Telangana : నేడు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక | Updates on the Telangana municipal elections 2026 | Sakshi
Sakshi News home page

నేడు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక

Feb 16 2026 8:54 AM | Updated on Feb 16 2026 9:45 AM

Updates on the Telangana municipal elections 2026

సాక్షి,హైదరాబాద్‌: నేడు తెలంగాణలో మున్సిపల్‌ కార్పొరేషన్లకు  ఛైర్మెన్, మేయర్ ఎన్నికలకు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నికకు ఎన్నికల సంఘం అధికారులకు ఏర్పాటు పూర్తి చేశారు. వైస్ చైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సైతం ఎన్నికల సంఘం  షెడ్యూల్ చేసింది. ఉదయం పది గంటల వరకు పత్రాలు బి ఫామ్ అధికారులకు సడ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో  అధికార, ప్రతిపక్ష పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్,వైస్ చైర్మన్‌ల ఎన్నికకు సమాయత్తమువుతున్నాయి. అవసరమైన సభ్యులు హాజరుకాకపోతే ఎంపిక కష్టమవుతున్న తరుణంలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. 

 కరీంనగర్:

  • కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ

  • కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్

  • మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీ

  • బీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్

  • ఈ క్రమంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్న బీఆర్ఎస్

సూర్యాపేట జిల్లా:

  • కోదాడ మున్సిపాలిటీలో పదవి పంపకాలు

  • చైర్ పర్సన్ ఆశావాహులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో బుజ్జగింపు రాజకీయాలు

  • మొదటి రెండు సంవత్సరాలు చైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

  • వైస్ ఛైర్మన్‌గా  దేవారంపల్లి మల్లేశ్వరి నాగిరెడ్డి

  • అనంతరం మరో మూడు సంవత్సరాలు

  • చైర్ పర్సన్‌గా  పారా సత్యవతి సీతయ్య

  • వైస్ చైర్మన్ గుండపునేని  పద్మావతి నాగేశ్వరరావు  పేర్లు ఖరారు

 జగిత్యాల జిల్లా:

  • జగిత్యాల పట్టణ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం

  • సీల్డ్ కవర్‌లో చైర్మన్ అభ్యర్థి పేరు

  • ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని అధిష్ఠానం

  • జీవన్ రెడ్డి, సంజయ్‌కు కూడా అందని సమాచారం

  • వాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజయ్

  • అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న  జీవన్ రెడ్డి, సంజయ్

  • ఎవరి వర్గం వారు చైర్మన్, వైస్ చైర్మన్ కాబోతున్నారన్న ఉత్కంఠ.

కరీంనగర్‌: 

  • కరీంనగర్‌లో శరవేగంగా మారుతున్న మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు..

  • రాత్రికి రాత్రే చక్రం తిప్పిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్

  • కాంగ్రెస్‌కు మేయర్, డిప్యూటీ పీఠాలు దక్కాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్స్, ఎంఐఎం మద్దతు తప్పనిసరి

  • కానీ, చేతులెత్తి ఓటేసే విషయంలో పీఠముడి

  • బీఆర్ఎస్ అభ్యర్థుల డిమాండ్లకు కాంగ్రెస్ సరైన స్పందన లేకపోవడంతో అలక

  • తటస్థంగా వ్యవహరించాలని నిర్ణయం..?

  • మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తకపోతే బీజేపీదే విజయం

  • ఉత్కంఠగా మారిన కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాలు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:

  • వ్యూహ-ప్రతివ్యూహాల నడుమ మున్సిపల్ పోరు

  • ​ఎక్స్ అఫీషియో ఓట్లతో గేమ్ ప్లాన్

  • గెలుపు గుర్రాలను తేల్చేది ప్రజా ప్రతినిధులే

  • ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలు

  • ​కింగ్ మేకర్లుగా స్వతంత్రులు

  • మొయినాబాద్, ఎల్లంపేటలో హంగ్ భయం

  • స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల మధ్య వార్

  • ​వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మారుతున్న సమీకరణాలు.. క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఉత్కంఠ


మేడ్చల్ జిల్లా :

  • జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యే చాన్స్

  • మల్లారెడ్డి, ఈటల మధ్య చర్చలు విఫలం

  • కాంగ్రెస్ నేత మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య చర్చలు

  • ​ఎల్లంపేట లోనే మల్లారెడ్డి, ఈటల ఓట్ల నమోదు

  • ఎల్లంపేట 13-13 ఓట్లతో టై..  లాటరీ ద్వారా చైర్మెన్ ఎన్నుకుంటారా ? 

  • బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటారా ? అనేది ఉత్కంఠ

నిజామాబాద్: 

  • నిజామాబాద్ : బోధన్ మున్సిపాలిటీలో వీడిన ప్రతిష్టంభన

  • కాంగ్రెస్, ఎం. ఐ. ఎం. మధ్య అవగాహన

  • చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం.

  • మున్సిపల్ చైర్మన్‌గా తూము శరత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు.

నిజామాబాద్‌:

  • నిజమాబాద్ జిల్లాలో మేయర్,చైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

  • ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్,ఏడు మున్సిపాలిటీలు

  • నిజమాబాద్‌తో పాటు కామారెడ్డి, బోధన్‌లో హాంగ్  

  • కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు మేయర్,ఎంఐఎంకు డిప్యూటీ మేయర్‌కు ఇచ్చేలా కుదిరిన ఒప్పందం

  • మేయర్ పరిశీలనలో ముగ్గురు మహిళల మధ్య పోటీ

  • ఎంఐఎం డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ ఖరారు తొలిసారి మహిళకు అవకాశం

  • ఆర్మూర్, భీంగల్ ,ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో  కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యం

  • సీల్డ్ కవర్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు పంపనున్న అధిష్టానం 

మహబూబ్ నగర్: 

  • నేడు మహబూబ్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్,చైర్మన్,వైస్ చైర్మన్‌ల ఎన్నిక

  • మహబూబ్ నగర్ కార్పోరేషన్‌లో కుదరని ఏకాభిప్రాయం

  • గంగరగోళంగా అభ్యర్దుల ఎంపిక

  • పదవి కోసం మైనార్టీల పట్టు

  • హంగ్ నేపద్యంలో గద్వాల,నారాయణ పేట,అమరచింతలో ఉత్కంఠత

  • క్యాంపుల నుంచి నేరుగా సమావేశలకు గెలిచిన అభ్యర్దులు

ఖమ్మం..

  • మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

  • కౌన్సిలర్ల ప్రమాణం తర్వాత చైర్మన్ ,వైస్ చైర్మన్‌ల ఎన్నిక

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్‌కే

  • చైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ..

  • నేడు పేర్లు ప్రకటించనున్న ఇన్‌ఛార్జ్‌ మంత్రి కొండ సురేఖ

  • కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో సిపిఐ ,కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం

  • మొదటి రెండున్నర ఏళ్ళు సీపీఐకి మేయర్..కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్

  • తర్వాత రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్‌కు మేయర్‌ సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం  

  • ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్‌లో60 డివిజన్లో పార్టీల వారీగా గెలిచిన స్థానాలు

  • కాంగ్రెస్ 22, సిపిఐ 22 ,బి ఆర్ ఎస్ 8, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు 6చోట్ల గెలుపొందారు

  • ఇందులో ఐదుగురు స్వతంత్రులు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

  • జాతీయ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌తో నడవాలని నిర్ణయించుకున్న సీపీఐ

  • అంతకుముందు కొత్తగూడెంలో హంగ్ వచ్చిన నేపద్యంలో సిపిఐకి బహిరంగంగా మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ 

నిజమాబాద్ జిల్లా:

  • నేడు జిల్లాలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, ఉత్తమ్ పర్యటన

  • నిజమాబాద్ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో గా ఓటు హక్కు వినియోగించుకోనున్న మహేష్ కుమార్ గౌడ్

  • మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనున్న మంత్రులు.

నల్లగొండ జిల్లా: 

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక‌ కార్పొరేషన్‌లో కొలువుదీరనున్న పాలకవర్గాలు

  • ఉదయం 10 గంటలకు సమావేశం. అనంతరం సభ్యుల ప్రమాణం

  • క్యాంపుల నుంచి నేరుగా సమావేశానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

  • పలు మున్సిపాలిటీల్లో ఇంకా చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎవరో రాని‌ స్పష్టత

  • నల్లగొండ మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.

  • ఇక్కడ డిప్యూటీ మేయర్ గా మైనార్టీ, బీసీ వర్గాలకు అవకాశం

  • దేవరకొండ చైర్ పర్సన్ గా పున్నా శైలజకు అవకాశం?

  • హాలియా చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి

  • నందికొండ చైర్ పర్సన్‌గా  మానసస్వర్ణ

  • మిర్యాలగూడ నుంచి పోటీలో నలుగురు

  • చండూరు చైర్మన్‌గా  కోడి‌శ్రీనివాస్

  • చిట్యాల చైర్ పర్సన్‌గా  పందిరి గీతకు అవకాశం

  • నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా  కొణతం చిన వెంకటరెడ్డి. వైస్ చైర్మన్‌గా నూకల సందీప్ రెడ్డి

  • కోదాడ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు. పోటీలో ఐదుగురు

  • సూర్యాపేట చైర్ పర్సన్‌గా మొరిశెట్టి నివేదిత

  • తిరుమలగిరి చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన రుఘునందన్ రెడ్డి

  • హుజూర్‌నగర్ మున్సిపల్ చైర్మన్ విషయంలో స్పష్టత కరువు.

  • భువనగిరి చైర్ పర్సన్ గా గంజి శ్రీవాణి, బర్రె పూజిత, పోతంశెట్టి మంజులలో ఒకరికి అవకాశం

  • చౌటుప్పల్ చైర్ పర్సన్ విషయంలో స్పష్టత కరువు

  • మోత్కూరు చైర్ పర్సన్ కోసం ముగ్గురు పోటీ

  • ఆలేరు చైర్ పర్సన్ పోటీలో ఇద్దరు

  • యాదగిరిగుట్ట చైర్ పర్సన్ గా వాణి ఎంపిక దాదాపు ఖరారే

  • పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేష్ కు అవకాశం

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement