Market
-
ఐటీ షేర్ల అండ.. ఏడోరోజూ ముందడుగు
ముంబై: ఐటీ రంగ షేర్ల అండతో స్టాక్ సూచీల ర్యాలీ ఏడోరోజూ కొనసాగింది. అయితే లాభాల స్వీకరణతో ఆరంభ లాభాలు హరించుకుపోయాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 757 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరికి 33 పాయింట్లు పరిమిత లాభంతో 78 వేల స్థాయిపైన 78,017 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్ల స్వల్ప లాభంతో 23,669 వద్ద నిలిచింది. ఐటీ, ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.ఇప్పటికీ అధిక విలువల వద్ద ట్రేడవుతున్న చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో విక్రయాలు చోటుచేసుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ సూచీ 1.63%, మిడ్ క్యాప్ ఇండెక్సు 1.13 శాతం నష్టపోయాయి. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న ప్రతీకార సుంకాల్లో మినహాయింపు ఉండొచ్చని ట్రంప్ సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ⇒ అధిక విలువ కలిగిన షేర్లలో ఇటీవల దిద్దుబాటు కారణంగా ఐటీ షేర్లకు డిమాండ్ నెలకొంది. పెర్సిస్టెంట్ 2.60%, కో ఫోర్జ్ 2.25% ర్యాలీ చేశాయి. ఎంఫసిస్, ఇన్ఫోసిస్ 1.50% పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్ 1%, టీసీఎస్, విప్రో షేర్లు అరశాతం మేర లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెంట్రల్ బ్యాంక్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3–5% క్షీణించాయి. ⇒ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ ఊపందుకుంటుందనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సిమెంట్ రంగ షేర్లకు ‘బై’ కేటాయించింది. అ్రల్టాటెక్ 3.50%, ఏసీసీ, దాల్మియా భారత్, అంబుజా సిమెంట్స్ 3% పెరిగాయి. -
సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు
సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ యోచిస్తోంది. ఇటీవల సెబీ కొత్త ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవిపురి బచ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.సెబీ ప్రతిపాదిత నిర్ణయంలో భాగంగా అధికారులు, సభ్యులు, ఇతర సిబ్బంది ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ సమీక్ష నిర్వహించనుంది. సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే తెలిపారు. బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని స్పష్టం చేశారు.ఏడాది చార్జీని ముందే తీసుకోవచ్చుపెట్టుబడుల సలహాదారులు (ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు), పరిశోధన విశ్లేషకులు (రీసెర్చ్ అనలిస్టులు) తమ సేవలకు సంబంధించి ఏడాది కాల చార్జీని ముందుగానే క్లయింట్ల నుంచి తీసుకునేందుకు అనుమతించాలని సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు క్లయింట్ల ఆమోదం మేరకు రెండు త్రైమాసికాల చార్జీలనే (ఆరు నెలలు) ముందస్తుగా తీసుకునేందుకు అనుమతి ఉంది. అదే, రీసెర్చ్ అనలిస్టులు అయితే ఒక త్రైమాసికం చార్జీలనే ముందుగా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?‘ఐఏలు, ఆర్ఏలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో.. క్లయింట్లు సమ్మతిస్తే ఏడాది కాల ఫీజులను ముందుగానే తీసుకునేందుకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది’ అని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఫీజుల పరిమితులు, చెల్లింపుల విధానాలు, రిఫండ్లు, బ్రేకేజ్ ఫీజులకు సంబంధించి నిబంధనల అమలు కేవలం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్) క్లయింట్లకే పరిమితమని స్పష్టం చేశారు. -
దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,850 (22 క్యారెట్స్), రూ.89,290 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,290 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 దిగి రూ.82,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.89,440 వద్దకు చేరింది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ప్రయివేట్ పెట్టుబడులు నేలచూపు
ముంబై: దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ప్రయివేట్ పెట్టుబడులు 33 శాతం క్షీణించినట్లు రేటింగ్ ఎజెన్సీ ఇక్రా తాజాగా వెల్లడించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే కనిష్టంకాగా.. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే అన్‌లిస్టెడ్ సంస్థలు పెట్టుబడుల్లో వెనకడుగు వేసినట్లు నివేదికలో పేర్కొంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే పెట్టుబడులకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ పెట్టుబడులు లేకపోవడం ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు కొన్ని త్రైమాసికాలలో తలెత్తినట్లు వివరించింది. నివేదిక ప్రకారం.. కొత్త సౌకర్యాలపై ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ప్రయివేట్ రంగం రుణ చెల్లింపులకే మిగులు నిధులను వెచి్చంచడంపై దృష్టి పెట్టింది. తద్వారా అధిక సామర్థ్య వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రధానంగా పట్టణాలలో వినియోగం బలహీనపడటం, డిమాండ్ మందగించడం, చైనా నుంచి పెరిగిన చౌక దిగుమతులు తదితర అంశాల కారణంగా దేశీ కార్పొరేట్ల విస్తరణ ప్రణాళికలు పరిమితమైపోయినట్లు ఇక్రా చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలియజేశారు. -
హల్దీరామ్‌లో టెమాసెక్‌కు వాటా
న్యూఢిల్లీ: ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమాసెక్ హోల్డింగ్స్ 10 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు అనుమతించమంటూ అనుబంధ సంస్థ జాంగ్‌సాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ ద్వారా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు దరఖాస్తు చేసింది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా కంపెనీ చెల్లించిన మూలధనంలో 10 శాతానికంటే తక్కువ వాటా సొంతం చేసుకుకోనున్నట్లు సీసీఐకి తెలియజేసింది. షేర్లు, వోటింగ్ హక్కుల ద్వారా వాటా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,700 కోట్లు) విలువలో హల్దీరామ్ స్నాక్స్‌లో 10 శాతం వాటా కొనుగోలుకి టెమాసెక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్లాక్‌స్టోన్, అల్ఫా వేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాలతో చర్చల అనంతరం టెమాసెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అగర్వాల్ కుటుంబ నిర్వహణలోని హల్దీరామ్ స్నాక్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహించే సంగతి తెలిసిందే. 1937లో రాజస్తాన్‌లోని బికనీర్‌లో ఏర్పాటైన కంపెనీ వచ్చే ఏడాది(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తాజాగా అందుకోనున్న నిధులను విస్తరణకు వినియోగించే వీలుంది. -
రిజిస్టర్డ్ ఫిన్ఫ్లుయెన్సర్లు 2 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడులపై రిటైల్ మదుపరుల మీద ఫిన్ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సరైన అర్హతలు, తగిన అనుమతులు లేకుండా వారిచ్చే ఆర్థిక సలహాలను పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ, ఎంతో మంది నష్టాల పాలవుతున్నారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లపై అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్ సంస్థ సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు (ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు) రెండు శాతమే ఉన్నారు. కానీ 33 శాతం మంది బాహాటంగానే క్రయ, విక్రయాలకు సంబంధించిన రికమెండేషన్లు ఇస్తున్నారు. దీంతో సదరు సలహాల విశ్వసనీయతపైనా, ఇన్ఫ్లుయెన్సర్ల జవాబుదారీతనంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిన్ఫ్లుయెన్సర్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు, పరిణామాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో 51 మంది ప్రముఖ ఫిన్ఫ్లుయెన్సర్ల తీరును లోతుగా విశ్లేషించారు. ఇందులో 1,600 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు దేశీయంగా ఫిన్‌ఫ్లుయెన్సర్ వ్యవస్థ ద్వారా ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బాధ్యతాయుతమైన విధానాలను పాటించడం, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్ల నుంచే పెట్టుబడులకు సంబంధించిన గైడెన్స్ తీసుకోవాలి. తాము ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలను ధృవీకరించుకోవాలి’’ అని సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్–ఇండియా కంట్రీ హెడ్ ఆరతి పోర్వాల్ తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. → 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువ ఇన్వెస్టర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. పొదుపు రూపంలో కాస్త చెప్పుకోతగిన మొత్తాన్ని పోగేసుకునే వరకు వేచి చూస్తున్నారు. వయస్సులో పెద్దవారైన ఇన్వెస్టర్లు మాత్రం నెలవారీగా ఇన్వెస్ట్ చేయడంలో స్థిరమైన విధానాలను పాటిస్తున్నారు. → విశ్వసనీయత, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటమనేవి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడంలో కీలకాంశాలుగా ఉంటున్నాయి. యువ ఇన్వెస్టర్లు తక్కువ బ్రోకరేజీ ఉండే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటుండగా, కాస్త సీనియర్లు ఫుల్–సర్వీస్ బ్రోకరేజీలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గైడెన్స్ ఇచ్చే ఫ్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నారు. → సంక్లిష్టమైన ఆర్థికాంశాలను ఇన్ఫ్లుయెన్సర్లు సరళంగా వివరిస్తున్నప్పటికీ, తమకు ఒనగూరే ప్రయోజనాల వివరాలను సరిగ్గా వెల్లడించడం లేదు. 63 శాతం మంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే స్పాన్సర్‌షిప్‌ల గురించి, ఆర్థిక సంస్థలతో ఉన్న సంబంధాల గురించి సరైన వివరాలు వెల్లడించలేదు. → ఈ నేపథ్యంలో నియంత్రణ, అవగాహనకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్టీఫికేషన్ ప్రమాణాలను పటిష్టం చేయాలి. ఆర్థిక సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు, సెబీలో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. పర్యవేక్షణ విధానాలను కఠినతరం చేయాలి. సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా పేర్కొనాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను ధృవీకరించే విధానాలను రూపొందించాలి. అలాగే, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.ఉపయోగాలు ఉన్నాయి, రిస్కులూ ఉన్నాయి..గత అయిదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇది స్వాగతించతగిన పరిణామమే అయినప్పటికీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం వీరిలో చాలా మంది స్పెక్యులేటర్లే ఉంటున్నారు తప్ప నిజమైన ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువే ఉంటోంది. వీరిని ప్రభావితం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందుతున్న ఫిన్ఫ్లుయెన్సర్లను కట్టడి చేసేందుకు సెబీ భారీ జరిమానాలు విధిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఇంకా చాలా సమయమే పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులను అర్థం చేసుకోవడం, ఫిన్ఫ్లుయెన్సర్లు అందిస్తున్న కంటెంట్‌ను సమీక్షించడం కీలకమైన అంశాలని సీఎఫ్ఏ గుర్తించింది. ఇందులో భాగంగానే నిర్వహించిన అధ్యనయంలో ఇన్వెస్టర్లను ఫిన్ఫ్లుయెన్సర్లు గణనీయంగా ప్రభావితం చేస్తున్న సంగతి వెల్లడైంది. ఇన్ఫ్లుయెన్సర్ల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు 82 శాతం మంది ఫాలోయర్లు తెలిపారు. వీరిలో 72 శాతం మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కూడా లభించాయి. అయితే, ఇందులో రిసు్కలూ ఉంటున్నాయి. వయస్సులో కాస్త పెద్దవారైన ఇన్వెస్టర్లలో (40 ఏళ్లు అంతకు పైబడి) 14 శాతం మంది తాము తప్పుదోవ పట్టించే సలహాలు విని మోసపోయినట్లు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. -
బంగారం వన్స్ మోర్.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) మరోసారి తగ్గాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (March 24) మళ్లీ క్షీణించాయి. భారీ ధరలతో నిరుత్సాహపడిన కొనుగోలుదారులకు వరుస తగ్గుదలలు ఊరటనిస్తున్నాయి.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 82,150, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 89,620 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున దిగొచ్చాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.89,770 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,300 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.210, రూ.150 చొప్పున తగ్గాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,620 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టారిఫ్ సంబంధిత అనిశ్చితి సెంటిమెంటును ప్రభావితం చేయడంతో మిశ్రమ ప్రపంచ మార్కెట్ కదలికల మధ్య భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 496.09 పాయింట్లు లేదా 0.65 శాతం లాతంతో 77,401.60 వద్ద, నిఫ్టీ 50 124.70 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,475.10 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ ప్రారంభం అనంతరం బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 1 శాతానికి పైగా పెరిగాయి.అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, వాణిజ్య సుంకాల ఆందోళనలు, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల చర్యలతో భారత స్టాక్ మార్కెట్లు నడిచే అవకాశం ఉంది. ఈ రోజు విడుదల కానున్న మార్చి నెలకు సంబంధించిన ఇండియా మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, కాంపోజిట్ పీఎంఐ ఫ్లాష్ గణాంకాలపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచనున్నారు.విదేశీ పెట్టుబడులు పుంజుకోవడం, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో భారత రూపాయి వరుసగా తొమ్మిదో సెషన్ లోనూ తన విజయ పరంపరను కొనసాగించింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. శుక్రవారం ముగింపు 85.98 తో పోలిస్తే యూఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు బలపడి 85.94 వద్ద ప్రారంభమైంది. -
మార్కెట్లకు విదేశీ జోష్
ముంబై: సెంటిమెంటుపై ప్రభావం చూపగల అంశాలు కొరవడిన నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా విదేశీ అంశాలు దోహదపడనున్నట్లు తెలియజేశారు. గత వారం మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి ఒక్కసారిగా స్పీడందుకోవడంతో స్వల్ప కాలానికి లాభాల పరుగు కొనసాగనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. అయితే ఈ వారం మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. దీంతో సెంటిమెంటు సానుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. 23,100 వద్ద సపోర్ట్ ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి తొలుత 23,100 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలున్నట్లు టెక్నికల్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జోరందుకున్న నేపథ్యంలో 100 రోజుల చలన సగటు 23,522 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు. 23,600 స్థాయి కీలకంకాగా.. 23,700, 23,800ను అధిగమిస్తే మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. స్వల్ప కాలంలో 24,069 వద్ద తీవ్ర అవరోధం ఎదురుకావచ్చని అంచనా. ఇతర అంశాలు యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాలతోపాటు.. డాలరు ఇండెక్స్, ముడిచమురు ధరల కదలికలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం అమ్మకాల బాట వీడి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగారు. అయితే దేశీ ఫండ్స్ విక్రయాలవైపు చూపు సారించాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కొంతమేర బలహీనపడింది. దీంతో రూపాయి 1 శాతంమేర బలపడింది. ఈ నేపథ్యంలో గత వారం మార్కెట్లు జోరందుకున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. యూఎస్ మార్కెట్లు సైతం పుంజుకున్నప్పటికీ రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గత వారమిలా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఉన్నట్టుండి జోరందుకోవడంతో సెన్సెక్స్ 77,000 మైలురాయికి చేరువైంది. నిఫ్టీ కీలకమైన 23,300ను అధిగమించింది. నికరంగా సెన్సెక్స్ 3,077 పాయింట్లు(4.2 శాతం) జంప్‌చేసి 76,906 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 953 పాయింట్లు(4.3 శాతం) ఎగసి 23,350 వద్ద ముగిసింది. ఇదేవిధంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్ 7 శాతం జంప్‌చేయగా.. స్మాల్ క్యాప్ మరింత వేగంగా 8 శాతం జోరు చూపింది. గణాంకాలపై దృష్టి 2024 చివరి త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) యూఎస్ జీడీపీ త్రైమాసికవారీ గణాంకాలు గురువారం(27న) వెల్లడికానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం గతేడాది క్యూ4లో రియల్ జీడీపీ 2.3 శాతం పుంజుకుంది. ఫిబ్రవరి నెలకు యూఎస్ మన్నికైన వస్తువుల (డ్యూరబుస్) ఆర్డర్ల వివరాలు బుధవారం(26) వెలువడనున్నాయి. ఈ బాటలో శుక్రవారం(28న) ఫిబ్రవరి నెలకు కీలక పీసీఈ ధరల ఇండెక్స్‌ను ప్రకటించనుంది. జనవరిలో 0.3%పెరిగింది.ఎఫ్‌పీఐల యూటర్న్ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం చివర్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. ఉన్నట్టుండి పెట్టుబడుల బాట పట్టారు. చివరి రెండు రోజుల్లో నగదు విభాగంలో రూ. 11,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో గత వారం నికరంగా 19.4 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) విలువైన అమ్మకాలు నమోదయ్యాయి. అంతకుముందు వారం 4 రోజుల ట్రేడింగ్‌లోనే 60.4 కోట్ల(రూ. 5,230 కోట్లు) డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం! కాగా.. మార్చిలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 31,719 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.టాప్–10 కంపెనీల స్పీడ్రూ. 3 లక్షల కోట్ల విలువ ప్లస్గత వారం మార్కెట్ల జోరుతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా టాప్–10 లిస్టెడ్ కంపెనీలు భారీగా బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే వీటి మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లకుపైగా పెరిగింది. ప్రయివేట్ రంగ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధానంగా బలపడగా.. ఐటీసీ మాత్రమే డీలాపడింది. ప్రామాణిక ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ 4.2 శాతం చొప్పున ఎగశాయి. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ అత్యధికంగా రూ. 64,426 కోట్లకుపైగా పుంజుకుని 9,47,628 కోట్లను అధిగమించింది. ఈ బాటలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మార్కెట్ విలువ రూ. 53,286 కోట్లు జంప్‌చేసి రూ. 9,84,354 కోట్లను దాటింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువకు రూ. 49,105 కోట్లు జమయ్యింది. దీంతో బ్యాంక్ విలువ రూ. 13,54,275 కోట్లను తాకింది. రిలయన్స్ సైతం టాప్–10 దిగ్గజాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ దాదాపు రూ. 39,312 కోట్లు బలపడి రూ. 17,27,340 కోట్లకు చేరింది. ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ విలువ సుమారు రూ. 30,954 కోట్లు ఎగసి రూ. 5,52,846 కోట్లను అధిగమించింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 24,259 కోట్లు పెరిగి రూ. 12,95,058 కోట్లను తాకింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ విలువ రూ. 22,535 కోట్లు మెరుగుపడి రూ. 6,72,024 కోట్లకు చేరింది. ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్ క్యాపిటలైజేషన్ రూ. 16,823 కోట్లు ఎగసింది. -
కొత్త ఐపీవో.. రూ. 550 కోట్లు టార్గెట్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది. పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
వారంలో రూ.22 లక్షల కోట్ల సంపద
స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా పతనమై చిన్నగా కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో గడిచిన వారంలో వచ్చిన మార్కెట్ ర్యాలీ నాలుగేళ్లలో ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ 3,000 పాయింట్లు ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ గణనీయమైన ర్యాలీని చూసింది. ఈ బుల్లిష్ రన్‌తో ఇన్వెస్టర్ల సంపద అదనంగా రూ.22 లక్షల కోట్లు పెరిగింది. ఇటీవల కాలం వరకు భారీగా పతనమైన మార్కెట్లు వారంలో ఇంతటి ర్యాలీని అందించడంతో లాభాలను నమోదు చేసుకోవడానికి ఇది సరైన సమయమా లేదా మరింత కాలం వేచి చూడాలా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. దీనిపై నిపుణులు కింది విధంగా సూచిస్తున్నారు.మార్కెట్ ర్యాలీకి కారణాలుసెన్సెక్స్ ఇటీవల పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, వచ్చే త్రైమాసిక ఫలితాల్లో బలమైన కార్పొరేట్ రాబడులుంటాయనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల తీరు ర్యాలీకి మరింత ఊపునిచ్చాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్, కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాలు ఈ పెరుగుదలకు కీలకంగా దోహదపడ్డాయి.స్టాక్స్ అమ్మాలా? ఉంచాలా?మార్కెట్లోని స్టాక్స్‌ను అమ్మి లాభాలు బుక్ చేయాలా లేదా మరిన్ని లాభాలను ఆశించి పెట్టుబడులను నిలుపుకోవాలా అనేది ప్రతి ఇన్వెస్టర్ మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే కింది అంశాలను పరిగణనలోని తీసుకోవాలి.మార్కెట్ వాల్యుయేషన్: మార్కెట్ ప్రస్తుత వాల్యుయేషన్ కీలక అంశం. చారిత్రాత్మక కొలమానాలతో పోలిస్తే కొన్ని స్టాక్స్ ఇప్పటికీ అధిక వ్యాల్యూయేషన్లలోనే ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో దిద్దుబాటు ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో పాక్షికంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో కూడా ఇలాంటి స్టాక్స్ ఉంటే వాటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం.పెట్టుబడి లక్ష్యాలు: ఇన్వెస్టర్లు తమ నిర్ణయాలను దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. భారతదేశం బలమైన ఆర్థిక మూలాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే వారు మరింత ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. తాత్కాలికంగా వచ్చే ర్యాలీకి ప్రభావితం చెంది ట్రేడ్‌లో నిర్ణయం తీసుకోకూడదు.సెక్టార్-స్పెసిఫిక్ అనాలిసిస్: ఏ ర్యాలీలోనైనా అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ఒకేలా పెరగవు..తగ్గవు. సెక్టోరల్ వారీగా స్టాక్స్‌ను విశ్లేషించి ప్రస్తుతం మెరుగైన రాబడినిస్తున్న వాటిని కొనసాగించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ అంశాలు: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, వడ్డీరేట్ల మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్కెట్ ధోరణులను ప్రభావితం చేస్తాయి. ఈ కారకాలపై అప్డేట్లను నిత్యం పరిశీలిస్తుండాలి.డైవర్సిఫికేషన్: ఆకస్మికంగా మార్కెట్లో వచ్చే ర్యాలీ మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడానికి, సరైన వైవిధ్యతను నిర్ధారించడానికి మంచి సమయం. రిస్క్ ఉన్న స్టాక్స్‌ను అమ్మేయడానికి ఈ ర్యాలీ తోడ్పడుతుంది. మంచి స్టాక్స్‌ను కొనసాగించేందుకు దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..మార్కెట్ ర్యాలీలో స్టాక్స్ అమ్మాలా లేదా ఉంచాలా అనేది పెట్టుబడిదారుల దీర్ఘకాలిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పరిధితో సహా వారి వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలి. -
ఊహించని రీతిలో.. మరోమారు తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు పెరుగుదలకు బ్రేక్ పడింది. వరుసగా రెండో రోజు గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,980 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు కూడా వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,980 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,980 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 22) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: చాహల్‌తో విడాకులు.. ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లు: ఇందులో ట్యాక్స్ ఎంత? -
ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్‌బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్‌వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది. పలు కంపెనీలు..ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్‌లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్‌వాలా ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్ రూ.550 కోట్లపై కన్నుప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్‌లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్
న్యూఢిల్లీ: మున్సిపల్ బాండ్ల కోసం ప్రత్యేకించిన వెబ్‌సైట్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఆవిష్కరించింది. తద్వారా దేశీయంగా మున్సిపల్ బాండ్ల మార్కెట్లలో క్రెడిబిలిటీ, విజిబిలిటీని పెంచనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దేశీ మున్సిపల్ బాండ్లపై సమగ్ర డేటాను అందించడం ద్వారా మార్కెట్లో లావాదేవీలు నిర్వహించేవారికి వెబ్సైట్ ప్రధాన కేంద్రంగా నిలవనున్నట్లు తెలియజేసింది.బాండ్ల జారీ, క్రెడిట్ రేటింగ్స్, లావాదేవీల పరిమాణం, వాస్తవిక ఈల్డ్స్, ధరలు తదితరాలను ఇందులో అందించనుంది. అంతేకాకుండా దేశీయంగా తొలి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ అయిన నిఫ్టీ ఇండియా మున్సిపల్ బాండ్ ఇండెక్స్ గత చరిత్ర తదితర పూర్తి వివరాలకు ఇది వేదిక కానుంది. పారదర్శకంగా, సులభంగా బాండ్ల సమాచారాన్ని పొందగలగడంతోపాటు.. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే లక్ష్యాలతో వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎప్పటికప్పుడు సంబంధిత తాజా సమాచారాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో సమకూర్చడం ద్వారా మున్సిపల్ బాండ్లను పెట్టుబడి సాధనంగా విశ్వసించేందుకు వెబ్సైట్ దోహదపడనున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: హెచ్‌సీఎల్ గ్రూప్‌తో ప్రుడెన్షియల్ జతసంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు వెబ్సైట్ సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ చౌహాన్ పేర్కొన్నారు. వెరసి పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ముని బాండ్లుగా పిలిచే వీటిని స్థానిక ప్రభుత్వాలు, ఏజెన్సీలు, రోజువారీ నిధుల అవసరాలకు జారీ చేస్తాయి. జాతీయ రహదారులు, రహదారులు, స్కూళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు సైతం వీటిని వినియోగిస్తాయి. -
మళ్లీ మంచి లాభాలు.. స్టాక్ మార్కెట్‌కు ఇదే బెస్ట్ వీక్!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు ర్యాలీని వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌కు పొడిగించాయి. ఈ ప్రక్రియలో నాలుగేళ్లలో బెస్ట్ వీక్‌ను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77,042 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 557 పాయింట్ల లాభంతో 76,906 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఈ వారంలో 3,077 శాతం లేదా 4.17 పాయింట్లు పెరిగింది.నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ వారం 4.26 శాతం లేదా 953 పాయింట్లు పెరిగింది. 2021 ఫిబ్రవరి 7 తర్వాత ఇది గరిష్ట వారపు లాభం. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ శుక్రవారం అత్యధికంగా 3.3 శాతం లాభపడింది. అదేసమయంలో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడాలాభాల్లో ముగిశాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 1 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కూడా నష్టాలను చూశాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా, స్మాల్‌క్యాప్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. పవర్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ లు లాభపడ్డాయి. మరోవైపు బీఎస్ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.8 శాతం, మెటల్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. -
ఉన్నట్టుండి తగ్గిన బంగారం ధరలు
మూడు రోజుల ధరల పెరుగుదల తరువాత.. గోల్డ్ రేటు ఉన్నట్టుంది తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,220 వద్ద నిలిచాయి. నిన్న రూ. 200, రూ. 220 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,220 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 90,370 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,03,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..! -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఎయిర్టెల్ మెరుపులు
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. వివిధ రంగాలలో కొనుగోళ్లకు దారితీయడంతో 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 899.01 పాయింట్లు లేదా 1.19 శాతం పెరిగి 76,348.06 వద్ద స్థిరపడింది. ఈ సూచీ ఈరోజు 76,456.25-75,684.58 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ 50 కూడా 283.05 పాయింట్లు (1.24 శాతం) పెరిగి 23,190.65 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్ 23,216.70 వద్ద రోజు గరిష్టాన్ని, 22,973.95 వద్ద కనిష్టాన్ని తాకింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.64 శాతం, 0.70 శాతం లాభపడ్డాయి.ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, మీడియా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో ఈ రోజు కేవలం మూడు మాత్రమే నష్టాలను చవిచూశాయి. భారతీ ఎయిర్ టెల్ 4 శాతం లాభంలో టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కూడా రాణించాయి. భారతీ ఎయిర్ టెల్ షేర్లు నిఫ్టీలోనూ మెరుపులు మెరిపించింది. నిఫ్టీ 50 షేర్లలో 4 మాత్రమే నష్టాలను చూశాయి. -
కొత్త రేటుకు చేరిన బంగారం
దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుదలవైపే దూసుకెళ్తున్నాయి. మూడో రోజు కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 220 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 90,660 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.220 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,660 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 90,810 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 20) కేజీ సిల్వర్ రేటు రూ. 1,14,100 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,05,100 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గోల్డ్.. నాన్ స్టాప్ ర్యాలీ
న్యూఢిల్లీ: పసిడి నాన్ స్టాప్ ర్యాలీ చేస్తోంది. బుధవారం మరో రూ.700 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు 91,950కి చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. వివాహాల సీజన్‌కు ముందు జ్యుయలర్లు భారీ కొనుగోళ్లకు దిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. దీనికితోడు మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ఎగిసిపడడంతో ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.700 పెరిగి రూ.91,500కు చేరుకుంది. మరోవైపు వెండి సైతం కొత్త రికార్డు నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరగడంతో రూ.1,03,500 జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ పసిడి కాంట్రాక్ట్ (10 గ్రాములు) రూ.288 పెరిగి రూ.89,000 మార్క్‌ను దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ ధర ముందురోజుతో పోల్చి చూస్తే పెద్దగా మార్పు లేకుండా 3,038 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో 3,045.39 డాలర్ల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆసియా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర 3,052.31 డాలర్లను తాకింది. అప్ ట్రెండ్ కొనసాగుతోంది..బంగారం ధరలు అప్‌ట్రెండ్‌లో ఉన్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. ఫెడ్ పాలసీ ప్రకటన ముందు ఒక పరిధిలో ట్రేడ్ అయినట్టు చెప్పారు. యూఎస్ ఫెడ్ పాలసీ కోసం ట్రేడర్లు వేచి చూస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ సైతం తెలిపారు. ఇదీ చదవండి: ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐఈ ఏడాది చివరికి 4,000 డాలర్లు...అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ వంటి అంశాలతో 2025 చివరికి బంగారం ఔన్స్‌కు 4,000 డాలర్ల స్థాయిని చేరుకోవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇక్కడ మరో 25 శాతం మేర బంగారం ధరలు పెరిగేందుకు అవకాశాలున్నాయన్నది వారి విశ్లేషణ. ఈ ప్రకారం చూస్తే రూపాయిల్లో బంగారం 10 గ్రాములకు రూ.1.14 లక్షలకు చేరుకోవచ్చని తెలుస్తోంది. -
స్టాక్ మార్కెట్లో ఎక్కువమంది అలాంటి ఇన్వెస్టర్లే..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లేనని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్పష్టం చేశారు. మార్కెట్లో లావాదేవీలు నిర్వహించే 11 కోట్లమందిలో కేవలం 2 శాతమే డెరివేటివ్స్‌లో పాలు పంచుకుంటుంటారని వివరించారు.మార్కెట్ పార్టిసిపెంట్లలో 98 శాతంమంది దీర్ఘకాలానికి మదుపు చేసేవారేనని పేర్కొన్నారు. ఇది దేశీయంగా క్రమశిక్షణ కలిగిన పెట్టుబడుల పద్ధతిని సూచిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి మెజారిటీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకే కట్టుబడుతుంటారని తెలియజేశారు. తద్వారా ఇటీవల సింగపూర్‌లో జరిగిన బృంద చర్చలో భారత స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఊహాజనిత(స్పెక్యులేటివ్) ట్రేడింగ్‌పైనే ఆధారపడి కదులుతుంటాయన్న అభిప్రాయాలకు చెక్ పెట్టారు.పెట్టుబడులులేని పెట్టుబడిదారీవిధానం ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్లు చౌహాన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇలా స్పందించారు. ‘సంప్రదాయబద్ధంగా చూస్తే భారీ పెట్టుబడుల ద్వారా మాత్రమే సంపద సృష్టి జరుగుతుందన్నది వాస్తవమే అయినా ఇటీవల ఆధునిక సాంకేతికతలు రూల్స్‌ను తిరగరాస్తున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తదితరాలు కనీస పెట్టుబడితోనే వ్యాపార విస్తరణకు దారి చూపుతున్నాయి. వెరసి ఎకనామిక్ మోడల్ సంప్రదాయ పెట్టుబడి ఆవశ్యకత విధానాల నుంచి దూరం జరుగుతోందంటూ’ వివరించారు. -
స్టాక్ మార్కెట్లు.. హ్యాట్రిక్..
భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లో లాభాలతో ముగిశాయి. బుధవారం ఇంట్రాడేలో 75,568.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 147.79 పాయింట్లు (0.20 శాతం) పెరిగి 75,449.05 వద్ద స్థిరపడింది.అలాగే నిఫ్టీ 73.30 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 22,907.60 వద్ద ముగిసింది. బుధవారం ఈ సూచీ 22,940.70 నుంచి 22,807.95 శ్రేణిలో ట్రేడ్ అయింది.శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు 3.91 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, బ్రిటానియా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు 2.32 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. -
ఫస్ట్‌టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీవోకు సిద్ధంగా ఉన్న రెండు కంపెనీలు ఇవే..
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో వైట్‌గూడ్స్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియాతోపాటు మానవ వనరులు, టోల్‌ప్లాజా నిర్వాహక సర్వీసుల సంస్థ ఇన్నోవిజన్ లిమిటెడ్ చేరాయి. రెండు కంపెనీలు 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి.దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ అనుబంధ సంస్థ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు సన్నద్ధమవుతోంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు ప్రారంభించగా..తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీవోలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను మాతృ సంస్థ విక్రయానికి ఉంచనుంది. తద్వారా సుమారు రూ.15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీవో పూర్తయితే కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తదుపరి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా దిగ్గజంగా ఎల్జీ నిలవనుంది. హ్యుందాయ్ గతేడాది అక్టోబర్‌లో లిస్టయింది. ఎల్జీ ఇండియా ప్రధానంగా వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్ తదితర పలు కన్జూమర్ ప్రొడక్టులను విక్రయించే విషయం విదితమే. దేశీయంగా నోయిడా, పుణెల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?రుణ చెల్లింపులకు..టోల్‌ప్లాజా మేనేజ్మెంట్ సర్వీసుల కంపెనీ ఇన్నోవిజన్ లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ.255 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో 17.72 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా మానవ వనరులు, క్లయింట్లకు దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ, టోల్ ప్లాజా మేనేజ్మెంట్ తదితర సర్వీసులు సమకూర్చుతోంది. -
రూ.91,000 దాటిన బంగారం
న్యూఢిల్లీ: పసిడి మరో కొత్త గరిష్టాన్ని తాకింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.500 లాభపడడంతో రూ.91,250 స్థాయికి చేరింది. అంతకుముందు రోజు సైతం బంగారం రూ.1,300 ర్యాలీ చేయడం తెలిసిందే. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.450 లాభపడి రూ.90,800 స్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీ మార్కెట్లోనూ బంగారం రికార్డు నూతన గరిష్టాలను తాకింది.యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇటీవలి అమెరికా ఆర్థిక గణాంకాలు సైతం యూఎస్ ఫెడ్ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలను పెంచినట్టు చెప్పారు. ఇది కూడా బంగారానికి మద్దతునిచ్చేదిగా పేర్కొన్నారు.మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర ఫ్లాట్‌గా రూ.1,02,500 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు (10 గ్రాములు) రూ.649 లాభపడి రూ.88,672కు చేరుకుంది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్‌కు 40 డాలర్లు లాభపడి 3,047 డాలర్ల నూతన గరిష్టాలకు చేరుకుంది. అమెరికాలో మాంద్యం రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు గరిష్టాలకు చేరినట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాటలో పయనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,131.30 పాయింట్లు లేదా 1.53 శాతం లాభంతో 75,301.26 వద్ద, నిఫ్టీ 325.55 పాయింట్లు లేదా 1.45 శాతం లాభంతో 22,834.30 వద్ద నిలిచాయి.ఉత్తమ్ షుగర్ మిల్స్, వన్ మొబిక్విక్ సిస్టం, టీటీ, సింధు ట్రేడ్స్ లింక్స్, గుల్షన్ పాలియోల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. Nacl ఇండస్ట్రీస్, పసుపతి అక్రిలాన్, ఇన్నోవానా థింక్లాబ్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, మెడికో రెమెడీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. త్వరలో తులం రూ.లక్షకు చేరుతుందని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,500 (22 క్యారెట్స్), రూ.90,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.82,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మ్యూచువల్ ఫండ్స్‌లో అమ్మకాల సెగ
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరి నెలలో నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నెల జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించడం గమనార్హం. మొత్తం 16 విభాగాలకు గాను 10 విభాగాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.‘స్వల్పకాలానికి పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ పోర్ట్‌ఫోలియో పరంగా డెట్ ఫండ్స్ ఎంతో ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులు కుదుటపడితే రానున్న రోజుల్లో పెట్టుబడుల రాక స్థిరపడొచ్చు’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం డెట్ పెట్టుబడుల విలువ (డెట్ ఏయూఎం) ఫిబ్రవరి చివరికి రూ.17.08 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. జనవరి చివరికి ఇది రూ.17.06 లక్షల కోట్లుగా ఉంది.పాజిటివ్–నెగెటివ్లిక్విడ్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.4,977 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,065 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.473 కోట్ల చొప్పున ఆకర్షించాయి.మీడియం టు లాంగ్ డ్యురేషన్ ఫండ్స్, గిల్డ్ ఫండ్స్‌లోకి స్వల్పంగా పెట్టుబడులు పెరిగాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.4,281 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.276 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్, ఓవర్‌నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2,264 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి నెల ఉపసంహరణల్లో ఈ నాలుగు విభాగాల నుంచే 90 శాతం ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..వడ్డీ రేట్ల కోతపై అంచనాలు‘ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నట్టున్నారు. దీనివల్ల లాంగ్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడుల వృద్ధి జరుగుతుంది. తక్కువ క్రెడిట్ రిస్క్ కారణంగా గిల్ట్ ఫండ్స్‌కు ఆదరణ కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు దీన్ని మెరుగైన విభాగంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు’ అని మెష్రామ్ వివరించారు. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నికరంగా 26 శాతం తగ్గి (జనవరితో పోల్చి చూస్తే) రూ.29,303 కోట్లుగా ఉండడం గమనార్హం. అన్ని విభాగాలూ కలిపి ఫిబ్రవరిలో ఫండ్స్ పరిశ్రమ నికరంగా ఆకర్షించిన పెట్టుబడులు రూ.40,000 కోట్లుగా ఉన్నాయి. -
భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు: కారణం ఇదే!
భారతదేశంలోని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం భారీగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎదుర్కొంటుందని శనివారం వెల్లడించింది. దివాలా.. దివాలా కోడ్ సెక్షన్ 9 కింద బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఈ పిటిషన్‌ను సమర్పించారు.ఆపరేషనల్ క్రెడిటర్ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్, అందించిన సేవలకు చెల్లింపులలో డిఫాల్ట్ అయిందని ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ వాదనలను ఖండించింది. దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాల కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.దీంతో కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 6.14 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొని.. రూ. 47.41కి చేరుకున్నాయి. కొంతకాలంగా పతనమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూశాయి. -
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,560 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,710 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 16) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది. -
జోరుగా అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గతేడాది(2024) అక్టోబర్‌లో మొదలైన అమ్మకాలు ఇటీవల కొద్ది నెలలుగా జోరందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(3–13 మధ్య) నికరంగా రూ. 30,015 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సుంకాల ఆందోళనలు పెరగడంతో ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి 2025లో ఇప్పటివరకూ రూ. 1.42 లక్షల కోట్ల(16.5 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. -
స్మార్ట్ పెట్టుబడులకు ప్యాసివ్ ఫండ్స్
సాంకేతిక పురోగతి, మార్కెట్లో ఒడిదుడుకులు, మారిపోతున్న ఆర్థిక పరిస్థితులతో ఇన్వెస్టింగ్ ప్రపంచంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తమ సంపదను పెంచుకునేందుకు సరళమైన, సమర్ధవంతమైన మార్గం కోసం అన్వేషిస్తున్న వారికి, ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారాయి. తక్కువ వ్యయాలతో కూడుకున్నవై, సరళమైన వ్యూహం, విస్తృత డైవర్సిఫికేషన్, దీర్ఘకాలిక వృద్ధిపై ఫోకస్ పెట్టే ప్యాసివ్ ఫండ్స్ అనేవి, ఆర్థిక మార్కెట్లలో సమర్ధవంతంగా ఇన్వెస్ట్ చేసేందుకు అనువైన మార్గంగా ఉండగలవు. 2025లో పెట్టుబడులకు సంబంధించి స్మార్ట్ చాయిస్‌గా నిలవడంలో వీటికున్న ప్రత్యేకత గురించి తెలియజేసేదే ఈ కథనం. సాధారణంగా ఇన్వెస్టింగ్ అంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ లను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ సాధనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలాంటి అనేకానేక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో, చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తుంది.ఇలాంటి గందరగోళం లేకుండా సరళమైన విధానంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడమే ప్యాసివ్ ఫండ్స్ ప్రత్యేకత. ఒక్కో స్టాక్‌ను వేర్వేరుగా ఎంచుకుని, ఒక్కొక్కటిగా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేకుండా విస్తృత మార్కెట్‌ను ప్రతిబింబించేవిగా, పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఇవి ఉంటాయి. దీర్ఘకాలిక వృద్ధి కోరుకుంటున్నా లేదా సంపదను స్థిరంగా పెంపొందించుకోవాలని భావిస్తున్నా, జీవితంలో ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టేందుకు వెసులుబాటునిచ్చే, సులభతరంగా అర్థమయ్యే సొల్యూషన్‌గా ప్యాసివ్ ఫండ్స్ ఉపయోగపడతాయి. తక్కువ వ్యయాలు.. ఎక్కువ ప్రయోజనాలు.. చెల్లించాల్సిన ఫీజుల గురించి ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా పట్టించుకుంటున్న నేపథ్యంలో 2025లో ప్రతి పర్సంటేజీ పాయింటూ ముఖ్యమే. అతి తక్కువ వ్యయ నిష్పత్తులకు ప్యాసివ్ ఫండ్స్ పేరొందాయి. వివిధ స్టాక్స్ ఎంపిక కోసం ఈ ఫండ్స్‌కి భారీగా అనలిస్టులు, ఫండ్ మేనేజర్ల బృందం అవసరం లేకపోవడం వల్ల వీటి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వృద్ధికి స్థిరమైన వ్యూహం .. నేరుగా మార్కెట్లకు అనుసంధానితమైన రాబడులను అందించే సామర్థ్యాలు ఉండటమే ప్యాసివ్ ఫండ్స్‌ను ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణంగా నిలుస్తుంది. అనిశ్చితి పెరిగిపోతున్న తరుణంలో, స్థిరత్వంతో పాటు కాలం గడిచే కొద్దీ నిలకడగా, కాంపౌండెడ్ రాబడులను అందించగలిగే వ్యూహాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. విస్తృతమైన మార్కెట్ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా, సంపదను పెంపొందించుకోవడానికి ఇన్వెస్టర్లకు విశ్వసనీయమైన బాటను ఏర్పర్చి, ప్యాసివ్ ఫండ్స్ ఇలాంటి వృద్ధి అవకాశాలను అందిస్తాయి. ప్యాసివ్ ఫండ్స్ ద్వారా కొనడం, అమ్మడం సులభతరంగా ఉంటుంది. కాబట్టి, ఇతరత్రా పెట్టుబడి సాధనాల తరహాలో సుదీర్ఘ సెటిల్మెంట్ వ్యవధులు లేదా పరిమితుల గురించిన ఆందోళన లేకుండా, అవసరమైనప్పుడు, కావాల్సిన విధంగా తమ పోర్ట్‌ఫోలియోను సరి చేసుకునే స్వాతంత్య్రం ఇన్వెస్టర్లకు లభిస్తుంది.వైవిధ్యం..ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ లు తప్పవు. కానీ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కీలకం. ప్యాసివ్ ఫండ్స్ అనేవి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం ద్వారా రిస్క్ లకు ప్రతిగా, సహజసిద్ధమైన హెడ్జింగ్ సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు విస్తృతమైన మార్కెట్లో (నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500) కొంత భాగాన్ని లేదా మొత్తం మార్కెట్‌నే కొనుగోలు చేసినట్లు లెక్క. ఇందులో వివిధ రంగాలు, పరిశ్రమలు, థీమ్‌లను ప్రతిబింబించే వేర్వేరు స్టాక్స్ ఉంటాయి. అంటే, మీ పెట్టుబడి రాణించడమనేది ఏ ఒక్క కంపెనీ లేదా రంగం పనితీరుపై ఆధారపడదు. ఒకటి తగ్గినా మరొకటి పెరిగే అవకాశాలు ఉండటం వల్ల రిస్క్ లు కొంత తక్కువగా ఉంటాయి. ఇక లిక్విడిటీపరంగా చూస్తే, ఇండెక్స్, సెక్టార్ లేదా అసెట్ క్లాస్‌ను ట్రాక్ చేసే ఈటీఎఫ్‌లు షేర్లలాగే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతాయి. ట్రేడింగ్‌కి అనువుగా ఉంటాయి. వీటిని కొని, అమ్మేందుకు డీమ్యాట్ ఖాతా ఉండాలి.మరోవైపు, నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిఫలిస్తూ, ప్యాసివ్‌గా ఉండేవి ఇండెక్స్ ఫండ్స్. వీటిలో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా అక్కర్లేదు. నికర అసెట్ వేల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా వీటిని నేరుగా ఫండ్ హౌస్ ద్వారా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు లేని ఇన్వెస్టర్లు కూడా ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇండెక్స్ ఫండ్ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది. -
విదేశీ గణాంకాలే దిక్సూచి
ఈ వారం ప్రధానంగా విదేశీ అంశాలే దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఇన్వెస్టర్లు దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలతోపాటు ఫెడ్ వడ్డీ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.ముంబై: అంతర్జాతీయంగా నేడు(17న) పలు ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఫిబ్రవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 2.31 శాతానికి చేరగా.. 2024 డిసెంబర్లో 2.37 శాతంగా నమోదైంది. విదేశీ అంశాలలో జనవరి–ఫిబ్రవరికి చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాల గణాంకాలు నేడు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో యూఎస్ రిటైల్ సేల్స్సహా హౌసింగ్ డేటా నేడు విడుదలకానుంది.ఈ బాటలో ఫిబ్రవరికి జపాన్ వాణిజ్య బ్యాలన్స్ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్ల నిర్ణయాలు 19న వెల్లడికానున్నాయి. గత సమీక్షలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.25 శాతం పెంచడంతో 0.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఇది గత 17ఏళ్లలోనే అత్యధికంకాగా.. 20న గత నెలకు యూఎస్ గృహ విక్రయాల డేటా విడుదలకానుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. 21న జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ద్రవ్యోల్బణం 4 శాతానికి ఎగసింది. ఫెడ్ ఏం చేయనుంది? రేపు(18న) ప్రారంభంకానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశ నిర్ణయాలు బుధ వారం(19న) వెల్లడికానున్నాయి. రెండు రోజులు సమావేశంకానున్న ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న ప్రతీకార టారిఫ్‌లు, ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.అయితే మరోసారి ఫెడరల్ ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే నిర్ణయించే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల విధింపు, విధానాల నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, ధరలు, ఉపాధి కల్పన తదితర అంశాలకు ఫెడ్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. దీంతో ఫెడ్ సంకేతాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఇతర అంశాలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 70 డాలర్ల దిగువన కదులుతున్నాయి. ఒపెక్, సంబంధిత దేశాలు ఏప్రిల్ నుంచీ చమురు ఉత్పత్తి పెంపు ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి రోజుకి 1,38,000 బ్యారళ్లమేర చమురు అధికంగా సరఫరాకానుంది. ఇది భారత్‌కు సానుకూల అంశమని ఆర్థికవేత్తలు తెలియజేశారు.ఇక మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి 87 స్థాయిలో బలహీనంగా కదులుతోంది. కాగా.. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే దేశీ మార్కెట్లపై ప్రభావం పడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు స్వల్ప కదలికలకే పరిమితంకావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.గత వారమిలాహోలీ పండుగ సందర్భంగా నాలుగు రోజులకే పరిమితమైన గత వారం ట్రేడింగ్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా క్షీణించాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 504 పాయింట్లు(0.7 శాతం) బలహీనపడింది. 73,829 వద్ద నిలిచింది. నిఫ్టీ 155 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 22,397 వద్ద స్థిరపడింది. చిన్న షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ 3.9 శాతం పతనమైంది. -
అమాంతం పెరిగి.. తగ్గిన బంగారం: నేటి ధరలు ఇవే..
హొలీ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (మార్చి 15) స్వల్పంగా తగ్గించి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,670 వద్ద నిలిచాయి. నిన్న రూ.1,100, రూ.12,00 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,670 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,820 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 15) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,3000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: ఫ్రెషర్లకు డిమాండ్.. ఐటీలో నియామకాలు డబుల్ -
చరిత్రలో తొలిసారి... పసిడి @ 3,000 డాలర్లు
న్యూయార్క్: కొన్నేళ్లుగా నిరవధికంగా మెరుస్తున్న పసిడి తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) 3,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా వారాంతాన సైతం బులియన్ మార్కెట్ కళకళలాడుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజీ(కామెక్స్)లో 3 శాతం బలపడి 3,001 డాలర్లకు చేరింది. ఒకానొక దశలో 3,017 డాలర్ల గరిష్టాన్ని కూడా తాకింది. ఈ ప్రభావం దేశీయంగా నేడు(శనివారం) ఆభరణ మార్కెట్లో ప్రతిఫలించనున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి తరతరాలుగా రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా తళతళలాడుతున్న బంగారం మరోసారి ప్రపంచ అనిశ్చి తులలో బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశాయి. గత 25ఏళ్లలో చూస్తే పసిడి 10 రెట్లు జంప్‌చేసింది. తద్వారా యూఎస్ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ ఎస్అండ్పీ–500ను సైతం మించి ర్యాలీ చేయడం గమనార్హం. ర్యాలీ తీరిలా గోల్డ్ ఔన్స్ ధర తొలుత 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి 1,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. తదుపరి కరోనా మహమ్మారి కాలంలో 2,000 డాలర్ల మైలురాయిని తాకింది. తిరిగి 2023, 2024లలో పరుగందుకుంది. ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లకు బదులుగా బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుండటం ధరల నిరంతర ర్యాలీకి దోహదపడుతున్నట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. గతేడాది చివర్లో యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక పసిడి మరింత దూకుడు చూపుతోంది. 2024లో 26 శాతం బలపడగా.. 2025లోనూ ఇప్పటివరకూ 14%పెరగడం విశేషం!20 ట్రిలియన్ డాలర్లుగత మూడేళ్లుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు పుత్తడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో 2022, 2023, 2024లో 1,000 మెట్రిక్ టన్నులు చొప్పున సొంతం చేసుకున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్ విలువ 20.2 ట్రిలియన్ డాలర్లను తాకగా.. గత 13 నెలల్లోనే 7 ట్రిలియన్ డాలర్ల విలువ జత కలిసింది. యూఎస్ లిస్టెడ్ టాప్–10 దిగ్గజాలు యాపిల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా తదితరాల మార్కెట్ విలువసహా.. బిట్‌కాయిన్, సిల్వర్‌ను సైతం పరిగణిస్తే మొత్తం విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు మాత్రమే! -
పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. హోలీ రోజున బంగారు ఆభరణాలు గిఫ్ట్‌గా ఇవ్వాలంటే మాత్రం ధరల విషయంగా కొంత ఆలోచించాలని సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,300 (22 క్యారెట్స్), రూ.89,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1,100, రూ.1,200 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,780 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.82,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1,200 పెరిగి రూ.89,930 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధరల్లోనూ(Silver Prices) మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీఓకు ఎల్జీ ఎల్రక్టానిక్స్ రెడీ
న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ దేశీ అనుబంధ సంస్థ రూ. 15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా కంపెనీగా నిలవనుంది. గతేడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. గత నెలలో ఐపీవోపై కంపెనీ రోడ్‌షోలను సైతం ప్రారంభించింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దేశీయంగా ఎల్జీ టాప్ ర్యాంక్ సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. కంపెనీ ప్రొడక్టులలో వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాటర్ ఫిల్టర్లు తదితరాలున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. 2023–24లో రూ. 64,088 కోట్ల ఆదాయం అందుకుంది. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లూ.. వీళ్లతో జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ (NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.మోసగాళ్లు.. వారి ఫోన్‌నంబర్లు ఇవే..ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్ఎస్ఈ వెల్లడించింది.“టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.“వీవీఎల్” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి9662890247 నంబర్ ద్వారా మోసగిస్తున్నారు.సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.“సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223, 9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్మెంట్ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్ఎస్ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్‌గా పేర్కొంటే తమ వెబ్సైట్లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. -
నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్‌కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్‌లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
హోలీకి ముందే.. అమాంతం పెరిగిన బంగారం రేటు
బంగారం ధరలు వరుసగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తోంది. రెండో రోజు (మార్చి 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 600 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,500 వద్ద నిలిచాయి. నిన్న రూ.450, రూ.490 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ.700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 550, రూ. 600 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,580 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 81,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,730 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 550, రూ. 600 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 13) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,1000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఫండ్ రివర్స్..!
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. రూ.29,303 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన రూ.39,688 కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం తగ్గిపోయాయి. 2024 డిసెంబర్లో ఈక్విటీ పథకాల్లోకి రూ.41,156 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఇలా చూస్తే వరుసగా రెండో నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. అటు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు సైతం మూడు నెలల కనిష్టానికి చేరాయి. గత డిసెంబర్లో సిప్ ద్వారా ఈక్విటీల్లోకి రూ.26,459 కోట్లు రాగా, జనవరిలో రూ.26,400 కోట్లకు, ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లకు క్షీణించాయి. మార్కెట్లలో కరెక్షన్ నేపథ్యంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి లమ్సమ్ రూపంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గినప్పటికీ, సిప్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు స్థిరత్వాన్ని చూపిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘సిప్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. కానీ, పెద్ద మొత్తమేమీ కాదు. పైగా జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలలో తక్కువ రోజులు ఉంటాయి’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హెడ్ సురంజన తెలిపారు. మార్కెట్లలో కరెక్షన్ కొనసాగడం ఫిబ్రవరిలో అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. దీర్ఘకాలానికి సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. స్మాల్, మిడ్‌క్యాప్‌పై ప్రభావం ఎక్కువ → స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో రూ.3,722 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.5,721 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.5,148 కోట్ల నుంచి రూ.3,407 కోట్లకు క్షీణించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి సైతం పెట్టుబడులు ఫిబ్రవరిలో రూ.1,980 కోట్లకు పరిమితమయ్యాయి. జనవరిలో రూ.3,751 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → అన్ని రకాల పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సిప్ ఖాతాలు 10.16 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో కొత్తగా 44.56 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభం కాగా, 54.70 లక్షల ఖాతాలను ఇన్వెస్టర్లు నిలిపివేశారు. ఫండ్స్ ఏయూఎంలో కుదుపు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి నెలలో 4% పతనమైంది. జనవరి చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి ఫిబ్రవరి చివరికి రూ.64.53 లక్షల కోట్లకు తగ్గింది. తాజా నిధుల సమీకరణ తక్కువగా ఉండడం, అదే సమయంలో స్టాక్స్ విలువలు పతనం కావడం ఫండ్స్ ఏయూఎం నికరంగా రూ.2.72 లక్షల కోట్ల మేర ఆవిరైంది. 2022 జూన్ తర్వాత నెలవారీ ఏయూఎం(శాతంలో) ఇంత అధికంగా క్షీణించడం ఇదే తొలి సారి. విలువ క్షీణత పరంగా చూస్తే 2020 మార్చి నెల తర్వాత గరిష్టం కావడం గమనార్హం. మార్కెట్లో దిద్దుబాటు ప్రభావం పరిశ్రమపై ఏ మేరకు ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే..స్వల్పకాల ప్రతికూలతలు పెట్టుబడులపై ప్రభావం చూపించి ఉండొచ్చు. అయినప్పటికీ ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే ఉంది. ఇప్పటికీ పెట్టుబడులు సానుకూలంగా ఉండడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్త ధోరణిని అనుసరిస్తూ, తమ దీర్ఘకాల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోని తిరిగి పరిశీలించుకుంటున్నట్టు కనిపిస్తోంది.– నేహల్ మెష్రామ్, సీనియర్ అనలిస్ట్, మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ -
ఇక 23 రోజులే గడువు.. సెబీ తాజా మార్గదర్శకాలు
లిస్టెడ్ కంపెనీ లు చేపట్టే రైట్స్ ఇష్యూలను ఇకపై 23 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా చర్యలకు తెరతీసింది. దీంతో ముసాయిదా ఆఫర్‌ను దాఖలు చేయవలసిన అవసరం తప్పుతుంది. ఇందుకు బదులుగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చి సూత్రప్రాయ అనుమతిని పొందవచ్చు.దీంతో వేగవంత రైట్స్ ఇష్యూలకు సెబీ దారి చూపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బోర్డు అనుమతించిన 23 పనిదినాల్లోగా రైట్స్ ఇష్యూని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత 317 రోజుల గడువును భారీగా కుదిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో 40 రోజుల గడువున్న ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కంటే రైట్స్‌ను వేగవంతం చేసింది. తద్వారా నిధుల సమీకరణకు ప్రాధాన్యతా మార్గంగా రైట్స్‌కు సెబీ మద్దతు పలికింది. ఎన్ఎస్ఈలో రోడ్‌స్టార్ ఇన్విట్ లిస్టింగ్రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోడ్‌స్టార్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఎన్ఎస్ఈలో లిస్టింగ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కు చెందిన రోడ్‌స్టార్ ఇన్విట్‌ను రూ. 8,592 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో లిస్ట్ చేసింది. తద్వారా రుణ పరిష్కారంలో గ్రూప్‌నకున్న విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది.ఈ బాటలో రుణదాతలకు రూ. 5,000 కోట్ల మధ్యంతర చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రస్తావించింది. ఇన్విట్ యూనిట్ల ద్వారా రూ. 3,500 కోట్లు, మరో రూ. 1,500 కోట్లకు నగదు చెల్లించినట్లు తెలియజేసింది. రహదారి ఆస్తుల (ప్రాజెక్టులు)పై గరిష్ట రిటర్నులు అందుకోవడం ద్వారా సమర్ధవంత పరిష్కారాలకు తెరతీస్తున్నట్లు వివరించింది. -
నిఫ్టీ మరో కొత్త ఇండెక్స్..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది.తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్‌ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్‌గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది.ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్స్చేంజీ వెల్లడించింది. కెమికల్స్ రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటంతో పరిశ్రమ ధోరణులు, పెట్టుబడుల అవకాశాలను ట్రాక్ చేయడానికి ఈ ఇండెక్స్ కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. -
ఐటీ షేర్ల దెబ్బ.. నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దేశీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో స్మార్ట్ లాభాలు బెంచ్‌మార్క్ సూచీల నష్టాలను అదుపులో ఉంచడానికి దోహదపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 74,270 వద్ద ప్రారంభమై, కొద్దిసేపటికే 74,392 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత బీఎస్ఈ సూచీ లాభాల్లో పయనించి 794 పాయింట్లు క్షీణించి 73,598 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 73 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప నష్టంతో 74,030 వద్ద ముగిసింది.ఇక నిఫ్టీ 22,577 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 22,330 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో 247 పాయింట్లు నష్టపోయి 22,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా ఉంది. బ్యాంక్ సీఈవో, గ్రూప్ చైర్మన్ ఇన్వెస్టర్ల భయాలను తగ్గించడానికి ప్రయత్నించడంతో నిన్నటి పతనం నుంచి కోలుకుని నేడు 5 శాతం లాభపడింది. అదే సమయంలో టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు 1-3 శాతం చొప్పున లాభపడ్డాయి.మరోవైపు ఇన్ఫోసిస్ 4 శాతానికి పైగా పడిపోయింది. టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, జొమాటో, ఎస్బీఐ 1-3 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్ లో బీఎస్ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.మొత్తంగా మార్కెట్ ప్రతికూలతను చూసింది. బీఎస్ఈలోని 1,500 షేర్లు పురోగమించగా దాదాపు 2,500 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే అమెరికా మాంద్యం ముప్పు, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డౌన్ గ్రేడ్ల నేపథ్యంలో బీఎస్ఈ ఐటీ సూచీ 3 శాతానికి పైగా పతనమైంది. రియాల్టీ ఇండెక్స్ 1.7 శాతం, మెటల్ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. -
భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..
ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్ చేశారు.‘మార్కెట్ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్ క్రాష్ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్డాడ్స్ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్‌కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.Germany, Japan, and America have been the engines up to now. Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.I wrote about this crash in my book RICH DAD’s…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టంనాస్డాక్ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది. -
దడ పుట్టిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.80,800కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.88,130 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ బుధవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) మంగళవారంతో పోలిస్తే రూ.2000 పెరిగి రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది. -
ఫ్లాటుగా ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 452 పాయింట్లు పతనమై సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 145 పాయింట్లు క్షీణించి 22,315 వద్ద కనిష్టాన్ని తాకింది. అమెరికా మాంద్యం భయాలతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు భారీ క్షీణత(27%), ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో నష్టాలు మరింత అధికమయ్యాయి. అయితే అఖరిగంటలో అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంకు(2.50%), రిలయన్స్ (1%), ఎయిర్టెల్ (2%) షేర్లు రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనానికి దారితీయోచ్చనే ఆందోళనలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్‌వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్‌ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్‌లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్‌ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్‌వర్త్‌పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్‌లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్‌లో ఇంటర్నల్ ట్రేడ్‌ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్‌పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్‌లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్.. కారణం..
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్ టెస్ట్’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంఅంతర్గత ఆడిట్లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్‌ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు. -
దిగొచ్చిన బంగారం: మరోసారి తగ్గిన రేటు
పడుతూ.. లేస్తూ ఉన్న బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల దిశగా అడుగులు వేసాయి. నేడు (మార్చి 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 330 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,490 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 300 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 330 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,490 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,640 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1000 తగ్గింది. దీంతో ఈ రోజు (మార్చి 11) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 423.38 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 73,691.79 వద్ద, నిఫ్టీ 112.85 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 22,347.45 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. నీతిరాజ్ ఇంజనీర్స్, హెడ్స్ అప్ వెంచర్స్, ఎల్సీసీ ఇన్ఫోటెక్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాగా.. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆకాష్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ వంటివి నష్టాలలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెరికా సుంకాలు: ఆ రంగంపైనే అధిక ప్రభావం..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప్పుడు భారత ఫార్మా రంగంపై అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక టారిఫ్‌లతో అమెరికాలో భారత ఫార్మా ఉత్పత్తుల ఖరీదు, ఇతర దేశాలతో పోల్చితే పెరిగిపోతుందంటున్నారు. అదే సమయంలో భారత ఆటోమొబైల్ కంపెనీలపై సుంకాల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందంటూ.. అమెరికాకు ఆటో ఎగుమతులు చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు మోపుతున్న భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే స్థాయిలో ప్రతిసుంకాలు అమలు చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే పనిగా ప్రకటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకం అమలు చేస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు.చరిత్రను గమనిస్తే దేశీ డిమాండ్‌ను తీర్చుకునేందుకు అమెరికా ఇప్పటి వరకు ఫార్మా ఉత్పత్తుల విషయంలో నికర దిగుమతిదారుగా ఉన్నట్టు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ అరవింద్ శర్మ తెలిపారు. ‘‘భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై గణనీయ స్థాయిలో టారిఫ్‌లు విధించాలని అమెరికా ఇటీవల నిర్ణయించడం భారత ఫార్మా రంగంపైనా చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా దేశీ వినియోగంపైనా దీని ప్రభావం ఉంటుంది’’అని చెప్పారు.అమెరికన్లకు గణనీయంగా ఆదా..అమెరికాలో ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్ నుంచి సరఫరా అవుతుండడం గమనార్హం. చౌకగా భారత్ అందిస్తున్న ఔషధాలతో అమెరికాకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. 2013 నుంచి 2022 వరకు చూస్తే పదేళ్ల కాలంలో 1.3 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు భారత చౌక జనరిక్ ఔషధాలతో అమెరికాకు వచ్చే ఐదేళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా.భారత ఫార్మా ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్ అని శర్మ చెప్పారు. భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటాయే మూడింట ఒక వంతుగా ఉన్నట్టు తెలిపారు. ఉన్నట్టుండి టారిఫ్‌లు పెంచితే, అది భారత్‌లో ఔషధ తయారీని, దిగుమతి వ్యయాలను పెంచుతుందన్నారు. అదే జరిగితే అప్పుడు ఇతర దేశాలతో పోల్చితే భారత ఔషధ ఉత్పత్తులు ఖరీదుగా మారతాయన్నారు. ఇది అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచుతుందని, వినియోగదారులపై భారాన్ని మోపుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఫార్మా రంగానికి కొత్త దారులుఅమెరికా అధిక సుంకాలతో కొత్త మార్కెట్ అవకాశాల దిశగా భారత ఫార్మా రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని శర్మ అంచనా వేస్తున్నారు. భారత కంపెనీలు యూరప్, ల్యాటిన్ అమెరికా లేదా ఆఫ్రికాలపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు భారత ఆటో ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ రంగంపై సుంకాల ప్రభావం తక్కువే ఉంటుందని ఇండస్ లా పార్ట్నర్ శశి మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. కాకపోతే భారత ఆటో విడిభాగాల కంపెనీలపై కొంత ప్రభావం ఉండొచ్చన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు ఆ దేశ ఆటో ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నా స్థాయికి సమీప కాలంలో తగ్గించకపోవచ్చన్న విశ్లేషణ వ్యక్తం చేశారు. -
అమెరికా మార్కెట్లు క్రాష్: కారణం ఇదే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన టారిఫ్ వార్ ఆర్థిక అనిశ్చితులకు దారి తీయోచ్చనే ఆందోళనలతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. నాస్డాక్ 4%, ఎస్అండ్పీ 2.5%, డోజోన్స్ 1.3% నష్టాలతో ట్రేడయ్యాయి.టెక్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నాస్డాక్ ఇండెక్స్‌లోని ప్రధాన షేర్లైన ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా షేర్లు 2–14% కుప్పకూలాయి.ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నవంబర్‌లో టెస్లా షేరు ఆర్జించిన లాభాలన్నీ(50%) తుడిచిపెట్టుకుపోయాయి. టారిఫ్‌ల కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలను మాత్రం తోసిపుచ్చలేదు.రూపాయి 36 పైసలు డౌన్రూపాయి విలువ నెలరోజుల్లో అతిపెద్ద పతనం చవిచూసింది. డాలర్ మారకంలో సోమవారం 36 పైసలు క్షీణించి 87.31 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 5 తర్వాత ఒక రోజులో రూపాయికిదే భారీ నష్టం. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు? -
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
ఐపీఓల జోరుకు బ్రేక్!!
న్యూఢిల్లీ: గతేడాదంతా జోరుగా దూసుకెళ్లిన ఐపీఓల మార్కెట్ ప్రస్తుతం సెకండరీ మార్కెట్లో కరెక్షన్ కారణంగా నెమ్మదించిన ధోరణి కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులు దీన్ని సూచిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2024 డిసెంబర్లో ఏకంగా 16 లిస్టింగ్స్ నమోదు కాగా .. ఈ ఏడాది జనవరిలో అయిదు ఇష్యూలు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య నాలుగుకి తగ్గింది. అంతేగాకుండా కొన్ని కంపెనీలు ఐపీఓ ప్రణాళికలను పక్కన పెడుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ సిస్–టెక్, ఎస్ఎఫ్సీ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, వినే కార్పొరేషన్ ఇలా ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న వాటిల్లో ఉన్నాయి. గత రెండు నెలల్లో ప్రధానంగా సెకండరీ మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడిందని ఈక్విరస్ ఎండీ భావేష్ షా తెలిపారు. దీనితో ఇన్వెస్టర్లు కొత్త లిస్టింగ్లవైపు చూడటం కాకుండా ప్రస్తుతమున్న పోర్ట్‌ఫోలియోను కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలా కొత్త ఐపీఓలపై ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లడంతో పబ్లిక్ ఇష్యూల మార్కెట్ కూడా నెమ్మదించిందని ఆయన పేర్కొన్నారు. పటిష్టమైన ఎకానమీ, మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు భారీగా పెరగడం వంటి సానుకూలాంశాలతో 2014లో ఏకంగా 91 ఐపీఓల ద్వారా కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయినప్పటికీ.. ఆశావహమే.. పబ్లిక్ ఇష్యూలపై ప్రస్తుతానికి ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లినప్పటికీ .. దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం మార్కెట్ సానుకూలంగానే కనిపిస్తోందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్‌రావు తెలిపారు. పెద్ద ఎత్తున సంస్థలు ఐపీఓకి సిద్ధమవుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘పెద్ద సంఖ్యలో ప్రాస్పెక్టస్‌లు దాఖలవుతున్నాయి. మార్కెట్లు స్థిరపడటం కోసం కంపెనీలు వేచిచూస్తున్నాయి. ప్రస్తుతం రూ. 67,000 కోట్లు సమీకరించడానికి 45 కంపెనీలకు సెబీ అనుమతులు ఉన్నాయి. మరో రూ. 1.15 లక్షల కోట్ల సమీకరణ కోసం 69 కంపెనీలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో 45 కంపెనీలు గత కొద్ది నెలల్లో ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి‘ అని ఆయన పేర్కొన్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 30 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను సమరి్పంచినట్లు వివరించారు. సత్వ గ్రూప్, బ్లాక్‌స్టోన్ దన్ను గల నాలెడ్జ్ రియల్టీ ట్రస్ట్ ఈమధ్యే రూ. 6,200 కోట్ల సమీకరణకు సంబంధించి పత్రాలు దాఖలు చేసింది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లు స్థిరపడిన తర్వాత ఐపీఓలు మళ్లీ పుంజుకుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని షా ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో పాటు మదుపరులు కూడా కొత్త కంపెనీల్లో తాజాగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. అయితే, ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి కంపెనీలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వేల్యుయేషన్లను సరిచేసుకోవాల్సి ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి.వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్‌పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,500 (22 క్యారెట్స్), రూ.87,820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,820 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.80,650కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.87,970 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. సోమవారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి రేటు(Silver Price) గతంతో పోలిస్తే రూ.100 తగ్గి రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈటీఎఫ్‌లు–ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం?
ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఏంటి? – దీప్తిఈ రెండు సాధనాల మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంది. ఈ రెండూ కూడా ప్యాసివ్ పెట్టుబడుల కోసం రూపొందించినవే. ఇండెక్స్‌ను (నిఫ్టీ50, సెన్సెక్స్ తదితర) ప్రతిఫలిస్తూ పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో వ్యయాలు చాలా తక్కువ. చూడ్డానికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వాటిల్లో పెట్టుబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. ధరల అస్థిరతల భయం లేకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇండెక్స్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా సులభంగా, పెట్టుబడులను ఆటోమేట్ చేసే సాధనమే ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లు అలా కాదు. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. వీటిని మీరే స్వయంగా కొనుగోలు చేసుకోవాలి. అందుకోసం ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలుండాలి. కొనుగోళ్లపై బ్రోకర్, ఇతర చార్జీలు చెల్లించాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఇండెక్స్ పండ్స్ సులభమైన ఎంపిక. వీటిని తరచుగా పర్యవేక్షించుకోనక్కర్లేదు. సిప్ రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలుండి, మార్కెట్ కదలికలను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టే వారికి ఈటీఎఫ్‌లు అనుకూలం.ఇదీ చదవండి: బిజినెస్‌లో గుజరాతీల సక్సెస్ సీక్రెట్స్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్నేను ఒకే అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ పరిధిలో (ఏఎంసీ) ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్ నుంచి, మరో ఈక్విటీ పథకంలోకి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులను మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పడుతుందా? – శ్రీకాంత్ ఎన్వీఈఎల్ఎస్ఎస్ పథకం నుంచి మరో ఈక్విటీ పథకంలోకి ఎస్టీపీ చేసుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఆ రెండు ఒకటే ఏఎంసీ పరిధిలో ఉన్నా సరే ఈ నిబంధనే వర్తిస్తుంది. ఇన్వెస్టర్ ఎస్టీపీ ద్వారా ఒక ఈక్విటీ పథకంలోని పెట్టుబడులను క్రమంగా మరో ఈక్విటీ పథకంలోకి మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. మధ్యలో బ్యాంక్ ఖాతా అవసరం ఉండదు. కానీ, పన్ను పరంగా చూస్తే ప్రతీ ఎస్టీపీ బదిలీని ఉపసంహరణగానే చట్టం కింద పరిగణిస్తారు. తిరిగి తాజా పెట్టుబడి కింద చూస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మూడేళ్ల కాలం ముగిసిన యూనిట్లనే ఎస్టీపీ ద్వారా బదిలీ చేసుకోగలరు. ఉపసంహరణపై వచ్చిన లాభం ఒక ఆర్థిక సంత్సరంలో రూ.1.25 లక్షలు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను పడుతుంది. పన్ను పడకుండా ఎస్టీపీ చేసుకోవాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపసంహరణ, బదిలీ అన్నది రూ.1.25 లక్షలు మించకుండా చూసుకోవాలి.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై దృష్టి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్‌ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్‌ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. దీంతో గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఐఐపీ, సీపీఐ జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు బుధవారం(12న) విడుదలకానున్నాయి. 3.7 శాతం వృద్ధి నమోదుకాగలదని అంచనా. 2024 జనవరిలో 4.2 శాతం పురోగమించగా.. డిసెంబర్లో 3.2 శాతం వృద్ధి చూపింది. ఇక ఫిబ్రవరి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. 2025 జనవరిలో సీపీఐ 3.2 శాతంగా నమోదైంది. 2024 డిసెంబర్లో నమోదైన 3 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇతర అంశాలూ కీలకమే దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల నిరంతరంగా అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ఎఫ్‌పీఐల తీరు మార్కెట్లలో కీలకంగా నిలుస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. కాగా.. మరోవైపు యూఎస్ డాలరుతోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం అటు మార్కెట్లను, ఇటు రూపాయినీ దెబ్బతీస్తున్నాయి. వీటితోపాటు రాజకీయ భౌగోళిక అనిశి్చతులు, ముడిచమురు ధరలు సైతం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోను చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. గత వారమిలాగత వారం(3–7) దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి బయటపడ్డాయి. ఇండెక్సులు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ నికరంగా 1,134 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 74,333 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 428 పాయింట్లు(2 శాతం) జంప్‌చేసి 22,553 వద్ద స్థిరపడింది. యూఎస్ టారిఫ్‌ల విధింపు ఆలస్యంకానున్న అంచనాలు, వీటిపై చర్చలకు ఆస్కారమున్నట్లు వెలువడిన అంచనాలు మార్కెట్లు బలపడేందుకు దోహదం చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.అమ్మకాలువీడని ఎఫ్పీఐలుమార్చి తొలివారంలో రూ. 24,753 కోట్లు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఇప్పటి(7)వరకూ రూ. 24,753 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. జనవరిలోనూ రూ. 78,027 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటిరకూ రూ. 1.37 లక్షల విలువైన స్టాక్స్ విక్రయించారు. ప్రపంచ వాణిజ్య ఆందోళనలు, దేశీ కార్పొరేట్ ఫలితాల నిరాశ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. 2024 డిసెంబర్ 13 నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 17.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించారు. -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
బోలెడంత షాపింగ్..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, డిజిటల్ అవగాహన కలిగిన యువ కస్టమర్లు, విస్తరిస్తున్న మహిళా శ్రామిక శక్తి.. ఇంకేముంది బోలెడంత షాపింగ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదార్లు గత ఏడాది రూ.82,00,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. మన దేశంలోకి విదేశీ కంపెనీల రాక, అలాగే బీటూసీ బ్రాండ్లు వెల్లువెత్తడం, మారుతున్న ప్రజల అభిరుచులతో రిటైల్ మార్కెట్ అంచనాలను మించి రికార్డులను సృష్టిస్తోంది. వచ్చే దశాబ్దంలో భారతీయ రిటైల్ మార్కెట్ ఏటా 8.8 శాతం వృద్ధి చెంది 2034 నాటికి రూ.1,90,00,000 కోట్లు మించిపోనుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడించింది.రిటైల్ రంగం పరుగెడుతోంది..ఆన్లైన్ షాపింగ్ విస్తృతి2014లో రూ.35,00,000 కోట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన రిటైల్ రంగం ఏటా 8.9 శాతం దూసుకెళ్లిందంటే కొనుగోలు తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి, వినోదం కోసం చేస్తున్న వ్యయాలు ఏటా 10 శాతం పెరిగాయి. వ్యవస్థీకృత రిటైల్‌లో పెట్టుబడులు 2014–2024 మధ్య రెండింతలయ్యాయి. ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్‌లో 30 శాతం వృద్ధి నమోదైంది. వినియోగానికి అనుగుణంగా రిటైల్ రంగం పరుగెడుతోంది. భారతదేశ వినియోగ వృద్ధి ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అంచనా. 32.5 కోట్లుగా ఉన్న గృహాల సంఖ్య 2034 నాటికి 40.7 కోట్లకు చేరుకోనుందని నివేదికలు చెబుతున్నాయి.విదేశీ బ్రాండ్లకు సై..ప్రపంచీకరణ, విదేశీ బ్రాండ్ల పట్ల భారతీయులు సాను కూలంగా భావిస్తున్నారు. గ్లోబల్ బ్రాండ్లకై వినియోగ దారుల డిమాండ్‌ను తీర్చడానికి గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్‌కు 60కిపైగా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.ఆర్థిక స్తోమతనుబట్టి.. వినియోగదార్ల కొనుగోళ్లను నిర్ణయి స్తున్న అంశాలు ఆర్థిక స్తోమతనుబట్టి మారు తున్నాయి. దిగువ మధ్యతరగతి కస్టమర్లలో అత్యధికుల షాపింగ్‌ను ధర ప్రభావితం చే స్తోంది. మధ్య తరగతి, అధిక ఆదాయ కుటుంబాల్లో ఎక్కువ మంది ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.కొనుగోలు నిర్ణయం ఇలా..ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే అత్యధికులు ఆఫ్లైన్పైనే ఆధారపడుతున్నారు. అంటే ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను చూసి, ముట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారన్న మాట. మిశ్రమ మార్గాలలో అంటే నేరుగా షాప్‌కు వెళ్లి వస్తువులను పరిశీలించి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం లేదా ఆన్లైన్లో పరిశోధించి ఆఫ్‌లైన్‌లో కొనడం.లోకల్‌కే మొగ్గు..భారతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కొనడానికి జనం ఇష్టపడుతున్నారు. 2016 నుండి భారత్‌లో 600లపైచిలుకు స్వదేశీ డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీటీసీ) బ్రాండ్లు ఉద్భవించాయి. -
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
బంగారం మళ్లీ భారీగా...
దేశంలో బంగారం ధరలు (Gold Prices) పెరుగుదల బాట పట్టాయి. రెండు రోజులుగా వరుసగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు (March 8) మళ్లీ ఎగిశాయి. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,400, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,710 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున ఎగిశాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,860 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,550 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.550, రూ.500 చొప్పున పెరిగాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,710 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.500, రూ.550 చొప్పున భారమయ్యాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,08,100 వద్ద, ఢిల్లీలో రూ. 99,100 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్‌గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 7.52 పాయింట్లు లేదా 0.010 శాతం నష్టంతో.. 74,332.58 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో 22,552.50 వద్ద నిలిచాయి.బంకా బయోలూ, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్, లక్ష్మీ డెంటల్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, MRO-TEK రియాలిటీ, ఎస్ పీ అప్పారల్స్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, దావణగిరి షుగర్ ఫ్యాక్టరీ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘కొత్త ఫండ్’ పథకానికి సెబీ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.వెరసి ఏఎంసీలు ఎన్ఎఫ్వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.పథకం సమాచార పత్రా(ఎస్ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది. -
బంగారం వరుస తగ్గుదల
దేశంలో పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) రెండు రోజులుగా కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు (March 7) వరుసగా రెండో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. అంతకుముందు వరుస పెరుగుదలతో బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇప్పుడు క్షీణిస్తుండటంతో పసిడి ప్రియులు కుదటపడి కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తున్నారు.బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? గోల్డ్ లోన్లు ఇక అంత ఈజీ కాదు..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 79,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,160 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,310 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.330, రూ.300 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,160 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.300, రూ.330 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలు రివర్స్దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా వెండి ధరల్లో మాత్రం నేడు పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,08,100 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ. 99,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.100 పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. బలహీనంగా ఐటీ, బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 609.87 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో.. 74,340.09 వద్ద, నిఫ్టీ 207.40 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 22,544.70 వద్ద నిలిచాయి.క్యాపిటల్ ట్రస్ట్, కోహినూర్ ఫుడ్స్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కో, లాంకోర్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. లాంకోర్ హోల్డింగ్స్, బీబీ ట్రిపుల్వాల్ కంటైనర్స్, ఫుడ్ అండ్ ఇన్స్, శ్రీరామ న్యూస్ ప్రింట్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పరుగు ఆపిన పసిడి! మళ్లీ అవకాశం రాదేమో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో(Gold Rate) మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గురువారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. దాంతో ఈ పెళ్లిళ్ల సీజన్లో ఇప్పుడే బంగారం కొనాలని కొందరు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,200 (22 క్యారెట్స్), రూ.87,490 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,490 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణువిద్యుత్‌కు రోడ్ మ్యాప్దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 తగ్గి రూ.80,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 తగ్గి రూ.87,640 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు గురువారం తగ్గినా వెండి ధరలు మాత్రం అందుకు విరుద్ధంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గురువారం వెండి ధరలు(Sliver Rate) స్పల్పంగా పెంజుకున్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నాన్‌స్టాప్ గోల్డ్ ర్యాలీ
న్యూఢిల్లీ: బంగారం మురిపిస్తోంది. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు అందరికీ పసిడిపై పెట్టుబడి కనక వర్షం కురిపిస్తోంది. 2024లో 27 శాతం రాబడితో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన స్థానంలో నిలిచిన బంగారం.. ఈ ఏడాదీ తన జోరును కొనసాగిస్తోంది. రెండు నెలల్లోనే 12 శాతం ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2,900 డాలర్లను దాటిపోయింది. దేశీయంగా 10 గ్రాముల ధర రూ.89,000 మార్క్‌పైకి చేరుకుంది. జనవరి 1న రూ.79,000 స్థాయిలో ఉంది. అక్కడి నుంచి చూస్తే రూపాయి మారకంలోనూ 13 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రాబడుల్లో బంగారమే ముందుంది. టారిఫ్‌ల విషయంలో ఏ దేశాన్ని విడిచి పెట్టేది లేదంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలు, వాణిజ్య యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయాలు, సెంట్రల్ బ్యాంకుల రెండు చేతులా కొనుగోళ్లు.. వెరసి బంగారం ధరలు ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు. ఎన్నో అంశాలు.. ఎక్కడైనా ధరలను నిర్ణయించేది డిమాండ్–సరఫరా అన్న విషయం తెలిసిందే. బంగారం ఉత్పత్తి గడిచిన కొన్నేళ్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. కానీ, అదే సమయంలో డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఆభరణాలు, పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల రూపంలో పసిడికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్త డిమాండ్‌లో 50 శాతం ఆభరణాల రూపంలోనే ఉంది. టెక్నాలజీ, పారిశ్రామిక రంగం వినియోగం 5 శాతంగా ఉంది. 25 శాతం పెట్టుబడుల రూపంలో, మరో 20 శాతం సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు రూపంలో డిమాండ్ నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఆభరణాల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతుంది. ఆభరణాల డిమాండ్‌లో చైనా, భారత్ బలమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంత డిమాండ్?కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరిగేదే కానీ (స్టోర్ ఆఫ్ వ్యాల్యూ) తరిగేది కాదు. ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి దీర్ఘకాలంలో తన విలువను పెంచుకుంటుందని చరిత్ర చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు తమ విదేశీ మారకం ఆస్తుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి ప్రాతినిధ్యాన్ని పెంచడం ఇందు వల్లే. 20 ఏళ్ల క్రితం ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోతగిన వస్తువులను.. నేడు కూడా ఔన్స్ బంగారంతో కొనుగోలు చేసుకోవచ్చు. కరెన్సీ విషయంలో అది అసాధ్యం. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో కరెన్సీ విలువ తగ్గుతుంటుంది. దీనికి విరుద్ధంగా పసిడి విలువ పెరుగుతుంది. అందుకే దీన్ని హెడ్జింగ్ సాధనంగా, ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తుంటారు. 2001 సెపె్టంబర్ 11 ఉగ్రదాడి, 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయాల్లో ఇన్వెస్టర్లు స్టాక్స్, ఇతర సాధనాల కంటే బంగారంలో పెట్టుబడులకే మొగ్గు చూపించారు. కానీ, ఇలాంటి అనిశ్చితుల్లో బంగారం ధరలు తాత్కాలికంగా ర్యాలీ చేసి, పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న సంకేతాలు కనిపించగానే మళ్లీ చల్లబడుతుంటాయి. ఈ విడత పరిస్థితులు భిన్నం..కానీ, కరోనా విపత్తు తర్వాత నుంచి చూస్తే.. పసిడి ధరలు పెద్దగా పడిపోకుండా స్వల్ప విరామంతో ర్యాలీ చేస్తుండడాన్ని గమనించొచ్చు. కరోనా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో.. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం పరిస్థితులను మార్చేసింది. రష్యా చర్యను వ్యతిరేకిస్తూ విదేశాల్లో రష్యాకు ఉన్న ఫారీన్ గవర్నమెంట్ బాండ్ హోల్డింగ్స్‌ను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి. అంటే రష్యా సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారకం ఆస్తుల్లో ఈ మేరకు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది భారత్, చైనా సహా పలు సెంట్రల్ బ్యాంక్‌లకు కనువిప్పు కలిగించింది. దీంతో బంగారం నిల్వలను పెద్ద ఎత్తున పెంచుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా 2022లో 1,082 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌లు కొనుగోలు చేశాయి. అంతటితో ఆగలేదు. 2023లోనూ మరో 1,051 టన్నులు, 2024లో 1,041 టన్నుల చొప్పున బంగారాన్ని సెంట్రల్ బ్యాంక్‌లు అదనంగా సమకూర్చుకున్నాయి. యూఎస్ డాలర్లకు ఇంతకాలం అధిక ప్రాధాన్యం ఇచి్చన సెంట్రల్ బ్యాంక్‌లు, ప్రస్తుతం బంగారానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాయి. ఇంతకుముందుతో పోల్చితే కరెన్సీ విలువల్లో ఆటుపోట్లు పెరిగాయి. కరెన్సీ అస్థితరలకు హెడ్జింగ్‌గా బంగారాన్ని పరిగణిస్తుంటారు. ఈ పరిణామాలన్నీ సెంట్రల్ బ్యాంకులు బంగారానికి వెయిటేజీ పెంచడానికి దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
నిఫ్టీ వరుస నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 1 శాతానికి పైగా లాభపడి స్థిరపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 740.30 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 73,730.23 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 254.65 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 22,337.30 వద్ద స్థిరపడింది, తద్వారా 10 రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికింది. బుధవారం సూచీ 22,394.90 నుంచి 22,067.80 రేంజ్లో ట్రేడ్ అయింది. మంగళవారం వరకు వరుసగా 10 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 3.8 శాతం లేదా 877 పాయింట్లు నష్టపోయింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 46 లాభాల్లో స్థిరపడగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5.15 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు 3.37 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.96 శాతం లాభంతో ముగియడంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.42 శాతం లాభంతో సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.04 శాతం లాభపడటంతో ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మీడియా సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. -
రాబడులపై పన్ను తగ్గింపు..?
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో భారీగా పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక లాభాలపై వచ్చే రాబడులపై పన్నుల ప్రభావాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. భారత ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) నిర్మాణాన్ని సమీక్షించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. రెవెన్యూ ఆందోళనల కారణంగా పూర్తి పన్నును ఉపసంహరించుకోవడం సాధ్యం కానప్పటికీ, దాని నిర్మాణాన్ని సవరించాలని తెలియజేస్తున్నాయి. దానివల్ల భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఆశావహం వ్యక్తం చేస్తున్నాయి.స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల లాభాలపై పన్ను విధించే అతికొద్ది మార్కెట్లలో భారత్ ఒకటి. భారీ నష్టాలు, తక్కువ రాబడులు, పన్ను భారాలు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై ఆకర్షణను తగ్గిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతో ఇన్వెస్టర్లలో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ మాట్లాడుతూ..విదేశీ, భారతీయ పెట్టుబడిదారులకు ఎల్టీసీజీ పన్నులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే, ప్రభుత్వ ఆదాయ అవసరాలను గుర్తించి పన్ను మినహాయింపుల హోల్డింగ్ వ్యవధిని ఏడాది నుంచి రెండు లేదా మూడేళ్లకు పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)పై ఎల్టీసీజీ పన్నులకు సంబంధించి హీలియోస్ క్యాపిటల్‌కు చెందిన సమీర్ అరోరా స్పందించారు. విదేశీ మార్కెట్లు మరింత అనుకూలమైన పన్ను విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో భారత్ ఎల్టీసీజీ వంటి పన్ను పద్ధతులను అనుసరించడం విదేశీ పెట్టుబడులను నిరోధించగలవని చెప్పారు.ఇదీ చదవండి: భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుత పన్ను విధానం ఇలా..2024 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాల పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చారు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై ఎల్టీసీజీ పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సర్దుబాట్లు పన్ను నిర్మాణాన్ని సరళతరం చేయడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నట్లు కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్టీసీజీ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించడం వల్ల ఆదాయ పెరుగుదల, మార్కెట్ పోటీతత్వం మధ్య సమతుల్యత సాధించవచ్చని భావిస్తున్నారు. -
భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.550, రూ.600 పెరిగింది.ఇదీ చదవండి: ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరంచెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.550 పెరిగి రూ.88,130కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.600 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. బుధవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,07,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై నిబంధనలు కఠినతరం
విలువైన లోహాలపై దిగుమతి సుంకం ఎగవేతను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రకటించింది. దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు కొంతమంది దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్‌గా మారుస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్ చాలా కాలంగా దిగుమతి సుంకాలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్లాటినం అల్లాయ్ దిగుమతులపై స్పష్టమైన వర్గీకరణ ఉండడం ద్వారా ప్రభుత్వం వాణిజ్య పద్ధతులపై నియంత్రణను కఠినతరం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ప్లాటినం మిశ్రమ దిగుమతులను ‘ఉచితం’గా వర్గీకరించారు. అంటే ఇది సాపేక్షంగా నియంత్రణ లేని వాణిజ్యానికి అనుమతిస్తుంది. అయితే, దీన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలున్నాయి. దాంతోపాటు ఇటీవల కాలంలో బంగారం ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు అధికమవుతుండడంతో వాటిని ప్లాటినం అల్లాయ్లుగా మార్చి వాణిజ్యానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.ఈ చర్యలు బంగారు నగలు, విలువైన లోహాల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తున్నారు. 99 శాతం స్వచ్ఛత కలిగినవి మినహా ప్లాటినం అల్లాయ్ దిగుమతులు ఇక నుంచి నియంత్రిత కేటగిరీ కిందకు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పన్ను ఎగవేతను అరికట్టే ప్రయత్నాలు చేపడుతోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు మారాల్సిన అవసరాన్ని ఇది చర్చ నొక్కి చెబుతుంది. పరిశ్రమ వ్యూహాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షిస్తూ మందుకుసాగాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..ప్రభుత్వ చర్యల ప్రభావం ఇలా..సుంకాల ఎగవేతను అరికట్టడం: అధిక దిగుమతి సుంకాలను దాటవేసేందుకు దిగుమతిదారులు బంగారం ఉత్పత్తులను ప్లాటినం అల్లాయ్‌గా మలచకుండా నిరోధించడమే ఈ విధానం లక్ష్యం. ఈ లొసుగును కట్టడి చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయ మార్గాలను పరిరక్షించవచ్చు. న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించవచ్చు.ఆభరణాల పరిశ్రమపై ప్రభావం: ప్లాటినం మిశ్రమాలపై ఆధారపడే నగల వ్యాపారులకు ఖర్చులు పెరగడానికి ఈ చర్యలు దారితీయవచ్చు. ఇది ప్లాటినం ఆభరణాల అధిక ధరలకు అవకాశం కల్పిస్తుంది. ఇది వినియోగదారుల డిమాండ్‌ను ప్రభావితం చేస్తుంది.ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడం: ఈ చర్య ప్లాటినం మిశ్రమాల దేశీయ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆటో, ఐటీ నేలచూపు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 96.01 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 72,989.93 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,033.18-72,633.54 రేంజ్లో ట్రేడ్ అయింది.అలాగే నిఫ్టీ 50 36.65 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 22,082.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,105.05 వద్ద, ఇంట్రాడేలో 21,964.60 వద్ద కనిష్టాన్ని తాకింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 28 షేర్లు నష్టాల్లో ముగియగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ షేర్లు 4.95 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3.03 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.69 శాతం, 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్‌లు మిశ్రమంగా ముగియగా, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు 1.31 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది. -
సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్ 'మాదభి పురి బుచ్' (Madhabi Puri Buch)కు ఊరట లభించింది. పురి, మరో ఐదుగురిపై పోలీసు కేసు నమోదు చేయాలన్న దిగువ కోర్టు ఆదేశాన్ని, బాంబే హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.స్టాక్ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో ఆర్ధిక పరమైన మోసం జరిగిందని ఆరోపిస్తూ.. సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇందులో పురి బుచ్ మాత్రమే కాకుండా.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లైన అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్ర వర్ష్నీలు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామమూర్తి, బిఎస్ఇ మాజీ చైర్మన్ & పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ ఉన్నారు.ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల తరువాత.. పురి బుచ్, మిగిలిన ఐదుగురు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే.. కింది కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం.. అని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు వీరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కూడా ఏసీబీని ఆదేశించింది.నిజానికి పురి బుచ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు.. గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా.. ఈమెపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టివే అని పురి బుచ్ కొట్టిపారేశారు. -
మొదలైన పసిడి పరుగు: భారీగా పెరిగిన ధరలు
వారంరోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. నేడు (మార్చి 04) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 760 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 760 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.2,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి.. రూ. 98,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ఉదయం.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 291.61 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 72,794.33 వద్ద, నిఫ్టీ 126.10 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో.. 21,993.20 వద్ద సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ విధించిన సుంకాలు ఈ రోజు నుంచి అమలులోకి రావడం వంటివి.. స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఇండోకో రెమెడీస్, రూబీ మిల్స్, అనుపమ రసాయన్ ఇండియా వంటి కంపెనీలు లాభాల్లో సాగుతున్నాయి. యూనిఇన్ఫో టెలికాం సర్వీసెస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్, మంగళం డ్రగ్స్, లాంకోర్ హోల్డింగ్స్, NR అగర్వాల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.ట్రంప్ సుంకాల ఎఫెక్ట్చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. మెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
కంపెనీల బాండ్ బాజా!
ఎఫ్ఐఐల అమ్మకాలు ఆగటం లేదు. మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో చాలా కంపెనీల షేర్లు ఏడాది కనిష్టానికి వచ్చేశాయి. మిగిలిన పెట్టుబడి సాధనాల్లో... బంగారం పెరుగుతున్నా... ధరల్లో ఊగిసలాట తప్పదు. రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకు డిపాజిట్లు సురక్షితమే కానీ... వడ్డీ రేట్లు తక్కువ. మరి వీటికన్నా ఎక్కువ వచ్చే ప్రభుత్వ బాండ్లు బెటరా? లేకపోతే అంతకన్నా కాస్త ఎక్కువ గిట్టుబాటయ్యే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల బాండ్లు బెటరా? రాబోయే వారం పది రోజుల్లో పలు ప్రభుత్వ కంపెనీలు సైతం బాండ్లు జారీ చేయటానికి ముందుకొస్తున్న నేపథ్యంలో... వాటి లాభనష్టాలు, రిసు్కల గురించి తెలుసుకుందాం...వడ్డీ రేట్లు పెంచుతూ లిక్విడిటీని రిజర్వు బ్యాంకు కట్టడి చేస్తోంది. దీంతో అప్పుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు కంపెనీలు బాండ్ల జారీకి వస్తున్నాయి. ఈ తాకిడి ఎంతలా అంటే... ఈ ఒక్కవారంలోనే కంపెనీలు రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) 7.40 శాతం వడ్డీతో 11 ఏళ్ల కాలానికి రూ.820 కోట్లు సమీకరించగా... నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ఏడేళ్ల కాలానికి 7.35 శాతం వడ్డీ రేటుతో రూ.4,800 కోట్లు సమీకరించింది. ఇక ఆర్ఈసీ 7.99 శాతం వడ్డీతో నిరవధిక బాండ్లను జారీ చేసింది. రూ.2,000 కోట్లు సమీకరించాలనుకున్నా రూ.1,995 కోట్లే చేయగలిగింది. ఇక రాబోయే రోజుల్లో నాబార్డ్ పదేళ్ల కాలానికి రూ.7,000 కోట్లు, సిడ్బి నాలుగేళ్ల కాలానికి రూ.6,000 కోట్లు, పీఎఫ్సీ నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు సమీకరించనున్నాయి. జనవరిలో ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన, భౌగోళిక అనిశి్చతుల నేపథ్యంలో బాండ్ మార్కెట్ భయపడింది. వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లు పెంచి లిక్విడిటీని కట్టడి చేసింది. దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్‌లు (రాబడి) 0.5 శాతం వరకూ పెరిగాయి. దీంతో కార్పొరేట్లు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాల్సి వచి్చంది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల ఈల్డ్ 7.1 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉండగా... ప్రైవేటు కంపెనీలు అంతకన్నా ఎక్కువ కూపన్ రేటును ఆఫర్ చేయాల్సి వస్తోంది. నిరవధిక బాండ్లు అంటే..సాధారణంగా పెర్పెట్యువల్ బాండ్లుగా పిలిచే ఈ బాండ్లకు నిర్ణీత కాలమంటూ ఏదీ ఉండదు. ఒక కంపెనీ ఈ రకమైన బాండ్లను జారీ చేస్తే... కాలపరిమితి ఉండదు కనుక ఏడాదికోసారి చొప్పున నిరవధికంగా వడ్డీని చెల్లిస్తూ పోతాయి. ఒకవేళ వాటిని బైబ్యాక్ చెయ్యాలని భావిస్తే అప్పుడు ప్రకటన ఇచి్చ... తమ బాండ్ల ప్రిన్సిపల్ మొత్తాన్ని చెల్లించి వెనక్కి తీసుకుంటాయి. అప్పటిదాకా వడ్డీ మాత్రం చెల్లిస్తుంటాయి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తిరిగి పొందటానికి కాలపరిమితి ఉండదు కనుక వీటికి వడ్డీ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే...బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే... ఆ బాండ్లకు బాగా రేటింగ్ ఉండి, చురుగ్గా ట్రేడయితేనే సెకండరీ బాండ్ మార్కెట్లో వెంటనే విక్రయించగలం. రేటింగ్ తక్కువగా ఉన్న బాండ్లయినా, నిరవధిక బాండ్లయినా విక్రయించటం అంత ఈజీ కాదు. పైపెచ్చు విక్రయించేటపుడు వాటి ధర అప్పటి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. మీరు కొన్నపుడు వడ్డీరేట్లు తక్కువ ఉండి ఆ తరవాత పెరిగాయనుకోండి. మీ బాండ్ల ధర కూడా తగ్గుతుంది. అదే రివర్స్‌లో మీరు కొన్నాక వడ్డీ రేట్లు తగ్గితే.. మీ బాండ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది కనక వాటికి గిరాకీ ఉంటుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే బాండ్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు.ప్రభుత్వ సావరిన్ బాండ్లు→ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి కనుక చాలా తక్కువ రిస్కు ఉంటుంది. → సురక్షితం కనుక... తక్కుక వడ్డీని ఆఫర్ చేస్తాయి. కానీ బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే వడ్డీ కాస్తంత ఎక్కువ ఉంటుంది. → డిపాజిట్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేరు. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడవుతాయి కనుక అప్పటి ధరకు విక్రయించుకోవచ్చు. → ఏడాదికోసారి వడ్డీ మన ఖాతాలో ఠంచనుగా పడుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల బాండ్లు→ కంపెనీలు తమ సొంత పూచీకత్తుపై జారీ చేస్తాయి. వాటి పనితీరుపై ఆధారపడి ఉంటాయి కనుక రిస్కు కాస్తంత ఎక్కువ. → రిస్కు ఎక్కువ కనుక ప్రభుత్వ బాండ్ల కన్నా వడ్డీ కాస్త ఎక్కువే. → వీటిని కూడా ప్రభుత్వ బాండ్ల మాదిరి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాండ్ మార్కెట్లో విక్రయించుకునే అవకాశం ఉంటుంది. → వీటి రేటింగ్‌ను బట్టి వడ్డీ ఉంటుంది. ట్రిపుల్ ఏ బాండ్లకు కాస్త తక్కువగా... రేటింగ్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ పెరిగేలా ఉంటాయి. → కాకపోతే తక్కు రేటింగ్ ఉన్న బాండ్లకు రిస్కు కూడా ఎక్కువని గమనించాలి. – సాక్షి, బిజినెస్ ప్రతినిధి -
యాక్సిస్ నుంచి.. కొత్త ‘ఫండ్’ గురూ..!
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మార్చ్ 2028 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది, నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటుంది.దీనికి ఫండ్ మేనేజరుగా హార్దిక్ షా వ్యవహరిస్తారు. ఈ న్యూ ఫండ్‌కి నిఫ్టీ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాండ్ మార్చ్ 2028 ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. మార్చ్ 4 వరకు ఎన్ఎఫ్వో అందుబాటులో ఉంటుంది.ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అత్యంత నాణ్యమైన, ఎఎఎ–రేటింగ్ ఉన్న సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కొత్త స్కీము అవకాశం కల్పిస్తుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ – సీఈవో బి. గోప్‌కుమార్ తెలిపారు. రిస్కులు, రాబడుల మధ్య సమతౌల్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వివరించారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సోమవారం సెషన్‌ను నష్టాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 73,085.94 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,649.72 - 72,784.54 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కేవలం 5.40 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 22,119.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 22,261 వద్ద, రోజు కనిష్ట స్థాయి 22,004 వద్ద నమోదయ్యాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.14 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ సోమవారం 0.27 శాతం నష్టపోయింది. భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 4.65 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ 50లోని 50 షేర్లలో 33 షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.17 శాతం క్షీణించింది.నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.44 శాతం వరకు నష్టపోయాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్‌కేర్ సూచీలు 1.26 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా సూచీలు 1.10 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. -
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
నాలుగు రోజులు వరుసగా బంగారం ధరలు తగ్గిన తరువాత.. ఈ రోజు (మార్చి 3) స్థిరంగా ఉన్నాయి. దీంతో పసిడి ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. నిన్న మాదిరిగానే.. ఈ రోజు కూడా గోల్డ్ రేటు స్థిరంగా ఉంది.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.ఇదీ చదవండి: రోజుకో రేటు వద్ద బంగారం.. ఎందుకో తెలుసా?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలలో ఎలాంటి మార్పు లేదు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలలో కూడా ఎటువంటి మాపు లేదు. నేడు సిల్వర్ రేటు కూడా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
ఉదయ 9:20 గంటలకు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 10:10 గంటలకు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 368.28 పాయింట్ల నష్టంతో 72,829.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94.75 పాయింట్ల నష్టంతో.. 22,029.95 వద్ద సాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 418.78 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 73580.80 వద్ద, నిఫ్టీ 132.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో.. 22,256.70 వద్ద సాగుతున్నాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజ్, రూబీ మిల్స్, రానా షుగర్స్, ఇమామి పేపర్ మిల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇంటర్నేషనల్ జెమ్మాలజీ ఇన్స్టిట్యూట్ ఇండియా, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనోరమ ఇండస్ట్రీస్, కర్మ ఎనర్జీ, హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, సువెన్ ఫార్మాస్యూటికల్స్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ట్రంప్ ప్రకటన: భారీగా పెరిగిన బిట్‌కాయిన్ విలువ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. క్రిప్టో కరెన్సీ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. దేశాన్ని ప్రపంచ క్రిప్టో కరెన్సీకి రాజధానిగా మారుస్తానని, క్రిప్టో రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్‌తో సహా.. అనేక క్రిప్టో కరెన్సీల విలువ మరింత పెరిగిపోయింది.డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర 91,000 డాలర్లను (సుమారు రూ.80 లక్షలు) దాటింది. ఎక్స్ఆర్పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎంఎస్టీఆర్, కాయిన్, హెచ్ఓఓడీ, ఎంఏఆర్ఏ, ఆర్ఐఓటీ వంటి క్రిప్టో లింక్డ్ స్టాక్‌లు కూడా బుల్లిష్ బిడ్లను చూసే అవకాశం ఉంది.మార్చి 7న ట్రంప్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించడంతో క్రిప్టో ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుకోవడం ప్రారంభించాయి. సమ్మిట్‌కు ప్రముఖ వ్యవస్థాపకులు, సీఈఓలు, క్రిప్టో పరిశ్రమకు చెందిన పెట్టుబడిదారులు హాజరయ్యే అవకాశం ఉంది.క్రిప్టో కాయిన్స్ విలువలు ఇలా..భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 8:55 గంటల సమాయానికి సొలనా కాయిన్ (ఎస్ఓఎల్) విలువ 24 శాతం పెరిగి 175.46 డాలర్లకు చేరుకుంది. ఎక్స్ఆర్పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.ఇతర దేశాల్లోనూ క్రిప్టో నిల్వలుఈ చొరవ ఇతర దేశాలు ఇలాంటి నిల్వలను అభివృద్ధి చేయడానికి, తద్వారా ప్రపంచ డిమాండ్‌ను పెంచడానికి ప్రేరేపిస్తుంది. పెద్ద సంస్థలు బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో ఆస్తులను తమ బ్యాలెన్స్ షీట్లలో చేర్చడానికి ఎక్కువ మొగ్గు చూపుతాయని కూడా అంచనా ఉంది. ఇది క్రిప్టోకు మరింత స్వీకరణను తెస్తుంది. క్రిప్టో వ్యవస్థను మరింత స్థిరీకరిస్తుంది. యూఎస్ ప్రభుత్వం క్రిప్టోను ఇంత పెద్ద ఎత్తున స్వీకరించడం దీర్ఘకాలంలో క్రిప్టోపై మరింత నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది. భారత్‌లోనూ వచ్చే 12 నుండి 18 నెలల్లో క్రిప్టోకు సంబంధించిన స్పష్టమైన నియంత్రణ చట్రాల రూపకల్పన జరగవచ్చు. - విక్రమ్ సుబ్బరాజ్, సీఈవో, జియోటస్ క్రిప్టో ప్లాట్ఫామ్గమనిక: క్రిప్టోకరెన్సీలో విపరీతమైన రిస్క్ ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. కాబట్టి వీటి విలువ ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు పతనావస్థకు చేరుతుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఇందులో పెట్టుబడులు పెట్టాలంటే.. దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి, లేదా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: 12 మంది.. రూ. 60వేల పెట్టుబడి: పార్లే-జీ ప్రస్థానం గురించి తెలుసా? -
ఇలా కూడా ఆరా తీస్తారు.. పన్ను వేస్తారు!
ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారు, ఒక్కో అస్సెస్సీకి సంబంధించిన అసెస్మెంట్ పూర్తి చేసినప్పుడు సమాచారం అడగడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 142 (1) సెక్షన్ కింద విస్తృత అధికారాలు ఉన్నాయి. ఈ మధ్యే ఒక అస్సెస్సీకి నోటీసులు వచ్చాయి. ‘‘మీరు మీ ఇంటి ఖర్చుల నిమిత్తం, సొంత వాడకాలు లేదా విత్‌డ్రాయల్స్ చాలా తక్కువగా చూపించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్ వివరాలు, వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్లు, వారి వార్షికాదాయం వివరాలు ఇవ్వండి’’ అనేది దాని సారాంశం. ఇవే కాకుండా ఈ కింది వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది.⬩నెలవారీ రేషన్ వివరాలు. ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు.⬩గోధుమ పిండి ఎంత కొన్నారు.. ⬩బియ్యం ఎంత? ⬩పప్పు ధాన్యాలెంత కొన్నారు..ఎంతకి కొన్నారు? ⬩నూనె ఎంత వాడారు.. ఎంతకు కొన్నారు? ⬩వంట గ్యాస్ వినియోగం వివరాలు. ⬩కరెంటు బిల్లెంత ⬩కొన్న బట్టల వివరాలు ⬩షూస్, పాలిష్, జోళ్లు వివరాలు ⬩క్షవరానికి ఎంత ఖర్చుపెట్టారు ⬩కాస్మెటిక్స్, స్ప్రేలు ⬩ఏయే వేడుకలు చేసుకున్నారు. ఖర్చెంత? ⬩పిల్లల చదువులు, పుస్తకాలు, ⬩స్కూల్ ఫీజుల వివరాలు ⬩మీరు చెల్లించే అద్దె వివరాలు ⬩కారు నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఎంత? ⬩హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు ⬩బిల్డింగ్ నిర్వహణ, ఇన్సూరెన్స్ వివరాలు ⬩జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు ⬩చుట్టాలకు, స్నేహితులకు బహుమతులు ఏమిచ్చారు. వాటి విలువెంత? ⬩రెస్టారెంట్ల ఖర్చులెంత? ⬩గెట్టు గెదర్ లాంటి కార్యక్రమాల ఖర్చులు ⬩సంఘంలోని కార్యకలాపాలు, ఖర్చులు ⬩రోజువారీ ఖర్చులు➤ఇలా అన్నింటి వివరాలూ ఇవ్వాలి. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో, వారందరి ఆదాయపు వివరాలు, ఖర్చుల వివరాలు, రుజువులతో సహా ఇవ్వాలి.➤చివర్లో కొసమెరుపు.. కాదు కాదు.. బెదిరింపు ఏమిటంటే, ‘‘ఈ వివరాలు ఇవ్వకపోతే మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లుగా భావిస్తాము’’ అని.➤అలా భావిస్తే.. భావించారు.. అక్కడితో ఊరుకోరు. ఆ మొత్తం మీద పన్ను కూడా వేస్తారు.అయితే, సాక్షి పాఠకలోకానికి ఈ అంశం కొత్త కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఖర్చుకైనా ‘‘సోర్స్’’ ఉండాలి. సోర్స్‌కు సరైన వివరణ లేకపోతే ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. -
విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే..
పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శివకుమార్ఈక్విటీల్లో దీర్ఘకాల పెట్టుబడులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. అయితే 50–60 శాతం పెట్టుబడులను మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25 - 30 శాతానికి పరిమితం అవుతాయి.లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70 శాతం మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి 50–60 శాతం కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలకు గురవుతుంది.చైనా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ఉంది. ఇందుకు ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అందుబాటులో ఉన్నాయా? – యోగితా రాణాఈక్విటీ పెట్టుబడులను భౌగోళికంగా వైవిధ్యం చేసుకోవాలన్న మీ ఆలోచన అభినందనీయం. అయితే ఈ వైవిధ్యం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదు. కేవలం చైనాలో ఇన్వెస్ట్ చేసేవి లేదా కేవలం యూఎస్‌లో ఇన్వెస్ట్ చేసే వాటితో కాన్సన్ట్రేషన్ రిస్క్ (పెట్టుబడి ఒకే చోట ఉండిపోవడం) ఏర్పడుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది చక్కటి వైవిధ్యంతో ఉండాలి. ఇన్వెస్టర్లు కేవలం ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే వాటికి దూరంగా ఉండడం మంచిది.యూఎస్ ఫండ్స్‌కు ఇందులో కొంత మినహాయింపు ఉంది. యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపనీల్లో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. యూఎస్ కంపెనీలను పరిశీలిస్తే అవి కేవలం యూఎస్‌కే పరిమితం కాకపోవడాన్ని గుర్తించొచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు (గూగుల్, మెటా, యాపిల్ తదితర) అంతర్జాతీయంగా కస్టమర్లు ఉంటారు. ఆయా కస్టమర్లు కేవలం యూఎస్‌లోనే ఉండరు. కనుక యూ ఎస్‌కు చెందిన ఫండ్ ఒకే ప్రాంతానికి చెందినది అయినప్పటికీ, అంతర్జాతీయ ఎక్స్పోజర్ను ఇస్తుంది.ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో 5 - 10% మించకుండా చైనా స్టాక్స్‌కు కేటాయించుకునేట్టు అయితే.. యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్ ఫండ్, ఎడెల్వీజ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్‌షోర్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ డైరెక్ట్, మిరే అస్సెట్ హ్యాంగ్‌సెంగ్ టెక్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్‌సెంగ్ బీస్ పథకాలు అందుబాటులో ఉన్నాయి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్. -
ఇంకా కష్టపడితేనే లక్ష్యాలు సాధించగలం
న్యూఢిల్లీ: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారతీయులు మరింత ఎక్కువగా కష్టపడితేనే సాధ్యమని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా పనిచేయాల్సిందేనన్నారు. ‘‘నేను కష్టించి పని చేయాలని విశ్వసిస్తాను. భారతీయులు ఇంకా కష్టపడి పనిచేయాలి. అది వారానికి 80 గంటలు కావచ్చు లేదా 90 గంటలు కావచ్చు. ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల భారీ లక్ష్యానికి చేరుకోవాలనుకున్నప్పుడు, వినోదాలతో గడిపేస్తూనో, లేకపోతే ఏదో కొందరు సినిమా స్టార్ల అభిప్రాయాలను అనుసరిస్తూనో కూర్చుంటే సాధించలేము’’ అని వ్యాఖ్యానించారు. పటిష్టమైన పని విధానాలతోనే జపాన్, దక్షిణ కొరియా, చైనా ఆర్థిక విజయం సాధించాయని, ప్రపంచ స్థాయి ఎకానమీగా ఎదగాలంటే భారత్ కూడా అలాంటి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఎన్ని గంటల పని వేళలు ఉండాలనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొందరు కార్పొరేట్ దిగ్గజాలు వారానికి 70–90 గంటలు పని చేయాలంటే, ఎన్ని గంటలు పని చేశామనేది కాదు ఎంత నాణ్యంగా పని చేశామనేది ముఖ్యమని మరికొందరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనైపోయింది.. ‘‘ఎక్కువగా కష్టపడకూడదంటూ మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. పనుల్లో జాప్యం జరగకుండా, ఖర్చులు పెరిగిపోకుండా, ప్రపంచ స్థాయి నాణ్యతతో, గడువు కన్నా ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే భారత్ కష్టపడి పని చేయాల్సిందే. ఇక పని–కుటుంబ జీవితం మధ్య సమతౌల్యం పాటించాలనే విషయానికొస్తే.. నేను ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ చేస్తూనే నేను ప్రతి రోజూ కష్టపడి పని కూడా చేస్తాను. మీకు వ్యక్తిగతంగా ఒకటిన్నర గంటలు మీకోసమే పక్కన పెట్టుకున్నా మీకు రోజులో ఇంకా 22.5 గంటలు ఉంటాయి. పని–కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించడానికి బోలెడంత సమయం ఉంటుంది. కష్టపడకపోవడమనేదాన్ని ఏదో ఫ్యాషన్‌గా మార్చొద్దు. పెద్దగా శ్రమించకుండానే భారత్ గొప్ప దేశంగా ఎదగగలదంటూ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. కష్టపడకుండా ఏ దేశమూ ఎదగలేదు’’ అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. -
అమెరికా టారిఫ్‌లు..ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: భారీ పతన బాటలో కొనసాగుతున్న దేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల మోతకు తోడు కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల పరంపర... ఇన్వెస్టర్లలో బలహీన సెంటి‘మంట’కు ఆజ్యం పోస్తోంది. ఈ వారంలో కూడా యూఎస్ టారిఫ్ సంబంధిత పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, ఎఫ్‌పీఐల ట్రేడింగ్ కార్యకలాపాలే మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బలహీనంగానే... ‘ట్రంప్ టారిఫ్ పాలసీతో పాటు గత వారంలో విడుదలైన నిరుద్యోగ గణాంకాలు (అయిదు నెలల గరిష్టం) మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగవచ్చు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో అస్థిరతలు సద్దుమణిగి, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల లాభాల్లో రికవరీ కనిపిస్తేనే మార్కెట్ మళ్లీ గాడిలో పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్‌కు తోడు దేశీయంగా కీలక అంశాలు (ట్రిగ్గర్లు) ఏవీ లేనందున మన మార్కెట్లలో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లు వణుకుతున్నాయని, ఎఫ్‌పీల అమ్మకాల జోరు దీనికి మరింత ఆజ్యం పోస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గణాంకాల ఎఫెక్ట్... గత వారాంతంలో విడుదలైన జీడీపీ గణాంకాల ప్రభావం సోమవారం మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ3తో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ.. క్యూ2తో పోలిస్తే (5.6 శాతం) సీక్వెన్షియల్‌గా కాస్త పుంజుకోవడం విశేషం. అమెరికా టారిఫ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం ఎగబాకి రూ.1.84 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తోంది. ఈ వారంలో విడుదల కానున్న హెచ్ఎస్బీసీ తయారీ, సేవల రంగ పీఎంఐ డేటాపై కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.ఫిబ్ర‘వర్రీ’...గత కొన్ని నెలలుగా నేల చూపులు చూస్తున్న మన మార్కెట్లకు ఫిబ్రవరిలో మరింత షాక్ తగిలింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) పతనం కాగా, బీఎస్ఈ సెన్సెక్స్ 4,302 (5.55%) పాయింట్లు కోల్పోయింది. సెపె్టంబర్ 27న సెన్సెక్స్ రికార్డ్ గరిష్టాన్ని (85,978) తాకి, అక్కడి నుంచి రివర్స్ గేర్‌లోనే వెళ్తోంది. ఇప్పటిదాకా 12,780 పాయింట్లు (14.86 శాతం) కుప్పకూలింది. ఇక నిఫ్టీ కూడా అప్పటి గరిష్టం (26,277) నుంచి 4,153 పాయింట్లు (15.8 శాతం) దిగజారింది. కాగా, ఒక్క గత వారంలోనే సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.94 శాతం క్షీణించడం గమనార్హం.రూ. 34,574 కోట్లు వెనక్కి...విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం మరింత జోరందుకుంది. ఫిబ్రవరి నెలలో దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.34,574 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో మొత్తం అమ్మకాలు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు కంపెనీల లాభాలపై ఆందోళనలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ‘భారత్ మార్కెట్లో ఈక్విటీ వేల్యుయేషన్లు చాలా అధికంగా ఉండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలపై ఆందోళనల ప్రభావంతో ఎఫ్‌పీఐల తిరోగమనం కొనసాగుతోంది’ అని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ పేర్కొన్నారు.టాప్–10 కంపెనీల్లో రూ.3 లక్షల కోట్లు హుష్గత వారంలో ప్రధాన సూచీలు దాదాపు 3 శాతం కుప్పకూలడంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,09,245 కోట్లు ఆవిరైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.1,09,211 కోట్లు క్షీణించి రూ.12,60,505 కోట్లకు పడిపోయింది. దీంతో టాప్–10లో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండో ర్యాంకును అందుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.30,258 కోట్లు జంప్ చేసి, 13,24,411 కోట్లకు ఎగబాకింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,697 కోట్లు తగ్గి, రూ.7,01,002 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ కూడా 39,230 కోట్లు నష్టపోయి రూ.8,94,993 కోట్లకు దిగొచ్చింది. -
ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్‌లో సిప్ చేసుకోవాలి. → సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్‌లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్‌లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
రోజుకో రేటు వద్ద బంగారం: కారణాలివే..
బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజుకో రేటు.. ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గిపోతాయి. ఎందుకిలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?.. ధరలు పెరగడానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.అంతర్జాతీయ ధరలుబంగారం ధరలు ప్రపంచ మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ధరలలో జరిగే ఏవైనా మార్పులు.. దేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ప్రపంచ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.దిగుమతి సుంకం & ప్రభుత్వ విధానాలుభారతదేశం భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు, పన్ను విధానాలు భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచితే, బంగారం ధరలు పెరుగుతాయి. బంగారు నిల్వకు సంబంధించిన విధానాలు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.దేశీయ మార్కెట్లో డిమాండ్ & సరఫరాభారతదేశంలో బంగారం డిమాండ్ పండుగలు.. వివాహ సీజన్లలో గరిష్టంగా ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు, ధరలు పెరుగుతాయి. దీనికి విరుద్ధంగా, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గవచ్చు. సరఫరా కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కొరత ఉన్నప్పుడు కూడా బంగారం ధర ఎక్కువగా ఉండవచ్చు.రూపాయి vs యూఎస్ డాలర్ మారకం రేటుప్రపంచవ్యాప్తంగా బంగారం వ్యాపారం.. అమెరికా డాలర్లతోనే జరుగుతుంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడితే, బంగారం ధర పెరుగుతుంది. అయితే రూపాయి బలపడితే.. బంగారం ధర తగ్గుతుంది. వడ్డీ రేట్లు & ద్రవ్యోల్బణం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచ ఆర్థిక, రాజకీయ సంఘటనలుఆర్ధిక మాంద్యం, మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రపంచ అనిశ్చితులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, పెట్టుబడిదారులు బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయి.ఇదీ చదవండి: 'అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొనే ఉంటారు': తండ్రి గురించి చెప్పిన ఆకాశ్ అంబానీ -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే!
వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ రేటు నేడు (మార్చి 1)న గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న రూ. 500, రూ. 540 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 220 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఈ రోజు (మార్చి 1) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్‌తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్‌లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
ఎపిక్ వరల్డ్ నుంచి కొత్త ఇండెక్స్
ఎపిక్ వరల్డ్ తాజాగా ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్ ఇండియా(ఈహెచ్ఐ) ఇండెక్స్‌ను ఆవిష్కరించింది. మార్నింగ్‌స్టార్ ఇండెక్సెస్తో కలసి రూపొందించిన ఈ సూచీలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితరాలకు చోటు కల్పించింది.తద్వారా 34 లిస్టెడ్ సంస్థల పనితీరును ట్రాక్ చేసేందుకు వీలుంటుందని ఎపిక్ వరల్డ్ పేర్కొంది. ఇండెక్సుకు ప్రాతినిధ్యం వహించే కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 115 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఐదేళ్లలో ఆదాయం 22 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేసింది.ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ఎలెవర్ ఈక్విటీ మద్దతుతో ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ 50 బ్లూ-చిప్ కంపెనీలను ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్‌కు (ఇహెచ్ఎస్) అందించడానికి వీలు కల్పిస్తుంది. వచ్చే 20 ఏళ్లలో ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్10 రెట్లు వృద్ధి చెందుతాయని భావిస్తున్న ఎపిక్ వరల్డ్ భారత్‌లో 100 ట్రిలియన్ డాలర్ల అవకాశాలను తెరవనుంది. -
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్‌మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త: మూడో రోజు తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి. వరుసగా మూడోరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 540 తగ్గింది. ఇది పసిడి ప్రియులకు శుభవార్త. ఈ రోజు (ఫిబ్రవరి 28) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో.. వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,840 వద్ద నిలిచాయి. నిన్న రూ. 400, రూ. 440 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 540 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,840 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,990 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500, రూ. 540 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 28) కేజీ సిల్వర్ రేటు రూ. 1,05,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ ఛైర్మన్‌గా మాదబిపురీ బుచ్ స్థానంలో తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. మార్చి 1 నుంచి తాను సెబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.తుహిన్ కాంత పాండే అనుభవంఆర్థిక కార్యదర్శి: భారత ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఆయన వివిధ ఆర్థిక సంస్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించారు.రెవెన్యూ కార్యదర్శి: దేశ రెవెన్యూ వసూళ్లు, పన్ను విధానాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి పదవిని కూడా పాండే నిర్వహించారు.ఎయిరిండియా ప్రైవేటీకరణ: భారతదేశ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ముఖ్యమైన ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు.పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహణ: పాండే తన కెరీర్ అంతటా ప్రభుత్వ సంస్థలు, వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల నిర్వహణలో నిమగ్నమయ్యారు. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డారు.ఇదీ చదవండి: రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’ముందున్న సవాళ్లు..కొత్త సెబీ ఛైర్మన్ పాండే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, మార్కెట్ సమగ్రతను పెంపొందించడానికి పలు కీలక రంగాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.విజిలెన్స్‌ను బలోపేతం చేయడం: మార్కెట్ మానిప్యులేషన్, ఇన్ సైడర్ ట్రేడింగ్(అనధికారికంగా ముందుగానే కంపెనీలోని కీలక సమాచారాన్ని తెలుసుకుని తర్వాత షేర్లు పెరిగాక తిరిగి విక్రయించి లాభపడడం)ను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి పాండే మార్కెట్ నిఘా యంత్రాంగాలను పెంచే అవకాశం ఉంది.ఇన్వెస్టర్ ప్రొటెక్షన్: కఠినమైన నిబంధనలు, పకడ్బందీ ఆర్థిక విధానల ద్వారా పారదర్శకతతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి.డిజిటల్ సహకారం: నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డిజిటల్ వేదికల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.కార్పొరేట్ గవర్నెన్స్: లిస్టెడ్ కంపెనీల్లో తమ కార్యకలాపాలపై జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను బలోపేతం చేయాలి.సుస్థిర ఆర్థిక విధానాలు: ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక కార్యక్రమాలు, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం. -
రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్‌ను సెబీ వర్గీకరించింది.ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జైప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌ను సిఫ్‌కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది. -
బంగారు కొండ దిగొస్తోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భేరిష్ ధోరణి, అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు రావడానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బంగారానికి అమ్మకాల సెగ తగిలింది. ఢిల్లీ మార్కెట్లో గురువారం ఒక్కరోజే 10 గ్రాములకు రూ.1,150 నష్టపోయింది. 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.88,200కు దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం ఇంతే మేర నష్టపోయి రూ.87,800 స్థాయికి వచ్చేసింది. వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.98,500 స్థాయి వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.554 నష్టపోయి రూ.85,320 వద్ద ఉంది. రూ.84,800 స్థాయిని కోల్పోతే బంగారంలో మరింత బలహీనత ఉండొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ ఔన్స్‌కు 40 డాలర్లు నష్టపోయి 2,890 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘‘బంగారం మరో రికార్డు స్థాయికి చేరిన అనంతరం దిద్దుబాటుకు లోనైంది. డాలర్ గరిష్ట స్థాయి దిశగా చలించడంతోపాటు, టారిఫ్‌ల భయాలు ఇందుకు దారితీశాయి. ఐరోపా యూనియన్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, మార్చి 4 నుంచి మెక్సికో, కెనడాలపై టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనతో సురక్షిత సాధనంగా బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగొచ్చు’’అని అబాన్స్ హోల్డింగ్స్ సీఈవో చింతన్ మెహతా విశ్లేషించారు. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు..
Stock Market Updates: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. విస్తృత సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత బెంచ్ మార్క్ సూచీలు అత్యంత స్వల్ప స్థాయిలో కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 74,834 వద్ద గరిష్ట స్థాయి నుండి 74,521 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి 10 పాయింట్ల లాభంతో 74,612 వద్ద ఫ్లాట్ నోట్ వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 100 పాయింట్ల స్వల్ప శ్రేణిలో కదలాడింది. 22,613 వద్ద గరిష్ట స్థాయి నుండి ఇండెక్స్ 22,508 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరికి దాదాపుగా 22,545 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చెరో 2 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, యాక్సిస్ బ్యాంక్ 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికను ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 5 శాతం పడిపోయింది. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయాయి. బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఏయూ బ్యాంక్, క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, టీటీకే హెల్త్‌కేర్, చోళమండలం హోల్డింగ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ 5-8 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు ఆర్ఆర్ కబెల్, కేఈఐ ఇండస్ట్రీస్, విజయ డయాగ్నస్టిక్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎంఎఫ్ఐ రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలపై రిస్క్ వెయిట్‌ను తగ్గించిన తరువాత క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC), మైక్రో ఫైనాన్స్ షేర్లకు గురువారం డిమాండ్ ఏర్పడింది. -
బంగారం కొనడానికి ఇది మంచి సమయం!.. మళ్ళీ తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరల పెరుగుదలకు.. మహాశివరాత్రి నుంచి బ్రేకులు పడ్డాయి. ఈ రోజు (ఫిబ్రవరి 27) కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మార్పు జరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే.. వివరాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,380 వద్ద నిలిచాయి. నిన్న రూ. 250, రూ. 270 తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400 , రూ. 440 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,380 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి రేట్లు స్వల్పంగా తగ్గాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 27) కేజీ సిల్వర్ రేటు రూ. 1,06,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 98,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
2 నెలల్లో లక్ష కోట్లు ఉఫ్!
కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతుండడంతో మార్కెట్లు పతనబాట పట్టాయి. 2024 అక్టోబర్ లో మొదలైన ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ నిరవధికంగా సాగుతోంది. దీంతో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఇండెక్సుల్లో భారీ కరెక్షన్ జరుగుతోంది.. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలు కొత్త గరిష్టస్థాయిల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. సుమారు మూడేళ్లపాటు సాగిన స్టాక్ మార్కెట్ బుల్ పరుగు గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి స్పీడు తగ్గింది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సెంటిమెంట్ బలహీనపడి మార్కెట్లు లాభాల బాట నుంచి యూటర్న్ తీసుకుని నష్టాల ప్రయాణం మొదలు పెట్టాయి. దీంతో 2024 సెపె్టంబర్ 27న చరిత్రాత్మక గరిష్టాలను తాకిన నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా తగ్గుతూ ఇప్పటివరకూ 14 శాతం పతనమయ్యాయి. బేర్ ట్రెండ్‌వైపు మళ్లాయి! కారణాలు ఇవీ...మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్‌తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది. అధికారం చేపట్టాక భారత్‌సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్‌పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు. నేలచూపుల తీరిదీ బీఎస్ఈ ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్ గత సెపె్టంబర్ 27న 85,978 వద్ద స్థిరపడింది. ఇదే రోజు నిఫ్టీ 26,277కు నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. ఈ స్థాయి నుంచి నిఫ్టీ 3,730 పాయింట్లు(14 శాతం) పతనమైంది. సెన్సెక్స్ 11,376 పాయింట్లు(13 శాతం) కోల్పోయింది. వెరసి గతేడాది అక్టోబర్ నుంచి మార్కెట్లు బేర్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. గత అక్టోబర్ మొదలు అమ్మకాలు కొనసాగిస్తున్న ఎఫ్‌పీఐలు కొత్త ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఫలితంగా ఈ జనవరి మొదలు ఇప్పటివరకూ సెన్సెక్స్ 3,537 పాయింట్లు(4.5 శాతం) పడిపోయింది. ఈ బాటలో నిఫ్టీ 1,097 పాయింట్లు(4.6 శాతం) వెనకడుగు వేసింది.నిపుణుల అంచనాలు నిజానికి మార్కెట్లలో నెలకొన్న దిద్దుబాటు పలు అంశాల కలయికతో జరుగుతుందని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. అధిక శాతం బ్లూచిప్ కంపెనీలు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలిపారు. వీటికితోడు ట్రంప్ టారిఫ్ భయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి అంశాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమవుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు. దీంతో మార్కెట్లు సాంకేతికంగా బలహీనపడినట్లు చెప్పారు. చైనాతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఖరీదుగా ఉండటంతో ఎఫ్‌పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. భారీగా పుంజుకుంటున్న డాలరు, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి క్షీణత, ఖరీదుగా మారిన దేశీ ఈక్విటీలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమనేది విశ్లేషకులు అభిప్రాయం.భారత్ బేర్ వర్ధమాన మార్కెట్లలో చూస్తే ప్రధానంగా ఆసియా దేశాలలో భారత్ నుంచే ఎఫ్‌పీఐలు అత్యధిక శాతం పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, మలేసియా తదితర మార్కెట్లతో పోలిస్తే 2025 తొలి రెండు నెలల్లో దేశీ స్టాక్స్‌లో భారీగా విక్రయాలు చేపట్టారు. ఆసియా దేశాలను పరిగణిస్తే ఫిలిప్పీన్స్‌లో అతితక్కువ అమ్మకాలు నమోదుకాగా.. భారత్‌లో అత్యధిక విక్రయాలకు తెరతీశారు. నిజానికి గత మూడేళ్లలో ఎఫ్‌పీఐలను అత్యధికంగా ఆకట్టుకున్న భారత్ ఇటీవల పలు కారణాలతో పెట్టుబడులను కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ఆసియాలో మెటల్స్ ఎగుమతులతో చైనా, ఎల్రక్టానిక్స్‌లో వియత్నాం వంటి దేశాలు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ అంశంలో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ తదితర పలు ఇతర కారణాలతో ఎఫ్‌పీఐలు విక్రయాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారంపై ఉపశమనం.. వెండిపై భారీ ఊరట!
దేశంలో కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) నేడు (February 26) కాస్త దిగివచ్చాయి. ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత ఈజీ.. ఇక నేరుగా యూపీఐ..తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 80,500, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,820 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.87,970 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,650 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.270, రూ.250 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,500 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,820 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.250, రూ.270 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.భారీగా పడిన వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.2000 తగ్గి రూ.1,06,000 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో కేజీ వెండ రూ. 98,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.3000 క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈక్విటీ డెరివేటివ్స్‌పై సెబీ ఫోకస్
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో సరళతర లావాదేవీల నిర్వహణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రిస్క్ పర్యవేక్షణను పటిష్టపరచడం ద్వారా సమర్థవంత లావాదేవీలకు తెరతీయనుంది. దీనిలో భాగంగా ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) ఓపెన్ ఇంటరెస్ట్(ఓఐ)పై రియల్‌టైమ్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై మార్చి 17వరకూ ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ప్రతిపాదనలను అమలు చేస్తే మరింతగా సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు ఏర్పడుతుంది. తద్వారా రిస్కులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశమేర్పడుతుంది. రియల్‌టైమ్‌లో సెబీ రూపొందించిన తాజా ప్రతిపాదనల ప్రకారం మార్కెట్ పార్టిసిపెంట్లు ఇంట్రాడే స్నాప్‌చాట్స్ ద్వారా రియల్‌టైమ్ ఎఫ్‌అండ్‌వో ఓఐ సంబంధిత సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది రిస్క్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సహకరించడంతోపాటు.. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు దారి చూపిస్తుంది. సెబీ సిద్ధం చేసిన కన్సల్టేషన్ పేపర్ ప్రకారం డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్), ఆల్టర్నేటివ్ పండ్స్(ఏఐఎఫ్) చేపట్టే లావాదేవీల(ఎక్స్పోజర్) పరిమితులలో సవరణలకు తెరలేవనుంది. ఫ్యూచర్స్ ఎక్స్పోజర్ మదింపులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆప్షన్స్(లాంగ్ అండ్ షార్ట్) ఎక్స్పోజర్లో సవరణలు చోటు చేసుకోనున్నాయి. వీటి ప్రకారం ఫ్యూచర్ ఈక్వివాలెంట్ లేదా డెల్టా ప్రాతిపదికన వీటిని మదింపు చేస్తారు. తద్వారా ఇవి మార్కెట్ కదలికల(సెన్సిటివిటీ)ను సమర్ధవంతంగా ప్రతిఫలిస్తాయి. సవరణల బాటలో ప్రస్తుతం విభిన్న పద్ధతుల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్పోజర్లను మదింపు చేస్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ల ఆధారంగా, షార్ట్ అప్షన్స్ను నోషనల్ విలువ ద్వారా, లాంగ్ ఆప్షన్స్ అయితే ప్రీమియం చెల్లింపు ద్వారా మదింపు చేస్తున్నారు. కాగా.. మార్కెట్ రిస్క్ లను మరింతగా ప్రతిఫలించేలా ఇండెక్స్ డెరివేటివ్స్‌కు సెబీ కొత్త పొజిషన్ పరిమితులను ప్రతిపాదించింది. ఇండెక్స్ ఆప్షన్స్‌కు రోజువారీ ముగింపులో నికర విలువ రూ. 500 కోట్లు, స్థూలంగా రూ. 1,500 కోట్లవరకూ అనుమతించనుండగా.. ఇంట్రాడేకు నికరంగా రూ. 1,000 కోట్లు, స్థూలంగా రూ. 2,500 కోట్లు చొప్పున పరిమితులు అమలుకానున్నాయి.ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు రోజువారీ ముగింపు పరిమితి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెరగనుంది. రూ. 2,500 కోట్ల ఇంట్రాడే పరిమితి ఇందుకు అమలుకానుంది. తాజా ప్రతిపాదనలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), ఎంఎఫ్‌లు, ట్రేడర్లు, క్లయింట్లతోపాటు మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ అమలుకానున్నాయి. అయితే నిజంగా హోల్డింగ్స్ కలిగిన పొజిషన్లకు మినహాయింపులు లభించనున్నాయి. స్టాక్స్ కలిగిన షార్ట్ పొజిషన్లు, నగదు కలిగిన లాంగ్ పొజిషన్లకు మినహాయింపులు వర్తించనున్నాయి. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 147.71 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో.. 74,602.12 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో.. 22,547.55 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే ఇండియా, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ట్రెంట్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్ తులం రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ తరుణంలో తక్కువ ధరకు బంగారం దొరికే ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కవ ధరకే బంగారం లభిస్తుంది. వాటి వివరాలు కింద తెలుసుకుందాం.దుబాయ్, యుఏఈఈ దేశం ‘బంగారు నగరం’గా ప్రసిద్ధి చెందింది. బంగారంపై తక్కువ పన్నులు ఉండడంతో ఇక్కడ అత్యంత సరసమైన ధరలకే పసిడి లభిస్తుంది. ఇక్కడ బంగారం సాధారణంగా భారతదేశం కంటే 10-15 శాతం చౌకగా ఉంటుంది. యూఏఈలో బంగారంపై విలువ ఆధారిత పన్ను లేకపోవడం గమనార్హం. దీనికితోడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో తక్కువ ధరలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే భారతీయులు ఈ దేశాన్ని అన్వేశిస్తున్నారు.థాయ్‌లాండ్‌ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా బంగారం కొనుగోలుకు ప్రసిద్ధ ప్రదేశాలు. తక్కువ మేకింగ్ ఛార్జీలు, పన్నుల కారణంగా భారత్‌తో పోలిస్తే ఈ దేశం తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అందిస్తోంది. సాధారణంగా థాయ్‌లాండ్‌లో బంగారం భారత్ కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. ఆ దేశంలో తక్కువ తయారీ ఖర్చులు, బంగారంపై స్వల్పంగా పన్నులు విధిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే సాపేక్షంగా తక్కువ మేకింగ్ ఛార్జీలతో బంగారు ఆభరణాలు లభిస్తాయి.సింగపూర్తక్కువ పన్నులు, బంగారం ధరల్లో పోటీ కారణంగా గోల్డ్ షాపింగ్‌కు సింగపూర్ కీలక గమ్యస్థానంగా ఉంది. నాణ్యమైన బంగారాన్ని విక్రయించడంలో ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఇక్కడ ధరలు భారతదేశం కంటే 5-8 శాతం చౌకగా ఉంటాయి. ఈ దేశంలో గ్రేడ్ బంగారంపై జీఎస్టీ లేదు. దాంతో చౌకగా లభిస్తుంది.మలేషియాకౌలాలంపూర్‌లో సరసమైన బంగారం ధరలు ఉన్నాయి. తక్కువ తయారీ ఛార్జీలు, పన్నుల కోసం చూస్తున్న భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశంలో పోటీ ధరలను అందించే అనేక దుకాణాలు ఉన్నాయి. మలేషియాలో బంగారం భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది. బంగారంపూ తక్కువ పన్నులు, మేకింగ్ ఛార్జీలను అందిస్తున్నారు.హాంగ్ కాంగ్హాంగ్ కాంగ్ బంగారం, విలువైన లోహాలపై పన్ను మినహిస్తుంది. దాంతో తక్కువ ధరలకు లభిస్తాయి. ఈ దేశం బంగారం ట్రేడింగ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. పోటీ ధరల కారణంగా చాలా మంది భారతీయులు ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హాంకాంగ్‌లో బంగారం సాధారణంగా భారతదేశం కంటే 5-10 శాతం చౌకగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్ 1 నుంచి సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనల్లో మార్పులుఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం ధరలు అధిక ధరకు దోహదం చేసే కొన్ని కీలక అంశాలను తెలుసుకుందాం.దిగుమతి సుంకాలు, పన్నులు: భారతదేశం బంగారంపై గణనీయమైన దిగుమతి సుంకాలు, పన్నులను విధిస్తుంది.ఈ సుంకాలు 12.5% వరకు ఉండవచ్చు. బంగారం కొనుగోళ్లపై అదనంగా 3% వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఉంటుంది. మేకింగ్ ఛార్జీలపై మరో 5 శాతం జీఎస్టీ వడ్డీస్తున్నారు.కరెన్సీ మారకం రేట్లు: అంతర్జాతీయంగా బంగారం అమెరికా డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి (ఐఎన్ఆర్) బలహీనపడినప్పుడు బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది. మారకం రేట్లలో ఈ హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరను నేరుగా ప్రభావితం చేస్తాయి .పండుగలు, పెళ్లిళ్లు: భారతదేశంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, దీపావళి, ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు సురక్షిత సంపదగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి పెరిగిన డిమాండ్ అధిక ధరలకు దారితీస్తుంది. ఇది భారత మార్కెట్లో ప్రతిబింబిస్తుంది.సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు: అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత రిజర్వ్ బ్యాంక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుతున్నాయి. ఈ బల్క్ కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్‌ను పెంచుతాయి. -
పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,750 (22 క్యారెట్స్), రూ.88,090 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.220, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.88,090 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.210 పెరిగి రూ.80,900కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.88,240 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. మంగళవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్‌మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్‌ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం కొత్త రేటు: ఈ రోజు ధరలివే..
బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా.. దూసుకెల్తూనే ఉంది. ఆదివారం స్థిరంగా ఉన్న పసిడి ధరలు మళ్ళీ పెరుగుదల దిశగా సాగాయి. దీంతో నేడు (ఫిబ్రవరి 24) గోల్డ్ రేటు మళ్ళీ పెరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,870 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 100 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు రూ. 100 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,870 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే..దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 80,690 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,020 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 90, రూ. 100 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదల వైపు అడుగులు వేసాయి. దీంతో ఈ రోజు (ఫిబ్రవరి 24) కేజీ సిల్వర్ రేటు రూ. 1000 పెరిగి, రూ. 1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత కొరవడటం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. రూపాయి బలహీనతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్ 0.56%, నిఫ్టీ 0.51% శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు నష్టపోయి పెరిగి 75311 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22795 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మరోపక్క నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.5 శాతం పెరిగాయి.ఈవారంఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక స్థాయులను పరిశీలిస్తే కచ్చితంగా ఈవారం సాంకేతిక మద్దతు లభించొచ్చు. ఇదే జరిగితే ఉపశమన ర్యాలీ ఖాయం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈనెల 28 న గణాంకాలు వెలువడతాయి. అలాగే ఈనెల 27 న అమెరికా జీడీపీ తాలూకు గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. నిరుద్యోగ డేటా కూడా ఈవారాంతంలో రానుంది. అమెరికా ఎకనామిక్ డేటా గతవారం అక్కడి మార్కెట్లను బాగా పడేసింది. దీని ప్రభావం సోమవారం వివిధ ఆసియా మార్కెట్లపై పడింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు కూడా ఈవారాన్ని నష్టాలతోనే ప్రారంభించొచ్చు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో అమ్మకాలు జరిపే విదేశీ మదుపర్లు ఇప్పుడు రూటు మార్చారు. పొద్దున్న ట్రేడింగ్ ప్రారంభమైన అరగంటలోనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకసారి మార్కెట్లు పడిపోయాక రోజు మొత్తంలో మళ్లీ తేరుకోవడం చాలా కష్టమవుతోంది. షేర్లలో కదలికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదే సమయంలో సూచీల్లో మాత్రం విపరీతమైన ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ట్రేడర్లకు భారీ నష్టాలే మిగులుతున్నాయి. ఈ ట్రెండ్‌ను గమనించి ముందుకెళ్లడం అవసరం.విదేశీ మదుపర్లువిదేశీ మదుపర్లు ఎటువంటి సానుకూల ప్రకటనలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మార్కెట్ వారికిప్పుడు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. దీంతో వీరు మన మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతూ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.36,976 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యథావిధిగా మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.42,601 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.సాంకేతిక స్థాయిలుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23000-200 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,400, ఆ తర్వాత 23,600 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,600 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్లిపోతే మాత్రం 22,500 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,350, ఆతర్వాత 22,000 స్థాయులను పరీక్షించే అవకాశం ఉంటుంది.రంగాలవారీగాఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఐటీ షేర్లు సైతం నష్టాల బాటలో కొనసాగొచ్చు. యంత్ర పరికరాలు, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు. లోహ, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉండగా, చమురు, టెలికాం రంగాల్లో పరిమిత స్థాయిలో కదలికలు ఉండొచ్చు. వచ్చే నెల 28వ తేదీ నుంచి బ్రిటానియా, భారత్ పెట్రోలియం స్థానంలో జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీ-50లో అడుగుపెట్టబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యుందాయ్ మోటార్, ఇండియన్ హోటల్స్, బెల్, ఐఆర్సీటీసీ, స్విగ్గీ, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌హెచ్‌పీసీ షేర్లపైనా దృష్టి సారించొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 3.23 శాతం క్షీణించి 14.53 దగ్గర ఉంది. 14 శాతం దిగువకు వచ్చేవరకు బుల్స్ ఆచితూచి వ్యవహరించాల్సిందే.మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఫండ్ పనితీరు మదింపు ఇలా..
భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పెట్టుబడి సాధనాల్లో మ్యుచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 2023లో అద్భుతంగా రాణించిన మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ 2024లోనూ అదే తీరును కొనసాగించడంతో నిర్వహణలోని అసెట్స్ పరిమాణం ఏకంగా రూ.17 లక్షల కోట్లు పెరిగింది. సరైన ఫండ్ ఎంపికపై ఎలాగైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే ఫండ్ పనితీరును మదింపు చేయడంపై కూడా ఇన్వెస్టర్లు తప్పక దృష్టి పెట్టాలి. ఇందుకు ఉపయోగపడే కొన్ని కీలక కొలమానాల గురించి తెలుసుకుందాం. రిస్క్‌కు తగ్గ రాబడులు: రాబడులు ముఖ్యమే అయినప్పటికీ, ఇవి పెట్టుబడి ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్నులను అందించగలిగే సామర్థ్యమే, ఫండ్ సిసలైన పనితీరును మదింపు చేసేందుకు కీలకాంశంగా ఉంటుంది. తీసుకుంటున్న రిస్క్‌కు తగ్గట్లుగా ఫండ్ ఎంత రాబడిని అందిస్తున్నదీ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్నులను మదింపు చేసేందుకు విరివిగా ఉపయోగించే సాధనాల్లో షార్ప్ రేషియో కూడా ఒకటి. తీసుకున్న ప్రతి యూనిట్ రిస్క్‌కు ఫండ్ ఎంత ఎక్కువగా రాబడిని అందించినది తెలుసుకునేందుకు ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. షార్ప్ నిష్పత్తి అధికంగా ఉందంటే, తీసుకున్న రిస్కుకు మించి అధిక రాబడులను అందిస్తోందని అర్థం. దీర్ఘకాలంలో స్థిరమైన పనితీరును కోరుకుంటున్న ఇన్వెస్టర్లకు ఇది సానుకూల సంకేతం. ఇక ఆల్ఫా అనేది రిస్క్‌కు అనుగుణంగా సర్దుబాట్లు చేసి, బెంచ్‌మార్క్ సూచీకి మించి పనితీరును కనపర్చగలిగే ఫండ్ మేనేజర్ సామర్థ్యాలను సూచిస్తుంది. ఆల్ఫా సానుకూలంగా ఉందంటే మార్కెట్ కదలికలను బట్టి, ఊహించిన దానికి మించి ఫండ్ మేనేజరు రాబడులు అందించినట్లు అర్థం. బీటా: మ్యుచువల్ ఫండ్ స్కీములు సాధారణంగా నిర్దిష్ట సూచీని ప్రామాణికంగా తీసుకుంటాయి. సదరు బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే నిర్దిష్ట స్కీము రాబడులను అందించడంలో ఎంత ఒడిదుడుకులకు లోనవుతున్నదీ తెలుసుకునేందుకు ఉపయోగించే కొలమానం బీటా. మార్కెట్ బీటా సాధారణంగా 1గా ఉంటుంది. మ్యుచువల్ ఫండ్ బీటా 1.0గా ఉందంటే, అచ్చం దాని బెంచ్‌మార్క్ సూచీని ప్రతిబింబించేంత సెన్సిటివ్‌గా లేదా ఒడిదుడుకులతో ఉంటుందని అర్థం. బీటా 1.20గా ఉందంటే అది 20% ఎక్కువ సెన్సిటివ్‌గా లేదా హెచ్చుతగ్గులకు లోనవుతుందని అర్థం. పోర్ట్‌ఫోలియోలోని మిగతా సాధనాలతో పోలిస్తే రిసు్కలను మదింపు చేసేందుకు ఇదొక కొలమానంగా ఉపయోగపడగలదు. ట్రాకింగ్ ఎర్రర్: నిర్దిష్ట ఫండ్ పనితీరు, దాని బెంచ్‌మార్క్ సూచీ పనితీరుకు ఎంత దగ్గరగా ఉందనేది ట్రాకింగ్ ఎర్రర్ లెక్కిస్తుంది. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉందంటే, బెంచ్‌మార్క్‌కి అనుగుణంగా ఫండ్ పనితీరు అంత దగ్గరగా ఉందని అర్థం. అదే ట్రాకింగ్ ఎర్రర్ అధికంగా ఉందంటే, ప్రామాణిక సూచీకి భిన్నంగా ఫండ్ పనితీరు ఉంటోందని భావించవచ్చు. ప్యాసివ్ ఫండ్స్ ఇన్వెస్టర్లు లేదా ఇండెక్స్ తరహా రాబడులను కోరుకునే మదుపరులకు ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండటం మంచిది. ఎక్స్పెన్స్ రేషియో: ఎక్స్పెన్స్ రేషియో అనేది మ్యుచువల్ ఫండ్ నిర్వహణకయ్యే వార్షిక వ్యయాలను ప్రతిబింబిస్తుంది. దీన్ని ఫండ్ అసెట్స్‌లో నిర్దిష్ట శాతంగా చూపిస్తారు. ఎక్స్పెన్స్ రేషియో అధికంగా ఉంటే రాబడులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కాస్త ఎక్కువ ఫీజులు వర్తించినా, యాక్టివ్ మేనేజ్మెంట్ ఉండటం వల్ల ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే మరింత మెరుగైన రాబడులు పొందడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, స్టాక్స్ ఎంపిక లేదా మార్కెట్ టైమింగ్‌పై దృష్టి పెట్టే యాక్టివ్ ఫండ్లు, బెంచ్‌మార్క్‌కి మించి రాబడులు అందించడం ద్వారా అధిక ఫీజులకు న్యాయం చేకూర్చవచ్చు. కాబట్టి వ్యయాలతో పోలిస్తే ఫండ్ వ్యూహం వల్ల ఒనగూరే విలువను మదింపు చేసుకోవడం అన్నివేళలా శ్రేయస్కరం. బెంచ్‌మార్క్: మ్యుచువల్ ఫండ్ పనితీరును పోల్చిచూసే మార్కెట్ సూచీని బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈక్విటీ ఫండ్లను సాధారణంగా నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్‌ను ప్రామాణికంగా పోల్చి చూస్తారు. అదే డెట్ ఫండ్లకు బాండ్ సూచీలను బెంచ్‌మార్క్‌లుగా పరిగణిస్తారు. ఫండ్ పనితీరును బెంచ్‌మార్క్‌తో పోల్చి చూడటం వల్ల ఫండ్ మేనేజర్ వ్యూహం సమర్ధతను, అధిక రాబడులను సాధించగలుగుతున్నారా అనే ది ఇన్వెస్టర్లు తెలుసుకోవచ్చు. అలాగే, వివిధ కాలవ్యవధుల్లో అంటే 1 ఏడాది, 3 ఏళ్లు, లేదా 5 ఏళ్ల వ్యవధిలో నిర్దిష్ట ఫండ్ తన బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఏ విధంగా పనిచేస్తోందో పరిశీలించడం కూడా ముఖ్యం. ఇదీ చదవండి: స్టాక్స్ అమ్మి ఫ్లాట్ కొనడం మంచిదా?చివరగా చెప్పాలంటే, మ్యుచువల్ ఫండ్ పనితీరును మదింపు చేయాలంటే అది గతంలో అందించిన రాబడి మాత్రమే చూస్తే సరిపోదు. పైన పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని పరిశీలించడం ద్వారా సదరు ఫండ్ సిసలైన సామర్థ్యాలను ఇన్వెస్టరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్ మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ కొలమానాలన్నింటినీ కలిపి ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి వృద్ధి, ఆదాయాన్ని కోరుకుంటున్నా లేదా సమతూకమైన విధానాన్ని పాటించాలనుకుంటున్నా ఈ కొలమానాలను అర్థం చేసుకోవడం వల్ల మరింత స్మార్ట్‌గా, సమగ్రమైన వివరాలతో తగిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.-రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ (రిటైల్ సేల్స్) యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
ఎఫ్‌పీఐల షాక్
దేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్‌పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్‌పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. -
టారిఫ్‌లు, ప్రపంచ మార్కెట్లపై దృష్టి
ముంబై: ప్రధానంగా ప్రపంచ పరిణామాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాల కారణంగా నేలచూపులకే పరిమితమవుతున్నాయి. ఈ బాటలో మరోసారి ఆటుపోట్లు చవిచూడనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనా ఎఫెక్ట్ యూఎస్ టారిఫ్‌లు తదితర పాలసీ నిర్ణయాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. కొద్ది నెలలుగా మార్కెట్లు దిద్దుబాటు ధోరణిలో సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎక్కడ టర్న్అరౌండ్ అయ్యేదీ అంచనా వేయడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల మరోసారి చైనా మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. దీంతో పలువురికి ఆదాయపన్ను ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్, వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష పెద్దగా ప్రభావం చూపలేకపోయినట్లు ప్రస్తావించారు. వారాంతాన... గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు శుక్రవారం(28న) వెల్లడికానుంది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో దేశ జీడీపీ పురోగతి గణాంకాలు విడుదలకానున్నాయి. జులై–సెప్టెంబర్(క్యూ3)లో జీడీపీ 5.4 శాతం వృద్ధి చూపింది. మరోపక్క యూఎస్ క్యూ4 జీడీపీ రెండో అంచనాలు 27న వెలువడనున్నాయి. ముందస్తు అంచనాలు 2.3 శాతం వృద్ధిని సంకేతించాయి. గత మూడు త్రైమాసికాలలో ఇది తక్కువకాగా.. క్యూ3లో 3.1 శాతం పురోగతి నమోదైంది. ఇదే రోజు జనవరి నెలకు యూఎస్ కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు, డ్యురబుల్ గూడ్స్ ఆర్డర్లు, వ్యక్తిగత ఆదాయం, వ్యయాలు తదితర గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ అంశాలపైనా దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసె స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.గత వారమిలా..గత వారం(17–21) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోవారంలోనూ డీలా పడ్డాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్ నికరంగా 628 పాయింట్లు(0.85 శాతం) క్షీణించి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 22,796 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.6 శాతం, 1 శాతం చొప్పున బలపడటం గమనార్హం!ఇతర అంశాలురష్యా– ఉక్రెయిన్ యుద్ధం సంబంధిత వార్తలు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి తీరు సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు వినోద్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఆర్జన మెరుగుపడటం, గ్లోబల్ లిక్విడిటీ, కరెన్సీ నిలకడం వంటి సానుకూల పరిస్థితులు నెలకొనేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ అయ్యే వీలున్నట్లు నిపుణులు వివరించారు. యూఎస్ విధిస్తున్న టారిఫ్‌లపై ఆందోళనలు దేశీ మార్కెట్లతోపాటు.. పలు ఇతర మార్కెట్లను సైతం ప్రభావితం చేయనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ వార్తలు ట్రెండ్‌ను నిర్దేశించవచ్చని అంచనా వేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు కీలక భాగస్వామ్య దేశాలను ప్రభావితం చేయనున్నట్లు మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా పేర్కొన్నారు. దీనికితోడు దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు కొంతమేర నిరాశపరుస్తున్నట్లు తెలియజేశారు. -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్‌ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్‌లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్‌ను ప్రేరేపించింది.స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్‌ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. -
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 221) బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..➤హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,770 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.➤విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 200, రూ. 20 పెరిగింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు కొంత పెరిగింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7770 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు ఓ మోస్తరుగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 80,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 370 పెరిగి రూ. 87,920 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శనివారం) రూ. 900 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి.. మళ్ళీ యధాస్థానానికే (రూ.1,00,500) చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్‌లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషితొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్‌ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు. -
ఇక వెండి.. కొండ!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్‌టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్‌టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్‌ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్‌ల్లో రాబడులు (%)ఏబీఎస్ఎల్ సిల్వర్ 36.36 కోటక్ సిల్వర్ 36.34 డీఎస్పీ సిల్వర్ 36.21 హెచ్డీఎఫ్సీ సిల్వర్ 36.13 యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్‌డెస్క్ -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్‌క్యాప్100, నిఫ్టీ స్మాల్‌క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇక్కడి లాభాలు అక్కడికి.. ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్‌కోటక్ స్పందన
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్‌కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.‘భారత్‌లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ఇప్పటికే ఎఫ్ఐఐలు, ఎఫ్‌డీఐలు భారత్‌లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్‌పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్‌లో తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్బీఐ తన రిజర్వ్‌లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. -
బంగారం ధరల్లో భారీ మార్పులు
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21) బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..➤హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,100 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర పెరిగింది.➤విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7750 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 450, రూ. 290 తగ్గింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7550 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7550 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 550 తగ్గి రూ. 80300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 640 తగ్గి రూ. 87550 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శుక్రవారం) రూ. 100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,900 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,400 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఐపీవో రూట్లో ఫోన్‌పే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్‌పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్‌పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్‌పే వేల్యుయేషన్‌ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్‌ఏఆర్‌ఎల్‌కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్‌కి 5.14 శాతం, ఫోన్‌పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 203.22 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 75,735.96 వద్ద, నిఫ్టీ 19.75 పాయింట్లు లేదా 0.086 శాతం నష్టంతో 22,913.15 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ రోజు బంగారం ధర చూశారా?.. ఇక కొనడం కష్టమే!
ఇంతింతై.. వటుడింతై అన్న చందాన, బంగారం ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 20) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 390 పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద నిలిచాయి. నిన్న రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,040 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి ధర రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు మరింత ఊపందుకున్నాయి. ఇక్కడ గోల్డ్ రేట్లు రూ. 80,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,190 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 390ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (20 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94.24 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 75,873.15 వద్ద, నిఫ్టీ 28.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,917.15 పాయింట్ల వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,350 (22 క్యారెట్స్), రూ.87,650 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.650, రూ.700 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.650, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,350 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,650 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 పెరిగి రూ.80,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.700 పెరిగి రూ.87,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. బుధవారం వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల లాగిన్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా కీలక చర్యలను సెబీ(SEBI) ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకమీదట అ«దీకృత యూజర్లే వారి ట్రేడింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. యూనిక్ క్లయింట్ కోడ్ (యూసీసీ)–డివైజ్–సిమ్ ఈ మూడింటితో కూడిన సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదన. యూపీఐ యాప్ అన్నది ఒక మొబైల్లో ఒకే యూజర్‌తో ఎలా అనుసంధానం అయి ఉంటుందో.. ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా సైతం యూజర్ మొబైల్‌తో అనుసంధానమై ఉంటుంది. యూపీఐ లావాదేవీల సమయంలో యూపీఐ అప్లికేషన్ క్లయింట్ సిమ్, మొబైల్ డివైజ్, వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేస్తుంది. అదే మాదిరిగా ట్రేడింగ్ అప్లికేషన్ సైతం యూజర్ యూసీసీ, సిమ్, మొబైల్ డివైజ్ నిజమైనవని ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్‌కు వీలు కల్పిస్తుంది.యూనిక్ క్లయింట్ కోడ్‌కు క్లయింట్ మొబైల్ నంబర్, డివైజ్ ఐఎంఈఐ నంబర్‌ను లింక్ చేయడాన్ని సెబీ ప్రతిపాదించింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అవ్వాలంటే.. సోషల్ మీడియా యాప్‌ల మాదిరే టైమ్ సెన్సిటివ్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సిటివ్ క్యూఆర్ కోడ్ ఆథెంటికేషన్ ద్వారే చేయాల్సి వస్తుంది. అలాగే, ట్రేడింగ్ యాప్‌లోకి బయోమోట్రిక్ ధ్రువీకరణతోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పత్రిపాదనలపై సలహా, సూచనలను మార్చి 11 లోపు తెలియజేయాలని సెబీ కోరింది.ఏఎంసీలు సకాలంలో పెట్టుబడి పెట్టాల్సిందేనూతన ఫండ్ పథకం (ఎన్ఎఫ్వో) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్దేశిత సమయంలోపు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలంటూ నిబంధనలను సెబీ సవరించింది. అలాగే, పారదర్శకత పెంపుకోసం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను సైతం ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. మరింత జవాబుదారీతనం, ఇన్వెస్టర్లలో విశ్వాసం, మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్వహణ సౌలభ్యం తీసుకొచ్చే దిశగా సెబీ ఈ చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం, పథకం పెట్టుబడుల విధానానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలోపు ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు గత డిసెంబర్లో ఆమోదం తెలపడం గమనార్హం. సాధారణంగా ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయకపోతే.. ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ (చార్జీ) చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఏఎంసీలు అనుమతించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎలా ఎదుర్కొంటాయో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.ఇండస్ట్రియల్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్ సెషన్ కల్లా సెన్సెక్స్ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది. ⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% క్షీణించింది. మిడ్ క్యాప్ సూచీ 0.19 శాతం నష్టపోయింది. రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్‌ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది. -
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది. పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 75,531 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. కానీ చివరికి 29 పాయింట్ల స్వల్ప నష్టంతో 75,967 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 22,801 కనిష్ట స్థాయిని, 22,992 గరిష్ట స్థాయిని తాకి, ఆ తర్వాత 14 పాయింట్లు తగ్గి 22,945 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 షేర్లలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3 శాతం వరకు లాభపడి టాప్ పెర్ఫార్మర్లలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, జొమాటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇతర స్పష్టమైన కదలికలు చేశాయి. మరోవైపు, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా & మహీంద్రా, టీసీఎస్ ఒక్కొక్కటి 1 - 2 శాతం క్షీణించాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా ఫ్లాట్ నోట్‌తో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5 శాతం క్షీణించింది. మొత్తంగా ఈరోజు మార్కెట్ 3:1 నిష్పత్తిలో బేర్లకు అనుకూలంగా నష్టాలను చూసింది. బీఎస్ఈలో దాదాపు 3,000 స్టాక్‌లు క్షీణించగా , 1,000 కంటే తక్కువ షేర్లు లాభపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పరుగు ఆపని పసిడి! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.79,700 (22 క్యారెట్స్), రూ.86,950 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 పెరిగింది.ఇదీ చదవండి: అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందేచెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.79,700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.86,950 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 పెరిగి రూ.79,850కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 పెరిగి రూ.87,100 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నా వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. మంగళవారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రేటు రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందే
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’ అని సెబీ పేర్కొంది. పెనాల్టీలు వేయాల్సింది టెల్కోలపై కాదు: సీఓఏఐస్పామ్ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేయడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలతో టెల్కోలకు పెనాల్టీలు గణనీయంగా పెరిగాయని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్‌కు ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల స్పామ్ సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. ‘టెలికం ఆపరేటర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి పుష్కలంగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: రూ.250కే జన్‌నివేష్ సిప్అయాచిత కమ్యూనికేషన్ల పరిమాణంలో గణనీయ పెరుగుదల, అలాగే న్యాయబద్ధ వాణిజ్య కమ్యూనికేషన్ అంతా ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లకు మారింది. ఇది దేశంలో ఆర్థిక నేరాల పెరుగుదలకు దారితీసింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లపై పెనాల్టీలు ఏ ప్రయోజనాన్ని అందించవు. అవసరమైతే టెలిమార్కెటర్ డెలివరీ కంపెనీలు లేదా వాణిజ్య సమాచార ప్రసారాల వాస్తవ రూపకర్తలు, లబ్ధాదారులైన ప్రధాన సంస్థలపై ఈ పెనాల్టీలు వేయాలి’ అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి.కొచ్చర్ అన్నారు. -
రూ.250కే జన్‌నివేష్ సిప్
ముంబై: తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పరిష్కారం కొనుగొంది. జన్‌నివేష్ సిప్ పేరుతో రూ.250 నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ దీన్ని ప్రారంభించారు. రూ.250 సిప్ తనకు అత్యంత ఇష్టమైన స్వప్నాల్లో ఒకటని బుచ్ పేర్కొన్నారు. ఈ తరహా అతి స్వల్ప పెట్టుబడుల ఉత్పత్తులు లక్షలాది మందికి సంపద సృష్టిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.‘భారత్ వృద్ధి చెందే క్రమంలో సంపద సృష్టి జరుగుతుంది. చిన్న మొత్తాల రూపంలో అయినా ప్రతి ఒక్కరికీ అందాలి. జన్‌నివేష్ అంటే నా దృష్టిలో అర్థం ఇదే’ అని మాధవి పేర్కొన్నారు. గతంలో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రూ.100, రూ.500 సిప్‌లు ప్రవేశపెట్టినప్పటికీ అధిక నిర్వహణ వ్యయాల కారణంగా వాటికి కొనసాగించలేకపోయినట్టు చెప్పారు. సూక్ష్మ సిప్‌లు ఆర్థికంగా లాభసాటి కావాలంటే, రెండేళ్లలోపే వాటికి సంబంధించి లాభం–నష్టంలేని స్థితి(స్టేబుల్‌గా ఉండేలా)ని సాధించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో రూ.250 సిప్ ద్వారా మొదటిసారి ఇన్వెస్టర్లు, అసంఘటిత రంగంలోని చిన్న మొత్తాల పొదుపరులను ఆకర్షించగలం’ అని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిషోర్ ప్రకటించారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా చేరువ చేసే దిశగా తాము ఉత్పత్తుల అభివృద్ధి, ప్రక్రియలు, టెక్నాలజీలపై దృష్టి సారిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్‌తోపాటు పేటీఎం, జెరోదా, గ్రోవ్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రతీ యూజర్ జన్‌నివేష్ సిప్‌ను పొందొచ్చని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. -
లాభాల స్వీకరణకే ఎఫ్ఐఐల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు.‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది‘ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ. 1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ. లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాడి స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే. -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు తమ ప్రారంభ నష్టాలను తిప్పికొట్టి 8 రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి, సోమవారం సానుకూలంగా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 57.65 పాయింట్లు లేదా మునుపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం పెరిగి 75,996.86 వద్ద ముగిసింది. దీని ఇంట్రా-డే కనిష్ట స్థాయి 75,294.76 నుండి దాదాపు 702.10 పాయింట్లు పెరిగింది. మునుపటి ఎనిమిది వరుస ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.4 శాతం లేదా 2,645 పాయింట్లు పడిపోయింది.అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 30.25 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 22,959.50 వద్ద ముగిసింది. సోమవారం ఈ ఇండెక్స్ 22,974.20 నుండి 22,725.45 పరిధిలో ట్రేడయింది. నిఫ్టీ50లోని 50 కాంపోనెంట్ స్టాక్‌లలో 34 లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్ 3.93 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. మహీంద్రా & మహీంద్రా, భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఎస్ఈ నిఫ్టీ50లో అత్యధికంగా వెనుకబడిన వాటిలో ఉన్నాయి, 3.45 శాతం వరకు నష్టాలు సంభవించాయి. ట్రేడింగ్ సెషన్ రెండవ భాగంలో విస్తృత మార్కెట్లు కూడా కోలుకున్నాయి, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 0.39 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.04 శాతం స్వల్ప లాభాలతో ముగిసింది. అయితే, మార్కెట్ విస్తృతి ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో ట్రేడవుతున్న 2,955 స్టాక్‌లలో 1,014 లాభాలతో ముగియగా, 1,871 స్టాక్‌లు క్షీణించాయి. 70 స్టాక్‌లు మాత్రం మారలేదు. ఎన్ఎస్ఈలోని రంగాలలో, ఫార్మా, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఓఎంసీలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ లాభాలతో ముగిశాయి. గ్లెన్‌మార్క్ ఫార్మా , అజంతా ఫార్మా నేతృత్వంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.27 శాతం లాభపడి ముగిసింది. కాగా నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా సూచీలు 0.71 శాతం వరకు తగ్గాయి. -
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్ళీ దూసుకెళ్తున్నాయి. నేడు (సోమవారం) గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో మార్పు జరిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?.. పది గ్రాముల బంగారం రేటు ఎలా ఉందనే వివరాలను వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 500 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 550 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 500, రూ. 550 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,620 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,550 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 86,770 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 500 , రూ. 550 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (17 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..
భారీ ఆటుపోట్లు చవిచూసిన మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లను ఓ రకమైన నిస్తేజం ఆవరించింది. పెరగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో వెంటనే విదేశీ మదుపర్లు రంగంలోకి దిగి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ ధోరణి మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. మరోపక్క యథావిధిగానే కార్పొరేట్ ఫలితాలు ఉసూరుమనిపించాయి. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కొత్త విషయంలో సందేహం నెలకొంది.పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకారంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. గత వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా మార్కెట్‌కు అది పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రూపాయి బలహీనతలు పుండు మీద కారంలా మారాయి. చమురు ధరలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.5 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1921 పాయింట్లు నష్టపోయి పెరిగి 75,939 వద్ద, నిఫ్టీ 631 పాయింట్లు కోల్పోయి 22929 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 7.4 శాతం, స్మాల్ క్యాప్ 9.4 శాతం పడిపోయాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు.ఈవారం మార్కెట్లు..ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో ఈవారం కొంత ఉపశమన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ రూపంలో విక్రయాలను తోసిపుచ్చలేం. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ముగిశాయి. దీంతో ట్రెండ్నుబట్టే మార్కెట్లో కదలికలు ఉండొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ తాలూకు మినిట్స్, అలాగే మన ఆర్బీఐ వెలువరించిన క్రెడిట్ పాలసీ మినిట్స్‌పై మార్కెట్లు దృష్టి సారిస్తాయి. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే మార్కెట్లకు కొండంత బలాన్ని ఇస్తాయి.అమెరికా జాబ్ డేటా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశాల పీఎమ్ఐ గణాంకాలపైనా ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇంతకు మించి పెద్దగా ప్రభావిత అంశాలేవీ ఈవారం లేవు. రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు.రూపాయి కదలికలుఅమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి నానాటికీ బలహీనపడుతూనే ఉంది. గతవారం స్థాయికి చేరుకున్న రూపాయి మార్కెట్లకు చుక్కలు చూపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.88 చేరడం రిజర్వు బ్యాంకు చేపట్టిన కొన్ని చర్యల కారణంగా గత వారం చివర్లో తేరుకోగలిగింది. దాదాపు 1.15 రూపాయలు పెరిగి 86.58 వద్ద స్థిరపడింది. ఈవారం కూడా రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగుతుందా... డాలర్లను భారీ స్థాయిలో విక్రయిస్తుండగా... రూపాయిని మరింత పడిపోనివ్వకుండా ఆదుకుంటుందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి.విదేశీ మదుపర్లుమార్కెట్ వర్గాలకు సంబంధించి కీలక ప్రకటనలేవీ లేకపోయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే స్థాయిలోనే బడ్జెట్ ఉంది. కానీ దీన్ని విదేశీ మదుపర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్నీ వీరు పట్టించుకోలేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఓ స్పష్టత రావడం, కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగుపడటం జరిగే వరకూ వీరి అమ్మకాల ధోరణిలో మార్పు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా వీరు వ్యవహరించవచ్చనే చెప్పొచ్చు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..సాంకేతిక స్థాయులుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23250-300 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,500, ఆ తర్వాత 23,750 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,900 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్ళిపోతే మాత్రం 22,750 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,500, ఆతర్వాత 22,300 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంటుంది. రంగాలవారీగా చూస్తే ఫార్మా షేర్లకు మద్దతు లభించవచ్చు. లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సిమెంట్ రంగంలో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 9.72 శాతం పెరిగి 15.02 దగ్గర ఉంది. బుల్స్ అప్రమత్తంగా ఉండాలి అనేందుకు ఇది సంకేతం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులు
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్‌లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయంఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్‌ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?పెట్టుబడులతో ప్రయోజనాలుమిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్‌తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి. పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్‌లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలవు. మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్లను తప్పక పరిశీలించవచ్చు.- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్ -
ఈ వారం 2 ఐపీవోలు.. 10 లిస్టింగ్‌లు
ఈ వారం రెండు కొత్త ఐపీవోలు ప్రారంభం కానుండగా, మెయిన్‌బోర్డ్, ఎస్ఎంఈ విభాగంలో కలిపి 10 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. మెయిన్ బోర్డ్‌లో 17న అజాక్స్ ఇంజనీరింగ్, 19న హెక్సావేర్ టెక్నాలజీస్, 21న క్వాలిటీ పవర్ లిస్ట్ కానున్నాయి. ఎస్ఎంఈ కంపెనీ హెచ్‌పీ టెలికామ్ ఐపీవో 20న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ.108. ప్రమోటర్లే 34.28 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో యాపిల్ ఉత్పత్తులను ఈ సంస్థ పంపిణీ చేస్తుంటుంది. సివిల్ కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లోని బీజాసాన్ ఎక్స్ప్లోటెక్ అనే మరో ఎస్ఎంఈ ఐపీవో 21న మొదలు కానుంది. 34.24 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో కంపెనీ రూ.60 కోట్లు సమీకరించాలనుకుంటోంది. -
విదేశీ అంశాలు, ఎఫ్‌పీఐల చేతుల్లోనే..
న్యూఢిల్లీ: కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్ (క్యూ3) ముగియడంతో.. అంతర్జాతీయ అంశాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ తీరు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా అమ్మకాలు చేస్తుండడం, క్యూ3లో కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం గత వారం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడం గమనార్హం. దీంతో నిఫ్టీ కీలకమైన 22800 మద్దతు స్థాయికి సమీపానికి మరోసారి వచ్చింది. నిఫ్టీ, సెన్సెక్స్ వరుసగా ఎనిమిదో రోజూ (గత శుక్రవారం) నష్టాల్లో ముగిశాయి. ఇలా చాలా అరుదుగానే చూస్తుంటాం. ఎనిమిది రోజుల్లో కలిపి బీఎస్ఈ సెన్సెక్స్ 2,645 పాయింట్లు కోల్పోగా (3.36 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 810 పాయింట్లు (3.41 శాతం) నష్టపోయింది. ‘‘డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశి్చతుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చు’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా తెలిపారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని ఏంజెల్ వన్ సీనియర్ అనలిస్ట్ ఓషో కృష్ణన్ పేర్కొన్నారు. ‘‘మార్కెట్ పతనానికి ఎన్నో అంశాలు దారిచూపాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లపై చేసిన ప్రకటన సెంటిమెంట్‌కు దెబ్బకొట్టింది. దీనికి అదనంగా క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఇన్వెస్టర్ల విశ్వాసంపై ప్రభావం చూపించింది’’అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా తెలిపారు. దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ ఆవిరి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి మార్కె ట్ విలువ పరంగా టాప్–10లోని ఎనిమిది కంపెనీలు గడిచిన వారంలో రూ.2 లక్షల కోట్లకు పైన విలువను నష్టపోయాయి. అన్నింటిలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ నష్టాన్ని చూసింది. రూ.67,527 కోట్లు తగ్గి రూ.16,46,822 కోట్ల వద్ద స్థిరపడింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,951 కోట్ల మేర తగ్గి రూ.14,22,903 కోట్ల వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.28,382 కోట్లను నష్టపోయింది. మార్కెట్ విలువ రూ.12,96,708 కోట్లుగా ఉంది. ఐటీసీ రూ.25,430 కోట్ల నష్టంతో రూ.5,13,670 కోట్ల వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 19,287 కోట్లు తగ్గిపోగా, ఎస్బీఐ రూ.13,431 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.10,714 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.4,230 కోట్లు చొప్పున మార్కెట్ విలు వను కోల్పోయా యి. ఎయిర్టెల్ మార్కె ట్ విలువ రూ.22,426 కోట్లు పెరగడంతో రూ.9,78, 631 కోట్లకు చేరింది. అలాగే, ఐ సీఐసీఐ బ్యాంక్ విలువ సైతం రూ.1,182 కోట్ల మేర లాభపడి రూ.8,88,815 కోట్లుగా ఉంది. ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.21,272 కోట్లు ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లోనూ ఎఫ్‌పీఐలు పెద్ద మొత్తంలో విక్రయాలు చేపట్టారు. నికరంగా రూ.21,272 కోట్లను ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. జనవరిలోనూ వీరు రూ.78,027 కోట్ల మేర అమ్మకాలు చేపట్టడం గమనార్హం. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు వీరు భారత ఈక్విటీల నుంచి రూ.99,299 కోట్లను వెనక్కి తీసుకెళ్లిపోయారు. డెట్ విభాగంలో ఈ నెల మొదటి రెండు వారాల్లో నికరంగా రూ.1,296 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టినప్పుడు ఎఫ్‌పీఐలు తిరిగి పెట్టుబడులతో రావొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. ‘‘స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించడం, ప్రతీకార సుంకాల ప్రణాళికలతో మార్కెట్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో భారతసహా వర్ధమాన మార్కెట్లలో తమ పెట్టుబడులను ఎఫ్‌పీఐలు సమీక్షిస్తున్నాయి’’అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. -
బంగారం భారీగా తగ్గిందోచ్.. తులానికి ఏకంగా..
దేశంలో కొన్ని రోజులుగా ఆగకుండా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Prices) నేడు (February 15) భారీగా దిగివచ్చాయి. ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది చదివారా? టూ వీలర్లకు ఫ్రీగా పెట్రోల్!తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 78,900, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 86,070 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున తగ్గాయి.ఇతర ప్రాంతాల్లో.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.86,220 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,050 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున క్షీణించాయి.చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 78,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 86,070 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.1000, రూ.1090 చొప్పున కరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,08,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,00,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కార్పొరేట్లకు.. రూపాయి టెన్షన్
రూపాయి పతనంతో ధరలు పెరిగిపోయి సామాన్యులు పడే కష్టాలు అటుంచితే కార్పొరేట్లకు కూడా టెన్షన్ తప్పట్లేదు. ముఖ్యంగా విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. గత రుణాలను తీర్చేందుకు మరింత ఎక్కువగా చెల్లించాల్సి రానుండటమే ఇందుకు కారణం. సాధారణంగా కార్పొరేట్లు తమ వ్యాపార అవసరాల కోసం, దేశీయంగా వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంటే విదేశీ మార్కెట్ల నుంచి తక్కువ వడ్డీ రేటుపై రుణాలు తీసుకుంటూ ఉంటాయి. చౌకగా వచ్చిన నిధులను వ్యాపార విస్తరణకు లేదా అధిక వడ్డీ రేటు మీద తీసుకున్న రుణాలను తీర్చేసేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. గత రెండేళ్లుగా మిగతా కరెన్సీలు ఒడిదుడుకులకు లోనవుతున్నా రూపాయి మాత్రం దాదాపు స్థిర స్థాయిలోనే కొనసాగింది. దీంతో కార్పొరేట్లు గణనీయంగా విదేశీ రుణాలు సమీకరించాయి. ఈ మధ్య సంగతే చూస్తే గతేడాది ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో నికరంగా 13.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు వచ్చినట్లు ఆర్బీఐ డేటా చెబుతోంది. గతేడాది నవంబర్‌లో దాదాపు 2.83 బిలియన్ డాలర్ల ఈసీబీలను సమీకరించే ప్రతిపాదనలను కంపెనీలు సమరి్పంచాయి. రూపాయి విలువ పడిపోకుండా, స్థిరంగా ఉన్నన్నాళ్లూ విదేశీ రుణాల వ్యవహారం బాగానే ఉంటోంది. కానీ ఎక్కడా ఆగకుండా పడిపోతుంటేనే సమస్యాత్మకంగా మారుతోంది. ‘‘ఆర్బీఐ లెక్కలను బట్టి చూస్తే రూపాయి వేల్యుయేషన్ ఇప్పటికే అధిక స్థాయిలో ఉంది. దాని విలువ ఇంకా తగ్గాల్సి ఉంది. అమెరికా టారిఫ్‌లు విధిస్తే మరింతగా పడే అవకాశం ఉంది’’ అంటూ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్లకు రూపాయి బాధ ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాలపైనా.. సాధారణంగా విమానయాన సంస్థలు ఎయిర్‌క్రాఫ్ట్‌ల లీజింగ్‌లు, ఇంధన కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులను డాలర్ల మారకంలో నిర్వహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనంతో ఎయిర్‌లైన్స్ ఖర్చులూ పెరిగిపోయి లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు ఇండిగోను తీసుకుంటే ఇటీవలి మూడో త్రైమాసికంలో లాభం ఏకంగా 18 శాతం పడిపోయింది. రూపాయి క్షీణతతో విదేశీ టూర్లు మరింత భారంగా మారే అవకాశం ఉండటంతో ప్రయాణాలను వాయిదా లేదా రద్దు చేసుకునే అవకాశాలు ఉండటంతో టూరిజం, హాస్పిటాలిటీ లాంటి రంగాల మీద కూడా పడొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అలాగే దిగుమతులపైన ఆధారపడిన లేక గణనీయంగా విదేశీ కరెన్సీలో రుణభారం ఉన్న రంగాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారం ఇలా.. 2020లో భారత్, అమెరికాలో వడ్డీ రేట్ల మధ్య దాదాపు అయిదు శాతం వ్యత్యాసం ఉన్న తరుణంలో రూపాయి మారకంలో కన్నా విదేశీ మారకంలో రుణాలు తీసుకోవడం చాలా ఆకర్షణీయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అవే రుణాలు ఇప్పుడు గుదిబండలుగా మారుతున్నాయి. అప్పట్లో గానీ రూ. 2,000 కోట్లు విదేశీ రుణం తీసుకుని ఉంటే పెరిగిన వడ్డీ భారంతో పాటు రూపాయి కూడా క్షీణించడం వల్ల 22 శాతం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు డాలరు విలువ రూ. 75గా ఉన్నప్పుడు 500 మిలియన్ డాలర్లు రుణం తీసుకుని ఉంటే, దేశీ కరెన్సీ విలువ 5 శాతం క్షీణించిన పక్షంలో అదనంగా రూ. 2,500 కోట్ల భారం పడుతుందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పాబ్రి తెలిపారు. ఇలా ఒకవైపు అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడిపోవడం వల్ల విదేశీ రుణాలను తీర్చడం భారంగా మారుతోంది.హెడ్జింగ్ అంతంతే..విదేశీ రుణాలు తీసుకున్నప్పుడు రూపాయి పడిపోతే నష్టపోకుండా ఉండేందుకు, తిరిగి చెల్లించేటప్పుడు ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు కంపెనీలు హెడ్జింగ్ వ్యూహాన్ని పాటిస్తుంటాయి. సుమారు గత మూడేళ్లుగా భారీగా విదేశీ నిధులు సమీకరించినవి, సమీకరించడంపై కసరత్తు చేస్తున్న వాటిలో ఆర్ఈసీ (500 మిలియన్ డాలర్లు), టాటా మోటార్స్ ఫైనాన్స్ (200 మిలియన్ డాలర్లు), ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (125 మిలియన్ డాలర్లు), టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు (100 మిలియన్ డాలర్లు) బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైనవి ఉన్నాయి. అయితే, దేశీ కంపెనీలు తీసుకున్న ఈసీబీల్లో దాదాపు మూడో వంతు రుణాలకు హెడ్జింగ్ రక్షణ లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2023–24లో దాదాపు 38.4 బిలియన్ డాలర్ల రుణాలు రాగా ఇందులో సుమారు 11.52 బిలియన్ డాలర్ల మొత్తానికి హెడ్జింగ్ రక్షణ లేదు. ఇలా హెడ్జింగ్ చేసుకోని కంపెనీలన్నింటికీ ప్రస్తుత రూపాయి పతనం సమస్యగా మారినట్లు పేర్కొన్నాయి. ఇటీవలి ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో సమీకరించిన మొత్తం ఈసీబీల్లో 40 శాతాన్నే పెట్టుబడి వ్యయాల కోసం కంపెనీలు ఉపయోగించుకున్నాయి. అంటే మిగతా 60 శాతాన్ని ఖరీదైన ఇతరత్రా రుణాలను తీర్చేందుకు ఉపయోగించుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 102.15 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 22,929.25 వద్ద ముగిసింది. ఈ రోజు ఈ ఇండెక్స్ గరిష్టంగా 23,133.7 వద్ద, కనిష్టంగా 22,774.85 వద్ద నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 199.76 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 75,939.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టం 76,138.97, కనిష్టం 75,439.64 వద్ద నమోదైంది.బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ టాప్ గెయినర్స్‌గా లాభాలను అందుకోగా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్‌గా నష్టాలను చవిచూశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్న సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ శుక్రవారం అధికారికంగా 'బేర్' దశలోకి ప్రవేశించింది. ఇండెక్స్ దాని గరిష్ట స్థాయి 19,716.20 నుండి దాదాపు 22 శాతం పడిపోయింది. శుక్రవారం ఇండెక్స్ దాదాపు 4 శాతం నష్టపోయి 15,373.70 స్థాయిల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి పతనం విస్తృత మార్కెట్లలో అంతటా అమ్మకాల ఒత్తిడితో జరిగింది. దీంతో మిడ్‌క్యాప్‌లు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 2.5 శాతం నష్టపోయి 18,325.40 స్థాయిల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లవర్స్‌డే రోజున బంగారం గిఫ్ట్ ఇస్తున్నారా? తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రేమికుల రోజున లవర్‌కు బంగారు ఆభరణాలు గిఫ్ట్‌గా ఇవ్వాలంటే మాత్రం ధరల విషయంగా కొంత ఆలోచించాలని సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.79,900 (22 క్యారెట్స్), రూ.87,160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.79,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,160 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.80,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 పెరిగి రూ.87,310 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధరల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై రూ.1,000 పెరిగి రూ.1,08,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32.11 పాయింట్లు లేదా 0.042 శాతం నష్టంతో 76,138.97 వద్ద, నిఫ్టీ 13.85 పాయింట్లు లేదా 0.060 శాతం నష్టంతో 23,031.40 వద్ద నిలిచాయి.బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు: ఇక కొనుగోలు కష్టమే!
వారం రోజుల తరువాత గోల్డ్ రేటు తగ్గింది అనుకునే లోపలే.. మళ్ళీ పెరిగింది. దీంతో మళ్ళీ బంగారం ధరలలో కదలికలు ఏర్పడ్డాయి. నేడు (గురువారం) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 87050 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,050 వద్ద నిలిచాయి. నిన్న రూ. 700, రూ. 710 తగ్గినా గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 380 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 380 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,050 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి.ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,950 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,200 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 310 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. వెండి రేటు మాత్రం ఎనిమిదో రోజు స్థిరంగానే ఉంది. దీంతో ఈ రోజు (12 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష రూపాయలు దాటేసినప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రిటైల్ ఇన్వెస్ట్టర్లు తగ్గేదేలే... ఈక్విటీల్లోకి రూ.39,688 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలి్చతే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి. 2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాల ను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్‌తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చి వరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది. దీర్ఘకాల దృక్పథం.. ‘‘మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ సిప్ రూపంలో రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అస్థిరతల్లోనూ పెట్టుబడులు కొనసాగించేందుకు, సంపద సృష్టికి కమ్రశిక్షణతో కూడిన దీర్ఘకాల విధానం అనుసరించే దిశగా ఇన్వెస్టర్లలో అవగాహనకు ఇక ముందూ మా ప్రయత్నాలు కొనసాగుతాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ ఆస్తుల విలువ రూ.13.12 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఈక్విటీ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉండడం గమనార్హం. జనవరిలో కొత్తగా 30.7 లక్షల ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) నమోదయ్యాయని, మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తుల విలువ 4 శాతం తగ్గడానికి మార్కెట్లలో ఆటుపోట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూనియన్ బడ్జెట్ ముందు అప్రమత్తతను కారణాలుగా ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.విభాగాల వారీగా.. → సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.9,016 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. డిసెంబర్లో ఇదే విభాగంలోకి రూ.15,331 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → మిడ్‌క్యాప్ విభాగంలోకి రూ.5,148 కోట్లు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.5,721 కోట్లను ఆకర్షించింది. → అస్థిరతలు కాస్త తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ విభాగంలోకి పెట్టుబడులు పెరిగాయి. డిసెంబర్లో రూ.2,010 కోట్లు రాగా, జనవరిలో రూ.3,063 కోట్లకు చేరాయి. → ఫ్లెక్సిక్యాప్ ఫండ్స్ సైతం అంత క్రితం నెలతో పోలి్చతే జనవరిలో 20 %అధికంగా రూ.5,697 కోట్లను ఆకర్షించాయి. → డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఈ విభాగం నుంచి రూ.1.27 కోట్లను ఉపసంహరించుకున్న ఇన్వెస్టర్లు జనవరిలో మళ్లీ అంతే మేర తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) ఇటీవలి కాలంలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయిలో రూ.3,751 కోట్లను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించినట్టు స్పష్టమవుతోంది. -
ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం
యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పుఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది.