తిరుమలాయపాలెం: సమగ్ర భూసర్వే ద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. సమగ్ర సర్వే కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని కాకరవాయిలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఆదివారం నుంచి క్లస్టర్ల వారీగా భూసర్వే చేపట్టనున్నందున రైతులు పాత పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్‌బుక్స్ తదితర ఆధారాలతో సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూసమస్యలు పారదర్శకంగా పరిష్కారమవడమే కాక అనుభవదారులుగానే మిగిలిన రైతులకు పూర్తి స్థాయి యజమాన్య హక్కులు అందుతాయని చెప్పారు. తహసీల్దార్ లూథర్ విల్సన్, డీటీ సుధీర్, ఆర్‌ఐలు పవన్‌కుమార్, లక్ష్మణ్, సర్పంచ్ గూడురు ఉపేందర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
రవాణాశాఖలో సేవలకు అంతరాయం
ఖమ్మంక్రైం: జిల్లాలోని అన్ని రవాణాశాఖా కార్యాలయాల్లో శనివారం సేవలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్లు డౌన్ కావడంతో ఈ పరిస్థితి ఎదురైందని అధికారుల ద్వారా తెలిసింది. ఈమేరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోవడంతో వాహనదారులు కాసేపు వేచి ఉండి వెనుదిరిగారు. అయితే, శనివారం స్లాట్లు బుక్ చేసుకున్న వాహనాదారులు సోమవారం సేవలు పొందొచ్చని ఇన్‌చార్జ్ ఆర్‌టీఓ శ్రీనివాస్ తెలిపారు.
ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్


