● కౌన్సిలర్లను తరలించిన కాంగ్రెస్ నేతలు ● ఎన్నిక రోజు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన వారిని క్యాంప్‌లకు తరలించారు. ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో గెలుపొందిన వారిని హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల క్యాంప్‌లకు తీసుకెళ్లారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినా నాయకత్వం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వీరు ప్రత్యేక బస్సుల్లో వెళ్లినట్లు సమాచారం. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే సమయానికి నేరుగా మున్సిపాలిటీలకు రానున్నారు.


