది పడనున్నారు.పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌పై రూ.3కు పైగా పెంపు కొద్దిరోజులు పెట్రోల్ దొరక్క ఇబ్బందులు పడ్డాం. ఆ సమస్య తీరిందనుకునేలోపే ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇంతలోనే లీటర్ పెట్రోల్ పై రూ.3కు పైగా పెంచడంతో మరింత భారం పడనుంది. –మొక్క సురేశ్, వాహనదారుడు, ఖమ్మం -
కేసీఆర్ లక్ష్యంగా జాతీయ పార్టీల కుట్ర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబురపడుతున్నా, అన్నిరంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని, బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ విచ్ఛిన్నం, కేసీఆర్ కుటుంబ విభజన కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలతో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోరాడుతున్నారన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించడమే కాక, వచ్చే ఎన్నికల్లో పది స్థానాలు కై వసం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈమేరకు బూత్‌స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించగా, డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించి శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఐదుగురు సభ్యులతో మండల సమన్వయ కమిటీలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం నేతలందరం సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. పార్టీపై మమకారంతో ఉండే కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. కోర్ కేడర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందున కేసులు పెడుతుండగా, రాబోయే రోజుల్లో మరింత ఒత్తిడి ఎదురైనా తట్టుకుని నిలబడతామని తెలిపారు. ఎవరైనా అలిగినా, తమపై కోపం ఉన్నా అన్నీ మర్చిపోదామని, పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పాటుపడతానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
128 కేజీల గంజాయి స్వాధీనం
వైరా: ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 128 కేజీల గంజాయిని వైరా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వైరాలో శుక్రవారం ఏసీపీ సారంగపాణి వివరాలు వెల్లడించారు. ఎస్ఐ పుష్పాల రామారావు, సిబ్బందితో కలిసి సోమవరం ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గోనె బస్తాలతో ద్విచక్రవాహనాలపై వస్తున్న ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి సంచుల్లో పరిశీలించగా 64 ప్యాకెట్లలో ఉన్న 128 కేజీల గంజాయి బయటపడింది. ఒడిశాలోని మల్కాన్‌గిరి రాబాకాలనీకి చెందిన మనుయాల్ బోత్రా, కమర్గూడా గ్రామానికి చెందిన లక్ష్మణ్ కేలో, ఏపీలోని అనకాపల్లి జిల్లా నాతవరానికి చెందిన చిటికల సన్యాసినాయుడు కలిసి ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. సమావేశంలో సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ పి.రామారావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. నల్లమందు, ఎండు గంజాయి.. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఖమ్మం – వరంగల్ మార్గంలో నల్లమందు, ఎండుగంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏసీఎం (నల్లమందు), గంజాయి వినియోగం, అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారంతో ఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రాజస్థాన్‌కు చెందిన రన్వీర్సింగ్ వద్ద నల్లమందు, ఎండు గంజాయి లభ్యమైంది. ఆయన మూత్రం శాంపిళ్లు పరీక్షించగా పాజిటివ్‌గా తేలడమే కాక, అక్కడే ఉన్న గుర్రాలపాడు వాసి ఎస్కే కరీంపాషా కూడా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు నిందితులపై చర్యల నిమిత్తం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–2లో అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది జమాల్‌షరీఫ్, తిరుపతి, వీరబాబు, ప్రసన్నకుమార్, జాయిరాం, రాజు తదితరులు పాల్గొన్నారు.ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న నిందితులు -
నెట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఖమ్మంస్పోర్ట్స్: నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సీహెచ్.దీప్తి, చీఫ్ ప్యాట్రన్‌గా రామసహాయం పార్వతీరెడ్డి, చైర్మన్‌గా డాక్టర్ రవికుమార్, కార్యదర్శిగా ఎన్.ఫణికుమార్ ఎన్నికయ్యారు. ఈ కమిటీ నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నెట్‌బాల్ అభివృద్ధికి కృషి చేయడమే కాక జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదిగేలా తర్ఫీదు ఇప్పిస్తామని వెల్లడించారు. ఐకేపీలో ఆగడాలపై మహిళల ఫిర్యాదు పొట్టేళ్ల దాడిలో గాయపడిన కాపరి మృతి పెనబల్లి: పొట్టేళ్లు పోట్లాడుకుంటుంటే విడదీసే యత్నంలో గాయపడిన జీవాల కాపరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెనుబల్లి మండలం ఉప్పలచిలకకు చెందిన చిల్లిముంత కుటుంబరావు(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన మందను తీసుకెళ్లే క్రమాన మందలోని రెండు పొట్టేలు పోట్లాడుకుంటుంటే విడదీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు ఆయనకు పెనుబల్లి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించినా పరిస్థితి మెరుగపడక వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు వీఎం.బంజర ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. -
●సంస్కృతికి ప్రతిబింబం.. సంగీతం
ఖమ్మంగాంధీచౌక్: భారతీయ సంస్కృతికి సంగీతం ప్రతిబింబంలా నిలుస్తుంది. అనేక రకాల వాయిద్యాలు శబ్దాన్ని సృష్టించి సంగీతాన్ని పలకిస్తాయి. ఈ నేపథ్యాన చిన్నతనంపై సంగీతంపై ఆసక్తి పెంచుకుంటున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో వాయిద్యాలు నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. పిల్లల ఆసక్తికి అనుగుణంగా ఖమ్మంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హార్మోనియం, తబలా, కంజర తదితర పరికరాలతో పాటు సంగీతంలో రేణుక శిక్షణ ఇస్తున్నారు. సంగీతం భారతీయ సంస్కృతిని నేర్పడమే కాక విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తుందని రేణుక చెబుతున్నారు. సెలవుల్లో రద్దీ దృష్ట్యా ఉదయం వేళ మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. -
●తరుగు తీస్తున్నారు సార్..
కూసుమంచి: యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈక్రమాన పలువురు రైతులు ధాన్యం తరలించేందుకు బస్తాకు రూ.5 వరకు వసూలు చేస్తున్నారని, మిల్లర్లు ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని వివరించారు. దీంతో స్పందించిన మంత్రులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్‌ను ఆదేశించారు. లారీల రవాణా ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతులు ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీమ్, పౌర సరఫరాల సంస్థల ఇన్చార్జి డీఎం సునీల్‌రెడ్డి, డీసీఓ గంగాధర్, తహసీల్దార్ సైదులు, ఏడీఏ సతీష్ పాల్గొన్నారు. -
దివ్యాంగ చిన్నారుల భరోసా
ఖమ్మంసహకారనగర్: భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్(సీఎంఓ) బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా గురువారం ఆయన ఖమ్మం నయాబజార్లోని భవితా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఈఆర్పీలు, ఫిజియోథెరపిస్టులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం నిష్ణాతులైన సిబ్బందిని నియమించినందున చికిత్స, బోధనపై దృష్టి సారించాలని తెలిపారు. ఉన్నతాధికారుల చొరవతో నూతన భవనాలు, వసతులు, బోధన ఉపకరణాలు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీలు సుభద్ర, రామ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల వద్దకే ఉపాధ్యాయులు!
కొణిజర్ల: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో షెడ్యూల్ ప్రకారం గురువారం తల్లిదండ్రుల నిర్వహించాల్సి ఉండగా మండలంలోని సింగరాయపాలెం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమావేశానికి ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. దీంతో జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పెసర ప్రభాకరరెడ్డి, సర్పంచ్ వేము నాగరాజు, ఉపసర్పంచ్ సురభి కృష్ణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జహీద, హెచ్ఎం కె.లక్ష్మీనారాయణ ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. కారణమేమిటని ఆరా తీయగా గ్రామస్తులు ఎక్కువ మంది ఉపాధి హామీ పనులకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులే ఊరి చివరి ఫీడర్‌ఛానల్ పూడికతీత పనుల వద్దకు వెళ్లారు. అక్కడే తల్లిదండ్రులతో సమావేశమై తమ పాఠశాలలో విద్యార్థుల ప్రగతి, అందుతున్న బోధన అంశాలను వివరించారు.ఉపాధి హామీ పని ప్రదేశంలో సమావేశం -
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి 621 దరఖాస్తులు అందగా, తల్లిదండ్రుల సమక్షాన పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఎవరైనా విద్యార్థులు చేరకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగులు రమేష్, రాములు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. 18నుంచి కేంద్ర పథకాలపై అవగాహన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్త్కర్ష అభియాన్ తదితర కేంద్ర పథకాల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఈనెల 18నుంచి 25వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సమిదా సింగ్ సూచించారు. న్యూఢిల్లీ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం నుంచి పీఓ రాహుల్ మాట్లాడుతూ గొత్తికోయలు, గిరిజన కుటుంబాలకు పథకాలపై అవగాహన కల్పించడమే కాక ఆధార్ నమోదు, జీవనోపాధి పథకాల మంజూరుకు క్యాంపులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏపీఓ డేవిడ్‌రాజ్, అధికారులు గన్యానాయక్, పాయం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మళ్లిస్తాం..
వాహనాలన్నీఖమ్మం సహకారనగర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ చివరి గింజ వరకు సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఏటా సీజన్లో బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి హమాలీలు వస్తారని, ప్రస్తుతం అక్కడి పరిస్థితుల కారణంగా వారు రాకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఎండల కారణంగా హమాలీలు పగటి వేళ పనిచేయలేక పోతున్నారన్నారు. ఈమేరకు సమస్యను పరిష్కరించేందుకు గాను జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు వేగంగా జరిగేలా రానున్న 15 రోజుల పాటు ఇసుక, సిమెంట్ తదితరాల రవాణాపై నియంత్రణ విధించి లారీలు, డీసీఎంలను ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొందరు మిల్లర్లు క్వింటాకు ఐదు, ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారనే సమాచారం ఉందని, ఇకనైనా వారు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.22 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతులకు రూ.4,800 కోట్లు జమ చేశామని తెలిపారు. మిల్లులు సీజ్ చేస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరించేందుకై నా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేయడంతో దిగుబడి కూడా అలాగే వచ్చిందన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు అక్రమంగా తరుగు తీసినట్లు తెలిస్తే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఖమ్మం కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ జిల్లాలో మొదలైన 309 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 94,961 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. ఇందులో 80 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి గోదాములకు తరలించామని చెప్పారు. భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పంట కోత ఆలస్యంగా ప్రారంభమైనందున కొనుగోళ్లు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయని వెల్లడించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయంలో ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్లు మ్రిణాల్ శ్రేష్ఠ, అజయ్‌యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
729 మందికి ఇళ్లు నిర్మించాల్సిందే..
ఖమ్మంఅర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై కూల్చివేతలతో సర్వం కోల్పోయిన 729మంది బాధితులకు అక్కడే ఇళ్లు నిర్మించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రాష్ట్ర జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఖమ్మం టీటీడీసీ హాల్లో గురువారం కె.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితుల తరఫున చేపట్టిన ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం 311 మందికి పట్టాలు ఇచ్చిందన్నారు. అయితే, మరో 101 మందికి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఇంకో 317 మందిని అనర్హులుగా ప్రకటించడం సరికాదన్నారు. ఇళ్లు కోల్పోయిన 729 మందికి వెలుగుమట్లలోనే పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ.. భూదాన్ భూమిలో కార్యాలయాల నిర్మాణ ఆలోచనను విరమించుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బాధితుల కమిటీ కన్వీనర్ ఉదయ్‌తో అమిత్, నవ్య, పాషా, బండి నాగేశ్వరరావు, మేడి బసవయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మోక్షం!
● బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో కదలిక ● రూ.600 కోట్లతో ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూ ● ప్రారంభమైతే 3వేల మందికి ప్రత్యక్ష ఉపాధి సత్తుపల్లి: రాష్ట్రంలోనే తొలిసారి ఆక్వా పరిశ్రమలకు అడుగు పడింది. ఇదికూడా జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కులో ఏర్పాటుకానుండడం విశేషం. రూ.650 కోట్ల వ్యయంతో ఇక్కడ ఫుడ్‌పార్కులో రెండు ఆక్వా(రొయ్య) పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. సుమారు 84 ఎకరాల విస్తీర్ణంలో చేపలు, రొయ్య ఫీడ్(దాణా) తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ స్థాపనకు దీపక్ నెక్స్‌జన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలు ప్రారంభమైతే సుమారు మూడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఇదే కంపెనీ ఏపీలోని హనుమాన్ జంక్షన్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయగా, బుగ్గపాడు పార్క్‌లో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. రైతులకు ప్రోత్సాహం ఆక్వా పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే సమీపాన రొయ్యల చెరువులు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈమేరకు సత్తుపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 2వేల ఎకరాల్లో చెరువుల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తారు. ఇక్కడి భూమి చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటుకు అనుకూలంగా ఉండడాన్ని కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రొయ్యల చెరువులకు ీఫీడ్(దాణా) కూడా అందించి ఉత్పత్తిని పెంచేలా కంపెనీ యాజమాన్యం కృషి చేయనుంది. దాణా కోసం ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న, సోయా ఉత్పత్తులకు సైతం డిమాండ్ వస్తుంది. అయితే, స్థానికంగా రొయ్యలు అందుబాటులోకి వచ్చే వరకు ఏపీ నుంచి రొయ్యలను తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తారు. చైనా, జపాన్, ఇండోనేషియా, అమెరికా దేశాలకు ఆక్వా ఉత్పత్తులను పంపించే అవకాశముంది. ఇటీవల ప్రారంభమైన గ్రీన్‌ఫీల్డ్ హైవే బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌కు 24 కి.మీ. దూరంలోనే ఉండడంతో పోర్ట్‌లకు రవాణా సులభమవుతుందని భావిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా 2008 జనవరి 27న 203 ఎకరాల విస్తీర్ణంలో బుగ్గపాడు ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో 60 ఎకరాలను మౌలిక వసతులకు కేటాయించి రూ.119 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన 143 ఎకరాల్లో రూ.10 కోట్లతో రహదారులు, ప్రహరీ, ఆఫీస్ భవనం నిర్మాణం చేశారు. కాగా, ఫుడ్‌పార్క్‌లో గతేడాది నుంచి వైఅండ్వై కంపెనీ మామిడి ప్రాసెసింగ్, జ్యూస్ కంపెనీని ఏర్పాటు చేసినా ఇది కేవలం సీజన్లోనే నడుస్తోంది. ఇప్పుడు రెండు ఆక్వా పరిశ్రమలు ప్రారంభం కానుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సీఎం సమక్షాన ఒప్పందం ఫుడ్‌పార్క్‌ను అభివృద్ధిలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతేడాది పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పరిశ్రమల మేళా ఏర్పాటు చేశారు. దీంతో పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవల దీపక్ నెక్స్‌జన్ కంపెనీ యాజమాన్యం.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షాన రెండు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణలోనే తొలి ఆక్వా పరిశ్రమలు కావడంతో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీకి సత్తుపల్లి సరిహద్దుగా ఉండడంతో అక్కడి రైతుల మాదిరి ఇప్పటికే కొందరు స్థానిక రైతులు ఆక్వా పరిశ్రమపై ఆసక్తితో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ముందుకొస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. -
రైతాంగానికి ఇంకాస్త ‘మద్దతు’
● వరి క్వింటాకు రూ.72, పత్తికి రూ.557 పెరిగిన ధర ● జిల్లాలో అత్యధికంగా సాగయ్యే రెండు పంటలివే.. ● మొక్కజొన్న ధరపై రైతుల్లో పెదవి విరుపు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలకు మద్దతు ధర పెరిగింది. ఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. 2026–27 సంవత్సరానికి కూడా వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఇందులో భాగంగా ధాన్యం, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పంటల ధరలు పెంచింది. జిల్లాలో అన్నీ కలిపి ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఇందులో వరి, పత్తి పంటలు ప్రధానంగా ఉంటాయి. వర్షాలు అనుకూలించి, జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంటే వానాకాలంలో వరి 3.20 లక్షల ఎకరాల్లో, పత్తి 2.69 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇక పెసర 18 వేల ఎకరాల్లో, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలు కూడా సాగవుతాయి. వరి ధర రూ.2,461 వరి రకాల వారీగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం క్వింటాకు రూ.72 పెంచింది. గ్రేడ్–ఏ రకానికి గత ఏడాది రూ.2,389 ఉంటే ఈ ఏడాది రూ.2,461 చేరింది. ఇక సాధారణ రకాలకు గత ఏడాది రూ.2,369గా ఉన్న ధర రూ.2,441కు పెరుగుతుంది. పత్తి క్వింటాకు రూ.557 పెంచడంతో రూ.8,110 నుంచి రూ.8,667కు చేరనుంది. మొక్కజొన్నకు కేవలం రూ.10 అపరాల పంటలకు ఈ ఏడాది కేంద్రం అరకొరగానే మద్దతు ధర పెంచింది. పెసలకు కేవలం రూ.12 మాత్రమే పెంచడంతో రూ.8,768 నుంచి రూ.8,780కు చేరుతుంది. కందులకు మాత్రం రూ.450 పెంచడంతో గతేడాది రూ.8వేలు ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.8,450కు పెరుగుతుంది. మినుములకు సైతం రూ.400 పెంచగా రూ.7,800 నుంచి 8,200కు చేరనుంది. జిల్లాలో అక్కడక్కడ సాగుచేసే వేరుశనగ పంటకు రూ.254 ను పెంచింది. కాగా, జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్నను విస్తారంగా సాగు చేస్తారు. కానీ ఈ పంటకు కేవలం రూ.10 మాత్రమే పెంచారు. దీంతో గత ఏడాది క్వింటాకు రూ.2,400 ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.2,410కు చేరుతుంది. పెరుగుతున్న పెట్టుబడులు పంటల సాగుకు ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యంత్రాలు, డీజిల్, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరగడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయాన కేంద్రప్రభుత్వం పెరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పంటల ధరలు నిర్ణయించడంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి పంటలకు పెట్టుబడులు పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదని చెబుతున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా అలాగే ఉన్నందున మద్దతు ధరలు మరికొంత పెంచాలని కోరుతున్నారు. -
ఆలయాల్లో చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
కల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కల్లూరులో గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై డి.హరిత సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం ఓబులపాలెంకు చెందిన బోలుసు ఏసుబాబు అలియాస్ మానికల ఏసుబాబు, ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన చేవూరి ఆదినారాయణ, వేంసూరు మండలం ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళితో పాటు మరో వ్యక్తి రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నాక వేలిముద్రల ఆధారంగా పరిశీలించాక ఇద్దరి వేలిముద్రలు డేటాబేస్‌లో పాత నేరుస్తులతో మ్యాచ్ అయ్యాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కల్లూరు మండలం చెన్నూరు, చిన్నకోరుకొండి, తల్లాడ మండలం వెంకటగిరి, మధిర మండలంలోని మల్లారం, ఏపీలో విసన్నపేట ఆంజనేయస్వామి దేవాలయం, పెనుబల్లి పోస్టాఫీసులో చోరీ చేసినట్లు తేలడంతో రిమాండ్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ హరిత, సిబ్బందిని నాగేంద్రబాబు, సత్యనారాయణ, నరసింహారావును ఏసీపీ వసుంధర అభినందించారు. -
హార్టికల్చర్ హబ్‌గా పేట
అశ్వారావుపేట: రానున్న కాలంలో అశ్వారావుపేట హార్టికల్చర్ హబ్‌గా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ ఉద్యాన పరిశోధనా కేంద్రం(హెచ్ఆర్ఎస్)లో తాత్కాలికంగా కేటాయించిన భవనంలో ప్రభుత్వ ఉద్యాన కళాశాలను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ రైతుల ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 70 ఎకరాల్లో శాశ్వత భవనాలు నిర్మించి కళాశాలకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానల వల్ల తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా మాట్లాడారు. ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.గోపి, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా, వ్యవసాయ విశ్వవిద్యాల వైస్ చాన్స్‌లర్ ఏ.జానయ్య, వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భక్తుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆలయాభివృద్ధి భద్రాచలం: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి దివ్యక్షేత్రాన్ని భక్తుల ఆకాంక్షలకు తగినట్లుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరిగేషన్, ఆర్అండ్బీ, దేవస్థానం ఈఓ దామోదర్‌రావులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, చల్లగుళ్ల నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు
కూసుమంచి: రైతులు పండించిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టడమే కాకుండా గోదాంలకు తరలిస్తామని వెల్లడించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్కల కాంటా పూర్తయి రోజులు దాటుతున్నా గోదాములకు తరలించడం, ఫలితంగా వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వివరించారు. దీంతో హమాలీల సంఖ్య పెంచడంతో పాటు రవాణాకు సరిపడా వాహనాలు సమకూర్చాలని డైరెక్టర్ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ సతీష్, ఏఓ వాణి, చేగొమ్మ సొసైటీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గీతకార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కల్లుగీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యాన సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో డీపీఈఓ నాగేందర్‌రెడ్డి అందజేసి మాట్లాడారు. గీత కార్మికులు వృత్తిలో ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఎకై ్సజ్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శేఖర్, బీసీ సంక్షేమాధికారి బజ్జూరి వెంకటేశ్వరరావు, గౌడసంఘం జిల్లా అధ్యక్షుడు రావుల గోపీగౌడ్తో పాటు మొక్కా తిరుపతిరావు, సున్నం నరసింహారావు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రాఘవ, మల్లయ్య, ఆదినారాయణ, రామారావు, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌లో సభ్యత్వంతో సేవాభావం ఖమ్మం మామిళ్లగూడెం: మానవ సేవే మాధవసేవ అన్న భావనతో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. సీపీఓ శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాదవి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఆర్.రవీందర్‌రావుతో కలిసి గురువారం కలెక్టరేట్లో సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుదిమళ్ల సూర్యప్రకాశ్‌రావు, కె.సత్యనారాయణరెడ్డి, ఏ.స్పందన, ఉప్పలయ్య, నర్సయ్య, తాతా రాఘవయ్య, సుధాకర్, షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. శిశుగృహలో న్యాయమూర్తి ఖమ్మం లీగల్: ఖమ్మంలోని శిశుగృహను జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంక్షేమం, వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే, పిల్లలతో మాట్లాడి చదువు, ఆరోగ్యంపై ఆరా తీశారు. కష్టపడి చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. -
పశుగ్రాసం.. విషపూరితం
● మొక్కజొన్న, జొన్నలో ‘నైట్రేట్’ ● జిల్లాలోని పశువులు, ఇతర జీవాల్లో ప్రభావం గుర్తింపు ● రైతులు అప్రమత్తంగా లేకపోతే నష్టం ఖమ్మంవ్యవసాయం: పశువులకు మేతగా వేసే గ్రాసాలు ప్రాణసంకటంగా మారుతున్నాయని పశుసంవర్థక, పశువైద్య శాఖ గుర్తించింది. మొక్కజొన్న, జొన్న, సూడాన్ గడ్డి, పొద్దు తిరుగుడు తదితర పశుగ్రాసాల్లో నైట్రేట్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేల్చారు. ఇందులో విషప్రభావం కారణంగా పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు నీరసించడంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడంతోపాటు ఫిట్స్ వంటి లక్షణాలతో మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో 2.26 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట కోత పూర్తవడంతో ఆ భూముల్లోని పచ్చిక, ఎండిన గ్రాసంలో జీవాలను మేపుతున్నారు. మొక్కజొన్న గ్రాసం విషపూరితమైనదనే అవగాహన లేక ఇలా చేస్తుండగా పశువులు అనారోగ్యం బారిన పడడమే కాక అక్కడక్కడా మృతి చెందుతున్నాయి. ఈమేరకు జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల డాక్టర్ మహ్మద్ రుబీనా నైట్రేట్ పశుగ్రాసం తిన్న పశువుల లక్షణాలు, చికిత్స, నివారణ వంటి విషయాలను వివరించారు. ఇవీ లక్షణాలు.. నైట్రేట్ కలిగిన పశుగ్రాసం తిన్నాక పశువులు, జీవాల్లో నీరసం వంటి లక్షణాలు 3 – 8 గంటల్లో కనిపిస్తాయి. ఒక్కసారిగా మందలో ఎక్కువ శాతం జీవాలు ఎలాంటి లక్షణాలు లేకుండా మృత్యువాత పడతాయి. మేతలో నైట్రేట్ శాతం ఆధారంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కళ్లలో శ్లేష్మ పొర నీలి రంగులోకి మారడం, అధికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, సరిగ్గా నిలబడలేక పోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విరోచనాలు, సొల్లు కారడం, పొట్ట ఉబ్బరం, రక్తం మట్టి రంగులోకి మారడం వంటి లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. చనిపోయే ముందు కాళ్లు గాలిలో కొట్టుకోవడం, ఫిట్స్ వంటివి కనిపిస్తాయి. చికిత్స.. నైట్రేట్ విష ప్రభావాన్ని వెంటనే గుర్తిస్తే జీవాలను కాపాడుకోవచ్చు. జీవాలను ప్రభావిత పొలాల్లో మేపడం వెంటనే ఆపాలి. ఎండుగడ్డి, తగినంత నీరు అందించాలి. ప్రథమ చికిత్సగా బొగ్గుపొడిలో గుడ్డు, మెగ్నీషియం ఆకై ్సడ్, టాన్నిక్ ఆమ్లం కలిపి తాగించాలి. ఆపై పశువైద్యుల సలహా మేరకు మందులను వాడాలి. నివారణ.. లేత జొన్న, మొక్కజొన్న మేయకుండా చూడాలి. కరువు తర్వాత, మబ్బు పట్టిన రోజుల్లో కోసిన మొక్కజొన్న కాడలను మేతగా వేయొద్దు. మేతలో నత్రజని శాతం మట్టి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే గ్రామంలోని మొక్కజొన్న పొలంలో మేసి పశువులు, జీవాలు అనారోగ్యానికి గురైతే ఆ గ్రామంలోని ఇతర పొలాల్లోనూ మేతకు వదలొద్దు. వర్షాలు కురిసిన వారం వరకు పశువులకు మొక్కజొన్న, జొన్నను మేపకూడదు. లేత ఆకుల్లోనే కాక ముదిరిన కాండంలోనూ ఎక్కువ శాతం నత్రజని ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మొక్కజొన్న కోత తర్వాత పశువులను మేపేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొలాలకు నత్రజనిని వినియోగించిన కొన్ని రోజుల వరకు పశువులను మేపకపోవడం మేలు. -
భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి..
ఖమ్మంమయూరిసెంటర్: బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా చట్టాన్ని కాపాడాల్సిన బండి సంజయ్ ఆయన కుమారుడు తప్పును రాజకీయ కుట్రగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. అలాంటి వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేనందున రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బాధితురాలిని రాత్రి 12 గంటల వరకు స్టేషన్లో ఉంచి, ఆమైపెనే తప్పుడు కేసు పెట్టడం పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిందో తెలియజేస్తోందన్నారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నట్లు వెల్లడించారు. కాగా, వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిబంధనలను సడలించి పంట మొత్తం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని రంగారావు హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు.మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు -
కరాటేతో స్వీయరక్షణ
స్వీయ రక్షణకు బాలికలు తప్పకుండా కరాటే శిక్షణ తీసుకోవాలి. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యాన కరాటే శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. రెండేళ్లుగా కరాటే నేర్చుకుంటున్నా.. బ్లాక్‌బెల్ట్‌కు ఎంపికయ్యాను. – వర్షి, సత్తుపల్లికరాటే నేర్చుకోవటం వల్ల ఫిట్నెస్తో పాటు చదువులోనూ ఏకాగ్రత పెరుగుతుంది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతారు. బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకొని ప్రావీణ్యం సాధించాలి. – కె.ప్రణీత్య, సత్తుపల్లివేసవి సెలవుల్లో కరాటే శిక్షణకు వస్తూ సద్వినియోగం చేసుకుంటున్నా. ఇది నాకు క్రమశిక్షణ నేర్పింది. ఏదైనా ఆపద వస్తే ఎదిరించగలననే ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. – ఆఫ్రిన్, సత్తుపల్లి -
క్రేజీ.. కరాటే
● ఆత్మరక్షణలో కీలకం ● శిక్షణ ఇప్పించడంపై తల్లిదండ్రుల ఆసక్తి ● కిటకిటలాడుతున్న ఉచిత శిక్షణ శిబిరంకరాటే శిక్షణలో మెళకువలతో నేర్పిస్తున్నారు. శరీరాన్ని, మనస్సును ఉత్సాహపరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. చదువులోనూ ఏకాగ్రత కన్పిస్తుంది. కరాటే వల్ల శారీరక ధృడత్వం లభిస్తుంది. – హేమచంద్ర, సత్తుపల్లి శారీరకంగా, బలంగా మారేందుకు కరాటే దోహదపడుతుంది. మానసికంగా, ధైర్యంగా ఉండడంతో పాటు ఆపదను దాటగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కరాటే శిక్షణకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారు. – వి.పిచ్చయ్య, కరాటే మాస్టర్, సత్తుపల్లిసత్తుపల్లిటౌన్: ప్రస్తుత సమాజ పోకడలను పరిశీలిస్తే ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. ఎవరో వస్తారని చూడకుండా ఆత్మరక్షణకు సిద్ధమయ్యేలా కరాటే ఉపకరిస్తుంది. దీంతో వేసవి సెలవులను కరాటేలో ప్రావీణ్యం సంపాదించుకునేలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈక్రమాన సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం పరిసరాలు అలర్ట్.. బో అరుపులతో మార్మోగుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాస్టర్ వి.పిచ్చయ్య ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటేతో ఆత్మరక్షణతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక ధృడత్వం, ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని గుర్తించడంతో ఆసక్తి నెలకొనగా.. నిత్యం 50 – 60 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. -
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన
● భూసమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ ● ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంరూరల్/ఖమ్మంమయూరిసెంటర్: గడిచిన రెండేళ్లలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని పాలేరు నియోజకవర్గ డివిజన్లలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించిన పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు మొదలు ఆడబిడ్డల ఉచిత ప్రయాణం వరకు ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కలను విస్మరించగా, తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. అలాగే, భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం ద్వారా ధరణితో ఎదురైన కష్టాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాదర్బార్ల ద్వారా చిన్నచిన్న సమస్యలను వేదికపైనే పరిష్కరించేలా అధికారుల ను ఆదేశించామని, మిగతావి వారంనుంచి మూడు నెలల్లోపరిష్కరిస్తామని వెల్లడించారు. రెండేళ్ల క్రితం పోలిస్తే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉందని, ఆ పనులు కూడా పూర్తయ్యాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని పొంగులేటి స్పష్టం చేశారు. మాటలు చెప్పడం కాదు.. పనిచేసి చూపించడమే తన నైజమని ఉద్ఘాటించారు. కలెక్టర్ దివాకర టీ.ఎస్. మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ప్రజాదర్బార్ల ద్వారా సుమారు 16 వేల దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇందులో ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారురాలు జయలక్ష్మి, మమత మాట్లాడుతూ.. ప్రస్తుతం సొంత ఇంట్లో ఆనందంగా జీవిస్తున్నామ ని తెలిపారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్‌బాబు, కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ అగస్త్య, శ్రీనివాసరెడ్డి, అడిషనల్ డీసీపీ రామానుజం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూన్‌లో వనజీవి స్మారకవనానికి శంకుస్థాపన పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా లక్షలాది మొక్కలు నాటి సంరక్షించిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్మారక వనానికి జూన్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాదర్భార్‌లో రామయ్య సతీమణి జానమ్మ మంత్రిని కలిసి తన గోడు చెప్పుకోగా మంత్రి స్పందించారు. స్మారకవనం ఏర్పాటుకు తక్షణమే స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్.ను ఆయన ఆదేశించారు. -
మొక్కజొన్న పొలాల్లో అగ్నిప్రమాదం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగర పరిసరాల్లో గురువారం రెండు చోట్ల మొక్కజొన్న పొలాల్లో మంటలు చెలరేగాయి. గొల్లగూడెం–రాజన్నపేట వెళ్లే దారిలోని మొక్కజొన్న పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు తెలిసింది. వడగాలులకు మంటలు వేగంగా వ్యాపించి పొలాల్లోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. అదే సమయాన వీ.వీ.పాలెం సొసైటీ పరిధి అల్లీపురం–పుట్టకోట రోడ్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సమీపాన కూడా మంటలు చెలరేగాయి. కేంద్రంలో వేల బస్తాల మొక్కజొన్న నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ఈమేరకు సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. -
రైతు సమస్యలపై దేశవ్యాప్త ఆందోళన
ఇల్లెందు: దేశ వ్యాప్తంగా రైతుల పాత రుణాలు రద్దు చేయాలని, వడ్డీ లేని రుణాలు అందజేయాలని, సాగుకు సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయించి గ్యారంటీ చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విమల్ త్రివేది, కిచ్చెల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని చండ్ర కిష్ణమూర్తి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల తీర్మానాలను వెల్లడించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, రబీలో తడిచిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించాలని, ఆదివాసీలపై అక్రమ కేసులను రద్దు చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్, వెనిజుల, క్యూబా ఇతర దేశాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి శ్రీసిటీకి చెందిన పయ్యావుల ఉమామహేశ్వరి(17) ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె తల్లి అనారోగ్యం బారిన పడగా బాధపడుతున్న ఉమామహేశ్వరి చదువులో ఒత్తిడి ఎదుర్కొంటోందని సమాచారం. దీంతో బుధవా రం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా, కొంతసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఎలుకల పేస్ట్ తిని వృద్ధురాలు.. మండలంలోని ఎం.వెంకటాయపాలెంకు చెందిన వడ్లమూడి గురవమ్మ(75) ఎలుకల పేస్ట్ తిని ఆత్మహత్య చేసుకుంది. వృద్ధాప్యానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈనెల 9న ఎలుకల పేస్ట్ తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి గురువారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. వాగులో మునిగి యువకుడు మృతి బోనకల్: మండలంలోని ఆళ్లపాడుకు చెందిన ముంగి వెంకట్రావు(20) ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన గురువారం స్నేహితులతో కలిసి కలకోటలోని పెద్దవాగు వద్దకు వెళ్లాడు. అక్కడ ఈతకు దిగగా, ఇటీవల రోడ్డు పనుల కోసం తవ్విన గుంతలో నీరు నిల్వ ఉన్న విషయం తెలియక మునిగిపోయాడు. స్నేహితులు ఆయనను బయటకు తీసి 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గేదెలను కాపాడబోయి రైతు.. తల్లాడ: మండలంలోని కుర్నవలిలో వాగులో పడిన గేదెలను కాపాడే క్రమాన నీట మునిగి ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన గొర్రెపాటి పుల్లారావు(33) గేదెలను గురువారం ఉదయం కుర్నవల్లి వాగు సమీపాన మేతకు తీసుకెళ్లాడు. అక్కడ నీళ్ల కోసం గేదెలు వాగులోకి దిగాయి. అవి లోతులోకి వెళ్తుండడంతో కాపాడేందుకు పుల్లారావు వాగులోకి దిగాడు. అక్కడ గుండాన్ని గమనించక ఆయన మునిగిపోయి మృతి చెందాడు. సమీప రైతులు కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. పుల్లారావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చేపల కోసం తూముల ధ్వంసం
కల్లూరురూరల్: చెరువుల నిండా నీరు ఉండడంతో వచ్చే సీజన్లో వర్షాలు ఆలస్యమైనా సాగుకు డోకా ఉండదని రైతులు ఆశతో ఉన్నారు. కానీ, కొందరు చెరువులోవేట కష్టంగా మారిందని తూములు పగలగొట్టి నీటిని బయటకు వృథాగా పంపిన వైనమిది. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి, వేంపల్లి చెరువులో చేపలు పెంచతున్న వ్యాపారులు నీళ్లు నిండుగా ఉండడం వేట ఆలస్యమవుతోందని భావించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి తూములు పగలగొట్టి పక్కనే ఉన్న వరిమడుల్లోకి నీరు వదిలిపెట్టారు. ఫలితంగా ఆయకట్టు పరిధిలోకి చేరిన నీటిని బుధవారం ఉదయం రైతులు గుర్తించి సమాచారం ఇవ్వగా జల వనరుల శాఖ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ చేరుకుని అడుకట్ట వేయించారు. వరి మడులు నీటితో నిండడంతో దుక్కులు దున్నే అవకాశం లేదని, ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, తూములు పగలగొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొణిజర్ల మండలంలో... కొణిజర్ల: చేపల వేట కోసం కొందరు చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారు. కొణిజర్లలోని ఊర చెరువు, చీకటి చెరువులో రెండు రోజులుగా రెండు తూముల ద్వారా భారీగా నీరు బయటకు పంపిస్తున్నారు. ఏటా చేపల వేట కోసం చెరువులో నీటిని వృథా చేస్తున్నా ఒకరిద్దరు రైతులు మినహా అటు ప్రజాప్రతినిధులు కానీ, జలవనరుల శాఖ అఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వేసవిలో పశువులకు తాగునీరు, వానాకాలంలో రైతులు నార్లు పోసుకునేందుకు చెరువులో నీరు ఉండాలి. కానీ చేపల వేటగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా రాత్రివేళ తూములు తెరిచి నీళ్లు బయటకు వదులుతున్నారు. ఫలితంగా చెరువులు ఖాళీ కావడమే కాక నీరు వృథాగా పొలాల్లోకి, ఏటిలోకి చేరుతోంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చెరువులు ఖాళీ చేయకుండా పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. -
● గోదాముల కొరత
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల నిల్వలకు గోదాముల సమస్య తలెత్తింది. జిల్లాలో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. ఇప్పటివరకు 40 కేంద్రాల ద్వారా 1.89 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేశారు. కానీ జిల్లాలో అవసరమైన గోదాములు లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మిర్చి మోడల్ మార్కెట్లోని ఐదు షెడ్లలో 25వేల మెట్రిక్ టన్నుల పంట నిల్వ చేశారు. ఆపై ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్లోని షెడ్లలో 3 వేల మెట్రిక్ టన్నులు, కూసుమంచి మండలం కల్లూరుగూడెం గోదాముల్లో కూడా నిల్వ చేస్తున్నారు. అయినా ఇంకా పంట ఉండడంతో రైస్ మిల్లులు, ఫంక్షన్ హాళ్లు, పాత సినిమా హాళ్లను పరిశీలిస్తున్నారు. ఇవికాక పొరుగు జిల్లాలైన సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చిలుకూరు ప్రాంతాల్లో ఉన్న గోదాములను లీజ్‌కు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు..
కొణిజర్ల: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గురువారం మిల్లులకు తరలిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ సునీల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని లాలాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన తహసీల్దార్ ఎన్.అరుణ, ఏఓ డి.బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించాక క్వింటాకు 10 కేజీల తరుగు కింద తీస్తున్నారని, అందుకు ఒప్పుకుంటేనే మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాక దిగుమతి ఆలస్యమైన లారీల అద్దె కూడా తమపైనే వేస్తున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా లారీలు సమకూర్చాలని కోరగా సునీల్‌రెడ్డి ప్రతీ బస్తా మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
ఖమ్మం ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి..
ఖమ్మంఅర్బన్: దివంగత సీఎం ఎన్టీఆర్ ఆశీస్సులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారానికి తోడు ఖమ్మం జిల్లా ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రిగా తొలిసారి ఆయన ప్రమాణ స్వీకా రం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఖమ్మం డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తుమ్మల మాట్లాడారు. సామాన్యుడినైన తనకు గత 45 ఏళ్లుగా అవకాశాలు కల్పించిన ప్రజలు, ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, తాను ఉన్న వ్యవస్థ, నాయకత్వానికి చేదోడుగా నిలుస్తూ, అధికారాన్ని సామాన్యులు, కష్టజీవుల సంక్షేమానికి వినియోగిస్తానని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, మంత్రి తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా మంత్రి తుమ్మల పని చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాక సాధారణ రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కొనియాడారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి తుమ్మల కృషి చేశారని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపారని చెప్పారు. ఇంకా సభలో వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతురావు, ఎండీ.సలాం, డాక్టర్ వాసిరెడ్డి రామ నాథం, గడిపల్లి కవిత, ఏలూరి శ్రీనివాసరావు, నూతి సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు తుమ్మల యుగంధర్, నాగండ్ల దీపక్‌చౌదరి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రావూరి సైదబాబు, సాధు రమేశ్‌రెడ్డి, చండ్రా రాంబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, యరగర్ల హనుమంతురావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, సంక్రాంతి నాగేశ్వరరావు, దేవ్‌సింగ్, దండి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయకన్‌గూడెం నుంచి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకోగా, మార్గమధ్యలో ఎన్టీఆర్ విగ్రహానికి తుమ్మల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మంసహకారనగర్: మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును టీజేఏసీ బాధ్యులు బుధవారం సన్మానించారు. టీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, జైపాల్, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. అభినందన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
గీతాసారం
జీవిత పాఠం..అష్టాదశ శ్లోకాలపై శిక్షణ ఖమ్మంగాంధీచౌక్: భగద్గీతలో అష్టాదశ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహాభారత యుద్ధం సమయాన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారమే భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. ఖమ్మం గుట్టలబజార్‌లోని శ్రీరామకృష్ణ విద్యాలయం ఉపాధ్యాయురాలు అపర్ణ విద్యార్థులకు భగవద్గీతతో పాటు రామాయణం, మహాభారతంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భగవద్గీతలోని అష్టాదశ శ్లోకాలపై ఇస్తున్న శిక్షణకు మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఈ శ్లోకాల సారం జీవిత పాఠాలను నేర్పుతుందని, సమాజంలో బాధ్యతలను గుర్తుచేస్తాయని నమ్ముతున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాక శ్లోకాల పఠనం ద్వారా విద్యార్థుల్లో భాష ఉచ్ఛారణ, స్పష్టత వస్తుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమాన వేసవిలో ఉదయం నామమాత్రపు ఫీజుతో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని రేణుక తెలిపారు. -
మక్కల నిల్వలకు అదనపు గోదాములు
ఖమ్మంవ్యవసాయం: మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నల నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాంలే కాక అదనపు గోదాంలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న నిల్వలను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాంటాలు కాగానే గోదాంలకు మక్కలు తరలించేలా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు కూసుమంచి: రైతులు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆపై ఆన్లైన్లో నమోదు చేస్తే రైతులకు సకాలంలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇన్చార్జి మేనేజర్ సునీల్‌రెడ్డి, డీఆర్డీఓ శ్రీరాం, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర టీ.ఎస్. -
గిన్నిస్ రికార్డ్ ప్రదర్శనలో రిటైర్డ్ కండక్టర్
మధిర: మధిరకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ రెంటపల్లి ఫ్రాన్సిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 2న జరిగిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబర్చిన 777 మందిని రికార్డుకు ఎంపిక చేయగా ఫ్రాన్సిస్‌కు స్థానం దక్కింది. ఈ మేరకు 8వ తేదీన విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు దండంగి అగస్టీన్ ఆయనకు రికార్డు పత్రం, పతకాన్ని బహూకరించారు. హెచ్‌పీఎస్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: రామాంతపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో మొదటి తరగతిలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా.. రామాంతపూర్, బేగంపేటలో ఒక్కో సీటు అందుబాటులో ఉందని వెల్లడించారు. వయస్సు, వార్షిక ఆదా యం ఆధారంగా అన్ని సర్టిఫికెట్లతో కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందించాలని సూచించారు. జిల్లా కోటా కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే జూన్ 1వ తేదీన లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో లాభాలుఖమ్మంఅర్బన్: ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకంగా మారుతోందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బాలాపేటలోని పలువురు రైతుల ఆయిల్‌పామ్ క్షేత్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగుచేస్తే తక్కువ నిర్వహణ ఖర్చు లతో అధిక ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎంవీ మధుసూదన్, పట్టు పరిశ్రమశాఖ డీడీ ముత్యాలు, రైతులు మానుకొండ రాధాకిశోర్, కుర్ర సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ విధానాలు దేశానికి ప్రమాదకరం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు అన్నారు. పార్టీ జిల్లా సమితి సమావేశం బుధవారం ఖమ్మంలో జరగగా ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్ విధానం, ప్రలోభాలు తదితర అంశాలు బీజేపీ గెలుపు వెనక దాగి ఉన్నాయన్నారు. దేశంలో ధరలు పెరుగుతుండగా, ఇతర సమస్యలను పరిష్కరించకుండా ప్రతీ సమస్యకు కర్మ ఫలమే పరిష్కారమనే వాదనను బీజేపీకి తెరపైకి తీసుకొస్తోందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా హిందుత్వ నినాదంతో ప్రజల మధ్య విభజన రేఖ తీసుకురావడం ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యం దాగి ఉందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిస్థాయిలో అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అంతేకాక ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొక్కజొన్నలు కొని రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని తెలిపారు. కాగా, పార్టీ ప్రజా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని హేమంతరావు కోరారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, పావులూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో హేమంతరావు -
మరింత వేగంగా అభివృద్ధి పనులు
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. మధిరలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆమె అధికారులతో సమీక్షించారు. పనులు వేగంగా చేపట్టడమే కాక నాణ్యత లోపించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పనుల సమయాన ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత రామనాథం, కమిషనర్ సంపత్ కుమార్, నాయకులు, కౌన్సిలర్లు మిర్యాల వెంకటరమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పారుపల్లి విజయకుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, బాణావత్ వెంకటరమణ నాయక్, యన్నం కోటేశ్వరరావు, దోర్నాల రవికుమార్, బండారు నరసింహారావు, మైలవరపు చక్రి పాల్గొన్నారు. -
జిల్లా.. గరం, గరం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడంతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కొద్ది రోజులుగా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే మొదలవుతున్న ఎండ గంటగంటకు పెరుగుతూ మధ్యాహ్నం వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం, రాత్రి తేడా లేకుండా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరిగి అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, విద్యుత్ వినియోగం పెరగడంతో అవాంతరాలు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. తిమ్మారావుపేటలో గరిష్టం ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బాణాపురంలో 43.8, గుబ్బగుర్తిలో 43.7, సిరిపురంలో 43.5, పమ్మిలో 43.3, ఏన్కూరులో 43.1, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పెద్దగోపతిలో 42.2, గౌరారంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కల్లూరులో 41.9, నేలకొండపల్లి, ఖమ్మం ఖానాపురం, ప్రకాష్నగర్ల్లో 41.8, కూసుమంచి, రావినూతలలో 41.7, తల్లాడ, కొణిజర్లలో 41.6, వైరాలో 41.5, వైరాలో 41.4, కుర్నవల్లిలో 41.3, నాగులవంచ, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 41.2, మధిర 41.1, పల్లెగూడెం, ముదిగొండలో 41, పెనుబల్లిలో 40.8, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 40.7, గేటు కారేపల్లి, మధిరలో 40.6, పంగిడిలో 40.5, లింగాల 40.3, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనానికి అవస్థలు ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రేకులు, పెంకుటిళ్లలో నివసించేవారే ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు పనుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎండల కారణంగా ఇటీవల వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యాన నిర్మాణ రంగం. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు ఎండ తీవ్రత నేపథ్యాన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
కనులపండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్య కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపారు. అలాగే, బేడా మండపంలో స్వామికి స్నపన తిరుమంజనం గావించారు. -
ప్రతీ దరఖాస్తుకు పరిష్కారం చూపుతాం
కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతీ మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు పది క్లస్టర్లలో జరిగాయన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహప్రవేశంలో... నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎస్సీ, బీసీ కాలనీలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశం బుధవారం జరగగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అందిమళ్ల నాగరాణి ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు అందజేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చిన మంత్రికి రుణపడి ఉంటామని ఆమె తెలిపారు. అలాగే, ఆచార్లగూడెంలో నిర్మించిన ఆలయంలో మంత్రి పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, సర్పంచ్ కొలికపొంగు ఉప్పలమ్మతో పాటు నాయకులు పాల్గొన్నారు. -
అగచాట్లు
అడ్డంకులు..ముదిగొండ సొసైటీలో ఆన్లైన్ కోసం వేచి ఉన్న రైతులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొనుగోళ్లలో జాప్యం, అడుగడుగునా సమస్యలతో మొక్కజొన్న ఎందుకు సాగు చేశామా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత మొదలు గోదాంకు తరలించే వరకు ఎదురవుతున్న అడ్డంకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవి ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం తాజాగా ఒక సొసైటీ రోజుకు 2వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పినట్లు తెలుస్తుండడం గుదిబండలా మారనుంది. వీటన్నింటికీ తోడు కౌలు రైతులను ఆన్లైన్ సమస్య వేధిస్తోంది. ఆన్లైన్లో జాప్యం ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఎకరానికి 40 – 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సిద్ధమైంది. ఇక అడపాదడపా కురిసిన అకాల వర్షాలతో మొక్కజొన్న పంట కిందకు వాలింది. దీంతో కింద పడ్డ కంకులు మిషన్‌తో కోయడం సాధ్యం కాక కూలీల రూపంలో అదనపు భారం పడింది. ఆపై పంట అమ్ముకునేందుకు వెళ్తే సకాలంలో ఆన్లైన్ కాక రైతులు రోజుల తరబడి వేచి ఉంటున్నారు. ఇక కౌలు రైతులు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో వెళ్లి ఏఈఓ దగ్గర ధ్రువపత్రం తీసుకున్నాక ఆన్లైన్లో డీఎం అనుమతి తీసుకోవాలి. ఆతర్వాత సొసైటీలో వేలిముద్ర వేయడానికి చాలా సమయం పడుతోంది. సర్వర్ మొరాయిస్తుండడంతో జాప్యం జరుగుతుండగా.. కొన్నిచోట్ల ఏఈఓలు చేసిన క్రాప్ బుకింగ్, క్షేత్రస్థాయి పంటకు తేడా రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కాంటాలు కాక.. లారీలు లేక.. కొనుగోలు కేంద్రాలకు మక్కలు తీసుకొచ్చిన రైతులు కాంటాల కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. గన్నీ బ్యాగ్‌లు ఇవ్వకపోవడంతో రైతులే రూ.26 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల కల్లాల్లో మొక్కజొన్నలను నిల్వ చేయగా.. ఎండ వేడికి నిప్పంటుకుంటోంది. ఇలాగే బోనకల్, చింతకాని మండలాల్లో పంట అగ్నికి ఆహుతైంది. మరోపక్క లారీల కొరతతో గోదాంలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. స్థానికంగా గోదాంలకై తే టన్నుకు రూ.450, సూర్యాపేటలోని గోదాంలకు రూ.500 నుంచి రూ.550 మాత్రమే లారీలకు ఇస్తున్నారు. కానీ అన్లోడ్ చేయడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో లోడ్‌కు రూ.16వేలే వేస్తున్నాయంటూ లారీల యాజమానులు ముందుకు రావడం లేదు. క్వింటాకు రూ.100 నుంచి రూ.120 ఇచ్చే రైతుల సరుకు తీసుకెళ్తుండగా, అలా ఇవ్వలేని రైతులు పడిగాపులు కాస్తున్నారు. రెండు వేల క్వింటాళ్లేనట.. మార్క్‌ఫెడ్ తాజాగా కొత్త నిబంధన అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాంటా అయిన మొక్కజొన్నలను తీసుకెళ్లిన లారీలు రకరకాల కారణాలతో గోదాంల వద్ద నిలిచిపోతున్నాయి. దీంతో ఒక్కో సొసైటీ రోజుకు రెండు వేల క్వింటాళ్లే కొనుగోలు చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లు సమాచారం. అంతవరకే ట్రక్ షీట్లు జారీ చేస్తుండడం రైతులు వేచి ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే విక్రయించిన పంటకు సకాలంలో నగదు జమ కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.మొక్కజొన్న విక్రయానికి రైతుల అవస్థలు -
నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రులు
కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండ పర్యటన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు హెలికాప్టర్ ద్వారా వారు నాయకన్‌గూడెం చేరుకుంటారు. తొలుత పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడనున్నారు. ఆతర్వాత 3–30 గంటలకు కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం కానున్న మంత్రులు ధాన్యం కొనుగోలుపై సమీక్షిస్తారు. ప్రశాంతంగా పాలిసెట్ ఖమ్మం సహకారనగర్/మధిర: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఖమ్మంలో ఆరు కేంద్రాలు ఏర్పాటుచేయగా 3,157 మంది విద్యార్థులకు గాను 2,902 మంది హాజరయ్యారని పరీక్షల నగర కోఆర్డినేటర్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పర్యవేక్షించినట్లు వెల్ల డించారు. అలాగే, మధిరలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 539 మంది విద్యార్థులకు గాను 496 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ కె.సాంబయ్య తెలిపారు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాక లోపలికి అనుమతించగా, కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 4,072 మందికి 3,821 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,039 మందిలో 941మంది హాజరయ్యారని అధికారులు తెలి పారు. కాగా, ఉదయం 20 సెంటర్లలో, మధ్యాహ్నం 16 సెంటర్లలో పరీక్షల కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు డీఐఈఓ రవిబాబు తనిఖీ చేశారు. బక్రీద్ ప్రశాంతంగా జరుపుకునేలా పర్యవేక్షణ ఖమ్మంక్రైం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతా వరణంలో జరుపుకునేలా వివిధ శాఖల అధి కారులు పర్యవేక్షించాలని డీజీపీ సీవీ.ఆనంద్ సూచించారు. పోలీసు, పశుసంవర్ధక, రెవె న్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మాట్లాడారు. జిల్లా నుంచి పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ గోవధ, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాలో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జంతువులను రవాణా చేస్తే జప్తు చేస్తున్నామని చెప్పారు. అంతేకాక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయగా, ఇప్పటికే గోరక్షక కమిటీలు, ముస్లిం మతపెద్దలతో సమావేశమై సూచనలు చేశామని తెలిపారు. ఇంకా ఈ వీసీలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, సారంగపాణి, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆశాజనకమేనా ?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత నెలాఖరు నుంచి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అడపాదడపా జల్లులు మినహా అకాల వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతోంది. అయినా జిల్లాలోని ప్రధాన చెరువులు, రిజర్వాయర్లలో ప్రస్తుతానికి నీటిమట్టం సంతృప్తికరంగానే ఉంది. కానీ రాబోయే వానాకాలం సాగు మొత్తం నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉండడం.. రుతుపవనాల రాక ఆలస్యమవుతుందనే ప్రచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నాగార్జునసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులు నిండితేనే సాగు సాఫీగా సాగనుంది. భయపెడుతున్న భానుడు ఎండాకాలం ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం వానాకాలం సాగుపై పడుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో ఉన్నా పంటల సాగుకు బోర్లు, బావులపై పెద్దసంఖ్యలో రైతులు ఆధారపడతారు. ఎండలకు తోడు వర్షాలు ఆలస్యమై భూగర్భ జలాలు మరింత తగ్గితే నీరు అందని పరిస్థితి ఎదురవుతుంది. మండువేసవిలో జలకళ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో వేసవిలోనూ నీటినిల్వలు ఉండటం విశేషం. ప్రధానంగా సాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చి చేరే నీటితో పాలేరు రిజర్వాయర్ కళ సంతరించుకుంది. ఈ రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 23 అడుగులు కాగా.. ప్రస్తుతం 19.45 అడుగుల మేర నీరు ఉంది. వైరా మధ్య తరహా ప్రాజెక్టు, జాలిముడి ప్రాజెక్టుల్లోనూ నీరు ఉండగా.. లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, కట్టలేరులో కొంత మేర తగ్గింది. 463 చెరువులు నిండా.. జిల్లాలో 962 చెరువులు ఉండగా.. అందులో 463 చెరువుల్లో 75 శాతం నుంచి 100శాతం నీరు ఉంది. కేవలం 233 చెరువుల్లోనే 25 శాతం లోపు నీటి నిల్వ లు ఉన్నాయి. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి వనరులు నిలకడగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో 87 చెరువుల్లో 50 – 75 శాతం మేరకు నీరు ఉండటం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఎండలు మరింత ముదిరితే ఇంకొన్ని చెరువుల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. రానున్న వానాకాలం సీజన్ వరకు ఈ నిల్వలు తగ్గకపోతే పంటల సాగుకు ఉపయుక్తం కానున్నాయి. వర్షాలపైనే ఆధారం.. జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు కొత్త ఆశలను కల్పిస్తున్నా.. రానున్న వానాకాలం సీజన్ సజావుగా సాగాలంటే వరుణుడి కరుణ తప్పనిసరి. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటాయి. రుతుపవనాలు బలహీన పడి సకాలంలో వర్షాలు కురవకపోతే వ్యవసాయంపై ప్రభావం పడుతుంది. అలాకాకుండా ప్రస్తుతం చెరువులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలకు తోడు జూన్ రెండు, మూడో వారాల్లో వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే సాగు గాడిన పడనుంది. ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వలు పాలేరు రిజర్వాయర్ 23 19.45 వైరా రిజర్వాయర్ 18.03 14.04 లంకాసాగర్ ప్రాజెక్టు 16 05.05 బేతుపల్లి చెరువు 16 08.03 జాలిముడి ప్రాజెక్టు 15 15.01 -
నీట్ నిస్తేజం
● పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో ఆందోళన ● కష్టపడి సిద్ధమయ్యామంటూ వెల్లడి ● మరోమారు పరీక్షకు సన్నద్ధతపై భిన్నాభిప్రాయాలు ఖమ్మంసహకారనగర్: మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలకు ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ‘నీట్’ను రద్దు చేశారు. రాజస్థాన్‌లో ప్రశ్నాపత్రం లీకై నట్లు నిర్ధారణకు వచ్చిన జాతీయ పరీక్ష వ్యవస్థ (ఎన్టీ) దర్యాప్తు సంస్థల విచారణతో ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రం మార్పు లేకుండా, మరోమారు ఫీజు చెల్లించే అవసరం లేకుండా త్వరలో ఇంకోసారి పరీక్ష నిర్వహిస్తామని చెబుతున్నా.. కష్టనష్టాలకోర్చి సిద్ధమైన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పరీక్ష కీ చూసుకుని మంచి మార్కులు సాధిస్తామని, తప్పక సీటు వస్తుందని నమ్మకంతో ఉన్న విద్యార్థులు రద్దయిందనే సమాచారంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక శిక్షణతో.. కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పలువురు రూ.లక్షలు ధారపోసి లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. కంటిమీద కునుకు లేకుండా పుస్తకాలతో కుస్తీపట్టారు. అంతేకాక తాజాగా ఇంటర్ చదివిన వారు షార్ట్‌టర్మ్ శిక్షణతో నీట్ లక్ష్యంగా సన్నద్ధమయ్యారు. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పొదుపు మొత్తాన్ని వెచ్చించారు. కానీ పరీక్ష రద్దు కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. ఎంతో శ్రమించి సన్నద్ధమై ఒకసారి పరీక్ష రాశాక.. మళ్లీ రాయడమంటే ఆ స్థాయిలో ఏకాగ్రత సులువు కాదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పేపర్ లీక్ పరిణామం తెలివైన విద్యార్థులకు తీరని నష్టం చేకూరుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయాన దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పారదర్శకంగా రీ సర్వే
● కలెక్టర్ దివాకర టీ.ఎస్. ● కాకరవాయిలో సర్వే పరిశీలన.. ఉద్యోగులకు సూచనలుతిరుమలాయపాలెం: భూముల రీ సర్వేను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. గ్రామంలో ఆర్ఎస్ఆర్ పట్టా విస్తీర్ణం సమస్యల పరిష్కారానికి రీ సర్వే చేపడుతుండగా.. ఆతర్వాత కచ్చితంగా వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఐదు బృందాల ద్వారా చేపడుతున్న సర్వే వివరాలను రైతు వేదికలోనే కంప్యూటర్ ఏర్పాటు చేసి నమోదు చేయాలని సూచించారు. గ్రామంలోని అన్ని రహదారులు, ప్రజాస్థలాలు, ప్రభుత్వ భూములను కచ్చితమైన వివరాలతో గుర్తించాలని చెప్పారు. ఐదు బృందాలు కలిపి రోజుకు 250 – 300 ఎకరాలు సర్వే చేయాలని తెలిపారు. ఈ సర్వేతో ఎవరికీ నష్టం జరగకపోగా, సర్వే నంబర్లలో గందరగోళం తొలగిపోతుందని వివరించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ విల్సన్, ఎంపీడిఓ సిలార్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. వానాకాలానికి ముందే రైతు రిజిస్ట్రీ ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్‌కు ముందే రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, రవాణా శాఖ, సీడ్ కార్పొరేషన్, పోలీసు శాఖలు సమన్వయంతో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా నిలువరించాలని తెలిపారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ బందాల ద్వారా నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. అలాగే, క్రాప్ బుకింగ్, రైతు రిజిస్ట్రీపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సోలార్ విలేజ్‌గా రఘునాథపాలెంరఘునాథపాలెం: పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూప్‌టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. రఘునాథపాలెంలో సోలార్ మోడల్ ప్రాజెక్టు పనులను మంగళవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఇప్పటివరకు 110 ఇళ్లపై ప్యానళ్లు ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాలు, ఇతర సామూహిక ప్రదేశాలపైనా సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జనగణన సర్వేపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యుత్ శాఖ డీఈ రామారావు, ఏడీఈ సంజయ్‌కుమార్, రెడ్కో జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ గాజుల కృష్ణారావు, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్, ఆర్ఐ వహీద్, గ్రామ కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు. ఖమ్మంసహకారనగర్: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది రాకుండా సాఫీగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2.78 లక్షల టన్నుల మొక్కజొన్న కేంద్రాలకు చేరగా, కొనుగోళ్లు చేపడుతున్నామని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల జిల్లాఅధికారులు చందన్‌కుమార్, శ్రీరామ్, డి.పుల్లయ్య, గంగాధర్, ఎం.ఏ.అలీం, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుల రాస్తారోకో
కొణిజర్ల: మొక్కజొన్నల కాంటా పూర్తయినా ఎగుమతికి ట్రక్షీట్లు ఆన్లైన్ చేయకుండా మార్క్‌ఫెడ్ అధికారులు కోతలు విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు కొణిజర్లలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. మొక్కజొన్నల కాంటా పూర్తయ్యాక ఎగుమతికి మార్క్‌ఫెడ్ అధికారులు ఆన్లైన్లో ట్రక్‌షీట్ మంజూరు చేయాలి. పట్టాదారు రైతు వేలి ముద్ర వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం పలు గ్రామాల రైతులు మంగళవారం ఉదయమే సొసైటీ కార్యాలయానికి రాగా, మార్క్‌ఫెడ్ అధికారులు రోజుకు 2 వేల బస్తాల ఎగుమతికే ఆన్లైన్ చేశారు. దీంతో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న తమ పరిస్థితి ఏమిటని రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ మేరకు సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ అరుణ చేరుకుని మాట్లాడారు. లారీ యజమానులు బస్తాకు రూ.50 తీసుకుంటున్నారని, ట్రక్‌షీట్ జారీ కాక వేచి ఉండాల్సి వస్తే రోజుకు రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో తహసీల్దార్ అరుణ మార్క్‌ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడగా వారు సర్వర్‌లో మార్పులు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా ఎండలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్తాల ఎగుమతిలో నిబంధనలపై ఆగ్రహం -
పులిగుండాల వెళ్లొద్దామా ?!
ఎకో టూరిజంలో భాగంగా పెనుబల్లి మండలంలోని పులిగుండాల రిజర్వాయర్ వద్ద పర్యాటకుల కోసం వసతులు కల్పించారు. అక్కడ నిండా నీళ్లతో కళకళలాడే రిజర్వాయర్‌ను చూస్తూ రోజంతా గడపొచ్చు. అలాగే, అడవిలో షికారుకు సఫారీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సేద తీరేందుకు విడిది గృహాలు, అడవిని వీక్షించేలా వాచ్‌టవర్ కూడా నిర్మించారు. ఈ క్రమాన పులిగుండాల టూరిజంప్రాజెక్టుపై ప్రచారం కోసం వాటర్ ఫాల్స్, వివిధ జంతువుల బొమ్మలతో కూడిన ప్రాజెక్టు నమూనాను కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దీన్ని చూస్తే చాలు సెలవుల్లో ఒకరోజు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలనే ఆసక్తి కలగడం ఖాయమని చెబుతున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణఖమ్మంవ్యవసాయం: పులిగుండల ఎకో–టూరిజం ప్రాజెక్టు వివరాలతో రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను హైదరాబాద్‌లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పులిగుండాలను పరిరక్షణ, పర్యాటకం, పర్యావరణ విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దడంలో పూర్వ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, ఉద్యోగుల కృషిని అభినందనీయమన్నారు. అలాగే, పుస్తక రూపకల్పనపై విక్రమ్‌సింగ్‌ను అభినందించారు. -
ఆర్టీసీలో ప్రతీ మంగళవారం గ్రీవెన్స్
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఖమ్మంలోని ఆర్ఎం కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిపోల వారీగా కార్యాలయాల్లో కాక రీజినల్ స్థాయిలోనూ ప్రతీ మంగళవారం గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మెరుగు రవీంద్రనాథ్ ఆధ్వర్యాన పదోన్నతుల్లో అవకతవకలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, డీఎం కార్యాలయంలో మేనేజర్ శివప్రసాద్‌కు మహిళా కార్మికులు తమ సమస్యలను వివరించారు. రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని, డిపోలు, బస్టాండ్లలో సరైన రెస్ట్ రూమ్స్ లేక అవస్థ పడుతున్నామని మహిళా కండక్టర్లు తెలిపారు. -
ఎస్సెస్సీ టాపర్లకు విమానయానం
బోనకల్: పదో తరగతి ఫలితాల్లో మండల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు విమానయానం కల్పిస్తామన్న ఊటుకూరి ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు తన హామీ నెరవేర్చుకున్నారు. ఈ మేరకు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టి.భానుప్రకాశ్ (ఆళ్లపాడు – 560 మార్కులు), టి.చంద్రిక (రావినూతల – 546 మార్కులు)ను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య కూడా వెళ్లారు. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిరవధిక వాయిదా కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఈ నెల 11న కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యాన మంగళవారం సాయంత్రం విద్యార్థులతో సమావేశం కాగా, పోటీ పరీక్షలు ఉండడమే కాక ఎండల కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించామని, ఈ నెల 13న మధ్యాహ్న భోజనం తర్వాత యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తారని వెల్లడించారు. జూన్ 8న వేసవి సెలవులు ముగిశాక సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. బరువు తగ్గిస్తామనే హామీ విఫలంతో జరిమానా ఖమ్మంలీగల్: బరువు తగ్గిస్తామని నమ్మబలికి రూ.వేలల్లో ఫీజు తీసుకున్నాక సేవల్లో నిర్లక్ష్యం వహించడంతో ఖమ్మంలోని కలర్స్ (కలర్స్ – సీజే హెల్త్, వెల్నెస్) సంస్థ పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పునిచ్చింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం గత్తాయిగూడెంకు చెందిన అట్లూరి తేజశ్రీ ఆరు నెలల్లో 15 కిలోల బరువు తగ్గిస్తామనే కలర్స్ సంస్థ ప్రకటన చూసి సంప్రదించింది. ఈ మేరకు 2024 నవంబర్‌లో రెండు విడతలుగా రూ.2 లక్షలు ఫీజు చెల్లించారు. ఆపై ప్రతీ వారం రామవరం నుంచి ఖమ్మంకు వచ్చివెళ్తూ ఎనిమిది నెలల చికిత్స పొందారు. అయినా బరువులో ఎలాంటి మార్పు రాకపోగా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించినా, లీగల్ నోటీసు జారీ చేసినా వారు స్పందించలేదు. దీంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కలర్స్ సంస్థ సేవల్లో లోపం ఉన్నట్లు నిర్ధారణ కావడం, విచారణకు ప్రతినిధులు హాజరుకాకపోవడంతో బాధితురాలు చెల్లించిన రూ.2లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వడమే కాక ఆర్థిక నష్టానికి రూ.20 వేలు, కేసు ఖర్చులుగా రూ.10 వేలు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించకపోతే వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేసింది. -
ప్రతీ ఓటమి గెలుపునకు నాంది
ఖమ్మంసహకారనగర్: ఓటమితో కుంగిపోకుండా గెలుపునకు నాందిగా భావించి ముందుకు సాఘాలని డీఈఓ చైతన్యజైనీ సూచించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూసుమంచి, సత్తుపల్లి, శాంతినగర్, ఎన్ఎస్సీ కాలనీ, మధిర పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కూసుమంచి ఉన్నత పాఠశాలలో క్యాంప్‌ను మంగళవారం డీఈఓ ప్రారంభించి మాట్లాడుతూ.. అందరి జీవితంలో జయాపజయాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని కారణాలు విశ్లేషించుకుంటూ ముందుకు సాగితే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. ఆ తర్వాత సాంస్కృతిక, క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాటు చేసిన క్యాంప్‌ను కూడా డీఈఓ పరిశీలించారు. ఏఎంఓ పి.ప్రభాకర్‌రెడ్డి, ఎంఈఓ వీరస్వామి పాల్గొన్నారు. -
మొబైల్ మాయ.. నష్టాల తోవ
కరకగూడెం: ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లలో ఒకరు ఎప్పుడూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ కాలం గడిపేవాడు. మరొకరు ప్రతిరోజూ కొంత సమయం చదువు, కొంత సమయం ఆటలకు, ఇంకొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించేవాడు. కాలం గడిచింది. మొబైల్‌తో సమయం వృథా చేసిన బాలుడు చదువులో వెనుకబడిపోయాడు. కానీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న బాలుడు చదువులోనే కాదు ఆటల్లోనూ, చిత్రలేఖనంలోనూ ప్రతిభ చూపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఒకరోజు మొబైల్‌కు బానిసైన బాలుడు తన స్నేహితుడిని అడిగాడు. ‘నువ్వు ఎలా విజయవంతమయ్యావు?’అని. అప్పుడు ఆ విద్యార్థి ‘మొబైల్ మనకు ఉపయోగపడాలి. మనమే మొబైల్‌కు బానిసలు కాకూడదు’అని చెప్పాడు. ఆ మాటలు విని మొదటి విద్యార్థి ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు నుంచి మొబైల్ వినియోగాన్ని తగ్గించి, స్నేహితులతో కలిసి బయట ఆటలు ఆడడమే కాక పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌గా సతీష్‌కుమార్
ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌కుమార్ నియమితులయ్యారు. ఏడాది కాలంగా పోస్టు ఖాళీగా ఉండడంతో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభావం పడుతోంది. ఈనేపథ్యాన సతీష్‌కుమార్‌ను నియమించగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అర్హులకు సాఫీగా అందేలా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైతే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రైతు డిస్కంకు సై! ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా విద్యుత్ సర్వీసుల కోసం రాష్ట్రస్థాయిలో విద్యుత్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రైతు డిస్కంలోకి వెళ్లేందుకు ఉద్యోగులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరిట నిర్వహిస్తున్న ఈ డిస్కంలో చేరేందుకు ఇతర డిస్కంల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించగా ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,252 మంది ఆసక్తి చూపించారు. ఇందులో ఖమ్మం విద్యుత్ సర్కిల్ నుంచి 80 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కూడా దరఖాస్తు చేసుకోగా, నలుగురు డివిజనల్ ఇంజనీర్లు, ఒక ఏడీఈ, ఏడుగురు ఏఈలు ముందుకొచ్చారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఖమ్మం రూరల్ డివిజన్ నుంచి అత్యధికంగా 26 మంది, ఖమ్మం టౌన్ డివిజన్లో 11 మంది, సత్తుపల్లి డివిజన్లో 14 మంది, వైరా డివిజన్లో 9 మంది, మధిర డివిజన్లో ఆరుగురు రైతు డిస్కంలోకి వెళ్తామని పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించారు. పదోన్నతులు వస్తాయని.. నూతన డిస్కంలో త్వరగా పదోన్నతి వస్తుందనే భావనతో ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేస్థాయిలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్కంలో చేరితే పదోన్నతుల్లో ప్రాధాన్యత ఉంటుందనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డిస్కం నిర్వహణకు 2 వేల మంది ఉద్యోగుల అవసరమని భావిస్తుండగా, ఎన్పీడీసీఎల్ నుంచే 1,250 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మిగతా డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్కో ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయినందున బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయా ఉద్యోగులు 15వ తేదీన ప్రస్తుత స్థానాల్లో రిలీవ్ అయి పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్నాక కొత్త స్థానాల్లో 25వ తేదీలోగా చేరాల్సి ఉంటుంది. విద్యుత్ సెక్షన్ల విలీనం పలు ఇంజనీరింగ్ పోస్టులు రద్దు ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం ప్రత్యేక ఏర్పాటుతో విద్యుత్ సెక్షన్ల విలీనానికి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ, వాటర్ వర్క్స్ కనెక్షన్ల నిర్వహణకు ప్రత్యేకంగా రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఆర్పీడీసీఎల్)ను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని 1,22,757 వ్యవసాయ, 7,912 వాటర్ వర్క్స్ కనెక్షన్లు ఆ డిస్కం పరిధిలోకి వెళ్తాయి. ఫలితంగా టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి ఖమ్మం విద్యుత్ సర్కిల్లో సర్వీసుల సంఖ్య తగ్గనుంది. ఈ మేరకు మిగిలిన కనెక్షన్లలో 15 వేలకు ఒకటి చొప్పున సెక్షన్ ఏర్పాటుకు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంతో రాయుడుపాలెం, వేంసూరును ఒక సెక్షన్‌గా, ఏన్కూరు, తిమ్మారావుపేట కలిపి ఒకటి, బోనకల్, మోటమర్రిని ఒక సెక్షన్‌గా విలీనం చేస్తున్నారు. అంతేకాక ఎస్ఈ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఈ, ముదిగొండ ఏడీఈ, విలీనమైన సెక్షన్లలో మూడు ఏఈ పోస్టులు, సబ్ ఇంజనీర్ల పోస్టుల రద్దుకు నివేదికలను సీఎండీకి పంపించారు. -
రద్దు బాధాకరం
నీట్లో మంచి మార్కులు వస్తాయనే నమ్మకంతో ఉన్నా. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అటు ఇంటర్, ఇటు నీట్‌కు సిద్ధమయ్యాం. పేపర్ లీక్ అయిందని పరీక్ష రద్దు చేయడంతో వేదనకు గురయ్యా. భవిష్యత్‌లోనైనా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. – హారికారెడ్డి, రెజొనెన్స్ కళాశాల, ఖమ్మం నీట్ రద్దయినట్లు తెలిసి బాధ కలిగింది. పరీక్ష చాలా బాగా రాయడంతో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. మరో రాష్ట్రంలో పేపర్ లీకేజీతో ఇంకోసారి పరీక్ష రాయాల్సి రావడం ఇబ్బందే. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. – కె.గుణశేషు, న్యూవిజన్ కళాశాల విద్యార్థి, ఖమ్మం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎన్టీఏ పరీక్ష నిర్వహించగా.. పేపర్ లీకేజీ కావడంపై సమగ్ర విచారణ జరిపించాలి. లీకేజీ వ్యవహారంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడుతోంది. ఈ అంశంపై విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – ఇటికల రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు దేశమంతా కాకుండా పేపర్ లీకై న ప్రాంతాల్లోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. ఏడాది పాటు విద్యార్థులు కష్టపడి చదివినందున ఈ నిర్ణయం తీసుకోవాలి. అంతటా రద్దు చేస్తే ఇబ్బంది పడతారు. గతంలో మంచిగా రాసిన వారు మళ్లీ అలా రాయగలరా అనేది చెప్పలేం. – డాక్టర్ రాజశేఖర్‌గౌడ్, డీసీహెచ్ఎస్ -
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ 49శాతం పూర్తి
ఖమ్మంవైద్యవిభాగం: గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 14 ఏళ్లు పూర్తయి 15ఏట కొనసాగుతున్న బాలికలకు ఈ టీకా వేయాలని నిర్ణయించి మార్చి 8వ తేదీన జిల్లాలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఈ వయస్సు బాలికలు 10,883 మంది ఉండగా, సోమవారం నాటికి 5,329 మందికి(49శాతం) వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు, మూడు ఏరియా ఆస్పత్రులు, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు 15 పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. తొలుత మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని నిర్దేశించుచుకున్నా, సాధ్యం కాకపోవడంతో సెంటర్ల పెంపునకు నిర్ణయించారు. ఖరీదైన గార్డాసిల్–4 వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉన్న నేపథ్యాన, తల్లిదండ్రులు తమ కుమార్తెలను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 37 కేంద్రాలు ఖమ్మంసహకారగనర్: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 37కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం నయాబజార్ కళాశాలలో సోమవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఎండల నేపథ్యాన కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని తెలిపారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30 గంటల వరకు జరిగే పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,433 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,562 మంది పరీక్షలు హాజరవుతారని చెప్పారు. హాల్టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా డీఐఈఓ ఆఫీస్‌లో సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. డీఈసీ సభ్యులు ఎం.సింహాచలం, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల నిర్వహించే పాలిసెట్ ఈనెల 13వ తేదీ బుధవారం జరగనుండగా, ఏర్పాట్లుచేసినట్లు నగర కోఆర్డినేటర్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ జాకిరుల్లా తెలిపారు. పరీక్షకు హాజరయ్యే 3,157మంది విద్యార్థుల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల, ఎస్బీఐటీ, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజినీరింగ్ కళాశాల, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు. పరీక్ష బుధవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులను 10 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలని సూచించారు. కేంద్రాల వద్ద 163 సెక్షన్ ఖమ్మంక్రైం: పాలిసెట్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ సునీల్‌దత్ తెలి పారు. ఉదయం 9నుంచి మధ్నాహ్నం 3–30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనుండగా, కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. సభలు, ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. 13,14వ తేదీల్లో ప్రజాదర్బార్ ఖమ్మంరూరల్/కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించేలా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లు ఈనెల 13, 14వ తేదీల్లో మూడు చోట్ల జరగనున్నాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువు ఈనెల 13న బుధవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఇక్కడ పోచా రం, తురకగూడెం, నేలపట్ల, అగ్రహారం, కోక్యాతండా, లోక్యాతండా, ముత్యాలగూడెం, చేగొమ్మ, ధర్మతండా, మునిగేపల్లి, కేశవా పురం, కిష్టాపురం గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందజేయవచ్చు. అలాగే, 14న ఉదయం 8గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 3గంటలకు రామన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. కస్టర్ల వారీగా డివిజన్ల ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరిస్తారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
● కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగింపు ● మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఇల్లెందు: మిలిటెంట్ పోరాటాలతోనే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. సోమవారం నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. చీలికలుగా మారిన సీపీఐ(ఎంఎల్)లోని కొన్ని గ్రూపులు కలిసి మాస్లైన్గా ఆవిర్భవించాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో 16 రారష్ట్రాల్లోని రైతు సంఘాలతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం సభలను ఇల్లెందులో నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైతుల నడ్డి విరిచేలా ఇతర దేశాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తుల దిగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గంభీర ఉపన్యాసాలు దంచే మోదీ ట్రంప్ షరతులకు తలొగ్గాడని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ఇక పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు. మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఎన్డీ పార్టీ ప్రతిఘటన పోరాటం అంటూ కేడర్‌ను మోసం చేస్తోందని ఆరోపించారు. జీవితాలను ధారబోసిన మావోయిస్టు పార్టీ కూడా ఆచరణ సాధ్యం కాని విధానంలో పని చేశామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పీడిత ప్రజల రాజ్యం రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలు అమలు చేయడం లేదన్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నా మక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, ఇల్లెందుకు నీరు ఇవ్వాలని అన్నారు. సభలో అలిండియా కన్వీనర్ విమల్ త్రివేది, తుమ్మలపల్లి ప్రసాద్, కిచ్చెల రంగయ్య, గుమ్మడి నర్సయ్య, కె.రమ, డీహెచ్ పూజార్, కృష్ణ గగోయ్, చండ్ర అరుణ, కృష్ణ, రాము, భిక్షం, నాయిని రాజు, వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటి సర్వే ఆరంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జనగణనలో కీలక అడుగు పడింది. ఇందులో తొలి దశగా ఇంటింటి గణనకు ఎన్యుమరేటర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే సిద్ధం చేసిన 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి కుటుంబాలకు నంబర్లు కేటాయించనున్నారు. ఇదంతా మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఆతర్వాత యాప్‌లోని ప్రశ్నావళి ఆధారంగా ఇంటింటా వివరాలు సేకరించనున్నారు. కాగా, ఇళ్ల గణన ప్రక్రియను కలెక్టర్ దివాకర టీ.ఎస్. కొణిజర్లలో పరిశీలించి ఎన్యుమరేటర్లకు సూచనలు చేశారు. రెండు దశల్లో జనగణన.. జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపడుతోంది. మొదటి దశ సోమవారం మొదలు కాగా.. రెండో దశ వచ్చే ఏడాది ఉంటుంది. ప్రస్తుత సర్వేలో తొలుత గృహగణన చేపడతారు. ఒక ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాల వివరాలను సేకరిస్తారు. వీటికి నంబర్లు కేటాయించి జాబితా తయారు చేస్తారు. అలాగే ఎన్యుమరేషన్ బ్లాక్‌లు(జనాభా గణన బ్లాక్‌లు) కూడా ఏర్పాటవుతాయి. జనగణనను సులువుగా చేపట్టేందుకు నిర్దిష్ట ప్రాంతాలను విభజిస్తారు. పెద్ద గ్రామాలు, పట్టణాలను చిన్నచిన్న భౌగోళిక ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతీ బ్లాక్‌కు నియమించిన గణన అధికారి తమ పరిధిలో ప్రతీ ఇంటిని సందర్శించి వివరాలు సేకరిస్తారు. దీన్ని సర్వేలో ప్రాథమిక దశగా పిలుస్తారు. ఇది గురువారం నుంచి జూన్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. స్వీయగణనకు నాలుగో స్థానం జనగణనలో భాగంగా ప్రజలే సొంతంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం సెల్ఫ్ ఎన్యుమరేషన్ పేరుతో అవకాశం కల్పించింది. గతనెల 26నుంచి ఈనెల 10వ తేదీ వరకు వెబ్సైట్ అందుబాటులో ఉండగా.. జిల్లాలో 30,398 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికి ఎస్ఈ ఐడీ వస్తుంది. ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ నంబర్ చూపిస్తే పరిశీలించి.. లోపాలు ఉంటే సరిచేసుకునే వీలు కల్పించారు. తద్వారా ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని చెబుతున్నారు. కాగా, స్వీయ గణనలో రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఖమ్మం జిల్లా నాలుగో స్థానం దక్కించుకుంది. ఇక గ్రామీణ జిల్లాల్లో పరిశీలిస్తే ఖమ్మం మొదటి స్థానాన నిలవడం విశేషం. స్వీయ గణన వల్ల ఎన్యుమరేటర్లకు పని సులభం కావడంతో పాటు సమయం సైతం ఆదా అవుతుంది. ఇళ్ల గణన ప్రారంభం జిల్లాలో సోమవారం నుంచి జనగణన మొదటి దశలో భాగంగా ఇళ్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి మూడు రోజులు ఇళ్ల సంఖ్య లెక్కించి నంబర్లు కేటాయిస్తూ, నాలుగో రోజు నుంచి గృహ సమాచారం, ఆ తర్వాత కుటుంబంలో వినియోగించే ధాన్యం, సదుపాయాలు, ఆస్తుల వివరాలను సేకరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డిజిటల్ రూపంలో వివరాలు చేస్తున్నారు. తద్వారా కచ్చితత్వం, పారదర్శక ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం తయారు చేసే ఇళ్ల జాబితా ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణనను చేపడతారు. జనగణనలో తొలిదశ ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం జిల్లాలో మొదలైంది. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి కుటుంబ వివరాలను సేకరిస్తారు. ప్రజలు పూర్తి, సరైన సమాచారాన్ని అందించి సహకరించాలి. ప్రభుత్వ పథకాలు కోల్పోతామనే అపోహలు విడనాడాలి. ప్రజలు ఇచ్చే వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. ఇలా సేకరించే సమాచారం దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. – దివాకర టీఎస్, కలెక్టర్కొణిజర్ల: దేశాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో కీలకంగా నిలిచే జనగణన విధులను ఎన్యుమరేటర్లు నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. జిల్లాలో సోమవారం ఇంటింటి గణను కొణిజర్లలో ఆయన పరిశీలించారు. గ్రామంలో మొత్తం 2,600 గృహాలను ప్రాథమికంగా గుర్తించగా, పది బ్లాక్‌లుగా రూపొందించి పది మంది ఎన్యుమరేటర్లను నియమించామని తహసీల్దార్ అరుణ తెలిపారు. అనంతరం ఇంటి గణన, నంబర్ల కేటాయింపు వివరాలపై ఎన్యుమరేటర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత ఎస్సీ కాలనీలో గృహ గణనను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. తొలుత మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా ఇంటింటికీ సమాచారం చేరవేస్తే ఎన్యుమరేటర్ వెళ్లే సరికి కుటుంబీకులు వివరాలు సిద్ధం చేస్తారని చెప్పారు. తద్వారా పని సులువుగా, త్వరగా పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. సీపీఓ ఏ.శ్రీనివాస్, వివిధ శాఖల ఉద్యోగులు శ్రీకాంత్, ఆర్.ఉపేంద్రయ్య, ఎన్.తిరుపతిరావు, రమేష్, గురుమూర్తి, రమేష్, అరుణాకర్, ప్రసాద్, హనుమతో పాటు సర్పంచ్ గూదె పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.స్వీయ జనగణన పూర్తి.. గృహ గణన మొదలు -
సృజనాత్మకత పెంపునకు సమ్మర్ క్యాంప్‌లు
బోనకల్: వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ తెలిపారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంప్‌ను సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించగా డీఈఓ పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు కంప్యూటర్, యోగా, ఆటలు, బొమ్మల తయారీ నేర్పించేలా ఇన్స్ట్రక్టర్లను నియమించామని తెలిపారు. కాగా, గ్రామ విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల ్లలు వచ్చేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమిరేశి సీతయ్య, సొసైటీ చైర్మన్ బోయినపల్లి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ముస్తఫా, చాంద్‌పాషా, ఉపాధ్యాయులు సరస్వతి, ఉషశ్రీ, నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు ఖమ్మంసహకారనగర్: దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్‌ను సురక్షితంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని డీఈఓ చైతన్యజైనీ తెలిపారు. ఖమ్మం నయాబజార్లోని జీపీఎస్ భవిత కేంద్రంలో దివ్యాంగులకు సోమవారం ఆమె వీల్చైర్లు, సీపీ వాకర్లు, టీఎల్ఎం కిట్లుఅందజేశాక మాట్లాడారు. క్యాంప్ ఇన్చార్జ్, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గుర్తింపు శిబిరంలో చిన్నారులకు 534 పరికరాలను అందజేశామన్నారు. ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మీ, కాంప్లెక్స్ హెచ్ఎం ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చైతన్యజైనీ -
సమాజమే కథలకు పునాది
సత్తుపల్లిటౌన్: విద్యార్థి దశ నుంచి సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే కథారచనకు అవసరమైన అనేక అంశాలు కనిపిస్తాయని సత్తుపల్లి ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం ఎస్కే సోందు తెలిపారు. ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమవుతున్న వేసవి వికాసం స్ఫూర్తితో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్ ఆధ్వర్యాన సోమవారం పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కథా కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోందు మాట్లాడుతూ.. కథా రచనలో మెళకువలు, అవసరమైన అంశాల గుర్తింపునకు కార్యశాల ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత తెలుగు ఉపాధ్యాయిని రమాదేవి కథా ప్రారంభం, విస్తరణ, ముగింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ట్రస్ట్ నిర్వాహకులు జి.రామకృష్ణ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులకు సాహిత్యంపై ఆసక్తి పెంచేలా ‘సాక్షి’ప్రత్యేక శీర్షిక నిర్వహించడం అభినందనీయమన్నారు. బాల సాహితీవేత్త బొల్లెపల్లి మధుసూదన్‌రాజు మాట్లాడగా ఎంఈఓ ఎన్.రాజేశ్వరరావు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యార్థులతో ఆసక్తి ఉన్న అంశాలపై కథలు రాయించి అందులో లోపాలను సరిచేసుకోవడంపై అవగాహన కల్పించారు. ‘కథా కార్యశాల’లో వక్తలు -
త ల్లిదండ్రుల ప్రోత్సాహం..
ఖమ్మంగాంధీచౌక్: ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, పాఠశాలల్లో జరిగే వేడుకలు, కుటుంబాల్లో పెళ్లిళ్లు.. ఇలా ఏ వేదికపై అయినా చిన్నారులు నృత్యం చేసేందుకు అవకాశం దక్కుతోంది. దీనికి కొందరు చిన్నారుల్లో నృత్యంపై సహజంగానే ఆసక్తి ఉంటోంది. ఈ మేరకు వేసవి సెలవుల్లో పలువురు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఆవిర్భంవించిన ఈ కళానృత్యం వైపు చిన్నారులు దృష్టి సారిస్తున్నారు. కళారూపం, హస్తముద్రలు, ముఖ, కంటి కదలికలతో పాటు వేగవంతమైన పాద విన్యాసంతో పురాణ గాథలు, భక్తిని ఈ నృత్యం ప్రదర్శిస్తుంది. భరత నాట్యానికి దగ్గరగా ఉండే ఈ నృత్యం ప్రత్యేక శైలిని కలిగి ఉండడంతో చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని ఏలూరి మీనా కొందరు చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. చిన్నారుల ఆసక్తికి అనుగుణంగా నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మీనా వద్ద 50 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల్లో కూచిపూడిపై ఆసక్తి పెరగుతోందని.. అందుకు అనుగుణంగా వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నృత్య ప్రదర్శనలు అంటే ఇష్టం. చాలా రకాల నృత్యాలు ఉన్నా కూచిపూడిపై ఆసక్తితో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో శిక్షణ పొందుతున్నా. –జ్ఞాన సహస్ర, గట్టయ్యసెంటర్, ఖమ్మం -
నా బాల్యం
వేసవి సెలవులన్నీ అమ్మమ్మ ఇంట్లోనే.. సత్తుపల్లిటౌన్: వేసవి సెలవులు వచ్చాయంటే అందరం కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్లలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి మేనమామలు, వారి పిల్లలతో సందడిగా గడిపేవాళ్లం. రోజూ సద్ది కట్టుకొని పొలాలకు వెళ్లేవాళ్లం. అంతేకాక వరి కోత పనులు, నాట్లు వేయడం, వేరుశనగ తీయడంలో పాలుపంచుకునేవాళ్లం. రాత్రి వేళ పిల్లలందరం కలిసి అష్టాచెమ్మా, దొంగా పోలీస్, కుంటాట, ఉప్పాట ఆడుకునేది. ఇంకా భక్షాలు (బొబ్బట్లు) చేసేవాళ్లం. మజ్జిగ చిలకడం ఇష్టంగా చేసేదానిని. ఆరో తరగతి చదివేటప్పుడు కడపలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లాను. ఏడు నుంచి పదో తరగతి వరకు నందికొట్కూరులో ఎన్సీసీ కేడెట్‌గా స్కూల్ ఫస్ట్ వచ్చా. ఇలా నా బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడిచిపోయింది. – డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే -
విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం
ఖమ్మంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం సమకూర్చనుండగా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించడమే కాక నాణ్యత పాటించేలా జిల్లాలోని 21మండలాలకు చెందిన 42 మంది కుక్–కమ్–హెల్పర్లకు ఖమ్మం వెలుగుమట్లలోని కేజీబీవీలో సోమవారం శిక్షణ ఇచ్చారు. డీఈఓ చైతన్యజైనీ ఆధ్వర్యాన జరిగిన శిక్షణను అదనపు కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రతీ మండలం నుంచి ఎంపిక చేసిన ఇద్దరికి ఇక్కడ శిక్షణ ఇస్తుండగా, ఆ తర్వాత మండల స్థాయి రిసోర్స్ పర్సన్లుగా మిగతా వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషకాహారం ద్వారా వారు చురుగ్గా ఉంటూ చదువులో రాణిస్తారని తెలిపారు. డీఈఓ చైతన్య జైనీ మాట్లాడుతూ అల్పాహారంతో జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లోని 60 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. సెక్టోరియల్ అధికారులు రూబీ పంకజం, ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, రచ్చ శ్రీనివాస్, ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .వర్కర్ల శిక్షణలో అదనపు కలెక్టర్ శ్రీజ -
అమ్మ.. ఆవకాయ.. ఆదివారం
సీటీజీ ఆధ్వర్యాన వినూత్నంగా మాతృదినోత్సవం ఖమ్మంఅర్బన్: అవకాయతో తెలుగు వారి అనుబంధం మరువలేనిదని వక్తలు పేర్కొన్నారు. ఖమ్మం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) సభ్యులు మాతృదినోత్సవం సందర్భంగా ‘అమ్మ – ఆవకాయ – ఆదివారం’పేరిట వరంగల్ క్రాస్ రోడ్డులోని విజయలక్ష్మి – మహేశ్‌బాబు ఇంట్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మానుకొండ జ్యోతి, షేక్ కై సర్, కొణిదెన శ్రీనివాస్ సంధానకర్తలుగా వ్యవహరించగా 50 మంది సభ్యులు పాల్గొని 50 కిలోల పచ్చడి సామూహింగా తయారు చేశారు. సూర్యాపేట జెడ్పీ సీఈఓ దేవరపల్లి శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్లలో పనులు చేస్తూ నలుగురు కుమారులను ఉన్నతస్థాయికి చేర్చిన కేస్లా లక్ష్మి తదితరులను సన్మానించారు. -
వాహనం ఢీకొని ఏడు పాడిగేదెలు మృతి
కొణిజర్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏడు పాడిగేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని బొట్లకుంట సమీపాన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రతాపనేని రామకృష్ణ, కూచిపూడి తిరపతిరావుకు చెందిన ఏడు పాడిగేదెలు ఆదివారం సమీపంలోని పొలాల్లో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే, గేదెలు గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి వెళ్లినట్లు తెలియడంతో సోమవారం ఉదయం రైతులు వెతుకుతూ వెళ్లారు. ఈక్రమాన అవి రోడ్డుపై చనిపోయి కనిపించాయి. భారీ వాహనం ఢీకొనడంతోనే గేదెలు మృతి చెందినట్లు భావిస్తుండగా, ఒక్కో గేదె విలువ రూ.90 వేల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో ఆగని మంటలు చింతకాని: మండలంలోని నాగులవంచ, లచ్చగూడెం, పాతర్లపాడు గ్రామాల్లో పలువురు రైతుల పొలాల్లో సోమవారం మంటలు చెలరేగాయి. కొందరు తమ పొలాల్లో చెత్తకు నిప్పు పెడుతుండగా, గాలులకు సమీప పొలాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కూడా పలువురి పొలాల్లో మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అదుపు చేయడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అంతేకాక నాగులవంచ సబ్‌స్టేషన్ సమీపాన కూడా మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. చుక్కల దుప్పి స్వాధీనం ఖమ్మంరూరల్: మండలంలోని మద్దివారిగూడెం సమీపాన గుట్టల నుంచి సోమవారం ఓ చుక్కల దుప్పి పిల్ల గ్రామానికి వచ్చింది. దుప్పిపిల్లను వీధి కుక్కలు తరుముతుండడంతో స్థానికులు రక్షించి అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో కూసుమంచి డీఆర్ఓ కేవీ రామారావు సిబ్బందితో చేరుకుని దుప్పికి పరీక్షలు చేయించాక కిన్నెరసాని డీర్ పార్క్‌కు తరలించారు. -
సత్వర పరిశీలన, పరిష్కారం
ఖమ్మంసహకారనగర్: ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని, అలా సాధ్యం కాని పక్షంలో కారణాలను దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని... ● తల్లాడ మండలం కలకొడిమకు చెందిన మనుబోలు రామారావు తన ఇంటి మార్గంలోని రోడ్డుపై కొందరు కంప వేశారని ఫిర్యాదు చేయగా.. తక్షణ చర్యలు తీసుకోవాలని డీపీఓను కలెక్టర్ ఆదేశించారు. ● మధిర మండలం వెంకటాపురం, వంగవీడు, సిరిపురం రైతులు పాలవాగు వరద వెళ్లేలా పైపులు పాడైతే ఒక వైపే కొత్తవి వేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు వాగు వైపునకు రావటం లేదని పేర్కొనగా, పరిశీలించాలని సత్తుపల్లి ఈఈ ఆర్ అండ్ బీకి సూచించారు. ● ఖమ్మంకు దివ్యాంగుడు పగిళ్ల రాము ఉపాధి కోసం మీ సేవ సెంటర్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ● ఖమ్మంకు చెందిన నిరుపేద దివ్యాంగులు పది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు డి.నాగరాజు కోరారు. ● కొణిజర్ల మండలం పెద్దగోపతిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించగా.. కొణిజర్ల తహసీల్దార్ ఎన్.అరుణ అప్పటికప్పుడు కేంద్రాన్ని పరిశీలించారు. క్వింటాకు 10 కేజీల తరుగు తీస్తున్నారని, ఖాళీ గోనె సంచులను తిరిగి అప్పగించకపోతే రూ.85 చొప్పున చెల్లించాలని చెబుతున్నట్లు రైతులు వాపోయారు. దీంతో విచారణ జరిపిస్తామని ఆమె తెలిపారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర -
ప్రకృతి ఒడిలో ఆటపాటలు
సెలవుల నేపథ్యాన గ్రామాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో నీడ పట్టున ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఒకప్పుడు టీవీలు, మొబైళ్లకే పరిమితమైన చిన్నారులు ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో మైదానాల్లో గడుపుతున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగుతూ కొందరు.. పాత టైర్లతో ఆడుకుంటూ ఇంకొందరు సెలవులను ఆస్వాదిస్తున్నారు. –పాల్వంచరూరల్ / కరకగూడెం కరకగూడెం : పాత టైర్లతో ఆడుకుంటున్న బాలురు -
రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఆలయ అభివృద్ధికి మూడు దశల్లో రూ. 351 కోట్లను కేటాయించిన సంగతి విదితమే. ఇందులో కీలకమైన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో పనులకు రంగం సిద్ధం చేశారు. సుమారు రూ.200 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధంచేసి ఈనెల 9న టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 15వరకు సివిల్ పనులకు గడువు విధించారు. ఆతర్వాత పరిశీలించి ఖరారు చేస్తారు. భవనాల తొలగింపునకు సుమారు రూ.5 కోట్లు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చివేసి, వాటి శిఽథిలాలను తొలగించే పనులకు రూ.4,97,64,000కు టెండరు పిలిచారు. మొత్తం 1,058 నిర్మాణ పనులకు రూ.200 కోట్ల 89 వేలుగా ప్రతిపాదించారు. కాగా ఈ పనుల పూర్తికి 30 నెలల గడువు విధించారు. వచ్చే మార్చి నాటికి ఆలయ ప్రాంగణంలో పనులను పూర్తి చేసి గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే టెండర్ ప్రక్రియలో రెండున్నరేళ్ల గడువు విధించడంతో పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. -
లక్ష్యం మేర రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వాలు
ఖమ్మంసహకారనగర్/ఖమ్మంవైద్యవిభాగం: రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా శాఖల వారీగా కేటాయించిన సభ్యత్వాలు నమోదు చేయించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన కలెక్టరేట్లో సభ్యత్వాలపై సమీక్షించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉద్యోగులు సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే రెడ్‌క్రాస్ సొసైటీలో జిల్లా నుంచి కనీసం వేయి మంది ఉద్యోగులు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి ఖమ్మంసహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా తాజా ఓటరు జాబితాను 2002 నాటి జాబితాతో మ్యాపింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీసీ ద్వారా ఎస్ఐఆర్ మ్యాపింగ్‌పై సమీక్షించారు. రానున్న 15 రోజుల్లో 90 శాతం మ్యాపింగ్ పూర్తి చేసేలా ఉద్యోగులకు సూచనలు చేయాలని తెలిపారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో మ్యాపింగ్ 42 శాతం పూర్తయిందని, మరింత వేగం పెరిగేలా చూస్తామని వివరించారు. ఇంకా ఈ వీసీలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ -
మరిచిపోయిన బ్యాగ్ అప్పగించిన ఆటోడ్రైవర్
ఖమ్మంక్రైం: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను డ్రైవర్ తిరిగి అప్పగించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వారం గ్రామానికి చెందిన మాలోతు మంజుల వైద్యం కోసం ఖమ్మం వచ్చింది. పాత బస్టాండ్‌లో దిగాక ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా.. హడావుడిలో రూ.20 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయింది. కాసేపయ్యాక గుర్తించిన ఆమె ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అంతలోనే డ్రైవర్ కూడా బ్యాగ్ యాజమాని గుర్తింపునకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన బ్యాగ్‌ను మంజులకు అందజేశాడు. ఈ సందర్భంగా డ్రైవర్‌తో పాటు ట్రాఫిక్ సిబ్బందిని సీఐ సత్యనారాయణ అభినందించారు. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి వేంసూరు: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో సోదరి ఇంటికి వెళ్లి వస్తున్న ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మండలంలోని బీమవరం – మర్లపాడు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. రాయుడుపాలెం గ్రామానికి చెందిన విసంపల్లి మురళీకృష్ణ (30) తన తండ్రి రాములు, బాబాయి కొడుకు నాగేంద్రబాబుతో కలిసి నారాయణపురంలో ఉంటున్న అక్క వద్దకు ట్రాక్టర్లో వెళ్లాడు. సోదరికి సామగ్రి అప్పగించి తిరిగి రాత్రి 11 గంటలకు వస్తుండగా భీమవరం – మర్లపాడు మధ్య ఒక్కసారిగా ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ట్రాక్టర్ ఇంజన్ చెక్కపై కూర్చున్న మురళీకృష్ణ కింద పడడం, ఆయనపై ట్రక్కు పడడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కూసుమంచి: వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, తీర్చే మార్గం లేకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన దామళ్ల సుధాకర్ (49) తనకు ఉన్న కొంత భూమితో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, కొన్నేళ్లుగా దిగుబడులు రాక అప్పులు పెరిగిపోయాయి. అప్పుల విషయమై ఇంట్లో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన సుధాకర్ ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కల్లూరు: అన్నం వండే విషయమై భార్యభర్తల మధ్య వివాదం నెలకొనడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన మేకల చిన్ననాగయ్య ఆదివారం మధ్యాహ్నం అన్నం వండే విషయంలో భార్య సత్యవతి(40)ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యవతి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బడుల్లో సమ్మర్ క్యాంపులు
● 18 పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● నేటి నుంచి 25వ తేదీ వరకు శిక్షణ ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలలతో పాటు ఒక కేజీబీవీలో ఈ క్యాంపులను సోమవారం ప్రారంభిస్తారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు క్యాంపులు కొనసాగనున్నాయి. ఆటపాటలు.. విద్యాభివృద్ధి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా క్యాంపుల్లో శిక్షణ ఇస్తారు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, కథలు చెప్పడమే కాక చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్‌లో శిక్షణ ఉంటుంది. అంతేకాక చదువుపై ఆసక్తి కల్పించడం, ఆటపాటల ద్వారా అభ్యసనంపై అవగాహన కల్పిస్తారు. ప్రతీ క్యాంపులో నిపుణులైన నలుగురు ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఈ క్యాంపులు ప్రతీరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. పీఎంశ్రీ పాఠశాలల్లోని బాలబాలికలే కాక సమీప పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు కూడా ఈ క్యాంపులకు హాజరుకావొచ్చు. ప్రత్యేక నిధులు క్యాంపుల నిర్వహణకు ఒక్కో పాఠశాలకు రూ.50 వేల నిధులు కేటాయించారు. ప్రతీ క్యాంప్‌లో ఏవైనా నాలుగు కోర్సులకు సంబంధించి రిసోర్స్ పర్సన్లు లేదా మాస్టర్ ట్రెయినర్లు, వృత్తి నిపుణులను నియమించుకోవచ్చు. ఈ మేరకు 15 రోజులకు గాను ఒక్కొక్కరికీ రూ.3 వేల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బాలబాలికల శిక్షణకు ఉపయోగపడే చార్టులు, స్కెచ్‌లు, పేపర్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలు వెచ్చించాలి. అంతేకాక ఫ్లెక్సీలు ఏర్పాటుకు రూ.3,500 కేటాయించారు. అలాగే, క్యాంప్‌లకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ అందిస్తారు. వంట పనుల్లో సాయపడే ఇద్దరు వర్కర్లకు రూ.వేయి చొప్పున చెల్లించాలి. ఈ బాధ్యతలన్నీ సమ్మర్ క్యాంప్ కొనసాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిర్వర్తించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించే సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెంచేలా శిక్షణ ఉంటుంది. ఆటపాటలతో పాటు ఇతర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తాం. సెలవుల్లో ఈ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –పెసర ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఇన్‌స్ట్రక్టర్ల నియామకం వంటి పనులు పూర్తయ్యాయి. 15 రోజుల పాటు కొనసాగే క్యాంపులను పర్యవేక్షిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తాం. –చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూ లమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అంజన్నకు రామయ్య పట్టు వస్త్రాలు.. భద్రాచలంటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ఈఓ కే. దామోదర్ రావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. నేటి నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ఇల్లెందురూరల్: ఏఐయూకేఎస్ జాతీయ ప్రథ మ మహాసభలు ఈనెల 11, 12, 13 తేదీలలో ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ రంగయ్య తెలిపారు. ఇల్లెందులో ఆది వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. మొదటి రోజు సాయంత్రం ఇల్లెందు జేకే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరు వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలులో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. -
పెద్దమ్మతల్లి గుడి వద్ద కూలిన వృక్షం
పాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మగుడి) సమీపాన సంతానం లేని మహిళ భక్తులు ఊయ్యాలతొట్టి కట్టే 63 ఏళ్ల నాటి వృక్షం (రావిచెట్టు) గాలివానకు శనివారం రాత్రి నేలకూలింది. ఈ చెట్టు కొమ్మలు ఆలయ ప్రాంగణంలో రేకులషెడ్‌పై పడడంతో దెబ్బతిన్నాయి. ఆలయం వద్ద1963లో నాటిన వేప, రావిచెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. రెండూ కలిసి ఉండడంతోఅశ్వాత్థామ వృక్షంగా భావించి ఏటా అశ్వత్థామకల్యాణం నిర్వహిస్తారు. ఈ వృక్షం చుట్టూభక్తులు ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక గద్దె,చుట్టూ స్టీల్ రెయిలింగ్ నిర్మించారు. శనివారంరాత్రి భారీగా గాలివానకు వృక్షం నేలకూలింది. వేపచెట్టు మాత్రం అలాగే ఉంది. చెట్టు కొమ్మలు పడటంతో షెడ్ కొంతభాగందెబ్బతిన్నది. స్టీల్ రెయిలింగ్ ఒకవైపు విరిగిపోయింది. అంతేకాక విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే, రాత్రి కావడంతోఎవరూ లేకపోగా పెనుప్రమాదం తప్పినట్లయింది. -
12 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
చింతకాని: మండలంలోని సీతంపేటకు చెందిన రైతులు పోలూరి పుల్లారావు, మోహన్‌రావు, మాగు నూరి కొండల్రావు 12 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట ఆదివారం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. సమీప రైతులు చేన్లలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడుతూ మోహన్‌రావు, కొండల్రావు మొక్కజొన్న పంటకు వ్యా పించాయి. ఈ విషయమై సమాచారం తెలిసి రైతు లు వెళ్లేలోగా రూ.10లక్షల విలువైన పంట కాలిపోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. పిండిప్రోలు కళాశాలలో ఫర్నిచర్ నిధులు స్వాహా? తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ కొనుగోలు సందర్భంగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నిధులను అక్రమంగా డ్రా చేశారని పలువురు విమర్శిస్తున్నా రు. ఈ విషయమై 9న తిరుమలాయపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వాతి ఫిర్యాదు చేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి బదిలీపై వెళ్లే సమయాన ఖాళీ చెక్కు లపై సంతకాలు చేయించుకొని సుమారు రూ.10 లక్షలు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని తెలిపారు. పాత ఫర్నిచర్, ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఉన్నా కొత్త వస్తువులను ఎక్కువ ధరతో కొనుగోలు చేసి కమీషన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన మంత్రి నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి సత్తుపల్లి: మండలంలోని కాకర్లపల్లిలో విద్యుదాఘాతం కారణంగా ఆదివారం రెండు పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. గ్రామ రైతు పువాళ్ల ప్రసాద్ కు చెందిన రెండు పాడి గేదెలు మేతకు వెళ్తూ ఇంటికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను తాకాయి. దీంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. రూ. 1.50 లక్షల విలువైన పాడిగేదెలు మృతి చెంది నందున తనను ఆదుకోవాలని రైతు ప్రసాద్ కోరాడు. -
పల్లెలకు ఆర్టీసీ కళ..
నూతన సర్వీసుల వివరాలు.. ఖమ్మం నుంచి బోనకల్ వెళ్లే ప్రయాణికుల కోసం నాగులవంచ, రామాపురం, గార్లపాడు, రావినూతల మీదుగా కొత్త సర్వీసు మొదలుకానుంది. ఈ బస్సు బోనకల్ నుంచి ఉదయం 8 గంటలకు మొదలై రామాపురం నుంచి ఖమ్మం చేరుకుంటుంది. సాయంత్రం 4.15 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి ఇదే మార్గంలో బోనకల్ వెళ్తుంది. అలాగే, ఖమ్మం – పందిళ్లపల్లి – మత్కేపల్లి మీదుగా గంధసిరి గ్రామానికి కొత్త సర్వీ సు ప్రారంభిస్తున్నారు. ఖమ్మం నుంచి ఉదయం 7.15, మధ్యాహ్నం 3.40 గంటలకు మొదలయ్యే ఈ బస్సులు, గంధసిరి నుంచి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. పునరుద్ధరించిన సర్వీసులు ప్రయాణికుల వినతితో పెద్దమండవ, చిన్నమండవ చింతకాని, పమ్మి గ్రామాలకు గతంలో నడిచిన బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఖమ్మం నుంచి ఉదయం 8.30, సాయంత్రం 4.30 గంటలకు పెద్దమండవకు బస్సులు మొదలవుతాయి. అలాగే, పెద్దమండవ నుంచి ఉదయం 9.50, సాయంత్రం 5.30 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి. అంతేకాక చిన్నమండవకు ఖమ్మం నుంచి ఉదయం 8.55 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, చిన్నమండవ నుంచి ఉదయం 10.05 గంటలకు, రాత్రి 7.40 గంటలకు బస్సులు మొదలవుతాయి. ఖమ్మం నుంచి చింతకానికి ఉదయం 7 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు, చింతకాని నుంచి ఖమ్మంకు ఉదయం 8, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు ఉంటాయి. అలాగే, ఖమ్మం నుంచి పమ్మికి ఉదయం 7.55 గంటలకు, సాయంత్రం 4.25 గంటలకు.. తిరుగు ప్రయాణంలో పమ్మి నుంచి ఉదయం 8.55, సాయంత్రం 5.30 గంటలకు బస్సులు బయలుదేరతాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఖమ్మం ఆర్టీసీ డిపో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా నూతన సర్వీసుల ఏర్పాటుకు నిర్ణయించారు. అంతేకాక గతంలో నిలిచిపోయిన సర్వీసులను సైతం పునరుద్ధరించనున్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళలకు బస్సుల షెడ్యూల్ రూపొందించగా సోమవారం నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. – ఖమ్మంమయూరిసెంటర్గ్రామాల్లోని విద్యార్థులు, సామాన్య ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త సర్వీసు లు ఏర్పాటు చేయడమే కాక పాత సర్వీసులను పునరుద్ధరించాం. తద్వారా విద్యార్థులు, ఉద్యోగులే కాక రైతు లు, చిరువ్యాపారులు నగరానికి వచ్చి వెళ్లడం సులభమవుతుంది. ప్రజలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుని సంస్థకు సహకరించాలి. –శివప్రసాద్, డీఎం, ఖమ్మం -
ఈత సరదా.. కావొద్దు బాధ
● వేసవి సెలవుల్లో నేర్చుకునేందుకు పిల్లల ఆసక్తి ● తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ప్రాణాలు పదిలం ● తల్లిదండ్రులు, నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి ఇల్లెందురూరల్: వేసవి వచ్చిందంటే ఉక్కబోత కారణంగా పిల్లలు ఈత కొట్టాలని ఆసక్తి కనబరుస్తుంటారు. ఇందులో పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్‌లు అందుబాటులో ఉన్నా.. గ్రామాలకు వచ్చేసరికి బావులు, చెరువులను ఆశ్రయిస్తారు. అయితే, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు దరి చేరడమే కాక ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. ఈ నేథ్యాన తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈత నేర్పించడం సులువవుతుంది. అవగాహన లేక ఇల్లెందు మండలం హనుమంతులపాడుకు చెందిన ఊకం సాగర్ (14) నాలుగు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకున్నా రక్షణ పరికరాలు లేకుండా బావిలోకి దూకగా మునిగిపోయాడు. రెండేళ్ల క్రితం మామిడిగుండాల గ్రామానికి చెందిన ఎర్రిపోతు భిక్షపతి ఈత రాకున్నా డబ్బా నడుముకు కట్టుకొని బావిలోకి దిగాడు. డబ్బా మధ్యలోనే జారిపోవడంతో మృత్యువాత పడ్డాడు. గతేడాది ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం రాంబాబు చెరువులో చేపలు పడుతుండగా గడ్డిజాతి తీగలు కాళ్లకు చుట్టుకొని నీట మునిగిపోయి మృతిచెందాడు. తల్లిదండ్రుల్లో మార్పు తల్లిదండ్రుల దృక్పథం గతంతో పోలిస్తే మారింది. ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తాం చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మాత్రమే భావిస్తున్నారు. మిగతా క్రీడలతో పాటు ఈత వంటి సంప్రదాయ, అభిరుచి ఉన్న ఆటల వైపు ప్రోత్సహించడం లేదు. పాఠశాలలు, శిక్షణలు, ప్రత్యేక తరగతుల పేరుతో యవ్వన దశ దాటేస్తుండగా.. నడి వయస్సులో ఈత నేర్చుకునే అవకాశం ఉన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. అప్రమత్తత తప్పనిసరి తల్లిదండ్రులు తమ సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. లేదంటే అనుభవం ఉన్న వారితో తర్ఫీదు ఇప్పించాలి. ఆడా, మగ తేడా లేకుండా పిల్లలకు తప్పనిసరిగా ఈత నేర్పితే భవిష్యత్‌లో నీటి ప్రమాదాలకు ఆస్కారముండదు. ఈతరాని వారు నీటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అడుగంటిన బావులు, చెరువులలో నీరు కలుషితంగా మారి అందులో ఈత కొడితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మంచినీరు ఉన్న బావులు, చెరువులనే ఎంచుకోవాలి. అంతేకాక బుర్రలను కట్టుకొని దిగితే నీటిలో తడిసి, బుర్రకాయకు రంధ్రాలు ఉంటే చిన్నారులు మునిగే అవకాశముంది. అందుకే సొరకాయ బుర్రలు, డబ్బాలకు బదులు నాణ్యమైన, సరిపడా సైజ్ కలిగిన ట్యూబ్‌లను వాడాలి.వేసవిలో పిల్లలకు ఈత సరదాగా ఉంటుంది. ఈత మంచిదే అయినా ఆరోగ్యకరమైన చికాకులు కూడా ఉంటాయని పెద్దలు గుర్తించాలి. కలుషిత నీటి వల్ల కంటి సంబంధ, చర్మ, అతిసారా వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మంచినీరు ఉన్న వనరులను ఎంచుకోవడమే కాక నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటే ప్రమాదాలను అధిగమించవచ్చు. –డాక్టర్ మోతీలాల్, చిన్నపిల్లల వైద్యుడు, ఇల్లెందు -
ఘనంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రగిరి క్షేత్రంలో గోదావరి నదీ తీరం భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రీ సీతా రామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమికి ఆదివారం నిర్వహించిన నదీహారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత గణపతి పూజ నిర్వహించి, అనంతరం దీపోత్సవం చేపట్టారు. భక్తులు వెలిగించిన దీపాలతో గోదావరి మాతకు, శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. చిన్నారుల భరత నాట్య ప్రదర్శన అలరించింది. కుంచాల రాజశేఖర్ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ సభ్యులు పూజా సామగ్రిని సమకూర్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజ్జుల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, తేజశర్మ, కృష్ణశర్మ పాల్గొన్నారు. -
జీవాలే నేస్తాలు
బాహ్య ప్రపంచానికి దూరంగా, ప్రకృతి ఒడిలో పెరిగే కొండరెడ్డి చిన్నారుల జీవనశైలికి ఈ చిత్రం అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు ఆడుకోవడానికి అనేక సౌకర్యాలు, సామగ్రి అందుబాటులో ఉంటాయి. కానీ కొండరెడ్ల చిన్నారులు మాత్రం అవేమీ లేక మేకపిల్లలతో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదే సమయాన పెద్దలంతా పనికి వెళ్తే వీళ్లే మేకల పిల్లలను సంరక్షిస్తున్నట్లవుతుంది. అశ్వారావుపేట మండలంలోని కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిలో ఈ దృశ్యం కనిపించింది. – అశ్వారావుపేటరూరల్ -
పచ్చిరొట్ట విత్తనాలు రెడీ..
● 50శాతం సబ్సిడీతో నేటి నుంచి పంపిణీ ● సహకార సంఘాలు, ఆగ్రోస్ సంస్థల ద్వారా సరఫరా ● ఉమ్మడి జిల్లాలో 18,440 క్వింటాళ్లకు ఇండెంట్ఖమ్మంవ్యవసాయం: పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధమైంది. సేంద్రియ విధానంలో భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట సాగు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలుగా వినియోగించే వరి, అపరాలు, నూనె గింజల పంటలు, ఉద్యాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నుతారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయి. ఈమేరకు ఏటా మాదిరిగానే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అటు సబ్సిడీ.. ఇటు ధర భారం పచ్చిరొట్ట విత్తనాలకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఈ ఏడాది 50 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఈ విధానంలో జీలుగు, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయనున్నారు. అయితే, పచ్చిరొట్ట విత్తనాల ధరలు మూడేళ్లుగా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తున్నా ధరలు పెరగడంతో రైతులకు అంతగా ప్రయోజనం కలగటం లేదు. విత్తన ధర క్వింటాకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుండగా, సబ్సిడీ పోగా రైతులు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు రైతులు రసాయన ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువగా జీలుగు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 18,340 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కావాలని ఇండెంట్ పెట్టారు. అధికంగా 16వేల క్వింటాళ్ల జీలుగు విత్తనాలు అవసరమని అందులో పేర్కొన్నారు. అలాగే, జనుము 1,760 క్వింటాళ్లు, పిల్లి పెసర 680 క్వింటాళ్లకు అవసరమని తెలిపారు. ప్రస్తుతం విత్తనాభివృద్ధి సంస్థ వద్ద 500 క్వింటాళ్ల జీలుగు, 150 క్వింటాళ్ల జనుము విత్తనాలు ఉండగా, పంపిణీ చేస్తుంటే దశల వారీగా చేరనున్నాయి. ఈ విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా సోమవారం నుంచి పంపిణీకి నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 75 సహకార సంఘాలు, ఏడు ఆగ్రోస్ రైతు సేవా సంస్థలు, భద్రాద్రి జిల్లాలో 20 సహకార సంఘాలు, రెండు ఆగ్రోస్ రైతు సేవా సంస్థల ద్వారా పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఈ విత్తనాలను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సేకరించి సరఫరా చేస్తుంది.వ్యవసాయ శాఖ ఇచ్చిన ఇండెంట్ మేరకు పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే విత్తనాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేశాం. ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో విత్తనాలు సిద్ధంగా ఉంటాయి. – ఎన్.భిక్షం, విత్తనాభివృద్ధి సంస్థ, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్ -
తాలు పేరుతో కోత విధించొద్దు
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం సహకారనగర్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాక తాలు పేరుతో కోత విధించొద్దని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఆదివారం ఆయన పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిర్దిష్ట కారణాలు లేకుండా తిరస్కరించొద్దని తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని భావిస్తే జిల్లా పౌర సరఫరాల అధికారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత సాంకేతిక సహాయ కమిటీ పరిశీలించి నాణ్యత ప్రమాణాలు లేవని నిర్ధారణ అయితేనే ధాన్యాన్ని తిరస్కరిస్తామని తెలిపారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరిగేలా హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ చందన్ కుమార్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మళ్లీ బ్రేక్ వైరా: ఫాస్ట్‌ట్రాక్‌కు సంబంధించి సర్వర్ మొరాయించడంతో ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆదివారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇదే సమస్య ఏర్పడగా సరిచేశారు. మళ్లీ ఆదివారం కూడా సర్వర్‌లో అంతరాయం ఏర్పడడంతో హైవే మార్గంలోని వైరా మండలం సోమవరం ఎగ్జిట్ పాయింట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో మండుటెండలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈమేరకు అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో రాకపోకలు మొదలయ్యాయి. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.25,370 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,632 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
నాడు కొత్తగూడెమే టాప్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నడుస్తోంది. 2021లో జరగాల్సిన గణన ఐదేళ్లు ఆలస్యంగా మొదలైంది. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించనున్నారు. అయితే, తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన జనగణన 1961లో జరిగింది. అప్పటి విశేషాలు, ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం. ఏడు తాలూకాలతో.. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించి 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. ఇందులో ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ (కొత్తగూడెం) తాలుకాలు ఉన్నాయి. ఆ తర్వాత 1959లో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం, నుగూరు తాలూకాలను కూడా ఖమ్మం జిల్లాలో చేర్చారు. భద్రాచలం, నుగూరు (వాజేడు, వెంకటాపురం మండలాలతో కూడిన ఉప తాలూకా)లు పూర్తిగా ఏజెన్సీ తాలూకాలుగా ఉండేవి. పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జన గణన 1961లో జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనాభా 10,57,542గా తేలింది. 1990 వరకు అప్రతిహతంగా అభివృద్ధి 1960 నుంచి 1990 వరకు కొత్తగూడెం పట్టణం అప్రతిహతంగా అభివృద్ధి పథంలో నడిచింది. కిన్నెరసాని ప్రాజెక్ట్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ల రాకతో పాల్వంచ సరికొత్త పట్టణంగా రూపాంతరం చెందింది. స్పాంజ్ ఐరన్, ఏపీ స్టీల్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కిన్నెర స్టీల్స్, బేరియం ఫ్యాక్టరీ, మైలారం రాగి గనులు, నవభారత్ వంటి ప్రైవేటు రంగ సంస్థలతో 90వ దశకం నాటికి ఖమ్మంపై కొత్తగూడెం అన్ని రంగాల్లో పైచేయి సాధించింది. మరోవైపు సింగరేణి గనుల కారణంగా కొత్తగూడెం, ఇల్లెందుకు తోడుగా మణుగూరు కూడా పట్టణ ప్రాంతంగా వృద్ధికి వచ్చింది. పేపర్ బోర్డు కారణంగా సారపాక–భద్రాచలం, ఉద్యాన పంటల కారణంగా అశ్వారావుపేట పారిశ్రామిక ప్రాంతాలుగా ఎదిగాయి. 90వ దశకం నుంచి దూసుకొస్తున్న ఖమ్మం ఆర్థిక సంస్కరణలు 1990లో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. అప్పటికే ఉన్న గ్రానైట్, ఆగ్రో ఇండస్ట్రీస్, మార్కెట్లు ఖమ్మం అభివృద్ధికి తోడ్పడ్డాయి. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు ఏరియాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడం, 1/70 చట్టం కారణంగా ఇక్కడున్న ఉద్యోగులు, కార్మికులకు సొంతిళ్లు కట్టుకునేందుకు ఖమ్మమే అనువైన ప్రాంతంగా కనిపించింది. వెరసి ప్రస్తుతం ఖమ్మం నగర జనాభా (మున్నేరు ఆవల కలుపుకుని) దాదాపు నాలుగు లక్షలకు మించింది. తెలంగాణాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలిచింది. నిజామాబాద్, కరీంనగర్‌లకు గట్టిపోటీ ఇస్తోంది. పూర్వ వైభవం వచ్చేనా..? కొత్తగూడెంలో ఉన్న అనేక ప్రైవేటు, ప్రభుత్వ పరిశ్రమలు 1990 తర్వాత మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది. 2016లో కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడం, మెడికల్ కాలేజీ, పోలీస్ బెటాలియన్, యూనివర్సిటీ వంటివి రావడంతో కొంత మేరకు నష్ట నివారణ జరిగింది. అయినా ఖమ్మానికి పోటీ ఇచ్చే స్థితిలో కొత్తగూడెం లేదు. కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చంచుపల్లి, రుద్రంపూర్లను కలిపినా కొత్తగూడెం అర్బన్ జనాభా మూడు లక్షలకు మించడం లేదు. సీతారామ ద్వారా గోదావరి జలాలు అందివ్వడం, ఉద్యోగులు సొంతింటి కల సాకారమయ్యేలా చూడటం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తేవడం, జాతీయ రహదారుల ఆధారంగా కొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ఎకో–టెంపుల్ టూరిజంపై ఫోకస్ చేయడం వంటి చర్యల ద్వారా భద్రాద్రి కొత్తగూడేనికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.జనగణన–1961 జరిగే సమయానికి కొత్తగూడెం పట్టణం ఇటు జనాభా, అటు విస్తీర్ణం పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నంబర్ వన్ స్థానంలో ఉంది. కొత్తగూడెం మున్సిపాలిటీ 69,728 మంది జనాభాతో క్లాస్–2 మున్సిపాలిటీ ఉండగా, ఖమ్మం 35,888 జనాభాతో క్లాస్–3 మున్సిపాలిటీగా ఉంది. ఖమ్మానికి పాలక మండలి ఉండగా, కొత్తగూడేనికి లేదు. ఆ తర్వాత ఇల్లెందు 10,955 మంది జనాభాతో క్లాస్–4 మున్సిపాలిటీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక మున్సిపాలిటీ కేటగిరిలోకి రాకుండా 6,059 జనాభాతో మధిర, 5,740 జనాభాతో భద్రాచలం పట్టణ ప్రాంతాలుగా నిలిచాయి. 1953లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆవిర్భావం -
నిప్పుల కుంపటి
● 43 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ● వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరిఖమ్మంవ్యవసాయం: భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతల ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్ది రోజులుగా జిల్లా అంతటా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే మొదలవుతున్న ఎండ ప్రభావం సాయంత్రం 5గంటల వరకు కూడా కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ ఎండకు తోడు వడాగాలుల తీవ్రతతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. యాసంగి పంటలు చేతికి అందుతున్న వేళ వ్యవసాయ కూలీలు, రైతులు సైతం ఉదయం, సాయింత్రమే పనులు చేసుకుంటున్నారు. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి ఎండతీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్దులు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పగలు, రాత్రీ తేడా లేకుండా కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి తరచూ విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే, రాత్రివేళ లోవోల్టోజీ సమస్య వేధిస్తోంది. విద్యుత్ వినియోగం పెరగడంతోనే ఈ సమస్య వస్తోందని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. గరిష్టంగా గుబ్బగుర్తిలో.. కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో ఆదివారం గరిష్టంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, తిమ్మారావుపేట, పమ్మిలో 42.8, బాణాపురం, నేలకొండపల్లిలో 42.6, రావినూతలలో 42.5, వైరా(ఏఆర్ఎస్)లో 41.8, ప్రకాష్‌నగర్‌లో 41.3, కూసుమంచిలో 41.2, వైరాలో 41.1 మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కొణిజర్లలో 40.9, మధిరలో 40.7, ఖమ్మం ఖానాపురం, ఏన్కూరులో 40.6, గౌరారం, సిరిపురంలో 40.5, కుర్నవల్లిలో 40.4, పంగిడిలో 40.3, లింగాల, నాగులవంచలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్టంగా వేంసూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మొదలుపెడదామా!
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో జనగణనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లుచేసింది. రెండు దశల్లో గణన చేపట్టనుండగా. తొలిదశ సోమవారం మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో ప్రతీ 300 ఇళ్లను కలుపుతూ బ్లాక్‌లుగా రూపొందించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి మ్యాపింగ్ చేశారు. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ ప్రారంభిస్తారు. గతంలో మాదిరి మాన్యువల్‌గా కాకుండా ఈసారి వివరాలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసేలా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 2,669 మంది ఎన్యుమరేటర్లు జిల్లాలో జనగణనకు సంబంధించి ఇప్పటికే 2,651 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్‌ల్లో సర్వే కోసం 2,669 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. అలాగే, ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉండేలా 485 మందికి విధులు కేటాయించారు. తొలి దశలో 31 ప్రశ్నలకు ప్రజల నుండి వివరాలు సేకరిస్తారు. ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరు ఉన్నా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే వచ్చేనెల 9వ తేదీ వరకు జరగనుండగా, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 19వేల కుటుంబాలు స్వీయగణన జనగణనలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈమేరకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఆదివారం రాత్రి 11–59 గంటలకు గడువు ముగిసింది. ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలో 19వేల మందికి పైగా స్వీయగణన పూర్తి చేసుకున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే 3,500కు మందికి పైగా స్వీయగణన చేసుకున్నారు. కేఎంసీలో భారీ నెట్వర్క్ ఖమ్మం నగరంలో జనగణన సర్వే పారదర్శకంగా చేపట్టేలా 524 హెచ్ఎల్బీ(హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్) లుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌లో సుమారు 290 ఇళ్లు, 800 మంది జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక సర్వే కోసం ఉపాధ్యాయులు 524మందిని ఎన్యుమరేటర్లను నియమించారు. గణనకు అవసరమైన కిట్లు, మ్యాపులను ఇప్పటికే అందజేశారు. సర్వేలో పొరపాట్లు జరగకుండా కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సూపర్వైజర్ల పనితీరును పర్యవేక్షించేందుకు కేఎంసీకి చెందిన 22 మంది అధికారులను కేటాయించారు. అంతేకాక డిప్యూటీ, అదనపు కమిషనర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీవ్రమైన ఎండల నేపథ్యాన సర్వే ఉదయాన్నే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సిబ్బంది అస్వస్థతకు గురైనా, ఎవరైనా గైర్హాజరైనా ఆ ప్రాంతంలో సర్వే నిలిచిపోకుండా రిజర్వ్‌గా ఉన్న ఎన్యుమరేటర్లను కేటాయించేలా మానిటరింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.జనగణన వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్ఎల్ఓ సెన్సెస్–2027 పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఎన్యుమరేటర్లు తాము సర్వే చేసిన కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆదివారం అర్ధరాత్రి 11–59 గంటల తర్వాత ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చే ఈ యాప్‌ను సోమవారం ఉదయం ఎన్యుమరేటర్లు ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆతర్వాత ఎన్యుమరేటర్‌కు కేటాయించిన ఐడీతో పాస్వర్డ్ రూపొందించుకుని వివరాల నమోదు ఆరంభించాల్సి ఉంటుంది.జనగణన సర్వేకు వేళాయె.. జనగణనకు సంబంధించి విధులు కేటాయించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. వీరంతా సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. తొలి మూడురోజులు హౌస్ లిస్టింక్ బ్లాక్‌లను పరిశీలించనున్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లో ఉన్న కుటుంబాల సంఖ్య, వివరాలను నమోదు చేసుకుంటారు. ఏదైనా బ్లాక్‌లో 300 ఇళ్ల కన్నా ఎక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తగ్గించాల్సి ఉంటుంది. 310– 320 కుటుంబాలు ఉంటేనే ఎన్యుమరేటర్లు సర్వే చేయాలని సూచించారు. అంతకు మించి కుటుంబాల సంఖ్య ఉంటే మాత్రం మరో భాగంగా విభజించి అదనపు ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. -
నేటి నుంచి విద్యా వారోత్సవాలు
● ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహణ ● రోజుకొక కార్యక్రమంతో షెడ్యూల్ ఖరారు ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల నిర్వహణకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వార్యన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేయడమే కాక ప్రవేశాల పెంపునకు కార్యాచరణ రూపొందించారు. ఇదీ షెడ్యూల్.. సోమవారం (ఈ నెల 11వ తేదీ): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, నూతన నిర్మాణాలే కాక అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యాన చేపట్టే పనులను ప్రారంభిస్తారు. అలాగే, 18 పీఎంశ్రీ పాఠశాలలు, ఒక కేజీబీవీలో రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్‌లను ప్రారంభిస్తారు. ●మంగళవారం (12వ తేదీ): పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెండు సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఇందుకోసం కూసుమంచి, రఘునాథపాలెం జెడ్పీహెచ్ఎస్లను ఎంపిక చేశారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేస్తారు. అలాగే, మధ్యాహ్న భోజనం, స్టేషనరీ కింద రూ.వంద, రవాణా అలవెన్స్‌గా ప్రతీ విద్యార్థికి రూ.వేయి నగదు అందజేస్తారు. ఈ క్యాంప్‌ల నిర్వహణతో సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ●బుధవారం (13వ తేదీ): ప్రతీ మండలస్థాయిలో సర్పంచ్‌లకు వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలను వారికి వివరిస్తారు. అంతేకాక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు సహకరించాలని వివరిస్తారు. ●గురువారం (14వ తేదీ): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యాన బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు చేపడుతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో అల్పాహారం అందించే అంశాన్ని వివరిస్తారు. డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను తిరిగి చేర్పించడంతో పాటు సున్నా ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ●శుక్రవారం (15వ తేదీ): విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదో రోజున లైబ్రరీ డేగా నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రతీ పాఠశాలలో ఉన్న గ్రంథాలయ సదుపాయంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక దాతల నుంచి పుస్తకాలు స్వీకరిస్తారు. ●శనివారం (16వ తేదీ): విద్యార్థులకు జిల్లాస్థాయి ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు. మండలాల్లో విజేతలను ఆహ్వానించి జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాక విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఖమ్మం మామిళ్లగూడెంలోని బాల భవన్లో జరగనుంది. ●ఆదివారం (17వ తేదీ): వారోత్సవాల్లో ముగింపును చివరి రోజు ఘనంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా పదో తరగతిలో జిల్లాస్థాయి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి అభినందిస్తారు.నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఎంఈఓలు, హెచ్ఎంలతో పాటు విద్యాశాఖ బాధ్యులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశాం. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలి. –చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి -
రేపటి నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయడంతో పాటు దిగుమతి సుంకాలు తగ్గించడం, ఆపై అమెరికా నుంచి దిగుమతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ తరుణాన ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇల్లెందులో నిర్వహించే ఏఐయూకేఎస్ ప్రథమ జాతీయ మహాసభలు కీలకంగా మారనున్నాయని తెలిపారు. ఈ సభల్లో రైతుల సమస్యలపై చర్చించడమే కాక భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తొలిరోజైన సోమవారం ఇల్లెందులో ర్యాలీ, సింగరేణి మైదానంలో బహిరంగ సభ ఉంటాయని తెలిపారు. ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించే సభలో జాతీయ నాయకులు ప్రదీప్‌సింగ్‌ఠాగూర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొంటారని, సభలను జయప్రదం చేసేందుకు మేధావులు, రైతులు, ప్రజలు తరలిరావాలని కోరారు. సమావేశంలో నాయకులు మలీదు నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, పాశం అప్పారావు, కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..
● ఈనెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తిరుమలాయపాలెం: రైతులు యాసంగిలో పండించిన వరి, మొక్కజొన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. ఈ విషయంలో రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించాక మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు కల్లాల వద్దకు వచ్చి ప్రభుత్వంపై బురద చల్లుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. గతంలో రైతులకు బేడీలు వేసిన వారు నేడు కొనుగోలు కేంద్రాల వద్ద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే, తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. అందుకే రుణమాఫీ చేయడంతో పాటు సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. కాగా, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాదర్బార్లలో 14,700 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, ఉచిత విద్యుత్ కోసం ఉన్నాయని చెప్పారు. అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తూ, మిగతావి మూడు నెలల్లో పరిష్కరించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధి దారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అర్హులందరికీ దశల వారీగా ఇళ్లు కేటాయిస్తామని, రెండో విడతగా ఈ నెలాఖరు నుంచి మంజూరు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బంది పడుతున్నందున తాము ‘భూ భారతి’కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంతో పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, మొక్కజొన్న అమ్మి నెల దాటినా డబ్బు జమ కాలేదని, పంటను వెంటనే గోదాంలకు తరలించాలని రైతులు, నాయకులు, తహసీల్ భవనం 11 నెలల అద్దె ఇప్పించాలని యజమాని మంత్రి పొంగులేటికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ రాంబాబు, విద్యుత్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి చందన్‌కుమార్, డీఆర్డీఓ శ్రీరామ్, మద్దులపల్లి మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు హరినాథ్‌బాబు, చావా శివరామకృష్ణ, నాయకులు, ప్రజాప్రతినిధులు రామసహాయం నరేశ్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, మంగీలాల్, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
●సమన్వయంతో సంతోషం
::.. తడికెళ నవ్యజ్యోతి, కేఎంసీ డీఈ ఖమ్మంమయూరిసెంటర్: ఇంట్లో గృహిణిగా, అమ్మగా, ఉద్యోగినిగా పలువురు మహిళలు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డీఈ తడికెళ నవ్యజ్యోతి వెల్లడించారు. కుటుంబంపై ప్రేమ, సమాజంపై బాధ్యతే మహిళా ఉద్యోగులను ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే తాను కుటుంబంతో, బాధ్యతల పరంగా కార్యాలయంలో సజావుగా పని చేయగలుగుతున్నానని చెప్పారు. విధుల నిర్వహణ సమయాన అక్కడి సమస్యలే తన దృష్టిలో ముఖ్యమని, ఇంటికి వెళ్లాక మాత్రం పిల్లలు, భర్త, కుటుంబమే సర్వస్వమని తెలిపారు. ఇలా ప్రతీఒక్కరూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చని వెల్లడించారు. ‘అమ్మ’ అనే పదంలో అపారమైన ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యత దాగి ఉన్నాయని.. ప్రతీ కుటుంబానికి అమ్మ ఒక బలమైన ఆధారమని చెప్పారు. తాను సైతం ఆమె స్ఫూర్తితోనే ఉద్యోగం, కుటుంబ జీవనంలోనూ రాణిస్తున్నట్లు తెలిపారు. -
ఐదెకరాల భూమి.. రూ.కోటి విరాళం
చింతకాని: చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యాన శ్రీ సత్యసాయి ప్రేమామృత విద్యాల యం, ప్రకృతి వైద్యాలయం ఏర్పాటుకు శని వారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవాసంస్థల జిల్లా బాధ్యులు మాట్లాడుతూ విద్యాలయంలో కేజీ నుంచి పీజీ వరకు మానవతా విలువలతో కూడిన ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. అంతేకాక కంప్యూటర్ విద్య, అగ్రిటెక్‌లో శిక్షణ కూడా ఉంటుందన్నారు. కాగా, విద్యాలయం ఏర్పాటుకు నాగులవంచ గ్రామానికి చెందిన చల్లా కోటయ్య ఐదెకరాల భూమి, నిర్మాణానికి సేవాసంస్థల మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మాధవరపు నాగేంద్ర రూ.కోటి విరాళంగా అందజేశారని తెలిపారు. అనంతరం పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. నాగులవంచ, సీతంపేట సర్పంచ్‌లు నారగాని రాంబాయి, ఆళ్ల మణి, వీవీసీ సంస్థల చైర్మన్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐ బయ్యన బాబూరావు, సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షుడు దమ్మాలపాటి సుధాకర్‌తో పాటు వంగవేటి భాస్కర్‌రావు, భిక్షమయ్య గురూజీ, సభ్యులు పాల్గొన్నారు.నాగులవంచలో సత్యసాయి విద్యాలయానికి భూమిపూజ -
విద్యావారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
● వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తిరుమలాయపాలెం: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీసీ ద్వారా జనగణన, ఫార్మర్ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోళ్లు, విద్యా వారోత్సవాలపై సమీక్షించగా, తిరుమలాయపాలెం తహసీల్ నుంచి కలెక్టర్ దివాకర టీ.ఎస్. పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యా వారోత్సవాల్లో రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. ఆ తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణనపై సూచనలు చేశారు. డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, సీపీఓ శ్రీనివాస్, డీఈఓ చైతన్యజైనీ తదితరులు పాల్గొన్నారు.జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలోని స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామి వారి పాదాలకు తెల్లవారుజామునే అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం పల్లకీసేవ నిర్వహించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి మధిర: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి ఈనెల 13న పాలిసెట్ జరగనుండగా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా సమన్వయకర్త కె.సాంబయ్య తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఖమ్మంలో ఆరు, మధిరలో మూడు ఏర్పాటుచేశామని వెల్లడించారు. మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, టీవీఎం స్కూల్, సీపీఎస్ స్కూల్‌తో పాటు ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్, ఎస్బీఐటీ, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో 3,696 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులను 11 గంటల వరకే అనుమతిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. రహదారిని పరిశీలించిన ఆర్అండ్బీ ఈఎన్సీ చింతకాని: మండలంలోని మత్కేపల్లిలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి జగన్నాథపురం వరకు ఇటీవల నిర్మించిన బీటీ రహదారిని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జోగారెడ్డి శనివారం పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో ఈ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగారహదారి నాణ్యత, వ్యవసాయ బావుల వద్ద గోడల నిర్మాణం, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుపై సూచనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్‌బాబు, తదితరులు ఉన్నారు. -
●అందరి సహకారం ఉంది..
::.. తాళ్లపల్లి శిరీష, కొత్తగూడెం కార్పొరేషన్ ఉద్యోగి కొత్తగూడెం అర్బన్: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెబుతున్నారు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ తాళ్లపల్లి శిరీష. పిల్లల పోషణ, కుటుంబ నిర్వహణతో పాటు ఉద్యోగ బాధ్యతలను సమన్వయం చేసుకోవడం ఎవరికై నా భారంగానే ఉంటుందని తెలిపారు. అయితే, ఇంట్లో భర్తతో పాటు కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల సహకారంతో భారం తగ్గి పనులు సులువుగా చేసుకోగలుగుతున్నానని వెల్లడించారు. పది నెలల పాపను, ఎల్కేజీ చదివే అబ్బాయిని చూసుకుంటూనే ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి తన భర్త కూడా సమయం కేటాయించి పనుల్లో సాయం చేయడం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో వీఆర్ఓగా సుజాతనగర్ మండలంలో పనిచేసినప్పుడు ఆరు నెలల కుమారుడిని తనతో పాటే తహసీల్‌కు తీసుకెళ్లి పనిచేసినా అధికారులు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అందరి నుంచి సహకారం ఉన్నప్పటికీ సమాజంలో ఇంకొంత మార్పు రావాలని, కష్టపడుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యతను గుర్తించాలని తెలిపారు.అమ్మ అంటే ప్రేమకు ప్రతీక మాత్రమే కాదు.. బాధ్యత, ఓర్పు, త్యాగానికి మరో పేరు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఉద్యోగ రంగంలోనూ రాణిస్తున్నారు. కచ్చితమైన పనివేళలు కాకుండా ఎప్పుడైనా విధులకు సిద్ధంగా ఉండే ఉద్యోగాలను సైతం మహిళలు ఎంచుకుంటున్నారు. ఈక్రమాన ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఉద్యోగం – కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న కొందరు మహిళా ఉద్యోగుల పరిచయం. -
●కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లు
ఇల్లెందురూరల్: అటవీ శాఖ ఇల్లెందు రేంజ్లో ఇస్లావత్ సత్యవతి బీట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అడవిలో విధులు నిర్వర్తించడం, స్తూనే వన్యప్రాణుల నుంచి కాపాడుకోవడం, అటవీ సంపదను రక్షించడం ఒక మహిళకు కత్తిమీద సామే. అయినా అలాంటి విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్న సత్యవతి కుటుంబాన్ని సైతం చక్కగా తీర్చిదిద్దుకుంటోంది. ఉదయమే విధులకు హాజరయ్యేందుకు తాను సిద్ధమవుతూనే పాఠశాలకు వెళ్లే పిల్లలను సిద్ధం చేస్తుంది. ఇలా ఒకే సమయంలో పిల్లలు, వ్యవసాయ పనులకు వెళ్లే భర్త మనోజ్‌ను సిద్ధం చేసి తాను విధులకు హాజరవుతోంది. రోజంతా విధుల్లో శ్రమించినా సాయంత్రం ఆ అలసట తనలోనే దాచుకొని పిల్లలను చదివిస్తూ నిర్ధేశించుకున్న లక్ష్యం దిశగా భర్త సహకారంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టం ఎదురైనా కుటుంబం, ఉద్యోగం రెండు కళ్లలా భావిస్తానని సత్యవతి చెబుతోంది. -
ఆలన.. పాలన
● కుటుంబ – ఉద్యోగ బాధ్యతల్లో మహిళామణులు ● రెండింటిని సమన్వయం చేస్తూ ముందడుగు ● సహోద్యోగులు, కుటుంబం అండగా నిలిస్తే మేలని భావన నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం●ఖాకీ చొక్కా చాటున మాతృత్వం ::.. సంకీర్తన, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కరకగూడెం: కరకగూడెంకు చెందిన సంకీర్తన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తూనే, తన మూడేళ్ల కుమారుడు రుద్రాన్ష్ గౌడ్ పెంపకంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. యూనిఫామ్ ధరిస్తే విధినిర్వహణలో.. ఇంటికి వెళ్లగానే ఆప్యాయత పంచే తల్లిగా ఆమె పాత్ర పోషిస్తారు. రైల్వే రక్షణ రంగం అంటే నిర్ణీత వేళలు ఉండకపోగా అర్ధరాత్రి అయినా, పండుగ రోజైనా అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ‘కొన్ని సందర్భాల్లో కుమారుడిని వెంట తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు సమాజం సరైన ప్రోత్సాహం.. భర్త, అత్తమామల సహకారం ఉంటే వృత్తిపరంగా మరింత ఎత్తుకు ఎదుగుతారు. అంతేకాక ప్రజా సేవలో భాగస్వాములవుతున్న మహిళల కష్టాన్ని గుర్తించి గౌరవించే సమాజం కావాలి’ అని సంకీర్తన ఆకాంక్షించారు. -
ఇంగ్లిష్ ట్రైనింగ్ ఇస్తుండగా.. ఆగిన టీచర్ గుండె
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. జ్ఞాన దీపం వెలిగిస్తూ ఓ టీచర్ గుండె మౌనంగా మిగిలిపోయింది. బ్లాక్ బోర్డుపై తోటి టీచర్లకు ఇంగ్లిష్ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఓ టీచర్ గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఖమ్మంలోని మమతా రోడ్లో శ్రీచైతన్య ఒలింపియాడ్ క్యాంపస్‌లో జరిగింది. గారపాటి జయరాజ్ అనే టీచర్.. అక్కడకు హాజరైన టీచర్లకు ఇంగ్లిష్ ట్రైనింగ్ క్లాస్‌లు ఇస్తున్నాడు. ఇంగ్లిష్ పాఠాలు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ఉన్నట్టుండి కూలిపోయాడు. తోటి టీచర్లు పరుగెత్తుకుని వచ్చి ఏమైందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై సహచర టీచర్లు సంతాపం వ్యక్తం చేశారు. -
కోతకు గురైన నూతన వారధి
● సారపాక వైపు దెబ్బతిన్న గోదావరి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు ● పాత వంతెనపైకి ట్రాఫిక్ మళ్లింపుభద్రాచలంటౌన్/బూర్గంపాడు: సారపాక–భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన రెండో బ్రిడ్జి అప్రోచ్ సారపాక వైపు కోతకు గురైంది. అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి జారిపోవడంతో వంతెన – రోడ్డు మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. ఈ విషయన్ని గురువారం రాత్రి గమనించిన నేషనల్ హైవేస్ అధికారులు కొత్త బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి పాత బ్రిడ్డి పైకి మళ్లించారు. ఒకే బ్రిడ్జిపై రాకపోకలతో వాహనాల రద్దీ పెరిగింది. నిన్నటి వరకు భద్రాచలం వెళ్లే వాహనాలు కొత్త బ్రిడ్జిపై నుంచి, భద్రాచలం నుంచి బయటకు వచ్చే వాహనాలు పాత బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త బ్రిడ్జి అప్రోచ్‌కు పోసిన మట్టి కోతకు గురికావటంతో మళ్లీ పాత బ్రిడ్జియే రాకపోకలకు దిక్కయింది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి ఇప్పటి వరకు ఎక్కడ పెద్దగా దెబ్బతినలేదు. ఏడాది క్రితం నిర్మించిన కొత్త బ్రిడ్జి అప్రోచ్ కోతకు గురవడంతో పనుల నాణ్యతపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆది నుంచీ విమర్శలే.. రూ.కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టగా, పనుల దశ నుంచే విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే ఓ పిల్లరు కుంగిపోవడంతో అధికారులు దానిని తొలగించి మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. తాజాగా అప్రోచ్ రోడ్డు వద్ద మట్టి పక్కకు జారిపోవడంతో నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పద్ధతిలో రాతి అప్రోచ్‌ను బలోపేతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఎప్పటి నుంచో కుంగిన అప్రోచ్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మట్టి మరింతగా జారిపోయింది. భద్రాచలం ట్రాఫిక్ పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద తీవ్రతను గమనించి వంతెన రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన వారధిగా ఉన్న ఈ వంతెనపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తిస్థాయిలో నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
సైబర్ నేరాల కట్టడికి కృషి
పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సత్తుపల్లి: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయటంతో పాటు సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తున్నామని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. సత్తుపల్లిలో ఆధునికీకరించిన కల్లూరు ఏసీపీ కార్యాలయాన్ని ఏసీపీ వసుంధర యాదవ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులకు మెరుగైన వసతీ సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తొలుత సిబ్బంది నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సీఐలు శ్రీహరి, ముత్తిలింగం, ఎస్సైలు పాల్గొన్నారు. మత్స్యకారులకు శిక్షణ కూసుమంచి: మండలంలోని పాలేరు పీ.వీ. నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల షెడ్యూల్ కులాలకు చెందిన మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారం రెండో రోజుకు చేరింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల గొండ, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా.. శాస్త్రవేత్తలు శాంతన్న, రవిందర్, అరుణ్ ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’పై అవగాహన కల్పించారు. దడి(కంచె)లో చేపల పెంపకానికి స్థలం ఎంపిక, దడి నిర్మాణంలో జాగ్రత్తలు, పంజరాల్లో చేపల పెంపకం చేపట్టేలా అవసరమైన నీరు, మేత, మార్కెటింగ్ అవకాశాలపై వివరించారు. నేడు తిరుమలాయపాలెంలో ప్రజాదర్బార్ తిరుమలాయపాలెం: పాలేరు నియోజకవర్గంలోని మండలాల్లో క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ శనివారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరగనుంది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లను మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్, ఎస్సై కూచిపూడి జగదీష్, ఎంపీఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజాదర్బార్‌లో తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, ఎదుళ్లచెరువు, కేశ్వాపురం, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి, తాళ్లచెరువు, తిమ్మక్కపేట, అజ్మీరా తండా, దమ్మాయిగూడెం, తెట్టెలపాడు, తిప్పారెడ్డిగూడెం, పడమటి తండాతో పాటు హైదర్‌సాయిపేట గ్రామాల ప్రజలు వినతిపత్రాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. పదోన్నతుల జాబితాలో ముగ్గురు ఏడీఏలు ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రప్రభుత్వం పదోన్నతులు, బదిలీలకు అనుమతి ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రక్రియ మొదలైంది. తొలుత పదోన్నతులకు అర్హులైన వారిని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) ద్వారా గుర్తించారు. ఇందులో భాగంగా ఏడీఏ(సహాయ వ్యవసాయ సంచాలకులు)లకు డీడీఏ(ఉప సహాయ సంచాలకులు)లుగా పదోన్నతి కల్పించేలా జాబితా రూపొందించగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి స్థానం దక్కింది. మధిర ఏడీఏ ఎస్.విజయ్‌చందర్, ఖమ్మం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ స్వరూపారాణి, భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి(ఏడీఏ) బాబూరావు ఇందులో ఉన్నారు. త్వరలోనే వీరికి డీడీఏలుగా పదోన్నతి కల్పించి నూతన స్థానంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఇదే సమయాన మండల వ్యవసాయాధికారులకు కూడా సహాయ వ్యవసాయ సంచాలకులుగా పదోన్నతి కల్పించే అవకాశాలున్నాయి. నెల వ్యవధిలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. -
నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం
● ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.మధిర: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. మధిరలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేసిన వివిధ విభాగాలను పరిశీలించాక చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సేవలపై ఆరాతీశారు. ఆతర్వాత వైద్యులు, సిబ్బంది హాజరు, రోజువారీ ఓపీ, ఔషధాల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించి సేవలు మరింత మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలే తప్ప అనవసరంగా సిజేరియన్లు చేయొద్దని తెలిపారు. అనంతరం మధిరలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.4 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులతో పాటు సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. తహసీల్దార్ రాంబాబు, విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలవాలి ఎర్రుపాలెం: రాష్ట్రంలోనే తొలిసారి ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సోలార్ ప్రాజెక్టు నిర్వహణ ఆదర్శంగా నిలిచేలా పనిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. రాజుపాలెంలో సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నందున త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ తీరును పరిశీలించారు. డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్, రెడ్కో డీఎం పి.అజయ్‌కుమార్, డీఆర్డీఓ ఏపీడీ జయశ్రీ, ఏడీఏ విజయ్‌చందర్, తహసీల్దార్ ఉషాశారద, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, సర్పంచ్ బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు. పనుల్లో నాణ్యత తప్పనిసరి బోనకల్: యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంలో వేగంతో పాటు నాణ్యత కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. బోనకల్ మండలంలోని లక్ష్మీపురంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్కూల్ భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. అయితే, తల్లిదండ్రుల వెయిటింగ్ హాల్, తదితర అంశాలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈఈ జనగాం బుగ్గయ్య తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రురావత్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
11నుంచి విద్యా వారోత్సవాలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల్లో భాగంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు రామకృష్ణ, పెసర ప్రభాకర్‌రెడ్డి, రూబీ, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన డీఈఓ నేలకొండపల్లి: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపి న విద్యార్థులు సొంతంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించిన డీఈఓ చైతన్య జైనీ ఆ మాట నెరవేర్చారు. నేలకొండపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయాన సొంత నిధులతో అల్పాహారం సమకూర్చారు. అప్పట్లో మండల స్థాయి అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరికి సైకిళ్లు ఇస్తానని తెలిపారు. ఈమేరకు 564మార్కులు సాధించిన చిట్టెంశెట్టి మహేష్, 537మార్కులు సాధించిన మోత్కూరి రక్షితకు శుక్రవారం సైకిళ్లు అందించడమే కాక మహేష్ ఉన్నత చదువుకు సహకరిస్తానని చెప్పారు. ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్ఎం గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ చైతన్య జైనీ -
సీహెచ్‌పీలో సిగ్నలింగ్ విధానం
సత్తుపల్లిరూరల్: సింగరేణి సత్తుపల్లి ఏరియా జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ సిస్టంను ఏర్పాటుచేశారు. జీఎంలు చింతల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రామ్మూర్తి ఈ విధానాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో ఏర్పాటుచేసిన ఈ విధానం ద్వారా వ్యాగన్లలో బొగ్గు లోడింగ్, రవాణా పారదర్శకంగానే కాక వేగంగా జరుగుతుందని తెలిపారు. లోడింగ్ మొదలు గమ్యానికి వ్యాగన్లు చేరే వరకు పర్యవేక్షించడం సులువవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు రామకృష్ణ, శ్రీనివాస్, సోమశేఖర్‌రావు, సునీల్‌వర్మ, రాజేశ్వరరావు, రవికుమార్, సూర్యప్రకాష్, కోటి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ముందస్తుగా పుస్తకం
● జిల్లాకు చేరిన 3.67లక్షల పాఠ్యపుస్తకాలు ● బడి తెరిచిన మొదటిరోజే పంపిణీకి సిద్ధం ఖమ్మంసహకారనగర్: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గతంలో బడులు తెరిచిన చాలారోజుల వరకు పుస్తకాలు అందకపోయేవి. కానీ రెండేళ్లుగా మార్పులు చేశారు. ఇందులో భాగంగా ఈసారి కూడా జిల్లాకు టైటిళ్ల వారీగా పుస్తకాలను చేరవేస్తున్నారు. 1,230 స్కూళ్లు, 60వేల మంది విద్యార్థులు జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 1,230 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో 60వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా. వీరికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను జిల్లాకు చేరవేయడం మొదలుపెట్టారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1నుంచి 10వ తరగతి వరకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు ముద్రించారు. ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మీడియం పాఠాలు ఉంటాయి. తొలుత పార్ట్–1 రెండు భాషల్లో ముద్రణతో పుస్తకాలను పాఠ్యాంశాల వారీగా రెండుగా విభజించారు. ఇందులో పార్ట్–1 పుస్తకాలను తొలుత అందజేస్తారు. జిల్లా విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి పార్ట్–1లో 4,45,820 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటివరకు 3,67,366 పుస్తకాలు జిల్లాకు చేరాయి. మిగతావి కూడా స్కూళ్ల ప్రారంభానికి ముందే చేరతాయని చెబుతున్నారు. ఈ పుస్తకాలను ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోనే నిల్వ చేస్తుండగా, త్వరలోనే ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలల వారీగా సరఫరా చేస్తారు. ప్రారంభం రోజునే పంపిణీ.. జూన్ 12వ తేదీ నుంచి విద్యాసంవత్సరం మొదలవుతుంది. అదేరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. కాగా, గతంలో పాఠ్యపుస్తకాలతో పాటే నోట్ పుస్తకాలను సైతం గోదాములకు చేర్చి అక్కడి నుంచి పాఠశాలలకు పంపించేవారు. కానీ ప్రస్తుతం నోట్‌పుస్తకాలను నేరుగా పాఠశాలలకు పంపిస్తున్నారు. -
ఆరోగ్యం.. యోగానందం
వేసవి సెలవుల్లో యోగా శిక్షణ పొందుతున్న సత్తుపల్లి ప్రభుత్వ బాలికల హైస్కూల్ విద్యార్థినులు పలు పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. మూడేళ్లుగా వేసవి సెలవుల్లో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యాన యోగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన శిక్షణ తరగతులకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. అయితే, సెలవుల్లో కాకుండా తర్వాత కూడా పలువురు విద్యార్థినులు శిక్షణ కొనసాగిస్తుండడంతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం గంట పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు హాజరవుతుండడంతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతోందని శిక్షకురాలు శ్రీలత చెబుతున్నారు. అంతేకాక శారీరక ఆరోగ్యం పెరిగి.. ఒత్తిడి దూరమవుతుందని పేర్కొన్నారు. – సత్తుపల్లిటౌన్ మూడేళ్లుగా యోగా శిక్షణ తీసుకుంటున్నా. ఈ శిక్షణతో ఉత్సాహంగా ఉండడమే కాక చదువు సైతం ఆసక్తిగా సాగుతోంది. నల్లగొండ, హైదరాబాద్, కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించా. – కిన్నెర ఫ్రూటీ జస్విత, సత్తుపల్లియోగా శిక్షణకు విద్యార్థినులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన 13 మంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – చీకటి శ్రీదేవి, పీడీ, బాలికోన్నత పాఠశాల, సత్తుపల్లియోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. కరీంనగర్, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. – కె.ధనవర్ష, సత్తుపల్లి -
తలసేమియా చిన్నారులకు సహకారం
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు కావాల్సిన రక్తం సమకూర్చడంలో సహకరిస్తామని ఏసీపీ రమణమూర్తి, ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం తెలిపారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని శుక్రవారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహించగా ఏసీపీ మాట్లాడుతూ సంకల్ప ఆధ్వర్యాన పిల్లల కోసం పలుమార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్‌లోనూ సహకరిస్తామని చెప్పారు. ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం మాట్లాడుతూ తలసేమియా జన్యుపరమైన వ్యాధి అని, దీనిని దృష్టిలో పెట్టుకుని గర్భిణులే కాక పెళ్లి చేసుకునే వారు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏఆర్ ఏసీపీ నర్సయ్య మాట్లాడగా చిన్నారులు ప్రదర్శించిన ‘వివాహనికి ముందు హెచ్‌బీఏ2 టెస్ట్’ స్కిట్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు రక్తదానం, చికిత్సకు ఆర్థికసాయం చేసిన దాతలను సత్కరించారు. సంస్థ ఫౌండర్ ప్రొద్దుటూరి అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్ నారాయణచౌదరి, మానస, జి.సుజాతరాణి, బీవీఎన్.కృష్ణ, నరేష్, లక్ష్మీదీప, శ్రావణి, ద్రౌపది, పి.పావని, పి.రవిచందర్, పి.ఉదయ్ భాస్కర్, పి.వంశీకిరిటీ, పి.ప్రియ, అనురాధ పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేయగా, యుగంధర్‌తో పాటు ప్రదీప్‌కుమార్ రక్తదానం చేశారు. అలాగే, ‘యువం ఫౌండేషన్’ సభ్యులు 50 మంది రక్తదానం చేశారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు రెహనా బేగం, కోటేశ్వరరావుతో పాటు కూరపాటి ప్రీతి, సనాఉల్లా, సిద్ధార్థ్, నరేష్, అభిషేక్, మల్లేష్, నజీర్, మోతీలాల్, సిరాజ్, సుచరిత, లక్ష్మి, సుగుణ, నిర్మల పాల్గొన్నారు. ఏసీపీ రమణమూర్తి, ఐఎంఏ అధ్యక్షురాలు రెహానాబేగం -
వ్యర్థాలకు నిప్పుతో సమీప పంటలు దగ్ధం
తిరుమలాయపాలెం: మొక్కజొన్న చేనులో వ్యర్థాలకు నిప్పు పెట్టగా సమీపంలోని వరి, జామాయిల్ పంటలకు నిప్పంటుకుని సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై బాధిత రైతుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని దమ్మాయిగూడెంలో వీరదాసు భాగ్యమ్మ తన మొక్కజొన్న పంట కోత అనంతరం వ్యర్థాలకు నిప్పు పెట్టింది. అయితే, గాలిదుమారంతో పక్కనే ఉన్న ఆలస్యం సత్యనారాయణ, నూకారపు నాగేశ్వరరావుకు చెందిన వరి, జామాయిల్ పంటలకు మంటలు వ్యాపించి కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.జగదీష్ తెలిపారు. కాగా, రైతులు వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కలియదున్నాలని సూచించారు. పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి ఎర్రుపాలెం: ఉపాధి హామీ పథకం ద్వారా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు తగిన వసతులు కల్పించాలని డీఆర్డీఓ కొండపల్లి శ్రీరామ్ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెగళ్లపాడు గ్రామాల్లో పనులతో పాటు నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన.. రోజుకు సగటున రూ.307 వచ్చేలా కొలతల ప్రకారం పనిచేయాలని తెలిపారు. ఎండల నేపథ్యాన ఉదయాన్నే పనికి రావాలని చెప్పారు. అలాగే, పని ప్రదేశాల్లో టెంట్ వేయించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సమకూర్చాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సర్పంచ్‌లు సమకూర్చిన మజ్జిగ ప్యాకెట్లను కూలీలకు అందజేశారు. నర్సరీలోని ఖాళీ సంచుల్లో త్వరగా మొలకలు వచ్చే విత్తనాలు నాటా లని ఆదేశించారు. ఎంపీడీఓ బి.సురేందర్, ఏపీఓ నాగరాజు, సర్పంచ్‌లు కె.కన్నమ్మ, కె.అనిల్‌కుమార్, ఈసీ లక్ష్మయ్య, కార్యదర్శులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి
కొణిజర్ల: ప్రమాదవశాత్తు వైరా రిజర్వాయర్‌లో పడిన వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు... వైరా మున్సిపాలిటీ పరిధి లీలా సుందరయ్యనగర్‌కు చెందిన లారీ డ్రైవర్ ఆది శివప్రసాద్(48) గురువారం రాత్రి భోజనం తర్వాత రిజర్వాయర్ ఆనకట్టపైకి వాకింగ్ కోసం వెళ్లాడు. ఈక్రమాన ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడినట్లు తెలుస్తోంది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం రిజర్వాయర్‌లో శివప్రసాద్ మృతదేహం తేలడంతో గుర్తించారు. ఆయనకు భార్య, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. శివప్రసాద్ తండ్రి జగన్నాధం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య పెనుబల్లి: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన అనుమోలు రమేష్(52) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు పెనుబల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు. -
వృద్ధురాలి ఆవేదనకు మంత్రి స్పందన
ఖమ్మంరూరల్: మండలంలోని గోళ్లపాడుకు చెందిన వెలుతురు భద్రమ్మ దశాబ్దాలుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదని ఈనెల 5న మంగళగూడెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికక్కడే స్పందించిన మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు శుక్రవారం వివాదంలో ఉన్న భూమిని పరిశీలించారు. రికార్డుల ప్రకారం సరిహద్దులను నిర్ధారించడమే కాక ఏళ్ల తరబడి సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదనే వివరాలు సేకరించారు. ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేయగానే స్పందించి క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి పొంగులేటి ఆదేశించడం, ఉద్యోగులు రావడంతో భద్రమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది. రేపటి మోదీ సభకు ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొననుండగా, సభకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటుచేసినట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిల వెంకట్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి ఆదివారం ఉదయం 8–30గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుందని, రైతులు, మహిళలు, యువత రావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, కోటమర్తి సుదర్శన్, ప్రభాకర్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, రజనీరెడ్డి, మంద సరస్వతి, నక్కల రవిగౌడ్, శ్రీరామనేని మణి పాల్గొన్నారు. 11న అప్రెంటీస్ మేళా ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 11వ తేదీన జాతీయ అప్రెంటీషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎన్సీ కంపెనీలు, జిల్లాలోని ఇతర కంపెనీల బాధ్యులు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. gov. in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, రిజిస్ట్రేషన్ కాపీతో ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, కుల ధృవీకరణపత్రం, రెండు పాస్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. -
చేపలు, రొయ్యల పెంపకానికి చెరువులే కీలకం
కల్లూరు: చేపలు, రొయ్యల పెంచే వారు చెరువుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. కల్లూరు రైతు వేదికలో మత్స్యశాఖ, జలవనరుల శాఖల ఆధ్వర్యాన మత్స్యకారులకు శుక్రవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని, లేనిపక్షంలో నీటి నాణ్యత తగ్గి చేపల ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈమేరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపా రు. జలవనరుల శాఖ ఈఈ సురేష్‌బాబు, డీఈ ఈలు వెంకటేశ్వరరావు, రాజారత్నం పాల్గొన్నారు. -
సైకిల్ సవారీ.. గోళీల ఆట!
కరకగూడెం: వేసవి తీవ్రతతో పిల్ల లను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ సెలవుల్లో పిల్లలను ఆపడం వారి వల్ల కావడం లేదు. ఈనేపథ్యాన నీడ పట్టున ఆడుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇళ్ల ఆవరణ, చెట్ల నీడలో.. ఉదయం, సాయంత్రం ఆరుబయట ఆటలతో పిల్లలు సందడిగా గడుపతున్నారు. స్నేహితుల సాయంతో.. కొందరు చిన్నారులు సైకిల్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. స్నేహితులు వెనక నుంచి సైకిల్ పట్టుకుంటే భయం భయంగానే పెడల్ తొక్కుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండుసార్లు కింద పడినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సైకిల్ నేర్చుకుంటున్నారు. లక్ష్యసాధన.. పాతకాలపు ఆటలను సైతం పిల్లలు మరువడం లేదు. కొందరు చిన్నారులు నేలపై గీసిన వలయంలో రంగురంగుల గోళీలను పెట్టి లకా్‌ష్య్‌న్ని గురి పెట్టి కొడుతూ ఆటలో మునిగిపోతున్నారు. గెలుపోటములను ఆస్వాదిస్తున్న చిన్నారులు కేరింతల మార్మోగుతున్నాయి. ఈ ఆట ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, స్నేహభావం పెరుగుతోందని పెద్దలు చెబుతున్నారు.స్నేహితుల సాయంతో సైకిల్ నేర్చుకుంటున్న బాలుడు గోళీలు ఆడుతున్న చిన్నారులు -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ఏదులాపురం క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గ్రామానికే చెందిన కొండా అజిత్(26) మృతి చెందాడు. వ్యక్తిగత పనిపై అజిత్ వరంగల్ క్రాస్‌రోడ్డుకు వెళ్లి తిరిగి నడుస్తూ ఇంటికి వస్తున్నాడు. ఆయన రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టి ఆయన పైనుంచి వెళ్లడంతో మృతదేహం చిధ్రమైంది. అక్కడకు చేరుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, బృందం సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన సర్కార్
ఖమ్మంమయూరిసెంటర్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేలా జీఓ 7ను తీసుకురావడం ద్వారా రాష్ట్రప్రభుత్వం పేద విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యాన ఖమ్మంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సురేష్‌తో పాటు సీపీఎం, మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఆవుల అశోక్, షేక్ ఖాసిం, రావి శివరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు అనుమతించగా, ఆ భారం విద్యార్థులపై పడుతుందన్నారు. ఈక్రమాన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేయకుండా పెంచడంతో పాటు ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అజ్మీరా రామ్మూర్తి, పుల్లయ్య, ఇటికల రామకృష్ణ, తాటి వెంకటేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, మేకల శ్రీనివాసరావు, ఝాన్సీ. నందిపాటి మనోహర్, ఏసు, జగన్, తుడుం ప్రవీణ్, గోకినపల్లి మస్తాన్, మనోజ్, నరేందర్, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ సమీపాన ఖమ్మం– ఇల్లెందు రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఎర్రగడ్డ నరేష్(29) బైక్‌పై వెళ్తుండగా ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న లారీ ముందు ఉన్న నరేష్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతేకాక అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును సైతం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్, కారు నుజ్జునుజ్జు కాగా తీవ్రగాయాలతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాక కారులో ఉన్న కామేపల్లి మండలం గోవింద్రాల వాసులు మూడ్ బాలకృష్ణ – అనూష దంపతుల్లో అనూషకు తీవ్రగాయాలు కాగా, మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడగా స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆపై సమాచారం అందుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, ఎర్రగడ్డ నరేష్ తన తల్లిదండ్రుల మృతితో కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబ పెద్దగా నిలిచే క్రమాన ఆయన మృతితో విషాదం నెలకొంది.బైక్‌ను ఢీకొట్టి కారుపైకి దూసుకెళ్లిన లారీ -
వైద్యసేవలతో పాటు పరిపాలనపైనా దృష్టి
● వైద్యులు సమయపాలన పాటించాలి ● వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ దివాకరఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే కాక పరిపాలన అంశాలపైనా వైద్యులు దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ, చికిత్సకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిస్తే ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఆస్పత్రుల్లో పనిచేయని యంత్రాల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పీహెచ్సీ స్థాయిలో అవసరమైన పరీక్షా సామగ్రి అందుబాటులో ఉంచాలని, ప్రతీ గర్భిణీకి పరీక్షలు చేసేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు లక్ష్యాలు నిర్దేశించాలని చెప్పారు. అలాగే, 14 – 15 వయస్సు బాలికలకు వ్యాక్సిన్ వేయించేలా తల్లిదండ్రులను అవగాహన కల్పించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అవసరమైన మరమ్మతులు, ఫర్నీచర్ కోసం గురువారం నాటికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ రామారావు, అదనపు డీఎంహెచ్ఓ చందునాయక్, పీఓలు అరుణాదేవి, ఐ.మోత్యా, డీఐఓ పి.సంపత్ తదితరులు పాల్గొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయండి ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నాణ్యతగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలోని 15 జూనియర్ కళాశాలల్లో మరమ్మతులు, అమ్మ ఆదర్శ పాఠశాల్లో జరుగుతున్న పనులపై నివేదిక అందించాలని చెప్పారు. తిరుమలాయపాలెంలో 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు విస్తరణ, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, భవిత కేంద్రాలు, వైరా జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, కేజీబీవీల్లో పనులపై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో పీఆర్ ఎస్ఈ వై.వెంకట్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ ఎం.యాకోబు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ బుగ్గయ్య పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య
వైరా: వైరా మున్సిపాలిటీ పరిధి గండగలపాడుకు చెందిన మిషన్ భగీరథ కార్మికుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన పింగళి శ్రీను(48) మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మద్యానికి బానిస కావడంతో వారం క్రితం భార్య రాధ, ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీను ఈనెల 4న ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోగా, ఈ విషయం బయటపడలేదు. అయితే, గురువారం శ్రీను సోదరుడు వెళ్లి ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆయన ఆత్మహత్య విషయం బయటపడింది. ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. ఆయిల్‌పామ్ మొక్కలు దగ్ధం కొణిజర్ల: మండలంలోని లక్ష్మీపురంలో రైతు ధరావత్ నంద్యానాయక్ సాగు చేస్తున్న తోటలో ఆయిల్‌పామ్ చెట్లు కాలిపోయాయి. ఆయన ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా గురువారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో రెండెకరాల విస్తీర్ణంలో మొక్కలు కాలిపోయాయి. సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, నాయకులు కుటుంబరావు, హరిచంద్, చింతపల్లి ప్రసాద్, అజయ్‌కుమార్, మహబూబ్ అలీ, కృష్ణకాంత్ తదితరులు తోటను పరిశీలించి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులపై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ మణుగూరు టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న పోలీసులపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని మణుగూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తోగ్గూడెం సమ్మక్క–సారలమ్మ దేవాలయం వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో తోగ్గూడెం గ్రామానికి చెందిన సోలం నాగేశ్వరరావు మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. పోలీసులు అడ్డుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా నిర్థారణ అయింది. దీంతో అతడిని మందలించి ఇంటికి పంపించారు. ఆతర్వాత తనకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా అంటూ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి కత్తి తీసుకుని తనిఖీలు చేపడుతున్న పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
కళ్ల ముందే పంట.. రైతు కన్నుమూత
కామేపల్లి: ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం చేతికొచ్చింది.. హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు తీసుకెళ్లాలని రైతు సిద్ధమవుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా మృతి చెందాడు. కామేపల్లి మండలం జాస్తిపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. జాస్తిపల్లికి చెందిన వేముల ఉపేందర్(40) సాగు చేసిన వరి పొలాన్ని హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేయించాడు. ఆతర్వాత ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. అదే గ్రామానికి చెందిన రాయల పెద్దిరాజు ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చాడు. ఈక్రమాన హార్వెస్టర్ పక్కనే ఉన్న ఉపేందర్‌ను గమనించకకుండా ఢీకొట్టడంతో పడిపోగానే ఆయన పైకి ట్రాక్టర్ ఎక్కింది. సమీప రైతులు అప్రమత్తమై తీవ్రగాయాలతో ఉన్న ఆయనను ఆటోలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై ఉపేందర్ భార్య రేణుక ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ పెద్దిరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.ట్రాక్టర్ కింద పడడంతో మృతి -
కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. -
కోడిపుంజుల బడాయి
సత్తుపల్లిటౌన్: ఒక ఊరిలో రెండు కోడి పుంజులు ఉండేవి. రెండింటికి బడాయి ఎక్కువే కావడంతో ఒక దాన్ని మించి మరొకటి బడాయి పోయేవి. ఓ రోజు గింజలు ఏరుకుని తింటున్న రెండు పుంజుల మధ్య మాటామాట పెరిగింది. ఆ మాటలు పెరిగి పందేనికి దారి తీశాయి. ఎవరు ఎక్కువ ఎత్తు ఎగరగలరనే అంశంపై పందెం వేసుకున్నాయి. నేను ఎక్కువ ఎత్తు ఎగరగలనని మొదటి పుంజు అంటే.. నీ కంటే నేనే ఎక్కువ ఎత్తు ఎగురుతాను అన్నది రెండో పుంజు. పెద్దమనిషిగా వ్యవహరించమని వీటి కంటే పెద్ద వయస్సు ఉన్న పుంజును అడిగాయి. ఆ పెద్దమనిషి పుంజు మాత్రం ఇలాంటి పందేలు వద్దని వారించింది. వీటితో నష్టం కలుగుతుందని హితవు చెప్పింది. అయినా పందెం మోజులో ఉన్న పుంజులకు మంచి మాటలు తలకెక్కలేదు. పెద్దమనిషి లేకపోతేనేం.. మనమే న్యాయంగా పోటీ పడదామని అంగీకారానికి వచ్చాయి. వద్దు.. వద్దు అని ఇంకొన్ని పుంజులు చెప్పినా వినలేదు. పందెం మొదలైంది. మొదటి పుంజు ప్రహరీ మీదకు ఎగిరింది. రెండో పుంజు ఇంటి కప్పు మీదకు ఎగిరింది. చూశావా నేనే ఎత్తు ఎగిరిరాను అన్నట్టు రెండో పుంజు చూస్తుండగానే మొదటి పుంజు చెట్టుకొమ్మపై వాలింది. మొదటి పుంజు గాలిలోకి అంత ఎత్తున రివ్వున ఎగిరింది. ఇంతలో సుడిగాలిలా వచ్చిన గద్ద మొదటి పుంజును తన కాళ్లతో ఒడిసి పట్టుకుని ఎగరేసుకుపోయింది. చిటారు కొమ్మన కూర్చున్న రెండో పుంజు ఇది చూసి చిగురుటాకులా వణికి పోయింది. గద్దకు కనబడకుండా ఒదిగి కూర్చుంది. గద్ద కనుమరుగయ్యాక కిందకి దిగింది. ఇదంతా చూస్తున్న మిగతా పుంజులు బడాయికి పోతే ప్రాణమే పోయింది కదా అని అనుకుంటూ గూటికి పయనమయ్యాయి. నీతి : ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా శక్తి ఉంటుంది. కానీ దాన్ని అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. అలాకాకుండా బడాయికి వెళ్తే శతృవుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.అమ్మమ్మ చెప్పిన కథ -
‘వన్ మినిట్ రూల్’తో భద్రతకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్: విద్యుత్ సిబ్బంది భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీజీఎన్పీడీసీఎల్లో ‘వన్ మినిట్ రూల్’ అమలు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు సిబ్బంది ఒక్క నిమిషం పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పనికి ముందు లైన్ క్లియర్ పొందడం, ఇండక్షన్ టెస్టర్‌తో లైన్లో విద్యుత్ లేదని నిర్థారించుకోవడం, పీపీఈ కిట్లు ధరించడం, ఎర్తింగ్ ఏర్పాటు, డబుల్ ఫీడింగ్ లేకుండా చూడడం, పరికరాల భద్రతను పరిశీలించడం వంటి అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ విధానంతో విద్యుత్ ప్రమాదాలు తగ్గించి సిబ్బంది ప్రాణాలు రక్షించడమే లక్ష్యమని తెలిపారు. ‘ఒక్క నిమిషం ఆలోచన – జీవితాంతం భద్రత’అనేదే ‘వన్ మినిట్ రూల్’ప్రధాన సందేశమని సీఎండీ వరుణ్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
సింగరేణి వైద్యుల నియామకంలో జాప్యం
రుద్రంపూర్: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల నియామకంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తీర్చేందుకు సంస్థ వ్యాప్తంగా 32 ఖాళీలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్లో యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సంస్థ ఉన్నతాధికారులు, సీనియర్ వైద్యాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా 32 పోస్టులకు 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, పీడియాట్రీషియన్–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్టీ సర్జన్–2, అనష్థీసియన్– 7, పెథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3, సైక్రియాట్రిస్ట్–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
● అచ్చతెలుగులో అందిస్తున్న వెబ్సైట్లు ● వేసవి సెలవుల్లో చిన్నారులకు ఉపయోగం
ఇల్లెందు రూరల్: వేసవి సెలవులు రాగానే చిన్నారుల్లో ఎక్కడ లేని ఆనందం. అయితే ఈ సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఒకప్పుడు నీతి కథలు, పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పేవారు. ప్రస్తుతం అలాంటివి చెప్పేవారు ఉన్నా.. వినే ఓపిక పిల్లలకు లేకుండా పోయింది. సెలవులనగానే సెల్‌ఫోన్ చేతపట్టి ఇంటర్నెట్తో కాలక్షేపం చేస్తున్నారు. వీడియో గేమ్‌లు, కార్టూన్ చానళ్లతోనే కాలం గడుపుతున్నారు. అలాకాకుండా తల్లిదండ్రులు కాస్త మనసు పెడితే పిల్లలు ఆసక్తిగా చూసేలా నీతి కథలు, విలువలను బోధించే కార్టూన్లను పరిచయం చేసే అవకాశం ఉంది. సెలవుల్లో విజ్ఞానం పాలు తాగే పసిపాప మొదలు బుడిబుడి అడుగులు వేసే పిల్లలు, ఆపై వయస్సు పిల్లలు కూడా సెల్ఫోన్లలో ఆటలకు పరిమితమయ్యారు. చిన్నవయస్సులో ఏడస్తున్న పసిహృదయాలకు సెల్‌ఫోన్ చేతిలో పెట్టి ఊరుకోబెడుతూ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే చిన్నారులను సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయేలా చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడేలా కథలను అందించే కొన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లోనే కాక అచ్చతెలుగులో విజ్ఞానాన్ని పెంచే కథలు, సామెతలు, పొడుపు కథలు, అక్బర్, బీర్బల్, చందమామ కథలు వంటివి చదవొచ్చు.. వినొచ్చు. మరికొన్ని సైట్లు పిల్లల పత్రికలు, మ్యాగజైన్లను అందిస్తున్నాయి. సెల్‌ఫోన్‌తో మారాం చేసే చిన్నారులకు వెబ్సైట్లలో నీతి కథలు వినిపిస్తూ వినోదం, విజ్ఞానం కూడా అందించేలా తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వెబ్సైట్లలో ఏముందంటే.. వెబ్సైట్లలో చిన్నారుల మేథోవికాసాన్ని పెంపొందించే పిట్టకథలు, బుర్రకథలు, తెనాలి రామకృష్ణ, సరదా కథలు, పాటలు, చందమామ కథలు, తెగులు పద్యాలు, పిల్లల వీడియోలు, పొడుపు కథలు, వేమ, సుమతి, భాస్కర శతక పద్యాలు లభిస్తాయి. అలాగే, పంచతంత్ర కథలు, గొప్ప రాజులు, పురాతన ఆలయాలు, శ్లోకాలు తదితరాలను పరిచయం చేస్తున్నారు. సాహిత్యంలో భాగంగా రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి. -
●మండు వేసవిలోనూ జలకళ
ఒకప్పుడు తిరుమలాయపాలెం మండలంలో చుక్కనీరు లేక చెరువులు నెర్రెలు బారి కనిపించేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. మండలంలోని పలు చెరువులు మండు వేసవిలోనూ జలకళ సంతరించుకుని కనిపిస్తున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలవనరుల శాఖ అధికారులు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేసి చెరువులను నింపారు. దీంతో దాదాపు అన్ని చెరువులు జలకళ సంతరించుకున్నాయి. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో భూగర్భ జాలలు కూడా భారీగా పెరిగిన నేపథ్యాన వర్షాకాలంలో వానలు ఆలస్యమైనా సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. – తిరుమలాయపాలెం -
హిందువుల ఐక్యతే.. జాతీయ సమైక్యత
● సమ్మేళనంలో దత్తేశ్వరానంద భారతి ఖమ్మం అర్బన్: హిందువులైన ప్రతీఒక్కరు గర్వించాలని దత్తేశ్వరానంద భారతి సూచించారు. ఖమ్మం ఆరో డివిజన్ ప్రశాంత్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యతగా నిలుస్తుందని తెలిపారు. విరాట్ హిందూ సమ్మేళన ఆహ్వాన కమిటీ, అభయ వేంకటేశ్వర ఆలయ కమిటీ బాధ్యులు అద్దంకి నాగేశ్వరరావు, కొల్లా రవీందర్, అల్లిక అంజయ్యతో పాటు పల్లెబోయిన చంద్రయ్య, బస్వోజు వెంకటేశ్వర్లు, ఏలూరి శ్రీనివాసరావు, బొల్లి కొమరయ్య, వనతడపా గౌతమ్‌కుమార్, చారి, దండా జ్యోతిరెడ్డి, భగవాన్‌శర్మ, కోనేటి శ్రీనివాసరావు, మేకల వీరన్నపురం, పల్లపు సత్యం, పురం తిరుపతయ్య, దాచేపల్లి సంతోష్, నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు. కోళ్ల వ్యర్థాలు డ్రెయినేజీల్లో వేయొద్దు.. ● పలు షాపుల్లో తనిఖీ చేసిన ఎమ్మెల్యే కనకయ్య ఇల్లెందు: చికెన్ షాపుల నిర్వాహకులకు వ్యర్థాలను డ్రెయినేజీల్లోకి వదలొద్దని ఇల్లెందు ఎమ్మెల్యే సూచించారు. ఇల్లెందులోని పలు షాపుల నుంచి వ్యర్థాలు డ్రెయిన్లలోకి చేరుతుండడంతో దుర్వాసనకు కారణంగా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకుఫిర్యాదు చేశారు. దీంతో గోవింద్ సెంటర్లోని పలు షాప్‌లను గురువారం ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. దుర్వాసన వెదల్లుతుండడాన్ని గుర్తించిన ఆయన షాపుల యజమానులను హెచ్చరించడమే కాక నిరంతరం తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కోళ్ల వ్యర్థాలను సేకరించి బయటకు తరలించేలా టెండర్ ద్వారా బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. మున్సిపల్ డీఈ మురళి, నాయకులు పాల్గొన్నారు. చలివేంద్రం ధ్వంసం ఘటనపై కేసు ఖమ్మం అర్బన్: ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఖమ్మం 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంతలక్ష్మి జశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. చలివేంద్రంలోని కుండల్లో మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించడమే కాక ఫ్లెక్సీలను చింపివేశారని ఫిర్యాదు అందింది. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను చర్యలు తీసుకోవాలని కోరగా, కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన మధిర: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మధిర రైతు వేదికలో గురువారం సౌర విద్యుత్ ఉత్పత్తి, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. అంతేకాక సాగులో ఉయోగపడే పరికరాలను ప్రదర్శించి వాటి వినియోగాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉండే మేలైన సన్నరకం వరి విత్తనాలు సాగు చేయాలని సూచించారు. తొలకరి వర్షాలు పడ్డాకే విత్తనాలు నాటుకోవాలని, ముందుగా నాటితే మొలక శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని తెలిపారు. కాగా, పంట వ్యర్థాలకు నిప్పు పెట్టకుండా భూమిలో కలియదున్నాలని సూచించారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు మాట్లాడగా.. శాస్త్రవేత్త నాగస్వాతి, వ్యవసాయ, విద్యుత్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. భద్రాచలంలో కూలిన సిగ్నల్ పోల్ భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గురువారం రాత్రి తీవ్రమైన గాలిదుమారం కారణంగా అంబేడ్కర్ సెంటర్లోని ట్రాఫిక్ సిగ్నల్ ఐరన్ పోల్ పక్కకు ఒరిగి రోడ్డుపై పడింది. అయితే, ఈ సమయాన వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రమాదమే తప్పినట్లయింది. ప్రధాన కూడలిలో స్తంభం అడ్డంగా పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. -
చెరువుల్లో పూడికతీత కష్టమే!
ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది చెరువుల పూడికతీత పనులు చేపట్టడంపై మీమాంస నెలకొంది. సాగర్ ఆయకట్టు పరిధిలోని చెరువులన్నీ నిండా నీటితో ఉండడమే ఇందుకు కారణంగా మారింది. గత నెల చివరి వరకు సాగర్ నీటి విడుదల కొనసాగడంతో పలు మండలాల పరిధిలోని చెరువుల్లో సగానికి పైగా నిల్వలు ఉన్నాయి. దీంతో అధికారులు ఎటూ తేల్చకోలేకపోతున్నారు. జిల్లాలో 1,415 చెరువులు జిల్లాలో 1,415 చెరువులు ఉన్నాయి. ఇందులో 100 ఎకరాలకుపైగా ఆయకట్టు కలిగినవి 984 ఉన్నట్లు జలవనరుల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. చెరువుల్లో నీటి సామర్ధ్యం పెంచడం, తద్వారా ఆయకట్టుకు సరిపడా సాగునీరు అందేలా ఏటా వేసవిలో పూడికతీత పనులు చేపడుతారు. ఈ మట్టిని రైతులు పొలాల్లోకి ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తారు. ఈసారి కూడా ప్రణాళిక రూపొందించినా, చెరువుల్లో పూడికతీతకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా నీటి నిల్వలతో పనులు మొదలుకాలేదు. అంతేకాక మే నెల రెండో వారం వస్తుండడంతో జూన్‌లో వర్షాలు మొదలయ్యే పనులు చేపట్టాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చెరువుల అంచుల్లో మాత్రమే 10 శాతం మేర పూడికతీతకు అవకాశముందని చెబుతున్నారు. ఇదే సమయాన సాగర్ నీరు ప్రవహించని గ్రామాల పరిధిలో కొన్నిచెరువుల్లో మాత్రం పూడికతీత, రైతులు మట్టి తరలించడానికి అధికారులు అనుమతులు ఇస్తున్నా పనులు జోరందుకోలేదు. కాగా, మట్టి కోసమంటూ చెరువుల్లో నీటిని బయటకు వదిలేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని జల వనరుల శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
ఇకపై ఫోర్లు.. సిక్స్‌లే!
ఖమ్మం స్పోర్ట్స్/ఖమ్మం రూరల్: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా శిక్షణ కోసం పటేల్ స్టేడియంలోని నెట్స్ తప్ప సరైన సదుపాయాలు లేక.. మ్యాచ్‌ల నిర్వహణకు సరిపడా మైదానాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది శుభవార్త! జిల్లా కేంద్రానికి సమీపాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా.. సాధ్యాసాధ్యాలపై ఖమ్మం లోక్‌సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి దృష్టి సారించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ బాధ్యుల వినతితో ఆయన గురువారం రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు హైవే వెంట స్థలాలను పరిశీలించారు. స్టేడియం నిర్మాణానికి ఎంత స్థలం అవసరం, ఎక్కడెకక్కడ అనువైన స్థలాలు ఉన్నాయనే అంశంపై మ్యాప్‌ల ఆధారంగా ఆరా తీశారు. ఔత్సాహిక క్రికెటర్ల కలలను సాకారం చేసేలా క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ వెల్లడించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ తహసీల్దార్లు ఎస్.శ్వేత, విజయేందర్‌రెడ్డి, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, గతంలో బాలపేట వద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు 20ఎకరాల స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. మరోమారు ఎంపీ స్టేడియం నిర్మాణానికి స్థలాలు పరిశీలించడంతో క్రీడాకారులు ఆశలు చిగురిస్తున్నాయి.క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఎంపీ రఘురాంరెడ్డి పరిశీలన -
తలసేమియా బాధితులను గుర్తించాలి
చుంచుపల్లి: తలసేమియా బాధితులను గుర్తించాలని భద్రాద్రి డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. శుక్రవారం ప్రపంచ తలసేమియా దినోత్సవం కావడంతో గురువారం ఆయన మహిళ ఆరోగ్య కార్యకర్తలతో ఆన్లైన్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల్లో తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. తలసేమియా వారసత్వ రక్త సంబంధిత వ్యాధి అని, ముందస్తుగా గుర్తిస్తే సరైన చికిత్సతో బాధితులు ఆరోగ్యంగా జీవిస్తారని వివరించారు. చిన్నపిల్లల్లో తరచుగా రక్తహీనత, అలసట, బలహీనత, ఎదుగుదల లోపం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తలసేమియా బాధితులను గుర్తించేందుకు రక్త పరీక్షలు అవసరమని తెలిపారు. వివాహానికి యువత తలసేమియా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్‌లో పిల్లలకు ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని వివరించారు. గర్భిణులు కూడా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు ఎండలో తిరగకూడదని, ఉదయం 11 గంటల వరకు పని ముగించుకుని ఇంటికి చేరాలని, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని, ఎక్కువ నీటిని తాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రతాప్, రాందాస్, సిబ్బంది మోహన్, రాంప్రసాద్ పాల్గొన్నారు.భ ద్రాద్రి డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ -
ఫుడ్ సేప్టీ అధికారి ఆకస్మిక తనిఖీలు..
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటళ్లు, డాబాల్లో గురువారం జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఓ హాటల్లో కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన ఆహారంలో కోడి ఈక రాగా, దీనిపై బాధిత వినియోగదారుడు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారి పలు హోటళ్లు, డాబాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, డాబాలలో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నిల్వ విధానం, వంట గదులు, ఫుడ్ సేప్టీ లైసెన్సులను ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 ప్రకారం 5 నమూనాలు, 12 సర్వేలైన్స్ నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. అలాగే నిబంధనలు పాటించని నిర్వాహకులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేప్టీ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఒక వారం రోజుల గడువు ఇచ్చి లైసెన్సులు పొందాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ దినేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మక్క రైతులపై అదనపు బాదుడు
ఖమ్మంవ్యవసాయం: కష్టనష్టాలను ఓర్చుకుని మొక్కజొన్న సాగు చేసిన రైతులు.. ఆ పంటను అమ్ముకునేందుకు మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రైవేటు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో విక్రయాల్లో అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతున్నాయి. వే బ్రిడ్జి కాంటాలు, దిగుమతుల్లో హమాలీ మామూళ్ల పేరిట అదనపు వసూళ్లు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది. పంట ఆరబెట్టాక తేమ శాతం పరీక్ష చేయించుకోవటం, విక్రయించుకునేందుకు గన్నీ బస్తాల కోసం వేచిచూడటం, ఆ తర్వాత కాంటాలు వేయించటం, ప్రభుత్వ శాఖలు అనుమతించినప్పుడు ట్రాక్టర్లో లోడ్ చేయించి మక్కలను గోదాము(ఖమ్మం మార్కెట్)కు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అడుగడుగునా అదనపు వసూళ్లతో రైతు చిత్తవుతున్నాడు. దూరాన్ని బట్టి వసూలు.. గ్రామంలో పంట విక్రయ సమయాన క్వింటాకు కాంటా ఖర్చు, లోడింగ్‌కు రూ.65 – రూ.80 తీసుకుంటున్నారు. ఇక ట్రాక్టర్‌పై రవాణాకు దూరం ఆధారంగా చార్జి వసూలు చేస్తున్నారు. గోదాం వద్ద వెంటనే దిగుమతి కాకపోతే వెయిటింగ్ చార్జిఅదనంగా తీసుకుంటున్నారు. ఈ చార్జీలు క్వింటాకు రూ.50 వరకు అవుతున్నాయి. అయితే, ఈ చార్జీలను మార్క్‌ఫెడ్ చెల్లిస్తామని చెబుతున్నా.. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ట్రాక్టర్ వే బ్రిడ్జిపై కాంటాకు ఒక్కో టిక్కీ(50 కిలోల బస్తా)కి రూ.2 ట్రాక్టర్ మొత్తం కాంటాకు రూ.100, లారీ అయితే రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక దిగుమతి వద్ద హమాలీలు మామూళ్ల పేరిట ట్రాక్టర్‌కు రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మక్కలు క్వింటాకు ప్రభుత్వం రూ. 2,400గా ప్రకటించినా.. ఇతర ఖర్చులు రూ.400 పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంటాలు, మామూళ్ల పేరిట వసూళ్లుఈ యాసంగిలో 15 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎండల్లో పంట పండించడంలో పడిన ఇబ్బంది కంటే విక్రయంలో మరిన్నిపాట్లు పడుతున్నాం. ప్రతిచోట అదనపు రేట్లు వసూలు చేస్తున్నారు. వే బ్రిడ్జి వద్ద, హమాలీలు మామూళ్ల పేరిట అన్నీ అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. – చావా ప్రవీణ్, రైతు, ముఠాపురం, నేలకొండపల్లి మండలం


