breaking news
Khammam District Latest News
-
అటవీ సరిహద్దులపై వర్క్‌షాప్
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్రంలోని అటవీ భూముల సరిహద్దుల గుర్తింపుపై అటవీ శాఖ దృష్టి సారించింది. నానాటికి అటవీ భూముల ఆక్రమణలు పెరుగుతుండటంతో సరిహద్దుల గుర్తింపు, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగులకు అవగాహన కల్పి స్తున్నారు. రిజర్వ్ ఫారెస్టు భూములు ఆక్రమణతో అడవులు అంతరించిపోవడమే కాక వన్యప్రాణుల మనుగడకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఖమ్మంలోని అటవీశాఖ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) బీమానాయక్ అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, రెవెన్యూ ఉద్యోగులతో సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, కూసుమంచి, తల్లాడ, మధిర, కారేపల్లి, సత్తుపల్లి రేంజ్‌ల్లో 1.50 లక్షల రిజర్వ్ ఫారెస్టు, భూములు నోటిఫై అయినందున సర్వే నంబర్ల ఆధారంగా గర్తించాలని సూచించారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ భూముల సరిహద్దులను గుర్తించడమే కాక రక్షణకు తీసుకోవా ల్సిన చర్యలను వివరించారు. ఎఫ్డీఓ మంజుల, ఉద్యోగులు, డ్రాఫ్ట్మెన్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.అవగాహన కల్పించిన సీసీఎఫ్ బీమానాయక్ -
ఒకే బస్సులో 107 మంది
● మద్యం మత్తులో డ్రైవర్.. ఆపై నిర్లక్ష్యం ● కాలువలో బోల్తా పడిన పాఠశాల బస్సు ● 20 మంది చిన్నారులకు గాయాలు వేంసూరు/పెనుబల్లి: పరిమితికి మించి విద్యార్థుల ను ఎక్కించడమే కాక.. డ్రైవర్ మద్యం మత్తులో ఉండగా పాఠశాల బస్సు సాగర్ కాలువలో బోల్తా పడింది. ఈ సమయాన నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. కాసేపైతే ఇళ్లకు చేరతామన్న భావనతో ఉన్న చిన్నారులు ఈ ఘటనతో భీతిల్లిపోయారు. ఏం జరిగిందో తెలియక రక్తమోడుతున్న గాయాలతో విద్యార్థులు రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెనుబల్లి, వేంసూరు మండలాల మధ్యలో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సామర్థ్యానికి మించి తీసుకెళ్తూ... వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలో వివేకానంద పాఠశాల కొనసాగుతోంది. ఈ పాఠశాలలో మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పెనుబల్లి మండలంలోని గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. రోజులాగే శుక్రవారం పాఠశాల ముగిశాక పెనుబల్లి మండలం గణేషన్‌పాడు, ఎల్ ఎస్.బంజర్, ముత్తగూడెం, గుట్టపాడు తదితర గ్రామాల విద్యార్థులను దింపేందుకు బస్సులో తీసుకెళ్తున్నారు. అయితే, ఒకే బస్సులో 107మంది పిల్ల లను ఎక్కించగా... డ్రైవర్ ఆళ్ల నవీన్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపాడని తెలిసింది. ఆయన రెండు రోజులుగా మద్యం సేవించి వస్తున్నట్లు తెలిసినా పట్టించుకోలేదని సమాచారం. కాగా, బస్సు పెనుబల్లి మండలం గణేషన్‌పాడు శివారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సమీపానికి చేరేసరికి ఎన్నెస్పీ మేజర్ కాలువ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే, కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినా సామర్ధ్యానికి మించి పిల్లలు ఉండడంతో ఒకరిపై ఒకరు పడగా 20మందికి గాయాలయ్యాయి. బస్సు పడుతున్నప్పుడు పెద్ద శబ్దం రావడం, ఆ తర్వాత ఆందోళనతో విద్యార్థులు చేసిన రోదనలు, అరుపులతో స్థానికులు చేరుకుని బయటకు తీశారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ నవీన్ కనీసం పట్టించుకోకుండా పరారవడం గమనార్హం. స్థానికులే పిల్లలను బయటకు తీసి అంబులెన్స్‌లు, ఆటోల ద్వారా 15 మంది తిరుపూరులో ప్రైవేట్ ఆస్పత్రికి, ఏడుగురిని పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్ చేరుకుని సహాయక చర్యలను పరిశీలించగా, ఎమ్మెల్యే మట్టా రాగమయి హుటాహుటీన చేరుకుని వివరాలు ఆరా తీశారు. అంతేకాక తిరుపూరులో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. కాగా, గతంలోనూ ఇదే పాఠశాల బస్సు లచ్చన్నగూడెం, భరణిపాడు గ్రామాల్లో ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. బస్సు ప్రమాదంపై మంత్రుల ఆరా గణేషన్‌పాడు వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిందన్న సమాచారంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్‌తో పాటు రవాణా శాఖ అధికారులు, కల్లూరు ఏసీపీ, సబ్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే జిల్లా ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు. అంతేకాక ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు.బస్సు కాల్వలో పడిన సమయాన పెద్దశబ్దం వచ్చింది. అంతేకాక విద్యార్థుల అరుపులు దగ్గరలోని పొలంలో పనిచేస్తున్న మాకు వినబడ్డాయి. నాతో పాటు మరికొందరం పరుగెత్తి వచ్చి బస్సులో నుంచి విద్యార్థులను బయటకు తీశాం. అందులో చాలామందికి గాయాలయ్యాయి. వీరిని ఆటోలు, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. – పెరవరపు నరసింహ, ప్రత్యక్ష సాక్షి -
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పరిధి విద్యాసంస్థల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు, వార్డెన్లతో శుక్రవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు, హెచ్ఎంలు కేటాయించిన పాఠశాలల్లో వారానికి రెండుసార్లు తనిఖీ చేస్తూ ఫొటోలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్‌బుక్ నిర్వహణ, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అమలుపై సూచనలు చేశారు. కాగా, సర్వారం, ఎలిసిరెడ్డిపల్లి, కమలాపూర్, రేగళ్ల తండా, బొజ్జాయిగూడెం, పాల్వంచ, పాత ఇల్లెందు, గొందిగూడెంతో పాటు ఖమ్మంలోని కొన్ని పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రానందున ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ స్పష్టం చేశారు. తొలుత పీఓ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఓ(జనరల్) డేవిడ్‌రాజ్, వివిధ విభాగాల అధికారులు మధుకర్, అశోక్, విజయలక్ష్మి, రమేష్, శ్రీరాములు, సత్యవతి, రాధమ్మ, భారతీదేవి, అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ -
మరో సమరం !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియగా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పనలో నిమగ్నం కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతుండగా, పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అధిక స్థానాల్లో నెగ్గిన నేపథ్యాన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక గత మున్సిపల్ ఎన్నికల మాదిరి పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్, పూర్వ వైభవాన్ని సాధించేందుకు కమ్యూనిస్టులు.. ఉనికి చాటుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. అదే ఒరవడి సాగేలా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలే కాక పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ జిల్లాలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. ఈ ఎన్నికలు పార్టీల రహితంగా జరిగినా పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ వైభవం చాటాలని కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. స్థానికంగా ఎవరికి బలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే విజయం దక్కుతుందన్న అంశంపై అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. క్లీన్‌స్వీప్ మళ్లీ సాధ్యమా? సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ సాధించింది. సత్తుపల్లిలోని 23 వార్డులకు అన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మధిరలో 22 వార్డులకు 13, వైరాలో 20 వార్డులకు 16 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిన నేపథ్యాన పాత, కొత్త మున్సిపాలిటీల్లో ఎలా సత్తా చాటాలన్న అంశంపై బీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. కమ్యూనిస్టులకు కలిసి వచ్చేనా? పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న సీపీఎం కొంత ప్రభావాన్ని చూపింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు పెదవి కదపడం లేదు. పట్టు ఉన్న ప్రాంతాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలోనే పార్టీలు ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతల్లో చర్చలు సాగుతున్నాయి. మరోవైపు జీపీ ఎన్నికల్లో మాదిరే బీఆర్ఎస్, సీపీఎం పొత్తు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ చరిష్మాతో.. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మోదీ చరిష్మాతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకోవాలనే భావనలో ఉన్నట్లు సమాచారం.గతంలో జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలు ఉండేవి. ఇటీవల ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. 2020 జనవరిలో పాత మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా అన్నింటా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరి 26తో ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించగా ఈనెల చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో అభ్యంతరాల పరిష్కారం, మార్పులు, చేర్పుల అనంతరం 10లోగా తుది ఓటర్ల జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది.వచ్చే నెలలో మున్సి‘పోల్స్’ నిర్వహణ? -
కాసులే ముఖ్యం
కాలం చెల్లినా..ఖమ్మంక్రైం: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిబంధనలు పాటించడం లేదు. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టకుండా వాటిలోనే పిల్లలను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అంతేకాక కాసుల కక్కుర్తితో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 813 స్కూల్ బస్సులు అధికారిక లెక్కల ప్రచారం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు 813 బస్సులు ఉన్నాయి. ఏటా జూన్‌కు ముందు ఖమ్మం, వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో వీటిని తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది మాత్రం 764 బస్సులకే ఫిట్‌నెట్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిసింది. దీంతో మిగిలిన బస్సులను వాడడం లేదా, కాలం చెల్లినా పిల్లలను తరలిస్తున్నారా అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిబంధనలకు మంగళం పెనుబల్లి మండలం గణేషన్‌పాడు సమీపాన వివేకానంద విద్యాలయం బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఇదేరోజు అశ్వాపురం మండలం మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా కొట్టింది. వివేకానంద విద్యాలయం బస్సు బోల్తా పడిన సమయాన అందులో 107 మంది పిల్లలు ఉండడం గమనార్హం. బస్సు ఫీజు అదనంగా వసూలు చేసే యజమానులు అందుకు సరిపడా బస్సులు సమకూర్చకుండా కొన్నింట్లోనే లెక్కకు మిక్కిలిగా తరలిస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు రెండు ఘట నలు జరగడం అటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధి కారుల నిర్లక్ష్యం తేటతెల్లం చేశాయి. అయితే, కొందరు విద్యాసంస్థల యజమానులు బస్సుల విషయంలో నిబంధనలు పాటించకుండా రాజకీయ నాయకుల పైరవీలతో రవాణాశాఖ అధికారులను మచ్చిక చేసుకుంటున్నారని సమాచారం. కొన్ని బస్సులకు ఫిట్నెస్ లేకపోగా, అనుభ వం లేనిడ్రైవర్లను నియమించడం, వారిలో కొందరు మద్యం మత్తులో వస్తున్నా పట్టించుకోకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోందని చెబుతున్నారు.స్కూల్ బస్సులను ఏటా జూన్‌కు ముందు రవాణా శాఖ అదికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయడమే కాక ప్రతీనెల ఒకసారి తనిఖీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తప్ప మిగతా సమయాల్లో అధికారులు తనిఖీల మాటే ఎత్తడం లేదు. ఇక కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదు. బస్సు ఫీజు పేరిట వేలాది రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు కక్కుర్తితో ఒకే బస్సులో వంద మంది చొప్పున తరలిస్తుండడంతో అనుకోని ఘటన జరిగితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశముంది. అయినా, అటు యాజమాన్యాలు.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఇంట్లో భారీపేలుడు
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం 300మీటర్ల దూరం వరకు వినబడగా, ఇంటి సీలింగ్ పెచ్చులు ఊడిపోవడంతో కిటికీలు, అద్దాలు ధ్వంసం కావడమే కాక గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఖమ్మం బైపాస్‌లోని ఓ ఇంట్లో నివాసముండున్న మాదాల నారయణరావు – రమ దంపతులకు కుమారుడు స్నేహన్ చౌదరి ఉన్నాడు. హైదరాబాద్‌లో చదువుతున్న ఆయన సెలవులకు వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటలకు రమ వంట చేసేందుకు స్టౌ వెలిగిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నిద్రలో ఉన్న నారాయణరావు, స్నేహన్ వచ్చేసరికి రమ దుస్తులకు మంటలు అంటుకోవడమే కాక పైకప్పు సీలింగ్ ఊడిపడుతోంది. అంతేకాక శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో నారాయణరావు కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు. అప్పటికే రమ శరీరం కొంత మేర కాలగా ఆమె భర్త, కుమారుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. ఏం జరిగింది? ఇంట్లో పేలుడు ఎలా జరిగిందో అగ్ని మాపక శాఖ, పోలీసు సిబ్బంది అంచనా వేయలేకపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగలేదని గుర్తించారు. అయితే, ఫ్రిజ్‌లో గ్యాస్ లీకేజీతో పేలుడు జరిగి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ, కార్కొపరేటర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు చేరుకుని పరిశీలించారు. అయితే, భారీ పేలుడులో రూ.10లక్షల మేర ఆస్తినష్టం జరిగినా కుటుంబీకులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల్లో 250మంది కేసులు ఖమ్మంక్రైం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 250మందిపై కేసు నమోదు చేయగా, ఇందులో ఖమ్మంకు చెందిన 76మంది ఉన్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీని వాసులు తెలిపారు. కేసు నమోదైన వారిపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడిన వారికి జైలుశిక్షతో జరిమానా విధించే అవకాశముందని తెలిపారు. గాయాలతో బయటపడిన కుటుంబీకులు -
ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల పిల్లలు ఉపకార వేతనాల కోసం వచ్చేనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పి.కృష్ణవేణి సూచించారు. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు, ధార్మిక లేదా ట్రస్టుల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 2024–25 విద్యాసంవత్సరం ఫలితాల ఆధారంగా ఉపకార వేతనాలు అందుతాయని వెల్లడించారు. ఎస్సెస్సీ, ఐటీఐ ఉత్తీర్ణత సాధిస్తే రూ.వేయి, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైతే రూ.1,500, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్లుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.2 వేలు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే మే డే నాటికి ఖాతాల్లో ఉపకార వేతనం జమ అవుతుందని ఆమె తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించిన ఆర్ఎం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌ను రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ శుక్రవారం ప్రారంభించారు. టికెట్ల బుకింగ్ కోసం వచ్చే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, ఖమ్మం, భద్రాచలం డీఎంలు శివప్రసాద్, జంగయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్ బోనకల్: గృహజ్యోతి లబ్ధిదారులకు సౌర విద్యుత్ అందించేలా యూనిట్లు ఏర్పాట్లుచేస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసచారి తెలిపారు. బోనకల్లో శుక్రవారం ఆయన పలువురి ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను పరిశీలించి మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం అమలుచేస్తోందని తెలిపారు. మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని 22 గ్రామాల్లో ఈ పథకం కింద సౌర ప్లాంట్ల ఏర్పాటు పనులు చివరి దశకు చేరడంతో నెలాఖరులోగా సోలార్ వెలుగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.1.40 లక్షల విలువైన సోలార్ ప్యానళ్లను ప్రభుత్వమే ఏర్పాటుచేయిస్తోందని తెలిపారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగదారుల అవసరాలకు వాడుకుని మిగిలితే ప్రభుత్వమే కొనుగోలు చేసి నగదును ఖాతాల్లో జమ చేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లకు కూడా త్వరలోనే ఈ విధానం అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఎస్ఈ తెలిపారు. రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్‌బాబు, డీఈ బండి శ్రీనివాసరావు, ఏఈఈ మనోహర్, ఎస్ఎల్ఆర్ శేషగిరిరావు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి ఖమ్మంరూరల్: మున్సిపాలిటీల ఎన్నికలకు ఎప్పుడు జరిగినా పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఆమె సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం, మధిర మున్సిపల్ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఉద్యోగుల ఎంపిక, శిక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను త్వరగా గుర్తించి అవసరమైన వసతుల కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కమిషనర్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, రామచంద్రరావు, నరసింహం, గురులింగం, సంపత్‌కుమార్, డీపీఓ రాంబాబు, జిల్లా క్రీడల అధికారి సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ నిర్మాణానికి రూ.2లక్షల విరాళం
కామేపల్లి: మండలంలోని రామకృష్ణాపురంలో గంగమ్మతల్లి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ అజ్మీర ద్వాలీచిన్నా రూ.2లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మాణ కమిటీ సభ్యులకు నగదు అందజేశాక ఆమె మాట్లాడారు. గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసి మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాన ని తెలిపారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సూదనపు కోటయ్య, వార్డు సభ్యులు భాగం రంగా రావు, సర్వయ్య, వీరబోయిన నాగేశ్వరరావు, పెరుగు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని శ్రీజ ఫర్టిలి టీ సెంటర్, గుర్రం డెంటల్ కేర్ ఆస్పత్రులతో పాటు స్టార్ డయాగ్నస్టిక్ సెంటర్లో డీఎంహెచ్ ఓ డి. రామారావు శుక్రవారం తనిఖీ చేశారు. ఆయా సెంటర్లలో వైద్యసేవలు, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, ధరల పట్టిక, అందుబాటులో ఉన్న వైద్యుల వివరాలు ఆరా తీశారు. అంతేకాక రోగులకు వసతులు, రక్షణ పరికరాల వివరాలు తెలుసుకున్న ఆయన ధరల జాబితాతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేయబోమంటూ బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. నమోదైన వైద్యులు తప్ప ఇతరులతో సేవలు అందించినట్లే తేలితే చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఇంట్లో చోరీ ●రూ.15లక్షలకు పైగా విలువైన బంగారం, నగదు అపహరణ రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం కోయచలకలో శుక్రవారం ఉదయం చోరీజరిగింది. మహిళా కానిస్టేబుల్ విధులకు వెళ్తుండగా ఆమెను బస్సు ఎక్కించేందుకు భర్త కూడా వెళ్లగా తిరిగొచ్చే సరికి దుండగులు బంగారు ఆభరణాలు, నగదు ను చోరీ చేశారు. గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ తెలబోయిన పూజిత ఇల్లెందులో విధులు నిర్వర్తిస్తుండగా శుక్రవారం ఉదయం ఆమెను కోయచలక క్రాస్ వద్ద దింపడానికి భర్త రాంబాబు వెళ్లాడు. బస్సు ఎక్కించాక పొలం పనులు చూసుకుని రాంబాబు వచ్చేసరికి ఇంటి వెనక తలుపు పగలగొట్టి ఉంది. లోపల పరిశీలించగా బీరువాలోని 13 తులా ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే, పూజిత దంపతులు బయటకు వెళ్తున్నట్లు గుర్తించి కాపుకాసిన నిందితులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న రఘునాథపాలెం, సీసీఎస్ సీఐలు ఉస్మాన్ షరీఫ్, రాజు, ఎస్ఐ వి.శ్రీనివాస్ క్లూస్స్ టీంతో చేరుకుని విచారణ చేపట్టారు. -
●హాహాకారాలు.. ఆర్తనాదాలు
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట శివారు ఎర్రమ్మగుడి సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట వంతెన వద్ద పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తాపడింది. పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల విద్యార్థులతో మణుగూరు నుంచి బయలుదేరిన బస్సు మొండికుంట దాటాక అటవీ ప్రాంతంలో స్టీరింగ్ సక్రమంగా పనిచేయక అదుపు తప్పి వాగు, వంతెన పక్కకు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉండగా, 40 మందికిపైగా గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రాజేష్ సిబ్బందితో చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, విద్యార్థులంతా డిప్లొమా, బీటెక్ కోర్సులు చదువుతున్నారు. అయితే, మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఎర్రమ్మగుడి సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. రెప్పపాటు తప్పినా బస్సు వాగులో బోల్తాపడేది. బస్సువాగులో బోల్తా పడితే పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయం ఉండేది. వాగును చూసిన స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్ ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైన బస్సు కావడంతో స్టీరింగ్ స్టక్ అయి ప్రమాదం జరిగినట్టు సమాచారం. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసి అక్కడకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రక్తమోడుతున్న తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
నేలకొండపల్లి: వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిం డర్ పేలడంతో గాయపడిన మహిళకు చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన ఇందుమతి(50) గత మంగళవారం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. ఘటనలో ఇందుమతికి తీవ్ర గాయాలు కాగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో కుమారుడు వెంకటేష్ సైతం గాయపడ్డాడు. వీరిలో ఇందుమతిని హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. రోడ్డుప్రమాదంలో ఒడిశా వాసి మృతి ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుర్రాలపాడు వద్ద కారు ఢీకొన్న ఘటనలో రబీంద్ర డాకువా(46) మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పతార్పంజికి చెందిన డాకువా గుర్రాలపాడులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లోకి సరుకులు తీసురావడానికి వెళ్తూ రోడ్డు దాడుతుండగా వెంకటగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఆయన బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలపై తనిఖీలుబోనకల్: మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో అనుమతి లేకుండా మట్టి తవ్వి తరలి స్తున్నారనే ఫిర్యాదుతో ఉద్యోగులు తనిఖీచేపట్టా రు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు శుక్రవారం మై నింగ్ ఆర్ఐనాగరాజు,గిర్దావర్ వహీదా సుల్తానా తవ్వకాలు జరుగుతున్న చోటుకు వెళ్లారు. వీరిని గుర్తించిన పలువురు పారిపోగా, జేసీబీని సీజ్ చేసి తహసీల్‌కు తరలించారు.యూరియా కోసం అవే అగచాట్లు నేలకొండపల్లి: యూరియా కోసం రైతులు తిప్పలు తీరడం లేదు. ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన యాప్ పనిచేయక ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న కూపన్లతో దుకాణాలు, సొసైటీల వద్ద బారులుతీరుతున్నా రు. నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ సొసైటీల వద్దే శుక్రవారం క్యూలైన్లు కని పించాయి. యూరియా స్టాక్‌తో పోలిస్తే ఎక్కువ మంది రైతులు రావడంతో ఒకటి, రెండు బస్తాలే ఇస్తుండగా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులందరికీ సరిపడా యూరియా చింతకాని: మండలంలోని చింతకాని, నాగులవంచ సొసైటీల్లో యూరియా పంపిణీని జిల్లా సహకా ర అధికారి గంగాధర్‌రావు శుక్రవారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాక్ కు అనుగుణంగా రైతులకు కూపన్లను జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ అధి కారులను సమన్వయం చేసుకుంటూ సరిపడా యూరియా నిల్వలు సేకరించాలని తెలిపారు. కాగా, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికా వొద్దని, సరిపడా యూరియా సరఫరా చేస్తామని వెల్లడించారు. కాగా, పలు సొసైటీలతో పాటు యూరియా పంపిణీ కేంద్రాలను మధిర ఏడీఏ విజయ్‌చంద్ర పరిశీలించి మాట్లాడారు. మండలంలోని రెండేసి గ్రామాలకు ఒక యూరియా పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీని వాసరావు, ఏఓ సోములపల్లి మానస, సొసైటీ సీఈఓలు వై.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, ఏఈఓలు పాల్గొన్నారు. -
ప్రతీ రైతుకు యూరియా అందిస్తాం..
● అవసరానికి మించి మాత్రం కొనుగోలు చేయొద్దు ● కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్ కొణిజర్ల: పంటలు సాగుకు అనుగుణంగా రైతులందరికీ యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కొణిజర్లలోని గోపవరం వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరియా పంపిణీని పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూరియా విషయంలో రైతులు అపోహలు వీడాలని సూచించారు. జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున అందరికీ సరఫరా చేస్తామని తెలిపారు. మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్న కొణిజర్ల, చింతకాని, బోనకల్, ముదిగొండ మండలాల్లో ప్రతీ రెండు వేల ఎకరాలకు ఒక సేల్ పాయింట్ ద్వారా పంపిణీ చేపడతామని చెప్పారు. కొణిజర్ల మండలంలో ఇప్పటికే ఉన్న ఏడు సేల్ పాయింట్లకు తోడు మరో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అంతేకాక యూరియా కోసం రైతులు ఎప్పుడు రావాలో ముందస్తు సమాచారం ఇస్తామని వెల్లడించారు. అయితే, రైతు తన సాగు విస్తీర్ణానికి కావాల్సిన యూరియా కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని, ఈ విషయంలో ఉద్యోగులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డ్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, ఏడీఏ కరుణశ్రీ, తహసీల్దార్ అరుణ, ఏఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు, -
సమాజ సేవ అందరి బాధ్యత
●కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నారాయణ రఘునాథపాలెం/చింతకాని/తిరుమలాయపాలెం: సమాజ సేవను అందరూ బాధ్యతగా భావించాలని, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఇందులో కీలకంగా వ్యవహరించాలని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్సీసీ కోఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సూచించారు. రఘునాథపాలెం మండలం రేగులచలకలో ఎంజేపీటీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం శుక్రవారం ముగియగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు, ఆర్సీఓ సీ.హెచ్.రాంబాబు, సర్పంచ్ యండపల్లి రమాదేవి సత్యం, అధ్యాపకులు డాక్టర్ ఎన్.స్వాతి, సునీత, వినీల, అనిత, హుస్సేనితో పాటు నున్నా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, చింతకాని మండలం తిరుమలాపురంలో నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యాన, తిరుమలాయపాలెంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిబిరాలను నారాయణ ప్రారంభించారు. డీఐఈఓ రవిబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా పీఓ డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు మల్లయ్య, చాపలమడుగు వీరబాబు, నాగమణి, పి.నవీన్‌బాబు, కృష్ణార్జున్‌రావు, స్వాతి, ఉమారాణి, సుజాత, విజయకుమారి పాల్గొన్నారు. -
కార్యాలయాల్లో మెరుగైన వసతులు
ఖమ్మం సహకారనగర్: ప్రజాసేవల్లో నాణ్యత పెంచేలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన మరమ్మతులు, కావాల్సిన వసతులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ భవనం, ఆర్అండ్బీ కార్యాలయం, విశ్రాంతిగృహం, బాల రక్షా భవనం, గిరిజన భవనాన్ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో ఆయన పరిశీలించారు. కార్యాలయాల్లో ఉద్యోగులతో మాట్లాడి వసతులు, పని వాతావరణం, ఇంకా కావాల్సిన సదుపాయాలపై ఆరాతీశాక కలెక్టర్ మాట్లాడారు. అనంతరం హరిత హోటల్ నిర్మాణానికి స్థలం గుర్తింపు కోసం ఎన్నెస్పీ క్యాంప్‌తో పాటు పలు ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.హరిత హోటల్ నిర్మాణానికి స్థలసేకరణ -
గుండెపోటుతో రైతు మృతి
తల్లాడ: ఓ రైతు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లే క్రమాన స్నేహితులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి బయలుదేరుతుండగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దొడ్డ నరేందర్(40) పిల్లలు చదువుల నిమిత్తం ఖమ్మంలో నివసిస్తుండగా, స్వగ్రామంలో ఉన్న పదెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై గురువారం గ్రామానికి వచ్చిన ఆయన పొలం వద్దకు వెళ్లగానే గుండెల్లో నొప్పిగా ఉండడంతో తిరిగి ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యలో యూనియన్ బ్యాంకులో పని చూసుకుని స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక ఖమ్మం వెళ్తుండగా రెడ్డిగూడెం సమీపాన రెండోసారి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే కుప్పకూలిన ఆయనను స్థానికులు 108అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా మరణించాడు. కాగా, నరేందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కత్తితో పలువురిపై దాడి ఖమ్మంరూరల్: ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన గంజుతారి మోహన్ పలువురిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కోటనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కోటనారాయణపురానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ఏసు మణికంఠం తన స్నేహితుడు ఎస్కే.అబ్దుల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమాన హోటల్ వద్ద మోహన్ వీరితో ఘర్షణకు దిగగా మణికంఠం తన బావ రామకృష్ణకు ఫోన్లో చెప్పడంతో ఆయన చేరుకున్నాడు. అక్కడ మోహన్ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. గొడవ ఆపేందుకు యత్నించిన సాయికుమార్పైనా దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
పింఛన్ ఆగిపోతుంది.. జాగ్రత్త
● లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇక్కట్లు ● సంస్థలో ఇంకా 15,888 మంది పెండింగ్ రుద్రంపూర్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పింఛన్ ఆగిపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సంస్థ వ్యాప్తంగా సీఎంపీఎఫ్ పెన్షనర్లు, సీపీఆర్ఎంఎస్(పోస్ట్ రిటైర్మెంట్ కార్పొరేట్ మెడికల్ స్కీమ్) కార్డుదారులు రెన్యువల్ కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంది. తద్వారా ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు పింఛన్ క్రమం తప్పకుండా అందుతుంది. పింఛన్‌దారుడు బతికే ఉన్నట్లు నిర్ధారించేందుకు ఈ సర్టిఫికెట్ అవసరం కాగా, ఒకవేళ వారు మృతి చెందితే వారి నామినీకి పింఛన్ అందించనున్నారు. అలాగే, సీపీఎంఆర్ఎస్ ద్వారా వైద్యసేవలు పొందేందుకు లైఫ్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఇచ్చింది 72,212 మంది సింగరేణి వ్యాప్తంగా 88,100 మంది పెన్షన్‌దారులు ఉండగా అందులో 72,212 మందే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఇంకా 15,188 మంది అందజేయాల్సి ఉంది. అలాగే, సీపీఆర్‌ఎంఎస్‌లో 81,595 మందికి 14,693 మంది ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.300 మొదలు రూ.20 వేల వరకు పెన్షన్ పొందే కార్మికులు ఉన్నారు. కాగా, ప్రకటనలతో సరిపెట్టకుండా ఏరియా వారీ జాబితా రూపొందించి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేలా అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. కాగా, సింగరేణి కార్మికులు పింఛన్‌తో పాటు వైద్యసౌకర్యం కోసం లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశమున్నందున సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రిటైర్డ్ ఉద్యోగుల కోసం నెల పాటు గడువు ఇచ్చాం. అయినా 15వేల మందికి పైగా లైఫ్ సర్టిఫికెట్లను ఇప్పటివరకు సమర్పించలేదు. ఇకనైనా ఫోన్లో యాప్ ద్వారా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు అందజేయాలి. – కిరణ్‌కుమార్, జీఎం (పర్సనల్) -
పెద్దమ్మను హత్య చేసిన రౌడీషీటర్
ఖమ్మంక్రైం: భూతగాదాల్లో సొంత పెద్దమ్మను ఓ రౌడీషీటర్ నడిరోడ్డుపై హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బొక్కలగడ్డలో గురువారం ఈ ఘటన చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంనకు చెందిన మోటె రాములమ్మ(70) కుటుంబం బతుకుదెరువు కోసం ఏళ్ల క్రితం ఖమ్మం వచ్చి బొక్కలగడ్డలో నివాసం ఉంటోంది. ఆమె భర్త యాదగిరి మృతి చెందాక కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు నర్సింహారావుతో జీవిస్తోంది. ఆమె భర్త, ఆయన సోదరులకు సంబంధించి స్వగ్రామంలో ఐదెకరాల పొలం ఉండగా ఇంకా పంచుకోలేదు. ఆ భూమిని రాములమ్మ గ్రామంలో ఉంటున్న కుమార్తె పేరిట రిజిస్టర్ చేశాక గొడవలు మొదలయ్యాయి. పెద్దమనుషులు బుధవారం మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేవరకు పొలాన్ని దున్నవద్దని చెప్పారు. అయినా రాములమ్మ కుమార్తె దున్నిస్తోందనే సమాచారంతో ఖమ్మం వెంకటేశ్వరనగర్‌లో జీవిస్తున్న రాములమ్మ మరిది కుమారుడు మోటె శేఖర్ పెద్దమ్మ ఇంటికి రాగా, ఆ సమయంలో ఆమె కుమారుడు పనికి వెళ్లాడు. ఈక్రమాన వాదన పెరగడంతో ఆరుబయట మిర్చి తొడిమలు తీస్తున్న రాములమ్మ ఊపిరితిత్తులపై శేఖర్ కత్తితో పొడవడంతో సమీపంలోని మహేష్ అనే వ్యక్తి రాగా ఆయనపైనా దాడి చేశాడు. ఘటనలో తీవ్రగాయాలతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందగా శేఖర్ పారిపోయాడు. కాగా, జులాయిగా తిరిగే శేఖర్‌పై ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌తో పాటు పలు కేసులు నమోదయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ మోహన్‌బాబు, ఎస్ఐ కొండలు చేరుకుని రాములమ్మ మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు. మృతురాలి కుమారుడు నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా,నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భూమి పంపకంలో తగాదాలే కారణం -
రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం
ఖమ్మంక్రైం: ఈనెల 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాలను గురువారం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతిఒక్కరు రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని సూచించారు. అంతేకాక వాహనదారులు అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం రవాణా శాఖ ఉద్యోగులతో కలిసి ఆయన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆతర్వాత జిల్లా రవాణా శాఖా కార్యాలయంలో పలువురు డ్రైవర్లకు అవగాహన కల్పించి భద్రతా నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్టీఓ వరప్రసాద్, ఆర్టీఓ సభ్యుడు వెంకన్న, ఏఎంవీఐలు స్వర్ణలత, సుమలత, దినేష్, రవిచంద్ర, సిబ్బంది సరిత, లక్ష్మి, ప్రసన్న, నిశ్చల తదితరులు పాల్గొన్నారు. -
3.26 కోట్ల చేపపిల్లలు
● జిల్లాలోని 820 జలాశయాల్లో వదిలిన అధికారులు ● చేపపిల్లల విలువ రూ.4.50కోట్లుఖమ్మంవ్యవసాయం: మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా రూపొందించిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం జిల్లాలో ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరింది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లోకి సమృద్ధి నీరు చేరింది. దీనికి తోడు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండడం, అక్కడి నుంచి నీటి విడుదలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని 882 జలాశయాల్లో 3.48 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, ఉచిత చేప పిల్లల పంపిణీ టెండర్లకు తొలుత కాంట్రాక్టర్లు ముందుకు రాక జాప్యం జరిగింది. చివరకు ప్రభుత్వం చర్చలు జరపడంతో సెప్టెంబర్ చివరి వారంలో టెండర్లలో పాల్గొన్నారు. కాగా, కోర్టు కేసుల కారనంగా 42 జలాశయాలు మినహా మిగతా వాటిలో చేపపిల్లల విడుదల పూర్తిచేశారు. సైజ్‌ల వారీగా.. జిల్లాలోని 820 జలాశయాల్లో సుమారు రూ.4.50 కోట్ల విలువైన 3.26 కోట్ల చేపపిల్లలను విడుదల చేశారు. నీటి సామర్ద్యం, ఇతర వనరుల ఆధారంగా రెండు రకాల సైజ్‌ల్లో చేపపిల్లలను వదిలారు. 80–100 మి.మీ.ల బొచ్చు, రవ్వు, బంగారు తీగ పిల్లలు 2.20 కోట్లు ఉండగా, 35–40 మి.మీ.ల సైజ్‌లో బొచ్చ, రవ్వ, మోసు రకాలు 1.06 కోట్ల పిల్లలను జలాశయాల్లో విడుదల చేశారు. 16,500 మంది మత్స్యకారులకు ఉపాధి జలాశయాల్లో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లలు విడుదల చేయడంతో మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతుంది. జిల్లాలోని 210 మత్స్య సహకార సంఘాల్లో 16,500 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేయించాక సంరక్షణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగిస్తారు. సభ్యుల చేప పిల్లలను సంరక్షిస్తూ ఏటా వేసవిలో మూడు నెలల పాటు చేపలు వేటాడి అమ్మమడం ద్వారా ఉపాధి పొందుతారు. జిల్లాలోని జలాశయాల నుంచి ఏటా సుమారు 25 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. జిల్లాలోని జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడం చేపల పెంపకానికి కలిసి వస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు జలాశయాల్లోకి చేరడంతో చేపపిల్లల ఎదుగుదలకు ఎలాంటి ఆటంకాలు రావు. ఈ ఏడాది లక్ష్యం మేర చేప పిల్లలను వదిలాం. తద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది. – శివప్రసాద్, జిల్లా మత్స్య శాఖ అధికారి -
గడప గడపకు.. మన సర్పంచ్ !
ముదిగొండ: ఇటీవల ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన వారు గ్రామాల్లో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముదిగొండ మండలంలోని వనంవారి కిష్టాపురం, ముత్తారం సర్పంచ్‌లు పర్ణకోల సరళ, ఎల్.మమత నూతన సంవత్సరం సందర్భంగా గురువారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్తూ ఆ ఇంటి పరిసరాలు, వీధుల్లో సమస్యలపై ఆరా తీసి ప్రత్యేక పుస్తకంలో నమోదు చేస్తున్నారు. అంతేకాక ప్రభుత్వ పథకాలకు అర్హుల వివరాలను ఆరా తీశారు. తొలి రోజు పదేసి ఇళ్లకు వెళ్లగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాక సమస్యలు తెలుసుకున్నారు. అన్నింటినీ సమస్యనుప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్‌లు సరళ, మమత వెల్లడించగా వారితో పాటు పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
డిప్యూటీ సీఎంను కలిసిస డీసీసీ అధ్యక్షుడు
ఖమ్మంమయూరిసెంటర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కలిశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కబడ్డీ టోర్నీ విజేత చెరువుమాధారం నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో పలు ప్రాంతాల జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్‌లో చెరువుమాధారం జట్టు విజేతగా నిలవగా, కోదాడ, కల్లూరు, కోదాడ(బీ), చెరువుమాధారం ఆటో యూనియన్ జట్లు ఆతర్వాత స్థానాల్లో నిలిచాయి. ఆయా జట్లకు సర్పంచ్ అమరగాని ఎల్లయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూరేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నదానానికి రూ. లక్ష విరాళంభద్రాచలంటౌన్: జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో అన్నదానానికి పట్టణానికి చెందిన ఉంగరాల వెంకట్రావు–లక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయిదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ నిధులతో గురువారం సుమారు 1,400 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్రీడాకారిణికి సన్మానం బోనకల్: ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన చాపలమడుగు శశికళను పలువురు సన్మానించారు. మండలంలోని చిరునోములకు చెందిన ఆమె సర్పంచ్ అనుమోలు చంద్రకళ, ఉప సర్పంచ్ నిమ్మతోట రఘు, వార్డు సభ్యులతో పాటు బోనకల్ కళాశాల అధ్యాపకులు వేర్వేరుగా సన్మానించి అభినందించారు. ప్రిన్సిపాల్ నళినిశ్రీ, అధ్యాపకులు అంతోటి తిరుపతిరావు, ప్రేమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టోల్గేట్ వద్ద 1033 అంబులెన్స్‌లు నేలకొండపల్లి: జాతీయ రహదారిపై ఎక్కడో ఓ చోట తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు తరలించేలా నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు టోల్గేట్ల వద్ద 1033 నంబర్‌తో అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి టోల్గేట్ వద్ద రెండు అంబులెన్స్‌లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. క్షతగాత్రులు 108 వాహనాలతో పాటు 1033 వాహనాల సేవలు కూడా పొందొచ్చని అధికారులు సూచించారు. ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వాహనాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్‌పర్సన్‌గా చంద్రకళ టేకులపల్లి: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు పూనెం చంద్రకళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అనుబంధ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి నియామక పత్రం విడుదలైందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గురువారం టేకులపల్లిలో ఆమెను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరం హనుమంతు, నాయకులు భూక్యా దేవానాయక్, కోరం మహాలక్ష్మి, బండ్ల రజిని, రాసమల్ల నరసయ్య, ఎనగంటి అర్జున్‌రావు, బోడ సరిత తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలు, అత్త దూరమై ఆవేదన
తల్లాడ: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు మృతి చెందారు.. అదే ఘటనలో అత్త, మరో బంధువు మృతి చెంది ఎనిమిది నెలలు దాటినా వారి జ్ఞాపకాలను మరిచిపోలేని వివాహిత తరచూ కన్నీరుమున్నీరయ్యేది. అదే ఆవేదనతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా ఆ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయిన ఘటన ఇది. గత ఏడాది ఏప్రిల్ 29న తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వినోద్ – రేవతి(30) దంపతుల కవల కుమారులు వరుణ్, తరుణ్ తేజ్, వినోద్ తల్లి సుశీల, మేనకోడలు మృతి చెందారు. అప్పటి నుంచి వినోద్ భార్య రేవతి మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇద్దరు పిల్లలే కాక అత్త, మరొకరు మృతితో మనోవేదనకు గురవుతున్న ఆమె డిసెంబర్ 22న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది. ఆ సమయాన ఇంటి ముందు ఉన్న వినోద్ అనుమానంతో తలుపు నెట్టగా రాకపోవటంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి అప్పటికే అపస్మారక స్థితికి చేరిన రేవతిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమించడంతో రేవతి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.జ్ఞాపకాలు మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య -
ఓటర్ల జాబితా రెడీ
మధిర: మధిర మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితాను కమిషనర్ సంపత్‌కుమార్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుండగా, మార్పులు, చేర్పుల కోసం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మధిర మున్సిపల్లో 22 వార్డులకు గాను ముసాయిదా ప్రకారం 25,679 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిలో 13,424 మంది మహిళలు, 12,251 మంది పురుషులతో పాటు ఇతరులు నలుగురు ఉన్నారని కమిషనర్ తెలిపారు. సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 23 వార్డులకు గాను ఓటర్ల జాబితా సిద్ధమైంది. ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ విడుదల చేయగా, 28,479 మంది ఓట ర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో 13,465 మంది పురుషులు, 14,999 మంది మహిళా ఓటర్లతో పాటు 15 మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. వైరా: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైరా మున్సిపాలిటీ పరిధి 20 వార్డులకు సంబంధించి ఓటర్ల ముసాయిదాను కమిషనర్ యూ.గురులింగం విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం విచారణ చేపట్టడంతో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాక తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదాను కయమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి విడుదల చేసి మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు గాను 45,256 ఓటర్లు ఉన్నారని తెలిపారు. జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు అందించాలని సూచించారు. కాగా, ఈనెల 5న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్లూరు రూరల్ : కల్లూరు మున్సిపాలిటీ ఓటర్ల జాబితా ముసాయిదాను కమిషనర్ ఎం.రామచంద్రరావు గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా మహిళా ఓటర్లు 9,785 మంది, పురుషులు 9,081 కలిపి మొత్తం 18,866 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కాగా, మున్సిపల్ పరిధిలో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా ముసాయిదా తయారీని కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్ గురువారం పరిశీలించారు. మున్సిపల్లో 20 వార్డులకు గాను 13 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు జిల్లాలోని మున్సిపాలిటీల్లో గురువారం ఓటర్ల ముసాయిదా జాబితాలు విడుదల చేశారు. మధిర, సత్తుపల్లి, వైరా పాత మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ముసాయిదా సిద్ధం చేశారు. ఈనెల 5వ తేదీన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడమే కాక ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాక 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. కాగా, ముసాయిదా ఆధారంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. -
కొత్త మొక్కులు !
ఆలయాలకు పోటెత్తిన భక్తులునూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలకు గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద బారులు దీరగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, ఏపీలోని వివి ధ ప్రాంతాల భక్తులు రావడంతో కిటకిటలా డింది. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయం, వాహన పూజలు, తలనీలాల టికెట్ల ద్వారా ఒకే రోజు ఆలయానికి రూ.5,05,900 ఆదాయం సమకూరింది. జమలాపురం సర్పంచ్ తుళ్లూరు నిర్మల–కోటేశ్వరరావు భక్తులకు ప్రసాద వితరణ చేయగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ఉప్పల విజయదేవశర్మ ప్రమాణ స్వీకారం చేశా రు. ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు ఉప్పల రాజీవ్‌శర్మ, ఎస్ఐ రమేష్, ఉద్యోగులు సోమ య్య, ముల్పూరి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ఎర్రుపాలెం/సాక్షి నెట్వర్క్ -
అభివృద్ధికి ‘ప్లాన్’!
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించనుండగా.. ఆయన ఆమోదిస్తే ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నమూనా, బడ్జెట్, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఈ ఏడాది శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నవమికి శంకుస్థాపన? నూతనంగా రూపొందించిన డిజైన్‌పై మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించారు. మరో మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి సైతం అభివృద్ధి నమూనాపై దృష్టి సారించారు. 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించి, పుష్కరాల నాటికి భక్తులకు రామయ్య దర్శనానికి ఆటంకం లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్లాన్ తుది రూపుపై వేగం పెంచినట్లు తెలుస్తొంది. ప్లాన్‌ను సీఎం ఆమోదిస్తే మార్చి 27న శ్రీరామనవమి రోజున ఆయనతోనే శంకుస్థాపన చేయించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా మాఢ వీధుల విస్తరణలో ఇప్పటికే భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించగా, వారికి బ్రిడ్జి సెంటర్లో ఉన్న ఆర్అండ్బీ కార్యాలయ ఖాళీ స్థలాన్ని అప్పగించాల్సి ఉంది. చర్చనీయాంశంగా అర్చకుల వినతి.. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్ సీఎం రేవంత్‌రెడ్డి ఫైనల్ చేసే క్రమాన శ్రీ భద్రాచల సీతారామ అర్చక సంఘం పేరిట అర్చకులు వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు స్తపతి, ఇతర అధికారుల సలహాలు, సూచనలతో ఆలయ అధికారులు ప్లాన్ రూపొందించారు. దీన్ని మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు ఆమోదించే తరుణాన మరికొన్ని మార్పులను సూచించారు. ప్రధానంగా రెండో ప్రాకారం, దాని నిర్మాణంపై సలహాలు, సూచనలు చేశారు. మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలు గర్భాలయానికి వెనుక, ఉత్తర, దక్షిణ దిక్కులో నిర్మించాలని, ఆలయ ప్రాకా రాలకు అవతల ఈశాన్య భాగంలో పుష్కరిణి, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ద్వాదశ మండ పం, ఆండాళ్ అమ్మవారి ఆలయానికి ఎదురుగా పౌర్ణమి మండపం నిర్మించాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం వినతిపత్రంలో ప్రస్తావించారు. ఆలయ నమూనా సిద్ధం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన డిజైన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేవా దాయ శాఖకు చెందిన ఆర్కిటెక్ట్ బృందం, స్తపతి, కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల పలుమా ర్లు భద్రాచలం వచ్చి భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ విస్తరణ వంటి పలు పనులను ప్లాన్‌లో సూచించారు. వైదిక సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. వీటన్నింటి తర్వాత తుది ప్లాన్‌ను ఇటీవలే కలెక్టర్ ఫైనల్ చేయగా దేవా దాయ శాఖ కమిషనర్ వద్దకు చేరింది. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అధికారులు, వైదిక సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ప్లాన్‌పై సమగ్ర అవగాహనకు వచ్చారు. కాగా దేవాదాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం మూడు విడతలుగా రూ.350 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్లాన్‌ను ఆమోదిస్తే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఇతర అంశాలపై స్పష్టత రానుంది.సిద్ధమైన రామాలయ మాస్టర్ ప్లాన్ నమూనా -
సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మం అర్బన్: హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యూరియాపై ఆందోళన వద్దు ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. పంటల సాగుకు అవసరమైన యూరియా సరిపడా పంపిణీ చేయనుండగా.. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 22,472మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా, ఇంకా 13,453 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. అధికారులు పర్యవేక్షిస్తున్న నేపథ్యాన రైతులు యూరియా విషయంలో అపోహలకు గురికావొద్దని, సమస్యలు ఎదురైతే ఏఓ, ఏఈఓల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు. రేపటి నుంచి ‘టెట్’ ఖమ్మం సహకారనగర్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన నిర్వహించే టీచర్ ఎలిజిబులిటీ టెస్టు(టెట్)ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. సెలవు మినహా ఎనిమిది రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్ష నిర్వహణకు జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజు రెండు సెషన్లలో జరిగే పరీక్షకు సుమారు 2వేల మంది హాజరుకానున్నారు. ప్రతీ కేంద్రానికి అబ్జర్వర్‌తో పాటు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. టెట్ కేంద్రాల వద్ద ఆంక్షలు ఖమ్మంక్రైం: ఈనెల 3నుంచి 20వ తేదీ వరకు జరగనున్న టెట్ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఉదయం 7–30నుంచి సాయంత్రం 6గంటల వరకు 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉండనున్నందున కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష సమయాన కేంద్రాల పరిసరాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ, దుకాణాలు మూసివేయాలని సీపీ సూచించారు. -
రేసులో ఉంటుందా?!
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్‌లో కసరత్తు ● తుది నిర్ణయం మంత్రి తుమ్మల చేతిలో... ● అంతా అనుకూలిస్తే కౌన్సిల్ రద్దుపై తీర్మానానికి యోచన ● అందుకు కావాల్సిన సంఖ్యాబలంపై లెక్కలుమిగతా మున్సిపాలిటీలతో కలవాలని.. రాష్ట్రంలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో పాటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై మంత్రి తుమ్మల సూచనలతో మేయర్, ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశం కాగా మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని మున్సిపాలిటీలతో కలిపి కేఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ డివిజన్లు కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రికి చేరిన సమాచారం పార్టీలోని మెజార్టీ కార్పొరేటర్లు ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపిన అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడాక స్పష్టత వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీలో చేరారు. ఈ బలానికి తోడు ప్రభుత్వం అధికారంలో ఉండడం.. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో కార్పొరేషన్‌ను కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మే 7వ తేదీ వరకు పాలకవర్గానికి గడువు ఉన్నా మిగతా మున్సిపాలిటీలతో కలిపి ఎన్నికలకు వెళ్తే పార్టీపరంగా కలిసివస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనందున మంత్రి నిర్ణయం కీలకం కానుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బలాబలాలు మారినా తక్కువే.. గత ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 45, కాంగ్రెస్ 10, సీపీఎం, సీపీఐ రెండేసి డివిజన్లతో పాటు ఒక డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. తద్వారా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బలాబలాలు మారాయి. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి 31 మంది, బీఆర్ఎస్కు 26 మంది, సీపీఎంకు ఇద్దరు, సీపీఐకి ఒక కార్పొరేటర్ ఉన్నారు. కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి కాంగ్రెస్‌కు తోడు సీపీఎం, సీపీఐ సభ్యులు మద్దతు తెలిపినా 34 మందే అవుతారు. కానీ 40 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా... ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మద్దతు తెలుపుతారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఇదంతా వారం రోజుల్లోనే పూర్తిచేయాలన్న భావనతో ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందడుగు పడనుంది.కౌన్సిల్‌ను రద్దు చేయాలన్న తీర్మానాన్ని మెజార్టీ సభ్యులు బలపరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగనుంది. మొత్తం 60 మంది కార్పొరేటర్లలో 40 మంది అంటే 2/3 సభ్యులు తీర్మానానికి అంగీకారం తెలపాలి. ఇందుకోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదా రాతపూర్వక తీర్మానం పై 2/3 వంతు సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్‌కు ఇస్తేఅక్కడి నుంచి ప్రభుత్వానికి చేరుతుంది. ఆపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా కౌన్సిల్ రద్దవుతుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత సంఖ్యా బలం లేనందున తీర్మాన కాపీపై సంతకాలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. -
ఏరులై పారింది!
● గత ఏడాది రూ.2,238 కోట్ల విలువైన మద్యం విక్రయం ● అత్యధికంగా డిసెంబర్లో రూ.277 కోట్లు వైరా: అంతకుముందు ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా 2025లో గణనీయమైన స్థితిలోనే నమోదు కావడం విశేషం. కొత్త ఎౖక్సైజ్ పాలసీ డిసెంబర్ 1న అందుబాటులోకి రావడం, ఆ వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు జరగడంతో అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు కలిసొచ్చింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి రూ.2,238 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలోని 204 వైన్స్, 52 బార్లు, మూడు క్లబ్‌లకు ఈ మద్యం సరఫరా అయింది. డిసెంబర్లోనే అత్యధికంగా రూ.277 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా, రోజుల వారీగా పరిశీలిస్తే మార్చి 29న రూ.25.85 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. బెల్టు షాపుల జోరు ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని వైన్స్‌ల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా అవుతోంది. వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపుల వారికి ధర పెంచడమే కాక ప్రత్యేక లేబుళ్ల ఆధారంగా మద్యాన్ని బహిరంగంగానే తరలిస్తున్నారు. ధర ఎక్కువ ఉందని బెల్టు షాపుల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా పర్యవేక్షణకు ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటుచేయడంతో వైన్స్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొంత తగ్గినా.. 2024తో పోలిస్తే 2025లో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రూ.2,308 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ 2025లో ఇది రూ.70కోట్ల మేర తగ్గి రూ.2,238 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు తగ్గడానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. అక్కడి కూటమి ప్రభుత్వం అంతకుముందు సర్కారు తీరుకు భిన్నంగా మద్యం అమ్మకాలు పెంచేలా అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీకి సరిహద్దుగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల వైన్స్‌లో అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు. -
చిన్నపరెడ్డి సేవలు అభినందనీయం
ఖమ్మంగాంధీచౌక్: విధినిర్వహణలో కచ్చితత్వం, అంకితభావంతో పాటు సేవాగుణం కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) స్పెషల్ అసోసియేట్ పుట్లూరి చిన్నపరెడ్డి సేవలు అభినందనీయమని పలువురు కొని యాడారు. చిన్నపరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఖమ్మంలోని ఎస్బీ ఐ మెయిన్ బ్రాంచ్‌లో బుధవారం ఆయనను సన్మానించాక అధికా రులు, యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. రెండు దశాబ్దాల పాటు సైన్యంలో పనిచేసిన ఆయన కార్గిల్ పోరులో పాల్గొన్నారని, ఆతర్వాత ఎస్బీఐ లో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరా డారని తెలిపారు. చిన్నపరెడ్డితో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రశాంత్ లింగాల, రీజనల్ సెక్రటరీ రాంబాబు, ఉద్యోగులు పీవీఆర్కే.ప్రసాద్, పి.నరేష్, తిప్పైస్వామి, ఆశాజ్యోతి, కేఎస్.నందు, రేణుకుమార్, శ్రీ రష్మిత, పుట్లూరి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదతరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ టోర్నీలో బంగారు పతకం బోనకల్: మండలంలోని చిరునోములకు చెందిన చేపల మడుగు శశికళ అంతర్జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. బిహార్‌లో ఇటీవల జరిగిన పోటీల్లో ఆమె బంగారు పతకం సాధించింది. ఇప్పటివరకు తొమ్మిది జాతీయస్థాయి టోర్నీల్లో పతకాలు సాధించిన శశికళను పలువురు అభినందించారు. టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఖమ్మం స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన తమిళనాడులో జరిగిన అండర్–17 జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఖమ్మం క్రీడాకారులు కాంస్య పతకం దక్కించుకున్నారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న పరిటాల జ్వలిత్, గద్దల సిరి పతకాలు గెలుచుకోగా డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, టెబుల్ టెన్నిస్ అసో సియేషన్ జిల్లాఅధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్.మూర్తి అభినందించారు. -
రంగస్థల నటుడు డీవీఎస్ మృతి
వైరా: వైరాకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, ఊరేగింపు సినిమా నిర్మాతల్లో ఒకరైన దార్న వెంకటసత్యనారాయణ(77) మృతి చెందారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తుండగా కన్నుమూశారు. వైరాలో జన్మించిన డీవీఎస్.నారాయణ ఏక్ దిన్కా సుల్తాన్ నాటకాన్ని 125సార్లు, తులసితీర్ధం నాటకాన్ని 50 సార్లు ప్రదర్శించారు. ఆతర్వాత పలు సినిమాల్లోనూ నటించిన ఆయన ఊరేగింపు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపై డాక్టర్ నాగబత్తిని రవి, షేక్సోందు సాహెబ్, దాసరాజు కుటుంబరా వు, కట్టా కృష్ణార్జునరావు, ఏడునూతల బుచ్చిరామారావు, నాగబత్తిని భాస్కరరావు, ఊరుకొండ వెంకటేశ్వరరావు, సంపసాల వరదరాజు, వెంకటేశ్వరరా వు, కృష్ణారావు, ప్రేమ్‌చంద్, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రామారా వు, గోవిందరావు, దార్న రాజశేఖర్, కట్ల రంగారావు, మేడా ప్రసాద్, నా యుడు సత్యనారాయణ, నూతి వెంకటస్వామి తదితరులు సంతాపం ప్రకటించారు. పాతకక్షలతో దాడిలో యువకుడు మృతి ఖమ్మంక్రైం: పాత కక్షల కారణంగా యువకుడిపై ఓ వ్యక్తి దాడి చేయటంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. ఘటన జరగాక మూడు రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం బాలాజీనగర్‌కు చెందిన షేక్ రెహమాన్(25) మద్యానికి బానిసై తిరుగుతూ సోదరి వద్ద ఉంటున్నాడు. డిసెంబర్ 28న రాత్రి బయటకు వెల్లిన ఆయన తిరిగి రాలేదు. రెహమాన్ కోసం గాలిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మార్చురీలో ఉందన్న సమాచారంతో బుధవారం చూడగా ఆయనదేనని గుర్తించారు. ఈమేరకు ఖమ్మం టూటౌన్ పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా విచారించడంతో 29వ తేదీ తెల్లవారుజామున బాలాజీనగర్ వద్ద నిద్రించిన రెహమాన్‌ను పాతకక్షలను మనస్సులో పెట్టుకుని లెనిన్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ బాజీ దాడి చేసినట్లు తేలింది. తీవ్రంగా గాయపడిన రెహమాన్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందగా, వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఆయన సోదరి గుర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. బస్సు ఢీకొని కండక్టర్ దుర్మరణం కృష్ణలంక(విజయవాడతూర్పు): బస్సును డ్రైవర్ వెనక్కి తీస్తుండగా సూచనలు చేస్తున్న కండక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. ఏపీలోని విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారధి సమీపాన బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సులో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం గంగారానికి చెందిన వజ్జ అభిలాష్(40) కండక్టర్‌గా, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన తప్పిట ప్రకాశం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు మంగళవారం భద్రాచలం నుంచి గుంటూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే, మంగళవారం రాత్రి 10గంటల సమయాన బస్సు వారధి దాటాక వై.జంక్షన్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్లాల్సి ఉండగా 300 మీటర్లు ముందుకు వెళ్లింది. దీన్ని గమనించిన డ్రైవర్ రివర్స్ చేసే క్రమాన కండక్టర్ బస్సు దిగి వెనకకు వెళ్లి సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే, ప్రమాదవశాత్తు బస్సు కండక్టర్‌ను ఢీకొట్టి తలపైకి ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, అభిలాష్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చేసినట్లు విజయవాడ కృష్ణలంక పోలీసులు తెలిపారు. మృతుడు టేకులపల్లి మండల వాసి -
పేదల సంక్షేమమే పరమావధి
● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● రూ.15 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకల్లూరురూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్ల పనులకు బుధవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి శంకుస్థాపన చేశారు. పేరువంచలో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇల్లు ఇవ్వకపోగా, తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో అర్హులైన ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కల్లూరులో రూ.13 లక్షలతో నిర్మించిన అటవీశాఖ వనసంరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పులిగుండాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యాన అడవిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కలెక్టర్ అనుదీప్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడగా బ్యాటరీ వాహనాలను మంత్రి ప్రారంభించారు. పాఠశాలలో తనిఖీ కల్లూరు మండలంలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్, సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి హైస్కూల్‌ను పరిశీలించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రహరీ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటరెడ్డి, ఈఈ రామకోటి నాయక్, తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎఫ్డీఓ మంజుల, ఎఫ్ఆర్ఓ ఉమ, డీఆర్ఓలు బానోతు రాంసింగ్, బానోతు శ్రీను, సురేష్, మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి, ప్రజాప్రతినిధులు, నాయకులు కీసర నిర్మల, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చందర్రావు, కె.మోహన్‌రెడ్డి, కృష్ణవేణి, గోపాలరావు, మురళి పాల్గొన్నారు. -
నవోదయం కోసం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కొత్త ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలతో నూతన ఏడాదికి జిల్లా ప్రజానీకం స్వాగతం పలికింది. ఎవరికి వారు కొత్త సంవత్సరం తమకు కలిసి రావాలని మనసారా కోరుకున్నారు. వచ్చే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తమదే పైచేయి కావాలని పార్టీల నేతలు, వానాకాలం పంట నష్టాన్ని చవిచూసిన రైతులు రబీ, వచ్చే వానాకాలంలో సమృద్ధిగా దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా ప్రయోజనాలు సమకూరాలని ఉద్యోగులు, సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరాలని ప్రజలు కోరుతూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించారు. సంతోషాలను వెతుకుతూ.. గత కాలపు గాయాలను మరిచిపోతూ, భవిష్యత్ వెలుగులను ఆశిస్తూ జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచే సంబురాలు మొదలుకాగా, అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఈవెంట్లు ఏర్పాటుచేయగా సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తింది. ఇక కేక్‌లు, స్వీట్ల కోసం వచ్చిన వారితో బేకరీలు, రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు కళకళలాడాయి. మద్యం మత్తులో వెళ్లే వారి కారణంగా ప్రమాదాలు జరగకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరికొత్త వ్యూహాలు గడిచిన ఏడాది చివరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా, కొత్త ఏడాది ప్రథమార్థంలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యాన రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పదవీయోగం దక్కాలన్న ఆకాంక్షతో ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించడమే కాక, ఆ తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించాలని రాజకీయ పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈనేపథ్యాన ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఆశావహులు తమ జాతకం మారిపోవాలన్న ఆశతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బంగారు పంటలు పండాలని.. రైతులు గత ఏడాది తుపాన్లు, పంటలకు తెగుళ్లతో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ధాన్యంతో పాటు పత్తి, మిర్చి సాగు చేసిన రైతులు అమ్ముకోవడానికి అవస్థ పడ్డారు. నూతన సంవత్సరంలో పంటలు బాగా పండడంతో పాటు గిట్టుబాటు ధర లభించాలని ఆశిస్తున్నారు. యూరియా కొరత తీరాలని, యాసంగితో పాటు వానాకాలంలోనూ మంచి దిగుబడులు రావాలనే ఆశతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ‘ప్రయోజనాలు’ దక్కుతాయని.. సంక్షేమ పథకాలపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పథకాలు అమలవుతున్నా ఇంకొన్ని అందాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌తో పాటు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ఆశిస్తున్నారు. సంక్రాంతికి రైతుభరోసా నిధులు విడుదల చేయనుండడంతో రైతుల్లో సంతోషం నిండనుంది. ఇవికాక ఆరు గ్యారంటీల్లో మిగిలినవి కూడా ఈ ఏడాది అమలవుతాయని ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగులు పీఆర్సీ, పెండింగ్ డీఏలు విడుదల కావాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి బకాయిలు వస్తాయని ఆశిస్తున్నారు.పదవుల కోసం నాయకుల నిరీక్షణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. అనుకున్న లక్ష్యాలను చేరడంతో పాటు సుఖసంతోషాలతో గడపాలి. జిల్లా మరింత ప్రగతిపథంలో పయనించేలా, అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. – అనుదీప్ దురిశెట్టి, కలెక్టర్ -
ప్రజలందరికీ మంచి జరగాలి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్: ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా పాలన సాగిస్తామని వారు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. అలాగే, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పనపై ఆరా ఖమ్మంరూరల్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన మొదలుపెట్టారు. ఈమేరకు ఏదులాపురం మున్సిపాలిటీలో పోలింగ్ స్టేషన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తుండగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వివరాలు ఆరా తీయడంతో పాటు ఎక్కడా తప్పులు దొర్లకుండా జాబితా రూపొందించాలని సూచించారు. ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలో కుష్ఠువ్యాధి సర్వే పూర్తి ఖమ్మం వైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపునకు జిల్లాలో చేపట్టిన సర్వే పూర్తయిందని డీఎంహెచ్ఓ డి.రామారావు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా ఈనెల 18 నుంచి 31 వరకు జిల్లాలోని 2,55,363 ఇళ్లలో 9,44,943 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈమేరకు 1,369 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించాక ఐదు కొత్త కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కాగా, చర్మంపై స్పర్శ లేకుండా వుండే లేతరంగు మచ్చలు కనిపిస్తే ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డీఎంహెచ్ఓ సూచించారు. విద్యుత్ ఉద్యోగులకు ర్యాంకులు ఖమ్మంవ్యవసాయం: ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రతీనెల మాదిరిగానే నవంబర్‌లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ర్యాంకులు ప్రకటించింది. డిస్కం స్థాయి అర్బన్ విభాగంలో ఖమ్మం టౌన్–1 ఏడీఈ సీహెచ్.నాగార్జున, టౌన్–5 ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో రాయుడుపాలెం ఏఈ అనిల్‌కుమార్ ర్యాంకులు సాధించారు. అలాగే, సర్కిల్ పరిధిలో సత్తుపలి డీఈ ఎల్.రాములు, ఏడీఈల స్థాయిలో ఖమ్మం టౌన్–2 ఏడీఈ యాదగిరి, పెనుబల్లి ఏడీఈ ఎస్.రామారావు, ఏఈల విభాగంలో ఖమ్మం టౌన్–2 ఏఈ రవికుమార్, చిన్నకోరుకొండి ఏఈ అబ్దుల్ ఆసీఫ్‌లు ర్యాంకులు దక్కించుకోగా పలువురు అభినందించారు. -
యూరియా కోసం తిప్పలు
సాక్షి నెట్వర్క్: యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. బోనకల్ మండలం ముష్టికుంట్ల సొసైటీలో 711బస్తాలు ఉండగా బుధవారం తెల్లవారుజామునే బారులు దీరారు. ఉన్నంత వరకు పంపిణీ చేయగా, డీసీఓ గంగాధర్, తహసీల్దార్ రమాదేవి, ఏడీఏ స్వర్ణ విజయచంద్ర, ఏఓ వినయ్‌కుమార్, ఎస్ఐ పి.వెంకన్న పరిశీలించారు. తల్లాడ సొసైటీలో 440 బస్తాల యూరియాను కూపన్ల ఆధారంగా పంపిణీ చేశారు. సీఈఓ నాగబాబు, ఎస్ఐ వెంకటేశ్, ఏఓ ఎండీ.తాజుద్దీన్ పర్యవేక్షించారు. కొణిజర్లలోని మన గ్రోమోర్, చిన్నగోపతిలో తెల్లవారుజామున 4గంటలకే వేయి మంది రావడం, 300 బస్తాల యూరియానే ఉండగా ఎస్ఐ సూరజ్ నేతృత్వాన ఉన్నంత వరకు పంపిణీ చేయించారు. చింతకాని, నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ●కూసుమంచి : యూరియా సరిపడా ఉన్నందున రైతులందరికీ సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా నోడల్ అధికారిగా నియమితులైన ఆయన కూసుమంచి మండలంలో యూరి యా పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ఏడీఏ సతీష్, ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు. -
భూలోక వైకుంఠమే..
ముక్కోటి ఏకాదశి వేళ భద్రగిరి భూలోక వైకుంఠంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జయ గంటలు మోగుతుండగా మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శన వేడుక ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. రామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమైన ఈ వేడుకలు ఉదయం ఆరు గంటలకు ముగిశాయి. ఐదు గంటల సమయాన ఉత్తర ద్వారాలు తెరుచుకోగా, ధూపదీపాలు, హారతి వెలుగుల నడుమ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. – భద్రాచలంఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారు వెండి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలోకి ప్రవేశించారు. తొలుత దేవస్థాన హరిదాసులు శ్రీరామ కీర్తనలు ఆలపించారు. అనంతరం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామి వారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పారు. సరిగ్గా తెల్లవారుజామున 5గంటలకు మంగళ వాయిద్య గంట మోగుతుండగా ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. వైకుంఠాన్ని మైమరిపించేలా ప్రత్యేకంగా అలంకరించిన ఈ ద్వారంలో ధూప, దీపాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. గంటపాటు స్వామివారి కి ప్రత్యేక పూజలు చేయగా, ‘శ్రీ రామాయనమః’ అంటూ భక్తుల రామనామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తర్వాత చుతర్వేద పారాయణం చేసి, నివేదన, మంత్రపుష్పం సమర్పించారు. చివరగా 108 వత్తులతో కూడిన హారతి సమర్పించాక శరణాగతి, దండకం అనంతరం ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యాన్ని అర్చకులు వివరించారు. ఉత్తర ద్వార దర్శనానంతరం శ్రీసీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. గరుడ వాహనంపై స్వామి వారు, గజ వాహనంపై సీతమ్మవారు, హనమత్ వాహనంపై లక్ష్మణస్వామిని కొలువుదీర్చి రాజవీధి మీదుగా తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి వెంట నడువగా గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు వెళ్లిన స్వామి వారు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ఉత్సవాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్‌కలెక్టర్ మ్రిణాల్శ్రేష్ట, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆలయ ఈఓ దామోదర్‌రావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.భద్రగిరిలో నేత్రపర్వంగా ఉత్తర ద్వార దర్శనం -
ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యత
● గెలుపు గుర్రాలకే మున్సిపల్ ఎన్నికల్లో బీ–ఫామ్ ● సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంమయూరిసెంటర్: కటౌట్లు పెట్టినంత మాత్రాన టికెట్లు రావని, ఎవరైతే ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతారో, ఎవరికి క్షేత్రస్థాయిలో ప్రజల ఆశీస్సులు ఉంటాయో వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ–ఫామ్ అందుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఖమ్మంలో మంగళవారం రాత్రి జరగగా మంత్రి మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. గెలిచే వారికే ప్రాధాన్యత ఉంటుందని, తన రక్త సంబంధీకులైనా సరే ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ వస్తుందని పొంగులేటి తెలిపారు. ఏదులాపురంలోని 32 వార్డుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని తెలిపారు. ఏదులాపురం పరిధిలో ఒక్క ఉపాధి హామీ పథకంతోనే రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రతీ ఇంటికీ చేరాయని చెప్పారు. చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగత ప్రచారం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాక వార్డుల్లో పెండింగ్ ఉన్న చిన్నచిన్న సమస్యల జాబితా అధికారులకు ఇస్తే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో పేదలకు అన్యాయం జరగకుండా నాయకులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, బేబీ స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, హరినాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం వీధుల్లో ‘స్మార్ట్’ వెలుగులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఉత్తమ ఫలితాల సాధనకు ప్రతీ పనికి సాంకేతికతను జోడిస్తుండగా, ప్రజాధనాన్ని ఆదా చేసేలా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 26,842 వీధి దీపాలకు సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(సీసీఎంఎస్)ను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయగా ఒకే క్లిక్‌తో వీధి దీపాలను ఆన్, ఆఫ్ చేసే అవకాశం లభించింది. అంతేకాక సమస్యలపై ఫిర్యాదులు వస్తే కార్యాలయం నుంచే పరిశీలించే సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది. సీసీఎంఎస్ ప్రత్యేకత సాధారణంగా వీధి లైట్లను ఆఫ్ చేయడం, ఆన్ చేయడానికి సిబ్బంది స్విచ్ బోర్డులపై ఆధారపడాల్సిందే. కానీ సీసీఎంఎస్ పరిజ్ఞానంతో అన్ని లైట్లను కార్పొరేషన్ కార్యాలయంలోని కంప్యూటర్ లేదా మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. ఇందులో ఉన్న ఆప్షన్‌తో సూర్యాస్తమయం కాగానే లైట్లు వెలగడం, సూర్యోదయం కాగానే వాటంతట అవే ఆరిపోనుండడంతో వెలుతురు ఉన్నప్పుడు లైట్లు వెలిగి విద్యుత్ వృథా అయ్యే సమస్య తీరనుంది. అలాగే, ఎక్కడైనా లైట్ పాడైతే స్థానికులు ఫిర్యాదు చేసే వరకు ఆగకుండా కంట్రోల్ రూమ్‌కు వచ్చే అలర్ట్ ఆధారంగా సిబ్బంది మరమ్మతు చేసే అవకాశముంది. విద్యుత్ బిల్లులు ఆదా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వీధి లైట్ల బిల్లులకు ప్రతీనెల రూ.40 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో పగటి పూట కూడా లైట్లు వెలుగుతూ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు నగరంలోని 26,842 వీధి దీపాలకు గాను ఇప్పటి వరకు 26వేల వరకు దీపాలను సీసీఎంస్కు అనుసంధానం చేశారు. తద్వారా బిల్లులు తగ్గడమేకాక రాత్రి వేళ ఎక్కడా చీకటి ఉండకుండా మరమ్మతులు సాధ్యమవుతాయని చెబుతున్నారు. 1,337 సీసీఎంఎస్ పరికరాలు కార్పొరేషన్ పరిధిలో వీధిలైట్లను మానిటరింగ్ చేయడంతో పాటు వెలిగించడం, ఆపడం కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించారు. 60 డివిజన్లలోని వీధులను విభజించి నిర్వహణ, పర్యవేక్షణ కోసం 1,337 సీసీఎంఎస్ సంబంధిత పరికరాలను అమర్చారు. వీటిలో 1,260 పరికరాలు ప్రస్తుతం యాక్టివ్ అయ్యాయి. నగర వ్యాప్తంగా ఇప్పటివరకు 26 వేల ఎల్ఈడీ లైట్లను ఈ సిస్టమ్‌కు అనుసంధానించగా, విద్యుత్ లోడ్ 1348.117 కిలోవాట్స్‌గా రికార్డ్ అయింది. ప్రతీది గుర్తించేలా.. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఏ ఏరియాలో ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఎన్ని ఆఫ్‌లో ఉన్నాయనేది శాతాల వారీగా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడైనా పరికరాలు పనిచేయకపోతే ఆ వివరాలు, ఆ ప్రాంత సిబ్బంది ఫోన్ నంబర్ కూడా డ్యాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. తద్వారా సిబ్బందిని అమ్రత్తం చేసి మరమ్మతు చేయించడం సులభమవుతుంది. నగర మ్యాప్‌లో లైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో పాయింట్ల రూపంలో చూసే అవకాశం వచ్చినందున పర్యవేక్షణ సులువవుతుంది. అంతేకాక ఎక్కడైనా విద్యుత్ సంబంధిత సమస్య ఎదురైతే అది ఏ సమయానికి జరిగింది, మళ్లీ ఎప్పుడు పునరుద్ధరించారనే వివరాలు సెకన్ల వ్యవధిలో అప్డేట్ అవుతున్నాయి.వీధి దీపాల నిర్వహణకు సాంకేతికతను జోడిస్తున్నాం. వీధి లైట్లు వెలగడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండగా, ఇప్పుడు సీసీఎంఎస్ ద్వారా కార్యాలయం నుంచే గుర్తించొచ్చు. తద్వారా ఆన్/ఆఫ్ సులభం కావడంతో పాటు సమస్య ఎదురయ్యే అవకాశమే ఉండదు. ఈ విధానంతో రాష్ట్రంలోనే ఖమ్మం రోల్ మోడల్‌గా నిలవనుంది. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ -
వైభవోపేతంగా ముక్కోటి ఏకాదశి
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తగా గోవింద నామస్మరణ మార్మోగింది. స్వామి, అమ్మవార్లను దాదాపు 10 వేల మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనంచేసుకున్నారు. అలాగే, ఆలయంలో స్వామి వారితో పాటు ఉప ఆలయాల్లో సోమేశ్వరస్వామి, గణపతి, ఆంజనేయస్వామి, అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకుని పూజలు చేశారు. కాగా, దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, వాహన పూజలు, కేశ ఖండన వద్ద రద్దీ నెలకొంది. ఎస్ఐ రమేష్, సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటుచేయగా మధిరకు చెందిన సత్యసాయి సేవా సమితి కమిటీ సభ్యులు సేవల్లో పాలుపంచుకున్నారు. ఆల య ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, మిథిలా స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు – నిర్మలకుమారి దంపతులతో పాటు అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.జమలాపురంలో స్వామిని దర్శించుకున్న భక్తజనం -
‘ఉపాధి’ చట్టంలో మార్పులు చేయొద్దు
వైరారూరల్: గ్రామీణ ప్రాంత పేదలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేయొద్దని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో మంగళవా రం నిర్వహించిన ఉపాధి హామీ కూలీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడ మే కాక అనేక మార్పులు చేయడంతో కూలీ లకు పనిదొరకని పరిస్థితి ఏర్పడుతుందని తెలి పారు. ఈమేరకు కేంద్రం నిర్ణయంపై పోరాడుతామని చెప్పారు. అనంతరం ముసలిమడుగు సర్పంచ్ తడికమళ్ల నాగార్జునను సత్కరించిన ఆయన గొల్లపూడి శివారు పులిగొట్ట శ్రీ లక్ష్మీ నరసింహా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నూతి వెంకటేశ్వర్లు, మేడూరి రామారావు, నాయకులు పాల్గొన్నారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు ఖమ్మం రాపర్తినగర్: నర్సింగ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్), కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యాన జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పన ప్రక్రియ చేపడుతారని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి 1–3 ఏళ్ల ఆనుభవం ఉండడంతో పాటు 22నుంచి 38 ఏళ్ల వయస్సు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం 94400 51581 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా జైలుకు పోట్రు ప్రవీణ్ సత్తుపల్లి: రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లూరు మండలం యర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను ఖమ్మంలోని జిల్లా జైలుకు తరలించారు. ఆయనను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం సత్తుపల్లి సబ్‌జైలుకు తరలించిన విషయం విదితమే. ఈమేరకు ఆయనను సోమవారం రాత్రి జిల్లా జైలుకు తరలించినట్టు సత్తుపల్లి సబ్‌జైల్ సూపరింటెండెంట్ కుటుంబరాజు తెలిపారు. సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు నేలకొండపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నేలకొండపల్లికి చెందిన ఇందుమతి ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీతో మంటలు మొదలై సిలిండర్ పేలినట్లు తెలిసింది. ఘటనలో ఇందుమతికి తీవ్ర గాయాలు కాగా ఆమెను కాపాడే యత్నంతో కుమారుడు వెంకటేష్ కూడా గాయపడ్డాడు. ఈమేరకు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. యూ ట్యూబర్‌పై కేసు నమోదు ఖమ్మంఅర్బన్: హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో రూపొందించిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన అన్వేష్ ‘నా అన్వేషణ.. ప్రపంచ యాత్రికుడు’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సీతాదేవి, ద్రౌపదీ దేవిపై అసభ్యంగా వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశాడని దానవాయిగూడెంకు చెందిన జి.సత్యనారాయణరావు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. దీంతో అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. పెళ్లి పేరుతో దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం రఘునాథపాలెం: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిపై దాడి చేసిన యువకుడు ఆతర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. కామేపల్లి మండలం భాసిత్నగర్కు చెందిన గుణశేఖర్, రఘునాథపాలెం మండలం కొర్ర తండాకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ ఆమె ఇంటికి వచ్చాడు. ఆమైపె దాడి చేసిన ఆయన ఆతర్వాత పురుగుల మందు తాగడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యువతి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ●రఘునాథపాలెం మండలం పువ్వాడనగర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం మాట్లాడుకుంటామని చెప్పి ఖమ్మం టేకులపల్లికి చెందిన గొడుగు రాజేష్, తన కుటుంబంతో వచ్చి బెదిరించాడు. ఘటనపై యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
ఆదర్శంగా ఏదులాపురం మున్సిపాలిటీ
● అన్ని వసతులతో అభివృద్ధి చేస్తాం.. ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధి శ్రీరాంనగర్‌లో రూ.20.25లక్షలతో నిర్మించే కల్వర్టు, సాయిగణేష్నగర్లోని ఎన్ఎస్పీ కాల్వపై రూ.15.70 లక్షలతో నిర్మించనున్న కల్వర్టుతో పాటు పోలేపల్లిలో డబుల్ బెడ్రూం కాలనీలో రూ.25లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశాక మాట్లాడారు. ఏళ్ల తరబడి కల్వర్టుల కోసం నాయకులకు మొరపెట్టుకున్నా పని కాలేదని కాలనీ వాసులు చెప్పారన్నారు. కానీ తన దృష్టికి రాగానే కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. శ్రీరాంనగర్ కాలనీలో ఒక కల్వర్టు మాత్రమే కాదు ఇంకో రెండు కల్వర్టులు, ప్రతీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడమే కాక ఓవర్‌హెడ్ ట్యాంక్ మంజూరు చేసి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు రేషన్‌కార్డులు, కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాక రైతులకు రుణ మాఫీ చేశామని తెలిపారు. అంతేకాక మొదటి విడతలో 4.50లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పాలేరు నియోజకవర్గంతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం పోలేపల్లిలో 56మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ యాకూబ్, ఏదులాపురం కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ జి.నర్సింహారావు, ప్రత్యేకాధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ భైరు హరినాధ్‌బాబు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, నాయకులు తోట చినవెంకటరెడ్డి, వెంపటి రవి తదితరులు పాల్గొన్నారు. -
14,388 మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రస్తుతం 14,388 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 10,088 మెట్రిక్ టన్నుల స్టాక్ రాగా, మరో 4,300 మెట్రిక్ టన్నులు రిజర్వ్‌గా ఉందని వెల్లడించారు. రైతులకు 18,982 మెట్రిక్ టన్నుల యూరి యా పంపిణీ చేశామని తెలిపారు. యాప్ అందుబాటులోకి వచ్చే వరకు పట్టాదారు పాస్ పుస్తకంలోని వివరాల ఆధారంగా 82 పీఏసీఎస్‌లు, 84 మంది డీలర్ల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచే పంపిణీ ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. సరిపడా యూరియా నిల్వలు కొణిజర్ల: జిల్లాలో రైతులకు కావాల్సినంత మేర యూరియా అందుబాటులో ఉందని డీఏఓ డి.పుల్ల య్య తెలిపారు. కొణిజర్ల పీఏసీఎస్‌లో యూరియా నిల్వలను మంగళవారం పరిశీలించిన ఆయన మా ట్లాడారు. మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఇరవై రోజుల తర్వాత అవసమయ్యే యూరియా కోసం ఇప్పుడే రావడంతో కృత్రిమ కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఈమేరకు రైతులు అపోహలు విడనాడి సిఫారసు మేరకే యూరియా వాడాలని సూ చించారు. ఈకార్యక్రమంలో డీసీఓ గంగాధర్, ఏఓ బాలాజీ, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ సందీప్, సీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి -
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి
● సైబర్ క్రైమ్‌పై విచారణ కొనసాగుతోంది.. ● కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్పెనుబల్లి: కల్లూరు సర్కిల్ పరిధిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. పెనుబల్లి మండలం వీఎం.బంజర పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆమె రికార్డులు, కేసుల విచారణపై ఆరా తీశారు. నిందితులు శిక్ష నుంచి తప్పించుకోకుండా విచారణలో సాంకేతికత ఉపయోగించాలని సీఐ ముత్తి లింగం, ఎస్సై కె.వెంకటేష్‌కు సూచించారు. అనంతరం ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ కల్లూరు సబ్ డివిజన్‌ను నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గంజాయిని కట్టడి చేస్తాం.. పెనుబల్లి తదితర మండలాల్లో గంజాయి వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించామని ఏసీపీ తెలిపారు. గంజాయికి బానిసలవుతున్న యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నందున సరఫరా, వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేలా తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించిన ఆమె, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు. అలాగే, మహిళలు, చిన్నపిల్లలపై నేరాలను అరికట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఎవరినీ వదిలేది లేదు.. సైబర్ నేరాల ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టిన కల్లూరు మండలం యర్రబోయినపల్లికి చెందిన ప్రవీణ్ తదితరులపై కేసు నమోదు చేయగా, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని ఏసీపీ వసుంధర తెలిపారు. నిందితులు ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ●కల్లూరు: కల్లూరు పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఏసీపీ వసుంధర యాదవ్ తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో పరిశీలించాక అధికారులతో సమావేశమైన ఆమె స్టేషన్ నిర్వహణ, కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షించారు. అలాగే, రౌడీ షీటర్లపై నిఘా కొనసాగిస్తూ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. -
మతోన్మాద రాజకీయాన్ని తిప్పికొట్టాలి
తిరుమలాయపాలెం: కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఎం శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మంగళవారం జరిగిన పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఆర్థిక భారాలు మోయలేక ఉద్యమాల్లోకి రాకుండా మతోన్మాద రాజకీయాలు చేస్తూ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈమేరకు సైద్ధాంతికంగా ఎదుర్కొనేలా సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావడమేకాక ప్రజల సమస్యలపైనా పోరాడాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు డివిజన్లో ఎనిమిది మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఉప సర్పంచ్‌లు, 100కు పైగా వార్డుసభ్యులు గెలవడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, షేక్ బషీరుద్దీన్, బండి రమేష్, బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు తదితరులు కూడా మాట్లాడారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
రైతులకు న్యాయమైన
● మేలైన, వైవిధ్యమైన పంటలకు ప్రోత్సాహం ● స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సమీక్షలో కలెక్టర్ అనుదీప్రుణ పరిమితిఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ ఖర్చులు ఏటేటా పెరుగుతున్న క్రమాన రైతుల కోసం వాస్తవికంగా, న్యాయంగా రుణ పరిమితి నిర్ణయించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈక్రమాన అన్నదాతలకు బ్యాంకులు అండగా నిలవాలని సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ హోదాలో ఆయన 2026–27 సంవత్సరానికి సంబంధించి పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయాలపై బ్యాంకులో మంగళవారం జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువులు, విత్తనాల వినియోగం, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దె వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు మేలు చేసేలా రుణపరిమితి ఖరారు చేయాలని తెలిపారు. అవసరమైన చోట సవరణలు చేసి తుది ప్రతిపాదనలు రూపొందించాలని.. మేలైన, వైవిధ్యమైన పంటలు సాగుచేసే రైతులను ప్రోత్సహించేలా ఈ విధానాలు ఉండాలని చెప్పారు. తద్వారా రైతు వ్యవసాయం చేసేందుకు ధైర్యంగా ముందుకొస్తారని తెలిపారు. అనంతరం బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. తొలుత బ్యాంకు కార్యకలాపాలపై ఆరాతీసిన కలెక్టర్ డీసీసీబీ ఆధ్వర్యాన రూపొందించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా ఉద్యానవనఅధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీ నాటికి సర్వే పూర్తి ఖమ్మం సహకారనగర్: జిల్లాలో భూముల సర్వే జనవరి 15వరకు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన భూసర్వే పనులపై మండలాల వారీగా సమీక్షించి సూచనలు చేశారు. భూసేకరణలో సర్వే శాఖ కీలకపాత్ర పోషించాల్సి ఉన్నా దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈక్రమంలో అత్యధికంగా సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సరైన కారణాలు లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకనుంచి మండలాల వారీగా సర్వేయర్ల పని తీరుపై ఏడీ పర్యవేక్షించాలని సూచించారు. కాగా, భూభారతి ఆధారంగా ప్రభుత్వ భూమి వివరాలు సమర్పించాలని, ప్రతీ మండలంలో ప్రభుత్వ భూమి అధికంగా ఉన్న ఐదు సర్వే నంబర్లను తీసుకొని విస్తీర్ణం, ఆక్రమణల వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు. -
లాహిరి..లాహిరి.. లాహిరిలో..
భద్రాచలం: భక్తుల జయజయ ధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి జలవిహారం చేస్తుండగా గోదావరి తీరం పులకించింది. కరకట్ట, స్నానఘాట్ల నిండుగా భక్త జనం వీక్షిస్తుండగా స్వామి వారు లాహిరి.. లాహిరి.. లాహిరిలో అంటూ జల విహారం చేశారు. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీ సీతారాముల తెప్పోత్సవం కనులపండువగా సాగింది. కట్టుదిట్టమైన భద్రత తెప్పోత్సవం సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఆధ్వర్యాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ముక్కోటి ఉత్సవ అధికారి శ్రీనివాసరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజుతో పాటు జిల్లా అధికారులు తరలివచ్చారు. ముగిసిన పగల్‌పత్తు ఉత్సవాలు తెప్పోత్సవానికి ముందు ప్రధాన ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం సేవాకాలం, తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి పూజలతో పగల్ పత్తు ఉత్సవాలు ముగిశాయి. ఆ తర్వాత గర్భగుడిలో ప్రభుత్వోత్సవం(దర్బార్ సేవ) నిర్వహించారు. నేటి నుంచి రాపత్తు సేవలు వైకుంఠ ఏకాదశి ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జనవరి 12 వరకు ఈ సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు శ్రీరామరక్షామండపం(డీఎస్పీ కార్యాలయ ప్రాంగణం) వద్ద రాపత్తు విలాసోత్సవం జరగనుంది. ఐదు పర్యాయాలు విహారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ చేపట్టిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక సాయంత్రం 6–03 గంటలకు హంస వాహనం కదిలింది. ఉత్తర దిశగా గోదావరి నదిలో ముందుకు సాగి, ఆ తర్వాత సవ్యదిశలో పరిక్రమణం ప్రారంభమైంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగా మెరుస్తున్న హంస వాహనం, అందులో ఆశీనులైన సీతారాములను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అప్పటికే పుష్కరఘాట్‌లో ఉన్న మెట్లన్నీ వేలాదిగా భక్తులతో నిండిపోయాయి. మెట్లపై స్థలం లేకపోవడంతో కరకట్టపైనా, లాకుల వద్దనున్న ఎత్తయిన ప్రాంతంలో నిలబడి సీతారాముల జల విహారాన్ని తిలకించారు. ఆ సమయంలో జై శ్రీరామ్ నామస్మరణతో గోదారి తీరం మార్మోగింది. ఐదు పర్యాయాలు స్వామివారు నదిలో విహరించగా, ఒక్కో పరిక్రమణానికి సగటున 13 నిమిషాల సమయం పట్టింది. తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది తరహాలోనే గోదావరి తీరంలో పుష్కరఘాట్ దగ్గర ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికపై శాసీ్త్రయ, గిరిజన సంప్రదాయ నృత్య, గాన ప్రదర్శనలు కొనసాగాయి. తెప్పోత్సవం అనంతరం ఆగమ శాస్త్ర పద్ధతులు అనుసరిస్తూ సీతారాములను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. నేడు ఉత్తర ద్వార దర్శనంబ్రహ్మకాలంలో ప్రారంభం కానున్న పూజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్నారు. ఏడాదిలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భద్రగిరికి పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బ్రహ్మ కాలంలో ప్రత్యేక వాహనంపై ఆశీనులైన లక్ష్మణ సమేత సీతారాములను ఉత్తర ద్వారం వద్ద కొలువుదీరుస్తారు. వైకుంఠ ఏకాదశి వైభవం, మంగళ వాద్యఘంట, వేద పారాయణం తర్వాత ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. ఉత్తర ద్వార దర్శన ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు వివరించాక 108 వత్తులతో హారతి ఇస్తూ శరణాగతి గద్య విన్నపం చేస్తారు. ఆ తర్వాత వైకుంఠ ద్వారం తెరిచి భక్తులు దర్శన భాగ్యం కలిగిస్తారు. పూజా విశేషాలు ఇలా తెల్లవారు జామున 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి వైభవం 5 నుంచి 5:40 వరకు ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శన విశిష్టత వివరణ ఆ తర్వాత 108 వత్తులతో హారతి.. శరణాగతి గద్యవిన్నపం ఉదయం 6 గంటలకు ఉత్తర ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటుండగా ధూపాన్ని చీల్చుతూ హరతి వెలుగుల నడుమ స్వామివారి దర్శనం హంస వాహనంలో శ్రీ సీతారాముల జల విహారం -
సీపీఐ శతాబ్ది ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేనెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్లను సోమవారం గిరిప్రసాద్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే సభకు ఐదు లక్షల మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి పార్టీకి ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులతో పాటు40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, 19, 20వ తేదీల్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలి పారు. కాగా, బహిరంగ సభ విజయవంతానికి ఖమ్మంలోని పలు కూడళ్లలో ప్రచారం చేయగా సీపీఐ నగర కార్యదర్శి ఎస్కే.జానీమియా మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు మహ్మద్ సలాం, యానాలి సాంబశివరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్, యాకన్న, ఆరెంపుల సతీష్, పగడాల మల్లేష్, మేకల శ్రీని వాసరావు, గాదె లక్ష్మీనారాయణ, ఎస్కే.సైదా, జ్వాలా నరసింహరావు, సతీష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే, చింతకానిలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ప్రజల తరఫున అనేక పోరాటా లు చేపట్టి విజయం సాధించిన సీపీఐ పార్టీకి వందేళ్లు నిండిన సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే సభ విజయవంతానికి నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ పర్సా రాంచందర్‌రావు, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లికా ర్జున్, కూచిపూడి రవి, దూసరి గోపాలరావు, మార్గం శ్రీను, అబ్బూరి మహేష్ పాల్గొన్నారు. -
ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!?
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ ● వచ్చేనెల 10న వార్డుల వారీగా తుదిజాబితా ● నోటిఫికేషన్లో కానరాని కేఎంసీ, మణుగూరు మున్సిపాలిటీ ● ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ప్రచారంఖమ్మంమయూరిసెంటర్: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సోమవారం నోటిఫికేషన్ జారీచేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని విడుదల చేసిన నోటిఫికేషన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ వివరాలు ఉన్నాయి. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మణుగూరు మున్సిపాలిటీ వివరాలను ఇందులో పొందుపర్చలేదు. కేఎంసీలో డివిజన్ల పెంపు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన నేపథ్యాన స్పష్టత వచ్చాకే ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనపై నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యాన ఫిబ్రవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయనే చర్చ మొదలైంది. వార్డులు, జనాభా వివరాలు ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఏదులాపురం మున్సిపాలిటీ జిల్లాలో అత్యధికంగా 32 వార్డులు కలిగి ఉంది. ఇక్కడ 38,210 మంది జనాభాకు గాను ఎస్సీ జనాభా 8,770, ఎస్టీ జనాభా 4,024 మంది ఉన్నారు. సత్తుపల్లి 23 వార్డులతో 31,857 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 4,765, ఎస్టీ జనాభా 1,996 ఉన్నారు. వైరా 20 వార్డులతో 31,056 జనాభా కలిగి ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 7,227, ఎస్టీ జనాభా 2,090 మంది ఉన్నారని నోటిఫికేషన్ పొందుపరిచారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డులకు గాను 30,856 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ 8,322, ఎస్టీలు 1,083 మంది ఉన్నారు. కల్లూరు 20 వార్డులతో ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడగా 22,748 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 5,516, ఎస్టీ జనాభా 3,732 మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులకు గాను 2011 లెక్కల ప్రకారం జనాభా 1,70,897గా ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 33,287, ఎస్టీ జనాభా 30,904గా నమోదైంది. అలాగే, 24 వార్డులతో ఉన్న ఇల్లెందు మున్సిపాలిటీ జనాభా 33,732 కాగా, ఇందులో ఎస్సీలు 6,894, ఎస్టీ 2,574 మంది ఉన్నారు. ఇక అశ్వారావుపేట మున్సిపాలిటీ 22 వార్డులను కలిగి ఉండగా.. 20,040 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 3,310, ఎస్టీ జనాభా 2,457 మంది ఉన్నారు. ఖమ్మంరూరల్: నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా జాబితా పునర్వ్యవస్థీకరణ, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పోలింగ్ కేంద్రాల డేటాను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా సర్దుబాటు చేయడంతో మొదలుపెట్టి జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగిస్తారు. ఈనెల 31న వార్డుల వారీగా డేటా పునర్వ్యవస్థీకరణ, జనవరి 1న ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరించాక జనవరి 5, 6వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. చివరగా 10వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితాను 2025 అక్టోబర్ 1నాటి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఆధారంగా రూపొందిస్తున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. -
నియంత్రణలోనే నేరాలు
ఖమ్మంక్రైం: పోలీసు యంత్రాంగం సమష్టి కృషితో నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆయన వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. ఈ ఏడాది దోపిడీలు, ఇళ్లలో చోరీలు, హత్యలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గగా, చోరీ సొత్తు రికవరీ 9 శాతం, నేరాలను ఛేదించడం 11 శాతం పెరిగిందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సుమారు రూ.4.5 కోట్లను బాధితులకు అందేలా చూడడంతో పాటు మరో రూ.1.50 కోట్లను హోల్డ్ చేయించామని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా 36,709 కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. గంజాయి అమ్మకాలను కట్టడి చేశామని, పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు, కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాలతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉద్యోగులకు శిక్షణ ఇప్పించడం ద్వారా చోరీ సొత్తును రికవరీ చేయడంలో గణనీయమైన పురోగతి నమోదైందని తెలిపారు. అంతేకాక ప్రమాదాల నియంత్రణలో భాగంగా బ్లాక్ స్పాట్ల గుర్తింపు, సిగ్నల్ లైట్లు, బారికేడ్ల ఏర్పాటు, విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలతో నష్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాదరావు, రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, మహేష్, సర్వర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పోలీసు కమిషనర్ సునీల్‌దత్ -
‘యాప్’సోపాలు
● యూరియా కొనుగోలుకు రైతుల అష్టకష్టాలు ● ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపిన వ్యాపారులు ● బస్తా రూ.266కు బదులు రూ.400తో విక్రయంఖమ్మంవ్యవసాయం: వానాకాలం సీజన్లో మాదిరిగానే అన్నదాతలకు యాసంగిలో కూడా యూరియా అవస్థలు తప్పటం లేదు. ఎరువు కొరత రాకుండా ప్రభుత్వం యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చినా సక్రమంగా అమలుకాక రైతులు పాట్లు పడుతున్నారు. రైతులు పీఏసీఎస్‌లు, దుకాణాల వద్ద పడిగాపులు కాయకుండా అవసరమైన మేరకే విడతల వారీగా తీసుకోవచ్చని ప్రత్యేక యాప్ రూపొందించి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత ఈనెల 20నుంచి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా, తర్వాత అన్ని జిల్లాలకు అమలుచేశారు. ఖమ్మం జిల్లాలో సోమవారం నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందని ప్రకటించగా రైతులు ఆదివారం నుంచే యాప్‌లో యూరియా బుకింగ్ కోసం ప్రయత్నిస్తే ఫలితం కానరాలేదు. సోమవారం కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో పాత విధానంలో పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇక జిల్లాను ఫెర్టిలైజర్ యాప్‌లో చేర్చలేదని కొందరికి మెసేజ్ రావడం గమనార్హం. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అధికారులు పాస్బక్ల ఆధారంగా కూపన్లు జారీ చేశారు. అడ్డదారులు తొక్కుతున్న వ్యాపారులు ఫర్టిలైజర్ యాప్ పని చేయకపోవడాన్ని అదునుగా తీసుకున్న జిల్లాలోని ఎరువుల వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. చింతకాని మండలం నాగులవంచలో అర్ధరాత్రి వేళ యూరియా విక్రయించడం బయటపడింది. ఇక కొందరు వ్యాపారులు యూరియాను బ్లాక్ చేసి తెలిసిన రైతుల పేరుతో విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేశారని సమాచారం. మరికొందరు ఇతర ఎరువులను లింక్ చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల రూ.266 యూరియా బస్తాను రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఇండెంట్ 72వేల మెట్రిక్ టన్నులు జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 4.16లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగవుతాయని, ఇందుకోసం 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ నివేదించింది. ప్రస్తుతం జిల్లాలో 34,891మెట్రిక్ టన్నులు నిల్వలు ఉన్నట్లు చెబుతున్నా మొక్కజొన్న తదితర పంటలకు అవసరం పెరగడంతో రైతులు బారులు దీరుతున్నారు. ఇదే సమయాన యాప్ అందుబాటులోకి రావడం, బుకింగ్‌లో ఇక్కట్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లూరురూరల్/నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: యాప్ ద్వారా సోమవారం ఉదయం కొందరు రైతులకు యూరియా కోసం స్లాట్ బుకింగ్ అయినట్లు తెలిసింది. వీరితో పాటు బుకింగ్ చేసుకోని వారు కూడా పీఏసీఎస్‌ల వద్ద బారులు దీరారు. మధ్యాహ్నం కల్లా యాప్ సర్వర్ మొరాయించడం, జాబితాలో జిల్లా పేరు లేదని వస్తుండడంతో ఆందోళన చెందారు. దీంతో యాప్‌తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని నిరసన చేపట్టగా కల్లూరు మండలంలోని రైతులకు ఇప్పటికే జారీ చేసిన పాస్బుక్ల్లోని వివరాల ఆధారంగా కూపన్లు జారీచేశారు. ఇక నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతు షేక్ రశీద్, ముదిగొండ మండలానికి చెందిన రైతుకు స్లాట్‌బుక్ కాగా పైనంపల్లి, రాజేశ్వరపురం సొసైటీ యూరియా తీసుకున్నారు. మిగతా వారికి బుక్ కాకపోవడంతో అవస్థ పడ్డారు. అలాగే, తిరుమలాయపాలెం మండలంలోని జల్లెపల్లి, పిండిప్రోలు, తిరుమలాయపాలెం సొసైటీ కార్యాలయాల్లో రైతులు పడిగాపులు కాశారు. జల్లెపల్లిలో 100 బస్తాల కోసం బుక్ చేసుకున్నా ఎక్కువ మంది రైతులు రావడంతో యూరియా ఇవ్వలేదు. పిండిప్రోలులో ఒక్కో బస్తా చొప్పున సరఫరా చేశారు. ఖమ్మం సహకారనగర్/ఖమ్మం వ్యవసాయం: పంటల సాగుకు అనుగుణంగా రైతులకు సరిపడా యూరియా సకాలంలో పంపిణీ చేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి వీసీ ద్వారా సమీక్షించిన ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా సరిగ్గా లేకపోవడంతో వానాకలం సీజన్లో ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడు యూరియా కొరత లేనందున అదనపు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, యాప్ వినియోగం లేని జిల్లాల్లో కూడా పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా సరఫరా చేయాలని సూచించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా పంపిణీ వివరాలను వెల్లడించగా, డీఏఓ డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, డీసీఓ గంగాధర్, జిల్లా మార్కెటింగ్అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాలో 9, 407 మెట్రిక్ టన్నుల యూరియా అందులో ఉందని, మరో 5,100 మెట్రిక్ టన్నులు రిజర్వ్ చేశామని కలెక్టర్ అనుదీప్ ఓ ప్రకటనలో తెలిపారు. యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే ఆఫ్‌లైన్ విధానంలో ఇస్తామని, ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి యూరియా సరఫరా చేస్తామనివెల్లడించారు. అలాగే, ఎవరైనావ్యాపారులు అక్రమాలకు ఆల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాని డీఏఓ హె చ్చరించారు. -
ప్రతిభ కనబరిచిన జిల్లా మహిళా కబడ్డీ జట్టు
ఖమ్మం స్పోర్ట్స్: కరీంనగర్లో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా క్రీడాకారులను సోమవారం కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కటికల క్రిస్టోఫర్‌బాబు, కోచ్ శివజ్యోతి, మేనేజర్ శ్రీను పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలకు పదోన్నతులు ఇవ్వాలి ఖమ్మం సహకారనగర్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు పదోన్నతులు ఇవ్వాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెసర ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఎడ్యుకేషనల్ పాలసీపై జరిగిన సమావేశంలో విద్యాశాఖ కమిషన్ చైర్మన్ కేశవరావుకు వినతిపత్రం అందజేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పారుపల్లి ఖమ్మం సహకారనగర్: టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి గా ఉన్న పారుపల్లి నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూటీఎఫ్‌లో మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను జనగామలో జరిగిన సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్, నాయకులు నాగమల్లేశ్వరరావు, వెంకన్న, షమీ, రాంబాబు, సురేష్, నాగేశ్వరరావు, ఉద్దండ్, పద్మ, ప్రశాంతి, నిర్మలాకుమారి, రామకృష్ణ అభినందించారు. 3,189 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 3,189.42 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,499.42 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 450 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 1,040 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిగతా మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసిన ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. హామీ నెరవేర్చేలా వినూత్న ప్రయోగంబోనకల్: బోనకల్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన బానోతు జ్యోతి తనను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ఆమె గెలుపొందగా, హామీల అమలుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం పలువురికి కొండముచ్చును పోలిన డ్రెస్ వేయించి మైక్ ద్వారా అరుపులు చేయిస్తూ కోతులను తరిమికొట్టారు. -
ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆమె అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించాక అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికా రులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. నేలకొండపల్లికి చెందిన ఐతనబోయిన ఉమ సింగారెడ్డిపాలెం రెవెన్యూలో తన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన నంద్యాల శ్రీనివాసరావు ప్రభుత్వ సీలింగ్ భూమిని పేదలకు 1976–77లో పంపిణీ చేస్తే ఇప్పుడు ఆక్రమణకు గురైనందున చర్యలు తీసుకోవాలని కోరారు. వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సుబ్బమ్మ తన కుమారుడు 30 గుంటల భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున తిరిగి ఇప్పించాలని విన్నవించింది.గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ శ్రీజ -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన నీరజ్‌కుమార్(20) ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన సోయం ప్రవీణ్, దుష్యంత్ ఈ నెల 19న రాత్రి సమయంలో కారులో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వస్తున్నారు. మండల పరిధిలోని గుర్వాయిగూడెం శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ముగ్గురూ గాయపడ్డారు. నీరజ్కుమార్ను విజయవాడ తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు. గేదెల విషయమై ఘర్షణ ●తీవ్రగాయాలతో ఒకరు మృతి వేంసూరు: సీసీ రోడ్డు పక్కన గేదెలను కట్టివేస్తుండడంతో అవి తమ ఇంటి ముందుకు వస్తున్నాయంటూ ఘర్షణకు దిగిన ఓ వ్యక్తి చేసిన దాడిలో ఎదుటి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇది. ఏపీలోని నందిగామకు చెందిన మార్కాపూడి వెంకట్రావు వేంసూరు మండలం రాజు గూడెంకు చెందిన పిచ్చమ్మ వివాహం చేసుకొని 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. ఆయన తన నివాసం వెనక సీసీ రోడ్డు పక్కన రెండు గేదెలను కట్టేస్తుండగా సమీపంలో ఉండే బొల్లిపోగు వెంకటేశ్వరరావు అవి తన ఇంటి ముందుకు వస్తున్నాయంటూ సోమవారం గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతుండగా వెంకట్రావుపై వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేయగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను సత్తుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పుట్టుకతో దివ్యాంగురాలు కాగా, మరో కుమార్తెకు ఇటీవలే వివాహం నిశ్చమైన నేపథ్యాన కుటుంబ పెద్ద మృతితో కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రిజర్వ్ ఫారెస్టులో బోరు వేస్తున్న లారీ సీజ్ కారేపల్లి: కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధి చీమలపాడు రిజర్వు ఫారె స్టు ప్రాంతంలో బోర్ వేస్తున్నారనే సమాచారంతో అటవీఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. రాఘబోయినగూడెం నార్త్ బీట్‌లో ఆదివారం తెల్లవారుజామున తనిఖీ చేస్తుండగా బోరువెల్ లారీని గుర్తించి సీజ్ చేసినట్లు ఎఫ్డీఓ మంజుల తెలిపా రు. ఈమేరకు లారీని కారేపల్లి కార్యాలయానికి తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేశామనివెల్లడించారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో అక్రమంగా తవ్వ కాలు చేపట్టినా, బోర్లు వేసినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం కారేపల్లిలో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. ఎఫ్ఎస్ఓ పి.కిషోర్‌కుమార్, ఎఫ్‌బీఓలు సైదా, ఉష తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా నేలకొండపల్లి: మండలంలోని చెరు వుమాధారం సమీపాన ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడగా డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఖమ్మం నుంచి ఏపీలోని ఓ క్వారీ వద్దకు సోమవారం ట్రాక్టర్ వెళ్తోంది. మండలంలోని చెరువుమాధారం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడగా డ్రైవర్ లక్ష్మయ్య అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. -
సైబర్.. అటాక్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఖమ్మం క్రైం: ఈ ఏడాది పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. చోరీల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినా మహిళలకు సంబంధించిన కేసులు గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ అందిన కాడికి దండుకున్నారు. చిన్నాచితక ఘటనలు మినహా గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రత కల్పించిన పోలీసులు... పాతర్లపాడుకు చెందిన సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసును నెలల తరబడి ఛేదించలేక అపప్రద మూటగట్టుకున్నారు. పెరిగిన పోక్సో కేసులు జిల్లాలో మహిళలు, చిన్నారులకు సంబంధించి కేసులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఒకటే పోక్సో కేసు నమోదైతే ఈసారి 15 కేసులు నమోదయ్యాయి. ఈవ్‌టీజింగ్ కింద కేసులు కూడా గత సంవత్సరం 17 ఉండగా.. ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. అత్యాచారం కేసులు గత ఏడాది 74 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 84కు చేరింది. తగ్గిన దొంగతనాలు పోలీసుల పెట్రోలింగ్, నిఘాతో చోరీ కేసులు తగ్గాయని చెబుతున్నారు. గత ఏడాది రూ.6.64 కోట్లకు పైగా సొత్తు చోరీ జరగగా, ఈ ఏడాది రూ.6.04 కోట్లకు పైగా సొత్తు దొంగతనానికి గురైంది. గత ఏడాది రూ.2.06 కోట్ల సొత్తు రికవరీ(31శాతం) చేసిన పోలీసులు ఈసారి రూ.2.40 కోట్ల సొత్తు రికవరీ (40శాతం) చేయగలిగారు. సీసీఎస్ పోలీసులు గత ఏడాది 84 దొంగతనాల కేసులను ఛేదించగా ఈసారి 105 కేసులను ఛేదించారు. అయితే, రికవరీ గత ఏడాది రూ.66.40 లక్షలు చేస్తే, ఈసారి రూ.55.20 లక్షలకే పరిమితమయ్యారు. పెరిగిన శిక్షల శాతం గత ఏడాది 4,398 కేసులు పరిష్కరిస్తే ఈ ఏడాది ఆ సంఖ్య 4,779కు చేరింది. గత సంవత్సరం 2,002 కేసుల్లో శిక్షలు పడగా.. ఈసారి 2,211 కేసుల్లో నిందితులకు శిక్ష వేయించగలిగారు. అలాగే, గత ఏడాది ఇద్దరికి జీవిత ఖైదు విధించగా, పకడ్బందీ చార్జిషీట్లు దాఖలు చేయడంతో అది 11కు పెరిగింది. ఇక 20 ఏళ్ల జైలుశిక్ష గత ఏడాది నాలుగు కేసుల్లో, ఈసారి ఐదు కేసుల్లో నమోదైంది. అలాగే, పదేళ్ల శిక్ష గత ఏడాది, ఈ ఏడాది ఒకరికే పడగా, ఏడేళ్ల శిక్ష ఇప్పుడు ఒకటి నమోదైంది. ఐదేళ్లలోపు శిక్షలు గత ఏడాది 33 కేసుల్లో పడగా.. ఈసారి 37 కేసుల్లో నిందితులకు విధించారు. విచ్చలవిడిగా మత్తు పదార్థాలు ఈ ఏడాది కమిషనేట్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది 37 కేసులు ఉంటే, ఈసారి 95 కేసులు నమోదయ్యాయి. యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడంతో ఎన్డీపీఎస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని భావిస్తున్నారు. ఇక గత ఏడాది 384 కేజీల గంజాయిని సీజ్ చేయగా ఈసారి 295 కేజీలే స్వాధీనం చేసుకోగలిగారు.ఈ సంవత్సరం సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కాయి. మొత్తం 2,197 ఫిర్యాదులు రాగా 1,805 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. గత సంవత్సరం 301 కేసులు నమోదైతే ఈ సంవత్సరం ఏకంగా 384 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం రూ.8.23 కోట్లకు పైగా నష్టపోతే, ఈసారి రూ.15.60 కోట్ల నగదును ప్రజలు కోల్పోయారు. అయితే, గత ఏడాది రూ.37 లక్షలకు పైగా రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈసారి ఏకంగా రూ.4.02కోట్లకు పైగా నగదును రికవరీ చేయడం విశేషం. నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం, నిద్ర మత్తు, రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ ప్రమాదాల్లో వందలాది మంది మృతిచెందగా.. అంతకు మించి సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. హైవేలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యాన వాహనాల వేగంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. నేరాలు 2024 2025 మహిళలకు సంబంధించి కేసులు 941 1,146 ఎన్ఫోర్స్మెంట్ 829 817 రోడ్డు ప్రమాదాలు 879 928 దొంగతనాలు 796 723 మిస్సింగ్ కేసులు 603 705 గాయాలు 693 809 మోసాలు 450 458 మహిళల మిస్సింగ్ 404 470 మహిళలపై వేఽధింపులు 362 516 రోడ్డు ప్రమాదాల్లో మృతులు 312 332 కిడ్నాప్ కేసులు 155 226 హత్యాయత్నాలు 41 40 చైన్‌స్నాచింగ్‌లు 34 28 హత్యలు 28 17 హత్య + దొంగతనాలు 02 01 లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారం 18,224 36,709ప్రశాంతంగా ఎన్నికలు జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగగా పోలీసు కమిషనర్ సునీల్‌దత్ నేతృత్వాన ముందస్తు వ్యూహాలు అమలుచేయడంతో చిన్నాచితక ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. సెక్టార్లుగా విభజించి పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఇది సాధ్యమైంది. కొత్త పుంతలు తొక్కిన ఆన్లైన్ మోసాలు -
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై దృష్టి
ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి లక్ష్యం మేర రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యంలో 54.15 శాతం పూర్తయిందని తెలిపారు. అలాగే, రూ. 97 కోట్ల విద్యారుణాలకు కేవలం రూ. 14.31 కోట్లే అందించినందున యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంట రుణాల పంపిణీలో పురోగతి నమోదైందని అభినందించిన ఆయన, వ్యవసాయానికి సంబంధించి ఇతర రుణాల్లో 19 శాతమే పంపిణీపై ఆరా తీశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.2,968 కోట్లకు గాను సెప్టెంబర్ చివరి నాటికి రూ.1,503 కోట్లు, 9,113 స్వశక్తి సంఘాలకు రూ.994.48 కోట్ల రుణాలు అందించామని బ్యాంకర్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్డీఎం రవిప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐజీ ఫ్లాట్ల ధర తగ్గిస్తేనే ఫలితం ఖమ్మంగాంధీచౌక్: హౌసింగ్ బోర్డు ఆధ్వర్యాన ఖమ్మంలోని శ్రీరాంనగర్‌లో నిర్మించిన ఎల్ఐజీ(లో ఇన్‌కం గ్రూప్) ప్లాట్ల విక్రయాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కార్యదర్శి విమల, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకమరావు, పీఆర్ఓ వి.వాసు పాల్గొనగా.. శ్రీరాంనగర్‌లోని 126 ఎల్ఐజీ ప్లాట్ల వివరాలు వెల్లడించారు. 450 చదరపు గజాల్లో నిర్మించిన ఒక్కో ఫ్లాట్ ధర రూ.11.25 లక్షలుగా నిర్ణయించామని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ఆధారంగా కేటాయిస్తామని తెలిపారు. అయితే, సదస్సుకు హాజరైన పలువురు ధరను రూ.8 లక్షలకు తగ్గించాలని కోరారు. అంతేకాక రహదారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఖమ్మం నగర వాసులకే ఇతరులకు అవకాశం ఇవ్వడంపై ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఇద్దరు ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
మహిళా హక్కుల పరిరక్షణకు ఓల్గా కృషి
ఖమ్మంగాంధీచౌక్: సామాజిక అసమానతలు, పితృస్వామిక భావజాల అణచివేతల సారమే ఓల్గా రచనలని, మహిళా హక్కుల పరిరక్షణకు ఆమె విశేష కృషి చేశారని ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు ఆచార్య సి.మృణాళిని అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘ఓల్గా సాహిత్య సమాలోచన’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో సీ్త్రవాద అస్తిత్వ స్పృహతో ఓల్గా అనేక రచనలు చేశారని తెలిపారు. కథా రచయిత్రి వి.ప్రతిమ మాట్లాడుతూ.. ఓల్గా రచనలు సీ్త్రల సాధికారత, అస్తిత్వ చైతన్య ప్రకటనగా కనిపిస్తూనే సమాజంలోని కుటుంబ రాజకీయ సాంస్కృతిక ప్రభావాన్ని, వాటి స్వరూపాలను ఆవిష్కరించారని తెలిపారు. రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. సమాజంలోని సామాజిక సంక్లిష్టతే తన రచనల నేపథ్యమని తెలిపారు. సీ్త్రల మధ్య సహకారం ఉండాలని, మహిళలను సంఘటితం చేసేందుకే తన రచనలు సాగాయని చెప్పారు. తొలుత ఓల్గా రచనల సారాంశ పోస్టర్లను న్యాయవాది పి.సంధ్యారాణి ప్రారంభించారు. ‘ఓల్గా రాజకీయ కథలు – విశ్లేషణ’ అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రచయిత్రులు వి.సునంద, పాటిబండ్ల రజని, డాక్టర్ కె.ఆనందవాణి, నాగమణి, జతిన్‌కుమార్, సాహితీవేత్తలు అక్కినేని కుటుంబరావు, రవిమారుత్, కె.ఆనందాచారి, ఆర్.పార్వతీరెడ్డి, జి.సౌభాగ్య, కె.శైలజ, ఎస్.రాధికారెడ్డి, ఫణి మాధవి, ఎస్.స్పందన, టి.లక్ష్మి పాల్గొన్నారు. -
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుకలను ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పార్టీ జెండా ఆవిష్కరించాక కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారత్ ఎదగడానికి కాంగ్రెస్సే కారణమని తెలిపారు. జనవరి 26న పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని, ప్రతీ కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నగర పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సుభాష్ ఎక్కర, మహ్మద్ జావేద్, చోటాబాబా, వడ్డెబోయిన నరసింహారావు, యడ్లపల్లి సంతోష్, అంజనీకుమార్, దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, బొడ్డు బొందయ్య, శేఖర్‌గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, బాలగంగాధర్ తిలక్, దొండపాటి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, లకావత్ సైదులు, రాపర్తి శరత్, వైష్ణవి ప్రసన్నకృష్ణ పాల్గొన్నారు. అభివృద్ధిలో మధిర ముందంజ మధిర: స్వాతంత్య్ర పోరాటం నుంచి గొప్ప చరిత్ర కలిగిన మధిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపరు. మధిరలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరానికి మధిరలోనే పునాది పడగా, ఎందరో సమరయోధులకు ఆశ్రయం కల్పించింది ఇక్కడేనని తెలిపారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ఆవిష్కరించకుండా నిజాం ప్రభుత్వం నిషేధం విధిస్తే సర్దార్ జమలాపురం కేశవరావు మారువేషంలో మధిరలో మూడు రంగుల జెండా ఎగురవేశారని, తొండలగోపవరం కేంద్రంగా నల్ల మల గిరిప్రసాద్ నిజాం వ్యతిరేక పోరాటం నడిపారని గుర్తు చేశారు. అయితే, ఓ పక్క ఏరు, మరో పక్క చెరువుతో మధిర విస్తరణకు సమస్యలు ఎదురవుతున్న నేపథ్యాన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పనుల్లో నాణ్యత లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, విద్యుత్ అంతరాయాలు ఎదురుకాకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక పట్టణాల్లో పేదల కోసం జీ ప్లస్ విధానంలో హౌసింగ్ కాలనీలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. కాగా, మధిరలో డిగ్రీ, జూనియర్ కళాశాలు, హైస్కూల్‌కు కొత్త భవనాలు మంజూరు చేయగా, త్వరలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులకు భూమి పూజ చేస్తానని తెలిపారు. అంతేకాక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను మంజూరు చేశామని, మహిళా సంఘాల్లో సభ్యులకు స్వయం ఉపాధి కల్పన కోసం సబ్బులు, అగరబత్తీ తయారీ కేంద్రానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు భట్టి వెల్లడించారు. కాగా, రాజకీయాలు ఎన్నికల వరకే అని, ఆ తర్వాత మధిర పట్టణాభివృద్ధే లక్ష్యమని వెల్లడించిన భట్టి.. పార్టీల నాయకులు, మేధావులు, విద్యావంతులు తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భట్టి విక్రమార్క జెండా ఆవిష్కరించారు. డీసీసీ కార్యాయలంలో కేక్ కట్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి -
ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారమచంద్రస్వామి వారు ఆదివారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధమనోహర రూపం.. కిరీటంపై నెమలి ఈకలతో బంగారపు ఊయలలో ఊగుతున్న స్వామివారికి భక్తులు నీరాజనం పలికారు. పగల్‌పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న స్వామివారి ఆవతారాలు ఆదివారంతో ముగిశాయి. నేడు తెప్పోత్సవం శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు పవిత్ర గోదావరిలో సోమవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేడుకలకు హంస వాహనాన్ని అలంకరించారు. అధ్యయనోత్సవాల్లో పదో రోజు రామయ్య జల విహారం చేయనుండగా, ఆగమంలో దీన్ని ప్లవోత్సవంగా పేర్కొంటారు. వ్యవహారిక భాషలో తెప్పోత్సవంగా పిలుస్తారు. తెప్పోత్సవానికి ఏర్పాటు పూర్తి చేశామని ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. కాగా, సోమవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు సేవాకాలం, తిరుమంగై ఆళ్వారుల పరమపదోత్సవం, 1 నుంచి 2 గంటల వరకు రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి సేవ, పగల్‌పత్తు ఉత్సవాల సమాప్తి, 3గంటలకు దర్బారుసేవ నిర్వహిస్తామని వివరించారు. -
కష్టాలు..కడగండ్లు
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రైతులకు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు ఎదురయ్యాయి. జూన్ మినహా జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో వరి, పత్తి పంటలు లక్ష్యానికి మించి సాగు చేశారు. అయితే, మధ్యమధ్య భారీ వర్షాలు, తుపాన్లతో పంట నష్టం కూడా అదేస్థాయిలో నమోదైంది. ఇక యూరియా కొరతతో ఇక్కట్లు ఎదుర్కొనగా, ధర ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా మిర్చి సాగు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది రైతులకు మిశ్రమ ఫలితాలే మిగిలాయి. – ఖమ్మంవ్యవసాయంజిల్లాలో గతేడాది 59,235 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది 31,713 ఎకరాలకే పరిమితమైంది. ఇక్కడ ప్రధానంగా సాగయ్యే ‘తేజా’ రకం మిర్చికి విదేశాల నుంచి ఆర్డర్లు రాకపోవడం, క్వింటాకు రూ.20 వేల వరకు పలికిన ధర సీజన్లో రూ.12 వేలు దాటకపోవడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. తెగుళ్ల బెడదతోనూ రైతులు మిర్చిని వదిలేసి పత్తి, ఇతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. పంటల ఉత్పతి దశలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వానలతో పాటు అక్టోబర్‌లో మోంథా తుపాను కారణంగా పూత, కాత దశలో ఉన్న పత్తికి నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి ఐదు క్వింటాళ్లు దాటలేదు. ఆగస్టులో కురిసిన వానలతో 3,635 మంది రైతులకు చెందిన 4,654.16 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇక మోంథా తుపానుతో 4,268 మంది రైతులకు చెందిన 4,275 ఎకరాల్లో వరి, పత్తి, కంది, మినుము, పెసర, టమాట పంటలకు నష్టం వాటిల్లింది. పంట రుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల వరకు మాఫీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో 1,31,760 మంది రైతులకు రూ.912.61 కోట్ల రుణాన్ని మాఫీ చేసింది. ఇక పంటల సాగుకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున గత వానాకాలం సీజన్లో 3,37,898 మంది రైతులకు రూ.427.264 కోట్లు చెల్లించింది. వానాకాలంలో కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంది. సాగర్ ప్రాజెక్టులోనూ నీరు ఉండడంతో యాసంగి సాగుకు ఢోకా లేనట్టేనని భావిస్తున్నారు. ఈసారి వరి 2.46 లక్షలు, మొక్కజొన్న 1.60 లక్షల ఎకరాలతో పాటు అన్నీ కలిపి 4.16 లక్షల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరితో పాటు మొక్కజొన్న సాగుపై రైతులు దృష్టి సారించగా ఇప్పటికే వెదజల్లే పద్ధతిలో వరి వేస్తున్నారు. ఇంకొందరు నారు పోశారు. ఈ ఏడాది విస్తారమైన వర్షాలతో జిల్లాలో పంటల సాగు సంతృప్తికరంగా సాగింది. వరి సాగు విస్తీర్ణం పెరగడమే కాక దిగుబడి, ధర ఆశాజనంగా ఉన్నాయి. అధిక వర్షాలతో పత్తి దిగుబడి కొంత మేర తగ్గింది. ధర ప్రభావంతో మిర్చి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారిపంట విస్తీర్ణం (ఎకరాల్లో) వరి 3,03,490.33పత్తి 2,56,211.10మొక్కజొన్న 1,970.28ఆయిల్‌పామ్ 40,065మిరప 31,713మామిడి 31,241కూరగాయలు 1,208నెల సాధారణం నమోదు జూన్ 131.2 123.9జూలై 240.9 281.6ఆగస్టు 240.0 389.7సెప్టెంబర్ 179.0 241.1పంటల సాగు లక్ష్యాన్ని దాటినా దెబ్బతీసిన తుపాన్లు ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలో రెండు పరిశ్రమలు, ఇక్కడి నేలలు, నీటి వనరులు అనుకూలంగా ఉండడంతో పంట సాగుకు మొగ్గు చూపారు. జిల్లాలో మొత్తం 10,459 మంది రైతులు 40,345.34 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. -
శాంతిభద్రతల సమస్య తేవొద్దు
రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి: హవాలా, సైబర్‌క్రైం, పేకాట, కోడిపందేలతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, మంచి చేయకపోయినా సరే కానీ.. ఇలాంటి చర్యలతో సత్తుపల్లికి చెడు పేరు తేవొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన) తనయుడు మధుమోహన్‌రెడ్డి అందించిన రూ.1.50 కోట్లతో గంగారం పంచాయతీ సమీకృత భవనం, డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యక్తిత్వాన్ని బట్టే విలువ ఉంటుందని, పంచాయతీ ఎన్నికల్లో రూ.కోట్టు ఖర్చుపెట్టినా ప్రజాదరణ ఉన్నవారే ఎన్నికయ్యారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావును ఆదర్శంగా తీసుకుని పని చేయడం వల్లే తాను చేసిన అభివృద్ధి పనులు ప్రతీ గ్రామంలో కనిపిస్తున్నాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే సలహాలు, సూచనల మేరకు అధికారులు పనిచేస్తూ అభివృద్ధిలో ముందుంచాలని అన్నారు. మధుమోహన్‌రెడ్డి అభినందనీయుడు.. రెండేళ్ల నుంచి గంగారంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్న దాసరి మధుమోహన్‌రెడ్డి అభినందనీయుడని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సొంత డబ్బులతో గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మధుమోహన్రెడ్డికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, మధుమోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు కాకర్ల రేవతి, మౌనికారెడ్డి, దోమ ఆనంద్ పాల్గొన్నారు. -
అలరించిన సినీ సంగీత విభావరి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి స్వర సుధ కల్చరల్ యూనిట్ ‘మదిలో వీణలు మ్రోగే’పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కళాభిమానులను అలరించింది. గాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు, గాయనీ, గాయకులు పాటలు పాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆదిరాజు పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మీనారాయణ, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఏఎస్ కుమార్, సెలవోటి చంద్రమోహన్, ఎస్.ప్రకాష్, ఆరేపల్లి పున్నయ్య, ఎస్వీ రమణ, మోహన్‌రావు, మాలతీనాయుడు, జనార్దన్, దేవీప్రియ, శ్రీదేవి, స్నేహ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్
ఖమ్మవైరారోడ్: కాంగ్రెస్ నేతలు అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుండగా, మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ చూసుకుని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడుతూ.. బోనకల్ మండలం ఆళ్లపాడులో గెలిచిన సంతోషంలో ర్యాలీ నిర్వహిస్తుంటే, కుంకుమ పడిందనే నెపంతో కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగలగొట్టారని మండిపడ్డారు. అయినా పోలీసులు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారని చెప్పారు. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టారని, తీగలబంజరలో గెలిచిన సర్పంచ్ మర్యాదపూర్వకంగా కలిస్తే బలవంతంగా కండువా కప్పారని ఎద్దేవా చేశారు. ఇక ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జింకలగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగారని ఆరోపించారు. ఇకనైనా బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ముదిగొండ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, పోట్ల శ్రీనివాసరా వు, చావా వేణుబాబు, మంకెన రమేష్, గురజాల హనుమంతరావు, బొడ్డు వెంకట రామారావు, కన్నెబోయిన కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే సండ్ర, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజ్ -
కేయూ క్రికెట్ విజేత ‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్’
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు టైటిల్ దక్కించుకుంది. ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ – జీడీసీ పాల్వంచ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ జట్టు పరిమిత ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ తర్వాత పాల్వంచ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. అంతకు ముందు జరిగిన రెండో సెమీస్‌లో కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల జట్టుపై జీడీసీ పాల్వంచ జట్టు విజయం సాధించింది. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న ట్రోఫీలు అందజేయగా, పీడీలు జి.గోపీకృష్ణ, డాక్టర్ పెరుమాండ్ల కోటేశ్వరరావు, జె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. రెండో స్థానంలో జీడీసీ పాల్వంచ -
పట్టుదలతో అవరోధాలను అధిగమించవచ్చు
ఖమ్మంమయూరిసెంటర్: మనిషిలో పట్టుదల ఉంటే ఎంతటి అవరోధాన్ని అయినా అధిగమించి విజయాలను సాధించవచ్చని జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. వీటిని ప్రారంభించిన విజేత మాట్లాడుతూ.. మనిషిలో పోరాట పటిమ ఉంటే లక్ష్య సాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదన్నారు. పలు రంగాల్లో దివ్యాంగులు అనేక విజయాలను సాధించి, ఉన్నత స్థానాలను అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఉత్సాహంగా పోటీలు.. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన దివ్యాంగుల ఆటల పోటీల్లో 250 మంది పాల్గొన్నారు. అంధులు, బదిరిలు, మూగ, పోలియో విభాగాల వారీగా నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ప్రతిభ కనబరించారు. వీరి కోసం అధికారులు రన్నింగ్, క్యారమ్స్, చెస్, జావలిన్ త్రో, షార్ట్‌పుట్ నిర్వహించారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు విజేత వెల్లడించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బిందుప్రసాద్, వేణుగోపాల్, సునీత, రమేష్, చారి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆటల పోటీల ప్రారంభంలో సంక్షేమ అధికారిణి విజేత -
గంజాయి గాడీ!
● ఒడిశా నుంచి మహారాష్ట్రకు సరఫరా ● కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకుంటున్న రవాణాదారులు ● జీఆర్పీ పోలీసులు తనిఖీ చేస్తున్నా ఆగని దందా ఖమ్మంక్రైం: ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఖమ్మం మీదుగా గంజాయి రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ అక్రమ రవా ణాకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అక్రమార్కులు ఉపయోగించుకుంటున్నారు. జీఆర్పీ పోలీసుల తనిఖీల్లో కొందరు అప్పుడప్పుడూ పట్టుబడుతున్నా రవాణా మాత్రం ఆగడం లేదు. అక్కడ విస్తృతంగా సాగు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున గంజా యిని సాగు చేస్తూ ఉంటారు. దీనికి మహారాష్ట్రలోని ముంబై, పుణే ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలిసింది. దీంతో భువనేశ్వర్ నుంచి వచ్చే కోణా ర్క్ ఎక్స్‌ప్రెస్‌ను గంజాయి స్మగ్లర్లు వినియోగించుకుంటున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు స్మగ్లర్లు పలువురు నిరుపేదలను ఎంచుకుని వారికి డబ్బు ఎరవేసి గంజాయి రవాణా సాగిస్తున్నారు. చిక్కేది బాధితులే.. జీఆర్పీ పోలీసుల తనిఖీల్లో గంజాయితో పట్టుబడినవారిలో చిన్నాచితకా వ్యక్తులేనని చెపాలి. అసలు స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారో పోలీసుల విచారణలో బయటపడే పరిస్థితి ఉండదు. ఒకవేళ చెప్పి నా వారిని పట్టుకోవటానికి ఆధారాలు ఉండవని, వారు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లలేరని పోలీసుల ద్వారా తెలిసింది. ఒడిశా ప్రాంతంలో గంజాయి సాగు చేసే ప్రాంతాలకు వెళ్లగలిగినా తిరిగి రావడం కష్టమని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూ.20 లక్షలకు పైగా సరుకు స్వాధీనం ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోనే రూ.22 లక్షలకు పైగా విలువైన గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో రూ.3లక్షల విలువైన గంజాయి లభించింది. ఆయా కేసుల్లో పదిమందిని అరెస్ట్ చేశారు. వీరంతా ఒడిశా రాష్ట్రంలోని భువనే శ్వర్, బరంపూర్ జిల్లాల వారే కావడం గమనార్హం. దీంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఏమేర గంజాయి స్మగ్లింగ్ నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాగా, సిబ్బంది కొరతతో పూర్తిగా రవాణాను అరికట్టలేకపోతున్నామని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. గంజాయి రవాణాను ఆరికట్టడానికి నిత్యం ఖమ్మం జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేస్తున్నా రవాణా ఆగ డం లేదు. తనిఖీల సమయాన గంజాయితో ఒకరిద్దరు పట్టుబడుతున్నారు. మిగతా వారు తప్పించు కుని గంజాయిని దొంగచాటుగా తరలించేస్తున్నా రు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నప్పుడు వారి దృష్టిని మర్చలడానికి ఒకరిద్దరిని ముందు ఉంచి.. మిగతా వారు తమ పని కానిచ్చేస్తున్నట్లు సమాచారం. -
ముగిసిన బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ రెండు రాష్ట్రాలస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. మొదటిస్థానంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వేస్ విశాఖపట్నం, ఒంగోలు ద్వితీయస్థానం, తృతీయస్థానంలో రాజేందర్ పైప్స్ విజయవాడ, నాలుగోస్థానంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం, ఐదో స్థానంలో ఈస్ట్ గోదావరి జట్లు నిలిచాయి. ఈసందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంబూరి దయాకర్‌రెడ్డి, ఏలూరి లక్ష్మీనారాయణ, డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి వీ.వీ.రమణ, జిల్లా బాల్ బ్యాడిమంటన్ అసోసియేషన్ అధ్యక్షులు వేజెళ్ల సురేశ్, టోర్నీ కన్వీనర్ రాధాకృష్ణమూర్తి, నిర్వాహకులు టి.రామచంద్రమూర్తి, విజయ్కలామ్, బడే సాహెబ్, తిరుపతి రెడ్డి, శంకరమూర్తి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం క్రాస్ కంట్రీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలకు బాలబాలికలు 20 మంది హాజరుకాగా, జట్ల వివరాలను అసోసియేసన్ జిల్లా కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ ప్రకటించారు. బాలుర జట్టుకు చరణ్‌గౌడ్, ఎన్.రవి, ఎస్.సైదులు, కె.ప్రశాంత్, జె.అనిల్, బాలికల జట్టుకు పి.శ్రా వణి, ఎ.శాలిని, యు.నిషా ఎంపికయ్యారు. పోటీల నిర్వహణలో ఎం.సుధాకర్, రవి, సీహెచ్.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరిన యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,417.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 420 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 980 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించి సరఫరా చేశారు. ముక్కోటి ఉత్సవాల్లో ‘కళా’కాంతులు భద్రాచలంటౌన్: భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరం ఆదివారం సందర్శకులతో నిండిపోయింది. ఏరు ఉత్సవాల సందర్భంగా నదీ తీరంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ ఆర్ట్ స్పేస్’సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టా రు. ప్రత్యక్ష చిత్రలేఖనం (లైవ్ పెయింటింగ్) ద్వారా భక్తి భావాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు. బోనకల్లో చోరీ బోనకల్: మండల కేంద్రానికి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మహబూబ్ సుబానీ శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఆవరణలో పెట్టాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ కూడా చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. విద్యార్థిని అదృశ్యం ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయిన ఘటనపై ఆదివారం కేసు నమోదైంది. బల్లేపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి నగరంలోని ఓ కళాశాలలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులకు దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణరావు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తి ఈ వీడియోలను అప్లోడ్ చేశాడని, ఈ వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయని ఆరోపించారు. -
ఘనంగా ప్రిజన్ మినిస్ట్రీ జూబ్లీ వేడుకలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రిజన్ మినిస్ట్రీ జూబిలీ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి చైర్మన్, ఖమ్మం మేత్రాసనం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బిషప్ మాట్లాడుతూ.. కారాగారంలో మగ్గుతున్న ఎంతోమంది జీవితాలలో వెలుగులు చూడాలని, త్వరలో వారికి విడుదల కలగాలని, వెలుపల ఉన్న వారి కుటుంబాలను పరామర్శించి వారిని ఆదుకుంటామని తెలిపారు. సమాజంలో హింసకు తావు లేకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్‌లుగా ఎన్నికై న వారిని, 25 ఏళ్ల నుంచి ఉపదేశకులుగా సేవలందించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఫాదర్లు ఐజాక్, సురేశ్, విజయ్, కొమ్ము అంతోని, జూర్నిస్, కొమరవెల్లి జోసెఫ్, వికార్, తప్పట శౌరి తదితరులు పాల్గొన్నారు. -
మోడ్రన్ కబడ్డీ విజేత మేడ్చల్..
కామేపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో మేడ్చల్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు నల్లగొండపై విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో నల్లగొండ, తృతీయ స్థానంలో హైదరబాద్, నాలుగో స్థానంలో కరీంనగర్ జట్లు నిలిచాయి. మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి నేతృత్వంలో ఈ పోటీలు జరగగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్ఐ శ్రీకాంత్, గింజల నరసింహారెడ్డి, తోటకూరి శివయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రాంరెడ్డి జగన్నాథరెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు -
కేసు నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి
ఖమ్మంవ్యవసాయం: అటవీ, వన్యప్రాణుల కేసుల్లో దర్యాప్తు, అభియోగాలు సమర్థవంతంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం అటవీశాఖ కార్యాలయంలో అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎ.శంకర్, అదనపు ప్రాసిక్యూటర్లు, అటవీ శాఖ అధికారులు, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీ, వణ్య ప్రాణుల కేసుల నమోదు, సరైన దర్యాప్తు, నిర్వహణ, సంబంధిత న్యాయస్థానాల్లో అభియోగాలపై చర్చించారు. న్యాయ స్థానాల ముందు కేసులను సమర్థవంతంగా ప్రస్తావించేందుకు అటవీ శాఖ, ప్రాసిక్యూషన్ శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు పేర్కొన్నారు. -
కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్ కోడ్లు
ఖమ్మంమయూరిసెంటర్: 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. సీఐటీయూ ఖమ్మం జిల్లా మహాసభలను ఆదివారం ప్రారంభిస్తూ వారు మాట్లాడారు. ఈ మహాసభలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, నాయకులు బి.మధు, సాంబశివరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, విష్ణువర్ధన్, వై.విక్రమ్, రమ్య పాల్గొన్నారు. నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఐటీయూ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ నేతలు తెలిపారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణువర్ధన్, కోశాధికారిగా చలమల విఠల్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులుగా వై.విక్రమ్, పిన్నింటి రమ్య, ముదాం శ్రీనివాస బండారు యాకయ్య, దొంగల తిరుపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శులుగా శీలం నరసింహరావు, జిల్లా ఉపేందర్, కోటేశ్వరి, తిరుమలచారి, ప్రసాద్, ఎస్.నవీన్‌రెడ్డి, మ్లూరి చంద్రశేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభల్లో పలు తీర్మాణాలు చేసి ఆమోదించడం జరిగిందన్నారు. -
పుట్టింటికి వెళ్లి వస్తూ..
సత్తుపల్లిటౌన్: పెళ్లయి ఐదు నెలలు అయింది.. పుట్టింటికి భర్తతో కలిసి వెళ్లి తమ్ముడితో కలిసి అత్తారింటికి వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ప్రమాదంలో ఆమె తమ్ముడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం సూరయ్యబంజర్ గ్రామానికి చెందిన పుచ్చ కృష్ణయ్య, రమాదేవి దంపతుల కుమార్తె తేజస్విని (18)కి ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కండ్రికగూడెం గ్రామానికి చెందిన తోట మధుతో ఐదు నెలల క్రితం వివాహమైంది. పుట్టింటికి వచ్చిన కొత్త దంపతులు ద్విచక్ర వాహనంపై కండ్రికగూడెం బయలుదేరారు. దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తేజస్విని తమ్ముడు పుచ్చా దేవేందర్ (13)ని కూడా ఎక్కించుకొని బయలుదేరారు. తన తమ్ముడిని సోమవారం ఆశ్రమ పాఠశాలలో చేర్పించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులో గల తమ్మిలేరు బ్రిడ్జిపై వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. అక్కా, తమ్ముడు తేజస్విని, దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. తోట మధు తీవ్రంగా గాయపడటంతో సత్తుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించి విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని గంగారం వద్ద అదుపులోకి తీసుకున్నారు. లేకలేక కలిగిన సంతానం.. కూలి పనులు చేసుకునే పుచ్చా కృష్ణయ్య, రమాదేవి దంపతులకు పెళ్లి అయిన పదేళ్లకు తేజస్విని, దేవేందర్ జన్మించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తీవ్రంగా గాయపడిన మధు సైతం ‘నా తేజుకు ఎలా ఉందిరా..’అంటూ బంధువులను ఆరాతీయడం పలువురిని కంటతడి పెట్టించింది. లారీ ఢీకొని అక్కా, తమ్ముడు దుర్మరణం -
అర్ధరాత్రి యూరియా అమ్మకాలు
● అధికారుల ఆదేశాలు బేఖాతర్ చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం అర్ధరాత్రి యూరియా అమ్మకాలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎరువుల దుకాణం యజమానులు తమ వద్ద ఉన్న యూరియా నిల్వలను ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నాగులవంచ గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని తన వద్ద ఉన్న యూరియా నిల్వలను ఆన్లైన్లో నమోదు చేయకుండా రైతులకు అధిక ధరతో విక్రయించాడు. దీంతోపాటు రూ.450 విలువ గల దుబ్బు గుళికలను లింకు పెట్టి విక్రయించాడు. నాగులవంచలో యూరియా అమ్మకాలు చేస్తున్నారనే విషయం రైతులకు తెలియటంతో దుకాణం వద్దకు యూరియా కోసం పెద్దఎత్తున చేరుకుని యూరియా కట్టల కోసం ఎగబడ్డారు. దీంతో ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచి గందరగోళం నెలకొంది. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి మానసను వివరణ కోరగా ఎరువుల దుకాణాల్లో ఉన్న యూరియా నిల్వలను ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని దుకాణ యజమానులను ఆదేశించామని, కానీ నాగులవంచలోని ఓ దుకాణం యజమాని జీరో స్టాక్‌ను ఆన్లైన్లో చూపించారని తెలిపారు. 30న ‘పీఎంశ్రీ’ క్రీడా పోటీలు కొత్తగూడెంఅర్బన్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈ నెల 30న పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ బి. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అంశాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టును కూడా ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వి.నరేష్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని వివరించారు. -
చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..
పాల్వంచరూరల్: విద్యాలయాల్లో సౌకర్యాలు ఉన్నా, లేకున్నా.. చదువుకోవాలనే పట్టుదల ఉండాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఐ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా పూర్వ విదార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ఆదివారం వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గిరిజన గురుకులంలో 50 ఏళ్ల క్రితం నాటిన మొక్క మహావృక్షమైందన్నారు. విద్యార్థులు ఉన్న వనరులు, అవకాశాలను వినియోగించుకుంటూ చదువుకోవాలనే కసి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కాగా, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ ఉపాధ్యాయులు ఎన్.చక్రవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్సీఓ అరుణకుమారి, ఏపీఓ డేవిడ్‌రాజు, ప్రిన్సిపాల్ రమేశ్, ఎస్.శ్యామ్‌కుమార్, ఖాదర్, రమేశ్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు. -
జలవిహారం
శ్రీరాములుతోనే● 1971 నుంచి కనుల పండువగా తెప్పోత్సవం ● ముఫ్పై ఏళ్లుగా ‘శ్రీరాములు’ లాంచీనే హంసవాహనం ● ఆగమశాస్త్రం ప్రకారం దేవేరుల జలవిహారంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోల్కొండ నవాబుగా తానీషా ఉన్న 17వ శతాబ్ద కాలంలో భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి ఆలయాన్ని కంచర్ల గోపన్న నిర్మించాడు. 1798లో గోదావరికి అవతలి వైపు ఉన్న భద్రాచలం ఏజెన్సీని బ్రిటీషర్లకు నిజాం రాజులు దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్‌తో సంబంధాలు పలుచబడి రాజ మండ్రితో భద్రాచలానికి సంబంధాలు పెరిగాయి. రాజమండ్రి, భద్రాచలం మధ్య దట్టమైన శంకరగిరి మాన్యాలు (రంపచోడవరం అడవులు) ఉండటంతో ఈ రెండు ప్రాంతాలను గోదావరిపై జల రవాణా వ్యవస్థనే కలిపి ఉంచేది. రాజమండ్రి నుంచి నిత్యావసర వస్తువులు భద్రాచలం ఏజెన్సీకి వస్తే ఇక్కడి నుంచి పంట ఉత్పత్తులు, కలప, లంక పొగాకు తదితరాలు రాజమండ్రికి వెళ్లేవి. అలా స్వాతంత్య్రం వచ్చే సమయానికి భద్రాచలం ఏజెన్సీకి రాకపోకలు సాగించేందుకు రాజమండ్రి కేంద్రంగా పదిహేను వరకు లాంచీలు నడిచేవి. ఉదయం 5 గంటలకు రాజమండ్రిలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు కూనవరం, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలానికి చేరుకునేవి. ప్రస్తుత చప్టా దిగువ ప్రాంతం అంత్యంత రద్దీ మార్కెట్‌గా ఉండేది. సరిగ్గా దీనికి అవతల ఒడ్డున గొమ్మూరు లంగరు ఉండేది. తెప్పోత్సవం రామయ్య స్వామికి పంచారాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిత్య పూజలు నిర్వహించేందుకు శ్రీరంగం నుంచి ఐదు శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే కుటుంబాలను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆ సంప్రదాయాలను అనుసరించి ఆరంభంలో తెప్పలో సీతారాములను గోదావరిలో జల విహారానికి తీసుకువచ్చేవారు. బూర్గంపాడు–భద్రాచలం ప్రాంతాలను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మాణం జరిగాక భద్రాచలానికి మేలైన రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చింది. భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో 1971లో భారీ వేడుకగా లాంచీలలో తెప్పోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి క్రమంగా లాంచీ సైజు అలంకరణలో భారీతనం చోటు చేసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి ‘శ్రీరాములు’ రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత జలరవాణా తన వైభవాన్ని కోల్పోయింది. కేవలం వానాకాలంలో అప్రమత్తతకే లాంచీలు పరిమితమయ్యాయి. 1986 వరదల తర్వాత జూన్ నుంచి సెప్టెంబరు వరకు వరుసగా మూడు నెలల పాటు లాంచీలను ప్రభుత్వం లీజుకు తీసుకునేది. లాంచీలు భద్రాచలం కేంద్రంగా సేవలు అందించేవి. ఈ క్రమంలో శ్రీరాములు లాంచీ 1995లో తెప్పోత్సవంలో భాగమైంది. ఆ ఏడు ఈ లాంచీకి చేసిన హంస అలంకారం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రముఖ ఆలయాల్లో తెప్పోత్సవానికి స్ఫూర్తిని ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శ్రీరాములునే ముక్కోటి పర్వదినానికి ముందు రోజు హంసగా మారుతుంది. రాముడి సేవలోనే 30ఏళ్లుగా ‘శ్రీరాములు’ రాముడి సేవకే అంకితమైంది. పదిహేను రోజుల పాటు హంస అలంకారం చేస్తారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత అలంకారం తీయడానికి మరో పది రోజుల సమయం పడుతుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఈ లాంచీని నీటి నుంచి బయటకు తీసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతారు. ఆ రోజుల్లో ఈ బోటు తయారీకి రూ. 3లక్షల ఖర్చయింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త బోటు తయారు చేయాలంటే రూ. 1.50 కోటి వరకు ఖర్చు అవుతుంది. ప్రతీ ఏడు వరదల సీజన్లో మూడు నెలల పాటు ప్రభుత్వం చెల్లించే లీజు ఆధారంగా లాంచీ నిర్వహణ సాగుతోంది. ఆ తర్వాత భద్రాచలం సమీపంలోనే లంగరు వేసి ఉంటుంది. వినాయకచవితి, దసరా సందర్భంగా విగ్రహాల నిమజ్జనంలో సాయం అందిస్తుంది. ముక్కోటి సమయంలో నెల రోజుల ముందుగా భద్రాచలం పుష్కరఘాట్‌కి తీసుకువస్తారు. మా నాన్న పేరు సీతారాములు. నా లాంచీ పేరు శ్రీరాములు. మాది రామభక్తుల కుటుంబం. ఆలయ ఈవోగా ప్రేమ్ అనే అధికారి ఉన్నప్పుడు రాముడికి సేవలు చేసి ఫీజు అడుగుతావా అని అడిగాడు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెప్పోత్సవానికి మా లాంచీని ఉచితంగానే అందుబాటులో ఉంచుతున్నాం. –రామకృష్ణ, లాంచీ యజమాని -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
కామేపల్లి: కామేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి నేతృత్వంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలు రెండో రోజు శనివారం హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు. -
‘బార్’ ఎన్నికలకు నామినేషన్ దాఖలు
ఖమ్మంలీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న మందడపు శ్రీనివాసరావు శనివారం హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) తరఫున తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు జలసూత్రం శివరామ్‌ప్రసాద్, ఏడునూతల శ్రీనివాసరావు, ఐలు మహిళా వింగ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యులు గాదె సునంద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కె.పుల్లయ్య రావిలాల రామారావు, కిలారు పురుషోత్తంరావు, పోశం భాస్కరరావు, వుడతనేని శ్రీనివాసరావు, నవీన్ చైతన్య, చింతనిప్పు వెంకట్, రామబ్రహ్మం, శ్రీలక్ష్మి, డి.నారాయణ, పాపయ్య, మీసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సంచి లేకుండా సరదాగా..
ఖమ్మంసహకారనగర్: పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బ్యాగుల మోతతో, రివిజన్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిరోజు పాఠశాలకు ఈ బ్యాగులను మోసుకెళ్లాల్సిందే. దీనిని గుర్తించిన ప్రభుత్వం నెలలో ఒక్కరోజు అయినా ‘నో బ్యాగ్ డే’నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఆదేశించినా కొన్ని చోట్ల మాత్రమే దీని అమలు చేస్తున్నారు. మూడు నెలలుగా జిల్లాలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చొరవతో ప్రతీ నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తున్నారు. ఆ రోజున ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు బ్యాగ్‌లు, పుస్తకాలు లేకుండా పాఠశాలకు వచ్చి పూర్తిస్థాయిలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతోపాటు ఆటలు, పాటలు, ప్రయోగాలతో గడపుతున్నారు. విద్యార్థుల్లో ఆహ్లాదాన్ని నింపేందుకు.. ప్రతీ రోజు విద్యార్థులు తరగతులు, క్లాస్‌రూంలో పాఠాలు, పుస్తకాల బరువుతో పాఠశాలలకు వచ్చి వెళ్తుంటారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటే ఉత్సాహం కనబర్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వారిలో పాఠశాలల పట్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. నెలలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో ఆగస్ట్ నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతీ నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగో శనివారం విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరవుతూ ఉత్సాహభరిత, వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. నృత్యాల ద్వారా కూడా అభ్యసనం చేస్తున్నారు. సృజనాత్మకత వెలికితేసేలా.. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. వెజిటబుల్ కార్వింగ్‌తో చిన్న చిన్న వస్తువుల ఆకారాలను తయారు చేయిస్తారు. ఈసీఆర్ కాంపిటీషన్స్, ఇసుకతో సైకత నమూనాలు చేసేలా ప్రోత్సహిస్తారు. పలు రకాల క్రీడలు నిర్వహించి, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు సులభతర సైన్స్ ప్రయోగాలు, టీఎల్ఎం ఎక్స్పో, స్ఫూర్తి ప్రదాతల స్పీచ్‌లు, క్విజ్ కాంపిటీషన్స్, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతారు. -
కేయూ జోనల్ క్రీడలు ప్రారంభం
ఖమ్మంస్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోనల్ క్రికెట్ పోటీలు శనివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, సత్తుపల్లి జెవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది నాటికి పూర్తి అవుతుందని, జిల్లా క్రికెటర్లు జాతీయస్థాయిలో రాణించేలా కష్టపడాలని సూచించారు. క్రమశిక్షణతోనే క్రీడల్లో రాణించగలరని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవికుమార్, ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి బి.వెంకన్న, నెట్ క్రికెట్ కోచ్ ఎండీ మతిన్, జి.గోపీకృష్ణ, జె.ఉపేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరిగే టోర్నీలో 11 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, జేవీఆర్ సత్తుపల్లి, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ఖమ్మం ముందజ వేశాయి. సెమీ ఫైనల్స్‌కు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం, జేవీఆర్ సత్తుపల్లి చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం – ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెంపై నెగ్గి ఫైనల్స్‌కు ప్రవేశించింది. -
ఏసీపీ ఆకస్మిక తనిఖీ
సత్తుపల్లి: సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ను కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, ఆవరణలోని వాహనాలు, పెండింగ్‌లో ఉన్న ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలని, కానిస్టేబుళ్లను గ్రామ పోలీస్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సమర్థవంతంగా నిర్వహించేలా సూచనలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కమ్యూనిటీ అవగాహన ప్రారంభించాలని, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన సెల్ఫోన్లను త్వరగా చేధించి బాధితులకు అప్పగించాలని ఏసీపీ పేర్కొన్నారు. సీఐ, ఎస్హెచ్ఓ తుమ్మలపల్లి శ్రీహరి, ఎస్ఐలు వీరప్రసాద్, వీరప్రతాప్, ప్రదీప్ ఉన్నారు. -
శ్రామిక విభజనను వ్యతిరేకిద్దాం
● వచ్చే ఏడాది కార్మిక సంఘాలకు కీలకం ● సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు పద్మనాభన్ఖమ్మంమయూరిసెంటర్ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గాన్ని విభజించి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎ.కె. పద్మనాభన్ అన్నారు. ఖమ్మంలో నిర్మించిన సీఐటీయూ జిల్లా కార్యాలయం (బీటీ రణదివే) భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్ గ్రౌండ్ నుంచి గట్టయ్య సెంటర్లోని భవనం వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రణదివే పేరుతో ఉన్న స్మారక భవనాన్ని ప్రారంభించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సీఐటీయూ అన్ని కార్మిక సంఘాల వంటిది కాదని, వర్గపోరాటాలు నిర్వహించడంలో దీని పాత్ర భిన్నమైనది, సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. 2026 శ్రామిక వర్గానికి ముఖ్యమైన సంవత్సరంగా ఉండబోతుందన్నారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వేదికై న ఖమ్మంలో సీఐటీయూ భవనానికి బీటీ రణదివే పేరుపెట్టడం గర్వకారణమని అన్నా రు. అంతకుముందు సంఘ పతాకాన్ని సీనియర్ నేత పి.రాజారావు ఆవిష్కరించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, నాయకులు బి.మధు, జ్యోతి, వజ్రాల శ్రీనివాసరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణు, పిన్నింటి రమ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు దివ్యాంగులకు ఆటలపోటీలు
ఖమ్మంమయూరిసెంటర్: అంతర్జాతీయ దివ్యా ంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న దివ్యాంగులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి వి.విజేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంధులకు.. షాట్‌పుట్, రన్నింగ్, చెస్, బధిరులకు.. షార్ట్‌పుట్, జావలిన్‌త్రో, క్యారమ్స్, బుద్ధి మాంద్యం గల వారికి.. షాట్‌పుట్, రన్నింగ్ పోటీలు ఉంటాయని వివరించారు. ఐఈఐ కాన్ఫరెన్స్‌కు కేఎండీసీ అధ్యాపకురాలు ఖమ్మంసహకారనగర్: 108వ ఇండియన్ ఎకానమీ అసోసియేషన్ (ఐఈఏ) ఆధ్వర్యంలో చైన్నైలో శనివారం జరుగుతున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు తమ కళాశాల అధ్యాపకులు ఆషాబేగం హాజరై ‘ఇంపాక్ట్ ఆఫ్ సం మాక్రో ఎకనామిక్ పాలసీస్ ఇన్ యూస్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇంటర్ లింక్డ్ డెవలపింగ్ ఎకానమీ స్ట్రక్చర్’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల (కేఎండీసీ) సెక్రటరి కోటా అప్పిరెడ్డి తెలిపారు. డిగ్రీ కళాశాల సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ప్రిన్సిపాల్ రమణారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు. పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలి ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ శాఖలో ఏర్పడిన ఖాళీలను పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని తెలంగాణ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్–1104 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి తక్కిళ్లపల్లి శేషగిరిరావు అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని 1104 యూనియన్ కార్మిక భవనంలో సంఘం ప్రాంతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు సీతారామయ్య అధ్యక్షతన ప్రాంతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. సబ్స్టేషన్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిమ్మారావుపేట సబ్ ఈఆర్ఓకు బదులుగా కొత్తలింగాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అదనపు కార్యదర్శి పి.సురేశ్, ప్రతినిధులు శ్రీధర్, జీవీఎస్ శ్రీనివాస్, మాధవి, రమణ, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన మంద రాజ్‌కుమార్ (40) ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రాజ్‌కుమార్ తన కుమార్తెకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవటంతో మనస్తాపానికి గురై ఈనెల 18న పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడు నాగులవంచ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు ఎస్ఐ వీరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. గుండెపోటుతో రైతు మృతి.. తిరుమలాయపాలెం: అంతసేపు ట్రాక్టర్‌తో పొలం దున్ని నీళ్లు తాగేందుకు వెళ్లి వస్తూ ఒక్కసారిగా గుండెనొప్పితో పంటచేలోనే ఓ రైతు మృతిచెందిన ఘటన జూపెడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూపెడకు చెందిన బొల్లికొండ వెంకటేశ్వర్లు (52) తనకున్నట్రాక్టర్తో ఇతర రైతుల దుక్కులు దున్నేందుకు వెళ్తున్నాడు. శనివారం ఓ రైతు పొలం దున్నేందుకు వెళ్లగా మధ్యాహ్నం దాహం కావడంతో ట్రాక్టర్ని ఆపి నీళ్లు తాగేందుకు వెళ్లాడు. నీళ్లు తాగి ట్రాక్టర్ వద్దకు వచ్చే సమయంలో గుండెనొప్పి వచ్చి అక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. మృతుడికి భార్య లచ్చమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కోడి పందెం స్థావరంపై దాడి సత్తుపల్లిరూరల్: మండలంలోని బుగ్గపాడులో శనివారం కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సత్తుపల్లి పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కోడి పందేలు నిర్వహించగా.. పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ చివరి వారం నుంచి.. సంక్రాంతి పండగ సందర్భంగా డిసెంబర్ చివరి వారం నుంచి ఎక్కడో ఓ చోట కోడి పందేలు నిర్వహిస్తూనే ఉంటారు. తెలంగాణలో కోడి పందేలకు అనుమతి లేదు. ఏపీకి ఆనుకుని ఉన్న సత్తుపల్లి చు ట్టు పక్కల మారుమూల ప్రాంతాల్లో కోడి పందేలు వేస్తూనే ఉంటారు. ఆరు నెలల ముందు నుంచే రూ.5 వేల నుంచి లక్షల రూపాయల వరకు విలువ చేసే పందెం పుంజులను కొనుగోలు చేసి, బలవర్థకమైన ఆహారం అందించి,పెంచి, పందేలు వేస్తారు. -
బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ షురూ..
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలస్థాయి బాల్ బ్మాండ్మింటన్ టోర్నీ (పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ పోటీలు) శనివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి వీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల సురేశ్, టోర్నీ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లతో పాటు 40 మంది జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో విజయ్‌ప్రసాద్, టి.రామచంద్రరాజు, పులి మధు, విజయ్కలామ్, ఎర్రగుట్ట స్వామి, మణి భూషణచారి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. తొలిరోజు పోటీల్లో కూకట్పల్లి జట్టుపై భూపాలపల్లి విజయం సాధించింది. అలాగే.. అనంతరపూర్ – వరంగల్‌పై.. మణికొండ – రమణస్ వైజాగ్‌పై.. ఈస్ట్ గోదావరి – బీహెచ్‌ఈఎల్‌పై.. ఎస్సీఆర్ గుంటూరు – నునాపర్తిపై.. కరీంనగర్ – ఖమ్మంపై విజయం సాధించాయి. ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లు హాజరు.. -
శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, విగ్రహానికి అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య పాల్గొన్నారు. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు● పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ వెల్లడి ఖమ్మంక్రైం: అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జిల్లాలో పోలీస్ యంత్రాంగం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోందని సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం వంటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులతో పాటు జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ తనిఖీలు ముమ్మరం చేశామని సీపీ వెల్లడించారు. చోరీలు జరగకుండా పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని, అనుమానిత వ్యక్తులు లేదా వాహనాలు తారసపడితే పూర్తి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. నట్టల నివారణ మందు వేయించాలిచింతకాని : జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడేపూడి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని లచ్చగూడెంలో శనివారం నట్టల నివారణ మందు పంపిణీని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ మందుతో జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాక పెరుగుదల బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందును జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రామ్‌జీ, గ్రామసర్పంచ్ కొప్పుల రజిని, ఉపసర్పంచ్ పోట్ల సీతయ్య, పశువైద్య సిబ్బంది నవీన్, భాస్కర్, గోపాలమిత్ర రాంచందర్ పాల్గొన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యతరఘునాథపాలెం : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఖమ్మం డిప్యూటీ ఎఫ్ఆర్ఓ సాల్మన్‌రాజు అన్నారు. మండలంలోని గణేశ్వరంలో శనివారం వన్యప్రాణుల సంరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సంక్రాంతికి మరో ఐదు రైళ్లుఖమ్మం రాపర్తినగర్ : సంక్రాతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఖమ్మం మీదుగా మరో ఐదు రైళ్లు నడవనున్నాయని సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. జనవరి 8న కాకినాడ–వికారాబాద్ (07460), సికింద్రాబాద్–పార్వతీపురం(07464), 9, 10 తేదీల్లో వికారాబాద్–పార్వతీపురం(07461), 10న పార్వతీపురం– వికారాబాద్(07462) రైళ్లు నడుస్తాయని, అవసరమైన వారు రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. -
జాగ్రత్తలు పాటిస్తేనే మేలు
ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోందని, ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే పలు రకాల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ డి. రామారావు అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా, సైనసైటిస్ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్‌లో ప్రజల సమస్యలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న: రెండు రోజులుగా జలుబు, వంటినొప్పులతో ఇబ్బంది పడుతున్నాము? –పి.రమాదేవి, ఎర్రుపాలెండీఎంహెచ్ఓ: దగ్గరలోని సబ్ సెంటర్‌కు వెళ్లి మందులు తీసుకోండి. చలికి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిచండి. ప్రశ్న: దగ్గరలోని ఆస్పత్రిలో జలుబు, దగ్గు మందులు అందుబాటులో లేవు? – ఐ. కనకరత్నం, కె.జి. సిరిపురండీఎంహెచ్ఓ: అన్ని సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచాం. సెంటర్‌కు వెళ్లి తీసుకోండి. ప్రశ్న: ఉదయం 4 గంటలకే పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. జలుబు, దగ్గుకు ఏం చేయాలి ? – జి. మురళి, కారేపల్లి, భూక్యా రాంబాబు, గుడితండా, సింగరేణిడీఎంహెచ్ఓ: తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ఉన్ని దుస్తులు ధరించాలి. ముఖం, చెవుల్లోకి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీరు తాగండి. ప్రశ్న: చలితో ఇంటిల్లిపాది ఇబ్బంది పడుతున్నాం? – ఎం.ఉపేందర్, బైరాన్‌పల్లి, ఎన్.లక్ష్మీనారాయణ, నామవరం, కె. వెకటరమణ, పెద్దమండవ, రవీందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం డీఎంహెచ్ఓ: వీలైనంత వరకు ఎండ వచ్చే వరకు బయటకు రాకండి. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రశ్న: పిల్లలు దగ్గు, జలుబు, జ్వరంతో బాదపడుతున్నారు? – ఆజాద్, రాపర్తినగర్డీఎంహెచ్ఓ: రాపర్తినగర్ యూపీహెచ్‌సీలో జ్వరం, దగ్గు సిరప్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ను ఆస్పత్రికి తీసుకెళ్లండి. ప్రశ్న: డాక్టర్ అందుబాటులో ఉండడం లేదు. టెస్టులు సరిగా చేయడం లేదు. –ఎం.సతీష్, ముదిగొండడీఎంహెచ్ఓ: ఇంతవరకు పనిచేసిన వైద్యుడు ప్రమోషన్‌పై వెళ్లగా కొత్త డాక్టర్‌ను కేటాయించాం. అన్ని టెస్టులు చేస్తున్నారు. పీహెచ్‌సీకి వెళ్లండి. ప్రశ్న: చలితో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలి? – సీహెచ్. సతీష్, తిరుమలాపురం డీఎంహెచ్ఓ: చలి తీవ్రంగా ఉన్న సమయంలో వీలైనంత వరకు పిల్లలను బయటకు వెళ్లనివ్వకండి. తప్పదనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలి. ప్రశ్న: చలి తీవ్రతతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఏం చేయాలి? – వెంకటరమణ, అన్నారుగుడెం డీఎంహెచ్ఓ: చలి కాలంలో ఆస్తమా సమస్య ఉన్న వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆందోళన వద్దు. దగ్గరలోని పీహెచ్‌సీకి వెళ్లి మందులు వాడండి. ప్రశ్న: జలుబు, జ్వరంతో వెళ్తే మందులు లేవంటున్నారు. – చతుర్వేది, పెద్దమండవ, ముదిగొండడీఎంహెచ్ఓ: అన్ని సెంటర్లకు మందులు పంపించాం. తక్కువ ఉంటే మళ్లీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తాం. ప్రశ్న: రోగాలతో వెళ్తే ఆర్ఎంపీలు దోచుకుంటున్నారు. చర్యలు తీసుకోండి? – యాకూబ్ పాషా, తల్లాడడీఎంహెచ్ఓ: పీహెచ్సీ, సబ్సెంటర్లలో వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలోని సెంటర్‌కు వెళ్లి మందులు తీసుకొని వాడండి. ప్రశ్న: మా పాపకు వారం నుంచి జలుబు తగ్గట్లేదు. ఏం చేయాలి? – వెంకటరమణ, ముదిగొండడీఎంహెచ్ఓ: పిల్లలకు ఈ కాలంలో పౌష్టికాహరం అందించాలి. తాజా ఆహారంతో పాటు, గోరువెచ్చ ని నీరు తాగించాలి. దగ్గరలోని పీహెచ్సీలో మందులు తీసుకుని వాడించండి. -
నిధులు నాస్తి
అభివృద్ధి..భూసేకరణ, నిధుల సమస్య ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును నిధుల కొరత, భూసేకరణ సమస్యలు వేధిస్తున్నాయి. రివైజ్డ్ అంచనా ప్రకారం రూ.19,600 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను కూడా ప్రాజెక్టులో భాగం చేస్తూ నిధులు కేటాయించింది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ద్వారా 10 నియోజకవర్గాలకు నీదందించేలా ప్రాజెక్టును విస్తరిస్తున్నారు. దీంతో కొత్తగా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో పంపిణీ కాల్వల కోసం టెండర్లు పిలుస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు 13వ ప్యాకేజీలో 270 ఎకరాలకు అటవీ అనుమతులు రావాల్సి ఉండగా 14వ ప్యాకేజీలో భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఇందుకు రూ.90 కోట్లు అవసరం. 15వ ప్యాకేజీలో రూ.80 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండగా, 16వ ప్యాకేజీలో రూ.465 కోట్ల అంచనాకు రూ.180 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. వరద ముంచెత్తకుండా.. ఖమ్మం నగరంలో వర్షపునీరు నివాసాలను ముంచెత్తకుండా వర్షపునీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.249 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు 10వ డివిజన్లో కొనసాగుతున్నాయి. వర్షపునీటి వరద కాలువ రూపంలో మున్నేరుకు చేరేలా పైపులైన్ నిర్మిస్తున్నా రు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 8.5 కి.మీ. మురుగు నీటి పైపులైన్ (ఊర చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు), మురుగు నీటి డ్రెయిన్ల అంతర్గత పైపులైన్లను అనుసంధానం చేసి మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించనున్నారు. అయితే ధంసలాపురం వద్ద చేపట్టనున్న 44 మిలియ న్ లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రానికి అవసరమైన భూసేకరణ చేయాల్సి ఉంది. పుట్ట కోటలో 9.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మురు గు నీటిశుద్ధి కేంద్రం పనులు పురోగతిలో ఉన్నాయి. కొత్త ఏడాదిలో ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారి కొత్త ఏడాదిలో ఖమ్మం – దేవరపల్లి జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. దీంతో ఖమ్మం నగరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జంక్షన్‌గా మారనుంది. ఈ పనులు ఇప్పటికే 80 శాతం మేర పూర్తయ్యాయి. ధంసలాపురం వద్ద ఆర్ఓబీ, ఖమ్మంకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పూర్తి చేయాల్సి ఉంది. మూడేళ్లలో 20వేల మంది మహిళలతో.. జిల్లాలో పాల కొరత తగ్గిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటైంది. మూడేళ్లలో 20 వేల మంది మహిళలు భాగస్వామ్యం అయ్యేలా ఈ ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధమైంది. ఇందుకు ప్రభుత్వం రూ.27 కోట్లు మంజూరు చేసింది. మధిర నియోజకవర్గ పరిధిలో 200 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఏడాది 80 గ్రామాల్లో 3,200 మంది మహిళలను ఎంపిక చేసి 80 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేశారు. రోజుకు 16 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యం. 5 వేల లీటర్ల సామర్థ్యంతో చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.ఖమ్మం అర్బన్ మండలం బాలపేట సమీపంలో వైద్య కళాశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి పూర్తి కావాల్సి ఉంది. రూ.180 కోట్ల అంచనాతో మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి కావాల్సి ఉంది. రూ.690 కోట్ల అంచనాతో మున్నేరుపై రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇరువైపులా 17 కిలోమీటర్లకు గాను ఇప్పటికి ఏడు కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఖమ్మం ఖిల్లాపై రోప్‌వే నిర్మాణానికి పర్యాటక శాఖ రూ.29 కోట్లు కేటాయించింది. కోల్‌కతాకు చెందిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. దాదాపు 236 మీటర్ల వరకు ఖిల్లా పైకి వేళ్లేందుకు రోప్ వే ను ఏర్పాటు చేస్తున్నారు. ఖిల్లాపై అధునాత న హోటల్, ఫౌంటెన్, అమ్యూజ్మెంట్ పా ర్క్, మినీ థియేటర్, ఆట పరికరాలు, ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. -
ప్రతీ పైస.. ప్రజల అభివృద్ధికే
నేలకొండపల్లి : ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పైస ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన.. మండలంలోని అనంతనగర్‌లో రూ.2.25 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం, రూ.1.75 కోట్లతో నిర్మించనున్న సబ్ష్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్ర ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతీ వారం బిల్లులు జమ చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా పేదల ముఖంలో ఆనందం చూడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, తిగుళ్ల భవాని, పెంటమళ్ల పుల్లమ్మ, గరిడేపల్లి రామారావు, కడియాల నరేష్, పాకనాటి కన్నారెడ్డి, కొమ్మినేని విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
భక్తుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలి
● ఆర్టీసీ ఈడీ సోలోమన్ ● ఖమ్మం రీజియన్ అధికారులతో సమీక్ష ఖమ్మంమయూరిసెంటర్ : ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల అవసరాలకు అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఈడీ పగిడిమర్రి సోలోమన్ అన్నారు. మేడారం జాతరకు బస్సుల ఏర్పాటుపై శనివారం ఖమ్మం రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులకు రవాణా సౌకర్యాలు కల్పించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాతర విధుల్లో ఉన్న ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ఖమ్మం ఆర్ఎం ఎ.సరిరామ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, అకౌంట్స్ అధికారి జ్యోత్స్న, పీఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బలరాముడిగా ‘అందరి బంధువు’
భద్రాచలం: అందరి బంధువుగా భక్తులు కీర్తించే అందాల రామయ్య బలరామయ్యగా భక్తులకు కనువిందు చేశాడు. అధ్యయనోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రామయ్యను బలరామావతారంలో అలంకరించారు. శేష తల్పంన సేదదీరి రెండు చేతుల్లో శంఖుచక్రాలు, మరో రెండు చేతుల్లోనాగలి ని, గదను చేబూని సీతాలక్ష్మణులతో దర్శనమిచ్చిన బలరాముడికి భక్తులు జేజేలు పలికారు. శ్రీహరికి శయన ఆదిశేషుని అంశతో జన్మించి, శ్రీకృష్ణునికి అన్నగా ఆయనకు ధర్మస్థాపనలో సహకరి స్తూ, అపర పరాక్రముడిగా పేరొందిన బలరామ య్య దర్శనమిచ్చాడని అర్చకులు అవతార విశిష్టతను వివరించారు. స్వామివారికి ఆలయంలో తెల్ల వారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాతం, ఆరాధన సేవలు జరిపారు. స్వామి వారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఘనంగా శోభాయాత్ర పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా జరిగిన బలరామావతారాన్ని శనివారం లారీ అసోసియేషన్ సహాయ సహకారాలతో వైభవోపేతంగా జరిపారు. సంఘబాధ్యులు, ఆలయ అధికారులు స్వామివారిని పల్ల కీపై ఊరేగింపుగా మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి హారతిని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందచేసి నైవేద్యాన్ని ప్రసాదంగా అందజేశారు. తిరువీధి సేవను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. లారీ అసోసియేషన్ సహకారంతో శోభాయాత్ర -
సంక్షేమమే లక్ష్యంగా పాలన
● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● తొమ్మిది నెలల్లో సమీకృత భవన నిర్మాణాలు పూర్తి ● రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి ఖమ్మంరూరల్: పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృధ్ధి పనుల నిర్వహణలోనూ వెనక్కు తగ్గకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో నిర్మించనున్న రూరల్ మండల కార్యాలయాల సమీకృత భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఖమ్మం రూరల్ మండలంలో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి రూ. 45 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఏదులాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.221 కోట్లతో పలు పనులు చేపట్టామని వివరించారు. అవసరమైన రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, ఇతర పనులు పూర్తి చేస్తామని, ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్దిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమీకృత కార్యాలయ భవనాలను తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండడంతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. రూరల్ మండలానికి సంబంధించి 13 శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భైరు హరినాథ్‌బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, నాయకులు తోట చినవెంకటరెడ్డి, వెంపటి రవి తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి తీరాన ఏరు ఉత్సవాలు
భద్రాచలంటౌన్: గోదావరి తీరంలో ‘ఏరు–ది రివర్ ఫెస్టివల్’ వేడుకల్లో భాగంగా శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. స్థానిక యువత230 మందితో ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక నృత్యప్రదర్శన, నదీ హారతి కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఏరు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అలరించిన ఏరు ఉత్సవం.. దుమ్ముగూడెం: మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఏరు ఉత్సవం ఆహూతులను అలరించింది. గిరిజన నృత్యాలు, క్యాంప్ ఫైర్ తదితర కార్యక్రమాలు సందడిగా సాగాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్‌శర్మ, కేంద్ర హౌసింగ్ అధికారి కుశాల్ తదితరులు హాజరై ఉత్సవాలను వీక్షించారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ప్రాచుర్యం చెందేలా ప్రయత్నిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఆర్ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో
రఘునాథపాలెం: అకారణంగా తమపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ రఘునాథపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు శుక్రవారం పోలీసుస్టేషన్ ఎదుట ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. దాడి చేసిన వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానికుల కథనం... క్రిస్మస్ వేడుకల సందర్భంగా గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో చిన్న విషయమై రెండు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం మరోసారి దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై బాధిత వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ చేయడం లేదంటూ పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఒక కానిస్టేబుల్ తమను దూషించాడని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ చేరుకుని సమగ్రంగా విచారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనతో అరగంట పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, రెండు వర్గాలకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేయగా, రాస్తారోకో చేసిన వారిపైనా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ -
వచ్చేనెలలో పౌరాణిక నాటక పోటీలు
మధిర: మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యాన వచ్చేనెల 29నుంచి 31వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు తెలిపారు. మాటూరుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం పోటీల కరపత్రాలను ఆవిష్కరించాక గౌరవ అధ్యక్షుడు పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్తో కలిసి మాట్లాడారు. మధిర బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అంతరించిపోతున్న కళల పరిరక్షణకు నిర్వహిస్తున్న పోటీలను అందరూ ఆదరించాలని కోరారు. కాగా, పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు ఉంటాయని, నాటక సమాజాల బాధ్యులు జనవరి 24వ తేదీలోపు 94403 13937 నంబర్‌కు ఫోన్ చేసి ఎంట్రీలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ రాయల కోటయ్యతో పాటు రావూరి శ్రీనివాసరావు, మాదల రామారావు, గడ్డం శ్రీహరి, తాటికొండ వెంకటేశ్వరరావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, చిలువేరు బుచ్చిరామయ్య, గడ్డం రమేష్, గడ్డం శేషు, చిలువేరు శాంతయ్య, గుర్రాల కృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, కృష్ణమూర్తి, వీరయ్య పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా బహిరంగసభ
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిజం అజేయం, అజరామరమని.. మరో వందేళ్లు ప్రజల హృదయాల్లో నిలిచి వుంటుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. సీపీఐ వందో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం హేమంతరావు మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి అనేక నిర్భందాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలవడమే కాక వారి సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు పాటుపడ్డారని తెలిపారు. కాగా, వచ్చేనెల 18న ఖమ్మంలో నిర్వహించే శత వార్షిక సభ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సభ విజయవంథానికి జనవరి 1నుంచి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానిమియా, మందడపు రాణి, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి తది తరులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను సన్మానించారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాయకులు -
తెలంగాణ గోల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక
తల్లాడ: మండలంలోని నారాయణపురం, మిట్టపల్లికి చెందిన కాంపల్లి సూర్యప్రకాష్, నాసా ఆదిత్యసుభాష్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆధ్వర్యాన నిర్వహించే తెలంగాణ గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీకి జిల్లా జట్టు తరపున ఎపింకయ్యారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ చదువుతుండగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 27న మొదలయ్యే టోర్నీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గ్రామస్తులు శుక్రవారం అభినందించారు. 30నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఈనెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ బాధ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం నిర్వాహకుడు సూరేపల్లి శ్రీను మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఏటా మాదిరిగానే కబడ్డీ పోటీలు ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే, ముగ్గులు, ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని కోరారు. కాలి నడకన శ్రీశైలానికి పయనం రఘునాథపాలెం: ప్రజల క్షేమం, గ్రామాభివృద్ధి కోసం రఘునాథపాలెం మండలం వీవీపాలెం మాజీ సర్పంచ్ వెంపటి కృష్ణమోహన్‌రావు ఏపీలోని శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు. ఏటా శివమాల ధరించే ఆయన ఐదేళ్లుగా శ్రీశైలానికి కాలి నడకన వెళ్తున్నాడు. ఈ సారి కూడా 350 కి.మీ. మేర ప్రయాణా న్ని ఇరుముడి కట్టుకుని బయలుదేరాడు. పాదయాత్ర పది రోజుల పాటు సాగుతుందని కృష్ణమోహన్‌రావు తెలిపారు. చర్చి అభివృద్ధికి రూ.లక్ష విరాళం నేలకొండపల్లి: మండలంలోని అమ్మగూడెంలో చర్చి నిర్మాణానికి సర్పంచ్ పొట్ట లక్ష్మి చంద్రశేఖర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. చర్చిలో శుక్రవారం జరిగిన ప్రార్థనలకు హాజరైన వారు అభివృద్ధి కోసం నిర్వాహకురాలు వందనకు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి బడ్డీకొట్టు దగ్ధం కూసుమంచి: మండలంలోని ఈశ్వరమాధారంలో ఓ బడ్డీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన గుండెబోయిన పద్మ, ఆమె కుమార్తె మల్లీశ్వరి చిన్న డబ్బాకొట్టులో హోటల్ ఏర్పాటుచేసుకున్నారు. రోజులాగే శుక్రవారం బజ్జీలు వేస్తుండగా సిలిండర్ నుంచి మంటలు వస్తుండడంతో పద్మ పరుగెత్తింది. ఇంతలో మంటలు పెరిగి సిలిండర్ పేలగా బడ్డీకొట్టు, సామగ్రి కాలిపోయాయి. అయితే, సమీపానే హైస్కూల్, అంగన్వాడీ కేంద్రం ఉన్నా సెలవు కావడంతో ప్రమాదం తప్పినట్లయింది. రూ.50వేల మేర నష్టం జరిగిందని తమను ఆదుకోవాలని పద్మ విన్నవించింది. -
నట్టల నివారణ మందుతో జీవాలకు ఆరోగ్యం
రఘునాథపాలెం: నట్టల కారణంగా గొర్రెలు, మేకలకు ఎదురయ్యే నష్టాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా మందు పంపిణీ చేస్తోందని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని కోయచెలక, రేగులచెలకలో నట్టల నివారణ మందు పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నట్టల నివారణ చర్యలతో జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాక పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈమేరకు పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు యండపల్లి రమాదేవి సత్యం, బలుసుపాటి శేషయ్య, మండల పశువైద్యాధికారి గంగాధర్‌తో పాటు మాదంశెట్టి హన్మంతరావు, పూర్ణచందర్రావు, యండపల్లి జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేలైన్.. పరిహారం లేట్
కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈక్రమాన భూమి సేకరించాల్సి ఉండగా వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం లెక్క కట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరు నెలలుగా సర్వేలు, గ్రామసభలు కొనసాగుతున్నా పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో వ్యవసాయ భూములు కోల్పోనున్న రైతులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోనున్న ప్రజలు ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వస్తోంది. అయితే, మార్కెట్ ధరపై పది రెట్లు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటారా లేక నామమాత్రంగా చెల్లిస్తే తాము బతకడం ఎలా అన్న ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. మండలంలో 54 ఎకరాలు కారేపల్లి మండలంలోని కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో 54 ఎకరాలు అవసరమని గుర్తించిన రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. ఇందులో సింగరేణి రెవెన్యూలో 60 – 70 మంది రైతుల నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాల్సి ఉంది. అలాగే, కారేపల్లి స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్‌ఫాం, అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి 20 కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, రైల్వేస్టేషన్ పరిధిలో 65మీటర్ల మేర భూమితో పాటు పలువురి ఇళ్లు సేకరించాల్సి ఉండగా.. అధికారులు మార్కింగ్ సైతం వేశారు. నా భర్త చనిపోయాడు. పెద్ద కుమార్తె, ఆమె పిల్లలతో కలిసి ఖాళీ స్థలంలో రేకులు షెడ్డు వేసుకుని ఉంటున్నా. రైల్వే లైన్లో మా ఇల్లు పోతుందని చెబుతున్నారు. చాలీచాలని పరిహారం కాకుండా వేరే చోట్ల ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుంది. – షేక్ జాన్‌బీ, కారేపల్లి ఇంటి స్థలం గజానికి రూ.2వేలు, దీనికి రెండు రెట్లు పెంచి రూ.6వేల చొప్పున ఇస్తామని చెబుతున్నారు. కారేపల్లిలో ఇంటి స్థలం ధర గజం రూ.10వేలకు పైగానే ఉంది. అధికారులు నామమాత్రంగా ఇచ్చే పరిహారంతో సర్వం కోల్పోతాం. – కొప్పుల బాలకృష్ణ, కారేపల్లిఇటీవల జరిగిన గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పాల్గొని భూసేకరణ, పరిహారం నిబంధనలను వివరించారు. అయితే, సింగరేణి(కారేపల్లి) రెవెన్యూ గ్రామం మైదాన ప్రాంతంలో ఉన్నందున వ్యవసాయ భూమి ఎకరాకు రూ.91లక్షలు, ఇళ్లు కోల్పోయిన వారికి గజం రూ.20వేలు చొప్పున చెల్లించాలని నిర్వాసితులు కోరారు. అంతేకాక వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలకు మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈక్రమంలో కారేపల్లికి చెందిన భవనాసి గణేష్ ఎకరం భూమి విలువ రూ.91.48 లక్షలుగా, మరో సర్వేనంబర్‌లో రూ.1.12కోట్లుగా, ఇదే గ్రామానికి చెందిన ముండ్ల సుధాకర్ భూమి రూ.1.12కోట్లుగా మార్కెట్ విలువ ఉందని ఎస్డీసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురి రైతుల పేర్లు భూసేకరణ జాబితాలో ఉన్న ందున మార్కెట్ ధరను పరిగణనలోకి పరిహారం చెల్లించాలని కోరారు. అయితే, సర్వే పూర్తయి, గ్రామసభలు జరిగి నెలలుగా గడుస్తున్నా పరి హారంపై స్పష్టత రాకపోవడంతో భూములు, ఇళ్లు కోల్పోనున్న వారిలో అయోమయం నెలకొంది. నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని ధర -
మున్నేటి బ్రిడ్జి పైనుంచి దూకడంతో యువతి మృతి ?
ఖమ్మంరూరల్: బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి కుటుంబంతో వచ్చిన ఓ యువతి మృత్యువాత పడింది. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు... ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా కందపాడు గ్రామానికి చెందిన దైతారి కందా తన భార్య దీపాంజలి, కుమార్తె జెమామణి కందా(17), కుమారుడు కై బాల్య కందాతో కలిసి మూడు నెలల క్రితం ప్రకాష్‌నగర్‌లో మున్నేటి పక్కన ఇటుక బట్టీలో పని చేయడానికి వచ్చాడు. రోజులాగే పని ముగించుకుని గురువారం రాత్రి నిద్రించగా శుక్రవారం తెల్లవారుజామున జెమామణి కనిపించలేదు. చుట్టుపక్కల వెతుకుతుండగా మున్నేటి ఒడ్డున ఆమె మృతదేహం కనిపించింది. జెమామణి ముఖం, పెదవులు, కుడికన్నుపై చిన్న గాయాలు ఉండడమే కాక ఒక కాలు విరిగి ఉంది. మున్నేటిపై ప్రకాష్‌నగర్ వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి దూకడంతో ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చేపలు కొరకడంతో గాయాలై ఉంటాయని తెలుస్తోంది. కాగా, జెమామణి అనారోగ్యం లేదా ఇతర కారణాలతో దూకి ఉంటుందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఆమె మృతదేహాన్ని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీయించారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు.. తల్లాడ: తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంజనాపురం గ్రామంలో నాయనమ్మ ఇంట్లో మూడ్ పవన్(23) జీవిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన ఇంటి ఎదుట కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కడుతుండగా పవన్ అడ్డుచెప్పాడు. దీంతో ముగ్గురు ఆయనపై దాడి చేస్తుండగా స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే, శుక్రవారం ఉదయంకల్లా ఆయన ఇంట్లో కూర్చున్న స్థితిలో చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని బంధువులు గుర్తించగా ఆయన పెదనాన్న కొడుకు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం ఖమ్మంక్రైం: సాగర్ కాల్వలో ఈనెల 24వ తేదీన ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు గల్లంతైన యడ్ల శశాంక్ (14) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. అదేరోజు ఆయన స్నేహితుడు సుహాన్ మృతదేహం లభ్యమైన విషయం విదితమే. అప్పటి నుంచి గాలిస్తుండగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతంలోని సాగర్ కాల్వలో శశాంక్ మృతదేహాన్ని గుర్తించారు. పంచనామా అనంతరం సుల్తాన్ బజార్‌లోని ఇంటికి తీసుకెళ్లగా ఆయన తల్లిదండ్రులు మాధవి – లక్ష్మణ్ గుండెలవిసేలా రోదించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ క్లెమెంట్, నాయకులు షకీనా, వీరబాబు తదితరులు కుటుంబీకులను పరామర్శించారు రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య ఖమ్మంక్రైం: ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన నాగుల్‌మీరా(50) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రింగ్ మేసీ్త్రగా పనిచేసే ఆయన కుటుంబ కలహాలతో నర్తకి థియేటర్ సమీపాన గురువారం అర్ధరాత్రి దాటాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రాక్టికల్ పరీక్షలకు రెడీ
● జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు ● ‘ఆదర్శ’ నిధులతో సామగ్రి కొనుగోలుఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు గత మూడు నెలల నుంచే విద్యార్థులకు బోధన మొదలుపెట్టారు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 1,224 మంది విద్యార్థులు సైన్స్ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇందులో ఎంపీసీ 873, బైపీసీ 351 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే, ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం 1,019, ద్వితీయ సంవత్సరంలో 767 మంది చదువుతున్నారు. మూడు నెలల నుంచి తరగతులు జూన్‌లో విద్యాసంవత్సరం మొదలుకాగా, సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్స్ బోధన ప్రారంభించారు. బైపీసీ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ తరగతులను నిర్వహిస్తున్నారు. గత ఏడాది ల్యాబ్‌ల నిర్వహణ సామగ్రి కోసం ఇంటర్మీడియట్ విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాలేజీలకు నిధులు కేటాయించింది. కానీ ఈ సారి నిధులు విడుదల కాలేదు. అయితే, అమ్మ ఆదర్శ కళాశాలల నిధుల నుంచి ల్యాబ్‌ల్లో అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం కల్పించడంతో ఇబ్బంది ఎదురుకాలేదు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు నాలుగు విడతల్లో జరగనుండగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమయ్యేలా విద్యార్థులకు బోధిస్తున్నాం. అమ్మ ఆదర్శ కళాశాలల నుంచి ల్యాబ్‌లకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రణాళిక ప్రకారం తరగతులు నిర్వహిస్తున్నాం. – ఆర్.గోవిందరావు, ప్రిన్సిపాల్, ఏఎస్ఆర్ కాలేజీ, ఖమ్మం -
నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటున్నా ఉదయం, సాయంత్రం చలి ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యాన వృద్ధులు, మహిళలు, పిల్లలే సాధారణ పౌరులు దగ్గు, జలుబుతో పాటు జ్వరం బారిన పడుతున్నారు. ఈమేరకు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స వివరాలు తెలుసుకునేందుకు నేరుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డి.రామారావుకు ఫోన్ చేసే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పిస్తోంది. ప్రజలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవడమే కాక సలహాలు తీసుకోవచ్చు. తేదీ : 27–12–2025, శనివారం (నేడు) సమయం : 10–30గంటల నుంచి 11–30 వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 98499 02517 -
క్రీడల్లో ప్రావీణ్యంతో మెరుగైన అవకాశాలు
కామేపల్లి: విద్యార్థులు, యువత చదువుకుంటూనే క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కామేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయిన వారు మరింత కష్టపడితే విజయాలు దక్కుతాయని చెప్పారు. ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి మాట్లాడుతూ పోటీలకు 33 జిల్లాల జట్లు హాజరుకాగా, విజేతలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఈసం రంగారావు, తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్సై శ్రీకాంత్‌తో పాటు గింజల నరసింహారెడ్డి, పుచ్చకాయల వీరభద్రం, గుజ్జర్లపూడి రాంబాబు, తోటకూరి శివయ్య, రాంరెడ్డి జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చలిలో జీవనయానం
కూరగాయల మార్కెట్‌కు ఎన్ని వాహనాలు వచ్చినా అలవోకగా అన్లోడ్ చేసే హమాలీలు చలితో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఆటోడ్రైవర్లు సైతం ఒక్క కిరాయి కోసం గంటల తరబడి ఎముకలు కొరికే చలిలో జీవన పోరాటం చేస్తున్నారు.సూర్యుడు అస్తమించడమే ఆలస్యం.. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. సాయంత్రం మొదలు గంటగంటకు ఉష్ణోగ్రత పడిపోతోంది. ఈ నేపథ్యాన పొట్టకూటి కోసం రోడ్లపై గడుపుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాచ్మెన్లు, హోటళ్ల నిర్వాహకులు, 24గంటల మందుల షాపుల సిబ్బంది, తెల్లవారుజామునే హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చే రైతులు, ఆటోడ్రైవర్లతో పాటు అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణాలు చేసే వారు గజగజ వణికిపోతున్నారు. ఏ దిక్కూ లేని అనాథలు చలి నుంచి కాపాడుకునేందుకు పడుతున్న తిప్పలు చెప్పలేని విధంగా ఉంటున్నాయి. ‘సాక్షి’ ఆధ్వర్యాన గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన పరిశీలనలో గుర్తించిన పరిస్థితులపై కథనం. – ఖమ్మం మయూరిసెంటర్ -
●యూరియా కోసం అవే తిప్పలు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో మొక్కజొన్న, వరి, ఇతరత్రా కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరిపడా సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడడం ఇందుకు కారణమవుతోంది. మండలంలోని మంచుకొండ, వీవీ.పాలెం, రఘునాథపాలెం పీఏసీఎస్‌ల పరిధిలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన యూరియా కూపన్లు జారీ చేశారు. వీటి ఆధారంగా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇచ్చినా ఇక్కట్లు తప్పలేదు. మంచుకొండ పీఏసీఎస్ పరిధి రైతులు పెద్దసంఖ్యలో రావడం, 445 బస్తాల యూరియా మాత్రమే ఉండడంతో పోటీ పడ్డారు. యూరియా అందని వారికి రఘునాథపాలెం పీఏసీఎస్ పరిధి ఈర్లపూడి సెంటర్లో సరఫరా చేస్తామని ఏఓ కె.ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అవసరం మేర నిల్వలు రానున్నందున రైతులు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు. -
దేవాదాయ చట్టాల సవరణ అనివార్యం
ఖమ్మంగాంధీచౌక్: సమస్యలు పరిష్కారం కావాలంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టాలను సవరించడం తప్పనిసరని అర్చక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. ఖమ్మం పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానంలో అర్చక, ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు దాములూరి వీరభద్రరావు, తోటకూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరించినా దేవాదాయ శాఖ చట్టాన్ని విస్మరించారని ఆరోపించారు. ఫలితంగా పదేళ్లకు పైగా పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ అర్చక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్.శర్మ మాట్లాడుతూ అసమానతలు తొలగించి అర్చక, ఉద్యోగులందరికీ ఒకే వేతన విధానం, డీడీఎన్ అర్చకులకు 1999 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నరహరి రామకృష్ణాచార్యులు, బగాది మురళి, కృష్ణమాచార్యులు, శ్రీనివాసశర్మ, రామశర్మ తదితరులు పాల్గొన్నారు.అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపేంద్రశర్మ -
రూ.10లక్షల్లో వచ్చింది రూ.50వేలే
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల బాధ్యులు ఏటా క్రీడా రుసుము చెల్లించాల్సిన ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా క్రీడాపోటీల నిర్వహణకు నిధులు లేక దాతలపై ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. క్రీడాభివృద్ధి కోసం విద్యాశాఖ నిధులు కేటాయించకపోగా పాఠశాలల నుంచి రుసుము వసూళ్లలోనూ పట్టింపు లేని ధోరణి ప్రదర్శిస్తుండడంతో క్రీడాభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతీ విద్యార్థి నుంచి రూ.15 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6నుంచి 9వ తరగతి విద్యార్థులను క్రీడా రుసుముగా రూ.15 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో రూ.10లక్షలు వసూలు కావాల్సి ఉన్నా ఇప్పటికే రూ.50 వేలే రావడం గమనార్హం. మిగిలిన నిధులు చెల్లించడంలో పాఠశాలల యాజమాన్యాలు, బాధ్యులు పట్టించుకోకపోగా అధికారులు సైతం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి నిర్ణీత రుసుము వసూలయ్యే అవకాశమున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదని వాపోతున్నారు. నిధులకు కటకట జిల్లావ్యాప్తంగా జరగాల్సిన పాఠశాలల స్థాయి క్రీడాపోటీలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఔత్సాహిక క్రీడాకారులను వెలికితీసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరతేనని తెలుస్తోంది. తొలుత మండలం, ఆపై జోనల్‌స్థాయిలో పోటీలు నిర్వహించాక జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మండలస్థాయి పోటీల తర్వాత జిల్లాస్థాయిలో కొన్ని క్రీడాంశాల్లోనే పోటీలు నిర్వహించిన పాఠశాలల క్రీడా సంఘం బాధ్యులు తమ పని కానిచ్చేశారు. ఇదేమిటని ఆరా తీస్తే నిధుల కొరత తామేం చేయలేని పరిస్థితి ఉందని, తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు చెప్పినట్లు తెలిసింది. ప్రైవేటు పాఠశాలలే అధికం జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో చదివే విద్యార్థుల నుంచి రూ.15వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాకున్నా యాజమాన్యాల నిరాసక్తతతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఫలితంగా జిల్లాస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి టోర్నీలకు పంపించలేకపోతున్నామని సంఘం బాధ్యులు చెబుతున్నారు. దాదాపు 37 క్రీడాంశాల్లో జిల్లా జట్లను ఎంపిక చేసినా వీరందరినీ రాష్ట్ర పోటీలకు పంపేందుకు సరిపడా నిధులు లేక దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. విద్యాశాఖ అధికారులు చొరవ చూపి విద్యాసంవత్సరం ఆరంభంలో క్రీడా రుసుము వసూలు చేయగలిగితే పోటీల నిర్వహణ, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులను తీసుకెళ్లడం సులువవుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చేసరికి బడి నిర్వహణకే నిధులు లేనందున క్రీడా రుసుము చెల్లించలేమని కొందరు హెచ్ఎంలు విద్యాశాఖ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇకనైనా అధికారులు చొరవ చూపి సకాలంలో రుసుము చెల్లించేలా సూచనలు చేస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మేలు చేసినట్లవుతుంది. పాఠశాలల క్రీడా రుసుము చెల్లింపులో నిర్లక్ష్యం -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘మిస్ టీన్ తెలంగాణ’ పోటీల్లో ప్రతిభభద్రాచలంటౌన్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఫరెవర్ మిస్ టీన్ ఇండియా–2025’ అందాల పోటీల్లో భద్రాచలం పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రీతి యాదవ్ ప్రతిభ చాటింది. ఈనెల 19 నుంచి 21 వరకు జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ‘ఫరెవర్ మిస్ టీన్ తెలంగాణ–2025’ కిరీటాన్ని కై వసం చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. వివిధ దశల్లో వడపోతల తర్వాత ఫైనల్స్ చేరుకున్న 101 మందిలో ప్రీతి యాదవ్ విజేతగా నిలిచింది. భద్రాచలం పట్టణంలో పానీపూరి వ్యాపారం చేసే ప్రకాష్ యాదవ్, రేణు యాదవ్ దంపతుల కుమార్తె ప్రీతి స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఆత్మవిశ్వాసంతో జాతీయ వేదికపై తెలంగాణ గర్వపడేలా రాణించిన ప్రీతిని పలువురు అభినందించారు. పోలీసుల అదుపులో అనుమానితులు?మధిర: మండలంలోని ఆత్కూరుకు చెందిన చౌరపు సత్యనారాయణ అడవి పందుల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం విదితమే. అయితే, ఆయనతో వెళ్లిన అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురిని మధిర టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఒక హోంగార్డు ఉన్నారని సమాచారం. సత్యనారాయణ అడవి పందులు వేటకు వెళ్లినప్పుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, షాక్ గురైన ఆయన కొన ఊపిరితో ఉన్నప్పుడు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించేలా మృతదేహాన్ని వైరా రోడ్డు పక్కన పడేసినట్లు తెలిసింది. ఈమేరకు ఆయనతో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. -
అద్దె పంచాయతీ
గ్రామపాలనలో కీలకమైన పంచాయతీలను సొంత భవనాల కొరత వేధిస్తోంది. కొన్నిచోట్ల సొంత భవనాలు లేకపోగా.. ఉన్నవాటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి. పలు పంచాయతీలను అద్దె భవనాల్లోని ఇరుకు గదుల్లో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 571 గ్రామపంచాయతీలకు గాను 461 పంచాయతీలకే సొంత భవనాలు ఉన్నాయి. మిగతా వాటిలో 70 అద్దె భవనాల్లో, 40 ఇతర ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్ని జీపీల భవనాలకు నిధులు విడుదలైనా నిర్మాణాలు పూర్తికాలేదు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం●అటు కిరాణం.. ఇటు జీపీ కొణిజర్ల మండలం రాజ్యతండా 2018లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి సర్పంచ్ ఓ ప్రైవేట్ భవనంలో ఐదేళ్ల పాటు పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించగా, ప్రస్తుతం గెలిచిన సర్పంచ్ బానోతు పుష్పావతి ఓ కిరాణం షాపులో నెలకు రూ.3వేల అద్దెతో గది తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.●అద్దె కట్టలేక.. 2018లో జీపీగా ఏర్పడిన కూసుమంచి మండలం ధర్మాతండా కార్యాలయాన్ని తొలి ఐదేళ్లు అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అద్దె కట్టలేక మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న భవనంలో నిర్వహిస్తున్నారు. నూతన భవనాన్ని మంజూరు చేస్తేనే సమస్యలు తొలగుతాయని సర్పంచ్ జర్పుల కిరణ్మయి కోరుతున్నారు.●పాఠశాలే పంచాయతీ కార్యాలయం.. తల్లాడ మండలం అంబేద్కర్‌నగర్ 2019లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడగా అంగన్వాడీ కేంద్రంలో కార్యకలాపాలు కొనసాగాయి. ఐసీడీఎస్‌కు అవసరం కావడంతో ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చారు. విద్యాశాఖకు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ భవనం కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. -
విద్యుత్ శాఖలో బదిలీలు ?
● త్వరలోనే విధివిధానాలు వెల్లడయ్యే అవకాశం ● రెండేళ్లు ఒకేచోట ఉన్న వారికి తప్పనిసరి ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై చర్చ మొదలైంది. ఒకేచోట రెండేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే కాక ఫిర్యాదులు ఉన్న వారిని నాన్ పోకల్ పోస్టుల్లోకి మార్చాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. తద్వారా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేసే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులను మూడేళ్లకోసారి బదిలీ చేస్తారు. కానీ ప్రభుత్వం ఈసారి రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకుని బదిలీలకు సిద్ధమైంది. విద్యుత్ సంస్థలో అవినీతి పెరిగిందని, కొత్త సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, మీటర్ల మార్పు ఇలా అన్ని పనులకు సిబ్బంది డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కూడా అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు పెరగడంతో ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థానచలనం కల్పించాలని, తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చనే భావనకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలో భారీగా స్థానచలనం విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకోనుండడంతో ఖమ్మం సర్కిల్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో బదిలీ కావొచ్చని భావిస్తున్నారు. దీర్ఘకాలంగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల్లో పనిచేసే వారు పెదవి విరుస్తున్నారు. ఇక యూనియన్లకు ప్రాతినిధ్యం వహించే నాయకులు ఇదే అదునుగా అనుకూలమైన చోటకు బదిలీ చేయించుకునేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖలో 18 – 19 ఉద్యోగ సంఘాలు ఉండగా కొందరు యూనియన్‌లో కీలక స్థానం ఉన్నట్లు లెటర్ ప్యాడ్లు సృష్టించి ఎంచుకున్న పోస్టింగ్ సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఫలితంగా దూర ప్రాంతాల్లో పనిచేసే పలువురు అక్కడే కొనసాగాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం బదిలీలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ఈ వ్యవహారంలో మార్పులు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఖమ్మం సర్కిల్ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 1,132 మంది ఉద్యోగులు, 250 మంది ఆర్టిజన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో వీరిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఇంజనీర్లు బదిలీ అయ్యే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. అయితే, మార్గదర్శకాలు విడుదలైతేనే ఈ అంశంలో స్పష్టత రానుంది. -
వేగంగా ముక్కోటి ఏర్పాట్లు
● చకచకా ర్యాంప్, హంసవాహన పనులు ● ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ భద్రాచలం: భద్రాచలం దివ్యక్షేత్రంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రధానంగా తెప్పోత్సవ పనులు వేగవంతమయ్యాయి. హంసాకృతికి సంబంధించిన చెక్కలకు రంగులు వేసి లాంచీకి అమర్చారు. హంసవాహనంపైకి స్వామి వారిని తీసుకెళ్లేందుకు ర్యాంప్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యాక అన్ని శాఖల అధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. అలాగే గతేడాది ప్రత్యేకాకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ఈ ఏడాది సైతం ఏరు ఉత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు తయారు చేయడంతో పాటు విక్రయానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఉత్తర ద్వార దర్శనానికి సెక్టార్ల విభజన చేయాల్సి ఉంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే పలుమార్లు ఏర్పాట్ల పనులను పరిశీలించి దిశా నిర్దేశం చేశారు. పూర్తి కావొచ్చిన ఆన్లైన్ టికెట్ల విక్రయం ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్లో ఉంచిన వివిధ సెక్టార్ల టికెట్ల విక్రయం దాదాపు పూర్తి కావొచ్చింది. మొత్తం 1,777 టికెట్లకు 1,167 టికెట్లను భక్తులు కొనుగోలు చేయగా ఇంకా 610 టికెట్లు మిగిలాయి. ఇందులో రూ.2వేల విలువ గల 487 టికెట్లు పూర్తిగా, రూ.500 విలువైన సెక్టార్ సీ, డీ టికెట్లు సైతం పూర్తిగా అమ్ముడుపోయాయి. రూ.1000 విలువ గల 75 టికెట్లు, రూ.500 విలువ గల సెక్టార్ బీ టికెట్లు 263, రూ.250 విలువ గల 272 టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. -
‘ప్రేరణ’ లేనట్టేనా ?!
● ఎస్సీ వసతిగృహాల్లో ఎస్సెస్సీ విద్యార్థులపై నిర్లక్ష్యం ● ఇప్పటికీ వసతిగృహాలకు చేరని స్టడీ మెటీరియల్ ● పరీక్షల షెడ్యూల్ వచ్చినా పట్టించుకోని అధికారులుఖమ్మంమయూరిసెంటర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సంక్షేమశాఖల ద్వారా వసతిగృహాలను నిర్వహిస్తోంది. ఇందులో పదో తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా సంక్షేమ శాఖల ద్వారా స్టడీ మెటీరియల్ అందించడమే కాక ప్రత్యేక మెనూ అమలుచేయాలి. అంతేకాక వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ‘ప్రేరణ’ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ద్వారా సంక్షేమ వసతిగృహాలు నిర్వహిస్తుండగా.. వందల సంఖ్యలో పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే, ఎస్సీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో 522 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది పరీక్షలకు సన్నద్ధంగా చేసేలా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. టీ, స్నాక్స్ కూడా బంద్.. వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులు రాత్రి చదువుకునే క్రమంలో ఏటా స్నాక్స్, టీ ఇచ్చేవారు. కానీ ఈసారి అవి కూడా ఇవ్వడం లేదు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారుల తీరుతో విద్యార్థులు సౌకర్యాలు కల్పించకపోగా చదువుపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని పలు వసతిగృహాల్లో సంక్షేమ అధికారులు ట్యూటర్లను నియమించినా వారు నిపుణులు కాకపోవడంతో పెద్దగా ఫలితం ఉండడం లేదని తెలుస్తోంది. పట్టింపే లేదు.. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యాననిర్వహిస్తున్న సంక్షేమ వసతిగృహాల్లోని ఎస్సెస్సీ విద్యార్థులకు ఆ శాఖ అధికారులు నవంబర్ నెలలోనే ప్రేరణ తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా అవగాహ న కల్పించారు. కానీ ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ఆ దిశగా కార్యాచరణ రూపొందించకపోవడం గమనార్హం. ఈవిషయమై ఉన్నతాధికారులైనా కలగచూసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో ఉంటూ పదో తరగతి చదివే విద్యార్థులకుఏటా నవంబర్ చివర లేదా డిసెంబర్ మొదటి వారంలోనే స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు ప్రేరణ క్లాస్‌లను నిర్వహించేవారు. మానసిక నిపుణులే కాక ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులపై పట్టు కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేవారు. తద్వారా విద్యార్థుల్లో పరీక్షలపై భయాన్ని తొలగిస్తూ అత్యధిక మార్కులు సాధించేలా సిద్ధం చేయడం ఈ తరగతుల లక్ష్యం. కానీ ఈ ఏడాది డిసెంబర్ చివరకు చేరినా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ప్రేరణ తరగతులను మొదలుపెట్టలేదు. వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైనప్పటికీ స్టడీ మెటీరియర్ జిల్లాకు రాకపోవడం గమనార్హం. -
లక్ష్య సాధనకు ఐక్యంగా కృషి చేయాలి
రుద్రంపూర్ : బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్య సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోల్ మూమెంట్ ఈడీ, చీఫ్ విజిలెన్స్ అధికారి బి.వెంకన్న సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న వీకే–7 ఓసీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓసీ నుంచి జనవరి నెలాఖరు నాటికి ఉత్పత్తి ప్రారంభం కావాలని, వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, ఇతర పరిశ్రమలకు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వార్షిక లక్ష్యానికి మూడు నెలలు మాత్రమే గడువు ఉన్నందున రక్షణతో కూడిన మెరుగైన ఉత్పత్తి సాధించాలని సూచించారు. రోజుకు వేయి టన్నులు ఉత్పత్తి చేయాలి పీవీకే–5 ఇంక్లైన్ భూగర్భ గనిలో రోజుకు 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని వెంకన్న అఽధికారులను ఆదేశించారు. సీఎమ్మార్ ద్వారా ఉత్పత్తి అవుతున్న గ్రేడ్ జీ–6 బొగ్గుకు మార్కెట్లో మంచి ధర ఉందని చెప్పారు. గనిలో యంత్రాల పని గంటలు పెంచితేనే రోజుకు అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందని సూచించారు.కోల్ మూమెంట్ ఈడీ వెంకన్న -
కేఎంసీ.. సరికొత్తగా!
● డివిజన్ల పునర్విభజన కోరుతూ సీడీఎంఏకు కమిషనర్ లేఖ ● పెరిగిన జనాభా, ఓటర్లకు అనుగుణంగా మార్పులు ● ఎస్ఐఆర్ తర్వాతే డివిజన్ల సంఖ్యపై స్పష్టత ఖమ్మంమయూరిసెంటర్: రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాలనా సౌలభ్యం కోసం డివిజన్ల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న నివాసాలు, జనాభా, ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డివిజన్ల సరిహద్దులను సవరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య డివిజన్ల పునర్విభజనకు అనుమతి కోరుతూ సీడీఎంఏకు ఇటీవల లేఖ రాశారు. వచ్చే ఏడాది మే నెలలో ప్రస్తుత పాలకవర్గం ముగుస్తుండడం, ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నందున ఆలోగానే పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. గతం నుంచి ప్రస్తుతం వరకు.. ఖమ్మం కార్పొరేషన్లో చివరిసారి 2021 ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లకు పెంచుతూ గెజిట్ విడుదల చేసింది. ఆ సమయాన కేఎంసీ పరిధిలో 2,81,387 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 1,45,608 మంది, పురుషులు 1,35,734 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. అప్పటి నుంచి 60 డివిజన్ల పరిధిలోనే పాలన కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఓటర్ల సంఖ్య 3.26లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాభా కూడా 5లక్షలకు పైగా ఉండడంతో డివిజన్ల పునర్విభజన తప్పదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, కొత్త డివిజన్లు ఏర్పాటుచేస్తారా, ప్రస్తుతం ఉన్న 60 డివిజన్ల సరిహద్దులనే సవరిస్తారా అన్నది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఆమోదమే తరువాయి కేఎంసీ నుంచి అధికారులు డివిజన్ల పునర్విభజనకు సంబంధించి సీడీఎంఏకు ప్రతిపాదనలు పంపారు. సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఆపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీచేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వార్డుల వారీగా జనాభా లెక్కింపు చేపడతారు. ఆతర్వాత భవిష్యత్ ఎన్నికల నాటికి కొత్త డివిజన్లు ఏర్పాటుచేసే అవకాశముందని చెబుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితేనే? ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతోంది. ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తయితే కేఎంసీలో ఓటర్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది. తద్వారా ఒక్కో డివిజన్లో 5,200 ఓటర్లే ఉండేలా మార్పులకు అవకాశముందని సమాచారం. అంటే ఎస్ఐఆర్ పూర్తయితేనే మార్పులు, చేర్పులపై స్పష్టత రానుంది. డివిజన్లు పెంచక తప్పని పరిస్థితి ఎదురైతే ప్రస్తుతం ఉన్న 60డివిజన్లకు తోడు కొత్తగా తొమ్మిది డివిజన్లు ఏర్పడే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయమై కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యను వివరణ కోరగా.. సీడీఎంకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కోసం అనుమతి కోరుతూ లేఖ రాశామని వెల్లడించారు. సీడీఎంఏ నుంచి అనుమతి వచ్చాక సర్వే చేపట్టి డివిజన్ల పెంపుపై స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతం 60 డివిజన్లతో ఉన్న ఖమ్మం నగరం విస్తరించడం, శివారు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడుతున్నాయి. కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం, మరికొన్నింట్లో తక్కువగా ఉండడంతో డివిజన్ల పరిధి క్రమపద్ధతిలో ఉంటేనే అభివృద్ధి పనులు, పౌర సేవలు వేగంగా అందించవచ్చనే భావనకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత కొత్తగా వేల సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంతో అంతరాలు ఏర్పడినట్లు గుర్తించారని సమాచారం. -
పరశురామా.. పాహిమాం
భద్రగిరిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలుభద్రాచలం: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం పరశురామావతారంలో దర్శనమిచ్చారు. తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతుల కార్య వీర్యార్జునుని సంహరించి 21 పర్యాయాలు భూమిని అంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు అవతరించిన ‘పరశురామయ్యకు పాహిమాం’ అంటూ భక్తులు వేన్నోళ్ల కీర్తించారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించాక పరశురామావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. కనులపండువగా శోభాయాత్ర ఉత్సవాల్లో భాగంగా లాడ్జీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేత్రపర్వంగా శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారిని మేళతాళాలు, భక్తుల కోలాటాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియం వేదికపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నాక తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. -
యాభై ఏళ్ల యాదిలో..
కిన్నెరసాని గురుకులంలో 1979లో చదువుకున్నాను. ఇక్కడ చదివిన నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. నేడు ఒమన్ దేశం మస్కట్‌లో ఆపరేషన్, మెయింటెనెన్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. – గొంది సతీష్‌కుమార్, ఉద్యోగి 2000 సంవత్సరంలో ఇక్కడి గురుకులంలో పదో తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన నేను ఆతర్వాత ఉన్నత విద్యను అభ్యసించాను. ప్రస్తుతం ఇదే గురుకుల కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉంది. – గొగ్గెల రమేష్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్పాల్వంచరూరల్ : కిన్నెరసాని.. రాష్ట్రంలో పేరొందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ 50 ఏళ్ల క్రితం గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించారు. వేల మంది గిరిపుత్రులు గురుకులం ఒడిలో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులుగా దేశ, విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ నెల 28న స్వర్ణోత్సవాలు నిర్వహించనుండగా, వారంతా తరలిరానున్నారు. కొద్దిరోజులుగా పలువురు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని డ్యామ్సైడ్లో 1975లో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత పక్కా భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా 1976, డిసెంబర్ 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సంజయ్‌గాంధీలు శంకుస్థాపన చేశారు. గురుకులంలో 50 ఏళ్ల కాలంలో ఒక్కో బ్యాచ్‌కు 80 మంది చొప్పున సుమారు 3,500 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. దేశ, విదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడ్డారు. పలువురు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మస్కట్‌లో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా పనిచేయడంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్యాంక్ మేనేజర్లు, టీచర్లు, పోలీసులుగా సేవలందిస్తున్నారు. స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు.. గురుకుల పాఠశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 3 వేల మంది పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో సావనీర్, ఫొటో గ్యాలరీ, పూర్వ ఉపాధ్యాయులకు సత్కారం, లైబ్రరీ ఏర్పాటు కోసం పుస్తకాల సేకరణ, స్వర్ణోత్సవాల నిర్వహణకు నిధుల సేకరణ, 50ఏళ్ల స్మృతి పైలాన్, ఫొటో సెల్ఫీపాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వర్ణోత్సవాలకు సిద్ధమైన గిరిజన గురుకులం -
సింగరేణికి దక్కేనా..?
● మణుగూరు ఏరియాలో పీకే ఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ వేలంపై ఉత్కంఠ ● ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియా భవిష్యత్‌పై సర్వత్రా చర్చ మొదలైంది. కొద్దిరోజుల్లో పీకే ఓసీ–2 దిగువ భాగం వేలం నిర్వహించనుండగా, కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా మణుగూరు ఏరియాలోనే అధికంగా బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఒక భూగర్భగని, రెండు ఓపెన్‌కాస్ట్‌లు ఉండగా, పీకే ఓసీలోని అంతర్భాగమైన పీకేఓసీ–2 ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గనిలో ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, అందులో 6 మిలియన్ టన్నులు పీకేఓసీ–2 నుంచే వెలికితీస్తున్నారు. ఇక్కడ సుమారు 55 మిలియన్ టన్నుల నిక్షేపాలు మాత్రమే ఉన్నాయి. మరో నాలుగున్నరేళ్లలో నిల్వలు అడుగంటుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2030 తర్వాత ఏరియా మనుగడ కొనసాగాలంటే పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తాజాగా బొగ్గు బ్లాకుల వేలానికి దరఖాస్తు గడువు ముగియగా, సింగరేణితోపాటు మరొక కంపెనీ దరఖాస్తు చేసుకుంది. జనవరి రెండో వారంలోగా వేలం వేయనున్నారు. బ్లాక్‌లో 115 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా, జీవిత కాలం 20 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. దీంతో సమీప ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉపాధి, కార్మికుల స్థిరీకరణతో అభివృద్ధి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సింగరేణి, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఏరియా బొగ్గు బ్లాక్ దక్కేలా కృషి చేయాలని కార్మిక నాయకులు, స్థానికులు కోరుతున్నారు. -
ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర: రాష్ట్రమంతా ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఏసుప్రభువును ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలోని బయ్యారం చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. చర్చి నిర్మించి 125ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భట్టి మాట్లాడారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే, ప్రభువు సందేశం ఇచ్చినట్లుగా ప్రతీఒక్కరు ఇతరులకు అండగా నిలవాలని, పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్చి బాధ్యులు, మత పెద్దలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఓవరాల్ చాంపియన్‌గా ‘తనికెళ్ల’ కొణిజర్ల: ఉమ్మడి జిల్లాస్థాయి మైనార్టీ బాలుర గురుకులాల క్రీడాపోటీల్లో తనికెళ్లలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పలు విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియనషిప్ కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి(ఆర్ఎల్సీ) ఎంజే. అరుణకుమారి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్.జితేష్ సాహిల్, పీడీ ఎం.రవికుమార్, పీఈటీ బండారు సాయికృష్ణతో డిప్యూటీ వార్డెన్ యాకూబ్ పాషా పాల్గొన్నారు. 28న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్ తెలిపారు. అండర్–16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్ –16 బాలబాలికలకు 2 కిలోమీటర్లు, అండర్–18లో బాలురకు ఆరు, బాలికలకు నాలుగు కి.మీ., అండర్–20 విభాగంలో బాలురకు ఎనిమిది కి.మీ., బాలికలకు ఆరు కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. క్రాస్ కంట్రీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈనెల 28 ఉదయం 10 గంటలకల్లా స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. చర్చి నిర్మాణానికి రూ.2లక్షల విరాళం రఘునాథపాలెం: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చర్చి నిర్మాణానికి గురువారం విరాళం అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఆయన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్మించే చర్చికి రూ.2లక్షల విరాళం అందించగా మతపెద్దలు పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శంకర్, నాయకులు మందడపు నరసింహారావు, మాధవరావుతో పాటు లక్ష్మణ్ నాయక్, క్రాంతి, సంజీవరావు, లాజర్, శ్రీను, విజయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు అర్చక, ఉద్యోగుల సమావేశం ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగల సమావేశాన్ని ఖమ్మంలోని పవనసుత జలాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంఘం బాధ్యులు దాములూరి వీరభద్రరావు, తోటకుర వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ల సమస్యలు, హెల్త్ కార్డులపై చర్చించనున్న ఈ సమావేశానికి అర్చక, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. -
రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వాజ్‌పేయ్
ఖమ్మం మామిళ్లగూడెం: దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషిచేయాలని బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్‌చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. వాజ్‌పేయ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం ఖమ్మంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల ముందు భారత పౌరుల తల ఎత్తుకునేలా వాజ్‌పేయ్ చేశారని కొనియాడారు. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారత్ సత్తా చాటారని తెలిపారు. తొలుత ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించగా పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, నాయకులు సన్నె ఉదయప్రతాప్, జి.విద్యాసాగర్, సుబ్బారావు, రామలింగేశ్వరరావు, వెంకటేశ్వరావు, దిద్దుకూరు వెంకటేశ్వరరావు, ప్రభాకర్‌రెడ్డి, వీరెల్లి రాజేష్, సరస్వతి, రజినీరెడ్డి, అనిత, అల్లిక అంజయ్య, జ్వాల తదితరులు పాల్గొన్నారు. కాగా, కరుణగిరిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లోనూ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. -
అపస్మారక స్థితిలో తల్లి.. ఆపదలో చిన్నారులు
వైరా: ఇద్దరు పిల్లలతో ఊరికి వెళ్లడానికి బయలుదేరిన ఓ మహిళ వైరా బస్టాండ్ సమీపాన అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఇద్దరు చిన్నారులను పోలీసులు, వీధి వ్యాపారులు చేరదీసి వారి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చంటిపిల్లలతో ఏపీలోని వత్సవాయి మండలం పోలంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వైరాకు వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ వైరా బస్టాండ్ సమీపాన అచేతనంగా పడిపోయింది. దీంతో విష యం ఏమిటో తెలియక చిన్నారులు రోదిస్తుండగా పోలీసులు, వీధివ్యాపారులు వారిని చేరదీసి పండ్లు అందించడమే కాక వివరాలు ఆరా తీశారు. ఆపై కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో ఆ మహిళ తాత వచ్చి ఆటోలో అంజనాపురం తీసుకెళ్లాడు. -
ఐకేపీలో నిధులు స్వాహా
● నిబంధనలకు విరుద్ధంగా నగదు ప్రోత్సాహకాలు డ్రా ● ఐకేపీ అధికారుల పాత్రపై అనుమానాలు తిరుమలాయపాలెం: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పని చేయాల్సిన ఇందిరాక్రాంతి పఽథం అధికారులు, సిబ్బంది మహిళా సంఘాలకు ప్రభుత్వం చెల్లించిన నగదు పోత్సాహకాలను గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన వైనమిది. ఇందులో పాలుపంచుకున్న సిబ్బంది ఇప్పుడు తమకేం సంబంధం లేదని ముఖం చాటేయడంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గ్రామదీపికలు లబోదిబోమంటున్నారు. అంతేకాక నిధుల స్వాహా విషయం బయటపడగానే రికవరీ బాధ్యతను గ్రామ దీపికలకే అప్పగించడంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూ.14లక్షల్లో వాటాలు తిరుమలాయపాలెం మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధిలో 66 గ్రామ సమాఖ్యలు ఉండగా, 60 మంది వీఓఏలు పనిచేస్తున్నారు. ఈ కార్యకలాపాల నిర్వహణకు 34 మంది గ్రామ దీపికలను నియమించారు. 2017 నుండి 2022 వరకు సీ్త్రనిధి రుణాలు సక్రమంగా రికవరీ చేసిన వీఓఓలకు నగదు ప్రోత్సాహకంగా ప్రభుత్వం నుంచి రూ.20.40లక్షలు విడుదలయ్యాయి. ఇందులో 50శాతం గ్రామదీపికలు తీసుకుని మిగిలిన నిధులను గ్రామ సమాఖ్యల అభివృద్ధికి వెచ్చించాలి. అయితే, బచ్చోడు, తిరుమలాయపాలెం, పిండిప్రోలు మినహా ఇతర క్లస్టర్లలోని 19 మంది గ్రామదీపికలు రూ.14.40లక్షల నిధులను ఐకేపీ ఏపీఎం, సీసీలు, గ్రామదీపికల ద్వారా డ్రా చేయించి పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగస్వామ్యం ఉన్న కొందరు కొద్దినెలల క్రితం బదిలీ కావడంతో, ప్రస్తుతం గ్రామ దీపికలే తిరిగి చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిసింది. ఇందులో సీసీల పాత్ర ఉన్నా వారిని వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. ఈక్రమాన కొందరు గ్రామదీపికలు అప్పు చేసి చెల్లిస్తుండగా మరికొందరు తాము తీసుకున్న మేరకే చెల్లిస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. అంతేకాక ఐకేపీలోని ప్రధాన అధికారి ఒత్తిడి చేస్తుండడంతో డీఆర్డీఓను కలిసేందు కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా, స్వాహా పర్వాన్ని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బయటకు తీసిన వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కో గ్రామదీపిక ద్వారా రూ.3వేల చొప్పున ఇస్తామని నచ్చచెబుతున్నట్లు తెలియగా, వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులే కారణం? మధిర: మండలంలోని ఆత్కూరు గ్రామానికి చెందిన చౌరపు సత్యనారాయణ (40) బుధవారం అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. సత్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, మరో ముగ్గురితో కలిసి దెందుకూరు సమీపాన ఆంధ్ర సరిహద్దులో అడ వి పందుల వేటకు వెళ్లినట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో అప్పటికే అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తాకడంతో సత్యనారాయణ తీవ్ర గాయాలై మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన వెంట వెళ్లిన వ్యక్తులు సత్యనారాయణ మృతదేహాన్ని వైరా రోడ్డులోని పీవీఆర్ కల్యాణమండపం సమీపంలో రోడ్డు పక్కన వేసి వెళ్లినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీ కరించే ప్రయత్నంలో అలా చేసినట్లు తెలుస్తుండగా, వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ సీఐ రమేష్ తెలిపారు. రైలు ఢీకొని టైలర్.. ఖమ్మంక్రైం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం గాంధీచౌక్‌లో టైలర్‌గా పనిచేస్తున్న బుర్హాన్‌పురానికి చెందిన రామగిరి రాములు(75) బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమాన పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఆయన మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రభుత్వం మొండివైఖరిని విడనాడాలి
ఖమ్మం సహకారనగర్: పెన్షనర్లకు బకాయిలు చెల్లింపు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌తో కలెక్టరేట్ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ అయిన వారికి నెలలు గడుస్తున్నా బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న జీపీఎఫ్, జీఐఎస్, సెలవు భత్యాన్ని సైతం చెల్లించకుండా ప్రభుత్వం సాగదీత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఇంకా ఈకార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రాయల రవికుమార్, నాయకులు కనపర్తి వెంకటేశ్వర్లు, ఊడుగు వెంకటేశ్వర్లు, కనపర్తి నాగప్రసాద్, జి.లక్ష్మీసుజాత, ఊడుగు సుధాకర్, ఎస్.జయరాం, రామారావు, ఏ.సాగర్, ఈ.రామకోటేశ్వరరావు, డి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఖర్చులు పక్కాగా
● సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటీసులు ● గెలిచిన, ఓడిన వారే కాక ఏకగ్రీవ స్థానాల్లో కూడా తప్పనిసరి ● విడతల వారీగా గడువు ప్రకటించిన అధికారులు అప్పగించాల్సిందే.. వైరా/నేలకొండపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. ఓడిన వారే కాక గెలిచిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈక్రమాన పోటీ చేసిన అభ్యర్థులంతా వ్యయం వివరాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ కార్యదర్శుల ద్వారా నోటీసుల జారీకి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డుగోలుగా ఖర్చు చేసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అనర్హత వేటు పడే ప్రమాదముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే దానిని నిబంధనల ప్రకారం చెప్పడం తలకు మించిన భారం కావడంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, వ్యయ వివరాలు సమర్పించేందుకు 45 రోజులు గడువు ఇవ్వనుండగా, ఈసారి ముందుగానే గడువు విధించడం గమనార్హం. సమర్పించకపోతే వేటే.. ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు వారికి గుర్తులు కేటాయించిన రోజు నుంచి ఫలితాలు వెలువడే వరకు చేసిన ఖర్చు వివరాలను ఎంపీడీఓలకు సమర్పించారు. లేనిపక్షంలో పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోనుండగా.. మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన వారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. త్వరలోనే పార్టీ గుర్తులపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జరగనున్నందున అభ్యర్థులు జాగ్రత్త పడాల్సి ఉంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏకగ్రీవాలు మినహా మొదటి విడతలో 172 జీపీలు, రెండో విడతలో 160, మూడో విడతలో 168 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇక భద్రాద్రి జిల్లాలో వరుసగా 145, 138, 145 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయగా, నెలకోసారి పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యాన సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓలకు.. ఆపై ఆన్లైన్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు అందజేసి రశీదు తీసుకోవాలి. ఆపై వివరాలను టీ–పోల్ సైట్లో ఫిబ్రవరి 15వ తేదీలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ మండలంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. కాగా, 5 వేల లోపు జనాభా ఉన్న జీపీల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశముంది. వార్డు సభ్యులైతే రూ.30 వేల వరకు ఖర్చులు చూపించవచ్చు. ఇక 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేసే అవకాశముండగా, పూర్తి వివరాలతో లెక్కలు అప్పగించాల్సి ఉంటుంది. విడత గడువు మొదటి విడత అభ్యర్థులు జనవరి 03 రెండో విడత జనవరి 06 మూడో విడత జనవరి 09 జిల్లా మొదటి విడత రెండో విడత మూడో విడత సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు ఖమ్మం 488 3,424 451 3,352 485 3,369 భద్రాద్రి 461 2,567 386 2,820 470 2,802 -
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఖమ్మం మయూరిసెంటర్: దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలుచేస్తూ, ప్రశ్నించే వారిని ఎన్డీఏ ప్రభుత్వం నిర్బంధాలకు గురి చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నిన్నటి వరకు స్వదేశ పౌరులపైనే మావోయిస్టుల పేరుతో యుద్ధం చేసిన బీజేపీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని అరెస్టు చేస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో బుధవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతం, కులం పేరుతో ప్రజలను విభజిస్తూ, దేవుడి పేరుతో మభ్యపెడుతూ దేశాన్ని సంక్లిష్ట స్థితికి తీసుకెళ్లేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం తీరుతో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు దేశ భవిష్యత్‌కు పెనుముప్పుగా మారనున్నాయని తెలిపారు. కాగా, సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని 26వ తేదీన వాడవాడలా నిర్వహించాలని, జనవరి 18న ఖమ్మంలో జరిగే చారిత్రక సభను విజయవంతం చేయాలని కూనంనేని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు పగడాల మల్లేశ్, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
15ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు..
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి అచేతనంగా పడి ఉన్న వ్యక్తికి సపర్యలు చేసిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆయన కోలుకున్నాక వివరాలు తెలుసుకుని కుటుంబం చెంతకు చేర్చారు. ఖమ్మం సమీపాన సదరు వ్యక్తి తిరుగుతుండగా కొన్నాళ్ల క్రితం అన్నం సేవా ఫౌండేషన్‌లో చేర్చుకున్న నిర్వాహకుడు శ్రీనివాసరావు వైద్యం చేయించారు. ఇటీవల కోలుకున్న ఆయన తన పేరు కనగాల చలపతిరావు అని స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి అని చెప్పడంతో బుధవారం అక్కడకు తీసుకెళ్లి గ్రామపెద్దల సమక్షాన కుటుంబానికి అప్పగించారు. పదిహేనేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఎక్కడ తిరిగినా ఆచూకీ లభించలేదని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం చలపతిరావు తమ చెంతకు చేరడంతో వారు అన్నం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆళ్లపాడులో కొనసాగిన దాడులుబోనకల్: మండలంలోని ఆళ్లపాడులో గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం రోజు మొదలైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈనెల 22న ప్రమాణస్వీకారం ఊరేగింపు నిర్వహిస్తుండగా కాంగ్రెస్, సీపీఎం, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ మొదలై దాడుల వరకు వెళ్లింది. ఈవిషయమై పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. అలాగే, బుధవారం మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ కందుల పాపారావుపై బీఆర్ఎస్, సీపీఎం వారు దాడి చేయడంతో గాయపడ్డాడు. దీంతో ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 25 మందిపై కేసు నమోదు చింతకాని: మండలంలోని పాతర్లపాడుకు చెందిన కొండ్రు జానకీరామయ్యతో పాటు మరో 24 మందిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. గ్రామంలో ఈనెల 22వ తేదీన సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా కంచుమర్తి సీతారావమ్మ ఇంట్లోకి పలువురు ప్రవేశించి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై సీతారావమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. ఆర్ అండ్ బీ ఉద్యోగుల ఫోరం ఎన్నిక ఖమ్మం అర్బన్: టీఎన్జీవోస్ అనుబంధ ఆర్అండ్బీ ఉద్యోగుల ఫోరం ఖమ్మం సర్కిల్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఒకే సెట్ నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైందని టీఎన్జీవోస్ ఖమ్మం ఉపాధ్యక్షుడు బి.శ్రీధర్‌సింగ్ తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఆర్.సూర్యనారాయణ, కార్యదర్శిగా జి.నర్సింహరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎండీ.ఖాజామియా, ఉపాధ్యక్షులుగా సీహెచ్.ఈశ్వర్, శ్రావణ్‌కుమార్, మహ్మద్, నాగమణిని ఎన్నుకున్నారు. ఈ కమిటీని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు అభినందించగా జెడ్.ఎస్.జైపాల్, యర్రా రమేష్, లలిత కుమారి, తాళ్లూరి శ్రీకాంత్, హరికృష్ణ కోనార్, యరమళ్ల శ్రీనివాసరావు, రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
●125 ఏళ్ల సీఎస్ఐ చర్చి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని సీఎస్ఐ(చర్చి ఆఫ్ సౌతిండియా) చర్చికి ఘన చరిత్ర ఉంది. డోర్నకల్ డయోసిస్ పరిధిలో ఖమ్మం, కొత్తగూడెంలో రెండు పెద్ద చర్చిలు ఉండగా, మరో 167 చర్చిల నిర్వహణ కొనసాగుతోంది. ఇందులో ఖమ్మం చర్చి నిర్మాణానికి 1899 ఏప్రిల్ 2వ తేదీన శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసి 1900 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించారు. 125 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇక్కడ ఏటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. చర్చి నిర్మాణంలో జేబీ పెయిన్స్ కీలకంగా పనిచేయగా, తొలి బిషప్‌గా వి.ఎస్.సుందరయ్య వ్యవహరించారు. ఇక్కడ చర్చి నిర్మాణం జరిగాక ఈ ప్రాంతానికి చర్చి కాంపౌండ్‌గా పేరు వచ్చింది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖల సహకారంతో చర్చిని అభివృద్ధి చేయడమే కాక వైద్య, విద్యా సేవలు కూడా కొనసాగిస్తున్నారు. అనుబంధంగా కొనసాగుతున్న సెయింట్ మేరీస్ హాస్పిటల్(మిషన్ హాస్పిటల్)కు వివిధ జిల్లాల ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ఏటా జనవరిలో విదేశాల నుంచి వైద్యులు ఈ ఆస్పత్రికి వచ్చి చికిత్స అందిస్తుంటారు. ఆస్పత్రికి అనుబంధంగా డే కేర్ సెంటర్, పోలియో హోమ్ కొనసాగుతున్నాయి. అలాగే, సెయింట్ మేరీస్ పాఠశాల ద్వారా విద్యార్థులకు బోధన అందుతోంది.అనుబంధంగా విద్య, వైద్య సేవలు -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ సేవలను పారదర్శకంగానే కాక ప్రజలకు వేగంగా అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఇటీవల ఎన్నికై న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) జిల్లా యూనిట్‌తో పాటు ఖమ్మం, కల్లూరు డివిజన్లు, కలెక్టరేట్ యూనిట్ల బాధ్యులు ఖమ్మంలో డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమంచి శ్రీనివాసరావు, కోశాధికారి బి.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు సునీల్‌రెడ్డి, కార్యదర్శి కే.వీ.వీ.ప్రసాద్‌తో పాటు క్రాంతికుమార్, రవీందర్, ముజాహిద్, సాయినరేష్, సీహెచ్.సురేష్, ఎం.శ్రీనివాస్, టి.కరుణాకర్‌రెడ్డి, డి.కరుణశ్రీ, పి.రాజేష్, బి.రవి తదితరులు పాల్గొన్నారు. -
జాబ్‌మేళాలో 26 మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలోని టీటీడీసీ భవన్లో బుధవారం జాబ్‌మేళా నిర్వహించారు. భారత్ హ్యుండాయ్ కంపెనీలో నియామకాల కోసం 40 మంది హాజరు కాగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ అనంతరం 26మందిని ఎంపికచేశారు. ఇంటర్వ్యూలను జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికొండపల్లి శ్రీరాం తదితరులు పర్యవేక్షించారు.పోరాటాలతోనే హక్కుల సాధనఖమ్మం మామిళ్లగూడెం: హక్కులు సాధించుకునేందుకు పోరాటాలే శరణ్యమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ గౌరవ సలహాదారు బి.వెంకన్న, ఖమ్మం డిపో గౌరవ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దిపాక వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికులపై పనిభారం పెంచడమే కాక సౌకర్యాలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని తెలిపారు. ఆయా అంశాలపై యూనియన్ ఆధ్వర్యాన ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం డిపో కార్యదర్శి బేధంపూడి బుచ్చిబాబు మాట్లాడగా నాయకులు కిరణ్ కుమార్, హరినాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. పేద యువతుల వివాహాలకు చేయూత ఖమ్మంమామిళ్లగూడెం: ఇద్దరు పేద, అనాథ యువత వివాహానికి ఆవామే హింద్ అండ్ వెల్ఫేర్ చారిటబుల్ ఫౌండేషన్, ముస్లిం ఐక్య సంఘం బాధ్యులు చేయూతగా నిలిచారు. ఖమ్మానికి చెందిన యువతి వివాహానికి రూ.25 వేల విలువైన సామగ్రి, భద్రాద్రి జిల్లా పెనగడప యువతి వివాహానికి రూ.10 వేల విలువైన సామగ్రిని బుధవారం అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ హఫీజ్ మహ్మద్ జవ్వాద్ అహ్మద్‌తో పాటు సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులపై యువకుల వీరంగంఖమ్మంక్రైం: ఖమ్మం కమాన్ బజార్లో బుధవారం రాత్రి ఇద్దరు యువకులు ట్రాఫిక్ పోలీసులపై వీరంగం సృష్టించారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన మహేందర్, మహేష్ తమ తండ్రితో కలిసి కమాన్ బజార్లో షాపింగ్‌కు వచ్చారు. వీరి వాహనాన్ని పక్కన పార్కింగ్ చేయాలని మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ సూచించగా ఆమెతో వాదనకు దిగడమే కాక పక్కకు తోసేశారు. దీంతో ఆమె ఇచ్చిన సమాచారంతో చేరుకున్న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఎస్సై, ఏఎస్సైతోనూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా ముగ్గురిని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, వీరిని విడిచిపెట్టాలని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అదుపులో ప్రవీణ్? సత్తుపల్లి: హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరా లకు పాల్పడి పలువురి నుంచి రూ.కోట్లలో నగ దు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను సత్తుపల్లి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయనను హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి వీఎం బంజర పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నగదును గ్రామపంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టినట్టు ఆరోపణలు రాగా, ఓడిపోయిన అభ్యర్థులు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈక్రమాన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. -
రేపు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈనెల 26న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కూసుమంచి మండలం మండలం గంగాబాద్ తండాలో వంద పడకల ఏరియా ఆస్పత్రి, కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి స్థలాలను పరిశీలిస్తారు. ఆతర్వాత క్యాంపు కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అలాగే, సాయంత్రం 3గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సమీకృత మండల కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశాక, శ్రీరాంనగర్, సాయి గణేష్ నగర్, పోలేపల్లి డబుల్బెడ్రూమ్ వద్ద రహదారులు, డ్రెయినేజీల నిర్మానానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎంపిక జాబితా వెబ్సైట్లో.. ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య మిషన్ విభాగం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని డీఎంహెచ్ఓ రామారావు తెలిపారు. ఈమేరకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను https:// khammam.telangana.gov.in వెబ్సైట్లో పొందుపర్చామని పేర్కొన్నారు. ఈ జాబితాపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 27వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా సరైన ఆధారాలతో తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 27న కమ్యూనిస్టు పార్టీ శతవార్షిక సభ ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈనెల 26వ తేదీతో వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 27న శత వార్షిక సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య భవనంలో ఈ సభ జరుగుతుందని వెల్లడించారు. త్యాగాలు, పోరాటాల వారసత్వం, విజయాలనే గుర్తుచేసుకోవడమేకాక వైఫల్యాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో బత్తిన శ్రీనివాసరావు, వి.భార్గవ, కేజీ.రామచందర్, కె.రమ, వి.కృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణ, గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొననున్నందున పార్టీ శ్రేణులు హాజరై విజయవతం చేయాలని రంగారావు ఓ ప్రకటనలో కోరారు. జలవనరుల శాఖ సీఈకి ఈఎన్సీగా పదోన్నతి ఖమ్మంఅర్బన్: సూర్యాపేట జిల్లా జలవనరుల శాఖ సీఈగా, ఖమ్మం ఇన్చార్జి సీఈగా విధులు నిర్వర్తిస్తున్న ఓ.వెంకట రమేష్‌బాబుకు పదోన్నతి లభించింది. ఆయనకు జల వనరుల శాఖలో ఈఎన్సీ(అడ్మిన్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన పదోన్నతితో రెండు జిల్లాల సీఈ పోస్టులు ఖాళీ కాగా, త్వరలోనే మరో అధికారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యా సదస్సును జయప్రదం చేయండి ఖమ్మం సహకారనగర్: జనగామలో ఈనెల 28, 29వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో బుధవారం వారు పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు బుర్రి వెంకన్న, షమి, రాంబాబు, సురేష్, రామకృష్ణ, సుధాకర్, శచేంద్రబాబు, శ్రీనివాసరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నట్టల మందుతో జీవాలకు ఆరోగ్యం -
●ఆసియా ఖండంలోనే ఖ్యాతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సీఎస్ఐ చర్చి నిలుస్తోంది. ఆంగ్లేయుల కాలంలో ఈ చర్చి తొలుత డంగు సున్నంతో నిర్మించారు. రానురాను భక్తుల సంఖ్య పెరగడంతో 2000 సంవత్సరంలో నూతన చర్చిని నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారు. కొత్త భవనాన్ని 2005 మే 1వ తేదీన మెదక్ చర్చి దివంగత ఫాదర్ బీపీ సుగంధన్ ప్రారంభించారు. ప్రతీ ఆదివారం ఐదు వేల మందికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలకు హాజరవుతారు. ఫాస్టరేట్ చైర్మన్‌గా డీమాల అభిజిత్ వ్యవహరిస్తున్న ఈ చర్చి డోర్నకల్ అధ్యక్ష మండలి పరిధిలో కొనసాగుతోంది. -
పెట్టుబడి కాదు భవిష్యత్‌కు పునాది
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘రాష్ట్రాభివృద్ధిలో విద్య అంత్యంత కీలకమైంది. విద్యాశాఖపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిని రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగపడే పెట్టుబడిగా భావించాలి. అధికారులు విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన విద్యాశాఖ, సంక్షేమ పథకాల అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలి ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, అనుమతుల పునరుద్ధరణపై ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించడంతో పాటు సరైన ఆటస్థలం, ల్యాబ్‌లు, విద్యార్థుల భద్రతపై దృష్టి సారించని స్కూళ్లకు అనుమతులు పునరుద్ధరించొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం కల్లా విద్యాసంస్థల్లో సదుపాయాలు సమకూర్చుకోకపోతే అనుమతి విషయంలో ఇబ్బందులు తప్పవని తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు అనుమతి ఇస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం భట్టి హెచ్చరించారు. రానున్న రెండేళ్లు అత్యంత కీలకంగా భావిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే వస్తున్నందున అధికారులు వారికి జవాబుదారీగా ఉండాలని చెప్పారు. కాగా, అటవీ భూ హక్కుల చట్టం కింద భూములు పొందిన గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా ఉచితంగా సోలార్ విద్యుత్, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మెనూ అమలు, బోధనపై ఆరాతీశాక వంటలను తనిఖీ చేయడమే కాక విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమేకాక ఉపాధ్యాయుల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మొదలు అధికారులంతా పర్యవేక్షించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఏదైనా ఘటన జరిగితే ఇన్చార్జి అధికారిని బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. వచ్చేవిద్యాసంవత్సరం నాటికి మధిర నియోజకవర్గంలోని మూడు మోడల్ పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాలు, జూనియర్ కాలేజీల్లో మరమ్మతులపై కూడా సూచనలు చేశారు. ఆంగ్లం, గణితం, సైన్స్‌లో నిపుణులైన ఉపాధ్యాయులను గుర్తించి ఆన్లైన్ విదానంలో 8 – 10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. -
ఎంబీబీఎస్ విద్యార్థికి ‘ప్రతిమ’ చేయూత
కరీంనగర్‌రూరల్: నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువు సాఫీగా సాగేలా ప్రతిమ ఫౌండేషన్ చేయూతనందించింది. తిరుమలాయపాలెం మండలం ఎదుల్లచెరువుకు చెందిన రైతు ఆరెంపుల శ్రీలత– ఉపేందర్ దంపతుల కుమార్తె సమీరాకు కన్వీనర్ కోటాలో కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. మొదటి సంవత్సరంలో చేరినా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఆమె కుటుంబసభ్యులు ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బోయినపల్లి హరిణిని సంప్రదించగా బుధవారం మొదటి సంవత్సరం ఫీజు చెల్లించేందుకు రూ.60వేల చెక్కు అందజేశారు. -
లోకమంతా మననం
●క్రీస్తు జననం..నేడు క్రిస్మస్ పర్వదినం ● ఉమ్మడి జిల్లాలో వందేళ్లు దాటిన ప్రార్థనామందిరాలెన్నో.. ● సుందరంగా ముస్తాబైన చర్చిలు ఏసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలుకాగా, కేక్ కట్ చేసిన మతపెద్దలు ఏసు జనన వృత్తాంతాన్ని వివరించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని పలు చర్చిలు వందేళ్ల క్రితం నిర్మాణమయ్యాయి. జిల్లా మీదుగా రైల్వేలైన్ వెళ్లడం, సింగరేణి గనులు ఉండడంతో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన బ్రిటీషర్ల కాలంలో వీటిని నిర్మించగా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇందులో కొన్ని చర్చిల ప్రత్యేకతలతో కథనం. -
●ప్రశాంతతకు నిలయం
తల్లాడ: వరంగల్ – దేవరపల్లి జాతీయ రహదారి పక్కన తల్లాడ పంచాయతీ పరిధి నారాయణపురంలో ఉన్న లూర్థుమాత ఆలయానికి జిల్లాలోనే అతిపెద్ద చర్చిగా పేరుంది. ఇక్కడ క్రిస్మస్ ప్రార్థనలకు వేలాదిగా భక్తులు హాజరవుతారు. ఎత్తయిన చర్చి, లూర్థుమాత విగ్రహాలు ఆకట్టుకుంటాయి. 26ఏళ్ల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యాన ఈ చర్చిని నిర్మించగా, ఆవరణలో కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవిత విశేషాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒకేసారి 2వేల మంది ప్రార్థన చేసే అవకాశమున్న ఈ చర్చి గోపురం 150 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్ పండుగతో పాటు ఏటా జనవరిలో ఫీస్ట్, ఫిబ్రవరిలో గుడి పండుగ, లూర్థుమాత ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ చర్చికి అనుబంధంగా మరో తొమ్మిది చర్చిలు కొనసాగుతున్నాయి. -
విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు
● క్వార్టర్‌పై అదనంగా రూ.40 వసూళ్లు ● పల్లెల్లో వివాదాలకు కారణమవుతున్న వైనం ● అయినా పట్టించుకోని ఎకై ్సజ్ శాఖాధికారులునేలకొండపల్లి: అధికారిక దుకాణాలు కావు... అయినా 24 గంటల మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. రహదారుల వెంట, గ్రామాల్లోని కిరాణం, ఇతర షాపుల్లో కొనసాగుతున్న వీటి కారణంగా మందుబాబులకు నిత్యం మద్యం లభిస్తుండడంతో తాగి గొడవ పడుతున్నారు. ఇక షాపుల నిర్వాహకులు వైన్స్ నుంచి క్వార్టర్‌పై రూ.10నుంచి రూ.20 వరకు ఎక్కువతో కొనుగోలు చేసి తీసుకొస్తూ గ్రామాల్లో ఎమ్మార్పీ కంటే రూ.40 పెంచి అమ్ముతున్నారు. నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో దాదాపు అన్నిచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎకై ్సజ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రతీ గ్రామం, తండాల్లో... ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో మద్యం అమ్మకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో ప్రతీ గ్రామం, తండాలో కనీసం మూడుకు పైగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బడ్డీకొట్టు, కిరాణం షాప్, హోటల్ ఇలా అనువుగా ఉన్న ప్రతీచోట 24గంటల పాటు మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయాన వ్యాపారులను బైండోవర్ చేసినా రూ.లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయంటే ఎకై ్సజ్ అధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. రోజంతా మద్యం లభిస్తుండడంతో అదనంగా వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్న మందుబాబులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీరి కారణంగా గ్రామాల్లో తరచుగా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. అదనపు వసూళ్లు బెల్ట్‌షాపుల నిర్వాహకుల నుంచి నేలకొండపల్లిలో ని వైన్స్ బాధ్యులు రూ.110 ఉన్న క్వార్టర్‌కు రూ. 130 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇకబెల్ట్ షాపుల్లో ఇదేక్వార్టర్ను రూ.150కి అమ్ముతున్నారు. అలా గే, బీర్లపైనా ధర పెంచుతుండగా ప్రతీరోజు బెల్ట్‌షాపులకు విక్రయించే మద్యం నుంచే వైన్స్ నిర్వాహకులు రూ.లక్షల మేర దండుకుంటున్నారు. నేలకొండపల్లిమండల కేంద్రంలో బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రెండు వైన్స్‌ను కేటా యించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు తనిఖీల మాటెత్తకపోవడం గమనార్హం. గుప్పుమంటున్న గుడుంబా పలు మండలాల్లో ఇటీవల గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. గ్రామాలు, తండాల్లో గుడుంబా విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. నేలకొండపల్లి ఎకై ్సజ్ స్టేషన్‌కు ఆక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ సీఐ లేకపోవడంతో అటు బెల్ట్‌షాపులు, ఇటు గుడుంబా విక్రయాలపై ఉద్యోగులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నేలకొండపల్లి సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులను కట్టడి చేసేలా తనిఖీలు నిర్వహిస్తాం. వైన్స్ ద్వారా హోల్‌సేల్‌గా మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేస్తాం. ఎవరైనా ఎమ్మార్పీకి మించి ధర పెంచినట్లే తెలిస్తే కేసులు నమోదు చేస్తాం. – రమేష్, ఇన్చార్జ్ ఎకై ్సజ్ సీఐ, నేలకొండపల్లి -
ప్రకృతి అందాలు అద్భుతం
పాల్వంచరూరల్ : కిన్నెరసాని ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని నలుగురు ట్రెయినీ ఐపీఎస్‌లు కితాబిచ్చారు. పాల్వంచ మండలం కిన్నెరసానిని మంగళవారం వారు సందర్శించారు. అభయారణ్యంలో జంతవుల సంరక్షణ, అటవీ సంపద వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు ‘సో బ్యూటిఫుల్’ అంటూ పేర్కొన్నారు. ఐపీఎస్ శిక్షణలో భాగంగా తాము ఇక్కడికి వచ్చామని హైదరాబాద్‌కు చెందిన రాహుల్, మనీషా నెహరా, సోనమ్ సునీల్, ఆయేషా ఫాతిమా వెల్లడించారు. అనంతరం బోటు షికారు చేశారు. వారి వెంట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ జీవన్ ఉన్నారు.కిన్నెరసానిని సందర్శించిన ట్రెయినీ ఐపీఎస్‌లు -
విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ
బోనకల్: మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన విజయోత్సవ ర్యాలీలో గొడవ జరగగా ముగ్గురికి గాయాలయ్యాయి. సీపీఎం మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈమేరకు ప్రమాణస్వీకారం అనంతరం ర్యాలీ నిర్వహించే క్రమాన కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లాది లింగయ్య ఇంటి ముందు కుంకుమ చల్లుకోవడంతోపాటు వారి ఇంటి ఆవరణలో కుంకుమ చల్లారని తెలిసింది. ఈ క్రమాన ఘర్షణ మొదలుకాగా సీపీఎం, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన చెన్నకేశ వేణుతోపాటు శ్రీకాంత్, పవన్ గాయపడడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై మంగళవారం ఫిర్యాదు అందిందని ఎస్సై పి.వెంకన్న తెలిపారు. కాగా, గాయపడ్డ వారిని జెడ్పీమాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు పరామర్శించారు. -
బకాయిలకు మోక్షం..
● స్కాలర్‌షిప్‌ల చెల్లింపునకు నిధులు ● జిల్లాలో బకాయిలు రూ.58.46 కోట్లు ఖమ్మంమయూరిసెంటర్: వేలాదిమంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపకార వేతనాల విడుదలకు మార్గం సుగమమైంది. ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడంతో విద్యార్థి లోకంలో హ ర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య చది వే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు ఆసరాగా నిలుస్తుండగా, ఏళ్ల తరబడి పెండింగ్ ఉండడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేసిన ప్రకటనతో జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు ఊరట లభించనుంది. గత ప్రభుత్వ హయాం నుంచి.. గత ప్రభుత్వ హయాం నుండి విద్యార్థులకు మెస్ చార్జీలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ము ఖ్యంగా ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పై యాజమాన్యాలుఫీజుకోసం ఒత్తిడి చేస్తుండడంపై, సర్టిఫికెట్లు ఆపివేయడం వంటి పరిణామాలతో భవి ష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఉపకారవేతనాల బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థుల్లో ఊరట నెలకొంది. జిల్లాలో వేలాది మంది... ఖమ్మం జిల్లాలో వందలాది విద్యాసంస్థలు ఉన్నా యి. వేలాది మంది విద్యార్థులు ఇంటర్ నుండి ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కోర్సుల వరకు చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులు ఉండగా, 2022 ఏడాది నుండి ఉపకార వేతనా లు నిలిచిపోయాయి. ఇప్పుడు బకాయిలన్నీ ప్రభుత్వం విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లలో.. 2022–23 ఏడాదినుండి విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల కావడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఉపకార వేతనాలు ఎంతో ఆసరాగా నిలుస్తాయి. కానీ మూడేళ్ల నుంచి విడుదల కాక జిల్లాలో రూ.58.46 కోట్ల మేర ఉపకార వేతనాల బకాయిలు పేరుకుపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిధులు విడుదల కానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి ఉపకార వేతనాల బకాయిలు (రూ.కోట్లలో) సంవత్సరం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 2024–25 4.49 1.13 3.13 1.23 2023–24 9.01 4.35 6.82 1.56 2022–23 11.31 4.93 5.87 1.62 మొత్తం 24.82 10.42 18.82 4.41 -
జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని గ్రేస్ విద్యాసంస్థల అధినేత, గ్రేస్ సర్వీస్ సొసైటీ చైర్మన్ ఎం.ఎం.జాకబ్‌కు ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డు లభించింది. ఉత్తమ సేవలందిస్తున్న పలు క్రైస్తవ సంస్థలకు ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అవార్డులు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జాకబ్ అవార్డు అందుకున్నా రు. వృద్ధులు, వితంతువులు, కుష్టు రోగులకు అందిస్తున్న సేవలు, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య తదితర కార్యక్రమాలకు గాను అవార్డు లభించిందని జాకబ్ వెల్లడించగా, ఆయనను పలువురు అభినందించారు. 28న కవయిత్రి ఓల్గాకు పౌరసన్మానంఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గాకు ఈనెల 28న పౌరసన్మానం ఏర్పాటుచేసినట్లు స్వేఛ్ఛావరణం నిర్వాహకురాలు సుమ తి తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ వేదిక ఫంక్షన్ హాల్లో జరిగే సన్మానంలో ప్రముఖ సాహితీ వేత్తలు మృణాళి ని, కాత్యాయని విద్మహే, ప్రతిమ, పాటిబండ్ల రజని తదితరులు హాజరవుతారని వెల్లడించా రు. తొలుత ‘ఓల్గా తీరం’ పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా, ఆమెరచనలపై ఎగ్జిబిషన్ ఉంటుందని, నృత్యరూపకాన్ని కూడా ప్రదర్శించనునట్లు తెలిపారు. ఇప్పటికే ఓల్గా రచనలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రచయిత్రి వురిమళ్ల సునంద తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ నిర్మాణ స్థలం పరిశీలన చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి పరిధిలో నిర్మించనున్న వ్యవసాయ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని ఎజిలిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. చింతకాని, ము దిగొండ మండలాలకు కలిపి మత్కేపల్లిలో మా ర్కెట్ మంజూరు చేయగా, సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూ మిని మార్కెటింగ్ అధికారులకు అప్పగించా రు. మిగిలిన స్థలాన్ని కూడా అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభించటానికి అవకాశం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వ ర్లు, వైస్ చైర్మన్ పర్చగాని తిరుపతిరావు, డైరెక్టర్ బందెల నాగార్జున్, జిల్లా మార్కెటింగ్ అధి కారి అలీమ్, ఎజిలిటి కంపెనీ ప్రతినిధి సురేష్ కుమార్ పాల్గొన్నారు. జాతీయస్థాయి ఉషూ పోటీలకు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: జాతీయస్థాయి ఉషూ పోటీల కు ఖమ్మంక్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 25నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నంద్‌గావ్‌లో జరిగే ఫెడరేషన్‌కప్ పోటీల్లో భాగంగా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల నుంచి 15 మంది బాలబాలికలు హాజరుకానున్నారు. ఈమేరకు క్రీడాకారులు టి.సాయిభవ్యశ్రీ, టి.సాయిమహార్షి, డి.హర్షిణి, ఎస్.కే. పర్దోష్, ఎన్.చైతన్య, కె.సోహన్, వి.అభిషేక్, జి. లోకేష్, బి.హర్షవర్థన్, ఆర్.శ్రీమార్, ఎస్.కే. ఉమర్ఫారుఖీ, పి.పవిత్రాచారి, పి.సత్యజిత్చా రి, ఎస్.కే.నిహాన్పాషా, వై.చరణ్‌తేజ్ యా దవ్, వై.గౌరీశంకర్ యాదవ్‌ను డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు. -
న్యాయ సలహాదారుడిగా వెంకటగుప్తా
ఖమ్మం లీగల్: జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహా దారుడిగా వెంకట గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం కోర్టులో 1992 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్న వెంకటగుప్తా వివిధ బ్యాంకులకు అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. అలా గే, న్యాయవాద పరిషత్‌కు జిల్లా కార్యదర్శిగా ఉన్నా రు. కాగా, కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడిగా ఆయనతో పాటు సహాయ న్యాయ సలహాదారులుగా శేఖర్‌రాజు, శ్రీనివాసశర్మ, ఆమనగంటి వెంకటరమణ, కొండపల్లి విజయకుమార్, చరణ్, గండ్ర దీన్‌దయాళ్ నియమితులయ్యారు. వేర్వేరు ఘటనల్లో ఆరుగురిపై కేసు చింతకాని: మండలంలోని బస్వాపురానికి గ్రామానికి చెందిన పొట్టపల్లి కన్నయ్య, లాలమ్మ, భాస్కర్, దొంతగాని రాంబాబు, కుక్కల సైదులుపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన పొట్టపల్లి ధనలక్ష్మికి చెందిన ఇంటి స్థలం విషయంలో వీరు గొడవ పడి ఇంట్లోని విద్యుత్ మోటార్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. అలాగే, మండలంలోని పందిళ్లపల్లికి చెందిన అలవాల పుష్ప ఇంట్లో చోరీకి యత్నించిన రామకృష్ణాపురానికి చెందిన గాదె పద్మ పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
సన్మానం పేరిట ఆహ్వానం
వైరా: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వైరా మండలంలో 20మంది సర్పంచ్‌లుగా గెలిచారు. వీరిని వైరాలోని కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం సన్మానిస్తారని మండల నాయకులు ప్రకటించారు. ఈమేరకు పార్టీ కార్యాలయానికి ఆహ్వానించగా సర్పంచ్‌లంతా చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి వేచి చూస్తుండగా మధ్యాహ్నం 3గంటల సమయాన డిప్యూటీ సీఎం భట్టి వైరా చేరుకున్నప్పటికీ కార్యాలయంలోకి రాకుండానే నిమిషం పాటు బయట ఆగి వెళ్లి పోయారు. దీంతో సర్పంచ్‌లంతా నిరాశగా వెను దిరిగారు. సన్మానం ఉంటుందని పిలిచి తమను ఎందుకు అవమానించారని నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం రాకపోవడంతో నిరుత్సాహం -
నిలకడ లేని మిర్చి ధర
● గత నెలతో పోలిస్తే క్వింటాకు రూ.వేయి డౌన్ ● ఎగుమతులు లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు ● నష్టానికి అమ్మలేక నిరాశలో రైతాంగం మధిర: మిర్చి ధర కొద్దిరోజులు ఆశాజనకంగా ఉంటున్నా అంతలోనే తగ్గుతోంది. నిలకడ లేని ధరతో రైతులు పంట అమ్మలేక, కోల్డ్ స్టోరేజీలో అద్దె భారం మోయలేక కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే తేజ రకం మిర్చికి ఈసారి విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడమే ధర పతనానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోపక్క దిగుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవడం, పంట చేతికొచ్చే సరికి ధర తగ్గుతుండడంతో రైతులు చేసేదేం లేక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తున్నారు. ఇలా గత మూడేళ్లలో సాగైన మిర్చి ఇప్పటికీ కోల్డ్ స్టోరేజీలో మూలుగుతోంది. ప్రస్తుత ఏడాది పంట కూడా చేతికి వచ్చే సమయం సమీపించడంతో అప్పులు తీర్చేందుకు వ్యాపారులు చెప్పిన ధర అమ్మక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. పడిపోయిన సాగు విసీర్ణం మిర్చిని ఆశిస్తున్న చీడపీడలు, పెరుగుతున్న సాగు వ్యయానికి తోడు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నా రు. గత ఏడాది జిల్లాలోని 69వేల ఎకరాల్లో మిర్చి సాగైతే ఈ ఏడాది కేవలం 32వేల ఎకరాలకే పరి మితం కావడం ఇందుకు నిదర్శనంగా నిలు స్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగయ్యే మిర్చి చైనా, బంగ్లాదేశ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. కానీ రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం పెరగడంతో పంట కొనుగోలుకు చేసేందుకు విదేశీ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 40 లక్షల బస్తాలను నిల్వ చేసే సామర్థ్యంతో 42 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో ఇంకా 22 లక్షలు బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు అంచనా. మధిరలోని 13 కోల్డ్ స్టోరేజీల్లో గత మూడేళ్లలో పండిన పంట మొత్తంగా సుమారు ఆరు లక్షల బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. తగ్గనున్న దిగుబడులు ఈ ఏడాది కూడా మిర్చి సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ముఖ్యంగా నల్లనల్లి, బొబ్బరోగం వంటి తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా ఎకరాకు 7 – 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. సాగు విస్తీర్ణం పడిపోగా, తెగుళ్లతో దిగుబడి కూడా తగ్గనుండడంతో ధర పెరుగుతుందని ఆశించిన పలువురు గత ఏడాది పంటను మార్కెట్‌కు తీసుకొస్తే పరిస్థితులు విరుద్ధంగా ఉంటున్నాయి. గత నెలలో క్వింటా మిర్చికి జెండా పాట రూ.15,800 నమోదు కాగా ప్రస్తుతం రూ.14,800గా నమోదవుతోంది. క్వింటాకు నెలలోనే ధర రూ.వేయి తగ్గగా, కోల్డ్ స్టోరేజీ అద్దె, తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.ఈ ఏడాది మిర్చిని నల్ల తామర ఆశించడం వల్ల 25 – 30శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సుమారు నెల క్రితం మిర్చికి వేరుకుళ్లు వచ్చింది. దీంతో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించాం. ఇటీవల పత్తి తీయగానే నల్ల తామర ఆశించింది. – మధుసూదన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
పన్నుపోటు
పంచాయతీలకుసాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో నూతనంగా కొలువుదీరిన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు పన్నుల వసూలు సవాల్‌గా మారనుంది. సుదీర్ఘకాలం పాటు గ్రామపంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి మందగించింది. ఇప్పుడు పాలకవర్గాలను ఎన్నుకోవడంతో పంచాయతీలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని గ్రామస్తులు ఆశిస్తున్నా పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో సందిగ్ధత నెలకొంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పన్ను తప్పక చెల్లించాలనే నిబంధన ఉండడంతో రాబడి ఉంటుందని అధికారులు భావించినా తక్కువ మొత్తంలోనే వసూలయ్యాయి. పాత, ప్రస్తుత బకాయిలు కలిపి జిల్లాలో రూ.15,55,82,207 ఉండగా.. రూ.5,69,69,816 మాత్రమే వసూలవడంతో, మిగతా బకాయిలపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారిస్తేనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టనున్నాయి. అస్తవ్యస్తంగా పల్లెలు గత రెండేళ్లుగా పాలకవర్గాలు లేక గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాక పనులు నిలిచి పోయాయి. గత సర్పంచ్ల పదవీకాలం ముగిశాక ప్రత్యేక అధికారుల పాలనలో అత్యవసర పనులకే ప్రాధాన్యత ఇచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల వెంట చెత్త తొలగింపు, పైపులైన్ల లీకేజీలు, గ్రామాల్లో అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చడం వంటి ప్రాథమిక పనులు కూడా నిధులు లేక ఆగిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు కొన్ని పనులకు సొంత నగదు వెచ్చించినా బిల్లులు రాలేదు. కొత్త బకాయిలు రూ.14కోట్ల పైమాటే ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం, గ్రామాల్లో పన్నులు వసూలు కాకపోవడంతో గ్రామపంచాయతీల ఖజానా ఖాళీ అవుతూ వచ్చింది. జిల్లాలోని 571 జీపీల్లో పాతబకాయి రూ.1,29,69,091 ఉండగా.. ప్రస్తుత బకాయిలు రూ.14,26,13,116గా నమోదయ్యాయి. రెండేళ్లుగా పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే జరుగుతోంది. మొత్తం 20 మండలాల్లో నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా రూ.1,39,28,115 బకాయి ఉంది. ఇందులో రూ.41,15,930 మాత్రమే వసూలయ్యాయి. అభ్యర్థులు సరే... ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పన్ను బకాయిలు ఉండొద్దనే నిబంధనతో చెల్లించారు. తద్వారా గ్రామపంచాయతీలకు మెరుగైన ఆదాయం నమోదవుతుందని భావించినా అంతగా ఫలితం కానరాలేదు. మొత్తం బకాయిల్లో పాతవి రూ.21,80,068, ప్రస్తుత బకాయిలు రూ.5,47,89,748 కలిపి రూ.5,69,69,816 గ్రామపంచాయతీల ఖజానాకు చేరాయి. ఇందులో పోటీ చేస్తున్న అభ్యర్థుల పన్నులతోపాటు ఇతరులు చెల్లించిన పన్నులు కూడా ఉన్నాయి. తద్వారా ఇంకా రూ.9,79,24,383 మేర పన్ను బకాయిలు అలాగే మిగిలిపోయాయి.పేరుకుపోయిన పాత, కొత్త బకాయిలు -
అంతర్జాతీయ సంస్థగా సింగరేణి
సత్తుపల్లి: ఇన్నాళ్లు తెలంగాణలో మాత్రమే బొగ్గు వెలికితీతకు పరిమితమైన సింగరేణి సంస్థ అనేక రంగాల్లోకి అడుగుపెడుతూ ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. సత్తుపల్లిలో నిర్మించిన ఏరియా జీఎం కార్యాలయాన్ని మంగళవారం ఆయన సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ను కట్ చేశాక సభలో మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సోలార్ ఎనర్జీ, మినరల్స్ రంగంలో అడుగు పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను విక్రయిస్తున్నందున సాధ్యమైనన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జైపూర్‌లో 1,500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సింగరేణి భవిష్యత్ కార్మికుల చేతుల్లో ఉందని గుర్తించి ఉత్పత్తి పెంచాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ సైలో బంకర్ కారణంగా కిష్టారంలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈమేరకు సైలో బంకర్‌ను మార్చడంతో పాటు స్థానికులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలని కోరారు. ఓసీ, సైలో బంకర్ పరిశీలన జేవీఆర్ ఓపెన్‌కాస్టును సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఓపెన్‌కాస్టులో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న తీరు, బొగ్గు నాణ్యత వివరాలు ఆరా తీశాక కిష్టారంలోని సైలో బంకర్‌ను పరిశీలించారు. ఆతర్వాత సత్తుపల్లి జీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులతో పలు అంశాలపై భట్టి సమీక్షించారు. విద్యుత్ వెతలు ఉండవు... తల్లాడ: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అవాంతరాలు లేకుండా సరఫరా చేసేలా అవసరమైన చోట సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తల్లాడ మండలం పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాలల్లో రూ.10.53కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్షేన్లకు పినపాకలో ఆయన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందునే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన 85 శాతం మందిని సర్పంచ్‌లుగా గెలిపించాలరని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమలరావు, జీఎం చింతల శ్రీనివాస్, పీఓలు ప్రహ్లాద్, సునీల్‌కుమార్‌వర్మ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, విద్యుత్, ఆర్అండ్బీ, జలనవరుల శాఖ ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, యాకోబు, ఎం.వెంకటేశ్వర్లు, ఏసీపీ వసుంధర యాదవ్, ఉద్యోగులు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, రాములు, సతీష్, కాపా సుధాకర్, జక్కంపూడి కిషోర్, కాపా అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం 10–30గంటలకు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పథకాల పై ఆయన సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు బోనకల్ మండలంలోని ముష్టికుంట్లలో చిరునోముల వరకు రూ.3.45 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం మధిరకు చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అలాగే, మధిర 21వ వార్డు, బయ్యారం ఆర్సీఎం చర్చి లో రాత్రి జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఇక గురువారం ఉదయం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా భట్టి పాల్గొననున్నారు. కొనుగోలు కేంద్రాలు పరిశీలన మధిర: మధిర వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఏర్పాటుచేసిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి మంగళవారం పరిశీలించారు. అడిషనల్ డైరెక్టర్ పి.రవికుమార్, మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావుతో కలిసి మాటూరు క్రాస్‌లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం, మధిర మెయిన్ రోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు భట్టు నాగమల్లేశ్వరరావు తదితరులను సన్మానించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీం, మార్కెట్ కార్యదర్శి కె.చంద్రశేఖర్, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ అమృత పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ డి.రామారావు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 22నుంచి నిర్వహిస్తున్న కంటి పరీక్షలు జనవరి 31వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా చూపు, దృష్టి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయడం వీలవుతుందన్నారు. రోజుకు 250–300మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు డీఎంహెచ్ఓ తెలి పారు. ఈ కార్యక్రమాన్ని ఆప్తమాలజీ హెచ్ఓడీ డి.రామూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుమాధవరావు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. 26న డాక్ అదాలత్ ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీన ఆన్లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. కోర్టులో ఉన్న అంశాలు మినహా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, సేవలు, పెండింగ్ అంశాల పై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈమేర కు ఫిర్యాదులను 25వ తేదీలోగా ‘డాక్ అదాల త్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, ఖమ్మం డివిజన్ – 507003’ చిరునామాకు పంపించాలని తెలిపారు. ఫిర్యాదుపై ఫోన్‌నంబర్ లేదా ఈ మెయిల్ పొందుపర్చాలని సూచించారు. సమష్టి కృషితో పశుసంపద అభివృద్ధి రఘునాథపాలెం: ప్రభుత్వ కార్యక్రమాలకు తోడు ప్రజాప్రతినిధులు, దాతలు, సంఘాలు సహకరిస్తే పశుసంపద అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. గొర్రెలు, మేకల నట్టల నివారణ మందు పంపిణీని మంగళవారం ఆయన రఘునాథపాలెం మండలం వీవీపాలెంలో ప్రారంభించి మాట్లాడారు. నట్టల నివారణ మందు ద్వారా గొర్రెలు, మేకల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కాగా, సబ్సెంటర్లో పరికరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన నాగబండి రాంబాబు, కాపా భూచక్రం, కుతుంబాక రవీందర్‌ను ఆయన అభినందించారు. సర్పంచ్‌లు కె.ఆదినారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం. జ్యోతి, ఉయ్యూరు ద్రాక్షవతి, పశువైద్యాధికారి కె.క్రాంతికుమార్, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, సొసైటీ అధ్యక్షుడు లింగయ్య, సిబ్బంది టి.కృష్ణ, డీవీ.సత్యనారాయణ, సువర్చలదేవి, మణిదీప్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసే కుట్ర
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం పేరు మార్చిందని, తద్వారా గాంధీని మరోసారి హత్య చేశారని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి పి.విశ్వనాథన్ పేర్కొన్నారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధులను తగ్గించడమే కాక కొంత వాటా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలన్న నిబంధనతో పేదలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు భవిష్యత్ ఎన్నికలకు మంచి ఊతమిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వాన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతోందని ఆయన వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు వర్ధంతి నిర్వహించగా నాయకులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కాగా, కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ను జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు, ప్రజాప్రతినిధులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రాపర్తి శరత్‌కుమార్, శెట్టి రంగారావు, వడ్డెబోయిన నర్సింహరావు, దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, మొక్క శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ●రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఏఐసీసీ కార్యదర్శి పి.విశ్వనాథన్ మంగళవారం సాయంత్రం ఖమ్మంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ●ఖమ్మంఅర్బన్: ఇటీవల ఎన్నికల్లో రఘునాథపాలెం మండలం నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కలిశారు. వీరిని అభినందించిన ఆయన ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావుతో పాటు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎల్ఎస్.. మరో విడత
● ఫిబ్రవరి, మార్చిలో నిర్వహణకు ఏర్పాట్లు ● విద్యార్థుల సామర్థ్యాల గుర్తింపునకు దోహదం ● తొలుత మూడు మాక్ టెస్ట్‌లు కూడా.. ఖమ్మంసహకారనగర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానంలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో రెండో విడత ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మూడో తరగతి విద్యార్థుల్లో భాష, గణితం, సంఖ్యాజ్ఞానం సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. జిల్లాలో 814 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. ఇందులో 5,729 మంది చదువుతున్నారు. ఇప్పటికే మొదటి ఎఫ్ఎల్ఎస్ 2022 విద్యాసంవత్సరంలో పూర్తిచేశారు. అంచనా వేసేలా.. జిల్లాలో ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) 2022 విద్యాసంవత్సరం నుంచి అమలవుతోంది. అదే ఏడాది మొదటి విడత నిర్వహించగా, విద్యార్థుల్లో భాష(తెలుగు/ఉర్దూ), గణితంలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ అధ్యయనం దోహదపడుతుందని చెబుతున్నారు. అవగాహన కోసం ప్రసుత్తం జిల్లా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ రెండో విడతకు సిద్ధం అవుతున్నారు. ఈ విడతలో అంచనా వేసే సామర్థ్యాల వివరాలు, ఏయే రంగాల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన కల్పించేలా విద్యాశాఖ, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి బుక్లెట్ రూపొందించింది. సామర్థ్యాల అంచనా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో మౌఖిక భాషా గ్రహణశక్తి, ధ్వని సంబంధిత అవగాహన, చిహ్నం–ధ్వని సంబంధం, పఠన గ్రహణశక్తి (వాక్యం–చిత్రం సరిపోల్చడం), మౌఖిక పఠన సామర్థ్యాలు, గ్రహణశక్తి, రచన సామర్థ్యాలను అంచనా వేయడమే కాక గణితంలో సంఖ్యల గుర్తింపు, ఇతర అంశాలపై విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇందుకోసం బుక్ బ్యాంక్ ఆధారంగా విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు, ఎఫ్ఎల్ఎస్ పూర్తయ్యాక విద్యాశాఖాధికారులు పలు కార్యక్రమాలు అమలు చేసే అవకాశముంది. అంతేకాక విద్యార్థుల స్థాయి అర్థమై ఉపాధ్యాయులు బోధనలో మార్పులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెబుతున్నారు. కాగా, ఎఫ్ఎల్ఎస్ అధ్యయనం రెండో విడతలో మెరుగైన ఫలితాలు నమోదయ్యేలా విద్యార్థులను మూడు భాషల్లో రూపొందించిన బుక్ బ్యాంక్ ఆధారంగా సిద్ధం చేస్తూ మూడు మాక్‌టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందుకోసం స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు.ఎఫ్ఎల్ఎస్ కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించాం. ఇందుకోసం మౌఖిక భాషా సామర్థ్యాలపై మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తాం. గణితం, సంఖ్యాజ్ఞానంపై బుక్‌బ్యాంక్ ఆధారంగా రోజువారీ అభ్యాసం చేయించనున్నాం. ఇది విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. – పెసర ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ -
నరసింహావతార రూపుడై..
భద్రాచలం: ప్రియ భక్తుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి బారి నుంచి రక్షించేందుకు వెలిసిన నరసింహావతారంలో అలంకరించిన రామయ్యను దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం నరసింహావతారంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తులకు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను నృసింహావతారంలో అలంకరించి బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక వేద పండితులు 200 పాశురాల ప్రంబంధాలను పఠించారు. వైభవంగా శోభాయాత్ర.. ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం నృసింహసేవా వాహిని సభ్యులతో పాటు అహోబిల మఠానికి చెందిన కృష్ణ చైతన్య స్వామివార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. నరసింహావతారంలో ఉన్న స్వామివారిని ప్రత్యేక పల్లకిపై కోలాట ప్రదర్శనలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అర్చకులు అవతార విశిష్టతను వివరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. గ్రామ రక్షకుడిగా స్వామివారు.. గ్రామ రక్షణార్థం స్వామి వారు నరసింహావతారంలో పురవీధుల గూండా తిరువీధి సేవ కొనసాగడం ఈ అవతారం ప్రత్యేకత అని వేదపండితులు తెలిపారు. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా, ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండేందుకే నరసింహావతారంలో స్వామి వారు పురవీధులలో సంచరిస్తారని వివరించారు. ఆ తర్వాత తిరిగి అంతరాలయానికి తీసుకెళ్లారు. -
పండుగ వాతావరణంలో...
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. సర్పంచ్‌లు, పాలకవర్గాలతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసి ముస్తాబు చేయగా, కొన్నిచోట్ల మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించారు. అయితే, పలు జీపీలకు సొంత భవనాలు లేక కొన్నిచోట్ల అసంపూర్తి భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో ఇతర ప్రభుత్వ భవనాల్లో ప్రమాణ స్వీకారం పూర్తిచేశారు. ఈ సందర్భంగా పాలకవర్గాలను స్థానికులు సన్మానించారు. -
పెండింగ్ లేకుండా పరిష్కారం
● ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు 2024–25 నుంచి పండ్లు సరఫరా చేస్తున్న తమపై పాత రేట్లతో భారం పడుతున్నందున ధరలు పరిశీలించాలని కోరారు. ● కొణిజర్ల మండలం బొట్లకుంటకు చెందిన రైతులు గ్రీన్‌ఫీల్డ్ హైవేతో చెరువు వరద పొలాల్లోకి చేరుతున్నందున సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ● రంగనాయకుల గుట్ట వద్ద మున్నేటిపై చెక్‌డ్యాంను తొలగించడమే కాక ప్రకాష్‌నగర్ బ్రిడ్జి దగ్గర చెక్‌డ్యాం ఎత్తు తగ్గించాలని పలువురు కోరారు. ● సత్తుపల్లి మండలం కొమ్మేపల్లికి చెందిన గుర్రాల తేజోరమ్మ తనకు పునరావాసం చట్టం క్రింద కేటాయించిన ప్లాట్‌ను మరోచోటకు మార్చాలని విన్నవించింది. కల్లూరు సమీపాన ఉన్న భూమిని తనతో పాటు కుమారులకు తెలియకుండా కుమార్తెలు ఇద్దరు 23కుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వృద్ధురాలినైన నాకు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నందున విచారణ జరిపించి న్యాయం చేయాలి. – తోట సక్కుభాయి, ఎర్రమాడు, ఆంధ్రప్రదేశ్ -
వరాహ రూపంలో వరాల రామయ్య
● వాగ్గేయకార వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర ● అధ్యయనోత్సవాలకు పోటెత్తిన భక్తజనం ● నేడు నరసింహావతారంలో స్వామివారుభద్రాచలం: లోకకంఠకుడైన హిరణ్యాక్షుడుని సంహరించి భూమిని తన కోరలతో పైకెత్తి లోకసంరక్షణ చేపట్టిన వరాహావతారంలో దర్శనమిచ్చిన రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. ‘వరాలు ఇచ్చే రామయ్య’ నామస్మరణతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతుండగా.. పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామిని వరాహ అవతారంలో అలంకరించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ నిర్వహించి ఆరాధన, నివేదన సమర్పించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం వేద పండితులు దివ్య ప్రబంధాలు పఠించారు. అనంతరం గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఆళ్వార్లతో సహా కొలువుదీర్చారు. వైభవంగా శోభాయాత్ర.. భద్రాచలం రామాలయానికి ఆధ్యులు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వాగ్గేయకారులు తూము నర్సింహదాసు వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారిని పల్లకీ సేవగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చారు. భక్తుల సందర్శన అనంతరం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ సాగింది. నేడు నరసింహావతారం.. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి వారిని మంగళవారం నరసింహావతారంలో అలంకరించనున్నారు. కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది. -
పోలీసుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానులపై ఖమ్మం నగర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా, ఓర్వలేని ఓ పార్టీ నేతల జోక్యంతో పోలీసులు ఏకంగా 11మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. అయితే ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసులు పెట్టారని జగన్మోహన్రెడ్డి అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. ముందే కవ్వించడంతో.. జగన్ అభిమానుల ర్యాలీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వైపు వెళ్తుండగా టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నేతల వీడియోలను చూపిస్తూ కవ్వింపునకు దిగినట్లు తెలిసింది. అయినా పట్టించుకోకుండా జగన్ అభిమానులు ముందుకు సాగారు. తిరిగి ర్యాలీ వచ్చే సమయాన టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు వద్ద ఉన్న వారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు సమాచారం. దీన్ని తట్టుకోలేని జగన్ అభిమానులు జై జగన్ అంటూ నినదించగా, ఓ అభిమాని రోడ్డు మీద బైక్‌పై ఉండి స్లోగన్స్ ఇచ్చాడు. దీన్ని ఆసరా చేసుకుని టీడీపీ కార్యాలయ వాచ్‌మన్‌తో ఫిర్యాదు చేయించారు. కేసు లేదని.. బనాయించి ర్యాలీ ముగిశాక వైఎస్సార్ కాలనీలో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు. అక్కడ ఉన్న అభిమానులను ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ రావాలని పిలవడంతో వెళ్లారు. దీంతో పోలీసులు ఏం జరిగిందో తెలుసుకుని తిరిగి పంపించేశారు. అనంతరం తెరవెనుక రాజకీయ ప్రమేయంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మళ్లీ వారిని ఆదివారం రాత్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ‘మీపై ఎలాంటి కేసు నమోదు చేయబోం’ అని పిలిపించి రాత్రంతా స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. అంతేకాక మొత్తం 11మందిపై కేసులు నమోదు చేసి అందులో ఎనిమిది మందిని సోమవారం ఉదయం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి 13 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. ఈ అక్రమ కేసుల వెనుక మంత్రితోపాటు ఆయన తనయుడి ప్రమేయం ఉందని జగన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. వీరిపైనే కేసులు పోలీసులు మొత్తం 11మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఏ1గా ప్రకాష్‌నగర్‌కు చెందిన గంగరబోయిన రవి, ఏ2గా యర్రా నాగరాజురెడ్డి దానవాయిగూడెం) పేరు నమోదు చేయగా, ఆతర్వాత వరుసగా మర్రి శ్రీనివాస్(శ్రీనగర్‌కాలనీ), ఆలస్యం సుధాకర్ (ముస్తఫానగర్), సరికొండ రామరాజు (పాండురంగాపురం), గంగారపు మురళి(రావినూతల), పగిళ్ల నరేష్(వైఎస్సార్ కాలనీ), కంచి మితేష్(రామాపురం), ముడి శివారెడ్డి(కోదాడ), కంచర్ల సాయి(గాంధీచౌక్), వెంకీ పేర్లు చేర్చారు. వీరిలో ఎనిమిది మందిని రిమాండ్‌కు తరలించారు.వైఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం ఉదయం కేక్ కట్ చేశాక భారీ ర్యాలీతో అభిమానులు సందడి చేశారు. శ్రీశ్రీ సర్కిల్ నుంచి మొదలైన ర్యాలీ ఇల్లెందు క్రాస్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రోడ్, జెడ్పీ సెంటర్, ముస్తఫానగర్, చర్చి కాంపౌండ్, కాల్వొడ్డు, రాపర్తినగర్, కేఎంసీ కార్యాలయం రోడ్, గట్టయ్య సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీ సర్కిల్, వైఎస్సార్ నగర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు.జగన్ అభిమానులు 11మందిపై క్రిమినల్ కేసులు వైఎస్ అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీ టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడ ఉన్న వారు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కానీ కార్యాలయం లోపలికి వెళ్లి వాచ్‌మన్‌ను దూషించారని, ఆఫీస్‌ను ధ్వంసం చేశారని చెప్పడం అవాస్తవం. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి.. ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న నేత తప్పుడు కేసులు పెట్టించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. – లక్కినేని సుధీర్, వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు -
విపత్తులను ఎదుర్కొనేలా..
● మున్నేటి ఒడ్డున మాక్‌డ్రిల్ ● పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులుఖమ్మంమయూరిసెంటర్: వరదలు, ఇతర ప్రమాదాలు ఎదురైనప్పుడు బాధితులను రక్షించడంతో పాటు విపత్తులను ఎదుర్కోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేలా సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మంలోని కాల్వొడ్డు మున్నేరు(బొక్కలగడ్డ) వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్నేటికి గత రెండేళ్ల నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యాన ప్రజలు తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆస్తులు నష్టపోకుండా కాపాడుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, జూన్ 2026 లోపు మున్నేటికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం జనరల్ ఆస్పత్రి వద్ద కూడా మాక్‌డ్రిల్ చేపట్టామని వెల్లడించారు. రెస్క్యూ చేస్తూ.. వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లను పంపించి రక్షించడంపై ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. అలాగే, నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీశాక వైద్య సాయం అందించడం, ఇళ్లు మునిగితే ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించే విధానాన్ని వివరించారు. అలాగే, మాక్‌డ్రిల్‌లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడకు తరలించిన వారికి వైద్యసేవలు అందించడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, విద్యుత్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈలు శ్రీనివాసాచారి, రంజిత్, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్, డీఎంహెచ్ఓ రామారావు, డీసీఎస్ఓ చందన్‌కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఏదులాపురం కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల ఉద్యోగులు అనిల్‌కుమార్, రాంప్రసాద్, ధరణికుమార్, శ్రీనివాస్, బెల్లం రాధిక, సుజాత, మాధవరావు, దివ్యశ్రీ, రాజేశ్వరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


