రెండు శాతం ఓట్ల పార్టీకి చైర్‌పర్సన్‌ పీఠమా? | Janasena Leaders Fire On Minister Sandhyarani | Sakshi
Sakshi News home page

రెండు శాతం ఓట్ల పార్టీకి చైర్‌పర్సన్‌ పీఠమా?

Nov 13 2026 11:18 AM | Updated on Nov 13 2026 11:24 AM

Janasena Leaders Fire On Minister Sandhyarani

సాక్షి, పార్వతీపురం మన్యం: సాలూరు మున్సిపల్‌ ఎన్నికల వేడి చల్లారినా.. కూటమిలో రాజకీయ సెగలు మాత్రం తగ్గడం లేదు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య రాజుకున్న విభేదాలు ఇప్పుడు మరోసారి బహిరంగ యుద్ధానికి దారితీస్తున్నాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని జనసేన దక్కించుకున్నప్పటికీ.. ఆ విజయానికి ముందు జరిగిన రాజకీయ పరిణామాలు మాత్రం ఇంకా ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. తాజాగా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గొర్లె విజయకుమారితో పాటు జనసేన నాయకులు మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సాలూరు రాజకీయా ల్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. 

కూటమి ధర్మానికి తూట్లు పొడిచారా? 
మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని మంత్రి సంధ్యారాణి విస్మరించారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపి వారికి మద్దతు పలికారని, తద్వారా జనసేన అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించరని మండిపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ ఒకే విధంగా బీరువా గుర్తు వచ్చేలా చేయ డం వెనుక కూడా అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఒక్కసారి కూడా జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయలేదని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను జనసేన తరఫున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన గొర్లె విజయకుమారి, ఆ పార్టీ నాయకులు గొర్లె తిరుపతినాయుడు, జరజాపు సూరిబాబు బహిరంగంగా వెల్లడించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి తీరుపై కూటమి పెద్దలకు ఫిర్యాదు చేస్తామ ని వారు స్పష్టం చేస్తున్నారు.
 
రెండు శాతం ఓట్ల పార్టీకి చైర్‌పర్సన్‌ పీఠమా? 
ఈ వివాదానికి ఎన్నికలకు ముందే బీజం పడింది. సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై మంత్రి సంధ్యారాణి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రెండు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకు చైర్‌పర్సన్‌ టికెట్‌ కేటాయించడ మేంటంటూ ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించిన ట్లు జనసేన నాయకులు గుర్తుచేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గా ల్లో చర్చ సాగింది. జనసేనకు అధికారికంగా బీఫా రాలు అందించినప్పటికీ, గతంలో హామీ ఇచ్చిన కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు ప్రోత్సహించారనే ఆరోపణ లు కూడా వినిపించాయి. వీటన్నింటినీ ప్రస్తావిస్తు న్న జనసేన నేతలు.. ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 

ఓటముల సెగ.. కొత్త వివాదాల తలపోటు! 
ఇప్పటికే సాలూరు మున్సిపల్‌ పీఠంతో పాటు సాలూరు, మక్కువ మండలాల జెడ్పీటీసీ స్థానాల ను కోల్పోయిన మంత్రి సంధ్యారాణికి తాజా పరి ణామాలు మరో రాజకీయ చిక్కుగా మారాయి. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య పైస్థాయిలో సఖ్యత కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థి తి అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల సమయంలో మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగ విమర్శల స్థాయికి చేరింది. 

ఒకవైపు కూటమి ఐక్యతను చాటుకోవాల్సిన సమయంలో.. మరోవైపు భాగస్వామ్య పార్టీల నేతలే పరస్పరం ఆరోపణలు చేసు కోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జనసేన నేతలు మంత్రి తీరుపై గళమెత్తుతుంటే.. మరోవైపు మంత్రి సంధ్యారాణి మాత్రం ఇప్పటివరకు ఈ ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేదు. దీంతో సాలూరు కూటమిలో నెలకొన్న విభే దాలకు అధిష్ఠానం ఎలా ముగింపు పలుకుతుంద న్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో ముగిసిందనుకున్న పోరు.. ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. గ్లాసు పార్టీలో రగులుతు న్న అసంతృప్తి కూటమికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందో చూడాలి!   

ఇదీ చదవండి: ‘నీ ఇష్టం వచ్చింది చేసుకో’..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement