‘బయో ఏషియా’కు సర్వం సిద్ధం | CM Revanth Reddy will inaugurate the two-day BioAsia 2026 conference on February 17 | Sakshi
Sakshi News home page

‘బయో ఏషియా’కు సర్వం సిద్ధం

Feb 16 2026 6:05 AM | Updated on Feb 16 2026 6:05 AM

CM Revanth Reddy will inaugurate the two-day BioAsia 2026 conference on February 17

17న సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  

హెచ్‌ఐసీసీ హాల్‌–4లో భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: బయో ఏషియా–2026 సద స్సుకు రాజధాని ముస్తాబైంది. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(హెచ్‌ఐసీసీ) హాల్‌–4లో రెండ్రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. 17న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, మంత్రి శ్రీధర్‌బాబు బయో ఏషియా సదస్సు 23వ ఎడిషన్‌ను ప్రారంభిస్తారు. ‘టెక్‌బయో అన్‌లీ‹Ù్డ ఏఐ, ఆటోమేషన్‌– బయాలజీ రివల్యూషన్‌’’అనే థీమ్‌ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బయో టెక్నాలజీ, ఔషధాలు, హెల్త్‌ రంగాలకు చెందిన నిపుణులు, 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలను ఈ సదస్సు వేదికగా పంచుకోనున్నారు.

తాజా సదస్సులో సింథటిక్‌ బయాలజీ, జనోమిక్స్, బయో మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఔషధ ఆవిష్కరణ, డిజిటల్‌ హెల్త్‌ రంగాలపై లోతైన చర్చ జరుగుతుంది. చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఆరోగ్య రంగం ‘ప్రీడిక్టివ్, ప్రిసైస్, ఇన్క్లూజివ్‌’దిశగా ఎలా మారుతుందో ఈ సదస్సు స్పష్టం చేయనుంది. భారత్‌ టెక్‌ బయో శక్తిగా ఎలా ఎదిగింది ? ప్రపంచ ఆరోగ్య సమస్యలకు వినూత్న పరిష్కారాలను ఎలా అందిస్తోంది అన్న అంశాలపై ప్రత్యేకంగా ఈ సదస్సులో చర్చిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, పెట్టుబడులు, విధానాల సమన్వయం ద్వారా ఆరోగ్య రంగంలో వేగవంతమైన పురోగతిని సాధించడమే లక్ష్యంగా బయో ఏషియా–2026 వేదిక కానుంది.  

షెడ్యూల్‌ ఇలా... 
ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య బయో ఏషియా–2026 సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. తొలిరోజు సదస్సులో భాగంగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ ప్రసంగిస్తారు. యూఎస్‌ఏకు చెందిన ప్రఖ్యాత కేన్సర్‌ జీన్‌ థెరపీ విభాగ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎల్‌.లెవిన్, ఆ తర్వాత అమ్జెన్‌ సంస్థ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డా.హోవర్డ్‌ వై.చాంగ్‌ కీలక ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ప్యానల్‌ డిస్కషన్స్‌ జరుగుతాయి.  

18న రెండో రోజు సదస్సులో భాగంగా ప్యానల్‌ డిస్కషన్స్‌ కొనసాగుతాయి. తెలంగాణ రైజింగ్‌–2047: బిల్డింగ్‌ ఏ వరల్డ్‌ క్లాస్‌ లైఫ్‌–సైన్సెస్‌ ఇకో సిస్టం, ముగింపుల కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement