breaking news
Municipal elections
-
ప్రత్యేకాధికారుల చేతుల్లోకి ‘పురపాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలు సహా 11 మేయర్, 75 మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. పదవీ కాలం ముగియడానికి ముందే ఆ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గత ఏడాది సెపె్టంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే.. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల ఏర్పాట్లు వంటివి ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పిఠాపురం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల స్థాయిని పెంచింది. ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. కాకినాడ నగర కార్పొరేషన్లో ప్రత్యేకాధికారుల పాలనను ఈ నెల 16 నుంచి మరో 6 నెలల పాటు పొడిగించింది. -
ఆ పార్టీలతో జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ..ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ..జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. రెండు పార్టీల ను ఎప్పటికప్పుడు ఐకమత్యంతో సమర్థంగా ఎదుర్కోవాల ని సూచించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా.. ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిపి ఒకసారి, విడివిడిగా మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు, వాటి అమలుకు చేసిన ఖర్చు తదితరాలపై నేతలకు సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. బలం మరింత పెంచుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.. ‘ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లు రాబట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలి..’ అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. ఎంఐఎంపై విస్తృతంగా చర్చిద్దాం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్‌గాంధీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇటీవలి ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. పార్టీ చెబుతున్నట్టుగానే బీసీలకు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. ఇకపైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం..’ అని చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర నేతల చిత్తశుద్ధిని ప్రశంసిచిన హైకమాండ్ పెద్దలు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకున్న బీజేపీ తీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమని మీనాక్షి నటరాజన్ సూచించగా, దీనిపై పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. కాగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తమతమ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. «రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని ఉత్తమ్ చెప్పారు.మార్చి 15 నాటికి పదవుల పంపకాలుఎన్నో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ, అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తిచేసి, ఆ తర్వాత మరో పది రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్ విప్, రెండు విప్ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని సమాచారం. రెడ్డి లేదా వెలమ సామాజికవర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యవర్గ కూర్పుపైనా చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గ నేతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.పిలిస్తే మేడారం వచ్చే వాళ్లం కదా..సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి వివరించగా..ఖర్గే, రాహుల్‌లు మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క, సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా జాతీయ స్థాయి సినిమా రూపొందించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్, ఖర్గే అనగా..సమయాభావంతో వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు సీతక్క వివరణ ఇచ్చారు. ఈసారి తప్పకుండా అధికారిక ఆహా్వనం అందజేస్తామని చెప్పారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్, ఖర్గే అన్నారు. కాగా అందరితో కలిసి చర్చించిన పార్టీ అగ్రనేతలు, అనంతరం మంత్రుల కోరిక మేరకు విడివిడిగా ఒక్కో నేతతో 5–10 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సురేఖ పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. -
తొలి అడుగు తడబాటు
సాక్షి, హైదరాబాద్: ‘మొదటిసారి ఎన్నికల్లో గెలవడం ఈజీ నే. కొత్తవారైనందున ఓటర్లలో సహజంగా ఉండే అభిప్రాయంతో పాటు ఇందుకు అనేక కారణాలుంటాయి. కానీ రెండోసారి, మూడోసారి గెలవడం అంత సులువు కాదు. ప్రజల మన్ననలు ప్రతిసారీ పొందాలంటే చాలా కష్టపడాలి. అసలు రాజకీయమంటే ఏంటో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుస్తుంది.’.. కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పే మాట ఇది. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని, ఓటు బ్యాంకు కాపాడుకోవాలని, పట్టు కోల్పోవద్దని.. అలా జరగాలంటే అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండాలని ఆయన చెబుతుంటారు. కానీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఈ విధంగా తొలి అడుగు వేయడంలో పూర్తిగా తడబడ్డారు. పట్టణ ఓటరు నాడి అర్థం కాకనో, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకనో కానీ పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోయారు. చివరకు చైర్మన్లు, మేయర్లను ఎలాగోలా గెలిపించుకున్నా.. తొలిసారి ఎమ్మెల్యేలున్న చాలా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం గమనార్హం. కానీ ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లకు పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీని చూసి ఓటేయాలా? ఎమ్మెల్యే వైపు ఉండాలా? పాలన సరిగా లేదని ప్రతిపక్షం వైపు చూడాలా? అనే విషయాల్లో అస్పష్టత వల్లే ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందని వారు అభిప్రాయపడుతున్నారు.అంచనాల్లో వైఫల్యం! ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇదే ఫలితం కనిపించింది. పార్టీ ఏదైనా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు తమ మున్సిపాలిటీల్లో పట్టు కనబర్చలేకపోయారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల తీరును తొలిసారి ఎమ్మెల్యేలు అంచనా వేయలేకపోయారని, అనుభవరాహిత్యంతో పాటు ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో వైఫల్యం కారణంగానే ఇలాంటి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ వెనుకబడ్డారని, సీనియర్లయిన మాజీలతో తలపడాల్సి వచ్చిన చోట్ల జూనియర్ ఎమ్మెల్యేల పాట్లు అన్నీ ఇన్నీ కావని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.తొలిసారి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హంగ్ ఫలితాలిలా.. » మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ కంటే రెండు వార్డులే ఎక్కువ వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇదే నియోజకవర్గంలోని కేసముద్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సమాన స్థాయిలో వార్డులు వచ్చాయి. » పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ వార్డులు వచ్చాయి. » ఖానాపూర్ నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్, బీజేపీల కంటే తక్కువ స్థానాల్లో ఆ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. » ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నప్పటికీ ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » ముథోల్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా భైంసా మున్సిపాలిటీలో ఆ పార్టీ గెలిచింది కేవలం ఆరు వార్డు స్థానాలనే. » సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా దాని పరిధిలోని కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కంటే తక్కువ స్థానాల్లో కమలం పార్టీ గెలిచింది. » జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా 13 వార్డుల్లో గెలిచినా మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. » వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తన మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెల్చుకోలేకపోయారు. » నారాయణపేట నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి పట్టు ప్రదర్శించలేకపోయారు. అక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్‌కు రెండు వార్డులు తక్కువ వచ్చాయి. » కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమనగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే వార్డు రావడం గమనార్హం. » మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్‌రావు ఎమ్మెల్యేగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆధిక్యత లభించలేదు. » దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్ కూడా తడబడిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేల్లో ఉన్నారు. ఆయన నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు వచి్చనా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » కోరుట్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడ బీజేపీ కంటే నాలుగు స్థానాలు తక్కువ వచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కు కూడా బీఆర్ఎస్తో సమానంగా వార్డులు వచ్చాయి. » వేములవాడలో ఆది శ్రీనివాస్‌కు మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు కౌన్సిలర్ స్థానాలు తక్కువ పడ్డాయి. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌కు రావడం గమనార్హం. » హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, జమ్మికుంటలో మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఆ పార్టీ తక్కువ వార్డుల్లో గెలిచింది. » ఆలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీతో సమానంగా మాత్రమే వార్డులు దక్కించుకోగలిగారు. » చెన్నూరులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న వివేక్ కూడా తన నియోజకవర్గ కేంద్రంలో మెజార్టీ సాధించలేకపోయారు. కమలం పార్టీలో కంగారు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కొత్త కంగారు మొదలైంది. పట్టణ ప్రాంత ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారనే అంచనాలతో కోటి ఆశలతో వెళ్లిన ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. అసలే ఓటింగ్ శాతం తగ్గి కేవలం ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితమైన బీజేపీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఫస్ట్ టైమర్లే. రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు గతంలోనూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మిగిలిన ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఓడించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్‌గా అవతరించిన వెంకటరమణారెడ్డి (కామారెడ్డి)తో సహా హరీశ్‌బాబు (సిర్పూర్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), రామారావు పవార్ (ముథోల్), పైడి రాకేశ్‌రెడ్డి (ఆర్మూరు), ధన్పాల్ సూర్యనారాయణ (నిజామాబాద్ అర్బన్)లు తమ నియోజకవర్గాల్లోని పట్టణ ప్రజల ఆదరణ పొందలేకపోయారు. ఇక బీజేఎల్పీ నాయకుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్) కూడా తన పట్టు నిరూపించుకోలేక చతికిలపడాల్సి వచ్చింది. ఈ ఎమ్మెల్యేలు మాత్రం ‘గెలిచారు’ మొదటిసారి గెలిచినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు పట్టణ ఓటర్ల ప్రజాదరణ పొందగలిగారు. ఈ జాబితాలో మేడిపల్లి సత్యం (చొప్పదండి), వీర్ల శంకరయ్య (షాద్‌నగర్), మట్టా రాగమయి (సత్తుపల్లి), జైవీర్‌రెడ్డి (నాగార్జునసాగర్), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), బి.లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ) తదితరులున్నారు. ఇక మొదటిసారి గెలిచి మంత్రులుగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి)లు కూడా తమ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో మంచి విజయాలు సాధించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నియోజకవర్గ కేంద్రంలో అయితే అన్ని వార్డులనూ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. సీనియర్లు కొందరు సైతం.. సీనియర్లు కొందరు ఈ మున్సిపల్ ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్నారని ఫలితాలను బట్టి తెలుస్తోంది. తమ అనుభవంతో నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో వారు పార్టీని గెలిపించగలిగారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర, శ్రీధర్‌బాబు, గడ్డం ప్రసాద్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రధాన ప్రతిపక్షంలోని కేసీఆర్, కేటీఆర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. -
బాల్క సుమన్ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నాం.’అని పేర్కొన్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.క్యాతన్ పల్లిలో @BRSparty కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని… pic.twitter.com/h9VQ7Nmh4I— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2026 -
8లో 7 కాంగ్రెస్‌కే..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో వాయిదా పడిన 11 చోట్ల మంగళవారం ఎన్నికలు నిర్వహించగా అందులో ఎనిమిది చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో మూడు చోట్ల వాయిదా పడింది. 8 మున్సిపాలిటీల్లో ఏడు చైర్పర్సన్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే.. ఒక్కచోట బీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించిన ఏడు మున్సిపాల్టీల్లో.. రెండింటిని టాస్‌తో గెలుపొందడం విశేషం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, తొర్రూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎక్స్‌అఫీ షియో ఓట్లతో కలుపుకొంటే సమానంగా ఓట్లు రావడంతో చైర్పర్సన్ పీఠం కోసం ఎన్నికల అధికారులు టాస్ వేయగా.. రెండుచోట్ల కూ డా కాంగ్రెస్‌కు చైర్పర్సన్ పీఠాలు దక్కా యి. ఇక కాగజ్‌నగర్‌లో బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంతో అక్కడ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటే.. వైస్‌చైర్మన్ స్థానాన్ని బీజేపీ సాధించింది. కాగా ఇబ్రహీంపట్నం ము న్సిపాలిటీలో ఎన్నిక ప్రక్రియ సగం వరకు అయిన తరువాత హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు రావడంతో.. ఎన్నిక ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇది కాకుండా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వా యిదా పడ్డాయి. ఈరోజు కూడా బద్ద శత్రువుల్లా వ్యవహరించే పార్టీలు ఒకరికొకరు సహకరించుకోవడం విశేషం.ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ఇలా..ఇంద్రేశంలో బీఆర్ఎస్.. జహీరాబాద్‌లో కాంగ్రెస్.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక మంగళవారం జరిగింది. ఇందులో ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, జహీరాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇంద్రేశంలో 18 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, 9 బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు వచ్చింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ బీఆర్ఎస్ గూటికి చేరడంతో గులాబీ పార్టీకి చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పదవులు దక్కాయి. చైర్‌పర్సన్‌గా కుశంగుల ప్రమీల ఎన్నికయ్యారు. » జహీరాబాద్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలో హైడ్రామా కొనసాగింది. ఈ ఎన్నిక నిర్వహించిన అధికారుల తీరును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మొత్తం 37 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ మూడు, ఎంఐఎం రెండు, ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ షెట్కార్, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తమ ఎక్స్అఫీషియో ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు స్వతంత్రులు అనుకూలంగా ఓటేయడంతో చైర్మన్‌గా ఎండీ యూనూస్ ఎన్నికయ్యారు. వైస్‌చైర్‌పర్సన్ పదవి మాత్రం స్వతంత్ర కౌన్సిలర్‌కు వచ్చింది. ఓరుగల్లు హస్తం క్లీన్‌స్వీప్...! బీఆర్ఎస్ చేజారిన తొర్రూరు... డోర్నకల్, జనగామల్లోనూ కాంగ్రెస్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌ను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే 9 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్న కాంగ్రెస్.. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం జరిగిన ఎన్నికల్లో మూడింటినీ గెలుచుకుంది. లాటరీ తీసిన జనగామ, తొర్రూరులలో కూడా బీఆర్ఎస్కు ‘లక్కీ’ కలిసిరాలేదు. లాటరీలో అదృష్టం కలిసిరాక అవి ‘చేతి’కి చిక్కాయి. డోర్నకల్‌లో కూడా హస్తంపరమైంది. » జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉద్రికతల మధ్య కొనసాగింది. జనగామలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన తర్వాత కూడా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు రాగా...బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్కు సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు డ్రా తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రావటంతో ఆమెను చైర్మన్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేపట్టారు. » జనగామ ఎన్నిక ప్రక్రియలో చేతులెత్తే పద్ధతితో బాలమణి, సుధాకర్‌లు ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో, లాటరీ ద్వారా ఎన్నిక నిర్వహించారు. మొదట కాంగ్రెస్ చేతులెత్తే ప్రక్రి య పూర్తికాగా, ఆ తర్వాత బీఆర్ఎస్ వంతు వచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు మద్దతు గా 8వ వార్డుకు చెందిన మహిళా కౌన్సిలర్ మంజుల చేతిని పైకి ఎత్తగా, కాంగ్రెస్‌కు చెందిన కరుణాకర్ రెడ్డి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు ఆమె చేయిని లాగు తూ ఓటు వేయొద్దని కిందికి అనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. దయాకర్‌రావు కన్నీటిపర్యంతం నర్సింహులపేట: ‘45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గపు పాలన, చూడలేదని, కక్షసాధింపు, మోసం రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా.. తప్పుకోవాలా..అనిపిస్తుంది. నా ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లెందు కాంగ్రెస్‌కే... ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి 19 మంది కాంగ్రెస్ సభ్యులు, రెబల్, స్వతంత్ర సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా ప్రిసైడింగ్ అధికారి మధు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత రెండో వార్డు నుంచి గెలుపొందిన దొడ్డా కిరణ్ మిత్రాను చైర్‌పర్సన్‌గా, 17వ వార్డు నుంచి ఎన్నికైన పెండేలా రాజును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి..!
మహబూబాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చైర్మన్ ఎన్నిక తీరును ఎర్రబెల్లి తప్పుబటట్టారు ‘ కష్టపడి పనిచేసిన కార్యకర్తలక నేనేం సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తుంది. . నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం వ్యవహరించింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది. బీజేపీకికానీ, ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేద. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి. బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీఠం చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు భావోద్వాగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా తొర్రూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బేటాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీచార్జి వంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. -
Balamani: లాటరీ విధానంలో కాంగ్రెస్‌కు దక్కిన అదృష్టం
-
చైర్మన్ పదవుల కోసం బీజేపీ-కాంగ్రెస్ అక్రమపొత్తులు: హరీష్
-
రణరంగమైన ఛైర్మన్ ఎన్నిక.. వివేక్ కారుపై రాళ్లదాడి
సాక్షి, మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయిపై రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్పగాయాలయినట్లు తెలుస్తోంది.ఎన్నికల కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పెద్దఎత్తున గూమిగూడారు. అనంతరం పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం అక్కడ మున్సిపల్ ఎన్నిక వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. సరైన మోజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారంటూ ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రావాలంటూ నిరనస చేపట్టారు. నిన్న11 చోట్ల కోరం సరిగ్గా లేకపోవడంతో వాయిదాపడిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలను అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ కాంగ్రెస్ కైవసం ఛైర్పర్సన్ షాహిన్ సుల్లానా (కాంగ్రెస్) వైస్ ఛైర్పర్సన్ లావణ్య (బీజేపీ) సంగారెడ్డి జిల్లాజహీరాబాద్ కాంగ్రెస్ కైవసం మున్సిపల్ ఛైర్మన్‌గా యూనస్ వైస్‌ఛైర్మన్‌గా శిరీషమహబూబాబాద్ జిల్లాతొర్రూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంలక్కీడ్రాలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి జనగామ జిల్లాజనగామ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసంలక్కీడ్రాలో కాంగ్రెస్ సొంతంఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని పల్లా ఆగ్రహంకౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన అదృష్టంజనగామ మున్సిపల్ ఎన్నికపై ఉత్కంఠకాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానంగా ఓట్లుదీంతో లక్కీడ్రా ద్వారా చైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక దీంతో ఇండిపెండెంట్లను ప్రభావితం చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహాంసంగారెడ్డి జిల్లాఇంద్రేశ్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం ఛైర్‌పర్సన్‌గా ప్రమీల,వైస్‌ఛైర్మన్‌గా హరీశ్ రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ గెలుపుపటాన్చెరు మున్సిపాలిటీల్లో ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశంఐదింట ఐదు గెలిచి క్లీన్‌స్వీప్ చైసిన బీఆర్ఎస్ -
11 మున్సిపాలిటీ ఛైర్మన్లకు నేడు ఎన్నిక
సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో పలు కారణాలతో వాయిదాపడ్డ 11 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక నేడు అధికారులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొర్రూరుతో పాటు జనగామ మున్సిపాలిటీల ఛైర్మన్ స్థానాలకు సమాన స్థానాలు రావడంతో అధికారులు డ్రా ద్వారా ఛైర్మన్‌ని ఎన్నిక చేయనున్నట్లు సమాచారం అందుతుంది.జనగామా మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియో స్థానాలతో కలిసి కాంగ్రెస్ 16, బీఆర్ఎస్16 స్థానాలు వచ్చాయి. అయితే ఈ ఛైర్పర్సన్ స్థానంకోసం అధికారులు డ్రా తీసే అవకాశం కనిపిస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఇదివరకే ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు.మరోవైపు తొర్రూరు మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాంతంలో కూడా ఎక్స్ అఫిషియోతో కలిసి కాంగ్రెస్‌కు 9, బీఆర్ఎస్ 9, స్థానాలు వచ్చాయి. దీంతో ఇక్కడ కూడా డ్రా తీసే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇదివరకే వివాదం నెలకొంది. ఎంపీ కావ్య ఎలా ఓటు వేస్తారనే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంతో శాంతిభద్రతల రీత్యా 144 సెక్షన్ విధించారు. ఎస్పీ ఆధ్యర్యంలో 700మందితో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.నిన్న 11 మున్సిపాలిటీల్లో కోరం లేకపోవడంతో పాటు పలు కారణాలతో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలు రద్దయ్యాయి. అవి ఇబ్రహీంపట్నం, తొర్రూర్, సుల్తానాబాద్, కాగజ్‌నగర్..ఇల్లందు, క్యాతన్‌పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ జనగామ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది. -
పురపాలికల్లో పై‘చేయి’
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లతోపాటు సింహభాగం మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను తన ఖాతాలో వేసుకుంది. కనీసం 90 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టణ స్థానిక సంస్థల్లో పట్టు సాధించగలిగింది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో భాగంగా 81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.వీటితోపాటు నలుగురు స్వతంత్రులు, ఒక ఏఐఎఫ్ బీ అభ్యర్థి గెలుపొందిన స్థానాలు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే వచ్చాయి. ఈక్రమంలో మరో 11 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్చైర్మన్ల ఎంపిక ప్రక్రియ మిగిలి ఉండగానే, 86 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక, పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ పీఠాలు తమవేననే ధీ మా అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం. ఆది నుంచీ ఆచితూచి పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ నాయకత్వం సమన్వయంతో వ్యవహరించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. వీరికి తోడు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు, పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారు పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.పీసీసీ ఏర్పాటు చేసిన వార్‌రూం కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికల దిశలో నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. ప్రతి రోజూ ఎన్నికల సరళిని పర్యవేక్షించిన ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేశారు. గత నెలలో తన విదేశీ పర్యటనకు ముందు, ఆ తర్వాత రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్లను నేరుగా తన మాటలతో ఢీ కొట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగలిగారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయం దిశగా ముందుకు నడిపించారు. మెదక్‌లోనే... ఓ మోస్తరు పోయిన దగ్గరే వెతుక్కోవాలనే నానుడి చందంగా.. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో కొంతమేరకు ప్రతికూల ఫలితాలు వచి్చన ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాని నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునే విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 90శాతానికి పైగా దక్కించుకోగా, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు, మెదక్‌లో ఓ మోస్తరు ఫలితాలను సాధించగలిగింది.మరీ ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పట్టుపట్టి మరీ అధికార పార్టీ చేజిక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత స్థానం కావడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠంపై కూర్చోగలిగింది. సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఒక మెట్టు తగ్గి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వడంలోనూ తాము చాకచక్యంగా వ్యవహరించామ ని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి.ఇక్కడ మేయర్ పీఠం సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్తులో చేసే రాజకీయ పదవుల డిమాండ్‌కు చెక్ పెట్టగలిగామని అంటున్నాయి. ఇక, పుర పీఠాలనూ ఎక్కువ శాతం బీసీ వర్గాలకు కేటాయించామని, ఆయా వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాలతోపాటు రిజర్వు చేయని మున్సిపాలిటీలను కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించామని చెబుతున్నాయి. తాము చెప్పిన విధంగా 50 శాతం కంటే ఎక్కువ బీసీలకు అవకాశం కలి్పంచామని కూడా పేర్కొంటున్నాయి. అయితే, ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలోనే వ్యూహాత్మక వైఫల్యం జరిగిందని, దీనిపై సమీక్ష చేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
‘మా పార్టీ బేస్ పెరిగింది.. ఓటింగ్ శాతం పెరిగింది’
హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బైంసా, నారాయణపేట్‌లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి, వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్‌రావు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్‌గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలిచాం. నిజామాబాద్‌లో మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీఅరవింద్, రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ కష్టపడి పని చేశారు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి. బీజేపీ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రెండు పార్టీలు ఎంఐఎం తో కలిసి మేయర్, చైర్మన్ రాకుండా చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న దానికి ఏం పేరు ఇవ్వాలి. ప్రజలే వీరి మధ్య సంబంధం ఏంటో చూడాలి. కమ్యునిస్టు పార్టీలు కనుమరుగు అవుతున్నాయి. వాటికి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఆలోచన చేయాలి. ఏప్రిల్‌లో ఎస్ఐఆర్ రాబోతుంది. అధికారులు అప్రమత్తంగా దొంగ ఓట్లు తొలగించాలి. ఓటర్లకు తెలియకుండానే వారి ఇళ్లలో ఓట్లను చేరుస్తున్నారు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విప్ జారీ చేశాం’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. -
ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!
-
తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత మున్సిపల్ ఎన్నిక రేపటికి వాయిదా
-
ట్విస్ట్.. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్, అలాగే బీఆర్ఎస్లో చేరిన ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీ బలాన్ని పెంచారు. దీంతో బీఆర్ఎస్ బలం 14కి చేరింది. కాంగ్రెస్ బలం మాత్రం 12 వద్ద నిలిచింది. ఈ సమీకరణలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా మారాయి. ఫలితంగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు బలపడుతున్నాయి.స్థానికంగా ఈ పరిణామం పెద్ద రాజకీయ చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో ఓట్లను పరిగణలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రాజ్యాంగబద్ధంగా తమకే అధికారం ఉందని వాదిస్తోంది. -
తొర్రూర్‌లో హైటెన్షన్.. ఎంపీ కడియం కావ్యపై ఎర్రబెల్లి ఆగ్రహం
సాక్షి,వరంగల్: తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయలు దేరడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్పొరేటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించి ఆధిక్యం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఎంపీ కడియం కావ్య 2025లో ఎక్స్ అఫిషియో ఓటును వరంగల్‌లో నమోదు చేసుకున్నారు. తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎంపీ కావ్య ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఆమె ఓటును పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళ్తాం. రాజ్యాంగ బద్ధంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు బీఆర్ఎస్వే’నని వ్యాఖ్యానించారు. ఈ వరుస పరిణామాలతో తొర్రూర్‌లో హైటెన్షన్ నెలకొంది. -
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం
సాక్షి,జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యే సంజయ్ తరుఫు వర్గానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మొండి చేయిచూపించింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. జగిత్యాలలలో మున్సిపాలిటీ వార్డులు మొత్తం 50 ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఆయన వర్గానికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ పరిణామం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బగా మారింది.కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. వాణి అభ్యర్థిత్వం ఖరారవడంతో, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం బలపడింది. అయితే, ఈ నిర్ణయం వల్ల పార్టీ అంతర్గతంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం కాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు చేరాయి. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు చేరగా, బీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్ చేరింది. ఇక సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్ చేరగా, ఇండిట్లు నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకున్నారు.మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎస్ఈసీ అధికారిక వివరాలుకాంగ్రెస్ ఖాతాలో 82 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లుబీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలుబీజేపీ ఖాతాలో ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్సీపీఐ ఖాతాలో కొత్తగూడెం కార్పొరేషన్నాలుగు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లువరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలుతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా..మిగిలిన 9 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక పూర్తి..9 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీతొర్రూరు, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్టు ప్రకటించిన అధికారులు* భూపాలపల్లి మున్సిపాలిటీ - (కాంగ్రెస్) _ చైర్మన్ బుర్ర కొమురయ్యనర్సంపేట_ చైర్మన్ గా పెండెం శ్రీలక్ష్మి ( కాంగ్రెస్ )స్టేషన్ ఘన్పూర్_ మున్సిపాలిటీ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్ ( కాంగ్రెస్ )వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి ( కాంగ్రెస్ )ములుగు మున్సిపాలిటీ చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ ( కాంగ్రెస్ )మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి ( కాంగ్రెస్ )పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ( కాంగ్రెస్ )మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి ( కాంగ్రెస్ )కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ బానోత్ సునీత ( కాంగ్రెస్ ) ఎన్నికకాంగ్రెస్లో కొనసాగడంపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్జగిత్యాల మున్సిపల్ ఎన్నికపై జీవన్ రెడ్డి విచారంసంతోషమా.. బాధ అర్థం కావడం లేదు: జీవన్ రెడ్డిపార్టీ జెండా మోసిన వ్యక్తికే పదవి ఇవ్వాలని మెుత్తుకున్నాకాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందిపార్టీలో ఉండాలా లేదా అనే సందిగ్ధత నెలకొంది జగిత్యాల జిల్లాజగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి మెట్పల్లి ఛైర్మన్ స్థానంపై బీజేపీ నేతల అసంతృప్తిఅసంతృప్తితో మెట్‌పల్లిలోని ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతలు యాదగిరి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలుబీఫామ్లు ఇవ్వడంలో యాదగిరి నిర్లక్షం చేశారని ఆరోపణ10 సీట్లు గెలిచినా ఛైర్మన్ దక్కలేదని నేతల అసంతృప్తిఏడు కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక పూర్తిమహాబూబ్నగర్, నల్గగొండ, మంచిర్యాల, కాంగ్రెస్ కైవసంరామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంకొత్తగుడెం కార్పొరేషన్ కైవసం చేసుకున్న సీపీఐకరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కించుకున్న బీజేపీమెుత్తంగా కాంగ్రెస్‌కు ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలలో ఇల్లందు మినహా కొత్తగూడెం కార్పొరేషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తిఎదులాపురం మున్సిపాలిటీ చేర్మెన్ గా పోకబత్తిన అనిత, వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికవైరా మున్సిపాలిటీ చైర్మన్ గా డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్మధిర మున్సిపాలిటీ ఛైర్మెన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్స్ ఆఫీషియో సభ్యుడుగా తన ఓటు వినియోగించుకున్నారుసత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా రెహానా బేగం, వైస్ చైర్మన్‌గా బొంతు సుమలతకల్లూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ధరావత్ మోహన్ నాయక్ , వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరికొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సిరిపురపు లలిత కుమారిఅశ్వారావుపేట మున్సిపాలిటీలోచైర్మన్, వైస్ చైర్మన్లుగా భార్యా, భర్తలుచైర్మన్గా జూపల్లి శశికళవైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికరంగారెడ్డి జిల్లాఆమనగల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ నేనవత్ పత్య నాయక్ క్లినిక్ పై దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలుబీఆర్ఎస్ నుండి కౌన్సిలర్‌గా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆగ్రహంబిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పత్య నాయక్రంగారెడ్డి జిల్లాఇబ్రహీంపట్నంలో క్యాంప్ రాజకీయాలురహస్యప్రాంతాలకు కౌన్సిలర్ల తరలింపుఅభ్యర్థులను తరలిస్తున్న పార్టీలుఎన్నికలు వాయిదా పడడంతో అభ్యర్థుల తరలింపుమహబూబాబాద్ జిల్లాఎంపీ కడియం కావ్యపై బీఆర్ఎస్ ఫిర్యాదుకావ్య ఎక్స్ అఫిషియో ఓటు చెల్లదని బీఆర్ఎస్ ఫిర్యాదుగ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఇదివరకే కావ్య ఓటు వేశారని ఫిర్యాదు హంగ్ వచ్చిన మూడు చోట్ల కాంగ్రెస్ పాగాకేసముద్రం,మహబూబాబాద్, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశంతెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీ పూర్తిగా బీజేపీ కైవసంభైంసాలో ఇండిపెండెంట్ కు మద్ధతుఐదు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ల పదవులు దక్కించుకున్న బీజేపీకరీంనగర్ కార్పోరేషన్ బీజేపీ వశంనారాయణపేట్ మున్సిపాలిటీ బీజేపీ కైవసంభైంసా ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ వశం3 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి వైస్ చైర్మన్లు దక్కించుకున్న బీజేపీ1. ఆమన్ గల్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ2. జిన్నారం (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ3. నర్సాపూర్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ4. అలియాబాద్ (కాంగ్రెస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీ5. ఎల్లంపేట (బీఆర్ఎస్ + బీజేపీ)-వైస్ చైర్మన్ దక్కించుకున్న బీజేపీనిర్మల్ జిల్లాభైంసా మున్సిపాలిటీ ఛైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిఛైర్మన్గా ప్రమాణస్వీకారం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి తూముదత్తాత్రి26స్థానాలకు 12 చోట్ల గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు సూర్యాపేట జిల్లాసూర్యాపేట మన్సిపల్ ఛైర్మన్‌గా మొరిశెట్టి నివేదితవైస్ ఛైర్మన్‌గా ఎండీ షపీఉల్లా ఎన్నికకోదాడ ఛైర్మన్‌గా వేర్నేని కుసుమ వెంకటరత్నంవైస్ ఛైర్మన్‌గా దేవర పల్లిమల్లీశ్వరిహుజూర్నగర్ ఛైర్మన్ డోంతగాని శ్రీనివాస్ గౌడ్వైస్ ఛైర్మన్‌గా తన్నీరు మల్లిఖార్జుననేరెడుచర్ల ఛైర్మన్‌గా కొణతం చిన వెంకట్ రెడ్డివైస్ ఛైర్మన్‌గా నూకల సందీప్ రెడ్డితిరుమలగిరి ఛైర్మన్‌గా ఎస్ రఘనందన్ రెడ్డివైస్ ఛైర్మన్‌గా గోవిందమ్మయాదాద్రి జిల్లాభువనగిరి ఛైర్మన్‌గా తంగళ్ళపల్లి శ్రీవాణివైస్ఛైర్మన్గా పోతంశెట్టి మంజులయాదగిరిగుట్ట ఛైర్మన్ భరత్ గౌడ్వైస్ ఛైర్మన్‌గా బరిగే రమ్య ప్రమాణస్వీకారంచౌటుప్పల్ ఛైర్మన్‌గా మోగుదాల పావనివైస్ ఛైర్మన్‌గా గోశిక వినయ్ ప్రమాణస్వీకారంభూదాన్ పోచంపల్లి ఛైర్మన్ తడక వెంకటేశంవైస్ ఛైర్మన్‌గా కొయ్యడ రజినిఆలేరు ఛైర్మన్‌గా బాలామణివైస్ ఛైర్మన్‌గా ఇంగడి ఆంజనేయులుమోత్కూరు ఛైర్మన్‌గా గడ్డం స్వప్నవైస్ ఛైర్మన్‌గా పల్లెర్ల వెంకన్ననల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం డిప్యూటీ మేయర్‌గా అష్రఫ్ అలీ (ఆమీర్)నల్లగొండ జిల్లామిర్యాలగూడ ఛైర్మన్‌గా చిలుకూరు సుధ వైస్ ఛైర్మన్‌గా పావని ప్రమాణస్వీకారంచిట్యాల ఛైర్మన్‌గా పందిరి గీత ప్రమాణస్వీకారం వైస్ ఛైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మిదేవరకొండ: ఛైర్మన్‌గా పున్న శైలజవైస్ ఛైర్మన్‌గా జూబేరియా తబసుంచండూరు: ఛైర్మన్‌గా కోడి శ్రీనివాసులువైస్ ఛైర్మన్‌గా దశరథ ప్రమాణస్వీకారంహాలియా ఛైర్మన్‌గా చింతల రామచంద్రారెడ్డివైస్ ఛైర్మన్‌గా రాజా రమేష్ ఎన్నికనందికొండ ఛైర్మన్‌గా గౌతమివైస్ ఛైర్మన్‌గా రాజా ప్రసాద్ ప్రమాణస్వీకారం. మహబూబ్‌నగర్ మేయర్ కాంగ్రెస్ వశంమేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మమత రాష్ట్రంలో 11 మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నికలు వాయిదాఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదాఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదాక్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూర్ ఎన్నిక వాయిదానారాయణపేట మున్సిపాలిటీ బీజేపీదే నారాయణపేట మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న బీజేపీనారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు వేసిన ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీజేపీ కైవసంఇటీవల బీజేపీలో చేరిన ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిపి 12కి చేరిన బీజేపీ బలం 12 మంది కౌన్సిలర్లతోపాటు, ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో మేజిక్ ఫిగర్ 13కి చేరిన బీజేపీ బలం.నారాయణ పేట మున్సిపాలిటీ చైర్మన్‌గా కొండా శ్వేత ఎన్నికనారాయణ పేట మున్సిపాలిటీ ఓటింగ్‌కి దూరంగా ఉన్న బీఆర్ఎస్నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు.మున్సిపాలిటీ చైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 13..11 వార్డులలో బీజేపీ విజయం.7 వార్డులలో కాంగ్రెస్ విజయం.2 స్థానాలలో BRS అభ్యర్థులు విజయం.2 వార్డులలో AIMIM కైవసం.ఒక వార్డులలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. ఇటీవల బీజేపీలో చేరారుఒక వార్డులో గెలిచిన AIFB అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు.పెద్దపల్లి జిల్లా:మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్‌గా ముస్కుల సహేందర్ రెడ్డి ఎన్నికకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్: కరీంనగర్ మేయర్‌గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ ప్రమాణం.34 ఓట్లతో మేయర్ అభ్యర్థి ప్రకటనకాంగ్రెస్- 14టీఆర్ఎస్- 9ఎంఐఎం- 3ఇండిపెండెంట్స్- 8నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ :నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఉమా రాణి 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఉమా రాణి.డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్54 డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నిక ఎంఐఎం కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ కాంగ్రెస్‌కు మద్దతు పలికిన బీఆర్ఎస్ కౌన్సిలర్లుకామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి ఎన్నిక ఇబ్రహీంపట్నం:ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తతమున్సిపల్ కార్యాలయంపై రాళ్లతో దాడిఎన్నికను ఆపాలంటూ కాంగ్రెస్,బీఆర్ఎస్ ఆందోళన ఆందోళ కారుల్ని చెదరగొట్టిన పోలీసులు కౌన్సిలర్ యాదగిరి కనిపించకుండా పోవడంతో అనుచరుల ఆగ్రహం ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్తెలంగాణలో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లలో పదవుల కోసం బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పోటీ అభ్యర్థులను మభ్యపెడుతున్న పార్టీలు అభ్యర్థుల కోసం క్యాంపు రాజకీయాలు ఛైర్మన్,వైఎస్ ఛైర్మన్ ఎన్నిక కోసం కౌన్సిలర్ల కిడ్నాప్పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న హైటెన్షన్రంగారెడ్డి:ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ట్విస్ట్ఒకే కారులో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావుఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి,రఘునందన్ రావుఎక్స్అఫిషియో ఓట్లతో బీఆర్ఎస్కు దక్కనున్న ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం తొర్రూర్ మున్సిపాలిటీ: తొర్రూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవికిపై ఉత్కంఠ తొర్రూర్ మున్సిపల్ ఆఫీసుకు తొమ్మిది మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లుబీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం అంటూ ఆరోపణలు కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహంకాంగ్రెస్ ఎక్స్ అఫిషియో ఓట్లతో ఏదో చేయాలని కాంగ్రెస్ చూస్తోందిఎంపీ కడియం కావ్య 2025 ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారుఎంపీ కడియం కావ్య ఓట్లను పరిగణలోకి తీసుకుంటే హైకోర్టుకు వెళతాం. రాజ్యాంగ బద్ధంగా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవి మాదే. జనగామ జిల్లా:తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్డగింతతొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వద్దకు వెళ్తున్న బస్సును అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన ఎంపీకాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలుబీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులట.కరీంనగర్: జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ ఎన్నికలో కొనసాగుతున్న ఉత్కంఠ.జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో సహా బి అర్ ఎస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్లు ఇండిపెండెంట్లు మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్న బీఆర్ఎస్, బీఅర్ఎస్ చైర్మెన్ పీఠం దక్కించుకునే అవకాశం. కరీంనగర్:కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీకరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీబీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ఈ క్రమంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్న బీఆర్ఎస్సూర్యాపేట జిల్లా:కోదాడ మున్సిపాలిటీలో పదవి పంపకాలుచైర్ పర్సన్ ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో బుజ్జగింపు రాజకీయాలుమొదటి రెండు సంవత్సరాలు చైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబువైస్ ఛైర్మన్‌గా దేవారంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డిఅనంతరం మరో మూడు సంవత్సరాలుచైర్ పర్సన్‌గా పారా సత్యవతి సీతయ్యవైస్ చైర్మన్ గుండపునేని పద్మావతి నాగేశ్వరరావు పేర్లు ఖరారు జగిత్యాల జిల్లా:జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసంసీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థి పేరుఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని అధిష్ఠానంజీవన్ రెడ్డి, సంజయ్‌కు కూడా అందని సమాచారంవాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజయ్అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న జీవన్ రెడ్డి, సంజయ్ఎవరి వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నారన్న ఉత్కంఠ.కరీంనగర్: కరీంనగర్లో శరవేగంగా మారుతున్న మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు..రాత్రికి రాత్రే చక్రం తిప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కాంగ్రెస్కు మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరికానీ, చేతులెత్తి ఓటేసే విషయంలో పీఠముడిబీఆర్ఎస్ అభ్యర్థుల డిమాండ్లకు కాంగ్రెస్ సరైన స్పందన లేకపోవడంతో అలకతటస్థంగా వ్యవహరించాలని నిర్ణయం..?మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తకపోతే బీజేపీదే విజయంఉత్కంఠగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:వ్యూహ-ప్రతివ్యూహాల నడుమ మున్సిపల్ పోరుఎక్స్ అఫీషియో ఓట్లతో గేమ్ ప్లాన్గెలుపు గుర్రాలను తేల్చేది ప్రజా ప్రతినిధులేఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలుకింగ్ మేకర్లుగా స్వతంత్రులుమొయినాబాద్, ఎల్లంపేటలో హంగ్ భయంస్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు.. క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఉత్కంఠమేడ్చల్ జిల్లా :జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే చాన్స్మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలంకాంగ్రెస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలుఎల్లంపేట లోనే మల్లారెడ్డి, ఈటల ఓట్ల నమోదుఎల్లంపేట 13-13 ఓట్లతో టై.. లాటరీ ద్వారా చైర్మెన్ ఎన్నుకుంటారా ? బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా ? అనేది ఉత్కంఠనిజామాబాద్: నిజామాబాద్ : బోధన్ మున్సిపాలిటీలో వీడిన ప్రతిష్టంభనకాంగ్రెస్, ఎం. ఐ. ఎం. మధ్య అవగాహనచైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.మున్సిపల్ చైర్మన్‌గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు.నిజామాబాద్:నిజమాబాద్ జిల్లాలో మేయర్,చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్,ఏడు మున్సిపాలిటీలునిజమాబాద్తో పాటు కామారెడ్డి, బోధన్‌లో హాంగ్ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు మేయర్,ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌కు ఇచ్చేలా కుదిరిన ఒప్పందంమేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీఎంఐఎం డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఖరారు తొలిసారి మహిళకు అవకాశంఆర్మూర్, భీంగల్ ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యంసీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు పంపనున్న అధిష్టానం మహబూబ్ నగర్: నేడు మహబూబ్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నికమహబూబ్ నగర్ కార్పోరేషన్లో కుదరని ఏకాభిప్రాయంగంగరగోళంగా అభ్యర్దుల ఎంపికపదవి కోసం మైనార్టీల పట్టుహంగ్ నేపద్యంలో గద్వాల,నారాయణ పేట,అమరచింతలో ఉత్కంఠతక్యాంపుల నుంచి నేరుగా సమావేశలకు గెలిచిన అభ్యర్దులుఖమ్మం..మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తికౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎన్నికఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్కేచైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ..నేడు పేర్లు ప్రకటించనున్న ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖకొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ ,కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంమొదటి రెండున్నర ఏళ్ళు సీపీఐకి మేయర్..కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్తర్వాత రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్‌కు మేయర్ సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్లో60 డివిజన్లో పార్టీల వారీగా గెలిచిన స్థానాలుకాంగ్రెస్ 22, సిపిఐ 22 ,బి ఆర్ ఎస్ 8, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు 6చోట్ల గెలుపొందారుఇందులో ఐదుగురు స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికజాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌తో నడవాలని నిర్ణయించుకున్న సీపీఐఅంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపద్యంలో సిపిఐకి బహిరంగంగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నిజమాబాద్ జిల్లా:నేడు జిల్లాలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, ఉత్తమ్ పర్యటననిజమాబాద్ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో గా ఓటు హక్కు వినియోగించుకోనున్న మహేష్ కుమార్ గౌడ్మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనున్న మంత్రులు.నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో కొలువుదీరనున్న పాలకవర్గాలుఉదయం 10 గంటలకు సమావేశం. అనంతరం సభ్యుల ప్రమాణంక్యాంపుల నుంచి నేరుగా సమావేశానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుపలు మున్సిపాలిటీల్లో ఇంకా చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎవరో రాని స్పష్టతనల్లగొండ మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.ఇక్కడ డిప్యూటీ మేయర్ గా మైనార్టీ, బీసీ వర్గాలకు అవకాశందేవరకొండ చైర్ పర్సన్ గా పున్నా శైలజకు అవకాశం?హాలియా చైర్మన్ గా చింతల చంద్రారెడ్డినందికొండ చైర్ పర్సన్‌గా మానసస్వర్ణమిర్యాలగూడ నుంచి పోటీలో నలుగురుచండూరు చైర్మన్‌గా కోడిశ్రీనివాస్చిట్యాల చైర్ పర్సన్‌గా పందిరి గీతకు అవకాశంనేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా కొణతం చిన వెంకటరెడ్డి. వైస్ చైర్మన్‌గా నూకల సందీప్ రెడ్డికోదాడ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు. పోటీలో ఐదుగురుసూర్యాపేట చైర్ పర్సన్‌గా మొరిశెట్టి నివేదితతిరుమలగిరి చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రుఘునందన్ రెడ్డిహుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో స్పష్టత కరువు.భువనగిరి చైర్ పర్సన్ గా గంజి శ్రీవాణి, బర్రె పూజిత, పోతంశెట్టి మంజులలో ఒకరికి అవకాశంచౌటుప్పల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువుమోత్కూరు చైర్ పర్సన్ కోసం ముగ్గురు పోటీఆలేరు చైర్ పర్సన్ పోటీలో ఇద్దరుయాదగిరిగుట్ట చైర్ పర్సన్ గా వాణి ఎంపిక దాదాపు ఖరారేపోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేష్ కు అవకాశం -
ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు.. ఫార్చునర్ కారు ఆఫర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్09, మజ్లిస్03, ఏఐఎఫ్బీ 02, స్వతంత్రులు04, ఎక్స్ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు వరకు పర్యవేక్షించాల్సి వచ్చింది.రోజంతా హైడ్రామా15 డివిజన్ నుంచి ఏఐఎఫ్బీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్బీ నాయకులు ఆమె ఇంటికి విప్ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్‌లోని కాంగ్రెస్ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్‌గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది.జమ్మికుంటలోనూ హంగ్ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్లో ఒక కౌన్సిలర్ వెళ్లి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్బీ 01, బీఆర్ఎస్ రెబల్1 కలిపి 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్ ఫిగర్ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.జగిత్యాల జిల్లా రాయికల్‌లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్ తరహాలోనే ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.26 సీట్లున్న మెట్పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్ఎస్ 06, కాంగ్రెస్ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి.పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సు ల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో స్పష్టమైన మెజారి టీ రావడంతో కాంగ్రెస్ పాలకవర్గాలను ఏర్పా టు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది.ఇండిపెండెంట్ల జోరుహంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాయి. కరీంనగర్ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్ కారు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.కరీంనగర్ బల్దియాలో నేడు ప్రమాణ స్వీకారం: ఉదయం 11.00 నుంచి 12.30 గంటల వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక: మ.12.30 నుంచి 1.30 వరకు ప్రెసిడింగ్ అధికారి: ఆర్డీవో ఎన్నిక మొత్తం: వెబ్‌కాస్టింగ్, లైవ్‌స్ట్రీమింగ్ -
సీపీఎం.. మున్సి‘పల్టీ’
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కార్మిక–రైతు ఉద్యమాలకు అగ్రగామిగా నిలిచిన సీపీఎం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోగా, సీపీఐ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలను నమోదు చేసింది. కొత్తగా అవతరించిన కొత్తగూడెం కార్పొరేషన్‌పై సీపీఐ ఎర్రజెండా ఎగురవేయనుంది. సీపీఎం మాత్రం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసి కూడా ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో తన ప్రభావాన్ని చూపలేకపోయింది. బీఆర్ఎస్తో పొత్తు.. రెంటికీ నష్టంప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని సీపీఎం బరిలోకి దిగినప్పటికీ ఆ వ్యూహం ఫలించలేదు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సీపీఎం పోటీ చేసిన చోట కాంగ్రెస్ విజయం సాధించింది. తద్వారా బీఆర్ఎస్ కూడా నష్టపోయినట్టు అయింది. రాష్ట్రవ్యాప్తంగా 13 వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఐదేళ్ల క్రితం ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లు సాధించిన సీపీఎంకు, ఈసారి పొత్తుతో ఒక సీటు మాత్రమే అదనంగా దక్కింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఒకప్పుడు సీపీఎంకు ప్రధాన కోటలు. కానీ తాజా ఫలితాలు అక్కడ కూడా ప్రభావం తగ్గినట్టుగా చూపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం బలహీనత, ఓటర్ల మూడ్ మార్పు, పొత్తులపై గందరగోళం.. ప్రభావితం చేసిన అంశాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సీపీఐ దూకుడు.. మేయర్ అవకాశంఈ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లో గణనీయ ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో 22 మంది కార్పొరేటర్లు, రామగుండంలో ఒక కార్పొరేటర్ సీపీఐ తరఫున గెలిచారు. క్యాతనపల్లి, ఎదులాపురం మున్సిపాలిటీల్లో నాలుగేసి వార్డులు, మహబూబాబాద్‌లో 3 వార్డులతోపాటు హుజూర్నగర్, యాదగిరిగుట్ట, వైరా, చండూరు, కోదాడ, భూపాలపల్లిలలో ఒక్కో వార్డు గెలుచుకుంది. ఏకంగా 40 స్థానాల్లో విజయాలు నమోదు చేయడం సీపీఐకి నూతన ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాన్ని సీపీఐ పొందడం తెలంగాణ, ఉమ్మడి ఏపీ చరిత్రలోనే తొలి ఘట్టంగా నిలవనుంది. -
హంగు.. కొత్త రాజకీయ రంగు
రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్–బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్‌బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్ ఉంది. హంగ్ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్⇒ మహబూబాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్ నుంచి 13, బీఆర్ఎస్ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్‌కు ముగ్గురు సీపీఎం, బీఆర్ఎస్కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్‌గా కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉంది. ⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 9 మంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్ అనివార్యం కానుంది. ⇒ ఆసిఫాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్ ఫిగర్ 11. ఇక్కడ కాంగ్రెస్‌కు ఏడుగురు, బీఆర్ఎస్కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది. ⇒ ఖానాపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) నమోదు కావడం, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ⇒ ఆదిలాబాద్: మ్యాజిక్ ఫిగర్‌కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్ (11), బీఆర్ఎస్ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్ కూర్చునే అవకాశాలున్నాయి. ⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్దరు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. ⇒ కాగజ్‌నగర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ కాంగ్రెస్‌కు 9 మంది, బీఆర్ఎస్కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్‌కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనుంది. ⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్ఎస్(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్ఎస్ పరం కానుంది. ⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్ఎస్ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్ఎస్ పక్షాన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కూడా వారు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ⇒ బోధన్ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 20. కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్ పాగా వేయనుంది. మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్ ఇష్టానికే చైర్మన్ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది. ⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్‌కు చైర్మన్, బీఆర్ఎస్కు వైస్‌చైర్మన్ దక్కే అవకాశాలున్నాయి. ⇒ అలంపూర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు ఆరుగురి బలం కావాలి. బీఆర్ఎస్కు ఐదు, కాంగ్రెస్‌కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో గులాబీ జెండా ఎగరనుంది.⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 16. కాంగ్రెస్‌కు 12, బీఆర్ఎస్కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్ (కాంగ్రెస్), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బీఆర్ఎస్) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ⇒ అలియాబాద్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11. కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్ పదవి అడుగుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది. ⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్‌కు 8 మంది, బీఆర్ఎస్కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్ఎస్) ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్ఎస్లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది. ⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఆర్ (కాంగ్రెస్) ఎక్స్ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరనుంది. ⇒ మొయినాబాద్ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 14. ఇందులో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరం కానుంది. ⇒ వికారాబాద్: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్ ఫిగర్ 18 కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్ఎస్ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరం కానుంది. ⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ జహీరాబాద్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19 కాగా, బీఆర్ఎస్ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్ ఫిగర్ రాదు. 14 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమయ్యే అవకాశాలున్నాయి. ⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 19. కాంగ్రెస్‌కు 16, బీఆర్ఎస్ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే... ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13. కాంగ్రెస్ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్ (2), ఏఐఎఫ్బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కాంగ్రెస్‌కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్ఎస్ను కాంగ్రెస్ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ. ⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్ఎస్ కూటమిదే. ⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పక్షానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు చేరడంతో బీఆర్ఎస్ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్‌తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 15కు చేరనుంది. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. ⇒ ఇస్నాపూర్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 14 కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి (ఎక్స్ అఫీషియో), ఒక ఇండిపెండెంట్‌తో కలిసి మ్యాజిక్ ఫిగర్ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా ఎంపీ రఘనందన్‌రావు ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ⇒ మెదక్, నర్సాపూర్ : హంగ్ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీజేపీకి చైర్మన్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ⇒ రాయికల్: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 7 కాగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది. ⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏడు కాగా, కాంగ్రెస్ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్ ఫిగర్ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది. ⇒ కోహిర్: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది. ⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11 కాగా, బీఆర్ఎస్ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ⇒ మెట్పల్లి: ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలిసి బీజేపీకి చెక్ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 14కుగాను బీఆర్ఎస్(6), కాంగ్రెస్ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ⇒ జగిత్యాల: మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్స్ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరనుంది. ⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 15. 13 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లకుతోడు స్వతంత్రులు, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానుంది.ఆమనగల్లులో ఏమవుతుందో?బీఆర్ఎస్కు చెక్‌పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పావులుఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించి, వైస్ చైర్మన్ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది. -
మంత్రులు, పీసీసీ చీఫ్‌తో సీఎం జూమ్ మీటింగ్
హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్‌లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
జగిత్యాల ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్..!
హైదరాబాద్: జగిత్యాల మున్సిపల్ పీఠంపై నెలకొన్న సందిగ్థతకు ఫుల్స్టాప్ పడినట్ల కనిపిస్తోంది. జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లతో సంధి కుదిర్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరిద్దరితో మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ చర్చలు జరపగా, అవి ఫలించాయనేది ప్రాథమిక సమాచారం. ఇరు వర్గాలకు నేతలు నచ్చచెప్పడంతో వారు మెట్టుదిగి వచ్చారని, ఈ క్రమంలోనే జెండా మోసిన వ్యక్తికు చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చచెప్పారు.ఈ చైర్మన్ పీఠంపై జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు చెరో వర్గంగా విడిపోయారు వార తమ పంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికి మేయర్ పీఠం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అధి నాయకత్వం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రజాభవన్‌కు పిలుపించుకుని మరీ చర్చలు జరిపారు. ఇది ఫలించడంతో జగిత్యాల ఎపిసోడ్‌కు దాదాపు ముగింపు పడినట్లే కనబడుతోంది. -
నేనే రాజు.. నేనే మంత్రి.. శృతిమించిన స్వాతిశయం
-
Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై.. బీరు సీసాలతో దాడి..
-
జగిత్యాల మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
-
‘మున్సిపోల్స్’లో కాంగ్రెస్‌కు 40% ఓట్లు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క తేలిపోయింది. ఈనెల 11న జరిగిన పోలింగ్‌లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు, ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోల్ కాగా, అందులో అత్యధికంగా కాంగ్రెస్‌కు పోలయ్యాయి. ఈ పార్టీకి మొత్తం 39.8 (దాదాపు 40 శాతం)తో 15,05,006 ఓట్లు వచ్చాయి. గత (2020) మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 7లక్షల ఓట్లు ఆ పార్టీ కి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్కు గత ఎన్నికలతో పోలిస్తే 5 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 15.90 లక్షల ఓట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 10,87,347 (దాదాపు 29 శాతం) ఓట్లకు పరిమితమైంది.ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 11 శాతంగా నమోదైంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు 4,17,659 ఓట్లు అదనంగా వచ్చాయి. మరో ప్రతిపక్షమైన బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే తగ్గలేదు. గత ఎన్నికల్లో వచ్చిన 15 శాతం ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 5.5 లక్షల ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి మరో 42 వేల ఓట్లు పెరిగి మొత్తం 5,92,823 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం కూడా తన 3% ఓట్లను పదిలపర్చుకుంది.2020 ఎన్నికల కంటే ఆ పార్టీ కి 3 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. కాగా, ఈసారి మూడు ప్రధాన పార్టీ ల తర్వాత అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంది స్వతంత్రులే. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లలో 8.3 శాతం ఓట్లు అంటే 3,14,096 ఓట్లు వచ్చా యని ఈసీ ప్రకటించింది. ఎంఐఎంతో సహా సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫా ర్వర్డ్ బ్లాక్, జేఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎంబీటీ, ఐయూఎంఎల్.. ఇలా అన్ని పార్టీ ల ఓట్లు కలిపినా ఇండిపెండెంట్ల కంటే తక్కువే కావడం గమనార్హం. -
టార్గెట్ 90
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కనీసం 90కి తగ్గకుండా పురపాలి కల్లో కాంగ్రెస్ కొలువు తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులకు లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులతో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ప్రత్యే కంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించిన మంత్రులు.. ప్రజాతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితమే ఈ విజయమని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన పార్లమెంట్ ఇన్చార్జి మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు నడిపిన మహేశ్‌కుమార్‌గౌడ్, రేవంత్‌రెడ్డిని మంత్రులు అభినందించారు. ఫలితాలు మనకు బూస్టప్ మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అందరం కలసికట్టుగా పనిచేయడం వల్లే సత్ఫలితాలు సాధించామన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీకి బూస్టప్ ఇచ్చాయని చెప్పారు. మొత్తం 70కిపైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధించిందని.. హంగ్ ఏర్పాటైన చోట్ల కూడా స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగరేసేలా మంత్రులు పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను పార్లమెంటు ఇన్చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై పార్టీ అగ్ర నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్న సీఎం.. త్వరలోనే పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ను నమ్మలేదు.. బీజేపీ బలపడలేదు ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందన్న వాదనలో నిజం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తిని చాటాలని మంత్రులకు సూచించారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ముఖ్య నేతలు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి హాజరవగా ఆన్లైన్ ద్వారా మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రులకు పని విభజన పార్టీపరంగా సమస్యలున్న మున్సిపాలిటీల్లో అందరితో మాట్లాడే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు.జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు అప్పగించిన సీఎం.. కొత్తగూడెం బాధ్యతను పొంగులేటికి, కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతను శ్రీధర్‌బాబు, పొన్నం, నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యత మహేశ్‌గౌడ్, ఉత్తమ్‌కు అప్పగించారు. -
మూడు ముక్కలాట!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ముడిపడిన మున్సిపాలిటీలివే.. హంగ్ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్‌నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్‌నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్‌లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్ఎస్కు ఎక్కువ కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. గైర్హాజరు... గోడ దూకుళ్లు ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్ ఫిగర్లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వతంత్రుల సాయం తీసుకుంటే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్‌లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్‌లో మ్యాజిక్ ఫిగర్‌కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్‌ను కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు వైస్‌చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్‌రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్. సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులందరినీ సీఎం అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించాం. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు. -
తెలంగాణలో కాకరేపుతున్న క్యాంప్ పాలిటిక్స్
మొయినాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్ జిలానీ అంటారో అని ఆయా పార్టీలు వారిని డేగ కళ్లతో కనిపెడుతున్నాయి. దీనిలో భాగంగా వారిని క్యాంప్‌లకు తరలిస్తూ దాచేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రిసార్ట్‌ల్లో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్‌గా చైర్మన్, మేయర్ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీల జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో పార్టీలు ఉన్నాయి. జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంప్ రాజకీయాలు..జగిత్యాలలో ఒకే పార్టీలో ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య మొదలైన క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపునకు మాజీమంత్రి జీవన్ రెడ్డి బయల్దేరారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మేజిక్ ఫిగర్ 26 సీట్లు..ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. సంజయ్ వర్గంతో కలిసేందుకు జీవన్ రెడ్డి..ససేమిరా అంటున్నారు. ఆదినుండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు.రసకందాయంగా జగిత్యాల్లో కాంగ్రెస్ అంతర్గత క్యాంప్ రాజకీయాల కొట్లాట మొదలైంది. ఇక పాలమూరు టూ చీరాల క్యాంపుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు బయల్దేరారు. రాత్రే ఓ వాహనంలో కొందరు వెళ్లగా నేడు మరో టూరిస్ట్ బస్సులో పయనమయ్యారు. కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రదాన నేతలు సైతం క్యాంపులకు బయల్దేరారు. ఇలా తెలంగాణలో ప్రతీ చోటా క్యాంపు రాజకీయాలే కనిపిస్తున్నాయి. -
బంగారు తల్లి కాళ్లు మొక్కి.. ఆనంద భాష్పాలు
హన్మకొండ: ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్‌హాల్‌నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, శ్రీనివాస్ మొదటినుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. -
రూ. 8 కోట్ల పన్ను చెల్లించా.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
-
ప్రజల రుణం తీర్చుకుంటా
అనంతగిరి: ‘మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు.. భారీ మెజారిటీతో గెలిపించారు.. వారి రుణం తీర్చుకునే సమయం వచి్చంది.. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించా.. ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. నాన్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ సహకారం.. ప్రభుత్వ అండదండలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’ అని 17వ వార్డు కౌన్సిలర్.. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి అనన్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మీ విజయానికి దోహదం చేసిన అంశాలు? కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే నా విజయానికి దోహదం చేశాయి. 17వ వార్డు ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. నాన్న ఆశీర్వాదం ఫలించింది. అందరి ఆదరణతోనే విజయం సాధించా. ఏయే సమస్యలు గుర్తించారు? వార్డుల్లో పర్యటించినప్పుడు పలు చోట్ల డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉన్నట్లు గుర్తించాం. తొలుత వీటి పరిష్కారానికి కృషి చేస్తాం. అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ? వికారాబాద్ పట్టణంపై పూర్తి అవగాహన ఉంది. నాన్న రాజకీయాల్లో ఉండటంతో చాలా నేర్చుకున్నా.. మున్సిపల్, ప్రభుత్వ నిధులతో వికారాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. -
ఏడ్చింది.. ఓడింది..
-
హంగ్ ఎఫెక్ట్.. ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సర్క్యులర్ విడుదల చేసింది. మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫీషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్‌గా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుందని తెలిపింది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదు అని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. మున్సిపల్ ఎన్నికల అమలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సర్క్యులర్ పంపిణీ చేసింది. అలాగే, మేయర్-చైర్మెన్ ఎన్నికపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎం యాక్ట్-2019 ప్రకారం ప్రత్యేక సమావేశానికి Form-II నోటీసు కలెక్టర్లు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. 16వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మున్నిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాల్టీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్.. కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దాదాపు 40 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థులకు డిమాండ్ పెరిగింది. దీంతో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 16న ఛైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందచేయాలని తెలిపింది. ఎన్నికల కోడ్‌కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ పంపించింది.బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని.. ముగ్గురికి మించి గుంపుగా ఉండరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీసు ఇవ్వాలని జిల్లాల అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఎస్ఈసీ తెలిపింది.మరోవైపు.. ఎన్నికల్లో విజేతలను ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పలు చోట్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీల అభ్యర్థులకు గాలం వేస్తున్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్నా... 10 ఓట్లు మాత్రమే వచ్చాయి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. View this post on Instagram A post shared by Politics Meter (@politicsmeter) మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన అనంతుల డు ఓట్లు మాత్ర మే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. -
కొత్తగూడెంలో 50–50
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఇక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నా కొత్తగూడెం కార్పొరేషన్ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు కుదరలేదు. దీంతో కాంగ్రెస్ సీపీఎంతో జత కట్టి 58 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు ఆ పార్టీ 22 డివిజన్లకే పరిమితం కాగా, మిత్రపక్షమైన సీపీఎం రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలిచింది. ఆది నుంచీ చెబుతున్నట్టుగానే 22 స్థానాల్లో సీపీఐ గెలిచింది. 51 డివిజన్ నుంచి గెలిచిన అభ్యర్థి సీపీఐకి మద్దతుదారుగా ఉన్నారు. కింగ్ ఎవరో? కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. మేయర్ పదవి దక్కించుకునేందుకు 31 డివిజన్లలో గెలవాలి. అయితే ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీలుగా అవతరించినా సరిపడా మెజారిటీ సాధించలేకపోయాయి. అయితే కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేసేందుకు కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కారద్యర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినట్టు తెలిసింది. సీపీఐ 23 స్థానాలకు తోడు బీఆర్ఎస్ సభ్యులు 8 మంది తోడైతే మేయర్ పదవి సీపీఐ ఖాతాలో పడుతుంది. అయితే, బీఆర్ఎస్ ఆఫర్‌పై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగూడెం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం కూనంనేనికి ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే సీపీఐ– కాంగ్రెస్‌లు కలిసి అధికారం పంచుకునే వీలుంది. కీలకంగా ఎక్స్అఫీషియో ఓట్లు మిత్రపక్షమైన సీపీఎంతో కలిపి కాంగ్రెస్ బలం 23గా ఉంది. ఐదుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలెట్టింది. వారు కాంగ్రెస్ పక్షాన నిలిస్తే హస్తం ఖాతాలో 28 డివిజన్లు ఉంటాయి. మెజారిటీకి మరో మూడు ఓట్లు అవసరం పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం నుంచి ఎక్స్అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌ను చేరుకుంటుంది. అయితే, సీపీఐ, బీఆర్ఎస్ మధ్య పొత్తు చిగురించని పక్షంలోనే ఈ సమీకరణానికి చోటుంది. ఒక వేళ సీపీఐ అనుబంధ సభ్యుడు, ఒకరిద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం వైపు మొగ్గు చూపినా కాంగ్రెస్‌కు మేయర్ పదవి దక్కించుకోవడం అంత సులువు కాదు. ఎక్స్అఫీషియో కోటాలో సీపీఐకి కూనంనేని సాంబశివరావుతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు ఓట్లు అండగా నిలిచే అవకాశముంది. కొత్తగూడెం మేయర్ మాకే!సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మేయర్ స్థానం సీపీఐకి వచ్చే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆయన శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేయర్ స్థానం కమ్యూనిస్టులకు రావడం గొప్ప గౌరవమన్నారు. కమ్యూనిజంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. ఈ విజయం కార్మికులకు అంకితమని, తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇస్తామని కేటీఆర్ ఫోన్లో హామీ ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ మాట్లాడలేదని వివరించారు. -
కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ‘సామ, భేద, దాన, దండోపాయాలు‘అన్నీ ప్రయోగించినా ప్రజల మనసు గెలవలేకపోయిందన్నారు. డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దురి్వనియోగం పరాకాష్టకు చేరినా ఓటర్లు భయపడలేదని స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్‌కు హెచ్చరిక ‘123 చోట్ల ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో ప్రత్యక్షంగా గెలిచాం. 30 చోట్ల హంగ్ పరిస్థితి నెలకొన్నది. మరో 10–15 చోట్ల బీఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే 117 స్థానాల్లో బలమైన ఫలితాలు సాధించాం. అధికారంలో లేని పార్టీగా ఇదే ప్రజాభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి వన్‌సైడ్ అవుతాయి. మంచి పరిపాలన ఉంటే 80–90 శాతం స్థానాలు గెలుస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఉల్టా ఉంది. ఇది కాంగ్రెస్‌కు హెచ్చరిక. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రెండేళ్లు కూడా నిండకముందే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. 4 వేల పైచిలుకు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలిచారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా బీఆర్ఎస్నే ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి బీఆర్ఎస్కే ఉందని ఈ ఫలితాలు తేల్చాయి. హంగ్ వచ్చిన చోట్ల ఏ వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించి, స్థానిక నాయకత్వ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం..’అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు ‘రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసి పనిచేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి చెన్నూరు, క్యాతనపల్లి ప్రాంతాల్లో పోటీ చేసి విజయాన్ని సాధించాం. చాలామంది వచ్చారు..పోయారు నేనే రాజు, నేనే మంత్రి అనుకునే వారు చాలామంది వచ్చారు, పోయారు. ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే గాలి తీసుకుపోతుంది. ఇందిరాగాం«దీ, ఎన్టీ రామారావులనూ ఓడించిన దేశమిది. మీ ప్రభుత్వంపై అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రండి. ప్రజల తీర్పే అసలు ఇండికేటర్..’అని కేటీఆర్ సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం మరింత తీవ్రం చేస్తామని అన్నారు. సింగరేణి కంపెనీలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దానిపై మేము పోరాడుతున్నామని చెప్పారు. -
మున్సిపల్ ముచ్చట్లు
తల్లీకొడుకు విజయం తిరుమలగిరి (తుంగతుర్తి) : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సి పాలిటీలో తల్లీకొడుకు విజయం సాధించారు. 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బత్తుల శకుంతల,ఆమె కుమారుడు బత్తుల శ్రీనివాస్ 7వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.మెదక్‌కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకు గెలిచారు. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా దొంతి లక్షి్మ, 15వ వార్డు నుంచి దొంతి నరేశ్ గౌడ్ ఘన విజయం సాధించారు. ఖమ్మంరూరల్: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో. 15వ డివిజన్ నుంచి తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆమె కుమారుడు నవీన్ 14వ డివిజన్ నుంచి గెలుపొందారు. అన్నపై తమ్ముడి గెలుపు నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డునుంచి అన్నా తమ్ము డు పోటీ చేయగా, అన్నపై తమ్ముడు గెలిచాడు. బీఆర్ఎస్ నుంచి బీరం నాగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బీరం భరత్‌రెడ్డి బరిలో ఉండగా, భరత్‌రెడ్డి తన అన్న నాగిరెడ్డిపై 172ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.⇒ కల్వకుర్తిలోని ఏడో వార్డులో భార్య రత్నమాల కాంగ్రెస్ నుంచి విజయం సాధించగా.. 13వ వార్డులో భర్త ఆనంద్‌కుమార్ ఓడిపోయారు. ⇒ గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ నుంచి పోటీ చేసిన దంపతులు గెలుపొందారు. 19వ వార్డు నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, 26వ వార్డు నుంచి ఆయన భార్య కృష్ణవేణి గెలుపొందారు. ⇒ వనపర్తి మున్సిపాలిటీలో కూతురు సౌమ్య (కాంగ్రెస్) ఆమె తల్లి అరుణ (బీఆర్ఎస్) విజయం సాధించారు. ⇒ జహీరాబాద్ మున్సిపాలిటీలోని 33వ వార్డు నుంచి తాహెరాబేగం(కాంగ్రెస్) 34వ వార్డు నుంచి ఆమె కోడలు నయ్యర్ బేగం స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించింది. ⇒ మంచిర్యాల కార్పొరేషన్లో తోటికోడళ్లు కాంగ్రెస్ కార్పొరేటర్లుగా గెలిచారు. 38వ డివిజన్ నుంచి పూదరి విజయరాణి, 39 డివిజన్ నుంచి పూదరి సునీత గెలుపొందారు. కల్నల్ తల్లి ఓటమి సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. మూడే ఓట్లు.. అయినా తగ్గేదేలె.. జనగామ: జనగామ మున్సిపాలిటీలోని 27వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆంజనేయులుకు 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా మూడు వేళ్లతో చూపిస్తూ చిరునవ్వు చిందించారు.కన్నీళ్లు పెట్టుకున్నా... యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసిన బొమ్మగాని రాజమణి ఓటమి పాలయ్యారు. ప్రచారంలో భాగంగా దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కన్నీళ్లు పెడుతూ యువతను ఓటు వేయాలని వేడుకుంది. అయితే ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానిస్టేబుల్ భార్య ఘన విజయం చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాలలో బీఆర్ఎస్ తరఫున 2వవార్డు అభ్యరి్థగా కమలాపురం గీతాంజలి బరిలో నిలిచారు. ఆమె భర్త రమేశ్ కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త రమేశ్ ప్రచారంలో పాల్గొన్నారని వచ్చిన ఆరోపణల మేరకు ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి తేజపై 223 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ట్రాన్స్‌జెండర్ విజయం చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్(కావేరి) తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగే‹Ùపై 102 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. ఈ వార్డులో 1008 ఓట్లు పోల్ కాగా, సుధాకర్(కావేరి)కు 429 ఓట్లు, నగేశ్‌కు 327 ఓట్లు వచ్చాయి. కాలేజీ టు కౌన్సిలర్ కోదాడ: ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్‌టైమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జిల్లేపల్లి నాగేశ్వరరావు కోదాడ మున్సిపాలిటీలోని 20వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కాలిదాసు వెంకటరత్నంపై 203 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ⇒ హైదరాబాద్‌లో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న షేక్ నెహనాజ్ కోదాడలోని 26 వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఆయనకొచ్చిన ఓట్లు 0 రామాయంపేట: రామాయంపేట మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన భూమ మల్లేశం తన ఓటు కూడా తాను వేసుకోలేకపోయాడు. ఆయన కుటుంబసభ్యులు కూడా మల్లేశంకు ఓటు వేయలేదు. దీంతో ఆయనకు సున్నా ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నుంచి గెలిచిన ముస్లిం మహిళ భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీలోని 5వ వార్డు బీజేపీ అభ్యరి్థగా పోటీచేసిన ముస్లిం మహిళ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ నాయకుడు తుమ్మల నగేశ్.. యాస్మిన్‌ను మతాంతర వివాహం చేసుకున్నాడు. 5వ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య యాస్మిన్‌ను బీజేపీ తరఫున బరిలో నిలిపాడు. ఒక్క ఓటుతో.... పరకాల: పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర ఒక్క ఓటుతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యరి్థశనిగరపు రజనికి 368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్రకు 366 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల మెజారిటీతో గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి సంతోషపడగా..పోస్టల్ బ్యాలెట్ మూడు ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి సుభద్రకే పడ్డాయి. దీంతో సుభద్ర ఓట్లు 369కి చేరాయి. ⇒ మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కాంగ్రెస్ నుంచి కొడకంటి హరిత, బీఆర్ఎస్ నుంచి న్యాయవాది జీవన్‌రావు పోటీ చేశారు. హరితకు 366 ఓట్లు రాగా, జీవన్‌రావుకు 365 ఓట్లు వచ్చాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి ఒక్క ఓటుతో విజయం సాధించారు. జయలక్షి్మకి 355 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు 354 ఓట్లు వచ్చాయి. ⇒ కల్వకుర్తిలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్‌కు 259 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ అలీకి 258 ఓట్లు వచ్చాయి. ⇒ గద్వాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో విజయం సాధించారు. మొదట కౌంటింగ్ చేయగా.. బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది. మూడుసార్లు రీకౌంటింగ్ చేసి.. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు ఆర్ఓ ప్రకటించారు.‘డ్రా’లో వరించిన విజయం నర్సాపూర్ /దుబ్బాకటౌన్/తూప్రాన్: ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు డ్రా తీసి విజేతను ప్రకటించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యరి్థగా పంబల్ల లలిత, కాంగ్రెస్ నుంచి వంకమల్ల జ్యోతి పోటీ పడ్డారు. ఇద్దరికీ సమానంగా 253 ఓట్లు వచ్చాయి.దీంతో అధికారులు డ్రా తీయగా.. పంబల్ల లలితకు విజయం వరించింది. లలిత 15వ వార్డు నుంచి రెండోసారి విజయం సాధించారు. ⇒ దుబ్బాక మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి కంకనాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి సత్తు శ్రీలతకు సమానంగా 266 ఓట్లువచ్చా యి. అధికారులు టాస్ వేయగా బీఆర్ఎస్ అభ్యరి్థని గెలుపు వరించింది. ⇒ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గజ్జెల కృష్ణకు, బీఆర్ఎస్ అభ్యర్థి సత్యలింగంకు 330 సమాన ఓట్లు వచ్చాయి. టాస్ వేయగా, సత్యలింగంకు అదృష్టం వరించింది. హస్తం గూటికి బీఎస్పీ అభ్యర్థి మెదక్‌జోన్: మెదక్‌లోని 17వ వార్డులో బీఎస్పీ తరఫున పోటీ చేసిన బుజరంపేట అరుణ గెలిచారు. అయితే కాంగ్రెస్ నేతలు ఆమెతో సంప్రదింపులు జరిపి తమ క్యాంపునకు తరలించారు. దీంతో కాంగ్రెస్ బలం15కు చేరింది. ఇక మిగిలిన ఇద్దరు బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ఇరుపార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. నాటి సఫాయి.. నేడు కౌన్సిలర్ నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు 2018 వరకు గ్రామ çపంచాయతీలో సఫాయి కార్మికురాలిగా పనిచేసిన ఇంజమూరి వెంకటమ్మ ఇప్పుడు మున్సిపాలిటీలోని 10వవార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించారు. బీఆర్ఎస్నుంచి పోటీ చేసిన వెంకటమ్మ.. కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ రాణిపై 10 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ జంటపై.. కాంగ్రెస్ జంట నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలి టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన దంపతులు.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దంపతులపై విజయం సాధించారు. 4వార్డులో కొణతం మంజుల.. తన ప్రత్యర్థి నాగండ్ల ఇందువదనపై 72 ఓట్లతో, 15వ వార్డులో కొణతం చిన వెంకట్‌రెడ్డి.. తన ప్రత్యర్థి నాగండ్ల శ్రీధర్‌పై 203 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున కొణతం మంజుల, చిన వెంకట్‌రెడ్డి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి నాగండ్ల ఇందు వదన, శ్రీధర్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కపుల్ ధమాకా రామాయంపేట(మెదక్): రెండు వార్డుల్లో దంపతులు గెలుపొందారు. రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, లావణ్యతో ఒకటో వార్డు నుంచి, నాగరాజు 7 వార్డు నుంచి గెలిచారు. లావణ్యను చైర్పర్సన్ చేస్తామని ఇటీవల కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. ఓ జంటలో భార్య.. ఇంకో జంటలో భర్త ఓటమి సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యరి్థగా కూసంపూడి మహేశ్ గెలుపొందగా.. ఆయన భార్య మాధురి 3వ వార్డు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 22వ వార్డు కాంగ్రెస్ అభ్యరి్థగా ఎండీ.రెహనాబేగం గెలిచినా, ఆమె భర్త 20వ వార్డు అభ్యర్థి ఎం.డీ. కమాల్‌పాషా ఓడిపోయారు. జంటగా కౌన్సిల్లోకి... అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా జూపల్లి రమే‹Ùబాబు, ఆయన సతీమణి శశికళ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా ముందే ప్రకటించిన శశికళ 6వ వార్డు నుంచి ఆమె భర్త రమేశ్‌బాబు 13వ వార్డు నుంచి గెలుపొందారు. భర్త ఓటమి.. భార్య గెలుపు ఇదే కార్పొషన్ పరిధిలో దంపతుల్లో భార్య గెలుపొందగా.. భర్త ఓటమి చవిచూశాడు. 34వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అగల్‌డ్యూటీ రాజు, 36వ డివిజన్ నుంచి అగల్‌డ్యూటీ రాణి పోటీచేశారు. వీరిలో అగల్‌డ్యూటీ రాణి గెలుపొందింది. -
అంచనాలకు దూరంగా..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకింత నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో పట్టున్న పార్టీగా మంచి ఫలితాలే సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశించినా అది నెరవేరలేదని అంటున్నారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కరీంనగర్, నిజామాబాద్ మేయర్ పీఠాలను, 116 మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 దాకా చైర్పర్సన్ పదవులను సాధిస్తామని వేసుకున్న అంచనాలకు దగ్గరలో కూడా ఫలితాలు రాలేదని భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో దూకుడు చూపడంతోపాటు దక్షిణ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్లో గెలిచి బలాన్ని చాటుతామనుకున్న అంచనాలను అందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 సీట్లలో 7, 8 ఎంపీ సీట్లలో మూడు, 3 ఎమ్మెల్సీ సీట్లలో 2 ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే గెలిచినందున... పుర ఎన్నికల్లో అక్కడ మంచి ప్రదర్శన కనబరుస్తామని భావించింది. అయితే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ పీఠం మాత్రమే దక్కించుకోగలిగింది. దక్షిణాన నామమాత్రమే... దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కనీసం ఒక్కసీటునైనా సాధించి ప్రాతినిధ్యం చాటుతామన్న కమలనాథుల ధీమా వాస్తవరూపం దాల్చలేదు. అదేవిధంగా కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా కైవసం చేసుకుంటామన్న ఆశలు నెరవేరలేదు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో నిరాశాజనక ఫలితాలు రాగా, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఆశించినస్థాయిలో వార్డులు, డివిజన్లను గెలవలేకపోయింది. ఏతావాతా చూస్తే... 2020 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే కొంచెం అటుఇటుగా ఈసారి కూడా సాధించినట్టయ్యింది. అయితే, గత ఎన్నికల్లో 15 శాతం ఓటింగ్ సాధించగా, 20 శాతం ఓట్ల నమోదు ద్వారా మెరుగైన ఫలితాలను సాధించామని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ నాయకత్వం ధీమా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం కూడా విశ్వసించింది. ఈ ఎన్నికలకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందజేసింది. ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్‌నగర్‌లో పెద్దఎత్తున ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భిన్నంగా... కాంగ్రెస్ సర్కార్‌పై చార్జీïÙట్ విడుదల చేసింది.. పురపోరు కోసమే ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా రూపొందించింది. మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీనిచి్చంది. అయితే, ఇవేవీ ఆశించిన స్థాయిలో పట్టణప్రాంతాల ప్రజల ఓట్లను రాబట్టుకోవడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీల్లో కనీసం ఒక్క డివిజన్, వార్డులోనూ గెలవకపోవడంతో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అంటున్నారు. -
ఇంకాస్త కష్టపడి ఉంటే..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ దాదాపు 30 శాతం వార్డులు/డివిజన్లను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 781 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇంకొద్దిగా కష్టపడితే వార్డుల సంఖ్య కనీసం వెయ్యివరకు చేరేదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయిందని అంటున్నారు.2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 1,737 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా.. అప్పట్లో కాంగ్రెస్ 589 స్థానాలకే పరిమితమైంది. దీంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఇప్పుడు తమకు ఎక్కువ స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క కార్పొరేషన్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. అయితే మరికొన్ని చోట్ల సింగిల్ లార్జెస్ట్ పారీ్టగా అవతరించడం గమనార్హం.అక్కడ పొత్తులు కుదిరితే మరికొన్ని పీఠాలు దక్కే అవకాశం ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకపోయినా.. బీఆర్ఎస్ సానుభూతి పరులు 30 శాతానికి పైగా గెలిచారని, ఈ ఎన్నికల్లోనూ వార్డుల పరంగా చూస్తే 30 శాతానికి పైగా విజయం సాధించినట్లు పార్టీ నాయకత్వం చెబుతోంది. కీలక నేతల ప్రాంతాల్లో చెక్కుచెదరని పట్టు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ పరిమిత ప్రాంతాల్లోనే పర్యటించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు సైతం సొంత ప్రాంతంలోనే ప్రచారం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నేతలు సీరియస్‌గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం కూడా ఎన్నికల్లో దూకుడుగా పని చేసిందని అంటున్నారు. కానీ బీఆర్ఎస్కు.. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నప్పటికీ బడా నేతల ఆర్భాటం లేకపోవడంతో మైనస్ అయ్యిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చారనే అసంతృప్తి, ఫలితంగా సమన్వయలోపం లాంటి కారణాలు కూడా బీఆర్ఎస్ వెనుకబడటానికి కారణమయ్యాయని జిల్లాస్థాయి నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడం గమనార్హం. అగ్రనేతల్లో సంతృప్తి ప్రస్తుతం ఎన్నికలు జరిగిన స్థానాల్లో పావువంతుకు పైగా సీట్లలో విజయం సాధించడంపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సాధారణంగా అధికారపార్టీ ఖాతాలోనే పడతాయని, కానీ పావువంతు సీట్లు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు దక్కడం ఆ పార్టీ బలాన్ని స్పష్టం చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ సాధించిన సీట్ల కంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఎక్కువ వచ్చాయంటూ ఇతర నేతలు సైతం సమరి్థంచుకుంటున్నారు. నారాయణపేట జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రెబెల్స్ విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచి్చన కేసీఆర్ కుమార్తె కవిత మద్దతుదారులు ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. -
కాంగ్రెస్ ఫుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అంచనాలకు తగినట్టుగానే ఆధిక్యత సాధించడంతో అధికార కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 26 నెలల తర్వాత, 2024 పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీ గుర్తులపై జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పనితీరుతోనే మన్ననలు ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల మనసును గెలుచుకోవడానికి పార్టీ పనితీరే కారణమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత 26 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో విశ్వా సం పెరిగిందని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కీలకపాత్ర పోషించాయని, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పకడ్బందీగా సాగిన ఎన్నికల ప్రచారం, వ్యూహాల అమలు కూడా ఫలితాన్నిచ్చాయని పేర్కొంటున్నారు. మంత్రుల నియోజకవర్గాల్లో స్వీప్ రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తోన్న వారందరి సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు, కోస్గి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోని మధిరతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్, నేరేడుచర్ల), దామోదర రాజనర్సింహ (ఆంథోల్), వాకిటి శ్రీహరి (మక్తల్), సీత క్క (ములుగు), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఏదులాపురం), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), వివేక్ (చెన్నూరు), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)లలో కాంగ్రె స్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంది. మంత్రులు అజహరుద్దీన్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. వాటి కోసం స్వతంత్రుల సాయం సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాని ఐదు చోట్ల స్వతంత్రుల సాయంతో గెలిచేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గద్వాల, వేములవాడల్లో ఇద్దరు చొప్పున ఇండిపెండెంట్లు, మొయినాబాద్, బెల్లంపల్లిలో ఐదుగురు, పరిగిలో ఇద్దరు స్వతంత్రుల సహకారంతో ఆయా మున్సిపాలిటీ లు, జగిత్యాలలో రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కచి్చతంగా బీజేపీ, బీఆర్ఎస్లు కలిస్తేనే మ్యాజిక్ ఫిగర్ రానున్న 10–12 స్థానాల్లో కూడా వీలున్న మున్సిపాలిటీలను స్థానిక పరిస్థితులను బట్టి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఆ రెండు కార్పొరేషన్లపై గురి మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా పరిశీలిస్తే ముందు నుంచీ ఊహించినట్టుగానే నల్లగొండ, రామగుండం, మంచిర్యాల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించింది. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐతో హోరాహోరీ తలపడింది. ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకునేందుకు అవసరమైన 9 అదనపు ఓట్ల కోసం ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమా లేదా స్వతంత్రులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో కార్పొరేషన్ కైవసం చేసుకోవడమా అనే అంశాలను పరిశీలిస్తోంది. నిజామాబాద్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎంఐఎం మద్దతు తీసుకుని, నాలుగు లేదా ఐదు ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకునే అవకాశాలపై దృష్టి పెట్టింది. ఢిల్లీ నుంచి సీఎం ఆరా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడి నుంచే ఫలితాలపై ఆరా తీశారు. గెలిచిన చోట్ల ప్రజా ప్రతినిధులను, పార్టీ నేతలను అభినందించడంతో పాటు గెలుపునకు దగ్గరగా వచి్చన మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడంపై చర్చలు జరిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షిలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్స్ అఫీషియో ఓట్లు ఎక్కడ ఎన్ని అవసరమవుతాయో అంచనాలు వేశారు. కీలకంగా వార్ రూమ్ ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో కాంగ్రెస్ వార్ రూం కీలకంగా పనిచేసి సత్ఫలితాలు సాధించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలు ప్రజల్లోకి వెళ్లిన తీరును గమనించడం బూత్‌ల వారీగా ప్రచారం సమన్వయం చేయడం, గడప గడపకూ సంక్షేమ పథకాలను చేరవేయడం, మహిళా సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించడం, క్లబ్బులతో సంప్రదింపులు జరపడం లాంటి కార్యక్రమాల ద్వారా వార్‌రూం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సమన్వయం చేసిన ఈ వార్‌రూంను పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి ముందుండి నడిపించారు. మిన్నంటిన సంబురాలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గాం«దీ భవన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాజీ ఎంపీ, సీనియర్ నేత వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, పీసీసీ నేత అల్లం భాస్కర్ తదితరులు నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకున్నారు. -
పురంలో పైచేయి
సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 66 మున్సిపాలిటీలు, రామగుండం, నల్లగొండ, మంచిర్యాల కార్పొరేషన్లలో విజయకేతనం ఎగురవేసింది. మరో ఐదారు మున్సిపాలిటీలు, మరో కార్పొరేషన్‌ను కూడా దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 13 పురపాలికల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎంఐఎం విషయానికి వస్తే ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మంచి ఫలితాలు సాధించిన కమలం పార్టీ.. పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకోవడంలో వెనుకబడింది.ఇక దాదాపు 36 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పలు వార్డు స్థానాల్లో విజయం సాధించారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్‌తో తలపడిన సీపీఐ ఆ పార్టీకి దీటుగా విజయాలను సాధించినా మ్యాజిక్ ఫిగర్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇక అనూహ్యంగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) బలపర్చిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలుపొందడం గమనార్హం. 51 శాతం స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ మున్సిపాలిలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డులు, డివిజన్ల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే విజయం సాధించింది. మొత్తం 2,996కు గాను 2,995 వార్డులు, డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో (మక్తల్‌లో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక నిర్వహించలేదు) ఆ పార్టీకి 1,538 స్థానాలు లభించాయి. అంటే దాదాపు 51 శాతం వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (2020) కేవలం 580 వార్డులు, డివిజన్లను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్.. గతం కంటే ఏకంగా 900కు పైగా స్థానాలను అదనంగా దక్కించుకుంది.బీఆర్ఎస్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ 781 డివిజన్లు, వార్డుల్లో విజయం సాధించింది. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి 26 శాతం స్థానాలు లభించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 1,767 స్థానాల్లో గెలుపొందిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు 1,000 స్థానాలను కోల్పోవడం గమనార్హం. అయితే రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీలే మెరుగైన ఫలితాలు సాధించడం కూడా గమనించ వలసిన విషయం. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో 311 చోట్ల విజయం సాధించగా, ఈసారి ఆ పార్టీకి 3335 స్థానాలు దక్కాయి. అంటే మొత్తం వార్డులు, డివిజన్లలో 11.3 శాతం గెలుపొందింది. మరోవైపు సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 331 (11.3 శాతం) చోట్ల విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే సీపీఎం, ఎంఐఎం స్థానాలు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. రెండుచోట్ల మినహా కాంగ్రెస్ జోరు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. ఉమ్మడి ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలనూ స్వీప్ చేయగా, నల్లగొండలో కేవలం ఒక్క మున్సిపాలిటీ మినహా 16 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మెజార్టీ స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్న్ను దక్కించుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ మెరుగైన ఫలితాలే సాధించినప్పటికీ ఉమ్మడి మెదక్‌లో కొంత డీలా పడింది. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మున్సిపాలిటీల్లోనూ కొంత వెనుకబడింది. ఇక్కడ గులాబీ పరిమళం ఉమ్మడి మెదక్, హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీకి ఈ రెండు చోట్లనే ఎక్కువ స్థానాలు రాగా, 26 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కొంచెం అటూ ఇటుగా అవే ఫలితాలు వచ్చాయి. అయితే అప్పటి ఎన్నికల తరహాలోనే గ్రామీణ తెలంగాణ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఫలితాలు రావడం గమనార్హం. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు నారాయణపేట, నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌నగర్ తదితర మున్సిపాలిటీలు, నిజామాబాద్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థానాలు లభించాయి.కమలం పార్టీ విషయానికొస్తే ఈ ఎన్నికకల్లో నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపగలిగింది. కొన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఓటమి చవి చూడాల్సి వచి్చంది. వార్డుల వారీగా వచి్చన సంఖ్యలో గతంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు లేకపోవడం, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందనే సంకేతాలు కరీంనగర్, నిజామాబాద్ మినహా పురపాలికల్లో పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. 40 చోట్ల హంగ్! గతంలో ఎన్నడూ లేని విధంగా 36 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడింది. అంటే వీటిల్లో సొంతంగా ఎవరూ మేయర్, చైర్పర్సన్లను దక్కించుకునే అవకాశం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్‌కు 31 డివిజన్లు అవసరం కాగా, సీపీఐ, కాంగ్రెస్‌లకు చెరి 22 స్థానాలు మాత్రమే లభించాయి. ఇక నిజామాబాద్‌లో కూడా మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 31 స్థానాల కంటే మూడు స్థానాలు వెనుకబడిన బీజేపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ ఎంఐఎం (13), కాంగ్రెస్ (18)లకు కలిపి మ్యాజిక్ ఫిగర్ లభించడం గమనార్హం. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఆ పార్టీ అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైపోయింది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్‌కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులు కూడా ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, ఏదీ కుదరకపోతే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని పదవులు, పదవీకాలం పంచుకోవడం లాంటి వ్యూహాలతో మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. క్యాంపులు షురూ..! ఏకంగా 40 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 16వ తేదీ వరకు గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాపాడుకోవాల్సి ఉండడంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు నేటి వరకు గడువు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు. రాజ్యసభ సభ్యులు శనివారం సాయంత్రం లోగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అలా నమోదు చేసుకున్నవారికే.. ఈనెల 16వ తేదీన నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత ఉంటుంది. కార్పొరేషన్లలో ఇలా.. నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. నల్లగొండ, మంచిర్యాల, రామగుండంలో మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమైంది. సీపీఐతో హోరాహోరీ తలపడిన కొత్తగూడెంలో మ్యాజిక్ ఫిగర్‌కు 9 స్థానాలు తక్కువైనా ఆరుగురు ఇండిపెండెంట్లు గెలవడం, ఎంపీ, రాజ్యసభ సభ్యులూ ఉండడం, అవసరమైతే ఎమ్మెల్సీలను కూడా ఎక్స్అఫీషియోలుగా రంగంలోకి దించడం, లేదంటే సీపీఐతో స్నేహపూర్వక ఒప్పందం చేసుకుని మేయర్ పీఠంపై కూర్చునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.కరీంనగర్లో బీజేపీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్థే మేయర్ కానున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లో ఎంఐఎం సహకారంతో మేయర్ కుర్చీ దక్కించుకునే దిశలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 31కి ఒక్క స్థానం దూరంలో ఉంది.రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనం. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా సంపూర్ణ ఆమోదం తెలిపారు. - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రిమున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సామ, భేద, దాన, దండోపాయాలన్నీ ప్రయోగించినా ప్రజలమనసు గెలవలేకపోయింది. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతం. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అవసరమైతే లౌకిక శక్తులతో కలిసిపనిచేస్తాం - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ గెలిచే అవకాశాలున్న చోట కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్ర పన్ని ఓడించాయి.ఈ మూడు పార్టీల మధ్య ఫెవిక్విక్ బంధం మరింత బలోపేతమైందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తమ మనుగడకుప్రమాదమన్న అక్కసుతో మజ్లిస్, అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు వ్యూహాత్మకంగా ఓడించే ప్రయత్నం చేశారు. - రాంచందర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
నల్లగొండ అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే నల్లగొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు.ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు.ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారుఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు -
మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్
-
వారికే ఈ విజయం అంకితం.. సీఎం రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026 -
సిరిసిల్లలో కారు జోరు BRS లో ఫుల్ జోష్
-
కాంగ్రెస్ గెలిచినా.. తగ్గని BRS క్రేజ్
-
కరీంనగర్ లో కాంగ్రెస్ జోరు వెనకబడ్డ బీజేపీ, బీఆర్ఎస్
-
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
-
ఎన్నికల ఫలితాల్లో ట్విస్ట్.. ఐదు చోట్ల హంగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్‌లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.ఏఐఎఫ్బీ ప్రభంజనం.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.కాంగ్రెస్ హవా.. కారు జోరు.. కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి. -
క్యాంపు రాజకీయాలు..? ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు దాదాపు ఖరారవడంతో పార్టీలన్నీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది.మున్సిపల్ ఎన్నికల చట్టం రూల్ 63 ప్రకారం గెలిచినసదరు అభ్యర్థికి సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరని పేర్కొంది. Form XXVII ప్రకారం ఎలక్షన్ సర్టిఫికేట్ అందించాలని తెలిపింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలని తెలిపింది. ఎన్నికల్లో గెలిచినట్లుగా సర్టిఫికేట్ అందుకున్న అభ్యర్థి తప్పనిసరిగా అతని సంతకం చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇదివరకే కొంతమంది అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో తిరిగి వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
మధిర, హాలియాలో కాంగ్రెస్ కైవసం
-
కరీంనగర్ లో బీజేపీ డామినేషన్..
-
మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ విజయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. చిట్యాల, చండూరు, హాలియా, నందికొండ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.👉మరోవైపు.. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. గడ్డపోతారంలో మొత్తం 18 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక, నందికొండలో 12 వార్డులకు గాను.. 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు.. కే. సముద్రం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.👉సుల్తానాబాద్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. మొత్తం 15 వార్డులకు గానూ 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ, బీఆర్ఎస్, ఇతరులు ఒక్కో వార్డును దక్కించుకున్నారు.👉డోర్నకల్‌లో హస్తం పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్ దక్కించుకోగా, నాలుగింటిలో బీఆర్ఎస్ విజయం సాధించింది.మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరిపెడ 15 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-6 విజయం సాధించాయి. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చండూరు(10) స్థానాల్లో కాంగ్రెస్-7, బీఆర్ఎస్-2, సీపీఐ-1 విజయం సాధించాయి.చిట్యాల కాంగ్రెస్ విజయం చోటుచేసుకుంది. చిట్యాల (12) స్థానాల్లో కాంగ్రెస్-9, బీఆర్ఎస్-2 విజయం. హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. హాలియాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్-8, బీఆర్ఎస్-2 విజయం. గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం. గుమ్మడిదల 22 స్థానాల్లో బీఆర్ఎస్-14, కాంగ్రెస్-4. బీజేపీ-2 విజయంచొప్పదండి కాంగ్రెస్ వశం.. చొప్పదండిలోని 14 స్థానాల్లో కాంగ్రెస్-10, బీజేపీ-3, బీఆర్ఎస్-1 స్థానం విజయం. -
20 వేల మందితో కౌంటింగ్.. కరీంనగర్ లో BJP జోష్
-
Watch Live: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
-
వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజారిటీ మున్సిపాలిటీలను దక్కించుకుంది.దాదాపు అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మున్సిపాలిటీలుకాంగ్రెస్బీఆర్ఎస్బీజేపీఎంఐఎంఇతరులు1జనగాం1213010042స్టేషన్‌ఘన్‌పూర్13050003నర్సంపేట2106010014వర్ధన్నపేట050600015పరకాల130603006డోర్నకల్11040007కేశసముద్రం08080008మహబూబాబాద్13111019మర్రిపెడ090500110తొర్రూర్070900011భూపాలపల్లి1610020112చొప్పదండి1001030013హుజురాబాద్1608050114జమ్మికుంట1012040415ధర్మపురి15000016జగిత్యాల220406021417కోరుట్ల18080600118మెట్పల్లి06061000419రాయికల్03030500120సిరిసిల్ల0627050021వేములవాడ1305080022మంథని1101000123పెద్దపల్లి27010100224సుల్తానాబాద్1201010025ఎదులాపురం2402000126కళ్లూరు1207000127మధిర1801000328సత్తుపల్లి170600029వైరా12050100230అశ్వరావుపేట1720100231ఇల్లందు1903000232ఆదిలాబాద్11062106033భైంసా01006120734ఖానాపూర్03040400135నిర్మల్24021303036ఆసిఫాబాద్070900437కాగజ్‌నగర్09110501438బెల్లంపల్లి14140100539చెన్నూర్11040200140క్యేతనపల్లి0710000141లక్సెట్టిపేట1103010042ఆమనగల్లు0108060043చేవెళ్ల1104030044ఇబ్రహీంపట్నం08130200145మొయినాబాద్10060400546షాద్‌నగర్15110100147శంకరపల్లి0940000248కొడంగల్1001001049పరిగి0808000250తాండూరు19120201151వికారాబాద్070303010152అలియాబాద్08070300153ముచ్చింతలపల్లి0914010054ఎల్లంపేట0812040055ఆర్మూర్19050801056భీంగల్080400057బోధన్17503120158బాన్సువాడ110303010159బిచ్కుంద100200060కామారెడ్డి19111600361ఎల్లారెడ్డి1001000162ఆలేరు0703020063భువనగిరి22040400564చౌటుప్పల్13030301065మోత్కురు0803000166పోచంపల్లి06050100167యాదగిరిగుట్ట08010200168హుజుర్నగర్1904000369కోదాడ2603000670నేరేడుచర్ల0905000171సూర్యాపేట31110100572తిరుమలగిరి051000073చండూరు0603000174చిట్యాల0902000175దేవరకొండ11060100276హాలియా110100077మిర్యాలగూడ31140100278నందికొండ110100079చేర్యాల050700080దుబ్బాక04110200381గజ్వేల్07110100182హుస్నాబాద్160400083ఆందోల్-జోగిపేట1603000184గడ్డపోతారం0314000185గుమ్మడిదల04150200186ఇంద్రేశం06090200187ఇస్నాపూర్1012000488జిన్నారం06080400289కోహిం080501010190నారాయణఖేడ్1103010091సదాశివపేట16080100192సంగారెడ్డి221002010393జహీరాబాద్141503020394మెదక్14150200195నర్సాపూర్0605040096రామాయంపేట0803010097తూప్రాన్0409030098భూత్పూర్0701020099దేవరకద్ర060401001100కోస్గి160000101మద్దూరు09060001102మక్తల్1200300103నారాయణపేట 0702110201104అలంపూర్0505000105గద్వాల1611070102106ఐజా0713000107వడ్డేపల్లి01010008108అమరచింత03030300109ఆత్మకూరు06010300110కొత్తకోట100301001111పెబ్బేరు0705000112వనపర్తి200802002113కల్వకుర్తి 130305001114కొల్లాపూర్1603000115నాగర్‌కర్నూలు1806000116ములుగు12051002 -
నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఫలితాలు.. కాంగ్రెస్ హవా
Telangana Municipal Elections 2026 Results👉వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు👉వార్డుల వారీగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. నిజమాబాద్ : కార్పొరేషన్ 60 డివిజన్లో ముగిసిన ఓట్ల లెక్కింపుఅతిపెద్ద పార్టీ గా బీజేపీ ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత రెడ్డి ఓటమిబీజేపీ 28కాంగ్రెస్ 18ఎంఐఎం 13బీఆర్ఎస్ 01తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా116 మున్సిపాలిటీల్లో 72 చోట్ల కాంగ్రెస్ విజయం15 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ రామగుండంలో కాంగ్రెస్ విజయం వెనుక మంత్రి శ్రీధర్‌బాబు కీలక పాత్రపెద్దపల్లి జిల్లాలో చక్రంతిప్పిన మంత్రి శ్రీధర్బాబుమంథని మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ దక్కించుకున్న కాంగ్రెస్రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ పలు మున్సిపాలిటీల్లో హంగ్హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో హీటెక్కిన పాలిటిక్స్చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ స్కెచ్ నిజమాబాద్ : కార్పొరేషన్ లో 60 డివిజన్లకు ఓట్ల లెక్కింపు26 డివిజన్ల లో ముందంజలో బీజేపీ అభ్యర్థులుకాంగ్రెస్ 17 డివిజన్లలో ముందంజఎంఐఎం 10 డివిజన్లలో ముందంజబీఆర్ఎస్ ఒక డివిజన్లో ముందంజ కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుపోతాం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాంకాంగ్రెస్ ప్రభుత్వం మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టిందిఅధికారుల్ని అడ్డం పెట్టుకుని గెలవాలని చూశారుకాంగ్రెస్, బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్ఎస్కే ఉందికాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్(మొత్తం 60 డివిజన్లు)ఏ పార్టీకి రాని స్పష్టమైన మెజార్టీసీపీఐ -24చోట్ల గెలుపుకాంగ్రెస్-20చోట్ల గెలుపుబీఆర్ఎస్-09సీపీఎం -01బీజేపీ -01 నల్లగొండ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంమంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసంరామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్‌దే కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసంకరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో 3 గంటల 50 నిమిషాల వరకు అప్డేట్స్బీజేపీ 33కాంగ్రెస్ 12బీఆర్ఎస్ 9ఇండిపెండెంట్స్ 6ఎంఐఎం 3ఆల్ ఇండియా ఫార్వబ్లాక్-3రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 3.17pmవరకు ఫలితాలు -48కాంగ్రెస్ 31బీఆర్ఎస్ 12బిజెపి 01ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 03ఇండిపెండెంట్ 01సిద్ధిపేట జిల్లాహుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం మెదక్: నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనారాయణపేట: మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంవరంగల్: పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్: కల్వకుర్తిమున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: షాద్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంరంగారెడ్డి: శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమెదక్: రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కైవసంమెదక్: తుప్రాన్మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ ఆధిక్యందాదాపు 15 మున్సిపాలిటీల్లో హంగ్దేవరకద్ర, కేసముద్రం, జహీర్బాద్లో హంగ్అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామల్ హంగ్ఆసిఫాబాద్, జమ్మికుంట,జిన్నారంలో హంగ్మహబూబాబాద్,బోధన్, వేములవాడ, ఆలియాబాద్‌లో హంగ్ జగిత్యాల జిల్లా :ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్15/15 స్థానాలు కాంగ్రెస్ కైవసంమొత్తం స్థానాలు 1515స్థానాల్లో ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేక పోయిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ప్రభావం చూపని బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులుఖమ్మం:వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంనిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన16 వ వార్డు రీ కౌంటింగ్ చెయ్యాలని జీవన్ రెడ్డి డిమాండ్కరీంనగర్ జిల్లా:తొలి రౌండ్ ముగిసేసరికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల్లో 30 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న బీజేపీరాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: ఎస్ఈసీ రాణి కుమిదినిఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది.16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది.మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు సిద్దిపేటచేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఇల్లందు మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్మహబూబాబాద్ జిల్లా;మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్_ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల అందోళనకౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్ది గుగులోత్ జ్యోతి రమేష్. 135 ఓట్ల తో గెలుపుజ్యోతి రమేష్ ను క్యాంపు కు తరలించడానికి మంతనాలుక్యాంప్ కి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్పోలీసుల రంగ ప్రవేశంఆభ్యర్ధిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులుమాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెసు కార్యకర్తలు.. నిరసనఖమ్మం జిల్లాకల్లూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా:ఆర్మూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీరాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 1, 6, 26 వార్డుల్లో రీకౌంటింగ్ కు పట్టుబడుతున్న సమీప ప్రత్యర్థులుకౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించిన ఆయా వార్డు అభ్యర్థులుబయటకు నెట్టేసిన పోలీసులు..కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసంకౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతమేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతస్వతంత్ర అభ్యర్థి వెంకటేష్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులుపోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, తోపులాట ధర్మపురిలో సంచలన ఫలితాలు..ధర్మపురి రాజకీయాల్లో సంచలన ఫలితాలు.ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాభవం.15 స్థానాలకు 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం..రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న ధర్మపురి మున్సిపల్ ఫలితాలు.. హంగ్ ఎఫెక్ట్.. స్వంత్రులకు గిరాకీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీ.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ.దేవరకద్ర, కేససముద్రం, జహీరాబాద్‌లో హంగ్.అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామలో హంగ్.ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలోనూ హంగ్.బోధన్, వేములవాడ, అలియాబాద్‌లో హంగ్.ఈ నేపథ్యంలో కీలకం కానున్న స్వతంత్రులు. కాంగ్రెస్ ఆధిపత్యం.. మధిరలో కాంగ్రెస్ ఘన విజయంమధిర 22 వార్డుల్లో 21 వార్డులు కాంగ్రెస్ కైవసం.ఒక్క వార్డుకే పరిమితమైన బీఆర్ఎస్మెదక్ రామాయంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమహబూబ్నగర్ కొత్త మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంసంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ విజయంపెబ్బేరు కాంగ్రెస్ కైవసం. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంజమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యంఆత్మకూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంసిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం బీఆర్ఎస్ జోరు.. భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.15 వార్డుల్లో 11 చోట్ల బీఆర్ఎస్ విజయం.క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం. కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మూడు చోట్ల హంగ్.. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్.కేస సముద్రంలో చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం.అలంపూర్‌లో చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. సిరిసిల్లలో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం.39 వార్డులకు గాను 14 వార్డుల్లో ఫలితాలు వెల్లడి.14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.ఘన్‌పూర్‌లో 18 స్థానాల్లో కాంగ్రెస్-13, బీఆర్ఎస్-5.హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.హుజురాబాద్ 30 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్.ఇస్నాపూర్‌లో 26 స్థానాల్లో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4జనగామలో బీఆర్ఎస్ ఆధిక్యం.జనగామలో 30 స్థానాల్లో బీఆర్ఎస్-13, కాంగ్రెస్-12, ఇతరులు-4గాంధీభవన్‌లో సంబురాలు..హైదరాబాద్..గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబురాలు.బాణాసంచా పేల్చి, స్వీట్లు తినిపించుకున్న కాంగ్రెస్ నేతలు. 👉ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ హవా.👉ఉమ్మడి జిల్లాలో కీలక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం.ఇప్పటి వరకు వెలువడిన 18 స్థానాల్లో ఫలితాల ప్రకారం..13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం. ఖమ్మంలో కాంగ్రెస్ హవా..మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు మున్సిపాలిలీలు కాంగ్రెస్ కైవసం. కొల్లాపూర్, మంథని, నేరుడుచర్చ కాంగ్రెస్ వశం..ఐజా మున్సిపాలిటీ బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో కాంగ్రెస్ హవా..బాన్సువాడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.19 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.3 వార్డుల్లో బీజేపీ విజయం2 వార్డుల్లో స్వతంత్రులుఒక వార్డులో బీఆర్ఎస్ విజయం. కామారెడ్డిలో బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం.బోణీ కొట్టని బీజేపీ.కొత్త మున్సిపాలిటీలో ఎగిరిన కాంగ్రెస్ జెండా. 👉ఇప్పటి వరకు 80 మున్సిపల్ వార్డుల ఫలితాలను స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు అందించిన అధికారులు👉52 వార్డులు కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇండిపెండెంట్, 1 ఇతరులు గెలుపు.దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంమొత్తం 20 వార్డులుకాంగ్రెస్-11బీఆర్ఎస్-6 ఇండిపెండెన్స్-2బీజేపీ-1 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయంచిట్యాల, చండూరు, హాలియా, నందికొండలో కాంగ్రెస్ విజయం. మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం. మరిపెడ 15..కాంగ్రెస్-8బీఆర్ఎస్-6 చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.చండూరు(10)కాంగ్రెస్-7బీఆర్ఎస్-2సీపీఐ-1చిట్యాల కాంగ్రెస్ విజయం.చిట్యాల (12)కాంగ్రెస్-9బీఆర్ఎస్-2 హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసంహాలియా 12..కాంగ్రెస్-8బీఆర్ఎస్-2 గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.గుమ్మడిదల 22బీఆర్ఎస్-14కాంగ్రెస్-4బీజేపీ-2బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ.. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.22 వార్డుల్లో కాంగ్రెస్ 16 విజయం.వేములవాడలో బీజేపీ ఆధిక్యం.కోహిర్లో (16) ఇలా..కాంగ్రెస్-6బీఆర్ఎస్-5బీజేపీ-1 నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం.నందికొండ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా కాంగ్రెస్నందికొండలో మొత్తం 12 వార్డులు.కాంగ్రెస్-11బీఆర్ఎస్-1 గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసంసంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 18 వార్డులుబీఆర్ఎస్-14కాంగ్రెస్-3ఇండిపెండెంట్-1. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కిషోర్ గెలుపు13వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీ నరసింహ రెడ్డి గెలుపు17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటేష్ గెలుపుమూడో వార్డు అభ్యర్థి ప్రియాంక రెడ్డి బీజేపీ విజయం.16వ వార్డు అభ్యర్థి కె.లక్ష్మీ బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంహుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4 5 6 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయంబీఆర్ఎస్ హవా..మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయంఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపుమేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలుపుసంగారెడ్డి జిల్లా గడ్డ పోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం... ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఒకటో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.విజయాలు ఇలా.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.వరంగల్ నర్సంపేట మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.వైరా మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో ఏడు వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.కొల్లాపూర్ 6,14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. అభ్యర్థుల విజయాలు..యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు బీజేపీ అభ్యర్థి రాధ గెలుపుమరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యం.సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు.100 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.గడ్డిపోతారం 16వ వార్డులో బీఆర్ఎస్ విజయం. ఆధిక్యం ఇలా.. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కాంగ్రెస్ లీడ్.ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడ్.యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో బీజేపీ గెలుపు.ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం.నందికొండ, హాలియా, చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్.నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యం. నల్లగొండ జిల్లాహాలియా మున్సిపాలిటీలోపోస్టల్ బ్యాలెట్ల ఫలితాలుకాంగ్రెస్ :32టీఆర్ఎస్ :8బీజేపీ : 1 ఇండిపెండెన్స్ :2నోటా: 1మొత్తం: 44చొప్పదండి మున్సిపల్ రెండవ వార్డులో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుబీజేపీ:1కాంగ్రెస్:2టీఆర్ఎస్:1 ఆధిక్యాలు ఇలా.. ఆదిలాబాద్..పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.ఖమ్మం జిల్లామధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం.మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజ.కాంగ్రెస్ -29బీఆర్ఎస్ -5నోటా -1 సంగారెడ్డిసంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలుమొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం3 వార్డుల్లో BRS ఆధిక్యంక్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుహైదరాబాద్..క్యాంప్ రాజకీయాలకు కాంగ్రెస్ కసరత్తుఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలునగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన హస్తం నేతలు350 రుమాలు బుక్ చేసిన కాంగ్రెస్నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపుఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపునకు తరలించిన కాంగ్రెస్ నేతలుబీఆర్ఎస్ ఆగ్రహంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా..అశ్వారావుపేట కౌంటింగ్ హాల్లో అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం..అధికార పార్టీ అభ్యర్థితో ముగ్గురిని అనుమతిస్తూ, బీఆర్ఎస్ నుండి ఒక్కరినే అనుమతి ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనఅందరికి ఒకే రూల్ ఉండాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలుబీజేపీ అభ్యర్థి మృతి.. మంచిర్యాల..లక్షెట్టిపేట పదో వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ.బీజేపీ లీడ్.. కరీంనగర్ జిల్లా:కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ లీడ్.పలు వార్డుల్లో బీజేపీ ఆధిక్యత.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు తర్వాత ప్రకటించనున్న అధికారులు.కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఈసీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కౌంటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.వెబ్ కాస్టింగ్ విధానాన్ని కమిషన్ ఆఫీసులో పరిశీలిస్తున్న చీఫ్ రాణి కుమిదిని.ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఉండాలని SEC ఆదేశం.పోలింగ్ రోజు తరహాలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి.కౌంటింగ్ కేంద్రంలో అధికారులు జాగ్రత్తగా ఉండాలి.కౌంటింగ్ జరగని చోట ఆలస్యానికి కారణం ఏంటని ఆరా తీసిన SEC. 👉మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుస్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.కరీంనగర్ జిల్లా:హుజురాబాద్‌లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్.గడ్డపారతో స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొట్టిన అధికారులు.కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతఎన్నికలపై అన్ని పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠకౌంటింగ్ కేంద్రాల సందడి వాతావరణం,. క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు ఎన్నికలు ఫలితాలు.. టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలుఎన్నికల ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ఫలితాలపై అలర్ట్‌గా ఉండాలన్న పీసీసీ ఛీఫ్.హాంగ్ వచ్చే అవకాశం ఉన్న చోట వెంటనే పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రికి సమాచారం ఇవ్వాలని ఆదేశం..ఇంకా క్యాంప్‌లకు తరలించని అభ్యర్థులను వీలైనంత త్వరగా తరలించాలని సూచన..ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయే వార్డులలో కచ్చితంగా రీ కౌంటింగ్‌కు అడగాలని సూచించిన మహేష్ కుమార్. ఈసీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు..తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వద్ద భారీ బందోబస్తు.పోలింగ్ రోజుతో పోల్చితే మూడింతల బందోబస్తు పెంచిన పోలీస్ శాఖ.పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని SEC ఆదేశం.SEC నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీ, BRS నేతలు.కౌంటింగ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే SECకి చేరుకుంటారనే సమాచారంతో బందోబస్తు పెంచిన అధికారులు.ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపుఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులుఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికఅభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలుకట్టుదిట్టమైన భద్రత: డీజీపీకౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్రెడ్డిలెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రతపోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘాకమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షణకౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలుఅన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుందా? బీఆర్ఎస్ పట్టునిలుపుకొనేనా? బీజేపీ నిలబడేనా?ఫలితాలపై సర్వత్రా ఆసక్తిమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. -
పుర తీర్పు నేడే
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల గుర్తులపై జరిగిన ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తలపడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓటర్లు తమ ఓట్లను బ్యాలెట్ పేపర్లలో నిక్షిప్తం చేయగా, బ్యాలెట్ బాక్స్‌లను ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అక్కడ భద్రంగా ఉన్న బ్యాలెట్‌బాక్స్‌లను ఉదయం అభ్యర్థుల సమక్షంలో గట్టి బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కౌంటింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది ప్రజాతీర్పుతో వెల్లడికానుంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 73.01 శాతం ఓట్లు పోలైన విషయం విదితమే. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడమనేది అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కావొస్తుండటంతో రాబోయే రెండున్నరేళ్లకు సంబంధించి పట్టణ ప్రజలు ఏవిధమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చర్చనీయాంశమైంది. అదేవిధంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించిన బీఆర్ఎస్ అదే ఒరవడిని కొనసాగించి గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మంచి ప్రదర్శన కనబరిచినందున, పట్టణప్రాంతాల్లో పట్టు ఉందని భావిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా ఫలితాలను సాధించగలదా అన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి? ఎవరికి ప్రతికూలంగా ఉంటాయన్న వాడీవేడీ చర్చ జరుగుతోంది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం ద్వారా తనపట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ యత్నిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం పూర్వవైభవం కోసం ప్రయతి్నస్తోంది. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని నిచ్చెనగా వినియోగించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. దీనికితోడు ఎంఐఎం తన పరిధిని విస్తరించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్నికల ఫలితాల తరువాత చైర్పర్సన్/ మేయర్ పదవులు దక్కించుకోవడానికి ఆయా పార్టీలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సీట్లు తగ్గే మున్సిపాలిటీల్లో గెలిచిన వారికి ఎరవేసే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలనేలా పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ వెయ్యి ఓట్లకు ఒక రౌండ్.. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని వెల్లడించారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ ఓట్లను వార్డుల వారీగా ఒకచోట వేసి వాటిని కలిపిన తరువాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్‌గా చేస్తామని, ఆవిధంగా 40 బండిల్స్‌ను ఒకచోట చేరుస్తామన్నారు. ప్రతీ వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌గా లెక్కించనున్నారు. మున్సిపాలిటీల్లో మూడు నాలుగు రౌండ్లలో వార్డు ఫలితం తేలుతుందని, అదే కార్పొరేషన్లలో అధికంగా ఓట్లు ఉన్నందున అక్కడ ఏడెనిమిది రౌండ్లకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థికి వచ్చిన వ్యాలిడ్ ఓట్లను వంద లెక్కన కట్టనున్నట్లు తెలిపింది. నోటా, ఇన్వ్యాలిడ్ ఓట్లను కూడా వంద లెక్కన బండిల్స్‌గా చేస్తామని పేర్కొంది. ప్రతీ బ్యాలెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే.. ఓటు వచ్చిన అభ్యర్థికి కేటాయించిన కంపార్ట్మెంట్లో వేస్తారని పేర్కొంది. కౌంటింగ్ పూర్తయిన తరువాత.. సంబంధిత అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్న తరువాత ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పింది. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తరువాత గెలిచిన అభ్యర్థికి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. మొబైల్ ఫోన్లకు అనుమతి నో.. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సూపర్వైజర్, సిబ్బంది, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌ను అనుమతించబోమన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (సీఆర్పీసీ 144) అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. అందువల్ల ఫలితాల అనంతరం అభ్యర్థులు ఎవరూ కూడా ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం నిషేధమని స్పష్టం చేసింది. ఏడు కార్పొరేషన్లలో 414 డివిజన్లు. 116 మునిసిపాలిటీల్లో 2,582 వార్డులున్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉండగా, అత్యల్పంగా నల్లగొండలో 48 ఉన్నాయి. -
కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్
-
మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా.. పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..!
-
పోలింగ్ బూతుల దగ్గర లీడర్ల హల్ చల్
-
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్‌కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల లోనే ఘోరమైన పాలనా వైఫల్యాలు మూటగట్టుకు న్న సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయంతో మున్సిపల్ ఎన్ని కల్లో దౌర్జన్యకాండకు దిగార ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణ ఎన్నికల్లోనూ తప్పదనే ఆందోళన తోనే రేవంత్ అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల రూపాయలతో ప్రజాతీర్పు నే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణు లపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్‌రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుంది’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎన్నిక ల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలు వీరో చితంగా పోరాడారు. వారు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది’అని కేటీఆర్ కొనియాడారు. దాడులు చేయడం హీనమైన సంస్కృతిముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియో గాని కి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డా రని మాజీ మంత్రి హరీశ్‌రా వు విమర్శించారు. ‘నామినే షన్ల దాఖలు మొదలు పోలింగ్ ముగిసేంత వరకు కాంగ్రెస్ అనేక అరాచకాలకు పా ల్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థు లను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిద ర్శనం. చట్టాన్ని కూడా లెక్క చేయ కుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడు గులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబ డటం ప్రజాస్వామ్య వ్యవస్థ ను అవమానించడమే. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు’అని హరీశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
73.01 శాతం పోలింగ్.. ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 123 పురపాలక సంఘాలకు కలిపి 73.01 శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05 శాతం, మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వర్గాలు ప్రకటించాయి. మున్సిపాలిటీల్లో అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం ఓట్లు పోలవగా, అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. కార్పొరేషన్ల విషయానికొస్తే నల్లగొండలో అత్యధికంగా (77.36%), నిజామాబాద్‌లో అత్యల్పంగా (59.12%) పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎక్కడా రీపోలింగ్ అవసరం ఏర్పడలేదని వెల్లడించాయి. అయితే నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సంగారెడ్డిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులను దూషించినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఈ రెండు ఘటనలపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సంబంధిత జిల్లా ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదులుంటే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని..ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్, డీజీపీ శివధర్‌రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర అధికారులతో కలిసి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పరిస్థితులను, బందోబస్తు ఏర్పాట్లను కమ్యూనికేషన్ సాధనాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. రూట్ మొబైల్ ఫోర్స్, స్రైకింగ్ పోర్స్, స్పెషల్ స్రైకింగ్ ఫోర్స్ కదలికలను గూగుల్ మ్యాపింగ్‌కు అనుసంధానం చేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి కూడా వారితో కలిసి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్ ఎన్నికల ప్రక్రియపై యువతలో అవగాహన పెంచడంతో పాటు ఓటర్లలో ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని, తద్వారా ఓటరు శాతం పెరుగుదలకు ఇది సహకరిస్తుందని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జనరల్ అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపారు. ఇలావుండగా పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు, సౌకర్యాల లోపంపై అక్కడక్కడా ఫిర్యాదులు అందాయి. రిసీవింగ్ సెంటర్లకు బ్యాలెట్ బాక్సులు పోలింగ్ ముగిసిన తర్వాత సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు తీసుకుని 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన రిసీవింగ్ సెంటర్లకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు సురక్షితంగా చేర్చడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న రాణీకుముదిని, డీజీపీ శివధర్‌రెడ్డి ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు ఈ నెల 13న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తొలిసారిగా టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు కొనసాగే అవకాశముంది. -
‘సీఎం రేవంత్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత…— KTR (@KTRBRS) February 11, 2026 -
మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్ డేట్స్ ఉద్రిక్తతల నడుమ పోలింగ్..
-
మున్సిపాలిటీ వార్డులో ఉద్రిక్తత
-
మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తల ఫైట్
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకుంది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారికి అక్కడి నుంచి చెదరగొట్టారు.కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి చేయి చేసుకున్నారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుపై చేయి చేసుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణ. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసిన కృష్ణ. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు.బీఆర్ఎస్ శ్రేణుల డబ్బుల పంపిణీభూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు. దీంతో, బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.👉జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం, తోపులాట జరిగింది. నినాదాల విషయంలో బీఆర్ఎస్, ఎంఐఎం వర్గీయుల వాగ్వాదం చోటుచేసుకుంది.👉వరంగల్‌లోని నర్సంపేట పరిధి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా డబ్బులు పంచుతుండగా కార్యకర్తలను పట్టుకున్న పోలీసులు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ వద్ద రూ.10 వేలు స్వాధీనం.👉వికారాబాద్‌లోని పరిగిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల వాగ్వాదం నెలకొంది. 13వ వార్డు 27వ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. స్థానిక ఓటర్లే గుర్తింపు కార్డులతో ఓట్లు వేస్తున్నారన్న కాంగ్రెస్ వర్గీయులు. నిరసనకారులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు. ఐదు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 13వ వార్డు ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. -
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
-
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్
-
మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్.. -
కార్పొరేషన్ కహానీ
రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన జాబితాలో మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉన్నాయి. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం గతం నుంచి కార్పొరేషన్లుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండలో పోటీలో ఉంది. దీంతో ప్రధాన పార్టీల గెలుపోటములపై మజ్లిస్ ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే ఫైట్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీలగిరి కార్పొరేషన్‌పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. అయితే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే కొనసాగుతోంది. ఇటీవల కార్పొరేషన్‌గా మారిన నల్లగొండలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్య ర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. బీజేపీ మజ్లిస్ మూడో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.బీజేపీ– కాంగ్రెస్ హోరాహోరీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు లేవు. అయితే ఫలితాల అనంతరం మాత్రం పొత్తులు నెలకొనే పరిస్థితులు ఉంటాయనే అంచనా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రానిపక్షంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య అవసరాన్ని బట్టి పొత్తులు కుదిరే అవకాశముంది. కమలం – హస్తం..సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. అయితే కొన్ని డివిజన్ల పరిధిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల నడుమ త్రిముఖపోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ, రెబెల్స్ మధ్య పోటీ ఉంది. ఎంఐఎం కూడా 15 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపింది. ఈ కార్పొరేషన్ పరిధిలో హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కూడా కాంగ్రెస్‌కే దక్కింది. మెజారిటీ డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులదే పైచేయిగా ఉంది. మొదటి సారిగా బీజేపీ అధిక డివిజన్లలో పోటీ చేస్తోంది.‘గూడెం’లో కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ వైరివర్గాలుగా మారి కొత్తగూడెంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎంతో జత కట్టి 58 డివిజన్ల నుంచి బరిలోకి దిగింది. సీపీఐ, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని 57 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. రెండు పార్టీల రెబెల్స్‌పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ చివరకు ఒంటరిగానే బరిలో నిలిచింది. మంచిర్యాలలో కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉండగా, పలు డివిజన్లలో బీజేపీ కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేషన్‌గా మారాక మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఉత్కంఠ రేపుతోంది. నగరంలో అన్నిపార్టీలకు బీసీల మద్దతే కీలకంగా మారింది. అన్ని పార్టీలు మహిళలకు రిజర్వు అయిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ అధికంగా బీసీలకే బీఫాంలు ఇచ్చాయి. పాలమూరు.. త్రిముఖ పోరు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఇలాకా కావడం.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా పాలమూరు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కొన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, మరి కొన్నింటిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఎంఐఎం అభ్యర్థులు 16 డివిజన్లలో పోటీలో ఉన్నారు. వీరికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా, అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. -
ఓట్ల కోసం 'కవర్' డ్రైవ్
కరీంనగర్ కార్పొరేషన్: ఎలక్షన్ ముందు ‘డిస్ట్రిబ్యూషన్’ ట్రెండ్ మారింది. కరీంనగర్‌లోని 66 డివిజన్లలో తక్కువలో తక్కువగా రూ.వేయి, ఎక్కువగా రూ.6 వేల చొప్పున ఓటుకు ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, మద్యం, బహుమతులు పంచారు. నగరవ్యాప్తంగా 2వ డివిజన్ డబ్బుల పంపకాల్లో అత్యంత విలువైన డివిజన్‌గా మారింది. ఇక్కడ ఓ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.6 వేలు ఇచ్చారు. రూ.6 వేలతో కూడిన కవర్‌ను నేరుగా ఓటరుకు అందజేశారు. ఒకే ఇంట్లో నలుగురు నాలుగు కవర్లు అంటే రూ.24 వేలు ఇవ్వడంతో ఓటర్లే ఆశ్చర్యపోయారు. కనీసం రెండు వేల మంది ఓటర్లకు రూ.1.20 కోట్లు పంచినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి ఈ స్థాయిలో పంచడంతో మరో అభ్యర్థి కూడా సెలెక్టెడ్ ఓటర్లకు రూ.5 వేల చొప్పున, ఇతర అభ్యర్థులు ఓటుకు రూ.1,500, రూ.2 వేలచొప్పున పంపకాలు చేపట్టారు. ‘రియల్’ ప్రభావంతోశంకర్పల్లి/మొయినాబాద్: శంకర్పల్లి, మొయినాబాద్‌లో ఓటుంటే బాగుండేది’.. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఓటర్ల ఫీలింగ్. ఎందుకంటారా..? ఇక్కడ ఒక్కో ఓటుకు పలుకుతున్న రేటు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీలున్నాయి. వీటిలో మొయినాబాద్, శంకర్పల్లి హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక్కడ ఒక్క ఓటుకు రూ.వేలల్లో, ఇంట్లో రెండు, మూడు ఓట్లుంటే రూ.లక్షల్లో నగదు అందుతోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వార్డుల్లో పెద్దమొత్తంలో కరెన్సీ వెదజల్లుతున్నారు.15 వార్డులు.. రూ.50 కోట్లుశంకర్పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. 57 మంది బరిలో నిలిచారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వీరు ఇప్పటికే పలు వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.30 వేల వరకు పంచారు. అంతటితోనే ఆగకుండా వెండినాణేలు, పట్టు చీరలు పంపిణీ చేశారు. ఇలా మున్సిపల్ పరిధిలో మొత్తం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశముంది. ఒక్క అభ్యర్థి.. రూ.5 కోట్లుమొయినాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఓటుకు రూ.లక్ష ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉండటం, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలామంది రియల్ వ్యాపారులు కావడంతో డబ్బును లెక్కచేయడం లేదు. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా, త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంచుతుండగా, రెండు మూడు వార్డుల్లో మాత్రం ఓటుకు రూ.30 నుంచి రూ.40 వేలు పంచినట్టు సమాచారం. ఓ వార్డులో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.లక్ష ఇచ్చినట్టు తెలుస్తోంది. తన చేయివాటంతో చివరి నిమిషంలో ఓ ప్రధాన పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఈయన ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వార్డులో రూ.5 కోట్లు పంపిణీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. గుట్టలో ఓటు కాస్ట్లీ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని ఓ వార్డులో ఓ అభ్యర్థి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఒక్కో ఓటుకు చెల్లించాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆ అభ్యర్థి ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం పంపిణీ చేశాడు. ఇంటికి 25 కిలోల బియ్యం బస్తా, మాంసం, చీరలు కూడా అందించారు. అదే వార్డులో మరో అభ్యర్థి రూ.5 వేలు ఓటుకు అందజేశారు. ఇంకో వార్డులో ఓ అభ్యర్థి రూ.7వేలతోపాటు వెండి కుంకుమ భరణి ఓటర్లకు ఇచ్చాడు. మరికొందరు రూ.3 వేల నుంచి రూ.5 వేలతో పాటు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సెంటిమెంట్‌కు తెరలేపారు. ఇస్నాపూర్‌లో బంగారం ఆఫర్బెంగళూరు, చెన్నైలో ఉండే ఓటర్లకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఓటర్లకు బంగారం ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఓటుకు రూ.5 వేల చొప్పున నలుగురు ఓటర్లు ఉన్న ఇంటికి రూ.20 వేలు పంపిణీ చేస్తున్న సదరు అభ్యర్థి..తాను గెలిస్తే నలుగురు ఉన్న ఇంటికి పావుతులం బంగారం ఇస్తామని హామీ ఇస్తుండటం స్థానికంగా చర్చనీ యాంశంగా మారింది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీతోపాటు, ఇంద్రేశం మున్సిపాలిటీలో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. రియల్ వ్యాపారాలు, బిల్డర్లుగా వ్యవహరించే నేతలే ఈ ఎన్నికల్లో అభ్య ర్థులుగా బరిలోకి దిగడంతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేచింది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంది. ఉద్యోగాల నిమిత్తం చెన్నై, బెంగళూరులో ఉండే ఓటర్లకు ఈ మున్సిపాలి టీలోని కొందరు అభ్యర్థులు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తు న్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో నివాసముండే వారికోసం క్యాబ్‌లు సైతం బుక్ చేస్తున్నారు. డబ్బు..చీరల పంపిణీ సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో ఒక్కో ఓటరకు రూ.1,000ల నుంచి రూ.3,000 వరకు నగదు పంపిణీ చేశారు. వీటికి తోడు అదనంగా మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. మహిళా ఓటర్లను చీరల పంపిణీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. -
నేడే మున్సి‘పోల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరి«ధిలోని 8,191 పోలింగ్ కేంద్రాల్లో 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 2,981 వార్డులు, డివిజన్లకు గాను 12,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆప్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. కాగా మున్సిపాలిటీల్లో 12 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. సిబ్బంది రెడీ.. బుధవారం పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో సహా మంగళవారం సాయంత్రానికే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 123 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో తరలివెళ్లారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత అధికారుల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను ముందే ఎంపిక చేసిన 137 స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరుస్తారు. నిరంతర పర్యవేక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తద్వారా పోలింగ్ కేంద్రాల లోపలా, వెలుపలా పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిఘాను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ‘టీ పోల్’లో తెలుసుకోండి.. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘టీ పోల్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్’లో ఓటర్లు తమ ఫోటో ఓటరు గుర్తింపు కార్డు నంబరు (ఎపిక్) సహాయంతో ఓటరు స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. టీ పోల్ యాప్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని ఓటర్ పోర్టల్ నుంచి కూడా ఓటరు స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 9240021456ను ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘హోమ్ ఓటింగ్‘కు అవకాశం ఇవ్వాలి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కేంద్ర ఎన్నికల కమిషన్ 80 సంవత్సరాలు పైబడిన వారు కానీ, వయసుతో నిమిత్తం లేకుండా తీవ్రంగా జబ్బు పడి మంచంలో ఉండి పోలింగ్ బూత్‌కు రాలేని పరిస్థితి ఉన్న వారు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా హోమ్ ఓటింగ్ ప్రొవిజన్‌ను ప్రవేశ పెట్టింది. తద్వారా ఆయా ఓటర్ల ఇళ్లకు పోలింగ్ అధికారులు స్వయంగా వెళ్లి ఓటు వేయించుకుని వచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అటువంటి ప్రొవిజన్ లేదని రిటరి్నంగ్ అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టాలి. – ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ బండారు రామ్మోహన్రావు. -
కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేస్తే ఆగమే: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్/మహబూబాబాద్/భూపాలపల్లి/గూడూరు: ‘అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాందీ, రాహుల్ గాందీల మీద ఒట్టేసి హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత వాటిని గాలికి వదిలేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు అభివృద్ధి,సంక్షేమం గురించి నిలదీస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అబద్దపు హామీలు, మాటలు నమ్మి ఓట్లేస్తే మళ్లీ ఆగమైతం..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి డబ్బులకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పడంతోపాటు అనేక ఇతర హామీలిచ్చి నెరవేర్చలేని రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకావడం లేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి వరంగల్‌లోని భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో కార్నర్ మీటింగ్‌ల ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాని రేవంత్‌రెడ్డి కేవలం కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేసీఆర్‌ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరం కాదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉండకూడదని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిప్పు పెట్టి తగులబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా.. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలన్నా 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలిస్తే..జిల్లాలు ఉండవు ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు చేర్చాలనే ఆలోచనతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల మానుకోట, భూపాలపల్లిని జిల్లాలుగా మార్చారు. ప్రజలకు కలెక్టర్, ఇతర అధికారులను దగ్గర చేర్చారు.. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు తీసివేస్తారటా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జిల్లాలుండవు.. ఏది కావాలో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. వెనకటి రోజులు తెస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిజం చేస్తున్నారన్నారు. వెనకటి రోజులు అంటే యూరియా కోసం చెప్పుల క్యూ పెట్టడమా.. కరెంట్ లేని రాత్రులు గడపడమా.. అని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాళ్లు గండ్ర జ్యోతి, మాలోతు కవిత, పాల్గొన్నారు. మరుగుజ్జుకు కేటీఆర్ ఆర్థిక హామీ.. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సోమవారం నర్సంపేట మీదుగా వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. భీరవెళ్లి భరత్ కుమార్‌రెడ్డి కోరిక మేరకు మార్గమధ్యలో గూడూరులోని రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో గల ఓ చాయ్ కొట్టు వద్ద ఆగారు. కేటీఆర్ చాయ్ తాగుతూ ఎదురుగా కనిపిస్తున్న ఓ చిన్న బాలుడి లాంటి వ్యక్తిని చూసి దగ్గరికి పిలిచి అతడిని ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు అని అడిగాడు. అక్కడే ఉన్న భరత్‌కుమార్‌రెడ్డి ‘సార్.. ఇతని పేరు ధారావత్ వినోద్‌కుమార్. 30ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు’అని చెప్పాడు. అది విన్న కేటీఆర్ ఏమైనా చిరువ్యాపారం చేసుకుంటావా? అని అతన్ని అడగ్గా, చేసుకుంటా సార్ అన్నాడు. భరత్‌కుమార్‌రెడ్డిని చూపుతూ ‘ఇతను నీకు తెలుసా’అని అడగ్గా తెల్సు సార్ అన్నాడు. వెంటనే ‘ఈయనకు రూ.2లక్షలు పంపిస్తా.. నీకు ఇస్తాడు. ఇంటి వద్ద ఏదైనా కిరాణం పెట్టుకో’అన్నాడు. -
‘పుర హోరు’కు తెర
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడింది. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సభలు, ఊరేగింపులు నిర్వహించడం లేదా పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సినిమాలు, టీవీలు, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని హెచ్చరించింది. సంగీత విభావరులు, నాటకాలు, విందులు, ఇతర రూపాల్లో ప్రచారం చేసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే వరకు 48 గంటలపాటు ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేసినా చర్యలు ఉంటాయని చెప్పింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పారీ్టలు, పార్టీ ప్రచారకర్తలు ఎన్నికల నియమావళి మేరకు వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. ఏర్పాట్లపై ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు ఈ ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రణాళికతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ మెటీరియల్‌తో సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనంతో మాత్రమే తరలించాలని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనంలో ఎస్కార్ట్ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్ రూములకు తరలించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటర్ల ఏర్పాటు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, రూట్ వారీగా బస్సుల ఏర్పాటు, పోలింగ్‌కు ముందు రోజు కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్ పలు సూచనలు చేశారు. నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సిబ్బంది మంగళవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో 12,993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 123 చోట్ల ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను చేర్చేందుకు 137 స్ట్రాంగ్ రూమ్‌లు సిద్దం చేశారు. ఒకే విడతలో జరిగే ఎన్నికల్లో 20 వేల మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితోపాటు సుమారు 25వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఈ నెల 13న 136 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అధికారికంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మైకులు మూగబోయాయి. ర్యాలీలు, సభలు నిలిచిపోయాయి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచారం జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది.ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్ల సంఖ్య 52.43 లక్షలు కాగా, అందులో మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు ఉన్నారు. ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది. అందుకోసం 16,301 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.పోలింగ్, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 25,000 మంది పోలీసులను బందోబస్తులో నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,900గా గుర్తించగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 1,400గా గుర్తించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయింది. స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.12ఏళ్లగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి. ఓటు వేసే ముందు గత పాలను గుర్తు చేసుకోండి. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తామని ప్రధాని మోదీ విస్మరించారు.మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలంగాణను అవమానించారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్
-
రేవంత్.. సింగరేణి బంగారం బామ్మర్దికి రాసిచ్చావా?: కేటీఆర్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి న్యాయం చేసేందే కేసీఆర్. సింగరేణి నల్ల బంగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అత్తగారి కొంగు బంగారంగా బావమరిదికి రాసిచ్చారు అంటూ ఆరోపణలు చేశారు.భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి?. జిల్లాలపై కమిటీ వేసిన రేవంత్ నిన్నటి సభలో భూపాలపల్లి జిల్లాను తీసేయం అని చెప్తున్నాడు.అసలు జిల్లాలు ఇచ్చింది కేసీఆర్. అలాంటి జిల్లాలను తీసేయడానికి నువ్వెవరు రేవంత్?. సింగరేణికి న్యాయం చేసింది కేసీఆర్. కానీ, సింగరేణి నల్ల బంగారాన్ని రేవంత్ తన బావ మరిదికి రాసిచ్చారు. నల్ల బంగారం కుంభకోణాన్ని బయటపెట్టగానే ఫోన్ ట్యాపింగ్ అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన ఆధారాలు అన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అగ్గి పెట్టి సాక్షా లు లేకుండా తగలపెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం
తాండూరు/ నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: ‘ముఖ్యమంత్రిని రైతు భరోసా ఇస్తా అంటివి కదా అని అడిగితే లాగులో తొండలు విడుస్తా అంటడు. మహిళలకు రూ.2 వేలు ఏమాయె అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటుండు. తులం బంగారం ఎప్పుడంటే పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. ఇంతకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా లేక బోటీ కొట్టేటోడా అర్థం కావడం లేదు. ఇక నుంచి ఆయన్ను లాగుల తొండల్‌రెడ్డి అనాలేమో’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరుతోపాటు వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని అది భస్మాసుర హస్తమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళితే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ.. రూ.4 వేలు పింఛన్ తీసుకునేవారు కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేలు పెన్షన్ తీసుకున్నోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ప్రజలకు చెప్పమని పంపించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోనియాగాం«దీపై ఒట్టేసి రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరి వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఎన్నికలకు ముందు పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపడంలో మాత్రమే సక్సెస్ అవుతున్నదని, రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునుద్దేశించి విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పైనే కేసులు మోపుతున్నారని, నన్నేమైనా అంటే పడతానని..మా అయ్య జోలికి వస్తే మూడు భాషల్లో తిడతానన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రోహిత్‌రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు. -
నీలగిరి.. నువ్వానేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు జిల్లా అంతటా వామపక్ష రాజకీయాలు బలంగా ఉంటే జిల్లా కేంద్రమైన నీలగిరి మాత్రం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడ మున్సిపల్ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి 13 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీనే మున్సిపాలిటీపై తమ జెండా ఎగురవేసింది. 1951లో 8 వార్డులతో నీలగిరి మున్సిపాలిటీగా ఏర్పడగా, గత నెల 14వ తేదీన 48 డివిజన్లతో నల్లగొండ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. 1953లో మున్సిపాలిటీకి మొదటిసారి ఎన్నికలు జరగ్గా, 2020లో చివరి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 14వసారి ఎన్నికలు జరుగుతుండగా, కార్పొరేషన్ అయ్యాయి మాత్రం ఇవి తొలిసారి. ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ పదవిని 8 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ రెండుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీఆర్ఎస్ ఒకసారి దక్కించుకుంది. మొదటి చైర్మన్‌గా చిత్తలూరి వెంకట నర్సింహారావు (కాంగ్రెస్) 1961 వరకు సేవలు అందించగా, చివరి చైర్మన్‌గా 2024 నుంచి 2025 వరకు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి సేవలు అందించారు. తొలి మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల దృష్టి కార్పొరేషన్ అయ్యాక జరిగే ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో నల్లగొండ తొలి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుండగా, బీఆర్ఎస్ కూడా అదే ధ్యేయంతో నడుస్తోంది. బీజేపీ కూడా మేయర్ పీఠం దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నా, గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆ తర్వాతే బీఆర్ఎస్ రెండు విడతల్లో 42 మందిని ప్రకటించింది. ఆ తర్వాత మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా చకిలం వసంతలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రచారంలో చెప్పడం లేదు. ఏ పార్టీ ఏం చెబుతుందంటే.... » ముందునుంచే కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు పూర్తయ్యాక ప్రతి రోజు నగరంలోని ఏడెనిమిది డివిజన్లలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా వెచి్చంచి పట్టణంలో అభివృద్ధి చేశామని, ప్రజలు తమను గెలిపించాలని కోరుతున్నారు. మరిన్ని నిధులు తెచ్చి నల్లగొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. » పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండలో ఎక్కువ అభివృద్ధి తామే చేశామని, దానిని చూసి తమను గెలిపించాలని బీఆర్ఎస్ చెబుతోంది. మాజీమంత్రి జగదీశ్‌రెడి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకొని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెబుతోంది. పట్టణంలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఐటీ హబ్ వంటికి తామే చేశామని చెబుతోంది. » నల్లగొండ అభివృద్ధికి కేంద్రం నుంచి అధిక నిధులు తెస్తామని, తమ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ చెబుతోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున అభివృద్ధి చేసిందని పేర్కొంటోంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి జరుగుతోందని చెబుతోంది. -
పదేళ్లు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా?
వైరా/మధిర: ‘మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు.. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓట్లేయాలా. రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచినందుకు ఓట్లేయాలా’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలన కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వలేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. మళ్లీ ఇప్పుడు తాము వచ్చాకే మొదటి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.22,500 కోట్ల నిధులు వె చ్చిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగితే పట్టించుకోలేదన్నారు. అప్పుడు ఇచ్చిన దొడ్డు బియ్యం పేదలకు ఉపయోగపడలేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు గాను 1.02 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాక ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా రూ.27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యం, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కామ్‌లే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పట్టణాల్లో వీధిదీపాలను కూడా వెలిగించలేని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. తన భాషతో వీధి రౌడీలా తయారయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే, రేవంత్‌రెడ్డి మాత్రం కండ్లకు గంతలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదని.. కేవలం ఫ్రాడింగ్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు బంద్ అయ్యాయని, స్కామ్‌లు మాత్రం జోరందుకున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో 15 కార్నర్‌మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తన తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌ను పట్టుకుని కనీస గౌరవం లేకుండా, అతినీచమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను దూషిస్తే నిరుపేదల కడుపులు నిండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పేదల కడుపులు నిండుతాయని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న కేసీఆర్‌ను జైలులో పెడతామని కాంగ్రెస్ అంటోందని హరీశ్‌రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను బంద్ చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు అన్నం పెట్టిన కేసీఆర్‌కు ఓటేస్తారా?, హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్‌రెడ్డికి ఓటేస్తారో?.. ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్‌రావు అన్నారు. అసలు ఎవరో.. నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లిలో చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డినే నకిలీ అని అన్నారు. -
కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి కబడ్డీ ఆటను ప్రారంభించాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు ఖాయమని, కబడ్డీ కప్ బీజేపీ గెలుచుకోవడం తథ్యమని తేలడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ (మ్యాచ్ ఫిక్సింగ్) కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేసి, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ‘విజయ సంకల్ప ర్యాలీ’నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ గార్డెన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది కాషాయ పగిడీలు ధరించి పాల్గొన్నారు. టవర్ సర్కిల్ వద్ద బండి సంజయ్, నవనీత్ కౌర్ ప్రసంగించారు. అభివృద్ధి నినాదంతో తాము కరీంనగర్ ఎన్నికలకు వెళ్తున్నామని, బీజేపీ 50 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అందుకోబోతోందని సర్వేలన్నీ తేల్చడంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ఒవైసీ శనివారం రాత్రి కరీంనగర్‌కు వచ్చి ఎంఐఎం గేర్ మారుస్తుందని మాట్లాడారని గుర్తు చేశారు. రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో.. ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని అన్నారు. -
ప్రలోభాల 'పురం'పర
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దండాలు, ఉపన్యాసాలు, వాగ్దానాలను మాత్రమే నమ్ముకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చే పనిలో పడిపోయారు. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుండటం, పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మద్యం, మాంసం, కూల్‌డ్రింక్స్, చీరలు, బిర్యానీలతో పాటు స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం నేటి నుంచి మరింత ఊపందుకుంటుందని, వీటన్నింటితోపాటు ఆయా మున్సిపాలిటీలు, వార్డులు,కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటుకో రేటు నిర్ణయించిన రాజకీయ నాయకులు ఈ మేరకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సామూహిక సమావేశాలు పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రచారం జోరందకుంది. సోమవారం సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియనుండడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు వార్డులు, డివిజన్లను చుట్టుముడుతున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గల్లీల్లో తిరుగుతూ, మైకుల హోరులో ప్రచారాన్ని సాగిస్తూనే వ్యక్తిగతంగా ఇళ్లకు వెళ్లి కలిసి వçస్తున్నారు.అపార్ట్మెంట్లలో సామూహిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పురుష ఓటర్లకు మద్యంతో కూడిన సిట్టింగ్‌లను ఏర్పాటు చేస్తుండగా, మహిళా ఓటర్ల కోసం టిఫిన్లు, స్నాక్స్, కూల్డ్రింక్స్లతో గెట్ టు గెదర్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ సామూహిక సమావేశాల పర్వం ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో చికెన్, మటన్, బిర్యానీలు సమకూరుస్తున్నారు. తాయిలాల్లో భాగంగా కొన్ని చోట్ల పోలింగ్ స్లిప్పులతో పాటు మద్యం సీసాలు పంపిణీ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు, స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. ప్రయాణ ఖర్చులు ఇచ్చి మరీ...! ఒక్కో ఓటు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి రావాల్సిన ఓటర్ల కోసం కూడా అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి కోసం ప్రయాణ ఖర్చులు ఇచ్చి మరీ వారిని రప్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎంత నగదు ఇవ్వాలో కూడా ఫిక్స్ చేశారు. వార్డులు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల రూ.10వేల వరకు ఓటుకు రేటు పలుకుతుందని, అయితే, ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఈ నగదు పంపిణీపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. నగదు పంపిణీ వ్యవహారాలపై ఓ రాష్ట్రస్థాయి నేత మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో భారీస్థాయిలో డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. కేవలం ప్రచారమే కాకుండా తాయిలాల కోసం ఒక్కో వార్డుకు కనీసం రూ.15 లక్షలు ఖర్చవుతున్నాయని చెప్పారు. చిన్న వార్డుల్లో రూ.15–25 లక్షల వరకు ఖర్చు వస్తోందని, మిగిలిన చోట్ల కోటిన్నర రూపాయలు కూడా అవుతున్నాయని, సగటున ఓ మోస్తరు మున్సిపాలిటీల్లో వార్డు లేదా డివిజన్‌కు రూ.40 నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు జరుగుతుందని ఆయన వెల్లడించడం గమనార్హం. మరో విశేషమేమిటంటే... కొన్ని చోట్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్పులు చేసి, ఆస్తులు తనఖా పెట్టి మరీ వడ్డీలకు డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. నేటితో ప్రచారానికి తెర మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఈనెల మూడో తేదీన బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలిన తర్వాత నాలుగో తేదీ నుంచి ప్రచార పర్వం ఊపందుకుంది. గత ఐదు రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు చివరి రోజు సుడిగాలి పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈనెల 11న పోలింగ్ జరగనుండగా, 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 16వ తారీఖున మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది. -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్ సెటైర్లు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్‌ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్మార్చి: సాండ్ స్కామ్ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్జూన్: ఫోర్త్ సిటీ స్కామ్జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్అక్టోబర్: పవర్ స్కామ్నవంబర్: సింగరేణి స్కామ్డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌కు చెప్పి రైతు బంధు వేయించాను’ అని చెప్పుకొచ్చారు. -
కార్పొరేషన్లలో బహుముఖ పోరు..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బహు ముఖ పోటీ నెలకొంది. 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా, 2,195 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 12 చోట్ల ద్విముఖ, 48 డివిజన్లలో త్రిముఖ పోరు జరుగుతోంది. మిగతా డివిజన్లలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్న పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచారు. 47% డివిజన్లలో నలుగురు లేదా ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16.4%డివిజన్లలో ఐదుగురు అభ్యర్థులు చొప్పున పోటీ పడుతున్నారు. రామగుండంలో జనరల్ మహిళకు రిజర్వు అయిన 1వ వార్డు నుంచి మడిపెల్లి విజయం, మహబూబ్‌నగర్‌లో జనరల్ మహిళకు రిజర్వు చేసిన 58వ వార్డు నుంచి బి.రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామగుండం 48వ డివిజన్, కొత్తగూడెం 42వ డివిజన్, నిజామాబాద్ 33వ డివిజన్లో అత్యధికంగా 13 మంది అభ్యర్థులు చొప్పున పోటీ పడుతున్నారు. -
సై అంటే సై..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షా లుగా కొనసాగుతున్నాయి. కానీ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రత్యర్థులుగా మారాయి. బల్దియా పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు పొడిచింది. అందులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సీపీఐ తర ఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు సీపీఐ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అనేక కీలక అంశాల్లో ప్రభుత్వ విధానాలకు కూనంనేని మద్దతుగా నిలిచారు. రెండేళ్లుగా సజావుగా కొనసాగుతున్న కాంగ్రెస్ – సీపీఐ దోస్తీకి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్పర్థలు మొదలయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొత్త గూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉన్న విద్యానగర్ పంచాయతీని సీపీఐ ఏకగ్రీవం చేసుకుంది.సర్దుబాటు కాలేదంటూ...కొత్తగూడెంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఎక్కువ డివిజన్ల నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి హస్తం నేతలు వచ్చారు. దీంతో కొత్తగూడెంలోని 60 డివిజన్లలో మిత్రపక్షమైన సీపీఐకి 15 డివిజన్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. కానీ పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో తమకు సంస్థాగతంగా బలం ఉన్నందున 25 డివిజన్లకు తక్కువ కాకుండా చూడాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ అంశంపై అనేకమార్లు చర్చలు జరిగినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్ – సీపీఐ స్నేహబంధానికి బీటలు వారినట్ట య్యింది. సీపీఎంతో జోడీ కట్టిన కాంగ్రెస్ 58 డివిజన్లలో పోటీకి నిలిచింది. ఇక టీడీపీతో దోస్తీ చేసిన సీపీఐ 57 డివిజన్ల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. మేమే చేస్తాం.. మేమే తెచ్చాంకూనంనేని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే కొత్తగూడెం కార్పొ రేషన్‌గా అప్‌గ్రేడ్ అయిందని, 20 ఏళ్లుగా ఎన్నికలు లేని పాల్వంచలో ఇప్పుడు పోలింగ్ జరుగుతోందని సీపీఐ ప్రచా రం చేస్తోంది. డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ కూడా మంజూరైందని, ఇదే వేగం కొనసాగాలంటే సీపీఐకే పట్టం కట్టాలనే నినాదంతో ఎర్రదండు ముందుకు కదులుతోంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి పొంగులేటి తన భుజాలకు ఎత్తుకు న్నారు. కొత్త పరి శ్రమలు రావాలన్నా, అభివృద్ధి పనులకు భారీగా నిధులు కావా లన్నా అది కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన ప్రచారం చేస్తున్నారు. -
సమయం లేదు మిత్రమా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్షేత్రం ఇప్పుడు రణరంగంగా మారింది. ప్రచార గడువు ముగియ డానికి కేవలం రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో, రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీజేపీ తన దూకుడును అమాంతం పెంచింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి లభి స్తున్న అపూర్వ స్పందనను చూస్తుంటే గెలుపుపై ధీమా పెరుగుతోందని, ఈ సానుకూల వాతావరణాన్ని ఓట్ల రూపంలోకి మలచడమే తక్షణ కర్తవ్యమని పార్టీ శ్రేణులకు నాయకత్వం దిశానిర్దేశం చేసింది.అంతర్గత నివేదికల ప్రకారం.. కనీసం 3 కార్పొరేషన్లు, 30 నుంచి 40 మున్సిపాలి టీల్లో కమలం జెండా ఎగురవేసేందుకు పరిస్థితు లు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఈ గెలుపు అవకాశాలను శాస్త్రీయంగా అంచనా వేస్తూ రాష్ట్ర పార్టీ అభ్యర్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా వర్గీ కరించింది. కచ్చితంగా గెలిచే స్థానాలను ‘ఏ’ గ్రేడ్‌లో ఉంచి, అక్కడ పోలింగ్ బూత్ స్థాయి మేనేజ్ మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉన్న ‘బీ’ గ్రేడ్ వార్డులలో ఉన్న లోటుపాట్లను అధిగమించేందుకు వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. స్థానిక నాయకులు, తటస్థులు, మీడియా వర్గాల సమాచారాన్ని ధ్రువీకరించుకుంటూ.. ఈ వర్గీకరణను పటిష్టం చేశారు.దిగ్గజ నేతల వ్యూహ రచనఈ రాజకీయ సమరంలో దిగ్గజ నేతలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పరిధిలో, ఎంపీ అర్వింద్æ ధర్మపురి నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఇప్పటికే సొంత సర్వేల ద్వారా బలాబలాలను బేరీజు వేసుకుని అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇదే బాటలో ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షణ ముమ్మరం చేశారు.సుడిగాలి పర్యటనలుప్రచార ముగింపు సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆదివారం హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ కొత్తగూడెం, కోదాడ, నల్లగొండలలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపనున్నారు. చివరి రోజైన సోమవారం నిజామా బాద్‌లో ఆయన పర్యటన ఉండగా, కరీంనగర్లో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ ప్రచార పగ్గాలు చేపట్టనున్నారు. ప్రచార గడువు ముగిసే వరకు ప్రతి ఇంటినీ తాకుతూ, భారీ రోడ్డు షోలతో మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడడమే లక్ష్యంగా బీజేపీ సర్వసన్నద్ధమైంది. -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
రాష్ట్రం దివాలా తీసింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని, ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల వరద రావాలంటే, కరీంనగర్ కార్పొరేషన్ సహా మున్సి పాలిటీల్లో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.ప్ర: మున్సిపాలిటీల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రానివ్వబోనని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.. మీరేమంటారు?సీఎం రేవంత్‌రెడ్డిని చూస్తే జాలేస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయడానికి అణాపైసా లేక బిక్కమొహంతో దిక్కులు చూస్తున్నడు. ఢిల్లీకి మూటలు పంపలేక ఆపసోపాలు పడుతున్నడు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల గ్రూపు తగాదా లపై ఏమీ చేయలేని నిస్సహాయత ఆయనది. కాంగ్రెస్ హైకమాండ్‌తో కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీల మూలంగా అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతు న్నాననే బాధ ఆయన కళ్లలో కనిపిస్తోంది. జనం కాంగ్రెస్‌ను ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేయాలా అని ఎదురు చూస్తున్నరు. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఏదో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను దారి మళ్లించాలనుకుంటున్నడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నరు. బీజేపీని ఆశీర్వదించబోతున్నారు.ప్ర: బీజేపీ ఎన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి?వందకు వందశాతం కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయబోతున్నం. ఒక్క నా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే మరో మూడు మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. వివిధ సర్వే రిపోర్టులు, ప్రజాస్పందన చూస్తుంటే.. రాష్ట్రంలో మెజారిటీ కార్పొరేటర్, కౌన్సిలర్ల స్థానాలను సాధించుకుని తిరుగులేని శక్తిగా ఎదిగే అవకా శాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో వార్ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడో స్థానం కోసం పోటీ పడు తున్నాయి. ఈ విషయం తెలిసి మజ్లిస్‌కు మేయర్ సీటు ఇస్తామని కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకొని ముస్లింలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.ప్ర: ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏమని విజ్ఞ్ఞప్తి చేస్తున్నారు ? ఈ ఎన్నికల్లో గుణవంతులకు, ధనవంతులకు మధ్య పోటీ జరుగుతోంది. అవినీతిపరులకు, నిజాయితీగా మీ కోసం కొట్లాడే బీజేపీ అభ్యర్థుల మధ్య జరిగే యుద్ధమిది. అధికారంలో ఉన్నంతకాలం కబ్జాలు, దోపిడీలు, కమీషన్లతో దోచుకుంటే.... వాళ్ల అరాచకాలు, కబ్జాలపై బీజేపీ అభ్యర్థులు పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లారు. కబ్జాకోరులు, దోపిడీదారులు మళ్లీ మాయమాటలతో మీ ముందుకు వస్తున్నారు. నమ్మి ఓటేస్తే ఐదేళ్లు నరకయాతన తప్పదు. నిధులిచ్చేది కేంద్రం. ఆ నిధుల వరద కొనసాగాలంటే... అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్ర: రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏవిధంగా ఉంది? ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ఫలితాలే గీటురాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేకుండా చేతులెత్తేసింది. నా దృష్టిలో బీఆర్ఎస్ గతించిన పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో అరకొర బీఆర్ఎస్ సీట్లు గెలుచుకున్నా, ఎన్నికలయ్యాక వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లే అవకాశాలున్నాయి.ప్ర: నిత్యం హిందుత్వం మాట్లాడే మీరు ఈ ఎన్నికల్లో అభివృద్ధి అంశాన్నే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారెందుకు?హిందుత్వం మా శ్వాస. అందులో తగ్గేదేలే. బండి సంజయ్ హిందుత్వం తప్ప ఏమీ మాట్లాడరని, అభివృద్ధి కోసం నయాపైసా తేలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ వారు విష ప్రచారం చేశారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నేను ఏం చేశాను? ఎన్ని నిధులు తెచ్చా ను? ఏఏ అభివృద్ధి పనులు చేశాననే వివరాలతో బుక్లెట్ ప్రింటింగ్ చేసి ఇంటింటికీ పంపుతున్నా. నేను వాస్తవాలు చెప్పే సరికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయితోంది. -
రేవంత్ కాంగ్రెస్ కాదు.. బీజేపీ మనిషి: కేటీఆర్
సాక్షి, బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. అధికార కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. బీజేపీ మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జుక్కల్ నియోజకవర్గం బాన్సువాడ(బిచ్కుంద మున్సిపాలిటీ) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పేరిట మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు రేవంత్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అయినా నేరవేరిందా?. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.ఒక ఆంబోతు రెండు దున్నపోతులంటూ పోచారం బండ కట్టుకొని బాయిలో దూకలే అంటూ ఎద్దవా చేశారు. పోచారానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్ నేతలందరూ స్టువర్టుపురం దొంగలే. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. -
బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తే ఏం వస్తుంది?: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ నేతలను గెలిపిస్తే ఏం ప్రయోజనమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిల్లో అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతుంది. కరోనా వచ్చినప్పుడు పేదలకు ఉపాధి లేకపోతే 80 కోట్ల మందికి అన్నం పెట్టింది నరేంద్ర మోదీ. కరోనా కాలంలో వాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడింది మోదీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు మంజూరైతే కేసీఆర్ కనీసం లక్షా70 వేల ఇళ్లు కట్టలేకపోయాడు. మోదీని తిట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఖతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే అంటున్నారు. వాళ్ల పరిస్థితి కూడా అదే అవుతుంది.నాకు తక్కువ టైంలో ఎక్కువ ఓట్లతో ఆశీర్వదించింది గజ్వేల్ ప్రజలే. నామినేషన్ వేసిన సమయంలో 5000 మంది వస్తారనుకుంటే 25వేల మంది వచ్చారు. ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్ అయితే నైతికంగా గెలిచింది గజ్వేల్ ప్రజలు. గజ్వేల్‌కు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. అభివృద్ధి మాత్రం జరగలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోలేని బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది?. తనను కోసినా 5 పైసల బిళ్ళ లేదు. నేను రైతు బంధు ఇవ్వను అని రేవంత్ అంటున్నాడు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ఈ జన్మాంతం మీ సేవకుడినే’
కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్.. కబ్జాదారుల అంతు చూస్తామన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ బాధ్యత తనేదనంటూ హామీ ఇచ్చారు. ‘మీ ఆస్తులకు రక్షణ బాధ్యత నాది. కబ్జాదారుల అంతు చూస్తా. చచ్చి బతికి మీకు సేవ చేసేందుకే వచ్చిన. ఈ జన్మాంతం మీ సేవకుడినే. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. కరీంనగర్లో మేయర్ పీఠం దక్కించుకోబోతున్నాం. బీఆర్ఎస్ నాలుగు సీట్లకే పరిమిత కాబోతుంది. కాంగ్రెస్-ఎంఐఎం కలిసినా 20 సీట్లలోపే వస్తాయి’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.కొందరు సర్వేల పేరిట గొప్పలు చెప్పుకుంటున్నారుపలువురు నేతలు సర్వేల పేరిట గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో అల్గనూరులో 8వ డివిజన్లో మంత్రి శ్రీధర్‌బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా శ్రీధర్‌బాబు ప్రసంగిస్తూ.. ‘ 40 స్థానాలకు పైగా సీట్లు గెలుచుకుని కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నాం. కొందరు సర్వేల పేరిట వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, పేద ప్రజల్లో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ కాంగ్రెస్. అందుకే ప్రజలన్నీ గమనిస్తారు.. కాంగ్రెస్‌ను గెలిపిస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు. -
పవన్ ప్రచారం చేస్తే.. మైనస్సే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు. -
పరిశ్రమలకు కరెంట్ కోతలు షురూ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంట్ కోతలు షురువయ్యాయని మాజీమంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ సీఎంగా కాకముందు పరిశ్రమలకు పవర్ హాలీడేలు ఉండేవని, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో పని లభించేది కాదని, కేసీఆర్ సీఎం అయ్యాక వ్యవసాయంతోపాటు పరిశ్రమలకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా చేశారని, దీంతో కార్మికులకు ఓటీలు దొరికాయని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతుబంధు, దళితబంధు, గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపపిల్లల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను బంద్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి బంద్‌ల బాబు అని ఎద్దేవా చేశారు. ఇదేంటని ప్రశి్నస్తే బూతులే సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి వాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు.కేసీఆర్ పదేళ్ల పాలనకు, కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు తన వద్దకు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారని, రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. సిగాచీ ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
జర్రమొచ్చింది.. సైలెంట్ మోడ్‌లో సేనాని!
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్‌కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు.. చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు. ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్‌కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది::సిమ్మాదిరప్పన్న -
కాంగ్రెస్‌కు ఓటేస్తే మరోసారి మోసపోయినట్లే..
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసపోయినట్లేనని, ఆరు గ్యారంటీల పేరిట 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రెండేళ్లలో ఒక్క హామీని నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని సీఎం చెబుతున్నారని, కానీ ఇప్పటికి ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలని అన్నారు. రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకుఆశ చూపించి, మరోసారి మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి ఈ మాట చెబుతున్నారని ఆరోపించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ హించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.. కేసీఆర్‌ను తిట్టడం దేనికి? ‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్న ప్పుడు చేతనైతే ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ గత సీఎం కేసీఆర్‌ను తిట్టవలసిన అవసరం ఏముంది? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడడం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఓటేయాలి. గత పదేళ్లపాటు ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచి్చన పార్టీకి, రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి’అని కేటీఆర్ చెప్పారు. ఒక్కరికైనా తులం బంగారం ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మీ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఒక్కరికైనా రేవంత్‌రెడ్డి తులం బంగారం ఇచ్చారా? (బంగారం కొనలేదని, నా భార్య నన్ను తిడుతోందంటూ కేటీఆర్ నవ్వులు పూయించారు) నేతన్నల బతుకులను బజారున పడేశారు.బతుకమ్మ చీరలతో ఉపాధి పొందిన కార్మికులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. 12 ఏళ్లలో ఏమీ చేయలేని బీజేపీ నేతలు గుడిముందు బిచ్చగాళ్లలాగా.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు’అని కేటీఆర్ అన్నారు. ప్రచారంలో భాగంగా సిరిసిల్లలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. చిన్నారిని బుజ్జగిస్తూ, ఆడిస్తూ.. సిరిసిల్లలో ఒకటో వార్డు జ్యోతినగర్‌లో నిర్వహించిన భేటీలో ఓ మహిళ వద్ద ఉన్న చిన్నారిని కేటీఆర్ తీసుకుని బుజ్జగించి, ఆడించారు. -
రేవంత్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు రెండేళ్ల కాలంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రేవంత్ అని సవాల్ విసిరారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్నర్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్‌కు రూ.1400 కోట్లు విడుదల చేశానని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్. రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు నయాపైసా కూడా ఇవ్వలేదు. నన్ను కోసినా నయాపైసా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయని అబద్దాలు చెబుతున్నారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?.కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా?. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు పెంపు తథ్యం. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. రోడ్డుపై నడిస్తే కూడా పన్ను వేస్తారు జాగ్రత్త. కమలం లక్ష్మీ అమ్మవారి పువ్వు.. స్వస్తిక్ శుభసూచికం. బ్యాలెట్లో పువ్వుపై స్వస్తిక్ గుర్తు గుద్దితే అన్నీ శుభ సూచకాలే అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే సూపర్.. ఇదే జనం మాట: కేటీఆర్
సాక్షి,రాజన్న: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్‌కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురికి అనర్హత వివాదంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు. ఈ తరుణంలో.. నెక్ట్స్ ఏం జరగనుందో చూడాలి. -
పుర బరిలో 12,958
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నెల 3న మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో వార్డులు, డివిజన్ల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే టీ పోల్ యాప్‌లో వివరాల నమోదు ఆలస్యం కావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు, 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు కలుపుకొని మొత్తం 2,996 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన వాటిని మినహాయించి మిగిలిన 2,982 స్థానాలకు మొత్తం 12,958 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 14 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వీరిలో 12 మంది మహిళలే కావడం గమనార్హం.12 చోట్ల కాంగ్రెస్, రెండింట బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పాలమూరు నుంచి బీజేపీ శంఖారావం
మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కమలదళం పాలమూరు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ..జాతీయ నాయకత్వాన్ని కూడా రంగంలోకి దింపింది. బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాన్ని ‘విజయ సంకల్ప సమ్మేళనం’గా పేర్కొంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడిగా తొలి సారిగా తెలంగాణకు వచ్చిన ఆయన.. మున్సిపోల్స్ సందర్భంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలో అధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లను గెలవడంతో.. ప్రస్తుతం దక్షిణ తెలంగాణపైనా జాతీ య, రాష్ట్ర నాయకత్వాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. గతంలోనూ పార్టీపరంగా అనేక కార్యక్రమాలను మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో...తెలంగాణ పోరుయాత్రను కృష్ణానది తీరం నుంచి మొదలుపెట్టారు. గతంలో బండి సంజయ్ రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఒక విడత పాద యాత్రను జోగుళాంబ ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఇక్కడి నుంచే శంఖారావం పూరించారు.ఎంపీలకు అగ్నిపరీక్ష..: ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీ ఎంపీలకు అగ్నిపరీక్షగా మారనుంది. 8 మంది ఎంపీలున్న ప్రాంతాల్లో విజయాలపై వారు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా పార్లమెంట్ సమావేశాల నుంచి కూడా మినహాయింపునిచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మునిసిపాలిటీలన్నింటి లోనూ వారు గట్టిగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో తమ పట్టు నిలుపుకో వాలంటే నియోజకవర్గాల్లో అత్యధిక స్థానా ల్లో గెలుపొందితేనే అదిసాధ్యమవుతుందన్న అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది. -
వడ్డించే వాడు.. అడిగే వాడు.. మనోడై ఉండాలి: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందాలంటే రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మున్సిపాలిటీల్లో రూ.17,472 కోట్లు ఖర్చు పెట్టామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కనీసం రేషన్‌కార్డులు ఇవ్వలేదు.. ‘మున్సిపల్ శాఖ నా వద్దే ఉంది. మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత. వడ్డించే వాడు మనవాడు. అడిగే వాడు కూడా మనోడై ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు వెళ్లే వారినే గెలిపించాలి. ఇంకా 8 ఏళ్లు అధికారంలో ఉంటాం. మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. గత ప్రభుత్వం పేదలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చాం. దేశ«ంలో ఎక్కడాలేని విధంగా 3.17 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరేసుకోవాలని, ధాన్యం తీసుకోమని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక సన్న వడ్లు పండించాలని చెప్పాం. రూ.500 బోనస్ కూడా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌తో పాటు 54 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాం’ అని సీఎం చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ‘రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లతో రుణమాఫీ చేసి అప్పుల నుంచి విముక్తి కల్పించాం. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.6 వేలు ఇస్తున్నాం. గతంలో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ఇచ్చాం. ఈ మున్సిపల్ ఎన్నికలు ముగియగానే మరో రూ.9 వేల కోట్లు ఇస్తాం. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 1000 బస్సులను మహిళలకు ఇచ్చి యజమానులను చేశాం. రూ.25 వేల కోట్లను మహిళా సంఘాలకు ఇచ్చాం. పెట్రోల్ బంకులు పెట్టించాం. ప్రజా ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి. పథకాల ద్వారా లబ్ధి పొందిన వారంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసిన మహిళలంతా కాంగ్రెస్‌కే ఓటేయాలి. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ల డిపాజిట్లు గల్లంతు కావాలి..’ అని సీఎం అన్నారు. మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించారు. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేదలను ఊరించి తాను మాత్రం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. పంజాగుట్టలో రూ.2 వేల కోట్లతో గడీని కట్టుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. వచ్చే బడ్జెట్లో మరిన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. మరింత మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచుతాం..’ అని రేవంత్ చెప్పారు. మొగుడూ పెళ్లాల ఫోన్లు విన్నారు ‘పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ తన దుర్మార్గ పాలనతో తెలంగాణను దోచుకున్నారు. అయినా పోనీలే అనుకుంటే.. పెళ్లాం, మొగుడు మాట్లాడుకుంటుంటే ఫోన్లు విన్నారు. జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు.. అందరి ఫోన్లు విన్నారు. అలాంటి వ్యక్తికి పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని అంటున్నారు. భార్యభర్తల మాటలు విన్న నువ్వు జాతిపితవు ఎలా అవుతావు? కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చేనట్లే అంటున్నారు. అలాగైతే జన్వాడ, ఎర్రవల్లి, మొయినాబాద్ ఫాంహౌస్‌లను, టీవీలు, పేపర్లను, దోచుకున్న వేలాది కోట్లను తెలంగాణ సమాజానికి ఇస్తారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి..అన్ని పదవులూ వారే తీసుకున్నారు. తెలంగాణ కోసం మొదటగా ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు చిన్న పదవి కూడా ఇవ్వలేదు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు. ఏపీలో పార్టీ చనిపోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పరవాలేదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అవుతుంది. నీలాంటి వాళ్లు ఎలా జాతిపిత అవుతారు?..’ అంటూ సీఎం తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, పద్మావతి, వేముల వీరేశం, జైవీర్‌రెడ్డి, బాలునాయక్, మందుల సామేలు, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కేవీ రెడ్డి, డీసీసీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు, ముఖాముఖి సభకు ముందు రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు రుణాల చెక్కులు అందజేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. నేడు గుమ్లాపూర్‌లో సభ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గుమ్లాపూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అక్కడి నుంచే రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్డ్ శిక్షణా కేంద్రానికి, దత్తోజిపేటలో సోలార్ ప్లాంట్‌కు, గంగాధరలో డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తారు. కాగా బుధవారం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు సభాస్థలిని పరిశీలించారు. -
కమీషన్ల సర్కార్.. వసూళ్ల రాజ్యం!
మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధితెలంగాణలో కమీషన్ల సర్కార్ నడుస్తోందని, వసూళ్ల రాజ్యం కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాహుల్‌గాం«దీ–రేవంత్‌రెడ్డి (ఆర్ఆర్) ట్యాక్స్, హఫ్తా, కమీషన్లు వసూలు అవుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేసేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామని తెలిపారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇలాగైతే ఎక్కువ కాలం అధికారంలో ఉండలేరు.. ‘తెలంగాణలో కొన్ని నెలలుగా వరసగా దేవాలయాలు, గుళ్లపై దాడులు, కూల్చివేతల ఘటనలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కువకాలం అధికారంలో ఉండలేరు. సనాతన, హైందవ ధర్మంపై దాడులను బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. వాటిని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడే ప్రసక్తే లేదు’ అని నితిన్ నబీన్ అన్నారు.హామీలు నెరవేర్చకుండా మోసం ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలను నారీశక్తిగా మార్చేందుకు, స్వశక్తితో నిలిపేందుకు కృషి చేస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోంది. ప్రతి మహిళకు నెలకు రూ.రెండున్నర వేలు, కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం వంటి వాగ్దానాలను ఎప్పుడో మరిచిపోయింది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి మహిళలకు ఈ విషయాలన్నీ వివరించాలి. ప్రస్తుతం జరుగుతున్న మోసం, దగాపై పోరాడాలి. కాంగ్రెస్ రైతులు, రైతుకూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేర్చలేదు. ఈ వర్గాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ సర్కార్‌కు తగిన బుద్ధి చెప్పాలి..’అని నితిన్ నబీన్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ సర్కార్‌వి సంతుషీ్టకరణ రాజకీయాలు ‘రాష్ట్రంలో రేవంత్ సర్కార్ సంతుïÙ్టకరణ రాజకీయాలు చేస్తూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కించపరుస్తోంది. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెబుతూ నిస్సిగ్గుగా ముస్లిం ఓట్‌బ్యాంక్ కోసమే పనిచేస్తూ కాంగ్రెస్ చరిత్రను చాటుతోంది. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం వక్ఫ్ భూముల్లో అక్రమాలకు వంత పాడుతున్నారు. దీనికి ధీటైన జవాబు ఇవ్వాల్సిన అవసరముంది. బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు (8 శాతం ఓటింగ్), 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు (35 శాతం ఓటింగ్) గెలిచేలా ప్రజలు మద్దతు పలికారు. ఈ ఎన్నికల తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుపొందుతోంది. మహారాష్ట్ర, బిహార్, చండీగఢ్, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగించింది. ప్రతి బూత్‌లో 50% పైగా ఓటింగ్ సాధించాలి రాష్ట్రంలో కూడా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్‌లో 50 శాతానికి పైగా ఓటింగ్ సాధన లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ విజయాలు, ప్రజలకు వివిధ పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి ప్రజలకు కార్యకర్తలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ కమలం వికసించేలా..యువ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా, అన్నివర్గాల ప్రజల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఆ తర్వాత 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కూడా ఖాయం. అయితే బీజేపీ అధికారం కోసం ప్రాకులాడడం లేదు. రాష్ట్ర భవిష్యత్, ఇక్కడి ప్రజల క్షేమం, అభ్యున్నతే లక్ష్యం. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రోడ్డు, రైల్వే కారిడార్లు, రెండు ఇండ్రస్టియల్ కారిడార్లు, మరెన్నో ప్రయోజనాలు చేకూరేలా చేశారు. రాష్ట్ర ప్రజల పట్ల మోదీకున్న ప్రేమాభిమానాలను ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తెలంగాణ ప్రజల పక్షానే ఉందని చెప్పడానికి ఇదే తార్కాణం..’అని బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. అంతకుముందు శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాం అమ్మవారికి, మైసిగండి ఉమామహేశ్వర అమ్మవారికి, తెలంగాణ విమోచన పోరాట యోధులకు, సర్దార్ వల్లభాయ్‌పటేల్‌కు నమస్సుమాంజలి ఘటించారు. తాజాగా పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. మళ్లీ ఏప్రిల్‌లో వస్తా.. ‘మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయండి...మంచి ఫలితాలు సాధించండి... జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తా.. ఈ సారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలి..మళ్లీ ఏప్రిల్‌లో వస్తా..’ అని నితిన్ నబీన్ మహబూబ్‌నగర్ నుంచి తిరుగు ప్రయాణంలో రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పినట్లు రాంచందర్‌రావు ‘సాక్షి’ కి తెలిపారు. ఘన స్వాగతం శంషాబాద్: నితిన్ నబీన్ తొలిసారి తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. -
మున్సిపల్ ఎన్నికలు.. 14 వార్డుల్లో ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఫలితాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. అధికంగా కాంగ్రెస్ ఖాతాలోకి ఏకగ్రీవ వార్డులు చేరాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేలో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి.వివరాల ప్రకారం.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం కాగా.. బీఆర్ఎస్ నుంచి రెండు వార్డుల్లో ఏకగ్రీవ విజయం అందుకున్నారు. సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయి. కొడాదలో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవ ఫలితాలు, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెరో విజయం దక్కింది. అలాగే, మహబూబ్‌నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహిళా అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఏకగ్రీవ విజయం అందుతున్నాయి.వివరాలు ఇలా.. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ వార్డు–10 (ST జనరల్)లో పీ.విక్రమ్ (BRS) ఏకగ్రీవ విజయంయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డు–17 (SC మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నికఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ వార్డు–15 (UR మహిళ)లో తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్) విజయంనల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపుసూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ వార్డు–3 (BC మహిళ)లో సులావ నాగలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయంసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–11 (UR మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఎన్నికసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–21 (BC మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) గెలుపుసూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ వార్డు–31 (UR మహిళ)లో యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవ విజయంమహబూబ్నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–58 (UR మహిళ)లో బి.రమాదేవి (కాంగ్రెస్) ఎన్నికమెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ వార్డు–32 (UR మహిళ)లో గోదల మానస (కాంగ్రెస్) గెలుపుపెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వార్డు–1 (UR మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) విజయంవికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–1 (UR జనరల్)లో అనంత్ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్) ఏకగ్రీవ ఎన్నికవికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు–15 (SC జనరల్)లో పీ.విజయలక్ష్మి (BRS) విజయంయాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు–10 (BC మహిళ)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవ గెలుపు -
పదేళ్లఅభివృద్ధి.. రెండేళ్ల వైఫల్యం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రచార పర్వంపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని, ప్రచార ఆర్భాటం లేకుండా స్థానిక నేతలు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన స్థానిక అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రచార పర్యవేక్షణ బాధ్యత పార్టీ సమన్వయకర్త లకు అప్పగించింది.116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేష న్లకు కలిపి మొత్తం 125 మంది సమన్వయకర్తలుగా నియమించింది. అవసర మైన చోట మరికొంత మందిని కూడా సమన్వయ కర్తలుగా నియమించడంపై కసరత్తు జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావులు అవసరమైన చోట కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. క్యాంప్‌ను వీడిన కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థులునామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవా లకు సహకరించకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గి, కొడంగల్, మద్దూరు మున్సి పాలిటీల్లో ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో వచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో పార్టీ అభ్యర్థులను కాపాడు కునేందుకు బీఆర్ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీ ల్లోని అభ్యర్థులను రెండు రోజులుగా ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంప్‌ను వీడి తమ ఇళ్లకు చేరుకుని ప్రచారాన్ని ప్రారంభించారు.ఉభయ కమ్యూనిస్టులతో స్థానిక పొత్తులుకాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐతోపాటు సీపీఎం పార్టీతోనూ బీఆర్ఎస్ పలు చోట్ల అవగా హన కుదుర్చుకుంది. మహబూబాబాద్, భువన గిరి, చౌటుప్పల్, క్యాతనపల్లి, బెల్లంపల్లితో పాటు నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్ల పరిధిలో స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒకటీ అరా స్థానాలను ఉభయ కమ్యూ నిస్టు పార్టీలకు బీఆర్ఎస్ కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్యే ఉన్న కొత్తగూడెంలో సీపీఐ, సీపీఎం బీఆర్ఎస్తో అవగాహన కుదుర్చుకున్నాయి.ఒకటీ అరా వార్డులు ఏకగ్రీవంకాంగ్రెస్ నుంచి ఎదురైన బెదిరింపులు, ఒత్తిళ్లతో ఒకటీ అరా వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రామగుండం, మహబూబ్‌నగర్ మున్సి పల్ కార్పొరేషన్ల పరిధిలోని ఒక్కో వార్డులో బీఆర్ ఎస్ అభ్యర్థులు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ ఏకగ్రీవాలకు మార్గం సుగమం చేశారు. యాదగిరిగుట్ట, పరకాల, చౌటుప్పల్, మెదక్ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పదో వార్డు అభ్యర్థిని బెదిరించి పోటీ నుంచి వైదొలిగేలా చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. -
వీడిన ఉత్కంఠ.. జగిత్యాలలో హైవోల్టేజ్ పొలిటికల్ డ్రామా
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో అధికార పార్టీలో కొనసాగుతున్న రగడ.. హైవోల్టే పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజయ్ వర్గానికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో.. సీనియర్ నేత జీవన్‌రెడ్డి అలకబూనారు.అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్యర్థుల ఖరారు చేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 (జగిత్యాలలో 30, రాయికల్‌లో 6), జీవన్‌రెడ్డి వర్గానికి 26 సీట్లు (జగిత్యాలలో 20, రాయికల్‌లో 6) కేటాయించింది. ఫ్లాష్ సర్వే, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న సీఎం రేవంత్ మాటకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో.. ఎమ్మెల్యే సంజయ్‌ను బహిరంగంగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. తమకు బీఫామ్‌లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ నివాసం, ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్‌లో సంజయ్ సక్సెస్ అయ్యారు. అయితే అధిష్టానం ఫార్ములాను జీవన్‌రెడ్డి రిజెక్ట్ చేస్తున్నారు. పంపకాల ప్రసక్తే లేదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌లు వరుస ఫోన్‌కాల్స్‌తో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.నన్ను, నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నా గొంతు కోశారు. నా కోసం కార్యకర్తలను పార్టీ బలి చేస్తోంది. నాకు వర్గమంటూ ఏదీ లేదు. పార్టీ జెండా మోసిన వారే నా వర్గం. క్రమశిక్షణ పేరుతో కట్టడి చస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేన్నారాయన. జగిత్యాల హస్తం పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయన తదుపరి అడుగులపై ఏంటనే చర్చ నడుస్తోంది. ఈ అలకను అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సిత్రాలు
-
మున్సిపాలిటీల్లో రెండున్నర వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండున్నర వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఎన్నికలు జరగనున్న 7 కార్పొరేషన్లతో పాటు, మిగతా మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నా అవి అభివృద్ధి పనులకు ఖర్చుచేయకుండా ఎక్కడికి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణాలు, నగరాల అభివృద్ధి, మౌలిక వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నగరాల్లో, మరీ ముఖ్యంగా ప్రజల బతుకుల్లో మార్పులొచ్చాయా? అని ప్రశ్నించారు. సోమవారం టూరిజం ప్లాజాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్, సహ ఇన్చార్జి అశోక్ పర్ణామి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మీడియా ఇన్చార్జి ఎన్వీ సుభాష్‌లతో కలిసి రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేశారు. ‘బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు’పేరిట కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బీజేపీ చార్జిషీట్ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అమలు కాని హామీలు, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తిచూపేందుకే ఈ చార్జిషీట్‌ను రాష్ట్ర బీజేపీ విడుదల చేస్తోందన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు, పథకాలు తీసుకురావడంతో పాటు పురపాలికల్లో అవినీతిరహిత, సమర్థవంతమైన పాలనను అందిస్తామని హామీనిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్‌కు అవకాశమిచ్చినందున, ఇప్పుడు బీజేపీకి అవకాశమిస్తే పట్టణాల్లో అన్ని విధాలుగా మార్పు తీసుకొచ్చి చూపుతామన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్దనున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలు పూర్తిగా విఫలం కావడంతో సీఎం కూడా పాలనలో వైఫల్యం చెందారన్నారు. ఒక మంత్రికి మరో మంత్రికి పడదని, కలెక్షన్లు, కమీషన్లతో మునిగితేలుతున్నారని ఆరోపించారు. బొగ్గు కుంభకోణం, టెండర్లలో అక్రమాలు తదితరాలతో, కాంగ్రెస్ సర్కార్ 40 శాతం కమీషన్ల పాలనగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటూ ప్రజలకు ఏ మేలు చేయని కాంగ్రెస్ పారీ్టకి, సీఎం రేవంత్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అశిష్ షెలార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా ప్రజలను వంచించే మోసపూరిత పార్టీలేనన్నారు. ఈ చార్జిషీట్లో ఏముందంటే.. ⇒ ఉద్యోగులకు మోసం : అన్ని పెండింగ్ డీఏలు ఇవ్వకుండా, పీఆర్సీ అమలు చేయకుండా, హెల్త్‌కార్డులు ఇవ్వకుండా, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకురాకుండా మోసం. ⇒ అన్నదాతల అరిగోసలు : కొందరికే రుణమాఫీ, రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామని దానికీ మంగళం, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వలేదు, భూ భారతితో కొత్త వివాదాలకు ఆజ్యం. ⇒ ఆగమైన విద్యా రంగం: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదు, మున్సిపాలిటీల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు మరిచారు. ⇒ వైద్యం అగమ్యగోచరం : రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ.10 లక్షలు అని మరిచారు. బిల్లులు చెల్లించక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం నిలిపివేత, ప్రతీ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ, అన్ని మున్సిపాలిటీల్లో వంద పడకల ఆస్పత్రులు తదితరాలు అమలు కాలేదు ⇒ మహిళలకు మహా మోసం: ప్రతీ నెల రూ.రెండున్నర వేలు ఆర్థిక సహాయం ఇవ్వలేదు. ఈ లెక్కన ప్రతీ మహిళకు రూ.లక్ష చొప్పున సర్కార్ బాకీ పడింది. కళ్యాణమస్తులో తులం బంగారం ఇస్తామని మొండిచేయి. ⇒ కార్మీకులపై కక్ష : అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పన చట్టం అమలు జాడలేదు. వారి కోసం సంక్షేమ బోర్డు, హమాలీల బోర్డు ఏర్పాటు కాలేదు.హెల్త్‌కార్డులు ఇవ్వలేదు ⇒ యువత ఆశలు ఆవిరి: ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు.యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్, ప్రతీ ఏడాది జూన్2న నోటిఫికేషన్లు, సెపె్టంబర్ 17కు నియామకాల పూర్తి హామీకి తిలోదకాలు. ⇒ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నయవంచన : అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీ అమలు మరిచారు. అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని పెంచలేదు. ⇒ పారిశ్రామికాభివృద్ధిపై నిర్లక్ష్యం : పూచీకత్తు లేని రుణాలకు ఎమ్మెస్‌ఎంఈల కోసం రాష్ట్ర స్థాయి క్రెడిట్ గ్యారెంటీ పథకం హామీ మరిచారు. ⇒ సింగరేణిపై సిగపట్టు: సింగరేణి కార్మీకుల సంక్షేమానికి, అభివృద్ధికి, వారి భద్రతకు చేపడతామన్న పటిష్టమైన చర్యలు తీసుకోలేదు, సింగరేణిలో ఆధునిక విద్యాలయాల ఏర్పాటుపై ఒక్క అడుగూ పడలేదు. -
రెబెల్స్ ఉండొద్దు..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంత్రుల నుంచి బూత్‌స్థాయి కార్యకర్త వరకు సమష్టిగా పనిచేసి ఘన విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో జూమ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రేవంత్ పురపాలక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇంచార్జులుగా నియమించిన నేపథ్యంలో ఎవరికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఆ మంత్రులు ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడాలని చెప్పారు. సమన్వయలోపం ఉండొద్దు.. పంచాయతీ ఎన్నికల్లో కొంత సమన్వయ లోపం కనిపించిందని, ఈ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక్కో గ్రామంలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ చేశారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ రెబెల్స్ కారణంగా కొంత నష్టం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో అలా జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పార్టీ నుంచి ఎన్నికల సమాచారం కోసం వార్‌రూంను ఏర్పాటు చేశామని, ఈ వార్రూంతో సంప్రదింపులు జరపాలని, అవసరమైనప్పుడు వార్‌రూం సహాయం తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడా అనైక్యత కనిపించకూడదన్నారు. పార్టీ నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే గెలుపు తథ్యమని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిరూపిస్తోందని, అంతకంటే ముందు జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ ఇదే సూత్రం పనిచేసిందని చెప్పారు. ఇప్పుడు కూడా ఐక్యతా సూత్రాన్ని పాటించి నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గెలిచే అభ్యర్థులకే బీఫారాలివ్వాలని చెప్పారు. ఇప్పటివరకు ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇక ముందు అలా చేయొద్దని చెప్పారు. ఎన్నికలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చాకే సామాజిక, స్థానిక సమీకరణల ఆధారంగా మేయర్లు, చైర్మన్లను ఎంపిక చేద్దామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు ఏజెన్సీలతో నిర్వహించిన సర్వే వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మున్సిపాలిటీల వారీగా వివరించారని సమాచారం. రాష్ట్రంలోని 90 శాతం స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే పరిస్థితులున్నాయని, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగలేదని, అక్కడక్కడా బీజేపీ ప్రభావం చూపినా మొత్తం పాలకవర్గాలను గెలిచే పరిస్థితి ఆ రెండు పార్టీలకు లేదని చెప్పినట్టు తెలిసింది. -
2,996 వార్డులకు 29,742 సెట్ల నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డులు/డివిజన్లకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జనవరి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల పర్వంలో 22,519 మంది అభ్యర్థులు 29,742 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ తరపున అత్యధికంగా 10,046 సెట్లు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి 7,564 సెట్లను అభ్యర్థులు సమర్పించారు. బీజేపీ నుంచి 5,462 సెట్లను అభ్యర్థులు సమర్పించారు. శనివారం నామినేషన్ పత్రాల స్క్రూటినీ జరగ్గా, ఆదివారం అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. సోమవారం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రిటరి్నంగ్ అధికారులు విడుదల చేస్తారు. -
సర్వేలు.. సమన్వయం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు కుని అసంతృప్తుల బుజ్జగింపు, అధికార పార్టీ ఒత్తిళ్లను అధిగమించడం, కేడర్‌ను సమీకరించి ప్రచా రం తదితరాల్లో సమన్వయానికి పెద్దపీట వేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్‌లకు నోటీసులు, విచారణ పేరిట హడావుడి జరుగుతున్నా ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలను ప్రామాణికంగా తీసుకున్న బీఆర్ఎస్ మరోమారు సర్వే చేసి అందుకు అనుగుణంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. వార్‌రూమ్.. సమన్వయకర్తలు ఎన్నికల్లో పార్టీ నేతలు, యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్ వార్‌రూమ్ ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రస్తుతం వార్‌రూమ్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో 9 మంది నేతలతో వార్‌రూమ్‌ను విస్తరించి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలను సమన్వయం చేసేందుకు 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు 125 మంది నేతలను సమన్వయకర్తలుగా నియమించారు. జిల్లా కలెక్టర్లకు ఫారమ్–ఏ పంపిన కేసీఆర్ జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొందరు పార్టీ నేతలకు బీ ఫామ్‌లు జారీ చేసే అధికారాన్ని ఇస్తూ ఫారమ్–ఏను కేసీఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించారు. కేసీఆర్ పేర్కొన్న నేతలు మాత్రమే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులకు బీ ఫారం జారీ చేస్తారు.బీ ఫారాల జారీలో ఎక్కడైనా సమస్య తలెత్తితే ఫారమ్–సీ కూడా కేసీఆర్ కలెక్టర్లకు అందజేసిన జాబితాలో ఉన్న నేతలు మాత్రమే జారీ చేస్తారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాగా, మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా పెండింగులో ఉన్న అభ్యరి్థత్వాలను కూడా ఖరారు చేసి బీ ఫారాలు ఇస్తారు. కాంగ్రెస్ ఏకగ్రీవ ప్రయత్నాలకు అడ్డుకట్టనామినేషన్ల స్రూ్కటినీ, ఉపసంహరణ సందర్భంగా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు జారిపోకుండా బీఆర్ఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్, మద్దూరు తదితర మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించి ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బెదిరింపులు, ప్రలోభాలకు అభ్యర్థులు లోనవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికోసం వార్‌రూమ్ నుంచి అభ్యర్థులకు అవసరమైన సహాయం అందించేలా కసరత్తు జరుగుతోంది. కాగా, ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కేటీఆర్, హరీశ్‌రావు రావాలంటూ అభ్యర్థుల నుంచి విన్నపాలు అందుతున్నాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. వీరిద్దరి ప్రచార షెడ్యూల్‌పై సస్పెన్స్ తొలగించి స్పష్టత ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు. -
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
విచారణకు రండి.. 'రెడీ'.. కానీ మరో రోజు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా.. ‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే.. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు. మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే.. – హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు. కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది ‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు. -
పురపోరుకు బీజేపీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో యావత్ పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మె జారిటీ స్థానాలు గెలిచేలా అన్నిస్థాయిల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానించింది. బుధ, గురువారాల్లో నామినేషన్ల దాఖలు సమయం ముగియనున్నందున వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.తొలుత నోవాటెల్‌లో నిర్వహించిన సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్రపార్టీ ఇన్చార్జి అభయ్ పాటిల్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో జాతీయ నాయకత్వం నియమించిన ఇతర రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జీలు సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయేదాకా నోవాటెల్‌లోనే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీలతో పార్టీ నేతలు రాంచందర్ రావు, కిషన్‌రెడ్డి, అభయ్ పాటిల్, డీకే అరుణ, కె.లక్ష్మణ్ ఇతర ముఖ్యనేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలతో రెండేసి ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున బహిరంగ సభ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. విజయసంకల్ప సమావేశాలు: రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళామోర్చా, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో విజయసంకల్ప సమావేశాలు జరిగాయి. మహిళా మోర్చా సన్నాహక సమావేశంలో రాంచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.వీరేందర్ గౌడ్‌తోపాటు ఎన్నికల కో ఇన్చార్జి, రాజస్థాన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, మరో కో–ఇన్చార్జి, ఎంపీ రేఖాశర్మ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 11న మున్సిపోల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సి పాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఈ నెల 28న బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం నుంచే ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ గడువు (ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు) ముగిసిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే నెల 11న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే విడతలో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఓట్లు్ల లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 16వ తేదీన కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి లింగ్యా నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డితో ఎన్నికల సంఘం కార్యాలయంలో భేటీ అయ్యారు. కాగా షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. భారీ పోలీసు బందోబస్తు ఎన్నికల ప్రక్రియను పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. అటవీ, ఎక్సైజ్ విభాగాల సిబ్బందితో కలిసి సుమారు 25 వేల మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 1,800 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా పట్టణ ప్రాంతాల్లోని లైసెన్స్ హోల్డర్లు ఆయుధాలు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు సిబ్బందితో ఫ్లయింగ్ స్క్వాడ్లు, చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదుతో పట్టుబడితే స్వాదీనం చేసుకుని రశీదు ఇవ్వడంతో పాటు అప్పీలు వివరాలు కూడా తెలియజేస్తారు. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిధిలో బందోబస్తు పెంచడంతో పాటు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తారు. 1,926 పోలింగ్ స్టేషన్లు సున్నితమైనవిగా, 1,302 అత్యంత సమస్యాత్మకమైనవిగా, 4,975 సాధారణమైనవిగా గుర్తించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్, నిజామాబాద్, బోధన్ తదితర మతపరమైన సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 133 మున్సిపాలిటీలకు గాను ప్రస్తుతం పాలక మండళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు పారదర్శకంగా స్వేఛ్చాయుత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. -
TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. 52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు. ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు. 👉ఎన్నికల షెడ్యూల్ వివరాలు.. ఇక్కడ క్లిక్ చేయండి -
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. SEC హైలెవల్ కమిటీ భేటీ
-
నేడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశాల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 11 లేదా 12వ తేదీన పోలింగ్ నిర్వహించి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించేలా షెడ్యూల్ ఉంటుందని సమాచారం. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
‘పుర’ షెడ్యూలుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల ఎన్నికల సన్నాహాలు కొలిక్కి రావడంతో ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు అనువైన తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూలు వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రదర్శించారు. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, వార్డులు, డివిజన్ల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ సమీక్ష జరిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారుల లభ్యత, టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్ వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిగింది. తాజాగా శనివారం మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతోనూ ఎన్నికల కమిషనర్ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ.. ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్లో భాగంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెల 19న రాష్ట్ర స్థాయిలో 13 మంది మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా శిక్షణ పొందిన మరో 21 మంది ట్రైనర్లు క్షేత్ర స్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. తొలిసారిగా వంద శాతం వెబ్‌కాస్టింగ్... రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల సంఖ్య 2,996 కాగా, వాటి పరిధిలో 8,025 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తొలిసారిగా వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లోనూ సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తొలిసారిగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించగా, తొలిసారిగా కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ప్రణాళికను పోలీసు శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచింది. మేడారం జాతర పూర్తయిన తర్వాత పురపాలక సంఘాల్లో పోలీసు బలగాల మోహరింపు ప్రారంభం కానున్నది. -
అధికారం లేని ఆర్థిక రాజధాని
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్‌లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది. కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్‌కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి. బాధ్యత లేని సంస్థలుఅయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్ఆర్ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి. ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్‌పాత్‌లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు. ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్‌సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్‌కాంగ్ లేదా లండన్లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?ఐఎఫ్‌సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి. ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి. స్వయం పాలన సాగినప్పుడే...ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు. వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.అజీత్ రానాడేవ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వేలం పాటలు
-
మరో చాన్స్ లేదు!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ మరోమారు అవకాశం ఇవ్వకూడదని, ఈ పదవులను ఎప్పుడు భర్తీ చేసినా అంతా కొత్తవారినే నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే చైర్మన్లను నియమించిన 35 కార్పొరేషన్లతో పాటు మిగతా కార్పొరేషన్లకు కూడా ఒకేసారి చైర్మన్లను నియమించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పద వీకాలం ఈ ఏడాది జూలైలో ముగియనున్నందున ఆ లోపు ఒకేసారి ఈ పదవులన్నింటినీ భర్తీ చేయాలనే నిర్ణయం కూడా జరిగిందని సమాచారం.తలనొప్పి ఎందుకనే..! 2024 మార్చి నెలలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. కానీ అధికారిక ఉత్తర్వులు వచ్చి వారు పదవీ బాధ్యతలు స్వీకరించే సరికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. జూలై 8న వారంతా అధికారికంగా చైర్మన్లుగా నియమితులయ్యారు. దీంతో వారి రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది జూలై రెండో వారంలో ముగియనుంది. అయితే ఇలా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న చైర్మన్లు తమకు మళ్లీ అవకాశం ఇస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసినందున ఓ దఫా చైర్మన్లుగా అవకాశం ఇచ్చామని, రెండోసారి అవకాశం దక్కాలంటే పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారం కోసం పనిచేయాలని గతంలో పలుమార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్చార్జి చెప్పారు. దీంతో పలువురు చైర్మన్లు ఆ రకంగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ కాకపోయినా పనితీరు ప్రాతిపదికన కొందరికి మళ్లీ చాన్స్ దక్కవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. కానీ కొందరికి ఇచ్చి మరికొందరిని పక్కన పెట్టడం వల్ల లేని తలనొప్పులు వస్తాయని, ఎలాగూ ఒకసారి అవకాశమిచ్చినందున మలిదఫాలో పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్, రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ జిల్లా కమిటీలు ప్రస్తుతానికి పెండింగే! మున్సిపల్ ఎన్నికలకు ముందు తలనొప్పి ఎందుకులే అనే ఆలోచనతో పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటును పీసీసీ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. వాస్తవానికి జనవరి 11 నాటికే జిల్లా కమిటీలు, 15 నాటికి మండల పార్టీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి తమకు పంపాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఎవరికి ఏ పదవి ఇస్తే ఏమవుతుందోననే మీమాంసతో ఎమ్మెల్యేలు, మంత్రులు చాలావరకు జిల్లా కమిటీల కోసం పూర్తి స్థాయిలో పేర్లను ఇవ్వలేదు. మండల పార్టీ అధ్యక్షుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పీసీసీ నిర్ణయించింది. మున్సిపల్ వ్యూహంలో గందరగోళం! మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. మంత్రులను వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట కాకుండా వేరేచోట ఇన్చార్జిలుగా నియమించడమే ఇందుకు కారణం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మంత్రులను వేరే పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జులుగా నియమించడం వల్ల వారు సొంత నియోజకవర్గాలకు సమయం ఇవ్వగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు చాలా జిల్లాలకు అసలు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. మిగిలిన అసెంబ్లీల విషయంలో.. స్థానిక ఎమ్మెల్యేలు, అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు వారికి సహకరించక పోవడమే కారణమనే వాదన ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులుగా వారు ఏ మేరకు పార్టీ నేతలను, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా ఇన్చార్జులను నియమిస్తున్నట్టు సీఎం కార్యాలయం అధికారికంగా ప్రకటిస్తే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అవే పార్లమెంటు స్థానాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, పార్లమెంటు పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కనీ్వనర్లుగా ఉండే ఈ కమిటీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు సభ్యులుగా ఉంటారని, టికెట్ల ఖరారులో ఈ కమిటీలదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాల వారీగా ఇన్చార్జి మంత్రులు వీరే! కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (మల్కాజిగిరి), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (చేవెళ్ల), తుమ్మల నాగేశ్వరరావు (కరీంనగర్), కొండా సురేఖ (ఖమ్మం), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్), దామోదర రాజనర్సింహ (మహబూబ్‌నగర్), మహ్మద్ అజహరుద్దీన్ (జహీరాబాద్), వివేక్ వెంకటస్వామి (మెదక్), వాకిటి శ్రీహరి (నాగర్‌కర్నూల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (నల్లగొండ), సీతక్క (భువనగిరి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నిజామాబాద్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), జూపల్లి కృష్ణారావు (పెద్దపల్లి), సుదర్శన్‌రెడ్డి, సలహాదారు (ఆదిలాబాద్)లను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. -
తెలంగాణ: మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు. వీక్‌గా ఉన్న మున్సిపాలిటీలలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.పార్లమెంట్ స్థానాల వారీగా..భువనగిరి - సీతక్కఖమ్మం-కొండా సురేఖమహబూబాబాద్- పొన్నం ప్రభాకర్మల్కాజ్గిరి-కోమటిరెడ్డి వెంకట్రెడ్డిచేవెళ్ల-శ్రీధర్బాబుమెదక్-వివేక్కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావుపెద్దపల్లి- జూపల్లి కృష్ణారావునల్గొండ-అడ్లూరి లక్ష్మణ్వరంగల్-పొంగులేటి శ్రీనివాస్రెడ్డినిజామాబాద్-ఉత్తమ్కుమార్రెడ్డిఆదిలాబాద్-సుదర్శన్రెడ్డిమహబూబ్నగర్- దామోదర రాజనర్సింహజహీరాబాద్-అజారుద్దీన్నాగర్ కర్నూల్- వాకిటి శ్రీహరిలకు బాధ్యతలు అప్పగించారు.కాగా, త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా మెజారిటీ స్థానాలు దక్కించుకుని తీరుతామని రాష్ట్ర మంత్రివర్గం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగుందని.. బీఆర్ఎస్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదని కేబినెట్ అభిప్రాయబడింది. ఆదివారం రాత్రి మేడారంలో రెండు గంటలకుపైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఫిబ్రవరి 15లోగా ఎన్నికల పూర్తికి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పార్టీపరంగా వాటిని ఎదుర్కొనే అంశాలపై మంత్రివర్గం చర్చించింది. జిల్లాలవారీగా, మున్సిపాలిటీలవారీగా రాజకీయ పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై పలువురు మంత్రులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రభావం కారణంగా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదని.. బీఆర్ఎస్, బీజేపీ నామమాత్ర పోటీయే ఇవ్వగలుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.అయినా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని.. స్థానిక ఎమ్మెల్యేలతోపాటు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు బాధ్యత తీసుకొని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. చర్చలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే వెలువడనున్నప్పటికీ తన విదేశీ పర్యటన ముందుగానే ఖరారైనందున వెళ్లాల్సి వస్తోందని వివరించారు. కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు తాను విదేశాలకు వెళుతున్నానని.. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజలు విశ్వాసం కనబరిచేలా పనిచేసే బాధ్యతను మంత్రులందరూ తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. -
మంత్రులను బద్నాం చేయొద్దు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సింగరేణి బొగ్గు టెండర్లపై పత్రి కలు, టీవీల్లో వార్తలు వస్తున్నాయి. సింగరేణి టెండర్లు సహా మా ప్రభుత్వంలో ఏ పనిలోనూ నయాపైసా అవినీ తికి తావులేదు. ఇలాంటి వార్తలతో శుక్రాచార్యుడు, మారీ చులకు పరోక్షంగా సహకరించకండి. మీడియా యాజమా న్యాలకు గొడవలు ఉంటే మీరు, మీరు చూసుకోండి తప్ప మంత్రులను బద్నాం చేయకండి. ఏదైనా వార్త రాసేముందు ఒకసారి నన్ను అడగండి. ముఖ్యమంత్రిగా నేను 24 గంటలూ ప్రజలు, మీడియాకు అందుబాటులో ఉంటా. నా ఎమ్మెల్యేలు, మంత్రులపై వచ్చే ఏ చిన్న ఆరోపణ అయినా అది నా నాయకత్వానికి బద్నాం కలిగించినట్లే భావిస్తా.మేమంతా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడిపి స్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పైలాన్‌ను మద్దులపల్లి వద్ద ఆదివారం సీఎం ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో మద్దులపల్లి వద్ద సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శుక్రాచార్యుడు‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్త యింది. మొదటి సంవత్సరం నుంచే శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు అడ్డుకోవడానికి బయలుదే రారు. శుక్రాచార్యుడు, మారీచుడు గురించి మీకు తెలుసు. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే భగ్నం చేయాలని ప్రయత్నించారు. రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఇక మారీచుడు, సుబాహులు బావబామ్మర్దులు. మారీచుడు మాయా జింక రూపంలో సీతను ఎత్తుకెళ్లడానికి సహకరిస్తే రాముడి చేతిలో చావు తప్పలేదు. మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు.. (మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు) 2034 వరకు మాదే అధికారం.. ‘రాష్ట్రంలో పదేళ్ల చొప్పున టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అధి కారంలో ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పున రావృతం అవుతుంది. నేను చెప్పింది జరగకుండా ఒక్కటీ లేదు. ఇక్కడి రాములవారీ సాక్షిగా చెబుతున్నా.. ఈ పదేళ్లు పేదల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలురైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన వ్యక్తి వైఎస్ రాజ శేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్‌పై పెట్టడమేకాక రూ.1,300 కోట్ల రైతుల బకాయిలను రద్దు చేశారు. ప్రస్తుతం మేము 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. మేము ఇప్పుడు గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. పార్టీలు వేరైనా వైఎస్సార్, ఎన్టీఆర్ గొప్ప నేతలు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరిని స్ఫూ ర్తిగా తీసుకుని పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి పట్టణ పేదలకూ అర్హత కల్పిస్తాం. మాది కలిసి పనిచేసే ప్రభుత్వంనాకన్నా అనుభవజ్ఞులైన నేతలు ఈ వేదికపై ఉన్నారు. సహచర మంత్రుల అనుభవాలను ఉపయోగించుకుంటూ, అందరి సమన్వయం, సహకారంతో ముందుకెళ్తు న్నాం. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం తుమ్మలకు ఉంది. సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లు, 100 రోజుల్లో అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెబితే ఆయనే చూసు కున్నారు. ఢిల్లీలో ఏ పని ఉన్నా డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క చూసుకుంటారు. ఇలా మాలో ఏకాభిప్రాయమే తప్ప, ఏకపాత్రాభినయం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. బీఆర్ఎస్ను బొంద పెట్టాలి. ఏకలింగం, తోకలింగం లాంటి బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా గెలిస్తే మున్నేరు, పాలేరు ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉంది. భద్రాచలం రామాలయానికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇవ్వలేదు. మేము ఇప్పటికే భూసేకరణ కోసం నిధులు ఇచ్చాం. అయోధ్య తరహాలో భద్రాచలంలో రామాలయ నిర్మాణాన్ని చేపడతాం’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.గ్రామాల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి తెలంగాణలో నందమూరి తారకరామారావుకు అభి మానులు ఉన్నారు.. చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కక్ష కట్టి.. ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన చంద్రశేఖర్‌రావు, బీఆర్ఎస్ను వంద మీటర్ల గొయ్యి తీసి సమూలంగా పాతిపెట్టాలి. బీఆర్ఎస్ వాళ్లు గద్దె దిగాలి.. గ్రామా ల్లో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి. అప్పుడే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతాం.ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పాలేరు నియోజకవర్గం మద్దులపల్లిలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద నర్సింగ్ కళాశాల ఆవరణలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కూసుమంచి మండలంలో వంద పడకల ఆస్పత్రి, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవ పైలాన్లను సీఎం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రధాన దృష్టిప్రభుత్వం నీటిపారుదల, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం ఈ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే సీతారామ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇక విద్యారంగానికి సంబంధించి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, వైద్య రంగానికి సంబంధించి నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కప్రజాప్రభుత్వంపై విషంపాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది.. కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. సెమీఫైనల్ అంటూ కారుకూతలు కూస్తున్న ట్విట్టర్ టిల్లుకు గ్రామపంచాయతీ ఎన్నికలే సమాధానం చెప్పాయి. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలి. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయి. రూ.162.54 కోట్లతో నిర్మించే మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికాంగ్రెస్ సమావేశంలో టీడీపీ జెండాలుకాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీడీపీ జెండాలు కనిపించాయి. ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతో కూడిన పార్టీ జెండాలతో వచ్చిన కొందరు ‘జై రేవంతన్న’ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో సీఎం అరగంటకు పైగా మాట్లాడగా.. టీడీపీ జెండాలు పట్టుకున్న వారు పలుమార్లు జెండాలను పైకెత్తి చూపుతూ నినదించారు. -
ఫిబ్రవరిలో మున్సిపోల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లతో వాటిలోని 2,999 వార్డులు/డివిజన్లకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం ఇప్పటికే మేయర్/చైర్మన్, కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ప్రకటించింది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న శివరాత్రి, 16 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుండగా, ఆలోగా విద్యార్థులకు పరీక్షలు సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు రాకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. ములుగు జిల్లా మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం మేడారంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కేబినెట్ భేటీ వివరాలను సమాచార, ప్రజాసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కతో కలిసి అక్కడే మీడియాకు వెల్లడించారు. టెంపుల్ సర్క్యూట్... 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరగనుండటంతో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను ‘టెంపుల్ సర్క్యూట్’పేరుతో ఎకో–టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తీర్మానించింది. ప్రణాళిక తయారీకి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించింది. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖలు సంయుక్తంగా ఫిబ్రవరి తొలివారం నాటికి సమగ్ర నివేదికను అందిస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మార్చి 31 నాటికి మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని తీర్మానించామని, నివేదిక తయారీకి కన్సల్టెన్సీని సైతం ఖరారు చేసినట్టు చెప్పారు. ⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలకు 14 ప్రాంతాల్లో మార్కెట్ ధర ఆధారంగా భూములు కేటాయించాలని నిర్ణయించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎస్బీఐ కార్పొరేట్ కార్యాలయం నిర్మాణానికి వరుసగా 20, 17 కుంటల భూమిని మార్కెట్ ధరకు కేటాయించనున్నారు. ⇒ హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, తదుపరి చర్చ కోసం వచ్చే మంత్రివర్గ సమావేశం ముందు ఫైల్‌ను పెట్టాలని ఆదేశించింది. ‘మెట్రో ఫేజ్–2ఏ’నాలుగు కారిడార్లు, ‘ఫేజ్–2బీ’కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని రూ.2,787 కోట్ల అంచనాలతో భూ సేకరణ ప్రతిపాదనలను ఆమోదించింది. ⇒ హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్కు టీజీఐఐసీకి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ⇒ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం. ⇒ నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో న్యాయ, ఫార్మసీ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. లా కళాశాలకు 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీకి 28 కొత్త పోస్టులు మంజూరు చేసింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ పోస్టు మంజూరు చేసింది. ⇒ ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హామ్ విధానంలో రూ.11,334 కోట్లతో 6 వేల కి.మీ. రహదారుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను వేగిరం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.6వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మట్టి రోడ్డు కనిపించదన్నారు. ⇒ ములుగు జిల్లాలో కొత్తగా రూ.143 కోట్లతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతోపాటు 7,500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకం చేపట్టనుంది. భవిష్యత్తులో 15–20వేల ఎకరాలకు ఆయకట్టును పెంచే అవకాశం ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు. తిరుపతి, కుంభమేళాను మరిపించే రీతిలో మేడారం తిరుపతి, కుంభమేళాను మరిపించేవిధంగా మేడారం ఆలయాన్ని అద్భుత పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సమక్షంలో పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆలయాభివృద్ధికి 19 ఎకరాలను సేకరించగా, మరో 21–22 ఎకరాలు సేకరించనున్నామన్నారు. 41–42 ఎకరాలను ఆలయం పేరుతో సేకరించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. జంపన్నవాగులో 365 రోజులు నీళ్లు ఉండేలా రామప్ప పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను లక్నవరంకు తరలించి అక్కడి నుంచి జంపన్న వాగుకు తీసుకురావాలని సీఎం రేవంత్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తిశ్రద్ధలతోనే గద్దెలు, ప్రాకారాలు తయారు చేయించామని, రాజకీయంతో కాదని విలేకరుల ప్రశ్నకు పొంగులేటి బదులిచ్చారు. మీడియా సమావేశంలో ఎంపీ బలరామ్ నాయక్ పాల్గొన్నారు. -
Municipal Elections: ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసింది. అందులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి తెలిపింది. అంతేకాదు.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రిజర్వేషన్ల నివేదికను కూడా ఖరారు చేసి పంపినట్లు పేర్కొంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలలో మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇకపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మాత్రమే మిగిలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. -
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
-
20న షెడ్యూల్?.. కీలక ఘట్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్: మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మునిసిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రచురించారు. తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రా పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50 శాతం మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వు చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావులేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వుడు స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మునిసిపల్ చైర్మన్, మునిసిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఖరారు చేసిన రిజర్వుడు స్థానాల వివరాలతో గజిట్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఇవే వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మునిసిపల్ శాఖ కార్యదర్శి పంపించారు. వాటిని పరిశీలించి ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నేడు కేబినెట్ భేటీలో షెడ్యూల్‌పై చర్చ ఆదివారం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశముంది. కేబినెట్ ఆమోదంతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో మేయర్ పదవి రాష్ట్రంలోని పది మేయర్ స్థానాలకు గాను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహా మరో నాలుగు మునిసిపల్ కార్పొరేషన్లను అన్ రిజర్వుడు (జనరల్) కేటగిరీకి రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో కేవలం గ్రేటర్ వరంగల్ ముసినిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మినహా మిగతా నాలుగు కార్పొరేషన్లు..జీహెచ్ఎంసీ, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండను జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వు చేశారు. బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు కాగా మంచిర్యాల, కరీంనగర్ బీసీ జనరల్, మహబూబ్‌నగర్‌ను బీసీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ఒక్కో మేయర్ పదవిని కేటాయించారు. కొత్తగూడెంను ఎస్టీ జనరల్, రామగుండంను ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. 300 డివిజన్లతో కూడిన జీహెచ్ఎంసీ మేయర్ పదవి ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వు అయ్యిందని, అయితే భవిష్యత్తులో జీహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తారో తమకు ఇప్పటివరకు సమాచారం లేదని శ్రీదేవి చెప్పారు. ఇదిలా ఉంటే మునిసిపాలిటీల్లో బీసీలకు 38 మునిసిపల్ చైర్మన్ పదవులు రిజర్వు కాగా ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున కేటాయించారు. జనరల్ కోటాలో 61 కేటాయించగా అందులో జనరల్‌లో 30, జనరల్ మహిళలకు 31 మునిసిపల్ చైర్పర్సన్ స్థానాలను రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 5 మునిసిపాలిటీలు కేటాయిస్తే... మహిళలకు రెండు, ఎస్టీ జనరల్‌కు మూడింటిని రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో మొత్తం 17 మునిసిపాలిటీలను కేటాయిస్తే.. 9 ఎస్సీ జనరల్, 8 ఎస్సీ మహిళలకు కేటాయించారు. -
మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం శనివారం(జనవరి 17వ తేదీ) ఖరారు చేసింది. ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38, జనరల్ కేటగిరికి 61 స్థానాలు కేటాయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.ఎస్టీ కేటగిరీ1. కొల్లూరు: ఎస్టీ (జనరల్)2. భూత్పూర్: ఎస్టీ (జనరల్)3. మహబూబాబాద్: ఎస్టీ (జనరల్)4. కేశసముద్రం: ఎస్టీ (మహిళ)5. ఎల్లంపేట్ : ఎస్టీ (మహిళ)ఎస్సీ కేటగిరీ1. స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్సీ (జనరల్)2. చొప్పదండి: ఎస్సీ (మహిళ)3. జమ్మికుంట: ఎస్సీ (జనరల్)4. హుజురాబాద్: ఎస్సీ (మహిళ)5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)6. డోర్నకల్: ఎస్సీ (జనరల్)7. లక్సింపేట్: ఎస్సీ (జనరల్)8. మూడుచింతలపల్లి: ఎస్సీ (జనరల్)9. నందికొండ: ఎస్సీ (జనరల్)10. మొయినాబాద్: ఎస్సీ (జనరల్)11. గడ్డపోతారం: ఎస్సీ (మహిళ)12. కోహిర్: ఎస్సీ (జనరల్)13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)14. చేర్యాల: ఎస్సీ (మహిళ)15. హుస్నాబాద్: ఎస్సీ (జనరల్)16. వికారాబాద్: ఎస్సీ (మహిళ)17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)బీసీ కేటగిరి1. ఇల్లెందు: బీసీ (మహిళ)2. జగిత్యాల: బీసీ (మహిళ)3. జనగాం: బీసీ (జనరల్)4. భూపాలపల్లి: బీసీ (జనరల్)5. లీజ: బీసీ (జనరల్)6. వడ్డేపల్లి: బీసీ(జనరల్)7. అలంపూర్: బీసీ (జనరల్)8. బిచ్కుంద: బీసీ (జనరల్)9. కామారెడ్డి: బీసీ (మహిళ)10. బాన్సువాడ: బీసీ (మహిళ)11. ఆసిఫాబాద్: బీసీ(జనరల్)12. కాగజ్‌నగర్: బీసీ (మహిళ)13. దేవరకద్ర: బీసీ (మహిళ)14. చెన్నూరు: బీసీ (మహిళ)15. మెదక్: బీసీ (మహిళ)16. ములుగు: బీసీ (మహిళ)17: కొల్లాపూర్: బీసీ (మహిళ)18. అచ్చంపేట: బీసీ (మహిళ)19. నాగర్‌కర్నూల్: బీసీ (జనరల్)20. దేవరకొండ: బీసీ (మహిళ)21. మద్దూరు: బీసీ (జనరల్)22. పెద్దపల్లి : బీసీ (జనరల్)23. మంథని: బీసీ (జనరల్)24. వేములవాడ: బీసీ (జనరల్)25. షాద్‌నగర్: బీసీ (జనరల్)26. జిన్నారం: బీసీ (జనరల్)27. జహీరాబాద్: బీసీ (జనరల్)28. గుమ్మడిదల: బీసీ (జనరల్)29. సిద్ధిపేట: బీసీ (జనరల్)30. గజ్వేల్: బీసీ (మహిళ)31. దుబ్బాక: బీసీ (మహిళ)32. హుజూర్నగర్: బీసీ (జనరల్)33. తాండూరు: బీసీ (జనరల్)34. పరిగి: బీసీ (మహిళ) 35. కొత్తకోట: బీసీ (మహిళ) 36. ఆత్మకూరు: బీసీ (మహిళ) 37. నర్సంపేట: బీసీ (మహిళ) 38. ఆలేరు: బీసీ (మహిళ) అన్‌రిజర్వుడ్1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)3. పర్కాల్: అన్‌రిజర్వుడ్4. కోరుట్ల: మహిళ (జనరల్)5. రాయికల్: అన్‌రిజర్వుడ్6. మెట్పల్లి: అన్‌రిజర్వుడ్7. ధర్మపురి: మహిళ (జనరల్)8. గద్వాల: మహిళ (జనరల్)9. ఎల్లారెడ్డి: అన్‌రిజర్వుడ్10. సత్తుపల్లి: మహిళ (జనరల్)11. వైరా: మహిళ (జనరల్)12. మధిర: మహిళ (జనరల్)13. జడ్చర్ల: అన్‌రిజర్వుడ్14. తొర్రూర్: అన్‌రిజర్వుడ్15. మరిపెడ: మహిళ (జనరల్)16. ఖ్యాతన్‌పల్లి: మహిళ (జనరల్)17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)18. రామాయంపేట: మహిళ (జనరల్)19. నర్సాపూర్: మహిళ (జనరల్)20. తుప్రాన్: మహిళ (జనరల్)21. అలియాబాద్: మహిళ (జనరల్)22. కల్వకుర్తి: మహిళ (జనరల్)23. చందూరు: అన్‌రిజర్వుడ్24. నకిరేకల్: అన్‌రిజర్వుడ్25. హాలియా: అన్‌రిజర్వుడ్26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)27. చిట్యాల: మహిళ (జనరల్)28. నారాయణపేట: మహిళ (జనరల్)29. కోస్గి: అన్‌రిజర్వుడ్30. మక్తల్: అన్‌రిజర్వుడ్31. ఖానాపూర్: అన్‌రిజర్వుడ్32. భైంసా: అన్‌రిజర్వుడ్33. నిర్మల్: మహిళ (జనరల్)34. భీంగల్: మహిళ (జనరల్)35. ఆర్మూర్: మహిళ (జనరల్)36. బోధన్: అన్‌రిజర్వుడ్37. సుల్తానాబాద్: అన్‌రిజర్వుడ్38. సిరిసిల్ల: మహిళ (జనరల్)39. శంకరపల్లి: అన్‌రిజర్వుడ్40. చేవెళ్ల: అన్‌రిజర్వుడ్41. ఇబ్రహీంపట్నం: అన్‌రిజర్వుడ్42: ఆమన్‌గల్: అన్‌రిజర్వుడ్43. కొత్తూర్: అన్‌రిజర్వుడ్44. సదాశివపేట: మహిళ (జనరల్)45. నారాయణఖేడ్: అన్‌రిజర్వుడ్46. ఆందోల్-జోగిపేట: అన్‌రిజర్వుడ్47. సంగారెడ్డి: మహిళ (జనరల్)48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)49. సూర్యాపేట: అన్‌రిజర్వుడ్50. తిరుమలగిరి: అన్‌రిజర్వుడ్51. కోదాడ: మహిళ (జనరల్)52. నేరేడుచర్ల: అన్‌రిజర్వుడ్53. కొడంగల్: అన్‌రిజర్వుడ్54. వనపర్తి: మహిళ (జనరల్)55. అమరచింత: అన్‌రిజర్వుడ్56. పెబ్బేరు: అన్‌రిజర్వుడ్57. వర్ధన్నపేట: అన్‌రిజర్వుడ్58. పోచంపల్లి: అన్‌రిజర్వుడ్59. యాదగిరిగుట్ట: మహిళ (జనరల్)60. భువనగిరి: మహిళ (జనరల్)61: చౌటుప్పల్: మహిళ (జనరల్) -
ముంబై కోటపై బీజేపీ జెండా!
ముంబై: మహారాష్ట్రలో పురపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి మెరిసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైపై కాషాయ జెండా ఎగరేసింది. తద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై దాదాపు మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఎట్టకేలకు తెర దించింది. దేశంలోనే గాక ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్‌గా పేరొందిన బీఎంసీలో 227 కార్పొరేటర్ స్థానాలకు గాను అధికార మహాయుతి కూటమి భాగస్వాములు శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)తో కలిసి బీజేపీ ఇప్పటికే 116 సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా 114 స్థానాల మెజారిటీ మార్కును దాటేసింది. కడపటి ఫలితాలు అందేసరికి కాషాయ పార్టీ సొంతంగానే 87 స్థానాలు సాధించింది. తద్వారా 2017లో 82 సీట్లు సాధించిన సొంత రికార్డును అధిగమించింది. ఇంకా పలుచోట్ల ముందంజలో ఉంది. శివసేన (షిండే) 27 స్థానాలను గెలుచుకుంది. మహాయుతి కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ (అజిత్) 2 సీట్లు గెలుచుకుంది. బీఎంసీపై పట్టును ఎలాగైనా నిలుపుకునేందుకు ఠాక్రే సోదరులు శివసేన (ఎంబీటీ) సారథి ఉద్ధవ్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ పరస్పర వైరానికి స్వస్తి పలికి ఎన్నికల ముంగిట చేతులు కలిపినా లాభం లేకపోయింది. వారి ఆశలపై ముంబై ఓటర్లు నీళ్లు చల్లారు. ఉద్ధవ్ సేన 64 సీట్లకు పరిమితం కాగా ఎంఎన్ఎస్ 6 చోట్ల మాత్రం నెగ్గింది. ఉద్ధవ్ పార్టీ కనీసం మరో 5 చోట్ల ముందంజలో ఉంది. బీఎంసీ సహా రాష్ట్రంలో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మహాయుతి ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. ఇక శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా ఘోర ఓటమే చవిచూసింది. భివండీ మినహా ఏ కార్పొరేషన్‌లోనూ కనీసం రెండంకెల స్కోరుకు కూడా చేరుకోలేక చతికిలపడింది. ముంబైలోనైతే ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానానికి పరిమితమైంది! సొంత గడ్డ అయిన పుణెలో కూడా ఘోర పరాభవం పాలైంది. 165 స్థానాలకు గాను కేవలం నాలుగు సీట్లతో సరిపుచ్చుకుంది. అక్కడ బీజేపీ ఒంటరిగానే ఏకంగా 123 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అత్యధిక పురపాలికల్లో నేలచూపులే చూసింది. బీఎంసీలో హస్తం పార్టీకి కేవలం 24 స్థానాలు దక్కాయి. లాతూర్ కార్పొరేషన్లో సొంతంగా మెజారిటీ సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటగా నిలిచింది. మొత్తం 29 కార్పొరేషన్లకు గాను మహాయుతి కూటమి 25 స్థానాలను చేజిక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. పురపాలికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వెలిబుచ్చారు. 54 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అన్ని పురపాలికల గడువూ మూడు నుంచి ఐదేళ్ల క్రితమే ముగిసింది. నాటినుంచీ అధికారుల పాలనలో ఉన్న ఆ కార్పొరేషన్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తమ్మీద 54.77 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఇచల్కరంజీ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధికంగా 69.76 శాతం ఓటింగ్ జరిగింది. 66.53 శాతంతో కొల్హాపూర్ రెండో స్థానంలో నిలిచింది. మీరా–భయందర్‌లో అత్యల్పంగా 48.64 శాతం నమోదైంది. ముంబైలో 52.94 శాతం పోలింగ్ జరిగింది. ప్రతిష్టాత్మకమైన పుణెతో పాటు పంప్రీ–చించ్వాడ్, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్... ఇలా మెజారిటీ కార్పొరేషన్లలో బీజేపీ కూటమి హవాయే కొనసాగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేసరికి మొత్తం 2,784 వార్డుల ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ 1,372 చోట్ల గెలుపొందింది. లాతూర్ కార్పొరేషన్లో మాత్రం 70 స్థానాలకు గాను కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. బీజేపీ 22 సీట్లకు పరిమితమైంది. చంద్రపూర్‌లో కూడా 66 స్థానాలకు గాను కాంగ్రెస్ 27 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఉద్ధవ్ శివసేనకు 6 స్థానాలు దక్కాయి. రెండు పార్టీలూ కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చంటున్నారు. జనవికాస్ సేనకు 3 సీట్లు రాగా ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. వారి మద్దతూ తమకేనని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ 23 సీట్లకు పరిమితం కాగా మజ్లిస్, బీఎస్పీలకు ఒక్కో స్థానం దక్కాయి. వసై–వీరార్ కార్పొరేషన్లో స్థానిక పార్టీ బహుజన్ వికాస్ అగాఢీ విజయం సాధించడం విశేషం. 115కు గాను ఆ పార్టీ ఏకంగా 71 స్థానాలను చేజిక్కించుకోగా బీజేపీ 43 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక పర్బాణిలో 65 స్థానాలకు గాను శివసేన (యూబీటీ) 25, కాంగ్రెస్ 12 సీట్లలో నెగ్గాయి. బీజేపీకి 12, ఎన్సీపీ (అజిత్) వర్గానికి 11 సీట్లొచ్చాయి.అభివృద్ధికే ఓటేశారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ పోరులో బీజేపీ కూటమి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో చెప్పేందుకు ఈ విజయమే తార్కాణమని ఆయన అన్నారు. అత్యధిక కార్పొరేషన్లలో ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా తమ పనితీరును వారు మరోసారి ఆశీర్వదించారన్నారు. ‘థాంక్యూ మహారాష్ట్ర!’ అంటూ ఎక్స్ పోస్టులో రాష్ట్ర ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో వారితో ఎన్డీఏ బంధం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్డీఏకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టిన కూటమి కార్యకర్తలను చూసి గరి్వస్తున్నా. మీ అవిశ్రాంత శ్రమే ఇందుకు కారణం’’ అన్నారు.బీజేపీ ఓట్ల చోరీ: రాహుల్ న్యూఢిల్లీ: ఎప్పట్లాగే మహారాష్ట్ర పురపాలికల ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ కండబలంతో ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఓటర్ల వేలిపై గుర్తు పెట్టేందుకు వాడిన మార్కర్ పెన్నుల్లో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే నాసిరకం ఇంకు వాడిందని మరోసారి ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపనున్నట్టు ముంబై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మార్కర్ పెన్నులు వాడబోమని కూడా ఎస్ఈసీ దినేశ్ వాగ్మారే పేర్కొన్నారు. 2011 నుంచీ రాష్ట్రంలో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ మార్కర్లనే వాడుతున్నట్టు ఆయన గుర్తు చేశారు.గౌరీ లంకేశ్ హత్య కేసునిందితుని గెలుపు జల్నా: జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పనగార్కర్ పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించాడు. జల్నా కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగిన అతడు 13వ వార్డు కార్పొరేటర్‌గా నెగ్గాడు. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రావ్‌సాహెబ్ ధోబ్లేపై స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. లంకేశ్ 2017లో దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఆమెను బెంగళూరు నివాసం బయటే దారుణంగా కాల్చి చంపారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్‌ను 2018 ఆగస్టులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. 2024లో అతను బెయిల్‌పై బయటికొచ్చాడు.మజ్లిస్‌కు 114 స్థానాలు మహారాష్ట్ర పుర పోరులో ఆలిండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 114 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లో అత్యధికంగా 33 సీట్లు నెగ్గడం విశేషం. మాలెగావ్ (21), అమరావతి (15), నాందేడ్ (13), ధులే (10) కార్పొరేషన్లలో పార్టీ రెండంకెల స్కోరు దాటింది. బీఎంసీలో కూడా ఖాతా తెరిచింది. 2017 నాటి కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ 80 స్థానాలు నెగ్గింది.చతికిలపడ్డ శివసేనశివసేన. మహారాష్ట్రలో ఈ పేరే ఓ సంచలనం. ముంబైలో శివసేన తిరుగులేని శక్తి. వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే రోజుల నుంచీ నగరంలో ఆ పార్టీ హవాయే సాగుతూ వచి్చంది. కొన్నేళ్లుగా కొడిగడుతూ వచి్చన ఆ ప్రభ తాజా బీఎంసీ ఎన్నికల ఫలితాలతో దాదాపుగా పరిసమా ప్తమైనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఇక తెర పడ్డట్టేనని చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అధికార యావే ఇందుకు కారణమని, ఆయన అత్యాశ కారణంగా చిట్టచివరి దుర్గమైన ముంబై కూడా శాశ్వతంగా పార్టీ చేజారిందని ఆయన వర్గీయులే వాపోతున్న పరిస్థితి. ముంబైపై పట్టును సవతి సోదరుడు రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ చేతులు కలిపినా లాభం లేకపోయింది. -
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
-
ముంబై మేయర్ పీఠం ఎవరిదో?
-
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
-
మహారాష్ట్రలో సిరాకు బదులు మార్కర్.. థాక్రే ఆరోపణలు
Maharashtra Elections Updates..ఓటు వేసిన సీఎం ఫడ్నవీస్మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ఫడ్నవీస్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఇప్పటి వరకు 14 శాతం పోలింగ్ నమోదుప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.#WATCH | Nagpur: Maharashtra CM Devendra Fadnavis and his family show their inked fingers after casting their vote for the Maharashtra local body elections. pic.twitter.com/ExLnWCm3xR— ANI (@ANI) January 15, 2026 ఎన్నికల నిర్వహణపై రాజ్ థాక్రే ఆరోపణలు..ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఆరోపణలు.తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించారు.చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగించడాన్ని తప్పుబట్టారు.పోలింగ్ ప్రక్రియను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలు అంటూ విమర్శించారు.ఇది ఆమోదయోగ్యం కాదు.ఇటువంటి మోసపూరిత ఎన్నికల వల్ల ప్రయోజనం లేదు.పౌరులు అప్రమత్తంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను Raj Thackeray on Voting Booth Issue : सॅनिटायझरने पुसलं तर मार्करची शाई जातेय : राज ठाकरे#RajThackeray #MNS #voting #abpmajha pic.twitter.com/zKkLAVwC1h— ABP माझा (@abpmajhatv) January 15, 2026ఓటు వేసిన నితిన్ గడ్కరీ, థాక్రేనాగపూర్లో ఓటు వేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే.ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్ థాక్రే. #WATCH | Maharashtra: MNS chief Raj Thackeray, along with his family, arrives at a polling station in Mumbai to cast his vote for the BMC elections. pic.twitter.com/jEPhUXUbjm— ANI (@ANI) January 15, 2026#WATCH | Union Minister Nitin Gadkari shows his inked finger after casting his vote at a polling station in Nagpur for Maharashtra local body polls. pic.twitter.com/F5IRM0qgFb— ANI (@ANI) January 15, 2026ఓటు వేసిన ప్రముఖులు.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సచిన్ముంబైలోని పోలింగ్ బూత్‌లో సచిన్ ఓటు వేశారు.సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Mumbai: Legendary cricketer Sachin Tendulkar shows his inked finger after casting his vote for the BMC elections.He says, "This is a very important election. It gives us a chance where we can express our opinion through votes. Everyone should come out and cast their… https://t.co/a3GAx722A7 pic.twitter.com/dweQFzV796— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన ప్రముఖులు వీరే.. #WATCH | Pune | After casting his vote in the 2026 Maharashtra municipal elections, Maharashtra Minister Chandrakant Patil says, "I exercised my right to vote... I fulfilled my duty this morning. I appeal to everyone to come out and vote... The BJP will bring development... and… pic.twitter.com/oq9JEKB8kA— ANI (@ANI) January 15, 2026 #WATCH | Mumbai: After casting his vote for the BMC elections, Musician Vishal Dadlani says, "...Hopefully, whoever wins will hold the elections on time. This is very important for the country, for democracy. But given the state of our city in the last few days, the hope is that… pic.twitter.com/v9vGyNuJ52— ANI (@ANI) January 15, 2026 ఓటు వేసిన మోహన్ భగవత్, అక్షయ్ కుమార్మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. #WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg— ANI (@ANI) January 15, 2026 మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.బృహన్ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7— ANI (@ANI) January 15, 2026పోటీలో 1700 మంది అభ్యర్థులు.. మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు. -
బీసీల వాటా 31.4%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగావార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరీకి ఎన్ని దక్కుతాయో వెల్లడించింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి బుధవారం జీవో నంబర్ 14 జారీ చేశారు. మున్సిపల్ వార్డులు, డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వుడు స్థానాల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4 శాతం, కార్పొరేషన్లలో 30 శాతం సీట్లు రిజర్వు చేశారు. 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్లకు గాను బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా, ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి. -
తెలంగాణ మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది.మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పైనా ప్రభుత్వం నోటిఫికేషన్లో మార్గదర్శకాలను పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది.ముఖ్య మార్గదర్శకాలు జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపుబీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలుమహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారుతాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారుSEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లుగత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపుమున్సిపాలిటీల్లో వార్డులకు 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపుబీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్మహిళలకు (జనరల్) 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లుప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారుఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్రిజర్వ్డ్ సీట్ల స్పష్టమైన విభజనగ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపుజిల్లా వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల -
మున్సిపల్ హీట్.. కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ ఫుల్ ఫోకస్
-
ఫిబ్రవరి 14న ‘పుర’ పోరు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నిక వచ్చే నెల 14న నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటరు జాబితా ఈ నెల 16న ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకా శం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రచారానికి వారం రోజుల వ్యవధి ఇచ్చేలా షెడ్యూల్‌పై కసరత్తు జరుగుతోంది.రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలును ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని 32 శాతానికే పరిమితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నివేదిక అందించిన ‘బూసాని’.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన బీసీ డెడికేషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదిక అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 12 లేదా 13వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించే పక్షంలో ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లు గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం నేపథ్యంలో మున్సిపాలిటీల్లో బీసీ జనాభా స్వల్పంగా తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి పరిమితం కానుండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రూ.85 కోట్లు విడుదల చేయాలని లేఖ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని కోరుతూ పురపాలక శాఖ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పోరేషన్లు కలుపుకుని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లోని 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిపోయిన ఐదారు కార్పొరేషన్ల పాలక మండళ్లను రద్దే చేయడం లేదా..వారితో రాజీనామా చేయించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
-
ముంబై మేయర్ పీఠం.. ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్ స్థానం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి నుంచే మేయర్ వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్ ఎంపిక విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ..దేశం ముందు అనే భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముంబై మేయర్ సీటు మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడింది. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు సహజంగానే మేయర్ తమిళుడు కావాలని చెబుతారు. అదేవిధంగా ముంబైలో కూడా మేయర్ మరాఠీ వ్యక్తే అవుతారు. మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అంతకముందు మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై మేయర్ పీఠం ఎంఐఎం పార్టీదేనని అన్నారు. ముంబై మేయర్‌గా ముస్లిం వ్యక్తే ఉంటారని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై ట్రాఫిక్ విషయమై ఫడ్నవీస్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఢిల్లీ ట్రాఫిక్ కంటే ముంబై ట్రాఫిక్ చాలా బెటర్. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరు. ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు. సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్‌లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్‌తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.ఇదిలా ఉండగా.. ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ స్థానం ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. -
పురం.. సత్వరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం వంటి అంశాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని.. జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు. రాణీ కుముదిని ఈ నెల 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని ‘టి పోల్’యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన రిటరి్నంగ్ అధికారులు, సహాయ రిటరి్నంగ్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను వెంటనే నియమించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. పోలింగ్ కోసం అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. నేడు రాజకీయ పార్టీలతో భేటీ ఇప్పటికే జిల్లా స్థాయిలో రాజకీయ పక్షాలతో ఈ నెల 5న సమావేశాలు నిర్వహించగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇదిలావుంటే ఈ నెల 16 నాటికి ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లపై స్పష్టత రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఎస్ఈసీ దృష్టి పెట్టనుంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపాలిటీ వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు. మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు, ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కొత్త పాలకమండళ్లు! మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల మూడోవారంలోగా షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖరుకు కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నల్లగొండ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ మంగళవారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ‘తెలంగాణ పురపాలికల చట్ట సవరణ’బిల్లును ఆమోదించారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ 48 డివిజన్లుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తారు.


