మున్సిపల్‌ ఫలితాలు.. కాంగ్రెస్‌ హవా | Telangana Municipal Elections 2026 Results Live Updates | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఫలితాలు.. కాంగ్రెస్‌ హవా

Feb 13 2026 7:03 AM | Updated on Feb 13 2026 7:39 PM

Telangana Municipal Elections 2026 Results Live Updates

Telangana Municipal Elections 2026 Results

👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివ‌రాలు

👉వార్డుల వారీగా కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు.. 

నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్‌లో ముగిసిన ఓట్ల లెక్కింపు

  • అతిపెద్ద పార్టీ గా బీజేపీ 
  • ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
  • కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమి
  • బీజేపీ    28
  • కాంగ్రెస్   18
  • ఎంఐఎం 13
  • బీఆర్‌ఎస్‌ 01

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా

  • 116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్‌ విజయం
  • 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌
  • మున్సిపల్‌ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ
     
  • రామగుండంలో కాంగ్రెస్‌ విజయం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్ర
  • పెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్‌బాబు
  • మంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్‌ కైవసం
  • రామగుండం కార్పొరేషన్‌ దక్కించుకున్న కాంగ్రెస్‌
  • రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

 

  • తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్‌
  • హంగ్‌ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్‌
  • చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ  స్కెచ్‌

 

నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు

  • 26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులు
  • కాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజ
  • ఎంఐఎం 10 డివిజన్లలో ముందంజ
  • బీఆర్‌ఎస్‌ ఒక డివిజన్‌లో ముందంజ

 

  • కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్‌
  • మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది
  • అధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారు
  • కాంగ్రెస్‌, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉంది
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది

 

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌(మొత్తం 60 డివిజన్లు)

  • ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీ
  • సీపీఐ -24చోట్ల గెలుపు
  • కాంగ్రెస్-20చోట్ల గెలుపు
  • బీఆర్‌ఎస్‌-09
  • సీపీఎం -01
  • బీజేపీ -01
     
  • నల్లగొండ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం
  • మంచిర్యాల కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం
  • రామగుండం కార్పొరేషన్‌  కాంగ్రెస్‌దే
     
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీజేపీ కైవసం

కరీంనగర్ జిల్లా:

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్

  • బీజేపీ 33
  • కాంగ్రెస్ 12
  • బీఆర్ఎస్ 9
  • ఇండిపెండెంట్స్ 6
  • ఎంఐఎం 3
  • ఆల్‌ ఇండియా ఫార్వబ్లాక్‌-3

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో  3.17pmవరకు ఫలితాలు -48

  • కాంగ్రెస్ 31

  • బీఆర్‌ఎస్‌ 12

  • బిజెపి     01

  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03

  • ఇండిపెండెంట్ 01

సిద్ధిపేట జిల్లా

  • హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం 
  • మెదక్‌: నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • నారాయణపేట: మక్తల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • వరంగల్‌: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మహబూబ్‌నగర్‌: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • రంగారెడ్డి: షాద్‌నగర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • రంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మహబూబాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మెదక్‌: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌కైవసం
  • మెదక్‌: తుప్రాన్‌మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం


కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ ఆధిక్యం

దాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్‌

  • దేవరకద్ర, కేసముద్రం, జహీర్‌బాద్‌లో హంగ్‌
  • అలంపూర్‌, ఇస్నాపూర్‌, అమరచింత, జనగామల్‌ హంగ్‌
  • ఆసిఫాబాద్‌, జమ్మికుంట,జిన్నారంలో హంగ్‌
  • మహబూబాబాద్‌,బోధన్‌, వేములవాడ, ఆలియాబాద్‌లో హంగ్‌
     

జగిత్యాల జిల్లా :

  • ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌
  • 15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసం
  • మొత్తం స్థానాలు 15
  • 15స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన  బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
  • ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు

ఖమ్మం:

  • వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

 

  • కొడంగల్‌ మున్సిపాలిటీ  కాంగ్రెస్‌ కైవసం

నిజామాబాద్ జిల్లా:

  • ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన
  • 16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్

కరీంనగర్ జిల్లా:

  • తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ల్లో 30 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న  బీజేపీ

రాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్‌ఈసీ రాణి కుమిదిని

  • ఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.
  • సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.
  • బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.
  • 16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.
  • మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు

 

సిద్దిపేట

  • చేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:

ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్

మహబూబాబాద్ జిల్లా;

మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

  • మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళన
  • కౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్  లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం
  • 4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్  జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపు
  • జ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలు
  • క్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
  • పోలీసుల రంగ ప్రవేశం
  • ఆభ్యర్ధిని కౌంటింగ్  హలోకి పంపిన పోలీసులు
  • మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసన

ఖమ్మం జిల్లా

  • కల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 

నిజామాబాద్ జిల్లా:

  • ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

రాజన్న సిరిసిల్ల జిల్లా

  • వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులు
  • కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులు
  • బయటకు నెట్టేసిన పోలీసులు..
  • కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు
  • ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులు
  • పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌ నేతలు, తోపులాట
  •  

ధర్మపురిలో సంచలన ఫలితాలు..

  • ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.
  • ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఘోర పరాభవం.
  • 15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..
  • రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు..
  •  

హంగ్‌ ఎఫెక్ట్‌.. స్వంత్రులకు గిరాకీ.. 

  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటాపోటీ.
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య గట్టి పోటీ.
  • దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్‌లో హంగ్‌.
  • అలంపూర్‌, ఇస్నాపూర్‌, అమరచింత, జనగామలో హంగ్‌.
  • ఆసిఫాబాద్‌, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్‌.
  • బోధన్‌, వేములవాడ, అలియాబాద్‌లో హంగ్‌.
  • ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. 
  •  

కాంగ్రెస్‌ ఆధిపత్యం.. 

  • మధిరలో కాంగ్రెస్‌ ఘన విజయం
  • మధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్‌ కైవసం.
  • ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్‌ఎస్‌
  • మెదక్‌ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మహబూబ్‌నగర్‌ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్‌ విజయం
  • సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం.
  • మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.
  • ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ విజయం
  • పెబ్బేరు కాంగ్రెస్‌ కైవసం. 

 

  • పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం
  • ఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌  కైవసం
  • సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
     

బీఆర్‌ఎస్‌ జోరు.. 

  • భీంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.
  • తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం.
  • 15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్‌ఎస్‌ విజయం.
  • క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్‌ కైవసం. 
  • కొడంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం. 

మూడు చోట్ల హంగ్‌.. 

  • కేస సముద్రం, అలంపూర్‌, ఇస్నాపూర్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌.
  • కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ విజయం.
  • అలంపూర్‌లో చెరో ఐదు చోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గెలుపు. 
     

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీ.. 

  • సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం.
  • 39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.
  • 14 వార్డుల్లోనూ బీఆర్‌ఎస్‌ విజయం.
  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.
  • ఘన్‌పూర్‌లో 18 స్థానాల్లో కాంగ్రెస్‌-13, బీఆర్‌ఎస్‌-5.
  • హుజురాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.
  • హుజురాబాద్‌ 30 స్థానాల్లో కాంగ్రెస్‌-16, బీఆర్‌ఎస్‌-8, బీజేపీ-5
  • ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో హంగ్‌.
  • ఇస్నాపూర్‌లో 26 స్థానాల్లో బీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-10, ఇతరులు-4
  • జనగామలో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం.
  • జనగామలో 30 స్థానాల్లో బీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-12, ఇతరులు-4

గాంధీభవన్‌లో సంబురాలు..

  • హైదరాబాద్..
  • గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సంబురాలు.
  • బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు.

 

👉ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ హవా.

👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం. 

 

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

  • ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..
  • 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ గెలుపు
  • ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ విజయం. 

ఖమ్మంలో కాంగ్రెస్‌ హవా..

  • మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్‌ కైవసం. 

 

  • కొల్లాపూర్‌, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్‌ వశం..
  • ఐజా మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ విజయం.  

కామారెడ్డిలో కాంగ్రెస్‌ హవా..

  • బాన్సువాడ మున్సిపాలిటీని  కైవసం చేసుకున్న కాంగ్రెస్
  • మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన  కాంగ్రెస్.
  • 19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్  విజయం.
  • 3 వార్డుల్లో బీజేపీ విజయం
  • 2 వార్డుల్లో స్వతంత్రులు
  • ఒక వార్డులో బీఆర్‌ఎస్‌ విజయం.

 

కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.

  • 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
  • 2 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం.
  • బోణీ కొట్టని బీజేపీ.
  • కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా.

 

👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు అందించిన అధికారులు

👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్‌ఎస్‌, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.

దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

  • మొత్తం 20 వార్డులు
  • కాంగ్రెస్-11
  • బీఆర్ఎస్-6 
  • ఇండిపెండెన్స్-2
  • బీజేపీ-1
     

 

ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్‌.. పలు చోట్ల హంగ్

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీ.. 

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం
  • చిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్‌ విజయం. 

మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం. 
మరిపెడ 15..

  • కాంగ్రెస్‌-8
    బీఆర్‌ఎస్‌-6

 

చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

చండూరు(10)

  • కాంగ్రెస్‌-7
  • బీఆర్‌ఎస్‌-2
  • సీపీఐ-1

చిట్యాల కాంగ్రెస్‌ విజయం.

చిట్యాల (12)

  • కాంగ్రెస్‌-9
  • బీఆర్‌ఎస్‌-2

 

  • హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • హాలియా 12..
  • కాంగ్రెస్‌-8
  • బీఆర్‌ఎస్‌-2

 

  • గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం.
  • గుమ్మడిదల 22
  • బీఆర్‌ఎస్‌-14
  • కాంగ్రెస్-4
  • బీజేపీ-2

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీ.. 

  • హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం.
  • మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.
  • 22 వార్డుల్లో కాంగ్రెస్‌ 16 విజయం.
  • వేములవాడలో​ బీజేపీ ఆధిక్యం.
  • కోహిర్‌లో (16) ఇలా..
    కాంగ్రెస్‌-6
    బీఆర్‌ఎస్‌-5
    బీజేపీ-1

 

నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం.

  • నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్‌
  • నందికొండలో మొత్తం 12 వార్డులు.
  • కాంగ్రెస్‌-11
  • బీఆర్‌ఎస్‌-1 

 

గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులు
  • బీఆర్‌ఎస్‌-14
  • కాంగ్రెస్-3
  • ఇండిపెండెంట్‌-1.

 

ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు

  • 12వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కిషోర్‌ గెలుపు
  • 13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు
  • 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపు
  • మూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.
  • 16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం

 

కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం

  • హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం
  • ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు
  • 4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం
  • 5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం
  • 6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం
  • 7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం

బీఆర్‌ఎస్‌ హవా..

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
  • ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్
  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత  గెలుపు
  • మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్
  • మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపు
  • సంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం...

 

ములుగులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు

  • ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఖాతా తెరిచింది.
  • ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

విజయాలు ఇలా.. 

  • జగిత్యాల పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ.
  • వరంగల్‌ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ లీడ్‌.
  • వైరా మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌లో ఏడు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం.
  • కొల్లాపూర్‌ 6,14 వార్డుల్లో కాంగ్రెస్‌ అ‍భ్యర్థుల గెలుపు. 
     

అభ్యర్థుల విజయాలు..

  • యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్‌ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపు
  • మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం.
  • మూడు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యం.
  • సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం.
  • ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ గెలుపు.
  • 100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి.
  • ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్‌ గెలుపు.
  • గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ విజయం. 

 

ఆధిక్యం ఇలా.. 

  • మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్‌ లీడ్‌.
  • ఆసిఫాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ లీడ్‌.
  • యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్‌ వార్డులో బీజేపీ గెలుపు.
  • ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం.
  • నాగర్‌ కర్నూల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం.
  • నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ లీడ్‌.
  • నిర్మల్‌, ఖానాపూర్‌ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. ‌

నల్లగొండ జిల్లా

  • హాలియా మున్సిపాలిటీలో
  • పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు
  • కాంగ్రెస్ :32
    టీఆర్ఎస్ :8
    బీజేపీ : 1 
    ఇండిపెండెన్స్ :2
    నోటా: 1
  • మొత్తం: 44


చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

  • బీజేపీ:1
    కాంగ్రెస్:2
    టీఆర్ఎస్:1

 

ఆధిక్యాలు ఇలా.. 
 

  • ఆదిలాబాద్‌..
  • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ.
  • ఖమ్మం జిల్లా
  • మధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్  ఫలితాల్లో   కాంగ్రెస్  ఆధిక్యం.
  • మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ముందంజ.
  • కాంగ్రెస్ -29
  • బీఆర్‌ఎస్‌ -5
  • నోటా -1
     

సంగారెడ్డి

  • సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
  • మొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం
  • 3 వార్డుల్లో BRS ఆధిక్యం

క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తు

  • హైదరాబాద్..
  • క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తు
  • ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు
  • నగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు
  • 350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్
  • నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపు
  • ఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలు

బీఆర్‌ఎస్‌ ఆగ్రహం

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
  • అశ్వారావుపేట కౌంటింగ్ హాల్‌లో అధికారుల తీరుపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం..
  • అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్‌ఎస్‌ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆందోళన
  • అందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు

బీజేపీ అభ్యర్థి మృతి.. 

  • మంచిర్యాల..
  • లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.
  • ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.

బీజేపీ లీడ్‌.. 
కరీంనగర్ జిల్లా:

  • కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ లీడ్.
  • పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.
  • పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.

కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
  • కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.
  • వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.
  • ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.
  • పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.
  • కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.
  • కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC.
     

👉మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం 

  • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు

స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్‌.

  • కరీంనగర్ జిల్లా:
  • హుజురాబాద్‌లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్‌.
  • గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.

కాసేపట్లో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ‍ప్రారంభం

  • కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత

  • ఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ

  • కౌంటింగ్‌ కేంద్రాల సందడి వాతావరణం,. 

  • క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు

 

ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్‌ కీలక ఆదేశాలు

  • ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
  • ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ జూమ్ మీటింగ్
  • ఫలితాలపై అలర్ట్‌గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.
  • హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్‌ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..
  • ఇంకా క్యాంప్‌లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..
  • ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్‌కు అడగాలని సూచించిన మహేష్‌ కుమార్‌. 

ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..

  • తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.
  • పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.
  • పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.
  • SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.
  • కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం
  • 2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులు
  • ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత
  • ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
  • ఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
  • అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలు

కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ

  • కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్‌రెడ్డి
  • లెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రత
  • పోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌
  • ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘా
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షణ
  • కౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలు
  • అన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి
     

మరికాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం.. 

  • ఉదయం 8 గంటలకే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం  

  • తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 

  • 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు 

  • కాంగ్రెస్‌ దూకుడు ప్రదర్శిస్తుందా? 

  • బీఆర్‌ఎస్‌ పట్టునిలుపుకొనేనా? 

  • బీజేపీ నిలబడేనా?

  • ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

  • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు.. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement